హైదరాబాద్ : ఎగ్జిబిషన్ మైదానంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అలయ్ బలయ్ సందడిగా జరిగింది.
తెలంగాణ వంటకాలు ఘుమ ఘుమలాడాయి. బతుకమ్మ ఆటలు, డప్పుల దరువులు, పోతరాజుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి .


