వారణాసి: గంగా నదిలో పడవలో విహరిస్తూ చికెన్ బిర్యానీతో ఇఫ్తార్ విందు చేసుకున్నందుకు యూపీ పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. ప్రార్థనా ప్రదేశాన్ని అపవిత్రం చేశారని, మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే, విందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీనిపై బీజేపీ యువమోర్చా నగర విభాగం అధ్యక్షుడు రజత్ జైశ్వాల్ కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గంగా నది మధ్యలో విహరిస్తూ వీరు మిగిలిన ఆహారపదార్థాలను నీళ్లలోకి పడవేసి అపవిత్రం చేశారని ఆరోపించారు. హిందువులు మనోభావాలను ఉద్దేశపూర్వకంగా కించపరిచారన్నారు. ప్రపంచ దేశాల నుంచి నిత్యం ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులు గంగా నదిని పవిత్రంగా భావిస్తారని, పూజలు చేస్తారని తెలిపారు.
In Varanasi, 14 Muslim youths were arrested after holding an Iftar Party on a boat in the Ganga River.
An FIR was filed alleging that they consumed chicken biryani during iftar and threw leftover bones into the river, which reportedly hurt religious sentiments.
The complaint… pic.twitter.com/VDIdIE3cWi— زماں (@Delhiite_) March 17, 2026


