breaking news
Jangaon
-
దుర్గామాతకు ఘన స్వాగతం
జనగామ: దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ విల్లాస్ కాలనీకి చెందిన టీమ్ ఎస్వీసీ వేమెళ్ల అభి ఆధ్వర్యంలో సోమవారం దుర్గామాత ప్రతిమకు భక్తిశ్రద్ధలతో స్వాగతం పలికారు. నెహ్రూపార్కు ఏరియా నుంచి వందలాది మంది మహిళలు, భక్తులు, పురప్రముఖులు, టీం ప్రతినిధుల ఆధ్వర్యంలో మేళ తాళాలు, భజనలు, ఆటాపాటలతో శ్రీ విల్లాస్ కాలనీ వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, కంచె రాములు, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. -
విద్యార్థుల ఆరోగ్యం ప్రదానం
స్టేషన్‌ఘన్‌పూర్: విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ చూపే అవకాశం ఉంటుందని, పిల్లల ఆరోగ్యం ఎంతో ప్రదానమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. దిక్సూచి కార్యక్రమంలో భాగంగా సోమవారం విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందించే కార్యక్రమాన్ని నమిలిగొండలోని కేజీబీవీలో ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 8 అంశాలతో రూపొందించిన దిక్సూచి కార్యక్రమంలో భాగంగా అన్ని సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్యపరీక్షలను ప్రారంభించి ప్రతీ విద్యార్థి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను హెల్త్ ప్రొఫైల్ కార్డులో నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సుధీర్, డీఐఓ డాక్టర్ స్వర్ణకుమారి, ఇప్పగూడెం పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రణీత తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛోత్సవాలను విజయవంతం చేయండి జనగామ: జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించ తలపెట్టిన స్వచ్ఛతా హీ సేవ–2025 పక్షోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలులో అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్, డీఆర్డీవో పీడీ వసంత, ఆర్డీవోలు గోపీరామ్, వెంకన్న, డీపీవో నాగపురి స్వరూప, ఎస్బీఎం కో ఆర్డినేటర్ కర్ణాకర్, డీఏవో అంబికా సోని, డీసీవో కోదండరాములుతో కలిసి కలెక్టర్ పోస్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్‌తో ఎమ్మెల్యే పల్లా సమీక్ష పట్టణంతో పాటు నియోజకవర్గంలో ప్రజాఅవసరాలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధి పనులను చేపట్టడంలో జాప్యం లేకుండా చూడాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ చాంబర్లో ఎమ్మెల్యే పల్లా.. కలెక్టర్ రిజ్వాన్ బాషాతో నియోజకవర్గ సమస్యలపై సమీక్షించారు. ‘రాష్ట్రీయ పోషణ్ మాహ్’ను విజయవంతం చేయాలి జనగామ రూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టే రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. ఈ నెల 17వ నుంచి అక్టోబర్ 16 వరకు రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా నమిలిగొండ కేజీబీవీలో విద్యార్థినులకు హెల్త్ ప్రొఫైల్ కార్డుల అందజేత -
వినతులు వినరేం?
సమస్యల పరిష్కారానికి ఏళ్ల తరబడిగా తిరుగుతున్నాం..25 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఈఫొటోలోని దివ్యాంగుడి పేరు దుస్స కృష్ణమూర్తి. జనగామ పట్టణం వీవర్స్‌కాలనీ. 12 ఏళ్ల క్రితం పక్షవాతం రాగా కుడి చేయి, కాలు పడిపోయి మంచానికి పరిమితం అయ్యాడు. భార్య కూలీపని చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. పట్టణంలో ఎలాంటి అస్తులు లేక 25 ఏళ్లుగా అద్దే ఇంట్లో ఉంటున్నారు. వచ్చే అదాయం కిరాయికే సరిపోతుందని, డబుల్ బెడ్రూం ఇచ్చి ఆదుకోవాలని, అలాగే దివ్యాంగ పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నాడు.ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలి నా భర్త అశోక్ 30 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలు కావడంలో బతుకుదెరువు లేక జనగామ పట్టణానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నా.. అద్దె భవనంలో ఉంటున్నాం.. గ్రామంలో ఎలాంటి ఆస్తులు లేవు. పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలి. – పానుగంటి ఆశాజ్యోతి, ఖిలాషాపూర్, రఘునాథపల్లి మండలం సర్వేనెంబర్లు హోల్డ్ నుంచి తొలగించాలి.. గ్రామంలో మొత్తం 15 సర్వే నెంబర్లలో సుమారు 30 ఎకరాల భూమి సాగు చేసుకుంటున్నాం. వారసత్వంగా గత 50 ఏళ్ల నుంచి ఖాస్తు ఉండి పట్టాదారుగా ఉన్నాం. సర్వే నెంబర్లు 14,182,183,192,207, 263,183, 187 193,347,700,729,730లను అధికారులు హోల్డ్‌లో పెట్టారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన రైతుభరోసా, బీమా రావడం లేదు. బ్యాంక్ రుణాలకు అవకాశం లేదు. సర్వే చేపట్టి తమకు పట్టాపాస్ పుస్తకాలు వచ్చేలా చూడాలి. – సముద్రాల గ్రామ రైతులు, స్టేషన్ ఘన్పూర్ మండలం సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి.. జనగామ మున్సిపాలిటీలోని బతుకమ్మకుంట ఎదురుగా ఉన్న దుర్గా కాలనీలో 15 సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకొని నివాసముంటున్నాం. నేటి వరకు సీసీ రోడ్లు గాని, డ్రైనేజీ కానీ నిర్మించలేదు. వర్షాలు వస్తే వర్ష పు నీరు ఇళ్ల చుట్టూ చేరి దోమల ద్వారా రోగాలు వస్తున్నాయి. అధికా రులు తక్షణ చర్యలు తీసుకోవాలి. – దుర్గాకాలనీ వాసులు, జనగామ రుణమాఫీ కావడం లేదు మండలంలోని కెనరా బ్యాంక్‌లో దశల వారీగా రెండు లక్షల యాభైవేలు పంట రుణాలు తీసుకున్నా..కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి ఏడాది కావొస్తున్నా మాకు లబ్ధి చేకూరలేదు. అధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పెట్టుబడికి అప్పులు చేయాల్సి వస్తోంది. అధికారులు స్పందించి రుణమాఫీ అయ్యేలా చూడాలి. – చెన్నలు భిక్షపతి, వడిచర్ల, లింగాలఘణపురం మండలంజనగామ రూరల్: ‘పక్షవాతంతో మంచానికే పరిమితం అయ్యా.. పెన్షన్, ఇల్లు ఇచ్చి ఆదుకోవాలి.., అక్రమంగా ఎకరం భూమి ఆక్రమించారు.., ఉండడానికి ఇల్లు లేదు 30 ఏళ్ల నుంచి అద్దెభవనంలో ఉంటున్నాము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలి.., రుణమాఫీ కావడం లేదు.. విద్యుత్ లైన్ మార్చాలి..’ అని పలు సమస్యలతో ప్రజలు సోమవారం గ్రీవెన్స్ సెల్‌కు తరలివచ్చారు. ఈసందర్భంగా ప్రజల నుంచి అదనపు కలెక్టర్లు బెన్షాలోమ్, పింకేశ్ కుమార్, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా 90మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఏళ్ల తరబడిగా కలెక్టరేట్ చుట్టు ప్రదక్షిణ చేసిన తమ సమస్యలు తీరడం లేదని సమయం, డబ్బులు ఖర్చవుతున్నాయని ప్రజలు అవేదన వ్యక్తం చేశారు. ప్రజల వినతులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీవోలు గోపిరామ్, డీఎస్ వెంకన్న, గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమయం, డబ్బులు వృథా అవుతున్నాయి.. ప్రజావాణిలో ప్రజల ఆవేదన సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం -
బస్సు ఆగింది !
కొట్టుకపోయిన గానుగుపహాడ్ జంక్షన్ బ్రిడ్జి మట్టి రోడ్డుజనగామ–హుస్నాబాద్ ప్రధాన రహదారిపై వడ్లకొండ శివారు గానుగుపహాడ్ జంక్షన్ బ్రిడ్జి పనులు ఏళ్ల తరబడి నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సౌకర్యంలో అంతరాయం కలగకుండా అధికారులు తాత్కాలికంగా మట్టి రహదారి ఏర్పాటు చేశారు. రెండు, మూడు నెలలుగా కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి పెరిగి కోతలకు గురవుతూ..ఇటీవల పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో లారీలు, భారీ ట్రక్కుల రూట్ మారిపోగా, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు గానుగుపహాడ్ మీదుగా మళ్లించారు. – జనగామప్రత్యామ్నాయం లేకనే.. జనగామ డిపో నుంచి హుస్నాబాద్‌కు సోమవారం రెండు బస్సులు(6 ట్రిప్పులు) రద్దు చేశాం. గానుగుపహాడ్ మీదుగా వెళ్లే పరిస్థితి లేదు. గ్రామస్తులకు నచ్చజెప్పి బస్సులను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇబ్బందిగా ఉంది.. జనగామ నుంచి నర్మెటలోని బంధువుల ఇంటికి వచ్చాను. తిరిగి వెళ్లే సమయంలో రెండు గంట ల కు పైగా నిరీక్షించినా ఒక్క బస్సు కూడా రాలేదు. ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో జనం కిక్కిరిసి వెళ్తున్నారు. నర్మెట నుంచి జనగామకు రూ.50 చెల్లించాల్సి వస్తోంది. జనగామ–హుస్నాబాద్ రూట్ రెండు రాష్ట్రాలు, ఏడు జిల్లాలకు ప్రధాన రహదారి. జనగామ నుంచి వడ్లకొండ, నర్మెట, తరిగొప్పుల మీదుగా హుస్నాబాద్(సిద్దిపేట), కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాకు ప్రధాన రహదారి. ఇటీవల ఈ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ దారి గుండా నిత్యం హుస్నాబాద్‌కు, అటు నుంచి జనగామకు.. రెండు డిపోలకు చెందిన 6 బస్సుల(18 ట్రిప్పులు)ను నడిపిస్తున్నారు. ప్రతీరోజు 2,500 మంది వరకు ప్రయాణికులు ఆర్టీసీ సర్వీసుల్లో ప్రయాణిస్తుండగా, మరో వెయ్యి వరకు ప్రైవేటు వాహనాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన దారిలో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జి సమస్యపై సర్కారు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోంది. గానుగుపహాడ్ జంక్షన్ వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టి మధ్యలోనే వదిలేశారు. వాగు మధ్యలోనుంచి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టికట్టపై నుంచి ప్రమాదకర రాకపోకలు సాగించారు. కొట్టుకుపోయిన వంతెన.. తాత్కాలిక మట్టిరోడ్డు కొట్టుకుపోవడంతో గానుగుపహాడ్ గ్రామం మీదుగా వాహనాలను మళ్లించారు. అయితే గ్రామంలోని చిన్న కల్వర్టు బలహీనంగా ఉండడం, దానిపై నుంచి భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ గ్రామం నుంచి భారీ వాహనాల మళ్లింపును ఆపేయాలని రాస్తారోకోకు దిగా రు. నూతన బ్రిడ్జి సమీపంలో తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడం, గానుగుపహాడ్‌లో లెవల్ కల్వర్టు ప్రమాదకరంగా మారడంతో హుస్నాబాద్ రూట్లో బస్సులు, భారీ వాహనాలు ప్రయాణం చేసే వీలు లేకుండా పోయింది. గానుగుపహాడ్ నుంచి మళ్లింపు ప్రజల నుంచి నిరసన తెలపడంతో జనగామ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్లే సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. హుస్నాబాద్ డిపో నుంచి నర్మెట వరకు మాత్రమే నడిపిస్తున్నారు. దీంతో వందలా ది మంది విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధి కారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనులు పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. బ్రిడ్జి నిర్మాణంపై నిర్లక్ష్యం.. జనగామ–హుస్నాబాద్ రూట్లో నిలిచిన బస్సు సర్వీసులు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, విద్యార్థులు -
రెండు స్కూళ్లకు ఇద్దరు టీచర్లు
జనగామ: జిల్లాలోని రఘునాథపల్లి మండలం నక్కబొక్కల తండా, పాలకుర్తి మండలం కిష్టాపూర్(సింగిల్ టీచర్) రెండు ప్రాథమిక పాఠశాలలకు ఇద్దరు టీచర్లను తాత్కాలిక డిప్యుటేషన్‌పై పంపించారు. ఇటీవల ప్రమోషన్లపై ఇందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వెళ్లిపోవడంతో విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడింది. ‘పట్టాలెక్కని సర్దుబాటు–గాడితప్పుతున్న పాఠశాల నిర్వహణ’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. నక్కబొక్కల తండా పీఎస్‌కు మండలగూడెం స్కూల్‌కు చెందిన మారుతి రాజు, కిష్టాపూర్ తండా పీఎస్‌కు పలుగు బోడుతండా పాఠశాల నుంచి రమేశ్‌ను తాత్కాలిక డిప్యుటేషన్‌పై పంపించారు. బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఎస్జీటీలు ఇటీవల ప్రమోష న్పై వెళ్లడంతో సీఆర్పీతో నెట్టుకొస్తున్నారు. స్కూల్లో 12 మంది విద్యార్థులు ఉండగా, ఇప్పటివరకు ఒక్క ఉపాధ్యాయున్ని కూడా కేటాయించలేదు. -
రాఘవాపూర్‌లో టెన్షన్ టెన్షన్
స్టేషన్‌ఘన్‌పూర్: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం రఘునాథపల్లి మండలం కుర్చవల్లి నుంచి పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ఆయన్ను హన్మకొండలో పోలీ సులు హౌజ్ అరెస్టు చేశారు. హౌజ్ అరెస్టు ఘటనపై మండలంలోని రాఘవాపూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. రాజయ్య మూడో విడత పాదయాత్రను రఘునాథపల్లి మండలంలోని కుర్చపల్లి నుంచి ప్రారంభించాల్సిన పాదయాత్రకు ము ఖ్య అతిఽథిగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరుకానుండగా రాఘవాపూర్ వద్ద వారికి స్వాగతం పలికేందుకు స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు మండలాల బీఆర్ఎస్ కార్యకర్తలు రాఘవాపూర్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఏమైనా గొడవలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీమ్‌శర్మ ఆధ్వర్యంలో స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, చిల్పూరు తదితర మండలాల సీఐలు, ఎస్ఐల ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తుగా మోహరించారు. బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల తోపులాట రాస్తారోకోలో ఎమ్మెల్యే కడియం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట, వాగ్వివాదం జరిగాయి. దాంతో బీఆర్ఎస్ నాయకులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏసీపీ, సీఐ, ఎస్ఐలు వారికి నచ్చజెప్పి రహదారిపై నుంచి పక్కకు తీసుకువచ్చారు. కార్యక్రమంలో చల్లా చందర్‌రెడ్డి, తాటికొండ సురేష్, ఎ.బాలరాజు, రాకేష్‌రెడ్డి, నర్సింహారెడ్డి, పెసరు సారయ్య, గుండె మల్లేష్, ప్రసాద్, రంజిత్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణుల నిరసన పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట ఉద్రిక్తతల నడుమ కుర్చపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే రాజయ్య పాదయాత్ర -
ప్రజాపాలన దినోత్సవ ముఖ్యఅతిథి బీర్ల
జనగామ: సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకలకు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టరేట్ ఆవరణలో జరిగే కార్యక్రమంలో ఉదయం 10 గంటలకు జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ప్రభుత్వ, పట్టణ, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నేడు, రేపు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలుజనగామ: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యలో అమలవుతున్న కార్యక్రమాల తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈనెల 16, 17వ తేదీల్లో రాష్ట్ర అధికారులను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి జనగామ జిల్లాకు రాష్ట్ర వయోజన విద్య డైరెక్టర్ జి.ఉషారాణిని రెండు రోజుల ఆకస్మిక పర్యటనకుగాను పర్యవేక్షణ అధికారిగా నియమించారు. మండల విద్యాశాఖ అధికారితో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులతో కలిసి ఉషారాణి 10 పాఠశాలలను తనిఖీ చేయనున్నారు. పాఠశాలల ఎంపికకు సంబంధించి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు. నేడు జిల్లాకు టీజీడీడీసీఎఫ్ చైర్మన్జనగామ: జిల్లాలో మంగళవారం(నేడు) తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కార్పోరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి పర్యటించనున్నారు. డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి (ఐఏఎస్) తో కలిసి ఆయన జనగామ నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల్లో జరుపతలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి జనగామ విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్‌సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం జనగామ మండలం సిద్ధెంకి గ్రామంలో ఆయన పాల ఉత్పత్తిదారుల కేంద్రాన్ని సందర్శించి, పాడి రైతులతో సమావేశమవుతారు. అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేనేత సమస్యలను పరిష్కరించండిజనగామ: చేనేత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కేంద్రంలో కార్మికులు ర్యాలీ చేపట్టారు. సొసైటీ ఇన్చార్జ్ గుర్రం నాగరాజు ఆధ్వర్యంలో జనగామ మండలం ఎల్లంల, సిద్ధెంకి, పట్టణంలోని బాణాపురం, సంజయ్‌నగర్, వీవర్స్ కాలనీ, బచ్చన్నపేట, లింగాలఘణపురం మండలాల్లోని సిరిపురం, పటేల్ గూడెం నుంచి వచ్చిన సుమారు 2వందల మంది కార్మికులతో ఆర్టీసీ చౌరస్తా నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం నాగరాజు నేతృత్వంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. చేనేత భరోసా, చేనేత పెన్షన్లు, స్టాండ్ మగ్గాలు, హెల్త్ కార్డులు తదితర హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు చిదురాల గణేశ్, ఎనగందుల కృష్ణ, జయరాములు, బిట్ల శంకర్, బిర్రు ఇస్తారి, బిర్రు శ్రీరాములు, మోహన్ కృష్ణ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలిబచ్చన్నపేట: గ్రామ పంచాయతీల రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని డీఎల్పీఓ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కొడవటూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేసి పలు పనులను యాప్‌లో ఆన్లైన్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామస్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా పైపులైను లీకేజీలు లేకుండా చూడాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలన్నారు. చెత్తను బయట వీధులలో పార వేయకుండా గ్రామస్తులకు అవగాహన కలించాలన్నారు. ఇంటి, నల్లా పన్నులను సకాలంలో గ్రామస్తులు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి బృంగి రూపాచైతన్య, జీపీ సిబ్బంది పాల్గొన్నారు. -
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
● బతుకమ్మకుంటను సందర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిజనగామ: జనగామ నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మార్నింగ్ వాక్‌లో భాగంగా జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో పురపాలిక కమిషనర్ మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. బతుకమ్మకుంటలో సుందరీకరణ పనులను పరిశీలించారు. వాకింగ్ ట్రాక్, చిల్ట్రన్ పార్కు, సుందరీకరణ పనుల పురోగతి, ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయమై ఆరా తీశారు. వాకర్లతో కాసేపు ముచ్చటించి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పురపాలిక జనరల్ ఫండ్‌తో పాటు ఎల్ఆర్ఎస్ ద్వారా సమకూరిన నిధులతో సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్‌రెడ్డి, నాయకులు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ముస్త్యాల దయాకర్, జూకంటి శ్రీశైలం, అనిత, పూర్ని స్వరూప, బిజ్జాల నవీన్‌గుప్తా, మామిడాల రాజు, ఉల్లెంగుల సందీప్, ఉడుగులు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
నిర్మాణం..కళాత్మకం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్భుత కట్టడాలుకాజీపేట అర్బన్: దక్షిణాదిలోనే అతి పెద్ద హాస్టల్ భవనంతో నిట్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిట్‌లోని సివిల్ ఇంజనీర్లు 2009లో హాస్టల్ భవనానికి శ్రీకారం చుట్టారు. 10 అంతస్తుల్లో 1,800 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఎటుచూసినా వీ ఆకారంలో కనిపించేలా భవనం నిర్మించారు. నాటి కాకతీయ కళాకారుల కీర్తి ప్రతిష్టను పెంపొందించేందుకు హాస్టల్ భవనానికి రామప్ప హాల్ ఆఫ్ రెసిడెన్సీగా నామకరణం చేయగా.. విద్యార్థులు ఆల్ట్రా మెగా హాస్టల్ 1.8కేగా పిలుచుకుంటున్నారు. చక్కటి గాలి, వెలుతురు వస్తుంది. నిట్ వరంగల్‌లో ప్రవేశం పొందిన బీటెక్ ఫస్ట్ ఇయర్, ఎంటెక్ విద్యార్థులకు హాస్టల్ భవనంలో వసతి కల్పిస్తారు. ఒక గదిలో నలుగురు విద్యార్థులకు సౌకర్యం కల్పించారు. జిమ్, కాఫీ షాపు, టీవీ రూంలు, బ్యాడ్మింటన్ కోర్టులతోపాటు మెస్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంజనీర్లు బహుళ అంతస్తు నిర్మాణంలో నిట్‌ను రోల్‌మెడల్‌గా తీసుకుంటున్నారు. కల్లెడ గడి ముఖద్వారంవసతులు ఘనం.. అతి పెద్ద భవనం చెక్కు చెదరని వందల ఏళ్ల నాటి గడీలు పర్యాటకులను ఆకర్షిస్తున్న శిల్పకళా సంపద కాకతీయుల కాలం నాటి ఇంజనీర్ల అపార మేథశతాబ్దికి సమీపం.. నేటికీ పదిలం -
క్రీడల్లో రాణించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని స్టేషన్ ఘన్పూర్ సీఐ జి.వేణు అన్నారు. జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండలంలోని ఛాగల్లు జెడ్పీఎస్ఎస్ ఆవరణలో జిల్లాస్థాయి సబ్‌జూనియర్స్ బాలబాలికల కబడ్జీ జట్ల ఎంపిక పోటీలను ఆదివారం నిర్వహించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో బాలురు 150 మంది, బాలికలు 120 మంది హాజరు కాగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఐ మాట్లాడుతూ.. కబడ్డీలో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ సారంగపాణి మాట్లాడుతూ.. పోటీలలో ఎంపికై నవారు ఈనెల 25 నుంచి నిజామాబాద్‌లో జరిగే 35వ సబ్ జూనియర్స్ అంతర్‌జిల్లాల పోటీలలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వై.కుమార్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఏదునూరి ఉప్పలయ్య, చింతకింది సుధాకర్, భాస్కుల సమ్మయ్య, రాజు, కుమార్, చందర్, ఆంజనేయులు, షఫీర్ పాల్గొన్నారు. ● స్టేషన్ ఘన్పూర్ సీఐ జి.వేణు ● ఛాగల్లులో సబ్ జూనియర్స్ జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక -
ప్రశాంతంగా సర్వేయర్ల పరీక్ష
● ఆరుగురు అభ్యర్థుల గైర్హాజరు జనగామ రూరల్: జిల్లా కేంద్రంలో ఏబీవీ డిగ్రీ కళాశాలలో సైన్స్ సర్వేయర్ల సప్లిమెంటరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని నోడల్ అధికారి మన్యంకొండ, పరీక్ష కన్వీనర్ నూకరాజు ఆదివారం తెలిపారు. 166 మందికి గాను ఆరుగురు గైర్హాజరయ్యారన్నారు. రెండు దశల్లో పరీక్షలు జరగగా మొత్తం 166 మందికి గాను ఉదయం పరీక్షలకు 74 మందికి గాను 69 మంది హాజరుకాగా ఐదుగురు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 92 మందికి 91 మంది హాజరు కాగా ఒక్కరు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. పరీక్ష కేంద్రాన్ని డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ పండారీ చేతన్ నితిన్ పరిశీలించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా చర్యలు చేపట్టారు. -
రాజ్యాధికార దిశగా ఉద్యమించాలి
జనగామ రూరల్: గిరిజనులు రాజ్యాధికార దిశగా ఐక్యంగా ఉద్యమించాలని సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షుడు చినబాబు నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు ఆముగోత్ రాంబాబు పిలుపునిచ్చారు. అదివారం పట్టణంలోని ఎస్ఎస్ఎన్ గార్డెన్స్‌లో జిల్లా అధ్యక్షుడు ధరావత్ శంకర్ నాయక్ అధ్యక్షతన సేవాలాల్ సేన ఆవిర్భావ దశాబ్ది వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..బంజారా, సుగాలి, లంబాడీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పించబడ్డాయని కానీ కొందరు నాయకులు అవగాహన లేకుండా తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది జోగురాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు మహేందర్, భూక్య రాజు, ధరావత్ రమేశ్, మూడవత్ రాజు, వాంకుడోత్ అనిత, భిక్షపతి పాల్గొన్నారు. -
స్వచ్ఛత ‘అమ్మ’ చేతిలో!
● పాఠశాలల్లో పరిశుభ్రత బాధ్యత అమ్మ ఆదర్శ కమిటీలకు.. ● ప్రత్యేక నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వంజనగామ: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నిర్వహణను మెరుగుపరచడమే లక్ష్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు పరిశుభ్రత బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. పాఠశాలల టాయిలెట్స్ శుభ్రత, మొక్కలకు నీరు పెట్టడం, ప్రాంగణంలో స్వచ్ఛత కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. ప్రస్తుతం గ్రామీణ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖ, పట్టణ స్కూల్స్‌ను మునిసిపల్ చూసుకోవాల్సి ఉన్నా, అవి సమర్థవంతంగా సాగకపోవడంతో పాఠశాలల పరిశుభ్రతపై తీవ్ర వ్యతిరేక ప్రభావం పడుతోంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకే ఈ బాధ్యతలు కట్టబెట్టింది. స్వచ్ఛత కోసం సర్కారు దృష్టి విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పాఠశాలల పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్స్ పేరుతో కొత్త నిధిని ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులు ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్ స్కూళ్లకు వర్తిస్తాయి. టాయిలెట్ల శుభ్రత, మొక్కలకు నీరు పెట్టడం, పాఠశాల ప్రాంగణ సంరక్షణ వంటి ఖర్చులకు మాత్రమే వినియోగించాలి. సమ గ్ర శిక్ష కింద వస్తున్న కాంపోసిటీ స్కూల్ గ్రాంట్‌కు అదనంగా ఈ నిధులు లభిస్తాయి. నిధులు నేరుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఖాతాల్లోకి 10 నెలలపాటు జమ అవుతాయి. జీరో స్కూల్స్‌కు నిధులు కేటాయించబడవు. ప్రత్యేక నిధులతో పాఠశాలల పరిశుభ్రత సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు విద్యార్థులకు స్వచ్ఛమైన వాతావరణం కలిగేందుకు ఆస్కారం ఉంటుందని సర్కారు సంకల్పం. నిధులు ఇలా నిధులు డ్రా చేసే సమయంలో ఎవరైనా వ్యక్తి పేరు ప్రస్తావించరాదు. వ్యక్తులకు నేరుగా డబ్బు చెల్లించకూడదు. పాఠశాల పరిసరాలు, మరుగుదొడ్లు తరచూ శుభ్రం చేయాలి. శుభ్రపరిచేందుకు అవసరమైన సామగ్రి కొను గోలు చేసే సమయంలో సమగ్ర శిక్ష కింద విడుదలైన కంపోజిట్ స్కూల్ గ్రాంట్ నుంచి వినియోగించాలి. వ్యక్తుల నియామకానికి అయ్యే ఖర్చులను పాఠశాలకు కేటాయించిన మొత్తం నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అదనపు నిధులు అనుమతించబడవు. స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్స్‌ను జిల్లాల మినరల్ ఫండ్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ)నుంచి విడుదల చేస్తారు. మూడు నెలల ముందుగానే డబ్బులు కమిటీలకు అందజేస్తారు. ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించి, విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేలా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉంటుంది. రూ.2.55కోట్లు విడుదల రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష (సివిల్ వర్క్స్) పరిధిలో పాఠశాలల శానిటేషన్తో పాటు సదుపాయాల కల్పన, అభివృద్ధి తదితర వాటి కోసం రాష్ట్రంలోని 21 జిల్లాలకు నిధులు కేటాయించగా, జనగామ జిల్లాకు రూ.2.55కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ నిధులు పాఠశాలల పరిశుభ్రత, సదుపాయాల మెరుగుదల, మరమ్మతుల కోసం మాత్రమే ఉపయోగించాలి. విద్యార్థుల నమోదు ఆధారంగా నెలనెలా నిధులు1నుంచి 30 మంది వరకు–రూ.3వేలు 31నుంచి 100 వరకు–రూ.6వేలు 101నుంచి 250 వరకు–కూ.8వేలు 251నుంచి 500 వరకు–రూ.12వేలు 501నుంచి750 వరకు–15వేలు 750 పైగా–20వేలు -
జిల్లాస్థాయి షూటింగ్‌బాల్ ఎంపిక పోటీలు
స్టేషన్‌ఘన్‌పూర్: డివిజన్ కేంద్రంలో జనగామ జిల్లాస్థాయి జూనియర్ బాలబాలికల షూటింగ్‌బాల్ ఎంపిక పోటీలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా షూటింగ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్ మాట్లాడారు.. జిల్లాస్థాయి జూనియర్ షూటింగ్‌బాల్ ఎంపిక పోటీలకు బాలురు 80 మంది, బాలికలు 70 మంది హాజరయ్యారన్నారు. ఎంపిక పోటీల్లో వారు చూపిన ప్రతిభ ఆధారంగా 12 మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న వారు ఈనెల 22, 23, 24వ తేదీలలో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో షూటింగ్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యుగేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు దేవ్‌సింగ్, పీడీ గోపాలకృష్ణ, పీఈటీలు సుధాకర్, చందర్ తదితరులు పాల్గొన్నారు. ముస్లింల ర్యాలీ జనగామ రూరల్: మిలాద్ ఉన్ నబీ పండుగ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మిలాద్ సోషల్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు అన్వర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ముస్లింలు ర్యాలీ చేపట్టారు. గిర్నిగడ్డ, లేబర్ అడ్డా నుంచి బైక్‌పై ముస్లిం మైనారిటీ యువకులు ర్యాలీ ప్రారంభించి రెల్వేస్టేషన్ జామియా మజీద్ వరకు నిర్వహించారు. ర్యాలీలో సీఐ దామోదర్‌రెడ్డి, జిల్లా మైనార్టీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జమాల్ షరీఫ్, మాజీ కౌన్సిలర్ సమద్, యువకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. సురక్షిత నీరు అందించాలి జనగామ రూరల్: చీటకోడూరు రిజర్వాయర్‌లోని ఫిల్టర్ బెడ్లను ఆధునీకరించి పట్టణ ప్రజలకు సురక్షిత నీరందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ డిమాండ్ చేశారు. అదివారం మండల కమిటీ ఆధ్వర్యంలో ఫిల్టర్‌బెడ్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొని పట్టణ ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి జగదీశ్, పట్టణ ఉపాధ్యక్షులు బింగి రమేశ్, హరిప్రసాద్, పట్టణ కార్యదర్శి శివకృష్ణ, జిల్లా కార్యదర్శి సతీశ్, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ జనగామ: హైదరాబాద్ బోడుప్పల్లో ఆదివారం నిర్వహించిన 29వ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో జనగామ పట్టణంలోని విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనభరచి పలు పతకాలు సాధించారని అకాడమీ జిల్లా అధ్యక్షుడు మాస్టర్ ఓరుగంటి సంతోష్‌కుమార్ తెలిపారు. అండర్ 14 బాలికల విభాగంలో మాట్ల జెస్సిక, అండర్ 8 బాలికల విభాగంలో చెన్నోజు అక్షయ, అండర్ 8 బాలుర విభాగంలో బండ శ్రీరామ్, మహేశ్వరం అశ్విత్చంద్ బంగారు పతకాలు గెలుచుకున్నారని తెలిపారు. అండర్ 14 బాలుర విభాగంలో బ్రౌన్ బెల్ట్ విభాగంలో ఓరుగంటి అక్షిత్ మణివర్ధన్, అండర్ 12 విభాగంలో ఓరుగంటి నిక్షిత్ మణివర్ధన్, మట్ల సామ్యేల్ జాన్ సిల్వ ర్ మెడల్ గెలుపొందగా, బాలికల కలర్ బెల్ట్స్ విభాగంలో హృతిక, ఆంధ్రగుండా వర్షిణి, బండ అవంతిక కాంస్య పతకాలు సాధించారని చెప్పారు. విక్టరీ షోటోకాన్ అకాడమీ ఇండియా చీఫ్ రంగు మల్లికార్జున్‌గౌడ్, సీనియర్లు మాస్టర్లు సదాశివుడు, బాబురావు, సురేశ్, గిద్దలూరు శ్రీనివాస్ పతకాలు గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. -
బీజేపీకి నైతికహక్కు లేదు
● సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావుజనగామ రూరల్: నిజాం రాచరికాన్ని ఓడించిన చరిత్ర ముమ్మాటికీ కమ్యూనిస్టులదేనని, సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవం పురస్కరించుకొని శనివారం పట్టణంలోని నల్ల నర్సింలు విగ్రహానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు పాతూరి సుగుణమ్మ, ఆకుల శ్రీనివాస్, చొప్పరి సోమయ్య, కావటి యాదగిరి, చామకూర యాకూబ్, చింతకింది అరుణ తదితరులు పాల్గొన్నారు. రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సీఈఓలుగా పని చేసిన సమయంలో తండ్రీకొడుకులు అవినీతికి పాల్పడటంతో కేసు నమోదు కాగా.. శనివారం తనయుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు. గతంలో సొసైటీ సీఈఓలుగా పనిచేసిన పెద్దగోని వెంకటరాజయ్య, అతడి కుమారుడు పెద్దగోని రాజ్‌కుమార్ రైతులకు తెలియకుండా వారి పేరిట రుణాలు తీసుకోవడంతో పాటు, అనేక అక్రమాలకు పాల్పడి రూ.39 లక్షలు దుర్వినియోగం చేసినట్లు కోఆపరేటివ్ విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని రాజ్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించగా అతడి తండ్రి వెంకటరాజయ్య పరారీలో ఉన్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
సమస్యలు పరిష్కరిస్తాం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లా కళాశాల ఐదేళ్ల కోర్సు విద్యార్థుల సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తామని రిజిస్ట్రార్ రామచంద్రం హామీ ఇచ్చారు. ఈనెల 12న ఐదేళ్ల లాకోర్సుల విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేసిన నేపథ్యంలో ఆయా విద్యార్థులతో శనివారం పరిపాలనాభవనం వద్ద చర్చలు జరిపారు. అయినప్పటికీ విద్యార్థులు వినకుండా పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించారు. మళ్లీ కొంతసేపటికి రిజిస్ట్రార్ రామచంద్రం విద్యార్థులతో మాట్లాడారు. వీసీ ప్రతాప్‌రెడ్డి ఈనెల 23న కేయూకు రానున్నారని సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లి దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. వినతిపత్రాన్ని రిజిస్ట్రార్ రామచంద్రంకు అందజేశారు. రిజిస్ట్రార్ వెంట పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సు దర్శన్, కేయూ పాలకమండలి సభ్యులు ఆచా ర్య బి.సురేశ్‌లాల్, లా హాస్టల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ చల్లా శ్రీనివాస్ ఉన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో.. కేయూ పోలీస్టేషన్ పోలీస్ అధికారులు కూడా అక్కడికి విచ్చేశారు. -
ఘనంగా జల్సా, నాథియా ముషాయిరా
జనగామ రూరల్: ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈద్–ఏ–మిలాద్–ఉన్–నబీ పర్వదిన సందర్భంగా శనివారం పట్టణంలో గిర్నిగడ్డ చౌరస్తాలో జిల్లా ముస్లిమ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు మ హమ్మద్ జామాల్ షరీఫ్ అధ్యక్షతన జల్సా, నాథి యా ముషాయిరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఉర్దూ దినపత్రిక ఎడిటర్, మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, డీసీపీ రాజమహేంద్రనాయక్, మార్కెట్ చైర్మన్ బి.శివరాజ్ యాదవ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా అమీర్ అలీఖాన్ మాట్లాడుతూ.. ముస్లిములు ఐదు పూటలు నమాజ్ చేయాలన్నారు. ఖరాన్ హదీస్ ముస్లింలు పాటించాలని సూచించారు. డీసీపీ రా జామహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో హిందూ, ముస్లిములు కలసి పండగలు జరుపుకుంటారని, మతసామర్యంగా ఉంటారని అభినందించారు. కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, ముజీబ్ ఊరు రెహ్మాన్, మౌలానా జాక్రియా సబ్, రఫ్ మతీన్ అ డ్వకేట్, అంకుశవాలి, అబ్దుల్ మన్నాన, మేడ శ్రీను, కర్నాకర్‌రెడ్డి, బాసిత్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
జనగామ రూరల్: పట్టణంలోని ఏబీవీ ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 15,16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్యా మండలి ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే దోస్త్ చివరి అవకాశం ఇచ్చిందని ఇంటర్ ఉత్తీర్ణత కలిగి డిగ్రీలో ప్రవేశం పొందనివారు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్పాట్ అడ్మిషన్ కోసం ఒరిజినల్స్ పదో తరగతి మెమో, ఇంటర్మీడియట్ మెమో కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, మూడో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు(2) వెంట తీసుకొని కళాశాలకు రావాలని ప్రిన్సిపాల్ తెలిపారు. మరిన్ని వివరాలకు 97010 46411, 99124 37032. నెంబర్లలో సంప్రదించాలన్నారు. చీటకోడూరు తాగునీటిని శుద్ధిచేయండిజనగామ: పట్టణ ప్రజలకు చీటకోడూరు రిజర్వాయర్ ఫిల్టర్ బెడ్ నుంచి నిత్యం సరఫరా చేసే తాగునీటి శుద్ధిలో లోపాలు ఉండడంతో ప్రజలు శాపంగా మారిందని అమ్మఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణి శనివారం కమిషనర్ మహేశ్వర్‌రెడ్డికి లేఖ రాశారు. తాగునీరు రంగు మారి వస్తుండడంతో నిత్యావసరాలకు సైతం ఉపయోగించలేని విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. విధిలేని పరిస్థితుల్లో ఈ నీటిని వాడుకోవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులతో పాటు అనేక రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మినరల్ వాటర్ కొనలేని దయనీయస్థితిలో నిరుపేద కుటుంబాలు రంగుమారిన నీటినే తాగుతున్నారన్నారు. ఫిల్టర్‌బెడ్ వద్ద నీటిని శుద్ధి చేసే సమయంలో నిబంధనలను పాటించాలని, లేని పక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. లింగాలఘణపురం: మండలంలోని మాణిక్యాపురానికి చెందిన ఒగ్గు రవిని శుక్రవారం రాత్రి విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో వైశాఖీ యువ పురస్కారంతో సత్కరించారు. నటరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వైశాఖీ జాతీయ నృత్సోత్సవాలు ప్రారంభం కాగా 21 మంది ఒగ్గుడోలు బృందానికి ప్రత్యేక ఆహ్వానం అందగా అబ్బురపరిచే ప్రదర్శన చేశారు. అనంతరం ఒగ్గు రవిని వైశాఖీ యువ పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఆర్ఎస్ రవిశంకర్ నారాయణ, రిటైర్డ్ ఆదాయ పన్ను శాఖ కమిషనర్ ఎస్.మహమ్మద్ అలీ, కళాభారతి నిర్వాహుకులు డాక్టర్ జీకేడీ ప్రసాద్, నటరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నిర్వహుకుడు విక్రమ్, ఆంధ్ర నాట్య కళాకారుడు కళాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.నర్మెట: మండలంలోని మచ్చుపహాడ్‌కు చెందిన ఫరీదుల లింగరాజుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇటీవల డాక్టరేట్ ప్రదానం చేసింది. డాక్టర్ హరీశ్ గుప్తా పర్యవేక్షణలో జియోకెమిస్ట్రీ విభాగంలో ఇండియన్ కోస్టల్ నదులపై చేసిన అధ్యయనానికిగాను లింగరాజు డాక్టరేట్ పొందారు. ఈసందర్భంగా తల్లితండ్రులు ఫరీదుల యాదయ్య–యాదమ్మలను మాజీ ప్రజాప్రతినిథులు, గ్రామస్థులు శనివారం అభినందించారు. -
ఈ పరీక్ష పాసైతేనే!
జనగామ: జిల్లాలో లైసెన్స్డ్ సర్వేయర్లకు ఆదివారం(నేడు) జరగనున్న సప్లిమెంటరీ పరీక్షకు సర్వం సిద్ధం చేశారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో పరీక్షల నోడల్ ఆఫీసర్, జిల్లా సర్వే డిపార్ట్మెంట్ ఏడీ మణ్యంకొండ, ఎగ్జామ్ కన్వీనర్ నూకరాజు నేతృత్వంలో పర్యవేక్షణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వచ్చిన భూభారతి చట్టం–2025 భూమి కొలతలు, సర్వే చేసేందుకు లైసెన్స్ పొందిన సర్వేయర్ల కోసం ఈ ఏడాది జూలై 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహించింది. ఇందులో 173 మంది పరీక్షలు రాయగా, 48 మంది మాత్రమే అర్హత సాధించారు. 100 మార్కులకు గాను 60 స్కోర్ సాధించినవారు లైసెన్స్డ్ సర్వేయర్లకు అర్హత సాధించగా, 125 మంది అర్హత ఫెయిల్ కాగా, ఆదివారం జరిగే పరీక్షకు వీరంతా హాజరై మరోసారి తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఏబీవీలో పరీక్ష కేంద్రం.. లైసెన్స్డ్ సర్వేయర్లకు సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు థియరీ, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్లాటింగ్ ఎగ్జామ్ జరగనుంది. పరీక్షకు సంబంధించి జనగామ పట్టణంలోని సిద్దిపేటరోడ్డు ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల(అటానమస్)లో పరీక్ష సెంటర్ ఏర్పాటు చేశారు. కాగా, పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అభ్యర్థులు 9.45 గంటల కల్లా సెంటర్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి ఉండదు. అభ్యర్థి వెంట సెల్‌ఫోన్ అనుమతి లేదు. పరీక్ష సమయంలో సాంకేతిక సమస్య, లోటుపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు : 125 సెంటర్ : ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల (అటానమస్) పరీక్ష సమయం : ఉదయం 10 నుంచి మధ్యాహం 1 గంట వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు మొబైల్స్‌కు అనుమతి లేదు నేడు లైసెన్స్డ్ సర్వేయర్లకు సప్లిమెంటరీ జూలైలో నిర్వహించిన పరీక్షల్లో 48 మంది మాత్రమే ఎంపిక మిగతా 125మందికి పరీక్ష -
సీటీస్కాన్..ప్రాణాపాయం తప్పించింది!
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కొత్తగా ప్రారంభమైన సీటీ స్కాన్ సేవలు ఓ ప్రాణాన్ని నిలబెట్టాయి. శనివారం ఉదయం ఓ వ్యక్తి పక్షవాతం లక్షణాలతో అత్యవసరంగా ఆసుపత్రికి రాగా, విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లు తక్షణమే సీటీ స్కాన్ చేయించి ట్రీట్మెంట్ ప్రారంభించి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పా నుగంటి భిక్షపతి పక్షవాతంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కుటుంబ సభ్యులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్, కల్నల్ భిక్షపతి స్పందించడంతో పాటు ఓపీ ప్రాసెస్ పూర్తిచేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం ఆదేశాల మేరకు సీటీస్కాన్ అప్రూవల్ తీసుకుని, దానిని కంప్లీట్ చేశారు. మరోవైపు డయాగ్నోసిస్‌కు సంబంధించి ప్రక్రియను 12 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయడంతో పేషెంటు ఆరోగ్య పరిస్థితులు మరింత దిగజారిపోకుండా కాపాడగలిగారు. ప్రాణాపా యం నుంచి బయటపడిన ఆ వ్యక్తిని మరింత మెరుగైన వైద్యసేవల కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. వేగవంతమైన వైద్యం, ఆధునిక సౌకర్యాలను అందిపుచ్చుకుని డాక్టర్లు చేసిన సేవలను ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. పేషెంటు వచ్చిన తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేసినా పరిస్థితి విషమించేదని డాక్టర్ భిక్షపతి అన్నారు. ఆయన వెంట వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి వేగంగా చికిత్స ఇటీవల ప్రారంభించిన సీటీస్కాన్ యంత్రంతో రోగనిర్ధారణ 12 నిమిషాల్లో ట్రీట్మెంట్ ప్రారంభించడంతో పరిస్థితి మెరుగు జనగామ జిల్లా ఆసుపత్రిలో ఘటన -
రాజీమార్గంతోనే సమస్యల పరిష్కారం
జనగామ రూరల్: రాజీమార్గంతోనే కక్షిదారుల సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌ను ఆమె ప్రారంభించారు. లోక్ అదాలత్‌లో 6 బెంచ్‌ల ద్వారా ఫిర్యాదులను పరిష్కరించారు. ● మొదటి బెంచ్ ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ, సభ్యులుగా బి.సంగీత ● రెండో బెంచ్‌కు సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్, సభ్యులుగా రెడ్డబోయిన రాజు ● మూడో బెంచ్‌కు సీనియర్ సివిల్ జడ్జి ఇ.సుచరిత, సభ్యులుగా కె. పుష్ప ● నాలుగో బెంచ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.శశి, సభ్యులుగా ఇ. జ్యోత్స్న ● ఐదో బెంచ్‌కు కె.సందీప, సభ్యులుగా జి. రేఖ ● ఆరో బెంచ్‌కు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ డి.వెంకట్రాంనరసయ్య, ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ కేసుల రాజీ ఇలా.. ఓ మోటార్ యాక్సిడెంట్ కేసులో కక్షిదారులకు రూ.2,30,000ల అవార్డు అందించారు. ఈ సందర్భంగా కక్షిదారుడు కె.మహేశ్ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఎంవీఓపీ కేసులో ఎం.వీరస్వామికి రూ.7,25,000 అవార్డు ఇవ్వడం జరిగినది. జాతీ య లోక్ అదాలత్‌కు వచ్చిన కక్షిదారులకు మధ్యాహ్నం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కోర్టు కేసుల్లో ముఖ్యంగా సివిల్, క్రిమినల్, మోటా ర్ యాక్సిడెంట్, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్, ఫ్యామిలీ కేసులు పరిష్కరించారు. మొత్తం సివిల్ కేసులు 10, మోటార్ యాక్సిడెంట్ కేసులు 8 రాగా 39 లక్షల 30 వేల రూపాయలు వసూలు చేశారు. క్రిమినల్ కేసులు 5,778, ప్రీ లిటిగేషన్ కేసులు 461, మొత్తం 6,257 కేసులు పరిష్కారం కాగా రూ.94,59,667 వచ్చాయి. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, న్యాయవాదులు, లయన్స్ క్లబ్ ప్రతినిధి బి.దయాకర్‌రెడ్డి, డాక్టర్ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.న్యాయవాదులకు శిక్షణ తరగతులు అవసరమే హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ డీసీసీబీ భవన్లో న్యాయ విజ్ఞాన సదస్సు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ జాతీయ లోక్ అదాలత్‌లో 6,257 కేసుల పరిష్కారం -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
రఘునాథపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు పుప్పాల వేణుకుమార్ అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ, దివంగత మహాత్మాగాంధీ జన్మదినోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు మండల, బూత్ స్థాయిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో బాల్నె శ్రీనివాస్‌గౌడ్, ఐలోని అంజిరెడ్డి, కావటి ముత్యాలు, వల్లాల వెంకటేశ్, కల్పగూరి ప్రభాకర్, వల్లాల ఉపేందర్, దామోదర్‌రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు చేరువకావాలి.. లింగాలఘణపురం: సేవా పక్షం మండల కార్యశాల కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త గ్రా మాల్లో సేవ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువ కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ కోరారు. మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కె.సంపత్ అధ్యక్షతన ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి, జిల్లా కార్యదర్శి సతీశ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ -
నాణ్యమైన వైద్యసేవలందించాలి
బచ్చన్నపేట: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన సేవలను అందించాలని, వైద్యులు సమయపాలన పాటించాలని రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని గదులను, ఆపరేషన్ పరికరాలను, యంత్రాలను, మందుల నిల్వలను, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్ర స్తుత వర్షాకాల సీజన్లో చాలా మందికి విషజ్వరా లు వస్తున్నాయని, జబ్బుల బారిన పడిన వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకునేలా చూడాలని, వారికి అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకో వాలని తెలిపారు. కార్యక్రమంలో డీఐఓ స్వర్ణకుమా రి, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్, ప్రోగ్రామ్ ఆఫీస ర్ లగిషెట్టి అశోక్‌కుమార్, వైద్యులు మానస, రా ములు, సూపర్వైజర్ అనురాధ, స్టాఫ్ నర్సు కవిత, ఫార్మసిస్ట్ బొడ్డు శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ -
ప్రతీ ఇంటిపై సౌర విద్యుత్
జనగామ: ప్రతీ ఇంటిలో సౌర విద్యుత్తును వినియోగించి కాలుష్య రహిత తెలంగాణగా మార్చుదామని విద్యుత్ శాఖ విశ్రాంత ఎస్ఈ నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశం హాల్లో ఎన్పీడీసీఎల ఎస్ఈ టి.వేణుమాధవ్ అధ్యక్షతన రెండు రోజులుగా గృహ సౌర విద్యుత్‌పై జరుగుతున్న శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. అంతకుముందు ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 2027మార్చిలోగా దేశంలో కోటి సౌర విద్యుత్ వినియోగదారులను తయారు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తోందన్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భావిస్తున్నామన్నారు. ఇంటిపై సౌర విద్యుత్ ప్యానెళ్లను అమర్చుకునే విధానంతో పాటు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై కేంద్రం విధి విధానాలు రూపొందించిందన్నారు. ముగింపు కార్యక్రమంలో జాతీయ విద్యుత్ శిక్షణా సంస్థ డిప్యూటీ డైరెక్టర్ వెంకట సుబ్బయ్య, విద్యుత్ శాఖ డీఈలు గణేశ్, రాంబాబు, లక్ష్మీనారాయణరెడ్డి, వివిధ సబ్ డివిజన్ల ఏడీఈ, ఏఈ, సబ్ ఇంజనీర్లు ఉన్నారు. శిక్షణ తరగతుల్లో విశ్రాంత ఎస్ఈ నరేంద్ర కుమార్ -
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: స్వచ్ఛంద సంస్థలు కొత్త గ్రాంట్ ఇన్ ఎయిడ్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి డాక్టర్ బి.విక్రమ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న ఎన్జీఓలు మాత్రమే సాంఘిక సంక్షేమ నిధి ఆర్థికసాయానికి అర్హులన్నారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఎంవీఐల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీజనగామ: జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తా పోలీసు కంట్రోల్ రూం ఏరియాలో ట్రెయినీ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐ) సంపత్‌గౌడ్, మహేష్‌గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు చేపట్టారు. సీనియర్ ఎంవీఐలతో కోఆర్డినేషన్ చేసుకుంటూ 10 రోజుల వ్యవధిలో ఉన్నతాధికారుల టార్గెట్‌ను రీచ్ కావాల్సి ఉంటుంది. ఆర్డీఓ నియమ నిబంధనలు పాటించకుండా రోడ్డెక్కుతున్న ప్రతీ వాహనంపై కేసు నమోదు చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 10 కేసులు నమోదు అయ్యాయి. వారి వెంట కానిస్టేబుల్ సమ్మద్, తదితరులు ఉన్నారు. ప్రజా ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారంజనగామ రూరల్: ప్రజా ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం అవుతాయని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో ఏ రొడ్డు చూసిన గుంతలతో ప్రమాదాలకు గురవుతున్నాయని, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీధిలైట్లు, ఉద్యోగుల సమయ పాలన, పారిశుద్ధ్యం, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 17న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవ ముగింపు సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈర్రి అహల్య, రాపర్తి రాజు సింగారపు రమేష్, బొట్ల శేఖర్, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, సుంచు విజేందర్, భూక్య చందు, బెల్లంకొండ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. యూరియా కోసం అవస్థలుజఫర్గఢ్ : యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. జఫర్‌గఢ్, స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రాల్లోని సొసైటీతో పాటు మన గ్రోమోర్ షాపులకు శుక్రవారం యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచి బారులుదీరారు. గంటల కొద్ది లైన్లో నిరీక్షించిన కొందరి రైతులకు యూరి యా దొరకకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి నిరాశతో వెనుదిరిగారు. సరిపడా యూరియా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. -
శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు!
వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న నకిలీ వైద్య కేంద్రాలపై ఆగస్టు 20న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీఎంసీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా మామిడి ఈశ్వరయ్య అనే వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ డాక్టర్ పోస్టర్ పెట్టుకుని రోగులను మోసం చేస్తున్నట్లు సభ్యులు గుర్తించారు. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేశ్‌కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్యకుమార్ ఆదేశాల మేరకు టీజీఎంసీ బృందం ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈతనిఖీల్లో మడికొండ మెయిన్ రోడ్డులో ‘సాయిశ్రీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్’ పేరుతో అక్రమంగా ఒక క్లినిక్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ● తక్కువ ఖర్చు పేరిట ఫేక్ ట్రీట్మెంట్ ● వైద్యం వికటించి పలువురికి అస్వస్థత ● పోలీసు కేసులకు వెరవని కొందరు● పేదలకు శాపంగా మారిన నకిలీ వైద్యులు ● ఎక్కడపడితే అక్కడ క్లినిక్‌లు, ల్యాబ్‌లు ● యథేచ్ఛగా నిర్వహిస్తున్న అనర్హులుసాక్షిప్రతినిధి, వరంగల్: ..ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లు.. పొంతనలేని మందులు.. ఎమర్జెన్సీ వైద్యం చేస్తూ కొందరు ‘నకిలీ’లు నిర్వహిస్తున్న ఆస్పత్రులు పేదలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఖర్చు తక్కువ పేరిట వైద్యం ఎరవేస్తున్న కొందరు ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ల తీరు శాపంగా మారుతోంది. ఫేక్ డిగ్రీలు.. సర్టిఫికెట్లతో ‘డాక్టర్’ స్టిక్కర్లు వేసుకుంటున్న అనేక మంది నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలా ఉమ్మడి వరంగల్‌లో 3,250కు పైగా అర్హత లేని వైద్యులున్నట్లు సమాచారం. చాలా మంది ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆయుర్వేద వైద్యం పేరిట ఎక్కడ పడితే అక్కడ ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణ వైద్య మండలి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో అనేక ఘటనలు వెలుగు చూడడం గమనార్హం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీలు గ్రేటర్ వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో నకిలీ పీఎంపీలు, ఆర్ఎంపీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఎక్కడి పడితే అక్కడ ఇష్టారాజ్యంగా క్లినిక్‌లు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు సైతం జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యాధి ఏదైనా ముందుగా సమీపంలోని ఆర్ఎంపీల దగ్గరికే వెళ్తున్నారు. రోగాలను నయం చేస్తారనే భరోసాతో వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారు. తాజాగా నకిలీ డిగ్రీలతో చికిత్స చేస్తున్న కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కొరడా ఝుళిపిస్తుండడంతో ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఆగస్టులో 15 కేసులు.. కొన్ని నెలలుగా నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్.. ఒక్క ఆగస్టు నెలలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15 కేసులు నమోదు చేసింది. పలువురి నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మెడికల్ కౌన్సిల్ అధికారులు గత నెలలో వరంగల్, హనుమకొండ, స్టేషన్‌ఘన్‌పూర్, గీసుకొండ, హసన్‌పర్తి, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నకిలీలు అని తేలిన వారిపై ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎంసీ చట్టం 34, 54 (టీఎస్‌ఎంపీఆర్ చట్టం 22 ప్రకారం కేసులు నమోదు చేశారు. పరిధి దాటి వైద్యం చేసిన మరికొంత మంది ఆర్ఎంపీలు, పీఎంపీలు ఎన్ఎంసీ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు టీఎంసీ అధికారులు ప్రకటించారు. కాగా.. ఆరు నెలల్లో 50 మందికి పైగా కేసులు నమోదైనప్పటికీ కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు తమ తీరు మార్చుకోకుండా పరిధి దాటి వైద్యం చేస్తూ అమాయక ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌పై ఇంతేజార్గంజ్ పోలీసులు ఇటీవల కేసులు నమోదు చేశారు. నకిలీ వైద్యుడు ఆర్ఎంపీ, పీఎంపీ అయిన సదానందం అశాసీ్త్రయంగా హై డోస్ యాంటీ బయాటిక్స్, ఇంజక్షన్లు ఇస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈమేరకు తనిఖీలు నిర్వహించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రైల్వే స్టేషన్ ఎదురుగా కొందరు అనధికారికంగా హాస్పిటల్ మాదిరిగా బెడ్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా ఆదర్శ వైద్యులమని ప్రజలను మోసం చేసి రిజిస్టర్డ్ వైద్యుల్లా అలోపతి వైద్యం నిర్వహించారు. ముగ్గురు నకిలీ వైద్యులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. ఎం.రమేశ్ (లావణ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్), బి.రవి (రుద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్), డి.అశోక్ (అమ్మ ఫస్ట్ ఎయిడ్ సెంటర్)పై కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు. నకిలీ వైద్యులపై వైద్య, ఆరోగ్యశాఖాపరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆర్ఎంపీలపై దాడులు నిర్వహించేటప్పుడు వైద్య, ఆరోగ్యశాఖతో కలిసి చేస్తే మరిన్ని సత్ఫలితాలు వస్తాయి. అనధికారిక క్లినిక్‌లు సీజ్ చేసే అధికారం వైద్య ఆరోగ్యశాఖ అధికారికి మాత్రమే ఉంటుంది. క్వాలిఫైడ్ ఆర్ఎంపీలు బోర్డు పెట్టుకోకుండా ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయవచ్చు. – డాక్టర్ అప్పయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, హనుమకొండ -
కలానికి సంకెళ్లేసి సత్యాన్ని నిర్బంధించలేరు!
నిఖార్సయిన జర్నలిజంతో తెలుగు పత్రికా ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘సాక్షి’పై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అక్కసు పెంచుకుందని ఉమ్మడి వరంగల్ జిల్లా పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలకు అక్షర రూపమిచ్చినందుకు సాక్షి జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం కేసులు పెట్టించడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. కలానికి సంకెళ్లు వేసి సత్యాన్ని నిర్బంధించగలరా? అని వారంతా ప్రశ్నిస్తున్నారు. -
సౌర విద్యుత్‌తో ఆర్థికలాభం
జనగామ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సౌర విద్యుత్ వినియోగంతో ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశం హాలులో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనపై విద్యుత్ శాఖ ఇంజనీర్లకు రెండు రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. రూరల్ ఎలక్ట్రికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), జాతీయ విద్యుత్ శిక్షణా సంస్థ (ఎన్‌పీటీఐ), బెంగళూరు ఆధ్వర్యంలో డైరెక్టర్ వెంకటసుబ్బయ్య, విద్యుత్ శాఖ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ దుర్గా ప్రసాద్, కలెక్టర్ రిజ్వాన్ బాషాలు ఎన్పీడీసీఎల్ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ టి.వేణుమాధవ్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇంటిపై కప్పుతో పాటు వ్యవసాయ భూముల్లో సౌర విద్యుత్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవచ్చన్నారు. జిల్లాలో 317 సౌర విద్యుత్ మీటర్ కనెక్షన్లు ఉన్నాయని, ఈ సంఖ్యను పెంచేందుకు అధికారులు, ఇంజనీర్లు కృషి చేయాలన్నారు. ఎస్ఈ వేణుమాధవ్ మాట్లాడుతూ సౌర విద్యుత్ ప్యానెళ్లకు ప్రభుత్వం సబ్సిడీ అందింస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏఓ జయరాజ్, డీఈలు గణేష్, రాంబాబు, లక్ష్మినారాయణరెడ్డి, ఏడీఈలు, ఏఈలు, సెక్షన్ ఏఈలు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులు ఏమైన సమస్యలు ఉంటే 1800 599 5991 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటలకు అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాలో 317 సౌర విద్యుత్ కనెక్షన్లు సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా -
విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి
పాలకుర్తి టౌన్: విద్యార్థులకు చదువుతోపాటు పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అదనపు కలెక్టర్ పింకేశ్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. జిల్లాలో మొదటిసారిగా ప్రారంభించనున్న ప్రీప్రైమరీ తరగతుల కోసం పాఠశాల తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలలో లైబ్రరీ, టీఎల్ఎం సదుపాయాలను, కిచెన్, గార్డెన్, పరిసరాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు చదువుతో మంచి వాతారవణం, పరిశుభ్రత చాలా అద్భుతంగా ఉందని ప్రధానో పాధ్యాయడు చిదురాల శ్రీనివాస్‌ను అభినందించా రు. అనంతరం విద్యార్థులతో పాఠాలు చదివించి పఠన నైపుణ్యాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ స్వరూప, ఏఎంఓ శ్రీనివాస్, ఎంపీడీఓ రవీందర్, ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, సీఆర్పీలు కిషన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల గొంతు నొక్కడమే..
హన్మకొండ అర్బన్: ప్రతిపక్షాల గొంతు నొక్కడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉన్న ఏకై క గొంతుక పత్రికలు. వాటిని కూడా అణచివేయడం, అక్రమ కేసులతో తొక్కివేయడం వంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టకర పరిణామాలుగా చెప్పాలి. ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. పత్రికలే ప్రజల గొంతుకగా ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పత్రికలు, పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టులను కేసుల పేరుతో నిర్బంధించడం, వేధించడం అమానుషం. ఇది మంచి పరిణామం కాదు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు, నాయకులు ప్రజాగ్రహానికి గురవ్వక తప్పదు. – ఎన్నమనేని జగన్మోహన్రావు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రజల స్వేచ్ఛను హరించడమే..హన్మకొండ అర్బన్: అధికార పక్షం విఫలమైనప్పుడు ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా నిలబడేవి పత్రికలు, మీడియా మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అధికారంలోకి వస్తే వారు తమ స్వలాభం కోసం నిర్బంధాలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది పూర్తిగా ప్రజలను ఇబ్బంది పెట్టినట్లే, కక్ష సాధించినట్లే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా పత్రికా స్వేచ్ఛను కాలరాయడమన్నది ప్రజల స్వేచ్ఛను హరించడమే. ఇప్పటికై నా ప్రభుత్వాలు ఉద్దేశపూర్వక చర్యలను మానుకోవాలి. సాక్షి జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – నిమ్మల శ్రీనివాస్, సామాజికవేత్త -
నియంతృత్వ పాలనకు నిదర్శనం..
మహబూబాబాద్ అర్బన్: ప్రజాస్వామ్య మౌలిక సూత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛను కాలరాయడం నియంతృత్వ పాలనకు నిదర్శనం. వాక్ స్వాతంత్య్రం నిరాకరించడం అంటే ప్రజస్వామ్యంలో నాలుగో స్తంభాన్ని కూలగొట్టడమే. ప్రభుత్వ కాలపరిమితి పరిమితం. కానీ, ప్రజాస్వామ్యం అజేయమైంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసులు పెట్టి మీడియా గొంతును నొక్కడం సరికాదు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం సరికాదు. – డాక్టర్ డోలి సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమకారుడు, మానుకోట ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే.. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను హరించడమంటే రాజ్యాంగ సూత్రాలను దెబ్బతీయడమే. ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. పత్రికా స్వేచ్ఛను కాపాడకుంటే ప్రజలు బుద్ధిచెబుతారు. – పిల్లి సుధాకర్, మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డి ప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్ అన్నారు. ఇప్పగూడెం పీహెచ్సీ ఆధ్వర్యంలో మండలంలోని తానేదార్పల్లి గ్రామంలో శుక్రవారం హెల్త్‌క్యాంపు నిర్వహించారు. ఎంఎల్‌హెచ్‌పీ డాక్టర్ రమ్యకృష్ణ ఆధ్వర్యంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బందికి డిప్యూటీ డీఎంహెచ్ఓ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్‌కుమార్, ఏఎన్ఎం సునీత, ఆశ కార్యకర్తలు అనిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్ -
సుప్రీం తీర్పును సమీక్షించాలి
రెండేళ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావాలని, లేదంటే ఉద్యోగాన్ని వదులుకోవాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలి. ప్రస్తుతం పదోన్నతి పొందాలంటే టెట్ అవసరమా లేదా అనే వివాదంపై వివిధ కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇరవై, పాతికేళ్లుగా సర్వీసు చేస్తున్న ఉపాధ్యాయులు ఇప్పుడు కేవలం రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణులు కావాలనడం భావ్యం కాదు. ఎన్సీటీఈ నోటిఫికేషన్ తర్వాత నియామకమైన టీచర్లకు మాత్రమే టెట్ తప్పనిసరి చేయాలి. – పి.చంద్రశేఖర్‌రావు, జిల్లా అధ్యక్షుడు, టీఎస్ యూటీఎఫ్ -
హోంలోన్‌కు బీమా వర్తించదంటున్నారు..
● ఫైనాన్స్ బ్యాంకు ఎదుట పెట్రోల్ డబ్బాతో బాధితుల నిరసన జనగామ: జిల్లా కేంద్రంలోని ఓ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సంస్థ ఎదుట ఇద్దరు వ్యక్తులు గురువారం పెట్రోల్ డబ్బాతో నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్మెటకు చెందిన కొలేపాక లక్ష్మయ్య అనే వ్యక్తి సదరు సంస్థలో రూ.8.50లక్షల హోంలోన్ తీసుకున్నాడు. రుణం ఇచ్చే సమయంలో ఆరోగ్య పరీక్షలు చేసి, బీమా కోసం రూ.30 వేలు తీసుకున్నారు. లక్షయ్య ఇటీవల మృతి చెందారు. లక్ష్మయ్య పేరిట బీమా చేసిన సమయంలో ఏదైనా జరిగితే లోన్‌కు సంబంధించిన ఫైనాన్స్ సంస్థకు ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని నిర్వాహకులు చెప్పారని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గత నెల నుంచి బీమా వర్తించడం లేదని, లక్ష్మయ్య తీసుకున్న రుణం చెల్లించాలని సంస్థ ప్రతినిధులు బెదిరింపులకు దిగడంతో పెట్రోల్ డబ్బాతో నిరసన తెలిపామన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని వారికి నచ్చజెప్పి పీఎస్‌కు తీసుకెళ్లారు. -
పీఏసీఎస్ ఇన్‌చార్జ్‌లకు బాధ్యతల అప్పగింత
జనగామ: జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు అఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించినట్లు జిల్లా సహకార అధికారి కోదండరాములు గురువారం చెప్పారు. లింగాలఘణపురం మండలం కళ్లెం సొసైటీ అఫిషియల్ పర్సన్ ఇన్చార్జ్గా వి.వేణుగోపాల్ (కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిష్ట్రార్), బచ్చన్నపేట సొసైటీ అఫిషి యల్ పర్సన్ ఇన్చార్జ్గా బి.దివ్య(కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిష్ట్రార్), రఘునాథపల్లి నిడిగొండ సొసైటీ అఫిషియల్ పర్సన్ ఇన్చార్జ్గా ఎన్.కొర్నేలియస్ (కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిష్ట్రార్)లకు బాధ్యతలను అప్పగించారు. జఫర్గడ్ సొసైటీకి సంబంధించిన నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచారు. జనగామ రూరల్: ఈనెల 13వ తేదీన జిల్లా కోర్టులో నిర్వహించే లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ గురువారం ఒక ప్రకటన తెలిపారు. ఇంతకు ముందు కోర్ట్ ముందుకు రాని కేసులు, కోర్ట్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులు కానీ పరిష్కరించుకునే వీలు ఉంటుందన్నారు. లోక్ అదాలత్‌లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, చిట్‌ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, చెక్కు బౌన్‌న్స్ కేసులు పరిష్కరించుకోవచ్చుని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ● మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎల్ఆర్ఎస్ కట్టిన బాధితుల ధర్నా జనగామ రూరల్: ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎల్ఆర్ఎస్ కట్టిన బాధిత ప్లాట్ ఓనర్లకు ఎల్ఆర్ఎస్ అప్రూవల్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం బాధితులతో కలిసి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..పట్టణంలోని 400 సర్వే నెంబర్ ఇళ్ల స్థలాల భూమిలో ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ అయ్యి పునాది లెవెల్ పూర్తి చేసిన గాజుల అంజలికి ఇందిరమ్మ ఇల్లు బిల్లు విడుదల చేయాలన్నారు. 2006 సంవత్సరంలో పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ ఎండీ ఇబ్రహీం భూమిని ప్లాట్లు చేసి విక్రయించగా పేదలు, రిక్షా కార్మికులు, హమాలీ కార్మికులు తదితరులు కొనుక్కుని ఎవరి ఖబ్జా మీద వారు ఉన్నారన్నారు. ధర్మ కృష్ణారెడ్డి అనే భూస్వామి 383 సర్వే నెంబర్లు పట్టా కలిగి ఉండి అక్రమంగా 400 సర్వే నెంబర్ పట్టాలోకి చొరబడి పేదలను ఇబ్బంది పెడుతున్నాడని, ఈ విషయం 2024 సంవత్సరంలో జనగామ డీఐ సర్వే నిర్వహించి గెట్టు నిర్ణయించారని మున్సిపల్ అధికారులను తప్పుదారి పట్టించి పేదలను ఇబ్బంది పెడుతున్నాడన్నారు. తక్షణమే పేదలకు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఇ ర్రి అహల్య, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, ఎండీ అజారుద్దీన్, భూక్య చందు, మీట్యానాయక్, బొట్ల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
దంచికొట్టింది
జనగామ: జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండలతో వాతావరణం హీటెక్కి పోగా.. సాయంత్రం 4 గంటల నుంచి ఒక్కసారిగా చల్లబడింది. 5.30 గంటల ప్రాంతంలో ముసురుతో ప్రారంభమైన వాన.. కనీవినీ ఎరగని స్థాయిలో దంచికొట్టింది. దీంతో జిల్లా కేంద్రంలోని హైదరాబాద్రోడ్డుతో పాటు జ్యోతినగర్, బాలాజీనగర్, కుర్మవాడ, శ్రీనగర్ కాలనీ రూట్, చమన్ తదితర ఏరియాలను వరద ముంచెత్తింది. చమన్ ఏరియాలో ఆరుబయట ఉంచిన బైక్‌లు సగం వరకు మునిగిపోగా, హైదరాబాద్ రూట్లో దుకాణ షట్టర్ల వరకు వరద చేరడంతో వ్యాపారులు ఆందోళన చెందారు. చంపక్‌హిల్స్‌లో పెంబర్తి బైపాస్ నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉండడంతో రోడ్డును ముంచేయడంతో వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. సీఐ దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, అజారుద్దీన్, ఆవుల శ్రీనివాస్‌రెడ్డి రోడ్డును సందర్శించారు. కాంట్రాక్టర్, ఎన్‌హెచ్ అధికారుల నిర్లక్ష్యంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. గానుగుపహాడ్ బ్రిడ్జి వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో రాత్రి 9 గంటల వరకు 40.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని బచ్చన్నపేటలో అత్యధికంగా 113.8 మిల్లీమీటర్లు, జనగామలో 94.0 మి.మీ., రఘునాథపల్లిలో 82.8, లింగాలఘణపురంలో 71.8, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 69.3, తరిగొప్పులలో 48, జఫర్గడ్లో 34, పాలకుర్తిలో 26, నర్మెటలో 9.5, దేవరుప్పులలో 9.3, కొడకండ్లలో 5.5 మి.మీ వర్షం కురిసింది. జిల్లాకేంద్రంలో ఒక్కసారిగా భారీ వర్షం -
టెట్.. టెన్షన్
జనగామ: ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ 'టెన్షన్' పట్టుకుంది. ఈనెల 1వ తేదీన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఉలిక్కి పడేలాచేసింది. ఐదేళ్లకు పైబడి సర్వీస్ ఉన్న ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కాని పక్షంలో ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందేనని తీర్పు స్పష్టం చేస్తోంది. ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన తర్వాత తమ జీవితాన్ని విద్యారంగానికి అంకితం చేసిన టీచర్లను తక్షణమే పరీక్ష రాయాలని, లేకుంటే ఉద్యోగం కోల్పోవాలనే నిర్ణయం అన్యాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.టెట్ చట్టబద్ధతపై 2010 నోటిఫికేషన్ నేపథ్యంటెట్ అర్హతపై 2010 ఆగస్టు 23న నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీఈటీ) కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. ఉపాధ్యాయ నియామకానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరిగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో జారీకి ముందు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2010కు ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు ఈ పరీక్ష నుంచి తప్పించబడ్డారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగానే గత పదిహేనేళ్లుగా పాలక ప్రభుత్వాలు ఉపాధ్యాయ నియామకాలు చేస్తున్నాయి.రెండేళ్ల గడువుతో టీచర్లలో ఆందోళనరెండేళ్లలోపు టీచర్లు టెట్‌లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశం ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది సీనియర్లు దశాబ్దాల తరబడి పాఠశాలల్లో బోధన చేస్తున్నారు. ఇప్పుడు వయసు, ఆరోగ్య సమ స్యలు, ఇంటి బాధ్యతలు వంటి కారణాలతో మళ్లీ పరీక్షకు సిద్ధమవ్వడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి లక్షలాది మంది ఉపాధ్యాయులు టెట్ పరీక్షకు హాజరుకావాల్సి వస్తే నిర్వహణకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయని విద్యావేత్తలు భావిస్తున్నారు.రివ్యూ పిటిషన్‌కు డిమాండ్టెట్ అర్హత.. వద్దే వద్దంటూ ఉపాధ్యాయ సంఘాలు, నిపుణులు ఒకే స్వరం వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతున్నారు. 2010 నోటిఫికేషన్ కంటే ముందు నియమితులైన టీచర్లకు మినహాయింపు కొనసాగించాలనే వాదన బలంగా వినపడుతోంది. విద్యారంగంలో అనుభవమే గొప్ప అర్హత అని, సీనియర్ టీచర్ల బోధన నైపుణ్యాలను కేవలం టెట్ పరీక్షతో కొలవలేమనే వాదన ఉంది. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.సీనియర్ టీచర్ల రక్షణ బాధ్యత ప్రభుత్వాలదేసీనియర్ టీచర్ల ప్రయోజనాలను కాపాడటం అత్యవసరం. వారు ఇప్పటివరకు నిస్వార్థంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. అలాంటి వారికి హఠాత్తుగా పరీక్ష బారిన పడేలా చేయడం సరైన నిర్ణయం కాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉపాధ్యాయుల తరఫున నిలబడాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా విద్యహక్కు చట్టం (ఆర్టీఈ) అమలు పరంగా ఉపాధ్యాయ నియామకానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి, గందరగోళం తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యా నాణ్యతను కాపాడేందుకు నిర్ణయాలు తీసుకోవాలే తప్ప, సీనియర్ ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేయడం తగదని ఉపాధ్యాయ వర్గంలో చర్చ కొనసాగుతోంది.జిల్లాలో 2,119 మంది టీచర్లుజిల్లాలో గెజిటెడ్, పీఎస్ హెచ్ఎంలతో పాటు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, పండిట్లు, ఇతర కేటగిరీల పరిధిలో 2,119 మంది టీచర్లు ఉన్నారు. ఇందులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వచ్చే రెండేళ్ల లోపు సుమారు 850 మంది టీచర్ల వరకు టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
జనగామ రూరల్: పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం మండలంలోని చౌడారం మోడల్ స్కూల్, కేజీవీబీని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో ఎప్పటికప్పుడు పిచ్చి మొక్కలను తొలగించాలని, శానిటేషన్ నిర్వహించాలన్నారు. 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే ఇప్పటి నుంచే ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధీర్‌రెడ్డి, అనిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో భూభారతి, సాదాబైనామా, జాతీయ కుటుంబ లబ్ధి పథకం, ప్రజావాణి దరఖాస్తులపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్నతో కలిసి తహసీల్దార్లలతో సమీక్షించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. భూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించడంలో తహసీల్దార్లు సందేహాలను నివృత్తి చేస్తూ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. యూరియా పంపిణీ సక్రమంగా జరిగే విధంగా విస్తృతంగా తనిఖీలు చేయాలని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు
జనగామ: జిల్లా కేంద్రంలోని స్కానింగ్ సెంటర్లలో అధికారుల బృందం గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. లింగనిర్ధారణ చేస్తున్నారా.. నియమ నిబంధనలు పాటిస్తున్నారా..తదితర విషయాలను తెలుసుకునేందుకు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాల డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్‌రావు, డీసీపీ రాజమహేంద్రనాయక్ నేతృత్వంలో వైద్య ఆరోగ్య, పోలీసు శాఖ సంయుక్తంగా మూడు బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని న్యూవిజయ స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్, జనని స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్, లక్ష్మి స్కానింగ్ సెంటర్, లోటస్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సత్య స్కానింగ్ సెంటర్, శ్రీ వెంకటేశ్వర స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ పీసీ, పీఎన్డీటీ యాక్టు ప్రకారం అనుమతులు, తదితర రికార్డులను చెక్ చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో అనుమతి పొందిన రేడియాలజిస్ట్ అందుబాటులో ఉన్నారా లేదా అనే దానిపై ఆరా తీశారు. లింగ నిర్ధారణకు సంబంధించి సైన్ బోర్డులు, స్కానింగ్ యంత్రాల వివరాలు, ధరల పట్టిక వివరాలకు స్కానింగ్ సెంటర్లకు వచ్చే వారికి కనిపించే విధంగా ప్రదర్శించారా లేదా అని చూశారు. స్కానింగ్ రేడియాలజిస్ట్, స్కానింగ్ యంత్రాలలో మార్పులు చేర్పులు చేసిన సమయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో తప్పకుండా నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ప్రతీ నెల 5వ తేదీ లోపు ఫారం ఎఫ్లను ఆన్లైన్లో నమోదు చేసి డీఎంహెచ్ఓ కార్యాలయంలో సమర్పించాలని చెప్పారు. స్కానింగ్ సెంటర్లలో జరుగుతున్న లోపాలను స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చి తగు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో 28 స్కానింగ్ సెంటర్ ఉండగా, మొదటి రోజు 7 చోట్ల తనిఖీలు చేపట్టామన్నారు. తనిఖీల్లో ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ కమల్‌హసన్, సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సైలు బి.రాజేశ్, చెన్నకేశవులు, నరసయ్య తదితరలు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదేశాలు.. మూడు టీములు ఏర్పాటు లోపాలు ఉన్న సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు -
భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక పత్రికా స్వేచ్ఛ, ప్రశ్నించే గొంతులను భౌతికదాడులతో పాటు పోలీసులను ఉపయోగిస్తూ తప్పుడు కేసులతో తీవ్ర అణచివేతకు గురిచేస్తుండడంపై పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు మండిపడుతన్నాయి. ప్రజా సమస్యలపై కథనాలు ప్రచురిస్తే సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ కేసులు నమోదు చేస్తుండడాన్ని ఖండించారు. వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్కాన్ఫరెన్స్ల వార్తలు రాసిన సందర్భంలోనూ సాక్షి దినపత్రికతో పాటు ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – హన్మకొండ -
మద్యం టెండర్లకు కసరత్తు
సాక్షిప్రతినిధి, వరంగల్: వైన్స్ (ఏ4)లకు 2025–27 సంవత్సరాలకు సంబంధించి టెండర్లు నిర్వహించేందుకు ఆబ్కారీ శాఖ సన్నద్ధమవుతోంది. వాస్తవానికి నవంబర్ నెలాఖరుతో గడువు ముగియనుండగా.. ఒక నెల ముందుగానే టెండర్లు నిర్వహించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వం 2023 ఆగస్టులోనే వైన్స్‌ల టెండర్లు నిర్వహించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎకై ్సజ్ పాలసీ అమల్లోకి వస్తున్నప్పటికీ అక్టోబర్‌లో టెండర్లు నిర్వహించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్లతో ఇటీవల హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. దీంతో అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడవచ్చని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచే కొత్త దుకాణాలు ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల సందర్భంగా 2023–25 ఎకై ్సజ్ పాలసీనే అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. ఈసారి కూడా ఆరు స్లాబుల విధానాన్నే అమలు చేయనున్నట్లు తెలిసింది. గతంలో 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు వసూలు చేశారు. 5 వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభాకు రూ.60 లక్షలు, లక్ష జనాభా నుంచి 5 లక్షల్లోపు ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల్లోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లు లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. ఈసారి కూడా అదే పాలసీ అమలు చేయనుండడంతో ఎప్పటిలాగే టెండర్లు వేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. కాగా, డిసెంబర్ ఒకటి నుంచి రాబోయే రెండేళ్లకు సంబంధించి కొత్త పాలసీ అమలుల్లోకి రానుండగా.. గతంలో మాదిరిగానే దుకాణాలకు సంబంధించి మూడు సామాజికవర్గాల (గౌడ, ఎస్సీ, ఎస్టీ) వ్యాపారులకు 30 శాతం వరకు రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈసారి మద్యం దుకాణాల టెండర్లు పోటాపోటీగా సాగనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ–జాతరతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగనున్నాయన్న చర్చ ఇప్పటికే సాగుతోంది. రిజర్వేషన్లు యథాతథం.. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు యథాతథంగా అమలు కానున్నట్లు, ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. టెండర్లు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈమేరకు మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించేలా జిల్లాల వారీగా మద్యనిషేధ, ఆబ్కారీ శాఖ చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరినట్లు సమాచారం. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో 2021–23 సంవత్సరాల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఈసారి కూడా ఉమ్మడి వరంగల్‌లో 294 మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు పాటించనున్నారు. ఈలెక్కన ఉమ్మడి వరంగల్‌లో 15 శాతం రిజర్వేషన్ల కింద గౌడ సామాజికవర్గానికి 39 నుంచి 44 దుకాణాలు రానున్నాయంటున్నారు. ఎస్సీలకు 27 లేదా 29, ఎస్టీలకు 13 నుంచి 15 దుకాణాలు కేటాయించనున్నారు. సుమారు 206 నుంచి 215 మద్యం దుకాణాలకు ఓపెన్ కేటగిరీ కింద కేటాయించే అవకాశం ఉండగా.. ఇందులోనూ అన్ని సామాజికవర్గాలు పాల్గొనే వీలుంటుంది. కాగా, ఈసారి కూడా 2011 జనాభా ప్రకారమే షాపులు కేటాయించనుండగా, స్లాబ్‌ల విధానం కూడా గత పాలసీ ప్రకారమే ఉండనుంది. ఉమ్మడి వరంగల్‌లో 294 దుకాణాలు దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంపు త్వరలో టెండర్ల తేదీల ప్రకటన డీసీ కార్యాలయాలకు అందిన మార్గదర్శకాలుజిల్లా పేరు వెన్స్‌లు హనుమకొండ 65 వరంగల్ 63 జనగామ 47 మహబూబాబాద్ 59 జేఎస్ భూపాలపల్లి ములుగు 60 మొత్తం 294 -
మోదీ నేతృత్వంలో అగ్రగామిగా భారత్
జనగామ రూరల్: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తూటుపల్లి రవికుమార్ అ న్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం జి ల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో సేవాపక్షం జిల్లా కార్యాశాల నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ..ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు పక్షం రోజులపాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవాపక్షం జిల్లా కన్వీనర్ శశిధర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తోకల ఉమారాణి అంజిరెడ్డి, నవీన్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత స్థానం గురువుదే
జనగామ రూరల్: జీవితంలో ఉన్నత స్థానం గురువుదేనని, విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో వారి కృషి వెలకట్టలేనిదని శాసన మండలి సభ్యుడు(ఎమ్మెల్సీ) పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరెట్లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్, డీఈఓ పింకేశ్ కుమార్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించే బాధ్యత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. అన్ని స్థాయిలో విద్యార్థులను ప్రోత్సహించి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలన్నారు. అదనపు కలెక్టర్, డీఈఓ పింకేశ్ కుమార్ మాట్లాడుతూ..న్యాస్‌లో కలెక్టర్ ప్రత్యేక దృష్టి వల్ల జిల్లా జాతీయస్థాయిలో టాప్ 50లో నిలిచిందన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం చేశారు. అలాగే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరామ్, ఏడీ సత్యనారాయణమూర్తి, ఆర్టీఏ సభ్యుడు అభిగౌడ్, గంటా రవీందర్, అధికారులు, ఉపాధ్యాయ యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. శాసన మండలి సభ్యుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం -
ఆ సొసైటీలకు షాక్!
జనగామ: అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ(పీఏసీఎస్)ల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం రెండోసారి పీఏసీఎస్‌ల పాలకమండళ్లకు గడువు పెంచగా, జిల్లాలో నాలుగింటికి బ్రేక్ వేసింది. ఇందులో మూడుచోట్ల అఫిషియల్ పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తుండగా, ఒక సొసైటీ బాధ్యతలకు సంబంధించి పెండింగ్‌లో ఉంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ పీఏసీఎస్ పాలక మండళ్ల పదవీ కాలం ముగియగా, ఆరు నెలల పాటు పాలక వర్గం గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతనెల ఆగస్టు 14వ తేదీన మొదటిసారి ఇచ్చిన గడువు ముగియడంతో పాలక మండళ్లకు మరో ఆరునెలల పాటు అవకాశం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగిసిన రెండు రోజుల్లో 10 పీఏసీఎస్‌లకు(ప్రస్తుతం ఉన్న పాలక మండళ్లు) అవకాశం ఇవ్వగా, నిధుల దుర్వినియోగం ఆరోపణలను ఎదుర్కొంటున్న నాలుగు సొసైటీల ఫైళ్లను పక్కనబెట్టింది. జిల్లాలో పీఏసీఎస్‌లు 14 పనిచేస్తుండగా, ఇటీవల తాత్కాలిక ఇన్చార్జ్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈక్రమంలో 10 పీఏసీఎస్‌ల పరిధిలో ప్రస్తుత చైర్మన్న్లకే పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించగా, జఫర్గడ్, నిడిగొండ, కళ్లెం, బచ్చన్నపేట సొసైటీలకు తాత్కాలిక బ్రేక్ వేసింది. ఇందుకు ప్రధాన కారణం ఆ నాలుగు సొసైటీల పరిధిలో కొన్నేళ్లుగా నిధుల దుర్వినియోగం, పంట రుణాల జారీలో అక్రమాలు, సొసైటీ స్థలాల ఆక్రమణలు, ఐకేపీ సెంటర్ల నుంచి వచ్చే కమీషన్ డబ్బులను మరో పనికి ఉపయోగించడం తదితర ఆరోపణలతో పెండింగ్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో సంబంధిత చైర్మన్న్లతో పాటు సీఈఓలకు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా, సమగ్ర విచారణ, పోలీసులు కేసులు కొనసాగుతున్నాయి. రఘునాథపల్లి మండలం నిడిగొండ, బచ్చన్నపేట, లింగాలఘనపురం మండలం కళ్లెం, జఫర్గడ్ పీఏసీఎస్ పరిధిలో అధికారుల విచారణలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. కళ్లెం, నిడిగొండ, కంచనపల్లి తదితర పీఏసీఎస్‌ల్లో బినామీ పేర్లతో పంట రుణాలు తీసుకున్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆడిటింగ్ జరుగకుండా చేసి, పెద్ద ఎ త్తున నిధులను గోల్మాల్ చేయగా, అప్పట్లో సాక్షి వరుస కథనాలు ప్రచురించగా, ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కళ్లెం సొసైటీలో 15 గుంటల భూమిని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయగా, ధాన్యం కొనుగోలు సెంటర్ల నుంచి వచ్చిన కమీషన్ డబ్బులను సైతం పక్కదారి పట్టించారు. జఫర్గడ్లో ఆడిట్, ఫర్టిలైజర్ అమ్మకాలకు సంబంధించి నగదు విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. బచ్చన్నపేట పీఏసీఎస్ సైతం నిధుల అక్రమాలు, కమీషన్ డబ్బులు, ఆడిట్ తదితర వాటికి సంబంధించి లెక్క తేలాల్సి ఉంది. నిడిగొండ సొసైటీలో జరిగిన అక్రమాలపై సైతం విచారణ జరుగుతోంది. నిడిగొండ, బచ్చన్నపేట, కళ్లెంలకు అఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జ్‌లు పెండింగ్‌లో జఫర్‌గఢ్ పీఏసీఎస్.. అవినీతి, అక్రమాలు, స్థలాల అమ్మకాలు, అవకతవకలే కారణం జిల్లాలోని మిగతా 10 పీఏసీఎస్‌లకు ప్రస్తుత చైర్మన్లే పర్సన్ ఇన్చార్జ్లుప్రభుత్వం నాలుగు పీఏసీఎస్‌ల గడువు పొడిగింపు విషయంలో క్లారిటీ ఇచ్చింది. నిడిగొండ, బచ్చన్నపేట, కళ్లెం సొసైటీల పరిధిలో అవకతవకలపై విచారణ కొనసాగుతుండగా, చైర్మన్లకు బదులుగా స్పెషల్ ఆఫీసర్లకు పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసినట్లు జిల్లా సహకార సొసైటీ అధికారి వెంకటరాములు తెలిపారు. జఫర్గడ్ సొసైటీ విషయంలో ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించకుండా విచారణకు ఆదేశించింది. మిగతా 10 పీఏసీఎస్‌లలో చైర్మన్న్లకే పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో వారి ఆధ్వర్యంలోనే సేవలు కొనసాగనున్నాయి. వివాదాస్పదంగా మారిన నాలుగు సొసైటీలకు సంబంధించిన భవి ష్యత్తు ప్రభుత్వ ఎంక్వయిరీ రిపోర్టుపై ఆధారపడి ఉండనుంది. మిగతా సొసైటీల పనితీరుపై కూడా నిఘా పెరగనుంది. జిల్లాలో 14 సొసైటీల పరిధిలో 10 చోట్ల ప్రస్తుత పాలక మండళ్లకు ఆరు నెలల పాటు గడువు పొడిగించారు. బచ్చన్నపేట, నిడిగొండ, జఫర్గడ్, కళ్లెం సొసైటీలకు బ్రేక్ వేయగా, ఇందులో జఫర్గడ్ మిన హా మిగతా మూడింటికి అఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జ్‌లకు బాధ్యతలు అప్పగించారు. అవినీతి, ఆరో పణలకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టం. సమగ్ర విచారణ జరిపించి నిజనిజాలు బయటకు తీసి, ప్రతి పైసాని వెనక్కి తీసుకుంటాం. -
పోరాటస్ఫూర్తి ఐలమ్మ
సాక్షి, నెట్వర్క్: తెలంగాణ సాయుధ పోరాట యో ధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి నివాళి అర్పించి ఆమె పోరాటాలను స్మరించుకున్నారు. కలెక్టరేట్లోని కాన్ఫ్రెన్స్ హాల్లో వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, అధికారులు, వివిధ కులసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివన్నారు. పాలకుర్తి మండల కేంద్రం రాజీవ్ చౌరస్తాలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి నివాళి అర్పించారు. భూస్వాములు, నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదా యకమన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, పురపాలిక కార్యాలయంలో వీరనారి ఐలమ్మ చిత్రపటానికి మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులుపాలకుర్తి టౌన్: నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఐలమ్మ మునిమనవరాళ్లు చిట్యాల శ్వేత, సంధ్యఐలమ్మకు నివాళులర్పిస్తున్న మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, డీసీపీ రాజమహేంద్రనాయక్ సాయుధ యోధురాలికి ‘జన’ నివాళి -
‘ఇందిరమ్మ’ పురోగతి ఆన్లైన్లో పొందుపర్చాలి
జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సంబంధిత అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మంజూరైనప్పటికీ నిర్మాణాలు ప్రారంభంకాని ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం కావాలన్నారు. పూర్తయిన ఇళ్ల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి లబ్ధిదారులకు నగదు అందేలా ఎంపీడీఓలు కృషి చేయాలన్నారు. మండలాల్లో ఇందిరమ్మ కమిటీ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. కొత్తగా మంజూరైన గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణాలు, టాయిలెట్ల నిర్మాణం ప్రారంభించాలని అన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీలో పనులు చేపట్టాలన్నారు. మహిళా సంఘాల రుణ మంజూరు లక్ష్యం చేరేలా ఏపీఎం, సీసీలు కృషి చేయాలని అన్నారు. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ రెండో జతను త్వరగా కుట్టి విద్యార్థులకు పంపిణీచేయాలన్నారు. ఇంటర్లో మెరుగైన ఫలితాలు సాధించాలి ఇంటర్ వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్ కళాశాల ప్రిన్సిపాళ్లతో మంగళవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు. ఫేస్ రికగ్నైజ్ సిస్టం ద్వారా హాజరు 100 శాతం పూర్తి కావాలన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి జితేందర్, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. దేవరుప్పుల : మండలంలోని పెద్దమడూరులో ఓనమాలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతోపాటు ఇందిరమ్మ, పల్లెప్రగతి పనులను కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటించారు. కోడిగుడ్ల నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచుతూ విలువలతో కూడిన విద్యనందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల సరఫరాపై ఆరా తీశారు. వార్షిక పరిక్షల సమయం సమీపిస్తున్నందున విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. మధ్యాహ్న భోజనం పథకం, నిర్వహణ రికార్డులు పరిశీలించి విద్యార్థుల నమోదు శాతం తగ్గకుండా ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో పలువురికి విద్యుత్ తీగల సమస్య దృష్టికి తీసుకురాగా సత్వరమే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఇసుక, కంకర, స్టీలు ధరల నియంత్రణకు సంబంధిత యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్దేశిత సమయంలో లబ్ధిదారులకు ఇల్లు పూర్తయ్యేలా మండల అధికారులు తోడ్పా టు అందించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆడెపు అండాలు, ఎంపీడీఓ సురేష్‌కుమార్, ఎంఈఓ కళావతి, ఆర్ఐ రాజు, పంచాయతీ కార్యదర్శి శివారెడ్డి తదితరులు ఉన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
జీపీఓల సేవలు షురూ..
● బాధ్యతల స్వీకరణ ● పాలనతో కీలకం కానున్న జీపీఓలు.. జనగామ: జిల్లాలో గ్రామ పరిపాలన అధికారుల(జీపీఓ) పాలన మంగళవారం నుంచి షురూ అయింది. వీఆర్ఏ, వీఆర్ఓలుగా పని చేసి అనుభవం కలిగి, ప్రస్తుతం వివిధ శాఖల్లో పని చేస్తున్న వారిలో 129 మంది జీపీఓలుగా అర్హత సాధించారు. జిల్లాలో 176 రెవెన్యూ గ్రామాల పరిధిలో 129 రెవెన్యూ క్లస్టర్లు ఉన్నాయి. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు జీపీఓలు వారికి కేటాయించిన మండలాలు, గ్రామాల పరిధిలో బాధ్యతలను స్వీకరించి ఎంపీడీఓలకు రిపోర్టు చేశారు. -
అర్హతకు మించి వైద్యం చేస్తే చర్యలు తప్పవు
● డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు స్టేషన్‌ఘన్‌పూర్: అర్హత లేకుండా నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వైద్యం చేస్తే తగిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జునరావు అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని పలువురు ఆర్ఎంపీలు నిర్వహించే క్లినిక్‌లు, మెడికల్‌షాపులు, ఆప్టికల్స్‌ను డిప్యూటీ డీహెచ్ఎంఓ సుధీర్‌తో కలిసి ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివునిపల్లిలో ఆర్ఎంపీలు నిర్వహించే క్లినిక్‌లు, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆప్టికల్స్, అర్హత లేని వైద్యుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న మెడికల్ షాపులు, క్లినిక్‌లను వారు తనిఖీలు చేపట్టారు. ఆయా క్లినిక్‌లలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వారు చేస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ మేరకు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సంపత్, సదానందం క్లినిక్‌లతోపాటు రెండు ఆప్టికల్ట్ షాపులను వారు సీజ్ చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ మీడియాతో మాట్లాడారు. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లిలో తనిఖీలు నిర్వహించారన్నారు. మెడికల్ కౌన్సిల్ నివేదిక మేరకు మేరకు తాము శివునిపల్లిలో తనిఖీలు చేపట్టామన్నారు. కనీసం ప్రాథమిక వైద్య చికిత్సలు చేసే అర్హత లేనివారు ఇక్కడ ఆర్ఎంపీ వైద్యులుగా చెలామణి అవుతున్నారని, అందుకే వారి క్లినిక్‌లను సీజ్ చేశామన్నారు. అదేవిధంగా ఆప్టికల్స్ షాపుల పేరిట అర్హత లేనివారు వైద్యం చేస్తుండగా రెండు ఆప్టికల్స్ షాపులను సీజ్ చేశామన్నారు. అదేవిధంగా డయాగ్నిస్టిక్ సెంటర్లు, మెడికల్ షాపుల వారికి నోటీసులు జారీ చేశామని, వారు అందించే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు. సీజ్ చేసిన వారు తిరిగి వైద్యం చేస్తే చట్టపరంగా కేసులు పెట్టి జైలుకు పంపడం ఖాయమని హెచ్చరించారు. ఆయన వెంట సీహెచ్ఓ మల్లికార్జున్, వైద్య సిబ్బంది ఉన్నారు. -
కాళోజీ సేవలు చిరస్మరణీయం
● కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: తెలంగాణ యాసలో సామాజిక రచనలు చేసి ప్రజలను చైతన్యపర్చిన ప్రజాకవి, సామాజిక ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో కాళోజీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, బెన్ష లోమ్తో కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లుర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ మాండలికంలో సామాజిక రచనలు చేస్తూ తెలంగాణ ప్రజలను సామాజికంగా మేల్కొల్పిన గొప్ప ప్రజాకవి కాళోజీ అని కొనియాడారు. కాళోజీ సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో గౌరవించిందని తెలిపారు. ఆయన పుట్టిన రోజును రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా కాళోజీ జయంతి నిర్వహిస్తోందని వివరించారు. భావితరాలకు ఆయన స్ఫూర్తి ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వానకొండయ్య జాతర అభివృద్ధికి కృషి
దేవరుప్పుల: వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి జాతర వైభవానికి సమష్టిగా కృషి చేద్దామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి సూచించారు. మండలంలోని కడవెండి రెవెన్యూ పరిధిలోని వానకొండయ్య గుట్టపై మౌలిక వసతుల కోసం ఇటీవల మంజూరైన రూ.కోటి వినియోగంపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంజూరైన నిధులతో ఆలయ ప్రాంగణం పునరుద్దరణ, కల్యాణ మండపం, అన్నదాన సత్రం, భక్తుల కోసం తాగునీరు, స్నానపు గదుల సదుపాయాలు, పార్కింగ్ స్థలాల వంటి వసతులను కల్పించాలన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల విషయంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించకుండా నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాలన్నారు. ప్రణాళిక మేరకు సత్వరమే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతామన్నారు. వచ్చే జాతర నాటికి వానకొండయ్య గుట్ట రూపురేఖలు మార్చి పుణ్యక్షేత్రంగా వర్దిల్లేలా అనుబంధ శాఖలు, ప్రజాప్రతినిధులం కలిసి పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. తొలుత గుట్టపై ఆలయంలో మూలవిరాట్‌కు ఎమ్మెల్యే మొక్కులు చెల్లించుకొని పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆడెపు ఆండాలు, ఎంపీడీఓ సురేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్, వివిధ శాఖల అధికారులు అరుణ, దివ్య, మానస, సింధుప్రియ, ఆలయ పూజారి బీట్కూరు సంపత్ కుమారచార్యులు తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
‘చేనేత’ ఆదాయం పెంచడమే లక్ష్యం
లింగాలఘణపురం: చేనేత కుటుంబాల ఆదాయం పెంచడమే లక్ష్యంగా చీరలపై నూతన డిజైన్ల కోసం రెండు నెలల శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, జెన్‌ప్యాక్ ఇండియా సీఎస్ఆర్ సహకారంతో జీ సఖి – ఇక్కత్ వీవర్స్ ప్రాజెక్టులో చేనేత మహిళ ప్రావీణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. జనగామ ప్రాంతంలో గతంలోని డిజైన్లు మినహా కొత్త రకాలపై అవగాహన లేదన్నారు. కొత్త డిజైన్లు, మగ్గానికి ముందు చేపట్టే పని భారాన్ని తగ్గించి ఆదాయం పెంచడమే ఈ శిక్షణ ఉద్దేశమన్నారు. శిక్షణను వినియోగించుకోవాలని హ్యాండ్లూమ్ ఏడీ చౌడేశ్వరి కోరారు. ఈ సందర్భంగా నూతన డిజైన్ల శిక్షణలో కావాల్సిన గ్రాఫ్ బుక్స్‌ను సంస్థల ప్రతినిధులు ఆవిష్కరించి చేనేత మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో జెన్‌ప్యాక్ ఇండియా ప్రతినిధి అపర్ణ పాథక్, సుమన్, విగ్నేష్, రాధాకృష్ణ, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సీనియర్ మేనేజర్ మేరుగు భరత్, శివపార్వతి, బ్రిగేడియర్ రిటైర్డ్ గణేశం, కొత్తపల్లి చేనేత సొసైటీ చైర్మన్ నాగభూషణం పాల్గొన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం -
వానాకాలంలో ఎండలు..!
● విచిత్రంగా మారుతున్న వాతావరణం ● ఆశ్చర్యానికి లోనవుతున్న జనం జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతుంటే జిల్లాలో ఎండలు మాత్రం మండుతున్నాయి. వానాకాలం మొదలైనప్పటి నుంచి ఓ వైపు అడపదడపా వర్షాలు, మరో వైపు ఊహించని విధంగా ఎండలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఉక్కపోత, వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 33 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలతో మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లడం కష్టంగా మారిందని ప్రజలు పేర్కొంటున్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో రైతాంగం ఆందోళనలో ఉంది. వానాకాలంలో ఎండలు ఏంటని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
కత్తెరసాగు @ జనగామ
యాసంగి సీజన్ ముగిసిన వెంటనే ప్రారంభంజనగామ: కత్తెర పంట సాగు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా కేవలం జనగామ జిల్లాలో మాత్రమే సాగు చేసే ఈ విధానంతో రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. సాధారణంగా వానాకాలంలోనే వరి సాగు ప్రారంభించి, యాసంగి వరకూ రెండు పంటలకే రైతులు పరిమితమవుతారు. కానీ జనగామ ప్రాంతంలో మెజార్టీ రైతులు మాత్రం తమ సొంత పద్ధతిలో ముందుగానే వరి విత్తనాలు వేసి, సెప్టెంబర్ మొదటి వారంలోనే కోతలు ప్రారంభిస్తారు. దీనిని స్థానికంగా ‘కత్తెర పంట’ గా పిలుస్తారు. జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో రైతులు వర్షాకాలం సమీపం వేసవి కాలం చివరలో మూడో పంటగా వరి కత్తెర సాగును ప్రారంభిస్తారు. జూన్ నెలాఖరులో నేలలో తేమ, తక్కువ వర్షపాతంలాంటి పరిస్థితులను వినియోగించుకుని దుక్కులు దున్ని నార్లు పోసి, నాట్లు వేయడం వల్ల ఆగస్టు చివరి నాటికి పంట చివరి దశకు వచ్చి, సెప్టెంబర్ మొదటి వారంలో కోతలు పూర్తవుతాయి. వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 2.10 లక్షల వరకు వరి సాగు చేయగా, ఇందులో కత్తెర సాగు 40 వేల ఎకరాలకుపైగా నమోదవుతుంది. కత్తెర పంట సాగు ఒక విశిష్టతగా ఇక్కడి రైతులు భావిస్తారు. ఈ సాగు విధానం కొత్తగా ఆవిర్భవించిన పద్ధతి కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ అని ఇక్కడి రైతులు చెబుతున్నారు. పూర్వం నుంచి రైతులు ఈ పద్ధతిని అనుసరించడంతో ఇప్పుడు అది ఒక ప్రత్యేక సంప్రదాయంగా మారిపోయింది. వానాకాలం పంటల కంటే ముందే కత్తెర పంట రావడం వల్ల పలువురు రైతులు మూడో పంటలు పండించే అవకాశం పొందుతున్నారు. రెండు పంటల మధ్య కత్తెర పంట యాసంగి, వానాకాలం మధ్య ఈ కత్తెర పంట రైతులకు అదనపు ఆదాయంగా దోహదపడుతుంది. వా నాకాలంలో సహచర రైతులు నాట్లు వేస్తున్న సమయంలో కత్తెర రైతులు కోతలు పూర్తి చేసి ధాన్యం అమ్మకానికి తీసుకెళ్లడం గమనార్హం. ఈ సమయంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్‌గా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అంతే కాకుండా వర్షాకాలం పంట కోత పూర్తయ్యేలోపు కొత్త విత్తనాల కోసం మళ్లీ నేల సిద్ధం చేసుకునే సమయం కూడా రైతులకు దొరుకుతుంది. ఇది రైతులకు ఒకవైపు సంప్రదాయం, మరోవైపు ఆర్థిక భరోసాగా చెప్పవచ్చు.కత్తెర పంట సాగు కోతలు, అమ్మకం సమయంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండవు. కత్తెర పంట ధాన్యాన్ని జనగామ వ్యవసాయ మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తుంటారు. జనగామ వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 8వ తేదీ నుంచి కత్తెర పంట ధాన్యం వస్తుంది. ధాన్యంలో తేమ 30 నుంచి 42 వరకు ఉండడంతో క్వింటాకు రూ.1,750 నుంచి రూ.1,850 వరకు మాత్రమే పలుకుతుంది. 2025–26 నుంచి కేంద్రం వరి పంటకు మద్దతు ధర ఏ గ్రేడ్ రూ.2,389, సాధారణం రూ.2,369కి పెంచింది. ఈ లెక్కన రైతులు ప్రైవేట్‌లో అమ్ముకోవడంతో నష్టపోవాల్సి వస్తుంది. మూడో పంటగా అదనపు దిగుబడి దశాబ్దాలుగా ఆనవాయితీ -
వంద శాతం పన్నులు వసూలు చేయాలి
నర్మెట: మౌలిక వసతుల కల్పనలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని, పంచాయతీలు వంద శాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా పంచా యతీ అధికారి నాగపురి స్వరూపరాణి అన్నా రు. మచ్చుపహాడ్ గ్రామ పంచాయతీని మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఆమె రికార్డులను పరిశీలించడంతోపాటు గ్రీవెన్స్‌కు అందిన దరఖాస్తుపై క్షేత్రస్థాయి పరిశీంచి సమస్య పరిష్కరించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యే క దృష్టి సారించడంతోపాటు తాగునీటి ట్యాంకులను సకాలంలో క్లోరినేషన్ చేయాలని చెప్పారు. సిబ్బంది రోజువారీ పనుల రికార్లును పారదర్శకంగా నిర్వహించాలని ఈసందర్భంగా ఆమె సూచించారు. ఆమె వెంట కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి దామెర వంశి, కారోబార్ లింగాల రమేష్, సిబ్బంది ఉన్నారు.నేడు కలెక్టరేట్లో చాకలి ఐలమ్మ వర్ధంతి జనగామ రూరల్: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేడు (బుధవారం) ఉదయం 10:30 గంటలకు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, రజక కులస్తులు ఇతర కులసంఘ నాయకులు, జిల్లా అధికారులు, సిబ్బంది హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. చెట్ల తొలగింపునకు వేలం జనగామ రూరల్: పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చెట్ల తొలగింపునకు ఆసక్తిగల అభ్యర్థులు బహిరంగ వేలంలో పాల్గొనాలని జిల్లా అటవీ క్షేత్ర అధికారి కొండల్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల పాఠశాలలో 132 చెట్లు ఉన్నాయని వాటిని తొలగించేందుకు ఈనెల 12వ తేదీన ఉదయం 11:30 గంటలకు గురుకుల పాఠశాల ప్రాంగణంలో నిర్వహించే బహిరంగ వేలంలో పాల్గొనాలని తెలిపారు. వేలంలో పాల్గొనేవారు ముందుగా రూ.10వేలు ఈఎండీ జమ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి జనగామ రూరల్: పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గుంటుపల్లి కార్తీక్ డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనగామ పట్టణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ.. స్కాలర్షిప్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైతరగతులకు వెళ్లాలంటే విద్యార్థులకు కళాశాల యజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వడంలేదని తెలిపారు. విద్యారంగంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి సాయి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేందర్, వంశీ, సాయి చరణ్, రాహుల్ దుర్గ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్ పెంచాల్సిందే!
జనగామ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు, చేయూత పింఛన్‌దారులకు పింఛన్ పెంచాలని, లేకుంటే ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఎమార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ సునీల్ మాదిగ డిమాండ్ చేశారు. వీహెచ్పీఎస్, ఏఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం దివ్యాంగులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా బోడ సునీల్, వీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కుమార్ మాట్లాడుతూ..దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, బీడీ, గీత కార్మికులకు అందించే పింఛన్ మొత్తాన్ని హామీ మేరకు పెంచాలన్నారు. ధర్నాలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిర్రు నాగేశ్, జిల్లా అధ్యక్షుడు గడ్డం సోమరాజు, జి.కిషోర్, సందీప్, వెంకటేశ్వర్లు, స్వామి, చక్రపాణి, కవిత తదితరులు పాల్గొన్నారు.‘పాలకుర్తి’ రోడ్ల అభివృద్ధికి రూ.21 కోట్లుపాలకుర్తి టౌన్: పాలకుర్తి నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి రూ.21కోట్ల నిధులను మంజూరు చేయనున్నట్లు మైనారిటీల సంక్షేమ, షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో క్యాంపు కార్యాలయంలో మంత్రి లక్ష్మణ్‌ను కలిసి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి వినతిపత్రం అందించారు. నియోజకవర్గంలో తండాలు, గూడాలలో రహదారులు దయనీయ పరిస్థితిలో ఉన్నాయని, నిధులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి రూ.21కోట్ల నిదులు వెంటనే మంజూరు చేస్తానని చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ ప్రజల తరపున మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.మల్లన్న పుణ్యక్షేత్రాన్ని మాస్టర్‌ప్లాన్‌లో చేర్చండిజనగామ: తెలంగాణ సంస్కృతి, సంప్రదా యాలకు ప్రతీకగా భక్తుల పూజలందుకుంటు న్న ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయం మాస్టర్ ప్లాన్‌లో చేర్చకపోవడం ఏంటని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి సంవత్సరం మల్లన్న ఖజానా నుంచి సర్కారు సీజీఎం రూపంలో రూ.6 కోట్లు పన్ను వసూలు చేస్తున్నప్పటికీ, కొమురవెల్లి ఆలయ మాస్టర్ ప్లాన్న్లో చోటు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆలయాన్ని తక్షణమే మాస్టర్ప్లాన్నలో చేర్చాలని డిమాండ్ చేశారు.సీపీగెట్‌లో గురుకుల డిగ్రీ విద్యార్థినుల ప్రతిభస్టేషన్ఘన్పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ ఎంజేపీటీడబ్ల్యూఆర్డీసీ(మహాత్మాజ్యోతిరాపు ఫూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్) బీకామ్ విద్యార్థినులు రాష్ట్రస్థాయి సీపీగెట్–2025 ఎంకామ్ ప్రవేశపరీక్షలో విశేష ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, డీఎల్ ఇన్ కామర్స్ బి.స్నేహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంకామ్ ప్రవేశపరీక్షలో ఎ.తిరుమల రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించగా, జె.నందిని మూడో ర్యాంకుతో సత్తా చాటారని పేర్కొన్నారు. తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటడంపై ప్రిన్సిపాల్, అధ్యాపక వర్గం, సిబ్బంది, సహ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.అర్హత సాధించని సర్వేయర్లకు మరోసారి పరీక్షజనగామ: భూసర్వేయర్గా ఇటీవల శిక్షణ తీసుకుని అర్హత సాధించని అభ్యర్థులకు మరోసారి అవకాశం కల్పించినట్లు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకుడు మన్యంకొండ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శిక్షణ పొందిన సర్వేయర్లకు మరొకసారి అవకాశం కల్పించేందుకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వేయర్ పరీక్షలో పాల్గొనే అభ్యర్థులు సప్లిమెంటరీ పరీక్ష కోసం మీ సేవలో రూ.500లు చలానా తీసి, 10వ తేదీలోగా అందించాలన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
వినతుల వెల్లువ
జనగామ రూరల్: పలు సమస్యల పరిష్కారానికి అర్జీలతో ప్రజలు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి తరలివచ్చారు. ప్రజల నుంచి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్షాలోమ్, అధికారులు 55 దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజలు అందించిన దరఖాస్తులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవోలు గోపిరామ్, వెంకన్న, డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులు ఇలా.. లింగాలఘన్పూర్ మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన చర్లపల్లి స్వప్న తన భర్త రమేశ్‌తో 7 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, అదనపు వరకట్నం కావాలని వేధిస్తూ తనను, పిల్లలను తీసుకెళ్లడం లేదని దరఖాస్తు అందించారు. తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన ఎర్రవెల్లి మరియ గతంలో తనకు బోదకాలు పింఛన్ మంజూరు అయ్యిందని, ఇటీవల నిలిపివేశారని తనకు పింఛన్ వచ్చేలా చూడాలని దరఖాస్తు అందించారు. చిల్పూర్ మండలం ఫత్తేపూర్ గ్రామానికి చెందిన జాటోత్ వెంకట్ తన దరఖాస్తు అందిస్తూ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, ఇంటిపై నుంచి కరెంటు వైర్లు వెళ్తుండడంతో ఇల్లు కట్టుకోలేకపోతున్నామని, వెంటనే వైర్లు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనగామ మండలం సిద్ధంకి గ్రామానికి చెందిన పెద్దపాటి సామ్యూల్ తన దరఖాస్తు అందిస్తూ పి.లక్ష్మమ్మ వద్ద 24/అ/4 సర్వే నెంబర్ ధరణి వచ్చిన దగ్గర నుంచి కనిపించడం లేదని సర్వే చేయించి ఆన్లైన్లో ఆ సర్వే నెంబర్ నమోదు చేయాలని కోరారు. క్వారీ పర్మిషన్ రద్దు చేయండి రఘునాథపల్లి మండలం కోమాల్ల గ్రామంలో క్వారీ పర్మిషన్ రద్దు చేయాలని గ్రామస్తులు దరఖాస్తు అందించారు. క్వారీ వల్ల ప్రకృతికి విఘాతం కలగడంతో పాటు పంట పొలాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. ఆవులు, గొర్రెలు, మేకలు పశు గ్రాసం కోసం ఇంకా గ్రామంలోని అనేక వసతుల విషయంలో మూడు గ్రామాల ప్రజలు ఈ గుట్టపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ప్రజావాణికి తరలివచ్చిన ప్రజలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని అర్జీలు 55 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు -
ఊళ్లోనే యూరియా !
రైతుల కష్టాలు తీర్చేందుకు కలెక్టర్ ఆదేశాలుజనగామ: రైతులకు యూరియా కష్టాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వ్యవసాయ పనులు వదులుకుని ఎరువుల దుకాణాలు, ఆగ్రోస్, పీఏసీఎస్, హాకా, ఓడీసీఎంఎస్ సెంటర్ల వద్ద బారులుదీరుతున్నారు. తెల్లవారి లేచింది మొదలుకుని మండల, జిల్లా కేంద్రాలకు వస్తూ ఒక్క బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రైతులకు రవాణా సులభతరం చేస్తూ రైతువేదికలు, పీఏసీఎస్ సెంటర్లలో అదనపు యూరియా సెంటర్లను ప్రారంభించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి యూరియా విక్రయించే వారికి ఈ–పాస్ యంత్రాలను కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. రైతు ముంగిట్లో.. రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు యూరియా కోసం పట్టణాలు, జిల్లా కేంద్రానికి వచ్చి అవస్థలు పడకుండా పీఏసీఎస్, రైతువేదికల్లో తాత్కాలిక యూరియా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల రైతులకు సమయం, డబ్బు ఆదా అవ్వడంతో పాటు రవాణా భారం కూడా తగ్గనుంది. ఇప్పటివరకు యూరియా పంపిణీ ప్రధానంగా పట్టణాలు, జిల్లా కేంద్రాలకే పరిమితమైంది. దీంతో రైతులు పొలాల్లో పనిచేసుకోవాల్సిన సమయంలో ఎరువుల కోసం దూరప్రాంతాలకు రావాల్సి వచ్చేది. రైతుల కష్టాన్ని గమనించిన కలెక్టర్, స్థానికంగా యూరియా అదనపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. యూరియా పంపిణీ బాధ్యత వహించే సిబ్బందికి ఈ–పాస్ యంత్రాల ఉపయోగంపై శిక్షణ ఇచ్చారు. రైతులకు సక్రమంగా ఎరువులు చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. రైతులు తమ గ్రామాలకు కేటాయించిన రైతువేదికలు, పీఏసీఎస్ అదనపు విక్రయ కేంద్రాల్లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆధార్–పంట నమోదు పత్రాలు తప్పనిసరి యూరియా బస్తాల కోసం వచ్చే రైతులు ఆధార్ కార్డుతో పాటు పంట నమోదు పత్రాలు వెంట తెచ్చుకోవాలి. దీంతో అర్హులైన వారికి మాత్రమే ఎరువులు చేరతాయి. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, మోసపూరిత లా వాదేవీలకు అవకాశం ఇవ్వబోమని కలెక్టర్ హెచ్చరించారు. ఎవరు అక్రమ నిల్వలు చేసుకున్నా లేదా అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవన్నారు. రైతులు అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయకుండా వ్యవసాయ శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. అధికంగా యూరియా వినియోగిస్తే పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని, శాసీ్త్రయ పద్ధతుల్లో యూరియాను వాడుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. 5,520 టన్నుల కేటాయింపు జిల్లాలో ఈనెలలో 5,520 టన్నుల యూరియా అవసరమున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం 1,620 టన్నుల యూరియా విక్రయాలు జరుగగా, నేటికల్లా 230 టన్నుల యూరియా జిల్లాకు రానుంది. ఈ నెల10వ తేదీన 230 టన్నులు, మరో మూడు రోజుల వ్యవవధిలో మరో 730 టన్నుల యూరియా వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు చేరుకోనుంది. అదనంగా ఏర్పాటు చేసిన ఒక్కో సెంటర్లో 5వందల టన్నుల యూరియా స్టాక్ పంపించే అవకాశం ఉంది. జిల్లాలో హాకా, ఓడీసీఎంఎస్, బిజినెస్ సొసైటీలు, ఆగ్రోస్, ఎఫ్పీవోతో పాటు ప్రైవేటు దుకాణాలు కలుపుకుని 246 ఉన్నాయి. పీఏసీఎస్, రైతు వేదికల్లో యూరియా కేంద్రాలు జిల్లాలో 13 కేంద్రాల గుర్తింపు పంపిణీదారులకు ఈ–పాస్ యంత్రాల పంపిణీఅక్రమాలకు తావులేదు.. జిల్లాలో 13 అదనపు యూరియా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశాం. యూరియా పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పర్యవేక్షణ చేస్తున్నాం. విక్రయ కేంద్రాలకు అవసరమైన ఈ–పాస్ యంత్రాలను అందించాం. ఇక నుంచి రైతులకు ఎలాంటి నిరీక్షణ ఉండదు. యూరియా పంపిణీ వ్యవసాయ విస్తరణ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ వంటి ఘటనలు చోటుచేసుకుంటే, కఠిన చర్యలు ఉంటాయి. – షేక్ రిజ్వాన్ బాషా, కలెక్టర్ -
కాళోజీ.. మెచ్చుకోవడం మరిచిపోలేని జ్ఞాపకం
‘ప్రజాకవి కాళోజీ నారాయణరావుతో పరిచయం ఉంది. మొదటి సారి 1990 హనుమకొండలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో కాళోజీ నారాయణరావు ఇంట్లో మిత్రమండలి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వెళ్లిన నేను మొదటిసారి ఆయనను ప్రత్యక్షంగా చూశా. అప్పటికే ప్రజాకవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా గొప్ప పేరుంది. ఆయన ముందు ధైర్యం చేసి నేను రాసిన ఒక కవితను చదివాను. దానికి కాళోజీ నన్ను అభినందించడం ఇప్పటికీ గుర్తుంది.’ అని అన్నారు తెలుగు కవయిత్రి, కార్టూనిస్టు నెల్లుట్ల రమాదేవి. ఆమెను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళోజీ సాహితీ పురస్కారం–2025కు ఎంపిక చేసిన నేపథ్యంలో నేడు (మంగళవారం) కాళోజీ జయంతి సందర్భంగా సోమవారం ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉద్యోగం చేస్తూనే ఆమె చేసిన రచనలు, రాసిన కథలు.. గీసిన కార్టూన్లు, కాళోజీతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. వివరాలు ఆమె మాటల్లోనే..– సాక్షిప్రతినిధి, వరంగల్/స్టేషన్ఘన్పూర్నెల్లుట్ల రమాదేవి...1980లో తొమ్మిదో తరగతిలో స్నేహ అనే నాటిక రాశాను. అనంతరం మొదటగా బుజ్జాయి అనే పిల్లల పత్రికలో నేను రాసిన కథను ప్రచురించారు. ఈ తరం అమ్మాయి అనే కథను ఒక మహిళా మ్యాగ్జిన్‌కు వాడుకున్నారు. నా చిన్నప్పటినుంచే మా అమ్మ శకుంతలాదేవి కథల పుస్తకాలు బాగా చదివేది. మాకు కథలు చెప్పేది. అలా కథల పుస్తకాలు చదువుతూ నేను కూడా కథలు రాయాలనుకున్నా. నన్ను మొదట ప్రోత్సహించింది మా అమ్మనే. అదేవిధంగా 1983లో వివాహం జరిగింది. భర్త దేవేందర్ జిల్లా కోఆపరేటిట్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసేవారు. ఆయన నన్ను బాగా ప్రోత్సహించేవారు. కథలు, రచనలకు, కార్టూన్లకు తన అభిప్రాయాలు, సూచనలు చేసేవారు. అయితే 2009లో ఆయన హఠాన్మరణం చెందడం బాధాకరం.ఆయన ధిక్కార స్వరం.. సమాజానికి దిక్సూచి..ఒక మనిషి, కవి, రచయిత ఎలా ఉండాలని సమాజానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా స్వయంగా పాటించిన గొప్పవ్యక్తి కాళోజీ. ఆయన రాసిన పలుకుబడుల భాష–బడిపలుకుల భాషతోపాటు పలు రచనలు చదివాను. ధిక్కార స్వరం అయిన కాళోజీ తెలంగాణకే కాదు మొత్తం సమాజానికి దిక్సూచి. ఆయన ఏదైనా పద్యం చెపితే వాస్తవికంగా, సరళంగా ఉండేది. రచనలు, మాటలు సూటిగా, చురుకుమనిపించేలా ఉంటాయి. ఆయన పోయట్రీ తెలంగాణకు దిశానిర్దేశం. తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటున్నామంటే ఆరోజుల్లోనే తెలంగాణ గురించి మాట్లాడి, కొట్లాడిన వ్యక్తి కాళోజీ ఒకధీరోదత్తుడు.సీరియస్, హాస్యం.. రెండు ఉంటాయి..కాళోజీ మంచి జోకులు వేసేవారు. ఒక సమావేశంలో ఆయనను కలిసినప్పుడు బ్యాంకు క్యాషియర్నైన నన్ను కేవలం పైసలు లెక్కపెడ్తున్నావా? రచనలు చేస్తున్నావా? అంటూ హాస్యంగా మాట్లాడారు. రచయితలు రచనలు చేయాలని, సమాజానికి దిశానిర్దేశం చేసేలా, ప్రజలను చైతన్యం చేసేలా రచనలు ఉండాలని చెప్పేవారు.కాళోజీ పురస్కారం... మొదటి మహిళగా సంతోషంగా ఉంది..గత పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న కాళోజీ సాహితీ పురస్కారానికి మొదటి మహిళగా ఈ ఏడాది నేను ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. 2015లో అమ్మంగి వేణుగోపాల్ ఈ అవార్డుకు ఎంపిక కాగా, అనంతరం గోరటి వెంకన్న తదితర ప్రముఖులు అందుకున్నారు. గత ఏడాది నలిమెల భాస్కర్‌కు ఈ అవార్డు అందించారు. 11వ వ్యక్తిగా మొదటి మహిళగా, కాళోజీ పుట్టిన ఓరుగల్లు బిడ్డగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది.కాళోజీని చాలాసార్లు కలిసి మాట్లాడాను..నాతో కలిసి హనుమకొండలో బ్యాంకులో పనిచేసే రవికుమార్ కాళోజీ కుమారుడని తర్వాత తెలిసింది. రవికుమార్ పద్యాలు రాసేవారు. ఇద్దరం కవితలు, పద్యాలు ఒకరికొకరం చెప్పుకునేవాళ్లం. అతడితో కలిసి కాళోజీ ఇంటికి వెళ్లి ఆ మహానుభావుడితో చాలాసార్లు మాట్లాడాను. కాళోజీకి నేను రాసిన కథలు, రచనలు చూపించి సంతోషపడ్డాను. అనంతరం రెండు, మూడు సమావేశాల్లో కలుసుకున్నాం. కాళోజీ రచనలు చాలా చదివాను. ఆయన రచనలు సరళంగా, వ్యంగ్యంగా ఉంటాయి. సమాజాన్ని సూటిగా ప్రశ్నించే ఆయన రచనలు అంటే చాలా ఇష్టం.బహుముఖ ప్రజ్ఞాశాలి.. రమాదేవినెల్లుట్ల రమాదేవి... తెలుగు కవయిత్రి, కథకురాలు, ఉపన్యాసకురాలు, కార్టూనిస్టు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ రైతు కుటుంబానికి చెందిన రాంచందర్‌రావు, శకుంతలా దేవి దంపతులకు జన్మించారు. 1983లో దేవేందర్‌ను వివాహమాడిన ఆమె 1984లో గ్రామీణ బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆంధ్రాబ్యాంకు సీనియర్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. కవి, రచయిత్రి, కార్టూనిస్టుగా రాణించిన రమాదేవి మొదటి కార్టూన్ 1978లో స్వాతిలో అచ్చయ్యింది. ఆ తర్వాత అనేక కథలు, కథానికలు ఆమెకు మంచి గుర్తింపు తేగా.. 2013 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తిపురస్కారం అందుకున్నారు. కథలు, కవిత్వమే కాకుండా కార్టూన్లు వేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా రమణీయమైన కావ్యాలతో అందరినీ ఆకట్టుకున్న రమాదేవి కాళోజీ సాహితి పురస్కారం –2025కు ఎంపికయ్యారు. -
గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని గుంతలో పడ్డారు..
జనగామ: గూగుల్ మ్యాప్ వలస కూలీల ప్రాణాల మీదకు తెచ్చింది. మ్యాప్‌నే నమ్ముకుని డ్రైవింగ్ చేసిన డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలు తీసినంత పనిచేశాడు. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రంలోని సిద్దిపేట ప్రధాన రహదారి శామీర్‌పేట బైపాస్ వద్ద ఆదివారం తెల్లవారు జామున జరిగింది. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా కైలూరు మండలానికి చెందిన డ్రైవర్‌తో సహా 19 మంది మత్స్య కార్మికులు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు బొలెరో వాహనంలో బయలుదేరారు. సంగారెడ్డి ప్రాంతంలో చెరువుల్లో చేపలు పట్టి, వాహనంలో లోడ్ చేసేందుకు రోజుకు రూ.1,000 వేతనం ఒప్పందంతో ఇక్కడకు వస్తు న్నారు. కైలూరు నుంచి బయలుదేరే సమయంలో డ్రైవర్ గూగుల్ మ్యాప్‌ను మాత్రమే నమ్ముకున్నాడు. జనగామ మండలం శామీర్‌పేట బైపాస్ వద్ద మలుపు తిరిగే సమయంలో రెండువైపులా గుంతల రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం, గూగుల్ మ్యాప్ స్ట్రైట్ రూట్ చూపించడంతో డ్రైవర్ నేరుగా వచ్చే శాడు. దగ్గరకు వచ్చేసరికి మలుపు, పక్కనే గుంత కనిపించడంతో వేగంగా ఉన్న వాహనాన్ని అదుపు చేసే క్రమంలో బొలెరో వాహనం అందులో పల్టీ కొట్టింది. గాఢనిద్రలో ఉన్న కూలీలు బాలి మాణిక్యం, సైదు వెంకటనారాయణ, గంటసాల రాధాకృష్ణ, బాలె హరినాథ్, గంటసాల వెంకన్న, ఇమ్మాన్యు యేల్, బాలె రవికుమార్, గంటసాల రేణుక, గంటసాల సాయి, ముంగర సత్యనారా యణ, కె.ఏసోబు, సైదు హరిశ్చంద్ర, నడుగారి ఆదేశ్, నబిగర్ నాగరాజు, సైదు వెంకటనారాయణ, ఏదూరి నల్లయ్య, బాలె మాణిక్యం, బాలె రవికుమార్, బాలె మణికంఠకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే స్థానికులు స్పందించి అంబులెన్స్‌కు సమాచారం అందించగా, క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఇందులో హరిశ్చంద్ర, సత్యనారాయణ తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకోవడంతో ప్రాథమిక చికిత్స అందించి 108లో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిగతా కూలీలకు ఇక్కడే వైద్య పరీక్షలు అందిస్తున్నారు. -
‘డబుల్’.. ఎన్నాళ్లీ ట్రబుల్!
సాక్షిప్రతినిధి, వరంగల్:● హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో 790 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 520 ఇళ్లు నిర్మించారు. మర్రిపల్లిగూడెం, గూడూరులో 50 చొప్పున 100 ఇళ్లు, కమలాపూర్‌లో 320 నిర్మించారు. అయితే రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్, వాటర్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కొద్ది రోజులు కాలయాపన జరిగింది. ఇప్పటికీ లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేయకపోవడంతో ఇళ్లు నిరుపయోగంగానే ఉన్నాయి. ● మహబూబాబాద్ జిల్లాలో 5,567 ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. 2024 వరకు 2,503 మాత్రమే పూర్తయ్యాయి. అందులో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 1,256 మందికి పంపిణీ చేశారు. ఇంకా 3,064 ఇళ్లు వివిధ స్థాయిల్లో ఉండగా.. పూర్తయిన 2,503 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇంకా 1,247 లబ్ధిదారులకు అందజేయడంలో కాలయాపన జరుగుతోంది. .. రెండు పడక గదుల ఇళ్ల పంపిణీకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోక్షం కలగడం లేదు. నిర్మాణాలు పూర్తయినా ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఫలితంగా మూడేళ్ల కిందట పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీకి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన నిర్మాణాల్లో గడ్డి, ముళ్లపొదలు ఏర్పడ్డాయి. పంపిణీ చేసిన వాటిలో సరైన మౌలిక సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకాశం రాక అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటిౖకైనా అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, పూర్తయిన వాటిని పంపిణీ చేయాలన్న డిమాండ్ వస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకాశం రాని వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటికలను సాకారం చేసే లక్ష్యంతో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని అమలు చేసింది. ఉమ్మడి వరంగల్‌లో ఈ పథకం కింద రెండు విడతల్లో 26,284 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో అధికారులు చెబుతున్న ప్రకారం సుమారు రూ.860 కోట్ల వరకు ఖర్చు చేసి 10,939 (41.62 శాతం) ఇండ్లు పూర్తి చేశారు. అందులో నుంచి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 4,874 (44.56 శాతం) రెండు పడకల గదుల ఇళ్లను పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా మంజూరైన మొత్తం 26,284లలో 4100 వరకు వివిధ కారణాలతో నిర్మాణాలు మొదలు పెట్టలేదు. నిర్మాణాలు ప్రారంభించిన 22,184 ఇళ్లలో 10,939 పూర్తయ్యాయి. 11,245 ఇళ్లు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పలు చోట్ల కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. పూర్తయిన 10,939 ఇళ్లలో 4,874 ఇళ్లు మాత్రమే పంపిణీ చేశారు. 6,065 ఇళ్ల మంజూరులో జాప్యం జరుగుతుండడంతో ఉండడానికి గూడులేక వేలాది మంది నిరుపేదలు ఏళ్లపాటు గుడిసెల్లో జీవిస్తూ పక్కా ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.జిల్లా మంజూరు పూర్తి పంపిణీ హనుమకొండ 4,326 2,143 1,200 వరంగల్ 6,350 2,350 1,250 జేఎస్ భూపాలపల్లి 3,882 1,615 710 జనగామ 4,400 1,600 750 ములుగు 1,800 950 300 మంజూరైన ఇళ్లలో పూర్తయినవి 41.62 శాతమే పూర్తయిన ఇళ్లలో పంపిణీ చేసింది 44.56 శాతం చాలాచోట్ల శిథిలావస్థకు గృహాలు వివిధ స్థాయిల్లో నిలిచినవి 11,245.. ఆ నిర్మాణాలపై నీలినీడలు నెరవేరని పేదోళ్ల సొంతింటి కల.. ‘ఇందిరమ్మ’పై అర్హుల ఆశలు -
ఉపాధ్యాయుల పాత్ర గొప్పది
జనగామ: ప్రతి మనిషి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పదని వరంగల్ రీజియన్ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ పెద్ది వెంకటేశం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జూబ్లీ గార్డెన్లో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ ఆధ్యక్షతన జరిగిన గురుపూజోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.. విద్యాబుద్ధులు నేర్పిన టీచర్లను ఎప్పటికీ మరువద్దన్నారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. 15 సంవత్సరాలుగా ఎవరూ చేయలేని విధంగా 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి, గురుపూజోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందించామన్నారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పజ్జూరి గోపయ్య, రైస్ మిల్లర్ ప్రతినిధి పజ్జూరి జయహరి, రత్నప్రసాద్, బెజగం భిక్షపతి, వరూధిని, గంగిశెట్టి అనూజ, తమ్మి స్రవంతి, గజ్జి సంతోష్ కుమార్, నాగమల్ల సోమయ్య, పడకంటి రవీందర్, వేదకుమారు, గందె సోమన్న మాశెట్టి వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.వరంగల్ రీజియన్ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశం -
దిక్సూచి
విద్యలో నూతన ఒరవడికి కలెక్టర్ ప్రత్యేక చొరవ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రాష్ట్రంలో విద్యాపరంగా జనగామ ముందువరుసలో ఉంది. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా విద్యలో ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతరం పర్యవేక్షిస్తుండడం వల్ల పదో తరగతి ఫలితాల్లో 3వ స్థానం, కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన న్యాస్ సర్వేలో దేశంలో 50 స్థానంలో నిలిచింది. ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థుల తల్లి దండ్రుల కృషితో ప్రగతి సాధిస్తోంది. అయితే ఈ ఏడాది నుంచి జిల్లాలో అమలు చేస్తున్న ఈ ప్రణాళిక రాష్ట్రవ్యాప్తంగా మోడల్‌గా నిలిచే అవకాశముంది.నూతన విద్యావిధానం లక్ష్యాల అమలులో భాగంగా జిల్లాలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం పాఠశాల విద్యా విభాగం ‘దిక్సూచి’ పేరుతో ప్రత్యేక ప్రణాళిక ప్రారంభించాం. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థులు జీవితంలో అవసరమైన విద్యా నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం, నైతిక విలువలు, యోగా, క్రీడలు, ధ్యానం ద్వారా శారీరక, మానసిక శ్రేయస్సు ఆరోగ్యం వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ఈ ప్రణాళిక రూపుదిద్దుకుంటుంది. ఉపాధ్యాయులు, అధికారులు నిబద్ధతతో ముందుకెళ్లాలి. – కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
ఆలయాల ద్వారబంధనం
సాక్షి, నెట్వర్క్: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా జిల్లాలో ఆదివారం ఆలయాలను మూసివేశారు. కొడవటూరు సిద్దులగుట్ట, చీటకోడూరు శ్రీ పంచకోసు రామలింగేశ్వర, జనగామ పాతబీటుబజారు శ్రీరామలింగేశ్వర, బాణాపురం శ్రీ వెంకటేశ్వర, బతుకమ్మకుంట శ్రీ విజయదుర్గా మాత, శ్రీ సాయిబాబా, హెడ్ పోస్టాఫీసు శ్రీ సంతోషీమాత, గుండ్లగడ్డ శ్రీ ఉమా మహేశ్వరస్వామి, పోలీస్టేషన్ ఏరియాలోని శ్రీ చెన్నకేశ్వరతో పాటు ఆయా మండలాల పరిధిలో ఆలయాలను మూసి వేశారు. పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మధ్యాహ్నం కవాట బంధనం చేశారు. తిరిగి సోమవారం ఉదయం సంప్రోక్షణాది పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 7.30 గంటలకు భక్తులకు అర్జిత సేవలు, దర్శనానికి అనుమతించడం జరుగుతుందని ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు తెలిపారు. ద్వారబంధనం కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు పాల్గొన్నారు. లింగాలఘణపురం మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 12.30 గంటలకు ద్వార బంధనం చేసినట్లు ఆలయ పూజారి భార్గవాచార్యులు తెలిపారు. మధ్యాహ్నం అర్చన, ఆరగింపు అనంతరం చిల్పూరుగుట్ట శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ ద్వార బంధనం చేసినట్లు అర్చకులు తెలిపారు. ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్య పాల్గొన్నారు. -
అనాథాశ్రమంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు
జనగామ రూరల్: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పసరమడ్లలోని అనాథాశ్రమంలో పిల్లలకు పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మిలాద్ సోషల్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు అన్వర్, సభ్యులు ఎక్బల్, హమీద్, అక్బర్, బాసిద్, మోహిన్, సుమేర్, మెయిజ్, యాకుబ్, సల్మాన్, ఇమ్రాన్, జమాల్, అశు, రమీజ్, జుబేర్ పాల్గొన్నారు. రక్తదాన శిబిరం.. మిలాద్ ఉన్ నబీ పురస్కరించుకొని ఏకే చారిటబు ల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని గుండ్లగడ్డలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్ మొయిజ్, కన్వీనర్ మాజీద్ అఫ్సర్, సైఫ్, కై ఫ్, అర్షద్ ఉర్ రెహమాన్, దిశ కమిటీ సభ్యుడు బక్క శ్రీను, గౌసి, సాదిక్, మాజీ కౌన్సిలర్ సమద్ తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి ‘సర్దుబాటు’
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు (ఎస్ఏ) పదోన్నతులు కల్పించిన నేపథ్యంలో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ మరోసారి చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. మొదటి విడతలో చేపట్టిన సర్దుబాటుపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. పైరవీలకు పెద్దపీట వేయడంతో సర్కార్ బడిని నమ్ముకుని అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు శాపంగా మారింది. దీంతో పలు పాఠశాలల ఆవరణలో తల్లిదండ్రులు సైతం ఆందోళనకు దిగారు. దీనిపై సాక్షి వరుస కథనాలతో సర్దుబాటు ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పదోన్నతుల నేపథ్యంలో.. జిల్లాలో 341 ప్రాథమిక(పీఎస్), 67 ప్రాథమికోన్నత, 103 ఉన్నత పాఠశాలల పరిధిలో 29వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. సుమారు 70 పీఎస్‌ల పరిధిలో జీరో సంఖ్యతో వాటిని మూసివేశారు. ఇటీవలే 87 మంది ఎస్జీటీలు, 17 మంది స్కూల్ అసిస్టెంట్లు పదోన్నతులు పొందడంతో పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని బోధన సౌలభ్యం కోసం సర్దుబాటు అనివార్యమైంది. ఈ ప్రక్రియలో పారదర్శకతపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చలు మళ్లీ మొదలయ్యాయి. మొదటి విడతలో 109 మంది ఉపాధ్యాయుల జాబితాతో జరిగిన సర్దుబాటుపై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది ప్రభావవంతులైన టీచర్లు తమ పరిధిలోనే ఉండేలా పైరవీలు చేసుకున్నారని, దీంతో కొంతమందికి అన్యాయం జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మరోసారి జరిగే ఈ సర్దుబాటు కూడా అదే బాటలో నడుస్తుందా అన్న ఆందోళన టీచర్ల వర్గాల్లో కనిపిస్తోంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా బోధన సిబ్బందిని కేటాయిస్తామన్న విద్యాశాఖ వాగ్దానం ఎంత వరకు ఆచరణలోకి వస్తుందో చూడాలి. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన అడ్మిషన్ల సంఖ్య బడిబాటలో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పిల్లల సంఖ్య కంటే తక్కువ టీచర్లు ఉన్న స్కూల్స్ ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఇంకా టీచర్లు అవసరమని తల్లిదండ్రులు చెబుతున్నారు. అదే సమయంలో పలుచోట్ల విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ మంది టీచర్లు కొనసాగుతున్నారు. ఈ సమస్యను అధిగమించడమే సర్దుబాటు ప్రధాన ఉద్దేశం. కానీ ఎప్పటిలాగే మళ్లీ పైరవీలు, బంధుత్వాలు ప్రభావం చూపితే విద్యార్థుల అభ్యసనంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. మొదటి విడతలో కనిపించిన లోపాలను సరిదిద్దకపోతే ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై ఇప్పటికే కొన్ని సంఘాలు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లాయి. సర్దుబాటుపై కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా దృష్టి సారించి పైరవీలకు ఆస్కారం లేకుండా, విద్యార్థులకు బోధనపరంగా ఇబ్బందులు లేని టీచర్ల నియామకం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పలువురు టీచర్లు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో సర్దుబాటు ప్రక్రియ పూర్తి కానుంది. 87 ఎజ్జీటీ, 17 ఎస్‌ఏలకు పద్నోనతులు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు మొదటి విడతలో అనేక ఆరోపణలు -
మా సార్ మాకే కావాలి..
జనగామ జిల్లా: ‘మా సార్‌ను అనవసరంగా డిప్యుటేషన్‌పై పంపించారు. మా సార్ మాకే కావాలి’.. అంటూ జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మున్సి పాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశా లలో విద్యార్థినులు శనివారం పాఠశాల గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. స్థానిక గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ఇన్చార్జి హెడ్ మాస్టర్‌గా ధరావత్ రాజు నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల పాఠశాలలో జరిగిన పరిణామాల నేపథ్యంలో.. ఉన్నతాధికారులు రాజును హనుమకొండ జిల్లా ఆరెపల్లి ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. రాజు శనివారం పాఠశాల నుంచి కారులో వెళ్తుండగా.. పలు వురు విద్యార్థులు ‘సార్.. వెళ్ళొద్దంటూ’ కన్నీరు పెట్టుకున్నారు. పాఠశాల గేటు వద్ద దాదాపు ఐదు గంటల పాటు నిరసన తెలిపారు. రాజు సార్ తమపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారని, పదో తరగతిలో 100 ఉత్తీర్ణత కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఆర్డీవో డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీఐ జి.వేణు, ఎస్ఐ వినయ్‌కుమార్ పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థినులు వినకపోవడంతో కలెక్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఫోన్లో కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఆదేశాల మేరకు.. నెల రోజుల్లో రాజు సార్‌ను పాఠశాలకు రప్పిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. -
నేడు చంద్రగహణం
● ఆలయాల మూసివేత జనగామ/బచ్చన్నపేట: దేశంలో నేడు (ఆది వారం) రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలను మూసి వేయనున్నారు. ఈ మేరకు బతుకమ్మకుంట శ్రీ విజయదుర్గా మాత ఆలయ ప్రధాన పూజారి ఆరాధ్య శర్మ శనివారం తెలిపారు. రాత్రి 9.56 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1.26 గంటల వరకు చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందన్నారు. ఆలయాలను మధ్యాహ్నం 12 గంటల తర్వాత మూసి వేసి, ఈ నెల 8వ తేదీ తెల్లవారు జాము ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శ నం చేసుకునే వీలు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రజలు సాయంత్రం 5 గంటల వరకే ఆహారం తీసుకుని, తిరిగి మరుసటి రోజు స్నానమాచరించి, ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాతనే ని త్యందన జీవితాన్ని ప్రారంభించాలన్నారు. చంద్రగ్రహణం నేపధ్యంలో 8వ తేదీన శివాలయాలకు వెళ్లి అభిషేకాలు చేస్తే శుభ ఫలితాలు ఉంటాయన్నారు. బచ్చన్నపేట మండలం కొడవటూర్ గ్రామంలోని స్వయంభూ శ్రీ సిద్ధేశ్వరాలయాన్ని నేడు మూసివేయనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి చిందం వంశీ, ప్రధాన పూజారి ఓం నమశివాయలు తెలిపారు. ● డీసీపీ రాజమహేంద్రనాయక్ జనగామ రూరల్: యువత సన్మార్గంలో సమాజ హితం కోసం పనిచేయాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఏసీరెడ్డినగర్ కాలనీలో గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నిమజ్జన ఊరేగింపులో మద్యం సేవించడం, ఘర్షణలు పెట్టుకోవడం చేయొద్దని, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తి చేసుకోవాలన్నారు. యువత చదువు, క్రీడలు వ్యాయామంపై దృష్టి సారించి సమాజ నిర్మాణానికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ దామోదర్ రెడ్డి, జోగు ప్రకాష్, సుంచు విజేందర్, బూడిది ప్రశాంత్, పాము భిక్షపతి, ధరావత్ మహేందర్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికజనగామ రూరల్: పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో శనివారం నిర్వహించిన క్రీడాపోటీల్లో పలువురు ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు డీవైఎస్ఓ బి. వెంకటరెడ్డి తెలిపారు. బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా నుంచి సుమారు 150 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈనెల 9,10 తేదీల్లో ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారన్నారు. అనంతరం సర్టిఫికెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో రాకేశ్, ప్రసాద్, కిష్టయ్య, మనోజ్ కుమార్, హనుమంతరావు, అశోక్ యాదగిరి, సంగీత మాధురి, మాధవి, దిలీప్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. జనగామ: ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ఉత్తమ టీచర్ల ఎంపికలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు ఉపాధ్యాయుల్లో చర్చ జరుగుతోంది. వినూత్న పద్ధతిలో బోధన, సీనియార్టీ, అడ్మిషన్లు పెంపు, వంద శాతం డ్రాప్ అవుట్ లేని బడులతో పాటు ప్రస్తుత సాంకేతికతను అందిపుచ్చుకుని ఉత్తమంగా నిలుస్తున్న వారిని మండల, జిల్లా స్థాయికి ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో పైరవీ లకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు బాహా టంగానే వినిపిస్తున్నాయి. ఇ ఉత్తమ టీచర్ కోసం దరఖాస్తు చేసుకోగా, అర్హత ఉన్నప్పటికీ వారి పేర్లను తొలగించి, పైరవీ చేసుకున్న వారికి చోటు కల్పిస్తున్నారనే ప్రచారం ఎంత వరకు నిజమనే విషయాన్ని ఉన్నతాధికారులు తేల్చాల్సి ఉంది. డాక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలిజనగామ రూరల్: ఈనెల 17న నిర్వహించే డాక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ డివిజన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సహాయ సంచాలకులు కె.శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను ఈ నెల 8వ తేదీలోగా అసిస్టెంట్ డైరెక్టర్, పోస్టుమాస్టర్ జనరల్, హైదరాబాద్ రీజియన్, హైదరాబాద్–500001 అనే చిరునామాకు పోస్ట్ ద్వారా పంపించాలన్నారు. కవర్‌పై 51 డాక్ అదాలత్ అని తప్పనిసరిగా రాయాలన్నారు. వచ్చిన ఫిర్యాదులను ఈ నెల 17వ తేదీ 11 గంటలకు గూగుల్ మీట్ ద్వారా పరిష్కరిస్తామన్నారు. -
వివిధ భాషల్లో 5వేల పుస్తకాలు, వందలాది జర్నల్స్, పురాతన స్క్రిప్ట్‌లు.. ఒకేచోట కొలువై ఉన్న ప్రొఫెసర్ గజ్జెల రామేశ్వరం ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇక.. అనేక మంది విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడనుంది. అరుదైన విజ్ఞాన సంపద ఉన్న ఈ ప్
నేచురోపతి లైబ్రరీ రీసెర్చ్ సెంటర్‌తో కేయూ, పుణే సంస్థల ఎంఓయూకేయూతో ఎంఓయూతో కలిగే ప్రయోజనాలు.. కాకతీయ యూనివర్సిటీ వారు ఈ నెల ఒకటో తేదీన ప్రకృతి వైద్య గ్రంథాలయంతో ఎంఓయూ చేసుకున్నారు. ● ప్రకృతి వైద్యజ్ఞానాన్ని సమయానికి పొందేలా ఈ లైబ్రరీ రీసెర్చ్ సెంటర్లోని పుస్తకాల క్యా టలాగ్, వర్గీకరణ చేపడతారు. ఇందుకు కేయూ లైబ్రరీ సైన్స్ విద్యార్థులను వినియోగిస్తారు. ● ఇరు సంస్థల వర్క్‌షాప్‌లు, సేవల మార్పిడి కోసం ఎలాంటి ఆర్థిక భారం ఉండబోదు. సదస్సులు, సమావేశాలను సంయుక్తంగా నిర్వహించేందుకు అవకాశం ఉంది. ● ఎంఎల్ఐఎస్సీ విద్యార్థులు, పీహెచ్డీ పరిశోధకులు తమ ప్రాజెక్ట్ వర్క్స్, ఇంటర్న్‌షిప్‌లకు అధ్యయనం చేసేందుకు ఈ ప్రకృతి వైద్య లైబ్రరీలోకి అనుమతి ఉంటుంది. ● ఆర్ట్స్ విద్యార్థులు ప్రకృతి వైద్య విజ్ఞాన సంపదను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు తెలుగు భాషలో ప్రకృతివైద్యంపై పద్యాలు, కవితల రూపంలో కూడా చికిత్స విధానాలున్నాయి. ● అమెరికా సిలికాన్ యూనివర్సిటీలో ఆయుర్వేద డిప్లొమా కోర్సు నడుస్తున్నది. తెలుగు, హిందీ భాషల్లో ప్రకృతి వైద్యానికి సంబంధించిన పుస్తకాలు, జర్నల్స్ ఉన్నాయి. ఆయా భాషల్లో ప్రకృతి వైద్యంపై పరిశోధన చేయాలనుకునేవారికి ఎంతో ఉపయోగపడనుంది. ● ఫార్మసీ విద్యార్థులకు ఫార్మాకాగ్నెన్స్ నేచురోపతికి సంబంధించిన ఆయుర్వేదం, యోగా, నేచురోపతి మీద ఒక పేపర్ ఉంది. ఆయా విద్యార్థుల సిలబస్‌కు అనుగుణంగా నూట్రిషన్స్, రోగ నిరోధకత పరిశోధనలకు ఉపయోపడే ప్రకృతి వైద్యం, విజ్ఞాన పుస్తకాలను ఉపయోగించుకోవచ్చు. ● ఇంటినే గ్రంథాలయంగా మార్చిన గజ్జెల రామేశ్వరం ● వివిధ భాషల్లో 5 వేల పుస్తకాలు, జర్నల్స్ అందుబాటులో.. ● ప్రకృతి వైద్యపరిజ్ఞానం పెంపొందించుకునే అవకాశం కేయూ క్యాంపస్: హనుమకొండ ప్రకాశ్‌రెడ్డిపేటలోని ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్లో దేశ, విదేశీ భాషా గ్రంథాలు ఉన్నాయి. ప్రకృతివైద్యానికి సంబంధించిన 50 పత్రికలు లభిస్తాయి. కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం విశ్రాంత ఆచార్యులు గజ్జెల రామేశ్వరం 2018 జూలై 24న తన ఇంటిలోనే ఈ లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రకృతి వైద్యంపై ఆసక్తి ఉన్నవారు ఈ లైబ్రరీలో ఉచితంగా ప్రవేశించి చదువుకునే అవకాశం కల్పించారు. పుణే జాతీయ ప్రకృతివైద్య సంస్థతో.. పుణేలోని జాతీయ ప్రకృతివైద్య సంస్థ గత జూలై 1న ఈ ప్రకృతి వైద్య గ్రంథాలయ పరిశోధన కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ సత్యలక్ష్మి, రామేశ్వరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. పుణే జాతీయ ప్రకృతి వైద్యసంస్థలో ఆస్పత్రి ఉంటుంది. అక్కడి నేచురోపతి కోర్సుల విద్యార్థులకు క్లినికల్ రీసెర్చ్‌కు సంబంధించిన ప్రకృతి వైద్య విజ్ఞాన పుస్తకాలు, జర్నల్స్ ఇక్కడి లైబ్రరీ రీసెర్చ్సెంటర్లో ఉన్నాయి. ఆ విద్యార్థులు ఇక్కడికి వచ్చి వినియోగించుకుంటారు. ఇతర దేశాల శాస్త్రవేత్తలు, ప్రకృతి వైద్యులు తమ సంస్థను సందర్శించిన సమయంలో పరిశోధనల విజ్ఞాన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉండడం వల్ల వారిని తరచూ ఇక్కడికి పంపే అవకాశాలున్నాయి. ఇది హెల్త్ ఎడ్యుకేషన్ టూరిజానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. యోగా, హిస్టరీ, లైఫ్ సైన్సెస్ వారికి ఉపయుక్తం కేయూ దూరవిద్యలో యోగా డిప్లొమా కోర్సు నడుస్తోంది. ఈ విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు 300 వరకు ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లోనూ నేచురోపతిపై ఒక పేపర్ ఉంది. సైకాలజీ విద్యార్థులకు మానసిక వైద్య విద్యకు సంబంఽధించి ప్రకృతి వైద్యపరంగా విజ్ఞానసంపద ఉంది. భారత ప్రకృతివైద్య చరిత్ర, ప్రకృతి వైద్య ఉద్యమ వైతాళికులు ఎవరు అనే అనేక అంశాలు, చారిత్రక పరంగా ప్రకృతి వైద్యవిధానం ఎలా వచ్చిందనే దానిపై హిస్టరీ విద్యార్థులు, పరిశోధనలకు ఈలైబ్రరీ రీసెర్చ్సెంటర్లో అనేక దేశ, విదేశాల పుస్తకాలు, జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. లైఫ్‌సైన్సెస్ పీజీకోర్సుల విద్యార్థులకు ఉపయోగపడే జ్ఞాన సంపద అందుబాటులో ఉంది. ప్రకృతి వైద్యవిజ్ఞానం ప్రజాబాహుళ్యంలోకి.. మూడున్నర దశాబ్దాలుగా సేకరించిన అరుదైన ప్రకృతి వైద్యవిద్య, సాహిత్య విజ్ఞాన సంపదను అందుబాటులో ఉంచా. కేయూ, పుణేలోని జాతీయ ప్రకృతివైద్య సంస్థతో మా లైబ్రరీ రీసెర్చ్ సెంటర్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. విజ్ఞాన సంపదను విద్యార్థులు, పరిశోధకులు ఉపయోగించుకోవాలి. – గజ్జెల రామేశ్వరం, ప్రకృతి వైద్య లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడుఇంటర్న్షిప్నకు కూడా.. ఈ ఎంఓయూతో ఎంఎల్ఐఎస్సీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌నకు అవకాశం లభించింది. తొలుత ఒకటి రెండురోజుల్లోనే ఇద్దరు విద్యార్థులను ఆ లైబ్రరీ సెంటర్‌కు పంపనున్నాం. మా లైబ్రరీ సైన్స్ విభాగంనుంచి ఆ లైబ్రరీలో పుస్తకాల క్యాట్‌లాగ్, క్లాసిఫికేషన్‌కు విద్యార్థులు సహకారం అందిస్తారు. –డాక్టర్ రాధికారాణి, కేయూ లైబ్రరీ సైన్స్ విభాగం అఽధిపతి -
కొత్త అందాలు
జనగామ: జిల్లా కేంద్రం కొత్త అందాలను సంతరించుకుంటోంది. పట్టణ అభివృద్ధితో పాటు సుందరీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆడపడుచులు ఆడంబరంగా జరుపుకునే బతుకమ్మ పండుగ నాటికి పూర్తి కానున్నాయి. చిన్న జిల్లాల్లో సాధారణ పట్టణంగా కనిపించిన జనగామ.. ఇప్పుడు న్యూ లుక్‌తో మెరిసిపోతోంది. సుందరీకరణ పనులు, ప్రజల కోసం ఆహ్లాదకరమైన వేదికలు, అన్నీ కలిసి పట్టణాన్ని అందంగా మార్చేస్తుంది. సుందరీకరణలో పెంబర్తి –యశ్వంతాపూర్–సూర్యాపేట బైపాస్ ముఖ ద్వారం, ఆర్టీసీ చౌరస్తా, బతుకమ్మకుంట ప్రత్యేక ఆకర్షణగా సంతరించుకుంటోంది. తళుక్కుమంటున్న కుంట–ఆకర్షణీయంగా ఆర్టీసీ చౌరస్తా ధర్మోనికుంట బతుకమ్మకుంటగా మారిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతోంది. కుంటను పునరుద్ధరించి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. కుంటలోని నీరు ఆహ్లాదాన్ని కలిగిస్తే, సుందరీకరణతో మనసుకు హాయిని ఇస్తోంది. చిన్నపి ల్లల కోసం ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్, యువత కోసం ఔట్‌డోర్ జిమ్, అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా నేల, టైల్స్‌తో వాకింగ్ ట్రాక్, వేదికలు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఐ లవ్ యూ జనగామ పేరిట ప్రత్యేక ఆకర్షణ కలిగించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు చేసే పెద్దలతో పాటు పిల్లలు ఆటలతో కాలక్షేపం చేసే విధంగా బతుకమ్మకుంట కొత్త జీవనశైలికి సంకేతాలుగా ఇస్తోంది. సూర్య నమస్కారాల విగ్రహాలు.. పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తా జంక్షన్‌ను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించగా, యోగా, ఆరోగ్యంపై అవగాహన కలిగించే విధంగా సూర్య నమస్కారాల విగ్రహాలను ఏర్పాటు చేశారు. బతుకమ్మకంట జంక్షన్లో బటర్‌ఫ్లై, నమస్కారంతో స్వాగత విగ్రహంతో ప్రధాన కూడళ్లన్నీ సరికొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. రాత్రి వేళల్లో రంగు రంగుల లైటింగ్‌తో కూడలి మెరిసిపోతూ పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. పట్టణ అభివృద్ధి అంటే కేవలం రహదారులు మాత్రమే కాదని, సాంస్కృతిక స్పృహను కలిగించే పనులూ అవసరమని దీంతో స్పష్టమవుతోంది. పెంబర్తి, యశ్వంతాపూర్ జిల్లా ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు హైలెట్‌గా నిలుస్తున్నాయి. ముఖ ద్వారం వద్ద తెలంగాణ సాయుధ పోరాటంలో తెగువ చూపిన చాకలి అయిలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్ధార్ సర్వాయ్ పాపన్న విగ్రహాలను ప్రతిష్ఠించారు. భవిష్యత్ దిశగా.. జనగామను కొత్త తరహా పట్టణంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో బతుకమ్మకుంట ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఇది కేవలం ఒక కుంట మాత్రమే కా దు, పట్టణం మొత్తం ఊపిరి పీల్చే ప్రదేశం. భవిష్యత్‌లో రంగప్ప చెరువుతో పాటు ఆయా ప్రాంతాల్లో ఇలాంటి సుందరీకరణ, అభివృద్ధి పనులు కొనసాగితే పట్టణం సాంస్కృతిక, ఆరోగ్య, వినోదాల కేంద్రంగా కూడా గుర్తింపు తెచ్చుకుంటుందని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం ముఖద్వారంలో స్వాగత తోరణాలు సాయుధ పోరాట యోధుల విగ్రహాలు ఆర్టీసీ చౌరస్తాలో సూర్య నమస్కారాలు రూ.2.50కోట్లతో సుందరీకరణ పనులు బతుకమ్మ పండుగ నాటికి పనులు పూర్తిపట్టణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. బతుకమ్మకుంట, పెంబర్తి, యశ్వంతాపూర్, ఆర్టీసీ చౌరస్తా జంక్షన్ తదితర ప్రధాన కూడళ్లలో సుందరీకరణ పనరులు వేగంగా జరుగుతున్నాయి. నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ప్రజల సహకారంతో పనులు త్వరగా పూర్తి చేయిస్తా. – రిజ్వాన్ బాషా, కలెక్టర్ -
కోర్టుకు హాజరైన ఉద్యమకారులు
జనగామ రూరల్: జిల్లా ఉద్యమ సమయంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, వివిధ పార్టీ నాయకులపై కేసులు ఉండగా శనివారం ఉద్యమకారులు జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న కేసులు కోట్టేయడం లేదని, ప్రభుత్వం చొరవ తీసుకొని కేసులు తొలగించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌడ రమేశ్, ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీఎల్ఎన్ రెడ్డి, ఉడుగుల రమేశ్, పెద్దోజు జగదీష్, తదితరులు కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు. -
యూరియా కోసం బారులు
ఘన్పూర్ పీఏసీఎస్ ఎదుట యూరియా కోసం బారులుదీరిన రైతులు జనగామ:ఆగ్రోస్ సెంటర్ వద్ద రైతుల బారులుజనగామ/స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ పట్టణం మున్సిపల్, కలెక్టర్‌రేట్ ఏరియాలోని ఆగ్రోస్ సెంటర్లతో పాటు జేకేఎస్ ఫర్టిలైజర్ దుకాణం వద్ద శనివారం రైతులు యూరియా కోసం బారులు దీరారు. టోకెన్ సిస్టం ప్రకారం యూరియా బస్తాలు ఇవ్వగా, పోలీసులు బందోబస్తు చేపట్టారు. అలాగే స్టేషన్‌ఘన్‌పూర్ పీఏసీఎల్లో యూరియా బస్తాలు ఇస్తున్నారని తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచే బారులుదీరారు. స్టాక్ ఉన్న వరకే రైతులకు పంపిణీ చేయగా యూరియా దొరకని రైతులు నిరాశతో వెనుదిరిగారు. -
వైభవంగా అనంత పద్మనాభస్వామి ఉత్సవాలు
రఘునాథపల్లి: మండలంలోని ఫతేషాపూర్లోని శ్రీభక్తాంజనేయస్వామి ఆలయంలో వెలసిన అనంత పద్మనాభస్వామికి శనివారం గ్రామస్తులు వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. అనంత చతుర్థిని పురస్కరించుకొని జిల్లాలోనే ఏకై క అనంత పద్మనా భస్వామి ఆలయమైన ఫతేషాపూర్కు పలు జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి వ్రత పూజలు చేశారు. వందలాది మంది భక్తులతో ఆలయం కిక్కిరిసింది. ప్రధానార్చకుడు రాజేష్ భార్గవ గణేష్పూజ, నవగ్రహ పూజ, పంచామృతభాషేకం, అర్చనలు నిర్వహించారు. పలువురు దంపతులు కోటి వత్తులతో దీపారాదన చేశారు. హనుమాన్ భజన మండలి, గ్రామస్తులు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. -
ముగిసిన నిమజ్జనం
జనగామ: తొమ్మిది రోజుల వినాయక ఉత్సవానికి తెరపడింది. వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో గణపయ్యకు వీడ్కోలు పలికారు. జిల్లాలో రెండు రోజుల పాటు జరిగిన నిమజ్జన కార్యక్రమం ఆదివారం తెల్లవారు జాము ముగిసింది. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో గణనాథులను నిమజ్జనం చేశారు. ప్రధాన రహదారులతో పాటు శోభాయాత్రలు వెళ్లే మార్గాలు, నిమజ్జన ఘాట్ల వద్ద పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. లింగాలఘణపురం నెల్లుట్లతో పాటు అన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో నిమజ్జనం సాఫీగా సాగాయి. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, డీసీపీ -
సుందరీకరణ పనులకు రూ.2.50 కోట్లు
జనగామ బతుకమ్మకుంటతో పాటు పట్టణ, బైపాస్ జంక్షన్ల వద్ద సుందరీకరణ, స్వాగత తోరణ పనులకు రూ.2.50 కోట్ల మేర నిధులను ఖర్చు చేస్తున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో మున్సిపల్ ఎల్ఆర్ ఎస్, జనరల్ ఫండ్ నిధులను వెచ్చించి ఈ పనులను చేపడుతున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపధ్యంలో సుందరీకరణ పనుల్లో మరింత వేగం పెంచారు. సద్దులు, దసరా ఉత్సవాలను ఆనవాయితీగా ఏటా ఇందులోనే నిర్వహించనున్నారు. పండుగ దగ్గర పడుతున్న నేపధ్యంలో పనులను త్వరగా పూర్తి చేసేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.యశ్వంతాపూర్ ముఖద్వారం వద్ద స్వాగత తోరణం -
ధనయజ్ఞంతో ‘కూలేశ్వరం’
● ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లింగాలఘణపురం: గత ప్రభుత్వం జలయజ్ఞాన్ని ధనయజ్జంగా మార్చుకొని కూలేశ్వరం కట్టిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ ఎకరానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగునీరు అందించే ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్పారు. శుక్రవారం మండలంలోని నవాబుపేట రిజర్వాయర్ నుంచి భువనగిరి ఎంపీ శ్యామలకిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డితో కలిసి నీటిని విడుదల చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కడియం అధ్యక్షతన జరిగిన సమావేశంలో విప్ బీర్ల ఐలయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. నవాబుపేట రిజర్వాయర్‌లోనికి నీళ్లు వచ్చేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంతో శ్రమించారన్నారు. ఉమ్మడి జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, పాలకుర్తి, వర్ధన్నపేటతో పాటు నల్లగొండలోని తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో దేవాదుల ప్రాజెక్టుతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..యూరియా కృత్రిమ కొరత కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. రైతులను రెచ్చగొట్టి యూరియా కొరత సృష్టిస్తున్నారన్నారు. ఎస్ఈ సుధీర్, ఈఈ ప్రవీణ్, ఆర్డీఓ గోపీరామ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు శివకుమార్, మాజీ జెడ్పీటీసీ వంశీధర్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులతో మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో వనిత టీ స్టాల్‌ను డీఆర్డీఓ వసంతతో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో డీపీఎం (ఐబీ అండ్ బ్యాంక్ లింకేజీ) శ్రీనివాసు, నాన్‌ఫాం ప్రకాశ్, ఏపీఎం నాగేశ్వర్రావు, సీసీలు పాల్గొన్నారు. -
న్యాస్‌లో కలెక్టర్‌కు రాష్ట్ర ఉత్తమ అవార్డు
జనగామ: న్యాస్(నేషనల్ అఛీవ్మెంట్ సర్వే)లో జనగామ జిల్లా జాతీయస్థాయిలో 50వ స్థానం, రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచి ప్రతిభను కనబరిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌తో కలిసి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఉత్తమ అవార్డు అందుకున్నారు. జిల్లాలో పాఠశాల విద్యను అభివృద్ధి చేయడంలో కలెక్టర్ పాత్రను గుర్తిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అవార్డుతో పాటు ప్రశంస పత్రాన్ని అందించారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డు అందుకోవడంతో తనపై బాధ్యత రెట్టింపు అయ్యిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. సీఎం చేతులమీదుగా ఏసీతో కలిసి స్వీకరణ -
వెళ్లిరావయ్యా.. బొజ్జ గణపయ్య అంటూ వీడ్కోలు
● ఘనంగా గణేశ్ నిమజ్జనం ● శోభాయాత్రలో కోలాటాలు, నృత్యాల సందడి ● అర్ధరాత్రి వరకు కొనసాగిన వేడుకలు ● నెల్లుట్ల చెరువు వద్ద పెద్దఎత్తున ఏర్పాట్లుట్రాఫిక్పై నజర్.. పట్టణంలో భారీ గణపతుల ఊరేగింపు నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎక్కడా అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నెహ్రూ పార్కు నుంచి సూర్యాపేట రోడ్డు మీదుగా నెల్లుట్ల చెరువు వరకు పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6.30 గంటలకు మండపాల నుంచి గణపతులు శోభాయాత్రకు బయలుదేరాయి. అర్ధరాత్రి 1.30 గంటల వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగింది.పట్టణంలోని బాలాజీనగర్, కుర్మవాడ, అంబేడ్కర్‌నగర్, జ్యోతినగర్, శ్రీనగర్ కాలనీ, గిర్నిగడ్డ, గుండ్లగడ్డ, శ్రీవిల్లాస్ కాలనీ, జీఎంఆర్ కాలనీ, నెహ్రూపార్కు, వీవర్స్‌కాలనీ, పాత బీట్‌బజార్, సూర్యాపేట రోడ్డుతో పాటు ఆయా కాలనీల్లో కొలువు దీరిన గణపతులను ఊరేగింపుగా చెరువుల వద్దకు తీసుకెళ్లారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆధ్వర్యంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, డీపీవో స్వరూప, డీఆర్డీఓ పీడీ వసంత, తహసీల్దార్ హుస్సేన్, జిల్లా ఫైర్ ఆఫీసర్ రేమండ్ పీటర్ తదితర శాఖల ఉన్నతాధికారులు నిరంతరం శ్రమించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిమజ్జనం జరుగగా, కంటిన్యూగా నేడు కూడా జరగనుంది. వినాయక నిమజ్జన కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్, ఏసీపీ భీమ్‌శర్మ, తహసీల్దార్ రవీందర్, ఎన్పీడీసీఎల్ డీఈ లక్ష్మినారాయణరెడ్డి పాల్గొన్నారు.ఆపరేషన్ సిందూర్ గణనాథుడు కాలనీల నుంచి ఊరేగింపులు -
మహా రక్తదాన శిబిరం
జనగామ రూరల్: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శుక్రవారం టీఎస్ మేసా, హమ్ సాత్ ఫౌండేషన్, మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణలోని ఏరియా హాస్పిటల్లో మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథి డీసీపీ రాజా మహేంద్రనాయక్ శిబిరాన్ని ప్రారంభించారు. మొత్తం 75 మంది రక్తదానం చేయగా వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే మహ్మద్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో డీసీపీ అసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆసుపత్రిలో మాజీ కౌన్సిలర్ మల్లిగారి రాజు 96వ సారి రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎస్ఐలు రాజేశ్, రాజన్‌బాబు, హమ్ సాత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ యాకుబ్ పాషా, టీఎస్ మేసా జిల్లా అధ్యక్షుడు అంకుషావలి, తహసీన్ ఇస్మాయిల్, అజారుద్దీన్, మచ్చ కుమార్, యాకూబ్ పాషా, అజర్ గౌస్భాయ్ తదితరులు పాల్గొన్నారు. ఐనవోలు: ఈనెల 7న (ఆదివారం) రాత్రి చంద్ర గ్రహణం కారణంగా అదే రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాల యం మూసివేయనున్నట్లు ఈఓ కందుల సుధాకర్, చైర్మన్ కొమ్మగోని ప్రభాకర్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆలయం మూసి ఉంటుందన్నారు. -
హైదరాబాద్‌కు తరలిన జీపీఓలు
జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత గ్రామ పరిపాలన అధికారుల(జీపీఓ) పాలన తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి 129 మంది జీపీఓలు అర్హత సాధించగా, శుక్రవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ పర్యవేక్షణలో ఆర్డీఓ గోపీరామ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమానికి కలెక్టరేట్ నుంచి రెండు ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్లారు. హైటెక్స్‌లో జరిగిన వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జీపీఓలకు ఆర్డర్ కాపీలను అందించారు. నేటి(శనివారం) నుంచి జీపీఓల సేవలు కొనసాగనుండగా, వారికి మండలాలు కేటాయించాల్సి ఉంటుంది. జీపీఓలు సొంత నియోజకవర్గం, మండలంలో పనిచేయకుండా నిబంధనలు విధించారు. -
శోభాయాత్రలు.. కోలాటాలు
బొజ్జ గణపయ్యను నవరాత్రులు పూజించారు.. చేతిలో లడ్డూ...మెడలో గరికపోచల దండలు..తీరొక్క పూలతో అభిషేకాలు.. తప్పులుంటే మన్నించయ్యా అంటూ గుంజీలు..ఉదయం, రాత్రి పూజలు..కోలాటం, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరూవాడ, పట్టణం, వీధులన్నీ గణేశుడి నామస్మరణతో నిండిపోయాయి. తొమ్మిది రోజుల విఘ్నేశ్వరుడిని భక్తితో పూజించిన ఉత్సవ కమిటీలు, భక్తులు శుక్రవారం నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరారు. జనగామ పట్టణం, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో మండలాల పురవీధులు గణనాథుడి నినాదాలతో మార్మోగాయి. భక్తుల పూజలు, నైవేద్యాలు, అన్నదాన కార్యక్రమాలు అందుకున్న బొజ్జగణపయ్య నిమజ్జన కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు వందలు, వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం వినాయక.. వెళ్లిరావయ్యా..అంటూ వీడ్కోలు పలుకగా... మళ్లొచ్చే యేడు కలుస్తానంటూ ఏకదంతుడు గంగమ్మ ఒడికి చేరాడు.– జనగామవినాయక నిమజ్జన ఊరేగింపు భక్తుల జయజయ హర్షధ్వానాల మధ్య కొనసాగింది. యాత్రలో మహిళల కోలాటాలు, సాంస్కృతిక, సాంప్రదాయ నృత్యాలతో భక్తిని చాటుకున్నారు. జనగామ పట్టణంలోని గణపతులు లింగాలఘణపురం మండలం నెల్లుట్ల, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని చెరువుల వద్దకు నిమజ్జనం కోసం తీసుకు వెళ్లారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన నవరాత్రులు జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.కట్టుదిట్టమైన బందోబస్తు..వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో ఏఎస్పీ, ఏసీపీ, సీఐ, ఎస్సైలు, పోలీసులు, జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నెల్లుట్ల, పాలకుర్తి చెరువుల్లో నాలుగు భారీ క్రేన్లు, నాలుగు తెప్పలు, 40 మంది గజ ఈతగాళ్లు, 30 మంది ప్రత్యేక పర్యవేక్షకులు 24 గంటల పాటు అక్కడే ఉండి నిఘా వేశారు. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక శిభిరాలను ఏర్పాటు చేయగా, రెవెన్యూ, మునిసిపాలిటీ, విద్యుత్, 108 అంబులెన్స్, అగ్నిమాపక, పంచాయతీరాజ్, పంచాయతీ ఆయా శాఖలు నిమజ్జన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. శానిటేషన్ కార్మికులు వారం రోజులుగా పని చేయడంతో పాటు రెండు రోజుల పాటు జరిగే నిమజ్జనం సమయంలో సేవలు అందించారు. ఇదిలా ఉండగా నెల్లుట్ల చెరువు వద్ద గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చెరువు ప్రధాన ద్వారం వద్ద గణేశ్ విగ్రహాలతో వచ్చిన వాహనాలను క్రమపద్ధతిలో లోనికి పంపించడంతో రద్దీ తగ్గి నిమజ్జనం సాఫీగా సాగింది. -
విద్యుత్, పోలీసు శాఖల సమీక్ష
వినాయక నిమజ్జనం పురస్కరించుకుని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ టి.వేణుమాధవ్ గురువారం సమీక్ష నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతిమలను నిమజ్జనానికి తరలించే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వార్డుల్లో కిందకు జారిన లైన్లను సరిచేయాలని డీసీపీ కోరారు. ఊరేగింపు కార్యక్రమాల్లో డీజేలకు అనుమతి లేదని, వినియోగిస్తే సీజ్ చేస్తామన్నారు. నిమజ్జన సమయంలో ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే 100 నెంబర్‌కు డయల్ చేయాలన్నారు. నిమజ్జనం కోసం నెల్లుట్ల చెరువు వద్దకు తీసుకెళ్లాలి. -
పెసర్ల కొనుగోలులో సిండికేట్
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్లో పెసర్ల ధరలు మళ్లీ తగ్గాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిండికేట్ బేరం నడిపిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెసర్లకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,360 ప్రకటించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా పెసరు పంట ధరలు సగానికి పైగా తగ్గగా, సాక్షి వరుస కథనాలతో అధికారుల దృష్టికి తీసుకెళ్తోంది. అయినప్పటికీ మార్కెట్లో ధరలు మాత్రం పెరగడం లేదు. గురువారం దేవరుప్పుల మండలం పెద్దమడూరుకు చెందిన రైతు బోరెం నరేందర్‌రెడ్డి ఐదున్నర క్వింటాళ్ల పెసర్లను అమ్ముకునేందుకు జనగామ వ్యవసాయ మార్కెట్‌కు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు 50శాతం మాత్రమే గిట్టుబాటు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు సరైన ధర రాక పెట్టుబడులు కూడా రావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. వ్యాపారులు ఒక్కటై ధర రాకుండా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో పెసర్లు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రావడం లేదని దీంతో ధర తగ్గుముఖం పడుతోందని మండిపడ్డారు. భారీగా తగ్గిన ధరలు పెట్టుబడి కూడా రావడం లేదంటూ రైతుల ఆవేదన -
ఆరోగ్య జనగామకు కృషి
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ: ఆరోగ్యవంతమైన జనగామ నియోజకవర్గం కోసం అహర్నిషలు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 43 మంది లబ్ధిదారులకు రూ.13.10లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటినుంచి నీలిమా ఆస్పత్రిలో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు ఉచితంగా మందులు సైతం ఇస్తున్నామన్నారు. జిల్లా జన రల్ ఆస్పత్రిలో సిటీస్కాన్ కోసం మొదటి నుంచి మంత్రి దామోదర నర్సింహతో మాట్లాడుతున్నానని, యంత్రం బిగించిన తర్వాత సేవల ఆలస్యంపై అసెంబ్లీలో కోరుట్ల ఎమ్మెల్యేతో మాట్లాడించిన రెండు రోజుల్లోనే ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో నాయకులు ఇర్రి రమణారెడ్డి, బాల్దె సిద్ధిలింగం, పోకల జమునలింగయ్య, గాడిపెల్లి హేమలతరెడ్డి, ముస్త్యాల దయాకర్, ఉల్లెంగుల సందీప్, చంద్రారెడ్డి, కృష్ణంరాజు, ఉడుగులు కిష్టయ్య, శ్రీనివాస్, మద్దికుంట రాధ, అనిత, విజయ్, గోవర్ధన్, రాజు, నర్సింగ్, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గురువుకు వందనం
నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పల్లెల్లో మూతపడిన ప్రభుత్వ పాఠశాలలకు పునరుజ్జీవం పోస్తూ ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి విద్యార్థులను పాఠశాలకు తీసుకొస్తున్న ఆదర్శ ఉపాధ్యాయులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కొందరు కథలు, రచనలతో పాఠాలపై అవగాహన కల్పిస్తుండగా, మరికొందరు సాంకేతిక బోధనోపకరణాల ద్వారా బోధన సాగిస్తున్నారు. పలువురు ఉపాధ్యాయులు వినూత్న బోధనారీతుల ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. – మరిన్ని కథనాలు 8లోuదేవరుప్పుల: జిల్లాలోని దేవరుప్పుల మండలం మాధాపురం ప్రాథమిక పాఠశాలకు గతేడాది ప్రధానోపాధ్యాయురాలిగా నల్ల లలిత విధుల్లో చేరారు. అనతి కాలంలోనే ముప్పైలోపు ఉన్న విద్యార్థుల సంఖ్యను 90మందికి చేరేలా కృషి చేశారు. విద్యార్థులకు అత్యుత్తమ భోధన అందించేలా హెచ్ఏం లలిత తన భర్త రమేశ్ సహకారంతో ఆంగ్లమాధ్యమం చదువులో సామర్థ్యం తక్కువ ఉన్న వారి కోసం ఏఐఎక్సల్ ల్యాబ్ ఏర్పర్చారు. కార్పొరేట్ పాఠశాల మాదిరిగా విద్యార్థులకు టై, బెల్టులు, ఐడీ కార్డులు, దినచర్య కోసం డైరీలు, క్రీడా దుస్తులు, తాగునీటి కోసం కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ సహకారంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. విద్యార్థులకు చేతిరాత (కాలీగ్రాఫిక్) శిక్షణ సైతం ఇప్పించారు. బడిబాటలో జిల్లాలోనే అగ్రభాగాన ఈ పాఠశాల చేరడంతో పరిసర గిరిజన తండాల నుంచి ప్రత్యేక వాహనం ఏర్పర్చుకొని విద్యార్థులు వస్తుండడం గమనార్హం.జనగామ: ఎన్నో సంవత్సరాలుగా మూతబడి..నూతన విద్యా సంవత్సరంలో తెరుచుకున్న బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు చక్కని బోధన చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ యువ ఉపాధ్యాయురాలు. జనగామ మండలం ఎర్రకుంట తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న రేష్మా 2024 డీఎస్సీ ద్వారా ఎంపికయ్యారు. పాఠశాలకు వచ్చిన రేష్మా గ్రామంలో వాడవాడలా తిరిగి 40 మంది విద్యార్థులను చేర్పించారు. ఈ స్కూల్ రీ ఓపెన్‌లో భాగంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా వెళ్లి ఘనంగా ప్రారంభించారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో రేష్మా బోధన చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.– జనగామ -
కులవృత్తులకు అండ..
స్టేషన్‌ఘన్‌పూర్: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులకు అండగా పనిచేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ పట్టణకేంద్రంలోని రైతు వేదికలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు, గీత కార్మికులకు కాటమయ్య సు రక్ష కిట్స్ పంపిణీ చేపట్టారు. కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ రిజ్వాన్ బాషా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, బీసీ వెల్ఫేర్ జిల్లా అఽధికారి రవీందర్, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ లావణ్యశిరీశ్రెడ్డి, ఎకై ్సజ్ సీఐ భాస్కర్‌రావు, ఆర్ఐలు సతీష్, శ్రీకాంత్ పాల్గొన్నారు. కమ్యూనిటీ భవనాల మంజూరు పత్రాల పంపిణీ.. పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని పలు గ్రామాలకు ఎంపీ నిధుల నుంచి మంజూరైన కమ్యూనిటీ భవనాలకు సంబంధించిన పత్రాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య చేతుల మీదుగా అందించారు. వనిత టీస్టాల్ ప్రారంభం.. మహిళల సంక్షేమానికి, మహిళల భద్రతకు, ఆర్థిక స్వావలంబనకు సీఎం రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ఎంపీ కడియం కావ్య అన్నారు. ఘన్పూర్ డివిజన్‌కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన వనిత టీస్టాల్‌ను ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ఆకట్టుకునేలా బతుకమ్మకుంట
జనగామ రూరల్: బతుకమ్మకుంటను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని, సుందరీకరణ పనులు వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం బతుకమ్మకుంట అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌తో కలిసి పర్యవేక్షించారు. ఈసందర్భంగా బతుకమ్మ కుంటలో అందమైన రంగులతో ఏర్పాటు చేసిన గ్రిల్స్‌ను, బెంచీలను పరిశీలించారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్క్ పనులను వేగవంతంగా బ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ ఇంజనీర్ శ్రీనివాస్‌రావు, ఉద్యాన శాఖ అధికారి శ్రీధర్ తదితరులు ఉన్నారు. పర్యావరణ పరిరక్షించాలి.. జనగామ: భవిష్యత్తుతరాలకు కాలుష్య రహిత స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించే బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్తో కలిసి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కను నాటి నీరు పోశారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ అధికారి అనిత, సీఐలు ప్రభావతి, సంతోష్‌రెడ్డి, ఎస్సైలు జనార్దన్, మధు, నరేశ్, రాధిక, పద్మ, సుధ, మాధురి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
సిద్దేశ్వరాలయ హుండీ రూ.5లక్షలు
బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ గ్రామంలోని స్వయంభూ శ్రీసిద్దేశ్వరాలయ హుండీ ఆదాయం రూ. 5 లక్షల 345లు వచ్చినట్లు ఆలయ ఈఓ చిందం వంశీ తెలిపారు. గురువారం హుండీ లెక్కింపు అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది ఆరు నెలల హుండీ ఆదాయమన్నారు. హుండీ లెక్కింపునకు పర్యవేక్షణ అధికారిగా దేవాదాయ, దర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి హాజరుకాగా ఆలయ కమిటీ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, సీబీఐ బీఎం గోపీనాయక్ , ప్రధాన పూజారి ఓంనమశివాయ, ధర్మకర్తలు నిమ్మ కర్ణాకర్‌రెడ్డి, నేరెళ్ల రాజయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి
● డీసీపీ రాజమహేంద్ర నాయక్ జనగామ రూరల్/స్టేషన్‌ఘన్‌పూర్: వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. బుధవారం పట్టణంలోని జ్యోతినగర్ కాలనీలో జై హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో డీసీపీ ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు నిమజ్జన వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసుల సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు బాల్దే దేవేందర్, తాడూరి వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఘన్పూర్ శివారు పుట్టలమ్మ కుంట వద్ద చేపడుతున్న ఏర్పాట్లను స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓ డీఎస్ వెంకన్న, సీఐ జి.వేణుతో కలిసి బుధవారం పరిశీలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించాలన్నారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. -
స్వచ్ఛమైన తాగునీరు అందించాలి
జనగామ: జనగామ పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే విధంగా మున్సిపల్ కమిషనర్ నిత్యం పర్యవేక్షణ చేయాలని డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. బు ధవారం చీటకోడూరు రిజర్వాయర్‌తో పాటు ఫిల్టర్ బెడ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిల్టర్ బెడ్‌ను ప రిశీలించిన అనంతరం కమిషనర్ మహేశ్వర్‌రెడ్డికి సమాచారం అందించగా, ఆయన అక్కడికి వచ్చా రు. రోజువారీగా సప్లైయ్ చేస్తున్న తాగునీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ప్ర జా సంక్షేమం విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. డీసీసీ అధ్యక్షుడి వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యా దవ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరె డ్డి, నాయకులు చెంచారపు కరుణాకర్‌రెడ్డి, మెరుగు బాలరాజు, బనుక ప్రభాకర్, ప్రకాశ్ యాదవ్, చి క్కుల వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి చీటకోడూరు రిజర్వాయర్ సందర్శన -
యూరియా కోసం బారులు
జనగామ/ తరిగొప్పుల/ స్టేషన్ ఘన్పూర్: రైతులకు యూరియా కష్టా లు తప్పడం లేవు. హైదరాబాద్ రోడ్డు జేకేఎస్ ఫర్టిలైజర్ వద్ద యూరియా కోసం బుధవారం రైతులు నానా తంటాలు పడ్డారు. నాలాపై సీసీ లేకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెనపై ప్రాణాలను ఫణ్ణంగా పెట్టి వెళ్లాల్సి వచ్చింది. తరిగొప్పుల మండలకేంద్రంలోని మన గ్రోమోర్ కేంద్రం వద్ద బుధవారం తెల్లవారుజామున నుంచి చెప్పులు క్యూలో పెట్టి యూరియా కోసం రైతులు నిల్చున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ శివునిపల్లిలోని ఆగ్రోస్ సెంటర్ వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు. -
చేపల టెండర్లలో సంక్షోభం!
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా చేపల టెండర్ల ప్రక్రియ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రతీ సంవత్సరం వర్షాలతో రిజర్వాయర్లు, చెరువుల్లో 50 శాతం నీరు చేరిన వెంటనే ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య చేపల విత్తనం (ఫిష్ సీడ్స్) వేయడం ఆనవాయితీ. ఈసారి టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో మత్స్యకారుల భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారింది. ఈ నెల 1వ తేదీన చేప పిల్లల పంపిణీకి టెండర్లు ఉండగా, కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వం 8వ తేదీ వరకు గడువు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరంలో చేపల విత్తనం సరఫరా చేసిన కాంట్రాక్టర్లలకు ప్రభుత్వం బిల్లులును చెల్లించకపోవడంతో పరిస్థితి సంక్లిష్టమైంది. ఈ రెండేళ్ల పరిధిలో కాంట్రాక్టర్లలకు ప్రభుత్వం నుంచి రూ.3.93 కోట్ల మేర రావాల్సి ఉంది. 2024–25 సంవత్సరంలో చేప పిల్లల టెండరు ప్రక్రియ నిర్వహించే సమయంలో ఇదే పరిస్థితి నెలకొంది. మునుపటి బిల్లులను మంజూరీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. ప్రభుత్వం 50శాతం చేప పి ల్లలకు మాత్రమే టెండరు ప్రక్రియ నిర్వహించగా, జిల్లాలో 1.29 కోట్ల పిల్లలకు గాను రూ.1.33 కోట్ల మేర బడ్జెట్ కేటాయించారు. కాంట్రాక్టర్లు ఈ మొత్తంగా చేపపిల్లలను పంపిణీ చేయగా, సర్కారు నుంచి ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. రెండు సంవత్సరాల బిల్లులు పెండింగ్‌లో ఉండటమే కాకుండా, చెల్లింపులపై ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడంతో కాంట్రాక్టర్లు, ప్రభుత్వం మధ్య సందిగ్ధత నెలకొంది. దీంతో కొత్త టెండర్లలో పాల్గొనే ఉత్సాహం గుత్తేదారులలో కనిపించడంలేదు. ఈనెల 1వ తేదీన ప్రభుత్వం ఆన్లైన్ పద్ధతిలో చేపల టెండర్ల ప్రక్రియ నిర్వహించగా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. చివరి అవకాశం కింద ఈనెల 8 వరకు గడువు పెంచింది. అయినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేందుకు ససేమిరా అంటున్నారు. రెండవ దఫాలోనైనా వస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది మత్స్యకారులు రిజర్వాయర్లు, చెరువుల్లో చేపల వేటపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్నారు. ప్రతీ సంవత్సరం విత్తనం వేయకపోతే రాబోయే రెండు మూడు సంవత్సరాలకు కూడా చేపల ఉత్పత్తి దెబ్బతింటుంది. ఇది కేవలం ఈ ఏడాది ఆదాయం మాత్రమే కాదు, భవిష్యత్‌లోనూ మత్స్యకారుల ఆర్థిక స్థితిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కాంట్రాక్టర్ల ప్రధాన డిమాండ్ గత రెండేళ్ల బిల్లులను క్లియర్ చేసి, భవిష్యత్‌లో చెల్లింపులు ఆలస్యం కాకుండా నిబంధనలను సడలించాలనే డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సర్కారు వద్ద ఆర్థిక భారం పెరిగి పోతుండడంతో బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుంది. దీంతో చాలా చోట్ల మత్స్య కార్మికులు సొంత డబ్బులతో చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులు, రిజర్వాయర్లలో వేసుకునే దయనీయ పరిస్థితి నెలకొంది. ముందుకురాని కాంట్రాక్టర్లు ఈ నెల 8వ తేదీ వరకు మరో అవకాశం ఆగమ్యగోచరంగా మత్స్యకారుల భవిష్యత్ ఈ ఏడాది 1.43 కోట్ల చేపపిల్లల పంపిణీకి టెండర్లు జిల్లాలో 2025–26 వార్షిక సంవత్సరంలో చేప పిల్లల పంపిణీకి టెండర్లకు ఆహ్వానించారు. 80 నుంచి 100, 35 నుంచి 40 ఎంఎం సైజులో ఉన్న 1.43 కోట్ల (కట్ల, రోగు, బంగారు తీగ) రకాల చేప పిల్లలకు సంబంధించి ఈ సారి రూ.3.19 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. జిల్లాలో 9 రిజర్వాయర్లు, 727 చెరువులు ఉన్నాయి. గత బిల్లుల పెండింగ్‌తో గుత్తేదారులు ముందుకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఈనెల 8 చివరి గడువు ముగిసేలోపు ప్రభుత్వం, గుత్తేదారుల మధ్య రాజీ కుదరకపోతే ఈ సంవత్సరం చేపల విత్తనం వేయడం కష్టసాధ్యం అవుతుంది. -
సన్నబియ్యం పంపిణీ పకడ్బందీగా జరగాలి
జనగామ రూరల్: జిల్లా సన్నబియ్యం పంపిణీ పకడ్బందీగా జరగాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. పట్టణంలోని 7, 18 రేషన్ షాప్‌లను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బియ్యం సరఫరాలో ఇబ్బందులు, నాణ్యత గురించి తెలుసుకున్నారు. కొత్తగా వచ్చిన రేషన్ కార్డుదారులు సన్న బియ్యం పొందాలన్నారు. జిల్లాలోని రేషన్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సమయపాలన పాటిస్తూ రేషన్ షాపులు సకాలంలో తెరిచి లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఎస్ఓ ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్, డీటీసీఎస్ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సైన్స్ల్యాబ్లతో సృజనాత్మకత సైన్స్ల్యాబ్లతో విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయడానికి ఉపయోగపడతాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం ఎన్ఆర్ఐలు రూ.15లక్షలతో పెంబర్తిలోని జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్‌ల్యాబ్‌ను ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే భవిష్యత్‌లో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టొచ్చన్నారు. ల్యాబ్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, జిల్లాలో పెంబర్తి జడ్పీ హైస్కూల్ ఒక మోడల్ పాఠశాలగా రూపుదిద్దుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అమెరికా ఇండియా ఫౌండేషన్ తెలంగాణ ప్రతినిధి రమేశ్, అట్లాస్ ప్రతినిధులు, ఏఎంఓ శ్రీనివాస్, ఎంఈఓ శంకర్‌రెడ్డి, హెచ్ఓం నాగరాణి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
‘చాట్‌బాట్’తో మెరుగైన సేవలు
జనగామ: వినియోగదారుల సౌకర్యార్థం ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తీసుకొచ్చే క్రమంలో తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎన్పీడీసీఎల్) వినూత్న ప్రయత్నం చేసింది. ఇకపై వినియోగదారులు తమ విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు, సేవలను ‘వాట్సాప్ చాట్‌బాట్’ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. వినియోగదారుడు తన స్మార్ట్ ఫోన్ వాట్సాప్‌లో 7901628348 నంబర్‌కు ‘హాయ్’ అని పంపించిన వెంటనే వెల్ కం టు టీజీఎన్పీడీసీఎల్ కాల్‌సెంటర్ అని సందేశం వస్తుంది. దీంతో పాటు కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే చాట్ విత్ ఏజెంట్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. ఫిర్యాదు నమోదు ఇలా.. వినియోగదారు ‘వాట్సాప్ చాట్‌బాట్’ లో యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే సర్వీస్ వివరాలు ప్రదర్శించబడతాయి. ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు నిర్ధారించిన తర్వాత సమస్యకు సంబంధించిన విభాగాల మెనూ కనిపిస్తుంది. ఇందులో సమస్యను ఎంపిక చేసుకుని ఫిర్యాదు నమోదు చేసుకోవాలి. అందులో నేరుగా చాట్ చేసుకునే అవకాశం కల్పించారు. ఫిర్యాదు నమోదైన వెంటనే ప్రత్యేక కంప్లైంట్ ఐడీ ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. వినియోగదారులు తమ ఫిర్యాదు ఐడీ ద్వారా సమస్య పరిష్కారం ఎక్కడి వరకు వచ్చిందనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సమస్య పరిష్కారం జరిగిన వెంటనే సదరు వినియోగదారుడికి ఐవీఆర్ఎస్ కాల్ కూడా వస్తుంది. ఇందులో సేవలు ఎలా ఉన్నాయనే దానిపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. వినియోగదారుడు సంతృప్తి చెందక పోతే ఫిర్యాదును తిరిగి రీఓపెన్ చేసుకునే అవకాశం కల్పించారు. అదనపు సదుపాయాలు టీజీఎన్పీడీసీఎల్ అధికారిక వెబ్సైట్ టీజీ ఎన్పీడీసీఎల్.కామ్‌లో వాట్సాప్ ఐకాన్ సేవలను సైతం అందుబాటులో ఉంచారు. అంతే కాకుండా ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1912కు కూడా కాల్ చేయవచ్చు. విద్యుత్‌శాఖలో వాట్సాప్ సేవలు ఇకపై ఇందులోనే ఫిర్యాదులు, పరిష్కారం చూసుకునే అవకాశం 7901628348 నంబర్‌కు ‘హాయ్’ అని పంపితే చాలు.. -
చిల్పూరు హుండీ ఆదాయం రూ.10.67లక్షలు
చిల్పూరు: చిల్పూరుగుట్ట శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఉదయం అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ అష్టదళ పాదపద్మారాధన పూజ అనంతరం దేవాదాయశాఖ పరిశీలకులు చిందం వంశీ ఆధ్వర్యంలో ఆలయ ఈవో లక్ష్మీప్రసన్న, చైర్మన పొట్లపల్లి శ్రీధర్‌రావు, ధర్మకర్తలు గనగోని రమేశ్, పుల్యాల నారాయణరెడ్డి, రత్నాకర్‌రెడ్డి, గోళి రాజశేఖర్ సమక్షంలో హుండీల లెక్కింపులో స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన వాసవీ వనిత క్లబ్ వారు పాల్గొన్నారు. హుండీల ఆదాయం రూ.10,67,650లతో పాటు ఖతర్ దేశానికి చెందిన 10 రియాల్స్ ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. -
మహిళాశక్తి మరింతగా!
● మహిళా సంఘాల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి ● వృద్ధులు, దివ్యాంగులు,కిశోర బాలికలతో గ్రూపుల ఏర్పాటు ● బ్యాంక్ నుంచి లింకేజీ రుణాలు ఇచ్చేలా చర్యలు ● యాక్షన్ ప్లాన్ తయారుచేస్తున్న అధికారులు ● జిల్లావ్యాప్తంగా 1,29,179 మంది సభ్యులుజనగామ రూరల్: మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. మహిళా సంఘాలను బలోపేతం చేసి ఆర్థిక సాధికారత సాధించాలన్న లక్ష్యంతో ఇందిర మహిళాశక్తి పథకాన్ని తీసుకొచ్చారు. ఈనేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు, కిశోర బాలికలకు కొత్తగా మహిళ సంఘ గ్రూపులు ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ బ్యాంక్ రుణాలు అందించేలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లోని వృద్ధులు, బాలికలు, దివ్యాంగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసినప్పుడు 60 ఏళ్లు దాటితే వారిని గ్రూపులోంచి తొలగించారు. ప్రస్తుతం ఉన్నవారిని అలాగే ఉంచాలని, లేకుంటే వారికి ఒక ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. వృద్ధులు, దివ్యాంగుల ఆనందం.. గతంలో 60 ఏళ్లు దాటాయంటే మహిళలను గ్రూపు నుంచి తొలగించారు. దీంతో వారు పొదుపు చేసుకునే అవకాశం కోల్పోయారు. ప్రభుత్వం అందించే పథకాలు వర్తించేవి కాదు. వృద్ధులు కావడంతో వారికి బ్యాంక్ రుణాలు ఇవ్వలేమని అప్పుడు తిరస్కరించేవారు. తాజాగా ప్రభుత్వం కచ్చితంగా వృద్ధులకు గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు అందించాలని ఆదేశించడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ మహిళాసంఘాల ఆధ్వర్యంలో కొత్తగా ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. వీరితోపాటు 15 నుంచి 18 ఏళ్ల వయస్సున్న బాలికలతో కూడా సంఘాలను ఏర్పాటు చేసి వారికీ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. వీరితోపాటు, సామాజిక మాధ్యమాల మోసాలు, అత్యాచారాలు, ఇతరత్రా అంశాలపై వారికి చైతన్యం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక గ్రామంలో 12 మంది ఉంటే వారికి ఒక గ్రూపు ఏర్పాటు చేయనున్నారు. లేకుంటే వేరే సంఘాల్లో ఉంటారు. వీరందరికీ బ్యాంక్ రుణాలు అందించి వారిని ఆర్థిక సాధికారత సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణతో రుణాల అందజేత ఈనెల 12 నుంచి 14వరకు గ్రామాల వారీగా జాబితా రూపొందించి మహిళా సంఘాల్లో లేని మహిళలు, దివ్యాంగులు, బాలికలను గుర్తిస్తారు. 14 నుంచి 15 వరకు వారికి సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనం గురించి వివరించనున్నారు. బ్యాంక్ రుణాలు అందుతాయని చెప్పి వారిని గ్రూపులో చేర్పించేలా చూస్తారు. 15 నుంచి 30 వరకు సంఘాల్లో చేరిన సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి బ్యాంకుల్లో ఖాతాలను ఓపెన్ చేసి రుణాలు అందిస్తారు. వీరికి సంబంధించిన వివరాలన్నింటినీ సెర్చ్ వెబ్సైట్లో నమోదు చేస్తారు. బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి రుణాలు సైతం మంజూరు చేయనున్నారు. రీవాల్వింగ్ ఫండ్‌ను ఖాతాల్లో జమచేస్తారు.మండలం గ్రూపులు మొత్తం సభ్యులు బచ్చన్నపేట 1048 12,182 చిల్పూర్ 906 10,019 దేవరుప్పుల 1030 11,852 ఘన్పూర్(స్టే) 1128 13,067 జనగామ 981 11,402 కొడకండ్ల 694 8,563 లి.ఘణపురం 984 10,943 నర్మెట 566 6,602 పాలకుర్తి 1306 14,335 రఘునాథపల్లి 1275 14,588 తరిగొప్పుల 480 5,539 జఫర్ఘడ్ 857 9,887 మొత్తం 11,255 1,29,179మహిళా సాధికారతే లక్ష్యం మహిళలు సాధికారత సాధించాలన్న ఉద్దేశంతో కొత్తగా మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో నూతనంగా వృద్ధులు, దివ్యాంగులకు, బాలికలతో గ్రూపులు ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నాం. వీరికి బ్యాంకు నుంచి లింకేజీ రుణాలు అందిస్తాం. – వసంత, డీఆర్డీఓ, జనగామ -
సర్కార్ దవాఖానాల్లో మెరుగైన వైద్యసేవలు
● రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ● జిల్లా జనరల్ ఆస్పత్రిలో ిసీటీస్కాన్ సేవలు ప్రారంభంజనగామ: రాష్ట్రంలో సర్కారు దవాఖానాల్లో నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సాక్షిలో వరుస కథనాలతో జిల్లా ఆస్పత్రిలో ిసీటీస్కాన్ యంత్రం వచ్చిన సంగతి తెలిసిందే. జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ సేవలను మంగళవారం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్షాలోమ్, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డి, డీఎంహెచ్ఓ మల్లికార్జున్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజలింగం, మెడికల్ కళా శాల ప్రిన్సిపాల్ నాగమణితో కలిసి మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. సీటీ స్కాన్ సేవలను ప్రారంభించిన అనంతరం మంత్రి జనరల్, డయాలసిస్ వార్డులతో పాటు అన్ని విభాగాలను సందర్శించారు. ఆసుపత్రి సేవలపై పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెడికల్ కళాశాల, నర్సింగ్ కాలేజ్ నిర్మాణ పనులతో పాటు సీజనల్ వ్యాధు ల కట్టడి, తదితర వాటిపై ఆరా తీశారు. పీహెచ్సీ, సీహెచ్‌సీ, సీఎంఎస్‌ల పనితీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కళాశాల విద్యార్థుల కోసం నిర్మిస్తున్న హాస్టల్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. సమస్యలు పరిష్కరించాలి.. తమ సమస్యలను పరిష్కరించాలని ఆశ వర్కర్లు మంత్రికి వినతి పత్రం అందించారు. గానుగుపహాడ్ బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతూ యాసారపు కర్ణాకర్, సందీప్ తదితరులు కోరారు. పెండింగ్ స్కాలర్షిప్స్ వెంటనే రిలీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు మంత్రికి విన్నవించారు. ఎన్హెచ్ఎం కాంట్రాక్టు సిబ్బంది పెండింగ్ వేతనాలు అందించాలని మొరపెట్టుకున్నారు. సత్కారం.. మంత్రి రాజనర్సింహను ఎమ్మెల్యే పల్లా, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ గోపాల్‌రావు, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్, డీసీపీ రాజమహేంద్రనాయక్, వంగాల మల్లారెడ్డి, నర్సిరెడ్డి, జంగి విద్యానాథ్, నర్సింహరెడ్డి తదితరులు ఉన్నారు. -
ఈవీఎంలను పరిశీలించిన కలెక్టర్
జనగామ రూరల్: సాధారణ తనిఖీలో భాగంగా మంగళవారం కలెక్టరేట్లో ఉన్న ఈవీఎం గోదాంను షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ బెన్షలోమ్ సందర్శించారు. ఈ సందర్భంగా భద్రతా పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, అగ్ని నియంత్రణ సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బి.భాస్కర్, బీఆర్ఎస్ నాయకుడు ఆర్.రవి, బీజేపీనుంచి ఎ.విజయభాస్కర్, టీడీపీకి చెందిన అజయ్, బీఎస్పీ చంద్రశేఖర్, ఆర్డీఓ గోపిరామ్, ఎన్నికల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక అక్షరాస్యత అందించాలి.. ఉపాధ్యాయులు సాంకేతిక అక్షరాస్యతను విద్యార్థులకు అందించడానికి కృషి చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం డిజిటల్ అక్షరాస్యత బోధనను ప్రారంభించిన నేపథ్యంలో గణితం, ఫిజికల్ సైన్స్ టీచర్లకు సీజేఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో డిజిటల్ కంటెంట్‌పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో శిక్షణ సమన్వయకర్త ఏఎంఓ శ్రీనివాస్, డీఎస్ఓ ఉపేందర్, డీఆర్పీలు శ్రీకాంత్, కృష్ణవేణి, కృష్ణయ్య, మాధవరావు పాల్గొన్నారు. -
ఆరు గ్యారంటీలు అమలు చేయాలి
● కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జనగామ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని, అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలపై విచారణ చేపట్టి అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. వరికి రూ.500 బోనస్ అని బోగస్ చేశారని, తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు. వర్షాలు, వరదల నష్టాలపై అసెంబ్లీలో మాట్లాడలేదని.. రాజకీయ పబ్బం కోసమే అర్ధరాత్రి వరకు నిర్వహించారని విమర్శించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో మహిళా కానిస్టేబుల్ చేతికి స్వల్పగాయమైంది. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు వినతిపత్రం అందజేశారు. మాజీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీఎల్ఎన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శివరాజ్‌యాదవ్, దుబ్బ రాజశేఖర్, పార్లమెంట్ కో కన్వీనర్ కొంతం శ్రీనివాస్, ఉడుగుల రమేశ్, లేగ రామ్మోహన్‌రెడ్డి, అంజిరెడ్డి, ఉమారాణి, పట్టణ అధ్యక్షుడు అనిల్ పాల్గొన్నారు. -
బనకచర్లను బాబుకు కట్టబెట్టేందుకే!
జనగామ: బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి బాబుకు కట్టబెట్టేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయనే బూటకపు మాటలతో సీఎం రేవంత్‌రెడ్డి సీబీఐని తెరపైకి తీసుకొచ్చాడని ఏఎంసీ మాజీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మాజీ ఎంపీపీ మేకల కలింగరాజు ఆరోపించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్‌రెడ్డి అధ్యక్షతన కాళేశ్వరంపై సీబీఐని వ్యతిరేకిస్తూ, రైతులకు యూరియా అందించాలని కోరుతూ సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బైక్ ర్యాలీగా ఆర్టీసీ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. వరంగల్–హైదరాబాద్ ప్రధాన హైవే జంక్షన్లో బైఠాయించి రాస్తారోకో చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు శ్రేణులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అంతకుముందు యూరియా కోసం రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. దేశంలో సీబీఐపై రాహుల్‌గాంధీ మండిపడుతుంటే, ఇక్కడ మాత్రం రేవంత్‌కు ప్రేమ పెరిగిందన్నారు. రేవంత్, చంద్రబాబు, ప్రధాని మోదీ కుట్రలను ప్రజలు ఖండించి, గోదావరి జలాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణ సమాజం భగ్గుమంటుందన్నారు. కార్యక్రమంలో నాయకులు పోకల జమునలింగయ్య, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ముస్త్యాల దయాకర్, గుర్రం భూలక్ష్మినాగరాజు, ఉల్లెంగుల సందీప్, జూకంటి లక్ష్మిశ్రీశైలం, సేవెల్లి మధు, ఉడుగుల కిష్టయ్య, అనిత, శారత, రేఖ, ఉడుగులు నర్సింహులు, మామిడాల రాజు, సువార్త, రాజు, జాయ శ్రీశైలం, యాకూబ్ తదితరులు ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బూటకపు మాటలతో సీబీఐ తెరపైకి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాస్తారోకో, ర్యాలీ సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం -
పరిష్కారానికి ఇంకెన్నాళ్లు?
జనగామ రూరల్: తమకు అన్యాయం జరిగినా నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం లేదని ఓ బాధితురాలు..కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉందని అంత్యోదయ కార్డు ఇచ్చి ఆదుకోవాలని ఓ పేదమహిళ.. రెండో విడత ఇందిరమ్మ బిల్లు రావడం లేదని ఓ లబ్ధిదారు, ఆరు నెలల నుంచి వేతనాలు లేక అవస్థలు పడుతున్నామని ఓ చిరుద్యోగి..ఇలా పలు సమస్యలతో సోమవారం ప్రజలు గ్రీవెన్స్‌సెల్‌కు తరలివచ్చారు. ఈసందర్భంగా ప్రజల నుంచి 69 వినతులను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్షాలోమ్, జిల్లా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు, భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. దూరప్రాంతాల నుంచి ఖర్చులు పెట్టుకుని ఏళ్లతరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు వాపోయారు. గ్రీవెన్స్‌లో వచ్చిన ప్రతి దరఖాస్తును ఆయా శాఖల అధికారులు నిషితంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు గోపిరామ్, డీఎస్ వెంకన్న, డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులు కొన్ని ఇలా.. ● నర్మెట మండల కేంద్రానికి చెందిన దేవర ధ్రువిత్రెడ్డి తన దరఖాస్తు అందిస్తూ తన తల్లి చనిపోయిందని, తండ్రి పట్టించుకోవడం లేదని తనకు చదువుకునేందుకు సోషల్ వెల్ఫేర్ గురుకులం లో సీటు ఇప్పించగలరని వినతిపత్రం అందజేశాడు. ● రఘునాథపల్లి మండలం కన్నాయిపల్లి గ్రామానికి చెందిన యాదగిరి కుమార్తె జస్విక.. తాను ఆత్మకూరు సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నానని పాలకుర్తిలో గాని, నర్మెటలో గాని గురుకులంలో సీటు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ● జనగామ పట్టణానికి చెందిన సంఘ వెంకటేశ్ తన దరఖాస్తు అందిస్తూ తన ఇంటి చుట్టూ నీరు నిలుస్తున్నందున ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సమస్యను పరిష్కరించాల్సిందిగా దరఖాస్తు అందించారు. ● తరిగొప్పుల మండలంలోని అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన పుష్ప..తన భర్త కృష్ణయ్య మరణించాడని నలుగురు కుమార్తెలతో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నానని, కూలి పనులపై ఆధారపడి జీవిస్తున్నందున తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. నిందితులపై కేసుపెట్టడం లేదు గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు 2019లో తనను అకారణంగా కొట్టి కులం పేరుతో దూషించారు. అప్పటినుంచి న్యాయం జరగాలని, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని పోలీసులను కోరినా పట్టించుకోవడం లేదు. తనకు తల్లిదండ్రులు, తోబుట్టువు ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్లిన న్యాయం జరగడం లేదు. – కోసంగి ఉపేంద్ర, రామరాజుపల్లి, దేవరుప్పుల మండలం రెండో విడత బిల్లుకు ఇబ్బందులు ఇందిరమ్మ ఇల్లు పనులు ప్రారంభించినప్పుడు మొదటి విడత బిల్లు వచ్చింది. అయితే సజ్జల లెవల్‌కు రాగా రెండో విడత బిల్లుకు ఫొటో అప్లోడ్ కావడం లేదని అధికారులను అడగగా ఉప్పల్‌లో ఇల్లు ఉందని అందుకే బిల్లు రావడం లేదని అంటున్నారు. తమకు ఎక్కడ ఇల్లు లేదని హైదరాబాద్‌కు, కలెక్టరేట్‌కు అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ఇల్లు లే కున్నా ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తోందని, విచారణ చేపట్టి తమకు ఇందిరమ్మ బిల్లు వచ్చేలా చూడాలి. –కోసున రాంచంద్రరెడ్డి, గోపాలపురం, పాలకుర్తి మండలం ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి గ్రామంలో ఎలాంటి ఆస్తులు లేవు. ఇద్దరు పిల్లల భవిష్యత్ కోసం హైదరాబాద్‌లో కూలీ పనులు చే సుకుంటు బతుకుతున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినా ఇంతవరకు అనుమతి పత్రాలు ఇవ్వడం లేదు. – మిద్దేపాక సునీత, పసరమడ్ల, జనగామ మండలం ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు గ్రీవెన్స్‌లో దరఖాస్తులు చేస్తున్నా పట్టింపులేదు.. ప్రజావాణిలో బాధితుల గోడు వినతులను సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్పట్టా కావడం లేదు గ్రామంలో సర్వే నెంబర్ 191లో ఎకరం 36 గుంటల భూమి నా పేరిట ఉంది. గత ప్రభుత్వంలో పట్టాపాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నా. అధికారులు ఇప్పటివరకు పట్టా పాస్ బుక్ ఇవ్వడం లేదు. భూభారతిలో దరఖాస్తు చేసుకున్న ఎలాంటి సమాధానం లేదు. సర్వే చేపట్టి పట్టా పాస్ బుక్ మంజూరు చేయాలి. –బొట్ల బాబు, యశ్వంతాపూర్, జనగామ మండలం అంత్యోదయ కార్డు ఇచ్చి ఆదుకోవాలి నాపేరు ఖమ్మం శ్రీకాంత్. మాది స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామం. పుట్టుకతోనే నాకు కళ్లు కనబడవు. వివాహమై 5 ఏళ్లు అవుతోంది. పింఛన్‌తో, భార్య కూలీ పనులతో కాలం వెల్లదీస్తున్నాం. తల్లిదండ్రుల రేషన్‌కార్డులో పేరు ఉంది. దివ్యాంగుడి కోటా కింద నాకు అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని, 5 ఏళ్ల నుంచి తిరుగుతున్నా. నాకు కొత్త కార్డు మంజూరు చేయండి.ఆరు నెలలుగా వేతనాలు లేవు తెలంగాణ మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు, పీడీ, కంప్యూటర్ ఆపరేటర్స్, నైట్ వాచ్మెన్, అటెండర్లకు ఆరు నెలలుగా జీతాలు రావడం లేదు. దీంతో జీవనోపాధి కష్టంగా మారింది. ప్రభుత్వం వెంటనే మాకు రావాల్సిన వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలి. -
సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే..
● మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చాలి ● టీఎన్జీవో, జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్జనగామ: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని టీఎన్జీవో, జేఏసీ అధ్యక్షుడు ఖాజా షరీఫ్ డిమాండ్ చేశారు. సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరట్ ఆవరణలో రెండు గంటల పాటు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఖాజా షరీఫ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పాత పెన్షన్ విధానం(ఓపీఎస్) పునరుద్ధరించేందుకు మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఒక్కసారి ఎన్నికై న ఎమ్మెల్యేలు, ఎంపీలకు జీవితాంతం పెన్షన్ లభిస్తోందని, 35 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ ఇవ్వకపోవడం ఎంత అన్యాయమో ఆలోచించాలన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కొర్నేలియస్, పి.చంద్రశేఖర్‌రావు, షరీఫ్, లక్ష్మీనారాయణ, పెండెల శ్రీనివాస్, పేర్వారం ప్రభాకర్, హఫీజ్, రాజనర్సయ్య, సంపత్ కుమార్, రాంనరసయ్య, మడూరి వెంకటేశ్, ఉప్పలయ్య, స్టెల్లా, శ్రీధర్‌బాబు, నాగార్జున, విష్ణు, అరుణ, బాబు, మధు శంకర్, రాజు, చందర్, రమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వరద నష్టనివారణ చర్యలు చేపట్టాలి
● వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం జనగామ రూరల్: వరద నష్టనివారణ చర్యలు చేపట్టాలని, శాఖల పరంగా పనులు గుర్తించి నివేదికలు రూపొందించుకోవాలని, పనులు, కావాల్సిన నిధులను తెలియజేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధనసరి అనసూయ(సీతక్క) తదితర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో భారీ వర్షాలతో జరిగిన నష్టం, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు కలెక్టర్లు బెన్షా లోమ్, పింకేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..జిల్లాలో భారీ వర్షాల వల్ల కలిగిన నష్టంపై అంచనాలు రూపొందించి తక్షణమే నివేదికలు అందజేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, జిల్లా అధికారులు, నీటిపారుదల, ఇంజనీరింగ్, వైద్య, విద్యుత్, వ్యవసాయ, ఉద్యాన వన, పంచాయతీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సర్వేయర్లకు ధ్రువీకరణ పత్రాల పంపిణీ జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా శిక్షణ పూర్తిచేసుకున్న 48 మంది సర్వేయర్లకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సర్వేయర్‌గా శిక్షణ పొంది అర్హత సాధించిన సర్వేయర్లకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పనిచేసి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఏఓ శ్రీకాంత్, సర్వే శాఖ ఏడీ మన్యం కొండ పాల్గొన్నారు. -
హామీ నిలబెట్టుకున్నాం..
జనగామ: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజిర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీని నిలబెట్టుకుని, తన చిత్త శుద్ధిని నిరూపించుకుంటోందని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో టీపీసీసీ అధికార ప్రతినిధులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పీవీ శ్రీనివాస్‌తో కలిసి సోమవారం కొమ్మూరి విలేకరులతో మాట్లాడారు.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, గవర్నర్‌కు పంపడం జరిగిందన్నారు. బీసీలకు ఘోరమైన అవమానం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి నిగ్గుతేల్చేందుకు సీబీఐకి అప్పగించడం స్వాగతిస్తున్నామన్నారు. సమావేశంలో లింగాల నర్సిరెడ్డి, వంగాల మల్లారెడ్డి, ఆలేటి సిద్ధిరాములు, చెంచారపు బుచ్చిరెడ్డి, వంగాల కళ్యాణి, ఇందిర, కరుణాకర్‌రెడ్డి, గాదెపాక రాంచందర్, అల్వాల ఎల్లయ్య, మల్లేశం, బక్క శ్రీని వాస్ తదితరులు పాల్గొన్నారు.అన్ని వర్గాలకు అండగా జీవిత బీమాజనగామ: అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా అండగా జీవిత బీమా సేవలు కొనసాగుతున్నాయని జీవిత బీమా(ఎల్ఐసీ) బ్రాంచి సీనియర్ మేనేజర్ హరిలాల్ అన్నారు. సోమవారం పట్టణంలో భారతీయ జీవిత బీమా సంస్థ జనగామ శాఖ ఆధ్వర్యంలో 69 ఆవిర్భావ దినోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారు..30 కోట్ల మంది పాలసీదారులను కలిగి అత్యుత్తమమైన సేవలతో జీవిత బీమా సంస్థ అగ్రగామిగా ఉందన్నారు. జనగామ శాఖ పరిధిలో స్టేషన్ ఘన్‌పూర్‌లో శాటిలైట్ ఆఫీస్ ఉందని, త్వరలో పాలకుర్తిలో మైక్రో లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి సిఫార్సు చేశామన్నారు. కార్యక్రమంలో జనగామ ఐడీబీఐ బ్రాంచ్ మేనేజర్ రాజేశ్, బ్యాంక్ మేనేజర్లు, అధికారులు, ఏజెంట్లు పాల్గొన్నారు.రాష్ట్రస్థాయి కళా ఉత్సవం పోటీలకు ఎంపికజనగామ రూరల్: రాష్ట్రస్థాయి కళా ఉత్సవ పోటీలకు తెలంగాణ మోడల్ స్కూల్ చౌడారం విద్యార్థిని నాంపల్లి అక్షయ ఎంపికై ందని పాఠశాల ప్రిన్సిపాల్ కె.సుధీర్‌రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలో జరిగిన జిల్లాస్థాయి కళాఉత్సవ పోటీల్లో సోలో క్లాసికల్ డ్యాన్స్‌లో పదో తరగతి విద్యార్థిని అక్షయ ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈసందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెను అభినందించారు.భాగవతాన్ని అధ్యయనం చేయాలి● సాహితీవేత్త శంకరమంచి శ్యాంప్రసాద్పాలకుర్తి టౌన్: విద్యార్థులు సాంకేతికంగానే కాకుండా సామాజిక విలువల్ని పెంపొందించుకోవటానికి భాగవత పద్యాలను నేర్చుకోవాలని సాహితీవేత్త శంకరమంచి శ్యాం ప్రసాద్ సూచించారు. సోమవారం మండలంలోని బమ్మెర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం రామ్మోహన్రావు అధ్యక్షతన జరిగిన సదస్సులో శంకరమంచి మాట్లాడుతూ.. భక్తితో పాటు సామాజిక విలువల్ని మానవీయ మూలాలను ప్రబోధించిన పోతన భాగవతాన్ని విద్యార్థుల అధ్యయనం చేయాలన్నారు. పోతన పద్యాలను నేర్చుకున్న విద్యార్థులకు పురస్కారాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో చరిత్ర పరిశోధకులు కేవీజీకే ఆచార్యులు శంకరమంచి శ్రీకాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలకు భంగం కలగొద్దు
రఘునాథపల్లి: శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, కేసుల వేగవంతమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా ఆదివారం రఘునాథపల్లి సీఐ సర్కిల్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. కేసులకు సంబంధించిన వివరాలు, ఇతరత్రా రికార్డులు పరిశీలించారు. సర్కిల్ పరిధిలోని మూడు మండలాల్లో శాంతిభద్రతలు, పెండింగ్ కేసులపై ఏసీపీ, సీఐ, ఎస్సైలతో డీసీపీ సమీక్షించారు. వినాయక చవితి ఉత్సవాలతో పాటు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నందున క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, సమస్యాత్మక ప్రాంతాల సమాచారం అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీంశర్మ, జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, సర్కిల్ పరిధి ఎస్సైలు దూదిమెట్ల నరేశ్, శ్రవణ్‌కుమార్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ -
ప్రతీ గ్రామానికి సాగునీరు అందించాలి
చిల్పూరు: సాగునీటి వసతులు లేని ప్రతీ గ్రామానికి మల్లన్నగండి దేవాదుల రిజర్వాయర్ ద్వారా అందించాలనే డిమాండ్‌తో తాను ఒక రోజు పాదయాత్ర చేపట్టినట్టు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చెప్పారు. ఆదివారం ఉదయం వేలేరులో చేపట్టిన పాదయాత్ర మధ్యాహ్నం చిల్పూరు మండలం కొమ్ముగుట్టకు చేరుకోగానే సాగునీటి వసతులు లేని కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి గ్రామాల కు చెందిన రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు రాజయ్యకు ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర ద్వారా లింగంపల్లి సమ్మక్క–సారలమ్మ జాతర జరిగే గద్దెల వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలనే డిమాండ్‌తో చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎడవెళ్లి కృష్ణారెడ్డి, జనగామ యాదగిరి, మాలోతు రమేశ్‌నాయక్, కంకటి రవి, వెన్నం మాధవరెడ్డి, రంగు హరీశ్, బత్తుల రాజన్‌బాబు, లొడెం రవీందర్, గాలి ప్రవీణ, డాక్టర్ గూళ్ల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాల్లో హేమాచలగుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించిన పూజారులు స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేసి వేద మంత్రోచ్ఛరణతో ఆశీర్వచనం ఇచ్చారు. -
నేటినుంచే రాగిజావ
జనగామ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 1 (సోమవారం) నుంచి రాగి జావ పథకం ప్రారంభం కానుంది. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10 తరగతుల విద్యార్థుల పోషకాహారాన్ని (ప్రధానమంత్రి పోషణ్) మరింత బలోపేతం చేయడానికి పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో రాగిజావ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్యాక్ చేసిన రాగి, బెల్లం పొడి ప్యాకెట్లను మండల స్థాయికి పంపిస్తారు. అక్కడి నుంచి ఎంఈ వోల పర్యవేక్షణలో పాఠశాలలకు రవాణా చేస్తారు. ఇందుకు సంబంధించి మధ్యాహ్న భోజనం వడ్డించే కుక్, హెల్పర్లకు రాగిజావ వడ్డించినందుకు గాను ఒక్కో విద్యార్థికి 25 పైసల చొప్పున చెల్లించనున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్న త, ప్రభుత్వ పాఠశాలలు 545 ఉండగా, సుమారు 31వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.రాగిజావ ఇలా..ప్రతీ విద్యార్థికి రోజుకు 10 గ్రాముల రాగిపిండి, 10 గ్రాముల బెల్లం పొడి కలిపి అందిస్తారు. మధ్యాహ్న భోజనంలో గుడ్లు ఇవ్వని రోజు వారానికి మూడుసార్లు రాగి జావ వడ్డించాలి. రాగి జావ తయారీ కోసం సురక్షితమైన తాగునీటిని మాత్రమే ఉపయోగించాలి. స్వచ్ఛతతో కూడిన కిచెన్న్ షెడ్‌తో పాటు గాలి, వెలుతురు సమపాళ్లలో ఉండేలా హెచ్ఎంలు చూసుకోవాలి. వంట తయారుచేసే గ్రూపులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు తలకు కవర్, మాస్క్ ధరించి, చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి. పాత్రలు, వంటగది, భోజనశాలను ప్రతి రోజు శుభ్రం చేయాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. రాగిజావ పంపిణీ చేసే సమయంలో ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేస్తూ ప్రతి పిల్లవాడికి సమానంగా వడ్డించేలా చూడాలి. రాగి జావ తయారుచేసేందుకు అవసరమైన ఇంధన ఖర్చుల కోసం ప్రతీ విద్యార్థికి రోజుకు 25 పైసల చొప్పున ప్రభుత్వం వారికి చెల్లించనుంది. ప్రతీనెల రాగిజావ కోసం పాఠశాల వారీగా నివేదికలను ఎంఈవోలు అందించాల్సి ఉంటుంది. రాగి జావతో విద్యార్థుల ఆరోగ్యం, పోషణ మెరుగుపడడంతో పాటు మధ్యాహ్న భోజన పథకం మరింత సమర్థవంతంగా అమలవుతుందని విద్యాశాఖ ముఖ్య ఉద్దేశ్యం.పిల్లలకు పోషకాహారం అందించడమే లక్ష్యంజిల్లాలో 545 ప్రభుత్వ బడుల్లో అమలురాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ రిజ్వాన్ బాషా పర్యవేక్షణలో సర్కారు బడుల్లో నేటి నుంచి వారానికి మూడు రోజుల పాటు విద్యార్థులకు రాగి జావ అందించనున్నాం. ప్రభుత్వం రాగి, బెల్లం పొడి ప్యాకెట్లను పంపిస్తుండగా, ఎంఈవోల ద్వారా పాఠశాలలకు వాటిని సప్లయ్ చేస్తాం. ఈ పథకం విజయవంతంగా అమలు చేసేందుకు నిత్యం పర్యవేక్షిస్తాం.– బొమ్మనబోయిన శ్రీనివాస్, ఏఎంఓసర్కారు బడులకు వచ్చే విద్యార్థులకు ప్రభుత్వ రా గిజావ అందించడం మంచి నిర్ణయం. రాగిజావతో పిల్లల ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగు పడడమే కాకుండా దృఢంగా తయారవుతారు. దీంతో చదువుతో పాటు ఆటల్లో మరింత రాణిస్తారు.– రావుల రామ్మోహన్‌రెడ్డి,ప్రభుత్వ ఉపాధ్యాయుడు -
ఓపీఎస్ సమరయాత్ర!
● పెన్షన్ స్కీం కొత్త విధానంలో ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యూటీ, పెన్షన్ కమ్యూనికేషన్, హెల్త్‌కార్డులు ఉండవు. ● సీపీఎస్ షేర్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. దీంతో ఎంత పెన్షన్ వస్తుందో తెలియదు. అందుకే దీనిని అన్ డిపెండెడ్ పెన్షన్ స్కీం అంటారు. షేర్ మార్కెట్లో నష్టాలు వస్తే ఇబ్బందులు తప్పవు. ● కొత్త పెన్షన్ విధానం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎఫ్, ఆర్డీఏ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసే అస్కారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.జనగామ: ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ఆర్థిక విధానాలకు అనుగుణంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం (ఎన్డీఏ) కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. 2004 తర్వాత నియమితులైన ఉపాధ్యాయ, ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ విధానాన్ని అమలుచేస్తూ కొత్త జీవోలను తీసుకొచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ని సమర్థిస్తూ అమల్లోకి తెచ్చింది. సదరు సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) అమలుచేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం(నేడు) కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేయనున్నారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగే మహాసభకు బయలుదేరుతారు. 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నియమించబడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ సీపీఎస్ పరిధిలోకి తీసుకొస్తూ 653, 654, 655 జీవోలను విడుదల చేసింది. సీపీఎస్ నూతన పెన్షన్ విధానం అమలులోకి రావడంతో ఉద్యోగి వేతనం బేసీక్ పే నుంచి 10శాతం తీసుకుని మ్యాచింగ్ గ్రాంట్‌గా ప్రభుత్వం మరో 10శాతం కలిపి మొత్తాన్ని షేర్ మార్కెట్లో పెడుతుంది. సీపీఎస్ ఉద్యోగి పదవీ విరమణ పొందిన తర్వాత 60శాతం నగదు చేతికి అందించి, రూ.పది లక్షలు దాటితే దానిపై 30శాతం పన్ను విధించేలా జీవోలను సవరించింది. మిగిలిన 40శాతం నగదును షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి దానిపై వచ్చే వడ్డీని ప్రతీ నెల పెన్షన్‌గా అందించేందుకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా వచ్చే పెన్షన్ చాలా తక్కువగా ఉండడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పాత పెన్షన్ విధానంలో ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యూటీ, పెన్షన్ కమ్యూనికేషన్, హెల్త్ స్కీంలు కూడా అమలులో ఉండడంతో రిటైర్ అయిన ఉద్యోగికి కచ్చితంగా భరోసా ఉండేది. నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో సీపీఎస్ ఉద్యోగులు ఏటా సెప్టెంబర్ 1వ తేదీని నిరసన దినోత్సవంగా పాటిస్తూ, తమ హక్కుల సాధన కోసం గళమెత్తనున్నారు. సీపీఎస్ అమలైన తర్వాత.. సీపీఎస్ విధానం అమలైన తర్వాత జిల్లాలో సుమారుగా 3వేల మంది నియమితులయ్యారు. ఉపాధ్యా య, ఉద్యోగులు ఉద్యోగ విరమణ తర్వాత సామాజిక భద్రతకు పెన్షన్‌ను ఒక్క హక్కుగా 1982లో కల్పించారు. అయితే పెన్షన్‌తో పాటు గ్రాట్యుటీని కూడా రద్దుచేయడంతో ఉద్యోగ విరమణ అనంతరం భద్రత లేకుండా పోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం ఉపాధ్యాయ, ఉద్యోగులకు శాపంగా మారింది. పాత పింఛన్ విధానం కోసం టీచర్లు, ఉద్యోగుల పోరుబాట కలెక్టరేట్ వద్ద ధర్నాలు..హైదరాబాద్‌లో మహాసభ నేడు సీపీఎస్ ఉద్యోగుల నిరసన దినోత్సవం -
పొద్దంతా క్యూలోనే..
పాలకుర్తి టౌన్: యూరియా కోసం మండల కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం గోదాం వద్ద ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రైతులు క్యూలో బారులు తీరారు. 444 బస్తాలు యూరియా రాగా వ్యవసాయ అధికారులు సమక్షంలో సొసైటీ సిబ్బంది, పోలీస్ బందోబస్తు మధ్య ఒక్క రైతుకు ఒకే బస్తా చొప్పున అందజేశారు. గంటల తరబడి క్యూలో నిలబడిన రైతులు కొందరికీ దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. నర్మెటలో.. నర్మెట: సాగుచేసిన పంటలకు సమయానికి యూ రియా వేద్దామంటే చాలినంత దొరకకపోవడంతో సొసైటీల షాపుల ముందు ఆడా, మగా తేడా లేకుండా బారులుతీరుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నిల్వ ఉందని తెలుసుకున్న రైతులు ఆదివారం ఉదయం నుంచే బారులు తీరారు. కొందరికీ దొరక్కపోవడంతో రెండు రోజులలో యూరియా అందుబాటులోకి వస్తుందని తెలుపడంతో నిరాశతో వెనుదిరిగారు. యూరియా కోసం అవే తిప్పలు ఒక్కరికీ ఒకే బస్తా.. వెనకుంటే దొరకనట్టే -
శాంతించిన గోదావరి
కన్నాయిగూడెం: మూడు రోజుల నుంచి ఉరకలేసిన గోదావరి ఉధృతి ఆదివారం కొంతమేర తగ్గి శాంతించింది. మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి ఆదివారం సాయంత్రం వరకు 8,17,183 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నటి వరకు 8,57,190 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా ఆదివారం 40 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం తగ్గి శాంతించింది. ప్రస్తుతం బ్యారేజీ 59 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 82.90 మీటర్ల నీటి మట్టం ఉంది. ఇంకా నీటిలోనే రహదారులు వాజేడు: మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద క్రమేపీ తగ్గుతూ వస్తోంది. మూడు రోజుల క్రితం ముంపునకు గురైన రహదారులు ఇంకా నీటిలోనే ఉన్నాయి. టేకులగూడెం చివరన 163 నంబర్ జాతీయ రహదారి ముంపునకు గురికావడంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు– గుమ్మడిదొడ్డి, ఏడ్జెర్లపల్లి– పూసూరు, పేరూరు–కృష్ణాపురం గ్రామాల మధ్యన రహదారులు ముంపులోనే ఉండడంతో రాకపోకలు కొనసాగడం లేదు. జాతీయ రహదారి నుంచి కోయవీరాపురం గ్రామానికి వెళ్లే రహదారి చాకలి వాగు వద్ద మునగడంతో గుట్ట పక్కన ఉన్న పాత దారి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద 8,17,183 క్యూసెక్కుల నీటి ప్రవాహం 59 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల -
కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ లింగాలఘణపురం: విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్త్ ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శనివారం మండలంలోని నెల్లుట్ల పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. పదో తరగతి, ప్రీప్రైమరీ విద్యార్థులతో మాట్లాడారు.. ప్రైమరీ విద్యార్థులతో బోర్డుపై ఉన్న పదాలను చదివించి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ప్రణాళికబద్ధంగా చదువుకోవాలని, అప్పుడే మంచి మార్కులు సాధిస్తారని పదో తరగతి విద్యార్థులకు సూచించారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందో పరిశీలించి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అనే విషయాలను తెలుసుకున్నారు. హెడ్మాస్టర్లు రవీందర్, సమ్మక్క తదితరులు ఉన్నారు. -
జాతీయ లోక్ అదాలత్‌ను
సద్వినియోగం చేసుకోవాలి ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ జనగామ రూరల్: జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా న్యాయసేవాసంస్థ ఆధ్వర్యంలో కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌పై కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ మొత్తంలో కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలన్నారు. డీసీపీ బి.రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సర్కిల్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు పెండింగ్‌లో ఉన్న రాజీపడ తగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకునేలా కక్షిదారులకు సూచనలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్, ఇ.సుచరిత, జూనియర్ సివిల్ జడ్జి శశి, ఆర్డీఓ కె.గోపిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.సుహాసిని, ఏసీపీలు ఎ.నర్సయ్య, ఆర్. భీమాశర్మ, ప్లీడర్ రామ్మోహన్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరిచంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
‘డబుల్’ ఇళ్ల పంపిణీలో వసూళ్లు ?
తరిగొప్పుల: గత ప్రభుత్వం గూడులేని నిరుపేదల ఆవాసం కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీలో కొందరు వసూళ్లకు పాల్పడినట్లు మండలవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మండలంలోని అక్కరాజుపల్లి గ్రామంలో అప్పటి ప్రభుత్వం 2020లో 30డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించింది. కాగా లబ్ధిదారులు ఎంపిక కోసం రెవెన్యూ అధికారులు పలుమార్లు గ్రామసభలు నిర్వహించారు. అయినప్పటికీ తుది జాబితా కొలిక్కిరాకపోవడంతో లబ్ధిదారుల ఎంపిక నిలిపివేశారు. ఇదిలా ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాలు లేనప్పటికీ తహసీల్దార్ సెలవులో ఉండగా శనివారం తహసీల్దార్ కార్యాలయంలో గుట్టుచప్పుడు కాకుండా రెవెన్యూ సిబ్బంది ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. కాగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ప్రొటోకాల్ పాటించకుండా స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఏంటని రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో అప్పటికే 21 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయగా 9 మందికి పంపిణీ చేయలేదు. కాగా, లబ్ధిదారుల్లో ఒక్కరైనా ఓ మహిళా లబ్ధిదారుకు ఫోన్ చేసి పట్టాలు పంపిణీ చేస్తున్న రెవెన్యూ అధికారులకు ఇవ్వాలని చెప్పి రూ.10 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ విషయమై రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆంధ్రయ్యను వివరణ కోరగా కలెక్టర్ సూచన ఆదేశాల మేరకు తహసీల్దార్ సూచన మేరకే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, ఎవరి నుంచి డబ్బులు వసూలు చేయలేదన్నారు. ఇల్లు ఇప్పించండి సారూ.. ఎప్పుడూ కూలుతుందో తెలియని పెంకుటింటిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న తనకు ఇల్లు ఇప్పించాలని అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన బొమ్మెన రేణుక అనే మహిళ శనివారం కలెక్టర్‌ను వేడుకునేందుకు వెళ్లగా పోలీసులు ఆమెను గేటు వద్ద అడ్డుకున్నారు. తన వెంట తెచ్చుకున్న సంచిని తనిఖీ చేశారు. పలుమార్లు ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకున్నానని అయినప్పటికీ తనకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త మృతి చెందాడని, కొడుకు, కూతురుతో కాలం వెళ్లదీస్తున్న తనని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాలు లేకున్నా పట్టాల పంపిణీ తహసీల్దార్ సెలవులో ఉండగా గుట్టుచప్పుడు కాకుండా.. -
ఎన్సీడీ నుంచి మినహాయించండి
జనగామ: ప్రభుత్వం ఎన్సీడీ ఆన్లైన్ ప్రోగ్రాం నుంచి ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏలను మినహాయించాలని కోరుతూ శనివారం జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావుకు వినతిపత్రం అందించారు. అనంతరం దేవేంద్ర, ఎ.శారద, ఎన్.పద్మావతి, అమృత, వసంత, సవిత, జ్యోతి, కుల్సూమ్ సుల్తాన్ మాట్లాడుతూ.. ఎన్‌సీడీకి సంబంధించి 2014లో స్టేట్ లెవల్ అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్(ఎన్సీడీ) చేసిన తర్వాత 2017, 2022 రీ స్క్రీనింగ్ సైతం చేశామన్నారు. 2022 సంవత్సరంలో సైతం చేసినట్లు స్పష్టం చేశారు. 2025లో మరో యాప్‌ను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చి గత వివరాలను నమోదు చేయాలనడం భావ్యం కాదన్నారు. ఒకే పనిని రెండు, మూడుసార్లు చేయిస్తుండడంతో తమకు అప్పగించిన వైద్యసేవలను పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నామన్నారు. ఉన్నతాధికారులు తమ సమస్యను మానవతా దృక్పథంతో ఆలోచించి విముక్తి కలిగించాలన్నారు. డీఎంహెచ్ఓకు ఏఎన్ఎం, ఎంపీహెచ్‌ఏల వినతి -
కేంద్ర ఆర్థిక పథకాలతో మహిళల స్వావలంబన
● ఆర్బీఐ జీఎం ఎంజీ సుప్రభాత్ పాలకుర్తి టౌన్: సామాజిక ఆర్థిక భద్రత పథకాలతో గ్రామీణ మహిళలు స్వావలంబన సాధించేందుకు బ్యాంకులు పనిచేస్తున్నాయని ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఎంజీ సప్రభాత్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ మండపంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో సోషల్ సెక్యూరిటీ స్కీమ్ విలేజ్ అవేర్నెస్ ప్రోగ్రాం, సంతృప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను ప్రజలకు చేరవేడయంతో పాటు కేవైసీ అప్డేట్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేంద్రన్‌తో కలిసి మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సురక్ష బీమా యోజన, జీవన్‌జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు పరిధిలో గల 33 మహిళ సంఘాలకు రూ.4కోట్ల రుణాల మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పీఎన్బీ సికింద్రాబాద్ సర్కిల్ హెడ్ సుజిత్‌కుమార్, డీఆర్డీఏ పీడీ వసంత, ఏపీడీ నూరోద్దిన్, పీఎన్బీ మేనేజర్ అడేపు రమేశ్, డీసీఎం శ్రీనివాస్, ఏపీఎం శ్రీరాములు, చంద్రశేఖర్ సీసీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
వానకొండయ్య జాతరకు సకల సౌకర్యాలు
దేవరుప్పుల: శ్రీవానకొండయ్య లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర నాటికి సకల సౌకర్యాలు కల్పించేలా పనులు వేగవంతం చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో తన నివాసంలో దేవాదాయశాఖ అధికారులతో కడవెండి శివారులోని శ్రీవానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కేటాయించిన రూ.కోటి నిధులు వినియోగంపై సమీక్ష జరిపారు. కల్యాణమండపం, అన్నదానసత్రం, భక్తులకు తాగునీటి సౌకర్యం, దీపాలంకరణ, సేద తీరేందుకు భవన సముదాయం వంటి మౌలిక వసతుల పనులు సత్వరమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. -
పెసర్ల ధర పిసరంత!
శనివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2025● జనగామ మార్కెట్లో ఒక్కసారిగా పతనం ● మూడు రోజుల వ్యవధిలో మూడు వేలకుపైగా వ్యత్యాసం ● అమ్మకానికి ససేమిరా అంటున్న రైతులు ● పెట్టుబడి సైతం రాదని ఆవేదన ● సరుకు నాణ్యత లేదంటున్న వ్యాపారులుజనగామ: జిల్లా రైతులకు పెసర్ల ధరలు షాక్ ఇస్తున్నాయి. మూడు రోజులుగా క్వింటాల్‌కు రూ.7,800ల వరకు ధర పలికి శుక్రవారం ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అమ్ముకునేందుకు ససేమిరా అంటున్న రైతులు.. మంచి ధర రాకుంటే ఇంటికి తీసుకెళ్తామంటున్నారు. ఇంత తక్కువ ధరకు అమ్మితే పెట్టుబడి సైతం రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యార్డుకు వచ్చిన పెసర్లు నాణ్యత లేకపోవడంతోనే ధర ఇవ్వలేకపోతున్నామని వ్యాపారులు అంటుండగా..ఇదే సరుకును మూడు రోజుల క్రితం ఎక్కువ ధరకు ఎలా తీసుకున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ–నామ్ పద్ధతిలో పెసర్ల కొనుగోలుకు ఐదారుగురు వ్యాపారులు రావాల్సిన చోట.. ఒకేఒక్కరు రావడంలో పోటీ లేకుండాపోయింది. తమ శ్రమతో పండించిన పంటకు సరైన విలువ దక్కకపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అమ్మకానికి నిరాకరణ మార్కెట్‌కు పెసర్లను తీసుకొచ్చిన రైతులు ధరలు తగ్గిపోవడంతో అమ్మకానికి నిరాకరిస్తూ ఇంటికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు కొంతమంది రైతులు ప్రైవేటులో తీసుకొచ్చిన అప్పులను తీర్చేందుకు తక్కువ ధరకై నా పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత కష్టం చేసి పండించిన పంటకు కనీసం ఉత్పత్తి వ్యయం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యవసాయం ఎలా చేయాలని వాపోతున్నారు. ఎక్కువ మంది ఖరీదుదారులు రావాల్సిన చోట ఒక్కరు మాత్రమే రావడం..ధరలు పడిపోవడానికి ప్రధాన కారణమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. మార్కెట్లో లావాదేవీలు మందగించడంతో రైతులు, వ్యాపారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. పెసర్ల నాణ్యత ఆధారంగా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. 25న రూ.7,800.. 29న రూ.4,700 జనగామ ఏఎంసీకి ఐదు రోజులుగా పెసర్లు వస్తున్నాయి. జిల్లాలో 7 వందల ఎకరాలకు పైగా పెసర పంట సాగుచేయగా.. మొదట్లో వర్షాభావ పరిస్థితుల్లో 20 శాతం పంట చేతికందకుండా పోగా, చాలా చోట్ల దిగుబడులు అమాంతం తగ్గాయి. ఉన్న పంటను అమ్ముకుందామంటే ధరలు తగ్గడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ నెల 25న క్వింటాల్ పెసర్ల ధరలు రూ.7,800, రూ.6,400, రూ.6,600 మూడు కేటగిరీల్లో ధర పలుకగా, 26న రూ.6,350, రూ.5,700, రూ.4,200 ధర ఇచ్చారు. 29న రూ.4,751, రూ.4,525, రూ.4,502 ధర మాత్రమే పలికింది. 25, 26 తేదీల్లో 151 క్వింటాళ్లు కొనుగోలు చేయగా, 29న మాత్రం 50 క్వింటాళ్ల సరుకు వాపస్ వెళ్లగా..వ్యాపారి 30 క్వింటాళ్లను కొనుగోలు చేశాడు.అభ్యంతరాలుంటే తెలపండిఇంటికి తీసుకెళ్తున్నా.. నాలుగు ఎకరాల్లో పెసర పంట సాగు చేశా. పెట్టుబడులకు రూ.30వేల వరకు ఖర్చు అయ్యింది. 15 క్వింటాళ్ల దిగుబడి రావాలి. పంటసాగు చేసిన మొదట్లో వర్షాభావ పరిస్థితులతో 9 క్వింటాళ్ల దిగుబడి తగ్గింది. ఆరు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. మార్కెట్లో నాలుగు రోజుల క్రితం క్వింటాల్ పెసర్లకు రూ.6వేల నుంచి రూ. 7,800 ధర పలుకగా.. ఇవాళ కేవలం రూ.4,750 ఇస్తామంటున్నారు.. ఇదేంటని అడిగితే మార్కెట్లో ధర పడిపోయిందని చెబుతున్నారు. సరుకును ఇంటికి తీసుకెళ్తున్నా..సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్లో ధర పలికితే అక్కడ అమ్ముకుంటా.. – ధరావత్ రవి,రైతు, బంజర, దేవరప్పుల -
‘రెవెన్యూ’లో వేళ్లూనిన అవినీతి!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూశాఖలో అవినీతి పరాకాష్టకు చేరుతోంది. కొందరు తహసీల్దార్లు, అధికారులు అక్రమాదాయానికి కొత్తదారులు వెతుక్కుని మరీ అవినీతికి పాల్పడుతుండడం వివాదాస్పదమవుతోంది. కిందిస్థాయిలో పలువురు వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి పైస్థాయిలో సర్వేయర్లు, ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్ల వరకు అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతీ పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్న కొందరి తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చేయి తడిపితే తప్ప దస్త్రం కదిలించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఓ వైపు శాఖాపరమైన చర్యలు.. మరోవైపు ఏసీబీ దాడులు చేస్తున్నా కొందరు తహసీల్దార్ల తీరు మారడం లేదు. తాజాగా ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. శుక్రవారం ఆయన ఇంటితో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై ఐదు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ప్రాథమికంగా రూ.5 కోట్ల అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తుండడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆది నుంచి అవినీతి ఆరోపణలు.. 2022లో వీఆర్ఎస్కు దరఖాస్తు.. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించిన కేసులో అరెస్టయిన తహసీల్దార్ బండి నాగేశ్వర్రావుపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ధర్మసాగర్, కాజీపేట, హసన్‌పర్తితోపాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్లో పలుచోట్ల పనిచేసిన సమయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు అధికారులు అందాయి. తహసీల్దార్ ఉద్యోగంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో భాగస్వామిగా చేరి రెండు చేతులా సంపాదిస్తూ ప్రభుత్వ, అసైన్డ్భూములను అప్పనంగా కట్టబెట్టారన్న ఫిర్యాదు మేరకు 2019లో అప్పుడున్న కలెక్టర్ విచారణ జరిపారు. ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామంలో గుట్టను విక్రయించి రిజిస్ట్రేషన్ చేసి పాస్‌పుస్తకాలు జారీ చేయడం వివాదంగా మారింది. 1976లో హసన్‌పర్తి శివారు కోమటిపల్లిలో కొనుగోలు చేసిన సీకేఎం కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్‌కు చెందిన 29 గుంటల భూమిని నగరానికి చెందిన ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసి వారి నుంచి రూ.45 లక్షలు తీసుకున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయమై బాధితులు 2022లో అప్పటి సీపీ, డీసీపీ, ఏసీపీకి ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌తోపాటు ఆ ముగ్గురిపై చేసిన ఫిర్యాదుపై విచారణ జరిగినా ఇప్పటికీ నానుతోంది. వరంగల్, హైదరాబాద్‌లో విలాసవంతమైన భవనాలను నిర్మించడంతోపాటు ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగుచూడడంతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు కూడా ఆయన దరఖాస్తు చేసుకున్నారు. చివరకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఏసీబీ దాడులు చేస్తున్నా వెరవని వైనం.. ● 2024లో భూసేకరణలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వరంగల్ ఆర్డీఓ సిడాం దత్తును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ● అంతకుముందు వరంగల్ జిల్లా సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ● జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో ఏకంగా సంయుక్త పాలనాధికారి సీసీ రూ.45 వేలు తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. ● హనుమకొండ జిల్లా నడికూడ మండల ఆర్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ● భూపాలపల్లిలో రెవెన్యూ అధికారులకు లంచమివ్వాలని, లేదంటే తమ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని వృద్ధ దంపతులు భిక్షాటన చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ● వెంకటాపూర్‌లో ఓ రైతు తనకున్న భూమిని పట్టా చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి, చివరకు విసిగిపోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. ● ఇలా ఆరోపణలు వచ్చిన పలువురిపై బదిలీలు, సస్పెన్షన్, వీఆర్‌లో వేటు పడినా.. రాజకీయ పలుకుబడితో మళ్లీ కీలక మండలాల్లో పోస్టింగ్‌లు తెచ్చుకుని అదే తంతు కొనసాగిస్తున్నారు. ● నాలుగేళ్లలో అవినీతి నిరోధక శాఖ ఉమ్మడి జిల్లాలో 66కు పైగా వివిధ శాఖలకు చెందిన వారిని పట్టుకుంది. అందులో రెవెన్యూ శాఖదే అగ్రస్థానం ఉండడం గమనార్హం. అయినా ఆ శాఖలో పని చేస్తున్న కొందరిలో మార్పు రావడం లేదన్న చర్చ జరుగుతోంది. అడ్డదారుల్లో కొందరు తహసీల్దార్లు, అధికారులు భూసమస్యల పరిష్కారానికి రూ.లక్షల్లో డిమాండ్ తీవ్ర ఆరోపణలు వస్తున్నా.. మారని తీరు ఆదాయానికి మించిన ఆస్తుల వివాదంలో బండి నాగేశ్వర్ ఏసీబీ దాడులతో మళ్లీ కలకలం.. రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఫైళ్లు స్వాధీనంఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్‌రోడ్డులోని ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. బీరువా, కౌంటర్లు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతీ ఫైల్‌ను పరిశీలించి కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మండల ఏర్పాటు నుంచి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
జనగామ రూరల్: జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు అన్నారు. శుక్రవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో జీపీ కార్మికులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీస వేతనం రూ. 26,000లు ఇవ్వాలని, యూనిఫామ్, సబ్బులు, నూనెలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్, పీఎఫ్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి నారోజు రామచంద్రం, బస్వ రామచంద్రం, సాంబయ్య, యాకన్న, సంగీ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
దేనికై నా సిద్ధమే
● సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా ఎదుర్కొంటా ● ఎమ్మెల్యే కడియం శ్రీహరిస్టేషన్ఘన్పూర్: సుప్రీంకోర్టు తీర్పు ఏ రకంగా వచ్చినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని ఓ ఫంక్షన్హల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన కడియం మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని, ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఒక్కొక్క ఎంపీటీసీ స్థానానికి ఇద్దరు ఇన్‌చార్జ్‌లను నియమిస్తానని, వారు గ్రామంలోని అందరి అభిప్రాయాలు తీసుకుని రెండు, మూడు పేర్లను సిఫార్సు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిరీశ్‌రెడ్డి, నాయకులు సీహెచ్ నరేందర్‌రెడ్డి, బెలిదె వెంకన్న, చిల్పూరు దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, లింగాజీ, రంజిత్‌రెడ్డి, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అలుగు పడితే ఆగుడే
శుక్రవారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2025జనగామ: రాష్ట్రమంతటా భారీ వర్షాలు..పొంగిపొర్లుతున్న ప్రాజెక్టులు..ఉప్పొంగుతున్న వాగులు..నిండు కుండలా చెరువులు..కానీ జనగామ జిల్లాలో నామమాత్రంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్దగా ఇబ్బంది లేకుండానే లోలెవల్ కాజ్వే, బ్రిడ్జిల వద్ద రాకపోకలు సాగుతున్నాయి. ఏటా జోరు వర్షాలతో వరద ఉధృతి పెరిగి రఘునాథపల్లి, లింగాలఘనపురం, జఫర్గడ్, పాలకుర్తి, బచ్చన్నపేట, జనగా మ రూరల్, నర్మెట తదితర మండలాల పరిధిలో అనేక గ్రామాలకు రోజుల తరబడి రవాణా సౌకర్యం, రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి. అయినప్పటికీ శాశ్వత బ్రిడ్జిల నిర్మాణం, ప్రమాదకరమైన రోడ్ల మరమ్మతులు తాత్కాలికంగా చేస్తున్నారు. ఈ సారి అనుకున్న స్థాయిలో వర్షాలు లేకపోవడంతో వరదలు లేవు. భారీ వర్షాలు కురియకముందే రవాణా కు అంతరాయం కలుగకుండా బ్రిడ్జిలు, లో లోవల్ కాజ్‌వేలు, ప్రమాదకరంగా ఉన్న రోడ్లు, కట్టల మరమ్మతుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కామారెడ్డి వరదల పరిస్థితి జిల్లాలో రాకుండా చూడాలని సూచిస్తున్నారు.గండి పడి.. రఘునాథపల్లి: మండలంలోని మేకలగట్టు నుంచి మచ్చుపహాడ్‌కు వెళ్లే తాత్కాలిక రోడ్డుకు గండి పడి రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసినా, విద్యుత్ లైన్లు కిందకు ఉండడంతో రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. ఇబ్రహీంపూర్ గ్రామ పెద్దచెరువు వద్ద బ్రిడ్జి లేకపోవడం, మండల గూడెం వద్ద కాజ్వే దెబ్బతినగా, అలుగు దాటుతూ ప్రజలు నరకం చూస్తున్నారు. బానాజీపేట, కోడూరు, రామన్నగూడెం వాగుపై బ్రిడ్జిల నిర్మాణం లేకపోవడంతో వాగు ఉధృతమైతే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి.రోడ్డు తెగితే కష్టమే.. నర్మెట్ట: భారీ వర్షం కురిస్తే వెల్దండ ఊరచెరువు మత్తడి రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉంది. జనగామ రహదారి మండల కేంద్రానికి సమీపంలో లోలెవల్ కాజ్వే కోతకు గురైంది. తండాలకు వెళ్లే రూట్లలో భారీ వర్షాలతో లో లెవల్ కాజ్‌వేలను ముంచేస్తుండడంతో రాకపోకలు నిలిచిపోతాయి.ప్రధాన రూట్ అయినా.. జనగామ రూరల్: జనగామ–హుస్నాబాద్ ప్రధాన రూట్ గానుగుపాడు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టికల్వర్టు ప్రమాదకరంగా మారింది. నూతన బ్రిడ్జి మూడేళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఈ కట్టపై అదుపు తప్పి తే అంతే. జనగామ నుంచి చీటకోడూరులో లెవల్ బ్రిడ్జి, సిద్దెంకి–పెద్దరామన్‌చర్ల, ఎర్రగొళ్లపహాడ్–పెద్దతండా, జనగామ నుంచి పోచన్నపేట మీదుగా బచ్చన్నపేట వెళ్లే దారిలో కల్వర్టులు, కాలువల సమీపంలో బ్రిడ్జిల ని ర్మాణం లేకపోవడంతో వరదలతో దాటలేని పరిస్థితి ఉంది.రాకపోకలు బంద్ చిల్పూరు: భారీ వర్షాలు కురిస్తే చిల్పూరు గుట్ట నుంచి మండల కేంద్రం బర్రెంకల చెరువు మత్తడి, వెంకటాద్రిపేట నుంచి మండల కేంద్రానికి వచ్చే రోడ్డు మధ్యలో చిల్పూర్ వాగు ఉప్పొంగితే రాకపోకలు నిలిచి పోతాయి. పల్లగుట్టకు వెళ్లే రూట్లో మూడు రూట్లలో లోలెవెల్ కల్వర్టులు ఉన్నాయి. స్తంభించిపోతున్న రాకపోకలు, రవాణా లో లెవల్ బ్రిడ్జి, మత్తళ్ల కల్వర్టులపై చిన్నచూపు తాత్కాలిక మరమ్మతులకే పరిమితం కామారెడ్డి వరదల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న ప్రజలు -
పింఛన్లు పెంచకుంటే రాజీనామా చెయ్
● సెప్టెంబర్ 9న మహాగర్జన నిర్వహిస్తాం● మంద కృష్ణమాదిగ స్టేషన్‌ఘన్‌పూర్: ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా దివ్యాంగులకు, చేయూత పింఛన్‌దారులకు పింఛన్లు పెంచాలని, లేదంటే సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. దివ్యాంగులు, చేయూత పింఛన్‌దారుల నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాన్ని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, వీహెచ్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక సిరిపురం గార్డెన్స్ ఫంక్షన్హాల్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం సోమరాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన మంద కృష్ణమాదిగ మాట్లాడారు.. దివ్యాంగులకు రూ.4వేల నుంచి రూ.6వేలకు, వృద్ధులు, వితంతువులకు రూ.2016 నుంచి రూ.4వేలకు పెంచుతామని హామీ ఇచ్చి ఇంతవరకూ అతీగతీ లేదన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 9న వికలాంగులు, చేయూత పెన్షన్‌దారుల మహాగర్జన సభతో ప్రభుత్వానికి గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ బోడ సునీల్, వీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు బిర్రు నగేశ్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు గద్దల కిషోర్, ఈగ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
చిల్పూరు: మండలంలోని పల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న చిదురాల ఆర్యన, జీడి ప్రీతి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం ఎల్లంభట్ల విజయ్‌కుమార్, ఫిజికల్ డైరెక్టర్ దేవ్‌సింగ్ గురువారం తెలిపారు. ఈనెల 25న జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించడంతో పాటు ఈనెల 30, 31 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించే 11వ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులను చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన చిర్ర నాగరాజు తదితరులు అభినందించారు.అప్రమత్తంగా ఉండాలి టెలీకాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే పల్లాజనగామ: వాతావరణ శాఖ హెచ్చరికలతో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఎమ్మెల్యే పల్లా టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.. భారీ వర్షాలు కురిసే సమయంలో నియోజకవర్గ ప్రజలకు పార్టీ శ్రేణులు అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో భాగస్వామ్యులు కావాలని కోరారు. పట్టణ, గ్రామాల్లోని ప్రజలు తడిచిన చేతులతో విద్యుత్ స్తంభాలు, కరెంటు వైర్లను తాకవద్దని సూచించారు.సాగుకు సరిపడా యూరియాజనగామ రూరల్: జిల్లాలో సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తు ప్రణాళికతో జిల్లాలోని రిజర్వాయర్లకు జలకళ సంతరించుకుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఆర్డీవో వెంకన్న, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ, నీటిపారుదల శాఖ ఎస్ ఈ సుధీర్, డీఈలు పాల్గొన్నారు.న్యాస్‌లో ఏడునూతుల పాఠశాలకొడకండ్ల: జాతీయస్థాయి నేషనల్ అచీవ్మెంట్ సర్వే(న్యాస్)లో మండలంలోని ఏడునూతుల ఉన్నత పాఠశాల ఆదర్శంగా నిలిచింది. న్యాస్‌లో జనగామ జిల్లా ఆరో తరగతి విభాగంలో 35వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పింకేశ్‌కుమార్ పాఠశాల హెచ్ఎం నారబోయిన యాకయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందిస్తూ ప్రశంసపత్రాలను అందజేశారు. ఈ విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులు కమల్‌కుమార్, రాంబాబు, భాస్కర్, సోమేశ్వర్, యాదగిరి, రజిత, మమత, రజిత, విజయ, ఈర్య కవితలతో పాటు విద్యార్థులను హెచ్ఎం అభినందించారు.ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలిరఘునాథపల్లి: ప్రజలందరూ ఐక్యంగా ఉండి గణేశ్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని కురుమవాడలో శ్రీ విఘ్నేశ్వర యూత్ ప్రతిష్ఠించిన వినాయకుడికి సీఐ, ఎస్సైలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలో మేకలగట్టు వద్ద వరద ప్రవాహానికి రోడ్డు తెగి రాకపోకలు నిలిచి పోగా డీసీపీ పరిశీలించారు. ఆయన వెంట జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ ఫణికిషోర్, ఎస్సై దూదిమెట్ల నరేశ్ తదితరులు ఉన్నారు. -
వేర్వేరు కేసుల్లో ఇద్దరికి ఏడాది జైలు
రఘునాథపల్లి: ద్విచక్రవాహనం, గ్యాస్ సిలిండర్ దొంగలించిన కేసులో నిందితుడికి కోర్టు ఏడాది జైలు, జరిమానా విధించినట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ గురువారం తెలిపారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన ఎస్కే ఖయ్యూం గత నెల 7వ తేదీన మండలంలోని కంచనపల్లిలో ఆమనగంటి రాజశేఖర్‌కు చెందిన గ్యాస్ సిలిండర్, గోవర్దనగిరిలో ద్విచక్రవాహనం దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి గురువారం కోర్టులో హాజరుపర్చగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.శశి నిందితుడికి ఏడాది జైలు, రూ.500 జరిమానా విధించారు. అలాగే 21 మే 2018న మండలంలోని నిడిగొండ వద్ద అతి వేగంగా కారు నడిపి మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ మరణానికి కారకుడైన హైదరాబాద్‌కు చెందిన ఎండీ ఖమ్యూం అలియాస్ లోబో అనే నిందితుడికి ఏడాది జైలు, రూ.12,500 జరిమానా విదించినట్లు ఎస్సై తెలిపారు. -
ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా రెండో స్థానం
● ప్రభుత్వం నుంచి ప్రశంసపత్రం అందజేత ● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: నిరుపేదలకు సొంత ఇళ్లను అందించే లక్ష్యంతో అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో వేగవంతంగా జరిగేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మొదటి విడతలో 71శాతం, రెండో విడతలో 86 శాతం గ్రౌం డింగ్ పూర్తి అయినందున ఈ నెలలో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా రెండో స్థానం దక్కించుకుందన్నారు. ఈమేరకు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రశంసపత్రం, ల్యాప్‌టాప్‌ను గురువారం కలెక్టర్ తన చాంబర్లో హౌజింగ్ పీడీ మాతృ నాయక్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో మొత్తం మొదటి విడతలో 716ఇల్లు మంజూరు కాగా 479 గ్రౌండింగ్ అయ్యాయని, రెండో విడతలో 5,282 ఇల్లు మంజూరు కాగా, 4,341 గ్రౌండింగ్ దశలో ఉన్నాయన్నారు. నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి లింగాలఘణపురం: జనగామ పట్టణానికి సంబంధించిన గణనాథుల నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లుట్ల చెరువును అన్ని శాఖల అధికారులతో కలిసి పరి శీలించారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్‌కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, జిల్లా పంచాయతీ అధి కారి స్వరూప, నీటిపారుదల శాఖ ఎస్ఈ సుధీర్, ఆర్డీఓ గోపీరామ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఆర్అండ్బీ డీఈ అశోక్, మత్స్యశాఖ అధి కారి రాణాప్రతాప్, తహసీల్దార్లు హుస్సేన్, రవీందర్, ఎంపీడీఓ రఘురామకృష్ణ ఉన్నారు. రేపు జాబ్‌మేళా జనగామ రూరల్: ఈనెల 30వ తేదీన జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో 80 పోస్టులకుగాను జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో కలెక్టరేట్ లోని ఎస్.8.లో ఉదయం 10:30 గంటలకు హాజ రుకావాలని సూచించారు. వివరాలకు 79954 30401 ఫోన్నెంబర్లో సంప్రదించాలన్నారు. -
మహోదరుడు
శివుడు ఓసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు. ఎంత కాలమైనా ఆయన ఆ తపస్సుని వీడకపోవడంతో పార్వతి కంగారు పడి పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని గిరిజన యువతిగా మారి ఆయన తపోభంగం కలిగించే ప్రయ త్నం చేసింది. పార్వతి చేష్టలకు పరమేశ్వరునికి దిగ్గున మెలకువ వచ్చి ఏం జరిగింది అన్న అయోమయం కూడా ఏర్పడి ఓ రాక్షసుడు జనించాడు. అతనే మోహాసురుడు. ఆ మోహాసురుడు సూర్యుని ఆరాధించి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. దేవతల ప్రార్థనను మన్నించి గణేశుడు లంబో దరునిగా అవతరించాడు. మోహం ఎప్పుడూ అయోమయానికి దారితీస్తుంది. దృక్పథం సంకుచితంగా మారిపోతుంది. అందరూ నావారే అన్న విశాలమైన దృష్టి కలిగిన రోజున ఆ మోహం దూరమైపోతుంది. -
ధూమ్రవర్ణుడు
అరిషడ్వార్గాలు అయిపోయాయి, దేహాభిమానమూ తీరిపోయింది. ఇక ‘నేను’ అనే అహంకారం ఒక్కటే మిగిలింది. దానికి సూచనే అహంకారాసురుడనే రాక్షసుడు. ధూమ్రము అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు. ఒక పరిమితీ ఉండదు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతుని ప్రతిరూపం ధూమ్రం. మనిషి ‘తాను’ అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావడానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం. ‘నేను’ అనే అహంకారాన్ని పక్కనపెట్టి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ పరులకు ఉపకారం చేస్తూ దైవ చింతనతో దైవాన్ని వెతుకుతూ మోక్షంకోసం సాధన చేయడమే దీని సారాంశం. -
గజాననుడు
కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జనించాడు. శివపంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు, శివుని అనుగ్రహంతో ముల్లోకాలనూ జయించే వరాన్ని పొందాడు. కానీ అతని లోభానికి అంతులేకుండా పోయింది. చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసు కున్న దేవతలు రైభ్యుడనే రుషిని శరణువేడారు. గణపతిని కనుక ఆవాహన చేస్తే, లోభాసురుని పరాజయం ఖాయమని సూచించాడు. అలా సకల దేవతల ప్రార్థనలను మన్నించి గణేశుడు ‘గజాననుడి’గా అవతరించి లోభాసురుని జయించాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. ఏనుగు తల బుద్ధిని సూచి స్తుంది. ఆ బుద్ధిని కనుక ఉపయోగిస్తే మనలోని లోభం (అత్యాశ, పిసినారితనం) దూరం కాకతప్పవు. -
