అధికారులు పారదర్శకంగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు పారదర్శకంగా పనిచేయాలి

Mar 18 2026 11:12 AM | Updated on Mar 18 2026 11:12 AM

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

జనగామ రూరల్‌: అధికారులు పారదర్శకంగా పనిచేస్తేనే సత్ఫలితాలు సాధ్యమని కలెక్టర్‌ సందీప్‌ కుఆమర్‌ ఝా అన్నారు. మంగళవారం భూ భార తి, ఇసుక తరలింపు, స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ తదితర అంశాల మీద కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, ఆర్డీఓలు, తహసీల్దార్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రెవెన్యూకు సంబంధించిన ఏ అంశాలు పెండింగ్‌లో ఉండకూడదన్నారు. భూ భారతికి సంబంధించిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. అక్రమ ఇసుక, మొరం, గ్రావెల్‌ అక్రమ రవాణా కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రక్రియను జనాభా లెక్కల విధులను సమర్థంగా నిర్వహించాలన్నారు.

గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో

ఇబ్బందులు లేకుండా..

గ్యాస్‌ సిలిండర్‌ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. మంగళవారం జిల్లా స్థాయి గ్యాస్‌ సరఫరా పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. టోల్‌ ఫ్రీ నంబర్‌ అమలు, గ్యాస్‌ సరఫరా, నిల్వల పరిస్థితిపై ఆరా తీశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వినియోగదారులతో పాటు వయోవృద్ధులు, దివ్యాంగులు, ఆస్పత్రులకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు గ్యాస్‌ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో కమర్షియల్‌ సిలిండర్‌ మాత్రమే ఉపయోగించాలని, డొమెస్టిక్‌ సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు రవీందర్‌, హసీనా బేగం, విక్రమ్‌, డీడబ్ల్యూఓ కో దండరాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌ గౌ డ్‌, గ్యాస్‌ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.

మహిళా సంఘాలు ముఖ్య పాత్ర వహించాలి

మహిళా సంఘాలు వ్యవసాయ రంగంలో ముఖ్య పాత్ర వహించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పిలుపునిచ్చారు. జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మార్క్‌ ఫెడ్‌ ప్రతినిధులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో మంగళవారం కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో మొక్కజొన్న సాగు, కోతలు, కొనుగోళ్లు మొదలు కావడంతో వాటికి సంబంధించిన కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి అంబి కాసోని, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత, ఏడీఏలు, అడిషనల్‌ పీడీలు, అధికారులు పాల్గొన్నా రు. అనంతరం పెంబర్తిలో నిర్మాణంలో ఉన్న జిల్లా సమైక్య భవనాన్ని కలెక్టర్‌ పరిశీలించి నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement