ఆమె గొప్ప హీరోయిన్‌.. ఇలా సినిమాల్ని వదిలేయడం బాధాకరం! | Urvashi says Nazriya Nazim is a Great Actress | Sakshi
Sakshi News home page

Urvashi: భర్తతో పాటు ఆమె కూడా గ్రేట్‌ యాక్టర్‌.. ఇలా ఎందుకు వదిలేసిందో!

Mar 9 2026 2:16 PM | Updated on Mar 9 2026 3:56 PM

Urvashi says Nazriya Nazim is a Great Actress

బాలనటిగా వెండితెరకు పరిచయమైంది. నేరం అనే ద్విభాషా(తమిళ, మలయాళ) చిత్రంతో హీరోయిన్‌గా మారింది. రాజా రాణి సినిమాతో ఎక్స్‌ప్రెషన్స్‌ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది నజ్రియా నజీమ్‌. ఈ ఒక్క మూవీతో సౌత్‌లో సెన్సేషన్‌ అయిపోయింది. ఆ క్రేజ్‌తోనే వరుసగా సినిమాలు చేసింది. 2014వ సంవత్సరంలో నాలుగు మలయాళ మూవీస్‌లో మెరిసింది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరం!
అదే ఏడాది ఆగస్టులో మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. పన్నెండేళ్ల కాలంలో మలయాళంలో కేవలం నాలుగంటే నాలుగే సినిమాలు చేసింది. అందులోనూ ఒకటి గెస్ట్‌ రోల్‌! నజ్రియా మలయాళంలో అదే స్పీడుతో సినిమాలు చేసుంటే బాగుండేదంటోంది సీనియర్‌ నటి ఊర్వశి.

ఫహద్‌ గొప్ప యాక్టర్‌
తాజాగా ఊర్వశి మాట్లాడుతూ.. నా ఫేవరెట్‌ యాక్టర్‌ ఫహద్‌ ఫాజిల్‌. అతడెప్పుడూ హీరోయిజం చూపించే పాత్రలు చేయడు. తన గుండును విగ్గుతో కవర్‌ చేయడానికీ ప్రయత్నించడు. తను తనలాగే ఉంటాడు. ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో చాలా బాగా నటిస్తాడు. ఇంకాస్త గట్టిగా కష్టపడితే తనకు మంచి కెరీర్‌ ఉంది. బసిల్‌ జోసెఫ్‌ కూడా గొప్ప నటుడే!

నజ్రియా గొప్ప నటి
హీరోయిన్స్‌ విషయానికి వస్తే మీరా జాస్మిన్‌, నవ్య నాయర్‌.. ఇలా చాలా మంది మంచి పర్ఫామెన్స్‌ ఇస్తారు. కానీ, నజ్రియా సినిమాల్లో యాక్టివ్‌గా ఉండుంటే తనంత గొప్ప నటి మరొకరు ఉండేవారు కాదు. పల్లెటూరి అమ్మాయి, మోడ్రన్‌ గర్ల్‌, తెలివైన యువతి.. ఇలా అన్ని రకాల పాత్రలు ఇట్టే చేయగలదు. తనకు మంచి టాలెంట్‌ ఉంది.. అయినా ఇలా సినిమాలను వదిలేయడం కాస్త విచారకరంగా అనిపిస్తుంది అని ఊర్వశి చెప్పుకొచ్చింది. నజ్రియా అంటే సుందరానికి సినిమాతో టాలీవుడ్‌లో డైరెక్ట్‌ ఎంట్రీ ఇచ్చింది.

చదవండి: ధురంధర్‌ 2 తర్వాత ఆ సినిమాకు సంతకం చేసిన సారా అర్జున్‌?

Advertisement
 
Advertisement
Advertisement