బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ జూలై 5న తన బాంద్రా నివాసంలో గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్నారు. అయితే అప్పటినుంచి ఈ వేడుకకు సంబంధించిన విశేషాలు నెట్టింట హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఆమీర్ మొదటి, రెండో భార్య, పిల్లలు,ఇతర కుటుంబ సభ్యులతో పాటు,కొద్దిమంది స్నేహితుల సమక్షంలో ఆమీర్-గౌరి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ ఈవెంట్‌లో ఆమీర్, గౌరి మ్యాచింగ్ సాంప్రదాయ దుస్తుల్లో అందంగా మెరిసారు. అలాగే ఆమీర్ ఒక కాలికి మాత్రమే పెట్టుకున్న మువ్వలు, గౌరీ స్ప్రాట్ పాస్టెల్ రంగు లెహంగా, లేయర్డ్ నెక్లెస్‌లు పఠానీ హారం ధరించి అందర్నీ ఆకట్టుకున్నారు. చాలా అరుదైన వీరి వెడ్డింగ్ రింగ్‌పై ఆసక్తి నెలకొంది. అలాగే దీనికి సంబంధించిన విషయాలు వైరలవుతున్నాయి.
కొత్త పెళ్లికూతురు గౌరీ రూబీ (కెంపు) వెడ్డింగ్ రింగ్ స్పెషల్ ఎట్రాక్షన్. దీన్ని లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ 'QWEEN' దీనిని డిజైన్ చేసింది. ఇందులో మడగాస్కర్ నుండి సేకరించిన అత్యంత అరుదైన 'సహజ క్యాబోచన్-కట్ రూబీ' (cabochon-cut ruby) ని ఉపయోగించారు. ఇది మిలియన్‌లో ఒకటి మాత్రమే దొరికేంత అరుదైనది. ఈ రూబీ చుట్టూ దాదాపు 40 సహజమైన వజ్రాలను (diamonds) పొదిగారు.ఈ రత్నాన్ని వెతకడానికే మూడు నెలలకు పైగా సమయం పట్టింది. 'QWEEN' సంస్థ కో-ఫౌండర్ అమిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 131 మంది నైపుణ్యం గల చేతి వృత్తికళాకారులు 256 గంటల కంటే ఎక్కువ సమయం సరిగ్గా చెప్పాలంటే 10 రోజుల16 గంటలు (దాదాపుగా పదిన్నర రోజులకు పైగా)శ్రమించి, ఈ రింగ్‌ను డిజైన్ చేశారు.
ఇదీ చదవండి: ఆమీర్ భార్య గౌరి బ్రైడల్ లుక్ : 'పఠానీ హార్' విశేషాలు తెలుసా?
ఏంటీ ప్రత్యేకత
ఈ రూబీ చుట్టూ దాదాపు 40 సహజమైన వజ్రాలను (diamonds) పొదిగారు. సాధారణ రింగ్స్ లాగా కాకుండా, ఈ రూబీని ఒక క్రోన్ లాంటి నిర్మాణంలో అమర్చారు. దీని కటింగ్ కూడా 'క్యాబోచన్ కట్' (మృదువైన, గుండ్రని ముగింపు) ఇవ్వడం వల్ల ఈ రత్నం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. చారిత్రక రాజకుటుంబాల నగలను గుర్తుచేసేలా 'మిల్‌గ్రెయిన్ బీడింగ్' (milgrain beading) శైలిలో దీనిని రూపొందించారు. భవిష్యత్తు తరాలకు అందించే ఒక అపురూపమైన ఆస్తిగా ఉండేలా ఈ రింగ్‌ను తీర్చిదిద్దారు. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలోనేచిరకాల ప్రియురాలు గౌరీ స్ప్రాట్ వేలికి బ్రెజిల్ దేశానికి చెందిన అరుదైన ‘ఆక్వామెరైన్’ (Aquamarine) రింగ్ ఆమీర్ ప్రత్యేకంగా చేయించి మరి ఇచ్చారట.
ఇదీ చదవండి: రెడ్ బెనారసీ డ్రెస్‌లో పార్టీ లుక్.. తొలిసారి ఇలా అన్షులా!


