రణ్‌వీర్ సింగ్ దురంధర్‌-2.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఫిక్స్ | Dhurandhar 2 on comes on this OTT platform after theatrical release | Sakshi
Sakshi News home page

Dhurandhar 2: నెట్‌ఫ్లిక్స్‌లో దురంధర్‌.. ఆ ఓటీటీలో సీక్వెల్‌ స్ట్రీమింగ్

Mar 9 2026 3:41 PM | Updated on Mar 9 2026 3:57 PM

Dhurandhar 2 on comes on this OTT platform after theatrical release

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. కేవలం హిందీలోనే రిలీజైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.

అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్‌గా దురంధర్‌ ది రివెంజ్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓటీటీ ‍స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ ఖరారైంది. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత జియో హాట్‌స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్రైలర్‌లోనే వెల్లడించారు. థియేటర్లలో రిలీజైన తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. కాగా.. ధురంధర్: ది రివెంజ్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.

పోటీ నుంచి తప్పుకున్న టాక్సిక్..

ఈ మూవీతో మార్చి 19న యశ్ హీరోగా వస్తోన్న టాక్సిస్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే బాక్సాఫీస్ పోటీ నుంచి యశ్ తప్పుకున్నారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన గ్యాంగ్‌స్టర్ మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement