కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకున్నాను: వర్ష బొల్లమ్మ | Constable Kanakam Chapter 3: Kalghat Glimpse Launch Event | Sakshi
Sakshi News home page

కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకున్నాను: వర్ష బొల్లమ్మ

Jan 23 2026 1:17 AM | Updated on Jan 23 2026 1:17 AM

Constable Kanakam Chapter 3: Kalghat Glimpse Launch Event

వర్ష బొల్లమ్మ లీడ్‌ రోల్‌లో ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వంలో రూపొందిన వెబ్‌ సిరీస్‌ ‘కానిస్టేబుల్‌ కనకం’. ఈ సిరీస్‌లో మేఘా లేఖ, రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ అవసరాల కీలకపాత్రల్లో నటించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్‌ కుమార్‌ నిర్మించిన ఈ సిరీస్‌ రెండు సీజన్స్‌గా ఈటీవీ విన్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అయ్యింది. ఈ రెండు సీజన్స్‌ను కలిపి ఓ సినిమాగా రిలీజ్‌ చేయబోతున్నారు. 

అలాగే ‘కానిస్టేబుల్‌ కనకం చాఫ్టర్‌ 3: కాల్‌ఘాట్‌’ పేరుతో సినిమా రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ‘కానిస్టేబుల్‌ కనకం చాఫ్టర్‌ 3: కాల్‌ఘాట్‌’ గ్లింప్స్‌ లాంచ్‌ ఈవెంట్‌లో దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్‌పాల్గొని, సినిమా విజయాన్ని ఆకాంక్షించారు. ‘‘చాప్టర్‌ 3: కాల్‌ఘాట్‌’ కోసం కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకున్నాను’’ అని చెప్పారు వర్ష బొల్లమ్మ. ‘‘కాల్‌ఘాట్‌’ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది’’ అన్నారు ప్రశాంత్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement