మొన్న భార్యకు.. ఇప్పుడు తల్లికి ఖరీదైన కారు గిఫ్ట్ | Allu Arjun Gifts Lexus Car To Mother Nirmala | Sakshi
Sakshi News home page

Allu Arjun: భార్యకు బెంజ్.. తల్లికి లెక్సెస్ కారు బహుమతి

Mar 9 2026 3:34 PM | Updated on Mar 9 2026 3:57 PM

Allu Arjun Gifts Lexus Car To Mother Nirmala

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.. మూడు రోజుల క్రితం తన పెళ్లి రోజు సందర్భంగా భార్య స్నేహారెడ్డికి ఖరీదైన బెంజ్ కారు బహుమతిగా ఇచ్చాడు. అయితే తొలుత ఈ కారు వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో తమ్ముడికి పెళ్లి గిఫ్ట్ ఇస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా భార్య స్నేహకు బన్నీ దీన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు తల్లికి కూడా ఖరీదైన కారుని ఇచ్చాడు.

(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!)

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ తన తల్లి నిర్మలకు ఖరీదైన లెక్సెస్ కారుని బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఒకటి రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని ధర రూ.70 లక్షల నుంచి రూ. కోటి మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. భార్యకు ఇచ్చిన బెంజ్ కారు ఖరీదు మాత్రం రూ.కోటిన్నర మేర ఉంటుందని సమాచారం.

ఇకపోతే బన్నీ పెళ్లిరోజునే తమ్ముడు శిరీష్ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. నయనిక రెడ్డి మెడలో మార్చి 06న మూడు ముళ్లు వేశాడు. మెగాహీరో వరుణ్-లావణ్య బ్యాచిలర్ పార్టీ సందర్బంగా కలిసి వీళ్లిద్దరూ.. తొలుత ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. శిరీష్ పెళ్లి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్)

Advertisement
 
Advertisement
Advertisement