మహిళల ఆత్మవిశ్వాసాన్ని, స్వీయ సాధికరాతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ‘సాక్షి’ గ్రూప్ మరో ముందడుగు వేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆల్ ఫర్ హర్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.
హైదరాబాద్‌లోని రాజపుష్ప అట్రియా వేదికగా జరిగిన వేడుకలు మహిళల సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, స్వయం అభివృద్ధి సందేశాన్ని ప్రతిధ్వనించేలా చేసింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ తమన్నా రూజ్ మేకప్ మాస్టర్ క్లాస్ సెషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది..


