చేసిన రెండు సినిమాలు ఫ్లాప్.. అయినా మరో ఛాన్స్ | Rukmini Vasanth To Act With Dhanush New Tamil Movie | Sakshi
Sakshi News home page

Rukmini Vasanth: ధనుష్‌కి జోడీగా రుక్మిణి.. ఏ మూవీ కోసమంటే?

Mar 11 2026 10:38 AM | Updated on Mar 11 2026 10:55 AM

Rukmini Vasanth To Act With Dhanush New Tamil Movie

తక్కువ టైంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. సొంత భాషలో హిట్స్ ఉన్నప్పటికీ తెలుగు, తమిళంలో చేసిన చిత్రాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. అయితే తమిళంలో చేసిన మూవీస్ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇప్పుడు రుక్మిణి మరో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)

వరుస సినిమాలతో అలరిస్తున్న తమిళ హీరో ధనుష్.. ప్రస్తుతం విఘ్నేశ్ ‌రాజా దర్శకత్వంలో 'కర' మూవీ చేశాడు. మమిత బైజు హీరోయిన్. వచ్చే నెల 30న థియేటర్లలోకి రానుంది. మరోవైపు 'అమరన్' తీసిన రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలోనూ ధనుష్‌ ఓ సినిమా చేస్తున్నాడు. డీ55 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్స్. సాయి‌ అభయంకర్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీని తర్వాత ధనుష్‌ మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 'లబ్బర్‌ పందు' ఫేమ్‌ తమిళసన్‌ పచ్చముత్తు దర్శకత్వం వహించనున్నట్లు టాక్.

ఇందులోనే దక్షిణాది క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్‌.. ధనుష్ సరసన నటించనుందట. ఇదే నిజమైతే వీళ్లిద్దరి కాంబోలో రూపొందే తొలి చిత్రం ఇదే అవుతుంది. ఈ ‍ప్రాజెక్టుకి అనిరుధ్‌ సంగీంతమందించనున్నాడట. ఇందులో ప్రతినాయకుడిగా విజయ్‌ కుమార్‌ నటిస్తారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

(ఇదీ చదవండి: తార‍కరత్న చివరి గుండె చప్పుడూ విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో)

Advertisement
 
Advertisement
Advertisement