ఓటీటీలో తెలుగు రొమాంటిక్ సినిమా.. అధికారిక ప్రకటన | Couple Friendly Movie OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Couple Friendly OTT: వాలంటైన్స్ డే హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Mar 11 2026 7:03 AM | Updated on Mar 11 2026 9:36 AM

Couple Friendly Movie OTT Streaming Update

గత నెలలో వాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలోకి వచ్చి హిట్ అయిన తెలుగు సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటించారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

ఏ మాత్రం అంచనాల్లేకుండా గత నెలలో విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర అనుకున్నట్లు క్లిక్ కాలేదు. ఓ వారం తర్వాత ప్రభాస్‌తో మూవీ టీమ్ ఓ ఇంటర్వ్యూ చేసింది. తర్వాత నుంచి వసూళ్లు కాస్త పికప్ అయ్యాయి. ఓవరాల్‌గా డీసెంట్ నంబర్లతో థియేట్రికల్ రన్ ముగించుకుంది. గత నెల 14న థియేటర్లలోకి రాగా ఈ శుక్రవారం(మార్చి 13) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

'కపుల్ ఫ్రెండ్లీ' విషయానికొస్తే.. శివ(సంతోష్ శోభన్)ది నెల్లూరు. ఉద్యోగ అవకాశాల కోసం చెన్నై వెళ్తాడు. కానీ ఎంతకీ జాబ్ దొరక్క పార్ట్ టైమ్ బైక్ రైడర్‌గా పనిచేస్తుంటాడు. ఇందులో భాగంగానే ఓ రోజు మిత్ర(మానస వారణాసి) పరిచయమవుతుంది. ఆమెది శివ లాంటి కథే. దీంతో ఇంట్లో వాళ్లకు జాబ్ చేస్తున్నానని అబద్ధాలు చెబుతూ చెన్నైలో బతికేస్తుంటుంది. అనుకోని పరిస్థితుల్లో మిత్ర కూడా శివతో కలిసి ఉండాల్సి వస్తుంది. మరి పెళ్లికి ముందే కలిసున్న శివ-మిత్ర జీవితాలు చివరకు ఎలా మారాయి? ఈ ప్రేమకథ సుఖాంతమైందా? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: తార‍కరత్న చివరి గుండె చప్పుడు విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో)

Advertisement
 
Advertisement
Advertisement