వినాయకుడు
వినాయకుడంటే భౌతికంగా మనకు కనిపించే ఆకారం మాత్రమే కాదు.. ఆయన రూపు, స్వభావం వెనుక లోతైన అర్థం ఉందని వేదాంతులు చెబుతుంటారు. గణేశుని ఆరాధనతో బాధల నుంచి సులభంగా విముక్తి పొంద వచ్చని సూచిస్తుంటారు. అందుకే గణేశుడే ప్రముఖంగా ఆరాధించబడే గాణపత్యం అనే శాఖ కూడా ఉంది. వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. ఆ ఎనిమిది అవతారాల వివరాలను, గణనాథుని మహిమలను తెలుసుకుని ఆ వినాయకుని సేవించి తరిద్దాం. -
ఏకదంతుడు
చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు అతనికి ‘హ్రీం’ అనే మంత్రాన్ని ఉపదేశించి నిరంతరం జపిస్తే ఫలితం దక్కుతుందన్నాడు. లోకాధి పత్యమే అభీష్టంగా గల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించి మదాసురునికి తిరుగులేకుండాపోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులు తీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా, ఆయన ‘ఏకదంతు’నిగా అవతరించి మదాసురిని జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి (గర్వం) చిహ్నం, ఏకదంతుడు ఈ సృష్టి యావత్తూ ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. -
వక్రతుండుడు
పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల ‘మాత్సర్యా సురుడు’ అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని ధాటికి ముల్లోకాలూ అల్లాడిపోయి దేవతలంతా దత్తాత్రేయుని శరణు వేడారు. అంతట దత్తాత్రేయుడు, గణపతిని ప్రార్థించమని సూచించాడు. ‘గం’ అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయ గానే ‘వక్రతుండుని’గా అవతరించాడు. ఆయన సింహవాహనుడై ఆ మాత్సర్యాసురుని జయించాడు. వక్రతుండం అనేది ఓంకారా నికి ప్రతీకగా, మాత్సర్యాసురుడు మనలోని మత్సరానికి (ఈర్ష్య) ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పైచేయి కావాలి అనుకున్న రోజున ఈర్ష్యాసూయలు జనిస్తాయి. ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనసులో ఎలాంటి ఈర్ష్య ఉండదు. -
విఘ్నరాజు
కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు ప్రతీకగా ఇప్పటివరకూ రాక్షసులని చూశాము. ఇక మమతాసురుడు అనే రాక్షసుని కథ ఇది. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలనూ పీడించసాగాడు. దేవతల కోరిక మేరకు వినాయకుడు, విఘ్నరాజుగా అవతరించి మమతాసురుని సంహరించాడు. చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగుపాముని వాహనంగా చేసుకున్నట్లు చెబుతారు. ఇక్కడ మమత అంటే దేహాభిమానానికి ప్రతీక. ఆ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి గల విఘ్నాలన్నీ తొలగిపోతాయి. దేహాభిమానానికి మమతాసురుడు, కుండలినికి సూచనగా నాగ వాహనం కనిపిస్తాయి. -
లంబోదరుడు
దేవ, రాక్షసులు కలిసి సాగరాన్ని మధించినప్పుడు చివరగా అమృతం దక్కిన విషయం తెలిసిందే! ఈ అమృతాన్ని రాక్షసులకు కాకుండా చేసేందుకు విష్ణుమూర్తి మోహినీ అవతారాన్ని ధరించాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చలించగా విష్ణువు తన నిజరూపంలోకి రావడంతో శివుడు భంగపడి క్రోధితుడయి క్రోధాసురుడు అనే రాక్షసుడు జనిం చాడు. సూర్యదేవుని ఆశీస్సులతో మహాబలవంతుడయ్యాడు. క్రోధాసురుడు ప్రీతి అనే కన్యను వివాహమాడగా హర్షం, శోకం అనే సంతానం కలిగారు. వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుడిని అణచివేశాడు. క్రోధం ఎప్పుడూ తాను ఇష్టపడిన దాని కోసం వెంపర్లాడుతుంది. ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం, ఓడితే శోకం అనే ఉద్వేగాలు కలుగుతాయి. -
సాగునీటికి మొదటి ప్రాధాన్యం
బుధవారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2025రఘునాథపల్లి: బ్యాంక్ స్ట్రీట్‌లో భారీ వినాయక మండపంనవరాత్రి ఉత్సవాలకు వినాయకుడిని తీసుకువెళ్తున్న ఉత్సవ కమిటీ ప్రతినిధులుబీసీ అభివృద్ధి అధికారిగా బాధ్యతలుజనగామ: జిల్లా బీసీ అభివృద్ధి అధికారిగా ఎన్.లక్ష్మినర్సింహరావు మంగళవారం బాధ్యలను స్వీకరించారు. రంగారెడ్డి జిల్లాలో పని చేస్తున్న ఆయన పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ప్రస్తుతం ఎఫ్ఏసీగా పని చేస్తున్న రవీందర్ నుంచి బాధ్యతలను తీసుకున్న తర్వాత కలెక్టర్ రిజ్వాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలిజనగామ రూరల్: న్యాయవాదుల భద్రత, రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఐలు (ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్) జిల్లా కన్వీనర్ గాజుల రవీందర్ అన్నారు. కూకట్పల్లి కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాది తన్నీరు శ్రీకాంత్‌పై దాడికి నిరసనగా మంగళవారం కోర్టు ఆవరణలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై వరుస దాడులు జరుగుతుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దాడులను అరికట్టడంలో విఫలమయ్యాయని విమర్శించారు. న్యాయవాదులకే రక్షణ లేకపోతే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోకన్వీనర్ మహేశ్వరం బద్రీనాథ్, వట్టేపు వినయ్ కుమార్, అమృత రావు, బిట్ల గణేష్, ఎ. లక్ష్మణ స్వామి, గుగులోత్ శ్రీనివాస్, మోతే సంపత్, బాలబోయిన సంపత్, చాగంటి శ్రీనివాస్, బస్కుల ఠాగూర్, కాముని శ్రావణ్ కుమార్, పోగుల కార్తీక్, తదితరులు పాల్గొన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలుచిల్పూరు: జిల్లాలో యూరియా కొరత లేదని, అక్రమ నిల్వలు చేసి కృత్రిమ కొతర సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి అంబికసోని అన్నారు. మండలంలోని మంగళవారం మండల వ్యవసాయాధికారి నజీరుద్దిన్తో కలిసి పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ జిల్లాలో సరిపోను యూరియా నిల్వలు ఉన్నాయని, ఎక్కడైన యూరియా వచ్చిందనగానే రైతులు ఒక్కసారిగా ఎగబడటంతో దొరకడంలేదన్నారు. సొసైటీల వారీగా యూరియా వస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏఈఓలు వినయ్‌కుమార్, నర్సింహులు, యాకూబ్ తదితరులు ఉన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలిజనగామ రూరల్: పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు తోట హృతిక్‌సాయి డిమాండ్ చేశారు. మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పట్టణంలో నిరస న కార్యక్రమంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్ తీసుకో లేక, కొత్త అడ్మిషన్ పొందలేక ఇబ్బందులు పడుతున్నారన్నాఉ. భవనాలకు అద్దె చెల్లించకపోవడంతో యజమానులు తాళాలు వేసే పరి స్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి దేశగాని సాయి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివార్ల మహేందర్, వట్టిపల్లి గణేష్, దేవులపల్లి నితీష్, సాగర్, అక్షిత్ పాల్గొన్నారు. రేపు ఉచిత ఉపకరణాల శిబిరంజనగామ రూరల్: జిల్లాలో దివ్యాంగులకు రేపు (గురువారం) అలింకో సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉపకరణాల క్యాంపు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలలోపు ఉన్న విద్యార్థులు ఈ నెల 28న ప్రెస్టన్ హైస్కూల్లో ఉదయం 10 నుంచి ఐదు గంటల వరకు శిబి రం ఉంటుందన్నారు. ఆధార్, రేషన్, సదరం సర్టిఫికెట్ జిరాక్స్‌తో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు కోఆర్డినేటర్ నాగరాజు (9491533047)ను సంప్రదించాలన్నారు. సందడి షురూ● జిల్లాలో పండుగ హోరు ● మార్కెట్లో రద్దీ, లడ్డూలకు గిరాకీ ● మండపాలు సిద్ధం చేసిన నిర్వాహకులు నేడు వినాయక చవితిజనగామ: జనగామలో వినాయక చవితి పండుగ సందడి మొదలైయింది. ఆధ్యాత్మికత, భక్తి, ఉత్సాహం, వ్యాపారం అన్నీ కలిసిపోయి గ్రామాలన్నీ పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ప్రకృతిని ఆరాధించడం, పంచభూతాలను పూజించడం భారతీయ సంస్కృతి గొప్పతనం. వినాయక చవితి పండుగను పురస్కరించకుని గణపయ్యను 21 రకాల పత్రులతో పూజించడంలో శాసీ్త్రయమైన భావన ఉంది. ఈ పత్రాలు నీటిలో కలిసినప్పుడు ఔషధ గుణాలు వ్యాపించి వాగులు, చెరువులను శుభ్రం చేస్తాయని విశ్వాసం. పత్రి పూజ ద్వారా ప్రకృతిని కాపాడుకోవాలని పండుగ మనకందించే సందేశం. నేడు (బుధవారం) వినాయక చవితి పండుగ నేపధ్యంలో సాక్షి ప్రత్యేక కథనం. మండపాలకు విగ్రహాల తరలింపు.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు తయారీ చేసిన వినాయకుడి ప్రతిమల విక్రయాలు జోరందుకున్నాయి. పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ప్రతిమలను కొనుగోలు చేసి ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎం, ఇతర వాహనాల్లో మండపాలకు తరలిస్తున్నారు. అలాగే పూలదండలు, పండ్లు, పత్రులు, పూజా సామగ్రి కోసం కొనుగోలుదారులు బారులుదీరారు. గ్రామాల నుంచి ప్రత్యేకంగా మామిడి కొమ్మలు, సీతాఫల్, జామ, దానిమ్మ, పత్రులు, పండ్లు పెద్ద ఎత్తున మార్కెట్‌కు చేరాయి. మార్కెట్లో రద్దీ నెలకొంది. కిక్కిరిసిన బస్టాండ్ పండుగ రాకతో జనగామ ఆర్టీసీ బస్టాండ్ జనసందోహంతో నిండిపోయింది. ఉద్యోగాలు, చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారు స్వగ్రామాలకు చేరుకోవడంతో బస్టాండు కిక్కిరిసిపోయింది. విద్యావ్యవస్థను మరింత పటిష్టపరచాలిజనగామ రూరల్: విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశహాల్లో విద్యావ్యవస్థ పటిష్టతపై అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి అన్ని రంగాల్లో రాణించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. అంతకుముందు ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన హెచ్ఎంలకు ప్రశంసపత్రాలు అందించి అభినందించారు. సమావేశంలో విద్యాశాఖ అధికారులు చంద్రభాను, రవికుమార్, సత్యమూర్తి, శ్రీనివాస్, గౌసియా బేగం, రామరాజు, నాగరాజు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే విద్యార్థి ఆరోగ్య ప్రొఫైల్ కార్డు వాల్ పోస్టర్లను అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావుతో కలిసి విడుదల చేశారు. ప్రతీ విద్యార్థి ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం నమోదుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పోస్టు మాస్టర్లకు పింఛన్ కిట్ల పంపిణీ జనగామ: జిల్లాలో ఆసరా పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు బ్రాంచ్ పోస్టు మాస్టర్లకు కొత్త మొబైల్ ఫోన్లు, ఫింగర్ ప్రింట్ డివైజ్లతో పాటు సాంకేతిక పరికరాలకు సంబంధించి కిట్లను అందించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ చేతుల మీదుగా 167 కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ వసంత, ఏపీడీ నూరోద్దీన్, డీపీఎం సతీష్, గిరిబాబు, పోస్టల్ శాఖ ఏఎస్పీ కృష్ణ, నవీన్, భాస్కర్, పోస్ట్ మాస్టర్లు పాల్గొన్నారు.శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టిజనగామ: పట్టణంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలు, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డులతో పాటు హైదరాబాద్, సిద్దిపేట, సూర్యాపేట రహదారులను పరిశీలించారు. 17వ వార్డులోని మోడల్ మార్కెట్, 15 వార్డులో స్లాటర్ హౌస్, 15, 17, 20, 21, 27, 29, 30 వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ గోపయ్య, పులిశేఖర్, జవాన్లు లక్ష్మణ్, ఎల్లేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.తప్పని నిరీక్షణజిల్లాలో పెద్దగా యూరియా కొరత లేకున్నా.. పలు మండలాల పరిధిలో నిరీక్షణ తప్పడం లేదు. మంగళవారం కొడకండ్ల, నర్మెట, పాలకుర్తి, దేవరుప్పుల, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి మండలాల్లో ఆగ్రోస్, పీఏసీఎస్, ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాల వద్ద రైతులు తెల్లవారు జాము నుంచే యూరియా కోసం బారులుదీరారు. – జనగామ/సాక్షి నెట్వర్క్భక్తితో పూజిద్దాం.. భద్రతతో నిఘా ఉంచుదాం.. మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలకు చెక్ నిర్వాహకులు, ఎలక్ట్రీషియన్లకు విద్యుత్ శాఖ సూచనలు ఎమ్మెల్యే కడియం శ్రీహరి లింగాలఘణపురం: సాగునీటి పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రా మాల్లో పనుల జాతరలో భాగంగా రూ.2.30కోట్ల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నెల్లుట్లలో విలేకరులతో మాట్లాడారు. ఆర్ఎస్ ఘన్పూర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్‌కు వచ్చే ప్రధాన కాల్వకు రూ.150 కోట్ల లైనింగ్ పనులను మంజూరు చేయించానన్నారు. రిజర్వాయర్ పనులన్నీ ఏడాదిలో పూర్తి చేయించి నియోజకవర్గంలోని ప్రతీ చెరువును గోదావరి జలాలతో నింపి స స్యశ్యామలం చేస్తామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు సాగునీరు అందలేదన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, ఆర్డీఓ గోపీరామ్, డీఈ ఆర్.రవీందర్, ఎంపీడీఓ రఘురామకృష్ణ, తహసీ ల్దార్ రవీందర్, ఏఈ శ్రీనివాసు, శివకుమార్, గుడి వంశీధర్‌రెడ్డి, మోహన్, శ్రీలతారెడ్డి, బాబు, దిలీ ప్రెడ్డి, సదానందం తదితరులు పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లుగణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ నేతృత్వంలో ఏసీపీ, సీఐ, ఎస్సైల ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తున్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, భద్రతా సిబ్బందిని మొహరించారు. ఆధ్యాత్మికత, భక్తి ఆరాధనతో నిండిన వినాయక చవితి వేడుకలు జిల్లాలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. కాగా వారం రోజులపాటు కనుమరుగైన వరణుడు ముసురు రూపంలో ప్రత్యక్షం కావడంతో చిరు వ్యాపారులు ముసురులోనే అమ్మకాలు జరిపారు. మహాగణపతి.. గోమయ గణపతిజిల్లాలో వచ్చే నెల (సెప్టెంబర్) 6వ తేదీన వినాయక నిమజ్జనం జరుపుకోవాలని జిల్లా గణేష్ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు మంచాల రవీందర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బాణాపురం వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, సిద్ధాంతి కృష్ణ మాచార్యులు ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు రంగ నర్సింగరావు, కీర్తి నరసయ్య తదితరులు ఉన్నారు. లడ్డూలకు గిరాకీ వినాయకుడి చేతిలో లడ్డూ పెట్టడం సంప్రదాయం. ఈసారి కూడా అర కిలో లడ్డూ నుంచి 25 కిలోల బరువు ఉన్న లడ్డూల వరకు తయారు చేయడానికి స్వీట్ హౌస్‌ల్లో ఆర్డర్లు ఇచ్చారు. పట్టణంలో రాత్రి సమయంలో గణేష్ మండపాలు విద్యుత్ వెలుగుల అలంకరణలతో మెరిసిపోతున్నాయి. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
తరిగొప్పుల: మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం మండలంలో ఆకస్మిక పర్యటన చేసి కేజీబీవీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫర్టిలైజర్ షాపులను పరిశీలించారు. కేజీబీవీలో మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని ఎస్ఓ సునీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలు, పప్పు ధాన్యాలు పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇసుక, కంకర, ఇతర సామగ్రి నిర్ణీత ధరలో లబ్ధిదారులకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫర్టిలైజర్ షాపులోని స్టాక్ రిజిస్టర్లు పరిశీలించి యూరియా కొరత సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మొగుళ్ల మహిపాల్‌రెడ్డి, ఎంపీడీఓ ఆలేటి దేవేందర్‌రెడ్డి, ఏఓ మనోహిత్ విక్రమరావు, ఎంపీఓ మాలతి, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే పూజిద్దాం
జనగామ రూరల్: పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే పూజించాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని నెహ్రూ చౌక్ వద్ద మున్సిపాలిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రసాయనాలతో తయారు చేసిన ప్రతిమలతో నీటి కాలుష్యం పెరిగిపోతుందన్నారు. మట్టి ప్రతిమలను పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. అలాగే ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ ఆర్మీ వింగ్ 10 బెటాలియన్ కెడెట్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఆర్యభట్టా పాఠశాలలో కరస్పాండెంట్ సురేష్ చంద్ర, ప్రిన్సిపాల్ సృజన ఆధ్వర్యంలో మట్టి వినాయకులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ -
ఉపాధ్యాయులకు పదోన్నతులు
జనగామ: జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. విద్యారంగంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నా యి. 87 మంది ఎస్జీటీలు (సెకండరీ గ్రేడ్ టీచర్లు) వివిధ విభాగా ల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. దీంతో హై స్కూల్స్‌లో సబ్జెక్ట్ నిపుణుల కొరత తీరనుండగా.. ప్రాథమిక పాఠశాల పిల్లలకు బోధన పరంగా కష్టాలు ప్రారంభం కానున్నాయి. సబ్జెక్టుల వారీగా ప్రమోషన్లు జిల్లాలో సబ్జెక్టుల వారీగా ఎస్జీటీలుగా పదోన్నతులు పొందారు. ఇందులో పీఎస్ హెచ్ఎం–22, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ–15, సోషల్ స్టడీస్–24 గణితం–6, ఫిజిక్స్–5, ఇంగ్లిష్–9, తెలుగు–1, హిందీ–2, ఫిజికల్ డైరెక్టర్ –1, స్పెషల్ ఎడ్యుకేషన్–3 ఉన్నారు. ఈ పదోన్నతుల హైస్కూల్ స్థాయిలో ఉపాధ్యాయుల కొరత తీరనుండగా, ప్రాథమిక పాఠశాలల్లో మాత్రం సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో కొత్త సవాళ్లు ‘బడి బాట’ ద్వారా ఈ ఏడాది ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లోనే అత్యధికంగా అడ్మిషన్లు వచ్చాయి. ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్న పీఎస్‌ల పరిధిలో ఒకరికి ప్రమోషన్ రావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. జిల్లాలోని సుమారు 50 ప్రాథమిక పాఠశాలల్లో ఒకరు పదోన్నతిపై హైస్కూల్ స్థాయికి వెళుతున్నారు. దీంతో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఏర్పడుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఖాళీల భర్తీకి తక్షణమే విద్యావలంటీర్లను నియమించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు అదనపు కలెక్టర్, డీఈఓ పింకేష్‌కుమార్ చేతులమీదుగా ఆర్డర్ కాపీలను అందించగా, వారు విధుల్లో చేరి బాధ్యతలను తీసుకున్నారు. ఎస్జీటీల పోస్టుల నుంచి 87 మంది ఖాళీ సుమారు 50 పాఠశాలల్లో ఒకేఒక్కరు పీఎస్ పరిధిలో ఉపాధ్యాయుల కొరత -
కడియం శ్రీహరిపై మరోసారి తాటికొండ రాజయ్య వివాదస్పద వ్యాఖ్యలు
సాక్షి, జనగామ జిల్లా: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నకిలీ ఎన్కౌంటర్లకు స్పెషలిస్ట్ కడియం శ్రీహరి అంటూ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఏఒక్కటి తన మార్క్ అని చెప్పడానికి లేని టాల్మాన్ అంటూ విమర్శలు గుప్పించారు. ఓర్వలేని తనంతో లెక్కచేయనితనంతో ఫ్రస్టేషన్‌కు లోనై ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు.బీజేపీలోకి రమ్మని పిలిచిన వెళ్లే జంపు జలానీలు తండ్రీ కూతుర్లని మండిపడ్డారు. అభివృద్ధి నినాదం అయితే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 1560 కోట్లు, హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 6000 కోట్లు తీసుకొస్తే, అభివృద్ధి కోసం పార్టీ మారినని చెప్పుకుంటున్న కడియం శ్రీహరి 800 కోట్లు తెచ్చానని చెప్పుకోవడం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందన్నారు.ఓడిపోతాడనే భయంతో తక్కువ మెజారిటీతో మూడుసార్లు ఎమ్మెల్యే గెలవడం ప్రజా నాయకుడు అనిపించుకోడన్నారు. నియోజకవర్గంలో ఇక నుండి కడియం శ్రీహరి ఎత్తులు జిత్తులు, కుళ్ళు కుతంత్రాలు సాగవన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని నేను అనుకోవడం లేదని, నువ్వే అనుకుని ఆగమాగం అవుతూ.. ఈరోజు లింగాల ఘన్‌పూర్‌లో మా పార్టీ కార్యక్రమాలను పోలీసుల ద్వారా రద్దు చేయించడం కడియం శ్రీహరి దుర్బుద్ధికి నిదర్శనం అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. -
యూరియా కోసం తిప్పలు
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు మండలాలకు చెందిన రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి, రెండు బస్తాల కోసం స్థానిక పీఏసీఎస్‌ల వద్ద గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. స్టేషన్‌ఘన్‌పూర్ పీఏసీఎస్ కార్యాలయానికి శనివారం 555 బస్తాలు యూరియా రాగా ఆదివారం 293 బస్తాలను పంపిణీ చేశారు. మిగిలిన 262 బస్తాలను సోమవారం పంపిణీ చేస్తారని తెలుసుకున్న రైతులు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. దీంతో రైతుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్సై వినయ్‌కుమార్, ఏఓ చంద్రన్‌కుమార్ పీఏసీఎస్ వద్దకు చేరుకుని రైతులకు సర్దిచెప్పారు. యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి రఘునాథపల్లి: నా జెండా..ఎజెండా నియోజకవర్గ అభివృద్ధేనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మండలంలోని వివిధ గ్రామాలు, కాలనీల్లో రూ.4 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక నిధులు మంజూరు చేశారన్నారు. అవినీతి, అక్రమాలు చేయను.. నీతి నిజాయితీగా పని చేస్తానని, తనతో ఉన్న వారు ఎవరైనా అ న్యాయం చేస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, ఆర్డీఓ గోపిరామ్, డీఆర్డీఓ పీడీ వసంత, లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, బొల్లం అజయ్, శివకుమార్, రవిగౌడ్ పాల్గొన్నారు. -
అదనపు కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ
జనగామ: జనగామ జిల్లా రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్‌గా బెన్షాలోమ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషాను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఓపీఎస్ అమలు చేయాలిజనగామ రూరల్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగమొల్ల దర్శన్‌గౌడ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆత్మగౌర సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ విధానం ఉద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. సెప్టెంబర్ 1న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేపట్టిన ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్, ఉపాధ్యక్షులు మంగ నర్సింహులు, భిక్షం, చింతల రజిత, రామారావు, స్రవంతి, శేఖర్‌రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యంనర్మెట: ఉపాధి సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తేనే అభివృద్ధిలో పురోగతి సాధిస్తామని అదనపు అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో సోమవారం ఎంపీడీఓ బోడపాడి అరవింద్ చౌదరి అధ్యక్షతన 16వ సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ మెటీరియల్, లేబర్ కాంపోనెంట్, మస్టర్ల నిర్వాహణలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కార్యదర్శులు సమన్వయ లోపం కనిపిస్తుందన్నారు. పనుల్లో నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో పారదర్శకత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఎం అంజి గౌడ్, ఎస్ఆర్పీ నరేందర్, క్యూ సి రాజవర్ధన్, ఏఈ ప్రదీప్, ఏపీఓ బిరుకూరి రమాదేవి, పంచాయతీ కార్యదర్శులు కందకట్ల శ్రీధర్, వంశీ, శ్రీకాంత్, ప్రశాంత్, రమేశ్, యాకూబ్, చలపతి, సురేష్, నరేష్ అనిల్, పవన్, సుజాత, కల్యాణ్, రిజ్వాన్, టీఏలు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు. అథ్లెటిక్స్‌లో యువకుడి ప్రతిభరఘునాథపల్లి: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో మండలంలోని వెల్లి గ్రామానికి చెందిన కళ్లెం నవీన్ ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్ 20 పురుషుల విభాగం 400 మీటర్ల లాంగ్ జంప్‌లో నవీన్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ నెల 30, 31 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నవీన్‌ను గ్రామస్తులు అభినందించారు.రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలిజనగామ రూరల్: రేషన్ డీలర్ల సమస్యల పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మురళి అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు డీలర్లకు కమీషన్ రాకపోవడంతో ఇబ్బందులు ప డుతున్నారని, వెంటనే కమీషన్ విడుదల చే యాలన్నారు. కార్యక్రమంలో చెవ్వ శ్రీనివాస్, ఎడ్ల మల్లయ్య, రామగల్ల శ్రీను, దయాకర్, రాజయ్య, దేవస్వామి పాల్గొన్నారు. -
జనహిత పాదయాత్ర
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పరిధి ఇల్లంద మార్కెట్‌నుంచి మండలకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ వరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లు జనహిత పాదయాత్ర నిర్వహించారు. వారి వెంట మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ శ్రేణులు నడిచారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. అనంతరం అంబేడ్కర్ సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ముఖ్యనేతలు ప్రసంగించారు. – సాక్షి, వరంగల్ -
ఆరు నెలల నుంచి వేతనం లేదు..
పట్టణంలోని ఎస్సీ ఏ హాస్టల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఏడాది నుంచి పనిచేస్తున్న. ఆరు నెలల నుంచి వేతనం రాకపోవడంతో కుటుంబం గడవటం ఇబ్బందిగా ఉంది. కలెక్టర్ చొరవ తీసుకొని జిల్లాలోని 16 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనం ఇప్పించి ఆదుకోవాలి. – జి.నాగరాజు, అవుట్సోర్సింగ్ ఉద్యోగి అక్రమంగా పట్టా చేసుకున్నారు.. తన భర్త ఎండీ అబ్బాస్ పేరు మీద సర్వే నంబర్ 448లో 2.28 ఎకరాల భూమి ఉంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నాం. బతుకుదెరువు కోసం వేరే గ్రామానికి వెళ్తే మా బంధువులు ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా పట్టా చేసుకున్నారు. ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ప్రయోజనం లేదు. విచారణ చేపట్టి న్యాయం చేయాలి. – ఎండీ జెహేరా, తిడుగు -
ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
జనగామ: అన్ని శాఖల అధికారుల సమన్వయంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టర్ సమావేశం హాలులో అదనపు కలెక్టర్లు బెన్షాలోమ్, పింకేష్‌కుమార్, డీసీపీ రాజ మహేంద్రనాయక్తో కలిసి సబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 6వ తే దీ వరకు ఉత్సవాలు జరగనున్నాయని, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాలన్నారు. నిమజ్జనం చేసే చెరువుల వద్ద రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షణలో పటిష్టమైన భారీగేడ్లు, క్రేన్లు, నిరంతర విద్యుత్ సరఫరాకు ఎన్పీడీసీఎల్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ, నిమజ్జన ప్రాంతంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 20 మంది గజ ఈతగాళ్లతో పాటు పోలీసు భద్రత ఉండాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. మండపాల నిర్వాహకులు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓలు గోపీరామ్, డీఎస్ వెంకన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొమరయ్య, డీపీఓ నాగపురి స్వరూప, ఏసీపీ భీమ్‌శర్మ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు. మట్టి వినాయకులను పూజిద్దాంవినాయక చవితి పండుగ రోజు మట్టి ప్రతిమలను పూజించి, పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సునీత ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ మానస, జిల్లా బీసీ సంక్షేమాధికారి రవీందర్, డీపీఓ స్వరూప, ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, ఎస్డీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొమురయ్య తదితరులు ఉన్నారు. మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా -
నోటిఫికేషనే తరువాయి..
స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధంఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసి దాదాపుగా రెండేళ్లు కావస్తోంది. దీనిపై ఇదివరకే ఈ సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు జ రిపించాలన్న హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. వీటంన్నిటిని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార పార్టీ నేతలు, సీఎం నిర్ణయించినట్లు ప్రచారం. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోయినప్పటికీ.. పార్టీ పరంగా ఆ మేరకు అవకాశం కల్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు ఆ పార్టీ ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు చెబుతున్నారు. ఈ నెల 29న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలపై చర్చించి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, చీఫ్ సెక్రటరీల నుంచి ఆదేశాలు అందడంతో అందరూ అలర్ట్ అయ్యారు. ● సెప్టెంబర్ మొదటి వారంలో ప్రకటించే అవకాశం ● ‘స్థానిక’ంలో బీసీలకు 42 శాతం అవకాశం.. పార్టీ కేడర్‌కు కాంగ్రెస్ సంకేతాలు ● ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ఆ తర్వాతే సర్పంచ్, ‘ఫ్యాక్స్’ల ఎన్నికలు ● ఉమ్మడి జిల్లాలో 6 జెడ్పీలు, 75 జెడ్పీటీసీ స్థానాలు.. ● జిల్లా కలెక్టర్లకూ సీఎస్ సమాచారం.. సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వేళయ్యిందా..? రిజర్వేషన్లు తేలకున్నా ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోందా..? ఈ మేరకు పార్టీ కేడర్, నాయకులకు సంకేతాలు అందాయా..? పీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనుందా?.. జిల్లా ఉన్నతాధికారులను కూడా అప్రమత్తం చేశారా?... అంటే నిజమే అంటున్నాయి అధికార పార్టీ, అధికార వర్గాలు. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సోమవారం కూడా జిల్లా కలెక్టర్లకు మౌఖికాదేశాలు అందాయన్న ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్‌లోనే నోటిఫికేషన్..?.. ఈ దిశగానే కసరత్తు... -
పాఠశాల ఆవరణలోనే ఎఫ్ఆర్ఎస్
జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో పారదర్శకత, క్రమశిక్షణను పెంపొందించేందుకు ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ద్వారా హాజరు నమోదు విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ఎఫ్ఆర్ఎస్ విధానంలో చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకునేందుకు గత 24 రోజుల పాటు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. ఈ సమయంలో టీచర్లు పాఠశాల ప్రాంగణానికి దూరంగా ఉన్నా.. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ వేశారు. ఈ విధానం అమలు చేసే సమయంలో అన్ని పాఠశాల ఆవరణ (ప్రి మిసెస్)లో జీపీఎస్ సిస్టం ద్వారా అనుసంధానం చేశారు. ఈ నేపధ్యంలో సోమవారం నుంచి స్కూల్ ఆవరణలో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ వేయాలనే నిబంధనలు అమలు చేశారు. దీంతో టీచర్లు ఉరుకులు, పరుగులతో సమయంలోపు పాఠశాలకు చేరుకుని ఎఫ్ఆర్ఎస్ వేశారు. పాఠశాల ప్రాంగణంలోనే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై స్కూల్ ప్రాంగణంలోనే ఎఫ్ఆర్ఎస్ విధానంలో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉపాధ్యాయులు ఎక్కడైనా హాజరు నమోదు చేసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు మాత్రం పాఠశాల పరిధిలో ఉన్నప్పుడే హాజరు నమోదవుతుంది. చిన్న చిన్న సాంకేతిక ఆటంకాలు తొలి రోజుల్లో సహజమే కానీ త్వరలోనే వాటిని అధిగమిస్తామని అధికారులు వెల్లడించారు. పలువురి ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్లు పెండింగ్ జిల్లాలో యూఆర్ఎస్ (గురుకులం), కేజీబీవీ, మో డల్, ప్రభుత్వ పాఠశాలలు 508 వరకు ఉన్నాయి. ఇందులో సుమారు 2,860 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పని చేస్తున్నారు. ఇప్పటి వ రకు 2,848 మంది టీచర్లు, సిబ్బంది ఎఫ్ఆర్ఎస్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగా 12 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఉదయం 9 గంటలు, సాయంత్రం ఉన్నత, ప్రాథమికోన్నత 4.15, ప్రాథమిక 4 గంటల వరకు రోజుకు రెండు సార్లు యాప్‌లో అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో పలు చోట్ల సెల్‌ఫోన్ సిగ్నల్ మొరాయించడంతో అటెండెన్స్ పూర్తి చేసుకునేసరికే మొదటి పీరియడ్ పూర్తవుతుంది. సాయంత్రం కూడా అరగంట వరకు పాఠశాల ఆవరణలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సర్వర్ సామర్థ్యాన్ని పెంచి సిగ్నల్ సమస్య ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు. అమలులోకి వచ్చిన కొత్త నిబంధనలు జిల్లాలో 12 మంది టీచర్ల రిజిస్ట్రేషన్లు పెండింగ్ -
సమస్యలు పరిష్కరించండి మహాప్రభో!
చెప్పులరిగేలా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాం..ఈ ఫొటోని మహిళ యశ్వంతాపూర్ గ్రామానికి చెందిన మారబోయిన చంద్రకళ. తన భర్త మల్ల య్య అనారోగ్యంతో మరణించాడని, తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, ఇద్దరు ఆడపిల్లలను కూలీ పనులు చేసి పోషిస్తున్నానని, అంత్యోదయ కార్డు ఇప్పించి ఆదుకోవాలని కలెక్టర్‌ను వేడుకుంది. ● గ్రీవెన్స్‌లో బాధితుల గోడు ● సమస్యలు త్వరగా పరిష్కరిస్తాం.. ● కలెక్టర్ రిజ్వాన్ బాషా ● ప్రజావాణిలో 74 అర్జీలుజనగామ రూరల్: పట్టా పాస్ బుక్ కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి ఆదుకోవాలని, అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని, వేతనాలు రాక కుటుంబం గడవటం లేదని.. ఇలా పలు సమస్యలతో ప్రజలు సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌లోని ప్రజావాణికి వచ్చారు. సమస్యలు పరిష్కరించండి మహాప్రభో..అంటూ కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు బెన్షాలోమ్, పింకేష్ కుమార్, జిల్లా అధికారులు ప్రజల నుంచి 74 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులు సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు గోపిరామ్, డీఎస్ వెంకన్న, డిప్యూటీ కలెక్టర్ కొమరయ్య, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలి
హన్మకొండ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్ధల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేపట్టనున్న సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని ఆ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బుట్టి శ్యాం యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని సంఘం కార్యాలయంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంజిత్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిందన్నారు. బీసీలకు రిజర్వేషన్ల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లును ఆమోదం తెలిపేలా ఒత్తిడి పెంచాలన్నారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ముందుకు వెళ్తే యుద్ధం చేస్తామన్నారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య, నాయకులు బాబు యాదవ్, సౌగాని శ్రీనివాస్, బగ్గీ రాజు, సనత్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
రెబ్బెన: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్షిప్లో కొనసాగుతున్న 71వ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆదిలా బాద్ మహిళ జట్టు విజేతగా నిలువగా పురుషుల వి భాగంలో వరంగల్ జిల్లా జట్టు విజయకేతనం ఎగురేసింది. సెమీఫైనల్‌తోపాటు ఫైనల్ పోటీలు నిర్వహించగా క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. ఫైనల్లో ఆదిలాబాద్ జిల్లా మహిళల జట్టు వరంగల్ జట్టుతో తలపడింది. పురుషుల విభాగంలో వరంగల్ జిల్లా క్రీడాకారులు రంగారెడ్డి జిల్లాతో తలపడ్డారు. పోటీలతో స్నేహభావం.. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల నిర్వహణతో వివిధ జిల్లాల క్రీడాకారుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్‌రెడ్డి, ఎస్వోటూజీఎం రాజమల్లు, బాల్‌బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, ప్రధానకార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. చాంపియన్‌గా ఆదిలాబాద్, వరంగల్ జట్లు -
పొలం గట్లే పిల్లలకు దారి..
మంచ్యతండా ప్రాథమిక పాఠశాల భవనంపొలం గట్లపై నడుస్తున్న పాఠశాల విద్యార్థులుమరిపెడ రూరల్: మారుమూల పల్లెలు, గిరిజన తండాల్లోని పలు పాఠశాలలు పొలాల మధ్య ఉండడంతో సరైన రహదారులు లేవు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు తిప్పలు తప్పడంలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబా బాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామ పంచాయ తీ పరిధిలోని మంచ్యతండాలో 20 ఏళ్ల క్రితం పొలాల మధ్య పాఠశాల ఏర్పాటు చేశారు. అందులోనే అంగన్వాడీ కేంద్రంతోపాటు పాఠశాల నిర్వహణ కొనసాగుతోంది. అంగన్వాడీ కేంద్రంలో 10 మంది చిన్నారులు, ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా, గదిలో ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తుండగా.. వరండాలో అంగన్వాడీ పిల్లల ఆలనా పాలన చూస్తున్నారు. కాగా దారి లేకపోవడంతో విద్యార్థులు, చిన్నారులు పొలం గట్ల మీదుగా పాఠశాలకు వెళ్లి, అదే గట్లపై మళ్లీ సాయంత్రం ఇంటికి వస్తున్నారు. ఉపాధ్యాయులు సైతం తమ ద్విచక్రవాహనాలను రోడ్డుపై నిలిపి, గట్ల వెంబడి పాఠశాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పొలం గట్లు తడిసిపోయి పిల్లలు జారి కింద పడిపోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు తక్షణమే అదనపు గదులతో పాటు, రహదారిని ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, మంచ్యతండా వాసులు కోరుతున్నారు. రహదారి లేని మంచ్యతండా పాఠశాల ఇరుకు గదిలోనే 30 మంది విద్యార్థులకు బోధన పట్టించుకోని విద్యాశాఖ అధికారులు