ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ చోరీ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కస్టమర్లుగా నటిస్తూ గోల్డ్ షాప్‌కు వెళ్లిన మహిళలు చోరీకి పాల్పడ్డారు. ముగ్గరు మహిళలు కేవలం 14 నిమిషాల్లోనే రూ.14 లక్షల విలువైన బంగారు చెవి పోగులు దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రయాగ్‌రాజ్‌లోని కల్యాణ్ జువెలర్స్ షోరూమ్‌లో డిసెంబర్ 31 2025న ఈ ఘటన జరిగింది.
ఆభరణాలు కొనేందుకు కస్టమర్లుగా వెళ్లిన ముగ్గురు మహిళలు.. సేల్స్‌మెన్ వారికి బంగారు ఆభరణాలను చూపించడంలో బిజీగా ఉన్న సమయంలో షోకేస్‌లో ఉన్న చెవిపోగుల డిస్‌ప్లే ప్యాడ్‌ను దొంగలించారు. ఎవరికీ కనిపించకుండా దుస్తుల్లో దాచి అక్కడ నుంచి వెళ్లిపోయారు. కేవలం 14 నిమిషాల్లోనే పనిపూర్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
డిస్‌ప్లే ప్యాడ్ కనిపించకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఈ వ్యవహారం బయటపడింది. జువెలర్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళల్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
इन महिलाओं ने बड़ा हाथ मारा है. कल्याण ज्वेलर्स से 14 लाख के गहने चुराए.
प्रयागराज स्थित कल्याण ज्वेलर्स में ये चोरी हुई है. चार महिलाओं ने सेल्समैन को बातों में उलझाए रखा और मौका मिलते ही गहना चोरी कर लिया. पूरी घटना CCTV में कैद है. pic.twitter.com/mhmYetbwEh— Priya singh (@priyarajputlive) January 7, 2026
ఈ ఘటనపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. సేల్స్‌మన్‌ను దృష్టి మళ్లించి, షాప్‌లో ఆభరణం దాచడం సినిమా సన్నివేశంలా ఉందంటూ ఒకరు.. సెక్యూరిటీ గార్డ్‌తో పాటు, సీసీటీవీని గమనిస్తూ వెంటనే అలర్ట్ చేసే వ్యక్తిని కూడా నియమించాలంటూ మరొకరు సూచనలు ఇస్తున్నారు. మరో నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ.. అది కూడా ఒక స్కిల్‌నే, దాంతో సంపాదించనివ్వండి.” అంటూ కామెంట్ పెట్టారు.


