breaking news
Theft
-
క్యాబ్ డ్రైవర్‌పై ప్రశంసల జల్లు.. కారణం ఏంటంటే?
ఢిల్లీ : ప్రయాణాల్లో పొరపాటున వస్తువులు మర్చిపోతే అవి తిరిగి దొరకడం గగనమైన ఈ రోజుల్లో ఓ క్యాబ్ డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. ప్రయాణికుడు క్యాబ్‌లో వదిలేసిన ఖరీదైన 'ఐఫోన్ 16'ను స్వయంగా వెళ్లి అప్పగించి అందరి మనసులనూ గెలుచుకున్నాడు.ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) పరిధిలో రైడ్ ముగిసిన తర్వాత మీర్ షేక్ అనే డ్రైవర్‌కు తన క్యాబ్ వెనుక సీట్లో ఐఫోన్ 16 కనిపించింది. ఆ ఫోన్ ఎవరిదో గుర్తించడానికి, యజమానిని సంప్రదించడానికి అతనికి ఎలాంటి ఆధారం లభించలేదు. సదరు ప్రయాణికుడు ఒక సీనియర్ సిటిజన్ అని మాత్రమే అతనికి గుర్తుంది. ఫోన్‌కు ఎలాంటి ఇన్కమింగ్ కాల్స్ రాకపోవడం, క్యాబ్ యాప్ ద్వారా నేరుగా కస్టమర్‌ను సంప్రదించే వీలు లేకపోవడంతో షేక్ ఈ విషయాన్ని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాడు.ఫోన్‌ను ఎవరికీ ఇవ్వకుండా భద్రంగా తన వద్దే ఉంచుకుని, యజమాని నుంచి కాల్ వచ్చే వరకు ఎదురుచూశాడు. కాసేపటికి ఫోన్ రింగ్ కావడంతో యజమానితో మాట్లాడాడు. వారు మలబార్ హిల్‌లో ఉన్నారని తెలుసుకున్న మీర్ షేక్, స్వయంగా అక్కడికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి ఆ ఫోన్‌ను సురక్షితంగా వారికి అందజేశాడు.ఫోన్ తిరిగి అందిన ఆనందంలో సదరు ప్రయాణికుడు డ్రైవర్ నిజాయితీని, శ్రమను అభినందిస్తూ అతనికి రూ. 2,500 నగదును బహుమతిగా అందించారు. దీనిపై మీర్ షేక్ స్పందిస్తూ.. నిజాయితీకి తగిన గౌరవం, ప్రతిఫలం దక్కడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు డ్రైవర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
ఎక్కడి బంగ్లాదేశ్? ఎక్కడి ఆదిలాబాద్?
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో జరిగిన దొంగతనం కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుడు మహ్మద్ జౌని అలీ గత కొన్నేళ్లుగా సుమారు 10 నుంచి 12 సార్లు అక్రమంగా, చాలా సులభంగా బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబడ్డాడు. వివిధ రాష్ట్రాల్లోని ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇదే తరహాలో పనిచేసే 12 నుంచి 15 మంది బంగ్లాదేశ్ వాసులతో కూడిన ముఠాతో అతడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసులో జిల్లా పోలీసులు ఇద్దరు బంగ్లాదేశీవాసులతోపాటు ఒక భారతీయ నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలను వెల్లడించిన విషయం విదితమే. సుమారు తొమ్మిదేళ్లుగా దేశ వ్యాప్తంగా పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు మహ్మద్ జౌని అలీని విచారించగా, పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజస్తాన్, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో సంచరిస్తూ ఇళ్ల తాళాలు పగులగొట్టి విలువైన వస్తువులు, బంగారం, వాహనాలు చోరీలకు పాల్పడుతున్నారు. నిందితులు పగటిపూట కుక్కర్లు, గ్రైండర్లు విక్రయిస్తున్నట్లు నటిస్తూ కాలనీల్లో సంచరిస్తారు. ఇళ్లను రెక్కీ నిర్వహించి తాళాలు వేసి ఉన్న వాటిని గుర్తిస్తారు. రాత్రివేళల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతారు. జౌనిపై దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎనిమిదికిపైగా నేరాల కేసులు ఉన్నాయి. ఇదే కేసులో పట్టుబడ్డ మరో సహ నిందితుడు భారత్‌కు చెందిన తరుణ్ సింగ్‌పై ఆరుకుపైగా కేసులు నమోదై ఉన్నాయి. ముఠాలోని ఇతర సభ్యులపై కూడా వివిధ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు గుర్తించారు.సహకరించిన వ్యక్తుల పాత్రపై దర్యాప్తు..సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, నిఘా సమాచారం, వివిధ రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో ఆదిలాబాద్ జిల్లా పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసి కేసును ఛేదించారు. మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ముఠాకు చెందిన ఇతర సభ్యులు, సహచరులు, అక్రమంగా భారతదేశంలో నివసించేందుకు సహకరించిన వ్యక్తులు, నకిలీ పత్రాలు సమకూర్చిన వారి పాత్రపై సంబంధిత రాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా పోలీసులు ముందుకెళ్తున్నారు. దేశ భద్రతకు ముప్పుగా మారే అక్రమ విదేశీయులు, అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర నేర ముఠాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఐబీకి వివరాలు పంపిస్తున్నాంఈ దొంగతనం కేసులో మరికొంత మంది బంగ్లాదేశ్ వాసులు ముఠాగా సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ప్రధాన నిందితుడి ద్వారా తెలిసింది. ఆ మిగిలిన వారి కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)కి వివరాలు పంపిస్తున్నాం. అక్రమంగా దేశంలోకి ఎలా ప్రవేశిస్తున్నారు? ఇంకా ఎలాంటి నేరాలు చేస్తున్నారు? అనే విషయాలను రాబడుతున్నాం. వివిధ రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నాం. – అఖిల్ మహాజన్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ -
తిరుపతిలో చోరీ కలకలం..
ఆంధ్రప్రదేశ్: తిరుపతి పోలీస్ స్టేషన్ పరిధి భవాని నగర్లో చోరీ ఘటన కలకలం రేపింది. ఒంటరిగా నివసిస్తున్న లక్ష్మి అనే మహిళ ఇంటిలో గుర్తుతెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు.బాధితురాలు ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగ, బీరువాలో భద్రపరిచిన సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. ఉదయం లేచి చూసిన బాధితురాలు నగలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు ఎస్సై ప్రసాద్ ఆధారాలను సేకరించి, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. అయితే, నిందితుడిని గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
పోటాపోటీగా పొర్లు దండాలు..!
సాక్షిప్రతినిధి, విజయనగరం: హూ ఈజ్ మోదీ.. అయామ్ ఫాదరాఫ్ లోకేశ్.. నౌ టెల్ మీ.. హూ ఈజ్ మోదీ.. తల్లిని చూడలేనివాడు దేశాన్ని చూస్తాడా.. గోద్రా నరహంతకుడు మోదీ దేశానికి ప్రధానిగా ఎలా పనికొస్తాడు అంటూ అప్పట్లో హూంకరించిన చంద్రబాబేనా ఈయన.. కొంపదీసి డూప్ చంద్రబాబు గట్రా స్టేజి మీద ఉన్నారా అని ఒక్క క్షణం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ సభకు హాజరైన జనానికి అనిపించింది. ఈ దేశానికి మోదీలాంటి వ్యక్తి అవసరం ఎంతైనా ఉంది.. అసలు మోదీ అవసరం దేశానికీ ఉంది.. ఆయన లేకపోతే దేశం లేదు.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీలాంటి నాయకుడిని చూడలేదు అంటూ బాబు ఉన్నఫళంగా మోదీ దండకం అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీని ఏదో మర్యాదకోసం... ప్రొటోకాల్ కోసం అభినందించడం.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కృతజ్ఞతలు పూర్వకంగా రెండు మాటలు మాట్లాడడం సహజమే.. కానీ శనివారం చంద్రబాబు.. లోకేశ్.. పవన్ కల్యాణ్ ఒక్కొక్కరు ఒక్కో రేంజిలో పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ మోదీ భజన చేస్తుంటే... అసలు ఇది విమానాశ్రయ ప్రారంభమా ? మోదీ భజన కోసం ఇన్ని వేలమందిని తరలించారా అనే సందేహం అందరిలోనూ కలిగింది. లోకేశ్ చిడతల భజన చంద్రబాబు, పవన్ ఒక్కోరేంజిలో భజన చేయడంతో... ఇక లోకేశ్ కూడా తనవంతు పాత్ర గట్టిగానే పోషించేశారు. మోదీజీ విజన్.. చంద్రబాబు ఎగ్జిక్యూషన్ అంటూ పావుగంటసేపు చిడతలు వాయించేశారు. ఉన్న సమయమంతా మోదీని పొగడడానికి సరిపెట్టేశారు. రాష్ట్ర, దేశ ప్రగతికి మోదీ చేస్తున్న సేవలు.. ఆయన కృషి అంటూ మొదలెట్టి పలు పథకాలు.. రకరకాల ప్రాజెక్టుల పేర్లు చెబుతూ మోదీజీకి జై అనేలా ప్రజలను బతిమాలి మరీ జై కొట్టించారు. వచ్చీరాని మాటలు, అర్ధంలేని ప్రసంగాలతో తనదైన ‘ముద్ర’ను ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి ముగ్గురూ ఒకరిని మించి ఒకరు ప్రధానమంత్రి మోదీని ఉబ్బించేసి తాము ఉబ్బిపోయి వేదిక దిగిపోయారు. పవన్‌కు కన్నీళ్లు వచ్చేశాయి సముద్రం ఒకరి కాళ్లదగ్గర మోకరిల్లదు .. పర్వతం ఎవరికీ సలాం చేయదు అంటూ విప్లవ డైలాగులు చెప్పే పవన్ కల్యాణ్ సైతం ఈ రోజు పదిపన్నెండు మెట్లు దిగి మోదీకి భజన కొట్టారు. ప్రభుత్వ వైఫల్యాల మీద యువత మోదీని తిడుతుంటే తనకు కన్నీళ్లొచ్చేశాయి అంటూ సెంటిమెంట్ పండించారు. మోదీని కొట్టేవాళ్లు దేశంలోనే లేరని, ఆయనకు నచ్చినన్నాళ్లు ప్రధాని పదవిలో ఉండచ్చని చెబుతూ ఆయనకు బోర్ కొడితే మాత్రమే పదవిని వదులుకోవాలన్నారు. అలాంటి ప్రధాని సారథ్యంలో పని చేయడం తనకు జన్మజన్మల పుణ్యఫలం అని చెబుతుంటే... గతంలో మనం ఢిల్లీ వాళ్ల ముందు తలవంచుతామా ? ఢిల్లీ పెత్తనం మనకు అవసరమా అంటూ గొంతు చించుకుని అరచిన పవన్ కల్యాణ్ జనానికి గుర్తొచ్చారు. కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు.. పని చేస్తున్నందుకే మోదీజీకి ఈ నిందలు అంటూ పవన్ మ్రాన్పడిపోవడాన్ని చూసి సభికులు విస్తుపోయారు. నటనా చాతుర్యం బాగుందని కితాబిచ్చారు.యువత దుమ్మెత్తిపోస్తుంటే... దేశవ్యాప్తంగా జెన్‌జీ యువత అటు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తోంది. నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్ర«దాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో దేశంలో మోదీ ప్రభ కాస్త మసకబారుతోందన్న సూచనలు సైతం సమాజంలోకి వెళ్తున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు తణమూల్ కాంగ్రెస్ నుంచి పలువురు ఎంపీలు బీజేపీలో కలుస్తుండడంతో ఈ అవకాశవాద చంద్రబాబును మోదీ పక్కనబెడతారు.. ఇక బాబుకు ప్రాధాన్యం తగ్గుతుందన్న వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబుకు అత్యవసరంగా లోకేశ్‌ను సీఎంగా చేయాలన్న ఇంటిపోరు సైతం మొదలైంది. మోదీ అనుమతి లేకుండా లోకేశ్‌ను సీఎం చేయడంకుదరని పని. దీంతో అటు తృణమూల్ రూపంలో కేంద్రంతో తన ప్రాధాన్యాన్ని ముంచుకొచ్చిన ముప్పును తప్పించుకుంటూ ఇంకా మోదీకి విధేయత చూపడానికి బాబు ఎక్కడలేని తంటాలు పడ్డారు. మేకిన్ ఇండియా.. ఆత్మనిర్భర భారత్.. బులెట్ ట్రైన్, డిజిటల్ పేమెంట్స్.. రోడ్లు.. విమానాశ్రయాలు.. జాతీయ రహదారులు అంటూ పలు ప్రాజెక్టులు, పథకాల పేర్లు చెబుతూ వెనువెంటనే మోదీమోదీ అంటూ అరవాల్సిందిగా బాబు సభికులకు ప్రాథయపడ్డారు. ఒకానొకదశలో బాబు పూనకం వచ్చినట్లు గొంతు చించుకుని మోదీమోదీ అని అరవడాన్ని చూసి వీఐపీ గ్యాలరీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం విస్తుపోయారు. ఉన్నఫళంగా ఈ స్థాయి పూనకానికి కారణం ఏమిటో అర్థంకాక ఒకరి మోకాలు ఒకరు చూసుకున్నారు. లోకేశ్‌ను సీఎంను చేసేందుకే ఇంత ప్రాపకమా అన్న విషయం తెలిసుకున్నాక ముక్కనవేలేసుకున్నారు.సీఎం పవన్ సారథ్యం అవసరం: శ్రీనివాస వర్మ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబుల నాయకత్వం ఎంతో అవసరం అని కేంద్ర పరిశ్రమల శాఖ శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదిక మీద ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో దోహదపడుతోందన్నారు. దీనికి ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఘనత సాధించడానికి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప ముఖ్య మంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఈ కాంబినేషన్ ఇలాగే ఉండాలని అభిలషించారు. పొరపాటున ఆయన ఇలా అన్నారేమో అనుకుని సభికులు కలవరపడ్డారు. ముఖ్యమంత్రి పవన్ అని కేంద్రమంత్రి అనగానే జనంలోంచి కాస్త గుసగుసలు.. కేకలు, అరుపులు వినిపించాయి... కానీ కేంద్ర మంత్రి ఏకంగా రెండుమూడు సార్లు పవన్‌ను ముఖ్యమంత్రి అని, చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి అని సంబోధించడం వెనుక బీజేపీ నుంచి ఏమైనా సూచనలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశంతో మోదీ ఈయనతో ఇలా మాట్లాడించారా అనే గుసగుసలు వినిపించాయి.రాష్ట్రమంత్రులకు నో మైక్ విమానాశ్రయం ప్రారంభ వేదిక మీద కేవలం ప్రధాని మోదీ, లోకేశ్, పవన్ కల్యాణ్, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, రామ్మోహన్ నాయుడు మాత్రమే ప్రసంగించారు. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కానీ రాష్ట్ర మంత్రులు టీడీ జనార్దన్, జిల్లాకు చెందిన కొండపల్లి శ్రీనివాస్, హోం మంత్రి అనితకు మైక్ దక్కలేదు. ఆఖరుకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కానీ స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి కూడా ప్రసంగించేందుకు అవకాశం దక్కలేదు. గవర్నర్ అబ్దుల్ నజీర్ , గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సైతం వేదిక మీద ఆసీనులయ్యారే తప్ప మాట్లాడేందుకు మైక్ అందలేదు. -
నా కథ, స్క్రీన్‌ప్లే దొంగిలించారు
నా కథ, స్క్రీన్‌ప్లేని దొంగిలించి, నేను రూపొందించిన ప్రాజెక్ట్ నుంచి తప్పించారంటూ ఓ సినీ రచయిత ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాద్ మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన భూక్య ప్రభుదేవ్ రూపొందించిన 'మణిమా–ది శూన్య పురుష–ది లార్డ్ పూరి జగన్నాథ్' మైథాలజీ సినిమాకు సంబంధించిన కథ, స్క్రీన్‌ప్లే, టైటిల్ గ్లింప్స్ ని స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్‌లో నమోదు చేసుకున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)సినిమా పనుల కోసం తనతో పనిచేసిన పి.రవి, కో డైరెక్టర్ నవీన్ నలమాసని ప్రభుదేవ్ నియమించుకున్నారు. వీరు అజిత్ కుమార్‌తో కలిసి ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్, ఫైల్స్‌ను, హార్డ్‌డిస్క్ దొంగిలించారని, అందులోని కథని ఉపయోగించి తనని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించి.. రచయిత, దర్శకులుగా గుర్తింపు పొందడానికి ప్రయత్నించారని ప్రభుదేవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం) -
తిరుమలలో విగ్రహం దొంగలించింది నారా లోకేష్ అనుచరుడే
-
హనుమాన్ విగ్రహం చోరీ.. మాయం చేసింది టీడీపీ నేతనే!
సాక్షి,తిరుపతి: తిరుమల కొండపై కలకలం రేపిన అంజనేయస్వామి విగ్రహం చోరీ కేసు దర్యాప్తులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఉన్న హనుమాన్ చిన్న విగ్రహాన్ని అపహరించిన వ్యక్తిని రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.తిరుమలలో అపచారానికి పాల్పడి విగ్రహాన్ని చోరీ చేసిన నిందితుడు విశాఖపట్నం జిల్లా, భీమిలి నియోజకవర్గం, టి. నగరపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేత పొట్నూరు యశ్వంత్గా దర్యాప్తులో తేలింది. నిందితుడు యశ్వంత్‌కు టీడీపీలోని కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్,గంటా శ్రీనివాసరావు సహా పలువురు పార్టీ ముఖ్య నేతలతో యశ్వంత్ దిగిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. -
‘తిరుమల ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు?’
సాక్షి, తిరుపతి: ‘‘తిరుమలలో హనుమాన్ విగ్రహం మాయమైంది. వందల ఏళ్ల పురాతన విగ్రహం చోరీకి గురైంది. కూటమి చేస్తానన్న తిరుమల ప్రక్షాళన ఇదేనా? అంటూ వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు.‘‘25 వేల మందికి పైగా మెట్ల మార్గం పాదయాత్ర ద్వారా తిరుమలకు వెళ్లే మార్గంలో ఈ విగ్రహాన్ని దర్శిస్తారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి రోజున వైభవంగా టీటీడీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. విగ్రహం చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి...టీటీడీ విజిలెన్స్ అధికారులు చోరీ చేసిన దొంగను పిచ్చివాడిగా ముద్ర వేసే కుట్ర జరుగుతోందని మాకు సమాచారం. నిత్యం కొండపై ఏదో ఒక ఘోరం, అపచారం జరుగుతోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు చెందిన అంశం ఇది. చంద్రబాబు బాధ్యతా వహించాలి. టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి’’ అని భూమన డిమాండ్ చేశారు. -
ఆ హోటల్ వద్ద ఆగితే అంతే..!
నల్గొండ జిల్లా: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి శివారులోని ఓ హోటల్ దోపిడీ దొంగలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి రాత్రివేళ హైదరాబాద్‌కు వెళ్లే ప్రైవేట్, ఆర్టీసీ బస్సులను డ్రైవర్లు టీ, టిఫిన్ కోసం ఈ హోటల్ వద్ద ఆపుతుంటారు. దీంతో అక్కడే మాటువేస్తున్న దోపిడీ దొంగలు పక్కా స్కెచ్‌తో ప్రయాణికుల సొమ్మును దోచేస్తున్నారు. హైవేపై ఎన్నో హోటళ్లు ఉన్నప్పటికీ.. కేవలం ఈ హోటల్ వద్దే పదేపదే దొంగతనాలు జరుగుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్లలో నాలుగు.. గడిచిన నాలుగేళ్లలో ఆ హోటల్ ఆవరణలోనే నాలుగు భారీ చోరీలు జరిగాయి. 2022 నవంబర్ 22న విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సును హోటల్ వద్ద ఆపగా.. ఓ ప్రయాణికుడికి సంబంధంచిన కిలో 300 గ్రాముల బంగారాన్ని దుండగులు అపహరించారు. అదేవిధంగా 2023 జూలై 26న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుడికి చెందిన రూ.28 లక్షల నగదును ఈ హోటల్ వద్దే దొంగలు అపహరించారు. ఈ రెండు కేసుల్లో నిందితులు ఇప్పటికీ దొరకలేదు. 2025 ఫిబ్రవరి 9న ఈ హోటల్ వద్ద ఆపిన బస్సులో నుంచి రూ.25 లక్షలు చోరీ చేసి కారులో పారిపోతున్న ముఠాను అప్పటి ఎస్ఐ క్రాంతికుమార్ సీసీ కెమెరాల ఆధారంగా మధ్యప్రదేశ్‌కు వెళ్లి పట్టుకున్నారు. రికవరీ చేసిన నగదును బాధితుడికి అప్పగించారు. తాజాగా ఆదివారం ఖమ్మం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఈ హోటల్ వద్ద ఆగగా.. ఓ ప్రయాణికుడు రూ.9లక్షల నగదు ఉన్న బ్యాగును పక్కన పెట్టుకుని టిఫిన్ చేస్తుండగా.. దుండగులు ఒక్కసారిగా బ్యాగును లాక్కొని అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న కారులో పరారయ్యారు. సినిమా ఫక్కీలో చోరీ..ఈ దోపిడీ ముఠాలు పక్కా ప్రణాళికతోనే సినిమా ఫక్కీలో దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దొంగలు ముందుగానే కారులో వచ్చి హోటల్ వద్ద మాటు వేస్తున్నారు. బస్సులు ఆగగానే ప్రయాణికులను గమనిస్తూ, నగదు లేదా నగలు ఉన్న బ్యాగులను టార్గెట్ చేస్తున్నారు. తరచూ ఆ హోటల్ వద్ద పదేపదే ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ప్రయాణికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రంగంలోకి మూడు ప్రత్యేక బృందాలువరుస చోరీల నేపథ్యంలో çహోటల్ వద్ద పోలీసులు సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.. తాజాగా జరిగిన దోపిడీపై నార్కట్‌పల్లి సీఐ సిరికొండ సురేష్, ఎస్ఐ పందిరి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీసీఎస్ సమన్వయంతో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. హోటల్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలు, జిల్లా సరిహద్దుల్లోని నాలుగు టోల్ ప్లాజాల డేటా, మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
యనమలకుదురు కొండపై గణపతి ఆలయాల్లో చోరీ
పెనమలూరు: విజయవాడ యనమలకుదురు కొండపై గల రెండు గణపతి ఆలయాల్లో దొంగలు హుండీలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురు కొండపై గల శ్రీపార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ గణపతి ఆలయంలో హుండీని పగులగొట్టి అందులో సొమ్మును చోరీ చేశారు. ఆదివారం రాత్రి ఆలయంలో పూజా కార్యక్రమాలు ముగిసిన తరువాత ప్రధాన ద్వారాలు మూసి తాళాలు వేశారు. దొంగ దాదాపు 15 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయ గోడపై (ప్రాకారం) నుంచి ఆలయంలోకి దిగాడు.శివాలయం పక్కనే ఉన్న శ్రీగణపతి ఆలయం హుండీ పగులగొట్టి అందులో సొమ్ము చోరీ చేశారు. అయితే ఇటీవల హుండీల లెక్కింపు జరగటంతో హుండీలో తక్కువ సొమ్ము మాత్రమే ఉండి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఆలయ ప్రధాన ద్వారాలు మూసివున్నా.. వాచ్మెన్, సీసీ కెమెరాలు ఉన్నా దొంగ చాకచక్యంగా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి దొంగతనం చేయటం కలకలం చెలరేగింది. ఆలయ ప్రాంణంలో దిగిన దొంగ తిరిగి బయటకు ఎలా వెళ్లాడనేది మిస్టరీగా ఉంది. మహాగణపతి ఆలయంలోనూ.. కొండ పైమార్గంలో ఉన్న మరో శ్రీమహాగణపతి ఆలయంలో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయం ప్రధాన ద్వారాలు మూసి ఉండటంతో దొంగ గుడి పక్కనే ఉన్న చెట్టుపై నుంచి ఆలయంలోకి దిగి గ్రిల్ తాళం పగులగొట్టాడు. ఆలయ హుండీని పగులగొట్టి సొమ్ము చోరీ చేశాడు. గత శివరాత్రి తరువాత హుండీ లెక్కించలేదని, దాదాపు రూ.50 వేల సొమ్ము పోయి ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. క్రైమ్ పోలీసులు, క్లూస్ టీమ్ రంగంలోకి సీసీ కెమెరా ఫుటేజీ, వేలిముద్రలు సేకరించారు. -
అయోధ్య విరాళాల చోరీ అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ వివాదాంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విరాళాల చోరీ వివాదం కేవలం సాధారణ నేరపూరిత ఘటనగా మాత్రమే చూడాలని, దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాలు రాజకీయాలకు వేదికలు కావని పిటిషనర్లకు హితవు పలికింది. ఈ వివాదంపై దాఖలైన పలు పిటిషన్లను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది.అయోధ్య రామ మందిరానికి సంబంధించిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బ్యాంక్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్‌తో పాటు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేత ఆడిట్ చేయించాలని పిటిషనర్లు కోరారు. అలాగే ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా సీబీఐ చేత స్వతంత్ర విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. పిటిషనర్ల వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు దర్యాప్తుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మరింత పారదర్శకంగా విచారించేందుకు వీలుగా, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందాన్ని పునర్వ్యవస్థీకరించాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన పురోగతి, నిందితుల అరెస్టులు, రికవరీలపై సమగ్రమైన స్టేటస్ కో రిపోర్టు సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది.యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విరాళాల చోరీ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. ఇప్పటివరకు ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి దాదాపు రూ.80 లక్షల నగదును రికవరీ చేసినట్లు సమాచారం. కాగా, ఈ వివాదంలో ప్రముఖ సాధువుల సంస్థ నిర్మోహి అఖారా కూడా అదనపు పిటిషన్ దాఖలు చేసింది. సిట్ పునర్వ్యవస్థీకరణ, స్టేటస్ రిపోర్టు సమర్పణకు సమయం ఇస్తూ, సుప్రీంకోర్టు తదుపరి విచారణను జూలై 27కి వాయిదా వేసింది. -
బాల్ కట్వా గ్యాంగ్ దాడులు.. పోలీసులకు సవాల్
పాట్నా: అందరూ ఇంట్లో ఉండగానే చొరబడతారు. చాకచక్యంగా మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేస్తారు. దొరికిన డబ్బు, నగలు దోచుకుని పరారవుతారు. అయితే వెళ్తూ వెళ్తూ ఇంట్లోని మహిళల జుట్టును కత్తిరించి తీసుకెళ్తుండటమే ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. దొంగతనాల కేసులను ఛేదించడమే పోలీసులకు సవాలుగా ఉంటే, ఈ ‘జుట్టు కత్తిరించే’ గ్యాంగ్ మాత్రం వారికి కొత్త తలనొప్పిగా మారింది. బిహార్‌లో ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.నిత్యం సోషల్ మీడియాలో ‘చడ్డీ గ్యాంగ్’, ‘షట్టర్ కట్వా గ్యాంగ్’ గురించి వింటుంటాం. ఇప్పుడు ‘బాల్ కట్వా గ్యాంగ్’ బిహార్ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వారం రోజుల వ్యవధిలో ఒకే గ్రామంలో రెండు చోట్ల ఒకే తరహాలో దోపిడీలు జరిగాయి. డబ్బు, నగలతో పాటు మహిళల జుట్టును కూడా కత్తిరించి తీసుకెళ్లడంతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.దొంగలు ఎత్తుకెళ్లిన డబ్బు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వారు కత్తిరించి తీసుకెళ్లిన జుట్టును ఏం చేస్తున్నారనే ప్రశ్నకు మాత్రం ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. ఇదే స్థానికుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.ఇటీవల బిహార్‌లోని దర్భంగా జిల్లా దర్హార్ గ్రామంలో రెండు వేర్వేరు ఇళ్లలో ఒకే తరహాలో దోపిడీలు జరిగాయి. జూలై 8న డాక్టర్ పవన్ కుమార్ మిశ్రా ఇంట్లోకి చొరబడ్డ ఐదుగురు అగంతకులు కుటుంబ సభ్యులను బంధించి, ఇంజెక్షన్ రూపంలో మత్తుమందు ఇచ్చారు. సుమారు 20 నిమిషాల్లో రూ.5 లక్షల విలువైన బంగారం, రూ.35 వేల నగదు దోచుకుని పరారయ్యారు. వెళ్లే ముందు పవన్ మేనకోడలు, 22 ఏళ్ల కరిష్మా దేవి జుట్టును కత్తిరించి తీసుకెళ్లారు.అదే గ్రామంలో ఉపాధ్యాయుడు సుమన్ కుమార్ ఇంట్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లో దోపిడీ చేసిన దుండగులు అక్కడ నిద్రిస్తున్న బాలిక జుట్టును కూడా కత్తిరించి తీసుకెళ్లారు. వరుస దోపిడీలపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. బాధిత కుటుంబాలను విచారించి, ఘటనాస్థలాలను పరిశీలించాయి. రెండు చోట్ల జరిగిన దోపిడీల తీరు ఒకే విధంగా ఉందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.మరోవైపు, దుండగులు మహిళల జుట్టును ఎందుకు కత్తిరించి తీసుకెళ్తున్నారన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దోపిడీల కంటే ఈ అంశమే స్థానికులను ఎక్కువగా కలవరపెడుతోంది. రెండు ఘటనల వెనుక ఒకే ముఠా ఉందా? జుట్టును తీసుకెళ్లడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.దర్హార్ గ్రామంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భయంతో చాలా మంది గ్రామస్తులు రాత్రిళ్లు ఇళ్లకు కాపలా కాస్తూ మేల్కొని ఉంటున్నారు. అయితే నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు ప్రజలకు హామీ ఇచ్చారు. -
ఖాకీలకు ‘దొంగ’ పాఠం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసు దర్యాప్తులో కొత్త విషయం వెలుగుచూసింది. ఈ ఏడాది మే 3న జరిగిన దోపిడీలో సుబోధ్ సింగ్ ముఠా రూ.88లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఆభరణాలను ధర్మపురి మీదుగా ఛత్తీస్‌ఘడ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని అసాన్సోల్ నగల వ్యాపారికి విక్రయించినట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి ఆరాతీయగా బంగారాన్ని బిహార్ సరిహద్దుల మీదుగా నేపాల్ తరలించారని తెలుసుకున్నారు. కాగా, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి చేసిన దోపిడీని ఛేదించిన సందర్భాన్ని డిపార్ట్మెంట్లో చేరనున్న ప్రతీ పోలీస్ తెలుసుకోవాలని హోంశాఖ నిర్ణయించింది. ఇటీవల ఎంపికైన డీఎస్పీలకు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో ఈనెల 18న కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పాఠంగా బోధించనున్నారు. ఘటనకు ముందు రెక్కీ, దోపిడీ చేసిన విధానం, ఆధారాలు లేకుండా పరారైన వైనం, ఒక్కొక్క పనికి ఒక్కో వరుసలో నేరస్తులను ఉపయోగించిన తీరు, ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా దొంగలు సంప్రదింపులు జరిపిన విధానం, బిహార్ జైలులో ఉండి ఈ మొత్తం దోపిడీకి స్కెచ్ వేసిన సుబోధ్‌సింగ్‌ను కరీంనగర్‌కు తరలించే వరకు జరిగిన ఘటనలను ఫొటోలు, వీడియోల రూపంలో గౌస్ ఆలం స్వయంగా వివరించనున్నారు. ఇకపై డిపార్ట్మెంట్లోకి కొత్తగా వచ్చే కానిస్టేబుల్ దగ్గర నుంచి డీఎస్పీల వరకు పీఎంజే దోపిడీ కేసును కేస్ స్టడీస్‌గా బోధించాలని పోలీస్‌శాఖ నిర్ణయించనుంది. -
బైక్ దొంగిలించి ఈజీగా దొరికిపోయాడు
-
ఏసీ కోచ్‌లలో దుప్పట్లు, ఫేస్ షీట్ల చోరీ : 4 ఏళ్లలో రూ. 104 కోట్లు
భారతీయ రైల్వేలోని ఎయిర్ కండిషన్డ్ (AC) కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులు జనవరి 2022 మరియు మే 2026 మధ్య కాలంలో ఏకంగా 1.27 కోట్లకు పైగా దుప్పట్లు, తువ్వాళ్లు (బెడ్‌రోల్ వస్తువులను) దొంగిలించినట్లు సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' చేసిన దర్యాప్తులో వెల్లడైంది. దీనివల్ల లినెన్ కాంట్రాక్టర్లకు రూ. 104 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.దేశంలోని 18 రైల్వే జోన్లలో 16 జోన్ల పరిధిలోని 54 రైల్వే డివిజన్ల నుండి సేకరించిన ఆర్టీఐ సమాధానాల ప్రకారం.. 2022 -2025 మధ్య కాలంలో లినెన్ వస్తువుల దొంగతనాలు 56 శాతం పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపివేసిన బెడ్‌రోల్ సేవలను జనవరి 2022లో పూర్తిగా పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ట్రంప్, నెతన్యాహుతో పాటు 13 మంది టార్గెట్? ఇరాన్ రివెంజ్ లిస్ట్ కలకలం సాధారణంగా ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారికి రెండు బెడ్షీట్లు, ఒక బ్లాంకెట్ (కంబళి), ఒక దిండు, దిండు కవర్ ఒక ఫేస్ టవల్ (ముఖం తుడుచుకునే తువ్వాలు) ఉన్న బెడ్‌రోల్ కిట్‌ను అందిస్తారు. దొంగిలించబడిన వస్తువుల సంఖ్యను లెక్కగడితే.. ప్రతి 1,000 మంది ప్రయాణికులలో ఒకరు ఒక వస్తువును దొంగిలించినట్లు అవుతుంది. అయితే, నాలుగేళ్ల కాలంలో దొంగిలించబడిన వస్తువులలో ఫేస్ టవల్స్ మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ మొత్తం నష్టం రైల్వే అధికారులకు, కాంట్రాక్టర్లకు పెద్ద ఆందోళనగా మారింది. బడాబాబులు కొట్టేసిన వస్తువుల వివరాలు: ఫేస్ టవల్స్: 46.54 లక్షలుబెడ్షీట్లు: 41.13 లక్షలుదిండు కవర్లు: 23.59 లక్షలుబ్లాంకెట్లు (కంబళ్లు): 12.95 లక్షలుదిండ్లు: 2.76 లక్షలు (ఇవి పరిమాణంలో పెద్దవిగా ఉండటం వల్ల తక్కువగా దొంగిలించబడ్డాయి).ఎక్కువగా దొంగతనాలు జరిగిన ప్రాంతాలు:ఆర్టీఐ నివేదిక ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఈ దొంగతనాలు చాలా ఎక్కువగా జరిగాయి:బికనీర్: 25.76 లక్షల వస్తువులతో అగ్రస్థానంలో ఉంది.రాంచీ: 9.31 లక్షలుఢిల్లీ: 8.21 లక్షలుముంబై: 8.17 లక్షలుజోధ్పూర్: 8.09 లక్షలుఅహ్మదాబాద్: 6.94 లక్షలుఈ భారం ఎవరికి?కోచ్‌ల లోపల లినెన్ వస్తువుల సంరక్షణ బాధ్యత అంతా బెడ్‌రోల్స్ పంపిణీ చేసే కాంట్రాక్ట్ ఏజెన్సీదేనని రైల్వే ప్రతినిధి తెలిపారు. వస్తువులు కనిపించకుండా పోతే, వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేసే ఆర్థిక భారం పూర్తిగా కాంట్రాక్టరే భరించాల్సి ఉంటుంది. ఈ నిరంతర దొంగతనాల వల్ల తలెత్తే కొరతను అధిగమించడానికి అదనపు లినెన్ సెట్లను ఏర్పాటు చేయడం కాంట్రాక్టర్లకు పెద్ద సవాలుగా మారిందని అధికారులు పేర్కొన్నారు. దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి : 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా? -
బద్రీనాథ్ విరాళాల చోరీ: సస్పెండైన ఉద్యోగి అరెస్ట్
డెహ్రాడూన్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయ విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కీలక పురోగతి సాధించింది. బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ)కి చెందిన సస్పెండైన ఉద్యోగి ప్రమోద్ నౌటియాల్‌ను ‘సిట్’ సోమవారం అరెస్ట్ చేసింది. డెహ్రాడూన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకుని, సుమారు గంటపాటు విచారించిన అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని గోపేశ్వర్ కోర్టులో హాజరుపరిచి, తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి కోరనున్నట్లు పోలీసులు తెలిపారు.జూలై 2న ఆలయ విరాళాల లెక్కింపు సమయంలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై బీకేటీసీ ఇన్ఛార్జ్ టెంపుల్ ఆఫీసర్ యుధ్వీర్ పుష్పవాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బద్రీనాథ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆలయ సీసీటీవీ విజువల్స్ పరిశీలించగా.. నిందితుడు నౌటియాల్ రూ.500, రూ.100 కరెన్సీ నోట్ల కట్టలు, బంగారు, వెండి నాణేలు, శాలిగ్రామ శిలలు, భక్తుల కానుకల కవర్లను అనుమానాస్పదంగా దాచడం, దొంగిలించడం బయటపడింది. లెక్కింపు గదికి, తన కార్యాలయానికి మధ్య నిందితుడు పలుమార్లు తిరిగినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా స్పష్టమైంది.మరోవైపు, తన సస్పెన్షన్‌ను, ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ నౌటియాల్ ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించాలని బీకేటీసీని ఆదేశించిన న్యాయస్థానం, తదుపరి విచారణను జూలై 16కు వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ కేసుపై రాష్ట్ర పోలీసులు, ‘సిట్’తో పాటు గర్వాల్ కమిషనర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు జరుపుతున్నాయి.ఇది కూడా చదవండి: ‘కార్తికేయ’ నటుడి వ్యాఖ్యలపై మాజీ సీఎం ఫైర్! -
కండక్టర్‌ను దోచుకుని.. 36 ఏళ్ల తర్వాత దొరికిపోయి..
కోజికోడ్: కేరళలో బస్సు కండక్టర్‌ను తుపాకీతో బెదిరించి టికెట్ విక్రయ నగదును దోచుకుని పరారైన ఒక వ్యక్తిని ఏకంగా 36 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు కేరళ నుంచి పారిపోయి కర్ణాటకలోని మైసూరులో మారుపేరుతో జీవిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్య పెట్టిన వేధింపుల కేసు ఇతడిని ఎట్టకేలకు పట్టిచ్చింది. 71 ఏళ్ల వయస్సులో అనుకోకుండా ఇతను పోలీసులకు దొరికిపోయాడు. కేరళలోని మలప్పురం జిల్లా అరికోడ్‌కు చెందిన వీకే జోస్ 1990లో కేరళ కేఎస్ఆర్టీసీ బస్సు థిరువంబాడీ నుంచి కూంబారా పట్టణానికి వెళ్తున్నప్పుడు అందులోని కండక్టర్‌ను తుపాకీతో బెదిరించి కండక్టర్ వద్ద ఉన్న రోజువారీ టికెట్ కలెక్షన్ సొమ్మును నిందితుడు లాక్కొని పరారయ్యాడు. ఈ కేసులో ఇతనిపై కోర్టు అప్పట్లోనే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఇతడు శివకుమార్ అనే మారుపేరుతో మైసూరులోని నరసింహరాజా ప్రాంతంలో జీవించడం మొదలెట్టాడు. పెళ్లిచేసుకుని భార్య, పిల్లలతో ఉంటున్నాడు. అయితే తనను భర్త వేధిస్తున్నాడంటూ ఇతని భార్య జూలై 8వ తేదీన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇతని ఇంట్లో సోదాలు చేయగా ఒక తుపాకీ లభించింది. తుపాకీ లైసెన్స్ వివరాలు ఆరా తీయగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఇతని వివరాలను కేరళ పోలీసులకు మైసూరు పోలీసులు పంపించారు. దీంతో ఇతనిపై మూడు దశాబ్దాల క్రితం చోరీ కేసు నమోదైనట్లు గుర్తించి వెంటనే అరెస్ట్‌చేశారు. తర్వాత కేరళలోని థిరువంబాడీకి తీసుకొచ్చి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. -
ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేసి..
వరంగల్: ఉమ్మడి జిల్లా జనగామలో అర్ధరాత్రి వేళ నిలిపి ఉంచిన బస్సును ఓ వ్యక్తి దొంగతనం చేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. విధులు ముగించుకున్న ఆర్టీసీ డ్రైవర్లు జనగామ బస్టాండ్‌లో రాత్రి అక్కడే బస్సును నిలిపిఉంచారు.అయితే, పాలకుర్తికి చెందిన వెంకన్న అనే వ్యక్తి బస్టాండ్ సిబ్బంది నిద్రిస్తున్నవేళ ఆర్టీసీ అద్దె బస్సును స్టార్ట్ చేసి తీసుకెళ్లాడు. సూర్యాపేట వైపు సుమారు 21 కిలోమీటర్ల దూరం నడిపాడు. అలా.. సింగరాజుపల్లి టోల్ గేట్ వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొట్టడంతో అక్కడే ఆగిపోయింది. బస్సును ఎత్తుకెళ్లిన నిందితుడు మద్యం సేవించి ఉండటంతో, ఆ మత్తులోనే ఇదంతా జరిగినట్లుగా తెలుస్తోంది. నిందితుడు వెంకన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు. మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తిజనగామ బస్టాండులో నిలిపి ఉన్న అద్దె ఆర్టీసీ బస్సును మద్యం మత్తులో ఎత్తుకెళ్లిన పాలకుర్తికి చెందిన వెంకన్న అనే వ్యక్తిజనగామ నుండి సూర్యాపేట వైపు దాదాపు 21 కిలోమీటర్లు బస్సు తీసుకెళ్లిన క్రమంలో, సింగరాజుపల్లి టోల్ ప్లాజా వద్ద… pic.twitter.com/lo0Ho21wyf— Telugu Scribe (@TeluguScribe) July 10, 2026 -
రాత్రివేళ రెచ్చిపోయిన పందుల దొంగలు..!
మద్దూర్(కోస్గి): సినిమా స్టోరీని తలపించేలా నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో పందుల దొంగలు హల్చల్ చేశారు. పందులను దొంగలించి వాహనంలో పారిపోతుండగా అడ్డుకున్న పోలీసులపై దాడికి ప్రయతి్నంచారు. ఓ హోంగార్డు తలపై బీరు బాటిల్‌తో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గురువారం అర్ధరాత్రి ఓ బొలేరో వాహనంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పందులను దొంగిలించి కోస్గి రోడ్ల గుండా వెళ్లేందుకు ప్రయతి్నంచారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో దొంగల వాహనం దారి తప్పింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి దగ్గర నూతన భవనానికి రంగులు వేస్తున్న కూలీలను దారి విషయమై దొంగలు వాకాబు చేశారు. అర్ధరాత్రి ఎక్కడ నుంచి వస్తున్నారు..మీరు ఎక్కడకు వెళ్లాలి అని పెయింటర్లు నిలదీయడంతో మారణాయుధాలు చూపించి పరారయ్యారు. ఈ విషయం పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులకు యువకులు సమాచారం ఇచ్చారు. విధుల్లో ఉన్న ఏఎస్సై, మరో ముగ్గురు సిబ్బందితో, ఇద్దరు పెట్రోలింగ్ బైక్‌పై పట్టణంలో గాలించారు. దొంగల వాహనం బస్టాండ్ ముందుకు రావడంతో పోలీసులు వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. వాహనంలోని ఓ వ్యక్తి బీరు సీసాతో బైక్‌పై ఉన్న హోంగార్డు సురేందర్ తలపై బలంగా కొట్టి పారిపాయాడు. తీవ్ర రక్తస్రావమైన సురేందర్‌ను స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా తలకు కుట్లు వేశారు. ఈ విషయమై జిల్లా పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఉదయం వరకు వాహనాలు తనిఖీ చేసినా దొంగల వాహనం దొరకలేదు. -
చోరీ చేసి ఇంటికి నిప్పంటించిన దొంగలు!
గుంతకల్లు రూరల్: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో నివాసం ఉంటున్న రైల్వే మహిళా ఉద్యోగి ఇంట్లోకి బుధవారం రాత్రి దుండగులు చొరబడి నగలు, నగదు కొల్లగొట్టారు. ఆధారాలు కనిపించకూడదని ఇంటికి నిప్పంటించి వెళ్లిపోయారు. బాధితురాలు తెలిపిన వివరాలు మేరకు.. ఉమాదేవి రైల్వేలో పాంచ్మెన్గా పని చేస్తున్నారు. ఆమె భర్త కూడా రైల్వేలోనే ఉద్యోగం చేస్తుండేవాడు. మూడేళ్ల క్రితం మృతి చెందాడు. ఉమాదేవి ఇద్దరు పిల్లలను చదివిస్తూ, వారి పెళ్లిళ్ల కోసం బంగారం, వెండి పోగు చేసుకుంది. ఇద్దరు బిడ్డలు మహారాష్ట్రలో డిగ్రీ చదువుతుండటంతో ఇంట్లో ఒంటరిగానే ఉంటోంది.బుధవారం రాత్రి యధావిధిగా ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన దుండగులు ఇంట్లోకి చొరబడి 25 తులాల బంగారు నగలు, 50 తులాల వెండి వస్తువులు, రూ.20 వేల నగదు ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ఇంట్లో మంటలు చెలరేగాయి. ఉదయం 4.30 గంటల సమయంలో ఇంట్లో నుంచి పొగలు, మంటలు వస్తుండడాన్ని గమనించిన స్థానికులు ఉమాదేవికి, ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇంట్లోని దుస్తులు, బీరువాలోని డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, ఏటీఎం కార్డులు, ఫ్రిడ్జ్, రెండు టీవీలు పూర్తిగా కాలి బూడిదయ్యాయని, కట్టుబట్టలు మిగిలాయని బాధితురాలు బోరున విలపించింది. గుంతకల్లు రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, కసాపురం ఎస్ఐ టీపీ వెంకటస్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. -
ఒక్క బిస్కెట్ తినడం వల్ల..! కోటి రూపాయల ఉద్యోగం పోయింది! ఈ వీడియో చూడండి
-
నేడు రామాలయ ట్రస్ట్ భేటీ
అయోధ్య: అయోధ్య రామాలయం శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక సమావేశం సోమవారం జరగనుంది. ఆలయ విరాళాల చోరీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడి ఆశ్రమంలో జరిగే ఈ భేటీకి ట్రస్ట్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులంతా హాజరు కావాలని ట్రస్ట్ ట్రెజరర్ గోవింద్ కోరారు.వయో సంబంధ సమస్యలతో చికిత్స పొందుతూ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 89 ఏళ్ల ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ సమావేశానికి వస్తారని తెలుస్తోంది. ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి(సీఈవో)ని నియమించే విషయం చర్చకు రానుంది. ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న గోపాల్ రావు పాత్రపైనా చర్చ జరిగే అవకాశముందంటున్నారు. ఆలయంలో విరాళాల మాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అందజేసిన మధ్యంతర నివేదికలోని అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.ఈ భేటీలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆలయ ఆదాయ వ్యయాల నివేదికను ఆమోదించనున్నారు. ప్రస్తుతం ట్రస్ట్ అధ్యక్షుడు నృత్యగోపాల్ దాస్తోపాటు 11 మంది రెగ్యులర్ సభ్యులున్నారు. ఆలయ విరాళాల వ్యవహారంపై ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే వ్యక్తం చేసిన అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు సంస్థ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వ్యవహారం హిందూ సమాజం నమ్మకాన్ని తీవ్రంగా గాయపరిచిందని ఇటీవల హొసబలే పేర్కొన్నారు. ఈ దురదృష్టకర ఘటనను ఆసరాగా చేసుకుని కొన్ని శక్తులు హిందూ ధర్మం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వీటిని హిందూ సమాజం ఓపిక, నిగ్రహంతో ఐక్యంగా ఎదుర్కోవాలని ఆయన కోరారు. -
నా దుస్తులు విప్పేస్తా… నీ గతి అదోగతే!
కొన్నిరోజులుగా ఇంట్లో వరుసగా డబ్బు, నగలు మాయం అవుతుండటంతో యజమానికి అనుమానం పెరిగింది. ఇంటా బయట సీసీటీవీలు ఏర్పాటు చేయించాడు. వాటిల్లో కనిపించిన దృశ్యాలు ఆయనను షాక్‌కు గురి చేశాయి. వెంటనే అప్రమత్తమై దొంగను అడ్డుకోగా.. ఆమె చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది.రాజస్థాన్‌లోని జైపూర్ ముహానా ప్రాంతంలోని ఓ ఇంట్లో కొద్దిరోజులుగా అనుమానాస్పద చోరీలు జరుగుతున్నాయి. మొదట్లో చిన్నగా డబ్బు మాయం కావడం ప్రారంభమై, తర్వాత నగలు కూడా కనిపించకపోవడంతో యజమాని అనుమానం బలపడింది. దీంతో ఆయన ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు.గురువారం కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో సీసీటీవీ లైవ్ ఫీడ్‌లో ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి నేరుగా బెడ్రూమ్ వైపు వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. అల్మారా తెరిచి నగల పెట్టెను పరిశీలిస్తున్న దృశ్యాలను చూసిన యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తక్షణమే అప్రమత్తమైన యజమాని పొరుగువారికి సమాచారం ఇచ్చి ఇంటి గేటును లాక్ చేయించాడు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న వారు ఆమెను ఇంట్లోనే అడ్డుకున్నారు.అయితే ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. బయటపడే మార్గం లేకపోవడంతో ఆమె తీవ్రంగా బెదిరింపులకు దిగింది. పోలీసులు వస్తారా? రానివ్వు.. వాళ్లు వచ్చేలోపు నా దుస్తులు విప్పేస్తా!. నువ్వు నన్ను బలవంతం చేయబోయావని ఏడుస్తా.. వాళ్లు నిన్నే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. నీ గతి అదోగతే.. నన్ను బయటకు పోనివ్వండి’’ అంటూ ఆమె చెప్పిన మాటలు విని ఆ ఓనర్, స్థానికులు నిర్ఘాంతపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
అయోధ్య విరాళాల చోరీ కేసు.. సిట్ కీలక నిర్ణయం
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్ల అయోధ్య ట్రస్ట్ ఖాతాలను రీ-ఆడిట్ చేయనుంది. విచారణలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. నిర్మాణ సంబంధిత వ్యయాలతో పాటు.. విరాళంగా వచ్చిన ఆభరణాలు, ఇతర బంగారం, వెండి వస్తువులను కూడా ఈ రీ-ఆడిట్లో పరిశీలించనున్నట్లు సిట్ పేర్కొంది. గత ఐదేళ్ల కాలానికి సంబంధించిన ట్రస్ట్ ఆర్థిక రికార్డులను సిట్ సమగ్రంగా పరిశీలించనుంది.మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన అవినాష్ శుక్లాను అయోధ్య పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విరాళాల లెక్కింపు విధుల్లో ఉన్న శుక్లాను ఈ కేసులో ముందుగానే అరెస్టు చేయగా.. స్థానిక న్యాయస్థానం గురువారం అతడికి 24 గంటల పాటు పోలీస్ కస్టడీ విధించింది. ఇప్పటివరకు ఈ కేసులో అత్యధిక నగదు ఇతని వద్ద నుంచే స్వాధీనం చేసుకున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. సిట్ అధికారులు ఇప్పటివరకు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా, ఆలయ నిర్మాణ, నిర్వహణ వ్యవహారాలతో సంబంధం ఉన్న గోపాల్ రావులను విచారించారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామాలు సమర్పించగా.. జూలై 6న జరగనున్న ట్రస్ట్ సమావేశంలో వారి రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఇప్పటివరకు ఈ కేసులో అవినాష్ శుక్లా నుంచి రూ. 20.39 లక్షలు, కరుణేష్ పాండే నుంచి రూ.18.07 లక్షలు, అనుకుల్ప్ మిశ్రా నుంచి రూ.16.82 లక్షలు, లవకుష్ మిశ్రా నుంచి రూ.14.25 లక్షలు, రమాశంకర్ మిశ్రా నుంచి రూ.7.32 లక్షలు, రమాశంకర్ యాదవ్ నుంచి రూ.1 లక్ష స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సుమారు 11 గ్రాముల బంగారం, 375 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.రామ మందిరంలో చోరీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. రామ మందిరంలో విరాళాల చోరీ భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని.. ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే అన్నారు. ఈ ఘటన మమ్మల్ని కలిచివేసింది. ఈ ఘటన పైన దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులకు దోషులు తేలిన వారిపై కఠిన శిక్షలు విధించాలి. ఈ ఘటనకు కారణమైన వ్యవస్థగత లోపాలను వెంటనే సరిదిద్దాలి. అలాగైతేనే భక్తుల విశ్వాసాలు కొనసాగుతాయి. పారదర్శక విధానాలను అనుసరించి ధార్మిక వాతావరణాన్ని మరింత పెంచేలా పనిచేయాలి. ఈ సంక్లిష్ట సమయంలో హిందువులందరూ సంయమనంతో వ్యవహరించాలి. ఈ ఘటనను స్వార్ధ ప్రయోజనాలకు ఉపయోగించుకుని.. హిందూ ధర్మంపై బురదజల్లే ప్రయత్నాలకు అడ్డు కట్టవేయాలి’’ అని దత్తాత్రేయ హోసబలే పేర్కొన్నారు. -
రామాలయ విరాళాల కేసు: తక్షణ విచారణకు ‘సుప్రీం’ నిరాకరణ
న్యూఢిల్లీ: అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల చోరీకి గురయ్యాయంటూ దాఖలైన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న ఈ విరాళాల మాయం వ్యవహారంపై తక్షణమే విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో తదుపరి ఏం జరగబోతోన్నదనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.రామాలయ కానుకల దొంగతనంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం ఉదయం న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ పిటిషన్‌పై తక్షణమే విచారణ జరపాల్సినంత అత్యవసర పరిస్థితి లేదా ప్రాధాన్యత ప్రస్తుతం కనిపించడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఈ కేసును త్వరితగతిన లిస్ట్ చేయడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అయోధ్య రామాలయానికి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు భారీగా కానుకలు, విరాళాలు సమర్పిస్తున్నారు. అయితే, ఈ విధంగా వచ్చిన విరాళాలలో కొంత భాగం చోరీకి గురైందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.దీనిపై ఒక ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ఈ కేసుపై అందరి దృష్టి పడింది. అత్యవసర విచారణ అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును సాధారణ న్యాయ నిబంధనల ప్రకారమే విచారిస్తామని పేర్కొంది. కోర్టు సాధారణ విచారణల జాబితా ద్వారానే ఈ పిటిషన్ మున్ముందు బెంచ్ ముందుకు రానుంది. ఈ కేసులో న్యాయస్థానం చేసిన మరిన్ని పరిశీలనలు, అలాగే తదుపరి విచారణ ఎప్పుడు జరగనుందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
రాముల వారి సొమ్ముతో లగ్జరీ కార్లు, ఫార్మ్‌హౌస్‌లు?
లక్నో: ప్రస్తుతం దేశంలో అయోధ్య రామాలయ హుండీలో విరాళాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన నేరస్థుల లైఫ్ స్టైల్‌పై ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారి గ్రామంలో ఈ విషయమై పోలీసులు విచారణ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.అయోధ్య రామాలయ హుండీ విరాళాల చోరీ కేసులో పోలీసులు ఇదివరకే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇందులో ఒకే కుటుంబానికి చెందిన అనుకల్ప్ మిశ్రా, అతని బావ లవకుష్ మిశ్రా ఉన్నారు. అయితే అనుకల్పే మాస్టర్‌మైండ్ ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. తాజాగా అయోధ్య పరిసరాల్లోని ఆయన గ్రామాన్ని సందర్శించగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.అయోధ్య సమీపంలోని అతని గ్రామమైన బసవాకు పోలీసులు విచారణ నిమిత్తం వెళ్లారు. ఇతరుల ఇళ్లతో పోలిస్తే అతని ఇల్లు చాలా విభిన్నంగా అత్యంత విలాసవంతమైనదిగా కనిపించినట్లు పేర్కొన్నారు. ఆ విషయమై వారి ఇంటి పరిసరాల్లోని వ్యక్తులను విచారించగా ఒక్కసారిగా వారి ఆర్థిక స్థితిలో పెనుమార్పులు వచ్చినట్లు తెలిపారు.అంతేకాకుండా అనుకల్ప్ మిశ్రా ఇటీవల గ్రామం వెలుపల ఒక ఫార్మ్‌హౌస్ నిర్మించాడని గత ఏడాది అయోధ్యలో రూ. 65 లక్షలు వెచ్చించి ఒక ఇల్లు కొనుగోలు చేశాడని అతని వద్ద ఇప్పటికే ఒక వాహనం ఉండగా, కొత్తగా స్కొర్పియో ఎస్యూవీ బుక్ చేశాడని పేర్కొన్నారు.కొద్దిరోజుల క్రితం వరకు ఆ కుటుంబం తీవ్రమైన "ఆర్థిక ఇబ్బందుల్లో" ఉండేదని, కానీ ఇప్పుడు వారికి ఎటువంటి లోటులేదని ఆర్థికంగా చాలా బలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే అనుకల్ప్ ఒక ప్రసిద్ధ మత ప్రవచనకర్త (కథావాచక్) తో ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించాడని అతని బంధువులు తెలిపినట్లు పేర్కొన్నారు.అనుకల్ప్ మిశ్రా నేపథ్యంఒక బ్యాంకు అవుట్సోర్సింగ్ టీమ్‌లో పనిచేసే మిశ్రా, దాదాపు మూడేళ్ల క్రితం రామాలయ విరాళాల లెక్కింపు బృందంలో చేరాడు. ఆ తర్వాత అదే బ్యాంక్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా తన బావ లవకుష్ మిశ్రాను కూడా అదే టీమ్‌లోకి తీసుకువచ్చాడు.అయోధ్యలోని రుదౌలీ ప్రాంతానికి చెందిన లవకుష్ మిశ్రా ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతను కూడా ఇటీవల లక్ష రూపాయలకు పైగా విలువైన బైక్‌ను కొనుగోలు చేసినట్లు పొరుగువారు తెలిపారు. -
నేరాలు చేయడానికో యాప్..అందులో చోరీల అసైన్మెంట్లు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదు ర్కొంటున్న సుబో«ధ్ సింగ్.. పోలీసు విచారణలో చెప్పిన విషయాలు వారే నిర్ఘాంతపోయేలా చేశాయి. అతడి నేర విధానం, సాంకేతికతను వాడుకుంటున్న తీరు, తాను స్వయంగా పాల్గొననప్పుడు పకడ్బందీగా ముఠాను నడిపించడం చూస్తే మొత్తం నేర సామ్రాజ్యమే నివ్వెరపోయేలా ఉంది. కేవలం బంగారం, నగల దుకాణాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడటం ఇతని ముఠా ప్రత్యేకత. అందుకే ఇతన్ని గోల్డ్ థీఫ్ (బంగారం దొంగ)గా పిలుస్తారు.ఇతను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా వాడుకుంటూ దోపిడీలకు పాల్పడుతున్నాడు. దొంగల నెట్వర్క్ కోసం ఒక పకడ్బందీ యాప్ నిర్వహిస్తున్నాడు. తన ముఠా సభ్యులకు ప్రతినెలా జీతాలు చెల్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా దోపిడీకి గురైన సంస్థల జాబితాలో మనప్పురం, తనిష్క్ వంటి సంస్థలుండగా, ఈ గ్యాంగ్ ఇప్పటివరకు 400 కిలోల బంగారం దొంగిలించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇంకో కీలకమైన విషయం ఏమిటంటే.. ఇతను నేరుగా కరీంనగర్ దోపిడీలో పాల్గొనలేదు. బిహార్ జైల్లో ఉండి, పక్కా స్కెచ్ వేసి తన గ్యాంగ్‌తో పని కానిచ్చాడు.10 వరకే చదువుకున్నా..బిహార్‌కు చెందిన సుబోధ్‌సింగ్ కేవలం 10వ తరగతి వరకే చదువుకున్నాడు. ప్రస్తుతం సొంత రాష్ట్రంతో పాటు కోల్‌కతా, మధ్యప్రదేశ్, యూపీ, జార్ఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో 27 కేసులు ఎదుర్కొంటున్నాడు. కరీంనగర్లో మే 3వ తేదీన దోపిడీ జరగ్గా పోలీసులు స్వల్ప వ్యవధిలోనే కొందరు నిందితులను పట్టుకోగలిగారు. వారిని తమదైన శైలిలో విచారించి బిహార్ జైల్లో ఉన్న సుబోధ్‌సింగ్ కీలక సూత్రధారి అని తెలుసుకు న్నారు.అతని పాత్రపై తగిన ఆధారాలు సంపాదించడంతో పాటు పీటీ వారంట్‌పై మే 28న రాష్ట్రానికి తీసుకువచ్చారు. కరీంనగర్ జైల్లో పెడితే తోటి ఖైదీలకు డబ్బు ఎరవేసి లోబరుచు కునే ప్రమాదముండటంతో ఒకే ఖైదీ ఉండేందుకు అవకాశం ఉన్న హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం కస్టడీలోకి తీసుకుని విచారించారు. బుధవారం సుబోధ్సింగ్తో పాటు అతని అనుచరుల కస్టడీ ముగిసింది.యాప్‌తో గ్యాంగ్ నిర్వహణసుబోధ్సింగ్ తన దోపిడీ నెట్వర్క్ కోసం ప్రత్యేక యాప్ నిర్వహిస్తున్నాడు. నేరాలు చేసి జైలుకు వెళ్లినప్పుడు పరిచయం అయిన చిన్న చిన్న నేరాలు చేసిన వారిని ముఠాలో చేర్చుకునే వాడు. ఒకరి గురించి మరొకరికి తెలియకుండా జాగ్రత్త పడేవాడు. నెలనెలా డబ్బులు ఇచ్చేవాడు. అత్యాధునిక ఎన్క్రిప్టెడ్ యాప్‌లు వాడటంలో ఆరితేరాడు. ఈ క్రమంలోనే తన గ్యాంగ్ కోసం ప్రత్యేకంగా ఒక యాప్ వాడుతున్నాడు.ఎవరి టాస్క్ వారికే.. గ్యాంగ్‌లో చేరిన వారి మొబైల్ ఫోన్లో ఆ యాప్ ఇన్స్టాల్ చేస్తారు. అందులో ఎవరికి కేటాయించిన టాస్క్ వారికి మాత్రమే కనిపిస్తుంది. అలా అప్పగించిన పనిని చేయగానే వారికి అందాల్సిన డబ్బు పక్కాగా అందుతుంది. పనిలో ప్రతిభ చూపిస్తే బోనస్‌లు కూడా ఇస్తాడు. బంగారం దోపిడీ పని కొందరికి, రవాణా బాధ్యత మరికొందరికి, అమ్మే పని వేరేవాళ్లకు.. ఇలా ఎవరికి కేటాయించిన పనిని వారు చేస్తారు. దీంతో ఎవరైనా పోలీసులకు చిక్కినా దోపిడీ గురించిన పూర్తి సమాచారం వారికి తెలియదు. అయితే కరీంనగర్ సీపీ గౌస్ ఆలం నేతృత్వంలోని పోలీసుల బృందం చాకచక్యంగా వ్యవహరించి కేవలం రోజుల వ్యవధిలోనే జైల్లో ఉండి సుబోధ్‌సింగ్ వేసిన స్కెచ్‌కు సంబంధించిన కీలకాధారాలు న్యాయస్థానం ముందుంచి తెలంగాణకు తరలించడంలో సఫలీకృతమయ్యింది.ఎంతకైనా తెగిస్తాడు..సుబో«ధ్సింగ్ నేరాల్లో అధిక శాతం బిహార్, బెంగాల్లోనే ఉన్నాయి. తాను ఇప్పటివరకు దొంగిలించిన 400 కిలోల బంగారంలో అధిక శాతం బిహార్‌ను ఆనుకుని ఉన్న నేపాల్‌లో విక్రయించాడు. ఇతను తోటి ఖైదీలను అలాగే తన గ్యాంగ్‌కు సహకరిస్తారనుకున్న పోలీ సులు, జైలు అధికారులు, లాయర్లకు ఎంతైనా చెల్లిస్తాడు. లేనిపక్షంలో అవసరమనుకుంటే వారిపై దాడి చేయడం లేదా చంపేయడం ఇతని గ్యాంగ్‌కు అలవాటే. అందుకే పోలీసులు ఇతన్ని కరీంనగర్ జైల్లో ఉంచలేదు. సుబోధ్ సింగ్‌కు సంబంధించిన ఉదంతాన్ని తెలంగాణ పోలీస్ అకాడమీ (టీజీపీఏ)లో కేస్ స్టడీగా బోధించనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
ఓవైపు విడాకులు కేసు.. హీరో ఇంట్లో చోరీ
తమిళ ప్రముఖ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇటీవలే దర్శకుడు, నిర్మాతగా మారిన ఈయన.. రవి మోహన్ స్టూడియోస్ పతాకంపై యోగి బాబు హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు. తానే హీరోగా మరో సినిమా తీస్తున్నాడు.(ఇదీ చదవండి: చిరు లీక్స్.. సమంత ప్రెగ్నెన్సీ గురించి చెప్పేసిన మెగాస్టార్)మరోవైపు తన భార్య ఆర్తితో మనస్పర్థల కారణంగా విడాకులు కోరుతూ కొన్నాళ్ల క్రితం రవి మోహన్ కోర్టుకి వెళ్లాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హీరో ఇంట్లో చోరీ జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.తన ఇంట్లో దొంగతనం జరిగిందని.. నీలాంగరై పోలీస్ స్టేషన్లో రవి మోహన్ ఫిర్యాదు చేశాడు. అందుకు తగిన ఆధారాలు కూడా ఫిర్యాదులో పొందుపరిచాడు. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని తనతో చెప్పినట్లు రవి మోహన్.. మీడియాకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాడు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ 'పాప్‌కార్న్' కామెంట్స్.. నెటిజన్ల విమర్శలు!) -
సమాధిని తవ్వి బంగారు గొలుసు చోరీ
కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో మానవత్వానికి మచ్చతెచ్చేలాంటి ఘటన వెలుగుచూసింది. చనిపోయిన ఒక చేపల వ్యాపారి సమాధిని గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి వేళ తవ్వి, అతడి మృతదేహంపై ఉన్న బంగారు గొలుసును దొంగిలించారు. కుటుంబ సభ్యులు మృతుడితో పాటే పూడ్చిపెట్టిన ఆభరణాన్ని ఇలా కిరాతకంగా దోచుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. ఈ అమానుష చర్యతో దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పీళమేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.సెంటిమెంట్‌గా బంగారు గొలుసుకోయంబత్తూరు సౌరిపాళ్యం ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల నాగరాజ్ చేపల వ్యాపారం చేస్తూ జీవించాడు. అనారోగ్య కారణాలతో ఆయన జూన్ 6న మరణించగా, మరుసటి రోజే కుటుంబ సభ్యులు స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. నాగరాజ్‌కు తాను ఎప్పుడూ ధరించే చేప ఆకారపు పెండెంట్ ఉన్న బంగారు గొలుసు అంటే ఎంతో ఇష్టం. ఆ సెంటిమెంట్‌తో, ఆయన చివరి కోరికను గౌరవిస్తూ, కుటుంబ సభ్యులు ఆ గొలుసును తీయకుండానే నాగరాజ్ మృతదేహంతో పాటు పూడ్చిపెట్టారు.16వ రోజు బయటపడిన దారుణంనాగరాజ్ మరణించిన 16వ రోజు అంత్యక్రియల ఆచారాలను నిర్వహించడానికి ఆయన కుమారుడు వెంకటేష్ కుమార్, ఇతర బంధువులు శ్మశానవాటికకు వెళ్లారు. అక్కడ సమాధి చుట్టూ ఉన్న మట్టిని ఎవరో తవ్వినట్లు గమనించి వారికి అనుమానం వచ్చింది. దీంతో వారు అక్కడ విచారించగా, శ్మశానవాటిక కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల కార్తికేయన్ అసలు విషయం బయటపెట్టాడు. ఇద్దరు స్థానిక వ్యక్తులు రాత్రి వేళ వచ్చి సమాధిని తవ్వి, మృతదేహం నుంచి సుమారు 24 గ్రాముల బరువున్న బంగారు గొలుసును దొంగిలించి పారిపోయారని తెలిసింది.పోలీసులకు ఫిర్యాదు ఈ దారుణ ఘటనపై మృతుడి కుమారుడు వెంకటేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పీళమేడు పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ దొంగతనంలో శ్మశానవాటిక కేర్‌టేకర్ కార్తికేయన్ పాత్రపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
రూ.4 కోట్ల నగల దోపిడీ వెనుక అసలు కథ..
గాజియాబాద్: యూపీలోని గాజియాబాద్ తనిష్క్ షోరూమ్ చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుకాణంలో పనిచేస్తోన్న వ్యక్తే.. తన ప్రియురాలితో కలిసి ఈ చోరీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. పెళ్లి కోసం ఆ వ్యక్తి.. గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి రూ.4కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్లాడు. ఈ చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారుతనిష్క్ ఉద్యోగి నితిన్ వర్మ (23), అతని ప్రియురాలు కాజల్ వర్మ (22), అతని తండ్రి సంజయ్ వర్మ (52). జూన్ 12న రాజ్ నగర్ డిస్ట్రిక్ట్ సెంటర్లోని తనిష్క్ షోరూమ్ నుండి రూ. 4 కోట్లకు పైగా విలువైన నగలను దొంగిలించినట్లు పోలీసులు నిర్థారించారు. పెళ్లి ఖర్చుల కోసమే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.నితిన్ ఆ షోరూమ్‌లో చేరి కేవలం నెల పదిహేను రోజులు మాత్రమే అయింది.. కానీ ఈ కొద్ది సమయంలోనే అతను స్టోర్ భద్రతా ఏర్పాట్లు, అత్యంత విలువైన నగలు ఎక్కడ ఉంచుతారనే విషయాలను తెలుసుకున్నాడు. ఘటనకు ఒక రోజు ముందే కాజల్‌తో తన పెళ్లి నిశ్చయమైందని చెబుతూ స్టోర్ సిబ్బందికి పార్టీ ఇచ్చాడు. ఆ వేడుకలో షోరూమ్ తాళాలు తన వద్దే ఉంచుకునే క్యాషియర్ గౌతమ్ రాజ్‌తో ఎక్కువగా మద్యం తాగిపించాడు. అనంతరం అతన్ని ఇంటి దగ్గర దింపుతానని చెప్పి.. అతని బ్యాగ్ నుండి షోరూమ్ మెయిన్ ఎంట్రన్స్ తాళాన్ని దొంగిలించాడు.మరుసటి రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో నితిన్ తన అనుచరుడితో కలిసి షోరూమ్‌కు వచ్చాడు. వారు దొంగిలించిన తాళంతో షట్టర్ తెరిచి.. ఎలాంటి అనుమానం రాకుండా లోపలికి వెళ్లడం సీసీటివి ఫుటేజీలో రికార్డయింది. డీసీపీ ధవళ్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ దొంగతనం పూర్తి చేయడానికి కేవలం 25 నిమిషాలు పట్టింది. వారు గ్రౌండ్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లను వదిలేసి.. బంగారం, వజ్రాలు, విలువైన రత్నాలు పొదిగిన నగలు ఉన్న ఫస్ట్ ఫ్లోర్‌ను టార్గెట్ చేశారు. నితిన్ లోపలికి వెళ్లినప్పుడు ఓ అనుచరుడు బయట నిలబడి నిఘా ఉంచాడని పోలీసులు తెలిపారు. వారు సుమారు రూ. 4 కోట్ల విలువైన నగలను సర్దుకుని, ఎవరికీ దొరక్కుండా దూరంగా పార్క్ చేసిన వాహనంలో పరారయ్యారు.ఈ దర్యాప్తులో షోరూమ్‌లోని తీవ్రమైన భద్రతా లోపాలు కూడా బయటపడ్డాయి. రూ.50 కోట్లకు పైగా విలువైన నగలు ఉన్నప్పటికీ.. అక్కడ ఎలాంటి అలారం సిస్టమ్ లేదు. రాత్రి వేళల్లో కేవలం ఒకే ఒక్క సెక్యూరిటీ గార్డును నియమించారు. అతను కూడా ఉదయం 7 గంటలకే డ్యూటీ నుంచి వెళ్లిపోయాడు. సీసీటీవీ విజువల్స్‌ను కంపెనీ హెడ్ ఆఫీస్ నుండి నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ.. నిందితులు 25 నిమిషాలకు పైగా లోపలే ఉన్నా ఈ చొరబాటును ఎవరూ గమనించలేకపోయారు.నితిన్, కాజల్ కలిసి ఈ దొంగతనానికి ప్లాన్ చేయగా.. దొంగిలించిన నగలను అమ్మడంలో సంజయ్ వర్మ సహాయం చేశాడు. తమకు వైద్య ఖర్చుల కోసం డబ్బు కావాలని అబద్ధాలు చెప్పి నిందితులు కొన్ని నగలను తక్కువ ధరలకే విక్రయించారు. ప్రస్తుతం అధికారులు రూ. 3.1 కోట్ల విలువైన దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ. 6.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
రాజకీయ నేత ఇంట్లో రూ.కోటిన్నర చోరీ?
సనత్‌నగర్: ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో భారీ చోరీ జరిగిందంటూ జరిగిన ప్రచారం సనత్‌నగర్ ప్రాంతంలో కలకలం రేపింది. ఏకంగా కోటిన్నర రూపాయలు చోరీకి గురైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తింది. అయితే ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జెక్కాలనీలో ప్రాంతంలో ఉండే ఓ రాజకీయ పార్టీ నేత ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు కనిపించడం లేదంటూ సదరు నాయకుడు సనత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వివరాల గురించి ఆరా తీసినట్లు సమాచారం. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించగా చివరికి ఆ రాజకీయ నేత కుమార్తె డబ్బులు తీసినట్లు తెలిసింది. ఇంట్లో త్వరలో జరిగే వివాహం నిమిత్తం నగదు జమ చేసి కోటిన్నర రూపాయల వరకు అల్మారాలో దాచి ఉంచారు. శుక్రవారం కొంత నగదు వేరే వారికి ఇవ్వాల్సి ఉండగా అల్మరాలో నుంచి డబ్బును తీసుకునేందుకు చూడగా అందులో నగదు కనిపించలే దు. దీంతో కంగారు పడి ఆ రాజకీయ నేత పోలీసులకు విషయం తెలపగా వారు వచ్చి విచారణ జరిపారు. చివరకు తమ కుమార్తెనే నగదు తీసినట్లు తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇది తమ కుటుంబ వ్యవహారమని, తామే చూసుకుంటామని సదరు రాజకీయ నేత చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. దీనిపై ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు కూడా ఇవ్వలేదు. -
లవర్స్ కోసం.. కుళాయిలు కొట్టేశారు
ప్రేమలో పడితే కొన్నిసార్లు ఆలోచనలకన్నా కోరికలే ముందుకు నడిపిస్తాయి. ప్రియురాళ్లకు గిఫ్ట్‌గా ఐఫోన్ ఇవ్వాలన్న చిన్న ఆశ ఆ యువకులను పెద్ద నేరం వైపు నెట్టేసింది. కానీ వారు వేసిన ప్లాన్ మాత్రం చివరికి ఊహించని మలుపు తిరిగి కటకటాల పాలు జేసింది.ఇద్దరు యువకులు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌కు ఐఫోన్లు కొనివ్వాలనే ఉద్దేశంతో ఏకంగా రూ.6.5 లక్షల విలువైన లగ్జరీ డిజైనర్ ట్యాప్స్‌ను ఓ గోడౌన్ నుంచి దొంగిలించారు. కానీ ఆ ఖరీదైన వస్తువులు చివరికి కేవలం రూ.20 వేలకే స్క్రాప్ డీలర్‌కు అమ్మేయడం ఈ కేసులో మరో ట్విస్ట్‌గా మారింది.ఓ గోడౌన్ యజమాని ఫిర్యాదుతో ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. మే 27–28 మధ్య రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గోడౌన్ పైకప్పులోని టిన్ షీట్లు తొలగించి లోపలికి ప్రవేశించి ఖరీదైన సానిటరీ వేర్‌ను ఎత్తుకెళ్లారు. గోల్డ్ టోన్, రోజ్ గోల్డ్, సిల్వర్ ఫినిష్ ఉన్న ప్రీమియం ట్యాప్స్ సహా మొత్తం రూ.6.5 లక్షల విలువైన వస్తువులు చోరీ అయ్యాయి.కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 20కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక సమాచారం, టెక్నికల్ ఇన్పుట్స్ ఆధారంగా కేవలం 12 గంటల్లోనే కేసును ఛేదించారు. విచారణలో ఇద్దరు మైనర్లు సహా ఒక ప్రధాన నిందితుడు పట్టుబడ్డాడు. ప్రశ్నించగా షాకింగ్ నిజం బయటపడింది గర్ల్‌ఫ్రెండ్స్‌కు ఐఫోన్లు కొనాలన్న కోరికతోనే ఈ దొంగతనం చేశామని వారు ఒప్పుకున్నారు. దొంగిలించిన ఖరీదైన ట్యాప్స్‌ను కేవలం రూ.20 వేలకే అమ్మినట్లు కూడా తేలింది. ఆ వస్తువులు కొనుగోలు చేసిన 38 ఏళ్ల ఇర్ఫాన్ అలీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ కోసం వేసిన “కాస్ట్లీ స్కెచ్” చివరికి చీప్ బేరంలో ముగిసి, పోలీసులు కేసును ఛేదించడంతో కథ ముగిసింది. నాగ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
ఉపమాక వెంకన్న ఆలయంలో భారీ చోరీ
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం భారీ చోరీ జరిగింది. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న ఈ ఆలయం టీటీడీకి అనుబంధంగా ఉంది. ఆలయంలో సీసీ కెమెరాలు, టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణ ఉన్న సమయంలోనే అర్ధరాత్రి దుండగులు ఆలయంలోకి ప్రవేశించి రెండు హుండీలను పగులగొట్టి నగదు, బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకుపోయారు. 600 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని 2015లో టీటీడీ పరిధిలోకి తీసుకున్నారు. ఇంత ప్రసిద్ధి గాంచిన ఆలయంలోకి మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు ఆలయం వెనుక నుంచి ప్రవేశించి ఉత్సవమూర్తులకు ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలో హుండీని, ఆండాళ్లమ్మ అమ్మవారి సన్నిధిలో ఉన్న హుండీని కట్టర్లతో పెకిలించారు. ఆస్థాన మండపంలో ఉన్న హుండీలో స్వామివారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకుపోయారు. అపహరణకు గురైన సొమ్ము సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని ఆలయ ఇన్స్పెక్టర్ కూర్మేశ్వరరావు చెబుతుండగా, సుమారు రూ.4లక్షలు పైనే ఉంటుందని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ ఉన్నా కూడా చోరీ ..! ఈ ఏడాది మార్చి 5వ తేదీన హుండీల కానుకలను లెక్కించారు. ఏటా స్వామివారికి కానుకల రూపంలో సుమారు రూ.40 లక్షల మేర ఆదాయం లభిస్తుంది. స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలను లెక్కించి తెల్లవస్త్రంలో మూటకట్టి ఆస్థాన మండపంలోని హుండీలో ఉంచినట్టు దేవస్థానం వారు చెబుతున్నారు. అయితే పోలీస్ జాగిలాలు ఆలయం వెనుక కొండ ప్రాంతంలో ఆ ఆభరణాల మూటను గుర్తించాయి. పోలీసులు, దేవస్థానం అధికారుల సçమక్షంలో తూకం వేయగా 56 గ్రాముల బంగారం, 2.70 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. దుండగులు మిషన్‌తో గర్భగుడి తలుపులు కత్తిరించడానికి యత్నించి రాకపోవడంతో వదిలేశారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, నక్కపల్లి, అడ్డురోడ్డు సీఐలు జె.మురళి, ఎల్.రామకృష్ణ, ఎస్ఐ సన్నిబాబు క్లూస్ టీములను రప్పించి, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. -
ఈ దొంగ... ‘బంగారు’ కొండ!
కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీస్ షోరూంలో ఈ నెల మొదటి వారంలో భారీ దోపిడీకి ఒడిగట్టిన ముఠా నాయకుడు సుబోధ్ సింగ్ అలియాస్ బబువా సామాన్యుడు కాదు. గోల్డెన్ థీఫ్గా పేరున్న ఇతగాడు ఇప్పటి వరకు ఏడు రాష్ట్రాల్లో జరిగిన 400 కేజీల బంగారం చోరీ, దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బీహార్‌లోని జైలు నుంచే పీఎంజే జ్యువెలర్స్‌లో దోపిడీకి స్కెచ్ చేసి, కథ నడిపంచాడు. ఈ గ్యాంగ్‌ను పట్టుకున్న కరీంనగర్ పోలీసులు ప్రస్తుతం సుబోధ్‌ను పీటీ వారెంట్‌పై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పదేళ్లల్లో ఏడు రాష్ట్రాల్లో పంజా విసిరిన ఈ సుబోధ్ సింగ్ పూర్వాపరాలు ఇవి...బీహార్‌లోని నాలంద జిల్లాలో ఉన్న చండి పోలీసుస్టేషన్ పరిధిలోని చిస్టిపూర్కు చెందిన ఈశ్వర్ ప్రసాద్ కుర్మి కుమారుడే సుబోధ్ సింగ్ (42). ఇతడిపై దేశంలోని ఏడు రాష్ట్రాల్లో దోపిడీ, హత్య, బందిపోటు దొంగతనం, దాడుల వంటి కేసులు నమోదయ్యాయి. పీఎంజే కేసుతో కలిపితే ఇతడిపై ఉన్న వాటి సంఖ్య 43కు చేరింది. ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ... గూగుల్ మ్యాప్స్, ప్రత్యేక యాప్స్ వంటి అత్యాధునిక విధానాలను వినియోగిస్తూ పంజా విసిరే, విసిరించే సుబోధ్ చదివి కేవలం 12వ తరగతి.1996 వరకు ఇతగాడు బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన చిన్నచిన్న దొంగలతో కలిసి నేరాలు చేశాడు. 1999 నాటికి బీహార్ పోలీసులకు ఇన్ఫార్మర్గా మారాడు. ఆ సమయంలో ఇతడు బీహార్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు ఉన్నతాధికారులతో కూడా సంబంధాలు పెంచుకున్నాడు. 2007 వరకు తన ఇన్ఫార్మర్ పనిని కొనసాగించాడు. ఇలా సుబోధ్‌కు పోలీసుల పని తీరు, వ్యూహం, కదలికలు పూర్తిగా అవగతం అయ్యాయి. ఓపక్క ఇన్ఫార్మర్గా పనిచేస్తూనే... మరోపక్క తన నేర నెట్‌వర్క్‌ను పెంచుకుంటూ పోయాడు.తనకు ప్రత్యర్థులు, పోటీదారులుగా ఉన్న దొంగలు, ముఠాల సమాచారాన్ని బీహార్ పోలీసులకు అందించిన అతడు.. వాళ్లు జైలుకు వెళ్లేలా చేసి తన ‘లైన్’ క్లియర్ చేసుకున్నాడు. 2008లో ఇతగాడు కోల్‌కతాలోని ఎస్బీఐ బ్యాంకులో దోపిడీ చేశాడు. ఇదే ఇతడి తొలి భారీ నేరం. ఆ తర్వాత రాయపూర్‌లోని ఒక బ్యాంకులో కూడా పంజా విసిరాడు. ఈ కేసుల్లో మొదట కోల్‌కతా పోలీసులు, తరువాత రాయపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2015 వరకు రాయపూర్ జైలులోనే ఉన్నాడు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ముత్తూట్, మణప్పురం మరియు పెద్ద జువెలర్లను లక్ష్యంగా చేసుకుని సొంత గ్యాంగ్‌తో పంజా విసిరాడుసుభోద్ నేరచరిత్ర తొలిసారిగా 2018లో బీహార్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల దృష్టిలోకి వచ్చింది. ప్రతి నేరాన్నీ పక్కా పథకం ప్రకారం, రెక్కీ తర్వాత చేయిస్తున్నట్లు గుర్తించారు. ప్రతి నేరంలోనూ కొత్త అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని వారికి ప్రత్యేక పేర్లు, పాత్రలు కేటాయించేవాడు. ప్రతి దోపిడీలో ఈ గ్యాంగ్ 5 నుంచి 20 కిలోలకు వరకు పసిడిని కొల్లగొట్టేది. 2018 నాటికి రాజస్థాన్‌లోని జైపూర్, మహారాష్ట్రలోని పుణే, నాగ్‌పూర్, పశ్చిమ బెంగాల్‌లోని బరాక్పూర్లలో భారీ బంగారం దోపిడీలు చేశాడు. బీహార్‌లోని అనేక నగరాల్లో కూడా నేరాలు చేశాడు.2018 జనవరిలో బీహార్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సుబోధ్‌ను అక్కడి వైశాలి జిల్లా దానాపూర్‌లో అరెస్ట్ చేసింది. తన ప్రేయసిని కలవడానికి వచ్చిన సమయంలో పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి ఏకంగా 16.5 కిలోల బంగారం, ఒక పిస్టల్, దేశీయ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అతడిని పాట్నాలోని బేయూర్ జైలుకు తరలించారు. చాలా కాలం ఆ జైలులోనే ఉన్నాడు. అక్కడి నుంచే తన గ్యాంగ్ సహాయంతో వరుసగా బంగారం దోపిడీలకు పథకాలు వేస్తూ, అమలు చేస్తూపోయాడు.తాను జైలులో ఉన్నప్పటికీ గ్యాంగ్‌ను విస్తరించాడు. సుబోధ్ సింగ్ జైలులో నుంచే కొత్త వ్యక్తులను తన గ్యాంగ్‌లోకి చేర్చడం ప్రారంభించాడు. స్నాచింగ్స్, దొంగతనం కేసుల్లో ఎవరైనా జైలుకు వచ్చిన వాళ్లను సుబోధ్ సింగ్ టార్గెట్ చేసుకుంటాడు. ఇలాంటి వాళ్లను అతడితో పాటు అతడి అనుచరులు బెయిల్, డబ్బు ఆశ చూపి తమవైపు తిప్పుకుంటారు ఆ వ్యక్తి అంగీకరిస్తే జైలులో నుంచే వారి బెయిల్ ఏర్పాట్లు చేయిస్తాడు. వారు బయటకు వచ్చిన తరువాత అప్పటి బయట ఉన్న తన గ్యాంగ్ సభ్యులతో వారికి శిక్షణ ఇప్పించి, బంగారం ఎక్కడ ఎలా దోచుకోవాలో నేర్పిస్తాడు.సుబోధ్ గ్యాంగ్ దోచుకున్న బంగారాన్ని నేపాల్ మరియు పశ్చిమ బెంగాల్‌కు తీసుకెళ్తుంది. అక్కడ దానిని కరిగించి విక్రయిస్తారు. దేశంలో జరిగిన మొత్తం బంగారం దోపిడీల్లో 70 శాతం తమ గ్యాంగ్ దేనని సుబోధ్ పోలీసులకు చెప్తూ ఉంటాడు. జైలులో ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాల్లో నేరాలకు సుబోధ్ సింగ్ పథకాలు రచిస్తాడు. అతడు పాట్నాలోని బేయూర్ జైలులో సెక్టార్–3లోని 21, 22 బ్యారక్‌ల్లో ఉంటాడు. అక్కడ అతడికి వీఐపీ ట్రీట్మెంట్తో పాటు అన్ని సౌకర్యాలు ఉంటాయని సమాచారం. ఈ రెండు బ్యారక్‌ల్లో సుబోధ్ సింగ్ గ్యాంగ్ సభ్యులు, అతడి పరిచయస్తులే ఉంటారట.2025 మార్చిలో ఒడిశాలో జరిగిన బంగారం దోపిడీ కేసులో విచారణ కోసం ఒడిశా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఈ ఏడాది ప్రథమార్థలో రాజస్థాన్‌కు చెందిన కంకరోలి పోలీసులు ఇతడిని ఒడిశా నుంచి పీటీ వారెంట్‌పై తీసకువెళ్లారు. బేయూర్ జైలులో ఉన్న సుబోధ్ రాజస్థాన్‌కు చెందిన సైబర్ నేరగాడు కునాల్‌ను బెదిరించి రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ మొత్తం చెల్లించడానికి అతడు అంగీకరించకపోవడంతో కునాల్‌పై హత్యాయత్నం చేయించాలని భావించాడు. కునాల్‌ను పోలీసులు సియాల్దా కోర్టులో హాజరు పరిచిన సమయంలో అతడిపై కాల్పులు జరిపించాలని భావించాడు. తన అనుచరులకు ఆదేశాలు ఇవ్వడం ద్బారా కునాల్‌పై ఉపాసన ఎక్స్‌ప్రెస్ రైలులో ఎస్కార్ట్ పోలీసు సమక్షంలోనే కాల్పులు జరిపించాడు. అతడు ప్రాణాలతో బయటపడగా... గార్డు గాయపడ్డాడు.2023 ఆగస్టు 23న కంకరోలిలోని భగవందాస్ మార్కెట్ ఎదురుగా ఉన్న రూపం గోల్డ్ జువెలర్స్‌లో దోపిడీ జరిగింది. ఉదయం 10:30 గంటలకు నాలుగు బైక్‌లపై వచ్చిన నేరస్తులు వ్యాపారి మరియు ఉద్యోగులను తుపాకీతో బెదిరించి బందీలుగా మార్చి సుమారు మూడు కిలోల బంగారం, రూ.18 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. దోపిడీదారులు ఉపయోగించిన బైక్‌లలో ఒకదాన్ని భిల్వారా రైల్వే స్టేషన్ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. ఆ బైక్ బీహార్ నుంచి దొంగిలించబడినదిగా తేలింది. నిందితులు రైలులో బీహార్‌కు పారిపోయినట్లు విచారణలో నిర్ధారణ అయింది. ఈ కేసులో సుబోధ్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేశారు.ఇంతకుముందు ఇదే గ్యాంగ్ 2022 ఆగస్టు 29న ఉదయపూర్‌లోని సుందర్వాస్లో ఉన్న మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్‌లో జరిగిన భారీ దోపిడీలో కూడా పాల్గొన్నట్లు తేలింది. ఈ కేసులో సుబోధ్‌తో పాటు ముగ్గురు నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సుబోధ్ బీహార్‌లోని పూర్నియా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, హైదరాబాద్. -
PMJ చోరీ కేసులో షాకింగ్ ట్విస్ట్ లాడ్జి యజమానితో దుండగుల ఫోన్ కాల్ వైరల్
-
PMJ జ్యువెలరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ధర్మపురిలో దుండగుల సంచారం
-
చిన్నారిపై వార్డెన్, వంటవాని పైశాచికం
కొల్లాం: కేరళలోని కొల్లాం జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 500 రూపాయలు దొంగిలించాడన్న అనుమానంతో 12 ఏళ్ల పసివాడిని తలకిందులుగా వేలాడదీసి, పైశాచికంగా హింసించిన ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్ సిబ్బంది అమానుషత్వం అందరినీ కలచివేసింది. ఈ అమానవీయ ఘటనకు పాల్పడిన వార్డెన్, వంట మనిషిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.వంటవాని కిరాతకం.. వార్డెన్ వత్తాసుపునలూర్ సమీపంలోని ఓ ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటున్న 12 ఏళ్ల విద్యార్థిపై అక్కడి వంటవాడి కన్ను పడింది. తన దగ్గర ఉన్న రూ. 500 దొంగిలించాడంటూ ఆ బాలుడిపై నింద మోపాడు. అనుమానంతో ఆ పసివాడిని శారీరకంగా తీవ్రంగా హింసించాడు. అంతటితో ఆగకుండా బాలుడిని అత్యంత పాశవికంగా తలకిందులుగా వేలాడదీసి, తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. ఈ దారుణ కాండలో బాలుడిని రక్షించాల్సిన స్కూల్ వార్డెన్ కూడా వంటవాడికి సహకరించడం గమనార్హం.తండ్రి ఫిర్యాదుతో..కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సిబ్బంది చేతిలో తీవ్ర నరకయాతన అనుభవించిన ఆ బాలుడు.. తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని రోదిస్తూ చెప్పాడు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాలుడి తండ్రి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. స్కూల్ సిబ్బంది పైశాచికత్వంపై ఆధారాలతో సహా పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశాడు.నిందితుల అరెస్ట్.. సురక్షితంగా బాలుడుతండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు వేగవంతం చేశారు. బాలుడిని హింసించిన వంటవాడిని, అతనికి సహకరించిన వార్డెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. జువైనల్ జస్టిస్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) చట్టాల కింద వారిపై కఠిన సెక్షన్లు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ దాడి వల్ల బాలుడి ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, ప్రస్తుతం అతను సురక్షితంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: దీదీకి షాకిచ్చిన బీజేపీ త్రయం -
రూ.కోటిన్నర బంగారం కొట్టేసింది కూతురే..!
చైతన్యపురి: ఓ వ్యాపారి ఇంట్లో కిలో బంగారు ఆభరణాలు చోరీకి గురై సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే వాటిని కొట్టేసింది అతడి కుమార్తె అని పోలీసుల విచారణలో తేలింది. చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాలు... కొత్తపేట గ్రీన్‌హిల్స్ కాలనీలో నివసించే దీపక్ పటేల్ టైల్స్ వ్యాపారి. జనవరి 28న భార్య వింధ్య పటేల్‌తో కలిసి ఇంట్లోని నగల బాక్సులను బెడ్ కింద ఉన్న లాకర్లో పెట్టి తాళం వేశారు. తాళం చెవులను బీరువా లాకర్లో భద్రపరిచారు. గత శనివారం ఆభరణాల కోసం లాకర్ తెరిచి చూడగా ఖాళీ బాక్సులు దర్శనమిచ్చాయి. అవి చోరీకి గురై ఉంటాయని భావించి దీపక్ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన డీఐ గురుస్వామి దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులను విచారించగా ఈ ఘటనలో ఫిర్యాదుదారుడి కుమార్తె రియా హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఎంబీఏ చదువుతోంది. నమ్మకంగా ఉంటూ దీపక్ పటేల్ దగ్గర మేనేజర్‌గా పనిచేసే సాగర్(34)కు రియా ఆ ఆభరణాలను ఇచ్చినట్లు విచారణలో తేలింది. బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్‌కు డబ్బులు అవసరమని అతడు నమ్మించి నగలు తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో కుటుంబం పరువు పోతుందని భావించిన ఫిర్యాదుదారుడు పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి కేసు వాపస్ తీసుకుంటానని అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. అనుమానితులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నామని కొంత నగదు, బంగారం స్వా«దీనం చేసుకున్నామని చైతన్యపురి పోలీసులు తెలిపారు. -
పోలీస్ స్టేషన్లో వ్యక్తి!
సాక్షి టాస్క్ ఫోర్స్: చోరీ కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం తెల్లవారు జామున నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో జరిగింది. అయితే ఇది ఆత్మహత్య కాదని, లాకప్ డెత్ అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కొలిమిగుండ్ల మండలం బెలుం శింగవరానికి చెందిన దొమ్మరి వెంకట సుబ్బయ్య(38) ఈనెల 16న తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా పడగటూరు గ్రామానికి చెందిన తేజ, నరేష్ తో కలిసి బెలుం గ్రామంలో రెక్కీ నిర్వహించి కొత్త ట్రాక్టర్‌ను అపహరించుకుపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు కర్నూలు సమీపంలో ట్రాక్టర్ ఉండటంతో రికవరీ చేశారు. ఈ కేసులో వెంకటసుబ్బయ్య, తేజను అదుపులోకి తీసుకోగా నరేష్ పరారీలో ఉన్నాడు. మృతుడు వెంకటసుబ్బయ్యపై పోలీస్ స్టేషన్లో దొంగతనం, రెండు కొట్లాట కేసులు ఉన్నాయి. బాత్రూంలో మృతి ట్రాక్టర్ దొంగతనం కేసులో వెంకటసుబ్బయ్యను పోలీసులు శనివారం ఉదయమే కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం ఆదివారం కోర్టులో హాజరు పర్చాలని భావించారు. తెల్లవారు జామున స్టేషన్‌లోని బాత్రూం వెళ్లి కట్టుకున్న లుంగీతో వెంకటసుబ్బయ్య ఉరివేసుకున్నాడు. బాత్రూంకు అని చెప్పి వెళ్లి ఎంతకు బయటకు రాకపోవడంతో తోటి దొంగ తేజ రాత్రి విధుల్లో ఉన్న పోలీసులకు చెప్పాడు. వారు వెళ్లి చూడగా సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. శ్వాస ఇంకా ఉందనే అనుమానంతో సిబ్బంది అవుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. సుబ్బయ్యపై మూడు కేసులు ఉండటంతో పాటు తాజాగా ట్రాక్టర్ చోరీలో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులతో చేతులు కలపడంతో రిమాండ్‌కు వెళ్లాల్సి వస్తుందనే కారణంతోనే భయపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. నంద్యాల ఏఎస్పీ మంద జావళి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని వివరాలు సేకరించారు. మృతిపై అనుమానాలెన్నో! వెంకటసుబ్బయ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దెబ్బలు తాళలేకనే మృతిచెందాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాత్రూంలో ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదని తెలుస్తోంది. సెటిల్మెంట్ చేశారా? వెంకటసుబ్బయ్య అధికార పార్టీకి చెందిన కార్యకర్త కావడంతో టీడీపీ నేతలు రంగప్రవేశం చేసి బాధిత కుటుంబానికి రూ.15 లక్షల మేర నష్టపరిహారం చెల్లించేలా సెటిల్మెంట్ చేసినట్లు వార్త చక్కర్లు కొడుతోంది. ఆత్మహత్య చేసుకుంటే డబ్బులు ఎందుకు బేరమాడారనేది చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి చూస్తే వెంకటసుబ్బయ్య కస్టడీలో ఉండగానే ఆత్మహత్య చేసుకోలేదని లాకప్ డెత్ జరిగిందనే వాదనకు బలం చేకూరుతోంది. -
హీరోయిన్ రాశీ ఖన్నాకు చేదు అనుభవం..!
హీరోయిన్ రాశి ఖన్నాకు చేదు అనుభవం ఎదురైంది. తాను నటిస్తోన్న ఓ మూవీ షూటింగ్లో ఆమె నగదు చోరీకి గురైంది. రాశీ హ్యాండ్ బ్యాగ్ నుంచి రూ.50 వేలను తస్కరించినట్లు తెలుస్తోంది. మూవీ సెట్స్‌లోని వానిటీ వ్యాన్‌లో పనిచేసే ఓ ఉద్యోగి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. అతన్ని వెంటనే గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని చితకబాది.. బయటికి గెంటేశారు.ఈ చోరీతో మూవీ సెట్స్‌లోని సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. మూవీ షూటింగ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన చూసి చాలా దిగ్భ్రాంతికి గురైనట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇలాంటి సంఘటనలు జరగడం పరిశ్రమకు సిగ్గుచేటన్నారు. కానీ ఎలాంటి చోరీ జరగలేదని రాశీ ఖన్నా టీమ్ చెప్పడం విశేషం. ఈ విషయంపై మాట్లాడటానికి రాశీ ఖన్నా మేనేజర్ నిరాకరించారు. కాగా.. రాశీ ఖన్నా ప్రస్తుతం అనీస్ బాజ్మీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్లతో కనిపించనుంది. -
స్వర్ణ పతకధారి.. చేసేది చోరీ!!
చౌటుప్పల్: ఎంబీఏ చదివాడు... గోల్డ్‌మెడల్ కూడా సాధించాడు...కానీ దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. పట్టపగలే తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలు చేస్తున్న దొంగ బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులకు చిక్కాడు. ఈ కేసు వివరాలను చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా వేటపాలెం నలందానగర్‌కు చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ సామ్రిచర్డ్ ఎంబీఏలో గోల్డ్‌మెడల్ సాధించాడు. కొన్నేళ్ల క్రితం స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు వచ్చి మన్సూరాబాద్ ప్రాంతంలో అద్దెకు ఉంటూ పలు వ్యాపారాలు చేశాడు. వాటిని విడిచి దొంగతనాలను వృత్తిగా ఎంచుకొని హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో 62 దొంగతనాలు చేశాడు. అనేకసార్లు పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లినా తిరిగి బయటకు వచ్చి మళ్లీ చోరీలు చేసేవాడు. ఫిబ్రవరి 22న ఓ చోరీ కేసులో ఖమ్మం కోర్టుకు హాజరైన వంశీకృష్ణ తిరిగి హైదరాబాద్‌కు వెళ్తూ చౌటుప్పల్‌లోని వలిగొండ చౌరస్తా కంఠమహేశ్వర కాలనీలో నివాసముంటున్న లింగంపల్లి నర్సింహ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి బీరువాలో దాచిన రూ.14.20 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వంశీకృష్ణ సెల్ఫ్ డ్రైవ్ కారు అద్దెకు తీసుకుని బుధవారం ఉదయం ఖమ్మం కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా అతడి కారును ఆపారు. వంశీకృష్ణ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చౌటుప్పల్‌లోని కంఠమహేశ్వర కాలనీలో లింగంపల్లి నర్సింహ ఇంట్లో చోరీ చేసింది తానేనని వంశీకృష్ణ ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.7 లక్షల నగదు, కారు, రెండు సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, కెమెరా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడి బ్యాంకు అకౌంట్లో ఉన్న రూ.2.28లక్షల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఈ మేరకు నిందితుడిని కోర్టులో హాజరుపర్చి అనంతరం నల్లగొండ జైలుకు తరలించారు.ఈ విలేకరుల సమావేశంలో సీఐ మన్మథకుమార్, సీసీఎస్ సీఐ ప్రవీణ్‌బాబు, ఎస్ఐలు యాదగిరి, వనం సైదులు, కుమారస్వామి పాల్గొన్నారు. కాగా, చోరీ చేసిన సొత్తుతో వంశీకృష్ణ వివిధ ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేసేవాడని, తన చుట్టూ బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని తిరుగుతుండేవాడని, పేదలకు దాన ధర్మాలు చేయడం, అనాథ పిల్లలను చేరదీసి వారికి చదువు చెప్పించడం కూడా చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. -
చిన్న వయసులోనే.. ఖతర్నాక్ దొంగతనం
-
దేవుని సొమ్ముకే ఎసరు.. ఆలయాల్లో బంగారం మాయం!
తిరువనంతపురం: శబరిమల తరహాలోనే కేరళలోని పలు ప్రసిద్ధ దేవాలయాల్లో స్వామివారి ఆభరణాలు కనుమరుగవుతున్నాయి. తాజాగా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెలుగులోకి వచ్చిన నిజాలు భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. సరైన పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ లేకపోవడంతో గుడిలోని దేవుని సొమ్ముకే రక్షణ లేకుండా పోయింది.కొచ్చికి చెందిన ఆర్టీఐ కార్యకర్త కె. గోవిందన్ నంబూతిరి దాఖలు చేసిన దరఖాస్తుకు.. కొచ్చిన్ దేవస్వం బోర్డు పరిధిలోని త్రిస్సూర్ గ్రూప్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇచ్చిన సమాధానాలతో ఈ విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. గతంలో శబరిమల ఆలయంలో వెలుగుచూసిన ఆరోపణల మాదిరిగానే.. ఇప్పుడు త్రివేండ్రంలోని శ్రీవరాహం ఆలయం, కొచ్చిన్ దేవస్వం బోర్డు పరిధిలోని పుల్లు భగవతి ఆలయం, త్రిపుణితుర పూర్ణత్రయీశన్ ఆలయాల నుంచి స్వామివారి బంగారం మాయమైనట్లు అధికారికంగా నిర్ధారణ అయింది.ఏ గుడిలో ఎంత మాయమైందంటే..పుల్లు భగవతి ఆలయం: కొచ్చిన్ దేవస్వం బోర్డు త్రిస్సూర్ గ్రూప్ కిందకు వచ్చే ఈ గుడిలో ఏకంగా 40.50 గ్రాముల బరువున్న ఏడు బంగారు గొలుసులు అదృశ్యమయ్యాయి.శ్రీవరాహం ఆలయం: ఇక్కడ 7.750 గ్రాముల బరువున్న రెండు పురాతన బంగారు గొలుసులు కనిపించలేదు. త్రిపుణితుర పూర్ణత్రయీశన్ ఆలయం: ఈ ప్రసిద్ధ ఆలయంలో స్వామివారి కిరీటం నుంచి 663 మిల్లీగ్రాముల బంగారం మాయమైంది.నిర్వహణలో డొల్లతనంపలు దేవస్వం బోర్డు ఆలయాల్లో స్వామివారి ఆభరణాలకు (తిరువాభరణం) సంబంధించి కనీస రిజిస్టర్లను కూడా సరిగ్గా నిర్వహించడం లేదని ఈ ఆర్టీఐ నివేదిక ద్వారా వెల్లడయ్యింది. అధికారుల బాధ్యతారాహిత్యానికి, నిల్వల ట్రాకింగ్‌లో ఉన్న లోపాలకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. కాగా శబరిమల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశ్ దర్శన్’ పథకం కింద మంజూరు చేసిన నిధుల వినియోగంపై కూడా నంబూతిరి కీలక వివరాలు వెల్లడించారు. ఆర్టీఐ పత్రాల ప్రకారం.. కేంద్రం రూ.46.53 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు కేవలం రూ.36.27 కోట్లు మాత్రమే వినియోగించినట్లు తెలుస్తోంది.ఇది కూడా చదవండి: పాక్‌లో ‘పెట్రో’ మంట: ప్రధాని మాస్టర్ ప్లాన్ ఇదే! -
మర్యాదగా ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..!
విశాఖపట్టణం: ‘మీరు స్వామివారి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం’ అంటూ అర్చకులు గద్దిస్తుంటే, భక్తులు బిత్తరపోయారు. నిష్కల్మషమైన భక్తితో కొండెక్కిన తమను ‘దొంగలు’ అనడమేమిటి? పైగా చేతులకు తాళ్లు కట్టి బంధించడమేమిటి? అని ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. కానీ, అదంతా ’దొంగ–పోలీస్’ ఆటలా సాగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టమని తెలిసి చివరకు ఆనంద డోలికల్లో మునిగిపోయారు. View this post on Instagram A post shared by Shyam Cherry (@simhachalamupdates)అసలేం జరిగింది? సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ‘వినోదోత్సవం’ కనువిందుగా జరిగింది. గురువారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో (వేట ఉత్సవం) స్వామివారి ఉంగరం పోయిందని, అది భక్తులే తీశారని అర్చకులు సరదాగా నిలదీసే ఘట్టమే ఈ ఉత్సవ విశేషం. బంధీలుగా వీఐపీలు.. సామాన్యులు రాజగోపురం వద్ద స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి ఏడు పరదాల చాటున వేంజేసి ఉండగా.. ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు స్వామివారి దూతగా మారి.. చేతిలో కర్ర, తాడు పట్టుకుని భక్తులను బంధించి తీసుకువచ్చారు. గాజువాకకు చెందిన వ్యాపారవేత్త సాగర్, ఇంజనీరింగ్ విద్యార్ధి ప్రణతి, విశాఖకు చెందిన ఫిజియోథెరపిస్టు రేషి్మ, విజయనగరానికి చెందిన ఆమె సోదరి భార్గవి, ఒడిశాలోని జాజ్పూర్కి చెందిన ప్రభుత్వ వైద్య విద్యార్థులు, శ్రీహరిపురానికి చెందిన భరత్, హేమ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కుమారుడు సిద్ధార్థ, కోడలు నిత్య, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జర్నలిస్టుల సంఘం జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, పలువురు నూతన దంపతులతోపాటు దేవస్థానం ఈవో జె.వెంకటరావు దంపతులను కూడా వదలకుండా తాళ్లతో బంధించి స్థానాచార్యుల ముందు ప్రవేశపెట్టారు. సీసీ కెమెరా సాక్ష్యం ఉంది.. ఇచ్చేయండి స్థానాచార్యులు రాజగోపాల్ భక్తులను ప్రశ్నించిన తీరు అత్యంత సహజంగా సాగింది. ‘మీరు దొంగతనం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయి’ అని ఆయన గర్జించడంతో భక్తులు హడలిపోయారు. భక్తుల చేతికి ఉన్న ఉంగరాలు చూపిస్తూ.. ‘ఇదే స్వామివారి ఉంగరం’ అని అర్చకులు నిలదీయడంతో చాలామంది భక్తులు ఆవేశంతో, మరికొందరు బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ట్విస్ట్ ఏమిటంటే: అందరినీ బంధించిన ప్రధానార్చకుడిని, అందరినీ ప్రశ్నించిన స్థానాచార్యుడిని, ఏఈవోలను కూడా చివర్లో తాళ్లతో బంధించడం ఈ ఉత్సవంలో హైలైట్‌గా నిలిచింది. పరదా వెనుక దొరికిన ‘నిజమైన’ దొంగ భక్తుల విచారణ ముగిసిన తర్వాత, స్వామివారి పల్లకీకి ఉన్న ఏడు పరదాలను ఒక్కొక్కటిగా తొలగించారు. ఆశ్చర్యంగా ఆఖరి పరదా చాటునే స్వామివారి ఉంగరం లభ్యమైంది. అంటే దొంగ మరెవరో కాదు.. ఆ స్వామివారే అని తేలడంతో భక్తులంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. తమను దొంగలుగా పట్టుకోవడం కూడా ఆ నృసింహుడి లీలగా భావించి భక్తులు పులకించిపోయారు. -
4 లక్షల చాక్లెట్లు ట్రక్కుతో సహా మాయం
"హ్యావ్ ఏ బ్రేక్.. హ్యావ్ ఏ కిట్‌కాట్" అనేది ఆ బ్రాండ్ ఐకానిక్ నినాదం. అయితే, కొంతమంది దొంగలు ఈ స్లోగన్‌ను మరీ సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు. ఏకంగా 12 టన్నుల కిట్‌కాట్ చాక్లెట్లతో నిండిన ట్రక్కునే మాయం చేసి, తీపి దొంగతనానికి తెరలేపారు. ఈస్టర్ పండుగ వేళ ఐరోపాలో జరిగిన ఈ భారీ దోపిడీ ఇప్పుడు సంచలనంగా మారింది.ఏం జరిగింది?మార్చి 26న మధ్య ఇటలీలోని ఒక ఫ్యాక్టరీ నుండి పోలాండ్లోని పంపిణీదారులకు బయలుదేరిన ఈ ట్రక్కు మార్గమధ్యలో అదృశ్యమైంది. ఇందులో సుమారు 4,13,793 కిట్‌కాట్ యూనిట్లు ఉన్నాయి. దీనిపై మాతృ సంస్థ నెస్లే ప్రతినిధులు స్పందిస్తూ.. "వాహనం, లోడ్ జాడ ఇంకా దొరకలేదు" అని ధ్రువీకరించారు.ఫార్ములా వన్ చాక్లెట్లుదొంగిలించిన ఈ స్టాక్‌లో కిట్‌కాట్ కొత్తగా ప్రవేశపెట్టిన 'ఫార్ములా వన్ (F1)'థీమ్ చాక్లెట్లు ఉండటం గమనార్హం. గత ఏడాది F1 అధికారిక భాగస్వామిగా మారిన తర్వాత, రేసు కార్ల ఆకారంలో ఈ ప్రత్యేక వేఫర్ చాక్లెట్లను నెస్లే రూపొందించింది. ఇప్పుడు ఈ ఖరీదైన, పరిమిత ఎడిషన్ చాక్లెట్లన్నీ దొంగల పాలయ్యాయి."మా బ్రాండ్ నినాదాన్ని దొంగలు అక్షరాలా పాటించి, 12 టన్నుల చాక్లెట్లతో విరామం తీసుకున్నట్లు కనిపిస్తోంది. నేరస్థుల రుచిని మేము అభినందిస్తున్నప్పటికీ, ఇది వ్యాపారాలకు పెద్ద సవాలుగా మారింది" నెస్లే పేర్కొంది.నిఘా నీడలో చాక్లెట్లుఈ దోపిడీపై నెస్లే సంస్థ వినియోగదారులను, రిటైలర్లను అప్రమత్తం చేసింది. ప్రతి ప్యాకేజీపై ఉండే బ్యాచ్ కోడ్ ద్వారా ఉత్పత్తిని ట్రాక్ చేయవచ్చని చెప్పింది. ఎవరైనా అనధికారిక మార్గాల ద్వారా ఈ చాక్లెట్లను విక్రయిస్తుంటే, స్కాన్ చేసి అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ దోపిడీ వల్ల మార్కెట్లో కిట్‌కాట్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగదని, వినియోగదారుల భద్రతకు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం స్థానిక పోలీసులు, సప్లయి చైన్ భాగస్వాములతో కలిసి ఈ 'తీపి' దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.Regarding recent press coverage pic.twitter.com/Huh4EnFV2J— KITKAT (@KITKAT) March 29, 2026 -
Kukatpally : కోటి రూపాయల హవాలా మనీ ఎవరిది?
సాక్షి,హైదరాబాద్: కూకట్‌పల్లిలో కోటి రూపాయల హవాలా మనీ చోరీకి గురైంది. హవాలా డబ్బును బైక్‌పై తీసుకుని వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల కళ్లల్లో కారం కొట్టి కోటి హవాలా మనీ కొట్టేశారు. బహుదూర్ పూరా నుంచి జీడిమెట్లకు తరలిస్తుండగా దోపిడీ జరిగింది. బాధితుల ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుల నుంచి హవాలా డబ్బు ఎక్కడికి వెళ్తుందని దిశగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
బెంగళూరులో సిలిండర్ దొంగతనం.. CCTV విజువల్స్ వైరల్
-
ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ.. 15 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు
విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారి ఇంద్రకీలాద్రి కొండపై చోరీ జరిగింది. ఓ భక్తురాలి వద్ద 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు పెళ్లికి వచ్చిన మహిళా భక్తురాలు నగలు పొగొట్టుకుంది. ఇవాళ కుంభాభిషేకం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో దర్శనానికి వెళ్లిన ఆమె బ్యాగ్‌లో ఉన్న బంగారు చోరీకి గురైంది.దీంతో విజయవాడలోని వన్ టౌన్ పోలీసులకు మహిళా భక్తురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. కుంభాభిషేకం ఏర్పాట్లలో భాగంగా ఆలయ ప్రాంగణంలో టెంట్లు ఏర్పాటు చేశారు. దీంతో సీసీ కెమెరాలకు అడ్డంగా టెంట్స్ ఉండడంతో దొంగను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. -
బాబు గుండెల్లో పరుగులు పెట్టిస్తున్న పరకాల రిపోర్ట్..
-
కోడిపెట్టను ఎరవేసి.. పుంజు చోరీ!
జూలూరుపాడు: ఆ పుంజులో ఏం ప్రత్యేకత ఉందో ఏమో కానీ.. ఇద్దరు వ్యక్తులు కోడిపెట్టను ఎరగా వేసి మరీ దాన్ని ఎత్తుకెళ్లారు. మనుషులను బురిడీ కొట్టించడానికి, డబ్బు లాగడానికి కేటుగాళ్లు హనీ ట్రాప్‌ను ఆయుధంగా వాడినట్లే ఇక్కడ కూడా వ్యవహరించడం విశేషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జేత్యాతండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాచినేనిపేటతండా గ్రామపంచాయతీ పరిధి జేత్యాతండాకు చెందిన రైతు లకావత్ జేత్రామ్ తన ఇంట్లో మూడు కోడి పుంజులు, ఒక పెట్టను పెంచుతున్నాడు.ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం ఆయన పొలానికి వెళ్లి సాయంత్రం వచ్చేసరికి ఒక పుంజు కనిపించలేదు. ఇరుగుపొరుగు వారిని ఆరా తీయగా ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు కోడి పెట్టను తీసుకుని వచ్చినట్లు తేలింది. ఆ వ్యక్తులే పెట్టను ఎరగా వేయగా.. జేత్రామ్ ఇంట్లోని కోడి పుంజు దగ్గరకు రావడంతో దాన్ని పట్టుకుని బైక్‌పై పారిపోయినట్లు గుర్తించాడు. దీనిపై జేత్రామ్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఇంట్లో తమ్ముడి దొంగతనం.. అన్న పెళ్లితో బయటపడింది
సాక్షి,హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. తన సొంత కుటుంబ సభ్యుల బంగారాన్ని దొంగిలించి, గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దొంగతనం చేశారని కట్టుకథ అల్లిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రూ. 12 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల మేరకు.. నిందితుడు భాస్కర్ ప్రమోద్ ముల (32 ఏళ్లు) బీటెక్ పూర్తి చేశాడు. చిక్కడపల్లిలో నివసిస్తున్నాడు. అయితే, భాస్కర్ ప్రమోద్ 2014లో బీటెక్ పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. కానీ మధ్యలోనే చదువులు మానేసి తిరిగి వచ్చాడు. బెంగళూరులో ఉన్న సమయంలో విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడి, క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల ద్వారా అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చడానికి 2024 నుండి తన నానమ్మ, కుటుంబ సభ్యుల బంగారాన్ని దొంగిలించి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ. 4,60,000 నగదు పొందాడు.ఇటీవల నిందితుడి అన్నయ్య పెళ్లి ఖాయం కావడంతో, కుటుంబ సభ్యులు నానమ్మ బంగారాన్ని పెళ్లి కోసం తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో భయాందోళనకు గురైన భాస్కర్, తన దొంగతనం బయటపడకుండా ఉండేందుకు ఒక పథకం వేశాడు.ఈ ఫిబ్రవరి 9న తన పెంట్ హౌస్‌లో దొంగతనం జరిగినట్లుగా సీన్ క్రియేట్ చేసి, గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వెండి ఎత్తుకెళ్లారని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడు. భాస్కర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తూ చేపట్టారు.ఈ దర్యాప్తులో ఫిర్యాదుదారుడే అసలు నిందితుడని తేల్చారు. విచారణలో నిందితుడు కొన్ని వెండి వస్తువులను మూసీ నాలాలో పడేసినట్లు అంగీకరించాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తులో రెండు బంగారు ఉంగరాలు (సుమారు 3 తులాలు), ఒక వెండి ప్లేటు, రెండు వెండి గిన్నెలు, అలాగే హెచ్డీఎఫ్సీ,ఎస్బీఐ ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన 80 గ్రాముల బంగారం మార్టిగేజ్ స్లిప్పులు ఉన్నాయి. మొత్తం విలువ సుమారు రూ. 12 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన సొంత కుటుంబాన్ని, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన నిందితుడు చివరికి తనే ఇరుక్కున్నాడు. నేరం ఎంత తెలివిగా ప్లాన్ చేసినా, నిజం బయటపడకుండా దాచడం అసాధ్యం అనేది ఈ కేసు నిరూపించింది. ఈ కేసును ఛేదించడంలో సికింద్రాబాద్ జోన్ డీసీపీ ఐపీఎస్ రక్షితా కృష్ణమూర్తి , అడిషనల్ డీసీపీ జె. నర్సయ్య మార్గదర్శకత్వంలో చిక్కడపల్లి ఏసీపీ ఎల్. రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ ఎం. మల్లేశం, ఎస్ఐ మొహమ్మద్ కరీమ్ క్రైమ్ స్టాఫ్ చాకచక్యంగా వ్యవహరించారు. -
పక్షవాతంతో భర్త.. 70 ఏళ్ల మహిళ హత్య : రూ. 65 లక్షల గోల్డ్ చోరీ
బెంగళూరు: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. పెద్ద వయసులో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధ దంపతులను టార్గెట్‌గా చేసుకున్నాడో వ్యక్తి. 70 ఏళ్ల మహిళను హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న నగలతో పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన శోభ, రంగనాథ్ దంపతులు. నెలమంగళలోని హీరాపూర్ ప్రాంతంలోని కోటే బీడీలో నివసిస్తున్నారు. వీరికి పిల్లలు లేరు. పైగా గత 15 ఏళ్లుగా భర్త రంగనాథ్ పక్షవాతంతో బాధపడుతున్నాడు. భార్య శోభ అతణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. సంఘటన జరిగిన రోజు, ఆ జంట తమ దినచర్య ఉదయం వాకింగ్‌కు వెళ్లి ఇంటికి వచ్చారు. ఇదే అదనుగా భావించిన హోల్‌సేల్ దుకాణ యజమాని శివకుమార్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆభరణాల దుకాణ యజమాని కుమార్తె శోభ ఒంటిమీద ఉన్న గొలుసు, గాజులు, ఇతర బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. మరికొంత బంగారం, డబ్బు కోసం ఇంట్లో వెతికాడు. దాదాపు రూ. 65 లక్షల విలువైన దాదాపు 450 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఆమె గొంతుకోసి హత్య చేసి అక్కడినుంచి ఉడాయించాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్టు ప్రేక్షకుడిగా నటిస్తూ నేరస్థలానికి తిరిగి వచ్చాడు. .పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగనాథ్‌కు ఫిజియోథెరపీ చేయడానికి వైద్యుడు ఇంటికి వచ్చినప్పుడు ఈ హత్య విషయం వెలుగు చూసింది. ఫిజియో థెరపిస్ట్ ఇంటికి వచ్చేసరికి శోభ రక్తపుమడుగులో పడి ఉంది. అప్పటికే ఆమె ప్రాణం పోయింది. పక్షవాతంతో బాధపడుతున్న భర్త కూడా ఆమె పక్కనే పడి ఉనన్నాడు. బహుశా ఈ దాడి గురించి తనికి తెలిసి ఉండకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు మోటార్ సైకిల్‌పై పారిపోతున్న దృశ్యాలను గుర్తించారు. స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా శివకుమార్ ఈ హత్యకు పాల్పడి ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. శివకుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు మోటార్ సైకిల్, హత్యకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్‌ను సాక్ష్యంగా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
బ్యాంక్ లాకర్లలో మీ వస్తువులు భద్రమేనా?
-
అజిత్ ఎక్కడ.. ఏటీఎం దొంగ వేటలో పోలీసులు!
గచ్చిబౌలి: రూ.60 లక్షలతో ఉడాయించిన సీఎంసీ వాహన డ్రైవర్ అజిత్ కుమార్ అలియాస్ శివ కోసం ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. భారీ నగదుతో పరారైన నిందితుడు ఎక్కడికి వెళ్లాడనే క్లూ ఇంకా లభించలేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఎస్ఓటీ, సీసీఎస్ పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నాయి.గురువారం సాయంత్రం 4.45 గంటల సమయంలో గోపన్‌పల్లిలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం నుంచి భారీ నగదుతో అజిత్ పరారైన విషయం తెలిసిందే. తెల్లాపూర్‌లో గద్దర్ చౌరస్తాలో వాహనం వదిలి వెళ్లిన అజిత్ ఓ ఆటోలో బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్డుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అశోక్‌నగర్‌లో ఓ లాడ్జీకి వెళ్లిన నిందితుడు.. పెట్టె పగుల గొట్టి అందులోని నగదును బ్యాగ్‌లోకి సర్దుకొని బస్సులో వెళ్లి మియాపూర్‌లో దిగి ఐడీఏ బొల్లారం వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బొల్లారం, బాచుపల్లి పరిసర ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు అజిత్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా మరో బృందం దర్యాప్తు చేస్తోంది. భారీ నగదుతో ఎక్కువ దూరం వెళ్లే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. గత ఏడేళ్లుగా తిరుమలగిరిలోనే ఉంటున్న అజిత్ ఆధార్ కార్డు మాత్రం బెంగళూర్‌లో తీసుకున్నట్లు పోలీసులు సమాచారం రాబట్టారు. ఆరు నెలల క్రితమే సీఎంసీ వాహనంలో డ్రైవర్ డ్యూటీలో చేరిన అజిత్ పక్కా ప్లాన్ తోనే రూ.60 లక్షల నగదు ఉన్న వాహనంతో పరారైనట్లు తెలుస్తోంది.పెట్టెలో ఉన్న నగదును తీసుకు వెళ్లేందుకు తన వద్ద బ్యాగ్‌ను ముందే సమకూర్చుకున్నట్లు సమాచారం.దాదాపు 7 ఏటీఎంలలో క్యాష్ లోడ్ చేశారు.కస్టమర్లు ఏటీఎంలో డిపాజిట్ చేసిన నగదును తీసి వాహనంలోని బాక్స్‌లో భద్రపరుస్తారు. చివరి ఏటీఎంకు వచ్చే సరికి డిపాజిట్ మొత్తం భారీగా ఉందని నిర్ధారించుకున్న తరువాతే అదును చూసి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ఉదయం సాఫ్ట్వేర్ జాబ్..రాత్రి అయితే దొంగ
అల్లిపురం: పగలు కంప్యూటర్ ముందు కూర్చు ని కోడింగ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజినీర్.. రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లకు కన్నం వేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, 15 ఏళ్ల వయసులోనే దొంగతనాలు మొదలుపెట్టాడు. నేడు 60 నేరాల రికార్డున్న గజదొంగగా మారిన అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీని విశాఖ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఈ వివరాలను వెల్లడించారు. నిందితుడి నుంచి 699 గ్రాముల బంగారం, 3.8 కేజీల వెండి, నేరాలకు ఉపయోగించిన బీఎండబ్ల్యూ కారు, నంబర్ ప్లేట్ లేని స్కూటీ, ఐరన్ రాడ్, డ్రిల్లింగ్ మెషిన్, సుత్తి, స్రూ్కడ్రైవర్, కట్టింగ్ ప్లయిర్, ఫేస్ మాస్కులను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. విశాఖ నగరంలో జరిగిన 26 దొంగతనం కేసుల్లో మొత్తం 108.494 తులాల బంగారం, 633.35 తులాల వెండి, నగదు రూ.40,500ను సన్నీ చోరీ చేసినట్లు సీపీ వెల్లడించారు. అసలేం జరిగిందంటే? గత ఏడాది అక్టోబర్ 10న గాజువాకలోని ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉంటున్న కన్నా శివ రామకృష్ణ తన కుమార్తె డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం తన కుటుంబంతో అరుణాచలం వెళ్లారు. కాకినాడకు చెందిన సన్నీ వారి ఇంటి తాళాలు పగలగొట్టి 17 తులాల బంగారం, 30 తులాల వెండిని ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న గాజువాక క్రైం ఇన్స్పెక్టర్ కల్లూరి శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే గాజువాక, ఆరి లోవ, మల్కాపురం, పెందుర్తి, దువ్వాడ ప్రాంతాల్లో ఒకే తరహా దొంగతనాలు జరగడంతో పోలీసులు దీనిని సవాలుగా తీసుకున్నారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నగరంలోని మాధవస్వామి కల్యాణ మండపం సమీపంలోని పార్క్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న సన్నీని శనివారం గాజువాకలోని మింది ఆర్చ్ రోడ్ వద్ద క్రైం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇదీ సన్నీ నేర చరిత్ర నిందితుడు మహేష్ రెడ్డి పీజీ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే చిన్నతనం నుంచే విలాసాలకు అలవాటు పడటంతో 15 ఏళ్లకే దొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. పీఎంపాలెం పరిధిలో నాలుగు దొంగతనాలు చేసి తొలిసారి జువెనైల్ హోంకి వెళ్లాడు. అక్కడి నుంచి విడుదలైన తర్వాత కాకినాడ, సర్పవరం, రామచంద్రాపురం, రాజమండ్రి పరిసరాల్లో 32 దొంగతనాలు చేశాడు. ఈ క్రమంలో పట్టుబడి రాజమండ్రి జైలులో 14 నెలలు శిక్ష కూడా అనుభవించాడు. ఇలా మొత్తం 60కి పైగా దొంగతనాలు చేశాడు. అప్పుడప్పుడు విశాఖ వచ్చి దొంగతనాలు చేసి, మళ్లీ హైదరాబాద్ వెళ్లి విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. ఎట్టకేలకు అతన్ని విశాఖ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. -
శబరిమల బంగారం చోరీ కేసులో.. జయరామన్‌ను విచారించిన సిట్
-
బెంగళూరులో భారీ చోరీ.. కిలేడీ జంట ఎక్కడ?
బెంగళూరు: కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రముఖ బిల్డర్ ఇంట్లో పని మనుషులుగా చేరిన నేపాలీ జంట.. ఆ ఇంటికే కన్నం పెట్టారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. సుమారు రూ. 18 కోట్ల విలువైన ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. నిందితులు నేపాల్ సరిహద్దు దాటి వెళ్లే అవకాశం ఉండటంతో బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దీంతో, ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని మారతహళ్లి పరిధిలో యెమలూరు కెంపాపుర నివాసి, బిల్డర్ షిమంత్ అర్జున్ ఇంట్లో ఆదివారం దొంగతనం జరిగింది. దాదాపు రూ.18 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, వెండి నగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఇంటి యజమాని షిమంత్ తన భార్య పిల్లలతో ఓ భూమి పూజ కార్యక్రామానికి వెళ్లగా అదే అదనుగా ఇంట్లో పనిమనుషులుగా ఉన్న నేపాలి జంట దినేష్, కమలా మరో నేపాలితో కలిసి చోరీకి పాల్పడ్డారు. షిమంత్ కుటుంబం బయటికి వెళ్లినప్పుడు మొదటి అంతస్తులోని బెడ్ రూంలో చొరబడి లాకర్ పగలగొట్టి 1.5 కిలోల బంగారం, దాదాపు 5 కిలోల వెండి ఆభరణాలు, రూ.11.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారని పోలీసులు గుర్తించారు.యజమానులు తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లై ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. అయితే, వీరు గత కొంతకాలంగా సదరు బిల్డర్ ఇంట్లో పని మనుషులుగా ఉంటూ యజమానికి నమ్మకంగా ఉంటున్నారు. ఇంటి గురించి పూర్తి అవగాహన ఉండటంతో, వీరు అతి సులువుగా లాకర్లను గుర్తించి చోరీకి పాల్పడ్డారు. నేరం చేసిన వెంటనే వారు సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్తపడి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ టీవీ కెమెరాల పరిశీలించి నిందితులకోసం గాలిస్తున్నారు. యజమానుల ఇంట్లో పనిమనుషులు చేసిన అతిపెద్ద దొంగతనాల్లో ఇదే పెద్దదని పోలీసులు అంటున్నారు.కాగా, నిందితులు నేపాల్ సరిహద్దు దాటి వెళ్లే అవకాశం ఉండటంతో, బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. పని మనుషులను పెట్టుకునే ముందు వారి నేపథ్యాన్ని తనిఖీ చేయాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో భూముల ‘రీ సర్వే’పై చంద్రబాబు దొంగాట... అప్పుడు దుష్ప్రచారం చేసి ఇప్పుడు క్రెడిట్ చోరీ కోసం పాకులాట
-
లేడీ కిలాడీలు.. సీసీ ఫుటేజ్‌లో షాకింగ్ దృశ్యాలు
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ చోరీ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కస్టమర్లుగా నటిస్తూ గోల్డ్ షాప్‌కు వెళ్లిన మహిళలు చోరీకి పాల్పడ్డారు. ముగ్గరు మహిళలు కేవలం 14 నిమిషాల్లోనే రూ.14 లక్షల విలువైన బంగారు చెవి పోగులు దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రయాగ్‌రాజ్‌లోని కల్యాణ్ జువెలర్స్ షోరూమ్‌లో డిసెంబర్ 31 2025న ఈ ఘటన జరిగింది.ఆభరణాలు కొనేందుకు కస్టమర్లుగా వెళ్లిన ముగ్గురు మహిళలు.. సేల్స్‌మెన్ వారికి బంగారు ఆభరణాలను చూపించడంలో బిజీగా ఉన్న సమయంలో షోకేస్‌లో ఉన్న చెవిపోగుల డిస్ప్లే ప్యాడ్‌ను దొంగలించారు. ఎవరికీ కనిపించకుండా దుస్తుల్లో దాచి అక్కడ నుంచి వెళ్లిపోయారు. కేవలం 14 నిమిషాల్లోనే పనిపూర్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.డిస్ప్లే ప్యాడ్ కనిపించకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఈ వ్యవహారం బయటపడింది. జువెలర్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళల్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.इन महिलाओं ने बड़ा हाथ मारा है. कल्याण ज्वेलर्स से 14 लाख के गहने चुराए.प्रयागराज स्थित कल्याण ज्वेलर्स में ये चोरी हुई है. चार महिलाओं ने सेल्समैन को बातों में उलझाए रखा और मौका मिलते ही गहना चोरी कर लिया. पूरी घटना CCTV में कैद है. pic.twitter.com/mhmYetbwEh— Priya singh (@priyarajputlive) January 7, 2026ఈ ఘటనపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. సేల్స్‌మన్‌ను దృష్టి మళ్లించి, షాప్‌లో ఆభరణం దాచడం సినిమా సన్నివేశంలా ఉందంటూ ఒకరు.. సెక్యూరిటీ గార్డ్‌తో పాటు, సీసీటీవీని గమనిస్తూ వెంటనే అలర్ట్ చేసే వ్యక్తిని కూడా నియమించాలంటూ మరొకరు సూచనలు ఇస్తున్నారు. మరో నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ.. అది కూడా ఒక స్కిల్‌నే, దాంతో సంపాదించనివ్వండి.” అంటూ కామెంట్ పెట్టారు. -
TS: వెంకటేశ్వర ఆలయంలో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువ చేసే..!
-
KPHB: ఆలయంలో భారీ చోరీ.. గర్భగుడి తాళాలు పగులగొట్టి..
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ పటేల్ నగర్‌లోని ఆలయంలో చోరీ జరిగింది. వెంకటేశ్వరస్వామి ఆలయంలో గర్భగుడి తాళాలు పగులగొట్టి విగ్రహానికి ఉన్న నగలు అపహరించారు. సుమారు రూ.30 లక్షల విలువ చేసే 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 3 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుడిలోకి ప్రవేశించి చోరీ చేసినట్లు గుర్తించారు.తెల్లవారుజామున రోజు వారిలానే ఆలయాన్ని తెరిచి పూజలు నిర్వహించే క్రమంలో పూజారులు గుర్తించారు. వెంటనే ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎరక్కపోయి.. ఇరుక్కుపోయాడు!
కోటా (రాజస్థాన్): అది ఆదివారం రాత్రి.. రాజస్థాన్‌లోని కోటా నగరంలో సుభాష్ కుమార్ రావత్ తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లి ప్రశాంతంగా ఇంటికి తిరిగి వచ్చారు. తాళం తీసి లోపలికి వెళ్లిన ఆ దంపతులకు గుండె ఆగినంత పనైంది. గాలి కోసం పెట్టిన ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఒక వింత ఆకారం వేలాడుతూ కనిపించింది. సగం లోపల.. సగం బయట! నేలకి పది అడుగుల ఎత్తులో.. తల, చేతులు ఇంట్లోకి వచ్చి ఉన్నాయి.. కాళ్లు మాత్రం బయట గాలిలో ఊగుతున్నాయి. సరిగ్గా గమనిస్తే అర్థ్ధమైంది.. ఆ ఆకారం ఒక ’దొంగ’ ప్రబుద్ధుడిదని.. ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం గుండా దూరి లోపలికి రావాలని ప్రణాళిక వేసి, నడుము భాగం దగ్గర గట్టిగా ఇరుక్కుపోయాడు. పాపం, అటు లోపలికి రాలేక, ఇటు బయటకి వెళ్లలేక బావురుమన్నాడు. ఇరుక్కుపోయినా తగ్గని ’ఈగో’!రావత్ దంపతులు తేరుకుని, ‘ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు?’.. అని గట్టిగా అరిచారు. సాధారణంగా దొంగలు దొరికిపోతే కాళ్లావేళ్లా పడతారు. కానీ మన దొంగ రూటే వేరు! ఇరుక్కుపోయినా కూడా, ఇంటి యజమానులనే బెదిరించడం మొదలుపెట్టాడు. ‘నన్ను ఇప్పుడే వదిలేయండి. నా మనుషులు బయటే ఉన్నారు.. నన్నేమై నా చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు!’.. అంటూ బడాయిలు పోయాడు. కానీ, అసలు విషయం ఏంటంటే.. అసలు దొంగ ఇరుక్కుపోవడం చూసి, బయట కాపలా ఉన్న కొసరు దొంగలంతా తమ కారు వదిలేసి మరీ పరారయ్యారు.ఏడుపులంకించుకున్న దొంగోడు వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అతన్ని బయటకి తీయడం పెద్ద సాహసమే అయిపోయింది. బయట ఒక కానిస్టేబుల్ నెట్టడం, లోపల ఇద్దరు పోలీసులు లాగడం.. ఈ క్రమంలో మన దొంగ గారు నొప్పితో విలవిల్లాడుతూ, ఏడుస్తూ పెట్టిన కేకలు చుట్టుపక్కల వారికి మాత్రం వినోదాన్ని పంచాయి. ఎట్టకేలకు అతన్ని బయటకు తీసి, సంకెళ్లు వేసి స్టేషన్‌కు తరలించారు. దొంగలు వచ్చిన కారు మీద ’పోలీస్’ అని స్టిక్కర్ ఉండటం విశేషం. ఇప్పుడు పోలీసులు.. ఆ కారు ఎక్కడిది? ఆ దొంగ వెనుక ఉన్న ముఠా ఎక్కడ? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
‘సంక్రాంతికి ఊరెళ్తున్నారా’.. ఇలా చేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే!
సాక్షి,హైదరాబాద్: కొత్త ఏడాది రాకతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వాతావరణ నెలకొంది. ఇప్పటికే సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పట్టణాలు వదిలి పల్లెలకు వెళ్లేందుకు సర్వం సిద్దం చేసుకున్నారు. పండుగకు కావాల్సిన కొత్తబట్టలు, బంగారం, ఇతర వస్తువుల్ని కొనుగోలు చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు సోషల్ మీడియా వేదికలపై తమ ఊరిలో సంక్రాంతి పండుగ సంబరాలపై షార్ట్స్,సెల్ఫీలతో పాటు ఇతర వివరాల్ని షేర్ చేస్తూ ఆనందాన్ని నెటిజన్లతో పంచుకుంటున్నారు. అయితే, అలా చేయొద్దని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పండక్కి ఊరెళ్తె మూడో కంటికి కనపడకూడదని సూచిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా చాలా మంది ఊర్లకు వెళ్లే అవకాశం ఉండటంతో దొంగలు ఈ సమయాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ప్రజలు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ ఏర్పాట్ల గురించి ఆయన మాట్లాడారు.సీసీ కెమెరాలుసైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాలను అమర్చారు. వీటి సహాయంతో అనేక నేరాలను ఛేదించాం. ప్రజలు కూడా తమ కాలనీలు, ఇళ్లు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.ఇళ్ల భద్రతా చర్యలు ఊర్లకు వెళ్లే వారు ఇంట్లో ఒక గదిలో లైటు వేసి ఉంచడం, తలుపులకు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేయడం, బీరువా తాళాలను ఇంట్లో ఉంచకుండా వెంట తీసుకెళ్లడం వంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా, ఇంటి ముందు చెత్త, దినపత్రికలు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా చూసుకోవాలని, లేకపోతే దొంగలు ఇంట్లో ఎవరూ లేరని గుర్తించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.వాహనాల భద్రత విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో లేదా కార్లలో ఉంచకూడదు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఇంటి ఆవరణలోనే పార్క్ చేయాలని, బయట రోడ్లపై పార్క్ చేయకూడదు. వాహనాలకు హ్యాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ కూడా వేయండి. ఇంట్లో బంగారు నగలు,నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం మంచిది. ఎక్కువ రోజులు ఊర్లకు వెళ్లేవారు వాటిని వెంట తీసుకెళ్లాలి. ప్రయాణ సమయంలో బ్యాగుల్లో నగలు, డబ్బు పెట్టుకున్నప్పుడు వాటిని దగ్గరలో ఉంచుకోవాలి. బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరించే అవకాశం ఉంది.టెక్నాలజీ ఆధారిత భద్రత ఇళ్లలో టైమర్‌తో కూడిన లైట్లు, మోషన్ సెన్సర్ లైట్లు అమర్చుకోండి. హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా మొబైల్ నుంచే ఇంటిని ప్రత్యక్షంగా గమనించే అవకాశం ఉంది. డీవీఆర్‌లను ఇంటి లోపల రహస్య ప్రదేశంలో అమర్చుకోవాలి. ప్రజలు తమ ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటుకు సహకరించాలని, పోలీస్ స్టేషన్ నంబర్లు, బీట్ కానిస్టేబుల్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి. కాలనీల్లో కమిటీలు ఏర్పాటు చేసి వాచ్మెన్లను నియమించుకోవాలని, కొత్త వ్యక్తుల కదలికలను గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వాలిసోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త ప్రజలు సోషల్ మీడియాలో తమ ప్రయాణ వివరాలను షేర్ చేయకూడదు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ చిరునామా, ఫోన్ నంబర్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేయాలి. దీంతో వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేయగలం. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి, పోలీసులతో సమన్వయం చేస్తే చోరీలను నియంత్రించడం సులభమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించి వెంటనే 100 డయల్, సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 9490617444 కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఏఐ పొట్ట కొట్టింది.. డిజైనర్ దారి తప్పాడు
ఒకవైపు ఆధునిక ప్రపంచం ’ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్’ విజయాలను వేడుక చేసుకుంటుంటే.. అదే టెక్నాలజీ ఒక 18 ఏళ్ల కుర్రాడి పొట్ట కొట్టింది. చేతిలోని పనిని ఏఐ లాగేసుకోవడంతో, ఆకలి తట్టుకోలేక ఆ యువకుడు తన స్నేహితురాలితో కలిసి చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డారు. ఏం జరిగిందంటే? ఇండోర్‌లోని రావు పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 22వ తేదీ రాత్రి ఒక నగల దుకాణంలో సుమారు రూ.16 లక్షల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు చోరీ అయ్యాయి. ఈ కేసును ఛేదించిన పోలీసులు, భోపాల్‌లో తలదాచుకున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు 18 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్ కాగా, మరొకరు డాక్టర్ కావాలని కలలు కంటూ ’నీట్’ పరీక్షకు సిద్ధమవుతున్న యువతి. ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమా స్ఫూర్తితో.. డీసీపీ శ్రీకృష్ణ లాల్చందాని తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఇద్దరూ చిన్నప్పటి స్నేహితులు. మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. 2005లో వచి్చన ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమా చూసి స్ఫూర్తి పొందారు. ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక వేసుకుని ఈ చోరీకి పాల్పడ్డారు. బతకడం కష్టమై తప్పు చేశా.. పోలీసుల విచారణలో.. ‘నేను ఒక ఐటీ కంపెనీలో పార్ట్ టైమ్ గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేసేవాడిని. కానీ కంపెనీ వాళ్లు ఏఐ టెక్నాలజీని వాడటం మొదలుపెట్టి, నా ఉద్యోగం తీసేశారు. చేతిలో పైసా లేక, బతకడం కష్టమై ఈ దారి ఎంచుకున్నాను’.. అని ఆ యువకుడు కన్నీళ్లు పెట్టుకోవడం కలచివేసింది. దొంగతనం చేసిన నగలను అమ్మడానికి వారు ప్రయతి్నంచారు కానీ, చూడ్డానికి చిన్నపిల్లల్లా ఉండటంతో ఎవరూ వాటిని కొనడానికి ముందుకు రాలేదు. తక్కువ ధర కోట్ చేయడంతో, క్రిస్మస్ సెలవుల తర్వాత నిదానంగా అమ్ముదామని వేచి చూస్తుండగా పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం పోలీసులు వారి దగ్గర నుండి నగలను స్వా«దీనం చేసుకున్నారు. సాంకేతికత తెచి్చన మార్పు ఒక యువకుడిని నేరస్తుడిగా మార్చడం.. నేటి సామాజిక సంక్షోభానికి అద్దం పడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో ఏం జరిగినా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని.. ఏ ఘటన జరిగినా టీటీడీ బోర్డుదే బాధ్యత అంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. కానుకల లెక్కింపులో పారదర్శకత ఉండాలన్న ధర్మాసనం.. టెక్నాలజీని వినియోగించుకోవాలని హైకోర్టు సూచించింది.టీటీడీ పరకామణి చోరీ కేసు పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ(డిసెంబర్ 19, శుక్రవారం) విచారణ చేపట్టింది. పరకామణి లెక్కింపు వ్యవహారంలో గత విచారణలో సలహాలు ఇవ్వమన్న దానిపై ఏమైనా సలహాలు ఇస్తారా అంటూ టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. కానుకల లెక్కింపు,పర్యవేక్షణ, రికార్డుల సేకరణ కోసం AI టెక్నాలజీ, కంప్యూటర్స్ వినియోగించాలని పేర్కొంది. చివరి పైసా వరకు లెక్క సరిగ్గా ఉండాలని.. చోరీలు, మోసాలు జరగకుండా చూడాలని హైకోర్టు చెప్పింది.టీటీడీ బోర్డ్ వెంటనే వీటిపై చర్యలు చేపట్టాలని.. ఒక ముసాయిదా రూపొందించాలని పేర్కొంది. రెండు వారాల్లోగా దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. టీటీడీ బోర్డు 8 వారాల్లోగా ప్లాన్ B పై నివేదిక సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. -
191 ఎట్ 52!
అతడి పేరు మహ్మద్ సలీం... మారుపేరు సునీల్‌శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు. 52 ఏళ్ల వయస్సున్న ఇతగాడు 34 ఏళ్ల నేర ప్రస్థానంలో 191 చోరీలు చేశాడు... ఇప్పటివరకు 26 సార్లు పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్లాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడుతున్న ఇతగాడిని హైదరాబాద్‌లోని బండ్లగూడ పోలీసులు డిసెంబర్ 2న మరోసారి పట్టుకున్నారు. చోరీల ద్వారా వచ్చిన సొమ్మును ఇతగాడు ఉత్తరాదిలో జల్సాలతో పాటు హెలీటూరిజానికి వెచ్చిస్తుంటాడు. హైదరాబాద్‌లోని ఫతేదర్వాజా సమీపంలో ఉన్న కుమ్మరివాడికి చెందిన సలీం పూర్తి నిరక్షరాస్యుడు. బతుకుతెరువు కోసం తొలినాళ్లల్లో కిరోసిన్ లాంతర్లు తయారు చేసే కర్మాగారంలో పనివాడిగా చేరాడు. ఆపై తన తండ్రి నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. ఇలా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో పరిచయమైంది. అక్కడ నుంచి అతడి జీవితం మలుపులు తిరగడం మొదలైంది. ఈ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం చోరుడిగా మారాడు. తొలుత తమ దుకాణంలోనే చిన్న చిన్న చోరీలు చేయడం మొదలెట్టాడు. కొన్నాళ్లు గుట్టుగానే సాగినా, చిరవకు విషయం బయటకు పొక్కేసరికి ఇల్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. దీంతో గత్యంతరం లేక చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్లో కార్మికుడిగా చేరాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న గృహోపకరణాలు తస్కరించేవాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెలకువలు నేర్చుకున్నాడు. ఈ చోరుడు ప్రధానంగా పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్లనే టార్గెట్‌గా చేసుకునేవాడు. అందుకే గడిచిన మూడుసార్లూ బండ్లగూడ పోలీసుస్టేషన్లో నమోదైన కేసుల్లోనే అరెస్టు అయ్యాడు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే ఇతగాడు తెల్లవారుజాము 4 గంటల తర్వాతే రంగంలోకి దిగుతాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్‌ఫోన్‌లో లూడో, క్రికెట్ ఆడుతూ టైమ్‌పాస్ చేస్తాడు. చిన్న టార్చ్‌లైట్, కటింగ్ ప్లేయర్‌తో ఫీల్డ్‌లోకి వచ్చే ఇతగాడు ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్ వాహనాలు ఆ ప్రాంతానికి వచ్చినా ఇంటి తాళం యథాతథంగా ఉండటంతో వారు ఆ ఇంటిపై దృష్టిపెట్టరనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటాడు. టార్గెట్ చేసిన ఇంటి లోపలకు వెళ్లాక అక్కడ దొరికే చెంచాలు తదితరాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. ఇతగాడు 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్నాడు. సునీల్‌శెట్టి ప్రస్తుతం ఏడుగురి పిల్లలకు తండ్రి. ఈ సొత్తు విక్రయించగా వచ్చిన సొమ్ముతో ముంబై, అజ్మీర్ సహా ఉత్తరాదిలో జల్సాలు చేస్తుంటాడు. సైట్ సీయింగ్‌తో పాటు హెలీకాఫ్టర్లో సంచరించే హెలీటూరిజం కోసం భారీగా ఖర్చు చేస్తాడు. సెక్స్‌వర్కర్ల వద్దకు వెళ్ళే అలవాటు ఉన్న సలీం ఓసారి రూ.12 లక్షల చోరీ సొత్తుతో ముంబైలోని ఓ మహిళ వద్దకు వెళ్లాడు. ఇతడు నిద్రపోతున్న సమయంలో ఆ సొత్తు కాజేసిన ఆమె అక్కడ నుంచి ఉడాయించింది. బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి అంటే అమితంగా ఇష్టపడే సలీం తన పేరునూ అలానే మార్చుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆ హీరో ఇంటి వద్దకు అనేకసార్లు వెళ్లినా కలవడం సాధ్యం కాలేదు. ఇప్పటి వరకు 191 నేరాలు చేసి 26 సార్లు అరెస్టు అయినా, శిక్షలు పూర్తయ్యే వరకు జైలు నుంచి బయటకు రాని నేపథ్యంలోనే ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగం అనేక సందర్భాల్లో సాధ్యం కాలేదు. పోలీసులకు చిక్కిన ప్రతిసారీ ఐదారు చోరీలు అంగీకరిస్తున్నా, ఇన్నేళ్లల్లో కేవలం రెండుసార్లే ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగం సాధ్యమైంది. -
హుండీ నగదు లెక్కింపులో టీడీపీ కార్యకర్త చేతివాటం
సాక్షి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ: కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ నగదు లెక్కింపులో ఓ సేవకుడు చేతివాటం చూపించాడు. స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు కోసం రామచంద్రపురం మండలం వేగాయమ్మ పేటకు చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావు వచ్చాడు.అనపర్తి మాణిక్యాంబ సమేత భీమేశ్వర సేవా సంఘం సభ్యుడిగా నగదు లెక్కింపులో శ్రీనివాసరావు పాల్గొన్నాడు. అయితే భోజన విరామ సమయంలో 25000 తస్కరించి బయటికి వెళ్తుండగా గార్డులు పట్టుకున్నారు. దాంతో తన ద్విచక్ర వాహనం కూడా తనిఖీ చేశారు. అందులో కూడా మరో ముప్పై ఐదు వేలు నగదును సిబ్బంది గుర్తించారు. మొత్తం రూ. 60,000 హుండీ సొమ్మును శ్రీనివాసరావు దొంగతనం చేసినట్టు అధికారులు నిర్ధారించారు. అనంతరం వాడపల్లి ఆలయ ఈవో చక్రధర్ రావు శ్రీనివాసరావును పోలీసులకు అప్పగించారు. ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు ఆత్రేయపురం పోలీసులు తనపై కేసు నమోదు చేశారు.హుండీ లెక్కింపులో చేతివాటానికి పాల్పడిన శ్రీనివాసరావు టిడిపి కార్యకర్తగా గుర్తింపుకార్తీక మాసంలో పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో నెలరోజుల కార్యక్రమాల పర్యవేక్షణకు మంత్రి సుభాష్ వేసిన అనధికార కమిటీలో సభ్యునిగా శ్రీనివాసరావు కొనసాగినట్టు సమాచారం. ప్రముఖ ఆలయాల హుండీలు లెక్కింపునకు సేవకునిగా శ్రీనివాసరావు వెళ్తున్నాడు. కాగా గతంలోనూ టిడిపి హయాంలో వాడపల్లి ఆలయంలో ట్రస్ట్ బోర్డు సభ్యుడు చేతివాటం ప్రదర్శించాడు. -
గలీ గలీ మే చోర్ హై!
పోలీసింగ్ వ్యవస్థ ఇప్పుడు టెక్నాలజీని మాగ్జిమమ్ వాడేసుకుంటోంది. అయినా కూడా.. దొంగల చేతిలో తాళాలు విరిగిపోతూనే ఉన్నాయి. కళల్లో చోరకళ ఒకటి అంటారు కదా!. దేశంలో ఎన్ని కళలు అంతరించిపోతున్నా.. చోర కళ మాత్రంకు అలాంటి దుస్థితి వచ్చే అవకాశమే కనిపించడం లేదు. నేరగణాంకాల నివేదిక ఒకటి ఈ విషయాన్నే బల్లగుద్ది మరీ చెబుతోంది. ప్రతి లక్ష మందికి సగటున 49.5(50 అనుకోండి ఇక) చోరీకి గురవుతున్నారట. ఆ వివరాలేంటో కాస్త లోతుగా చూద్దాం..చోర కళకు స్వర్గధామంగా (పోలీసుల పరిభాషలో హాట్‌స్పాట్ అని అందురు).. మహారాష్ట్ర (70.4), రాజస్థాన్ (50.9), మధ్యప్రదేశ్ (41.0) వంటి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ (42.5), బీహార్ (37.5), కర్ణాటక (36.8), ఒడిశా (36.3) కూడా జాతీయ సగటు దరిదాపుల్లో కేసులు నమోదు చేస్తున్నాయి.చండీగఢ్, ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో స్వేచ్ఛగా సంచరించే అవకాశం దొంగలకు కలుగుతోంది. సగటును పరిశీలిస్తే.. లక్ష మందికి చండీగఢ్‌లో 114.3 కేసులు, ఢిల్లీలో 106.3 కేసులు నమోదు అవుతున్నాయి. అంటే ఇవి దేశ సగటు కంటే రెండింతలు ఎక్కువన్నమాట!. ప్చ్.. ఈ విషయంలో చిన్న రాష్ట్రాలు ఏం వెనకబడిపోలేదు. మిజోరాం (94), మణిపూర్ (74.1) లాంటి ఈశాన్య ప్రాంతాలు కూడా దొంగల బారిన పడుతున్నాయి.అయితే.. కొన్ని రాష్ట్రాలు మాత్రం చోర కళకు చిక్కులు తప్పడం లేదు. తమిళనాడు (23.1), కేరళ (13.1), పశ్చిమ బెంగాల్ (9.4), సిక్కిం (6.7) లాంటి ప్రాంతాలు తక్కువ కేసులతో పాపం.. ఈ జాబితాలో అట్టడుగున నిలిచాయి. అంటే, అక్కడి పోలీసింగ్ వ్యవస్థ అంత బలంగా ఉందన్నమాట. ప్చ్.. లడఖ్ (5.0), దమన్ & దీయూ, డిఎన్హెచ్ (10.0), అండమాన్ & నికోబార్ (16.1), లక్షద్వీప్ (29.0) వంటి ప్రాంతాలు కూడా తక్కువ కేసులు నమోదు చేస్తున్నాయి. అయితే పర్యాటక ప్రాంతమైన గోవా (29.2), గుజరాత్ (29.6)లకు దొంగల పరిస్థితి కాస్త అటు ఇటుగానే నడుస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాల స్థాయి మధ్యస్థంగా ఉంది. తెలంగాణలో ప్రతి లక్ష మందికి సగటున 42.5 కేసులు నమోదవుతున్నాయి. ఇది దేశ సగటు (49.5) కంటే కొంచెం తక్కువ అయినప్పటికీ.. మధ్యస్థాయి ప్రమాదంగా పరిగణించొచ్చు. అలాగే.. అర్బన్ భద్రతా వ్యవస్థకు సవాలుగా మారే అవకాశమూ లేకపోలేదు. ఇక ఏపీ విషయానికొస్తే.. సాధారణంగా దేశ సగటు కంటే కాస్త తక్కువ స్థాయిలోనే కేసులు(23.4) నమోదవుతున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి పట్టణాల్లో దొంగతనాలు ఎక్కువగా నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం దొంగలు తమ చేతి వాటం తక్కువే ప్రదర్శిస్తున్నారని తేలింది.పై లెక్కలు చూస్తే.. మనం ఊహించేంత సురక్షితంగా మన గల్లీలు అందులో ఉన్న ఇల్లులు.. మనమూ లేమన్న మాట. సమర్థవంతమైన పోలీసింగ్‌కు ప్రజల భాగస్వామ్యం చేరినప్పుడు.. అదే సమయంలో సామాజిక సమస్యల పరిష్కారం కలిసినప్పుడే దొంగతనాలు పూర్తిగా కట్టడి అవుతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతూనే ఉన్నారు. -
రూ.7.5 కోట్ల ఏటీఎం నగదు చోరీ కేసు.. ఛేదించిన పోలీసులు
సాక్షి, చిత్తూరు జిల్లా: బెంగళూరు ఏటీఎం వ్యాన్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఏపీలోని కుప్పంలో తనిఖీలు నిర్వహించిన కర్ణాటక పోలీసులు.. కూర్మానీపల్లెలో రూ. 7.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. నవీన్ అనే యువకుడి ఇంట్లో నగదు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా నిందితులు నగదును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుస్తూ.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పంలో నగదును మారుస్తున్న క్రమంలో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అధికారులమంటూ ఏటీఎం కరెన్సీ వ్యాన్ సిబ్బందిని నమ్మించి ఏకంగా రూ.7.5 కోట్ల కరెన్సీ కట్టలను దోచుకెళ్లిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలే చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం(నవంబర్ 19) మధ్యాహ్నం 12.24 గంటలకు జేపీ నగర్ హెచ్డీఎఫ్సీ కరెన్సీ చెస్ట్ నుంచి రూ.7.5 కోట్ల విలువైన కరెన్సీ కట్టలను తీసుకుని వేర్వేరు ఏటీఎంలలో నింపేందుకు బయల్దేరిన సీఎంఎస్ ఇన్నో సిస్టమ్స్ వారి ఏటీఎం క్యాష్‌వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అశోకా పిల్లర్ వద్ద అడ్డగించారు.ప్రభుత్వ స్టిక్టర్ అంటించి ఉన్న ఖరీదైన ఎస్యూవీ వాహనంలో దిగిన ఆ దొంగలు తాము ఆర్బీఐ ఉన్నతాధికారులమంటూ నమ్మబలికారు. డాక్యు మెంట్లను వెంటనే క్షుణ్ణంగా తనిఖీ చేయాలంటూ కస్టోడియన్ అఫ్తాబ్, గన్‌మెన్ రాజన్న, తమ్మయ్యలనూ తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. తమ వాహనాన్ని అనుసరించాలని ఏటీఎం క్యాష్ వాహన డ్రైవర్‌కు సూచించారు. డైరీ సర్కిల్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే పిస్టల్ చూపించి డ్రైవర్‌ను బెదిరించి కరెన్సీ కట్టలు తీసుకుని ఉడాయించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కేసును కర్ణాటక పోలీసులు ఇవాళ ఛేదించారు. -
