ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమాలు చేశారు.. గుర్తుపట్టారా? | Director Hanu Raghavapudi And Radha Krisha Old Visuals Viral | Sakshi
Sakshi News home page

Guess The Directors: తెలుగు దర్శకుల పాత వీడియో వైరల్

Jul 9 2026 2:47 PM | Updated on Jul 9 2026 2:50 PM

Director Hanu Raghavapudi And Radha Krisha Old Visuals Viral

వయసు పెరిగే కొద్ది మనుషుల్లో మార్పు కచ్చితంగా వస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే పాత ఫొటోలు, వీడియోలు బయటకొచ్చినప్పుడు వీళ్లు వాళ్లేనా అనిపించకమానదు. ఇప్పుడు అలానే టాలీవుడ్ ప్రముఖ దర్శకులకు సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మరి వీళ్లెవరో గుర్తుపట్టారా? లేదంటే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: ప్రేమ పేరుతో నాలుగేళ్లు నా వెంటపడ్డాడు: హీరోయిన్ అంజలి)

పైన ఫొటోలో కనిపిస్తున్న వాళ్లలో ఎడమవైపు ఉన్నది రాధాకృష్ణ కుమార్, కుడివైపు ఉన్నది హను రాఘవపూడి. ఈ పేర్లు  ఎక్కడో విన్నట్టు ఉందే అనిపిస్తుందా? అవును ప్రభాస్‌తో 'రాధేశ్యామ్' తీసిన దర్శకుడు రాధాకృష్ణ కాగా ప్రస్తుతం 'ఫౌజీ' తీస్తున్నది హను. వీళ్లిద్దరూ గతంలో ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దగ్గర సహాయకులుగా పనిచేశారు. అంటే దాదాపు 20 ఏళ్ల క్రితం. అప్పటి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాధాకృష్ణ కుమార్ విషయానికొస్తే.. ప్రయాణం, సాహసం సినిమాలకు రచయితగా చేశాడు. గోపీచంద్ 'జిల్' మూవీతో దర్శకుడిగా మారాడు. తొలి చిత్రంతో పర్లేదనిపించాడు. దీంతో 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌తో 'రాధేశ్యామ్' చేసే అవకాశమొచ్చింది. రిలీజ్‌కి ముందు ఆహా ఓహో అన్నారు గానీ ఎందుకనో సదరు చిత్రం జనాలకు సరిగా కనెక్ట్ కాలేదు. దీంతో రాధాకృష్ణకు మరో ఛాన్స్ రాకుండా పోయింది. ప్రస్తుతం ఏం చేస్తున్నాడో తెలీదు.

ఇక హను రాఘవపూడి విషయానికొస్తే.. అందాల రాక్షసి, పడిపడి లేచే మనసు, సీతారామం తదితర మూవీస్‌తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించాడు. ప్రస్తుతం ప్రభాస్‌తో పీరియాడిక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే 'ఫౌజీ' తీస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబరులో ఇది థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: మేడమ్ మా మూవీలో ఓ రోల్ చేయండి: నవీన్ పొలిశెట్టి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement