breaking news
Gauri Spratt
-
'ఇప్పటికే మూడో పెళ్లి చేసుకున్నా.. కానీ'.. అమిర్ ఖాన్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతనెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. లాల్ సింగ్ చద్ధా తర్వాత అమిర్ చేసిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2018లో వచ్చిన మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ హీరో.అయితే ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న అమిర్ ఖాన్ మరోసారి రిలేషన్లో ఉన్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్ ప్రారంభించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం గౌరీతో రిలేషన్లో ఉన్న అమిర్ ఖాన్.. మూడో పెళ్లిపై స్పందించారు. గౌరీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్లు అమిర్ ఖాన్ తెలిపారు. మేమిద్దరం చాలా నిజాయితీ, నిబద్ధతతో ఉన్నామని అన్నారు. మీకు తెలుసా? మేము ప్రస్తుతం భాగస్వాములని.. ఇప్పటికే తన హృదయంతో ఆమెను పెళ్లాడానని అమిర్ ఖాన్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. మేము కలిసి ఉన్నామని.. అయితే అధికారికంగా పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే దానిపై రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అమిర్ ఖాన్ తెలిపారు.కాగా.. ఈ సంవత్సరం మార్చిలో తన 60వ పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో తన రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. అమిర్ వయస్సు 60 ఏళ్లు కాగా.. గౌరీకి(46) అతనికి దాదాపు 14 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఆమె ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఇప్పటికే అమిర్ ఖాన్ 1986లో మొదట రీనా దత్తాను పెళ్లాడారు. ఆ తర్వాత 2002లో విడిపోయారు. మరో మూడేళ్లకు డైరెక్టర్ కిరణ్ రావును వివాహమాడారు. వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మూడో పెళ్లికి సిద్ధమయ్యారు మన బాలీవుడ్ స్టార్ హీరో. -
లేటు వయసులో డేటింగ్.. పొరపాటున జరిగిపోయింది: అమిర్ ఖాన్
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సినిమాల కంటే వ్యక్తిగతంగానే వార్తల్లో నిలుస్తున్నారు. ఆరు పదుల వయస్సులో ప్రేమ అంటూ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చాడు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్ ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌తో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తన బర్త్ డే వేడుకల సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు.అయితే తాజా ఇంటర్వ్యూలో గౌరీ స్ప్రాట్‌తో తన రిలేషన్ గురించి మాట్లాడారు. ఈ వయలులో మళ్లీ ప్రేమలో పడాలనే ఆలోచన తనకు లేదని అన్నారు. ఇప్పటికే తన వయసు అయిపోయిందని.. తనకు భాగస్వామి దొరకడం సాధ్యం కాదని భావించేవాడినని ఆమిర్ పేర్కొన్నారు. తనకు వృద్ధాప్యఛాయలు వచ్చినట్లు అనిపించిందని.. గౌరీని కలవడానికి ముందు థెరపీ చేయించుకున్నానని తెలిపారు. నేను, గౌరీ పొరపాటున కలుసుకున్నామని అమిర్ ఖాన్ వెల్లడించారు.గౌరీతో పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ.. 'నేను, గౌరీ పొరపాటున కలుసుకున్నాం. ఆ తర్వాత మేము స్నేహితులమయ్యాం.. మా మధ్య ప్రేమ పుట్టింది. నాకు నా తల్లి, పిల్లలు, తోబుట్టువులు ఉన్నారు. నాకు ఇప్పటికే చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, నాకు భాగస్వామి అవసరం లేదు. కిరణ్, రీనా నేను ఇప్పటికీ పానీ ఫౌండేషన్ కోసం కలిసి పని చేస్తున్నాం. మేము ప్రతిరోజూ కూర్చుని మాట్లాడుకుంటాం. ఒక కుటుంబంగా మా మధ్య నిజమైన ప్రేమ ఉంటుంది మేము ఎల్లప్పుడూ కుటుంబంగానే ఉంటాం. మేము భార్యాభర్తలం కాకపోవచ్చు.. కానీ మేము ఎల్లప్పుడూ ఓకే ఫ్యామిలీగానే ఉంటాం. వారు ఎప్పటికీ నా జీవితంలో ఒక శాశ్వత భాగం.' అని వెల్లడించారు. కాగా..అమిర్ ఖాన్, గౌరీ ఏప్రిల్ 12న చైనాలో జరిగిన మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్లో జంటగా మొదటిసారి కనిపించారు. ప్రస్తుతం అమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్', లోకేష్ కనగరాజ్ 'కూలీ'చిత్రంలో కనిపించనున్నారు. -
ప్రియురాలితో కలిసి బోనీకపూర్ ఇంటికి అమిర్ ఖాన్!
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ముంబయి చేరుకున్నారు. ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను పరామర్శించారు. రెండు రోజుల క్రితమే బోనీ కపూర్ తల్లి నిర్మల్ కపూర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బోనీ కపూర్‌ను కలిసి పరామర్శించారు. అమిర్‌తో పాటు ఆయన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి బోనీ కపూర్ నివాసానికి చేరుకుని ఆమెకు నివాళులర్పించారు.కాగా.. బోనీ కపూర్ మాతృమూర్తి నిర్మల్ కపూర్ మే 2న అనారోగ్యంతో మరణించారు. కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆ తర్వాత ఎస్వీ రోడ్‌లోని విలే పార్లే శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బోనీ కపూర్ కుటుంబంతో సాన్నిహిత్య కారణంతో ఆమిర్ ఖాన్ ప్రత్యేకంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వీరితో పాటు కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, రాణి ముఖర్జీ లాంటి ప్రముఖులు కూడా బోనీ నివాసంలో కనిపించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
60 ఏళ్ల స్టార్ హీరోతో ప్రేమాయణం.. అందుకే ప్రేమించానన్న ప్రియురాలు
ప్రేమ ఎప్పుడు? ఎక్కడ? ఎలా? చిగురిస్తుందో తెలియదంటారు. ఆమిర్ ఖాన్ (Aamir Khan) విషయంలోనూ ఇదే జరిగింది. 25 ఏళ్లుగా పరిచయస్తురాలైన గౌరీ స్ప్రాట్ (Gauri Spratt)తో ప్రేమలో పడతానని కలలో కూడా ఊహించకపోవచ్చు. కానీ ఏమైంది? రెండేళ్లక్రితం మనసు మాట వినలేదు. గౌరీ గురించే పరితపించసాగింది. ఇది స్నేహం కాదు ప్రేమ అని ఆమిర్‌కు అర్థమయ్యింది. అదే మాట ఆమెతో చెప్పగా తను కూడా సంతోషంగా ఒప్పుకుంది.60 ఏళ్ల హీరోతో ప్రేమ..అయితే ఆమిర్ ఖాన్ ఈ ఏడాది 60వ వయసులోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని వారికి విడాకులిచ్చేశాడు. మరి అంతటి పెద్దాయనను ఈవిడ ఎలా ప్రేమించింది? అని సోషల్ మీడియాలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ అనుమానాలకు చెక్ పెట్టింది గౌరి. ఆమిర్‌ను జీవిత భాగస్వామిగా ఎంచుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది. ప్రేమకు కారణం అదా!నా లైఫ్‌లో ఒక జెంటిల్మన్ ఉండాలనుకున్నాను. ఎక్కడలేని ప్రేమ కురిపించడంతోపాటు.. దయాగుణం కలిగుండే వ్యక్తి నా జీవితంలోకి వస్తే బాగుండనుకున్నాను అని గౌరి చెప్పింది. ఇంతలో ఆమిర్ అందుకుంటూ.. అప్పుడు నేను నీకు కనిపించాను కదూ.. అంటూ సరదాగా బదులిచ్చాడు. గౌరీ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు. తను పెరిగిందంతా బెంగళూరులోనే కాదు. పెద్దగా హిందీ సినిమాలు కూడా చూడదట! గౌరీకి ఆరేళ్ల కుమారుడునన్ను సూపర్‌స్టార్‌గా చూడదు కానీ పార్ట్నర్గా మాత్రం భావిస్తోందని ఆమిర్ స్వయంగా పేర్కొన్నాడు. మార్చి 12న ఆమెను తన స్నేహితులు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్‌కు పరిచయం చేశాడు. ఇకపోతే గౌరీకి గతంలో పెళ్లయినట్లు తెలుస్తోంది. ఆమెకు ఆరేళ్ల కుమారుడు ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. తను ముంబైలో బిబ్లంట్ అనే సెలూన్ నడుపుతోంది.చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్ -
అమిర్ ఖాన్‌తో డేటింగ్.. తొలిసారి అలా కనిపించిన గౌరీ స్ప్రాట్
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవల అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. తాను డేటింగ్లో ఉన్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దాదాపు 60 ఏళ్ల వయసులో అమిర్ ఖాన్ రిలేషన్లో ఉన్నానంటూ ప్రకటించడంతో ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. ఇటీవల ముంబైలో జరిగిన తన ప్రీ బర్త్ డే ఈవెంట్లో తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను మీడియా ముందు అందరికీ పరిచయం చేశాడు. దీంతో అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేశారు.అయితే తాజాగా అమీర్ ఖాన్‌తో రిలేషన్ తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది గౌరీ. అమిర్ ఖాన్ పుట్టినరోజు పార్టీలో కనిపించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోను చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.అసలు ఎవరీ గౌరీ స్ప్రాట్..కాగా.. ఇటీవల ముంబయి నిర్వహించిన ప్రెస్మీట్లో గౌరీతో తన రిలేషన్‌షిప్‌ను అమీర్ ఖాన్ ధృవీకరించారు. దాదాపు ఏడాదిగా తాము డేటింగ్లో ఉన్నామని పేర్కొన్నారు. ఆమెకు ఆరేళ్ల పాప కూడా ఉందని తెలిపారు. గత 25 ఏళ్లుగా ఆమె తెలుసని కూడా అన్నారు. అంతేకాకుండా గౌరీ ఇటీవలే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను కలిశారని ఆయన ప్రస్తావించారు. కాగా.. ఇప్పటికే అమిర్ ఖాన్ కిరణ్ రావు, రీనా దత్తాలతో విడిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు బెంగళూరుకు చెందిన గౌరీ.. రీటా స్ప్రాట్ కుమార్తె. ప్రస్తుతం ఆమె ముంబయిలోనే ఓ సెలూన్‌ను నిర్వహిస్తోంది. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
ప్రేయసితో వయసు ముదిరిన హీరో చెట్టాపట్టాల్.. మాజీ భార్యలకూ సంతోషమే!
ప్రేమకు వయసుతో పని లేదని నిరూపించాడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan). 60 ఏళ్ల వయసులో తాను డేటింగ్లో ఉన్నానని నిర్మొహమాటంగా మీడియాకు వెల్లడించాడు. గౌరీ స్ప్రాట్ (Gauri Spratt)తో ప్రేమలో ఏడాదికాలంగా ప్రేమలో ఉన్నానని తన బర్త్ సందర్భంగా వెల్లడించాడు. ఆమె కోసం ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని కూడా నియమించి తనపై ప్రేమను చాటుకున్నాడు.వైరల్‌గా మారిన వీడియోఅయితే ఆమిర్‌కు గతంలో రెండు పెళ్లిళ్లయిన విషయం తెలిసిందే! రీనా దత్తా (Reena Dutta), కిరణ్ రావు (Kiran Rao)లను పెళ్లి చేసుకోగా ఇద్దరికీ విడాకులిచ్చేశాడు. అలా అని వారితో శత్రుత్వమేమీ పెంచుకోలేదు. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితుల్లా మాత్రం ఇప్పటికీ ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఫిబ్రవరి నెలలో మాజీ భార్యలతో ఆమిర్ ఓ ఫంక్షన్‌కు వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.అందరూ ఒకేచోట..క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) - సఫా మీర్జాల 9వ పెళ్లి రోజుకు ఆమిర్ వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు. మాజీ భార్యలతో పాటు ప్రేయసి గౌరీని కూడా తీసుకెళ్లాడు. ఈ వీడియోను ఇర్ఫాన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ఆమిర్ మాజీ భార్యలు, ప్రియురాలు ఒకేచోట సంతోషంగా నవ్వుతూ కనిపించారు. ఇంత మోడ్రన్ ఫ్యామిలీని ఎక్కడా చూడలేదంటున్నారు నెటిజన్లు.సినిమాఆమిర్ ఖాన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సితారే జమీన్ పర్ మూవీ చేస్తున్నాడు. ఇది 2007లో వచ్చిన తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్ సినిమాలో కూడా భాగం కానున్నాడు. View this post on Instagram A post shared by Irfan Pathan (@irfanpathan_official) చదవండి: ఛాతి నొప్పి.. ఆస్పత్రిలో చేరిన ఏఆర్ రెహమాన్