breaking news
Uttar Pradesh
-
పేరు మార్చి ప్రేమ నాటకం.. నిలదీస్తే కారు ఎక్కించిన ప్రియుడు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో దారుణ ఘటన జరిగింది. తనను మోసం చేశాడని అడ్డుకున్న ప్రియురాలిపై ప్రియుడు ఏకంగా కారు ఎక్కించాడు. లక్నోలోని ప్రఖ్యాత జనేశ్వర్ మిశ్రా పార్క్ సమీపంలో జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రియుడిని నిలదీసిన యువతిపై, నిందితుడు రాక్షసంగా వ్యవహరించిన తీరు సర్వత్రా ఆందోళనలు రేకెత్తిస్తోంది.వివరాల్లోకి వెళితే.. అనామిక అనే యువతి, షహన్వాజ్ కొంతకాలంగా పరిచయంలో ఉన్నారు. అయితే, మరో యువతితో షహన్వాజ్ కారులో తిరుగుతుండగా అనామిక రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో గొడవకు దిగింది. వివాదం ముదిరడంతో షహన్వాజ్ కారులో అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా, యువతి అడ్డుకునే యత్నం చేసింది. అయితే ఆ సమయంలోనూ తన ప్రియుడు ఏమాత్రం కనికరం చూపకుండా కారుతో వేగంగా కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. అంతటితో ఆగకుండా కిందపడిపోయిన ఆమెపైకి వాహనం ఎక్కించేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన లక్నో పోలీసులు, ప్రధాన నిందితుడు షహన్వాజ్ను అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే సదరు యువతిని పేరు మార్చి (యష్ ఠాకూర్) పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. Lucknow - A woman was struck by a car and carried on its bonnet for some distance during a dispute near Janeshwar Mishra Park on Wednesday morning, according to police. A video of the incident has circulated widely on social media. Preliminary police accounts said the woman saw… pic.twitter.com/9setQbAQYs— NextMinute News (@nextminutenews7) September 16, 2026 -
సీఎం కోటాలో నిన్ను ఐఏఎస్‌ను చేస్తా!
‘‘మీరు చాలా అందంగా ఉంటారు. అంతకంటే మంచి మనసు కూడా ఉంది. మీ వ్యక్తిత్వమూ ఎంతో అద్భుతమైంది. ఇవన్నీ కాదండీ.. మీరు ఓ కంప్లీట్ ఉమెన్. మీరు చేసే పని మీకు అస్సలు సూట్ కాలేదు. నేను గనుక రాజకీయాల్లో కొనసాగితే.. రేపు మా పార్టీ అధికారంలోకి వస్తే సీఎం కోటాలో మీకు ఏఐఎస్ జాబ్ ఇప్పిస్తా’’ .. ఇలా ఓ వాట్సాప్ మెసేజ్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. బ్యాంక్ ఉద్యోగి అయిన ఆమెను ఏకంగా ఐఏఎస్‌ను చేస్తానంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడా నేత. కాకపోతే అధికారంలోకి వస్తేనే ఆ పని చేస్తాడంట. అందుకోసం ఆమెను ‘కాంప్రమైజ్’ కావాలంటూ వేధించాడాయన!. ఓ బ్యాంక్ ఉద్యోగిని సంచలన ఆరోపణలతో ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేగింది. సమాజ్‌వాదీ పార్టీ మైనారిటీ విభాగం కార్యదర్శి రాజన్ రిజ్వీ తనను వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించిందామె. అంతేకాదు.. తనకు పంపిన పలు మెసేజ్‌లను మీడియా ముందు రిలీజ్ చేయడం తీవ్ర దుమారం రేపింది. రోజూ నా వెంటపడే వాడు. ఏదో ఒక పని మీద రిజ్వీ రోజూ బ్యాంక్‌కు వచ్చేవాడని.. తోటి సిబ్బందిని ప్రలోభపెట్టి తన నెంబర్ సంపాదించాడని.. అప్పటి నుంచి వేధించడం మొదలుపెట్టాడని ఆమె ఆంటోంది. గట్టిగా నిలదీస్తే బెదిరింపులకు దిగాడని ఆరోపిస్తోంది. అంతేకాకుండా.. ఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తనకు సీఎం కోటాలో ఐఏఎస్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రిజ్వీ ఆశ చూపుతున్నాడని చెబుతోంది. ఈ మేరకు రిజ్వీ చేసినట్లుగా ఉన్న వాట్సాప్ మెసేజ్‌లను బయటపెట్టిందామె."मुझे आपकी पर्सनालिटी पर ये जॉब अच्छी नहीं लगती। अगर भविष्य में राजनीति में आगे जाता हूं और सपा की सरकार बनती है तो मैं आपको CM कोटे से IAS बनवाने की कोशिश करुंगा"बैंक की महिला कर्मचारी को यह मैसेज करने वाला सपा नेता राजन रिजवी है। पुलिस ने FIR कर ली है।📍मथुरा, उत्तर प्रदेश pic.twitter.com/YfBHGXOG3Q— Sachin Gupta (@Sachingupta) September 16, 2026వేధింపులు ఎక్కువయ్యేసరికి తాను ఫోన్ ఎత్తడం మానేశానని.. దీంతో సరాసరి బ్యాంక్‌కు వచ్చి అందరి ముందే బెదిరించాడని చెప్పిందామె. అంతేకాదు.. తన కుటుంబాన్ని సైతం టార్గెట్ చేసుకున్నాడని.. గూండాలతో వాళ్లపై నిరంతరం నిఘా పెడుతున్నాడని వాపోయింది. భరించలేకనే ఇలా పోలీసుల ముందుకు రావాల్సి వచ్చిందని తెలిపింది. ఈ నేపథ్యంతో మధురలోని కొత్వాలి పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేయగా.. సెప్టెంబర్ 15న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఎస్పీ చర్యలు..రిజ్వీ వ్యవహారాన్ని ఆధారంగా చేసుకుని అధికార బీజేపీ ప్రతిపక్ష ఎస్పీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అయితే కేసు నమోదైన నేపథ్యంలో రాజన్ రిజ్వీని సమాజ్‌వాదీ పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. మహిళల భద్రత విషయంలో ఎలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: ఇలా కలిశారో లేదో.. అలా పని జరిగిపోయింది! -
యూపీలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
-
విడాకులు తీసుకున్న మహిళను నమ్మించి...
టీమిండియా వెటరన్ బౌలర్ మహ్మద్ షమీ సోదరుడు, క్రికెటర్ మహ్మద్ కైఫ్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని తనను మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విడాకులు తీసుకున్న మహిళను నమ్మించి...దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. క్రికెటర్ షమీ సోదరుడు కైఫ్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న సదరు మహిళకు కైఫ్ మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు.హోటల్‌కు రప్పించిబలవంతం మీద ఆమెను సెప్టెంబరు 9, 2023న కోల్‌కతాలోని ఓ హోటల్‌కు రప్పించి శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని కోరగా.. ఆమెతో స్నేహాన్ని తెంచుకున్నాడు. ఈ మేరకు సదరు మహిళ ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని అర్షియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కైఫ్‌పై కేసు నమోదైందని రిపోర్టర్ అభిషేక్ త్రిపాఠి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.అన్న మాదిరే బెంగాల్‌కు ఆడుతూ..కాగా అన్న షమీ మాదిరే కైఫ్ కూడా క్రికెటర్. ఉత్తరప్రదేశ్ వీరి సొంత రాష్ట్రం అయినప్పటికీ అన్న బాటలోనే దేశవాళీ క్రికెట్లో కైఫ్ బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్మద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు పలు దేశీ టోర్నమెంట్లలో ఆడుతున్నాడు. మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన అతడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటికి 40కి పైగా వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే.. ఇంతకుముందు కూడా ఓ మహిళ కైఫ్‌పై ఇదే తరహాలో ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ఆరోపించింది. అయితే, అధికారికంగా కేసు మాత్రం పెట్టలేదని సమాచారం. కాగా షమీపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.షమీపై కూడా గతంలో ఆరోపణలుషమీ భార్య హసీన్ జహాన్ స్వయంగా తీవ్రమైన ఆరోపణలతో కోర్టు మెట్లు ఎక్కింది. అతడికి వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపించడంతో పాటు ఫిక్సింగ్ చేస్తాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పటి నుంచి విడిగా ఉంటున్న వీరు.. భరణానికి సంబంధించి తరచూ ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తున్నారు. కాగా హసీన్ జహాన్ ఐపీఎల్లో చీర్ గర్ల్‌గా ఉన్న సమయంలో ఆమె ప్రేమలో పడ్డ షమీ.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అయితే, అప్పటికే హసీన్‌కు వివాహమై కూతురు కూడా ఉన్నట్లు సమాచారం. షమీ- హసీన్‌కు కూడా ఓ కుమార్తె జన్మించింది.చదవండి: వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి? -
రష్యా పోలీసులు చిత్రహింసలు పెట్టారు
కాన్పూర్: రష్యా రాజధాని మాస్కోలో పోలీసులు తనను అనవసరంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేశారని యూపీలోని కాన్పూర్‌కు చెందిన చందన్ గుప్తా(45) ఆరోపించారు. నోయిడాలోని యూఫ్లెక్స్ అనే కంపెనీ తరఫున 2023 నుంచి భార్య, కుమారుడితోపాటు మాస్కోలో ఉంటున్నట్లు చందన్ చెప్పారు. రష్యా పోలీసుల కస్టడీలో దాదాపు 48 గంటలు గడిపిన తర్వాత మాస్కో నుంచి తిరిగి స్వదేశానికి వచ్చేశానన్నారు. అక్కడి పోలీసులు తనను, తన స్నేహితుడిని దుర్భాషలాడటంతోపాటు, బెదిరించి, చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ఈ సంఘటన తనను ఎంతో వేదనకు గురిచేసిందని, ఇకపై రష్యా ఒక్కటే కాదు, విదేశాలలో ఎన్నడూ పనిచేయరాదని నిర్ణయించుకున్నట్లు శనివారం చెప్పారు. ‘ఈ నెల 5వ తేదీ రాత్రి మిత్రుడు ఆశిష్‌తో కలిసి మాస్కోలోని కిటే గొరోడ్ మెట్రో స్టేషన్‌కు, హాంగింగ్ బ్రిడ్జి, అటు నుంచి రెడ్ స్క్వేర్ వైపు నడిచి వెళ్తుండగా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. తాము మద్యం మత్తులో ఉన్నట్లు, అంబులెన్సు కిటికీ అద్దాన్ని పగులగొట్టామని ఆరోపిస్తూ చిత్రహింసలకు గురిచేశారు. ఏవో పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. కుటుంబసభ్యులు, మిత్రులను కూడా కలవనివ్వలేదు. మా కంపెనీ లాయర్ల జోక్యంతో దాదాపు 48 గంటల తర్వాత విడిచిపెట్టారు’అని ఆరోపించారు. రెండు రోజుల క్రితం చందన్ గుప్తా భార్య స్నేహ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తన భర్తను విడిపించేందుకు సాయం చేయాలంటూ యూపీ సీఎం యోగిని అందులో కోరారు. మాస్కోలోని భారత ఎంబసీ తమకు ఎటువంటి సాయం చేయలేదని, రష్యా పోలీసులు చేసిన ఆరోపణలనే వినిపించిందన్నారు. -
రూ. 250లతో చెట్టు కింద ఉచిత స్కూలు: KBC 18 కంటెస్టెంట్ ఇంట్రస్టింగ్ స్టోరీ
అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి 18' గురువారం ఎపిసోడ్లో, ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన రోల్ఓవర్ కంటెస్టెంట్ 27 ఏళ్ల ఉద్దేశ్య సచన్ రూ. 25 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నంలో విఫలమై, రూ. 12.5 లక్షల నగదు బహుమతితో గేమ్‌నుంచి నిష్క్రమించారు. అయితే ఈ ఎపిసోడ్ సందర్భంగా ఉద్దేశ్య వెల్లడించిన వివరాలు నెట్టింట విశేషంగా నిలిచాయి.కాన్పూర్‌లో పేద పిల్లల కోసం ఒక పాఠశాలను నడుపుతున్నానని, అక్కడ 400 మంది పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్నానని ఉద్దేశ్య సచన్ చెప్పారు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం తన తల్లి వద్ద రూ. 250 అప్పుగా తీసుకుని ఒక చెట్టు కింద కొద్దిమంది పిల్లలకు పాఠాలు చెప్పడం ద్వారా ఈ పాఠశాలను ప్రారంభించారు. గత కొన్నేళ్లలో ఈ పాఠశాల విస్తరించి, ప్రస్తుతం సొంత భవనాన్ని కలిగి ఉంది. 12వ తరగతి వరకు పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఫీజులు లేకుండా మరింత మంది పిల్లలకు విద్యను అందించడానికి దీనిని ఇంకా విస్తరించాలని ఆయన భావిస్తున్నారు.ఇదీ చదవండి: నేనో పెద్ద ప్రకటన చేయబోతున్నా : కేజ్రీవాల్ ట్వీట్ వైరల్విద్యావ్యవస్థ చాలా ఖరీదైనదిగా మారిందని, పేద పిల్లలు చదువుకోలేకపోతున్నారనే ఈ పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. వీరిలో చాలామంది పిల్లలు సమీపంలోని మురికివాడల (స్లమ్స్) నుండి వస్తారు. దీని ద్వారా తనకు ఎలాంటి ఆదాయం రాదని, తన ప్రాథమిక అవసరాలైన ఆహారం, నివాసం తన అన్నయ్య చూసుకుంటారని తెలిపారు.కాగా ఉద్దేశ్య తండ్రి దర్జీగా (టైలర్) పనిచేస్తూ నెలకు రూ. 4000-5000 మాత్రమే సంపాదించేవారు. విద్యుత్ షాక్ కారణంగా ఆయన తల్లి అనారోగ్యానికి గురైన తర్వాత కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. తండ్రి ఫీజు చెల్లించలేకపోవడంతో ఉద్దేశ్యను 6 - 9 ఏళ్ల వయస్సులో రెండుసార్లు పాఠశాల నుండి పంపించివేశారు. ఫీజులు చెల్లించనందుకు పాఠశాల ఉపాధ్యాయులు ఆయన తల్లిదండ్రులను తరచూ అవమానించేవారని గుర్తు చేసుకున్నారు. ఆ వయసులోనే అయన అనుభవించిన అవమానాలు, మానసిక క్షోభే ఈనాటి ఉచిత విద్యకు పునాది అని చెప్పారు.ఇదీ చదవండి : నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్రూ. 250తో స్కూలుకు నాంది పడిందిలా ధాబా, కేఫ్ ,కొన్ని కర్మాగారాల్లో (ఫ్యాక్టరీలు) చిన్న చిన్న పనులు చేస్తూ, తండ్రి సహాయంతో తన చదువును పూర్తి చేశారు. అయితే తనలాంటి పిల్లలు ఇంకా చాలామంది ఉంటారని గ్రహించి, వారి జీవితాలను మార్చడానికి విద్య ఒక్కటే మార్గమని నమ్మి ఈ దిశగా అడుగులు వేశారు.తన తల్లి వద్ద రూ. 250 అప్పుగా తీసుకుని స్థానికంగా ప్రచారం చేయడానికి కొన్ని పాంప్లెట్లు ప్రింట్ చేయించి పాఠశాలను ప్రారంభించినట్లు ఉద్దేశ్య చెప్పారు. ప్రారంభ రోజుల్లో ఆయన ఇంటింటికీ వెళ్లి పిల్లలను చదువుకోవడానికి ప్రోత్సహించేవారు. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ఆయన పాఠశాలకు విరాళాలు ఇచ్చారు. నటుడు ఆర్. మాధవన్ దీనిపై ఒక పోస్ట్ షేర్ చేసినప్పుడు పాఠశాలకు భారీగా విరాళాలు వచ్చాయి. ఇది విన్న అమితాబ్ బచ్చన్ కూడా తన సోషల్ మీడియా ద్వారా ఈ పాఠశాల గురించి ప్రచారం చేస్తానని ప్రకటించారు.KBC 18లో ఉద్దేశ్య ఎదుర్కొన్న రూ. 25 లక్షల ప్రశ్న: ఏ ప్రాచీన భారతీయ పాలకుడిని 'అమిత్రఘాత' అనే బిరుదుతో కూడా పిలిచేవారు?ఆప్షన్లు: సమ్రాట్ అశోకుడు, బింబిసారుడు, సముద్రగుప్తుడు, బిందుసారుడుఉద్దేశ్య 'మహాఫ్లిప్' లైఫ్‌లైన్ ఉపయోగించిన తర్వాత ఈ ప్రశ్న వచ్చింది. దీని సమాధానంపై కూడా ఆయనకు స్పష్టత లేకపోవడంతో 50:50 లైఫ్‌లైన్ ఎంచుకున్నారు. లైఫ్‌లైన్ తర్వాత తెరపై మిగిలిన రెండు ఆప్షన్లు: బింబిసారుడు , బిందుసారుడు.సరియైన సమాధానం తెలియకపోవడంతో, ఆయన గేమ్‌ను క్విట్ చేసి క్విట్ చేసిన తర్వాత, ఊహించి ఒక సమాధానం చెప్పమని కోరగా, ఆయన 'బిందుసారుడు' అని చెప్పారు. నిజానికి అదే సరైన సమాధానం.‘అమిత్రఘాత’ అంటేమగధను పాలించిన మౌర్య సామ్రాజ్య రెండవ చక్రవర్తి బిందుసారుడిని 'అమిత్రఘాత' అని పిలిచేవారు. బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుని కుమారుడు, అలాగే మౌర్య సామ్రాజ్యంలో అత్యంత ప్రసిద్ధ పాలకుడైన అశోకుడి తండ్రి. బిందుసారుడి పాలన క్రీ.పూ. 297 నుండి క్రీ.పూ. 273 వరకు కొనసాగింది. ఈ పేరు 'అమిత్ర' (శత్రువు), 'ఘాత' (సంహారకుడు) అనే పదాల కలయికతో ఏర్పడింది. అంటే "శత్రు సంహారకుడు" అని అర్థం. విశేషమేమిటంటే, ప్రాచీన గ్రీకు రచయిత స్ట్రాబో ఆయనను 'అమిట్రోచేట్స్' (Amitrochates) అని పిలిచారు, సంస్కృత పదం,అమిత్రఘాతను గ్రీకులో 'అమిట్రోచేట్స్ అంటారు. -
భార్య.. భర్త.. ప్రియుడు.. ముగ్గురూ మంచోళ్లే!
వివాహేతర సంబంధాల మోజులో నేరాలు ఘోరాలు జరుగుతున్న రోజుల్లో.. భర్తను చంపే భార్యలు, భార్యలను హతమార్చే భర్తలు, ప్రేమ పేరుతో బ్లాక్మెయిల్ చేసే ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. కానీ దీనికి పూర్తి భిన్నంగా.. ఒక భార్య తనకు భర్త వద్దని, ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో ఆ భర్త తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కథలో ట్విస్టులు మాత్రం సినిమాను మించి ఉన్నాయి!..ఈవీవీ డైరెక్షన్లో వచ్చిన కన్యాదానం చిత్రంలో.. తన స్నేహితుడి ప్రేమను నిలబెట్టేందుకు భార్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపిస్తాడు హీరో. ఆ క్లైమాక్స్‌ను ఏమాత్రం తీసిపోని రేంజ్లో జరిగిన ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటే.. ఆమె మాత్రం అతను వద్దని తెగేసి చెప్పింది. దీంతో ఆ సినిమాలో శ్రీకాంత్ చేసినట్లే.. ప్రియుడి వద్దకే భార్యను చేర్చాడా భర్త. లక్నోకు చెందిన ప్రాంతీయ రక్షక్ దళ్ (PRD) జవాన్ విక్కీకి సొనాలీతో ఏడాది క్రితం వివాహమైంది. అయితే పెళ్లికి ముందే సొనాలీకి తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇద్దరూ స్కూల్ టైం నుంచే స్నేహితులు. ఆ స్నేహం కాస్తా వాళ్లతో పాటే పెరిగి ప్రేమగా మారింది. అయితే అతనితో వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదు. బలవంతంగా విక్కీకి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆమె తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. భర్తను మోసం చేయొద్దని.. సుఖంగా కాపురం చేసుకోమని ఆ ప్రియుడు ఆమెకు హితబోధ చేస్తూ వచ్చాడు. అయితే ఆమె మాత్రం అలా ఉండలేనంటూ తెగేసి చెప్పింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న సొనాలీ అత్తింటి నుంచి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త విక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సమీప జిల్లాలకు సమాచారం పంపి గాలింపు చేపట్టారు. చివరకు..సొనాలీ హర్దోయ్‌లో ఓ వ్యక్తితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. అతను తన ప్రియుడని చెప్పడంతో అంతా కంగుతిన్నారు. బుధవారం పోలీసులు ఇద్దరినీ లక్నోకు తీసుకొచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడించారు. గంటల తరబడి నచ్చజెప్పినా సొనాలీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భర్తతో ఒక్క క్షణం కూడా ఉండటం తనకు ఇష్టం లేదని, తన చిన్ననాటి ప్రియుడితోనే జీవితాంతం ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేసింది. ఆ సమయంలో ప్రియుడు.. భర్త వద్దకే వెళ్లిపోవాలంటూ సూచించడం గమనార్హం.అయితే భార్య మాటలు విన్న విక్కీ కొంతసేపు షాక్‌కు గురైనా.. చివరకు ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. “ఇందులో బలవంతం ఏమీ లేదు. ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో వారితోనే ఉండు” అని చెప్పాడు. అనంతరం ఇరువర్గాల అంగీకారంతో అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత సొనాలీ, ఆమె చిన్ననాటి ప్రియుడు స్థానిక ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేశారు. ఈ సమయంలో ఆమె భర్త విక్కీ స్వయంగా భార్యను ప్రియుడికి అప్పగించాడు.పెళ్లి తర్వాత కూడా చిన్ననాటి ప్రేమను కొనసాగించిన సొనాలీ.. చివరకు తన ప్రియుడినే ఎంచుకుంది. అయితే ఈ ప్రేమకథలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలు బయటపడితే గొడవలు, దాడులు, హత్యలు, బ్లాక్‌మెయిలింగ్‌ల వరకు వెళ్లే ఘటనలు చూస్తుంటాం. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు.. భర్త బలవంతం చేయకుండా భార్య నిర్ణయాన్ని గౌరవించాడు. అంతేకాదు.. ఆమె చేయిని ప్రియుడి చేతిలో పెట్టి దగ్గరుండి పెళ్లి జరిపించాడు. ఆ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది.In #Lucknow's Malihabad, a PRD (Prantiya Rakshak Dal) jawan arranged his wife's marriage to her lover. His wife had run away from home, and upon discovering she was having an affair, the husband deemed it appropriate to have her married to the man rather than create a dispute. pic.twitter.com/9SC6Vdq05m— Siraj Noorani (@sirajnoorani) September 11, 2026 -
5జీ వేగం తగ్గిందని.. మొబైల్ టవర్‌కు కట్టేశారు..!
మనిషిని చెట్టు కట్టేయడం.. టవర్లకు కట్టేయడం అనేది ఎవరైనా తప్పు చేసిన సందర్భాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువ గ్రామ స్థాయిలో తారస పడుతూ ఉంటుంది. ఊరంతా ఒక్కటై తప్పు చేసిన మనిషిని స్తంభాలకో, చెట్లకో, టవర్లకో కట్టేస్తూ ఉంటారు. ఇది అనాగరిక సంస్కృతే అయినా ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. కానీ ఇక్కడ చిత్రమేమింటంటే ఓ వ్యక్తి ఒక సంస్థలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నందుకు ఈ అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి అసలు కారణం 5జీ నెట్వర్క్.. ఇది ప్రస్తుతం అత్యంత వేగవంతమైన నెట్వర్క్. ఇది మనకు తెలిసిన విషయమే. మొబైల్ చూడటంలో కానీ వాడటంలో కానీ వేగానికి అలవాటు పడిన ప్రస్తుత సమాజంలో అత్యధిక శాతం మంది.. 5జీ నెట్వర్క్ పట్ల ఆకర్షితులయ్యారనేది కాదనలేని సత్యం. మరి ఆ వేగంలో ఏమైనా మార్పులు వచ్చి ఆ నెట్వర్క్ స్పీడ్ తగ్గితే.. వారు చాలా స్పీడ్‌గా రియాక్ట్ అవుతారనడానికి తాజా ఘటనే ఉదాహరణ. ఇక్కడ సాటి మనిషి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నామా.. అనే సంగతిని కూడా మర్చిపోయి మరీ రెచ్చిపోయారు.తమ ఊరిలో 5జీ నెట్వర్క్ స్పీడ్ తగ్గిందనే కారణంతో సదరు సంస్థకు సంబంధించిన టెక్నీషియన్‌ను మొబైల్ టవర్‌కు కట్టేసిన వైనం వెలుగు చూసింది. సాధారణంగానే ఆ టెక్నీషియన్ ఊరిలోకి వచ్చిన సందర్భంలో గ్రామస్తులు తిరగబడ్డారు. తాము 5జీ నెట్‌వర్క్‌ను వాడుతుంటే అది ఎందుకు సరిగా పనిచేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఇన్‌స్టా రీల్స్ సరిగా స్ట్రీమింగ్ కావడం లేదని ఆరోపిస్తూ సదరు టెక్నీషియన్‌ను మొబైల్ టవర్‌కు కట్టేసి ఎవరొస్తారో రండి అంటూ కూడా సవాల్ విసిరారు. దీనిపై ఆ సంస్థకు చెందిన అధికారులు వచ్చి 5జీ నెట్వర్క్ స్పీడ్‌ను పెంచే వరకూ టెక్నీషియన్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఏమైతే కనెక్టివిటీ సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే ఉన్నతాధికారులు వచ్చి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫతేపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. Frustrated that Instagram Reels wouldn’t stream properly due to poor 5G speeds, angry villagers in UP's Fatehpur tied a Jio technician to the mobile tower and demanded that senior officials come to the site immediately to fix the connectivity problems. pic.twitter.com/eVE0kFDjfA— Piyush Rai (@Benarasiyaa) September 11, 2026 ఇదీ చదవండి:కాబోయే భార్యను ఇంప్రెస్ చేద్దామని.. -
‘అమ్మనా కోడలా?’.. స్టెప్పులేస్తూ.. మామ ప్రాణం తీయించింది
లక్నో: ప్రముఖ వ్యాపారి వినీత్ మనోచా హత్య కేసులో కోడలు షాలు(30) దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సుఫారీ గ్యాంగ్ మనోచాను కత్తితో పొడుస్తున్న సమయంలో కోడలు షాలు బాలీవుడ్ ఓల్డ్ క్లాసిక్ పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు తేలింది. సంబంధిత దృశ్యాలు వెలుగులోకి రాగా.. పోలీసులు విచారణలో కోడలు షాలు సైతం అంగీకరించింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారి వినీత్ మీనోచా హత్య కేసుకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రూ.40 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న కుటుంబ వ్యాపారంలో తగిన స్వేచ్ఛ లేకపోవడం, చిన్న ఖర్చులకు కూడా మామను అడగాల్సి రావడం, ఇంట్లో సీసీటీవీల ద్వారా తన కదలికలపై నిరంతరం నిఘా పెట్టడంపై కోడలు షాలు తీవ్ర కక్ష పెంచుకుంది. అర్ధరాత్రి వరకు పార్టీలకు వెళ్లనివ్వకపోవడం, ఆలస్యంగా రావడాన్ని ప్రశ్నించడమే ఈ దారుణానికి ప్రధాన కారణమని తేలింది.పోలీసులు నిందితుల కాల్ డీటెయిల్ రికార్డ్స్ పరిశీలించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. హత్యకు ముందు కేవలం 21 రోజుల్లో మాజీ పనిమనిషి విశాల్ గౌతమ్‌తో కుటుంబ సభ్యులు విపరీతంగా సంప్రదింపులు జరిపారు. కోడలు షాలు సుమారు 30 సార్లు, ఆమె భర్త సుబ్రత్ సుమారు 300 సార్లు విశాల్‌తో ఫోన్లో మాట్లాడారు. మొత్తం కలిపి ఈ సంఖ్య 330కి చేరింది. హత్య జరిగిన రోజు ఒక్కరోజే ఉదయం నుంచి రాత్రి వరకు షాలు, విశాల్ మధ్య ఏకంగా 14 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.జూలై 28న ఆలస్యంగా ఇంటికి వచ్చిన షాలు మామతో గొడవ పడిన తర్వాతే ఈ హత్యకు ప్లాన్ వేసింది. మాజీ పనిమనిషి విశాల్ గౌతమ్‌కు రూ.6 లక్షలకు సుపారీ ఇచ్చి, ముందుగా రూ.2 లక్షలు చెల్లించి డూప్లికేట్ తాళం చెవిని అందజేసింది. పథకం ప్రకారం హత్యకు గురైన రోజు షాలు, ఆమె భర్త తమ బిడ్డతో కలిసి కాన్పూర్‌లోని కాస్మోజిన్ లాంజ్‌లో జరిగిన పార్టీకి వెళ్లారు.అక్కడ షాలు తన స్నేహితులతో కలిసి బాలీవుడ్ పాటలకు స్టెప్పులెస్తోంది. మరోవైపు మామను ఎలా హత్య చేయాలో నిందితులకు గైడెన్సీ ఇచ్చింది. సరిగ్గా అదే సమయంలో విశాల్, మరో నిందితుడు రాజ్ కిషోర్ మందులు ఇవ్వడానికి వచ్చామంటూ సెక్యూరిటీ గార్డ్‌ను నమ్మి లోపలికి వెళ్లారు. 63 ఏళ్ల వినీత్ మీనోచాను కత్తితో పొడిచి చంపారు.పోలీసుల అరెస్టుఅర్ధరాత్రి 3 గంటలకు షాలు దంపతులు ఇంటికి తిరిగి వచ్చేసరికి వినీత్ మీనోచా రక్తపు మడుగులో పడి ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు, ఎన్కౌంటర్ తర్వాత నిందితులు విశాల్, రాజ్ కిషోర్లతో పాటు సూత్రధారైన కోడలు షాలును అరెస్టు చేశారు. మొదట అమాయకురాలిగా నటించినప్పటికీ, పోలీసుల విచారణలో షాలు తన నేరాన్ని అంగీకరించింది. -
ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాన్ని కాదని యోగ టీచర్‌గా!
సురక్షితమైన, స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామంది యువత డ్రీమ్ అలాంటి ఉద్యోగాన్ని వద్దనుకోవడానికి చాలా గట్స్ ఉండాలి. తీరా ఆ నిర్ణయం భవిష్యత్తులో బాధను కలిగించకుండా ఉంటుందా అనే సందేహాం సదా వెంటాడుతుంటుంది. అయినా సరే ఇంతటి భయానక నిర్ణయం తీసుకుంది ఈ మహిళ. అది కూడా దేని కోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు.ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్నిగ్ధా బోస్ సురక్షితమైన స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని కాలదన్నుకుంది. ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా మంచి జీతం ఆర్జించే ఉద్యోగాన్ని వదులకుందామె. అసలు ఈ నిర్ణయాన్ని చాలామంది తప్పుబట్టారు, వెర్రి నిర్ణయంగా అభివర్ణించారు. అయితే ఆ ఉద్యోగంలో తను పనిచేస్తున్నట్లుగా అనిపించలేదని, నిరంతరం ఒత్తిడి, మానసిక అలసట, సొంత శరీరంలో అనుసంధానం కావడానికి సమయమే లేనట్లుగా అనిపించిందని చెబుతుంది. ఏదో ఉక్కిరిబిక్కిరిగా అనిపించి ఆ ఉద్యోగం వదిలేసినట్లు పేర్కొంది స్నిగ్ధా. ఆ తర్వాత మీరట్‌లో యోగాకి సంబంధిచిన 'తులా వెల్నెస్ స్టూడియోని నడుపుతున్నట్లు తెలిపింది. తనకు ఆర్థిక భద్రత కంటే వ్యక్తిగత శ్రేయస్సే ముఖ్యమనిపించిందని అంటోంది. ఇలా తనలా ఉద్యోగం మానేసేంత సౌలభ్యం అందరికీ ఉండకపోవచ్చు. అలాగే తనలా చేయాల్సిన పనిలేదు కూడా. ఒత్తిడితో ఉద్యోగం చేస్తూ కూడా ఆరోగ్యాన్ని చూసుకోచ్చు. ఒక పక్క ఉద్యోగం, అలాగే శారీరక బలం పెంపొందిచుకునేలా చురుగ్గా ఉండే ప్రయత్నం చేయొచ్చని అంటోంది. చెప్పాలంటే జీవితాన్ని మార్చకుండానే ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయొచ్చని, కానీ తనకు ఆ అవకాశం ఉంది కాబట్టి మానసిక ఆరోగ్యమే ప్రధానంగా భావించి, ఇలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నా అని సోషల్ మీడియా వేదికగా తన స్టోరీని పంచుకుంది స్నిగ్ధా. అంతేగాదు నెటిజన్లు కూడా మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న స్నిగ్ధ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ..తమ అనుభవాల్ని పంచుకున్నారు. మరొక యూజర్ తాను కూడా ఎస్బీఐలో ఉద్యోగం మానేసి తనకు నచ్చి గోల్ప్ క్రీడపై ఫోకస్ పెట్టి అంతర్జాతీయ క్రీడాకారిణిగా దూసుకుపోతున్నా అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Snigdha | Certified Yoga & Pranayam Instructor (@tulaa_wellness) (చదవండి: అర ఎకరం..ఏడాదికి రూ. 80 లక్షలు!) -
బీజేపీ ‘మిషన్ 115’.. స్పెషల్ ఆపరేషన్!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన స్థానాలతోపాటు తాము బలహీనంగా ఉన్న స్థానాలపై బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఆయా స్థానాల్లో కచ్చితంగా గెలుపు బావుట ఎగురవేయాలని నిశ్చయించుకుంది.ఇందుకోసం నేరుగా కేంద్ర నాయకత్వమే రంగంలోకి దిగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్.సంతోష్, ఉత్తరప్రదేశ్ బీజేపీ ఇన్చార్జి వినోద్ తావ్డేలు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సంస్థాగత పరిస్థితి, సామాజిక సమీకరణాలు, ఓడిన సీట్లలో గెలుపు వ్యూహాలపై గురువారం నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించనున్నారు.ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన వ్యూహరచన 2022 అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ పార్టీలు బలంగా నిలిచిన 115 అసెంబ్లీ నియోజక వర్గాలపై బీజేపీ గురిపెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ప్రజల్లో పార్టీ ప్రభావాన్ని పెంచే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. పార్టీ అగ్రనాయకత్వం ఆయా స్థానాల్లో పర్యటించబోతోంది. ఇందులో భాగంగానే నితిన్ నబిన్ సెప్టెంబర్ 12, 13 తేదీల్లో మీరట్ నుంచి పశ్చిమ యూపీ పర్యటనను ప్రారంభిస్తారు.రాష్ట్రంలోని ఆరు కీలక ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 71 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీని మరింత బలోపేతం చేయాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. తమ కూటమిలోని పార్టీల బలాబలాలను సైతం అంచనా వేయడం, జాట్ వర్గాన్ని కలుపుకునేలా వారితో సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన వ్యూహరచన సాగించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. బలం పెంచుకోవడానికి ప్రత్యేక బృందాలు బీఎల్ సంతోష్ ఈ నెల 10, 11 తేదీల్లో లక్నోలో అవధ్, కాన్పూర్ ప్రాంతాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అవధ్‌లో 82, కాన్పూర్‌లో 52 అసెంబ్లీ స్థానాల పరిధిలో పార్టీ పరిస్థితిని ఆయన సమీక్షిస్తారు. ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్‌లతో భేటీ అయ్యే అవకాశం ఉంది. వినోద్ తావ్డే ఇప్పటికే యూపీలో ఒక పర్యాయం పర్యటించారు. పార్టీ స్థితిగతులపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించారు. ప్రాంతీయంగా బ లం పెంచుకోవడానికి నేతలు, కార్యకర్తలతో కొన్ని బృందాలు ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఆయన మరోసారి రాష్ట్రంలో పర్యటించి సంస్థాగత ఏర్పాట్లను పరిశీలించనున్నారు.2022లో ఓడిన అసెంబ్లీ స్థానాలు, 2024లో బీజేపీ వెనుకబడిన లోక్‌సభ స్థానాల్లో పార్టీని తిరు గులేని శక్తిగా మార్చడం, బలహీనతలను సరిదిద్దడం, సామాజిక సమీకరణాలను అనుకూలంగా మార్చుకోవడం బీజేపీ ప్రధాన అజెండాగా కనిపిస్తోంది. 2027లో జరిగే ఎన్నికలకు ముందే పార్టీని పూర్తిస్థాయిలో ఎన్నికల వాతావరణంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర నాయకత్వం వరుసగా యూపీ పర్యటనలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: విజయ్ కూటమికి కొత్త పేరు.. తమిళనాట కొత్త లెక్కలు -
‘‘మీరంతా సల్లబడేటట్టు చేస్తా.. జాగ్రత్త’’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత 2 వారాలుగా పలు సమస్యలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో ఓ పోలీసు అధికారి నిరసన చేస్తున్న విద్యార్థులను తీవ్రంగా హెచ్చరిస్తూ కనిపించారు. క్యాంపస్‌లో అదనపు పోలీసు బలగాలను మోహరిస్తానని ఆయన హెచ్చరించారు.“ఇంకా బలగాన్ని రప్పిస్తాను.. మీరంతా సల్లబడేటట్టు చేస్తా. మేము గోరఖ్‌పూర్ పోలీసులమని గుర్తుంచుకోండి” అని పోలీసు అధికారి హెచ్చరించినట్లు వీడియోలో వినిపిస్తోంది. వీడియోలో పోలీసు అధికారి చేయి పైకెత్తి పిడికిలి బిగిస్తూ ఆగ్రహంగా మాట్లాడటం కనిపించింది. విద్యార్థులతో ఆయన వాగ్వాదానికి దిగిన సమయంలో కొన్ని అసభ్య పదాలు కూడా వినిపించాయి.ఈ ఘటనపై గోరఖ్‌పూర్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. బహిష్కరణకు గురైన కొందరు విద్యార్థులు విశ్వవిద్యాలయ ప్రాక్టర్తో సమావేశమైన సమయంలో పరిస్థితి అదుపు తప్పిందని పోలీసులు తెలిపారు. కొంతమంది విద్యార్థులు ఆగ్రహానికి గురై ప్రాక్టర్పై దాడి చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు పేర్కొన్నారు.అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని ప్రాక్టర్ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారని తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని గోరఖ్‌పూర్ పోలీసులు తెలిపారు.పోలీసు అధికారి వ్యవహారంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. నిరసన చేస్తున్న వారు విద్యార్థులని, నేరస్థులు కాదని గుర్తుంచుకుని సంయమనం పాటించాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు.విద్యార్థుల నిరసనలు ఎందుకు?విశ్వవిద్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలతో విద్యార్థుల ఆందోళన తీవ్రతరమైంది. ఆగస్టు 25 నుంచి విద్యార్థులు క్యాంపస్‌లో నిరసన చేస్తున్నారు. 4 రోజుల క్రితం వారు నిరాహార దీక్ష కూడా ప్రారంభించారు. విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణ సంస్థకు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. డిగ్రీలు, మార్కుల పట్టాలు తీసుకునేందుకు కూడా విద్యార్థుల నుంచి రుసుములు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించకపోయినా విద్యార్థుల నుంచి విద్యార్థి సంఘం రుసుము వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో మెరుగైన భోజనం, ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రధానమంత్రి ఉషా పథకం కింద విశ్వవిద్యాలయంలో చేపడుతున్న పనుల కేటాయింపులో పారదర్శకత ఉండాలని వారు డిమాండ్ చేశారు. బహిష్కరించిన విద్యార్థులను తిరిగి చేర్చుకోవాలని కూడా కోరుతున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు.Chaos at Gorakhpur University as students on hunger strike erupt in protest.A Sub-Inspector arrives on the spot and threatens students: I’ll call so much force that I’ll cool you down. This is Gorakhpur Police.@myogiadityanath It’s 2026, and students are still being threatened… pic.twitter.com/pcL3h3LqUx— Voice of Hindus (@Voiceofhindus) September 9, 2026 -
రూ.1051 కోట్లు : రమణీయంగా మధుర..అయోధ్యలాంటి మేకోవర్!
అయోధ్య తరహాలో మథుర-బృందావన్ రూపురేఖలను మార్చి అత్యంత రమణీయంగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 1,051 కోట్ల ప్రణాళికను రూపొందిం. ఇందులో రూ. 540 కోట్ల విలువైన 62 ప్రాజెక్టులను ఇప్పటికే ప్రారంభించారు. మరో 167 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం విశేషం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ. 1,051 కోట్ల విలువైన 229 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. కృష్ణాష్టమి పర్వదినాన శ్రీకృష్ణ జన్మభూమి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఈ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.అయోధ్య, కాశీ తరహాలోనే మధుర-బృందావన్‌లో కూడా అత్యంత ఘనంగా ఆలయ సముదాయాలను నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.మధుర 2.0:మొత్తం రూ. 1,051 కోట్లలో ఇప్పటికే రూ. 540 కోట్ల విలువైన 62 ప్రాజెక్టులను ప్రారంభించగా, మరో రూ. 437 కోట్ల విలువైన 167 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా గృహ నిర్మాణ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 72 కోట్లు నేరుగా బదిలీ చేశారు.ప్రాజెక్టుకేటాయించిన నిధులుప్రయోజనంబృందావన్కు 4-లేన్ల హైవేరూ. 251 కోట్లుయమునా ఎక్స్‌ప్రెస్ వే నుండి నేరుగా బృందావన్‌కు అనుసంధానం చేస్తారు. దీని వల్ల ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయని భావిస్తున్నారు.యమునా నదిపై కొత్త వంతెన : 2-లేన్ల క్రాసింగ్ ద్వారా పాత వంతెనలపై భారం తగ్గింపు, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా. 12 అంతస్తుల పర్యాటక హాస్టల్స్. 47 కోట్లు పండుగల సమయంలో (జన్మాష్టమి, హోలీ, రాధాష్టమి) వచ్చే భక్తుల కోసం వసతి సౌకర్యం.ఛాతా మాస్టర్ ప్లాన్ రోడ్డు : రూ. 86 కోట్లు30 మీటర్ల వెడల్పుగల రోడ్డు ద్వారా భారీ వాహనాల మళ్లింపు, వాణిజ్య కార్యకలాపాల విస్తరణ.ఫ్లైఓవర్ & సౌందర్యీకరణరూ. 79 కోట్లుజాతీయ రహదారి (NH-19) నుండి బృందావన్ ప్రవేశ మార్గం ఆధునీకరణ (ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు, అండర్‌గ్రౌండ్ వైరింగ్).12 అంతస్తుల పర్యాటక వసతి గృహం: నయారా పోలీస్ లైన్స్ క్యాంపస్‌లో రూ. 47 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇది, జన్మాష్టమి, హోలీ, రాధాష్టమి వంటి పండుగల సమయంలో నగరం యాత్రికులతో నిండిపోయే రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్మాణం.బృందావన్‌లో ఒక పౌర శిక్షణా కేంద్రం: పరిశుభ్రత, స్మార్ట్ సేవలు , యాత్రికుల నిర్వహణపై మున్సిపల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే ఈ కేంద్రం కోసం రూ. 31 కోట్లు కేటాయించారు.ఇదీ చదవండి: సీజేపీ ఉద్యమకారుడికి నోటీసులా? సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహందీంతో పాటు బృందావన్‌లో కొత్త రోప్‌వే , భారీ పార్కింగ్ ప్రాజెక్టులు.సూర్దాస్ బ్రజ్‌భాషా అకాడమీ , 400 ఎకరాల్లో విస్తరించే ఆసియాలోనే అతిపెద్ద సిటీ ఫారెస్ట్ సిద్ధం కానుంది. ఇంకా కొత్త హైవేలు, ఫ్లైఓవర్లు నిర్మానంకానున్నాయి. ఫలితంగా ఢిల్లీ, నోయిడా నుండి మధుర-బృందావన్‌లకు ప్రయాణ సమయం కేవలం రెండు గంటలకు తగ్గనుంది. ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కోరుకునే వారికి, వారాంతపు పర్యాటకులకు బృందావన్ అత్యంత అనుకూలమైన కేంద్రంగా మారుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రిటైర్మెంట్ హోమ్స్ నిర్మించనున్నారు.ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసుఅయెధ్యలోరామమందిరి నిర్మాణంతో రామమందిరం సమీపంలో భూముల ధరలు భారీగా పెరిగాయి, పెట్టుబడిదారులు స్థలాలను దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు.ఇప్పుడిక శ్రీకృష్ణుని జన్మభూమి అయిన ఈ ప్రాంతంలో కూడా అటువంటి మార్పునే తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం, హోటళ్లు, సర్వీస్ అపార్ట్మెంట్లు, గెస్ట్ హౌస్‌లకు డిమాండ్ పెరుగుతుంది.ఇదీ చదవండి: ఆ ఒరంగుటాన్లు ఎక్కడివి? అనుమానాస్పదంగా మహీంద్ర బ్లాక్ థార్ -
ఒకప్పుడు సైన్యం కోసం రాకెట్లు..ఇవాళ చిన్నారుల ఫుడ్ బ్రాండ్ వ్యాపారం!
మాతృత్వం ఆ మహిళను ఆహార వ్యాపారం ప్రారంభించడానికి పునాది వేసింది. ముఖ్యంగా తన పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్ అందించాలనే అన్వేషణ ఇందుకు అంకురార్పణ. అలా వ్యాపార వేత్తగా మారి సక్సెస్ అందుకుందా అంటే..ఆ మహిళే ఉత్తరప్రదేశ్‌కి చెందిన జ్యోతి శ్రీ వాస్తవ భారత సైన్యం కోసం ఒకప్పుడు రాకెట్లు రూపొందించేది. కెమికల్ ఇంజనీర్ అయిన జ్యోతి నానో టెక్నాలజీ, రాకెట్ ప్రొపెల్లెంట్ల విభాగంలో మంచి నైపుణ్యం సాధించారామె. అలా ఆమె ఆర్మీ కోసం రాకెట్లు డిజైన్ చేసే విభాగంలో పనిచేసింది. అయితే ఆ వర్క్‌లో ఉండే తీవ్రమైన ఒత్తిడికి తట్టుకోలేగా ఆ ఉద్యోగానికి కొన్నాళ్లపాటు విరామం తీసుకునేలా రిజైన్ చేసింది. ఒక ఏడాది తర్వాత ఆమె గర్భవతి కావడం ఒక పండంటి మగబిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ చిన్నారికి ఘన ఆహారం కోసం అన్వేషిస్తున్నప్పుడే తెలిసింది మార్కెట్లో లభించేవన్నీ పోషకవంతమైనవి కావని. చిన్నప్పటి నుంచి సరైన ఆహారం అందిస్తేనే కదా వాళ్ల పెరుగుదల బాగుంటుందన్న ఆలోచన ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. ఆ క్రమంలో పడిన తపన మళ్లీ ఆమెను తన ఉద్యోగం వైపుకి వెళ్లకుండా ఫుడ్ వ్యాపారంలోకి దిగేలా చేసింది. మైదా లేనివి, శుద్ధి చేసిన చక్కెరలు ఉపయోగించిన ఆరోగ్యకరమైన ఆహారాలు ఇచ్చేలా యూనిసెఫ్ నుంచి శిక్షణ తీసుకుని మరి సర్టిఫికేషన్ పొందింది. అది ఆమెకు శిశువుల పెరుగుదల అభివృద్ధిలో వివిధ సూక్ష్మ, స్థూల పోషకాలు, ఖనిజాలు, విటమిన్ల పాత్రలను అర్థం చేసుకోవడానికి సహాయపడిందని అంటోంది. అలాగే పిల్లల ఆరోగ్యంలో వనమూలికల పాత్రను అర్థం చేసుకునేందుకు ఆయుర్వేదాన్ని అధ్యయనం చేసింది. ఆ తర్వాత వ్యాపారం పెట్టేందకు నిధులు కొరతతో ఇబ్బందులు ఎదురైనా..ఏదోలా కష్టపడి లిటిల్ చెర్రీ మామ్ అనే వ్యాపారాన్ని తన సొంతూరు మీరట్‌లో ప్రారంభించింది. దాన్ని ఓ బ్రాండ్లా మార్చి.. పోషకవంతమైన ఆహారం అందించేలా దోస మిక్స్‌లు, చిరుధాన్యల పిండి, పంచదార, బెల్లం లేని లడ్డూలు వంటి మంచి ఉత్పత్తులను అందించింది. అంతేగాదు పిల్లల కోసం సన్నని క్రాకర్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను కూడా అందుబాటులోకి తీసకొచ్చింది. ముఖ్యంగా ఆరునెలల తదనంతరం ఎలాంటి ఫుడ్ పెట్టాలని భయపడే చిన్నారుల తల్లులకు ఈ ప్రొడక్ట్స్‌ని ధైర్యంగా పెట్టొచ్చు అనేలా ప్రజల నమ్మకం సంపాదించుకుంది జ్యోతి. ప్రారంభంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఈ బ్రాండ్‌కి దేశవ్యాప్తంగా 70 వేల మంది వినియోగదారులున్నారని ఏడాదికి కోటి రూపాయల టర్నోవర్ ఆర్జిస్తుండటం విశేషం. అంతేగాదు జ్యోతి 'షార్క్ ట్యాంక్ ఇండియా' సీజన్ 5లో పాల్గొని తన వ్యాపార సక్సెస్ గురించి కూడా పంచుకుంది.(చదవండి: కార్పొరేట్ ఉద్యోగాన్ని కాదని సైన్యంలోకి సివిల్ ఇంజనీర్!) -
4 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన జడ్జి.. ఇప్పుడేమంటున్నారంటే?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్ గత 4 నెలల్లో 23 మందికి మరణశిక్ష విధించారు. తాజా తీర్పులో వరకట్నం డిమాండ్ కారణంగా భార్యను సజీవ దహనం చేసిన నదీమ్‌కు మరణశిక్ష విధించారు. ఈ కేసులో నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 302, 504 కింద దోషిగా నిర్ధారించి రూ.లక్ష జరిమానా విధించారు.షాజహాన్‌పూర్ పట్టణంలో 2018 జూలై 23న నదీమ్ తన భార్య షెహజాదీని వరకట్నం డిమాండ్ కారణంగా నిప్పంటించి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర గాయాలతో ఆమెను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. మరణానికి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో నదీమ్ తనకు నిప్పంటించినట్లు షెహజాదీ చెప్పినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.విచారణ సమయంలో అభియోగపక్షానికి చెందిన మొత్తం 11 మంది సాక్షులు తమ వాంగ్మూలాలను మార్చుకున్నారు. అయినప్పటికీ షెహజాదీ మరణ వాంగ్మూలం ఆధారంగా కోర్టు నదీమ్‌ను దోషిగా తేల్చింది. ఈ హత్య అత్యంత క్రూరమైనదిగా, అనాగరికమైనదిగా పేర్కొన్న కోర్టు దీనిని అత్యంత అరుదైన కేసుల్లో అరుదైనదిగా పరిగణించి మరణశిక్ష విధించింది.ఈ తీర్పుతో దివాకర్ కోర్టు గత 4 నెలల్లో 11 కేసుల్లో 23 మందికి మరణశిక్ష విధించింది. అయితే మరణశిక్షకు సంబంధించిన కేసుల్లో తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. నిందితులకు పైకోర్టుల్లో అప్పీల్ చేసుకునే హక్కు ఉంటుంది.చనిపోవడానికే సిద్ధం: జడ్జి‘‘నన్ను పిరికి న్యాయమూర్తి అని పిలిపించుకోవడం కంటే చనిపోవడానికే సిద్ధం’’ అని దివాకర్ అన్నారు. తన సూత్రాలను పాటిస్తూ విధులు నిర్వహించగలిగినంతకాలం పదవిలో కొనసాగుతానని, అలా చేయలేని పరిస్థితి వస్తే రాజీనామా చేస్తానని తెలిపారు. తాను న్యాయమూర్తి స్థానంలో ఉన్నంతకాలం నిర్ణయాలు తీసుకునే అధికారం తనదేనని ఆయన తీర్పులో పేర్కొన్నారు. న్యాయమూర్తి తనపై మాఫియా, నేరస్థుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. మాఫియా, నేరస్థులకు ప్రయోజనం చేకూర్చేలా తన కోర్టు నుంచి సుమారు 100 తీవ్రమైన కేసులను తొలగించారని ఆరోపించారు.ఆగస్టులో దివాకర్ ముందు పెండింగ్‌లో ఉన్న సుమారు 100 హత్య కేసులను పరిపాలనా ఉత్తర్వుల ద్వారా జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు బదిలీ చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మరణశిక్షలు విధించే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ కేసుల బదిలీ జరిగిందని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ త్యాగి తెలిపారు. -
చిన్న ఖర్చుకూ మామనే అడగాలా?..
సంపన్న కుటుంబానికి ఆమె కోడలిగా వెళ్లింది. అయితే అత్తింట్లో అడుగు పెట్టినప్పటి నుంచే ఆమెను మనశ్శాంతి కరువైందట. అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా. ఏం చేసినా ఓ కన్నేసి చూసే పిసినారి మామ. నచ్చిన దుస్తులు వేసుకుంటే.. సూటిపోటి మాటలు. కాస్త ఆలస్యంగా ఇంటికి వస్తే ప్రశ్నలు. చిన్న ఖర్చుకూ భార్యభర్తలిద్దరూ ఆయన్నే డబ్బులు అడగాల్సిన పరిస్థితి.. ఇవన్నీ ఆమెలో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. ఆ అసహనం.. కోపంగా మారి తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన 63 ఏళ్ల ఫార్మాస్యూటికల్ వ్యాపారి వినీత్ మినోచా దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో ఆయన కోడలే ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చేశారు. మాజీ పనిమనుషులకు సుపారీ ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడిందని తెలిసింది. నేరాంగీకారంలో ఆమె విస్తుపోయే విషయాలే వెల్లడించింది. సెప్టెంబర్ 5 శనివారం రాత్రి తన ఇంట్లో వినీత్ దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ఆ కుటుంబానికి గతంలో పనిచేసిన విశాల్ (30), అతడి సహచరుడు రాజ్ కిశోర్‌పై అనుమానం వచ్చింది. ఆదివారం రాత్రి ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో విశాల్ ఇచ్చిన సమాచారంతో కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.వినీత్ కోడలు షాలు (36) తన మామను హత్య చేయాలని తమను సంప్రదించిందని విశాల్ పోలీసులకు చెప్పాడు. ఇందుకోసం రూ.6 లక్షలు ఇస్తానని ఆమె ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు షాలును అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఆమె.. ఆ తర్వాత తన ప్రమేయాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.షాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా మామ తన కదలికలను నిరంతరం గమనించేవారు. రాత్రిళ్లు పార్టీలకు వెళ్లడం, ఆలస్యంగా ఇంటికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసేవారు. కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ.. తనకు, తన భర్తకు సంబంధించిన చిన్న ఖర్చులకు కూడా మామను డబ్బులు అడగాల్సి వచ్చేదని ఆమె పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం.ఆ రాత్రి..జూలై 28న పార్టీ నుంచి షాలు ఆలస్యంగా ఇంటికి రావడంతో మామతో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఘటన తర్వాతే ఆమె మామపై కక్ష పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత వినీత్ దగ్గర గతంలో పని చేసిన విశాల్‌ను ఆమె సంప్రదించింది. సెప్టెంబర్ 6న రూ.2 లక్షలు, మిగిలిన రూ.4 లక్షలను 15 రోజుల తర్వాత ఇస్తానని ఒప్పందం చేసుకుంది. అంతేకాదు హత్య కోసం ఫ్లాట్ డూప్లికేట్ తాళం చెవిని కూడా షాలు ఏర్పాటు చేసి విశాల్ చేతికి అందించింది. జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 4న అతడిని ఇంటికి పిలిచి.. హత్య స్కెచ్‌ను వివరించింది. గుండెపోటుగా..శనివారం రాత్రి షాలు తన భర్త సుబ్రత్, కుమారుడితో కలిసి పార్టీకి వెళ్లింది. వారు ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే విశాల్, రాజ్ కిశోర్ ఫ్లాట్‌కు చేరుకున్నారు. సెక్యూరిటీ గార్డు మదన్ వారిని అడ్డుకోవడంతో.. విశాల్ వెంటనే షాలుకు ఫోన్ చేశాడు. వాళ్లిద్దరూ మందులు తెచ్చారని.. లోపలికి అనుమతించాలని గార్డుకు ఆమె చెప్పింది. అయితే వినీత్‌ను దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేయడం.. దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలన్నది వాళ్ల ప్లాన్. అయితే జరిగింది వేరు. ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరూ.. బెడ్రూమ్లో దాక్కున్నారు. వినీత్ అక్కడికి రావడంతో ఒక్కసారిగా ఆయనపై కత్తులతో దాడి చేశారు. ఏకంగా 26 సార్లు పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.రక్తపు మడుగులో మామ..పార్టీ ముగించుకుని షాలు, ఆమె భర్త సుబ్రత్ రాత్రి సుమారు 3 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. బెడ్రూమ్లో వినీత్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇంట్లోని విలువైన వస్తువులేవీ దొంగిలించకపోవడం పోలీసులకు కీలక ఆధారంగా మారింది. దీంతో తొలినుంచే ఇది దోపిడీ కోసం జరిగిన హత్య కాదని.. కుటుంబంలో వ్యక్తిగత విభేదాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానించారు.ప్రస్తుతం షాలు జైలులో ఉంది. మరోవైపు ఆమె భర్త సుబ్రత్ ఈ కుట్ర గురించి ముందే తెలుసా? హత్యలో అతడి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం అతడి ఫోన్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: యూట్యూబర్ రమా నందన సంచలన వాంగ్మూలం -
యూపీ ఎన్నికల వేళ అఖిలేశ్ పార్టీలో ఖతర్నాక్ చేంజ్
లక్నో (ఉత్తరప్రదేశ్): సమాజ్‌వాదీ పార్టీ తన విద్యార్థి విభాగమైన సమాజ్‌వాదీ పార్టీ ఛాత్ర సభ దుస్తుల విధానాన్ని మార్చింది. ఇంతవరకు ఉన్న సంప్రదాయ ఎరుపు రంగుకు బదులుగా నీలిరంగు జీన్స్, నీలిరంగు టీషర్టులను కొత్త దుస్తులుగా నిర్ణయించింది.దళిత ఓటర్లు, యువతకు చేరువ కావాలనే ప్రయత్నంలో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. 2027 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం లక్నోలో జరుగుతున్న ఛాత్ర సభ సదస్సులో కొత్త దుస్తుల విధానం కనిపించింది. పార్టీ పదాధికారులు, కార్యకర్తలు కొత్త నీలిరంగు దుస్తులతో హాజరయ్యారు.ఈ మార్పును కేవలం సంస్థాగత నిర్ణయంగా కాకుండా దళిత యువతలో పార్టీకి ఆదరణ పెంచే రాజకీయ వ్యూహంగా కూడా చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో రంగులకు సుదీర్ఘకాలంగా రాజకీయ ప్రాధాన్యం ఉంది. నీలిరంగు దళిత రాజకీయాలు, బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతంతో ముడిపడి ఉంది. సమాజ్‌వాదీ పార్టీ సంప్రదాయంగా ఎరుపు, ఆకుపచ్చ రంగులతో గుర్తింపు పొందింది.ఇది రాజకీయ సందేశం! ఈ నేపథ్యంలో విద్యార్థి విభాగానికి నీలిరంగును ప్రధాన రంగుగా మార్చడం రాజకీయ సందేశాన్ని ఇస్తున్న చర్యగా భావిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ తన సంప్రదాయ యాదవ్-ముస్లిం మద్దతు వర్గాలకు మించి దళిత ఓటర్లను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకుంది.పార్టీ ప్రతిపాదించిన పీడీఏ అంటే వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల సమీకరణ సూత్రానికి 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ రాజకీయ ప్రాధాన్యం లభించింది. రాబోయే ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో, యువ ఓటర్లను సమీకరించే ప్రయత్నాలు సాగుతున్న వేళ ఈ దుస్తుల మార్పు సమయానికి కూడా రాజకీయ ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు.ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరగనున్నాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో 403 మంది ఎన్నికైన సభ్యులు ఉన్నారు. వీరిలో 258 మంది భారతీయ జనతా పార్టీకి, 107 మంది సమాజ్‌వాదీ పార్టీకి, 13 మంది అప్నా దళ్‌కు చెందినవారు. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ ఉత్తర్‌ప్రదేశ్‌లో తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. 2027 ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి పెట్టింది. -
రీల్ స్టంట్ : 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్‌లోకి..కట్ చేస్తే!
సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి ప్రజల ప్రాణాలమీదికి తీసుకొస్తున్నా,తీరు మారడం లేదు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీలో ఒక యువకుడు డేంజరస్ స్టంట్ చేస్తూ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రాస్‌ల్యాండ్స్ పోలీస్ పోస్ట్ సమీపంలో ఉన్న పహుంజ్ డ్యామ్ వద్ద ఈ సంఘటన జరిగింది. రక్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వాయి గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ కుమారుడు, 38 ఏళ్ల పుష్పేంద్ర కుమార్ (32) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి సమీపంలోని పహూజ్ డ్యామ్‌ను చూడటానికి వెళ్లాడు ఇన్‌స్టారీల్ కోసం ఒక స్టంట్ చేయాలను పూనుకున్నాడు. స్నేహితులు వీడియో రికార్డ్ చేస్తుండగా, పుష్పేంద్ర డ్యామ్‌లోని వ్యూ పాయింట్ వద్ద ఉన్న బాండ్రీ వాల్ ఎక్కి దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి డ్యామ్‌లోకి దూకాడు.Jhansi - A young man suffered fractures in both legs after he jumped from a 30-foot-high dam in Jhansi while trying to shoot a social media reel. The incident took place at Pahuj Dam. Pushpendra Kumar Manauriya, 32, a resident of Parwai village under Raksa police station, had… pic.twitter.com/HpowlS0MO7— NextMinute News (@nextminutenews7) September 7, 2026డ్యామ్‌లో నీళ్లు ఎక్కువగా ఉంటాయని భావించి దూకినప్పటికీ, ఆ ప్రదేశంలో నీరు చాలా తక్కువగా ఉండటంతో నేరుగా నేలను బలంగా తాకాడు. ధఋఃథక్ష అతడి రెండు కాళ్లు తీవ్రంగా విరిగిపోయాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్నేహితులు, స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పుష్పేంద్రను డ్యామ్ నుంచి బయటకు తీసి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్‌లో సింగర్ హఠాన్మరణంనోట్ : సోషల్ మీడియాలో వ్యూస్‌కోసం లేనిపోని సాహసాలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు గతంలో చాలా చూశాం. ఇప్పటికే ఇలాంటి స్టంట్లు చేసి, తల్లితండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని నిపుణులు పలు హెచ్చరికలు చేశారు. కొన్ని సెకన్ల రీల్ లేదా వైరల్ వీడియోల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టవద్దని, ఇటువంటి ప్రమాదకరమైన స్టంట్లు చేయవద్దని పోలీసులు, ప్రజలకు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్ -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
బాగ్పత్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తీర్థయాత్రికులతో వెళ్తున్న బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడటంతో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై బడాగావ్ కట్ సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 32 మంది యాత్రికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని బంగార్ నుంచి బదాయూన్ వైపు బస్సు వెళ్తుండగా రాత్రి సుమారు 12.30 గంటలకు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొన్న అనంతరం బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. 112 అత్యవసర సేవకు సమాచారం అందడంతో నాలుగు పోలీస్ రెస్పాన్స్ వెహికల్స్ (పీఆర్వీలు), అంబులెన్స్‌లు, స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.బస్సులో ఉన్నవారిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్పీ కుమార్ రాయ్ తెలిపారు. బోల్తాపడిన బస్సు నుంచి క్షతగాత్రులను బయటకు తీసి సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ), జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కొందరిని మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు పంపినట్లు చెప్పారు. బాగ్పత్ జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్ కూడా నలుగురు మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని, బాధితులందరినీ సమీపంలోని వైద్య కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు.ఇది కూడా చదవండి: డ్రోన్ల కలకలం.. హైఅలర్ట్‌లో అమృత్సర్ ఎయిర్పోర్ట్! -
ఇక ఈ కవలలకు జీవితాంతం పోలీసు ఉద్యోగం రాదు!
కాన్పూర్: పోలీసు యూనిఫాం ధరించాలన్న కలతో కాన్పూర్‌లో ఇద్దరు కవల సోదరులు ఉద్యోగం సంపాదించేందుకు మోసానికి పాల్పడ్డారు. ఇద్దరి ముఖం ఒకేలా ఉండటాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని, ఒకే రకమైన దుస్తులు ధరించాలని, వైద్య పరీక్ష సమయంలో ఒకరి స్థానంలో మరొకరు హాజరుకావాలని ముందుగానే ప్రణాళిక వేసుకున్నారు. అయితే ముఖం ఒకేలా ఉన్నప్పటికీ వేలిముద్రలు, కంటి రెటీనా ఒకేలా ఉండవన్న విషయాన్ని వారు గుర్తించలేదు.ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ పోలీస్ లైన్లో జరుగుతున్న పోలీస్ నియామక శారీరక ప్రమాణాల పరీక్షలో ఈ ఘటన జరిగింది. ఆగ్రాకు చెందిన భూపేంద్ర రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, శారీరక కొలతల పరీక్షకు హాజరయ్యాడు. ఆగస్టు 29న నిర్వహించిన పరీక్షలో భూపేంద్ర ఎత్తు 166.4 సెంటీమీటర్లు, ఛాతీ కొలత 79 సెంటీమీటర్లుగా నమోదైంది. నియామకానికి నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఎత్తు తక్కువగా ఉండటంతో అతడిని అనర్హుడిగా ప్రకటించారు.పోలీసు నియామక నిబంధనల ప్రకారం అభ్యర్థి తన వైద్య లేదా శారీరక పరీక్షపై అభ్యంతరం ఉంటే మరోసారి పరీక్ష నిర్వహించాలని అప్పీల్ చేసుకోవచ్చు. భూపేంద్ర కూడా మరోసారి కొలతలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడి నుంచే కవల సోదరుల మోసం మొదలైంది.తొలిసారి 166.4.. రెండోసారి 169.6 సెంటీమీటర్లుమరోసారి వైద్య పరీక్ష నిర్వహించిన సమయంలో ఓ యువకుడు తానే భూపేంద్రనంటూ అధికారుల ముందు హాజరయ్యాడు. ఈ సారి అతడి ఎత్తు 169.6 సెంటీమీటర్లుగా నమోదైంది. అంటే తొలి పరీక్ష, రెండో పరీక్ష మధ్య 3.2 సెంటీమీటర్ల తేడా వచ్చింది. ఇంత పెద్ద తేడా కనిపించడంతో అధికారులకు అనుమానం వచ్చింది.అధికారులు ఫొటోలను సరిపోల్చారు. ఫొటోలో ముఖం దాదాపు ఒకేలా కనిపించింది. ఇద్దరి ముఖాలు ఒకేలా ఉండటంతో తొలిచూపులో విషయం బయటపడలేదు. అయితే అధికారుల అనుమానం మాత్రం తీరలేదు.దీంతో బయోమెట్రిక్ పరీక్ష నిర్వహించారు. కంటి రెటీనా, వేలిముద్రలు సరిపోలలేదు. దీంతో ఇద్దరు సోదరుల పథకం మొత్తం బయటపడింది. కఠినంగా విచారించడంతో వైద్య పరీక్షకు వచ్చిన యువకుడు భూపేంద్ర కాదని, అతడి కవల సోదరుడు భూపేశ్ అని తేలింది.ఎత్తు తక్కువని ముందే తెలుసుపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపేంద్ర తన ఎత్తు నియామక ప్రమాణాల కంటే తక్కువగా ఉందని ముందే తెలుసు. అందుకే తొలిసారి పరీక్షలో ఎత్తు తక్కువగా నమోదైతే, రెండోసారి వైద్య పరీక్ష సమయంలో తన స్థానంలో ఎక్కువ ఎత్తు ఉన్న భూపేశ్‌ను పంపించాలని ఇద్దరూ ముందుగానే ప్రణాళిక వేసుకున్నారు.తొలి పరీక్ష తర్వాత భూపేంద్ర తన సామాన్లు తీసుకుని ఇంటికి వెళ్తున్నట్లుగా అక్కడి నుంచి బయటకు వెళ్లాడు. కొంతసేపటి తర్వాత అతడి కవల సోదరుడు భూపేశ్ అదే రకమైన దుస్తులు, సామాన్లతో అక్కడికి వచ్చి మరోసారి ఎత్తు పరీక్ష నిర్వహించాలని కోరాడు.ఇద్దరి ముఖాలు ఒకేలా ఉండటంతో అధికారులకు తొలుత అనుమానం రాలేదు. అయితే ఎత్తులో 3 సెంటీమీటర్లకు పైగా తేడా రావడంతో విషయం అనుమానాస్పదంగా మారింది. రెండో పరీక్షలో ఎక్కువ ఎత్తు నమోదైన తర్వాత భూపేశ్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోవాలి. అనంతరం భూపేంద్ర తిరిగి తన స్థానాన్ని తీసుకోవాలి అనేది ఇద్దరి ప్రణాళిక.విచారణ తర్వాత ఇద్దరు సోదరుల అరెస్టువిచారణ అనంతరం ప్రాంగణం బయట ఉన్న భూపేంద్రను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు సోదరులను అరెస్టు చేశారు. పోలీస్ లైన్ ఉప పరిశీలకుడు ఈశ్వర్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కోత్వాలీ ఇన్చార్జ్ అరుణ్ కుమార్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. కవల సోదరులుగా ఉండటం, ముఖాలు ఒకేలా ఉండటాన్ని ఉపయోగించుకుని నియామక ప్రక్రియను మోసం చేసేందుకు ఇద్దరూ ప్రయత్నించారు. పోలీసులు ఇద్దరి వద్ద నుంచి 2 మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు, ఏటీఎం కార్డులు సహా ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. -
ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో
-
4 రాష్ట్రాల్లో ముందస్తు జన గణన
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో జన గణన ప్రక్రియను ముందుగానే ప్రారంభిస్తున్నట్లు రిజి్రస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్జీఐ) శనివారం వెల్లడించారు. గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలతోపాటు ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రక్రియ 2026 డిసెంబర్ 1 నుంచి 2027 జనవరి 4వ తేదీ వరకు జరుగుతుందని తెలియజేశారు. అలాగే 2027 జనవరి 5 నుంచి 2027 జనవరి 9 వరకు దీనికి సంబంధించిన పునఃపరిశీలన దశ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్జీఐ, జనాభా గణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా ప్రాంతాల్లోని పౌరులు 2026 నవంబర్ 16 నుంచి నవంబర్ 30 వరకు స్వయంగా వివరాలను నమోదు చేసుకునే (ఎల్ఫ్ ఎన్యూమరేషన్) అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా జనగణన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మాత్రం ముందుగానే నిర్వహించబోతున్నారు. -
రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్ జాబ్ ఎంచుకున్న టెకీ
ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీలో ఉద్యోగం. లక్షల్లొ జీతం. సౌకర్యవంతమైన జీవితం. సాధారణంగా చాలా మంది నిపుణులు తమ కెరీర్లో ఒక మైలురాయిగా భావిస్తారు. కానీ లక్నోకు చెందిన 27 ఏళ్ల శారదేందు తివారీ తీసుకున్న నిర్ణయం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలుస్తోంది. తండ్రిని ప్రేరణగా తీసుకొని మరీ తీసుకున్న తివారి సంచనల నిర్ణయం గురించి తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.శారదేందు తివారీ అమెజాన్‌లో క్లౌడ్ ఇంజినీర్‌గా ఏడాదికి సుమారు రూ.46 లక్షల ప్యాకేజీతో పనిచేసేవారు. అయితే చాలా సౌకర్యవంతమైన కార్పొరేట్ జీతాన్ని వదులుకుని త్వరలో భారత ఆర్మీలో ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. శనివారం గయలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో పాసింగ్ అవుట్ పరేడ్ తన ప్రతిభను చాటుకున్నారు.అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవులలో ఒకటైన సీనియర్ అండర్ ఆఫీసర్ (SUO)గా ఎంపికయ్యారు.ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్బస్లోనూ పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ , చిన్ననాటి నుంచి ఉన్న సైన్యంలో చేరాలన్న కలను నెరవేర్చుకునేందుకు చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నారట తివారీ. శర్దేందు తివారీ ఆర్మీ యూనిఫామ్ ధరించాలనే నిర్ణయానికి ఆయన కుటుంబ నేపథ్యమే కారణం. తండ్రి రాజ్ కుమార్ తివారీ ఆర్మీ సర్వీస్ కార్ప్స్లో ఆనరరీ కెప్టెన్‌గా 36 ఏళ్ల పాటు దేశసేవ చేసి రిటైర్ అయ్యారు. తండ్రి సేవలను చిన్నప్పటి నుంచి చూసిన శారదేందుకు మిలిటరీలో చేరాలనే బలమైన కోరిక ఉండేది.శారదేందు తివారీది ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ జిల్లాలోని పిపర్గావ్. అయితే వారి కుటుంబం లక్నోలోని నీల్మథ ప్రాంతంలో స్థిరపడింది. పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజ్ (చండీగఢ్) నుంచి ఐటీలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఎం.టెక్ పూర్తి చేశారు. క్యాంపస్ ప్లేస్మెంట్ తర్వాత, రూ. 46 లక్షల వార్షిక ప్యాకేజీతో అమెజాన్‌లో క్లౌడ్ ఇంజనీర్‌గా చేరారు. కానీ ఆర్మీలో చేరాలన్న కోరిక మాత్రం నిరంతరం మదిలో మెదులుతూనే ఉండది. ఫలితంగా ఆర్మీ సెలెక్షన్ ప్రక్రియ కోసం ఆయన 8 సార్లు ప్రయత్నించారు. ఓటమికి కుంగిపోకుండా పట్టుదలతో శ్రమించి 'టెక్నికల్ రూట్' ద్వారా ఆర్మీకి సేవల చేయాలన్న కలను సాకారం చేసుకున్నారు. ఆర్మీ ఇచ్చే సాహసం, నాయకత్వ లక్షణాలు, దేశసేవ చేసే అవకాశం తనను ఆకర్షించాయనిశారదేందు తెలిపారు.ఇదీ చదవండి: రూ. 6వేలతో మొదలై, రూ.1400 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడుషార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) శిక్షణ పూర్తి చేసిన తర్వాత, 219 మంది పురుషులు,35 మంది మహిళలతో సహా మొత్తం 254 మంది క్యాడెట్లు కమిషన్ పొందనున్నారు. వియత్నాం పీపుల్స్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ లే వాన్ హోయాంగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియో -
యోగి సర్కార్‌కు కొత్త టెన్షన్.. అఖిలేష్-సీజేపీ భేటీపై రాజకీయ దుమారం!
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ.. ఓ కీలక భేటీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, విద్యార్థి ఉద్యమ సంస్థ సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా భేటీ కావడంతో యూపీలో కొత్త రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనా? లేక ఎన్నికల ముందు యువతను కేంద్రంగా చేసుకుని అఖిలేష్ కొత్త రాజకీయ వ్యూహానికి తెరతీశారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.ఇక, అఖిలేష్‌తో సీజేపీ ప్రతినిధి సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరి మధ్య లక్నోలో జరిగిన భేటీ దాదాపు 90 నిమిషాల పాటు సాగినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. సమావేశం తర్వాత ఇరువైపుల నుంచి పెద్దగా వివరాలు బయటకు రాకపోవడంతో.. అసలు ఏం చర్చించారు? అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఎన్నికల ముందు అఖిలేష్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారా? సీజేపీ ద్వారా యూపీలో విద్యార్థి శక్తిని ఏకం చేయబోతున్నారా? ఈ భేటీ వెనుక అసలు వ్యూహం ఏమిటి? ఇప్పుడు యూపీ రాజకీయాల్లో ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇప్పటివరకు ఎస్పీ-సీజేపీ మధ్య ఎలాంటి అధికారిక రాజకీయ పొత్తు లేదా అవగాహన ప్రకటించలేదు.టార్గెట్ యూపీనా?సీజేపీ ఇటీవల విద్యార్థులు, యువతకు సంబంధించిన అంశాలపై ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. పరీక్షల వ్యవస్థ, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో లోపాలపై ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లింది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని పరిశీలించే ‘School Thik Karo’ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో అఖిలేష్‌తో రంకా భేటీ కావడంతో.. సీజేపీ తన విద్యార్థి ఉద్యమాన్ని యూపీలో విస్తరించేందుకు సిద్ధమవుతోందా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.యువ ఓటర్లపై అఖిలేష్ కన్ను?యూపీ రాజకీయాల్లో యువత, విద్యార్థులు కీలక ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఉద్యోగాలు, పరీక్షల నిర్వహణ, పేపర్ లీకులు, విద్యా వ్యవస్థ వంటి అంశాలను అఖిలేష్ యాదవ్ కూడా తరచూ ప్రస్తావిస్తూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో యువతలో ప్రభావం పెంచుకుంటున్న ఓ ఉద్యమ సంస్థతో సంప్రదింపులు జరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ఇదీ చదవండి: ‘విజయ్ ఫర్ పీఎం’.. కాంగ్రెస్‌కు టీవీకే మరో షాక్!అయితే, సీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? సమాజ్‌వాదీపార్టీతో కలిసి పనిచేస్తుందా? లేక కేవలం విద్యార్థి సమస్యలపై మాత్రమే సహకారం ఉంటుందా? అన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మరోవైపు.. వీరి భేటీపై బీజేపీ కూడా స్పందించింది. బీజేపీ నేత రాకేశ్ త్రిపాఠి ఈ పరిణామాన్ని విమర్శిస్తూ సీజేపీ ఉద్యమం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం ఈ రకమైన సంప్రదింపులను స్వాగతించింది. దీంతో ఈ భేటీ కేవలం విద్యార్థి సమస్యలపై చర్చకే పరిమితమా.. లేక యూపీలో కొత్త రాజకీయ కూటమికి తొలి సంకేతమా? అన్న ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారింది. -
యూపీలో దారుణం : 3 నెలల చిన్నారిపై అఘాయిత్యం
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మెయిన్‌పురి జిల్లాలో ఒక గ్రామంలో, మూడు నెలల చిన్నారిపై 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన దిగ్బ్రాంతి రేపింది.పోలీసుల సమాచారం ప్రకారం పొరిగింటిలో ఉండే, కుటుంబానికి తెలిసిన వ్యక్తి జితేంద్ర ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి వేళ ఇంట్లో మంచంపై పడుకుని ఉన్న చిన్నారి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు.. ఆ సమయంలో చిన్నారి తల్లి రాత్రి వంట పనిలో తండ్రి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో పొరుగింట్లో ఉండే నిందితుడు జితేంద్ర, ఇంట్లోకి వచ్చి చిన్నారితో ఆడుకోవడం మొదలుపెట్టాడు. తెలిసిన వ్యక్తి కావడంతో, వారు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సుమారు అరగంట తర్వాత నిందితుడు తిరిగి వచ్చి, చిన్నారిని మళ్లీ మంచంపై పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.అయితే పాప విపరీతంగా ఏడుస్తూండటంతో తల్లీ ఎత్తుకుని ఓదారుస్తుండగా, చిన్నారి జననేంద్రియాల నుండి తీవ్ర రక్తస్రావం అవుతుండటాన్నిగమనించి ఒక్కసారిగాఉలిక్కిపడింది. గట్టిగా కేకలు వేసింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారని బేవార్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ సింగ్ తెలిపారు.ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలుకుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు, అక్కడి వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో సాయిఫై మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందు తోందని పోలీసు అధికారి తెలిపారు. బాధితురాలి తండ్రి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: నెలకు రూ. 14 లక్షలు : ఏం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు -
400 మీటర్లు ఒంటికాలితో గెంతుతూ : ఏడేళ్ల రాగిణి హృదయ విదారక స్టోరీ వైరల్
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన ఏడేళ్ల బాలిక నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా చిన్నారులు సరదాగా గెంతుతూ ఎగురుతూ బడికి వెళ్లడం మనం చూసి ఉంటాం. కానీ దురదృష్టవశాత్తూ ఈ బాలికకు బాధతో కుంటుకుంటూ వెళ్లక తప్పని పరిస్థితి. అందుకే పాఠశాలకు సులభంగా వెళ్లడానికి వీలుగా ఒక ట్రైసైకిల్ కావాలని జిల్లా మేజిస్ట్రేట్‌కు పెట్టుకున్న విజ్ఞప్తి చేసి ఆన్లైన్లో అందరి దృష్టిని ఆకర్షించింది. 6 నెలల వయస్సులోనే జరిగిన ఒక ప్రమాదంలో ఏడేళ్ల రాగిణి తన ఎడమ కాలును కోల్పోయింది. అయినప్పటికీ, చదువుకోవాలనే పట్టుదలతో ప్రతిరోజూ ఒంటికాలితో దాదాపు 400 మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు గెంతుతూ వెళ్తోంది. బల్లియాలోని మనియార్ విద్యా బ్లాక్‌లో ఉన్న దిఘేడా ప్రాథమిక పాఠశాలలో రాగిణి మొదటి తరగతి చదువుతోంది.ట్విటర్లో Benarasiyaa అనే యూజర్ ఆమె పరిస్థితిని వివరిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. చదువును కొనసాగించడానికి ఆమెకు కావలసింది కేవలం ఒక ట్రైసైకిల్ మాత్రమే అంటూ జిల్లా కలెక్టర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఒక నిరుపేద చిన్నారికి ప్రాథమిక సదుపాయం అందించేందుకు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు స్థానిక యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నెటిజన్లు కూడా పాఠశాల అధికారులు లేదా స్థానిక యంత్రాంగం ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించారు. ఆ బాలికకు భారీ మద్దతు లభిస్తోంది. “DM Uncle, please get me a bicycle…” 🚲🥹Despite being differently-abled, Class 1 student Ragini’s passion for education is unstoppable. Her small request carries a big dream. 📚❤️#Ballia #Ragini #Education pic.twitter.com/RiozXvVuO9— Sunanda Acharya (@Sunanda_Iam) September 1, 2026నెటిజన్ల స్పందనలుఆమెకు చికిత్స అవసరం. ట్రైసైకిల్ ఆమెకు శాశ్వత పరిష్కారం కాదు. ఆమె వయసు కేవలం 7 ఏళ్లు మాత్రమే, ఇంకా ఆమె శారీరక ఎదుగుదల మిగిలే ఉందని ఒకరు 5-8 వేల రూపాయలకే ట్రైసైకిల్ వస్తుంది కదా, క్రౌడ్ ఫండింగ్ (ప్రజల నుంచి విరాళాలు) చేసి ఉండవచ్చు లేదా కనీసం DMకి సమాచారం ఇచ్చి ఉండాల్సింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోజు సెలవు పెట్టి చూపించి ఉండాల్సింది కదా మరొకరు వ్యాఖ్యానించారు. ఇలాంటి వార్తలు చూసినప్పుడు బాధ అనిపిపిస్తుంది. వెనుకబడిన పౌరుల కోసం దేశం ఎంతైనా చేయాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆమెకు తక్షణమే సహాయం చేస్తుందని ఆశిస్తున్నా అన్నారు. మరొకరు వ్యక్తి కృత్రిమ కాలు (prosthetic limb) అమర్చడంలో సహాయం చేస్తానని ముందుకొచ్చారు. ఈ ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఒక పోలీస్ అధికారి కూడా ఆ వీడియోపై స్పందించి ఆమెకు ట్రైసైకిల్ సమకూర్చినట్టు తెలిసిందన్నారు.స్పందించిన యంత్రాంగంచివరికి, బల్లియా జిల్లా మేజిస్ట్రేట్ (DM) ఆ చిన్నారికి ట్రైసైకిల్‌ను అందించడం విశేషం. దీంతో ఇకపై ఆ చిన్నారి బడికి వెళ్లేటప్పుడు కుంటుతూ నడవాల్సిన అవసరం ఉండదు. అయితే, ఇది శాశ్వత పరిష్కారం కాదు. ప్రమాదంలో దెబ్బతిన్న ఆ చిన్నారి కాలు సరిగ్గా నయమవ్వాలంటే, ఆమెకు సరైన వైద్య చికిత్స అందడం ఇప్పుడు చాలా అవసరమని వీడియో షేర్ చేసినవ్యక్తి ఆనందం వెలిబుచ్చారు. మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 20 మందికి పైగా ట్రైసైకిల్ ఇస్తామని ముందుకు వచ్చారు. కానీ మొదట జిల్లా యంత్రాంగం నుండి సహాయం కోసం వేచి చూసినట్టు చెప్పారు.बुलंद हौसले वाली बलिया की बेटी रागिनी अब ट्राईसाइकिल से स्कूल जाएगी .उसके सपनों की उड़ान अब नहीं थमेगी🥰बलिया DM मंगला प्रसाद ने रागिनी को ट्राइसाइकिल के साथ किताब और चाकलेट भी दिया... https://t.co/9YXKTWr4P0 pic.twitter.com/0XSXCsgRbl— Ruby Arun रूबी अरुण (@arunruby08) September 2, 2026ఆప్ సాయంమరోవైపు ఈ విషయంలో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో రాగిణికి సహాయం చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యకర్తలు ముందుకు వచ్చారు. AAP ప్రతినిధి సర్వేష్ మిశ్రా , బల్లియా జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ యాదవ్ రాగిణి కుటుంబాన్ని సంప్రదించారు. AAP నాయకుడు సంజయ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, పార్టీ కార్యకర్తలు స్థానిక సభ్యులతో కలిసి ఆ చిన్నారిని కలిసి ఆమెకు వీల్‌చైర్‌ను అందించారు. అలాగే ఆ కుటుంబానికి రూ. 25,000 ఆర్థిక సహాయం కూడా అందజేశారు. -
అయోధ్య ట్రస్ట్ సీఈవోగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా
లక్నో: అయోధ్య ట్రస్ట్ సీఈవోగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ఆయనను అయోధ్య ట్రస్ట్ సీఈవోగా ఎంపికచేస్తూ రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటన విడుదల చేసింది. జితేంద్ర మిశ్రా 39 ఏళ్ల పాటు ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందించారు. కాగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తన మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)కి దరఖాస్తులను ఆహ్వనించిన సంగతి తెలిసిందే. దాదాపు 5,500కి పైగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ జితేంద్ర మిశ్రాను సీఈఓగా ఎంపిక చేసింది.జరిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, నిపుణుల కమిటీ సభ్యుడు సురేష్ హవ్డేలతో కూడిన ప్యానెల్ ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. మొత్తం 5,585 దరఖాస్తులను క్షుణ్ణంగా సమీక్షించి, 16 మంది అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించినట్లు ట్రస్ట్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. జులై 11 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరించగా, 600 మార్కుల మూల్యాంకన విధానం ద్వారా అభ్యర్థుల అర్హతలను పరిశీలించారు. ప్రాథమిక పరిశీలన అనంతరం 3,577 మందికి ఫారాలు పంపగా, కనీసం 470 మార్కులు సాధించిన 108 మంది అర్హత పొందారు.వీరికి నాలుగు రోజుల పాటు వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహించి, వారి ప్రతిభ ఆధారంగా 17 మందిని గ్రేడ్లుగా విభజించారు. చివరికి నిబద్ధత, దార్శనికత ఆధారంగా అత్యుత్తమమైన ముగ్గురిని ఎంపిక చేసి ట్రస్ట్‌కు సమర్పించారు. ట్రస్ట్ సభ్యుడు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణం, కానుకల చోరీ ఆరోపణలు, మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాల రాజీనామాల అనంతరం ఏర్పడిన ఖాళీల నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
యూపీ ఎన్నికలపై కాంగ్రెస్ ప్లాన్ బీ.. వారికి బంపరాఫర్?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ కూడా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతున్న వేళ.. అభ్యర్థుల ఎంపికలోనూ కొత్త విధానాన్ని అనుసరించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.బలమైన ప్రజాదరణతో పాటు ఎన్నికల ప్రచారాన్ని సొంతంగా నిర్వహించగల ఆర్థిక సామర్థ్యం ఉన్న అభ్యర్థులకు టికెట్లలో ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు ‘ఇండియా టుడే’ కథనం వెల్లడించింది. ఎన్నికలను ఈసారి కాంగ్రెస్ అత్యంత సీరియస్‌గా తీసుకుంటోందని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. నియోజకవర్గంలో ప్రజాదరణ, గెలుపు అవకాశాలు, ప్రచారానికి అవసరమైన వనరులు ఉన్న నేతలను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.అయితే.. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ గెలిచే సత్తా ఉన్న బలమైన అభ్యర్థులకు మాత్రం మినహాయింపు ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. అదే సమయంలో అభ్యర్థులు పార్టీ నిధికి కూడా తమ వంతు సహకారం అందించాలని పార్టీ ఆశిస్తోంది. గతంలో ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ నుంచి నిధులు తీసుకున్న కొందరు అభ్యర్థులు వాటిని పూర్తిగా ప్రచారానికి వినియోగించకుండా తమ వద్దే ఉంచుకున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఈ అంశంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.2022 ఫలితాల నేపథ్యంలో కొత్త వ్యూహం2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 399 స్థానాల్లో పోటీ చేసి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పలువురు అభ్యర్థులకు పార్టీ నుంచి ఎన్నికల ప్రచారం కోసం భారీగా నిధులు అందించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అనుభవం నేపథ్యంలోనే ఈసారి అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలతో పాటు ఆర్థిక సామర్థ్యానికీ ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.ఎస్పీతో సీట్లపై కాంగ్రెస్ పట్టుమరోవైపు.. సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల పంపకాల అంశం కాంగ్రెస్‌కు కీలకంగా మారింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 115 నుంచి 120 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యూపీ కాంగ్రెస్ ఇన్చార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్ ఏకంగా 50 శాతం సీట్ల కోసం డిమాండ్ చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలుచుకోవడం, ఉత్తర భారతదేశంలో రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణ తమకు అనుకూలంగా మారుతుందని పార్టీ అంచనా వేస్తోంది. దళితులు, మైనారిటీలు, యాదవేతర ఓబీసీ వర్గాలు రాహుల్ వైపు మొగ్గుచూపుతున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.ఇక వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై యాంటీ ఇన్‌కంబెన్సీ తమకు కలిసొచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తూ మొత్తం 403 నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తోంది. సీట్ల పంపకాల నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు.. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: రీల్స్.. ఫాలోవర్ల మోజు!.. పార్టీని పట్టించుకోరా? -
ఈ ముగింపు ఏ ఆరంభానికి..?
కొందరు అధికారులు ఉద్యోగాలకే వన్నె తెస్తుంటారు. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ అలాంటి వారిలో ఒకరు. పదమూడేళ్లగా చేస్తున్న ఉద్యోగానికి స్వచ్ఛందంగా ముగింపు పలుకుతూ రాజీనామా చేశారు. భవిష్యత్‌లో ఏం చేయబోతున్నారో ఇప్పటివరకు చెప్పలేదు. ‘సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను’ అన్నారు. దివ్య తన పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది...దివ్య మిట్టల్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే ఐఏఎస్ అధికారిణి. ఎవరైనా సందేహం అడిగితే వెంటనే నివృత్తి చేసేవారు. దేశవ్యాప్తంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే లక్షలాది మంది అభ్యర్థులకు ఆమె ‘మెంటార్’గా నిలిచారు. మీర్జాపూర్ జిల్లా లహురియా దహ్ గ్రామం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆ గ్రామ ప్రజలకు పైపుల ద్వారా మంచినీరు అందలేదు. దివ్య మిట్టల్ అక్కడ జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉన్నప్పుడు వారి దాహాన్ని తీర్చిన తొలి ఆఫీసర్‌గా వారి గుండెల్లో నిలిచిపోయారు. అక్రమ మైనింగ్ వంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పరిపాలనా చర్యలు తీసుకున్నారు. ప్రకృతి సంపదను ప్రజల హక్కుగా చూడాలనేది ఆమె నిర్ణయాల్లో కనిపించింది. కోట్ల జీతం వదిలి... ఐఐటీ ఢిల్లీలో ఇంజినీరింగ్, ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ పూర్తి చేసిన దివ్య మిట్టల్ లండన్‌లో ‘జేపీ మోర్గాన్’ సంస్థలో ‘ఎక్సోటిక్ డెరివేటివ్స్ ట్రేడర్’గా పనిచేశారు. ఏడాదికి కోట్లాది రూపాయల వార్షిక వేతనాన్ని అందుకునే వారు. కోట్ల రూపాయల ΄్యాకేజీని వద్దనుకొని 2011లో స్వదేశానికి వచ్చి యూపీఎస్సీకి ప్రిపేరై ఐఏఎస్ అయ్యారు. ‘ఐఏఎస్‌లో చేరిన తర్వాత దొరికింది కేవలం ప్రభుత్వ ఉద్యోగం కాదు. వేలాది జీవితాలను తాకే అవకాశం’ అంటూ పలు సందర్భాల్లో ఆమె చెప్పడం విశేషం. జీవితాంతం గుర్తుంటుంది... రాజీనామా సందర్భంగా దివ్య మిట్టల్ రాసిన లేఖలోని ముఖ్య విషయాలు... ‘ఈ రోజు నా 13 ఏళ్ల ప్రయాణానికి నా ఇష్టంతో విరామం పలుకుతూ ఐఏఎస్‌కు రాజీనామా చేశాను. ఐఏఎస్ ఆఫీసర్‌గా పనిచేసే అదృష్టం నాకు లభించింది. చాలా చేయడానికి అవకాశం లభించింది. శక్తి పదవి నుంచి రాదు. ప్రజలు మనపై ఉంచే విశ్వాసం నుంచి వస్తుంది. నేను ఏదో ఇవ్వడానికి వచ్చానని అనుకోవడం పొరపాటు. నిజానికి ఎక్కువగా పొందింది నేనే. లహురియా దహ్ కొండపై ఉన్న ఒక బామ్మ తన గ్రామానికి తొలిసారిగా నీరు చేరడాన్ని చూసి ఆనందంతో నన్ను ఆశీర్వదించి వెళ్లింది. ఈ రోజు పదవి నన్ను విడిచిపోయింది. కానీ ఆమె స్పర్శ మాత్రం జీవితాంతం నన్ను విడిచిపెట్టదు. ఈ దేశపు మట్టి నాకు అందించిన ఆ కల కూడా ఎప్పటికీ నన్ను విడిచిపెట్టదు.రాజీనామా ఎందుకు?మీర్జాపూర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న దివ్యా మిట్టల్‌ను బదిలీ చేయడంతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అయిదు నెలలు ఆమెకు ఏ పోస్ట్ కేటాయించలేదు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ గ్రామీణ రహదారుల సంస్థ సీఈవోగా నియామకం అయ్యారు దివ్య. రాజీనామా చేయడానికి ముందు రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక కార్శదర్శిగా పనిచేస్తున్నారు. తన రాజీనామాకు కారణం చెప్పకపోవడంతో రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువ సమయాన్ని కుటుంబంతో గడపడానికి, బోధనలు, రచనలు చేయడానికి, సామాజిక సేవ కోసం రాజీనామా చేశారనే అభి ప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు....ఉద్యోగప్రస్థానంలో ప్రభుత్వం నుంచి దివ్యకు ఇబ్బందులు ఎదురై ఉంటాయని ఒక వాదన. ఒకవేళ అలాంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే...అవేంటో త్వరలోనే ఆమె మాటల్లో వినవచ్చు.– చైతన్య వంపుగాని, సాక్షి, న్యూదిల్లీ -
23 ఏళ్లకే ఉద్యోగం వదిలేశాడు.. కొండల్లో తిరుగుతూ కోట్ల సంపాదన!
పాతికేళ్ల వయసులో జాబ్ చేస్తూ బాగా సంపాదించాలని అందరూ అనుకుంటారు. కానీ 23 ఏళ్ల వయసులో బ్యాంకింగ్ ఉద్యోగాన్ని వదిలి తనకు ఇష్టమైన కొండలు, అడవులు, ట్రెక్కింగ్ వైపు అడుగులు వేసాడు విజయ్ ప్రతాప్ సింగ్. అదే అతన్ని సక్సెస్ వైపు తీసుకెళ్లింది, కోట్ల రూపాయల ఆదాయం గడించేలా చేసింది.ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన విజయ్ చదువుల కోసం డెహ్రాడూన్‌కు వెళ్లిన తర్వాత ప్రకృతికి చాలా దగ్గరయ్యాడు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అడవులు, కొండల్లో తిరిగేవాడు. అదే ఆసక్తి తర్వాత సొంత వ్యాపారం పెట్టాలనే ఆలోచనకు దారితీసింది.ట్రెక్కింగ్‌తో సొంత కంపెనీవిజయ్ అడ్వెంచర్ ట్రావెల్ కంపెనీని ప్రారంభించాడు. ట్రెక్కింగ్ ట్రిప్స్, అవుట్డోర్ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కంపెనీని క్రమంగా అభివృద్ధి చేశాడు. ఉద్యోగం వదిలే ముందే కంపెనీని ఎలా నడపాలనే దానిపై ప్లాన్ చేసుకున్నాడు. స్నేహితుల సహాయంతో వెబ్సైట్, సోషల్ మీడియా పేజీలు ఏర్పాటు చేసి ట్రెక్కింగ్ బుకింగ్స్ ప్రారంభించాడు. 2016లో 12 మంది విద్యార్థులను చోప్టా-తుంగ్నాథ్ ట్రెక్కు తీసుకెళ్లడంతో అతని ట్రెక్ లీడర్ ప్రయాణం మొదలైంది.శిక్షణతో బలమైన టీమ్ట్రెక్కింగ్పై ఆసక్తి ఒక్కటే మాత్రమే సరిపోదని విజయ్ అర్థం చేసుకున్నాడు. కొండల్లో భద్రత చాలా ముఖ్యమని భావించి నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తర్వాత శిక్షణ పొందిన ట్రెక్ లీడర్లతో 10 మంది సభ్యుల టీమ్‌ను ఏర్పాటు చేశాడు. వీరిలో కొందరికి మౌంటెనీరింగ్, సెర్చ్ అండ్ రెస్క్యూ, ఫస్ట్ ఎయిడ్‌లో శిక్షణ ఉంది. ట్రెక్కింగ్‌కు వచ్చే వారి ఆరోగ్య పరిస్థితిని కూడా ముందుగానే పరిశీలిస్తారు.రూ.10 కోట్ల వరకు ఆదాయంగత ఎనిమిదేళ్లలో తన అడ్వెంచర్ ట్రావెల్ కంపెనీ ద్వారా లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, నేపాల్ వంటి ప్రాంతాలకు ట్రెక్కింగ్ ట్రిప్స్ నిర్వహించారు. ఈ కంపెనీ ఇప్పటివరకు సుమారు రూ.10 కోట్ల ఆదాయం పొందినట్లు సమాచారం. అయితే.. ఎక్కువ ట్రెక్కులు నిర్వహించడం కంటే.. ప్రతి గ్రూప్‌కు మంచి అనుభవం ఇవ్వడానికే విజయ్ ప్రాధాన్యం ఇస్తున్నాడు. అందుకే ఏడాదికి 10 నుంచి 20 ట్రెక్కులు మాత్రమే నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఎవరికీ పెద్దగా తెలియని కొత్త ట్రెక్కింగ్ మార్గాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేయాలనేది తన లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఖాతాదారులకు అలర్ట్.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్! -
అప్పుడు ఆరోపణలతో దూరం.. ఇప్పుడు ‘అస్త్రం’గా దూకుడు!
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 2027 అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సమాజ్‌వాదీ పార్టీ వ్యూహం స్పష్టమవుతోంది. ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కంటే ఇప్పుడు ఆయన భార్య, మైన్‌పురి ఎంపీ డింపుల్ యాదవ్ ఎక్కువగా రాజకీయ వేదికలపై కనిపిస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ రాజకీయాల ఆరోపణలకు దూరంగా ఉంచిన ఆమెనే ఇప్పుడు బీజేపీని ఎదుర్కొనేందుకు అఖిలేశ్ కీలక అస్త్రంగా ముందుకు తెస్తున్నట్లు కనిపిస్తోంది.2017లో రాహుల్ గాంధీ చేసిన కుటుంబ రాజకీయాల విమర్శల నేపథ్యంలో అఖిలేశ్.. తన భార్య డింపుల్ యాదవ్ ఇక ఎన్నికల్లో పోటీ చేయరని ప్రకటించారు. కానీ ఆ హామీ ఎక్కువ కాలం నిలవలేదు. 2019లో కన్నౌజ్ నుంచి పోటీ చేసి ఓడిన డింపుల్.. ములాయం సింగ్ యాదవ్ మరణం తర్వాత 2022లో మైన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచారు. 2024లోనూ అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వరుస విజయాలతో ఆమె కేవలం యాదవ్ కుటుంబ వారసురాలిగానే కాకుండా, సొంత రాజకీయ గుర్తింపు ఉన్న నాయకురాలిగా ఎదిగారు.జంతర్ మంతర్ నుంచి లక్నో వరకు..ఈ మధ్యకాలంలో డింపుల్ రాజకీయం మరింత దూకుడుగా కనిపిస్తోంది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో ఆమె పాల్గొనడం, గాయపడిన నిరసనకారులను పరామర్శించడం చర్చనీయాంశమైంది. అఖిలేశ్ పార్లమెంట్లో ఉండగా.. డింపుల్ రోడ్డుపై నిరసనకారుల మధ్య కనిపించడం ఆమెకు నెక్ట్స్‌లెవల్ పొలిటికల్ ఇమేజ్ను తీసుకొచ్చింది.ఆగస్టు 26న లక్నోలోని లోహియా సభాగార్లో నిర్వహించిన కార్యక్రమంలోనూ డింపుల్ కేంద్రబిందువుగా నిలిచారు. మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిండిన వేదికపై అఖిలేశ్ ఒక్కరే ఉన్నారు. డింపుల్ కార్యక్రమాన్ని ప్రారంభించి ‘స్త్రీ సమ్మాన్ సమృద్ధి యోజన’ను ప్రకటించారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన మహిళలకు ఏటా రూ.40 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించడం ద్వారా బీజేపీ మహిళా ఓటు బ్యాంకుపై నేరుగా గురిపెట్టారు.మహిళా ఓటర్లే లక్ష్యంఉత్తరప్రదేశ్లో సమాజ్‌వాదీ పార్టీకి చాలాకాలంగా మహిళా ఓటర్ల మద్దతు బలహీనంగా ఉంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లలో బీజేపీకి ఎస్పీ కూటమిపై గణనీయమైన ఆధిక్యం లభించింది. గతంలో ఎస్పీ పాలనలో శాంతిభద్రతలు, మహిళల భద్రత అంశాలను బీజేపీ పదేపదే ప్రచారాస్త్రంగా ఉపయోగించింది.ఇప్పుడు డింపుల్‌ను ముందుకు తీసుకురావడం ద్వారా ఆ ప్రతికూల ముద్రను కొంతమేర మార్చాలని అఖిలేశ్ భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మహిళల భద్రత, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలపై డింపుల్ గళం వినిపిస్తున్నారు. మహిళలను ‘ఆధీ ఆబాదీ’(మెజారిటీ సమాజం)గా పరిగణిస్తూ పీడీఏ(పిచ్డా(OBC), దళిత్, అల్పసంఖ్యక్) సామాజిక సమీకరణాన్ని మరింత విస్తరించాలన్న సంకేతాలను ఇస్తున్నారు.ఆ ఫలితాలే ధైర్యానిచ్చాయా?2024 లోక్‌సభ ఎన్నికలు ఎస్పీకి కొత్త ఊపునిచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ 37 స్థానాలు గెలుచుకుంది. ఇండియా కూటమి మొత్తం 43 స్థానాలను దక్కించుకుంది. ఈ ఫలితాల నేపథ్యంలో లోక్‌సభ విజయాన్ని 2027 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని అఖిలేశ్ వ్యూహం రచిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లలో బీజేపీకి ఉన్న పట్టు సడలిస్తేనే అసెంబ్లీ పోరులో ఎస్పీకి గణనీయమైన లాభం చేకూరే అవకాశం ఉంది. అందుకే డింపుల్ యాదవ్‌ను మహిళా ముఖంగా ముందుకు తీసుకురావడం వ్యూహాత్మక నిర్ణయంగా కనిపిస్తోంది.రాజకీయంగా అఖిలేశ్ దూకుడైన నేతగా కనిపిస్తే.. డింపుల్ అదే పోరాటాన్ని మరింత సౌమ్యమైన శైలిలో ప్రజల్లోకి తీసుకెళ్లగలరన్న అంచనా ఉంది. కుటుంబ వారసత్వం నుంచి వచ్చినప్పటికీ రెండు విజయాలతో తనకు తానుగా ఓ రాజకీయ బలం సంపాదించుకున్నారన్నది ఎస్పీ వర్గాల నమ్మకం. అందుకే ఒకప్పుడు కుటుంబ రాజకీయాల విమర్శల నుంచి తప్పించేందుకు ఎన్నికలకు దూరంగా ఉంచిన డింపుల్.. ఇప్పుడు 2027లో అఖిలేశ్‌కు బీజేపీపై పోరులో అత్యంత కీలకమైన రాజకీయ అస్త్రంగా మార్చుతున్నారనే విశ్లేషణలు యూపీ రాజకీయాల్లో నడుస్తున్నాయి.ఇదీ చదవండి: విజయ్.. సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం! -
యోగి సర్కార్‌పై విమర్శల వేళ.. అంకిత్ కేసులో ట్విస్ట్
ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతున్న వేళ.. హర్యాన్వీ గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బల్యాన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అంకిత్‌పై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న ఇద్దరిని పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. సోమవారం వేకువ జామున షామ్లీ ఇండస్ట్రీయల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరారైన మరికొందరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.హరియాణాలో పుట్టి పెరిగిన అంకిత్ బల్యాన్.. యూపీకి వలస వచ్చి స్థిరపడ్డాడు. తొలుత కబడ్డీ ప్లేయర్‌గా రాణించి.. గాయం కారణంగా సంగీతం వైపు మళ్లాడు. యూట్యూబ్ వీడియోలతో పాటు హర్యాన్వీ సాంగ్స్‌తోనూ మాంచి గుర్తింపు దక్కించుకున్నాడు. సోషల్ మీడియాలోనూ ఆయన వీడియోలకు విపరీతమైన పాపులారిటీ ఉంది. అయితే.. ఆగస్టు 26న సాయంత్రం షామ్లీ జిల్లా కోత్వాలి పీఎస్ పరిధిలో ఓ జిమ్ బయట అంకిత్ బల్యాన్ దారుణ హత్యకు గురయ్యాడు.జిమ్ నుంచి బయటకు వచ్చి తన కారు వైపు వెళ్తున్న అంకిత్‌పై రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు కాల్పులు జరిపారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితులు అంకిత్ వైపు దూసుకొచ్చి వరుసగా కాల్పులు జరుపుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. కనీసం 16 రౌండ్లు కాల్పులు జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన అంకిత్‌ను వెంటనే సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ ఫోన్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారుఅయితే ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరు ఈ ఉదయం ఎన్కౌంటర్ అయ్యారు. వాళ్ల పేర్లు సుమిత్, మోహిత్‌గా పోలీసులు నిర్ధారించారు. అయితే వాళ్లు ఏ గ్యాంగ్? ఎందుకు అంకిత్‌ను హతమార్చారు అనేదానిపై ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు ఉధృతం చేసినట్లు మాత్రమే వెల్లడించారు.భార్య తీవ్ర హెచ్చరికహత్య అనంతరం అంకిత్ కుటుంబం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త హత్యకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని అంకిత్ భార్య డిమాండ్ చేశారు. నాలుగు రోజుల్లో హంతకులను పట్టుకోకపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట ఆత్మాహుతికి పాల్పడతానని ఆమె హెచ్చరించారు.నా కొడుకు ఎవరితోనూ గొడవ పడలేదు.. అతడికి ఎలాంటి శత్రుత్వం లేదు. అన్యాయంగా అతడిని చంపారు. నా కొడుకును ఎలాగైతే చంపారో.. ఆ హంతకులనూ అలాగే చంపాలి అని సీఎం యోగికి అంకిత్ తండ్రి విజ్ఞప్తి చేశాడు. దీంతో.. పోలీసులు అంకిత్ కుటుంబాన్ని కలిసి దర్యాప్తు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పరిణామం జరిగిన కొద్దిరోజుల్లోనే ఇద్దరు అనుమానితులు ఎన్కౌంటర్లో హతమవడం కేసులో కీలక మలుపుగా మారింది.గోగీ గ్యాంగ్ పేరు తెరపైకిఅంకిత్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తాను హరియాణాలోని సోనిపట్‌కు చెందిన భోలు షాపురి అని చెప్పుకుంటూ.. ఈ హత్యకు గోగీ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటించాడు. దీంతో కేసులో గ్యాంగ్‌వార్ కోణం తెరపైకి వచ్చింది. అయితే ఈ ప్రకటనను పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. అంకిత్‌కు ఎవరితోనైనా పాత వివాదాలు ఉన్నాయా? వ్యక్తిగత కక్షలే హత్యకు కారణమా? గ్యాంగ్ ప్రమేయం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఎన్కౌంటర్లో మృతిచెందిన ఇద్దరు అనుమానితుల నుంచి లభించే సమాచారం కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది.యోగి సర్కార్‌పై విమర్శలుఅంకిత్ బల్యాన్ హత్య ఘటన ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై మరోసారి రాజకీయ దుమారం రేపింది. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ సహా విపక్షాలు యోగి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించాయి. రాష్ట్రంలో సామాన్యులతో పాటు ప్రముఖులకు కూడా భద్రత లేకుండా పోయిందని ఆరోపించాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ హత్యపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిపోయిందని విమర్శించారు. వ్యక్తిగత కక్షలతో పాటు రాజకీయ కోణాన్ని కూడా పరిశీలించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ హత్య కేవలం నేర ఘటనగానే కాకుండా రాజకీయ అంశంగానూ మారింది.ఎవరీ అంకిత్ బల్యాన్?33 ఏళ్ల అంకిత్ బల్యాన్ హర్యాన్వీ సంగీతంలో గుర్తింపు పొందిన గాయకుడు, యూట్యూబర్. షామ్లీకి చెందిన ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు లక్షలకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో మూడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. సంగీతంలోకి రాకముందు అంకిత్ రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా ఉన్నారు. 2013–14 వరకు ఢిల్లీ, భోపాల్ తదితర ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నారు. కాలికి గాయం కావడంతో కబడ్డీకి దూరమై అనంతరం జిమ్‌లో చేరారు. 2022 ప్రాంతంలో హర్యాన్వీ సంగీతంపై దృష్టి పెట్టారు.గాయకుడిగా మాత్రమే కాకుండా గీత రచయితగా, సంగీత స్వరకర్తగా కూడా పనిచేశారు. తన కెరీర్లో 50కి పైగా పాటలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘భారీ కోర్ట్ మే గోలి మారేంగే’, ‘బాడీ బిల్డర్’, ‘పీటీఐ’, ‘ఏక్ ఖటోలా జైల్ కే భీతర్’ వంటి పాటలతో పాపులర్ అయ్యారు. ఆయన పాటలు, వీడియోల్లో తుపాకులు, గొడవలు, గ్యాంగ్‌లు, లగ్జరీ కార్ల ప్రస్తావనలు తరచూ కనిపించేవి. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా అంకిత్ భావిస్తున్నట్లు గతంలో సమాచారం వచ్చింది.హత్యకు కొన్ని గంటల ముందు..అంకిత్ హత్యకు కొన్ని గంటల ముందే తన కొత్త పాట ‘బేబీ బద్మాష్’కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో హత్యను ప్రస్తావించే కొన్ని పంక్తులను పాడారు. హత్య తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ పాటకు, హత్యకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? అన్నది మాత్రం ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు.ఇదీ చదవండి: జాక్‌పాట్ కొట్టిన కానిస్టేబుల్.. ఏకంగా కోట్లలో లాటరీ! -
ఐఏఎస్‌కు దివ్య మిట్టల్ గుడ్‌బై.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు
విదేశాల్లో లక్షల జీతం.. ఐఏఎస్‌లో ప్రతిష్ఠాత్మక కెరీర్.. అయినా ఆమె ఎందుకు అన్నింటినీ వదిలేశారు? 13 ఏళ్ల సుదీర్ఘ ఐఏఎస్ ప్రస్థానానికి దివ్య మిట్టల్ స్వచ్ఛందంగా ముగింపు పలికారు. ఉన్నత పదవి, అధికారం, గుర్తింపు ఉన్నప్పటికీ తన జీవితానికి అవే అంతా కాదని తేల్చిచెప్పారు. ఎలాంటి ఒత్తిడి లేదని, ఆకస్మిక నిర్ణయం కాదని స్పష్టం చేసిన ఆమె.. కుటుంబం, వ్యక్తిగత ఆసక్తులు, జీవితంలో చేయాలనుకున్న మరిన్ని పనుల కోసమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ఆమె..‘ఐఏఎస్ నా జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే.. నా మొత్తం జీవితం కాదు’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు.. ఆమె రాజీనామా అంశంపై అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.2013 బ్యాచ్‌కు చెందిన దివ్య మిట్టల్ యూపీలోని దేవరియా, మీర్జాపూర్, సంత్ కబీర్‌నగర్ జిల్లాలకు జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. ప్రస్తుతం రెవెన్యూ బోర్డులో స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజీనామాపై స్పందించిన దివ్య మిట్టల్.. ‘ఐఏఎస్ ఉద్యోగం నా జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే.. నా మొత్తం ఉనికి కాదని అన్నారు. తన ఇద్దరు కుమార్తెలు, కుటుంబ బాధ్యతలతో పాటు చాలాకాలంగా తనకు ఉన్న ఆసక్తులను కూడా ఇకపై కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. రచన, బోధన లేదా సామాజిక సేవలో ఏదైనా చేయొచ్చని ఆమె వెల్లడించారు. అయితే భవిష్యత్ ప్రణాళికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు..మరోవైపు.. ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్ రాజీనామా రాజకీయ రంగు పులుముకుంది. ఆమె నిర్ణయంపై స్పందించిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఉత్తరప్రదేశ్‌లో నిజాయితీగా పనిచేసే అధికారులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆరోపించారు. యోగి ప్రభుత్వంలో నిజాయితీగల అధికారులు పనిచేయలేకపోతున్నారు. అవినీతి కారణంగా వారు విధులు నిర్వర్తించలేకపోతున్నారు. అధికారులపై అంత ఒత్తిడి ఉంది.. రిటైర్మెంట్కు ముందే ఉద్యోగాలను వదిలేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.విదేశాల్లో భారీ జీతాలు.. అయినా భారత్‌కు తిరిగిఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో చదువుకున్న దివ్య మిట్టల్.. లండన్‌లో ఉద్యోగం కూడా చేశారు. జేపీ మోర్గాన్‌లో పనిచేసిన ఆమెకు అక్కడ మంచి కెరీర్ ఉండేది. ఆమె భర్త, మాజీ ఐఏఎస్ అధికారి గగన్‌దీప్ సింగ్ ధిల్లాన్ కూడా సిటీ గ్రూప్‌లో పనిచేశారు. అయితే విదేశాల్లో మంచి జీతాలు, విజయవంతమైన కెరీర్ ఉన్నప్పటికీ ఏదో లోటుగా అనిపించడంతో ఇద్దరూ భారత్‌కు తిరిగివచ్చారు. అనంతరం దివ్య మిట్టల్ సివిల్ సర్వీసెస్‌లోకి ప్రవేశించారు. 2012లో రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా 68వ ర్యాంక్‌తో ఐఏఎస్ సాధించారు.దేవరియా నుంచి మీర్జాపూర్ వరకు..ఉత్తరప్రదేశ్‌లో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించిన దివ్య మిట్టల్ తన పోస్టింగులు తనకు పరిపాలనకు మించిన జీవిత పాఠాలను నేర్పాయని చెప్పారు. దేవరియాలో సరైనదాని కోసం నిలబడటం బాధ్యత అని నేర్చుకున్నానని, మీర్జాపూర్లో ‘‘అసాధ్యం’’ అనేది వాస్తవం కాదు.. ఒక అభిప్రాయం మాత్రమే అని తెలుసుకున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె సమర్పించిన రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. యూపీ ప్రభుత్వం సిఫార్సు చేసిన అనంతరం తుది నిర్ణయం కేంద్ర హోంశాఖ తీసుకోనుంది.ఆమె సేవలో గుర్తుండిపోయే అంశాలులహురియాదహ్కు నల్లా నీరు: మిర్జాపూర్‌లోని లహురియాదహ్ గ్రామ ప్రజలు చాలా కాలంగా ట్యాంకర్ నీటిపై ఆధారపడేవారు. దివ్య మిట్టల్ హయాంలో అక్కడ పైపుల ద్వారా నీటి సరఫరా అందింది. తాజా కథనాలు దీనిని ఆమెకు గుర్తుండిపోయే ప్రజా సేవగా పేర్కొంటున్నాయి. కాగా, పదవి పోతుంది.. కానీ ప్రజల మనసుల్లో మిగిలే జ్ఞాపకాలు పోవు. లహురియాదహ్లో నల్లా నీరు వచ్చిన రోజు ఓ వృద్ధురాలి ఆశీర్వాదం తనతో జీవితాంతం ఉంటుందని దివ్య మిట్టల్ చెప్పడం.. ఆమె 13 ఏళ్ల ప్రస్థానానికి అద్దం పడుతోంది. ఇప్పుడు ఐఏఎస్‌కు రాజీనామా చేసినా ప్రజా సేవకు పూర్తిగా దూరం కావాలనుకోవడం లేదని ఆమె సంకేతాలిచ్చారు. ఐఏఎస్‌కు దివ్య మిట్టల్ వీడ్కోలు పలికినా.. తన లక్ష్యాలకు మాత్రం కాదని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: మాట్లాడింది.. రాహులా? భగవతా? -
అపుడు భర్త, ఇపుడు భార్య రాజీనామా? యూపీ రాజకీయాల్లోకి ఎంట్రీ?
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ రాజీనామా పెద్ద సంచలనంగా మారింది. ఇండియాలో IAS అధికారిగా రాణించిన ఆమె 13 ఏళ్ల కరియర్లో ఎన్నో విజయాలు, మరెన్నో కీలక మైలు రాళ్లు. 75 ఏళ్ల నాటి నీటి సమస్య పరిష్కారం మొదలు రాజీనామా వరకు దివ్యమిట్టల్ ప్రస్తానం వైరల్‌గా మారింది. ఇన్నేళ్ల సర్వీసు తరువాత రాజీనామా చేయడంతో మాజీ బ్యూరోక్రాట్ దంపతులు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు.దివ్య మిట్టల్, ఆమెభర్త గగన్‌దీప్, లండన్‌లో లక్షల విలువైన ప్యాకేజీని వదిలిపెట్టి భారతదేశానికి తిరిగి వచ్చారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, గగన్‌దీప్ సింగ్ ధిల్లాన్ తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ ర్యాంకును పొందగా, దివ్య మిట్టల్ 2012లో తన రెండవ ప్రయత్నంలో అఖిల భారత ర్యాంకు 68 సాధించారు. అలా డియోరియాలో కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే ఆమె పలుమార్లు వార్తల్లో నిలిచారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఆమెకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయడంతోపాటు, అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. కేవలం బీజేపీ ఎంఎల్ఏ ఆరోపణలు, ఫిర్యాదుల కారణంగా మే 6న డియోరియా నుండి బదిలీ చేశారా? లాంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. దివ్య మిట్టల్ ప్రత్యేకతలు, వివాదాలు లండన్‌లో ట్రేడింగ్ వృత్తిని వదిలిపెట్టిన మరీ IAS అధికారి కావాలనే కల సాకారం కోసం ఆమె ఇండియాకు తిరిగి వచ్చారు. మీర్జాపూర్ జిల్లా కలెక్టర్‌గా (2023) పనిచేసిన సమయంలో జల్ జీవన్ మిషన్ కింద ఆమె చేసిన కృషి, సేవ ప్రత్యేకంగా నిలుస్తుంది.దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, మీర్జాపూర్‌లోని లహరియా దాహ్ గ్రామానికి నీటి సౌకర్యాన్ని కల్పించింది మాత్రం దివ్య మిట్టలే అని మీర్జాపూర్ ప్రజలు ఇప్పటికీ చాలా గర్వంగా చెప్పుకుంటారు. ఆమెను ఎంతో గౌరవిస్తారు. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మీర్జాపూర్ నుండి పోటీ చేసే అవకాశం ఉందా అనే ఊహాగానాలు వెలుగులోకి వస్తున్నాయి.क्या जीवन में थक गए हो? मेरी स्वरचित कुछ पंक्तियाँ आपके लिए - ‘रुकना मत’ pic.twitter.com/egSijXFKgT— Divya Mittal (@divyamittal_IAS) July 29, 2026 లహూరియా దాహ్ గ్రామానికి పైపుల ద్వారా నీటి సరఫరా లేదు. కానీ ఆమె కృషితో జల్ జీవన్ మిషన్ కింద ఆ గ్రామానికి 75 ఏళ్లలో తొలిసారిగా కుళాయి నీరు అందింది. ఈ విషయాన్ని ఆమె తన రాజీనామా లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొండ ప్రాంతం, పైప్లైన్లు విజయవంతంగా అందుబాటులోకి వచ్చాయి. 125 ఇళ్లకు కనెక్షన్లు, సుమారు 1,200 మంది నివాసితులు లబ్ధి పొందారు. సుదీర్ఘ తీవ్రమైన తాగునీటి సంక్షోభానికి తెరపడింది. అంతకుముందు, కాలానుగుణంగా వచ్చే నీటి ఊటపై, ఖరీదైన ప్రైవేట్ ట్యాంకర్లే ఆధారం. నీటి కోసం ప్రతీ రోజూ కాలి నడకన వెళ్లి అష్టకష్టాలు పడాల్సి వచ్చేది.అయితే ఈ కార్యక్రమంలో ఆమెను ప్రోటోకాల్ పాటించలేదంటూ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి యోగీ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఆయనను ఆహ్వానించలేదనే ఆరోపణల మధ్య ఆమెను బదిలీ చేశారన్న ఆరోపణలు గుప్పు మన్నాయి. ఆ తరువాత దివ్యను బదిలీ చేశారు. 'వెయిటింగ్ లిస్ట్'లో ఉంచారు. అంతేకాదు కొత్తగా వేసిన పైప్‌లైన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో నీటి సరఫరా మళ్లీ నిలిచిపోయింది. గ్రామాన్ని తిరిగి నీటి సంక్షోభంలోకి వెళ్లిపోయింది. నెలల తరబడి అధికారిక పోస్టింగ్ లేకుండా నిరీక్షణ జాబితాలో ఉన్న దివ్య మిట్టల్ చివరికి తన పదవికి రాజీనామా చేశారు.వంతెన నిర్మాణంలో నిర్లక్ష్యం వహించినందుకు దివ్య ఒక PWD అధికారిని మందలించారు. ఆ సమయంలో, ఎండ తీవ్రతను ప్రస్తావిస్తూ, నీడలో కూర్చుని మాట్లాడాలని ADM ఆమెను కోరారు. దానికి ఆమె సరదాగా స్పందిస్తూ, " మిత్రమా, అది కేవలం ఎండ మాత్రమే కదా—కాస్త ఓపిక పట్టు, మనం కరిగిపోము కదా..." అని బదులివ్వడం పలువుర్ని ఆకట్టుకుంది. అంతేకాదు అక్రమ ఆక్రమణకు సంబంధించిన ఫిర్యాదుపై కనుంగో-లేఖ్పాల్ను మందలిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది."దీన్ని మీరు సర్కస్‌లా మార్చేశారు. ఈ వ్యవహారం మొత్తాన్ని విచారించి నివేదిక సమర్పించండి. ఇకపై ఇలాంటి పనులు చేయకండి. నిజంగానే, మిమ్మల్ని జైలుకు పంపిస్తాను." అంటూ తీవ్రంగా హెచ్చరించిన వైనం అప్పట్లో పెద్ద సంచలనం.ఇదీ చదవండి: యూపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా కలకలంఅప్పుడు భర్త, ఇప్పుడు భార్యఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్ భర్త గగన్ దీప్ సింగ్ కూడా వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో,2022లో తన పదవికి రాజీనామా చేశారు. వీరిద్దరూ అత్యున్నత స్థాయి అధికారులు, పైగా ఇప్పుడు ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేయడంతో వీరి భవిష్యత్ ప్రణాళిక ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆ తర్వాత ఆమె భర్త దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యాపారం చేసే ఒక సంస్థను స్థాపించారు. మరోవైపు గత నాలుగు నెలలుగా ఆమెకు ఎటువంటి కీలక బాధ్యతలు అప్పగించకపోవడంతో, ఇప్పుడు ఆమె తన భర్త వ్యాపారానికి సహకరించడం లేదా రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంచనా. కాగా గగన్ దీప్ సింగ్ హర్యానాలోని రేవారి జిల్లాకు చెందినవారు. గగన్ దీప్ సింగ్ 2011 బ్యాచ్‌కు చెందిన ఐటీఎస్ (ITS) అధికారి.రాజీనామాకు ఆమె చెప్పిన కారణంతన నిర్ణయం ఎలాంటి ఒత్తిడి లేదా ప్రేరేపణ ఫలితంగా తీసుకోలేదని, ఇది పూర్తిగా ఆలోచించి తీసుకున్న వ్యక్తిగత కుటుంబ నిర్ణయమని స్పష్టం దివ్య మిట్టల్ చేశారు. తన ప్రాధాన్యతలు, ఆసక్తులు, ఇద్దరు కుమార్తెలు, కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆమె రచన, బోధన, సామాజిక సేవ వంటి రంగాలలోకి ప్రవేశించవచ్చని తెలిపారు. ‘‘ఐఏఎస్ ఉద్యోగం నా జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే, నా జీవితం మొత్తం కాదు" అని పేర్కొనడం గమనార్హం.మోటివేషనల్ వీడియో వైరల్ ‘‘అలసిపోతే, నిద్రపోండి, మీ హృదయం నిండిపోతే, ఏడవండి, కానీ ఆగిపోకండి’’ అంటూ దివ్య మిట్టల్ పాత స్ఫూర్తిదాయక వీడియో వైరల్ అవుతోంది. -
యూపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా కలకలం
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ తీసుకున్న సంచలన నిర్ణయం నెట్టింట వైరల్‌గా మారింది. యూపీ రెవెన్యూ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న దివ్య మిట్టల్, 13 ఏళ్ల సుదీర్ఘ కరియర్‌కు రాజీనామా చేశారు. సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ, ప్రజా సేవలో గడిపిన తన సంవత్సరాలను ఒక మరపురాని అధ్యాయంగా మిట్టల్ అభివర్ణించారు.ఐఏఎస్‌లో 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను ముగిస్తూ, మిట్టల్ తన దృష్టిలో, అధికారిక పదవిని వదిలివేయడం అంటే, తనను భారతదేశానికి తిరిగి తీసుకువచ్చిన ఉన్నతమైన లక్ష్యాన్ని విడిచిపెట్టడం కాదని వ్యాఖ్యానించారు. తాను ఈ పదవిని వీడుతున్నప్పటికీ, సేవ వైపు తనను ఆకర్షించిన గొప్ప కల మాత్రం కొనసాగుతుందని ఆమె అన్నారు. అదే విధంగా ప్రజా సేవపై తన మారుతున్న అవగాహన గురించి, తన వృత్తి జీవితంలో తాను కనుగొన్న ఉద్దేశ్యం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఒకప్పుడు తన కోసం తాను కన్న వ్యక్తిగత కలలు ఇప్పటికే నెరవేరాయని, ఇప్పుడు తాను ఇతరుల కోసం కన్న కలల కోసం జీవించాలను కుంటున్నానని మిట్టల్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.‘‘ఈ నేల నాకు విద్యను, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆ రుణం తీర్చుకోవడానికే సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చాను" అని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. తాను ఒకప్పుడు విజయంగా భావించిన దానిని సాధించి నప్పటికీ, ఏదో అసంపూర్ణంగా మిగిలిపోయిందని అనిపించిందని ఆమె తన రాజీనామా లేఖలో గుర్తు చేసుకున్నారు. భారతదేశానికి దూరంగా జీవించడం తనను కలవరపెట్టిందనీ, అందుకే దేశానికి తిరిగి వచ్చి ఐఏఎస్‌లో చేరినట్టు చెప్పుకొచ్చారు. లండన్‌లో ఉన్నతమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి దేశసేవ కోసం భారత్ వచ్చినమిట్టల్ తాజా రాజీనామా చర్చకు దారి తీసింది. आज मैंने 13 वर्षों की अविस्मरणीय यात्रा को अपनी इच्छा से विराम देते हुए IAS से त्यागपत्र दे दिया है।साधारण परिवेश में पलते हुए मैंने एक अच्छे, सफल जीवन का सपना देखा था। दिन-रात एक कर IIT दिल्ली और IIM बैंगलोर से पढ़ने के बाद, लंदन में नौकरी लग गयी। पर 'सब कुछ' पा लेने पर भी कुछ… pic.twitter.com/4VRXpK8nu8— Divya Mittal (@divyamittal_IAS) August 30, 2026 అలాగే కుటుంబాలు తొలిసారిగా భూమి హక్కులను పొందడం, దివ్యాంగులు గౌరవప్రదంగా జీవించే అవకాశాలను పొందడం, రైతులు తమ పొలాలకు నీటిని అందుకోవడం వంటివి చూడటమే ప్రజా సేవలో అత్యంత సంతృప్తి నిచ్చిన ఉదంతాలన్నారు. ప్రజలకు ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ప్రజా సేవలోకి ప్రవేశించానని , అయితే, సంవత్సరాలు గడిచేకొద్దీ, వారి సంతోషం, ఆప్యాయత , నమ్మకం రూపంలో తాను వారి నుండి అంతకంటే ఎంతో ఎక్కువ పొందానంటే సంతోషాన్ని వెలిబుచ్చారు. తన పదవీ కాలంలో తనతో పాటు పనిచేసిన సహోద్యోగులకు, అధికారులకు ,ఉద్యోగులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు లభించిన ప్రేమ, మర్యాద, ఆప్యాయత తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని, కష్ట సమయాల్లో కూడా ముందుకు సాగడానికి అవి తోడ్పడ్డాయన్నారు.లహూరియా దేహ్ గ్రామానికి మొదటిసారిగా నీరు రావడం చూసి, ఒక వృద్ధురాలు వణుకుతున్న చేతులతో తన తలను తాకడాన్ని మిట్టల్ గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ 75 ఏళ్ల నిరీక్షణ తర్వాత 125 కుటుంబాలకు పైపుల ద్వారా కుళాయి నీటిని అందించింది. తన వీడ్కోలు ప్రసంగంలో, పరిపాలన ,బాధ్యతపై తన అవగాహనను తీర్చిదిద్దడంలో ఈ రెండు పోస్టింగ్‌లే కీలకమని వ్యాఖ్యానించడం విశేషం. న్యాయమైన దాని పక్షాన నిలబడటం ఒక ఐచ్ఛికం కాదని, అది ఒక కర్తవ్యం అని డియోరియా తనకు నేర్పించిందనీ. "అసాధ్యం అనేది వాస్తవం కాదు, కేవలం ఒక అభిప్రాయం మాత్రమే" అని మీర్జాపూర్ తనకు నేర్పించిందన్నారు. అయితే లండన్‌లో ఉన్నతమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి దేశసేవ కోసం భారత్ వచ్చినమిట్టల్ తాజా రాజీనామా చర్చకు దారి తీసింది. మరోఆణిముత్యం లాంటి ఆఫీసర్‌ను కోల్పోయాం అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయిఇదీ చదవండి: Nepal Flash Floods 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు!ఎవరీ దివ్య మిట్టల్ఢిల్లీకి చెందిన ఈమె ఐఐటీ ఢిల్లీనుంచి ఇంజినీరింగ్, ఐఐఎమ్ బెంగళూరు నుంచి మేనేజ్మెంట్ పూర్తి చేశారు. లండన్‌లో ఫైనాన్స్ విభాగంలో అధిక జీతంతో కూడిన ఉద్యోగం సాధించినప్పటికీ, దేశానికి సేవ చేయాలనే తపనతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్‌కు తిరిగొచ్చారు. UPSC సాధించి IAS అధికారిణిగా మారారు. అలా మిట్టల్ తన ఐఏఎస్ కెరీర్లో యూపీలోని మీర్జాపూర్ , సంత్ కబీర్ నగర్, జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. అలాగే రెవెన్యూ శాఖలో స్పెషల్ సెక్రటరీగా సేవలు అందించారు. ముఖ్యంగా మీర్జాపూర్‌లోని 'లహురియా దిహ్' (Lahuriya Dih) కొండ ప్రాంత గ్రామానికి తొలిసారిగా తాగునీరు అందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. మిట్టల్ మే నెలలో డియోరియా నుండి లక్నోకు రెవెన్యూ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఆమె భర్త గగన్‌దీప్ సింగ్ కూడా ఐఏఎస్ అధికారి. ఐఐటి ఢిల్లీ, ఐఐఎం బెంగళూరు పూర్వ విద్యార్థి.ఇదీ చదవండి: తుకారాం ముండేకు భారీ ఎదురు దెబ్బ, హైకోర్టు మండిపాటు -
మందాకిని ఉగ్రరూపం.. వరదల్లో ఉత్తర ప్రదేశ్
-
గల్ల పగలగొట్టిన అమ్మాయి.. ఆ డబ్బుతో ఏం కొన్నదో తెలిస్తే షాక్
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ 9 ఏళ్ల పాటు తన గల్ల (పిగ్గీ బ్యాంక్)లో డబ్బు దాచుకుంది. చివరకు ఆ డబ్బుతో కారు, ఫోన్ లేదా మరేదైనా విలాసవంతమైన వస్తువు కొనకుండా, ఓ స్థలం కొనుగోలు చేసింది.ఇన్స్టాగ్రామ్ వినియోగదారు దీక్షా జైస్వాల్ తన ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. 2017 నుంచి ఏళ్ల తరబడి డబ్బు దాచుకోవడం ద్వారా తాను ఏం సాధించానో అందులో చూపించారు.వీడియోలో దీక్షా నవ్వుతూ తన పిగ్గీ బ్యాంక్‌ను ఖాళీ చేస్తూ కనిపించారు. ఏళ్ల తరబడి జాగ్రత్తగా దాచుకున్న నోట్ల కట్టలు, నాణేలను బయటకు తీశారు. "2017 నుంచి డబ్బు దాచుకోవడం ద్వారా ఏం సాధించారు?" అని వీడియోలో ఒకరు ప్రశ్నించింది.ఆ తర్వాత దీక్షా ఓ బ్యాగ్‌తో నడుస్తూ కనిపించారు. అందులోంచి 7 నుంచి 8 నగదు కట్టలను బయటకు తీశారు. తాను దాచుకున్న డబ్బుతో పెద్ద కొనుగోలు చేయబోతున్నట్లు ఇది సూచించారు.తర్వాతి దృశ్యంలో ఆ డబ్బుతో ఆమె ఏం కొనుగోలు చేశారో వెల్లడైంది. వాహనం లేదా మరో ఖరీదైన వస్తువు కొనకుండా, దీక్షా ఓ స్థలంలో పెట్టుబడి పెట్టారు.ఆ తర్వాత ఆమె తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. తన తాజా పెట్టుబడిని గర్వంగా చూపిస్తూ, ఏళ్ల తరబడి డబ్బు దాచుకున్న తర్వాత సాధించిన విజయాన్ని జరుపుకున్నారు.ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాలక్రమంలో విలువ కోల్పోయే వస్తువుపై డబ్బు ఖర్చు చేయకుండా, ఆస్తిలో పెట్టుబడి పెట్టిన ఆమె నిర్ణయాన్ని పలువురు ప్రశంసించారు.ఓ వినియోగదారు ఇన్నేళ్లు డబ్బు దాచుకున్న తర్వాత ఆమె కారు కొనకపోవడం సంతోషంగా ఉందని చెప్పారు. మరో వినియోగదారు తన సొంత సంపాదనతో ఓ మహిళ ఆస్తిలో పెట్టుబడి పెట్టడం చూసి "చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉంది" అని చెప్పారు. ఇదే సరైన మార్గమని పేర్కొన్నారు.మరికొందరు ఆమె చివర్లో కారు, ఫోన్ లేదా బంగారం చూపిస్తారని ఊహించినట్లు చెప్పారు. కానీ ఆమె తీసుకున్న నిర్ణయం చూసి ఆనందం కలిగిందన్నారు. ఓ ప్రేక్షకుడు తన ఫీడ్‌లో కనిపించిన వారిలో ఆమెనే తెలివైన వ్యక్తి అని పేర్కొన్నారు. చిన్న వయసులోనే ఆమె పెట్టుబడులపై అవగాహన కలిగి ఉండటం బాగుందన్నారు. View this post on Instagram A post shared by Diksha Jaiswal (@djmadgirl) -
నన్ను కూడా చేర్చుకోండి సార్! నాకు చాలా అనుభవం ఉంది!!
నన్ను కూడా చేర్చుకోండి సార్! నాకు చాలా అనుభవం ఉంది!! -
డిగ్రీ కాదు.. స్కిల్స్ ఉంటే చాలు! ఈ రాష్ట్రం టాప్‌లో!
ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు.. కార్పొరేట్ హబ్‌గా వెలుగుతున్న ముంబైలను దాటుకుని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, స్కిల్స్ రేస్‌లో ఉత్తరప్రదేశ్ నెంబర్ వన్ పీఠాన్ని కైవసం చేసుకుంది! ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 విడుదల చేసిన తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం. 78.64 శాతం ఎం΄్లాయబిలిటీ రేటుతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలవగా.. ఇందులో మహిళలే ఎక్కువ అర్హత గలవారిగా రికార్డు సృష్టించారు. ఉద్యోగానికి కావాల్సింది చేతిలోని డిగ్రీలు కాదు... స్కిల్స్ కూడా అవసరమే అని నిరూపించారు.ఇన్నాళ్లూ మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలదే హవా అనుకున్న ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేస్తూ, ఈసారి ఉత్తరప్రదేశ్ యువత ప్రతిభలో టాప్‌గేర్ వేశారు. మారుతున్న ఉద్యోగ అవసరాలకు తగినట్టుగా నైపుణ్యాలను పెంపొందించుకుని 78.64 శాతంతో ప్రథమ స్థానాన్ని సంపాదించుకుంది. వాణిజ్య రాజధాని మహారాష్ట్ర గట్టి పోటీనిచ్చినప్పటికీ 75.42 శాతంతో రెండో స్థానానికే పరిమితమైంది. కర్ణాటక ఐటీ పవర్ హౌస్‌గా ఉన్నప్పటికీ 73.85 శాతంతో నైపుణ్య వృద్ధిలో మూడో స్థానానికి చేరింది. కేరళ విద్యా శ్రేణిలో ముందంజలో ఉన్నా నైపుణ్యంలో 72.16 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. ఢిల్లీ 71.25 శాతంతో ఐదో స్థానంలో నిలిచింది.జాతీయ సగటు పెరుగుదలదేశ వ్యాప్తంగా యువత ఉద్యోగ అర్హత 2025లో 54.81% ఉండగా 2026 నాటికి 56.35% కి పెరిగింది. 2022లో ఇది 46.2% మాత్రమే ఉండేది. డిజిటల్ టెక్నాలజీల వినియోగం పెరగడం దీనికి ప్రధాన కారణం.మహిళలే టాప్ఉద్యోగార్హతలో మహిళలు (54%) మొదటిసారిగా పురుషులను (51.5%) వెనక్కి నెట్టారు! ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి వస్తున్న మహిళలు బ్యాంకింగ్, హెల్త్‌కేర్, విద్యారంగాల్లో సరికొత్త రికార్డులు çసృష్టి్టస్తున్నారు.ఏఐ నైపుణ్యాలే ముఖ్యంకంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లలో అత్యధికంగా 80%, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో 78%, ఇన్స్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో 77% ఉద్యోగ అర్హత నమోదైంది. ఏఐ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్ ఉంది. గ్లోబల్ ఏఐ టాలెంట్‌లో 16% వాటా మన భారతీయులదే.గిగ్ ఎకానమీ ధమాకా2030 నాటికి దేశంలో 2.35 కోట్ల మంది ఫ్రీలాన్సర్లు, గిగ్ వర్కర్లు రాబోతున్నారనీ.. ‘ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఆఫీస్ డెస్క్’’ అనే సాంప్రదాయ పద్ధతికి కాలం చెల్లుతోందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. పాఠ్యపుస్తకాల్లో చదివే పాతకాలపు విషయాల కంటే, కంపెనీలలో నేరుగా ఉపయోగపడే ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్నవారికే ఉద్యోగాల్లో గ్రీన్ సిగ్నల్ లభిస్తోంది.అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కోడింగ్, ఏఐ టూల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్న యువత ఏ ప్రాంతంతోనూ సంబంధం లేకుండా ముందంజలో ఉంటరన్నమాట.ఇవి కూడా చదవండి: ఆటల్లో రాణిస్తున్నారు! -
నేపాల్ వరదల్లో కొట్టుకుపోయిన 7 మృతదేహాలు భారత్‌లో గుర్తింపు
లక్నో: నేపాల్ నుంచి ప్రవహించే నదుల్లో ఏడు మృతదేహాలను భారత అధికారులు వెలికితీశారు. ఇవి మెరుపు వరదల్లో మృతి చెందినవారి మృతదేహాలు అయి ఉండొచ్చని అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ ఘటన ఘోర వరద విపత్తు తీవ్రతను తెలియజేస్తోంది.నేపాల్ దక్షిణ ప్రాంతంలోని వరద ప్రభావిత చిత్వన్ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్, కుషీనగర్ జిల్లాల్లో నదుల్లో ఈ మృతదేహాలు కొట్టుకొస్తూ కనిపించాయి.“గుర్తుతెలియని నాలుగు మృతదేహాలను గురువారం జిల్లాలో వెలికితీశాం. అక్కడ సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత అవి నేపాల్ నుంచి కొట్టుకొచ్చి భారత్‌లోకి ప్రవేశించి ఉంటాయని భావిస్తున్నాం” అని ” అని మహారాజ్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ సింగ్ సోగర్వాల్ ఏఎఫ్పీకి తెలిపారు. సరిహద్దు నుంచి నదీ ప్రవాహ దిశలో సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుషీనగర్ జిల్లాలో మరో మూడు మృతదేహాలను వెలికితీశామని పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.కాగా, నేపాల్ వరదల్లో 538 మంది మృతి చెందారు. ఇందులో నేపాల్‌లో వెలికితీసిన 469, చైనాలో 3 మృతదేహాలు ఉన్నాయి. దాదాపు 1,400 మంది ఆచూకీ తెలియడం లేదు. భారత్‌లో వెలికితీసిన ఏడు మృతదేహాలను ఈ మృతుల సంఖ్యలో చేర్చలేదు.ఇదీ చదవండి: నార్వే రాజు హరాల్డ్-5 ఇకలేరు -
సింగర్ దారుణ హత్య.. యోగి సర్కార్‌పై తీవ్ర విమర్శలు
ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశం.. మరోసారి చర్చనీయాంశమైంది. ప్రముఖ హర్యాన్వీ గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బల్యాన్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపడంతో రాష్ట్రం ఉలిక్కి పడింది. షామ్లీ జిల్లాలోని కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ఆ రాష్ట్రంలో ప్రజలకు, ప్రముఖులకు రక్షణ కరువైందని యోగి సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.పోలీసుల వివరాల ప్రకారం.. అంకిత్ బల్యాన్ జిమ్(33) నుంచి బయటకు వస్తుండగా బైకులపై వచ్చిన ఇద్దరు దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే కూలిపోగా.. దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అంకిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు షామ్లీ ఎస్పీ ఎం.పీ. సింగ్ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. అంకిత్‌పై దుండగులు దాదాపు 18 రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం.ఎవరీ బల్యాన్ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌లోనూ అంకిత్ బల్యాన్ యూట్యూబ్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన గాయకుడు. ఆయన ఛానల్‌కు 3.66 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. హర్యాన్వీ పాటలు, ప్రదర్శనలతో యువతలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వీడియోల్లో పాటలతో పాటు లగ్జరీ కార్లు, ఆయుధాల ప్రదర్శన హైలైట్ అయ్యేవి. ఇదిలా ఉండగా.. అంకిత్ బల్యాన్ త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.అఖిలేష్ ఆగ్రహంఅంకిత్ హత్యపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. అయితే ఎస్సీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని విమర్శించారు. ఈ ఘటన భయాందోళనలకు కారణమైందని పేర్కొన్నారు. అంకిత్ తల్లి తన కుమారుడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని విలపించిన దృశ్యం హృదయ విదారకమని అన్నారు. వ్యక్తిగత కక్షలతో పాటు రాజకీయ కక్షల కోణంలోనూ దర్యాప్తు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఈ హత్యపై జాట్ వర్గంలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో జాట్లు మొత్తం జనాభాలో సుమారు 2–3 శాతం వరకు ఉంటారని అంచనాలు ఉన్నాయి. అయితే పశ్చిమ యూపీలోని షామ్లీ, ముజఫర్‌నగర్, బాఘ్‌పత్, మీరట్ వంటి జిల్లాల్లో వీరి ప్రభావం గణనీయంగా ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో జాట్ ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు.ఇప్పటికే యూపీలో శాంతి భద్రతల గురించి దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. గ్యాంగ్స్టర్ల ఎన్కౌంటర్ల గురించి యోగి ప్రభుత్వ తొలి కాలంలో సానుకూల చర్చ నడిచినా.. ప్రస్తుత టర్మ్‌లో మాత్రం కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. అమాయకులు బలైపోతున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి తోడు.. అభివృద్ధి అంశం పూర్తిగా పక్కకు జరిగిపోయిందనే విశ్లేషణలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో.. వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంకిత్ బల్యాన్ హత్య రాజకీయ చర్చకు దారి తీసింది. జాట్ సంఘాలు దీనిని పెద్ద అంశంగా తీసుకుని ఆందోళనలు చేస్తే యోగి సర్కార్‌కు కాస్త ఇబ్బందికర పరిస్థితే ఎదురు కావొచ్చు.ఇదీ చదవండి: సీఎం కటింగ్ ఖరీదు 50రూ. -
లంచాలను సమానంగా పంచుకుందామంటూ ప్రమాణం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు కౌన్సిలర్లు లంచాల ద్వారా వచ్చిన డబ్బును తమలో తాము నిజాయితీగా పంచుకుంటామని ప్రమాణం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో మున్సిపల్ సంస్థ విచారణకు ఆదేశించింది.వీడియోలో ఒక మున్సిపల్ కౌన్సిలర్ గంగాజలం ఉన్న పాత్రను పట్టుకుని, లంచాల ద్వారా వచ్చిన డబ్బును 60 మందికి సమానంగా పంచుకుంటామని ప్రమాణం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఒక వ్యక్తి ప్రమాణం చేయిస్తుండగా.. చేతుల్లో నీటితో కొంతమంది నిలబడి ఆయన చెప్పిన మాటలను పునరావృతం చేస్తున్నట్లు కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వారిని మున్సిపల్ కౌన్సిలర్లుగా గుర్తించారు. అయితే వీడియో నిజమైనదా, అందులో కనిపిస్తున్న వ్యక్తులు ఎవరు అనే విషయాలను స్వతంత్రంగా ఏ వార్తా సంస్థా ధ్రువీకరించలేదు.ఆ వీడియోలో ప్రకారం.. మున్సిపల్ కార్పొరేషన్‌కు వచ్చిన డబ్బును 60 మంది కౌన్సిలర్లకు సమానంగా పంచుకోవాలని పేర్కొన్నారు. తమలో ఎవరైనా ఇబ్బందుల్లో పడితే అందరూ ఐక్యంగా నిలబడతామని కూడా ఆ బృందం ప్రమాణం చేసినట్లు చెబుతున్నారు. ప్రమాణాన్ని ఉల్లంఘించిన వ్యక్తిని ద్రోహిగా పేర్కొంటూ వీడియోలో అభ్యంతరకరమైన వ్యాఖ్య కూడా ఉంది.ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో కౌన్సిలర్లపై అవినీతి ఆరోపణలకు దారితీసింది. ఒక కౌన్సిలర్ ఆస్తులు పెరిగినట్లు కొంతమంది వినియోగదారులు చెప్పారు. 3 ఏళ్ల క్రితం ఆ వ్యక్తికి ఒక ఇల్లు మాత్రమే ఉండేదని, ఇప్పుడు అనేక ఇళ్లు, విలాసవంతమైన వాహనాలు సంపాదించారని వారు ఆరోపించారు.మున్సిపల్ కమిషనర్ సౌమ్య గురురాణి జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఈ వీడియోను 2025 నవంబర్‌లో, మరో మున్సిపల్ కమిషనర్ బాధ్యతల్లో ఉన్న సమయంలో చిత్రీకరించినట్లు సమాచారం అందిందని తెలిపారు. “అయినప్పటికీ, మేము విచారణకు ఆదేశించాం” అని ఆమె చెప్పారు. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.UP councillors in Shahjahanpur reportedly took a Gangajal oath to equally share the municipal corporation’s earnings, sparking allegations of corruption and questions over public money. pic.twitter.com/P4dt07sFw4— Ground Eye 🇮🇳 (@TapasyaYaa83081) August 25, 2026 -
ఇందుకేనేమో యువకులు పెళ్లి చేసుకోవాలంటే వణికిపోతున్నారు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ భర్త తన భార్యను ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దీంతో, ఈ సమయంలో తన భార్య తన చేతులను పట్టుకోగా, ఆమె ప్రియుడు తనపై దాడి చేసి.. గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని బాధిత భర్త ఆరోపించాడు. ఇంతలో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి తనను కాపాడారని తెలిపాడు.బాధిత భర్తకు ఆ మహిళతో సుమారు నెలన్నర క్రితమే వివాహం జరిగింది. ఫిర్యాదు చేసేందుకు భర్త ఝాన్సీ ఎస్ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తన గోడును వెల్లడించాడు. ఈ ఘటన ప్రస్తుతం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.చిర్గావ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అతడు నివసిస్తున్నాడు. అతడు తన తల్లిదండ్రులతో కలిసి ఎస్ఎస్పీ కార్యాలయానికి వెళ్లాడు. జూన్ 24న మధ్యప్రదేశ్‌లోని భాండేర్కు చెందిన ఓ యువతితో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగినట్లు తెలిపాడు. పెళ్లయినప్పటి నుంచి తన భార్య తనకు నిద్రమాత్రలు ఇవ్వడం ప్రారంభించిందని, తాను నిద్రపోయాక ఆమె తన ప్రియుడితో మాట్లాడుకునేదని భర్త ఆరోపించాడు.టీ, పాలలో నిద్రమాత్రలు తన భార్య టీ, పాలలో నిద్రమాత్రలు కలిపేదని, ప్రియుడితో కలిసి తనపై హత్యాయత్నానికి పాల్పడిందని బాధిత భర్త ఆరోపించాడు. ఆగస్టు 19న ప్రియుడి ఇంట్లోకి వెళ్లిన తర్వాత, ఆగస్టు 23న రెండోసారి భర్త వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ సమయంలో ప్రియుడు, భార్య కలిసి తన గొంతు నులిమి కొట్టారని ఆరోపించాడు. అతని అరుపులు విని వచ్చిన పొరుగువారు అతడిని కాపాడారు. ప్రస్తుతం తన ప్రాణాలకు ప్రమాదం ఉందని చెబుతూ బాధితుడు పోలీసులను న్యాయం చేయాలని కోరాడు.ఈ కేసుపై మోంఠ్ పోలీస్ సర్కిల్ అధికారి మాట్లాడుతూ.. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారని, ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఇదీ చదవండి: భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ భారీ ప్రణాళిక -
ముమ్మాటికి అది నీటి సమస్యేనా..? పరిశోధకులు సైతం..
అది కేవలం నీటి సమస్యేనా.. అంతకుమించి మరేదైనానా..!? టెక్నాలజీ పెరిగింది.. అంతరిక్షానికి చేరువయ్యే మేథస్సుని అందిపుచ్చుకుంటున్నా.. ఇంకా కులం కోరల్లో మగ్గిపోతున్నారు చాలచోట్ల. వీచే గాలి, ప్రసరించే ఎండకు లేని భేదం మనిషికి మనిషికి మధ్య కులం అనే అడ్డుగోడ సృష్టించే సమస్యలకు నిలువెత్తు నిదర్శనం ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్ ఖండ్‌లో కనిపించే సమస్య. శాస్త్రవేత్తలను సైతం దిగ్బ్రాంతికి గురిచేసే మానవీయ సమస్య.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఎండలు మండిపోతుండటంతో నీటి కష్టాలు తీవ్రంగా మారుతున్నాయి. కరువు, తక్కువ వర్షపాతం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. దీంతో అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి కోసం ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఇప్పటికే ఉన్న కుల వివక్షను మరింత తీవ్రం చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.జలౌన్ జిల్లాకు చెందిన 40 ఏళ్ల మమత పరిస్థితి ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన దళితురాలైన ఆమె.. కుటుంబ సభ్యులు, పశువుల అవసరాల కోసం ప్రతిరోజూ హ్యాండ్‌పంప్(బోరింగ్) వద్దకు వెళ్లి నీటిని తీసుకువస్తోంది. గ్రామంలో ప్రభుత్వ పథకం కింద ఏర్పాటు చేసిన నల్లాలు రెండేళ్లుగా పనిచేయకపోవడంతో సుమారు వెయ్యి మంది ప్రజలు కొద్దిపాటి హ్యాండ్పంపులపైనే ఆధారపడుతున్నారు. దీంతో మమత రోజుకు 8 నుంచి 10 సార్లు నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది.అయితే నీటి కోసం వెళ్లే మమతకు ఎండలతో పాటు కుల వివక్ష కూడా ఇబ్బందిగా మారిందని ఆమె ఆరోపిస్తోంది. ఆధిపత్య కులాలకు చెందినవారు హ్యాండ్‌పంప్ వద్ద ఉన్నప్పుడు తాము నీటిని పట్టుకోలేమని, వారు వెళ్లే వరకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని చెబుతోంది. అంతేకాకుండా నిమ్నకులాలు తాకిన హ్యాండ్పంప్ని వారు వెళ్లిన తర్వాత నీటిని పోసి శుద్ధి చేస్తారని ఆరోపించింది. ఇదే తరహా అనుభవాన్ని షాజహాన్‌పూర్‌కు చెందిన శివ్ కూడా ఎదుర్కొంటున్నాడు. ఆధిపత్య కులాల వారు నీటిని తీసుకుంటున్నప్పుడు తమ వర్గానికి చెందినవారు హ్యాండ్‌పంప్ వద్దకు వెళ్లరని, ఎంత ఎండగా ఉన్నా వేచి ఉండాల్సిందేనని తెలిపాడు. కుటుంబ సభ్యులు ఎంత దాహంగా ఉన్నాసరే.. అగ్ర కులాలవారు అక్కడినుంచి వెళ్లే వరకు గంటల తరబడి వేచి ఉండాలని, గతంలో నీటి విషయంలో జరిగిన గొడవలో తన తల్లిపై దాడి కూడా జరిగిందని ఆరోపించాడు.వేసవి కాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. ఈ క్రమంలో చలికాలంలో రోజుకు 2, 3 సార్లు మాత్రమే నీటి కోసం వెళ్లే మమత.. వేసవిలో ఏకంగా 8 నుంచి 10 సార్లు నీటికోసం వెళ్లాల్సి వస్తోందని చెబుతోంది. మరోవైపు బుందేల్‌ఖండ్‌లో ఇటీవలి వేసవిలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరువయ్యాయి. ఆ ప్రాంతం రాతి నేల కారణంగా భూగర్భ జలాలను ఎక్కువగా నిల్వ చేసుకోలేకపోవడం, వర్షపాతం తక్కువగా ఉండటం కూడా నీటి సమస్యను అధికం చేస్తున్నాయి. అయితే నీటి వనరుల వద్ద కుల వివక్ష జరుగుతోందన్న ఆరోపణలను స్థానిక అధికారులు కొట్టివేస్తున్నారు. నీటి కొరతను ఎదుర్కొనేందుకు పైపుల ద్వారా తాగునీరు అందించడం, చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పెంచే చర్యలు చేపడుతున్నామని వారు చెబుతున్నారు.అయితే నీటి వనరులను పెంచడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం కాదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఎండలు ఇప్పటికే ఉన్న సామాజిక అసమానతలను మరింత తీవ్రం చేస్తున్నాయని వారు చెబుతున్నారు. నీరు కొరతగా మారిన కొద్దీ నీటికై పోటీ పెరుగుతోందని, ఈ క్రమంలో దళితులు ఎదుర్కొంటున్న వివక్ష మరింత స్పష్టంగా బయటపడుతోందని అంటున్నారు. అందరికీ సమానంగా నీరు అందేలా చూడటంతో పాటు కుల వివక్షను తొలగించేందుకు చర్యలు తీసుకున్నప్పుడే బుందేల్‌ఖండ్ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.ఇవి చదవండి: పర్యావరణ హిత జీవన సేద్యం -
మొగుడ్ని చంపి పేగుల్లాగేసింది: కిడ్నీ, లివర్ మాయం
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కురుక్షేత్రలోని పెహోవా రోడ్డులో రాజ్ ప్యాలెస్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళ భర్తను అత్యంత అమానుషంగా హత్య చేసింది. పొట్టలో కత్తితో దారుణంగా పొడవడంతో పేగులు బయటకొచ్చిన ఘటన కలకలం రేపింది. అంతేకాదు మృతుడి కాలేయం, కిడ్నీ అదృశ్యం కావడంపై మరింత ఆందోళన రేపింది. దీనిపై హర్యానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.యూపీలోని ధంపూర్ గ్రామానికి చెందిన రాజేష్, విమలా దేవి భార్యాభర్తలు. భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం నేపథ్యంలో భర్తను పొడిచిన తర్వాత, ఆ మహిళ అతని ప్రేగులను భవనం పైకప్పుపై ఉన్న ప్లాస్టిక్ సంచిలో కుక్కుతుండగా,ఇంటి యజమాని కంట్లోపడింది. ఇంటి యజమాని రింకు అక్కడికి చేరుకుని, రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించినప్పుడు, నిందితురాలు విమలా దేవి భవనం పైకప్పు పైనుంచి దూకేసింది. రాజేష్ పొట్టలో తీవ్రమైన గాయాలు అయ్యాయని, బయటకు వచ్చిన ప్రేగులను విమల ఒక ప్లాస్టిక్ సంచిలో పెడుతోందని రింకు పోలీసులకు తెలిపింది. మరోవైపు నిందితురాలు దేవి వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు పోలీసులు.భర్త కాలేయం, మూత్రపిండం అదృశ్యంపోస్ట్-మార్టం నివేదిక ప్రకారం, ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ గౌరవ్ కౌశిక్ వివరాల ప్రకారం భర్త రైట్ కిడ్నీ,కాలేయంలోకొంత భాగం కనిపించకుండా పోయాయి. అలాగే పొట్ట భాగంలో సుమారు 37 సెంటీమీటర్ల పొడవైన లోతైన గాటు, ప్రేగులు బయటకు వచ్చి పడి ఉన్నాయి. ఇదీ చదవండి: బిచ్చగత్తె కన్నుమూత : 30కి పైగా గోనె సంచుల్లో డబ్బువిమల, రాజేష్ దంపతులు సుమారు ఏడాది కాలంగా కురుక్షేత్రలో నివసిస్తుండగా, భర్త ఒక కంపెనీలో నీటి సరఫరా విభాగంలో పనిచేసేవాడు. వీరికి పిల్లలు లేరు. అయితే విమలాదేవి చేతబడి, దుష్టశక్తులను వదిలించే ప్రక్రియవంటి పనుల్లో నిమగ్నమై ఉండేదని, వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవని ఇంటి యజమాని తెలిపారు.ఇదీ చదవండి: 25 ఏళ్లకే కోట్లు సంపాదించా : ఫ్యూచర్లో ఏం చేయాలి?ఘటనా స్థలం నుండి పోలీసులు మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ హత్యకు గల కారణం ఇంకా తెలియరాలేదు. విచారణకు సహకరించేంతగా ఆమె ఆరోగ్యం కుదుటపడ్డాక ఆమెను విచారిస్తామని ఆదర్శ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సురేందర్ సంధు వెల్లడించారు. ఈ అవయవాలు అదృశ్యం కావడానికి, హత్యకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: రోజు రూ. 50లే, ఇపుడు ఫార్చ్యూనర్ కారు : స్వీపర్ సక్సెస్ స్టోరీ వైరల్ -
UP: విషదం.. పిల్లలపై కూలిన ఇంటి పైకప్పు.. బాలుడి మరణం
-
రాహుల్ గాంధీపై దేశానికి పెద్దగా ఆశలు లేవు.. యోగి ఆగ్రహం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మనుస్మృతిపై చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. బాధ్యత గల ప్రతిపక్ష నేత హోదాలో ఆయన అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు. ఈ క్రమంలో.. సంప్రదాయాలు, సంస్కృతిని అవమానించేలా రాహుల్ వ్యాఖ్యలు చేస్తున్నారని, యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని యోగి మండిపడ్డారు.రాయ్‌బరేలీలో స్వాతంత్య్ర సమరయోధుడు రాణా బేని మాధవ్ బక్ష్ సింగ్ జయంతి సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మాట్లాడారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మహిళలు మనుస్మృతి సంకెళ్ల నుంచి బయటకు రావాలని వ్యాఖ్యానించారని యోగి ప్రస్తావించారు.“రాహుల్ గాంధీపై దేశానికి పెద్దగా ఆశలు లేవు. కానీ భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఆయనకు ప్రజాస్వామ్యంపై బాధ్యత ఉంది. దేశ సంప్రదాయాలు, వారసత్వాన్ని విమర్శించడం మీ జన్మహక్కు అని భావిస్తున్నారా?” అని యోగి ప్రశ్నించారు. మనుస్మృతి గురించి మాట్లాడే ముందు రాహుల్ గాంధీ భారతీయ గ్రంథాలను అధ్యయనం చేయాలని యోగి సూచించారు. మనువు, భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే అథర్వవేదం, శతపథ బ్రాహ్మణం, మత్స్య పురాణం వంటి గ్రంథాలను చదవాలని అన్నారు.“If you want to understand Manusmriti, read Artha Veda, Shatapatha Brahmana, you will get all information.”- CM Yogi Adityanath to Rahul Gandhi on 'Manusmriti mindset' remark pic.twitter.com/xwDfphNMVf— News Arena India (@NewsArenaIndia) August 24, 2026భారతీయ సంప్రదాయాలు, వారసత్వంపై అవగాహన లేకుండానే విమర్శలు చేయడం సరికాదని యోగి పేర్కొన్నారు. దేశ సంస్కృతిని అవమానించే వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.విదేశాల్లో భారత్‌పై విమర్శలురాహుల్ గాంధీ గతంలోనూ అంతర్జాతీయ వేదికలపై భారత సాంస్కృతిక వారసత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని యోగి ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ బయటకు వెళ్లినప్పుడు రాష్ట్రాన్ని, విదేశాలకు వెళ్లినప్పుడు దేశాన్ని అవమానిస్తున్నారని విమర్శించారు. దేశం ఉగ్రవాదంపై పోరాడుతున్న సమయంలో సైన్యాన్ని ప్రశ్నించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సరిహద్దుల్లో సైనికులు శత్రువులతో పోరాడుతున్నప్పుడు వారి చర్యలకు ఆధారాలు అడగడం సరికాదన్నారు.కాంగ్రెస్‌పైనా ఫైర్అయోధ్య విరాళాల చోరీ అంశం రాజకీయంగా పెను దుమారం రేపింది. అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై యోగి విమర్శలు గుప్పించారు. అయోధ్యలో శ్రీరాముడి ఉనికిని ప్రశ్నించిన పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్యం, సంస్కృతి గురించి మాట్లాడుతోందని అన్నారు. 1975లో విధించిన ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌కు మాట్లాడే నైతిక హక్కు ఉందా? అని ప్రశ్నించారు.ఈ సందర్భంగా రాయ్‌బరేలీలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించిన రాణా బేని మాధవ్ బక్ష్ సింగ్ పేరుతో ఆడిటోరియంను యోగి ప్రారంభించారు. ఆయన పేరుతో పోస్టల్ స్టాంపును విడుదల చేసి, స్మారక సంచికను ఆవిష్కరించారు. రాయ్‌బరేలీ జిల్లాకు ఇది చారిత్రక రోజని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.రాహుల్ ఏమన్నారంటే..ఆగస్టు 22న మహారాష్ట్ర పుణెలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో మహిళల హక్కులు, స్వేచ్ఛపై మాట్లాడిన రాహుల్ గాంధీ.. మనుస్మృతిలో మహిళల స్థానం గురించి ప్రస్తావించారు. “మనుస్మృతి ప్రకారం చిన్నతనంలో మహిళ తండ్రి ఆధీనంలో, యవ్వనంలో భర్త ఆధీనంలో, భర్త మరణించిన తర్వాత కుమారుల ఆధీనంలో ఉండాలని చెబుతుంది. మహిళ ఎప్పుడూ స్వతంత్రంగా ఉండకూడదనే ఆలోచనను నేను వ్యతిరేకిస్తున్నాను. ఇలాంటి భావనలు సిగ్గుచేటు” అని అన్నారాయన. అలాగే బీజేపీ, ఆరెస్సెస్‌లు మహిళలను చెరసాల బందీలుగానే చూస్తుంటాయని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలనే ప్రస్తావిస్తూ.. యూపీ సీఎం యోగి ఇప్పుడు విమర్శలు గుప్పించారు. #WATCH | Pune, Maharashtra: Addressing the "Chhatron Ki Goonj" program, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "The Manusmriti says- "in childhood, a female belongs to her father. In youth, she belongs to her husband. When her lord is dead, she belongs to her sons. A… pic.twitter.com/JsqPlnFXsy— ANI (@ANI) August 22, 2026ఇదీ చదవండి: సెల్ఫీ కోసం వచ్చినట్లు చేసి, ముద్దు పెట్టి.. -
Ayodhya: శ్రావణ మాసంలో చేపల కూరా?
పవిత్రమైన శ్రావణ మాసంలో అందునా.. అయోధ్య నగరంలో చేపల వంటకాల భోజనాలు ఏర్పాటు చేయడంపై కొందరు సాధువులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాముడు కొలువై ఉన్నచోట ఇలాంటి పనులు చేయడం ఘోర పాపమేనని తిట్టిపోస్తున్నారు. అయితే కార్యక్రమ నిర్వాహకుడు మాత్రం వ్యక్తిగత ఆహార స్వేచ్ఛ, సంప్రదాయాల పేరుతో ఈ ఏర్పాటును సమర్థించారు.అయోధ్య రామ మందిర విరాళాల గోల్మాల్ వివాదం కొనసాగుతున్న వేళ.. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఆదివారం అయోధ్యలో పర్యటించారు. తొలుత ఆయన శ్రీరామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గఢీ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తరుణ్ ప్రాంతంలో కాంగ్రెస్ నేత రామ్ నిహాల్ నిషాద్ ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అజయ్ రాయ్‌తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ రాజ్‌పాల్ గౌతమ్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అఖిలేశ్ ప్రతాప్ సింగ్, పూర్వాంచల్ ఇన్చార్జ్ అభిషేక్ దత్ తదితరులు హాజరయ్యారు.అయితే ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అతిథుల కోసం రకరకాల వంటకాలు సిద్ధం చేయించారు. అందులో.. చేపల వంటకాలు స్పెషల్కాగా.. అదే వివాదానికి దారి తీసింది.వీడియోతో మొదలైన వివాదంకార్యక్రమ వేదిక వద్ద చేపలు వండుతున్న దృశ్యాలతో కూడిన వీడియోలు కొందరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. భారీ వర్షం పడుతున్న సమయంలోనే అక్కడ చేపలను తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అయోధ్యలో చేపల కూర వడ్డింపుపై కొందరు స్థానిక సాధువులు, హిందూ సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రావణ మాసంలో అయోధ్య వంటి పవిత్ర ప్రాంతంలో చేపల విందు ఏర్పాటు చేయడం మతపరమైన భావాలను దెబ్బతీస్తుందని వారు పేర్కొన్నారు.A Major Controversy at a Congress Event in AyodhyaA fish feast is allegedly being prepared in Ayodhya for the welcome of Uttar Pradesh Congress President Ajay Rai.Ajay Rai is scheduled to visit Arpit Lawn near the Hanuman Garhi temple, where fish is reportedly being prepared… pic.twitter.com/nY5K2SkTcy— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) August 23, 2026ఏం తినాలో మీరే చెప్తారా?అయితే కార్యక్రమ నిర్వాహకుడు రామ్ నిహాల్ నిషాద్ ఈ విమర్శలను తోసిపుచ్చారు. రాజ్యాంగం ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన ఆహారం తీసుకునే హక్కును కల్పించిందని అన్నారు. సమాజంలో చేపల వేట, చేపలు తినడం సంప్రదాయంలో భాగమని పేర్కొన్న ఆయన.. శ్రావణం, భాద్రపదం వంటి నెలల పేరుతో వ్యక్తుల ఆహార అలవాట్లను ప్రశ్నించకూడదని వ్యాఖ్యానించారు.రాజకీయ దుమారంతన అయోధ్య పర్యటనలో చెలరేగిన ఈ దుమారంపై అజయ్ రాయ్ స్పందించారు. దేశంలో అణచివేత, అన్యాయం కొనసాగుతోందని యూపీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రామాలయంలో సమర్పించిన కానుకల విషయంలోనూ ఆయన ఆరోపణలు చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని జైలుకు పంపాలని హనుమంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. అయితే అయోధ్యలో చేపల విందు వివాదం ప్రస్తుతం ఆహార స్వేచ్ఛ, మత విశ్వాసాలు, రాజకీయ విమర్శల చుట్టూ కొత్త చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: అతను సీఎం పదవికి అన్నివిధాల అర్హుడు! -
‘జనగణమన’ మధ్యలోనే వెళ్లిపోయిన స్పీకర్
ఉన్నావ్: ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్ సతీశ్ మహానా అనూహ్య చర్య వివాదానికి దారి తీసింది. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహానా జాతీయ గీతం ఆలాపన పూర్తి కాకుండానే వేదిక దిగి, అక్కడి నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఉన్నావ్‌లోని ఎస్వీఎం ఇంటర్ కాలేజీలో జరిగిన సెమినార్‌కు ఆయన హాజరయ్యారు. పోలీసులు స్పీకర్‌కు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జనగణమన గీతాలాపన మొదలైంది. కొన్ని క్షణాల పాటు అక్కడే అటెన్షన్లో నిల్చున్న స్పీకర్ వెంటనే వెనుదిరిగి, వేదిక నుంచి కిందికి చేరుకున్నారు. అక్కడే సిద్ధంగా ఉన్న తన కారులో వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వందేమాతరం పూర్తి ఆరు చరణాలకు బదులుగా గతంలో మాదిరిగానే రెండు చరణాలను మాత్రమే తాము ఆలపిస్తామంటూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీనిపై కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చీఫ్ సుప్రియా శ్రీనాథే బీజేపీ, ఆర్ఎస్ఎస్.. బ్రిటిష్ ఇన్ఫార్మర్లు అని విరుచుకుపడ్డారు. ‘గొప్ప బీజేపీ నేత, స్పీకర్ మహానా జాతీయ గీతం మధ్యలోనే ఎందుకు వెళ్లిపోయారు? కనీసం 52 సెకన్లు కూడా వేచి ఉండే సమయం ఆయనకు లేదా? జనగణమనను ఆయన అవమానించారు. మహానా క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
నలభై రెండేళ్లకు చిక్కాడు
న్యూఢిల్లీ: ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా నలభై రెండేళ్లు పోలీసుల కళ్లుకప్పాడు ఆ వ్యక్తి. ఎప్పుడో 1984లో ఢిల్లీలో హత్య చేసి పారిపోయిన నత్తూ అలియాస్ నథూలాల్ చివరకు 2026 ఆగస్టు 18న ఉత్తరప్రదేశ్‌లో పోలీసులకు చిక్కాడు. పోలీసులిచ్చిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయికి చెందిన నత్తూలాల్ ఢిల్లీలో ఉండేవాడు. 1984 మే 23వ తేదీ సీతాపూర్‌కు చెందిన మిత్రుడు బభూతి ప్రసాద్‌తో కలిసి ఢిల్లీలోని వికాస్పురి ప్రాంతంలో అశోక్ కుమార్ అనే వ్యక్తిని చంపాడు. అశోక్ కుమార్ ఒంటిపై బోలెడన్ని కత్తిపోట్లు కనిపించాయి. ఈ విషయమై జనక్‌పురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కూడా. కేసు విచారించిన పోలీసులు బభూతి ప్రసాద్‌ను అరెస్ట్ చేసి నేరం చేసేందుకు వాడిన కత్తిని కూడా స్వాదీనం చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి నత్తూ మాత్రం కనిపించకుండా పోయాడు. ఎలాగైనా ఈ పాత కేసును పరిష్కరించలని అనుకున్నారో ఏమో కానీ... నత్తూ అరెస్ట్ కోసం పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పాత కేసు రికార్డులను నెలలకొద్దీ పరిశీలించి... సీతాపూర్, హర్దోయి ప్రాంతాల్లో తనిఖీలు చేసి నత్తూ ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల హర్దోయిలోని పాలి ప్రాంతంలో వెరిఫికేషన్ జరుగుతూండగా నత్తూ బతికే ఉన్నట్లు, అప్పుడప్పుడూ సొంతూరుకు వచ్చిపోతున్నట్లు పోలీసులకు తెలిసింది. నత్తూ పోలికలతో ఉన్న వ్యక్తి గురించి ఆగస్టు 17న సమాచారం అందడంతో పోలీసులు నిఘా పెంచారు. ఆ మరుసటి రోజే నత్తూ తన ఊరి నుంచి ఫరూకాబాద్ వెళ్లేందుకు ప్రయతి్నస్తూండగా పట్టుబడ్డాడు. -
ఒక్కసారిగా మీ ఉద్యోగం పోయినా ఇతడిలా ఉండాలి..
అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. అయితే, టెకీకి తన తండ్రి అందించిన అచంచలమైన మద్దతు ధైర్యాన్ని ఇచ్చింది. యూకేలో జేపీ మోర్గాన్ ఉద్యోగం నుంచి తనను తొలగించిన తర్వాత కైష్ అన్సారీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ వీడియోను పంచుకున్నారు. అందులో తన తండ్రి తనకు ఓదార్పునిచ్చిన తీరు కనిపించింది.గతంలో టైలర్‌గా పనిచేసిన తన తండ్రి, తన ఉద్యోగం గురించి కాకుండా ప్రధానంగా తన మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన చెందారని చెప్పారు. తనను తాను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రోత్సహించారని కైష్ అన్సారీ తెలిపారు. “ఈ వీడియోను సానుభూతి కోసం షేర్ చేయడం లేదు. కష్టకాలంలో ఉన్న ఎవరికైనా మీరు ఒంటరిగా లేరని గుర్తు చేయడానికే పంచుకుంటున్నాను. ఏ పరిస్థితుల్లోనైనా మీ కుటుంబం మీకు అండగా ఉంటుంది” అని కైష్ అన్సారీ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోయిన విషయంపై కైష్ అన్సారీ మాట్లాడుతూ.. “ఉద్యోగం నుంచి తొలగించడం బాధాకరం. మీరు ఎంత అనుభవం ఉన్నవారైనా, ఎంత కష్టపడి పనిచేసినా.. ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోతే మీపై మీకు, మీ వృత్తిపై, మీ భవిష్యత్తుపై సందేహాలు మొదలవుతాయి” అని రాశారు. కైష్ అన్సారీ ఉత్తరప్రదేశ్‌లోని డియోరా జిల్లాలోని సలేమ్పూర్కు చెందినవారు. ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నారు.తండ్రి మాటలతో ధైర్యం తీవ్రమైన వృత్తిపరమైన ఆత్మన్యూనతకు గురైన సమయంలో తన తండ్రి చెప్పిన మాటలు తనకు ఎలా ధైర్యం ఇచ్చాయో ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ హృదయాన్ని హత్తుకునే సంభాషణను వివరిస్తూ.. కష్టకాలంలో కుటుంబం తనపై ఉంచే నమ్మకమే అత్యంత గొప్ప ప్రేరణ అని చెప్పారు.“అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులతో జరిగే ఒక్క సంభాషణ నిజంగా ముఖ్యమైన విషయం ఏమిటో గుర్తు చేస్తుంది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత నా నాన్నతో జరిగిన సంభాషణలోని చిన్న భాగం ఇది. నిజాయితీగా చెప్పాలంటే, ఆయన చెప్పిన మాటలు ఆయన ఊహించిన దానికంటే నాకు ఎంతో భాగా అర్థమయ్యాయి. నా నాన్న ఎప్పుడూ నాకు అత్యంత గొప్ప ప్రేరణనిచ్చే వ్యక్తుల్లో ఒకరు. ప్రతి విజయంలోనూ, ప్రతి కష్టకాలంలోనూ ఆయనకు నాపై ఉన్న నమ్మకం ఎప్పుడూ మారలేదు. నాపై నాకు సందేహం వచ్చినప్పుడు ముందుకు సాగాలని గుర్తు చేస్తారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరగనప్పుడు జీవితం అక్కడితో ముగిసిపోదని చెబుతారు” అని కైష్ అన్సారీ తెలిపారు.సంభాషణను ఎందుకు షేర్ చేశారు?భావోద్వేగానికి లోనైన అన్సారీ స్పందిస్తూ.. “అలాంటి మద్దతును కుటుంబం మాత్రమే ఇవ్వగలదు. ఇదే పరిస్థితిని మౌనంగా ఎదుర్కొంటున్న ఎంతోమంది ఉన్నారని నాకు తెలుసు కాబట్టే దీన్ని పంచుకుంటున్నాను. ఉద్యోగాలు కోల్పోవడం, తిరస్కరణలు, ఉద్యోగ ఇంటర్వ్యూలు విఫలంకావడం, అనిశ్చితి, ఆర్థిక ఒత్తిడి లేదా ‘ఇక నేను ఏం చేయాలి?’ అని ఆలోచించడం.. వంటి నాకు తెలుసు” అని తెలిపారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ తిరస్కరణలకు గురవుతున్న వారికి, ఆర్థిక ఆందోళనతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సందేశం ఓదార్పునిస్తుందని ఆయన ఆశించారు.“వారిలో మీరు ఒకరైతే, దయచేసి గుర్తుంచుకోండి.. ఉద్యోగం కోల్పోవడం మీ విలువకు ప్రతిబింబం కాదు. అది మీ వృత్తిలో జరిగిన ఒక సంఘటన మాత్రమే, మీ వృత్తికి ముగింపు కాదు. ఒక్క ఎదురుదెబ్బ కారణంగా ఇప్పటివరకు మీరు సాధించిన ప్రతిదాన్ని మర్చిపోకండి. నేర్చుకుంటూ ఉండండి. మెరుగుపడుతూ ఉండండి. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తూనే ఉండండి. నమ్మకాన్ని కోల్పోవద్దు. మనం ఇంకా కనుగొనని అవకాశాలు ముందున్నాయి. కొన్నిసార్లు జీవితం ఒక తలుపును మూసివేసి, అంతకంటే మెరుగైన దిశగా మనల్ని నడిపిస్తుంది” అని తెలిపారు.నాన్న విషయానికి వస్తే… తన తండ్రికి కృతజ్ఞతలు తెలుపుతూ అన్సారీ.. “మీ ప్రేమ, మీ మద్దతు, మీ దీవెనలు ఎప్పుడూ ముందుకు సాగేందుకు నాకు బలాన్ని ఇచ్చాయి. నేను ఉద్యోగాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ నా ఆత్మవిశ్వాసాన్ని, నా ఆశయాన్ని, పోరాడాలనే నా సంకల్పాన్ని కోల్పోలేదు. ఈ ఎదురుదెబ్బను ఎదుర్కొని, మరింత బలంగా తిరిగి వస్తాను. అంతకంటే మంచి ఉద్యోగ అవకాశంతో తిరిగి వస్తానని ఆశిస్తున్నాను” అని తెలిపారు.నా మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన తన తండ్రి తన ఉద్యోగం కోల్పోవడం గురించి ఎప్పుడూ ఆందోళన చెందలేదని, తాను ఎలా ఉన్నాననే విషయంపైనే ఎక్కువగా ఆందోళన చెందారని అన్సారీ చెప్పారు. “ఆయన ప్రధానంగా నా మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. ఎందుకంటే నా కుటుంబానికి పూర్తి బాధ్యత నాదే. నా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న ఏకైక వ్యక్తిని నేనే. ఆయన వృత్తిరీత్యా టైలర్. అందుకే నా కుటుంబం కోసం పని ప్రారంభించడానికి నాకు ఇంకా శక్తి ఉందని చెప్పారు. ప్రాథమికంగా, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయనను విశ్రాంతి తీసుకోమని నేను చెప్పాను. ప్రస్తుతం యూకేలో ఉద్యోగ మార్కెట్ కొంత కష్టంగా ఉంది. అయినప్పటికీ నాకు కొన్ని ఉద్యోగ ఇంటర్వ్యూలు వస్తున్నాయి. ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్నాను. త్వరలోనే నాకు మరింత మంచి ఉద్యోగం లభిస్తుంది” అని చెప్పారు. View this post on Instagram A post shared by Kaish Ansari (@theengineerguy_) -
రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో 178 మంది సేఫ్
లక్నో: ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 178 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఢిల్లీ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6E 2381 ల్యాండింగ్ సమయంలో విమానం వెనుక భాగం రన్‌వేను తాకింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఫైలట్ వెంటనే గో-అరౌండ్ చేసి విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లడంతో పెనుప్రమాదం తప్పింది. అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుంచి అనుమతి తీసుకుని కొద్దిసేపటి తర్వాత విమానాన్ని రెండో ప్రయత్నంలో సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన సాధారణ తనిఖీల్లో దాని వెనుక భాగంలోని ఆక్సిలరీ పవర్ యూనిట్ (APU) సమీపంలో గీతలు, రాపిడి గుర్తులు కనిపించాయి. దీంతో విమానాన్ని తాత్కాలికంగా సేవల నుంచి తొలగించారు.ప్రస్తుతం విమానంపై సాంకేతిక తనిఖీలు, మరమ్మతులు జరుగుతున్నాయని అవసరమైన సాంకేతిక అనుమతులు లభించిన తర్వాత మాత్రమే విమానాన్ని తిరిగి కార్యకలాపాల్లోకి తీసుకురానున్నట్లు ఇండిగో సిబ్బంది ప్రకటించారు. ఈ ప్రభావంతో గోరఖ్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ 6E-5013 సుమారు 5 గంటల 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. కాగా ఇటీవల ఇండిగో విమానంలో తరచుగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కోల్‌కతా–చెన్నై 6E-723 విమానంలో ల్యాండింగ్‌కు ముందు ఎడమ ఇంజిన్ పనిచేయకుండా పోయింది. చెన్నైలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించగా, 224 మంది ఉన్న విమానం ఒక ఇంజిన్‌తో సురక్షితంగా ల్యాండ్ అయింది.ఆగస్టు 13న భువనేశ్వర్–కోల్‌కతా ఇండిగో విమానంలో ప్రయాణికులు ఎక్కుతున్న సమయంలో పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించారు. భద్రతా కారణాలతో ఆ విమానాన్ని రద్దు చేశారు. ఇలాంటి ఘటనలు తరుచుగా జరగడం ప్రయాణికులకు ఆందోళన కలిగించే విషయం -
భార్య, సోదరి హత్యకు అదే కారణమా?.. లక్నో కేసులో షాకింగ్ ట్విస్ట్!
ఒకవైపు విడాకుల కేసు.. మరోవైపు రూ.1.5 కోట్ల భరణం డిమాండ్.. ఇంకోవైపు కుటుంబ కలహాలు.. ఇవన్నీ కలిసి ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయా?. లక్నోలో ఓ బ్యాంకర్ భార్యను నడిరోడ్డుపై కాల్చి చంపి, ఇంటికి వెళ్లి సొంత సోదరినీ హతమార్చి చివరకు తాను కూడా ప్రాణాలు తీసుకున్న ఘటన సంచలనంగా మారింది. మూడు ప్రాణాలను బలిగొన్న ఈ దారుణం వెనుక అసలు కారణమేంటి?. మూడు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న విషయాలు మరింత కలవరపెడుతున్నాయి.దివ్యా మిశ్రా, మానస్ బాజ్‌పాయ్ 2017లో వివాహం చేసుకున్నారు. మొదట వారి వైవాహిక జీవితం సాఫీగానే సాగినప్పటికీ, కొంతకాలానికి కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. గత ఏడాది నవంబర్ నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ ఏడాది జనవరిలో దివ్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది.ఆగస్టు 18న కోర్టులో ఏం జరిగింది?విడాకుల కేసు విచారణలో దివ్య రూ.1.5 కోట్ల భరణం కోరిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విచారణ అనంతరం మానస్ తీవ్ర ఆందోళనకు గురైనట్లు పోలీసులు విచారణలో తేలింది. అయితే రూ.1.5 కోట్ల డిమాండ్ ఒక్కటే హత్యకు కారణమని పోలీసులు ఇప్పటివరకు తేల్చలేదు. దంపతుల మధ్య ఉన్న గొడవలు, కుటుంబ సమస్యలు, ముఖ్యంగా మానస్ చెల్లెలు షీబాతో ఉన్న విభేదాలను కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు.ఒక్కరోజే మూడు కాల్పులుగురువారం మధ్యాహ్నం గోమతీనగర్‌లోని తన కార్యాలయం వెలుపల దివ్యపై మానస్ కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. అనంతరం అతడు తన ఇంటికి వెళ్లాడు. అక్కడ తన 28 ఏళ్ల చెల్లెలు షీబాను కాల్చి చంపిన అనంతరం, తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత మానస్ గదికి తాళం వేసుకుని టీవీ శబ్దాన్ని గట్టిగా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల శబ్దం బయటకు వినిపించకుండా చేసేందుకే ఇలా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.వాట్సాప్ స్టేటస్‌లో సంచలన ఆరోపణలుదివ్యను హత్య చేసిన తర్వాత మానస్ పెట్టినట్లు చెబుతున్న వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. దివ్య తనను మోసం చేసిందని ఆరోపిస్తూ, తాను భార్యను చంపినట్లు అందులో పేర్కొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు, తాను, తన చెల్లెలు చనిపోతామని కూడా ఆ సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం. దివ్య సోదరి, యూట్యూబర్ ప్రగ్యా మిశ్రా, ఆమె భర్త భరత్ పేర్లు కూడా ఆ సందేశంలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రగ్యా, భరత్‌కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని దివ్య బంధువు మయాంక్ దీక్షిత్ స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: నీ తల్లి కోసమైనా బతకాలి కదరా.. ఇది ముందే పన్నిన పథకమా?ఇప్పుడు పోలీసుల ముందు ఉన్న మరో కీలక ప్రశ్న ఇదే. మానస్ దివ్యను హత్య చేసేందుకు ముందుగానే ప్రణాళిక రూపొందించాడా?. మూడు తుపాకుల స్వాధీనం, సీసీటీవీ దృశ్యాలు, దివ్య కదలికలపై అతడు రెండు రోజుల పాటు నిఘా పెట్టినట్లు వచ్చిన సమాచారం.. వీటిని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బ్యాంకు ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది, పొరుగువారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఫోన్, వాట్సాప్, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా విశ్లేషిస్తున్నారు. రూ.1.5 కోట్ల భరణం వివాదమే హత్యలకు కారణమా? కుటుంబ కలహాలే అసలు కారణమా? లేక మానస్ చివరి సందేశంలో పేర్కొన్న ఆరోపణల వెనుక మరేదైనా కథ ఉందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడమే పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. -
తాను చేసిన స్వీటును తానే తిననని చెప్పిన దుకాణదారుడు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలోని మౌదహా పట్టణంలో పండుగల నేపథ్యంలో ఎస్డీఎం, ఆహార శాఖ అధికారులు కల్తీ స్వీట్లకు వ్యతిరేకంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా మా వైష్ణో జై భవానీ స్వీట్ హౌస్ నిర్వాహకుడు బాబాకు ఆయన దుకాణంలో ఉన్న వెండి పూత వేసిన స్వీట్‌ను తినాలని అధికారులు చెప్పారు. అయితే దానిని తినేందుకు ఆయన స్పష్టంగా నిరాకరించారు. దుకాణదారు తినేందుకు నిరాకరించడంతో ఎస్డీఎం కరణ్వీర్ సింగ్ స్వీట్ల నమూనాలు సేకరించి, ఆ స్వీట్లను పారేయించారు. ఈ చర్యకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతోంది. అధికారులు పదేపదే చెప్పినప్పటికీ ఆయన ఆ స్వీట్ తినేందుకు నిరాకరించారు. ఈ ఘటన తర్వాత ఆహార పదార్థాల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తాయి.అపరిశుభ్రత, నిషేధిత వెండి పూత వాడకంఆహార శాఖ సహాయ కమిషనర్ గోరీ శంకర్, ఆహార భద్రత అధికారి మృత్యుంజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం పలు దుకాణాల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపింది. తనిఖీల్లో 2 దుకాణాల్లో అపరిశుభ్రత కనిపించింది. స్వీట్లలో నిషేధిత వెండి పూతను ఉపయోగించిన విషయం కూడా బయటపడింది. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్డీఎం కరణ్వీర్ సింగ్ తెలిపారు.ఇదీ చదవండి: ఎల్ నినో: మనకు ముప్పు తట్టుకోలేని విధంగా ఏ స్థాయిలో అంటే?మార్కెట్లో కలకలం.. పోలీసు బలగాల మోహరింపుసంయుక్త తనిఖీల విషయం తెలియగానే మౌదహా పట్టణంలోని ఇతర స్వీట్ విక్రేతల్లో కలకలం రేగింది. ఈ చర్యల సమయంలో ప్రాంతీయ అధికారి రాజ్‌కుమార్ పాండే, కోత్వాలీ ఇన్చార్జ్ సంతోష్ కుమార్ పోలీసు బలగాలతో అక్కడే ఉన్నారు. పండుగల సమయంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేవారిపై చేపడుతున్న ఈ కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. View this post on Instagram A post shared by Briefly Scroll (@brieflyscroll) -
‘కుళ్లిన టమాటా కారణంగా కూడా కొట్టేవాడు’
ఢిల్లీ: లక్నోలోని ఐసీఐసీఐ బ్యాంక్ వెలుపల తన భర్త చేతిలో దివ్య మిశ్రా హత్యకు గురైన సంగతి తెలిసిందే. సంచలన రేపిన ఈ ఘటనలో దివ్య మిశ్రా సోదరి ప్రజ్ఞా మిశ్రా.. నిందితుడు మానస్ వాజ్‌పేయ్ గురించి దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించారు. హిందీ యూట్యూబర్ అయిన ప్రజ్ఞా మిశ్రా మాట్లాడుతూ, మానస్ తన సోదరి దివ్య పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేవాడని.. అందుకే ఆమె అతని నుండి విడాకులు కోరుకుందని తెలిపారు.ఒకసారి బ్లింకిట్ (Blinkit) ద్వారా తెప్పించిన టమోటా కుళ్లిపోయిందనే కోపంతో మానస్ తన సోదరిని దారుణంగా కొట్టాడని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రజ్ఞా మిశ్రా తెలిపారు. మానస్‌ను "సైకో"గా అభివర్ణించిన ప్రజ్ఞా మిశ్రా.. ఆ వ్యక్తి, అతని సోదరి కలిసి తల్లిని దారుణంగా కొట్టేవారని.. చివరకు అనారోగ్యంతో అతని సొంత తల్లి కూడా మరణించింది. దివ్య అతని నుంచి బయటపడాలని మాత్రమే కోరుకుంది. ఫ్యామిలీ కోర్టులోని కౌన్సిలర్‌తో కూడా మనస్ గొడవపడ్డాడని ఆమె ఒకసారి తనకు చెప్పిందని ప్రజ్ఞా తెలిపారు. తమ పెళ్లి జరిగిన రాత్రే ఇంటి ఖర్చులను ఏయే విధంగా దివ్య భరించాలో మానస్ ఒక జాబితా తయారు చేశాడని, దానికి దివ్య అంగీకరించిందని ప్రజ్ఞా తెలిపారు.దివ్య, మానస్‌లకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే గత ఏడాది కాలంగా వారు విడివిడిగా ఉంటున్నారు. గత ఏడాది దివ్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దివ్య తనను మోసం చేస్తోందంటూ మానస్ ఆరోపించేవాడు. గత ఏడాది నుంచి దివ్య తన వాటా ఖర్చులను చెల్లించడం ఆపేసింది. ఆ సైకో హంతకుడి దృష్టిలో అది కూడా మోసం చేసినట్టేనా? ఇంతటి బాధను అనుభవించినప్పటికీ, దివ్య ‘తీజ్’ పండుగ సందర్భంగా ఉపవాసం ఉండాలనుకుంది. ఆమె చేతిపై మానస్ పేరును టాటూగా కూడా వేయించుకుంది. మనసులో అతను మారాలని బలమైన కోరిక ఉండేది” అని ప్రజ్ఞా తెలిపారు.గురువారం.. మానస్ తన భార్య పనిచేసే ప్రదేశానికి వెళ్లి, ఆమెను ఐసీఐసీఐ బ్యాంక్ బయటకు పిలిచాడు. ఆమెతో కొన్ని నిమిషాలు మాట్లాడిన అనంతరం కాల్చి చంపాడు. దివ్యను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత నిందితుడు ఇంటికి తిరిగి వెళ్లి తన సోదరి శివా వాజ్‌పేయి (28)ని కూడా చంపాడు. ఆమె మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. కొన్ని నిమిషాల తర్వాత మానస్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మానస్ తన భార్య, సోదరిని తానే చంపినట్లు వాట్సాప్ స్టేటస్ పెట్టిన సంగతి తెలిసిందే. -
భార్య, సోదరిని కాల్చి చంపిన ఎస్బీఐ ఉద్యోగి : వాట్సాప్ స్టేటస్
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో గోమతీ నగర్ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 12:15 గంటల ప్రాంతంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఒక బ్యాంకు ఉద్యోగి తన భార్యను, చెల్లిని కాల్చి చంపి, ఆపై తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దిగ్భ్రాంతి రేపింది. ఈ జంటల హత్య వెనుక అసలు రహస్యాన్ని అతను వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టాడు.మృతుడు మానస్ వాజ్‌పేయ్ (38)ఎస్బీఐలో పనిచేసేవాడు. గోమతీ నగర్‌లోని ICICI బ్యాంక్ బ్రాంచ్‌లో భార్య దివ్య మిశ్రా (37) రిలేషన్షిప్ మేనేజర్‌గా పనిచేస్తోంది.ఆటోరిక్షాలో వేచి ఉన్న భర్త పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీతో కాల్పులు జరిపి అక్కడినుంచి పరాయ్యాడు. ఆతరువాత గోమతి నగర్లో ఇంటికెళ్లి దివ్యాంగురాలైన తన సోదరి శివా వాజ్పేయ్నుని కాల్చి చంపాడు. ఈ క్రమంలో వాట్సాప్‌లో ఒక మెసేజ్ పెట్టిన అనంతరం ఆ తర్వాత అదే తుపాకీతో తాను కూడా కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’ఈ ఘాతుకానికి పాల్పడే ముందు ‘‘నా భార్య నన్ను మోసింది, అందుకే చంపేసా. ఇపుడు నా సోదరి, నేను కూడా చనిపోవాలి. ఈ విషయాలన్నీ ఆమె సోదరి ప్రజ్ఞ , భరత్‌కు అంతా తెలుసు’’ అంటూ స్టేటస్ పెట్టారు. అయితే తాను పోయిన తరువాత దివ్యాంగురాలైన తన28 ఏళ్ల సోదరిని చూసుకునే వారు ఎవరూ ఉండరనే కారణంతో అతను ఆమెను చంపినట్లు భావిస్తున్నారు. దివ్య మిశ్రా సోదరి,జర్నలిస్ట్ ప్రజ్ఞా మిశ్రా యూపీ పోలీసుల అధికారిక హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: ఇన్‌స్టామార్ట్‌లో బొద్దింక : ఎఫ్‌డీఏ తుకారాంకు హీరోయిన్ విజ్ఞప్తికాగా మానస్ వాజ్‌పేయ్, దివ్య మిశ్రాలకు పెళ్లై 12 సంవత్సరాలు అయింది. వారికి పిల్లలు లేరు.భార్య ఏడాది క్రితం విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం -
జస్టిస్ రవికుమార్‌కు షాక్.. ఆ 100 కేసులు బదిలీ!
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవి కుమార్ దివాకర్ తీర్పులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత నాలుగు నెలల్లో ఆయన 10 హత్య కేసుల్లో ఏకంగా 22 మందికి మరణశిక్ష విధించారు. ఈ నేపథ్యంలో ఆయన వద్ద విచారణలో ఉన్న మరణశిక్ష, జీవిత ఖైదు పడే అవకాశం ఉన్న సుమారు 100 హత్య కేసులను మరో కోర్టుకు బదిలీ చేశారు. అందుకు కారణం ఏంటో కూడా చెబుతున్నారు.ముజఫర్‌నగర్‌లోని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవి కుమార్ దివాకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న సుమారు 100 హత్య కేసులను జిల్లా, సెషన్స్ జడ్జి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు బదిలీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. మరణశిక్ష లేదంటే జీవిత ఖైదు పడే అవకాశం ఉన్న కేసులే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ త్యాగి ప్రకారం.. ఈ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న నిందితులకు గరిష్ఠ శిక్ష పడే అవకాశం ఉందన్న ఆందోళన న్యాయవాదులు, కక్షిదారుల్లో నెలకొంది.ఎవరీ రవి కుమార్ దివాకర్?46 ఏళ్ల రవి కుమార్ దివాకర్ 2009లో అజంగఢ్‌లో అదనపు సివిల్ జడ్జిగా తన న్యాయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2015లో సుల్తాన్‌పూర్‌లో సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. అనంతరం న్యాయ మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. బీకామ్, ఎల్ఎల్ఎం పట్టాలు పొందిన ఆయన 2025 నవంబర్ నుంచి ముజఫర్‌నగర్‌లో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు. 2022లో వారణాసిలోని జ్ఞాన్వాపి సముదాయంలో వీడియో సర్వే నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.నాలుగు నెలల్లో 22 మరణశిక్షలు..రవి కుమార్ దివాకర్ ఇటీవల వరుసగా సంచలన తీర్పులు వెలువరించారు. ఆగస్టు 13న 12 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నలుగురికి మరణశిక్ష విధించారు. షామ్లీ జిల్లాలో పాత కక్షల నేపథ్యంలో 2014లో పవన్ కుమార్ ఇంటిపై దాడి చేసి కాల్పులు జరిపిన కేసులో రామ్‌వీర్, రాజీవ్, రాహుల్, హరేంద్ర కుమార్‌లను దోషులుగా తేల్చారు.అంతకుముందు ఆగస్టు 12న 1999లో రూ.5 లక్షల విమోచన కోసం కలప వ్యాపారి సలీంను కిడ్నాప్ చేసి హత్య చేసిన షహనవాజ్‌కు ఉరిశిక్ష విధించారు. దాదాపు 27 ఏళ్ల నాటి కేసులో ఈ తీర్పు వెలువడింది. జూలై 17న 2011లో దోపిడీకి ప్రయత్నిస్తూ రైతు రాజ్సింగ్ను హత్య చేసిన కేసులో నలుగురికి మరణశిక్ష పడింది. జూలై 6న పంచాయతీ ఎన్నికల కక్షల నేపథ్యంలో 2010లో రాజ్బీర్ సింగ్‌ను హత్య చేసిన కేసులో మాజీ గ్రామ సర్పంచ్, అతని సహచరుడికి ఉరిశిక్ష విధించారు. ఈ కేసు ‘అత్యంత అరుదైన వాటిలో అరుదైనది’ అని కోర్టు అభిప్రాయపడింది.విధుల్లో ఉన్న హోంగార్డును హత్య చేసిన కేసులోనూ..2020లో విధుల్లో ఉన్న హోంగార్డు రతిరామ్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన దీపక్‌కు జూలై 2న మరణశిక్ష విధించారు. తన తల్లిపై దాడి చేసిన నిందితుడిని అడ్డుకునేందుకు రతిరామ్ ప్రయత్నించడంతో ఈ హత్య జరిగినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది. జూన్ 20న రాజేంద్ర సైనీ హత్య కేసులో గజేంద్ర, రామ్కిరణ్లకు ఉరిశిక్ష విధించారు. మే 30న 15 ఏళ్ల నాటి డబుల్ మర్డర్ కేసులో 50 ఏళ్ల రహీస్‌కు మరణశిక్ష పడింది. అతడు రాజేశ్ దేవి, ఆమె ఆరేళ్ల కుమారుడు హిమాంశును ఇటుకలతో కొట్టి చంపినట్లు కోర్టు నిర్ధారించింది.ఏప్రిల్ 28న 2019 నాటి హత్య కేసులో ఓ మహిళతో పాటు ఆమె ముగ్గురు కుమారులకు మరణశిక్ష విధించారు. ఏప్రిల్ 6న రూ.45 లక్షల ఆర్థిక వివాదం నేపథ్యంలో న్యాయవాది మహ్మద్ సమీర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో ముగ్గురికి ఉరిశిక్ష విధించారు.ఎందుకింత చర్చ?ఒకే న్యాయమూర్తి నాలుగు నెలల వ్యవధిలో 10 కేసుల్లో 22 మందికి మరణశిక్ష విధించడం న్యాయ వర్గాల్లోనే కాదు.. ఇటు దేశవ్యాప్తంగానూ చర్చకు దారితీసింది. ముఖ్యంగా మరణశిక్ష అనేది ‘అత్యంత అరుదైన వాటిలో అరుదైన’ కేసుల్లోనే విధించాల్సిన గరిష్ఠ శిక్ష కావడంతో.. ఈ తీర్పులపై ఆసక్తి నెలకొంది. అయితే మరణశిక్ష విధించినంత మాత్రాన వెంటనే ఉరి అమలు జరగదు. భారత న్యాయవ్యవస్థలో ఇటువంటి తీర్పులకు తదుపరి న్యాయపరమైన దశలు ఉంటాయి. అప్పీళ్లు, ఉన్నత న్యాయస్థానాల పరిశీలన వంటి ప్రక్రియలు పూర్తయిన తర్వాతే తుది పరిణామం ఉంటుంది. ఈ నేపథ్యంలో దివాకర్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న సుమారు 100 కేసుల బదిలీ ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. -
విషపూరితమైన పాము కాటు : 150 చెంపదెబ్బలు కొట్టి కాపాడుకున్న అన్న
సోదరుడిని కాపాడుకోవాలనే తపనతో ఒక వ్యక్తి అతడిని ఏకంగా 150 సార్లు చెంపదెబ్బలు కొట్టాడు. వైద్యుల సలహా మేరకు అలా చేశాడు. అదేంటి అనుకుంటున్నారా? అయితే నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే.ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్కి చెందిన 21 ఏళ్ల అరుణ్‌ని అత్యంత విషపూరితమైన పాము కాటు వేసింది. నీళ్లు తెచ్చుకోవడానికి పొలానికి వెళ్లినపుడు గడ్డి బస్తాను పైకి లేపుతుండగా, అందులో దాగి ఉన్న పాము అతన్ని కాటు వేసింది.దీంతో అతడు గట్టిగా కేకలు వేశాడు. క్రమంగా అతని పరిస్థితి విషమంగా మారిపోతోంది. అరుణ్ అరుపులు విన్న అతని అన్నయ్య ఆకాష్ వెంటనే అక్కడికి చేరుకుని, అతన్ని రోడ్డు వైపు తీసుకువెళ్లాడు. అరుణ్ పరిస్థితి మరింత క్షీణించడంతో అంబులెన్స్ ,పోలీసులకు సమాచారం అందించారు.మరోవైపు అరుణ్ పరిస్థితి తీవ్రతను గమనించిన ఒక మెడికల్ స్టోర్ యజమాని, ఆ సోదరులిద్దరినీ తన మోటార్‌సైకిల్‌పై మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాడు. మెడికల్ కాలేజీలోని ఎమర్జెన్సీ విభాగంలో, ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ (EMO) డాక్టర్ షేర్ సింగ్, ఆయన బృందం వెంటనే చికిత్స ప్రారంభించారు.రెండు గంటల వ్యవధిలో 15 డోసుల యాంటీ-వెనం (విష విరుగుడు మందు) ఇచ్చారు, ఆ తర్వాత అతని ఆరోగ్యం మెరుగుపడింది. ఆ సమయంలో అతణ్ణి నిద్రపోనివ్వకుండా చూడాలని, మెలకువగా ఉంచాలను వైద్యులు సూచించారు. దీంతో ఆకాష్ తన సోదరుడి పరిస్థితిని నిరంతరం గమనిస్తూనే, అతనిపై నీళ్లు చల్లుతూ, అరుణ్‌ని 150 సార్లకు పైగా చెంపదెబ్బలు కొడుతూ అతణ్ణి మెలకువతో ఉండేలా కాపాలా కాశాడు. ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి ఘాతుకం : దిండుతో అదిమి భర్త, కొడుకు హత్యపాము కాటు కేసుల్లో సాధారణంగా ఐదు డోసుల యాంటీ-వెనం ఇస్తామని డాక్టర్ షేర్ సింగ్ తెలిపారు. అయితే, అరుణ్‌పై విష ప్రభావం తీవ్రంగా ఉండటంతో, రెండు గంటల వ్యవధిలో మొత్తం 15 డోసుల యాంటీ-వెనం ఇవ్వాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అరుణ్ ప్రాణాలను కాపాడటంలో సహాయపడినందుకు కుటుంబ సభ్యులు వైద్యులకు , మెడికల్ స్టోర్ యజమానికి కృతజ్ఞతలు తెలిపారు.ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!నోట్ : పాము కాటుకు గురైనప్పుడు వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. సాధ్యమైనంత త్వరగా యాంటి వెనమ్ ఇంజెక్షన్స్ తీసుకుంటే ప్రాణాపాయం తప్పుతుంది. ఆందోళన,భయం అస్సలు మంచిది కాదు. ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం -
అయోధ్య విరాళాల కేసు.. చంపత్ రాయ్‌కు ఊరట
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్చిట్ ఇచ్చింది. చంపత్తో పాటు ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు కూడా కేసులో ఎలాంటి పాత్ర లేదని సిట్ తేల్చింది. రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణలో అవకతవకలు, నగదు చోరీ జరిగాయన్న ఆరోపణలు తెరపైకి రావడంతో చంపత్ రాయ్, అనిల్ మిశ్రా ఇద్దరూ జూన్ 27న తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం విరాళాల సేకరణ, లెక్కింపు, భద్రత, నిర్వహణకు సంబంధించిన అంశాలపై SIT అధికారులు వారిని ప్రశ్నించారు. విచారణ సందర్భంగా చంపత్ రాయ్ తనకు విరాళాల చోరీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి తానే పోలీసులకు ఫిర్యాదు చేశానని దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసిన SIT తన తుది నివేదికను సోమవారం ఉత్తర్‌ప్రదేశ్ హోం శాఖకు సమర్పించింది. అనంతరం దానిని తదుపరి చర్యల కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేశారు.‘అక్రమాలు తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నా’విరాళాల సేకరణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడటం తన బాధ్యతేనని చంపత్ రాయ్ SITకు వివరించినట్లు సమాచారం. అక్రమాలు జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సందర్భంగా ఆయన వాంగ్మూలంతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించిన SIT.. విరాళాల చోరీలో రాయ్, అనిల్ మిశ్రా పాత్ర ఉన్నట్లు ఆధారాలు లేవని నిర్ధారించినట్లు సమాచారం.జూన్ 13న SIT ఏర్పాటురామ మందిర విరాళాల చోరీ ఆరోపణలపై ట్రస్ట్ అభ్యర్థన మేరకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న ముగ్గురు సభ్యులతో SITను ఏర్పాటు చేసింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ ఈ బృందానికి నేతృత్వం వహించారు. రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేలోపే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.SIT జూన్ 23న ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. విరాళాల నిర్వహణ వ్యవస్థలో పలు లోపాలను గుర్తించిన బృందం.. వాటిని సరిదిద్దేందుకు కఠినమైన సిఫార్సులు చేసింది.ఎనిమిది మందిపై FIRSIT ప్రాథమిక నివేదిక ఆధారంగా ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ శ్రీరామ జన్మభూమి పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో జూన్ 25న పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ సహా పలువురి పేర్లను చేర్చారు. మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులను కూడా నిందితులుగా పేర్కొన్నారు.ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(a) కింద కేసులు నమోదు చేశారు. SIT సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగానే తదుపరి FIRలు, అరెస్టులకు సంబంధించిన చర్యలు కొనసాగాయి.తాజాగా SIT తుది నివేదికలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రాకు క్లీన్చిట్ ఇవ్వడంతో ఈ కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇక దర్యాప్తు నివేదిక ఆధారంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తదుపరి చర్యలు తీసుకోనుంది. -
భార్య మర్మాంగాలకు విద్యుత్ షాక్ ఇచ్చి అతి దారుణంగా..
రాంపూర్: భార్యకు మర్మాంగాలతో పాటు శరీరంలోని పలు భాగాలకు విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేశాడు భర్త. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదమే ఆ మహిళ దారుణ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు.నస్రీన్ పోస్టుమార్టం నివేదికలో ఆమె శరీరంపై పలు కాలిన గాయాలు ఉన్నట్లు తేలింది. మర్మాంగాలపై కూడా కాలిన గాయాలు ఉండగా, అవి విద్యుత్ షాక్ వల్ల ఏర్పడినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుడు ఇస్రార్ నేరాన్ని అంగీకరించాడు. తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో కొంత భాగాన్ని విక్రయించేందుకు భార్య నిరాకరించడంతో ఆమెపై కోపం పెంచుకున్నానని దర్యాప్తు అధికారులకు చెప్పాడు.నస్రీన్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ భూమిని విక్రయిస్తే తమ ఐదుగురు పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆమె భయపడింది. నస్రీన్, ఇస్రార్లకు దాదాపు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.భూమి వివాదం కారణంగా నస్రీన్‌కు పదేపదే బెదిరింపులు, హింస ఎదురయ్యాయని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన డిమాండ్లకు అంగీకరించకపోతే ఎప్పటికైనా చంపేస్తానని ఇస్రార్ ఆమెను బెదిరించేవాడని వారు తెలిపారు.నస్రీన్ సోదరి హసీన్ జహాన్ మాట్లాడుతూ.. నస్రీన్ ఇటీవల గాయపడినప్పటికీ, ఆ విషయాన్ని బయటకు చెప్పలేదని తెలిపారు. "ఆమె ఇంటికి పూర్తిగా క్షేమంగా వచ్చింది. కానీ ఆమె ముఖంపై గాయాలు ఉన్నాయి" అని జహాన్ తెలిపారు. తనకు ఏం జరిగిందో నస్రీన్ చెప్పలేదని ఆమె తెలిపారు.రాంపూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ అనురాగ్ సింగ్ మాట్లాడుతూ.. బాధితురాలి మేనమామ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నస్రీన్ హత్యలో ఆమె అత్తింటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని ఫిర్యాదులో ఆరోపించినట్లు చెప్పారు.విద్యుత్ షాక్‌ల కారణంగా గాయాలు ఏర్పడినట్లు పోస్టుమార్టం నివేదిక నిర్ధారించిందని అధికారి తెలిపారు. "పోస్టుమార్టం నివేదికలో 6 చోట్ల గాయాలు ఉన్నట్లు తేలింది. అందులో విద్యుత్ షాక్ కారణంగా ఏర్పడిన పలు కాలిన గాయాలు ఉన్నాయి. ఆమె మర్మాంగాలపై కూడా విద్యుత్ షాక్ గాయాలు కనిపించాయి" అని సింగ్ తెలిపారు. -
చైనా మాంజాతో యువకుడి విషాదం.. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఘటన!
ఉత్తరప్రదేశ్: స్వాతంత్య్ర దినోత్సవం రోజున చైనా మాంజాతో ఓ ప్రయాణికుడు ప్రాణాలను కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో చోటుచేసుకుంది. కౌశాంబి పోలీసుల వివరాల ప్రకారం.. నోయిడాలోని అక్బర్పూర్ బెహ్రాంపూర్కు చెందిన రవి రాజ్ తన స్నేహితుడు నరేశ్‌తో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళ్తున్నాడు.అయితే, కౌశాంబి పోలీస్‌స్టేషన్ ఎన్‌హెచ్-9పై యూపీ గేట్ సమీపంలో వంతెనపై వారు చేరుకోగానే.. గాలిలో వేలాడుతున్న మాంజా అకస్మాత్తుగా అతని మెడకు చుట్టుకుంది. మాంజా పదునుగా ఉండటంతో రవి మెడకు తీవ్ర గాయమై, మెడ ఎముక వరకు తెగింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయాడు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న రవిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన చోటు తీవ్ర గందరగోళం పరిస్థితి ఏర్పడింది. గాయపడిన రవిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా ఇందిరాపురం ఏసీపీ సూర్యబలి మౌర్య తెలిపారు.అయితే, ఈ ప్రమాద ఘటన సుమారు 2 గంటల సమయంలో ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో జరిగినట్లుగా, ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మాంజాతో మెడకు తీవ్ర గాయం కావడంతో రవి రక్తమోడుతూ కనిపించగా, అతడి స్నేహితుడు గాయంపై వస్త్రాన్ని ఉంచి రక్తస్రావాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రవి ఆన్లైన్ డెలివరీ పని చేసేవాడని, అతడి స్వస్థలం బిహార్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో చైనా మాంజా వాడటం నిషేధం ఉన్నప్పటికీ ఈ వినియోగం ఎలా జరుగుతోందనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.ఏసీపీ మాట్లాడుతూ.. పదునైన ఈ మాంజా ద్విచక్ర వాహనదారులు, పాదచారులతో పాటు పక్షులకు కూడా ప్రమాదకరంగా మారుతోందని తెలిపారు. నిషేధిత మాంజాను విక్రయించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ విక్రయాలను అడ్డుకునేలా పర్యవేక్షణ పెంచుతామని వారు తెలిపారు. -
దారుణం : హనీమూన్‌లో పీరియడ్స్ వచ్చాయని..!
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన ఒక మహిళ చేసిన ఫిర్యాదుపై నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది. వివాహమైన నెల రోజులకే హనీమూన్ సమయంలోనెలసరి వచ్చిందన్న ఆగ్రహంతో తన భర్త తనపై దాడిచేయడంతోపాటు గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించాడంటూ ఆరోపించిన కేసు కలకలం రేపుతోంది.యూపీలోని రామ్ఘర్తాల్ ప్రాంతానికి చెందిన సదరు మహిళ తన ఫిర్యాదులో, ఢిల్లీకి చెందిన తన భర్త నిఖిల్ మిశ్రాపై కేసు నమోదు చేసింది.ఈ ఫిర్యాదు ప్రకారం 2023 మే 30న ఢిల్లీకి చెందిన నిఖిల్ మిశ్రాతో ఈమెకు వివాహమైంది. ఆ తర్వాత జూలై 4న హనీమూన్ కోసం అండమాన్ వెళ్లారు. అక్కడికి వెళ్లాక తీవ్రమైన కడుపునొప్పి, పీరియడ్స్ వచ్చాయి. అధిక రక్తస్రావం జరిగింది. దీంతో రుతుక్రమం గురించి తనకు ముందుగానే ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తూ భర్త తనపై దాడి చేశాడని ఆమె ఆరోపించింది. అలాగే గొంతు నులమడానికి ప్రయత్నించాడని కూడా చెప్పింది. ఆమెకు రుతుక్రమం (పీరియడ్స్) రావడంతో ఆగ్రహానికి గురైన భర్త ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొంది. చివరికి హోటల్ సిబ్బంది ఆమె కేకలు విని రక్షించినట్లు బాధితురాలు తెలిపింది.కట్నం కోసం వేధింపులు పెళ్లిలో కట్నంకోసం వేధించారని కూడా ఫిర్యాదు చేసింది. రూ. 20 లక్షల నగదు, ఒక కారు, రూ. 40 లక్షల విలువైన వస్తువులు కట్నంగా ఇచ్చినప్పటికీ, బ్రాండెడ్ వస్తువులు తీసుకురాలేదని అత్త, ఆడపడుచు మానసికంగా వేధించారని తెలిపింది. అంతేకాదు పెళ్లయిన 45 రోజులకే (జూలై 14, 2023) ఆమెను అత్తవారింటి నుంచి వెళ్లగొట్టారు. సమస్యను పరిష్కరించడానికి వచ్చిన ఆమె తండ్రిని కూడా అవమానించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి పలుమార్లు ప్రయత్నించినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది. ఇప్పటికీ కట్నంగా ఇచ్చిన వస్తువులను తిరిగి ఇవ్వలేదని, తన భర్త ఇంకా తనకు బెదిరింపు సందేశాలు పంపుతూనే ఉన్నాడని కూడా ఆమె ఆరోపించింది.ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనంమొత్తానికి గోరఖ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ కౌస్తుభ్ జోక్యంతో ఎట్టకేలకు ఆగస్టు 15న భర్త, అత్త మరియు ఆడపడుచుపై FIR నమోదు చేశారు. మిశ్రా, అతని తల్లి సంజు మిశ్రా సోదరి నేహా పాండేలపై సదరు మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఆగస్టు 15న ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు రామ్ఘర్తాల్ ఎస్హెచ్ఓ శ్యామ నంద్ రాయ్ తెలిపారు. విచారణలో సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఎగ్జామ్ స్కాంలపై మోదీ సర్కార్‌కు బాబా రామ్‌దేవ్ హెచ్చరిక -
లక్నో వీధుల్లో ‘జెన్ ఆల్ఫా’ ఆగ్రహం.. నిరసనలకు కారణాలివే!
లక్నో: పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల సమస్యలపై ఉత్తరప్రదేశ్‌లోని విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. లక్నోలోని దుబగ్గ ప్రాంతంలోని జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ విద్యాలయానికి చెందిన వందలాది మంది విద్యార్థులు ఉపాధ్యాయుల కొరతను నిరసిస్తూ బాలాగంజ్ చౌరస్తాలో నిరసనకు దిగారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.అయితే, మూడు రోజుల క్రితం కూడా ఇదే పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల కొరత, పాఠశాలలోని వసతులపై నిరసనకు దిగారు. ఆ సమయంలో కన్నౌజ్ వెళ్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, అధికారులు తమ కాన్వాయ్‌ను నిలిపి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులను త్వరగా నియమిస్తామని హామీ ఇచ్చారు. అయితే మూడు రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో విద్యార్థులు మరోసారి రోడ్డుపైకి వచ్చారు. అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.ఈ విద్యార్థుల నిరసనలు కేవలం ఉత్తరప్రదేశ్‌కే పరిమితం కాలేదు. ఫతేపూర్, హమీర్పూర్, బిహార్, రాజస్థాన్‌లోని బార్మేర్, జాలోర్, మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా, సిరోంజ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోనూ పాఠశాల విద్యార్థులు వివిధ సమస్యలపై ఆందోళనలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.హమీర్‌పూర్‌లో గ్రామానికి రహదారి లేకపోవడంతో పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 'చదువుకుని మంచి భవిష్యత్తును పొందాలనుకుంటున్నాం.. కానీ పాఠశాలకు వెళ్లే దారే ఇలా ఉంటే ఎలా' అని విద్యార్థులు వారి ఇబ్బంది పరిస్థితులను చెప్పుకొచ్చారు. మరోవైపు అల్వార్‌లో పాఠశాల పైకప్పు దెబ్బతినడంతో భద్రతపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. కన్నౌజ్‌లో పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రశ్నలు తలెత్తడంతో విద్యార్థులు ఆ భోజనాన్ని బహిష్కరించినట్లు సమాచారం.అయితే, ఉత్తరప్రదేశ్ నుంచి పలు రాష్ట్రాలకు చేరుకున్న ఈ విద్యార్థుల ఆందోళనలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల భద్రత, నాణ్యమైన భోజనం వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తమకు అవసరమైన కనీస సదుపాయాలు కల్పించాలని కోరుతూ పాఠశాల విద్యార్థులు స్వయంగా రోడ్డెక్కడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. -
వారణాసి ఎయిర్‌పోర్టులో గన్ మిస్‌ఫైర్.. ఇద్దరికి గాయాలు
లక్నో: వారణాసి విమానాశ్రయంలో ఆదివారం భారీ ప్రమాదం తప్పింది. ఆయుధాల తనిఖీ సమయంలో ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న పిస్టల్ అనుకోకుండా పేలడంతో ఇద్దరు విమానాశ్రయ సిబ్బంది గాయపడ్డారు. దీంతో, విమానాశ్రయంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.వివరాల మేరకు.. అజాంగఢ్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఎయిర్ ఇండియా విమానం IX-1810లో ముంబై వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చాడు. అతని వద్ద పిస్టల్, మ్యాగజైన్ ఉండగా.. ప్రయాణానికి ముందే ఆయుధాల వివరాలను అధికారులకు వెల్లడించాడు. ఆదివాయం ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో ఆయుధం, సంబంధిత పత్రాలను తనిఖీ చేస్తున్న సమయంలోనే పిస్టల్ నుంచి ఓ రౌండ్ పేలింది. ఈ ఘటనలో సమీపంలో ఉన్న ఇద్దరు సిబ్బంది తగలి గాయపడ్డారు.తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్ తొలుత నేలను తాకి అనంతరం సిబ్బందిని తాకినట్లు అధికారులు తెలిపారు. ఓ మహిళా సిబ్బందికి తొడ భాగంలో బుల్లెట్ గాయం కాగా, మరో పురుష సిబ్బంది చేతికి గాయమైంది. ఈ క్రమంలో గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం న్యూ లక్ష్మీ ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వారణాసి విమానాశ్రయ డైరెక్టర్ పునీత్ గుప్తా తెలిపారు. ఆయుధం, దాని పత్రాల తనిఖీ సమయంలో ఆయుధ యజమాని, విమానాశ్రయ సిబ్బంది అక్కడే ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో దర్యాప్తు కొనసాగుతోంది.Today, 16.08.2026, at about 0930 hrs, a passenger travelling with his wife on flight IX-1810 to Mumbai declared weapons on board the flight. During the weapons check, the passenger fired a round, injuring two AAICLAS screeners. Both were taken to New Laxmi Trauma Centre for…— ANI (@ANI) August 16, 2026 -
ఐదు నిమిషాలు లేట్.. ఫోన్ లాక్కుని డెలివరీ బాయ్‌పై దాడి.. ఆపై బిగ్ ట్విస్ట్!
ఐదు నిమిషాల ఆలస్యం.. కస్టమర్‌కు కోపం కట్టలు తెంచుకుంది! ఆర్డర్ లేట్‌గా వచ్చిందన్న ఆగ్రహంతో ఓ డెలివరీ బాయ్‌పై కస్టమర్ దాడికి దిగాడు. ఫోన్ లాక్కొని, చెంపదెబ్బలు కొట్టి, తన్నడమే కాకుండా ఇంట్లోకి తీసుకెళ్లి మరీ దాడి చేశాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ మొత్తం ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కస్టమర్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు నిలిపివేస్తామని ప్రకటించి, నిరసనకు దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకోగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో గంగాసాగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమిత్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేందుకు అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. అక్కడ కస్టమర్ యమన్‌తో డెలివరీ ఆలస్యంపై వాగ్వాదం జరిగింది. అమిత్ ప్రకారం ఆర్డర్ సుమారు ఐదు నిమిషాలు ఆలస్యమైంది. కానీ యమన్ మాత్రం తాను 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చానంటూ ఆరోపించినట్లు అమిత్ తెలిపాడు.ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సీసీటీవీ దృశ్యాల్లో యమన్.. అమిత్ ఫోన్ లాక్కొని, అతడిని కొట్టడం, తన్నడం కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడ కూడా దాడి కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమిత్ ఫిర్యాదు ప్రకారం.. యమన్ తనపై హత్య బెదిరింపులకు పాల్పడ్డాడని, డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించాడు. అంతేకాదు, తన భార్యకు సంబంధించిన వేధింపుల కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు కూడా చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తోటి డెలివరీ ఏజెంట్లు స్పందించారు. అమిత్‌ను గుర్తించి అతడిని సంప్రదించారు. అనంతరం అందరూ కలిసి భవన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.An FIR has been registered against the couple who beat up a Blinkit delivery boy in Meerut, UP. Both have fled after locking their flat. Police raids are ongoing. pic.twitter.com/Sfke34hWFj— subash kumar (@Krishan10_) August 15, 2026డెలివరీ ఏజెంట్ల బంద్..ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన డెలివరీ ఏజెంట్లు పనులు నిలిపివేశారు. అమిత్‌కు కస్టమర్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు చేయబోమని ప్రకటించారు. “ఆర్డర్ కొన్ని నిమిషాలు ఆలస్యమైతే దాడి చేసే హక్కు ఎవరికీ లేదు” అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి 34 ఏళ్ల యమన్‌ను అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరుస్తామని భవన్‌పూర్ పోలీసులు తెలిపారు. ఐదు నిమిషాల ఆలస్యం.. ఆపై గొడవ.. చివరకు సీసీటీవీలో బయటపడిన దాడి! ఈ ఘటన ఇప్పుడు డెలివరీ ఉద్యోగుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. -
మటన్ షాపులోకి దూరిన కొండచిలువ.. మెడలో వేసుకుని యవకుడి విన్యాసాలు!
లక్నో: ఉత్తరప్రదేశ్ బారాబంకీలో చోటుచేసుకున్న భయానక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుమారు 15 అడుగుల పొడవైన భారీ కొండచిలువ ఒక మటన్ షాపులోకి దూరి, అక్కడి మేకను తినేందుకు ప్రయత్నించింది. దీంతో షాపు యజమానితో పాటు అందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే, అదే సమయంలో విపరీతమైన మద్యం మత్తులో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి, ఆ కొండచిలువను చూసి ఏమాత్రం భయపడలేదు సరికదా.. దాన్ని తన మెడలో వేసుకొని వీరంగం సృష్టించాడు. కొండచిలువతో ఆ వ్యక్తి చేసిన ఈ విన్యాసాలు స్థానికులను తీవ్రంగా కలవరపాటుకు గురి చేశాయి. బారాబంకీలోని ఒక మటన్ షాపులోకి అనుకోకుండా ప్రవేశించిన ఆ భారీ కొండచిలువ, దుకాణంలో ఉన్న మేకల్లో ఒకదానిని మింగేసేందుకు యత్నించింది. ఇదే సమయంలో మద్యం మత్తులో ఉన్న సురేష్ అనే వ్యక్తి ఆ మటన్ షాపు వైపు వచ్చాడు. భారీ కొండచిలువను చూసి అందరూ భయంతో పారిపోతుంటే ఇతను మాత్రం ఏమాత్రం వెనకాడకుండా ఖాళీ చేతులతో దాన్ని పట్టుకున్నాడు. సురేష్ దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయడంతో, ఆ పాము తిరగబడి అతడి చేతిని కొరికింది.కొండచిలువలకు విషం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయినప్పటికీ ఏమాత్రం లెక్కచేయని సురేష్, ఆ భారీ కొండచిలువను తన భుజాలపై వేసుకుని, మెడ చుట్టూ దండలా చుట్టుకుని నానా హంగామా సృష్టించాడు. ఈ విచిత్ర దృశ్యాన్ని చూసేందుకు జనం భారీగా గుమిగూడారు. కొందరు దీన్ని తమ మొబైల్స్‌లో రికార్డ్ చేశారు. కొంతసేపటి తర్వాత మత్తు దిగి తేరుకున్న సురేష్, ఆ పామును ఒక పెద్ద డబ్బాలో బంధించాడు. అనంతరం దానిని తీసుకెళ్లి సమీపంలోని ఒక కాలువలో వదిలిపెట్టాడు. ఆ డబ్బాలో నుంచి బయటకు వచ్చిన కొండ చిలువ తన తలను సుమారు 3 అడుగుల ఎత్తుకు లేపి విన్యాసాలు చేసింది. -
17 ఏళ్ల బాలుడికి ర్యాపిడో బైక్‌పై లైంగిక వేధింపులు.. ఆ తర్వాత..
లక్నో: ఓ బాలుడి(17)కి ర్యాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్ చేతిలో భయానక అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లో రాపిడో బైక్ ట్యాక్సీలో ప్రయాణిస్తున్న సమయంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపిస్తూ ఆ బాలుడు ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన తర్వాత ర్యాపిడో కంపెనీ స్పందిస్తూ.. సదరు డ్రైవర్‌ను ప్లాట్‌ఫామ్ నుంచి శాశ్వతంగా నిషేధించినట్లు తెలిపింది. ఓ జాతీయ మీడియాతో ఆ టీనేజర్ మాట్లాడుతూ వివరాలు తెలిపాడు.వీడియోలో ఏముంది?వీడియోలో ఆ టీనేజర్ వెనుక సీటులో కూర్చుని ప్రయాణిస్తుండగా.. డ్రైవర్ అకస్మాత్తుగా తన చేతిని వెనక్కి చాచి ప్రయాణికుడి వైపు తీసుకెళ్లడం కనిపిస్తుంది. వెంటనే టీనేజర్ ఆ వ్యక్తి చేతిని తొలగించాడు. ఆ తర్వాత ఆ డ్రైవర్ టీనేజర్ కాలు, తొడను తాకేందుకు ప్రయత్నించాడు. టీనేజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రాపిడోను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. దానికి “మైనర్ బీటీవీ” అనే క్యాప్షన్ పెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో జరిగినట్లు టీనేజర్ తెలిపాడు.ర్యాపిడో ఏమంది?కంపెనీ మొదట చేసిన మెసేజ్‌లో... “హాయ్.., మీ ద్వారా ఈ విషయం గురించి తెలుసుకోవడం మాకు నిజంగా ఆందోళన కలిగించింది. ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇలాంటి ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. తక్షణ చర్య తీసుకునేందుకు, దయచేసి రైడ్ ఐడీ, మీ మొబైల్ నంబర్‌ను మాకు డీఎం ద్వారా పంపించండి” అని పేర్కొంది.తర్వాత ర్యాపిడో స్పందిస్తూ, “మీకు ఎదురైన అనుభవానికి మేము నిజంగా చింతిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మిమ్మల్ని తీవ్ర అసౌకర్యానికి, బాధకు గురిచేస్తాయని మేము అర్థం చేసుకున్నాం. ఫోన్లో మాట్లాడుకున్నట్లుగా, ఈ విషయాన్ని మేము తీవ్రంగా పరిగణించామని తెలుసుకోండి. ఫిర్యాదులో పేర్కొన్న కెప్టెన్‌ను ప్లాట్‌ఫామ్ నుంచి శాశ్వతంగా నిషేధించాం. కస్టమర్ భద్రతకు లేదా గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తనను మేము ఏమాత్రం అంగీకరించం. మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని మేము ఎంతో విలువైనదిగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ మా ప్లాట్‌ఫామ్ సురక్షితమైన, గౌరవప్రదమైన ప్రదేశంగా ఉండేలా మా వంతు కృషి కొనసాగిస్తాం. మీకు మరేదైనా సహాయం అవసరమైతే, మాకు డీఎం చేయండి” అని తెలిపింది. తాను ఫిర్యాదు చేయలేదని ఆ టీనేజర్ తెలిపాడు. “నేను ఇంకా నా కుటుంబానికి చెప్పలేదు” అని చెప్పాడు.సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్చాలామంది టీనేజర్‌కు మద్దతు తెలుపుతూ, ధైర్యం చెప్పారు. అయితే, కొందరు మాత్రం అతడిపై ట్రోలింగ్ చేశారు. ఆ బాలుడిని తప్పుపట్టడంతో పాటు అవమానకర వ్యాఖ్యలు చేశారు. మరికొందరు అతని ఆరోపణలు నిజమేనా అని ప్రశ్నించారు.తనను విమర్శించిన వారికి సమాధానమిస్తూ ఆ టీనేజర్.. “ద్వేషం మంచిది కాదు. దాని గురించి నేను బాధపడుతున్నాను. ఇది లింగానికి సంబంధించిన విషయం కాదని, మనుషుల భద్రతతో పాటు పిల్లల భద్రతకు సంబంధించిన విషయం అని వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని చెప్పాడు. -
ఇంట్లోకి లాక్కెళ్లి డెలివరీ బాయ్‌కు నరకం చూపించిన యువకుడు
మీరట్: ఆర్డర్‌ను డెలివరీ చేయడంలో 5 నిమిషాలు ఆలస్యమైనందుకు ఓ డెలివరీ బాయ్‌పై ఓ వ్యక్తి దాడి చేశాడు. డెలివరీ బాయ్‌పై దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎరుపు రంగు చొక్కా ధరించిన డెలివరీ బాయ్ ఆర్డర్ ఇవ్వడానికి ఓ అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. ఆ తర్వాత ఓ వ్యక్తి ఫ్లాట్ నుంచి బయటకు వచ్చాడు. ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు జరిగింది.డెలివరీ బాయ్ ఫ్లాట్ డోర్ బెల్ కొట్టాడు. బయటకు వచ్చిన వ్యక్తి అతనితో ఏదో చెప్పాడు. అనంతరం ఆ వ్యక్తి డెలివరీ బాయ్ మొబైల్ ఫోన్ లాక్కుని అతనిపై దాడి చేయడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి డెలివరీ బాయ్‌ను చెంపదెబ్బలు కొట్టడం, తన్నడం దృశ్యాల్లో కనిపించింది. ఈ ఘటన సమయంలో డెలివరీ ఏజెంట్ తన మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వాలని అడిగాడు. ఓ మహిళ కూడా ఫ్లాట్ నుంచి బయటకు వచ్చి ఘటన జరుగుతున్న సమయంలో అక్కడే ఉంది.ఆ తర్వాత డెలివరీ బాయ్‌ను ఫ్లాట్ లోపలికి తీసుకెళ్లినట్లు దృశ్యాల్లో కనిపించింది. ఫ్లాట్ లోపల కూడా ఆ వ్యక్తి అతనిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంత సమయం తర్వాత డెలివరీ బాయ్‌ను తిరిగి బయటకు తీసుకొచ్చారు. ఈ వీడియో మీరట్‌లోని భావనువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగా హైట్స్ అపార్ట్‌మెంట్‌కు చెందినదిగా సమాచారం. ఈ ఘటన 2026 ఆగస్టు 14న రాత్రి 9:30 గంటల సమయంలో జరిగింది. డెలివరీ బాయ్‌ను అమిత్‌గా గుర్తించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వైరల్ వీడియో పోలీసుల దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేయగా ఈ ఘటన 2026 ఆగస్టు 14న జరిగినట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. ఫిర్యాదుదారు నుంచి రాతపూర్వక ఫిర్యాదు తీసుకుని, సంబంధిత సెక్షన్ల కింద భావనువాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. View this post on Instagram A post shared by mid-day (@middayindia) -
ఆస్తి దాహం.. కొడుకు చేసిన పని వైరల్
ఆస్తి కోసం బంధాలను మరిచిపోయిన ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. మంచాన పడ్డ తండ్రికి వైద్యం చేయిస్తానంటూ అందరినీ నమ్మబలికి తన వెంట తీసుకెళ్లాడు. ఆపై ప్రాణం పోయాక.. ఛీ కొట్టే పనికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరడంతో వైరల్ అవుతోంది. యూపీ లక్నోలోని ఖరౌహా గ్రామానికి చెందిన ఛత్రపాల్ (75)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే కొడుకు మహేంద్ర, కోడలు లక్ష్మి ఛత్రపాల్‌ను వేధించసాగారు. దీంతో ఆయన తన ముగ్గురు కుమార్తెల వద్ద ఉంటూ జీవనం సాగించారు. ఈ క్రమంలో.. ఓరోజు తన ఆస్తిని కూతుళ్లకు సమానంగా పంచుతున్నానని, కొడుకు-కోడలును బహిష్కరిస్తున్నట్లు పత్రిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ పరిణామంతో మహేంద్ర, అతని భార్య రగిలిపోయారు. అయితే జులై 7న ఛత్రపాల్ ఆరోగ్యం క్షీణించడంతో మహేంద్రకు అతని సోదరి సమాచారం ఇచ్చింది. దీంతో మహేంద్ర తన కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చి, వైద్యం చేయిస్తానంటూ తండ్రిని తన వెంట తీసుకెళ్లాడు. ఆ రెండు రోజులకే అంటే జులై 9న ఛత్రపాల్ మృతి చెందారు.తండ్రి అంత్యక్రియల కోసం గ్రామానికి చేరుకున్న కుమార్తెలకు మరో షాక్ ఎదురైంది. బంధువులు, గ్రామస్తుల సమక్షంలో మహేంద్ర తన మృత తండ్రి బొటనవేలిని ఖాళీ కాగితాలపై ముద్రిస్తున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ పత్రాలపై తీసుకున్న వేలిముద్రలను భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగించుకుంటారోనని అనుమానం వ్యక్తం చేశారు.ఆపై ఊహించిందే జరిగింది. ఆస్తంతా తనదేనంటూ గొడవకు దిగాడు మహేంద్ర. దీంతో ఛత్రపాల్ కూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. తండ్రి శవంతో ఖాళీ పేపర్లపై వేలిముద్ర వేయించుకున్న దృశ్యాల్ని పోలీసులకు సమర్పించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
రవి కిషన్‌పై యోగి జోక్.. కడుపుబ్బా నవ్వుకున్న ప్రేక్షకులు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి గోరఖ్‌పూర్ ఎంపీ, సినీ నటుడు రవి కిషన్‌పై సరదాగా వ్యాఖ్యలు చేశారు. విమాన కనెక్టివిటీ మెరుగ్గా ఉండడంతో రవి కిషన్ ఏ రోజు గోరఖ్‌పూర్‌లో ఉంటారో, ముంబైలో ఉంటారో, ఢిల్లీలో ఉంటారో ఎవరికీ తెలియదని చమత్కరించారు. దీంతో అందరి ముఖాల్లో నవ్వులు పూశాయి. ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. గోరఖ్‌పూర్‌లో మెరుగైన విమాన కనెక్టివిటీ గురించి మాట్లాడిన యోగి.. నగరంలో భారీ మార్పు వచ్చిందన్నారు. 10 ఏళ్ల క్రితం రోజుకు ఒక్క విమానం మాత్రమే నడిచేదని, ప్రస్తుతం నగరం నుంచి 14 విమానాలు నడుస్తున్నాయని చెప్పారు.ఆ తర్వాత ప్రేక్షకుల్లో కూర్చున్న రవి కిషన్ వైపు తిరిగి మాట్లాడుతూ.. “రవి కిషన్ గురించి నేను ఎప్పుడూ చెబుతుంటాను. ఆయన గోరఖ్‌పూర్‌లో ఎప్పుడు ఉంటారో, ముంబైలో ఎప్పుడు ఉంటారో ఎవరికీ తెలియదు. ముంబైలో బ్రేక్‌ఫాస్ట్ చేస్తే, గోరఖ్‌పూర్‌లో లంచ్ కూడా చేసేస్తారు. ఇక్కడ ముఖం చూపించి మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోతారు” అన్నారు. విమాన అనుసంధానం లేకపోతే ఇలాంటి షెడ్యూల్ నిర్వహించడం కష్టమయ్యేదని అన్నారు. యోగి వ్యాఖ్యలపై రవి కిషన్‌తో పాటు అక్కడ ఉన్నవారు కూడా గట్టిగా నవ్వారు.గతంలోనూ ఓ సారి ఇలాగే..ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల ఒకే వేదికపై కనిపించినప్పుడల్లా ఇటువంటి సరదా సంభాషణలు జరుగుతుంటాయి. 2025 జూలైలో గోరఖ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమంలో, రామ్‌ఘర్ తాల్ ప్రాంతంలో కాలువపై రవి కిషన్ ఇల్లు కట్టారని యోగి సరదాగా ప్రస్తావించారు. నీరు నిలిస్తే ఆయనపైనా చర్యలు తప్పవని చమత్కరించారు. మురుగు నీటి ప్రవాహం సజావుగా సాగాలంటే కాలువకు కొంత దూరంగా ఇల్లు కట్టాలని సూచించారు. మరో సందర్భంలో అదే ఇంటిని ప్రస్తావిస్తూ, రామ్‌ఘర్ తాల్ ఒడ్డున ఒక “షీషే మహల్” ఉందని వ్యాఖ్యానించారు. అది రవి కిషన్ ఇంటినే ఉద్దేశించి చేసిన వ్యాఖ్య. -
ప్రియుడు.. ప్రియురాలు.. 10 తూటాలు..!
ప్రియుడిపై ప్రేమ.. తండ్రి భయం.. చివరకు జైలు గేటు ముందు జరిగిన ఘటన సంచలనంగా మారింది. ప్రియుడిని కలిసేందుకు వచ్చిన బాలిక దగ్గర 10 బుల్లెట్ తూటాలు దొరకడం ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. నకిలీ ఆధార్ కార్డు, కొంత నగదును కూడా ఆమె నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గోండా డివిజనల్ జైలులో ఉన్న తన ప్రియుడు హర్షు కశ్యప్‌ను కలిసేందుకు బాలికతో పాటు మరో వ్యక్తి గురువారం జైలుకు వచ్చినట్లు జైలర్ అఫ్తాబ్ ఆలం అన్సారీ తెలిపారు. జైలు ప్రధాన గేటు దగ్గర తనిఖీల సమయంలో బాలిక తప్పుడు గుర్తింపుతో రావడం భద్రతా సిబ్బందికి అనుమానం కలిగించింది. ఆధార్ కార్డులో ఉన్న పేరుకు భిన్నంగా ఆమె మరో పేరు చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆమెను తనిఖీ చేయగా.. జేబులో 10 లైవ్ బుల్లెట్ కార్ట్రిడ్జ్లు బయటపడ్డాయి. వెంటనే జైలు ఔట్ పోస్ట్ ఇన్ఛార్జ్కు సమాచారం అందించి.. బాలికతో పాటు వచ్చిన వ్యక్తితో పాటు వారి దగ్గర ఉన్న వస్తువులను పోలీసులకు అప్పగించారు.విచారణలో బాలిక తన అసలు వివరాలను బయటపెట్టింది. ఆ బుల్లెట్లు తన తండ్రి లైసెన్స్ గన్లోనివని.. తన తండ్రికి కోపం ఎక్కువని.. తాను జైలులో ఉన్న ప్రియుడిని కలవడానికి వెళ్లిన విషయం తెలిస్తే ఆయన ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భయపడి బుల్లెట్లను వెంట తీసుకువచ్చానంటూ చెప్పింది. దీంతో అధికారులు షాక్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
చక్రవ్యూహంలో యువతరం
ప్రయాగ్‌రాజ్: యువతరం విషయానికొస్తే సమస్య, సమాచారం, సంపద అంశాల్లో దేశానికి వీళ్లే అతిపెద్ద బలమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కీలక నగరాల్లో దశల వారీగా కొనసాగుతున్న ‘ఛాంత్రోంకీ గూంజ్(విద్యార్థుల గొంతు)’కార్యక్రమంలో భాగంగా శనివారం ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కేపీ గ్రౌండ్లో వేలాది మంది విద్యార్థులనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ఎల్లప్పుడూ తెల్లని టీ–షర్ట్ ధరించే రాహుల్ తన శైలికి భిన్నంగా లేత గులాబీరంగు సాధారణ షర్ట్‌తో ఆకట్టుకున్నారు. ‘‘మీరే ఈ దేశ గౌరవం, భవిష్యత్తు. దేశంలో యువత జనాభా అత్యధికం. మీరు సృష్టించే డేటా అపారం. 21వ శతాబ్దిలో దేశ ఆర్థికవ్యవస్థకు మీరు, డేటాయే చోదకశక్తులు. అయితే యువత వద్ద డేటా ఉంది. దానికి తోడు యువతలో ఉండాల్సిన శక్తిసామర్థ్యాలన్నీ మీకున్నాయి. కానీ వ్యవస్థ అనేది మిమ్మల్ని ఒక చక్రవ్యూహంలో పడేసింది. యువత ఎక్కువ రీల్స్ చూసేలా, ఎక్కువ వాట్సప్ మెసెజ్‌లలో మునిగిపోయేలా, ఇన్‌స్టా గ్రామ్ రీల్స్ చేస్తూ, షేర్చేస్తూ వాటిల్లోనే గడిపేలా ఒక అదృశ్య వ్యవస్థ నడుస్తోంది. ఇదంతా యువతకు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద వ్యసనంగా తయారైంది’’అంటూ రాహుల్ వెనక తెరమీద పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ల ఫొటోలను ప్రదర్శించారు. ఫొటోలను చూపిస్తూ.. ‘‘డేటా మీది. కష్టం మీది. కానీ సంపద మాత్రం వీళ్లది. ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ ఇదే. అదానీ సంపద గత పదేళ్లలో 30 రెట్లు పెరిగింది. ప్రభుత్వంతో ఆయన క్విడ్ ప్రోకో(నీకిది నాకది) ఒప్పందం చేసుకున్నారు. బీజేపీ సంపద అమాంతం పెరిగింది. బీజేపీ బ్యాంక్ ఖాతాలో సొమ్ము ఇన్నేళ్లలో రూ.150 కోట్ల నుంచి ఏకంగా రూ.10,000 కోట్లకు ఎగసింది. ఇక ఆర్ఎస్ఎస్ విషయానికొస్తే.. ప్రభుత్వ ఉద్యోగాల్లో, మీడియా, జ్యుడీషరీ, పారామిలటరీ, విశ్వవిద్యాలయాలు, కళాశాలలల్లో ఆర్ఎస్ఎస్ భావజాల వ్యక్తులున్నారు. ఇలా వీళ్లంతా మనల్ని నియంత్రిస్తున్నారు. ఇదే వ్యవస్థ’’అని రాహుల్ అన్నారు. సర్టిఫికెట్లకు అర్థం లేకుండా పోయింది ‘‘కష్టపడి చదివి సంపాదించిన సరి్టఫికెట్లకు ఎలాంటి అర్థం లేకుండాపోయింది. ఇవి ఉద్యోగం ఇవ్వలేవు. విద్యార్థులుసైతం అత్యధిక ఫీజులు, పరీక్షల వ్యవస్థల అక్రమాల వలయంలో చిక్కుకున్నారు. ఉన్నత విద్య కోసం ఎంతో ఖర్చుచేయాల్సి వస్తోంది. తీరా కోర్సు పూర్తయ్యాక ఉద్యో గం రాదు. తయారీరంగం కుదేలవుతోంది. రుణాలు దొరకడం కష్టమైంది. పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీలు ఆగట్లేవు. ఏఐ వచ్చి ఉన్న ఉద్యోగాలనూ తీసేస్తోంది. యువత కష్టాలు ఇంకెన్నో’’అని రాహుల్ అన్నారు.అంధకారంలో అగ్గిరాజేయండి ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ఎందరో విద్యార్థులు ఉద్యమించారు. పేపర్ లీకేజీలతో మనస్తాపంతో మరెందరో బలవన్మరణాలకు పాల్పడ్డారు. వాళ్లకు నా నివాళులు. అస్తవ్యవస్త విద్యారంగంలో అంధకారం అలుముకుంది. మీ తల్లిదండ్రులు చేయలేని పనిని మీరైనా చేయండి. ఇకనైనా విద్యార్థులు భయాలను విడనాడి అంధకారంలో ఉద్యమదీపాలను వెలగించి దేశంలో మార్పులకు పునాదులు వేయండి. విద్వేషం, హింసతో మార్పులు తేలేం. ప్రేమతోనే ఇది సాధ్యం. మీరే దేశ స్ఫూర్తి. మీరే దేశ భవిత. ప్రపంచంలోని బ్యూటిఫుల్ యంగ్‌స్టర్స్ మీరే. ప్రేమ దుకాణాలను తెరవండి. ప్రేమతోనే పోరాడి గెలవండి’’అని రాహుల్ అన్నారు. -
డేటింగ్ యాప్‌లో వల, వీడియోలతో బ్లాక్మెయిల్ : కోట్లు కొట్టేస్తున్న కిలాడీ
డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఒక లేడీ కిలాడీ హనీ ట్రాప్ దందా ఆలస్యంగా వెలుగుచూసింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన పల్లవి సింగ్ రాజ్‌పుత్ అనే మహిళ డేటింగ్ యాప్ టిండర్ (Tinder), ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పురుషులతో పరిచయం పెంచుకుని, ఆపై వారిని బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేస్తోందన్న ఆరోపణలు సంచలనం రేపాయి. ఒక హైకోర్టు లాయర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ హనీట్రాప్ నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది .విచారణలో విషయాలు తెలిసి పోలీసులు సైతం నివ్వెరపోయారు.పల్లవి సింగ్ రాజ్‌పుత్ అనే మహిళ టిండర్ ద్వారా పురుషులకు వల వేసి, స్నేహం నటించేది. ఆ తర్వాత వారితో దగ్గరయ్యేది. ఇక్కడే తన ప్లాన్ అమలులో కీలకమైన అడుగు వేసేది. తనకు పరిచయమైన వారితో సన్నిహితంగా ఉంటున్న సమయాల్లో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసేదని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వీడియోలు, ఫోటోలు చూపించి బాధితులను బెదిరిస్తూ ఇప్పటివరకు దాదాపు రూ. 6 కోట్లకు పైగా వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. అంతేకాదు తాను డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకపోతే అత్యాచారం హత్యాయత్నం లాంటి తీవ్రమైన కేసులు పెడతానని బెదిరించేది. ఈమె ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటికే ఐదుగురు జైలుకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.నకిలీ ప్రొఫైళ్లుపల్లవి "స్వీటీ తివారి" అనే పేరుతో సహా వివిధ నకిలీ సోషల్ మీడియా ప్రొఫైళ్లను ఉపయోగించి కొత్తవారిని బురిడీ కొట్టించేదని మరొక ఫిర్యాదులో వెల్లడైంది. ఈమెకు మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు సహకరిస్తున్నారని సమాచారం.ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్‌కి రూ. 6 లక్షల రింగ్ : లవర్ చేసిన పని ఇదే!సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ఈ కేసువెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించి మంచంపై పెద్ద ఎత్తున నోట్ల కట్టలు పేర్చి ఉన్న ఫొటోలు, అలాగే ఒక మహిళ చేతిలో ఆయుధం పట్టుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. అయితే, ఈ ఫొటోల విశ్వసనీయతను పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఆరోపణలపై పోలీసులు కేసు నమోది చేసి ముమ్మర దర్యాప్తు జరుపు తున్నారు.ఇదీ చదవండి: 26 ఏళ్ల మిలియనీర్ కుక్కలా మారేందుకు రూ. 220 కోట్లు? వీడియో వైరల్ -
ఏసీ గదిలో నిద్ర.. అదే చివరి రాత్రైంది!
ఎల్ నినో ప్రభావంతో వర్షాకాలంలోనూ ఉక్కపోత కొనసాగుతోంది. మండుతున్న వేడి నుంచి ఉపశమనం కోసం ఆ కుటుంబం మొత్తం ఏసీ గదిలో నిద్రకు ఉపక్రమించింది. కానీ అదే వారి చివరి రాత్రిగా మారింది. భారీ వర్షాల ధాటికి దాదాపు 100 ఏళ్ల నాటి ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి ప్రకోపం ఓ కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టింది.ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మండుతున్న వేడి నుంచి ఉపశమనం కోసం కుటుంబమంతా ఒకే ఏసీ గదిలో నిద్రించగా.. అదే వారికి చివరి రాత్రిగా మారింది. భారీ వర్షాలకు దాదాపు 100 ఏళ్ల నాటి ఇల్లు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ప్రతాప్‌గఢ్ జిల్లాలోని మహులి ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన జరిగింది. నగర్ కోత్వాలి పరిధిలోని ఓ పాత ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లో ఏడుగురు ఉన్నారు.క్షణాల్లో శిథిలాల కిందఎండ తీవ్రత కారణంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏసీ ఉన్న ఒకే గదిలో నిద్రించాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఇప్పటికే బలహీనంగా మారిన పాత ఇంటి పైకప్పు వర్షం ధాటికి కూలిపోయింది. దీంతో నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు.ఆరుగురి మృతి.. ఒకరి ప్రాణాలతో పోరాటంఈ ఘటనలో ప్రమోద్ శ్రీవాస్తవ్ (60), ఆయన భార్య రీటా (55), కుమారుడు నితిన్ (25), కోడలు మాధురి (24), మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కుటుంబ పెద్ద కుమారుడు అమన్ (28) మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డాడు. శిథిలాల నుంచి స్వయంగా బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడు. తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పాత భవనం పరిస్థితి, కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.వర్షాలకు వరుస విషాదాలుప్రతాప్గఢ్ ఘటనతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ పాత నిర్మాణాలు కూలి ప్రాణ నష్టం జరిగింది. బారాబంకీ జిల్లాలోని అలియాబాద్‌లో పాత ఇటుక గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలడంతో పిల్లలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఆస్పత్రికి తరలించినప్పటికీ ఏడేళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయారు. సహరన్పూర్ జిల్లాలోనూ భారీ వర్షాల కారణంగా మట్టి ఇల్లు కూలి 35 ఏళ్ల మహిళ మృతి చెందింది. గ్రామస్థుల సహాయంతో ఆమెను బయటకు తీసినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.వరుసగా కురుస్తున్న వర్షాలు పాత ఇళ్లకు ప్రమాదంగా మారుతున్నాయి. బలహీనంగా ఉన్న నిర్మాణాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
రూ.4,200 కోట్ల రోడ్డుకు ప్యాచ్ వర్క్!
భారీ వ్యయంతో నిర్మించిన ఓ ప్రతిష్టాత్మక ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైన కొద్ది రోజులకే దెబ్బతినడం చర్చనీయాంశంగా మారింది. రూ.4,200 కోట్లతో నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రారంభించిన మూడు వారాలకే పలు ప్రాంతాల్లో కుంగుదల, పగుళ్లు కనిపించడంతో అధికారులు ప్యాచ్ వర్క్ చేపట్టారు. మరోవైపు.. అనుకోని ఈ పరిస్థితుల్లో భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఎక్స్‌ప్రెస్‌వే అంతటా టోల్ వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది.సుమారు 63 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేను లక్నో–కాన్పూర్ మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నిర్మించారు. జూలై 13న దీన్ని ప్రారంభించగా.. కేవలం 13 రోజులకే జూలై 26న ఉనావ్ జిల్లాలోని 64వ కిలోమీటర్ వద్ద రహదారి కుంగిపోవడం, ఉపరితల పొర కొట్టుకుపోవడం బయటపడ్డాయి.మళ్లీ మళ్లీ అదే ప్రాంతంమొదట సమస్య కనిపించిన ప్రాంతంలో పరిమిత స్థాయిలో మరమ్మతులు చేపట్టారు. సుమారు 120 మీటర్ల ప్రాంతంలో సమస్య గుర్తించగా.. దాదాపు 100 మీటర్ల బిటుమెన్ పొరను మరమ్మతు చేశారు. మరో 20 మీటర్ల భాగాన్ని పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించారు. అయితే కొద్ది కాలానికే సమస్య మళ్లీ తలెత్తడంతో అధికారులు మరింత విస్తృత స్థాయిలో పరిశీలన చేపట్టారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా సుమారు 300 మీటర్ల మేర రహదారిని తవ్వి తిరిగి నిర్మిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్డు పెచ్చులుగా ఊడడం కనిపించడంతో జేసీబీలు, రోలర్లతో పనులు కొనసాగుతున్నాయి.Pedestal fans being used to dry the patch work after the multiple portions of the Lucknow-kanpur expressway was damaged barely a forthnight after inauguration.#REDMINote17 #vivoS2#Investors_favorite_Stock#Avadhootadattapeetham #vivoseries pic.twitter.com/Y5vdl2gLz1— Cockroach Janta Party,Kanpur (@CJPknp) August 6, 2026ఒకే మార్గంలో రెండు వైపులా వాహనాలుమరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దెబ్బతిన్న క్యారేజ్‌వేలను మూసివేయడంతో లక్నో నుంచి కాన్పూర్, కాన్పూర్ నుంచి లక్నో వెళ్లే వాహనాలను ఒకే మార్గంలోకి మళ్లిస్తున్నారు. కొన్ని చోట్ల వాహనదారులు యూ టర్న్ తీసుకుని వ్యతిరేక దిశలో ప్రయాణించాల్సి వస్తోంది.120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో డైవర్షన్లు, బ్యారికేడ్లు, మరమ్మతు ప్రాంతాల కారణంగా వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తోంది. అయితే అధికారికంగా వేగ పరిమితిని తగ్గించలేదని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు.టోల్ చెల్లించిన తర్వాతే డైవర్షన్ సమాచారంమరమ్మతుల కారణంగా మార్గం మార్చాల్సి వస్తున్నప్పటికీ ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని పలువురు వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. టోల్ చెల్లించిన తర్వాతే రూట్ మార్పు వివరాలు చెబుతున్నారని ఆరోపించారు. కొంతమంది ప్రయాణికులు రోడ్డులో కుంగిన ప్రాంతాల వల్ల వాహనాలు అదుపు తప్పే పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు. దీంతో పాత రహదారుల వైపు మళ్లుతున్నట్లు చెప్పారు.నీరు చొరబడటమే కారణమా?ప్రాథమిక పరిశీలనలో వర్షపు నీరు రహదారి పొరల్లోకి చేరి కింద ఉన్న మట్టిని బలహీనపరిచినట్లు భావిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. తవ్విన ప్రాంతాల్లో తడి మట్టి కనిపించిందని, దీంతో రోడ్డు పైభాగం కుంగిపోయినట్లు ప్రాథమిక అంచనా వేశారు. రోడ్డు నాణ్యతను ప్రభావితం చేసే అంశాల్లో మట్టి నాణ్యత, పొరల కాంపాక్షన్, డ్రైనేజీ వ్యవస్థ, బిటుమెన్ నాణ్యత కీలకమని నిపుణులు చెబుతున్నారు. కారణాలను పూర్తిగా గుర్తించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ నిపుణుల బృందాన్ని రంగంలోకి దించారు.నిర్మాణ సంస్థపై చర్యలుఈ ఘటనపై నిర్మాణ సంస్థ పీఎన్సీ ఇన్ఫ్రాటెక్పై ఎన్హెచ్ఏఐ చర్యలు ప్రారంభించింది. సంస్థను “నాన్-పర్ఫార్మర్”గా ప్రకటించే ప్రక్రియ మొదలుపెట్టడంతో పాటు, బాధ్యులపై జరిమానాలు, భవిష్యత్ ప్రాజెక్టుల్లో పాల్గొనకుండా నిషేధం వంటి చర్యలను పరిశీలిస్తోంది. మరమ్మతు పనుల మొత్తం ఖర్చును నిర్మాణ సంస్థే భరించాల్సి ఉంటుందని ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది. సుమారు రూ.3 కోట్ల వరకు ఈ పనులకు ఖర్చవుతుందని అంచనా వేసింది.ఇంజినీర్లపై వేటుప్రాజెక్టు పర్యవేక్షణలో నిర్లక్ష్యంపై కొందరు అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టు మేనేజర్ వివేక్ కుమార్ గుప్తా, ఇండిపెండెంట్ ఇంజినీర్ టీమ్ లీడర్ సురేంద్ర కుమార్, రెసిడెంట్ ఇంజినీర్ యతేంద్ర కుమార్‌లను ప్రాజెక్టు నుంచి తొలగించారు.టోల్ వసూళ్లకు బ్రేక్మరమ్మతులు పూర్తయ్యే వరకు కాన్పూర్–లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై టోల్ వసూళ్లు నిలిపివేస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. టోల్ ఆదాయ నష్టాన్ని నిర్మాణ సంస్థ నుంచి వసూలు చేస్తామని వెల్లడించింది. రూ.4,200 కోట్లతో నిర్మించిన హైస్పీడ్ కారిడార్.. ప్రారంభమైన కొద్ది రోజులకే రిపేర్ల బాట పట్టడం ఇప్పుడు రహదారి నిర్మాణ నాణ్యతపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. -
రూ. కోటిన్నర నజరానా!.. అస్మితకు భారీ షాక్?
అస్మితా డే... కామన్వెల్త్ గేమ్స్‌లో జూడో విభాగంలో భారత్‌కు మొట్టమొదటి స్వర్ణం అందించిన అమ్మాయి. గ్లాస్గోలో 48 కిలోల విభాగంలో కెనడాకు చెందిన అంతర్జాతీయ చాంపియన్ హెడీ క్వాచ్ ను ఓడించి పసిడి పతకాన్ని 23 ఏళ్ల అస్మిత ముద్దాడింది. సైకిల్ మెకానిక్ కుమార్తె అయిన ఆమె జూడోలో ఉన్నత శిఖరాలకు చేరి దేశాన్ని గర్వపడేలా చేసింది.అయితే, అస్మితకు క్యాష్ రివార్డు ఇచ్చే అంశంలో వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ఇచ్చే భారీ నగదు బహుమతికి ఆమె అర్హురాలా? కాదా? అన్న చర్చ మొదలైంది. అస్మిత స్వస్థలం త్రిపుర. బెలోనియా అనే చిన్న పట్టణంలో ఆమె జన్మించింది. అయితే, క్రీడల్లో ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తోంది.వివిధ వేదికలపై సత్తా చాటిన అథ్లెట్లకు నగదు బహుమతి ప్రకటించే క్రమంలో యూపీ ప్రభుత్వం 2024, ఆగష్టులో ఒక జీవో తీసుకువచ్చింది. దీని ప్రకారం.. రాష్ట్రం ఇచ్చే నగదు బహుమతి పొందాలంటే అథ్లెట్లకు మూడు నిబంధనలు విధించింది.మూడు నిబంధనలుఒకటి.. సదరు అథ్లెట్ చట్టబద్ధంగా యూపీలో శాశ్వత నివాసం కలిగి ఉండాలి. రెండు.. యూపీకి చెందిన, గుర్తింపుపొందిన కాలేజీ లేదంటే యూనివర్సిటీలో కనీసం రెండేళ్లపాటు చదివి ఉండాలి. మూడు.. ఏదేని క్రీడాంశంలో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించి ఉండాలి.ఈ నేపథ్యంలో అస్మితకు ఇచ్చే క్యాష్ రివార్డు విషయంలో సందిగ్దత నెలకొన్నట్లు తెలుస్తోంది. త్రిపురకు చెందిన ఆమె యూపీకి ప్రాతినిథ్యం వహిస్తూ పతకాలు సాధిస్తోంది. ఈ క్రమంలో 2023లో యూపీ విభాగంలో ఆమెకు సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం.రూ. 1.5 కోట్ల క్యాష్ రికార్డుఇక కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన అస్మితకు నిజానికి.. అన్నీ కుదిరితే యూపీ ప్రభుత్వం నుంచి రూ. 1.5 కోట్ల క్యాష్ రికార్డు వస్తుంది. అయితే, నిబంధనల ప్రకారం అస్మితకు ఆ అర్హత ఉందా? లేదా? అన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో యూపీ జూడో అసోసియేషన్ కార్యదర్శి మునావర్ అంజర్ స్పందిస్తూ..‘‘ఆమె 2023 నుంచి యూపీ పోలీస్ విభాగంలో పనిచేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో యూపీ ముఖచిత్రంగా అస్మిత కొనసాగుతోంది. తొలుత సీనియర్ జూడో చాంపియన్‌షిప్‌లో యూపీ తరఫున స్వర్ణం గెలిచింది.ఆ తర్వాత 38వ జాతీయ క్రీడల్లోనూ గోల్డ్ మెడల్ సాధించింది. కాసబ్లాంకా ఆఫ్రికన్ ఓపెనర్ చాంపియన్‌షిప్‌లోనూ పసిడి పతకం గెలిచింది. తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లోనూ యూపీ తరఫున స్వర్ణం గెలిచింది’’ అని పేర్కొన్నారు. పరోక్షంగా ఆమె క్యాష్ రివార్డుకు అర్హురాలే అనేలా వ్యాఖ్యలు చేశారు.వీరికి నజరానాలు లభించాయిఇక యూపీ క్రీడా శాఖా కార్యదర్శి సుహాస్ ఎల్వై మాట్లాడుతూ.. ‘‘అర్హులైన ప్రతి ఒక్క అథ్లెట్‌కు అన్ని రకాల ప్రయోజనాలు అందిస్తాము. అధికారులు ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. నిజానికి సుహాస్ కర్ణాటకకు చెందిన ఐఏఎస్ అధికారి. 2003 నుంచి యూపీలో సేవలు అందిస్తున్నారు. పారాలింపిక్స్‌లో యూపీ తరఫున సిల్వర్ గెలిచిన సుహాస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివిధ రివార్డులు అందుకున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. నేపాల్‌కు చెందిన జీతూ రాయ్ లక్నోకు చెందిన 11 గోర్ఖా రైఫిల్స్‌లో చేరిన తర్వాత భారత పౌరసత్వం పొందారు. ఈ క్రమంలో ఆసియా క్రీడల 2014 ఎడిషన్‌లో షూటింగ్ విభాగంలో యూపీ తరఫున గోల్డ్ మెడల్ గెలవగా.. యూపీ ప్రభుత్వం రూ. కోటి నజరానా అందించింది.చదవండి: రూ. 30 లక్షల నజరానా.. డీఎస్పీగా ప్రమోషన్ -
రోడ్డు ప్రమాదంలో అతీక్ అహ్మద్ కుమారుడు మృతి
ఝాన్సీ(ఉత్తరప్రదేశ్): గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్ కుమారుడు అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఝాన్సీ జైలులో ఉన్న తన అన్నయ్య అలీ అహ్మద్‌ను కలిసేందుకు కారులో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అబాన్ అహ్మద్ ప్రయాణిస్తున్న కారు అతివేగంగా వెళ్తుండగా అకస్మాత్తుగా అదుపుతప్పింది. రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతినింది. తీవ్ర గాయాలపాలైన అబాన్ అహ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.ఉమేష్ పాల్ హత్య కేసులో అశ్రద్తో పాటు అతీక్ అహ్మద్ పోలీసు కస్టడీలో ఉన్న సమయంలోనే 2023 ఏప్రిల్‌లో హత్యకు గురయ్యారు. అంతకుముందు అతీక్ కుమారుడు అసద్ పోలీసు ఎన్కౌంటర్లో మరణించారు. ఈ ఘటనలు జరిగి మూడేళ్లు దాటిన తర్వాత, ఇప్పుడు అతీక్ చిన్న కుమారుడు అబాన్ రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా అతీక్ మరో కుమారుడు అలీ అహ్మద్ పలు క్రిమినల్ కేసుల్లో ప్రస్తుతం ఝాన్సీ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఆయనను చూసేందుకు వెళ్తున్న సమయంలోనే అబాన్ రోడ్డు ప్రమాదానికి గురికావడం గమనార్హం.ఇది కూడా చదవండి: ‘రక్త సంబంధం’.. ఇది సీరియల్ కాదు.. సినిమా కానే కాదు! -
అయోధ్యలో అక్రమాలు.. 500 ఏళ్ల త్యాగాల ప్రతీకపై మచ్చా
భోపాల్: అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల చోరీ ఆరోపణలపై రామ జన్మభూమి ఉద్యమ నేతల్లో ఒకరైన సాధ్వి రితంభర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంటూ.. బాధ్యులపై త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సాధ్వి రితంభర మాట్లాడుతూ.. రామ మందిర నిర్మాణం కోసం గత 500 ఏళ్లుగా ప్రజలు డబ్బుతో పాటు ప్రాణాలను కూడా త్యాగం చేశారని గుర్తు చేశారు. అలాంటి పవిత్ర స్థలానికి సమర్పించిన కానుకలపై దొంగతనం జరగడం భక్తులను తీవ్రంగా బాధించిందని అన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. ఇది మనందరినీ సిగ్గుపడేలా చేసింది. కొంతమంది చేసే పనులు దేశానికి, సమాజానికి, సంప్రదాయాలకు చెడ్డపేరు తెస్తాయి. ఇది అలాంటి ఘటనల్లో ఒకటి అని ఆమె వ్యాఖ్యానించారు. భక్తులు ఎంతో విశ్వాసంతో సమర్పించే కానుకలపై రాబందులాంటి కన్ను వేయడం బాధాకరమని సాధ్వి రితంభర అన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.ఇదే సమయంలో.. రామ మందిరం కోసం అనేక తరాలుగా ప్రజలు చేసిన పోరాటం, త్యాగాలను గుర్తు చేస్తూ.. ఇలాంటి ఘటనలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజల్లో విలువలు, నైతికతను బలపరచాల్సిన అవసరం ఉందన్నారు.ఇదిలా ఉండగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన జెన్ జెడ్ ఉద్యమంపై కూడా సాధ్వి రితంభర స్పందించారు. భారతదేశ వర్తమానం, భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు. యువత దేశం, సంస్కృతి పట్ల అంకితభావంతో పనిచేయాలని, తమ ప్రతిభను సరైన మార్గంలో వినియోగించుకోవాలని సూచించారు. భారత యువత గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని మేము కోరుకుంటున్నాం. వారు దేశం నెరవేర్చాల్సిన కలలను సాకారం చేస్తారు. భారతీయ పిల్లలు తులసి మొక్కల లాంటివారు. వారికి విలువలనే గంగా జలంతో పోషించాలని అన్నారు. -
మాయావతికి తీరని లోటు.. బీఎస్పీ ఏకైక ఎమ్మెల్యే కన్నుమూత
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్ బీఎస్పీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ (55) బుధవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా మెదడు కణితి (బ్రెయిన్ ట్యూమర్)తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఉమాశంకర్ సింగ్ బుధవారం రాత్రి సుమారు 8.30 గంటలకు మరణించినట్లు బీఎస్పీ ఆజమ్గఢ్, గోరఖ్‌పూర్ జోనల్ కోఆర్డినేటర్ మదన్ రామ్ తెలిపారు. ఉమాశంకర్ సింగ్ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఉమాశంకర్ సింగ్ బల్లియా జిల్లా రస్రా నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమాశంకర్ సింగ్ మృతి ఎంతో బాధాకరమని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఉమాశంకర్ సింగ్ మృతిపై సంతాపం తెలిపారు. ఆయన మరణం తీవ్రంగా బాధించిందని, పార్టీకి ఆయన చేసిన సేవలు, విధేయత ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఉమాశంకర్ సింగ్‌ను నిజాయితీ గల, అంకితభావంతో పనిచేసిన పార్టీ నేతగా మాయావతి అభివర్ణించారు. బీఎస్పీ పట్ల ఆయన చూపిన నిబద్ధతను ఎంత ప్రశంసించినా తక్కువేనని పేర్కొన్నారు. చికిత్స సమయంలో ఉమాశంకర్ సింగ్ కుమారుడితో తాను నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు మాయావతి తెలిపారు. ఆయన మరణ వార్తను కూడా కుమారుడి ద్వారానే తెలుసుకున్నానని చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ మొత్తం కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.రాజకీయ ప్రస్థానం.. ఉమాశంకర్ సింగ్ రాజకీయ ప్రస్థానం విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైంది. 1990-91లో బల్లియాలోని సతీష్ చంద్ర కాలేజీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అనంతరం క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2012లో తొలిసారి రస్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం బీఎస్పీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నారు. ఉమాశంకర్ సింగ్ మృతి బీఎస్పీకి రాజకీయంగా పెద్ద లోటుగా మారింది. -
ఏసీపీ ఇంట్లో దొంగలు పడ్డారు.. ఒక్కసారి కాదు..
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని రాజాజీపురంలో ఓ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) నివసిస్తున్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఏసీపీ పై అంతస్తులో ఉంటుండగా, కింది అంతస్తులోని ఇంట్లోకి చొరబడి నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు.పోలీస్ ఔట్‌పోస్ట్‌కు కేవలం 200 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. గత 5 నెలల్లో అదే ఇంట్లో జరిగిన రెండో చోరీ ఇది. ఆదివారం విధులు ముగించుకుని ఏసీపీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.టాకటోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజినీర్ సుధాంశు ఇల్లు ఉంటుంది. ఆయన సోదరుడు ఓ ఐఏఎస్ అధికారి. బజార్ఖాలా ఏసీపీ రంజిత్ కుమార్ సుమారు 20 రోజుల క్రితం తన కుటుంబంతో కలిసి ఆ ఇంటి మొదటి అంతస్తులోకి మారారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏసీపీ కుటుంబ సభ్యులు కొన్ని రోజుల క్రితం తమ స్వగ్రామానికి వెళ్లారు. దీంతో ఇంటికి తాళం వేసి ఉంది. ఆదివారం విధులు ముగించుకుని తిరిగి వచ్చిన రంజిత్ కుమార్ ప్రధాన గది తెరిచి ఉండటం గమనించారు. పరిశీలించగా, దొంగలు కింది అంతస్తులోకి చొరబడి అల్మారా లాకర్‌ను బలవంతంగా తెరిచి నగదు, విలువైన వస్తువులతో పారిపోయినట్లు గుర్తించారు. చోరీకి గురైన వస్తువుల విలువ ఇంకా నిర్ధారణ కాలేదు.ఈ చోరీపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాలు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు ముందు ఆ ప్రాంతంలో కొందరు అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లు సమాచారం.బజార్ఖాలా స్టేషన్ హౌస్ ఆఫీసర్ కుల్దీప్ దుబే మాట్లాడుతూ, చోరీ విషయం ఇంజినీర్ కుటుంబ సభ్యుల నుంచి తమకు తెలిసిందని చెప్పారు. అయితే ఆదివారం సాయంత్రం వరకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని తెలిపారు.తాజా ఘటనతో ఇదే ఇంట్లో గతంలో జరిగిన చోరీ మరోసారి చర్చనీయాంశమైంది. మార్చి 25న దొంగలు ఇంట్లో నుంచి నగలు రూ.50,000 నగదు, ఇతర విలువైన వస్తువులు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ కేసు ఇప్పటికీ ఛేదించలేదు. నిందితులను పోలీసులు ఇంకా గుర్తించలేదు. -
'నా శవాన్ని కూడా నా భార్య తాకడానికి వీల్లేదు'
''నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని కూడా నా భార్య తాకడానికి వీల్లేదు. అంత్యక్రియల కోసం అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయకండి. నా ఆత్మశాంతి కోసం ఎలాంటి మతపరమైన క్రతువులు నిర్వహించవద్దు. ఎందుకంటే నా ఆత్మ శాంతించ ఉండకూడదు. మా అమ్మను జాగ్రత్తగా చూసుకోండి''- అని వాట్సాప్ మెసేస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడో బాడీబిల్డర్.ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్ జిల్లాలో డిగ్రీ కళాశాలలో క్లర్క్‌గా పనిచేస్తున్న 52 ఏళ్ల బాడీబిల్డర్ దేవదత్ శర్మ అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన ఇంట్లో తుపాకీతో కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సర్సావా పోలీస్ స్టేషన్ (Sarsawa police station) పరిధిలోని సలేంపూర్ గ్రామంలో నివసిస్తున్న దేవదత్ శర్మ శనివారం సాయంత్రం తన ఇంటి వెనుక నిర్వహిస్తున్న "రాక్ జిమ్" నుంచి ఇంటికి వచ్చారు. సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తుపాకీ కాల్పుల శబ్దం విని ఆయన భార్య సీమా రాణి అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో దేవదత్‌ను సమీప వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆత్మహత్యకు కొద్దిసేపటి ముందు దేవదత్ శర్మ తన మేనకోడలికి పంపిన వాట్సాప్ సందేశాన్ని కీలక ఆధారంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు, పొరుగువారిని విచారించారు. ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా భావిస్తున్నట్లు సర్కిల్ ఆఫీసర్ పవన్ కుమార్ తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దేవదత్ భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించనున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు, డిజిటల్ ఆధారాలు, వాట్సాప్ సందేశాన్ని పరిశీలించిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కుమార్ చెప్పారు.మేనకోడలికి చివరి సందేశంమరణానికి ముందు దేవదత్ శర్మ తన 21 ఏళ్ల మేనకోడలు నేహా శర్మకు వాట్సాప్‌లో సుదీర్ఘ సందేశం పంపినట్లు పోలీసులు తెలిపారు. అందులో తాను ఎదుర్కొంటున్న అవమానాలను ఇక భరించలేకపోతున్నానని పేర్కొన్నట్లు సమాచారం. ప్రతిరోజూ అవమానాలతో జీవించడం కంటే ఒక్కసారిగా మరణించడం మేలని భావించానని, అయితే తాను పిరికివాడిని కాదని సందేశంలో రాసినట్లు తెలుస్తోంది.తన మరణానంతరం తన భార్య తన మృతదేహాన్ని తాకవద్దని కోరినట్లు సమాచారం. అంత్యక్రియల కోసం ఎక్కువ ఖర్చు చేయవద్దని, పిడకలు (ఆవుపేడతో చేసిన ఇంధనం) ఉపయోగించవద్దని కూడా సూచించినట్లు తెలుస్తోంది. తన ఆత్మశాంతి కోసం ఎలాంటి మతపరమైన క్రతువులు నిర్వహించవద్దని, తన ఆత్మ ప్రశాంతంగా ఉండకూడదని కూడా సందేశంలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. చివరగా తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని మేనకోడలిని కోరినట్లు సమాచారం. ఈ సందేశం ప్రామాణికతను పోలీసులు పరిశీలిస్తున్నారు.రెండు దశాబ్దాలుగా జిమ్ నిర్వహణదేవదత్ శర్మ 2000 సంవత్సరం నుంచి తన ఇంటి వెనుక "రాక్ జిమ్" పేరుతో వ్యాయామశాలను నిర్వహిస్తున్నారు. స్థానికంగా బాడీబిల్డర్‌గా కూడా మంచి గుర్తింపు పొందారు. గత రెండేళ్లుగా బాలాజీ గ్రూప్ ఆఫ్ కాలేజీలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు తిలక్ రామ్ సైనీ గర్ల్స్ కాలేజ్, ఎలం చంద్ సైనీ గర్ల్స్ కాలేజీల్లో కూడా పనిచేశారు.కుటుంబ నేపథ్యందేవదత్ శర్మకు సీమా రాణితో 33 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అభిషేక్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు ఆదిత్య చండీగఢ్‌లో ఫోరెన్సిక్ సైన్స్ చదువుతున్నాడు. దేవదత్ శర్మకు ఒక సోదరి ఉంది. ఆమె కుమార్తె నేహా శర్మకే ఆయన చివరి వాట్సాప్ సందేశం పంపినట్లు తెలిసింది.(ఆత్మహత్య ఎన్నటికీ పరిష్కారం కాదు. మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోండి. మీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు వస్తే, దయచేసి ‘దిశా’ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు: 1056, 0471-2552056) -
మానసిక వైద్యురాలిని కబళించిన డిప్రెషన్!
వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిళ్లు.. కారణాలు ఏవైనా కావొచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడి మనిషిని కుంగదీస్తుంది. అలాంటి సమయంలో సరైన సహాయం, మద్దతు అందకపోతే పరిస్థితులు విషాదకర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అయితే ఇలాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించాల్సిన ఓ వైద్యురాలే.. చివరకు అదే మానసిక ఒత్తిడికి బలికావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఆఫీసర్స్ సిటీ-2 సొసైటీలో నివసిస్తున్న డాక్టర్ హేమికా అగర్వాల్ (40) ఆదివారం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.హేమికా తండ్రి డాక్టర్ ఆర్. చంద్ర కూడా ఘజియాబాద్‌లో ప్రముఖ సైకియాట్రిస్ట్‌గా ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన విడాకుల తర్వాత ఆమె తీవ్ర భావోద్వేగ ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కుమార్తె వివాహ బంధం ముగిసిన తర్వాత మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు.దాని నుంచి బయటపడేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారని.. పేషెంట్లకు చికిత్స కొనసాగిస్తుండడంతో మామూలుగా మారిందని తాము భావించామని చెబుతున్నారాయన. మరోవైపు ఆమె మృతి వార్త స్థానికంగా వైద్య వర్గాల్లో విషాదం నింపింది. పలువురు ఆమె మృతికి సంతాపం తెలుపుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.ఇతరుల మానసిక సమస్యలకు పరిష్కారం చూపే వృత్తిలో ఉన్న ఓ వైద్యురాలే వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒత్తిడితో విషాద నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ బయటపడకపోవడంతో.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
సన్నిహిత సంబంధం కేసు: 6 నెలల పసికందును కాలువలో పడేసి చంపి..
ప్రియుడి మోజులో పడి అతడితో కలిసి వెళ్లిపోయింది ఓ మహిళ. తమకు అడ్డంగా ఉన్నాడని ఆ మహిళ 6 నెలల కుమారుడిని చంపేసి కాలువలో పడేశాడు ఆమె ప్రియుడు. అందుకు ఆ మహిళ కూడా సహకరించింది.ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లోని నౌచండి పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 12న వైశాలి కాలనీ సమీపంలోని కాలువలో లభించిన 6 నెలల శిశువు మృతదేహం గుర్తింపు ఇప్పుడు పూర్తైంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆ చిన్నారి సహారన్పూర్కు చెందిన ఇమ్రాన్, షబానా కుమారుడు సమీర్. ఈ కేసును ఛేదించిన నౌచండి పోలీసులు శిశువు తల్లి షబానా, ఆమె ప్రియుడు విశాల్‌ను అరెస్టు చేశారు.షబానా తన ప్రియుడు విశాల్‌తో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంది. ఇందుకోసం ఆమె చిన్నకుమారుడు సమీర్‌ను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. హాపూర్‌కు చెందిన విశాల్ కూడా మీరట్‌కు చేరుకున్నాడు. ఇద్దరూ ముందే కలిసి జీవించాలనే ప్రణాళిక వేసుకున్నారు. అయితే, సమీర్‌ను తనతో ఉంచుకోవడానికి విశాల్ సిద్ధంగా లేడు.సమీర్‌ను అడ్డంకిగా భావించి తొలగించాలనే కుట్ర పన్నారు. విశాల్ శిశువును తనతో తీసుకెళ్లాడు. తర్వాత అతడు శిశువును హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. జూలై 12న శిశువు మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. అయితే అప్పట్లో ఆ మృతదేహం ఎవరిదో పోలీసులు గుర్తించలేకపోయారు.ఇదిలా ఉండగా, సహారన్‌పూర్‌లోని గంగోహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇమ్రాన్ తన భార్య షబానా, కుమారుడు సమీర్ కనిపించడం లేదని ఫిర్యాదు నమోదు చేశాడు. పోలీసులు షబానాను గుర్తించారు. కానీ ఆమె 6 నెలల కుమారుడు కనిపించలేదు. షబానా కూడా శిశువు గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇదే సమయంలో మీరట్‌లో లభించిన గుర్తు తెలియని మృతదేహం ఫొటోలను సమీప జిల్లాలకు పంపించారు.నౌచండి పోలీసులు శిశువు ఫొటోలను సహారన్పూర్ సహా ఇతర జిల్లాలకు షేర్ చేశారు. జులై 13న ఈ సమాచారం సహారన్పూర్ పోలీసులకు కూడా చేరింది. ఫొటో చూసిన ఇమ్రాన్ మృతదేహం తన కుమారుడు సమీర్దేనని గుర్తించాడు. ఆ తర్వాత మీరట్ పోలీసులు కేసులోని అంశాలను కలిపి శిశువు తల్లి, ఆమె ప్రియుడిపై దృష్టి పెట్టారు.సహారన్పూర్లో నమోదు చేసిన జీరో ఎఫ్ఐఆర్ తర్వాత మీరట్ నౌచండి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఎఫ్ఐఆర్ అందిన తర్వాత నిందితుల వద్దకు చేరుకోవడానికి పోలీసులు బృందాన్ని ఏర్పాటు చేశారు. షబానా, విశాల్‌ను విచారించగా ఇద్దరూ హత్య కుట్ర పన్నిన విషయం, నేరాన్ని అమలు చేసిన విషయాన్ని అంగీకరించారు.ఇమ్రాన్, షబానాకు నలుగురు పిల్లలుఇమ్రాన్, షబానాకు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. షబానా చిన్న పిల్లాడిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. మీరట్ ఎస్పీ సిటీ వినాయక్ గోపాల్ భోస్లే తెలిపిన వివరాల ప్రకారం, జూలై 12న నౌచండి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలువ నుంచి ఒక శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు బృందం ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షకు పంపించింది. సహారన్పూర్ గంగోహ్ పోలీస్ స్టేషన్లో షబానా, ఆమె శిశువు అదృశ్యమైనట్టు కేసు నమోదు అయింది. షబానాను మొదట గుర్తించారు. ఆ తర్వాత శిశువును గుర్తించారు. ఆ తర్వాత గంగోహ్ పోలీస్ స్టేషన్ నుంచి జీరో ఎఫ్ఐఆర్ను నౌచండి పోలీస్ స్టేషన్‌కు పంపించారు. షబానా, హాపూర్‌కు చెందిన విశాల్‌పై ఇమ్రాన్ హత్య ఆరోపణలు చేశాడు. -
వీళ్లు జెన్ జీ కాదు.. జెన్ ఆల్ఫా.. 1,500 మంది ధర్నా
లక్నో: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఆధ్వర్యంలోని జెన్ జీ (1997 - 2012 మధ్య పుట్టినవారు) నిరసన ప్రభావం జెన్ ఆల్ఫా(2013 - 2025 మధ్య పుట్టినవారు)పై కూడా పడింది. ఉత్తరప్రదేశ్‌లో 6 నుంచి 12 తరగతుల వరకు చదువుతున్న 1,500 మందికి పైగా విద్యార్థులు తమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.ఫతేపూర్ జిల్లాలోని సర్వోదయ ఇంటర్ కాలేజీ విద్యార్థులు తమ పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరతపై ధర్నా చేపట్టారు. దీంతో యాజమాన్యం వారి డిమాండ్లలో చాలా వరకు అంగీకరించింది. ఈ నిరసనను సామాజిక మాధ్యమాల్లో “జెన్ ఆల్ఫా నిరసన”గా చర్చించినప్పటికీ, ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆందోళనలో పాల్గొని తిరిగి వచ్చిన కొందరు సీనియర్ విద్యార్థులు దీన్ని ప్రణాళిక చేశారని పాఠశాల అధికారులు అంటున్నారు.నీట్ ప్రశ్నపత్ర లీక్ ఆరోపణలపై జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్న 12వ తరగతి విద్యార్థులు నలుగురు ఈ నిరసనకు నాయకత్వం వహించారు. అక్కడి అనుభవంతో ప్రేరణ పొందిన వారు తాగునీటి కొరత, పారిశుద్ధ్య సమస్యలు, తరగతి గదుల మౌలిక సదుపాయాల లోపం, క్రీడా సదుపాయాల కొరత వంటి దీర్ఘకాల సమస్యలపై తమ పాఠశాలలో ఇదే తరహా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లాల్ బహదూర్ సింగ్ మాట్లాడుతూ.. “నేను పాఠశాలకు చేరుకున్న వెంటనే విద్యార్థులు తరగతులకు వెళ్లకుండా ధర్నా చేపట్టారని ఉపాధ్యాయులు చెప్పారు. ఆ సమయంలో ఆందోళనకు నాయకత్వం వహించిన అంకూర్ సోన్కర్ ఇటీవల జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్న విషయం నాకు తెలియదు. తర్వాత అతడు అక్కడ ఉన్న వీడియోలు చూశాను. చిన్న పిల్లలు ఇలాంటి నిరసనలకు దూరంగా ఉండాలని చెప్పాం. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. అయినా వారిని ఒప్పించడానికి 6 గంటలు పట్టింది” అని ఆయన చెప్పారు.అంకూర్ మాట్లాడుతూ.. ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తనపై గాఢ ప్రభావం చూపారని తెలిపారు. జంతర్ మంతర్ నిరసన సమయంలో రికార్డు చేసిన వీడియోల్లో “సోనమ్ సర్‌కు మద్దతు ఇవ్వండి. మంచి వ్యక్తులకు మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరికిస్తాం? మీ హక్కుల కోసం పోరాడండి” అని యువతకు పిలుపునిచ్చారు.అంకూర్ తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థులు ఆర్వో వ్యవస్థతో స్వచ్ఛమైన తాగునీరు, కొత్త మరుగుదొడ్లు, ప్రతి తరగతి గదిలో 4 ఫ్యాన్లు, మెరుగైన క్రీడా సదుపాయాలు, మౌలిక వసతుల అభివృద్ధి కోరారు. నిరసన అనంతరం యాజమాన్యం డిమాండ్లను అంగీకరించడంతో ఆందోళన విరమించారు.6 గంటల ధర్నా, చేతుల్లో అంబేడ్కర్ చిత్రపటాలుఉదయం 7.30 గంటల సమయంలో 6 నుంచి 12 తరగతుల వరకు చదువుతున్న 1,500 మందికి పైగా విద్యార్థులు అంబేడ్కర్ చిత్రాలు, ప్లకార్డులు పట్టుకుని పాఠశాల ప్రాంగణంలో గుమికూడటంతో నిరసన ప్రారంభమైందని తెలిసింది. విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, తరగతి గదుల సదుపాయాల లోపం చాలా కాలంగా ఉందని, వాటి వల్ల చదువులకు ఇబ్బంది కలుగుతోందని విద్యార్థులు ఆరోపించారు. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆరోపించారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.జెన్ ఆల్ఫా నిరసన వార్త వ్యాపించడంతో పాఠశాల అధికారులు, స్థానిక పోలీసులు విద్యార్థులను తరగతులకు పంపేందుకు ప్రయత్నించారు. అయితే జిల్లా ఉన్నతాధికారులు పాఠశాలకు వచ్చే వరకు నిరసన విరమించబోమని విద్యార్థులు స్పష్టం చేశారు.జిల్లా పాఠశాలల పరిశీలకుడు రాకేష్ కుమార్, నాయబ్ తహసీల్దార్ నితిన్ కుమార్ తదితర అధికారులు క్యాంపస్‌కు చేరుకుని 8 మంది విద్యార్థుల ప్రతినిధి బృందంతో చర్చించారు. సమావేశం అనంతరం విద్యార్థుల 8 డిమాండ్లలో 7 డిమాండ్లను లిఖితపూర్వకంగా అంగీకరించారు. దీంతో మధ్యాహ్నం తర్వాత నిరసన ముగిసింది.ప్రతి తరగతి గదిలో 4 ఫ్యాన్లు ఏర్పాటు చేస్తామని, విద్యుత్ వైరింగ్ మరమ్మతులు చేపడతామని, సురక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మరుగుదొడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయిస్తామని, క్రీడా మైదానాన్ని నిర్వహిస్తామని, మధ్యాహ్న భోజన నాణ్యత, పరిమాణం మెరుగుపరుస్తామని, ఫర్నిచర్ తక్కువగా ఉన్న తరగతి గదుల్లో అదనపు బెంచీలు నెలరోజుల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.సైన్స్ విభాగం ప్రారంభించాలన్న ఒక్క డిమాండ్ మాత్రమే వెంటనే అంగీకరించలేదు. దానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదన పంపాలని పాఠశాలకు సూచించారు.జిల్లా పాఠశాలల పరిశీలకుడు రాకేశ్ కుమార్ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల లోపంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశించినట్లు చెప్పారు.నిరసనకు ప్రధాన కారణం ఏమిటి?ఓ విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం తరగతి గదిలో ఫ్యాన్లు పనిచేయడం లేదని ఫిర్యాదు చేసిన కొందరు బాలికలతో ఓ ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించిన ఘటనే నిరసనకు కారణమైంది. “బాలికలు ఫిర్యాదు చేయగా, ‘నువ్వు కూర్చో, నిశ్శబ్దంగా ఉండు’ అని ఉపాధ్యాయుడు అన్నాడు. ఆ తర్వాత మరికొందరు బాలికలు కలిసి జరిగిన విషయం బాలురకు చెప్పారు. కొందరు విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడి వద్ద ఫిర్యాదు చేశారు. కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదని వారు భావించారు” అని ఆ విద్యార్థి తెలిపాడు. -
అది ఉత్తుత్తి పెళ్లి...
అమ్రోహా: ఒకే వ్యక్తిని ముగ్గురు పెళ్లాడిన వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, దీనిపై ఆన్లైన్లో పెద్ద దుమారమే చెలరేగింది. స్పందించిన యూపీ మహిళా సంక్షేమ కమిటీ(సీడబ్ల్యూసీ) అధికారులు ఆ ముగ్గురినీ సోమవారం పిలిపించారు. విచారణలో వారు చెప్పిన విషయాలను విని అధికారులు నోరెళ్లబెట్టారు. అదంతా వైరలయ్యేందుకు తీసుకున్న వీడియో మాత్రమేనని వారు అసలు విషయం వెల్లడించారు. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు తీసిన ప్రాంక్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. అయితే, తమపై ఆన్లైన్ ట్రోలింగ్ ఘోరంగా ఉందని వాపోయారు. అది నిజంగా పెళ్లేనంటూ అబద్ధం చెప్పినందుకు పశ్చాత్తాప పడుతున్నారు. ఇకనైనా వేధింపులను ఆపాలని వారు వేడుకున్నారు.ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు వీడియోలో కనిపించిన ముగ్గురిలో ఒకరు మైనర్ అంటూ తమకు మూడు రోజుల క్రితం అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు సీడబ్ల్యూసీ చైర్మన్ అతులేశ్ కుమార్ భరద్వాజ్ వివరించారు. ముగ్గురి నుంచి వాంగ్మూలాలను సేకరించామని, వీరిలో ఒకరు మైనర్ అని రూఢీ అయ్యిందని చెప్పారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామన్నారు. యూపీలోని అమ్రోహా జిల్లా ధోరియా గ్రామానికి చెందిన దేవిక, ఛావి అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు, వారి బంధువు మెహర్పూర్కు చెందిన ఆల్కా కలిసి శ్యాంపురి గ్రామానికి చెందిన వికాస్ అలియాస్ విక్కును హసన్‌పూర్‌లోని చాముండ ఆలయంలో వివాహమాడినట్లు ఆన్లైన్లో వీడియో ప్రత్యక్షమైంది.వీరు నలుగురూ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, ఆన్లైన్లో బాగా ఫాలోయింగ్ ఉన్న వాళ్లు. ఆరు నెలలుగా వికాస్ ముగ్గురికీ భర్తగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నాడు. అయితే, ముగ్గురు యువతులు ఒక్కరినే వివాహమాడటం సనాతన ధర్మానికి విరుద్ధమంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, తాము మైనర్లమనీ, ఇష్టం వచ్చిన వారిని పెళ్లాడే హక్కు తమకుందని, పురాణాల్లోనూ ఇలాంటి ఉదాహరణలున్నాయంటూ వారు మొదట్లో కొట్టిపారేశారు.అదేవిధంగా, ముగ్గురు యువతులు, ఒక యువకుడి పెళ్లి తాను జరిపించలేదని చాముండ ఆలయ పూజారి స్పష్టం చేస్తున్నారు. వివాదాస్పద వీడియోలో ఉన్న ఆ నలుగురినీ ఈ నెల 23వ తేదీన పిలిపించి, వారి వయస్సును నిర్ధారించే పత్రాలను సమరి్పంచాలని, లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని కోరామని హసన్పూర్ సీనియర్ ఎస్సై అమిత్ కుమార్ తెలిపారు. అయితే, వారింకా వాటిని ఇవ్వలేదన్నారు. -
బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌పై కాల్చి వాతలు, స్కూల్ టీచర్ ఘాతుకం..!
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. నర్సరీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారి పట్ల ఉపాధ్యాయురాలు అత్యంత దారుణంగా ప్రవర్తించిన ఘటన దిగ్భ్రాంతి రేపింది. వాష్‌రూమ్‌కు వెళ్లనివ్వకపోవడంతో, ఆ బాలుడు యూరిన్ పాస్ చేశాడు. దీంతో బాలుడి ప్రైవేట్ భాగాలపై చాకు కాల్చివాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన తీవ్ర విమర్శలకు తావిచ్చింది.బాలుడు తండ్రి కేసరి కుమార్ తన కుమారుడికి జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం వారణాసిలోని పాండేపూర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. నర్సరీ చదువుతున్నబాధిత బాలుడు టాయిలెట్‌కి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ఉపాధ్యాయురాలు ప్రీతి కుష్వాహాను కోరాడు. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు. దీంతో బాలుడు ప్యాంట్‌లోనే మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీచర్, చిన్నారిని వేరే గదిలోకి తీసుకెళ్లి, చాకును వేడి చేసి ప్రైవేట్ భాగాలపై కాల్చి వాతలు పెట్టింది. అంతేకాకుండా బాలుడిని తీవ్రంగా కొట్టి, మళ్లీ ఈ తప్పు చేయవద్దని బెదిరించింది.ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసిందిబాధతో ఇంటికి తిరిగొచ్చిన బాలుడు జరిగిన ఉదంతాన్ని తల్లిదండ్రులకు వివరించడంతో వారు షాకయ్యారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు. టీచర్ దుర్మార్గాన్ని ప్రశ్నించిన తమపై స్కూల్ యాజమాన్యం బెదిరిస్తోందని కుటుంబ సభ్యులు మీడియా ముందు వాపోయారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు టీచర్, ప్రిన్సిపాల్, పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపు తున్నారు.ఇదీ చదవండి: ఇండిగో విమానంలో పొగలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ Deeply shocked by the horrifying incident in Varanasi, where a 5-year-old was brutally tortured by a teacher. Cruelty against children is unacceptable. I demand swift & strict legal action against the teacher & school admin. Zero tolerance for abuse! #Varanasi pic.twitter.com/mnOd0UOk3S— Rais Shaikh (@rais_shk) July 27, 2026అఖిలేష్ యాదవ్ స్పందనఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత తీవ్రమైన దారుణమైన ఘటన అన్నారు. దీనివల్ల ఆ చిన్నారిపై జీవితాంతం కోలుకోలేని మానసిక ప్రశాంతత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలతో సానుభూతి, మానవత్వంతో ఎలా ప్రవర్తించాలో ఉపాధ్యాయులకు కనీస అవగాహన ఉండాలి. ఈ ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
టైగర్ రిజర్వులో తీవ్రగాయాలతో పులి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్ ,షాజహాన్‌పూర్ జిల్లాలపిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో తీవ్రంగా గాయపడిన ఐదేళ్ల పులి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ వివరాలని టైగర్ రిజర్వ్‌లోని అటవీ శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.పీటీఆర్ డిప్యూటీ డైరెక్టర్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) మనీష్ సింగ్ మాట్లాడుతూ.. శనివారం రాత్రి పులి మృతి చెందిందని తెలిసింది. దానిని పోస్ట్ మార్టం నివేదిక కోసం మృతదేహాన్ని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపాం. మరణానికి గల అసలు కారణం పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాతే నిర్ధారించబడుతుంది" అని అన్నారు.ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం మరో పులితో జరిగిన భూభాగ వివాదం బెబ్బులి గాయపడి ఉండవచ్చని తెలిపారు. గత శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అటవీశాఖ అధికారులు రొటీన్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ పులి గాయపడినట్లు గుర్తించారు. ఈ జంతువుకు చికిత్స చేయడానికి దక్ష గంగ్వార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన పశువైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే వైద్యులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ పులిప్రాణాలు దక్కలేదని తెలిపారు. -
బాయ్‌ఫ్రెండ్‌ని కట్టేసి, నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ ప్రాంతంలో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన 20 ఏళ్ల నీట్ (NEET) విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. దిగ్భ్రాంతి రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన 20 ఏళ్ల యువతి రాజస్థాన్‌లోని కోటాలో ఉంటూ నీట్ (NEET) పరీక్షకు సన్నద్ధమవుతోంది. ఆమె కొద్ది రోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చింది. ఆమె సోషల్ మీడియా ద్వారా పరిచయమైన 17 ఏళ్ల మైనర్ ఫ్రెండ్‌ను కలవడానికి చిత్రకూట్‌కు వచ్చింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వారు బైక్‌పై దేవాంగన లోయ వద్ద ఉన్న గుట్టపైకి వెళ్లారు. ఇది గమనించిన కొంతమంది దుండగులు నకిలీ అధికారులు అవతారం ఎత్తారు. వీరిద్దరూ సోషల్ మీడియా రీల్స్ చేసుకుంటుండగా, ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అక్కడికి వచ్చారు. తాము అటవీ శాఖ అధికారులమని చెప్పి బెదిరించారు. అబ్బాయిపై బెల్టుతో తీవ్రంగా కొట్టి, అతడి చేతులు, కాళ్లను బంధించారు. ఆ తర్వాత యువతిని బలవంతంగా సమీపంలో ఉన్న పొదల్లోకి ఈడ్చుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అరిస్తే గుట్టపై నుంచి కిందకు తోసేస్తామని బెదిరించారు. అనంతరం అక్కడినుంచి ఉడాయించారు. చివరికి అబ్బాయి ఎలాగో తప్పించుకొని పోలీసు అత్యవసర హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు.ఇదీ చదవండి: ఐఫోన్ రాలేదు, ఆయిల్ వచ్చింది.. కట్ చేస్తే రూ. 1.81 లక్షసంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించగా, గాయపడిన అబ్బాయికి ప్రాథమిక చికిత్స అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. సిసిటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగాఅనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రయాగ్‌రాజ్ జోన్ అడిషనల్ డీజీ జ్యోతి నారాయణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని ఆదేశించారు.ఇదీ చదవండి: 150 పిజ్జాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్‌లో మానవత్వపు పరిమళాలు -
రాజుల కాలం కాదు.. ముగ్గురంటే ఎలా బాసూ!
“భయ్యా.. పెళ్లి చేసుకున్నావా?”“అవును..”“కంగ్రాట్స్.. సంతోషంగా ఉన్నావా?”“అదే అర్థం కావడం లేదు బాబూ.. సంతోషమో.. సవాలో!”“అదేందన్నా.. ఎందుకలా అంటున్నావ్?”“ఒక్కరిని మెప్పించడమే కష్టంగా ఉంటుంది కదా.. అలాంటిది ముగ్గురి మనసులు గెలవాలంటే రోజులో 24 గంటలు సరిపోతాయా చెప్పు!”ఇది ఏదో సినిమా కథ కాదు.. ఉత్తరప్రదేశ్‌లో వైరల్‌గా మారిన ఓ పెళ్లి కథ. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పరిచయమైన ఓ యువకుడు.. ఆ పరిచయమే చివరకు పెళ్లి బంధంగా మారిందని చెబుతున్న ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఈ పెళ్లి నిజమేనా? చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. View this post on Instagram A post shared by Rajput girl (@ak_rajput9990)కెమెరామెన్ నుంచి భర్త వరకు..ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన సరోజ్, సావిత్రి, సంతోష్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లుగా పనిచేస్తున్నారు. వారి వీడియోలకు కెమెరామెన్‌గా పనిచేసిన వికాస్ అలియాస్ విక్కుతో పరిచయం ఏర్పడింది. మొదట రీల్స్‌లో భర్త పాత్ర పోషించిన వికాస్.. చివరకు నిజ జీవితంలోనే వారి జీవిత భాగస్వామిగా మారాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. మొదట అంతా ఇదేదో సోషల్ మీడియా స్టంట్ అనుకున్నారు. కానీ ముగ్గురు సోదరీమణులు స్వయంగా స్పందిస్తూ.. “ఇది నిజమైన పెళ్లి. మా ఇష్టంతో తీసుకున్న నిర్ణయం” అని తెలిపారు.విడిపోవడం ఎందుకని..ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇద్దరు సొంత రక్తం. మరొకరు.. ఆ ఇంట్లోనే పెరిగారు. చిన్నప్పటి నుంచి ముగ్గురం కలిసే పెరిగామని చెబుతున్నారు. వేర్వేరు కుటుంబాల్లోకి వెళ్లిపోవడం ఇష్టం లేకే ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నామని వెల్లడించారు. “మేమంతా పెద్దవాళ్లమే. మా జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు మాకు ఉంది” అంటూ వారు స్పష్టం చేశారు. వికాస్ కూడా వారి నిర్ణయానికి అంగీకరించాడని, అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వివాహం జరిగిందని తెలిపారు. సరే.. మనసులు కలిశాయి.. మరి చట్టం?ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. “ప్రేమకు హద్దులు ఉండవు” అని వారు చెబుతున్నా.. చట్టానికి మాత్రం కొన్ని పరిమితులు ఉంటాయి. భారతీయ చట్టాల ప్రకారం హిందూ వివాహ చట్టం ఒక వ్యక్తికి ఒకేసారి ఒక భార్య ఉండే విధానాన్ని గుర్తిస్తుంది. అంటే.. ఇలాంటి వివాహం చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా? అధికారికంగా నమోదు జరిగిందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కూడా వివరాలు సేకరిస్తున్నారు. View this post on Instagram A post shared by Rajput girl (@ak_rajput9990)“రాజుల కాలం వేరు.. ఇప్పటి చట్టాలు వేరు”ఈ పెళ్లిపై ప్రశ్నలు రావడంతో ముగ్గురు సోదరీమణులు పాతకాలపు ఉదాహరణలు చెబుతున్నారు. రాజులకు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారని పేర్కొంటున్నారు. కానీ న్యాయ నిపుణుల ప్రకారం.. చారిత్రక ఆచారాలు, ప్రస్తుత చట్టాలు ఒకేలా ఉండవు.రీల్ లైఫ్ బాగుంది.. రియల్ లైఫ్ ఎలా?సోషల్ మీడియాలో ఓ వీడియోకు లక్షల వ్యూస్ రావచ్చు. కానీ నిజ జీవితంలో ఒక బంధాన్ని కొనసాగించాలంటే ప్రేమతో పాటు బాధ్యత, అవగాహన కూడా అవసరం. ఇప్పటివరకు ఈ కథలో అందరి మాట ఒక్కటే.. “మేము సంతోషంగా ఉన్నాం. సోషల్ మీడియా ఆదాయంతో కుటుంబాన్ని నడిపిస్తున్నాం. మొగుడి పేరిట కాస్త భూమి ఉంది” అని. కానీ అసలు పరీక్ష మాత్రం ముందుంది. రీల్లో కలిసి కనిపించడం సులువు.. రియల్ లైఫ్‌లో కలిసి నడవడమే అసలు సవాల్!. -
ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ట్విస్ట్ ఏంటంటే?
మీరట్ : ఒకే వ్యక్తిని ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లు వివాహం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీనిపై మద్దతు, వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ధౌరియా గ్రామానికి చెందిన సరోజ్ (20), సావిత్రి (19), సంతోష్ (18) సొంత అక్కాచెల్లెళ్లు. వీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా వీడియోలు రూపొందిస్తూ ఆదాయం పొందుతున్నారు. శ్యామ్‌పురి గ్రామానికి చెందిన వికాస్ అలియాస్ విక్కుతో జూలై 17న ఆలయంలో వివాహం చేసుకున్నట్లు వారు ప్రకటించారు. ఆ వికాస్ ఎవరో కాదు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లుగా పనిచేస్తున్న ముగ్గురు అక్కా చెల్లెళ్లకు వికాస్ కెమెరా మెన్‌గా, కంటెంట్‌గా అనుగుణంగా భర్తగా నటించాడు. ఇప్పుడు ఆ రీల్ భర్తే.. రియల్ భర్తయ్యాడు. వివాహం అనంతరం విడుదల చేసిన వీడియోలో, చిన్నప్పటి నుంచి తాము ఎప్పుడూ కలిసి పెరిగామని, భవిష్యత్తులో కూడా విడిపోవాలని కోరుకోవడం లేదని అక్కాచెల్లెళ్లు తెలిపారు. కుటుంబ సభ్యులు వేర్వేరుగా పెళ్లిళ్లు చేయాలని ప్రయత్నించడంతో, విడిపోవడం కంటే ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.వికాస్ కూడా వారి పరిస్థితిని అర్థం చేసుకుని, వారిని విడదీయకుండా కలిసి ఉండేలా ఈ వివాహానికి అంగీకరించినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం అతను తన అత్తగారి ఇంట్లోనే నివసిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వివాహంపై స్థానిక హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సనాతన సంప్రదాయాలకు, సామాజిక కట్టుబాట్లకు ఇది విరుద్ధమని పేర్కొంటూ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని కోరాయి.ఇదిలా ఉండగా, వివాహం జరిగినట్లు ప్రచారం జరుగుతున్న చాముండ మాత ఆలయ నిర్వహణ మాత్రం ఆ సమయంలో ఆలయంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయని, అక్కడ ఎలాంటి పూజారి లేరని స్పష్టం చేసింది.వివాదం నేపథ్యంలో స్పందించిన ముగ్గురు సోదరీమణులు మరో వీడియో విడుదల చేశారు. మేము ఏ తప్పూ చేయలేదు. ఇది ప్రేమతో తీసుకున్న నిర్ణయం. మేమంతా పెద్దవాళ్లమే. మేము సంతోషంగా ఉన్నప్పుడు ఇతరులకు సమస్య ఏమిటి? అని ప్రశ్నించారు. అలాగే, పూర్వకాలంలో రాజులకు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. అప్పుడు అది తప్పుగా పరిగణించలేదే, ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?.అని వ్యాఖ్యానించారు.ఈ ఘటనపై పోలీసులు కూడా సమాచారం అందుకున్నట్లు హసన్పూర్ కొత్వాలి ఇన్చార్జ్ రాజేష్ కుమార్ తివారీ తెలిపారు. అయితే ఈ వివాహానికి సంబంధించిన చట్టపరమైన అంశాలు, అధికారిక నమోదు వంటి విషయాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. -
వావ్.. ఇలాంటి భర్త ప్రతి అమ్మాయికీ దొరకాలి..
బిడ్డ పుట్టడం తల్లికే కాదు, తండ్రికీ ఎంతో ప్రత్యేకమైన క్షణం. ఇది జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభవాల్లో ఒకటి. అయితే ప్రసవ ప్రక్రియ తల్లికి ఎంతో బాధాకరమైనది. ఆ బాధను శరీరంలో ఎన్నో ఎముకలు విరిగిన నొప్పితో పోలుస్తుంటారు. కానీ ప్రేమగా చూసుకునే జీవిత భాగస్వామి ఉంటే ఆ బాధ కూడా తక్కువగా అనిపిస్తుంది. అలాంటి దృశ్యమే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ప్రసూతి వార్డులో కనిపించింది. నవజాత శిశువును చూడకముందే, ప్రసవ వేదనను భరించిన తన భార్య వద్దకు ఓ భర్త పరుగెత్తి వెళ్లాడు.ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ప్రసూతి, స్త్రీరోగ నిపుణురాలు డాక్టర్ ఉమ్ముల్ ఖైర్ ఫాతిమా తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. వీడియోలో డాక్టర్ నవజాత శిశువును చేతుల్లో పట్టుకుని భర్తను గదిలోకి పిలిచారు. సాధారణంగా తండ్రి ముందుగా బిడ్డను ఎత్తుకుంటాడని అందరూ భావిస్తారు. కానీ ఈ వీడియోలో భిన్నంగా జరిగింది.గదిలోకి వచ్చిన ఆ వ్యక్తి, ఆ శిశువును పట్టించుకోకుండా నేరుగా తన భార్య వద్దకు వెళ్లాడు. బిడ్డ గది ప్రవేశద్వారం దగ్గరే ఉన్నా, అతను ముందుగా భార్యను గట్టిగా కౌగిలించుకుని చెంపపై ముద్దు పెట్టాడు. ప్రసవ వేదన నుంచి బయటపడిన ఆమె భావోద్వేగానికి గురైంది. ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత ఆ వ్యక్తి డాక్టర్‌కు ధన్యవాదాలు తెలిపి, తన భార్యతో కలిసి బిడ్డను ప్రేమగా చూసుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఆ అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు, షేర్లు వచ్చాయి. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "దేవుడా... ఇలాంటి జీవిత భాగస్వామి అందరికీ దొరకాలి" అని పేర్కొన్నాడు. Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి Ummul Khair Fatma (@drnaazfatima) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది -
ఎవరీ డాక్టర్ దీప్తి శర్మ? వైద్య విద్యలో ఏకంగా 19 పతకాలు..
గోల్డె మెడలిస్ట్ గురించి విని ఉంటారు గానీ ఏకంగా ఇన్ని గోల్డ్ మెడల్స్ సాధించిన వాళ్లను ఉండరు. అత్యంత అరుదు. అలాంటి అరుదైన ఘనతను సాధించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ డాక్టర్. వైద్య విద్యలోనే ఇన్ని పతకాలు సాధించడం విశేషం. డాక్టర్ కావాలన్న చిన్న నాటి కోరికను సాకారం చేసుకోవడమే కాదు..వైద్య విద్యను అభ్యసిస్తున్న కాలేజీకే గర్వకారణంగా నిలిచేలా ప్రతిభను చాటుకుని ప్రశంసలందుకుంటోందామె.ఆ అమ్మాయే ఉత్తరప్రదేశ్‌లోని మజఫర్పూర్కు చెందిన రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి కుమార్తె దీప్తి శర్మ. ఇటీవలే కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) నుంచి వైద్య విద్యను పూర్తి చేసిన యువ పట్టభద్రురాలు. ఆ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఇతర ప్రముఖుల సమక్షంలో మొత్తం 19 మెడల్స్ అందుకుంది. ఇన్ని పతకాలు ఆమెనే ఎలా వరించాయంటే..ఎంబీబీఎస్ ఫైనల్ ప్రొఫెషనల్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించినందుకు ప్రతిష్టాత్మకమైన హెవెట్ గోల్డ్ మెడల్, అన్ని ఎంబీబీఎస్ ప్రొఫెషనల్ పరీక్షలలో అత్యధిక మొత్తం మార్కులు సాధించినందుకు ఛాన్సలర్ గోల్డ్ మెడల్, అన్ని MBBS పరీక్షలలో అత్యధిక సంఖ్యలో గౌరవాలు, సర్టిఫికేట్లు పొందినందుకు యూనివర్సిటీ ఆనర్స్ గోల్డ్ మెడల్‌తో సహా మొత్తం 19 పతకాలను సాధించింది. వాటిలో 11 బంగారు పతకాలే.అంతేగాదు విశ్వవిద్యాలయ చరిత్రలోఆ పతకాలలో హెవెట్ గోల్డ్ మెడల్, ఛాన్సలర్ గోల్డ్ మెడల్ రెండింటిని గెలుపొందిన ఏడవ విద్యార్థిగా నిలవడం విశేషం. ఈ మేరకు దీప్తి మాట్లాడుతూ..గడిపిన ప్రత గంట కష్టానికి దక్కిన ప్రతిఫలంగా పేర్కొందామె. ఇన్ని పతకాలు గెలుపొందడం కన్నా.. పేరెంట్స్ పొందుతున్న సంతోషమే తనని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పింది. తన వైద్య విద్య ప్రారంభమైన రోజులను గుర్తు చేసుకుంటూ..2021లో సరిగ్గా మహమ్మారి సమయంలో ఇంటర్ నీట్ రెండిటినీ పూర్తి చేశాను. నీట్లో తొలిప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి కేజీఎంయూ (KGMU)లో సీటు సంపాదించడం ఒక కల నిజమైనట్లుగా ఎంత సంబరపడ్డానో మర్చిపోనంటోందామె. ఆ సమయంలో తన పేరెంట్స్ ఎలా సంబరాలు చేసుకున్నారో మర్చిపోనని భావోద్వేగంగా చెబుతోంది. ఇంటర్న్‌గా చేస్తున్నప్పుడూ.. తన దృష్టిని పాఠ్యపుస్తకాల నుంచి రోగుల సంరక్షణ వైపుకి ఎలా మళ్లించిదో కూడా వెల్లడించింది. ఈ ప్రశంసలన్నీ తన కెరీర్‌కు ఒక నాంది మాత్రమేనని అంటోందామె. అవార్డులు, సర్టిఫికెట్లు కేవలం ఒక ఆరంభం మాత్రమేన అనడానికి ఇదొక నిదర్శనం అని అంటోంది. ఒక ఇంటర్న్‌గా రోజుల రోగులను కలుస్తాను, వాళ్లు తమ డాక్టర్ని చూసినప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించే ఆశ అనే మెరుపు ఆ అంచనాలకు అనుగుణంగా జీవించడంపై ఫోకస్ పెట్టేలా చేస్తుందని చెబుతోంది. వాళ్లు నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేసేలా స్వస్థత చేకూరేలా చేయడం తన కర్తవ్యమని అంటోంది. అంతేగాదు గందరగోళం కన్నా..స్థిరత్వమే మేలు అని నొక్కి చెబుతోంది. ఏం చదివినా..పూర్తి ఏకాగ్రతతో చదవడం,పునశ్చరణే అత్యంత కీలకం అని చెబుతోంది. కేవల మనం వేసుకున్న ప్లాన్‌ని విజయవంతం చేయడం కోసమే ఆందోళన పడండి తప్ప..ఇంకేం అవసరం లేదని అంటోంది. అదనపు ఒత్తిడిని నివారించి, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటే..ప్రతిదీ దానంతట అదే సర్దుకుంటుందని చెబుతోందామె. భవిష్యత్తులో పునశ్చరణే కీలకం! మాస్టర్స్ డిగ్రీని అభ్యసించినా, సొంత క్లినిక్‌ను ప్రారంభించినా, లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవను కొనసాగించినా, ఒక విషయం మాత్రం నిశ్చయం..అది ఆమె ఇప్పుడే వైద్య ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న వైద్యురాలు అనేది. View this post on Instagram A post shared by Dr. Deepti Sharma (@deepti._bhardwaj) (చదవండి: భర్త డ్రీమ్ కోసం..పేరెంటింగ్ బాధ్యతలన్నీ ఆమెపైనే! పోస్ట్ వైరల్) -
క్షమించండి నాన్నా, ప్రభుత్వోద్యోగం కోసం 50 సార్లు ప్రయత్నించా..!
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 23 ఏళ్ల బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపో యినందుకు తండ్రికి క్షమాపణలు చెబుతూ సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. మృతుడు ఆనంద్ కుమార్ కాన్పూర్‌లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ‘ప్రణవీర్ సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు. 2024లో టాపర్‌గా నిలిచాడు. ఉత్తరప్రదేశ్‌లో మూడో ర్యాంకును సాధించాడు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు. తండ్రి రాజ్‌కుమార్ రిటైర్డ్ ఉద్యోగి. పెద్ద కొడుకు వివాహ సంబంధం కోసం కుటుంబమంతా బీహార్‌లోని తమ స్వగ్రామానికి వెళ్లింది. ఆ సమయంలో గోవింద్‌నగర్‌లోని మూడంతస్తుల ఇంట్లో ఆనంద్ ఉరివేసుకు కున్నాడు. ఉదయం వచ్చిన పనిమనిషి తలుపు తట్టినప్పటికీ అతను స్పందించకపోవడంతో ఇరుగుపొరుగుకు తెలిపింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపుతెరిచి చూడగా యువకుడి మృతదేహం లభ్యమైంది. చేతిరాతతో ఉన్న ఐదు లైన్ల నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘క్షమించండి నాన్నా, ప్రభుత్వ ఉద్యోగం కోసం దాదాపు 50 సార్లు ప్రయత్నించాను. కానీ విజయం సాధించలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి’ అని ఆంగ్లంలో రాసి ఉంది. గ్రాడ్యుయేషన్ తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ముందు అతను ‘పవర్ గ్రిడ్’లో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్‌షిప్ పూర్తి చేశాడని అతని తండ్రి రాజ్‌కుమార్ తెలిపారు. రైల్వేలు, ఎస్ఎస్సి (స్టాఫ్ సెలక్షన్ కమిషన్), బ్యాంకులు, విద్యా శాఖ నిర్వహించిన నియామక పరీక్షలకు హాజరయ్యాడు. విజయం సాధించలేకపోయాడు. కొన్ని నెలలుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆనంద్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. -
50 సార్లు ట్రై చేశా డాడీ : బీటెక్‌లో గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. బీటెక్ (BTech) లో గోల్డ్ మెడల్ సాధించి, గవర్నర్ చేతుల మీదుగా మెడల్ అందుకున్న 23 ఏళ్ల యువకుడు, ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే తీవ్ర మనస్తాపంతో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఆనంద్ కుమార్ ఆనంద్ కాన్పూర్‌లోని 'ప్రాణ్‌వీర్ సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (PSIT) లో 2024లో బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) పూర్తి చేసి కాలేజ్ టాపర్‌గా నిలిచాడు. రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంక్ సాధించాడు. కాలేజ్ ఫంక్షన్లో యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నాడు. చదువు పూర్తయ్యాక 'పవర్ గ్రిడ్' సంస్థలో ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి, ఆపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం ప్రారంభించాడు. కానీ ప్రతీసారి వైఫల్యం వెక్కింరించడంతో తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదీ చదవండి: 400 ఏళ్ల నాటి ఆలయంలో బర్త్‌డే ప్రత్యేక పూజలు చేసిన నటిఆనంద్ అన్నయ్య పెళ్లి సంబంధం మాట్లాడటానికి కుటుంబ సభ్యులంతా బీహార్‌లోని తమ సొంతూరికి వెళ్లారు. కాన్పూర్‌లోని గోవింద్ నగర్లో ఉన్న మూడంతస్తుల ఇంట్లో ఆనంద్ ఒంటరిగా ఉన్నాడు. ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో, ఇంట్లో పనిచేసే వ్యక్తి పొరుగువారికి, పోలీసులకు సమాచారం అందించాడు. లోపలికి వెళ్లి చూడగా ఆనంద్ తన గదిలో ఉరివేసుకుని కనిపించాడు.ఆత్మహత్య లేఖ పోలీసులు ఘటనా స్థలం నుండి ఐదు లైన్ల చేతిరాతతో ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన తండ్రికి క్షమాపణలు చెబుతూ ఇలా రాశాడు: "సారీ పాపా.. నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి దాదాపు 50 సార్లు ప్రయత్నించాను, కానీ విజయం సాధించలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి."ఇదీ చదవండి: 800 మందికి శాంసంగ్ ఝలక్ : కారణం ఇదే!రైల్వేస్, ఎస్ఎస్సి (SSC), బ్యాంకులు, విద్యాశాఖ నిర్వహించిన పలు రిక్రూట్మెంట్ పరీక్షలు రాసినప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో ఆనంద్ గత కొన్ని నెలలుగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనట్లు అతని తండ్రి రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది -
రీల్స్ రచ్చ.. యోగి సర్కార్‌కు అగ్నిపరీక్ష!?
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ బరిలోకి దిగుతున్నారు. 2017లో తొలిసారి అధికారాన్ని చేపట్టిన బీజేపీ.. 2022లోనూ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుని యోగి నాయకత్వానికి ప్రజా మద్దతు ఉందని నిరూపించింది. ఇప్పుడు 2027లోనూ అదే విజయ పరంపర కొనసాగించాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అయితే ఎన్నికల ముంగిట సోషల్ మీడియా ప్రచారాలు కొత్త రాజకీయ చిక్కులను తెచ్చిపెడుతున్నాయి.రామ మందిరం.. అయోధ్య.. హిందుత్వం.. ఇవన్నీ బీజేపీ రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకమైన అంశాలు. అలాంటి అయోధ్యలోనే భక్తులు ఇచ్చిన విరాళాలపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. గతంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ వివాదం.. ఇప్పుడు రీల్స్, వీడియోల రూపంలో గ్రామీణ ప్రాంతాలకూ చేరుతోంది.అయితే ఈ చర్చ యోగి ప్రభుత్వంపై నేరుగా ప్రభావం చూపుతుందా? లేదంటే ఇది కేవలం ఆలయ ట్రస్ట్ నిర్వహణకు సంబంధించిన అంశంగానే మిగిలిపోతుందా? అన్నది ఇప్పుడు యూపీ రాజకీయాల్లో ఆసక్తికర ప్రశ్నగా మారింది.భక్తి అంశం.. రాజకీయ అస్త్రంగా మారుతుందా?అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విరాళాలు అందించారు. ప్రతి రూపాయి వెనుక భక్తి భావన ఉందని చాలామంది భావించారు. అలాంటి విరాళాల విషయంలో ఆరోపణలు రావడంతో కొందరు భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. “భక్తితో ఇచ్చిన డబ్బు విషయంలో పారదర్శకత ఉండాలి” అనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే కొందరు మాత్రం ఈ వ్యవహారాన్ని ఆలయ ట్రస్ట్ నిర్వహణకు సంబంధించిన అంశంగానే చూస్తున్నారు. దీనికి నేరుగా యోగి ప్రభుత్వాన్ని బాధ్యురాలిగా చూడటం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు.ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు మాత్రం రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ.. ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని చూస్తోంది.మళ్లీ తెరపైకి వచ్చిన పాత గాయంఅయోధ్య అంశంతో పాటు ఉత్తరప్రదేశ్‌లో మరోసారి చర్చకు వచ్చిన విషయం ఉన్నావ్ అత్యాచార కేసు. 2017లో సంచలనం సృష్టించిన ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆయనకు జీవిత ఖైదు శిక్ష పడింది. అయితే ఇటీవల ఆయనకు సంబంధించిన న్యాయపరమైన పరిణామాలు, బెయిల్ ప్రయత్నాలు మరోసారి రాజకీయ దుమారాన్ని రేపాయి. మహిళా భద్రత, న్యాయ వ్యవస్థ, అధికార పార్టీ వైఖరిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.ఈ అంశంపై వస్తున్న రీల్స్.. ముఖ్యంగా మహిళా భద్రతకు సంబంధించిన ప్రశ్నలను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నాయి. ప్రతిపక్షాలు దీన్ని యోగి ప్రభుత్వంపై విమర్శలకు ఉపయోగించుకుంటున్నాయి. బీజేపీ మాత్రం చట్టం తన పని చేసిందని, కోర్టు ప్రక్రియలో ప్రభుత్వానికి ప్రత్యక్ష పాత్ర ఉండదని చెబుతోంది.కుంభమేళ విషాదం కూడా..ఉత్తరప్రదేశ్‌లో మరో కీలక అంశం మహా కుంభమేళ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట విషాదం. కోట్లాది మంది భక్తులు పాల్గొన్న ఈ భారీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియోలు, ప్రత్యక్ష దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ప్రశ్నలు వచ్చాయి.అయితే మరోవైపు ఇంత భారీ జన సమూహాన్ని నిర్వహించడం సవాలుతో కూడుకున్నదని, ఇలాంటి ఘటనలను రాజకీయ కోణంలో మాత్రమే చూడకూడదని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ ఎన్నికల సమయంలో ప్రజల భావోద్వేగాలకు దగ్గరగా ఉండే ఇలాంటి ఘటనలు సహజంగానే రాజకీయ చర్చలకు దారితీస్తాయి.రీల్స్ యుగంలో మారుతున్న రాజకీయాలుఒకప్పుడు రాజకీయ ప్రచారం సభలు, పత్రికలు, టీవీ చర్చలకే పరిమితమయ్యేది. ఇప్పుడు పరిస్థితి మారింది. 30 సెకన్ల వీడియో.. ఒక వైరల్ రీల్.. లక్షల మందికి చేరే శక్తిని కలిగి ఉంది. ప్రభుత్వ విజయాలను చూపించే రీల్స్ ఎంత వేగంగా వ్యాపిస్తాయో.. సమస్యలను చూపించే వీడియోలు కూడా అంతే వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి.యోగి ప్రభుత్వం రోడ్లు, మౌలిక వసతులు, శాంతిభద్రతలు, పెట్టుబడులపై తన విజయాలను ప్రచారం చేస్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలు, మహిళా భద్రత వంటి అంశాలను సోషల్ మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాయి.ఓటరు నిర్ణయాన్ని రీల్స్ మార్చగలవా?అయితే కేవలం సోషల్ మీడియా ప్రచారాలే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయా? అనేది మాత్రం ప్రశ్నగానే ఉంది. ఉత్తరప్రదేశ్ వంటి భారీ రాష్ట్రంలో కుల సమీకరణాలు, స్థానిక సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నాయకత్వంపై నమ్మకం వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఒక వీడియోతో ఓటరు అభిప్రాయం పూర్తిగా మారిపోదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ అదే సమయంలో.. ఒక అంశాన్ని నిరంతరం ప్రజల చర్చలో ఉంచే శక్తి సోషల్ మీడియాకు ఉందని అంగీకరిస్తున్నారు.హ్యాట్రిక్ లక్ష్యానికి ముందు సో.మీ. పరీక్షయోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2027 ఎన్నికల్లో హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్న వేళ.. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల భావోద్వేగ అంశాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయోధ్య విరాళాల వివాదం, ఉన్నావ్ కేసు, కుంభమేళ ఘటన వంటి అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. ఇవి ఇప్పటికిప్పుడు యోగి ప్రభుత్వానికి రాజకీయ నష్టంగా మారాయని చెప్పలేం. కానీ ఎన్నికల వరకు ఈ అంశాలు ఎలా ప్రయాణిస్తాయి? ప్రజల మనసుల్లో ఎలాంటి ముద్ర వేస్తాయి? అన్నదే అసలు పరీక్ష. -
విధులు నిర్వహించలేనప్పుడు డాక్టర్ అని రాసుకోవద్దు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మార్చిలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో సకాలంలో చికిత్స అందించేందుకు నిరాకరించిన రెండు ప్రైవేట్ ఆస్పత్రులు, వాటి వైద్యులపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘మీరు బాధ్యతలను సక్రమంగా నిర్వహించనప్పుడు, పేరు ముందు డాక్టర్ అని రాసుకునే అర్హత మీకు లేదు. మీకు గనుక మానవత్వం, స్పందించే గుణం ఉండి ఉంటే, మీ దగ్గర తగిన వసతులు లేనప్పుడు ఆ బిడ్డతో పాటు మీరే స్వయంగా మరో ఆస్పత్రికి వెళ్లి ఉండేవారు. ఆమె పేదరాలు అనో, ఫీజు చెల్లించలేదనో మీరు నిర్లక్ష్యం చేశారా?’అని వైద్యులను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. చిన్నారి కుటుంబానికి సహేతుకమైన మొత్తంలో పరిహారం చెల్లించాలని సంబంధిత రెండు ఆస్పత్రుల నిర్వాహకులను ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. మార్చి 16వ తేదీన బాధిత చిన్నారిని పొరుగింట్లో ఉండే వ్యక్తి చాక్లెట్లు ఆశచూపి తీసుకెళ్లాడు. ఆ చిన్నారి తిరిగి సాయంత్రమైనా ఇంటికి చేరుకోకపోవడంతో రోజుకూలీగా పనిచేసే ఆమె తండ్రి చుట్టుపక్కల వెదికారు. నిర్మానుష్య ప్రాంతంలో రక్తపు మడుగులో, అపస్మారక స్థితిలో పడి ఉన్న కుమార్తెను గుర్తించి, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు ఆస్పత్రుల్లోనూ ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో, చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఏప్రిల్ విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. చిన్నారికి వైద్యం అందించేందుకు నిరాకరించిన ఖాజన్ సింగ్మాన్వి హెల్త్ కేర్, సెయింట్ జోసెఫ్(మరియం)ఆస్పత్రులకు తగు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయంలో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టేందుకు ఘజియాబాద్ పోలీసులు తాత్సారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీ ప్రభుత్వానికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో)కు, సంబంధిత ఆస్పత్రులకు, జిల్లా మేజి్రస్టేట్‌కు నోటీసులు జారీ చేసింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల గుర్తింపుపై గోప్యత పాటించాలని పోలీసులు, ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబాన్ని వేధించరాదంటూ పోలీసులకు స్పష్టం చేసింది. -
ఆ రూ. 40 వేలతోనే : రామమందిర్ విరాళాల గోల్మాల్ గుట్టు
అయోధ్య రామ మందిర విరాళాల గోల్మాల్ కేసులో ఒకదాని తర్వాత ఒకటిగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్రస్టీల అవినీతి, విలాసాలు, స్టాక్‌మార్కెట్‌తో సంబంధాలు లాంటి ఇప్పటికే బైటపడగా, తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిపై అభియోగాలు నమోదైనాయి. ఈభారీ కుంభ కోణం నిందితులను పట్టుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. అయితే, అసలు ఇంత పెద్ద కుంభకోణం ఎలా బయటపడిందో తెలుసా?ఒక వాచ్‌మన్ నిజాయితీ కారణంగా రామమందిరంలోని విరాళాల చోరి వ్యవహారం వెలుగు లోకి వచ్చాయి. దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం, మే నెల చివరి వారంలో ఆలయ ప్రాంగణంలోని ఒక బాత్రూంలో దాదాపు 40 వేల రూపాయలు నగదును గుర్తించి, గేటు వద్ద కాపలాగా ఉన్న గార్డు శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లోని ఒక ట్రస్టీకి తెలియ జేశాడు. ఈ సమాచారం అందగానే ఆయన హుటాహుటిన ఆలయానికి చేరుకున్నారు, ఆ తర్వాత భద్రతా సిబ్బందికి, ఇతర ట్రస్ట్ సభ్యులకు విషయం తెలియజేశారు. నగదు దొరకడంతో విరాళాల సొమ్మును అక్రమంగా పక్కదారి పట్టిస్తున్నారనే అనుమానాలు తలెత్తాయి. దీనిపై ట్రస్ట్ జూన్ 4న పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేవలం 17 గంటల వ్యవధిలోనే అయోధ్య, యూపీలోని ఇతర జిల్లాల్లోని పలు ప్రాంతాలపై దాడులు నిర్వహించి దాదాపు రూ. 80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. విరాళాల లెక్కింపు కేంద్రంలో పనిచేసే అనుమానిత ఉద్యోగులను పోలీసులు తీవ్రంగా విచారించారు. పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నిందితుడు రామశంకర్ మిశ్రా ఇంటిలో, మరో నిందితుడు అవినాష్ శుక్లా పూర్వీకుల ఇంట్లో, ఇతర ప్రదేశాలలోనూ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగదు, ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు నమోదైన 17 గంటల లోపే, ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి పోలీసులు అయోధ్య మరియు యూపీలోని ఇతర జిల్లాల్లోని పలు ప్రాంతాల నుండి దాదాపు రూ. 80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్మరోవైపు దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం తననివేదికను సమర్పించాల్సి ఉంది. తొలుత సిట్‌కు 15 రోజుల గడువు ఇవ్వగా, జూలై 1న ఆ గడువును మరో 15 రోజులు పొడిగించారు. ఈ నివేదిక ఆధారంగా, అయోధ్య రామాలయ నిర్వహణ, ముఖ్యంగా విరాళాల లెక్కింపు ప్రక్రియలోపారదర్శకత ఉండేలా ప్రభుత్వం, ట్రస్ట్ అధికారులు భారీ మార్పులు తీసుకురావడానికి సిద్ధమవు తున్నారు.ఇదీ చదవండి: తొలి హైడ్రోజన్ రైలు : దీని ప్రత్యేకతలివే! -
క్లాస్‌రూంలోనే రాసలీలలు
విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే హద్దులు దాటారు. పాఠాలు చెప్పాల్సిన తరగతి గదిలోనే అనుచిత ప్రవర్తించారు. ఆ వీడియోలు కాస్త బయటకు రావడంతో.. తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు కంగుతిన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇటు విద్యాశాఖ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు అసిస్టెంట్ టీచర్లు.. తరగతి గదిలో హద్దులు దాటి ప్రవర్తించారు. విద్యార్థులు లేని టైం చూసుకుని ఏకాంతంగా కలుసుకున్నారు. ముద్దులతో, కౌగిలింతలతో.. రెచ్చిపోయారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో.. విద్యాశాఖ రంగంలోకి దిగింది. ఇద్దరు సీనియర్ టీచర్లతో ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. నివేదికలో.. వాళ్లు తప్పు చేసినట్లు తేలింది.ప్రవర్తన ఉపాధ్యాయుల వృత్తి ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని.. ఇలాంటి చర్యలు విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తేల్చింది. దీంతో విద్యాశాఖ వాళ్లను సస్పెండ్ చేసింది.ఉత్తరప్రదేశ్‌లో కన్నౌజ్ జిల్లాలోని సౌరిక్ బ్లాక్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. నివేదిక ఆధారంగా జిల్లా బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సందీప్ కుమార్ ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఒక టీచర్‌ను గుగరాపూర్ బ్లాక్ రిసోర్స్ సెంటర్‌కు, మరో టీచర్‌ను తాల్గ్రామ్ బ్లాక్ రిసోర్స్ సెంటర్‌కు అటాచ్ చేశారు. చాలా కాలంగా వీళ్లిద్దరూ ఇలా చేస్తున్నట్లు తేలిందని ఆయన అంటున్నారు.అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో నిజమైనదేనా? ఎప్పుడు చిత్రీకరించారు? అనే అంశాలపై కూడా అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు. వీడియోలో మాత్రం ఆ క్లాస్‌రూం రొమాన్స్.. ఈ ఏడాది జనవరిలో జరిగినట్లు డేట్ కనిపిస్తోంది. వీడియో ప్రామాణికతను నిర్ధారించే విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన గురువులే ఇలా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పాఠాలు చెప్పాల్సిన క్లాస్‌రూంలోనే అనుచిత ప్రవర్తనకు పాల్పడి.. చివరకు ఇద్దరు టీచర్లు తమ ఉద్యోగాలపై వేటు పడే పరిస్థితిని ఎదుర్కొన్నారు. -
RPFపై ఆందోళనలకు దిగిన రైల్వే ఉద్యోగ సంఘాలు
-
50 ఫ్యామిలీలు ఉండే భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి
నోయిడాలో 50 కుటుంబాలు ఉండే ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇద్దరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. పలు కుటుంబాలు భవనంలో చిక్కుకుపోయాయని తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బుధవారం ఫేజ్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలోని మమూరా గ్రామంలో ఎలక్ట్రిక్ బైక్‌లో చెలరేగిన మంటల వల్ల అగ్ని ప్రమాదం జరిగింది.ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భవనంలో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏంటో తెలుసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.నోయిడా సెక్టార్ 66లో జరిగిన భవన అగ్నిప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఘటన స్థలికి చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. సహాయ చర్యలు, రక్షణ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని చెప్పారు. అన్ని స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలని పాలన యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. సహాయ చర్యలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గౌతమ్ బుద్ధ నగర్ సంయుక్త కమిషనర్ రాజీవ్ నారాయణ్ మాట్లాడుతూ.. “సెక్టార్ 66 పరిధిలోని ఫేజ్-3 పోలీస్ స్టేషన్ పరిధి మమూరా గ్రామంలో అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం అందింది. అగ్నిమాపక సేవల సిబ్బంది వెంటనే స్పందించి అత్యంత తక్కువ సమయంలో ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక చర్యలు, రక్షణ చర్యల కోసం హైడ్రాలిక్ ప్లాట్‌ఫార్ములు, రెస్క్యూ వాహనాలు, 7 అగ్నిమాపక వాహనాలను వినియోగించారు. మంటలు చెలరేగిన భవనం జీ ప్లస్ 4 నిర్మాణం. అందులో దాదాపు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. నివాసితులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే పొగ పీల్చడం వల్ల ఇద్దరికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. భవనం కింది స్థలంలో పార్కింగ్ సౌకర్యం ఉంది. బేస్మెంట్ లేదు. పార్కింగ్ ప్రాంతం నుంచి పై అంతస్తులకు పొగ వ్యాపించి లోపల ఉన్న వారిపై ప్రభావం చూపింది.పొగ ప్రభావంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించిన ఇద్దరిని వెంటనే అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం ఇస్తాం. వారిని ఇప్పటికే ఆసుపత్రికి తీసుకెళ్లాం. ప్రతి అంతస్తులో దాదాపు 5 కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 12 గదులు రెండు గదుల ఫ్లాట్లుగా ఏర్పాటు చేశారు. భవనంలో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడానికి రక్షణ చర్యలు చేపట్టాం” అని తెలిపారు. VIDEO | Fire breaks out in a residential building in Mamura village in Noida. Rescue operations underway. More details are awaited. (Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/SpfsoCaow7— Press Trust of India (@PTI_News) July 15, 2026VIDEO | Noida, Uttar Pradesh: Fire breaks out in a residential building in Mamura village. Rajeev Narain, Joint Commissioner, Gautam Buddha Nagar, says, "Information was received about a fire in Mamura village, which falls under Sector 66 and the Phase-3 police station limits.… pic.twitter.com/Q9E04f5faw— Press Trust of India (@PTI_News) July 15, 2026 -
ఘనంగా పెళ్లి : రూ. కోటి నగలు, నగదుతో రాత్రికి రాత్రే వధువు జంప్
ఐఏఎస్ (IAS) అధికారిణిని పెళ్లి చేసుకోవాలన్న ఉత్తరప్రదేశ్‌లోని ఒక యువకుడి కల ఖరీదైన పీడకలగా మారింది. ఎంతో ఘనంగా పెళ్లయిన కొద్ది గంటల్లోనే రాత్రికి రాత్రే వధువు కోటి రూపాయలకు పైగా విలువైన నగలు, విలువైన వస్తువులతో పరారైన ఘటన కలకలం రేపింది. నెట్టింట ఈ వింత పెళ్లి మోసం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఏమైంది?ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా ఫరీద్పూర్ పరిధిలో గల పచోమి గ్రామానికి చెందిన అభిషేక్ పెళ్లి చేసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్‌నే పెళ్లి చేసుకోవా లనుకున్నాడు. సాధన అనే ఒక కిలాడీ తనను తాను ఐఏఎస్ అధికారిణిగా పరిచయం చేసుకుంటూ, సోషల్ మీడియాలో ప్రొఫైల్‌ను చూసి వెనుకా ముందు ఆలోచించకుండా భలే ఛాన్స్‌లే అనుకుంటూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్తా పెళ్లిదాకా తీసుకొచ్చాడు. అటు తమ ఇంటికి ఐఏఎస్ అధికారిణి కోడలిగా రాబోతుందనే ఆనందంతో అభిషేక్ కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఎంతో సంతోషంగా అంగీకరించారు. ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. అయితే, ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు.శోభనం రాత్రే 'కోటి రూపాయల' తో జంప్ఎఫ్ఐఆర్ (FIR) వివరాల ప్రకారం... పెళ్లయిన తర్వాత వధువు సాధన అత్తారింటికి చేరుకుంది. అక్కడ కుటుంబ సభ్యులు ఆమెకు పెద్ద ఎత్తున బంగారు, వెండి, వజ్రాల ఆభరణాలను బహుమతిగా ఇచ్చారు. అయితే, పెళ్లి జరిగిన మొదటి రాత్రి (శోభనం రాత్రి) భర్త అభిషేక్ నిద్రిస్తున్న సమయంలో, సాధన ఇంట్లోని విలువైన నగలు, నగదును బ్యాగ్‌లో సర్దుకుని అక్కడి నుండి పరారైంది. ఉదయం చూసేసరికి దాదాపు రూ. 1 కోటి విలువైన వస్తువులతో వధువు కనిపించకుండా పోవడంతో వరుడి కుటుంబం లబోదిబోమంది.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందిమోసపోయామని గ్రహించిన వరుడి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అభిషేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సాధన, ఆమె తండ్రి ,మరో ఇద్దరు కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేశారు. ఈ నకిలీ ఐఏఎస్ వధువును పట్టుకోవడానికి బరేలీ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.ఇదీ చదవండి: 25 ఏకరాల భూమి కొన్న స్టార్ హీరో, ధర ఎంతో తెలుసా?వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పొరుగున ఉన్న బుదౌన్ జిల్లాకు చెందిన ప్రధాన నిందితురాలు సాధనను అదుపులోకి తీసుకున్నారు. ఈమె వెనుక ఉన్న మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా గతంలో కూడా ఎవరినైనా ఇలాగే ఐఏఎస్ పేరుతో మోసం చేసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నకిలీ ఐఏఎస్ ప్రొఫైల్, వివాహ మోసాల నెట్వర్క్ విస్తృతిపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తుండటంతో, ఈ కేసు స్థానికంగా విస్తృత చర్చనీయాంశ మైంది. -
రామాలయ సీఈఓ బరిలో ఠాకూర్
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య భవ్య రామమందిర మొట్టమొదటి ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) పోస్టు కోసం మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ పోటీ పడుతున్నారు. ఆయన 1992 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి. 2021 మార్చి 23న కేంద్ర హోంశాఖ ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించింది. లేకపోతే 2028 వరకు సర్వీసులో కొనసాగేవారు. అమితాబ్ ఠాకూర్‌పై పలు ఆరోపణలు వచ్చాయి.శాఖాపరంగా విచారణ జరిగింది. ఆరోపణలు నిజమేనని తేలడంతో హోంశాఖ ఆదేశాల మేరకు బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఉద్యోగం నుంచి తప్పుకున్నప్పటికీ ప్రజా జీవితంలో కొనసాగుతానని, ‘అధికార్ సేన’పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(2022) పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ, పార్టీని స్థాపించలేదు. అందుకు కారణాలు ఏమిటో ఆయన వెల్లడించలేదు. -
శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్
ఆగ్రా: ఓ వ్యక్తి తన కన్నతల్లికి విషం పెట్టాడు. పిల్లనిచ్చిన అత్త మాటలు విని ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు అతడు. ఈ ఘటన ఆగ్రాలోని పిధౌరా పరిధిలో ఉన్న బర్పురా గ్రామంలో జరిగింది. నిందితుడు రవీంద్ర, అతని తమ్ముడు ముకేశ్ మధ్య భూ వివాదం తలెత్తింది. ఆ వివాదం తర్వాత రవీంద్ర భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తిరిగి తీసుకురావడానికి రవీంద్ర అత్తింటికి వెళ్లగా, అతని అత్త ఓ షరతు పెట్టింది. తన కూతురిని తిరిగి పంపాలంటే ‘‘ముందుగా నీ తల్లిని చంపాలి’’ అని ఆమె చెప్పింది. తల్లికి పెట్టే శనగ కూరలో విషం కలిపి చంపాలని కూడా అత్త సూచించింది. రవీంద్ర ఆ షరతుకు అంగీకరించి ఇంటికి వచ్చాడు. అనంతరం శనగ కూరలో విషం కలిపి తన తల్లికి తినిపించాడు. దీంతో ఆమె ఆరోగ్యం విషమించింది.కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులు రవీంద్రను అరెస్టు చేశారు. అతని అత్త ఫూల్వతి పరారీలో ఉండగా, ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.ఈ కేసు వివరాలను సహాయ పోలీసు కమిషనర్ రాజీవ్ రంజన్ వెల్లడించారు. రవీంద్రను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఫూల్వతిని పట్టుకునేందుకు దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. -
అయోధ్య ట్రస్ట్ సీఈవో పదవికి దరఖాస్తులు ఆహ్వానం, అర్హతలేంటో!
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామ మందిర విరాళాల చోరీ ఆరోపణల వివాదం కొనసాగుతుండగనే శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం కీలక పదవికోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ సోమవారం ఎక్స్‌లో ఒక ప్రకటనను పోస్ట్ చేసింది.ఈ ప్రకటన ప్రకారం మూడేళ్ల పదికాలానికిగాను ఆలయ ట్రస్ట్ సీఈఓ పదవికి అర్హులైన అభ్యర్తులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఇందుకు జూలై 18 చివరి తేదీ అని పేర్కొంది. ఈ పదవి కాలపరిమితి మూడు సంవత్సరాలు. 50 - 70 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. జీత భత్యాలు పరస్పర చర్చల ద్వారా నిర్ణయించబడతాయని వెల్లడించింది.ఇదీ చదవండి: యోగా గురు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు : దుమారం श्री राम जन्मभूमि तीर्थक्षेत्र (न्यास) श्री राम जन्मभूमि मंदिर के मुख्य कार्यकारी अधिकारी पद के लिए योग्य जनों से आवेदन आमंत्रित करता है आवेदन की अंतिम तिथि: शनिवार १८ जुलाई २०२६; सायं ४ बजे Shri Ram Janmabhoomi Teerth Kshetra (Trust) invites applications from eligible… pic.twitter.com/PHa0MbT5kY— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) July 13, 2026సీఈఓ బాధ్యతలు ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి లేదా సీఈఓ నేరుగా ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. సంస్థ అత్యున్నత కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తూ, దాని చట్టబద్ధమైన, పరిపాలనా, ఆర్థిక విధులను పర్యవేక్షిస్తారు. సంస్థ లక్ష్యాలు స్థాయికి తగిన కార్యాచరణ వ్యవస్థలు, విధానాలు, పద్ధతులను అభివృద్ధి చేయాలి. ట్రస్ట్ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో సహా, ట్రస్ట్ మొత్తం నిర్వహణకు సీఈఓ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, అకౌంటింగ్ వ్యవస్థలు, సంస్థాగత సమాచారంలో పారదర్శకత, జవాబు దారీతనం, సామర్థ్యాన్ని ప్రోత్సహించే బాధ్యత సీఈఓకు ఉంటుంది.ఇదీ చదవండి : 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?ఈ బాధ్యతలతోపాటు అవసరమైనప్పుడు స్థానిక, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, సంస్థ భద్రతా వ్యవస్థను కూడా సీఈఓ పర్యవేక్షిస్తారు. అన్ని మతపర ఆచారాలు, పూజలు, పండుగలు, వేడుకలను సంప్రదాయాలకు అనుగుణంగా జరిగేలా చూసే బాధ్యత ఈ పదవిపై ఉంటుంది. అలాగే ఆలయాన్ని సందర్శించే యాత్రికులు, భక్తుల భద్రత, సౌకర్యాలకు ఎలాంటి లోటు లేకుండా నిర్ధారించడం మరో ముఖ్య బాధ్యతల్లో ఒకటి. ఇంకా సంస్థను సందర్శించే విశిష్ట అతిథులు, ప్రముఖ సాధువుల కోసం ఏర్పాట్లు చూడాలి. ట్రస్ట్, ఆలయం రెండింటి ప్రతిష్టను పెంచడానికి కృషి చేయాలి. ట్రస్ట్ డీడ్‌లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి సీఈఓ ప్రణాళికలను రూపొందించి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, జనరల్ సెక్రటరీ మార్గదర్శకత్వంలో నిర్వర్తించాలి. ట్రస్ట్ లేదా ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు అప్పగించే అదనపు బాధ్యతలను కూడా సీఈవో నిర్వహించాలి. ఇదీ చదవండి: ఏసీ కోచ్‌లలో దుప్పట్లు, ఫేస్ షీట్ల చోరీ : 4 ఏళ్లలో రూ. 104 కోట్లు -
అయోధ్య విరాళాల చోరీ కేసు : సుప్రీం నోటీసులు
అయోధ్య రామాలయం విరాళాల వివాదానికి సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విరాళాల చోరీ కేసు పై విచారణలో సుప్రీం ప్రతి వాదులకు నోటీసులు జారీచేసింది. అలాగే సిట్ దర్యాప్తు స్టేటస్ రిపోర్టు ఫైల్ చేయాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదావేసింది. విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్ ద్వారా దర్యాప్తు జరుపుతోందని కోర్టుకు తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.అయోధ్య రాముడి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం, ఆర్థిక అక్రమాలపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ (CBI) స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను (PILs) సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు పునఃప్రారంభమైన మొదటి రోజే ఈ కీలకమైన కేసు విచారణకు రావడం గమనార్హం.రామాలయ నిర్మాణం కోసం సేకరించిన ప్రజా విరాళాలను దుర్వినియోగం చేశారని, నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపిస్తూ న్యాయవాదులు, ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ సహా మరికొందరు వేర్వేరుగా ఈ పిటిషన్లను దాఖలు చేశారు. ఇందులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ జరుపుతోంది.అయితే, సంక్లిష్టమైన ఆర్థిక నేరాలను దర్యాప్తు చేయడానికి అవసరమైన ఫోరెన్సిక్ మరియు తగిన వనరులు రాష్ట్ర సిట్ (SIT) వద్ద లేవని, పైగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే దర్యాప్తు ప్రారంభించారని పిటిషనర్లు వాదన.దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల నమ్మకానికి సంబంధించిన విషయం కావడంతో, దీనిపై సీబీఐ నేతృత్వంలో నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని, అలాగే ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలపై కాగ్ (CAG) లేదా స్వతంత్ర సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని కూడా కోరారు.ఇదీ చదవండి: 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా? -
15 ఏళ్లకే చదువు మానేసింది..! కట్‌చేస్తే రూ 7 వేల కోట్ల కంపెనీ..
సాధారణంగా కష్టపడి చదివి..నైపుణ్యాలు అందిపుచ్చుకుని ఒక్కోమెట్టు ఎక్కుతూ సక్సెస్ అందుకుంటాం. కానీ కొందరు చిన్న వయసులోనే అపార ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ కోవకు చెందిన పిల్లలు అందరి పిల్లల్లా క్లాస్రూమ్ పాఠాలకు అంకితమవ్వరు. అలా టైం వేస్ట్ చేసే కంటే..తనకేది ఇష్టమే ఏం చేస్తే బాగుంటుందో.. అంత చిన్న వయసులోనే నిర్ణయించుకోగలరు. ఆ దిశగా తమ టాలెంట్‌ని ప్రదర్శించి దిగ్గజ కంపెనీలే వచ్చి తమ సంస్థలో చేర్చుకునేలా చేసుకుంటారు. అలాంటి టాలెంటెడ్ గర్ల్ హర్షిత అరోరా. ఆమె స్కూల్ చదువుని మధ్యలోనే ఆపేసి పేరెంట్స్‌కి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత అత్యంత చిన్న వయసులోనే కోట్ల విలువ చేసే కంపెనీని నిర్మించి..ఇంటెలిజెన్స్‌కి కేరాఫ్‌గా నిలిచింది. ఆ అమ్మాయే ఉత్తప్రదేశ్‌లోని సహారన్పూర్ నగరానికి చెందిన హర్షిత అరోరా. చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు ఇంజీనర్ లేదా డాక్టరో అవ్వాలనే అనుకుంటారు. కానీ హర్షిత తన తల్లిదండ్రులే ఆందోళన చెందేలా భయానక నిర్ణయం తీసుకుని షాక్‌కి గురి చేసింది. చదువుకి అత్యంత కీలకమైన టీనేజ్ దశ అంటే 15 ఏళ్ల వయసుకే ఈ చదువులు నావల్ల అయ్యే పని కాదని స్టడీస్‌కి బై..బై చెప్పేసింది. తనకు తాను సొంతంగా టెక్నాలజీ గురించి నేర్చుకోవడం ప్రారంభించింది. ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ సాయంతో 16 ఏళ్ల వయసు వచ్చేసరికి ఒక క్రిప్టో పోర్ట్‌ఫోలియో ట్రాకింగ్ యాప్‌ను సృష్టించింది. అది చాలా సరళంగా ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. ఆపిల్ దీన్ని గమనించి తన ఫ్లాట్ఫామ్లోకి చేర్చింది. ఈ యాప్ అమెరికా, కెనడా దేశాల వ్యాప్తంగా రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన ఫైనాన్స్ యాప్‌గా నిలిచింది. ఆ తర్వాత కొద్ది కాలానికే, ఒక కంపెనీ దీనిని కొనుగోలు చేసింది. అలా 2020లో, భారత ప్రభుత్వం హర్షిత విజయాలను గుర్తించింది. అందుకుగానూ ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాల పురస్కార్‌ను అందుకుంది కూడా. అదే ఏడాది ఆమె అమెరికా వెళ్లడానికి O-1 వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. తమ రంగంలో అసాధారణమైన సామర్థ్యాన్ని ప్రదర్శించిన వారికి ఈ వీసా ఇస్తారు. అందుకోసం ఆమెకు మొత్తం పదిమంది సీఈవోల నుంచి సిఫార్సులు అవసరం. కానీ హర్షితకు ఏకంగా 15 సిఫార్సులు లభించాయి. అంతేగాదు శాన్ ఫ్రాన్సిస్కో ఆమెకు స్వాగతం పలికింది. 2019లో, ఆమె విజ్ఞాన్ వెలివేల తుషార్ మిశ్రాలతో కలిసి AtoB అనే స్టార్టప్‌ను స్థాపించారు. వాళ్ల మంచి ఆలోచనతో స్టార్టప్‌ని ప్రారంభించడంతో Y కాంబినేటర్ సమ్మర్ 2020 బ్యాచ్‌కు ఎంపికయ్యారు.ఈ Y కాంబినేటర్ (Y Combinator) అనేది 2005లో స్థాపించిన ఒక ప్రముఖ అమెరికన్ స్టార్టప్ యాక్సిలరేటర్. ఇది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి (స్టార్టప్‌లకు) అవసరమైన ప్రాథమిక పెట్టుబడి (Seed Fund), శిక్షణను అందిస్తుంది. అయితే వారి ఆలోచన ప్రారంభం కాకముందే కరోనా మహమ్మారితో వారి స్టార్టప్‌కి బ్రేక్‌లు పడ్డాయి. అకస్మాత్తుగా మారిపోయిన ప్రపంచం ఒకవైపు..ఏదో నిర్మించాలనే తపనతో కష్టపడుతున్న హర్షిత బృందం ఇంకోవైపు. నిజానికి ఆ టైంలో చాలా స్టార్టప్‌లు మూతపడ్డాయి. చాలామంది వ్యవస్థాపకులు తిరిగి ఉద్యోగాల్లోకి వెళ్లిపోయారు కూడా. అయితే హర్షిత బృందం మాత్రం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ట్రంక్ స్టాప్లకు వెళ్లారు. వారాల తరబడి అక్కడే నిలబడి ఆ ట్రక్ డ్రైవర్లతో మాట్లాడేవారు. వారి సమస్యల గురించి, చెల్లింపుల గురించి అడిగారు. అలాగే ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. నిజానికి హర్షిత బృందానికి ట్రక్కింగ్ పరిశ్రమ గురించి ఏమీ తెలియదు. దానికి సంబంధించి..ఫ్లీట్ల కోసం చెల్లింపు వ్యవస్థల గురించి కూడా ఏమీ తెలియదు. వాళ్లకు అర్థమయ్యే వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉంది ఆ బృందం. అలా వారు AtoBని మళ్ళీ మొదటి నుండి నిర్మించారు. ఈసారి ఈసారి అమెరికన్ ట్రక్కింగ్ పరిశ్రమ కోసం ఆర్థిక మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టి..దశాబ్దాలుగా పాత పద్ధతులను ఉపయోగిస్తున్న పరిశ్రమ కోసం ఆధునిక టెక్నాలజీని అందించారు.అలా ఇప్పుడు అమెరికాలోని 30 వేలకు పైగా ఫ్లీట్లు AtoBని ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ సుమారు $800 మిలియన్లు, అంటే దాదాపు రూ. 7,600 కోట్లు. ఇక్కడ హర్షిత చదువు మానేసి మరి..తనకు ఏ మాత్రం పరిచయంలోని పరిశ్రమలో భారీ విజయాన్ని అందుకోవడం విశేషం. ప్రారంభించాలనుకున్నా.. స్టార్టప్‌కు బ్రేకులు పడ్డాయేమో గానీ తనకు కాదని తన సక్సెస్‌తో నిరూపించింది. ఏప్రిల్ 2026లో, వై కాంబినేటర్ హర్షితను జనరల్ పార్టనర్‌గా పదోన్నతి కల్పించింది. అంతకుముందు ఏడాది ఆ సంస్థలో అత్యంత పిన్న వయస్కురాలైన విజిటింగ్ పార్టనర్‌గా ఉంటూ..ప్రారంభ దశలో ఉన్న వ్యవస్థాపకులకు ఒక కంపెనీని నిర్మించడంలో సహాయసహకారాలు అందించేది. దాంతో హర్షిత 24 ఏళ్లకే ప్రపంచంలోని అత్యంత తెలివైన బిల్డర్లతో పనిచేసే అవకాశం దక్కించుకుంది. ఇక్కడ ఆమె ఏ స్టార్టప్‌లకు నిధులు అందాలో, ఏ వ్యవస్థాపకులకు ప్రపంచాన్ని మార్చే అవకాశం లభించాలో హర్షితానే నిర్ణయిస్తుంది. కెరీర్ ప్రారంభించే వయసుకే వై కాంబినేటర్‌లో జనరల్ పార్టనర్ అవ్వడం అంటే మామలు విషయం కాదు. ఎవ్వరికైన ఏదైనా మొదలు పెట్టేటప్పుడూ ఆటంకాలు వస్తాయి..దాన్ని అధిగమించి ఎలా ముందుకు సాగుతున్నావనే దానిపై సక్సెస్ మొత్తం ఆధారపడి ఉంటుందని హర్షిత నిరూపించింది. (చదవండి: పింక్ బనారసి పట్టు చీరలో అందమైన గులాబీలా నీతా అంబానీ..!) -
పెళ్లిలో వధువు కొంగులాగిన కొంటె మరిది : రచ్చ రచ్చ
తమ్ముడు చేసిన అభ్యంతకర చర్య అన్నయ్య పెళ్లికి చేటు తీసుకొచ్చింది. పెళ్లి ఆచారాలు జరుగుతున్న సమయంలో వధువు కొంగు (పల్లూ) లాగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో పెళ్లి కొడుకు తలకు తీవ్ర గాయమవ్వగా, పలువురు గాయపడ్డారు. దీంతో పెళ్లి కాస్తా తాత్కాలికంగా ఆగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.పోలీసుల సమాచారం ప్రకారం.. అనుకున్న సమయానికి పెళ్లి జరిపించేందుకు పెద్దలు, పురోహితులు సిద్ధంగా ఉన్నారు. అటు పెళ్లి బరాత్ కూడా షెడ్యూల్ ప్రకారమే కల్యాణ మండపానికి చేరుకుంది. వేడుకలు కూడా సజావుగానే సాగుతున్నాయి. అయితే, పెళ్లి చివరి ఘట్టానికి చేరుకున్న సమయంలో, పెళ్లికొడుకు తమ్ముడు పిచ్చి వేషం వేశాడు. కాబోయే వదిన అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఆమె కొంగు పట్టుకొని లాగాడు. అంతే దుమారం రేగింది. వధువు బాబాయ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అలా మొదలైన వివాదం మధ్య తీవ్ర రూపం దాల్చింది. మద్యం సేవించిన మరికొంతమంది బంధువులు దీనికి మరింత ఆజ్యం పోశారు. అంతే ఈ మాటల యుద్ధం కాస్తా క్షణాల్లోనే పరస్పర దాడులుగా మారింది. వరుడు, వధువు తరఫు బంధువు (కజిన్) కూడా గాయపడ్డాడు. గొడవ పెద్దది కావడంతో పెళ్లి ఆచారాలను మధ్యలోనే నిలిపి వేయాల్సి వచ్చింది. ఇరువర్గాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఇదీ చదవడి: మటన్ వర్సెస్ చికెన్ : కుర్చీలు విరిగాయ్, తలలు పగిలాయ్!గురువారం నాడు గ్రామ సర్పంచ్ సమక్షంలో ఇరు కుటుంబాల వారు పోలీస్ స్టేషన్లోనే సుదీర్ఘంగా చర్చలు జరిపారు.ఎట్టకేలకు ఇరువర్గాలు ఒక అవగాహనకు వచ్చాయి. గాయపడిన వారి వైద్య ఖర్చుల కోసం రూ. 4,500 చెల్లించేలా పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తానికి ఇరు కుటుంబాలు శాంతించి, ఆ తర్వాత అదే రోజు సాయంత్రం వధూవరులను ఒకటి చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఇరువర్గాలు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నాయని, ఎవరూ కూడా ఒకరిపై ఒకరు పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: దత్తత హిందూ సోదరికి, ముస్లిం వ్యక్తి కన్యాదానం, వైభవంగా పెళ్లి -
దత్తత హిందూ సోదరికి, ముస్లిం వ్యక్తి కన్యాదానం, వైభవంగా పెళ్లి
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో జరిగిన ఒక వివాహం మత సామరస్యానికి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ముస్లిం యువకుడైన బబ్లూ సిద్ధిఖీ, తన పెంపుడు సోదరి దీపాన్షి వివాహ బాధ్యతలను పూర్తిగా తన భుజాలపై వేసుకున్నాడు.హైందవ సంప్రదాయాల ప్రకారం జరిపించిన తీరు స్థానికంగానే కాక సోషల్ మీడియాలోనూ ప్రశంసలందుకుంటోంది.తండ్రి తరువాత తండ్రికొన్నేళ్ల క్రితమే దీపాన్షి తల్లిదండ్రులు చనిపోయి ఒంటరిగా మిగిలిపోయింది. దీంతో పొరుగున ఉండే బబ్లూ సిద్ధిఖీ, ఆమెను తన సొంత చెల్లెలిలా ఆదరించాడు. బబ్లూ కుటుంబం ఆమెకు అండగా నిలిచింది. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు లేరనే వెలితి ఆమెకు తెలియకుండా బబ్లూ కుటుంబం ఆమె జీవితంలో ప్రతి అడుగులో తోడుగా నిలిచింది. ఆమెకు యుక్తవయసు రావడంతో పెద్దమనసు చేసుకొని వైభంగా పెళ్లి చేశారు. కాళ్లు క డిగి కన్యాదానం చేసి చక్కటి విందు ఇవ్వడం విశేషంగా నిలిచింది. జులై 8న హిందూ సంప్రదాయాల ప్రకారం ఉఝానిలోని ఎస్ఎస్ గ్రీన్ ప్యాలెస్‌లో దీపాన్షి, కమల్‌కాంత్ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయంల అత్యంత పవిత్రమైన 'కన్యాదానం' క్రతువును బబ్లూ సిద్ధిఖీ స్వయంగా నిర్వహించాడు. దాదాపు 800 మంది అతిథులకు భోజన వసతులతో పాటు పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నాడు.కన్నప్రేమ కంటే పెంచిన ప్రేమ మిన్న‘‘దీపాన్షి చిన్నప్పటి నుంచి నా సొంత చెల్లెలా చూసుకున్నా. తమ కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. ప్రేమ, నమ్మకంతో ఏర్పడే బంధాలు రక్తసంబంధాల కంటే తక్కువేమీ కావు. ఏ ఆడపిల్ల కూడా తన పెళ్లి రోజున ఒంటరినని బాధపడకూడదు. ఒక సొంత అన్నగా చెల్లెల్నిఎంత గౌరవంగా, సంతోషంగా అత్తవారింటికి పంపాలో, అలాగే పంపించాను" అని బబ్లూ సిద్ధిఖీ గర్వంగా చెప్పాడు.కన్నీళ్లు పెట్టుకున్న వధువుపెళ్లి సమయంలో దీపాన్షి పలుమార్లు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. బబ్లూ భయ్యా, వారి కుటుంబం సొంత కూతురి కంటే మిన్నగా చూసుకున్నారు. తల్లిదండ్రులు లేరనే బాధ నాకు కలగనివ్వలేదు. సామాజిక, మతపరమైన వ్యత్యాసాల కంటే ప్రేమాభిమానాలే గొప్పవని మా అన్న నిరూపించాడు అంటూ భావోద్వేగానికి లోనైంది. నీరు నిండిన కళ్ళతో వారికి కృతజ్ఞతలు తెలిపింది.ఇదీ చదవండి: ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్వ్యాగన్ వినూత్న ప్రయోగం : 100 గొర్రెలతో..!నెటిజన్ల ప్రశంసలుఈ పెళ్లికి హాజరైన స్థానికులు బబ్లూ సిద్ధిఖీ మానవత్వాన్ని, మతసామరస్యాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు . సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ కావడంతో, నెటిజన్లు "నిజమైన భారతదేశం అంటే ఇదే" అంటూ ఈ అన్నాచెల్లెళ్ల బంధాన్ని, బబ్లూ సంస్కారాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. మతాల పేరుతో సమాజంలో విభేదాలు తలెత్తుతున్న ఈ రోజుల్లో బబ్లూ మతంకంటే మానవత్వం మిన్న అని చాటిచెప్పాడు అంటూ కొనియాడు తున్నారు. ఇదీ చదవండి: సీక్రెట్‌గా ప్రియుడ్ని పెళ్లాడిన బిగ్ బాస్ ఫేమ్ : స్పెషాల్టీ ఏంటంటే A Muslim man named Bablu (Riyasat) Siddiqui in Badaun, Uttar Pradesh, organised a lavish, fully traditional Hindu wedding for his adopted Hindu sister Deepanshi, personally performing her kanyadaan and hosting more than 800 guests with food and refreshments. pic.twitter.com/6CGEaM1VT1— Shakeel Yasar Ullah (@yasarullah) July 10, 2026 -
ఎనర్జిటిక్ ఉమెన్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మల్లిఖేడ గ్రామం. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని గ్రామాలలో ఇదొకటి. చాలామంది ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా డీజిల్‌ను ఎంచుకునేవారు. అయితే అది చాలా ఖరీదైన వ్యవహారం. ఆమె పేరు సుమన్. భర్త చిన్నపాటి ఉద్యోగమేదో చేస్తాడు. తక్కువ ఆదాయం కారణంగా, కుటుంబాన్ని పోషించడానికి ఒక చిన్నపాటి షాపు నిర్వహిస్తోంది సుమన్. డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు, ప్రింటింగ్, ఫొటో కాపీయింగ్, ఆధార్ అనుసంధాన సేవలను అందిస్తోంది. కరెంట్ సమస్య...నెత్తి మీద కత్తి!కరెంట్ సమస్య వల్ల ఆమె షాప్ సరిగ్గా నడిచేది కాదు. రోజూ ఎంతోమంది కస్టమర్లు వచ్చినా, కరెంట్ లేకపోవడంతో వెనక్కి తిరిగి వెళ్లేవారు. అలాంటి రోజుల్లో ఒకరోజు...ఊళ్లో జరిగిన గ్రామసభలో పాల్గొంది సుమన్. ఆ సభలో కరెంట్ కష్టాలను ఏకరువు పెట్టింది. ‘సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుంటే మీకు ఏ సమస్యా ఉండదు’ అని సూచించారు అధికారులు.స్వయం సహాయక బృందాల నెట్వర్క్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తరువాత 1 కిలోవాట్ రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు లోన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అలా సోలార్ సిస్టమ్‌కు చేరువైంది. ఇప్పుడు ఆమెకు ఎలాంటి కరెంట్ కష్టాలు లేవు. సుమన్‌కు నెలవారీ ఆదాయం పెరిగింది. ఎలక్ట్రిసిటీ బిల్ భయపెట్టడం లేదు. ఎంతో కొంత డబ్బు పొదుపు చేయగలుగుతోంది.త్రిబుల్ ఫ్రేమ్వర్క్భారతదేశ ఇంధనరంగంలో మహిళల భాగస్వామ్యం 22 శాతమే. అయినప్పటికీ పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి ఆశాజనకమైన పరిస్థితి కనిపిస్తోంది. సౌర, పవన ఇంధనంతో పాటు ఇతర ఇంధనాలకు సంబంధించి సాంకేతిక కార్యక్రమాలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు.‘మన దేశంలో పునరుత్పాదక శక్తి ఇంజినీరింగ్‌కు సంబంధించి ప్రత్యేక డిగ్రీ కోర్సు లేదు. మనం పూరించాల్సిన లోటు ఇది’ అంటున్నారు లూమినస్ పవర్ టెక్నాలజీ ఎండీ ప్రీతీ బజాజ్.‘మహిళలకు ఇంధనరంగం గురించి అవగాహన కలిగించాలి. ఈ రంగంలో ఉండే అద్భుతమైన కెరీర్ అవకాశాలను గురించి వివరంగా తెలియజేయాలి’ అంటారు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్‌లో సీఎస్ఆర్ విభాగ అధిపతి భావన కృపాల్. ఇంధన రంగంలో మహిళలను ప్రోత్సహించడానికి 3 ఉ ఫ్రేమ్‌వర్క్ గురించి చెబుతున్నారు ప్రీతి బజాజ్.ఫస్ట్ E–ఎంకరేజర్స్ ( ప్రోత్సాహకులు)నాయకత్వ స్థానాల్లోకి మహిళలు అడుగు పెట్టడానికి ప్రేరేపించే, ప్రోత్సహించే వ్యక్తులు.సెకండ్ E – ఎన్రిచర్స్ (సుసంపన్నం, సారవంతం చేయడం) మహిళల ప్రతిభను గుర్తించి వారి కెరీర్ పురోగతికి మార్గాలు చూపించే సీనియర్లు.థర్డ్ E – ఎంగేజర్స్ (నిమగ్నపరిచేవారు)తమకు ఉన్న విశ్వసనీయతను, ఇన్‌ఫ్లూయెన్స్‌ను ఉపయోగించి మహిళలకు మార్గనిర్దేశకత్వం చేస్తూ, వారికి అండగా ఉంటూ, ఉన్నతస్థానాలకు చేర్చడంలో తోడ్పడేవారు.ప్రత్యామ్నాయాల దారిలో...దశాబ్దాల కాలం నుంచి మన ఇంటి వంటకు ఎల్పీజీ వెన్నెముకగా ఉంది. అయితే పెరుగుతున్న ధరలు, సరఫరాకు సంబంధించిన సమస్యలు, పర్యావరణ అవగాహన కారణంగా చాలామంది గృహిణులు ఎల్పీజీకి ప్రత్యామ్నాయాలు అన్వేషించడం ప్రారంభించారు. ఎల్పీజీపై ఆధారపడడాన్ని తగ్గించగల ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించారు.గృహిణులకు అత్యంత సులభంగా అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలలో ఎలక్ట్రిక్ ఇండక్షన్ కుక్‌టాప్ ఒకటి. ఇండక్షన్ స్టవ్‌లు విద్యుదయస్కాంత శక్తిని ఉపయోగించి పాత్రలను నేరుగా వేడి చేస్తాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేని పట్టణాలలో ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి.మోడ్రన్ ఇండక్షన్ కుక్‌టాప్‌లు భారతీయ వంటకాల కోసం ముందుగా సెట్ చేసిన మెనూలతో వస్తున్నాయి. దీని వల్ల సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని వారికి కూడా వీటిని ఉపయోగించడం సులభం అవుతుంది. అమెరికా– ఇరాన్ యుద్ధ నేపథ్యంలో పల్లె, పట్టణం అని తేడా లేకుండా ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా ఆధునిక, పురాతన సంప్రదాయ పద్ధతులను ప్రజలు అనుసరించారు.అవసరంలో ఉన్నప్పుడు ఆవిష్కరణ పుడుతుంది అంటారు. నిన్నామొన్నటి ఎల్పీజీ సిలిండర్ల సంక్షోభం నేపథ్యంలో ఆ మాట మరోసారి గుర్తుకు వస్తుంది. యుద్ధం రెండు దేశాల మధ్య జరిగిందా? రెండు దేశాలు కలిసి సామాన్యులపై చేశాయా? అనేది అంతుచిక్కని జవాబు. యుద్ధం వల్ల ఎల్పీజీ సంక్షోభం ఒక కోణం అయితే, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వెదుక్కోవడం, పాత పద్ధతుల్లోకి తిరిగి వెళ్లడం మరో కోణం. ప్రత్నామ్నాయ ఇంధన వనరుల విషయంలో మహిళలు ముందున్నారు. ఎనర్జిటిక్‌గా ముందుకు వెళుతున్నారు.. -
ఆలయానికి కొత్తగా సీఈఓ
అయోధ్య: రామమందిర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన బీజేపీ, సంఘ్ పరివార్లు అయోధ్య రామమందిరంలో కోట్ల రూపాయల చందా చోరీ ఉదంతంతో మసకబారిన ఆలయ ప్రతిష్ట పునరుద్ధరించేందుకు నడుంబిగించాయి. ఆలయ నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేలా కొత్తగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) పదవిని ఏర్పాటుచేయాలని సోమవారం జరిగిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక భేటీలో నిర్ణయించారు. సీఈఓ పదవికి అర్హతలున్న వ్యక్తి ఎంపిక బాధ్యతలను ముగ్గురు సభ్యుల కమిటీకి అప్పగించారు.ఈ కమిటీలోకి సభ్యులుగా విశ్రాంత న్యాయమూర్తి ప్రమోద్ కోహ్లీ, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, ట్రస్టీ సురేశ్ హవారేలను తీసుకున్నారు. లక్షలాది మంది భక్తులు సమరి్పంచిన నగదు, స్వర్ణాభరణ కానుకలను కాజేసిన ఉదంతంలో నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామాచేస్తూ చంపత్ రాయ్ తీసుకున్న నిర్ణయాన్ని సోమవారం ఆలయ కాంప్లెక్స్‌లోని గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్నం మూడుగంటలపాటు జరిగిన భేటీలో ట్రస్ట్ సభ్యులు ఆమోదించారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామానూ ఆమోదించారు. ప్రస్తుతం ట్రస్టీగా ఉన్న కృష్ణమోహన్‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకు న్నారు. ఎవరైనా వచ్చి సరిచూసుకోవచ్చు: కృష్ణమోహన్ భేటీ తర్వాత తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కృష్ణ మోహన్ మీడియాతో మాట్లాడారు. ‘‘రామమందిరానికి భారీ స్థాయిలో బంగారం, వెండి, ఇతరత్రా అత్యంత విలువైన ఆభరణాలు, వస్తుసామగ్రిని ఇచ్చిన దాతలు తామిచ్చిన విరాళాలు ఉన్నాయో లేదో సరిచూసుకునేందుకు అవకాశం కల్పిస్తాం. నగదుకాని 2,926 కానుకల సంబంధ రికార్డులు, డాక్యుమెంట్లను బహిరంగంచేస్తాం. ఎవరైనా వచ్చి వాటిని సరిచూసుకోవచ్చు. చోరీకి పాల్పడిన వారికి తగిన శిక్ష పడేలా చేస్తాం. చోరీ ఘటనతో ఆలయంపై ఆరోపణల మచ్చ పడింది.ఇలాంటివి పునరావృతంకాకుండా, మళ్లీ ప్రజల విశ్వాసం చూరగొనేలా ట్రస్ట్ సభ్యులంతా ఎంతో పారదర్శకంగా పనిచేస్తారు. ఆలయాన్ని మరింత సమర్థవంతంగా, ఆదర్శప్రాయంగా నిర్వహించేందుకు, నిపుణుల నుంచి సలహాలు తీసుకోబోతున్నాం’’అని తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కృష్ణ మోహన్ అన్నారు.శతాబ్దాలపోరాట ఫలితంగా సాకారమైన ఆలయంలో కొంతకాలంగా హుండీల నుంచి విరాళాలు చోరీ అవుతున్నాయన్న విషయం తెలియగానే ట్రస్ట్ సభ్యులు, భక్తులు ఎంతో కలతచెందారని, ఇది నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితి అని ట్రస్ట్ కోశాధికారి గోవింద్‌దేవ్ గిరి వ్యాఖ్యానించారు. ఈనెల 22వ తేదీన ట్రస్ట్ మరోసారి సమావేశంకానుంది. సోమవారంనాటి భేటీలో ట్రస్ట్ చైర్మన్ నృత్యగోపాల్ దాస్సహా ఏడుగురు శాశ్వత సభ్యులు హాజరయ్యారు. సాయంత్రం ఆరున్నరదాకా భేటీ కొనసాగింది. -
అయోధ్య రాముడి విరాళాల స్కాం వేళ కీలక పరిణామం
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామాను ఆమోదించింది. అయోధ్య రామ మందిరం ట్రస్ట్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్‌కు బాధ్యతలు అప్పగించారు. రామ మందిర్ ట్రస్టు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 22న మరోసారి సమావేశం కానుంది ట్రస్ట్. సిట్ నివేదికను పరిశీలించనుంది. నిందితులను త్వరగా పట్టుకుని, శిక్షించాలని ట్రస్ట్ కోరింది.ఈ సందర్భంగా ట్రస్ట్ కోశాధికారి గోవిందు గిరి మాట్లాడుతూ.. రామ మందిర్‌పై ఈ ఘటనను ఆధారం చేసుకుని అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని అన్నారు. చంపత్రాయ సేవలను అభినందిస్తున్నామని చెప్పారు. దోషులను పట్టుకునే వరకు తాను ట్రస్టులో కొనసాగలేనని చంపత్‌రాయ్ వెల్లడించారని తెలిపారు. అయోధ్యను కించపరిచేలా ఉండే ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. మొదట, విశ్వ హిందూ పరిషత్ (VHP) అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజ్రంగ్ బగ్రాను కొత్త సెక్రటరీగా నియమిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్‌ను నియమించారు.రాజీనామా చేసిన మరో ట్రస్ట్ ప్రతినిధి అనిల్ మిశ్రా రాజీనామా కూడా ఆమోదం పొందింది. ఈ సందర్భంగా సిట్ దర్యాప్తుపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన ట్రస్ట్.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేసింది. ట్రస్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న డిస్టిక్ మేజిస్ట్రేట్‌కు మరిన్ని అధికారాలను అప్పగించేందుకు ట్రస్ట్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: కేతన్ హత్య : సియాకు సపోర్ట్ చేసిన నెటిజన్‌పై గాయని మండిపాటుఇదీ చదవండి: ఆమీర్ మూడో పెళ్లి: అంబానీ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం -
అయోధ్య విరాళాల చోరీ కేసు.. సిట్ కీలక నిర్ణయం
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్ల అయోధ్య ట్రస్ట్ ఖాతాలను రీ-ఆడిట్ చేయనుంది. విచారణలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. నిర్మాణ సంబంధిత వ్యయాలతో పాటు.. విరాళంగా వచ్చిన ఆభరణాలు, ఇతర బంగారం, వెండి వస్తువులను కూడా ఈ రీ-ఆడిట్లో పరిశీలించనున్నట్లు సిట్ పేర్కొంది. గత ఐదేళ్ల కాలానికి సంబంధించిన ట్రస్ట్ ఆర్థిక రికార్డులను సిట్ సమగ్రంగా పరిశీలించనుంది.మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన అవినాష్ శుక్లాను అయోధ్య పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విరాళాల లెక్కింపు విధుల్లో ఉన్న శుక్లాను ఈ కేసులో ముందుగానే అరెస్టు చేయగా.. స్థానిక న్యాయస్థానం గురువారం అతడికి 24 గంటల పాటు పోలీస్ కస్టడీ విధించింది. ఇప్పటివరకు ఈ కేసులో అత్యధిక నగదు ఇతని వద్ద నుంచే స్వాధీనం చేసుకున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. సిట్ అధికారులు ఇప్పటివరకు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా, ఆలయ నిర్మాణ, నిర్వహణ వ్యవహారాలతో సంబంధం ఉన్న గోపాల్ రావులను విచారించారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామాలు సమర్పించగా.. జూలై 6న జరగనున్న ట్రస్ట్ సమావేశంలో వారి రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఇప్పటివరకు ఈ కేసులో అవినాష్ శుక్లా నుంచి రూ. 20.39 లక్షలు, కరుణేష్ పాండే నుంచి రూ.18.07 లక్షలు, అనుకుల్ప్ మిశ్రా నుంచి రూ.16.82 లక్షలు, లవకుష్ మిశ్రా నుంచి రూ.14.25 లక్షలు, రమాశంకర్ మిశ్రా నుంచి రూ.7.32 లక్షలు, రమాశంకర్ యాదవ్ నుంచి రూ.1 లక్ష స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సుమారు 11 గ్రాముల బంగారం, 375 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.రామ మందిరంలో చోరీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. రామ మందిరంలో విరాళాల చోరీ భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని.. ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే అన్నారు. ఈ ఘటన మమ్మల్ని కలిచివేసింది. ఈ ఘటన పైన దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులకు దోషులు తేలిన వారిపై కఠిన శిక్షలు విధించాలి. ఈ ఘటనకు కారణమైన వ్యవస్థగత లోపాలను వెంటనే సరిదిద్దాలి. అలాగైతేనే భక్తుల విశ్వాసాలు కొనసాగుతాయి. పారదర్శక విధానాలను అనుసరించి ధార్మిక వాతావరణాన్ని మరింత పెంచేలా పనిచేయాలి. ఈ సంక్లిష్ట సమయంలో హిందువులందరూ సంయమనంతో వ్యవహరించాలి. ఈ ఘటనను స్వార్ధ ప్రయోజనాలకు ఉపయోగించుకుని.. హిందూ ధర్మంపై బురదజల్లే ప్రయత్నాలకు అడ్డు కట్టవేయాలి’’ అని దత్తాత్రేయ హోసబలే పేర్కొన్నారు. -
అయోధ్యరాముడి విరాళాల గోల్మాల్ : స్పందించిన ఆర్ఎస్ఎస్
అయోధ్య రామాలయంలో విరాళాల గోల్మాల్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలన రేపింది. దీనిపై ఉత్తరప్రదేశ్ ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికే అనేక షాకింగ్ విషయాలను వెల్లడించింది. తాజాగా విరాళాల మాయంపై వస్తున్న ఆరోపణలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తొలిసారి స్పందించింది. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అలాగే ఈ ఘటన ద్వారా హిందూమతాన్ని అప్రతిష్టపాలు చేయడానికి దేశ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది.అయోధ్యలోని రామమందిరంలో హుండీ సొమ్ము దొంగతనానికి గురైన ఘటన తమను ఎంతో కలచి వేసిందని, తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ఆర్ఎస్ఎస్ తెలిపింది. ఈ దురదృష్టకర సంఘటన హిందూ సమాజంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీరాముని భక్తుల మనోభావాలను, విశ్వాసాన్ని తీవ్రంగా గాయపరిచిందని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అభ్యర్థన మేరకు ఇప్పటికే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిందని, వారి సిఫార్సుల ఆధారంగా చట్టపరమైన చర్యలు ప్రారంభించిందని ఆర్ఎస్ఎస్ గుర్తు చేసింది. ఈ విచారణలో నిందితులుగా తేలిన వారెవరినైనా సరే చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.ఆలయ నిర్వహణ మారాలిఆర్ఎస్ఎస్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ ఘటనను ఒక ఎక్సెప్షనల్ విషయంగా పరిగణించాలని ఆర్ఎస్ఎస్ కోరింది. ఆలయ పరిపాలన, నిర్వహణ లోపాలన్నింటినీ సరిదిద్దడానికి తక్షణమే సమర్థవంత మైన చర్యలు చేపట్టాలని కోట్లాది భక్తులకు అయోధ్య ఆలయంపై ఉన్న నమ్మకం, భక్తి ఏమాత్రం సడలకుండా చూడాల్సిన బాధ్యత ట్రస్ట్‌పై ఉందని పేర్కొంది. ఈ విషయంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళం, అనిశ్చితికి వెంటనే ముగింపు పలకాలని కోరింది.ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్‌కు ఫౌండర్!హిందూ ధర్మాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర: దత్తాత్రేయ హోసబాలేఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రామాలయంలో విరాళాల దొంగతనం తీవ్రంగా బాధించిందన్నారు. అంతే కాకుండా, ఈ సంఘటనను ఆసరాగా చేసుకుని "హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తులు" హిందూ ధర్మానికి చెడ్డపేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయని హోసబాలే ఆరోపించారు. అందువల్ల సమగ్ర విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీకాగా ఆలయంలోని కౌంటింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని, అక్కడి ఉద్యోగులే డబ్బులను చాకచక్యంగా తస్కరించి, ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా ఆలయ ప్రాంగణంలోని వాష్‌రూమ్‌లలో దాచిపెట్టి, సీసీటీవీకి చిక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా బయటకు తీసుకెళ్లేవారని సిట్ విచారణలోనిందితులు తెలిపారు. అనేక సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. జూలై 15లోగా ప్రభుత్వం ముందుకు పూర్తి నివేదిక సమర్పించనుంది.ఇదీ చదవండి: రూ. 10 లక్షలకు ముంచేశారు, రోజంతా స్టేషన్లోనే : నటి ఆవేదన -
టోల్‌గేట్‌పై దూసుకొచ్చిన ఎల్పీజీ ట్యాంకర్ : నలుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పిజి)లోడ్‌తో వెళ్తున్న ఒక ట్యాంకర్ టోల్ బూత్‌ను ఢీకొట్టి పేలిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. జూన్ 26న ఉదయం 6:40 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగు చూడటంతో వైరల్‌గా మారింది.24 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో, రెండు ట్యాంకర్లు టోల్ బూత్ వైపు వస్తుండగా, వాటిలో ఒకటి అకస్మాత్తుగా అదుపుతప్పి, డివైడర్‌ను ఢీకొట్టి టోల్ ప్లాజాలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ ట్యాంకర్ నుండి గ్యాస్ లీక్ అవ్వడంతో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో కొద్ది క్షణాలకే, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. మంటలు సుమారు రెండు కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.మంటలను అదుపులోకి తీసుకు రావడానికి జిల్లాలోని అన్ని అగ్నిమాపక దళాల యూనిట్లతో పాటు సివిల్ పోలీసు సిబ్బందిని కూడా రంగంలోకి దించినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు.Remember the horrific fire at Sihori Toll Plaza on 26 June 2026?Four people lost their lives. Many others were left critically injured and are still battling for recovery.The CCTV footage now confirms the LPG tanker slammed into the divider, overturned, and only then… pic.twitter.com/m9ens5h2xx— ज़िद्दी नागरिक (@ZiddiNaagrik) July 3, 2026 ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీఈ ఘటనలో ధర్మేంద్ర దుబే (40) డ్రైవర్, అలోక్ అనే టోల్ ప్లాజా ఉద్యోగి అక్కడికక్కడే మరణించారు. టోల్ ప్లాజాలోని పలువురు ఇతర కార్మికులు కూడా తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు తర్వాత మరణించారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి వాహనాలను టోల్ ప్లాజా గుండా ఉచితంగా వెళ్ళడానికి కొద్దిసేపు అనుమతించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ఒక టెక్నికల్ టీంను ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: 16 పత్రాలిచ్చినా; సిటిజెన్‌షిప్‌పై గౌహతి కోర్టు సంచలన తీర్పు -
అయోధ్య విరాళాల కేసు.. కౌంటింగ్ రూమ్‌లో నిందితుల తొలి ఫొటోలు లీక్!
అయోధ్య: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రధాన నిందితులు అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రాలకు సంబంధించిన ఫొటోలు తాజాగా వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది.రామ మందిర భవనంలో అధికారుల సమక్షంలో భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. అయితే, సిబ్బంది విరాళాల్ని లెక్కిస్తున్న సమయంలోనే అవినాష్, అనుకల్ప్ ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు ఇప్పుడు బయటకు రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించేందుకు ట్రస్ట్ అధికారులు ఆలయ ప్రాంగణంలో రెండు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి లెక్కింపు కేంద్రం ‘పిల్గ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్’ కాగా, రెండవదాన్ని ఒక పోలీస్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ రెండవ కౌంటింగ్ సెంటర్లోనే కానుకలు లెక్కించే బాధ్యతలను ప్రధాన నిందితుడు అనుకల్ప్ మిశ్రా చూసేవాడు. అక్కడ నుంచే అతను ఈ అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. కుంభమేళా అనంతరం భక్తుల రద్దీ, కానుకల సమర్పణ విపరీతంగా పెరగడంతో, లెక్కింపును వేగవంతం చేయడానికి ట్రస్ట్ అధికారులు ఆలయ ఆవరణలోని ఒక పోలీస్ పోస్ట్ వద్ద రెండవ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది మార్చి నెలలో నగదు లెక్కింపు కోసం కొత్తగా రిక్రూట్ చేసిన 10 మంది సిబ్బందిని ఈ పోలీస్ పోస్ట్ వద్ద ఉన్న రెండవ కేంద్రానికే కేటాయించారు. వీరిలో ప్రధాన నిందితుడు అనుకల్ప్ మిశ్రాతో పాటు అవినాష్ శుక్లా, కరుణేష్ పాండే, లవకుష్ మిశ్రా ఉన్నారు.అనుకల్ప్ మిశ్రా నేరుగా విరాళాల వోచర్లు తయారు చేసే బాధ్యతను చూసేవాడు. అతను తన బావ అయిన లవకుష్ మిశ్రాతో కలిసి బ్యాంకుకు వెళ్లే క్యాష్ బండిల్స్‌లో అదనపు నోట్లను చేర్చేవాడు. బ్యాంకు అధికారులు బండిల్స్ సంఖ్యను మాత్రమే లెక్కించి డిపాజిట్ రశీదులు ఇచ్చే లోపాన్ని ఆసరాగా చేసుకుని, ఆలయం నుండి బ్యాంకుకు సొమ్ము తరలించే లోపే ఆ అదనపు నగదును వీరు రహస్యంగా నొక్కేసేవారని దర్యాప్తులో తేలింది.పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. విరాళాల లెక్కింపు సమయంలో సీసీటీవీ కంట్రోల్ రూమ్‌ను అధికారులు సరిగ్గా పర్యవేక్షించడం లేదనే విషయాన్ని నిందితులు గమనించారు. మొదట్లో కెమెరాలకు చిక్కకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించిన నిందితుడు అనుకల్ప్ మిశ్రా, ఆ తర్వాత నిఘా లోపాన్ని ఆసరాగా చేసుకుని కెమెరాల ముందే బహిరంగంగా నగదును పక్కదారి పట్టించాడు.ఆలయం నుంచి నిందితుడు అత్యంత చాకచక్యంగా నగదును తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాల ఆధారంగా దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నెలకు కేవలం రూ. 15,000 నుండి రూ. 18,000 జీతం తీసుకునే అనుకల్ప్ మిశ్రా పేరు మీద అయోధ్యలో రూ. 65 లక్షల విలువైన ఇల్లు, కొత్తగా నిర్మిస్తున్న ఫామ్‌హౌస్, రూ. లక్షకు పైగా విలువైన బైక్, మహీంద్రా స్కార్పియో ఎస్యూవీ బుకింగ్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఈ కేసులో మనీలాండరింగ్, నిధుల మళ్లింపు కోణాన్ని మరింత లోతుగా విచారించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ సహాయం కూడా కోరనున్నారు.దేవుడు చూస్తున్నాడురిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి, నిందితుడైన సుభాష్ శ్రీవాస్తవ లెక్కింపు ప్రక్రియకు ఇన్చార్జ్గా ఉన్నారు. విరాళాల పెట్టెల నుండి నగదును బయటకు తీసి, దానిని లెక్కింపు గదికి పంపి, చివరకు ఎస్బిఐకి అప్పగించడం అతని బాధ్యత. ఆభరణాలకు సంబంధించి సరైన రికార్డు ఉండేది కాదు.దీనివల్ల విరాళాల దుర్వినియోగం జరిగేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి విరాళాలు పక్కదారి మళ్లుతన్నాయనే విషయం తొలిసారి వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. లెక్కింపు బృందంలోని ఒక సభ్యుడు, లెక్కింపు సమయంలో పలువురు డబ్బును కాజేస్తున్నారని ఇన్చార్జ్ సుభాష్ శ్రీవాస్తవకు తెలియజేశారు. దీనికి శ్రీవాస్తవ..‘దేవుడు చూస్తున్నాడు. ఇది నీ ఇంట్లో నుంచో నా ఇంట్లో నుంచో పోయేది కాదు కదా’అని బదులిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
35 సెకండ్లలో 10 సార్లు తన్నిన స్వీపర్ : ఎంత అమానుషం
ఉత్తరప్రదేశ్‌లోని రాయబలేరిలోని ఒక ఆసుపత్రి ఉద్యోగిని నిస్సహాయుడైన రోగిపట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరు విమర్శలకు తావిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అత్యంత అమానుషమైన ఘటనగా స్వయంగా అధికారులే ప్రకటించారు. యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఆదేశాల మేరకు ఆసుపత్రి యాజమాన్యం సదరు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించింది.ఈ వీడియో ప్రకారం మానసిక ఆరోగ్యంగా సరిగ్గాలేని యువ రోగిని కేవలం 35 సెకండ్లలో సుమారు 10 సార్లు నిర్దాక్షిణ్యంగా తన్నడమే కాకుండా నోటికొచ్చినట్లు అతనిపై దుర్బాష లాడింది. అక్కడే సెక్యూరిటీ గార్డుకూడా చోద్యం చూశాడు తప్ప ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీనిపై స్పందించిన జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పుష్పేంద్ర కుమార్ సంబంధిత ఉద్యోగినిపై చర్యలు తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఉద్యోగిని ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్న పింకీగా గుర్తించినట్లు తెలిపారు. సస్పెన్షన్ కాలంలో పింకీని జిల్లా ఆసుపత్రిలోని ఆయుష్ (AYUSH) అవుట్‌పేషెంట్ విభాగానికి బదిలీ చేశారు. ఈ ఘటనపై నిర్ణీత కాలపరిమితిలోగా విచారణ జరిపేందుకు డాక్టర్ దినేష్ ప్రతాప్ సరోజ్ (ఆర్థోపెడిక్ కన్సల్టెంట్), డాక్టర్ రిచా (మైక్రోబయాలజిస్ట్), సుష్మా యాదవ్ (సిస్టర్-మేట్రన్) ముగ్గుర సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.ఇదీ చదవండి: షాకింగ్ : భారతీయ నావికుడి బాడీలో అవయవాలన్నీ మాయం!Who is mentally ill?A staff member at the district hospital in #Raebareli, #UttarPradesh, kicked a mentally ill young man. In this act of inhumanity, the female staff member kicked the young man on the head, face, and shoulder. The security guard standing nearby remained silent… pic.twitter.com/jejNEj56FV— Siraj Noorani (@sirajnoorani) June 30, 2026 అలాగే మెడికల్ అండ్ హెల్త్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అమిత్ కుమార్ ఘోష్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చీఫ్ మెడికల్ ఆఫీసర్లందరికీ సేవా ప్రవర్తనా నియమాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. రోగుల పట్ల దుష్ప్రవర్తన లేదా అమానుషంగా ప్రవర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.ఇదీ చదవండి: అయోధ్య విరాళాల స్కామ్ : మాజీ ట్రస్టీకి బిగుస్తున్న ఉచ్చుఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్ -
అయోధ్య విరాళాల స్కామ్ : మాజీ ట్రస్టీకి బిగుస్తున్న ఉచ్చు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో (Ayodhya Ram Temple) విరాళాల కుంభకోణంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుంభకోణంలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తులో నిందితులు దొంగలించిన సొత్తును వాష్‌రూమ్‌ల్లో దాచి పెట్టిన విషయం కలకలం రేపుతోంది. నిందితుల సమాచారంతో ఈ స్కామ్‌లో రామ్ మందిర్ ట్రస్ట్ మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా పాత్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. నిందితుడు అవినాష్ మిశ్రాను (శుక్లా) పోలీసులు విచారించినప్పుడు అనిల్ మిశ్రా పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. విరాళాల లెక్కింపు ప్రక్రియలో అనిల్ మిశ్రా కూడా పాల్గొనేవారని సమాచారం.అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. దొంగిలించిన కోట్లాది రూపాయల నగదును గుడి వెలుపలికి తీసుకెళ్లే ముందు తాత్కాలికంగా వాష్‌రూమ్‌లలో (మరుగుదొడ్లలో) దాచినట్లు ఒప్పుకున్నాడు. విరాళాలు లెక్కించే గది ఒక తాళంచెవి చంపత్ రాయ్ అనుచరుడైన టిన్నూ యాదవ్ వద్ద ఉండగా, రెండో తాళంచెవి బ్యాంక్ ఉద్యోగుల వద్ద ఉండేదని నిందితుడు తెలిపాడు.నిందితులకు ఆలయ ప్రాంగణంలోని సిసిటివి (CCTV) కెమెరాల స్థానాలపై పూర్తి అవగాహన ఉంది. అందుకే నిఘా సిబ్బంది తమ కదలికలను సరిగ్గా గమనించకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కెమెరాల కంటికి చిక్కకుండా ఒకరికొకరు కవర్‌గా నిలబడి డబ్బును దొంగిలించేవారని శుక్లా వివరించాడు. దొంగిలించిన సొమ్ముతో భూములు, ఇళ్లను కొనుగోలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు వీరి ఆర్థిక లావాదేవీలు, ఆస్తులపై దృష్టి సారించారు.లెక్కింపు గది తాళాలు - బ్యాంక్ సిబ్బంది కుమ్మక్కు:అరెస్ట్ అయిన నిందితుల్లో 'టిన్నూ యాదవ్' (రామశంకర్ యాదవ్) అత్యంత కీలకమైన వ్యక్తిగా తేలాడు. విరాళాలు లెక్కించే గది ఒక తాళంచెవి టిన్నూ యాదవ్ వద్ద ఉండగా, రెండో తాళంచెవి బ్యాంక్ సిబ్బంది వద్ద ఉండేది. కేవలం లోపలి వ్యక్తులే కాకుండా, బ్యాంక్ సిబ్బందితో కూడా కుమ్మక్కై ఈ దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దొంగిలించిన సొమ్ములో టిన్నూ యాదవ్‌తో పాటు సదరు బ్యాంక్ ఉద్యోగులు కూడా వాటాలు పంచుకున్నట్లు సమాచారం.కాగా విరాళాల లెక్కింపు ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన ఆలయ ట్రస్టీ అనిల్ మిశ్రా, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌లు ఈ అవకతవకలపై ప్రశ్నలు తలెత్తడంతో గత వారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ కుంభకోణం వ్యవహారంలో యూపీ ప్రభుత్వం జూన్ 13న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ SIT విచారణ ప్రారంభించడానికి ముందే పోలీసులు రూ. 58 లక్షలను రికవరీ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్ -
అపుడు లవర్ కోసం ఇస్లాంలోకి ఆయుష్ : ఇపుడు కొత్త ట్విస్ట్
ఉత్తర ప్రదేశ్‌లోని షామ్లీకి చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ దేవరాజ్ మాలిక్ కుమారుడు 30 ఏళ్ల ఆయుష్ మాలిక్ గుర్తున్నాడా? ముస్లిం యువతిని వివాహం చేసుకొనేందుకు ముస్లింగా మారి ఈద్ పండుగ రోజున నమాజ్ చేస్తూ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాడు. మత మార్పిడి నిరోధక చట్టం కింద ఆయుష్పైనా, వధువు తల్లిదండ్రులపైనా కేసు నమోదు కావడం అప్పట్లో చర్చకు దారి తీసింది. ఇపుడీ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయుష్ మాలిక్, ఇప్పుడు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించాడు. చట్టవిరుద్ధ మత మార్పిడుల నిషేధ చట్టం కింద దేవరాజ్ మాలిక్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు, ఫిజియోథెరపిస్ట్ చాందిని ఖురేషి ,ఆమె తండ్రి ఇస్లాం ఖురేషిలను ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన కొన్ని వారాల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.Ayush Malik, who had earlier claimed to adopt Islam in Shamli, Western Uttar Pradesh, has returned to Sanatan Hindu Dharma. Ayush Malik reconverted to Hinduism at his home in the presence of his family. Yashvir Maharaj stated that Ayush Malik embraced Hindu religion once… pic.twitter.com/jYtLN4QHF2— VARAHA WARRIOR (@VarahaWarrior) June 30, 2026తన తల్లిదండ్రులు పడుతున్న బాధను గమనించిన తర్వాత, స్వచ్ఛందంగానే తిరిగి హిందూ మతాన్వి స్వీకరించాడని అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయుష్ హిందూ సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ, ప్రార్థనలు చేయడం విశేషం. తాను గతంలో ఇస్లాం మతంలోకి మారినప్పటికీ, ఇప్పుడు స్వచ్ఛందంగా సనాతన ధర్మానికి తిరిగి వచ్చి తన కుటుంబంతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నానని ఆ వీడియోలో చెప్పాడు. తన కుమారుడు అధికారికంగా తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించాడని అతని తండ్రి దేవరాజ్ మాలిక్ తెలిపారు. ఇదీ చదవండి: తనకోసం బంగారు గాజులమ్మిన తల్లికి అదిరిపోయే గిఫ్ట్!గతంలో ఏం జరిగింది?బి-ఫార్మా పట్టభద్రుడైన ఆయుష్ తన కుటుంబానికి చెందిన మెడికల్ స్టోర్ నిర్వహణలో సహాయపడేవాడు. 2018లో కాలి గాయానికి చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అతనికి చాందినీ పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఇస్లాంను స్వీకరించిన తర్వాత మహమ్మద్ అలీగా పేరు మార్చుకున్న ఆయుష్ మాలిక్ , చాందినిని వివాహమాడాడు. ఈ విషయంలో ఎవరి బలవంతం లేదని, స్వచ్ఛందగానే ఇస్లాంను స్వీకరించానని, తన భార్య కోసం న్యాయ పోరాటం చేస్తానని చెప్పిన ఆయుష్ ప్రకటించాడు. అయితే చాందినీ,ఆమె కుటుంబ సభ్యులు అతన్ని ఇస్లాం మతాన్ని స్వీకరించేలా క్రమంగా ప్రభావితం చేశారని పోలీసులు తెలిపారు. 2023లో ఆయుష్‌ను ఢిల్లీకి తీసుకెళ్లి, అక్కడ ఇస్లాం మతంలోకి మార్చి 'మహ్మద్ అలీ'గా పేరు మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీలో నికాహ్ (వివాహ) వేడుక కూడా జరిగిందని అందులో పేర్కొన్నప్పటికీ, విచారణలో ఎటువంటి వివాహ ధృవీకరణ పత్రం లభించలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు కోట్ల రూపాయల విలువైన కుటుంబ ఆస్తిని చేజిక్కించుకునే కుట్రలో భాగంగా, చాందినీ ఖురేషీ ,ఆమె తండ్రి ఇస్లాం ఖురేషీ కలిసి ఆయుష్‌ను మభ్యపెట్టి (బ్రెయిన్ వాష్ చేసి), 'మహ్మద్ అలీ' పేరుతో ఇస్లాం మతంలోకి మార్చారని దేవరాజ్ మాలిక్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయుష్ హిందూ మతంలోకి మారడం ట్విస్ట్. మరి అతని భార్య పరిస్థితి ఏంటి? భార్యతో విడిపోయాడా? కలిసే ఉంటాడా అన్నే ప్రశ్నలకు సమాధానం లేదు. -
అయోధ్య కుంభకోణం.. వీహెచ్‌పీ కీలక వ్యాఖ్యలు
అయోధ్య రామ మందిరంలో వెలుగుచూసిన విరాళాల కుంభకోణం.. మరిన్ని చీకటి విషయాలను వెలుగులోకి తెస్తోంది. భక్తులు సమర్పించే కానుకలు సైతం మాయం చేశారని.. అలాగే గోల్మాల్ జరిగిందన్న విషయం ట్రస్ట్ పెద్దలకు ముందే తెలుసని సిట్ దర్యాప్తు తేల్చింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో విశ్వ హిందూ పరిషత్ (VHP) స్పందించింది.అయోధ్య రామ్ మందిరానికి సంబంధించిన డొనేషన్ల దుర్వినియోగం ఆరోపణలతో.. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరు మసకబారిపోయింది. భక్తులు సమర్పించిన విరాళాలు ఒక ప్లాన్ ప్రకారం దారి మళ్లించబడ్డాయని వచ్చిన ఆరోపణలతో విచారణ వేగం పెరిగింది. ఈ కేసులో ట్రస్ట్‌లో కీలక పాత్ర పోషించిన చంపత్ రాయ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ (VHP) అంతర్జాతీయ అధ్యక్షుడు ఆలక్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.రామ్ జన్మభూమి ఉద్యమ లక్ష్యం పూర్తయిన తర్వాత ఆలయ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ట్రస్ట్ పరిధిలోకి వెళ్లాయి. అక్కడితోనే మా పాత్ర ముగిసింది. మందిర నిర్మాణం వరకే మా పాత్ర పరిమితమైంది. ఆ తర్వాత ఆలయ నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు ట్రస్ట్ బాధ్యతేనని ఆయన తేల్చి చెప్పారు. అలాగే.. చంపత్ రాయ్ వ్యవహారాన్ని వీహెచ్‌పీతో అంటగట్టవద్దని ఆలక్ పరోక్షంగా సూచించారు. ట్రస్ట్‌లో జరిగే నిర్ణయాలకు సంస్థ బాధ్యత వహించదని స్పష్టం చేస్తూ, వ్యక్తిగతంగా ఎవరు చేసిన చర్యలకైనా ట్రస్ట్ మాత్రమే సమాధానం చెప్పాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.చంపత్ రాయ్ గతంలో విశ్వ హిందూ పరిషత్‌లో సుదీర్ఘంగా పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. రామ్ జన్మభూమి ఉద్యమ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అదే అనుభవంతో తరువాత శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. చంపత్తో పాటు మరికొందరు వీహెచ్‌పీ అనుబంధ నేతలు కూడా ట్రస్ట్ సభ్యులుగా పని చేశారు. అయితే విరాళాల గోల్మాల్ వ్యహారం బయటకు రావడం.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠిన వైఖరి, సిట్ ప్రాథమిక నివేదిక నేపథ్యంలో చంపత్‌రాయ్ జూన్ 27న ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఆలయ సిబ్బంది సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఆధారాల ప్రకారం సుమారు రూ.7 నుంచి రూ.7.5 కోట్ల వరకు విరాళాల దుర్వినియోగం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుంభకోణంలో మరెవరెవరికి ప్రమేయం ఉందనే కోణంలో కూడా సిట్ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.అయితే ట్రస్ట్ ఏర్పాటైన తర్వాత అది స్వతంత్ర సంస్థగా పనిచేస్తుందని వీహెచ్‌పీ ఇలా ప్రకటించడం కొత్తేం కాదు. తాజాగా వచ్చిన వివాదాల నేపథ్యంలో అదే స్టాండ్‌ను మరోసారి బలంగా పునరుద్ఘాటించింది.రామ్ మందిర ఉద్యమం, జనజాగరణ, భూమి పోరాటం వంటి దశల్లో వీహెచ్‌పీ సంస్థ కీలక పాత్ర పోషించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ బాధ్యతలు పూర్తిగా ట్రస్ట్ చేతుల్లోకి వెళ్లాయి. అందుకే ప్రస్తుతం ఆలయ ఆర్థిక వ్యవహారాలు, విరాళాలు, నిర్వహణలో తమకేం ప్రత్యక్ష పాత్ర లేదని సంస్థ స్పష్టం చేస్తోంది.ఇక ఈ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ కొనసాగిస్తోంది. డొనేషన్ నిధుల వినియోగం, బ్యాంక్ లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజ్, నగదు ప్రవాహం అన్నీ పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా, మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. భక్తుల నమ్మకంతో నిర్మితమైన రామ్ మందిరం చుట్టూ వచ్చిన ఈ వివాదం ఇప్పుడు వీహెచ్‌పీ స్టేట్మెంట్ తర్వాత.. సంస్థాగత బాధ్యతలపైనా పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. చంపత్‌రాయ్‌పై ప్రశ్నల వర్షం.. రామ్ మందిరం డొనేషన్ కుంభకోణం దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా మాజీ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ను రెండు గంటలకు పైగా విచారించింది. భక్తుల విరాళాల సేకరణ, నగదు లెక్కింపు, విలువైన కానుకల భద్రపరిచడం, వాటిని బ్యాంకుల్లో జమ చేసే విధానం వరకు ప్రతి అంశంపై అధికారులు ఆయన నుంచి వివరాలు సేకరించారు. అయితే డొనేషన్ దుర్వినియోగంలో తనకు ఎలాంటి పాత్ర లేదని చంపత్‌రాయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. అక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే తానే ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశారని, విరాళాల సేకరణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడడం తన బాధ్యతేనని విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. -
ఒక్క క్షణం.. ఒక మలుపు.. నలుగురి ప్రాణాలు బలి
-
రామమందిరం విరాళాల కేసులో కొత్త ట్విస్ట్!
అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం కేసు కొత్త మలుపు తిరిగింది. కేసు అధికారికంగా నమోదు కావడానికి ముందే.. దొంగిలించబడిన నగదులో భారీ మొత్తాన్ని రికవరీ చేసినట్లు వెలుగులోకి రావడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో ఆలయ ట్రస్ట్ పాత్ర, పోలీసుల చర్యలు, దర్యాప్తు తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ప్రారంభించకముందే.. దొంగిలించబడిన నగదులో సుమారు రూ.58 లక్షలను ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామం కేసు దర్యాప్తులో కొత్త కోణాన్ని తెరపైకి తీసుకొచ్చింది.జూన్ 4వ తేదీన విరాళాల నగదు గల్లంతైన విషయం ట్రస్ట్‌కు తెలిసింది. మరుసటి రోజే అప్పటి ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ ఆదేశాల మేరకు ట్రస్ట్ ప్రతినిధులు, పోలీసులతో కలిసి నిందితుడు అవినాశ్ శుక్లా ఇంటికి వెళ్లి సుమారు రూ.58 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం జూన్ 5 నుంచి 8 మధ్య మిగిలిన మొత్తం నిందితులు బ్యాంకు బదిలీల ద్వారా తిరిగి చెల్లించినట్లు సమాచారం.అయితే ఈ మొత్తం రికవరీ అంతా ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే జరగడం ఇప్పుడు దర్యాప్తులో కీలక అంశంగా మారింది. కేసు బయటకు రావడానికి ముందే నగదు రికవరీ ఎందుకు జరిగింది? అధికారిక ఫిర్యాదు నమోదు చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగింది? అనే అంశాలపై విచారణ సంస్థలు దృష్టి సారించాయి.ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాతే.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి మరికొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.ఈ వివాదం నేపథ్యంలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అప్పటి ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు విరాళాల నగదు నిర్వహణ, ఉద్యోగుల నియామకాలు, సీసీటీవీ పర్యవేక్షణలో పలు లోపాలు ఉన్నట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం.కేసుపై ఇటు రాజకీయంగానూ దుమారం కొనసాగుతోంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా.. విశ్వహిందూ పరిషత్ (VHP) మాత్రం పారదర్శక దర్యాప్తు జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు సుప్రీం కోర్టు ఈ వ్యవహారంలో దాఖలైన పిల్‌ను.. నిదానంగా విచారణ జరుపుతానని అంటోంది.ఎఫ్ఐఆర్కు ముందే నగదు రికవరీ జరిగిన వ్యవహారం, దాని వెనుక అనుసరించిన ప్రక్రియపై ఇప్పుడు దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరా తీస్తుండటంతో.. రామమందిరం విరాళాల కేసు మరిన్ని సంచలన విషయాలను వెలుగులోకి తీసుకురానుందా అనే ఆసక్తి నెలకొంది. -
22వ అంతస్తులో పేలిన ఏసీ!.. భారీ అగ్నిప్రమాదం
మరో భారీ అగ్నిప్రమాదంతో దేశ రాజధాని రీజియన్ ఉలిక్కి పడింది. నోయిడాలోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అక్కడి ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఏసీ యూనిట్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.నోయిడా సెక్టార్-119లో ఉన్న అరణ్య సొసైటీలో సోమవారం వేకువ జామున ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో ఆరు ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. ఘటనాస్థలికి గౌతమ్‌బుద్ధ్‌నగర్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ (CFO), స్థానిక పోలీసులు కూడా చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అగ్నిమాపక సిబ్బంది అపార్ట్మెంట్లోని ఇతర నివాసితులను అప్రమత్తం చేస్తూ, మంటలు ఇతర ఫ్లాట్లకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.Fire breaks out in a high rise in sector 119, #Noida pic.twitter.com/82ZkYvGNFl— Karan Singh / करन सिंह (@Journo_Karan) June 29, 2026ప్రస్తుతం వరకు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అయితే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాతే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణంపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు.. ఇదిలా ఉండగా ఢిల్లీలో మాత్రం ఉష్ణోగ్రతలతో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. పగటి పూటే కాదు.. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణానికి మించి నమోదు కావడంతో ప్రజలు తీవ్రమైన ఉక్కపోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఏసీలు వాడాల్సి వస్తుండగా.. షార్ట్ సర్క్యూట్‌తోనే నోయిడా ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో కూలర్లు, ఏసీల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు పౌరులకు సూచిస్తున్నారు. -
అంత ఎత్తున రైలింగ్‌పై నిలబడి.. గంగలో దూకబోయిన యువతి
ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే... ఓ ప్రాణం గంగలో కలిసిపోయేది. వంతెన రైలింగ్‌పై నిలబడి కిందకు దూకేందుకు సిద్ధమైంది ఓ యువతి. కింద వందలాది మంది చూస్తున్నారు.. కానీ ఎవరూ దగ్గరకు వెళ్లలేకపోయారు. చివరికి ఓ యువకుడు ప్రాణాలకు తెగించి చేసిన సాహసం... ఆ యువతి ప్రాణాన్ని నిలబెట్టింది. అసలు ఆమె ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించింది? ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఆ ఉత్కంఠభరిత ఘటన గురించి తెలుసుకుందాం...వారణాసిలోని మాలవీయ వంతెనపైకి డార్జిలింగ్, నార్త్ పాయింట్ టుక్వార్కు చెందిన 23 ఏళ్ల యువతి ఎక్కింది. గంగానదిలో దూకేందుకు ప్రయత్నించింది. అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుని ఆమెను కిందకు దిగాలని సూచనలు చేశారు. అయినప్పటికీ ఆ యువతి దిగలేదు. అదే సమయంలో ఓ యువకుడు వంతెన రైలింగ్‌పైకి ఎక్కి, వెనుక నుంచి ఆమెను పట్టుకుని సురక్షితంగా కాపాడాడు. ఆ తర్వాత మరొకరు కూడా వంతెనపైకి ఎక్కి ఆమెను పట్టుకున్నారు.ఈ ఘటన మొత్తం వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి గంగా నదిలో దూకుతానంటూ దాదాపు గంట పాటు అక్కడే నిలబడి అరుస్తూ కనిపించింది. దీంతో వంతెనపై వెళ్లే, వచ్చే వారి రద్దీ పెరిగింది. సమాచారం అందిన 25 నిమిషాల తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని జనాన్ని అక్కడి నుంచి పంపించేశారు.ఆదంపూర్ పోలీసు ఔట్‌పోస్ట్ ఇన్‌ఛార్జి ప్రశాంత్ పాండే తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యువతి ఓ ఇన్ఫ్లూయెన్సర్. తన స్నేహితుడి మాటలతో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. View this post on Instagram A post shared by Policenama (@policenamaa) -
అయోధ్య కుంభకోణం: సిట్ బయటపెట్టిన షాకింగ్ నిజాలు!
భక్తులు భగవంతుడిపై విశ్వాసంతో హుండీలో వేసిన కానుకలనే కొందరు సిబ్బంది కాజేశారు. సీసీ కెమెరాలు ఉన్నా పట్టుబడకుండా చాకచక్యంగా వ్యవహరించారు. ఒకరు కెమెరాకు అడ్డంగా నిలబడితే.. మరొకరు హుండీలోని నగదును, నగలను మాయం చేశారు. అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) బయటపెట్టిన వివరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు కేవలం 40 రోజుల్లోనే దాదాపు 70 సార్లు చోరీలు జరిగినట్లు సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాల ద్వారా గుర్తించారు. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు.. రూ.79.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.దర్యాప్తులో బయటపడిన విధానం మరింత విస్మయానికి గురిచేస్తోంది. విరాళాల లెక్కింపు సమయంలో ఒక ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడేవాడు. అదే సమయంలో అతని సహచరులు హుండీలోని నగదును దొంగిలించి తమ దుస్తుల్లో దాచుకునేవారు. అనంతరం ఆ డబ్బును స్నానాల గదిలో దాచిపెట్టి, అనువైన సమయంలో బయటకు తీసుకెళ్లి పరస్పరం పంచుకునేవారని ఎస్ఐటీ గుర్తించింది.ఇంతటితో ఆగలేదు. హుండీల్లో వచ్చిన నగదును బ్యాంకులకు తరలించే సమయంలో కూడా కొంత మొత్తాన్ని పక్కకు మళ్లించి కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. నగదు లెక్కింపు, భద్రపరచడం, బ్యాంకులో జమ చేసే మొత్తం ప్రక్రియలో పలు దశల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.నగదుతో పాటు భక్తులు బాలరాముడికి సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలు కూడా మాయమైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. హుండీలో వేసిన చెవిపోగులు, ముక్కుపుడకలు, గాజులు, కాలి గజ్జెలు.. లాంటి విలువైన ఆభరణాల లెక్కల్లో కూడా తేడాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. అయితే వీటి విలువ, పరిమాణంపై అధికారులు ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు.ఎస్ఐటీ ప్రాథమిక నివేదిక ఆధారంగా నమోదైన కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా జూన్ 29 వరకు పోలీసు కస్టడీకి పంపించారు. అరెస్టయిన వారిలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌కు మాజీ డ్రైవర్‌గా పనిచేసిన టిన్నూ యాదవ్ కూడా ఉన్నాడు.ఈ పరిణామాల మధ్య.. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి పేర్లు ఎఫ్ఐఆర్లో లేకపోయినా, అరెస్టయిన కొందరు నిందితులు తమ సన్నిహితులేనన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ‘‘ప్రజల విశ్వాసంతో చెలగాటమాడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. దోషులు కఠిన శిక్షను ఎదుర్కోవాల్సిందే’’ అని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. అయోధ్య రామమందిరం వంటి దేశంలోని అత్యంత ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంలో విరాళాల భద్రత, పారదర్శకతపై ఈ ఘటన తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. దర్యాప్తులో మరెన్ని సంచలనాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. -
యూపీ బీజేపీ కార్యవర్గం ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరిగే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ తన కార్యాచరణను వేగవంతం చేసింది. ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి కీలకంగా ఉన్న ‘పీడీఏ’(వెనుకబడిన, దళిత, మైనారిటీ) అస్త్రాన్ని దీటుగా ఎదుర్కొనే మిషన్– 2027 వ్యూహాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్ చౌదరి 64 మంది సభ్యుల జంబో కమిటీ వివరాలను శుక్రవారం విడుదల చేశారు. ఈ కమిటీలో 19 మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు, 19 మంది కార్యదర్శులు, ఆరుగురు ప్రాంతీయ అధ్యక్షులు ఉన్నారు. కుల సమీకరణాలకే ప్రాధాన్యం యూపీలో అధికారం నిలబెట్టుకోవాలంటే నాన్–యాదవ్ ఓబీసీలు అత్యంత కీలకం. అందుకే, యూపీ బీజేపీ తన కార్యవర్గంలో ఏకంగా ఓబీసీ నేతలకు 20కి పైగా కీలక పదవులను కట్టబెట్టింది. గత కమిటీలో ఓబీసీ నేతలు 18 మంది మాత్రమే కాగా, ఈసారి వారి ప్రాతినిథ్యాన్ని మరింతగా పెంచింది. రాజ్‌భర్, బింద్, గుర్జర్, సైని తదితర వర్గాలకు సముచిత స్థానం కల్పించారు. పార్టీలోని ఆరుగురు ప్రాంతీయ అధ్యక్షుల్లో నలుగురు (నవాబ్ సింగ్ నగర్–పశ్చిమ యూపీ, పూరన్ లాల్ లో«దీ–బ్రిజ్, రామ్ కిషోర్ సాహు–కాన్పూర్, అశోక్ చౌరాసియా–కాశీ) ఓబీసీ వర్గానికే చెందిన వారు కావడం విశేషం. మిగిలిన రెండు ప్రాంతాలకు బ్రాహ్మణ, భూమిహార్ వర్గాలకు చెందిన అవధేష్ ద్వివేది (అవ«ద్), వినోద్ రాయ్ (గోరఖ్‌పూర్) లను ఎంపిక చేశారు. ప్రధాన కార్యదర్శుల్లో ఎనిమిది మందిగాను ముగ్గురు ఓబీసీ వర్గానికి చెందినవారే. -
ఏఐ మెమరీచిప్స్ విస్తరణకు రూ. 1,000 కోట్లు
న్యూఢిల్లీ: ఏఐ మెమరీ చిప్స్ తయారీ సామర్థ్యాలను మరింతగా పెంచుకోవడంపై మైఫై దృష్టి పెడుతోంది. ఇందుకోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని, ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ప్రస్తుతమున్న ప్లాంటును విస్తరించాలని యోచిస్తోంది. ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, ఆటోమొబైల్ తదితర రంగాల నుంచి మెమరీ సొల్యూషన్స్‌కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైఫై సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు వ్యాపార వృద్ధి, రూ.1,000 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. మైక్రోమ్యాక్స్, తైవాన్‌కి చెందిన ఫైసన్ సంస్థ కలిసి జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేసిన మైఫై గతేడాది జనవరిలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాయి. దేశ విదేశీ కస్టమర్ల నుంచి భారీ ఆర్డర్ల దన్నుతో వచ్చే రెండు మూడేళ్లలో యూనికార్న్‌గా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) ఎదిగే అవకాశం కూడా ఉందని శర్మ తెలిపారు. కేవలం హార్డ్‌వేర్‌కే పరిమితం కాకుండా కృత్రిమ మేధ (ఏఐ) సాఫ్ట్వేర్ విభాగంలోకి కూడా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. కృత్రిమ మేధ పనులకు సంబంధించి సిస్టమ్ మెమరీని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు తమ ఏఐ అడాప్టివ్ మెమరీ సాఫ్ట్వేర్ సహాయకరంగా ఉంటుందని వివరించారు. -
సిబ్బందికి రీల్స్ పిచ్చి.. అదను చూసి సెంట్రల్ జైలు నుంచి ఖైదీ జంప్!
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ సెంట్రల్ జైల్లో జరిగిన నిర్లక్ష్యంలో జైలు ఉన్నతాధికారులు చిక్కుల్లో పడ్డారు. జైల్లో విధులు నిర్వహిస్తున్న గార్డులు తమ విధులు విస్మరించి మొబైల్లో రీల్స్ చూస్తుండగా.. జీవిత ఖైదు అనుభవిస్తున్న దినేష్ అనే ఖైదీ జైలు గోడ దూకి పారిపోయాడు. ఈ ఘటనలో జైలర్ సహా 11 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఉన్నతాధికారులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ సెంట్రల్ జైలు దేశంలో అత్యంత కట్టుదిట్టమైన జైళ్లలో ఒకటి. ఇక్కడ అనేక మంది హై-ప్రొఫైల్ ఖైదీలు ఉన్నారు. ఇదే జైలులో అమ్రోహా జిల్లా నన్హెడా రాజ్‌పుత్ గ్రామానికి చెందిన దినేష్ (22) బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం అతనిని మరో 45 మంది ఖైదీలతో కలిసి జైలులోపల వ్యవసాయ పనులకు పంపారు.ఘటన జరిగిన మధ్యహ్నం సుమారు 12.30 గంటల సమయంలో 10 మంది జైలు సిబ్బంది పర్యవేక్షణలో ఉండగా నిందితుడు ఐదు అడుగుల ఎత్తైన గోడను ఎక్కి దినేష్ పారిపోయాడు. పారిపోయే సమయంలో జైలు సిబ్బంది మొబైల్ ఫోన్లలో రీల్స్ చూస్తున్నారని విచారణలో బయటపడింది.ఈ ఘటనపై డీజీ (ప్రిజన్స్) పీసీ మీనా తక్షణ చర్యలు తీసుకున్నారు. జైలర్ నీరజ్ కుమార్, డిప్యూటీ జైలర్ వందనా చౌధరిలను సస్పెండ్ చేశారు. అదనంగా, సీనియర్ జైలు సూపరింటెండెంట్ అవినాష్ గౌతంపై కఠినమైన శాఖా చర్యలు సిఫారసు చేశారు. మరో ఏడు మంది కింది స్థాయి సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు. బరేలీ సెంట్రల్ జైల్లో సీసీటీవీ కెమెరాలు, పోలీసు పోస్టు, అదనపు భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, వరుసగా ఖైదీలు తప్పించుకోవడం జైలు నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఖైదీలను బయట పనులకు పంపినప్పుడు పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని అధికారులు అంగీకరించారు.దినేష్‌ను పట్టుకోవడానికి అమ్రోహా మరియు పరిసర ప్రాంతాల్లో శోధన బృందాలు ఏర్పాటు చేశారు. పోలీసులు, జైలు అధికారులు కలిసి అతని కోసం గాలిస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.కాగా, జైల్లో ఖైదును అనుభవిస్తున్న ఖైదీలో తప్పించుకోవడం ఇదే తొలిసారి కాదు. 2024 అక్టోబర్‌లో హర్పాల్ అనే హత్యా ఖైదీ కూడా ఇక్కడి నుండి పారిపోయాడు. ఆ సమయంలో కూడా సిబ్బందిని సస్పెండ్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తరువాత అతన్ని పోలీసు ఎన్కౌంటర్లో తిరిగి పట్టుకున్నారు. -
జి రామ్ జి కేటాయింపులు..
విబి–జి రామ్ జి (వికసిత్ భారత్– గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్– గ్రామీణ్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.95,692 కోట్ల ప్రతిపాదిత కేటాయింపులను ప్రకటించింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ పొందాయి. -
విద్యుత్ తీగలపై ఊయలలూగిన తాగుబోతు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మద్యం తాగిన ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడో వ్యక్తి. మద్యం మత్తులో ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కేశాడు. అంతటితో ఊరుకోలేదు. హైవోల్టు తీగల మీద పడుకుని ఊయలూగాడు. రాష్ట్రంలోని మహరాజ్‌గంజ్ జిల్లాలోని పర్సా ఖుర్ద్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గ్రామంలోని దీన్‌దయాల్ అనే వ్యక్తి పీకలదాకా తాగాడు. మద్యం మత్తులో స్థానికంగా ఉన్న ఓ విద్యుత్ స్తంభం ఎక్కాడు. చుట్టుపక్కల వాళ్లు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరు ఎంత వారించినా వినకుండా స్తంభం ఎక్కడమే కాదు.. 11వేల ఓల్టుల విద్యుత్ సరఫరా చేసే హైటెన్షన్ తీగలపై పడుకున్నాడు. ఓవైపు తల, మరో వైపు కాళ్లు పెట్టి వేలాడుతూ ఊయలూలాగాడు. ఎంత మంది చెప్పినా..కిందకు దిగడానికి నిరాకరించాడు. తీవ్ర భయాందోళనకు గురైన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే భితౌలి పోలీసులు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించి విద్యుత్ సరఫరా నిలిపేసేలా చూశారు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి అతడిని స్తంభం నుంచి దించేందుకు ప్రయత్నించారు. చివరికి వారి ప్రయత్నాలు ఫలించాయి. అతను స్తంభం నుంచి సురక్షితంగా దిగాడు. కొన్ని గంటలపాటు నెలకొన్న ఉత్కంఠకు తెరపడి.. అక్కడ గుమిగూడిన జనం ఊపిరి పీల్చుకున్నారు. సహాయక చర్యలకు తోడు ఆయనకు అదృష్టం కూడా కలిసొచ్చింది. దీన్ దయాళ్ స్తంభం ఎక్కడానికి కొన్ని నిమిషాల ముందే ఆ లైన్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ తరువాత పోలీసులు, విద్యుత్ శాఖ వేగవంతమైన సమన్వయంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే!
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ (Budaun) జిల్లాలో జరిగిన ఒక మతాంతర వివాహం, అనంతర పరిణామాలు చర్చనీయాంశంగా నిలిచాయి. ఈ ప్రేమ వివాహం ఒక కుటుంబంలో సంబరాలకు దారి తీయగా, మరో కుటుంబంమాత్రం విచారంలో మునిగి పోయింది. ముస్లిం యువతి (హీరా నాజ్ బీ) హిందూ యువకుడిని (అతుల్) వివాహం చేసుకుని, హిందూ మతంలోకి మారి హిమాన్షీ కుమారిగా పేరు మార్చుకున్న 19 ఏళ్ల యువతికథ ఇది. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏమైంది అంటే.. 2023లో హీరా నాజ్ బీ 10వ తరగతి చదువుతున్నప్పుడు వారి గ్రామానికి సమీపంలో అతుల్‌తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. మూడేళ్ల తర్వాత, ఈ ఏడాది జనవరిలో వారు ఆర్య సమాజ్ ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 'లివ్-ఇన్' సర్టిఫికేట్ తీసుకుని, ఆమె తిరిగి తన తల్లిదండ్రుల వద్దకి వెళ్ళిపోయింది.అయితే ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా కొట్టి, గదిలో బంధించారు. దీంతో ఆమె 100 నంబర్‌కు డయల్ చేసి, తనకు ప్రాణభయం ఉందని పోలీసుల సహాయం కోరింది.మరోవైపు యువతి మైనర్ అని, అతుల్ ఆమెను ప్రలోభపెట్టాడని యువతి కుటుంబం ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్‌కు పిలిపించి విచారించారు.యువతి తాను మేజర్ (వయస్సు నిండిన వ్యక్తినని) అని, తన ఇష్టపూర్వకంగానే అతుల్‌తో వెళ్తానని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది. చట్టప్రకారం ఆమె వయోజనురాలు కావడంతో, పోలీసులు ఆమె నిర్ణయానికే మొగ్గుచూపి వారిని కలిసి వెళ్ళడానికి అనుమతించారు.Budaun, Uttar Pradesh - A muslim girl Heena Nazmi broke all religious ties and married with Hindu boyfriend Atul at Khatushyam Mandir after court marriage.Now her new name is Himanshi. After that once again proved love has no religious boundaries. pic.twitter.com/0EsMjLLago— ॐ Er Prince Raj 🚩 (@PrinceRaj628) June 18, 2026 "> ఇదీ చదవండి : రూ. 18 కోట్ల మేయర్ కిడ్నాప్ డ్రామా : సంచలన ఆరోపణలు అబ్బాయి కుటుంబం సంబరాలువీరి ప్రేమను ఆమోదించిన అతుల్ కుటుంబ సభ్యులు, బజరంగ్ దళ్ సభ్యులసమక్షంలో వీరిద్దిరికీ బదౌన్‌లోని ఖాటూ శ్యామ్ ఆలయంలో మళ్లీ ఘనంగా వివాహం జరిపించారు. హిందూత్వ సంస్థలు మరియు బజరంగ్ దళ్ సభ్యులు దీనిని 'ఘర్ వాప్సీ' (Ghar Wapsi) గా అభివర్ణించారు. ఆలయం వెలుపల జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ, దాదాపు 300 మంది తరలి ఇచ్చి నూతన వధువును చూడటానికి వచ్చారు. ఇది స్థానికంగా ఆసక్తికరంగా మారింది.అయితే ఈ పెళ్లి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాస్మా గ్రామానికి చెందిన ముస్లిం ప్రజలు మౌనంగా ఉండిపోయారు. ఒక రకమైన నిశ్శబ్దం,విచారం, ఆందోళన,నెలకొన్నాయి. తాము దీనిపై ఎలాంటి నిరసన వ్యక్తంచేసినా, తిరిగి తమపైనే చర్యలు లేదా పరిణామాలు ఉంటాయేమోననే భయంతో వారు మౌనంగా ఉండిపోయారు.ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరంఅయితే అదృష్టవశాత్తూ ఈ ఉదంతంలో ఎలాంటి మతపరమైన ఘర్షణలు లేదా శాంతిభద్రతల సమస్యలు తలెత్తలేదు. కొత్త సెక్షన్ 69 ప్రకారం ఇటువంటి కేసుల్లో మేజిస్ట్రేట్ ముందు యువతి ఇచ్చే స్టేట్మెంట్కు మాత్రమే చట్టపరమైన విలువ ఉంటుందని, ఈ కేసులో యువతి మొదటి నుండి ఒకే మాటపై నిలబడటం వల్ల ఎలాంటి FIR నమోదు కాకుండానే వివాదం పరిష్కారమైందని అధికారులు తెలిపారు.ఇక్కడ యువతి ముస్లిం, యువకుడు హిందూ కావడం వల్ల సమస్య సులువుగా ముగిసింది. ఒకవేళ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉండి ఉంటే (అంటే యువతి హిందూ, యువకుడు ముస్లిం అయితే) పరిస్థితి ఇంత ప్రశాంతంగా ఉండేది కాదు. హిందూ సంస్థలు దీనిని 'లవ్ జిహాద్' (Love Jihad) గా చిత్రీకరించి తీవ్రంగా నిరసనలు తెలిపేవి, అది శాంతిభద్రతల సమస్యగా మారేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: రూ. 3,800 కోట్ల గిఫ్ట్ : మురిసిపోయిన డొనాల్డ్ ట్రంప్ -
‘మోగ్లీ గర్ల్’ పూజ ఇక లేదు
అడవిలో ఒంటరిగా కనిపించిన ఆ చిన్నారి కథ ఒకప్పుడు దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మానవ సమాజానికి దూరంగా గడిచిన బాల్యం నుంచి, మనుషుల మధ్య జీవించడం నేర్చుకున్న ఆమె జీవితం పోరాటానికి ప్రతీకగా నిలిచింది. అయితే ఎన్నో కష్టాలు, ఆరోగ్య సమస్యలను అధిగమిస్తూ సాగిన ఆ ప్రయాణం చివరకు ఆగిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మోగ్లీ గర్ల్’ ఎహ్సాస్ (18) ఇక లేదు.చిన్నారిగా అడవుల్లో దొరికిందని అధికారులు చెబుతున్న ఎహ్సాస్ అలియాస్ పూజ చిన్నవయసులోనే కన్నుమూసింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా వచ్చిన తీవ్రమైన రక్త సంక్రమణ (సెప్టీసీమియా) ఆమె మృతికి కారణమైందని వైద్యులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చికిత్స పొందుతూ ఆమె జూన్ 15నే మరణించిందట. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎహ్సాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో జూన్ 11న డిశ్చార్జ్ చేశారు. అయితే జూన్ 15న ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో తిరిగి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది.ఎహ్సాస్ కథ 2017 జనవరిలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా కతర్నియాఘాట్ అటవీ ప్రాంతంలోని మోతీపూర్ రేంజ్ సమీపంలో ఆమె కనిపించింది. అప్పటికి ఆమె మానవ సమాజంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్నట్లు కనిపించింది. ఆమె ప్రవర్తన కూడా వింతగా అనిపించింది. నాలుగు కాళ్లపై నడవడం, దుస్తులు ధరించడానికి నిరాకరించడం, మనుషులు దగ్గరకు వస్తే దూకుడు దాడులు చేయడం.. ఇవన్నీ అధికారుల్ని ఆశ్చర్యపరిచింది. దీంతో ప్రముఖ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ రచించిన ‘జంగిల్ బుక్’లోని మొగ్లీ పాత్రతో పోలుస్తూ ఆమెను ‘మోగ్లీ గర్ల్’గా పిలవడం ప్రారంభించారు.రక్షించిన తర్వాత బాలికను తొలుత ‘పూజ’గా పేరు పెట్టిన అధికారులు.. అనంతరం లక్నోలోని ప్రత్యేక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమెకు ‘ఎహ్సాస్’ అనే పేరు పెట్టారు. వైద్య పరీక్షల్లో ఆమె మెదడు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేదని, మేధో వికలాంగతతో పాటు ఎపిలెప్సీ (మూర్ఛ) సమస్యలు కూడా ఉన్నట్లు తేలింది. అయినప్పటికీ, సంవత్సరాల తరబడి అందించిన వైద్య సేవలు, థెరపీ, పునరావాస కార్యక్రమాల వల్ల ఆమె ప్రవర్తనలో గణనీయమైన మార్పు వచ్చింది.క్రమంగా దుస్తులు ధరించడం, సంరక్షకులను గుర్తుపట్టడం, సామాజిక జీవనంలోని కొన్ని అంశాలకు అలవాటు పడడం నేర్చుకుంది. ఆమెను చూసుకునే సిబ్బందితో ఆత్మీయ బంధం ఏర్పడింది. ముఖ్యంగా సంరక్షకురాలు రాణిని ‘అమ్మ’ అని పిలుస్తూ ఎంతో సన్నిహితంగా ఉండేదని సహచరులు గుర్తు చేసుకున్నారు.ఎహ్సాస్ మరణంపై భావోద్వేగానికి గురైన రాణి, ‘‘ఒకరోజు ఆమె పూర్తిగా కోలుకుంటుందని ఎప్పుడూ నమ్మేదాన్ని. ఇప్పుడు ఆమె జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు."ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అడవిలోకి ఎలా చేరింది? అన్న ప్రశ్నలు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అడవిలో ఒంటరిగా కనిపించిన ఓ బాలిక.. సమాజంలో కలిసిపోవడానికి ప్రయత్నించడం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ‘మోగ్లీ గర్ల్’గా దేశం గుర్తుపెట్టుకున్న ఎహ్సాస్ జీవితం మాత్రం ఒక అసాధారణ గాథగా నిలిచిపోయింది. -
‘అఖిలేశ్ తన ఎంపీలను కాపాడుకోవాలి’
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన పార్లమెంట్ సభ్యులు కొందరు వేరు కుంపటి పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలపై యూపీ మంత్రి, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తమ ఎంపీలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసుకోవాలని సూచించారు.అలాగే.. ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. కొందరు తిరుగుబాటు ఎంపీలు బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వీరికి రెబల్ బల్లియా కుమారుడి నాయకత్వంలో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. పార్టీలో బ్రాహ్మణులకు జరుగుతున్న అవమానాలే ఇందుకు కారణమన్నారు. ఎస్పీలో చీలిక తథ్యమంటూ గత రెండు రోజులుగా ఆయన ఇలాంటి ప్రకటనలు చేస్తుండటం గమనార్హం. ఇందులో నేరుగా ఆయన ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ, సనాతన్ పాండేను ఉద్దేశించే అయి ఉండొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ పుకార్లను కొట్టివేసిన అఖిలేశ్ యాదవ్.. రాజ్‌భర్‌ను పుకార్ల శాఖ మంత్రిగా అభివర్ణించారు.ఎన్డీఏపై కాంగ్రెస్ ధ్వజం మరోవైపు.. ప్రతిపక్షాల నుంచి అధికార ఎన్డీఏలోకి కొనసాగుతున్న వలసలకు హోం మంత్రి అమిత్ షా కుట్రలే కారణమని కాంగ్రెస్ నిందించింది. ఎన్డీఏను అమిత్ షా నేషనల్ డిఫెక్టర్స్ అలయన్స్ (జాతీయ ఫిరాయింపుదారుల కూటమి)గా మార్చేశారని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ గురువారం మీడియాతో మాట్లాడారు. అధికార ఎన్డీఏ కూటమికి లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీని సాధించేందుకు అమిత్ షా చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టడానికి తమ పార్టీ మిత్రపక్షాలతో సంప్రదింపులు జరుపుతోందని ఆయన చెప్పారు. -
రూ.4 కోట్ల నగల దోపిడీ వెనుక అసలు కథ..
గాజియాబాద్: యూపీలోని గాజియాబాద్ తనిష్క్ షోరూమ్ చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుకాణంలో పనిచేస్తోన్న వ్యక్తే.. తన ప్రియురాలితో కలిసి ఈ చోరీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. పెళ్లి కోసం ఆ వ్యక్తి.. గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి రూ.4కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్లాడు. ఈ చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారుతనిష్క్ ఉద్యోగి నితిన్ వర్మ (23), అతని ప్రియురాలు కాజల్ వర్మ (22), అతని తండ్రి సంజయ్ వర్మ (52). జూన్ 12న రాజ్ నగర్ డిస్ట్రిక్ట్ సెంటర్లోని తనిష్క్ షోరూమ్ నుండి రూ. 4 కోట్లకు పైగా విలువైన నగలను దొంగిలించినట్లు పోలీసులు నిర్థారించారు. పెళ్లి ఖర్చుల కోసమే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.నితిన్ ఆ షోరూమ్‌లో చేరి కేవలం నెల పదిహేను రోజులు మాత్రమే అయింది.. కానీ ఈ కొద్ది సమయంలోనే అతను స్టోర్ భద్రతా ఏర్పాట్లు, అత్యంత విలువైన నగలు ఎక్కడ ఉంచుతారనే విషయాలను తెలుసుకున్నాడు. ఘటనకు ఒక రోజు ముందే కాజల్‌తో తన పెళ్లి నిశ్చయమైందని చెబుతూ స్టోర్ సిబ్బందికి పార్టీ ఇచ్చాడు. ఆ వేడుకలో షోరూమ్ తాళాలు తన వద్దే ఉంచుకునే క్యాషియర్ గౌతమ్ రాజ్‌తో ఎక్కువగా మద్యం తాగిపించాడు. అనంతరం అతన్ని ఇంటి దగ్గర దింపుతానని చెప్పి.. అతని బ్యాగ్ నుండి షోరూమ్ మెయిన్ ఎంట్రన్స్ తాళాన్ని దొంగిలించాడు.మరుసటి రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో నితిన్ తన అనుచరుడితో కలిసి షోరూమ్‌కు వచ్చాడు. వారు దొంగిలించిన తాళంతో షట్టర్ తెరిచి.. ఎలాంటి అనుమానం రాకుండా లోపలికి వెళ్లడం సీసీటివి ఫుటేజీలో రికార్డయింది. డీసీపీ ధవళ్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ దొంగతనం పూర్తి చేయడానికి కేవలం 25 నిమిషాలు పట్టింది. వారు గ్రౌండ్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లను వదిలేసి.. బంగారం, వజ్రాలు, విలువైన రత్నాలు పొదిగిన నగలు ఉన్న ఫస్ట్ ఫ్లోర్‌ను టార్గెట్ చేశారు. నితిన్ లోపలికి వెళ్లినప్పుడు ఓ అనుచరుడు బయట నిలబడి నిఘా ఉంచాడని పోలీసులు తెలిపారు. వారు సుమారు రూ. 4 కోట్ల విలువైన నగలను సర్దుకుని, ఎవరికీ దొరక్కుండా దూరంగా పార్క్ చేసిన వాహనంలో పరారయ్యారు.ఈ దర్యాప్తులో షోరూమ్‌లోని తీవ్రమైన భద్రతా లోపాలు కూడా బయటపడ్డాయి. రూ.50 కోట్లకు పైగా విలువైన నగలు ఉన్నప్పటికీ.. అక్కడ ఎలాంటి అలారం సిస్టమ్ లేదు. రాత్రి వేళల్లో కేవలం ఒకే ఒక్క సెక్యూరిటీ గార్డును నియమించారు. అతను కూడా ఉదయం 7 గంటలకే డ్యూటీ నుంచి వెళ్లిపోయాడు. సీసీటీవీ విజువల్స్‌ను కంపెనీ హెడ్ ఆఫీస్ నుండి నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ.. నిందితులు 25 నిమిషాలకు పైగా లోపలే ఉన్నా ఈ చొరబాటును ఎవరూ గమనించలేకపోయారు.నితిన్, కాజల్ కలిసి ఈ దొంగతనానికి ప్లాన్ చేయగా.. దొంగిలించిన నగలను అమ్మడంలో సంజయ్ వర్మ సహాయం చేశాడు. తమకు వైద్య ఖర్చుల కోసం డబ్బు కావాలని అబద్ధాలు చెప్పి నిందితులు కొన్ని నగలను తక్కువ ధరలకే విక్రయించారు. ప్రస్తుతం అధికారులు రూ. 3.1 కోట్ల విలువైన దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ. 6.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
బొండాడ ఇంజనీరింగ్‌కి రూ. 1,338 కోట్ల ఆర్డరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ రెన్యువబుల్ ఎనర్జీ నుంచి భారీ కాంట్రాక్టు లభించినట్లు బొండాడ ఇంజినీరింగ్ వెల్లడించింది. దీని విలువ సుమారు రూ. 1,338 కోట్లని తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో 250 మెగావాట్ల సోలార్ పీవీ ప్రాజెక్టు, 50 మెగావాట్ల/200 మెగావాట్‌హవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్ఎస్) ఏర్పాటుకు సంబంధించి ఇది ఈపీసీ ప్యాకేజీ రూపంలో ఉంటుంది. నోటిఫికేషన్ ఆఫ్ అవార్డు (ఎన్‌వోఏ) లభించినప్పటి నుంచి 18 నెలల్లోగా ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుందని కంపెనీ వివరించింది. మంగళవారం బీఎస్ఈలో బొండాడ ఇంజనీరింగ్ షేరు 4% పెరిగి రూ. 343.50 వద్ద క్లోజయ్యింది. -
అయోధ్య శ్రీరాముడికి ఖరీదైన నైవేద్యం
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొలువైన అందాల రాముడికి స్థానిక భక్తుడు (రైతు) ఒకరు సమర్పించిన కానుక విశేషంగా నిలుస్తోంది. తాను పండించిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండును నైవేద్యంగా అందించారు. ఈ పండు విలువ అంతర్జాతీయ మార్కెట్లో కిలోకు రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా, తులసి దళంతో కలిపి ఈ పండును సోమవారం దేవుడికి సమర్పించారు.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండుగా పేరుగాంచిన జపాన్‌కు చెందిన 'మియాజాకి' (Miyazaki) రకాన్ని అయోధ్యలోని రామ్ మందిరంలో రాముడికి తొలి సారిగా సమర్పించారు. ఈ విశేషమైన మామిడి పండును "సూర్యుని గుడ్డు" (Egg of the Sun) అని కూడా పిలుస్తారు. ఈ రకం మామిడి ఒక్కో పండు ధర సుమారు రూ. లక్ష ఉంటుందని అంచనా. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకాల్లో ఒకటిగా నిలిచింది.అయోధ్య వాతావరణ పరిస్థితులకు ఈ రకం మామిడి ఎంతవరకు అనుకూలంగా ఉంటుందో తెలుసుకునే ఉత్సాహంతో సుమారు రెండేళ్ల క్రితం రైతు ఓంప్రకాష్ సింగ్ దీనిని నాటారు. సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆ చెట్టు స్థానిక వాతావరణానికి విజయవంతంగా అలవాటు పడి, ఈ సీజన్లో దాదాపు డజను పండ్లను కాసింది. మియాజాకి మామిడి దాని అద్భుతమైన తీపి, అధిక పీచు పదార్థం (ఫైబర్) , పోషక విలువలకి ప్రసిద్ధి చెందిందని సింగ్ వెల్లడించారు.సింగ్ అందించిన వివరాల ప్రకారం ఒక్కో పండు బరువు 150 గ్రాముల నుండి 300 గ్రాముల మధ్య ఉంది. తోటలోని తొలి పండును దేవుడికి అంకితం చేసే సుదీర్ఘ సంప్రదాయం ప్రకారం శ్రీరాముడికి సమర్పించా మన్నారు. మియాజాకితో పాటు, థాయిలాండ్ వెరైటీ 'బనానా మ్యాంగో', ఆస్ట్రేలియా రకం 'R2E2' , భారతదేశానికి చెందిన 'చౌసా', 'దశేరి' వంటి వివిధ రకాలను కూడా పండిస్తున్నారు.మహంత్ సీతారాం దాస్ జీ మహరాజ్ హర్షంఓంప్రకాష్ సింగ్ తోటను సందర్శించిన మహంత్ సీతారాం దాస్ జీ మహరాజ్ ఈ సందర్భాన్ని కొనియాడారు. ఈ మామిడి పండు రంగు విశ్వాన్ని ప్రకాశింపజేసే సూర్య భగవానుడిని పోలి ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు అయోధ్య గడ్డపై పండటం, తొలి పంటను శ్రీరాముడికి ప్రసాదంగా సమర్పించడం ఎంతో అదృష్టమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. -
పెన్ అనుకుని జేబులో పెట్టుకుంటే అంతే సంగతులు..!
-
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
బేకరీలోకి వెళ్తే మీకు కేకులు, కూల్డ్రింకులు, బిస్కెట్లు చాకెట్లు కనిపిస్తాయి కదా. కానీ ఇక్కడ ఓ షాప్‌లో మాత్రం అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అక్కడ కస్టమర్లకు “స్వీట్ షాక్” కాదు, నేరుగా “సర్ప్రైజ్ షాక్” ఎదురైంది. లోపల కనిపించిన దృశ్యం చూసి కొందరు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు!ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న ఓ బేకరీలో భారీ కొండచిలువ కనిపించి అందరినీ హడలెత్తించింది. అది బిస్కెట్ ప్యాకెట్ కోసం వచ్చిందా? లేదంటే డిస్కౌంట్ ఆఫర్ చూసి వచ్చిందా? అనే జోకులు పక్కన పెడితే… అక్కడి సిబ్బంది మాత్రం ‘బాబోయ్’ అంటూ బయటకు పరుగులు తీశారు. పామును చూసిన వెంటనే షాప్‌లో క్షణాల్లోనే “బిజినెస్ క్లోజ్, ఎమర్జెన్సీ ఓపెన్” పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీమ్ హుటాహుటిన అక్కడికి చేరుకుంది. కానీ సమస్య ఏంటంటే… ఆ పాము దాగిన చోటు అంత ఈజీగా కనిపించలేదు. దాదాపు 3 గంటల పాటు సాగిన సినిమా స్టైల్ రేస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆ భారీ పైథాన్‌ను సురక్షితంగా పట్టుకున్నారు. తీరా చూస్తే అది ఎనిమిది అడుగుల పొడవుతో భయానకంగా ఉంది. చుట్టూ గుమిగూడిన జనాలు మొత్తం “ఇదేందిరా ఇంత ఉంది!” అనే ఫీలింగ్‌లో షాక్‌లోనే నిల్చిపోయారు. ఆ సమయంలో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నవాళ్లు.. పైథాన్‌ను పట్టుకునే క్రమంలో ఒకరి మీద ఒకరు వేసుకున్న జోకులతో అక్కడంతా నవ్వులు పూశాయి.చివరికి పామును అడవిలోకి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ షాప్ మాత్రం ఒక్క రోజుకే “స్వీట్ షాప్” నుంచి “స్నేక్ షాక్ 🐍”గా ఫేమస్ అయిపోయింది!. స్వీట్స్ కోసం వెళ్లిన వాళ్లకి ‘స్వీట్ బిల్’ కాదు… జీవితాంతం గుర్తుండే షాక్ బిల్ పడింది! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.#मेरठ: दुकान में घुसा विशाल अजगरसिविल लाइन क्षेत्र में मची दहशतकर्मचारियों में मची अफरा-तफरीवन विभाग ने चलाया रेस्क्यूतीन घंटे बाद पकड़ा गया अजगरसुरक्षित रेस्क्यू के बाद राहत#Meerut #UPNews #BreakingNews #Python #Rescue #ForestDepartment #LocalNews #UPNow pic.twitter.com/RamOTx0ko5— UP NOW (@UPNOWTV) June 14, 2026 -
2027 యూపీ ఎన్నికల కోసం అఖిలేశ్ సూపర్ ప్లాన్.. అది ఇదే..
ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పర్ఫార్మన్స్ను మెరుగుపరచిన సామాజిక సమీకరణ వ్యూహాన్ని మళ్లీ అమలు చేయాలనే లక్ష్యంతో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) పనిచేస్తోంది. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో పలు జనరల్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి.దీని ద్వారా పార్టీ తన పీడీఏ అంటే వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల సామాజిక కూటమిని బలోపేతం చేయాలని చూస్తోంది. అలాగే ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సాంప్రదాయ దళిత ఓటు బ్యాంకులోకి మరింత చొచ్చుకుపోవాలని ఎస్పీ భావిస్తోంది.ఈ వ్యూహాన్ని తొలిసారిగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పరీక్షించారు. అప్పట్లో ఎస్పీ జనరల్ ఫైజాబాద్ స్థానంలో షెడ్యూల్డ్ కుల నేత అవదేశ్ ప్రసాద్‌ను, జనరల్ మీరట్ నియోజకవర్గంలో సునితా వర్మను బరిలోకి దింపింది.ఈ ప్రయోగం పార్టీకి సక్సెస్‌ను ఇచ్చింది. అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో రామాలయం అధికార పార్టీ బీజేపీకి ప్రధాన ప్రచార అంశంగా నిలిచినా, అవదేశ్ ప్రసాద్ తన భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థిపై 50,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. మీరట్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరుణ్ గోవిల్ సుమారు 10,000 ఓట్ల తేడాతో గెలిచి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఎస్పీ ఆధిక్యం అయితే, ఆ నియోజకవర్గంలోని 5 అసెంబ్లీ విభాగాల్లో 4 చోట్ల ఎస్పీ ఆధిక్యం సాధించింది. ఆ ఫలితాల జోరుతో పార్టీ ఇప్పుడు అదే విధానాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలని యోచిస్తోంది. ఎస్పీ జాతీయ ప్రతినిధి రాజేంద్ర చౌధరి ఈ వ్యూహాన్ని గత ఎన్నికల్లో విజయవంతంగా అమలు చేశామని ధ్రువీకరించారు.“2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ మేము పలు షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులను జనరల్ స్థానాల నుంచి బరిలోకి దింపాం. ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. అదే మోడల్‌ను మళ్లీ అమలు చేయవచ్చు” అని చౌధరి చెప్పారు.ఈ ప్రయోగానికి గుర్తించిన చాలా నియోజకవర్గాలు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. 2012 తర్వాత బీఎస్పీ బలహీనపడటంతో దూరమైన దళిత ఓటర్లను ఆకర్షించాలని ఎస్పీ ఆశిస్తోంది. అలాగే, దళిత ఓటర్లలో చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడమూ ఈ వ్యూహంలో భాగమే.సమాజ్‌వాదీ పార్టీకి 2019లో 5 లోక్‌సభ స్థానాలు ఉండేవి. 2024లో 37 స్థానాలకు చేరుకుంది. అసెంబ్లీ విభాగాల వారీ ఫలితాల ప్రకారం.. ఎస్పీ 184 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల కంటే ముందంజలో నిలిచింది. 2024 ఫలితాల ఆధారంగా, పీడీఏ కూటమి మద్దతును 2027 ఎన్నికల నాటికి మరింత పెంచుకోవచ్చనే నమ్మకం ఎస్పీ నాయకత్వంలో పెరిగింది.లక్నోలోని గిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్‌కు చెందిన రాజకీయ విశ్లేషకురాలు నోమిత కుమార్ మాట్లాడుతూ.. సాధారణ స్థానాల నుంచి షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులను బరిలోకి దింపాలన్న సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయం నియోజకవర్గ స్థాయిలో దళిత ఓటర్లను బాగా సమీకరించేలా ప్రభావం చూపవచ్చని అన్నారు.“సాధారణ స్థానాల్లో ఎస్సీ అభ్యర్థులను నిలబెట్టడం ఆ నియోజకవర్గాల్లో దళిత ఓటర్లను ఉత్తేజపరుస్తుంది. ముఖ్యంగా స్థానిక పోటీల్లో గుర్తింపు ప్రాతినిధ్యం కీలక అంశంగా మారినప్పుడు ఇది ప్రభావం చూపుతుంది. అయితే ముస్లింలు, ఇతర వెనుకబడిన వర్గాలు, దళితులను పీడీఏ రూపకల్పన కింద ఎంత సమర్థంగా ఏకం చేయగలదన్నదే ఎస్పీ ఎన్నికల బలాన్ని నిర్ణయిస్తుంది. ఉత్తరప్రదేశ్ అంతటా పోటీతత్వాన్ని నిర్ణయించేది ఈ సమీకరణే” అని ఆమె అన్నారు. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి
లక్నో నుంచి ఢిల్లీ వెళ్లే 'స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్' (Swarn Shatabdi Express) రైలుపై ఫిరోజాబాద్ సమీపంలో గురువారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైల్లో ఈ ఘటన జరగడంతో ఆందోళన రేగింది. అయితే ఈ ప్రమాదంలో మోహన్ భాగవత్ సురక్షితంగా ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు ఏ జరిగిందంటే..గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ నుండి ఢిల్లీ వెళ్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 12003) రాత్రి 7:20 గంటల ప్రాంతంలో మఖన్పూర్ స్టేషన్‌ను దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. కదులుతున్న రైలుపై రాయి పడటంతో E-1 కోచ్ కిటికీ అద్దం దెబ్బతింది. దీంతో రైల్వే అధికారులు ఉత్తరప్రదేశ్ ఫేరోజాబాద్ జిల్లాలోని తుండ్లా జంక్షన్ వద్ద వద్ద రైలును నిలిపివేశారు.మోహన్ భగవత్ టార్గెట్?అయితే రాయి తగిలిన కోచ్‌లోనే మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నట్లు GRP ఇన్స్పెక్టర్ షేర్ సింగ్ ధృవీకరించారు. కోచ్‌లోని అవతలి వైపు (ఆపోజిట్ సీట్లో) కూర్చోవడంతో ఆయనకు ఎలాంటి హాని జరగలేదు. అలాగే ఆయనతో పాటు, ఇతర ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉన్నారని సింగ్ తెలిపారు. అధికారుల తనిఖీల అనంతరం రైలు తిరిగి ఢిల్లీకి బయలుదేరింది.ఘటనా స్థలానికి ఉన్నతాధికారులుఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఫిరోజాబాద్‌లోని ఘటనా స్థలాన్ని సందర్శించారు. రైలులో మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ఎస్ఎస్పీ ఆదిత్య లాంగే చెప్పారు. విచారణ నిమిత్తం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.గతంలోనూ రాళ్ల దాడులు ఫిరోజాబాద్ గుండా వెళ్లే ఈ రైల్వే ట్రాక్ పరిసరాల్లో గతంలోనూ పలుమార్లు రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. గతంలో జరిగిన ఘటనలను, ప్రస్తుత కేసును పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని ఎస్ఎస్పీ లాంగే స్పష్టం చేశారు. -
వైరల్ వీడియోలే వరుడికి విలన్‌లయ్యాయి..
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఓ వరుడు తన పెళ్లికి బుల్డోజర్పై రావాలని వింత నిర్ణయం తీసుకున్నాడు. బరాత్ సమయంలో బుల్డోజర్పై కూర్చొని పొగ తాగుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. అతని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.ఉమ్రీ కలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరుడు ఉస్మాన్ గ్రామంలో పెళ్లి ఊరేగింపునకు సంప్రదాయంగా గుర్రం లేదా కారు బదులు బుల్డోజర్ను వాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందరికంటే ప్రత్యేకంగా తన బరాత్ చేసుకోవాలని అనుకున్నాడు.వైరల్ వీడియోలో ఉన్న దారి ప్రకారం ఉస్మాన్ తన స్నేహితులతో కలిసి బుల్డోజర్పై కూర్చొని గ్రామంలో ఊరేగింపులో పాల్గొంటూ కనిపించాడు. ఒక వీడియోలో అతను సిగరెట్ తాగుతూ పొగ రింగు రింగులుగా వదులుతూ వెళ్లిన దృశ్యాలు కనిపించాయి.మరో వీడియోలో పెద్ద శబ్దంతో వినిపించిన డీజే సంగీతానికి అనుగుణంగా బుల్డోజర్పై ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుండగా పెళ్లి అతిథులు అతడిని ప్రోత్సహిస్తూ కనిపించారు. వేడుకల సమయంలో మరికొందరు బరాత్ సభ్యులు కూడా బుల్డోజర్పైకి ఎక్కినట్లు వీడియోల్లో కనిపించింది. కదులుతున్న బుల్డోజర్పై డజన్‌కు పైగా అతిథులు నిలబడి డ్యాన్స్ చేస్తూ హ్యాపీగా గడిపారు.ఈ విభిన్న పెళ్లి ఊరేగింపును కొందరు నెటిజన్లు వినోదాత్మకంగా భావించినా, మరికొందరు భద్రతాపరమైన ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. రద్దీగా ఉన్న ఊరేగింపులో బుల్డోజర్పై డ్యాన్స్ చేయడం ప్రమాదాలకు దారి తీయవచ్చని అభిప్రాయపడ్డారు.వీడియోలు మరింత వైరల్ అవుతుండడంతో స్థానిక అధికారులు ఈ విషయాన్ని గమనించారు. వీడియోల్లో కనిపించిన బుల్డోజర్ను గుర్తించామని, దానిపై చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.ఈ విషయంపై మాట్లాడిన కాంత్ పోలీస్ స్టేషన్ అధికారులు.. ఊరేగింపులో వినియోగించిన జేసీబీ యంత్రాన్ని గుర్తించామని, చలాన్ జారీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. అయితే భారీ యంత్రాలు, ప్రమాదకర విన్యాసాలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో జరిగే వేడుకలు చట్టపరమైన చర్యలకు దారి తీస్తాయని, ముఖ్యంగా ప్రజల భద్రత ప్రమాదంలో పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు పలుమార్లు హెచ్చరించారు.ఉస్మాన్ పెళ్లి బృందం సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించడంలో విజయవంతమైనా, పెళ్లి తర్వాత ఊహించని గుర్తుగా ట్రాఫిక్ చలాన్‌ను కూడా పొందింది. -
బంగారం కొట్టేసిన నేపాలీ గ్యాంగ్ అరెస్ట్
-
భర్తను అలా చూసి కారు బోనెట్‌పైకి భార్య చివరికి.. వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో గుండె ఝల్లుమనే ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతనిపై నిఘాపెట్టింది. ఇద్దరూ కలిసి ఉండటాన్ని చూసిన ఆమె వాహనాన్ని ఆపే ప్రయత్నంలో వేగంగా దూసుకెళ్తున్న కారు బోనెట్మీదకు లంఘించింది. ఈ ఘటన భమోరా పరిధిలోని దేవ్చరా చౌరహా (కూడలి) వద్ద శనివారం సాయంత్రం జరిగినట్లు సమాచారం. ఆమె బోనెట్‌పై వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గోదావరి (38) , నేత్రపాల్ సింగ్ ఇద్దరూ భార్యాభర్తలు. తన భర్త వేరే మహిళతో కలిసి కారులో ప్రయాణించడం చూసి, అతడిని అడ్డుకోడానికి ప్రయత్నించింది. కానీ అతను ఆపకుండా,మరింత వేగం పెంచడంతో, బోనెట్‌పై దూకేసింది. ఆమె బోనెట్‌పై ఉన్నప్పటికీ నేత్రపాల్ కారును ఆపకుండా 100 మీటర్ల దూరం లాక్కెళ్లిన వైనం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మొత్తానికి అడ్డుకుని, ఆమెను సురక్షితంగా కిందకు దించారు. కారు ముందుకు దూసుకెళ్తుంటే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మహిళ బోనెట్‌ను గట్టిగా పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో కనిపించాయి. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి.ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్High drama unfolds in #Bareilly as wife catches husband with alleged girlfriend in a vehicle. She climbs onto car bonnet; gets dragged for nearly 100 meters. FIR Filed @uppolice @timesofindia pic.twitter.com/prKxvw3YvB— Sandeep Rai (@RaiSandeepTOI) June 9, 2026 భమోరా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గోదావరి తన భర్త నేత్రపాల్ సింగ్‌కు సాధన అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది. ఈ విషయంపై తాను భర్తను ప్రశ్నించినప్పుడల్లా ఆయన తనను తిడుతూ, శారీరకంగా హింసించేవాడని ఆమె తెలిపింది. ఇద్దరూ కారులో వెడుతుండగా, వారిని ఆపడానికే తాను అలా చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.తాను బోనెట్‌పై ఉన్నప్పటికీ నేత్రపాల్ కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడని ఆమె ఆరోపించింది. ఈ ఘర్షణలో సాధన తనపై దాడి చేసి, తన మెడలోని బంగారు గొలుసును లాక్కుని అక్కడి నుంచి పారిపోయిందని గోదావరి తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఈ రసాభాసలో తన మామయ్య వాహనం కూడా దెబ్బతిన్నట్లు చెప్పింది.అయితే, సాధన ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. తాను బ్లాక్ ఆఫీస్ నుండి తిరిగి వస్తుండగా నేత్రపాల్ కారులో కేవలం లిఫ్ట్ మాత్రమే తీసుకున్నానని, గోదావరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించింది. పైగా ఈ ఘటనలో తనపైనే దాడి జరిగిందని ఆమె ఆరోపించింది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తభమోరా ఎస్హెచ్ఓ (SHO) పవన్ కుమార్ స్పందిస్తూ, నేత్రపాల్ సింగ్, సాధనలపై ర్యాష్ డ్రైవింగ్, దాడి, ఉద్దేశపూర్వ దాడి లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇదీ చదవండి: హాట్ టాపిక్‌గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా -
ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!
ఉత్తర ప్రదేశ్‌లో మరో ఊహించని పరిణామం గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే. పెళ్లికి ముందు రాత్రే వధువు తన ప్రియుడితో పారిపోయింది. ఎలాగో ఒప్పించి, వధువు చెల్లెల్ని పెళ్లి కూతుర్ని చేశారు. ఇక్కడ మరో ట్విస్ట్ పెళ్లి కొడుకును వెక్కిరించింది. ఇక ఈ తరువాతి పరిణామాలు ఒక్కోటి సినిమా రేంజ్లో చక చకా జరిగిపోయాయి. చివరికి ఈ వివాదం మరింత ఉద్రిక్తమై కాల్పుల దాకా చేరింది.ఉత్తరప్రదేశ్‌లోని బిత్థ్రి ప్రాంతంలోని షాజహాన్‌పూర్-బరేలీ రోడ్డుపై ఉన్న ఒక బ్యాంకెట్ హాల్లో శనివారం పెళ్లి వేడుక ఉత్సాహంగా జరుగుతోంది. వధూవరులిద్దరూ అందంగా ముస్తాబయ్యారు. అతిథులందరూ ఎవరి హడావిడిలో వారు తిరుగుతూ, విందు భోజనానికి సిద్దపడుతున్నారు. పెళ్లి కొడుకు తన బృందంతో (ఊరేగింపుగా), అటు వధువు కుటుంబ సభ్యులు కూడా సందడి ఉన్నారు. ఇంతలో కలకలం రేపింది. హాజరైన అతిథులకు భోజనాలకు బదులు దాడులు మొదలయ్యాయి. ఈ గందరగోళం మధ్య కాల్పులుకు దారి తీసింది. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ట్విస్టుల మీద ట్విస్టులుసరిగ్గా పెళ్లి జరిగే సమయానికి వధువు రాలేదు. పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న నగలతో సహా వధువు రాత్రికి రాత్రే ప్రియుడితో ఉడాయించింది. దీంతో వధువు కుటుంబ సభ్యులు ఆమె చెల్లెల్ని వధువు స్థానంలోకూర్చోబెట్టడానికి ఒప్పించి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి తంతు ముగిద్దాం అనుకున్నారు. అయితే పెళ్లి కూతురు మారిపోయిందన్న విషయాన్ని గమనించిన పెళ్లి కొడుకు ‘నాకీ పెళ్లి వద్దు పొమ్మన్నా’డు.ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్అయితే ఎలాగోలా పెద్దలంతా సంప్రదింపులు జరిపే వరుడిని పెళ్లికి ఒప్పించాడు. ఇక్కడ మళ్లీ ట్విస్ట్. ఈ ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగి, అంతా చక్కబడింది అనుకునే లోపే, వధువు చెల్లెలి ప్రియుడుఎంట్రీ ఇచ్చాడు. మళ్లీ లొల్లి షురూ. చినికి చినికి గాలివానలా మొదలైన ఈ వ్యవహారం భౌతిక ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో కాల్పులు కూడా జరిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో పలువురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు జోక్యం చేసుకున్నట్టు గానీ, ఎవరిపైనా కేసులు నమోదు చేసినట్టు గానీ సమాచారం లేదు. ఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు -
పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో జరిగిన ఒక వింత పెళ్లి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఒక వ్యక్తి ఏకంగా పిల్లనిచ్చిన సొంత అత్తనే వివాహం చేసుకున్న ఘటన పలువుర్ని విభ్రాంతికి గురి చేసింది. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, అక్బర్పూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో, సదరు వ్యక్తి తన భార్యను వదిలిపెట్టి, ఆమె తల్లిని కోర్టు వివాహం చేసుకున్నారట. అంతేకాదు తమ వివాహ ధృవీకరణ పత్రాన్ని చేతిలో పట్టుకుని, తమ బంధాన్ని అంగీకరించాలని , తమ నిర్ణయాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ జంటకు వివాహానికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కుమార్తె వివాహం జరిగిన తర్వాత అత్తా-అల్లుళ్ల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని సమాచారం. అయితే ఆ వ్యక్తి భార్య స్పందన ఏంటి అనేదానిపై స్పష్టతలేదు. ఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలుఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకుఎటువంటి పోలీసు ఫిర్యాదు నమోదు కాలేదు. అలాగే అధికారులు ఎటువంటి చట్టపరమైన చర్యల గురించి వెల్లడించలేదు. दामाद ने बेटी से रिश्ता तोड़ मां से किया शादीयूपी के कानपुर में एक अनोखा मामला सामने आया है, जहां एक युवक ने अपनी पत्नी से अलग होने के बाद अपनी सास के साथ कोर्ट मैरिज कर ली।इस घटना के बाद इलाके में तरह-तरह की चर्चाएं हो रही हैं। pic.twitter.com/fcaNnYNle5— Priya singh (@priyarajputlive) June 8, 2026నెటిజన్ల మాత్రం ఈ వివాహం గురించి తెలిసి బంధాలు, నైతిక విలువలు మంటగలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేయగా, వావి వరుసలు మర్చిపోతున్నారంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక వివాదాస్పద ప్రేమకథ మాత్రమే కాదు, ఒక కుటుంబాన్నే ఛిన్నాభిన్నం చేసిన పరిస్థితి. మధ్యలో నలిగిపోయే వారే అసలైన బాధితులు, కుటుంబ అనుబంధం హద్దులు దాటింది. కామమే గెలిచింది, కుటుంబం ఓడిపోయిందని మరొకరన్నారు. సొంత రక్తమే వినాశనానికి కారణమైతే, ఇక ఎవరిని నమ్మాలి?" పాపం..ఆమె కుమార్తె పరిస్థితి ఏంటి అని ఆరాతీస్తున్నారు. కాగా 2024లో బీహార్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఈ ఘటనలో భార్య మరణం తరువాత, అతను అత్తమామల ఇంట్లోనే నివసించడం ప్రారంభించాడు. ఆ క్రమంలో అతను తన 55 ఏళ్ల అత్తగారు గీతా దేవితో సన్నిహితమయ్యాడు. ఒక రోజు, అతను గీతతో ఏకాంతంగా ఉండగా అతని మామగారు వారిని రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత, ఆ వ్యక్తి గ్రామస్తులందరి సమక్షంలో గీతను ప్రేమిస్తున్నట్లు అంగీకరించి, ఆమెను వివాహం చేసుకున్నాడు. -
బుర్ఖాలో వచ్చాడు.. నడకతో దొరికిపోయాడు
స్నేహితుడి మెడలో ఐదు తులాల బంగారంపై కన్నేశాడు. ఎలాగైనా కాజేయాలని నెలల తరబడి ఎదురు చూశాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఏం చేయాలి.. ఎలా తప్పించుకోవాలి అని స్కెచ్ గీశాడు. ప్లాన్ అమలు చేసే టైంలో.. కంగారుపడడంతో ఊహించనిది జరిగింది. అయినా బెదరలేదు. ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. చివరకు.. సీసీటీవీలో దొరికిన ఒక చిన్న క్లూ చివరకు అతడిని కటకటాల వెనక్కి నెట్టింది.ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ప్రకాశ్ చంద్ర గుప్తా కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతనికి మోహిత్ ద్వివేది అనే వ్యక్తితో 18 ఏళ్ల స్నేహం ఉంది. అయితే ఆ స్నేహానికే చివరికి డబ్బు, బంగారం చిచ్చుపెట్టాయి. ప్రకాశ్ ధరించే సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు గొలుసుపై మోహిత్ కన్నేశాడు. దానిని ఎలాగైనా దోచుకోవాలని నిర్ణయించుకున్న అతడు ముందుగానే పథకం రచించాడు.ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న మే 31 రాత్రి ప్రకాశ్ తన కోచింగ్ సెంటర్లోనే ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు బుర్ఖా ధరించడంతో పాటు మహిళలు ఉపయోగించే ఆభరణాలు, చెప్పులు కూడా వేసుకున్నాడు. అనంతరం కోచింగ్ సెంటర్లోకి ప్రవేశించి ప్రకాశ్‌పై దాడికి దిగాడు. బంగారు గొలుసు లాక్కునే ప్రయత్నంలో ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది.ఈ క్రమంలో ప్రకాశ్‌ను బలంగా తోసేయడంతో అతడు నేలపై పడిపోయి తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కారణంగా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మోహిత్ బంగారు గొలుసుతో పాటు మరో బంగారు బ్రాస్లెట్ను కూడా తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం ప్రకాశ్ కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని రక్తపు మడుగులో గుర్తించారు. తొలుత పోలీసులు ప్రమాదవశాత్తూ పడిపోవడం వల్ల మరణించి ఉండొచ్చని భావించారు. అయితే బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఒక చోట ఒకరు బుర్ఖాలో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ మనిషి నడక మాత్రం తేడాగా కనిపించింది. దీంతో బుర్ఖాలో ఉంది మహిళ కాదేమోనని అనుమానపడ్డారు. అలాగే.. అక్కడి నుంచి సుమారు 100 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ ఆ ముసుగు వ్యక్తి కదలికలను ట్రాక్ చేశారు. చివరకు ఒక కారులో.. బుర్ఖా మార్చుకుంటూ ఆ వ్యక్తి బయటపడ్డాడు. అది మోహిత్ అని గుర్తించి షాక్ తిన్నారు.పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన మోహిత్.. హత్య తర్వాత కూడా ఎలాంటి అనుమానం రాకుండా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు వెల్లడైంది. అంతేకాకుండా నేరం జరిగిన మరుసటి రోజే ఓ పోటీ పరీక్షకు హాజరై, తర్వాత లక్నోకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనతో ప్రకాశ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. "18 ఏళ్ల స్నేహాన్ని డబ్బు కోసం బలి చేశాడు. ఇంత దారుణంగా మోసం చేస్తాడని ఊహించలేదు" అని మృతుడి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
‘బాలికకు అతికిన ఎముకను మళ్లీ విరగొట్టాడు’
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం మంటగలిపే అమానవీయ ఘటన జరిగింది. లంచం ఇవ్వలేదనే కారణంతో 14 ఏళ్ల బాలికకు అతికిన ఎముకను ప్రభుత్వ వైద్యుడు మళ్లీ విరిచేశాడు. గాయపడిన బాలిక చికిత్సకు ఆ డాక్టర్ రూ. 25 వేలు డిమాండ్ చేశాడు. అప్పటికే బాధిత కుటుంబం రూ. 8 వేలు చెల్లించింది. డిమాండ్ చేసిన రూ.25 వేలు ఇవ్వలేదనే కారణంతో బాలికను పరీక్షల నిమిత్తం పిలిచి కాలు విరిచాడు.దీంతో బాధితులు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. తక్షణమే ఉచిత చికిత్స అందించాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జరిగిన ఘటనను తెలుసుకున్న కలెక్టర్‌తో పాటు అక్కడ ఉన్నవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వ్యవహారంపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) స్పందిస్తూ.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. దాదాపు నెలన్నర క్రితం మానసిక వికలాంగురాలైన తన కుమార్తె కుడి కాలు ఎముక విరిగింది. దాంతో ఆమె కూతురిని తీసుకుని జిల్లా ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడ ఆపరేషన్ చేయడానికి రూ. 25 వేలు లంచం డిమాండ్ చేశారు.భర్త మరణించిన తర్వాత ఒంటరిగా పిల్లలను పోషిస్తున్న ఆమె.. అంత డబ్బు ఇచ్చుకోలేనని చెప్పడంతో వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించారు. దీంతో బాధితురాలైన తల్లి జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం)ను ఆశ్రయించింది. డీఎం జోక్యం చేసుకుని.. ఉచితంగా చికిత్స అందించాలని సీఎంఓకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది వైఖరిలో మార్పు రాలేదు.డీఎం దగ్గరకు ఎందుకు వెళ్లావంటూ వైద్యులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి.. చికిత్స చేయడానికి నిరాకరించారు. చివరికి చేసేదేమీ లేక ఆ తల్లి అప్పు చేసి రూ.8 వేలు ఇవ్వడంతో బాలికకు ఆపరేషన్ చేశారు. మిగిలిన డబ్బును తర్వాత ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఆపరేషన్ జరిగిన కొన్ని రోజుల తర్వాత బాధిత తల్లి తన కుమార్తెను ఫాలో-అప్ చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అక్కడ ఉన్న డాక్టర్ తీవ్ర ఆగ్రహంతో మాట్లాడి.. మిగిలిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.తన వద్ద డబ్బులు లేవని ఆమె చెప్పడంతో.. ఆగ్రహించిన డాక్టర్ ఆ బాలిక మోకాలిని ఎంత ఘోరంగా మెలి తిప్పాడు. ఆ పిల్ల నొప్పితో గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో కాలు ఎముక విరిగిన శబ్దం స్పష్టంగా వినిపించిందని ఆమె తెలిపింది. దీంతో ఆమె నిలదీయగా.. వైద్యులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి.. బలవంతంగా ఆసుపత్రి నుండి బయటకు నెట్టేశారు.ఇంటికి వచ్చిన తర్వాత బాలిక కాలు విపరీతంగా వాచిపోయి.. రాత్రంతా నొప్పితో విలవిలల్లాడటంతో.. తల్లి ప్రైవేట్ ల్యాబ్‌లో డిజిటల్ ఎక్స్-రే చేయించింది. ఎక్స్-రే రిపోర్టులో బాలిక కాలు ఎముక మళ్లీ విరిగినట్లు స్పష్టంగా తేలింది. దీనిపై నిలదీయడానికి మళ్లీ ఆసుపత్రికి వెళ్లగా.. వైద్యులు న్యాయం చేయడానికి బదులు.. బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసి అక్కడి నుండి తరిమికొట్టారు. -
ఆస్తికోసం తల్లిదండ్రులు, సోదరి హత్య, ఆ తర్వాత షాకింగ్ ఘటన
ప్రయాగ్‌రాజ్ : డబ్బు, ఆస్తి మీద విపరీమైన వ్యామోహంతో ఎంతటి దారుణానికైనా తెగ బడుతున్నారు మనుషులు. మానవ విలువల్ని, బంధాల్ని బంధుత్వాల్ని మరిచి సొంత తల్లిదండ్రులను, తోగబుట్టిన సోదరిని హత్య చేశాడో దుర్మార్గుడు. చివరికి అతను కూడా అదే అత్యాశకు బలైపోయాడు. ఉత్తర ప్రదేశ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని భవనంలోఈ దారుణ ఘటన వెలుగు చూసింది. కర్మ ఎవరిని విడిచిపెట్టదనే సూత్రం వీరి విషయంలో అక్షరాలా నిజమైంది.పోలీస్ కమిషనర్ జోగేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ మలకా ప్రాంతంలో ఉన్న ఒక కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో వివాదం నెలకొంది. వీరేంద్ర వైశ్య, ఆయన భార్య తమ ఆస్తి నుండి కుమారుడు అభిషేక్‌కు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో వారి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు అభిషేక్. తల్లిదండ్రులు, సోదరిని చంపడానికి ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే తన స్నేహితుడు సన్నీ గుప్తాను ఇంటికి పిలిపించు కున్నాడు. ప్లాన్ ప్రకారం వారిని మట్టుబెట్టాడు. ఆ తర్వాత, ఇద్దరూ కలిసి ఇంటో దొంగిలించిన విలువైన వస్తువులను పంచుకోవడానికి గ్రౌండ్ ఫ్లోర్‌లోని దుకాణానికి వెళ్లారు. అయితే ఈ పంపకాల సమయంలో ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీంతో ఏరాడ్తో అయితే తల్లిదండ్రులను హత్య చేశాడో అదే రాడ్‌తో అభిషేక్‌ను హత్య చేసి, శవాన్ని దుకాణంలోనే వదిలేసి, షాప్‌కు తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు సన్నీ.రెండు రోజుల తరువాత ఆ ప్రాంతమంతా దుర్వాసన వ్యాపించడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా భయంకరమైన దృశ్యం కనిపించింది. మే 31 సాయంత్రం అభిషేక్, గుప్తాతో కలిసి వీరేంద్ర, అనిత, మీనాక్షిలను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో వీరేంద్ర వైశ్య (70), ఆయన భార్య అనిత (65), కుమార్తె మీనాక్షి (45) మృతదేహాలను స్వాధీనం తీసుకున్నారు.మొదట, అభిషేక్ హంతకుడై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావించి, అతని కోసం గాలించారు.. కానీ మృతదేహాలపై డిటర్జెంట్, శుభ్రపరిచే రసాయనాలుపూసి ఉండటంతో, రక్తపు మరకలున్న టీ-షర్టు, కుటుంబ కలహాలు, ఆభరణాలచోరీ , నకిటీ నోట్ ఆధారంగా హత్య పథకాన్ని వారు వెలికితీశారు. అదే భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న తాళం వేసిన దుకాణాన్ని బలవంతంగా తెరిచారు. అక్కడ అభిషేక్ వైశ్య (40) మృతదేహం లభించింది. సిసిటివి ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలించి నిందితుడైన సన్నీ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. అతడినుంచి బంగారం, 360 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.ఫ్యామిలీ బిజినెస్ వీరేంద్ర వైశ్య ఆ ప్రాంతంలో పేరున్న వ్యాపారవేత్త. భార్య అనిత, కుమార్తె మీనాక్షి, పెద్ద కుమారుడు అభిషేక్‌తో కలిసి ఆ భవనంలో నివసించేవాడు. కింది అంతస్తులో సుమారు 15 నుండి 16 దుకాణాలు ఉండేవి, వాటిలో చాలా వరకు అద్దెకు ఇచ్చి, ప్రతి నెలా లక్ష రూపాయలకు పైగా ఆదాయాన్ని ఆర్జించేవి. లిక్విడ్ డిటర్జెంట్ మరియు టాయిలెట్ క్లీనర్లతో సహా వెస్టిజ్ ఉత్పత్తులను అమ్మే దుకాణాన్ని అభిషేక్ నడిపేవాడు. మరొకటి మీనాక్షికి చెందింది. ఆమె ఇటీవలే ఒక గిఫ్ట్ గ్యాలరీ వ్యాపారాన్ని ప్రారంభించింది.చిన్నకొడుకుతో విభేదాలు, తప్పుడు నోట్కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకు, సుమారు 15 ఏళ్ల క్రితం వీరేంద్ర తన చిన్న కొడుకు అశ్వినిని తన కొడుకు కాదని వదిలేశాడని సమాచారం. ఆ కుటుంబంలో ఆస్తి తగాదాలు పదేపదే తలెత్తుతూ ఉండేవి. వీరిద్దరినీ బంటీ, బబ్లూ అని పిలిచేవారు. ఈ హత్యను తప్పు దారి పట్టించేందుకు బంటీ , కోడలు బబ్లూనే చంపారు అనే నోట్ వదిలారు. అయితే వివాహ వెబ్సైట్ మోసాలకు సంబంధించిన ఒక కేసులో అశ్విని, రితు 2024లో జైలు పాలయ్యారు. -
లైంగిక దాడి, అశ్లీల ఫోటోలు, వీడియోలు : ఐఐటీ బాబా గలీజు దందా
ఐఐటీ (IIT) గ్రాడ్యుయేట్ మథురై బాబాగా పేరొందిన అభిషేక్ మిశ్రా అలియాస్ అధికార్త నారాయణ్ దాస్ (29) గుట్టు రట్టైంది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో 29 ఏళ్ల స్వీయ-ప్రకటిత ఆధ్యాత్మిక గురువు చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆధ్యాత్మిక గురువుగా నటిస్తూ యువతులను లైంగికంగ దోచుకోవడం, వారిని, వారి కుటుంబాలను బ్లాక్మెయిల్ చేయడం లాంటి ఆరోపణలతో పోలీసులు అతగాడిని అరెస్ట్ చేశారు.ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆశ చూపి విద్యావంతులైన యువతులను లైంగికంగా దోపిడీ చేస్తున్న ఆరోపణలపై మిశ్రాను సోమవారం రాధా కుండ్‌లోని అతని ఆశ్రమంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతులను లైంగికంగా వేధించడమే కాకుండా వారి నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు తెలిపారు. పోలీసులు ఆ ప్రాంగణం నుంచి ఇద్దరు యువతులను, ఒక యువకుడిని కూడా రక్షించి వారి కుటుంబాలకు అప్పగించారు.మే 25న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 22 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని గోవర్ధన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. మిశ్రా తనకు 'ప్రసాదం' అని చెప్పి పాలు ఇచ్చాడని, అందులో మత్తు కలిగించే పదార్థం ఉందని నర్సింగ్ విద్యార్థిని ఆరోపించింది. పాలు తాగిన తర్వాత తాను స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత అతను తనపై అత్యాచారం చేసి, అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీశాడని ఆ మహిళ ఆరోపించింది. ఈమె ఫిర్యాదు మేకు కేసు నమోదైంది.ఇదీ చదవండి: విమానయాన, ఇంధన సంస్థలకు గుడ్ న్యూస్: కేబినెట్ కీలక నిర్ణయండీఎస్పీ అనిల్ కుమార్ సింగ్ సమాచారం ప్రకారం నిందితుడు బాధితురాలిని బెదిరించి, డబ్బు చెల్లించకపోతే ఆమె వీడియోలను ప్రచారం చేస్తానని హెచ్చరిస్తూ రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. దర్యాప్తులో భాగంగా, నిందితుడి మొబైల్ ఫోన్ నుంచి పోలీసులు వివిధ పురుషులు, మహిళలకు చెందిన డజనుకు పైగా అశ్లీల ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు. మిశ్రా ఆన్లైన్లో ప్రసంగాలతో అనుచరులను ఆకర్షించేవాడని, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. గత నాలుగేళ్లుగా అభిషేక్ మిశ్రా మథురలోని రాధాకుంజ్ ప్రాంతంలో నివసిస్తూ, తనను తాను ఒక 'కథావాచక్' (ఆధ్యాత్మిక ప్రవచనకారుడు) గా పరిచయం చేసుకున్నాడు. యూట్యూబ్‌లో "రాధా కృప అమృత" (Radha Kripa Amrita) అనే ఛానెల్ ద్వారా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రవచనాలు చెబుతూ ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ప్రత్యేకంగా విద్యావంతులైన మహిళలను, ముఖ్యంగా ఇంజనీర్లు, పెద్ద కంపెనీలలో పనిచేసే నిపుణులను లక్ష్యంగా చేసుకుని, వారిని లైంగికంగా వేధించి, బ్లాక్మెయిల్ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ కొనసాగుతోందని, నిందితుడిని జైలుకు తరలించామని ఎస్పీ (గ్రామీణ) సురేష్ చంద్ర రావత్ తెలిపారు. మిశ్రా నేపథ్యం, బాధితులపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ఢిల్లీ విషాదం : షాకింగ్ విషయాలు వెలుగులోకివిచారణ సమయంలో మిశ్రా పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం, అతను సుమారు ఐదేళ్ల క్రితం ఐఐటి రూర్కీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. మధురకు వెళ్లడానికి ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో సంవత్సరానికి రూ. 20 లక్షల జీతంతో పనిచేశాడు. ఇదీ చదవండి: హోమియో Vs అల్లోపతి : అగ్గి రాజేసిన అనుష్క శర్మ పోస్ట్ -
కజిన్ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్.. చూడలేం!
ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ఘోరమైన, కలచివేసే ఘటన వెలుగుచూసింది. ఫిరోజాబాద్‌లోని యాదవ్ కాలనీలో శనివారం (మే 30) జితేంద్ర పాఠక్ అలియాస్ విరాజ్ (24) అనే వ్యక్తి, ఆరవ్ అనే ఒకటిన్నర ఏళ్ల చిన్నారిని అత్యంత అమానుషంగా నేలకేసి కొట్టి చంపాడు.స్థానిక మహిళను పెళ్లి చేసుకోవాలని భావించాడు నిందితుడు జితేంద్ర. అయితే దీన్ని ఆమె తిరస్కరించడంతో విచక్షణ మరచిన రాక్షసుడిలా మారిపోయాడు. అమాయక బాలుడిని దారుణంగా ఉన్మాదిలా పదే పదే నేలకేసి విసిరి కొట్టాడు. ఎనిమిది సార్లు నేలకేసి కొట్టడంతో, చిన్నారిఅక్కడికక్కడే ప్రాణాలొదొలేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అమానుష ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. The video is sensitive.A woman rejected this monster's proposal, and the beast thrashed her innocent child to death. This incident occurred in #Firozabad, #UttarPradesh.Accused Viraj Alias Jitender Arrested Viraj, also known as Jitender, has been arrested by police. The… pic.twitter.com/bfoGAmACz7— Siraj Noorani (@sirajnoorani) May 30, 2026 నిందితుడు జితేంద్ర పాఠక్ ఒక కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అతను తన కజిన్ సుమిత్ భార్య, చిన్నారి తల్లి , రతీ దేవిపై మోహాన్ని పెంచుకున్నాడు. రతి, సుమిత్ గత కొంతకాలంగా విడిగా ఉంటుండగా, రతి విడాకుల వ్యవహారాల్లో జితేంద్ర సహాయం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమెపై ప్రేమను పెంచుకుని పెళ్లి ప్రతిపాదనలు చేయగా, రతి వాటిని నిరంతరం తిరస్కరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లి పింకీ దేవితో కలిసి విడాకుల చట్టపరమైన సంప్రదింపుల కోసం షికోహాబాద్ వెళ్లారు. జితేంద్ర వారిని వెంబడించి అక్కడ కూడా పెళ్లి ప్రపోజల్ పెట్టగా, ఆమె నిరాకరించింది. రతి తనను పెళ్లి చేసుకోకపోవడానికి ఆ చిన్నారే ప్రధాన అడ్డంకి అని నిందితుడు భావించి, ఆ దురాగతానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది.శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో టాఫీ (చాక్లెట్) కొనిస్తానని చెప్పి చిన్నారి ఆరవ్‌ను జితేంద్ర లోబరుచుకున్నాడు. తీవ్రమైన ఉన్మాదంతో ఊగిపోయిన జితేంద్ర, ఆ పసికందును పైకెత్తి దాదాపు ఎనిమిది సార్లు కిరాతకంగా నేలకేసి కొట్టాడు. ఈ దారుణమైన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.స్థానికులు గమనించి అడ్డుకునేలోపే ఘోరం జరిగిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదైంది. ఆదివారం (మే 31) మైన్‌పురి రోడ్డు సమీపంలో పోలీసులకు, నిందితుడికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల (ఎన్కౌంటర్) అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇదీ చదవండి: ఇద్దరు అమ్మాయిల పెళ్లి : అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..! -
మా ఇంట్లోనే ఉంటూ.. మా బిడ్డ ప్రాణం తీశాడు!
శనివారం ఉదయం (మే 29).. త్యాగి కుటుంబమంతా చిరాగ్ కోసం ఎదురుచూస్తోంది. జపాన్ నుంచి తిరిగి వస్తున్న అతడికి ఘన స్వాగతం పలికేందుకు ఇంటిని అందంగా అలంకరించారు. పారా ఆసియా క్రీడలకు అర్హత సాధించిన అతడికి అభినందనలు తెలపాలని ఊరంతా ఎదురుచూస్తోంది.కానీ చిరాగ్ మాత్రం ఇంటికి రానేలేదు. బదులుగా ఘజియాబాద్ పోలీసుల నుంచి అతడి కుటుంబానికి ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే ఎంఎంజీ ఆస్పత్రికి రావాలని.. చిరాగ్ గాయపడ్డాడని వారికి చెప్పారు. కానీ అక్కడికి వెళ్లే సరికి అంతా అయిపోయింది.భారత పారా అథ్లెట్ 24 ఏళ్ల చిరాగ్ త్యాగి శాశ్వతంగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయాడు. పారా ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్న కల నెరవేరకుండానే అతడు కన్నుమూశాడు. ఇందుకు అతడి స్నేహితుడు, తోటి పారా అథ్లెట్ యశ్ ఖటిక్ కారణమని త్యాగి కుటుంబం ఆరోపించింది.వాళ్లే కారణంఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం నాటి ప్రెస్ మీట్లో కీలక విషయాలు వెల్లడించారు. ‘‘విచారణలో భాగంగా చిరాగ్ త్యాగి మరణానికి యశ్ ఖటిక్తో పాటు గగన్ త్యాగి కూడా కారణమని తేలింది. వీరితో పాటు అభయ్ అలియాస్ అభినవ్‌కు కూడా ఇందులో హస్తం ఉంది’’ అని పోలీసులు తెలిపారు.విచారణలో భాగంగా నిందితుడు యశ్ ఖటిక్ తమకు చెప్పిన విషయాలను కూడా పోలీసులు ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. ‘‘నేనూ.. చిరాగ్ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 400 మీటర్ల రేసు కోసం ప్రాక్టీస్ చేసేవాళ్లము. చిరాగ్ మాత్రమే ఆసియా క్రీడలకు ఎంపికయ్యాడు.నాలో అభద్రతా భావం నిజానికి చిరాగ్ మాదిరే నాకూ కంటి సమస్య ఉంది. అయితే, నా మెడికల్ రిపోర్టును జర్మనీకి పంపించాల్సి ఉంది. కానీ చిరాగ్ దానిని నాశనం చేశాడు. దీంతో నేను ఆసియా క్రీడలకు సెలక్ట్ కాలేకపోయాను.అంతేకాదు.. పరుగు పందెంలో ఎప్పుడూ చిరాగే గెలిచేవాడు. అతడు వరుసగా రెండు పతకాలు కూడా సాధించాడు. అతడి ఎదుగుదల నాలో అభద్రతా భావాన్ని పెంచింది. అతడి వల్ల నా కెరీర్ ప్రమాదంలో పడుతుందనే భయం వెంటాడింది.అందుకే నా అసోసియేట్ గగన్ త్యాగితో కలిసి చిరాగ్ హత్యకు పథకం రచించాను. మాకు భికన్పూర్కు చెందిన అభయ్ పిస్టల్ తెచ్చి ఇచ్చాడు. మే 29న బెంగళూరు నుంచి చిరాగ్ తిరిగి వచ్చాడు. మే 30న ఘజియాబాద్‌కు టాక్సీలో పయనమయ్యాడు.అక్కడిక్కడే కుప్పకూలిపోయాడుఅప్పుడే మా ప్లాన్ ప్రకారం.. సాయి ఉప్వన్ దగ్గర చిరాగ్ త్యాగిని నేను తుపాకీతో చాలా దగ్గరి నుంచి కాల్చాను. అది అతడి తలకు తగిలింది. ఆ తర్వాత వెన్నులోనూ కాల్చాను. అతడు అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు.మేము చిరాగ్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాము. అతడి సిమ్ కార్డు తీసి మురికికాలువలో పడేశాము. అతడి బ్యాంకు అకౌంట్ నుంచి 62 వేల రూపాయలు డ్రా చేసి.. మాకు పిస్టల్ అమ్మిన వ్యక్తికి ఇచ్చేశాము’’ అని నిందితుడు యశ్ ఖటిక్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.కాగా చిరాగ్, యశ్ ‘బ్లైండ్’ కేటగిరీలో పోటీల్లో పాల్గొంటున్నారని.. అయితే, చిరాగ్ పట్ల అసూయతోనే యశ్ ఈ పని చేసినట్లు వెల్లడించాడని పోలీసుల విచారణలో తేలింది. కాగా చిరాగ్ అంకుల్ ప్రవీణ్ రాజ్ త్యాగి ఈ ఘటన గురించి మాట్లాడుతూ..‘‘చిన్నప్పటి నుంచి ఒలింపిక్స్ లక్ష్యంగా చిరాగ్ ముందుకు సాగాడు. జూడోలో కూడా అతడికి ప్రవేశం ఉంది. అయితే, స్ప్రింటర్‌గా రాణించడంపైనే దృష్టి పెట్టాడు.మా ఇంట్లోనే ఉంటూ.. మా బిడ్డ ప్రాణం తీశాడు!ఈ క్రమంలో ఎన్నో త్యాగాలు చేశాడు. అయితే, రోజురోజుకీ అతడి కంటిచూపు మందగించింది. ఎన్ని ఆస్పత్రులకు తిప్పినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడే పారా క్రీడల రూపంలో మాకు మరో మార్గం దొరికింది. అక్కడైనా తనను తాను నిరూపించుకోవాలని చిరాగ్ పట్టుదలగా పనిచేశాడు.అసలు యశ్ ఈ పని చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాము. చిరాగ్‌కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రూ. 20 వేలు వస్తే అందులో 10 వేలు యశ్కే ఇచ్చేవాడు. అతడికి శిక్షణ కూడా ఇచ్చేవాడు. యశ్‌ను మేమెంతగానో నమ్మాము. మా కొడుకులాగే చూసుకున్నాము. మాతో పాటు మా ఇంట్లోనే ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు అసూయతో మా బిడ్డనే చంపేశాడు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.


