
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతనెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. లాల్ సింగ్ చద్ధా తర్వాత అమిర్ చేసిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2018లో వచ్చిన మూవీకి సీక్వెల్గా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ హీరో.
అయితే ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న అమిర్ ఖాన్ మరోసారి రిలేషన్లో ఉన్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్ ప్రారంభించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం గౌరీతో రిలేషన్లో ఉన్న అమిర్ ఖాన్.. మూడో పెళ్లిపై స్పందించారు. గౌరీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్లు అమిర్ ఖాన్ తెలిపారు. మేమిద్దరం చాలా నిజాయితీ, నిబద్ధతతో ఉన్నామని అన్నారు. మీకు తెలుసా? మేము ప్రస్తుతం భాగస్వాములని.. ఇప్పటికే తన హృదయంతో ఆమెను పెళ్లాడానని అమిర్ ఖాన్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. మేము కలిసి ఉన్నామని.. అయితే అధికారికంగా పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే దానిపై రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అమిర్ ఖాన్ తెలిపారు.
కాగా.. ఈ సంవత్సరం మార్చిలో తన 60వ పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో తన రిలేషన్ను అఫీషియల్గా ప్రకటించారు. అమిర్ వయస్సు 60 ఏళ్లు కాగా.. గౌరీకి(46) అతనికి దాదాపు 14 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఆమె ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఇప్పటికే అమిర్ ఖాన్ 1986లో మొదట రీనా దత్తాను పెళ్లాడారు. ఆ తర్వాత 2002లో విడిపోయారు. మరో మూడేళ్లకు డైరెక్టర్ కిరణ్ రావును వివాహమాడారు. వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మూడో పెళ్లికి సిద్ధమయ్యారు మన బాలీవుడ్ స్టార్ హీరో.