ఆమీర్‌ భార్య గౌరి బ్రైడల్‌ లుక్‌ : 'పఠానీ హార్' విశేషాలు తెలుసా? | Aamir Khan 3rd wife Gauri Spratt’s bridal look and The Hyderabadi haar speciality | Sakshi
Sakshi News home page

ఆమీర్‌ భార్య గౌరి బ్రైడల్‌ లుక్‌ : 'పఠానీ హార్' విశేషాలు తెలుసా?

Jul 8 2026 3:00 PM | Updated on Jul 8 2026 3:06 PM

Aamir Khan 3rd  wife Gauri Spratt’s bridal look and The Hyderabadi haar speciality

హైదరాబాద్‌కు చెందిన సాంప్రదాయ నిజామీ ఆభరణాలకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది.  ముఖ్యంగా రాయల్ జ్యువెలరీ రాజసం సెలబ్రిటీ వధువులను విపరీతంగా ఆకర్షిస్తోంది. గతంలో దీపికా పదుకోన్, నయన తార లాంటి సెలబ్రిటీ స్టార్స్ తమ పెళ్లిళ్లలో హైదరాబాద్ రాయల్టీ ప్రతీక అయిన ముత్యాల 'సత్లాద్‌ హార్' (Satlada Haar) ధరించి వార్తల్లో నిలిచారు. అలాగే ఫ్యాషన్‌ ఐకాన్‌ నీతా అంబానీ, ఇషా అంబానీకి కూడా ఈ ఆభరణాలపై మక్కువ ఎక్కువ.  తాజాగా మరో సెలబ్రిటీ వధువు, వ్యాపారవేత్త గౌరీ స్ప్రాట్ (Gauri Spratt) బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌తో జరిగిన పెళ్లి వేడుకలో ధరించిన హైదరాబాదీ పఠానీ హార్ ఫ్యాషన్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యేకంగా తయారుచేసిన హైదరాబాదీ నిజామీ  'లేయర్డ్'  జ్యుయల్లరీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

నటుడు ఆమిర్ ఖాన్ జూలై 5న ముంబైలోని బాంద్రాలోని  ఆమిర్ నివాసంలో గౌరీ స్ప్రాట్‌ను సింపుల్‌గా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ వేడుకలో గౌరీ ఎలిగెంట్ ఐవరీ (Ivory) లెహంగాలో అందంగా మెరిసింది. అయితే గౌరీ స్ప్రాట్ ధరించిన లెహంగా ఎంతగా ఆకట్టుకుందో, పోల్కీ నగలను జతచేసి క్లాసిక్ బ్రైడల్ లుక్‌ మరింత స్పెషల్‌గా నిలిచింది.మరీ ముఖ్యంగా  ఆమె మెడలో ఉన్న 'పఠానీ హార్' అంతకంటే  మిన్నగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 

ఇదీ చదవండి: అన్షులా-రోహన్‌ ఇంట్రస్టింగ్‌ లవ్‌ స్టోరీ, భర్త ఆస్తి ఎంతంటే!

ఏంటీ దీని ప్రత్యేకత
ఆమె ధరించిన పఠానీ హారం హైదరాబాద్ నిజాంల కాలం నాటి అత్యంత విలువైన సాంప్రదాయ ఆభరణాలలో ఒకటి. ఈ పేరు పఠాన్ కమ్యూనిటీ నుండి వచ్చినప్పటికీ, దీనిని శతాబ్దాలుగా ఆదరించి, మరింత అందంగా తీర్చిదిద్దాయి. డెక్కన్ జ్యువెలరీ సంస్కృతిలో ఇది ఒక ముఖ్యమైన భాగం. సున్నితమైన మల్లె పువ్వు మొగ్గ స్ఫూర్తితో రూపొందించిన, ప్రత్యేకమైన, అతిపెద్ద చంపకలి హార్ (పఠానీ హార్) ఇది.

 

ముత్యాల వరుసలతో ఉండే 'సత్లాద్‌ హార్'తో పోలిస్తే, 'పఠానీ హార్' అనేది పోల్కీ (Polki), అద్భుతమైన జడౌ (Jadau) నైపుణ్యంతో కూడిన డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. ఇందులో రత్నాలను, అన్‌కట్ డైమండ్స్‌ను చేతితో ఎంతో క్లిష్టంగా పొదుగుతారు.

హైదరాబాద్  రాయల్‌ ఫ్యామిలీస్‌ 'పఠానీ హార్' కేవలం ఒక నెక్లెస్ మాత్రమే కాదు, అది తరతరాలుగా వస్తున్న ఒక వారసత్వ కానుక. పెళ్లిళ్లు, ఈద్ పండుగలు, పెద్ద వేడుకలలో దీనిని ధరించేందుకు మహిళలు ఇష్టపడతారు. ప్రస్తుతం చార్మినార్ లాడ్ బజార్, గుల్జార్ హౌజ్ వంటి ప్రాంతాలలోని హెరిటేజ్ జ్యువెలర్స్ ఈ తరం వధువుల కోసం ఆధునిక డిజైన్లలో కూడా ఈ పఠానీ హార్‌ను తయారు చేస్తున్నారు. గౌరీ స్ప్రాట్ ఈ నిజామీ హారాన్ని ధరించడంతో, హైదరాబాద్ రాయల్ జ్యువెలరీ ఖ్యాతి 'సిటీ ఆఫ్ పెర్ల్స్' ఖండాలుదాటి  మరీ తన హవా చాటుకుంటోందని మరోసారి నిరూపితమైంది.

ఇదీ చదవండి: రెడ్‌ బెనారసీ డ్రెస్‌లో పార్టీ లుక్‌.. తొలిసారి ఇలా అన్షులా!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement