జనగామ: హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) టీకా బాలికలను సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం పట్టణంలోని అర్బన్ పీహెచ్‌సీలో హెచ్‌పీవీ టీకాను కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు టీకా కార్యక్రమానికి సహకరించి బాలికలకు తప్పనిసరిగా టీకా వేయించేలా చొరవ చూపించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ మల్లికార్జున్‌రావు, డాక్టర్లు శ్యామ్ కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్, చైల్డ్ హెల్త్ ఇమ్యునైజేషన్ అశోక్, ప్రోగ్రాం ఆఫీసర్ కమల్ హాసన్, కనకరాజు, అనురాధ, మెడికల్ ఆఫీసర్ రేవతి తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణలో భాగంగా పట్టణంలోని ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య, గైర్హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
క్యాన్సర్ నుంచి బాలికలకు రక్ష
టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