యాపిల్‌కేర్ ప్లస్ ప్లాన్‌లో కొత్త ఫీచర్లు
ఐఫోన్లు పోయినా, చోరీకి గురైనా కూడా కవరేజీ వర్తించేలా టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో తమ యాపిల్‌కేర్ ప్లస్ ప్లాన్ పరిధిని విస్తరించింది. ఏడాదిలో రెండు ఉదంతాలకు ఇది వర్తిస్తుంది. ఇది ఇప్పటికే కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. ప్రస్తుతం ప్రమాదవశాత్తూ దెబ్బతిన్న డివైజ్‌ని అపరిమిత స్థాయిలో రిపేర్ చేయించుకునేందుకు ప్రొటెక్షన్ ప్లాన్ కింద కవరేజీ ఉంటోంది.యాపిల్‌కేర్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఇప్పటికే వార్షిక ప్రాతిపదికన ఉండగా, తాజాగా నెలవారీ ప్లాన్‌ని కూడా ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఇది డివైజ్‌ని బట్టి రూ. 799 నుంచి ప్రారంభమవుతుందని వివరించింది. ఇక డివైజ్ కొనుక్కున్నప్పుడే ప్లాన్ కూడా తీసుకోవాలన్న నిబంధనను సడలిస్తూ, 60 రోజుల వరకు వ్యవధినిస్తున్నట్లు తెలిపింది. కొత్త ఫీచర్లుఐఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా కవరేజీ ఉంటుంది.ఏడాదిలో రెండు ఘటనలకు వర్తిస్తుంది.ప్రమాదవశాత్తూ దెబ్బతిన్న డివైజ్‌కి అపరిమిత రిపేర్లు అందుబాటులో ఉంటాయి.ఇప్పటి వరకు వార్షిక ప్రాతిపదికన మాత్రమే ఉండగా, ఇప్పుడు నెలవారీ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.నెలవారీ ప్లాన్ ధర రూ.799 నుంచి ప్రారంభం.డివైజ్ కొనుగోలు చేసిన వెంటనే మాత్రమే కాకుండా, 60 రోజుల లోపు యాపిల్‌కేర్ ప్లస్ ప్లాన్ తీసుకోవచ్చుగమనించాల్సిన అంశాలుథెఫ్ట్ & లాస్ కవరేజీ కేవలం ఐఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది.సర్వీస్ ఫీజు ఉండే అవకాశం ఉంది. (యాపిల్ సాధారణంగా రీప్లేస్మెంట్ ఫీజు వసూలు చేస్తుంది).ప్లాన్ ధర డివైజ్ మోడల్ ఆధారంగా మారుతుంది. -
దేవుడి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ధూళిపాళ్ల అనుచరుడు
-
నరసరావుపేటలో భారీ చోరీ
నరసరావుపేట రూరల్: పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్లో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగులకొట్టి బీరువాలోని 100 సవర్ల బంగారం, కిలో వెండి, రూ.45వేల నగదు దోచుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... గాడిపర్తి సుబ్బారావు, భారతీదేవి దంపతులు ప్రకాష్‌నగర్‌లో నివసిస్తున్నారు. నాదెండ్ల మండలం గణపవరంలోని కుమార్తె వద్దకు ఈనెల 4న వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. లోనికి వెళ్లి పరిశీలించగా బీరువా తెరిచి ఉంది. బీరువాలోని బంగారం, వెండి వస్తువులు, నగదు కనిపించలేదు. వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఫిరోజ్ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ నమూనాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
నగల దుకాణంలో ‘అమ్మగారికి’ దేహశుద్ధి
నగలు, బట్టల దుకాణాల్లో చేతివాటం చూపించే మహిళా దొంగల గురించి చాలా వీడియోలు చూశాం. కానీ నగల దుకాణంలో చోరీకి ప్రయత్నించి చావు దెబ్బల తిన్న వైనం నెట్టింట వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఒక ఆభరణాల దుకాణంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. నవంబర్ 3న మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన CCTVలో రికార్డయింది. దీని ప్రకారం అహ్మదాబాద్‌లోని రాణిప్ కూరగాయల మార్కెట్ సమీపంలోని బంగారం మరియు వెండి దుకాణంలోకి కస్టమర్‌గా ఒక మహిళ జ్యుయల్లరీ దుకాణంలోకి ప్రవేశించింది. దుపట్టా అడ్డం పెట్టుకుని, అదును చూసి దుకాణ యజమానిపై కారంపొడి చల్లి అందినంతా దోచుకోవాలని ప్రయత్నించింది. కానీ అది కాస్త బెడిసి కొట్టింది. ఊహించని పరిస్థితి ఎదురైంది. మహిళ చోరకళను గుర్తించిన దుకాణదారుడు తక్షణమే అలర్ట్ అయిపోయాడు. వెంటనే లేచి చెంపలు పగలగొట్టేశాడు. 25 సెకన్లలో దాదాపు దాదాపు 20 సార్లు కొట్టాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించి దుకాణదారుడు ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. విచారణ జరుగుతోంని రాణిప్ పోలీస్ స్టేషన్ పిఐ కేతన్ వ్యాస్ తెలిపారు. అమ్మగారికి తగిన శాస్తి జరిగింది, సీన్ సితార్ అయ్యింది అంటు నెటిజన్లు పలు రకాలుగా వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: తండ్రి త్యాగం, కొడుకు సర్ప్రైజ్ : నెటిజనుల భావోద్వేగం In Ahmedabad, a woman tried to rob a jewelry store owner by throwing red chili powder into his eyes.Even after the chili got into his eyes, the owner stood strong.#IPL2026 #Kumbha #Fourthnattawat pic.twitter.com/rAqmVDlVpo— 🦋 KOMAL SINGH🦋 💯 Follow Back (@Singh_Komall) November 7, 2025 -
‘డబ్బులు చెల్లిస్తా.. నన్ను వదిలేయండి సార్’..అమెరికాలో భారత యువతి
వాషింగ్టన్: అమెరికాలో మరో భారత యువతి దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికింది. పైగా తాను దొంగతనం చేయలేదని బుకాయించింది. తీసుకున్న వస్తువులకు డబ్బులు చెల్లించడం మరిచిపోయానంటూ ప్రాధేయపడింది. కావాలంటే ఇప్పుడు తీసుకున్న వస్తువులకు డబ్బులు చెల్లిస్తా. నన్ను వదిలేయండి’ అంటూ చేతులు జోడించి అక్కడి పోలీసుల్ని వేడుకుంది. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ఓ యువతి టూరిస్ట్ వీసాతో అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సమయంలో అమెరికాకు చెందిన ఓ రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ ఓ షాప్‌లో తనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం, అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా.. సదరు షాపు యజమాని ..తన షాపులో ఓ యువతి దొంగతనం చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తు వీడియోలో.. ఆ యువతి ఎలా శిక్ష విధించకుండా వదిలేయమని కోరింది. తాను షాపులు వస్తువుల్ని కొనుగోలు చేశానే తప్పా.. దొంగతనం చేయలేదని, కొనుగోలు చేసిన వస్తువులకు ఇప్పుడే డబ్బులు చెల్లిస్తానని చెప్పడం ఆవీడియోలో చూడొచ్చు. కాగా, ఆ యువతి వివరాలు, ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియాల్సి ఉంది. 👉ఇదీ చదవండి: చేతివాటం చేసే చేటు ఇంతింతకాదయా?కొద్దిరోజుల క్రితం కొద్దిరోజుల క్రితం మనదేశానికే చెందిన ఓ మహిళ అమెరికాలోని ఇల్లినాయిస్లో డిపార్టుమెంటల్ స్టోర్సుకు వెళ్లి.. ఏకంగా 1300 డాలర్ల విలువైన వస్తువులను తస్కరించడానికి ప్రయత్నించిందట. బిల్లు ఎగ్గొట్టి జారుకోవాలని చూస్తే.. చివరికి పోలీసుల పాలైంది. దొరికి పోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? ‘సారీ సర్.. ప్లీజ్ సర్, ఫస్ట్ టైం సర్, క్షమించండి సర్..’ అని కోరినప్పటికీ పోలీసులు ఆమెను కటకటాల వెనక్కు పంపారు. -
చేతివాటం చేసే చేటు ఇంతింతకాదయా?
చేతివాటం అని కొంత మంది ఏదో చులకనగా తేలికపాటి పదాలతో అంటూ ఉంటారు గానీ.. నిజానికి ‘హస్తలాఘవం’ అని గౌరవప్రదంగా అంటే ఆ విద్యలో ఉన్న కళాకౌశలానికి తగిన గుర్తింపు దక్కినట్టు అవుతుంది. అవును మరి.. ‘పిక్ పాకెట్’ లేదా ‘జేబు కత్తిరించుట’ అని చవకబారు భాషలో అనేసినంత మాత్రాన ఆ విద్యలో ఉన్న గొప్పదనం మరుగున పడిపోతుందా?. రెండు వైపులా పదును ఉండి.. పట్టుకున్న చేతినికూడా గాయపరచగల బ్లేడు వంటి చిన్న ఆయుధాన్ని, చాలా ఒడుపుగా రెండువేళ్ల మధ్యలో ఇరికించి పట్టుకుని.. ఎంతో టేలెంట్తో.. రోడ్డు మీద కనిపించిన వారి జేబును డబ్బులు లేదా మనీ పర్సు ఉన్నంత మేర మాత్రమే కత్తిరించడం ఆ విద్యలో మాస్టర్ డిగ్రీ అని చెప్పాల్సిందే. ఆ మాటకొస్తే జేబులు కత్తిరించడం మాత్రమేనా ఏమిటి? దుకాణాల్లో యజమానికి తెలియకుండా సరుకులు కొట్టేయడాలు, సూపర్ మార్కెట్లలో సీసీ కెమెరాల కనుగప్పి సరుకుల్ని మాయచేయడాలూ లాంటి వ్యవహారాలు అనేకం మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాటిని చీప్‌గా చోరీలు అనకూడదు.. ‘కళాకౌశల ప్రదర్శన’ అని అనాలి. అందుకే మనం పొదుగుతున్న పిట్టకు తెలియకుండా గూట్లో గుడ్డును కొట్టేసే మహామహుల్ని గురించి కథలు తయారుచేసుకుని చెప్పుకుంటూ ఉంటాం. నిజానికి చౌర్యం అనేది ఒక ఆర్టు.. చతుష్షష్ఠి కళలలో ఎన్నదగిన ఆర్టు. ఆ పనిచేసేవాళ్లు సదరు ఆర్టుని పెర్ఫార్మ్ చేస్తున్న కళాకారులు! మనకు అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. ఎవరో ఇద్దరు ఆడవాళ్లు బంగారం దుకాణానికి వస్తారు. మంచిగా మాటలు చెబుతూ నగల బేరం ప్రారంభిస్తారు. కొత్త కొత్త డిజైన్లు చూపించమని షాప్ కుర్రాడిని పురమాయిస్తారు. అతను వెనుదిరిగి మరో డిజైన్ అందుకుని చూపించేలోగా, ఆ బల్ల మీద ఉన్న వాటిని ఎంతో ఒడుపుగా తమ దుస్తుల మధ్యలోకి చేరవేస్తారు. కొన్ని క్షణాల వ్యవధిలో వీసమెత్తు తేడా రాకుండా ఎంతో పకడ్బందీగా ఈ కళను ప్రదర్శించాలంటే చాలా చాలా టేలెంట్ ఉండాలి. కానీ మనమేమో దానిని దొంగతనం అంటాం. నాలుగు తగిలించి పంపిస్తాం లేదా పోలీసులకు పట్టిస్తాం. Gujaratis are giving India a bad name internationally. Look at this Gujarati woman who stole 3 jeans, 7 tops, and 5 pairs of underwear from a shop in US. She was later caught with all the items, and her phone wallpaper had an image of Modi.pic.twitter.com/InTIuIzdxt— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) September 7, 2025తమ కళకు, టేలెంట్కు ఇక్కడ స్వదేశంలో అనుకున్న రీతిలో గౌరవం దక్కడం లేదని బాధపడుతున్నవారు ఏం చేయాలి, సాధారణంగా ఏం చేస్తుంటారు?. ఫరెగ్జాంపుల్ ఇంజినీరింగ్, మెడిసిన్ చదివిన వాళ్లు తమ ప్రతిభ మరింతగా రాణించాలంటే.. తమ విద్యతో మరింతగా ఆర్జించాలంటే అమెరికాకు వెళుతున్నారు కదా?. అదేమాదిరిగా మనం చోరకళాకారులు కూడా అమెరికాకు వెళుతున్నారు. అక్కడ తమ హస్తలాఘవాన్ని, కళాప్రావీణ్యాన్ని ప్రదర్శించాలని చూస్తున్నారు. కానీ తమాషా ఏంటంటే.. వారి ఆర్టుకు అమెరికాలో కూడా గౌరవం దక్కడం లేదు. డిపార్టుమెంటల్ స్టోర్సులో, సూపర్ మార్కెట్లలో ఏదో తమకు తోచిన రీతిలో చేతివాటం ప్రదర్శిస్తే.. పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టేస్తున్నారు. మనదేశానికే చెందిన ఓ మహిళ అమెరికాలోని ఇల్లినాయిస్లో డిపార్టుమెంటల్ స్టోర్సుకు వెళ్లి.. ఏకంగా 1300 డాలర్ల విలువైన వస్తువులను తస్కరించడానికి ప్రయత్నించిందట. బిల్లు ఎగ్గొట్టి జారుకోవాలని చూస్తే.. చివరికి పోలీసుల పాలైంది. దొరికి పోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? ‘సారీ సర్.. ప్లీజ్ సర్, ఫస్ట్ టైం సర్, క్షమించండి సర్..’ ఇదే పాట ఆమె కూడా పాడింది గానీ.. పోలీసులు కరుణించలేదు. ఆ పప్పులన్నీ ఉడకవని తేల్చేసి కటకటాల వెనక్కు పంపారు. ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా ఇలాగే చోర కళాప్రదర్శనచేసి దొరికిపోయారు. అమెరికాలో ఈ కళను ‘షాప్ లిఫ్టింగ్’ అని వ్యవహరిస్తారట. అనగా.. స్టోర్సులో వస్తువులు పుచ్చుకుని డబ్బులివ్వకుండా జారుకునే విద్యకు అక్కడి పేరు అది! చదువుకోవడానికి అమెరికా వచ్చిన ఇద్దరు అమ్మాయిలు న్యూజెర్సీలో ఇదే షాప్ లిఫ్టింగ్ కళను పెర్ఫార్మ్ చేస్తుండగా పట్టుకున్నారు. ఆ వీడియో గత ఏడాదంతా మహా వైరల్ అయింది. చూడబోతే మన దేశంలో మాదిరిగానే అమెరికాలో కూడా కళకు సరైన గౌరవం లేదని అనిపిస్తోంది కదా!.గౌరవం లేకపోతే పాయె.. కానీ, ఈ సమస్య అక్కడితో ఆగడం లేదు. భారతదేశానికి చెందిన ఇలాంటి చోరకళాకారులు అడపాదడపా దొరికిపోతుండడం.. అమెరికాకు వెళ్లదలచుకునే వారి వీసాల ప్రక్రియ మీద కూడా ప్రభావం చూపిస్తోందట. చిన్న చిన్న చేతివాటానికి సంబంధించిన కేసులు ఉన్నా సరే.. అలాంటి వారు అమెరికాలో అడుగుపెట్టకుండా వీసాలు నిరాకరించాలని.. భారత్ లోని యూఎస్ ఎంబసీ ఆలోచిస్తున్నదట. వారి జైలుకు పోవడం సరే.. వారి దెబ్బకు మామూలు వాళ్లు కూడా అమెరికాకు వెళ్లాలంటే.. మనల్ని అనుమానంగా చూసే పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. ఇంటి దొంగలు ఇంట్లోనే ఉంటే కొంచెం పరువు దక్కుతుంది బజారున పడి దొంగతనాలు చేస్తే పరువు కూడా బజారుకెక్కుతుంది. చోరకళ అందరికీ అబ్బే విద్య కాదని వారు వాదించవచ్చు గానీ. ఈ అమాయక సమాజం దానిని నేరంగా పరిగణిస్తున్నప్పుడు.. వారు ప్రదర్శించకుండా మౌనంగా ఉండడమే మంచిది. ఏమంటారు?. -ఎం.రాజేశ్వరి👉ఇదీ చదవండి: ‘డబ్బులు చెల్లిస్తా.. నన్ను వదిలేయండి సార్’ -
Sabarimala Theft Case.. మాజీ అధికారి అరెస్ట్
తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో బంగారం చోరీ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధీష్ కుమార్‌ను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)అధికారులు.. సుధీష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని, విచారించిన దరిమిలా ఈ అరెస్ట్ జరిగింది.ఆలయ ద్వారం వద్దనున్న శిల్పాలకు పూత పూసిన పొరలు బంగారంతో తయారు చేసినవని తెలిసినప్పటికీ, సుధీష్ కుమార్ అధికారిక పత్రాలలో వాటిని రాగి పొరలుగా తప్పుగా నమోదు చేసినట్లు దర్యాప్తు అధికారులు కనుగొన్నారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి మహసర్ (అధికారిక రికార్డు)ను ట్యాంపరింగ్ చేసి, బంగారాన్ని దొంగిలించేందుకు సుధీష్ కుమార్ సహాయం చేశాడని సిట్ నిర్ధారించింది. 2019లో శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన సుధీష్ నాడు ఉన్నికృష్ణన్ పొట్టిని దాతగా ఆమోదించారు. దీనికితోడు దేవస్వం బోర్డు ఆ బంగారు పొరలను రాగి పలకలుగా చెప్పాలంటూ ఉన్నికృష్ణన్ పొట్టిని కోరిందని సిట్ గుర్తించింది. అధికారులు శిల్పాలను ట్యాంపరింగ్ చేసినప్పుడు కూడా, సుధీష్ వాటిని రికార్డులలో రాగి పొరలుగా పేర్కొన్నారు.అయితే పొట్టికి ఆ షీట్లు అందకపోయినా, సుధీష్ అతని పేరును రికార్డులలో రాశారని చూపించే ఆధారాలను సిట్ స్వాధీనం చేసుకుంది. సుధీష్ మరో నిందితుడు మురారి బాబుకు ఈ బంగారం చోరీలో సహాయం చేశాడని కూడా దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. సుధీష్ కుమార్‌ను అధికారులు (ఈరోజు) శనివారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం అతనిని తిరిగి కస్టడీకి కోరే అవకాశం ఉందని సమాచారం. -
మ్యూజియంలో దొంగలు పడ్డారు
ఓక్లాండ్ (కాలిఫోర్నీయా): అమెరికాలో చారిత్రక ప్రాధాన్యమున్న దాదాపు 1000 వస్తువులను దుండగులు అపహరించారు. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ మ్యూజియం నుంచి ఈ నెల 15న ఈ వస్తువులను అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన వస్తువులు కాలిఫోర్నీయా చరిత్రకు సాక్ష్యాలుగా భద్రపర్చబడ్డవి అని పేర్కొన్నారు. ఈ చోరీపై దర్యాప్తు జరుగుతోందని మ్యూజియం డైరెక్టర్ లోరీ ఫోగర్టీ తెలిపారు. దొంగలు ఆ వస్తువులను ఎక్కడైనా విక్రయించటానికి ప్రయతి్నస్తే తమకు సమాచారం అందించాలని పురాతన వస్తువులను విక్రయించే మార్కెట్లు, దుకాణాదారులకు విజ్ఞప్తి చేశారు. ‘వారు కొల్లగొట్టింది మ్యూజియాన్ని మాత్రమే కాదు. ప్రజల సంపదను కొల్లగొట్టారు. మన సమాజాన్ని కొల్లగొట్టారు. వాటిని తిరిగి తెచ్చేందుకు ప్రజలు సహకరిస్తారని ఆశిస్తున్నాం’అని లోరీ గురువారం ఆశాభావం వ్యక్తంచేశారు. చోరీకి గురైన వస్తువుల్లో మెటల్ వర్క్ ఆభరణాలు, అమెరికా మూలవాసులు ఉపయోగించిన బుట్టలు, గతంలో కాలిఫోర్నీయా వాసులు నిత్యజీవితంలో వినియోగించిన వస్తువులు, అథ్లెటిక్స్ ట్రోఫీలు తదిర విలువైన వస్తువులు ఉన్నాయి. ‘దుండగులు భవనంలోకి ప్రవేశించి కనిపించిన వస్తువునల్లా తీసుకొని వచ్చిన దారినే వెళ్లినట్లు కనిపిస్తోంది’అని లోరీ తెలిపారు. చోరీకి గురైనవాటిలో ప్రముఖ లోహవస్తువుల కళాకారుడు ఫ్లోరెన్స్ రెస్నికోఫ్ రూపొందించిన అందమైన ఆభరణాలతోపాటు నగిషీలు చెక్కిన వాల్రస్ (సముద్ర జంతువు) దంతాలు ఉన్నాయి. చాలా వస్తువులు కాలిఫోర్నీయా 20వ శతాబ్దపు చరిత్రను తెలియజేసేవేనని లోరీ తెలిపారు. వాటిని ఇప్పటికే అమ్మేసి ఉంటారు చోరీ జరిగి ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయినందున దొంగలు వాటిని ఎక్కడో ఓ చోట అమ్మేసి ఉంటారని లాస్ఏంజెల్స్ పో లీస్ విభాగంలో కెపె్టన్‌గా పనిచేసి రిటైరైన జాన్ రోమెరో అభిప్రాయపడ్డారు. దర్యాప్తు అధికారులు వాటికోసం వస్తువుల రీసేట్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లైన ఈబే, క్రెయిగ్స్లిస్ట్తోపాటు చారిత్రక ప్రాధాన్యమున్న వస్తువులను సేకరించే దుకాణాల్లో వెదకాలని సూచించారు. ‘దోపిడీ చేసినవారు వాటిని అమ్మేసి వెంటనే డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు. వాటి విలువ తెలిసినవారు కాదు’అని పేర్కొన్నారు. -
బంగారు పూత కలశం చోరీ
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని జ్యోతి నగర్ ప్రాంతంలో జైన దేవాలయం గోపురం నుండి సుమారు రూ.40 లక్షల విలువైన బంగారు పూత కలశం చోరీ అయ్యింది. ఆలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నమోదైన చోరీకి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాలివి. జ్యోతి నగర్ ప్రాంత నివాసితులు శుక్రవారం అర్ధరాత్రి భారీ ఎత్తున కర్వా చౌత్ వేడుకల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. నిందితుడు విద్యుత్తీగల ఆధారంగా ఆలయం పైకప్పు ఎక్కి, గోపురం పైకి చేరుకున్నాడు. అక్కడున్న బంగారు పూత కలశాన్ని చోరీ చేసి పారిపోయాడు. అష్ట ధాతువులతో కలశం తయారీ చోరీ అయిన కలశం ’అష్ట ధాతువులు’ (ఎనిమిది లోహాల మిశ్రమం)తో తయారైంది. దీని తయారీకి సుమారు 200 గ్రాముల బంగారం వినియోగించారు. కలశం విలువ సుమారు రూ.35–40 లక్షలు ఉంటుందని అంచనా. కలశం సుమారు 25 నుండి 30 కిలోగ్రాముల రాగి, బంగారు పూతతో తయారైందని పోలీసులు తెలిపారు. చోరీపై ఆలయ కమిటీ అధ్యక్షుడు నీరజ్ జైన్ శనివారం ఉదయం ఈస్ట్ జ్యోతి నగర్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు బృందాలను ఏర్పాటు చేశామని, అతని కదలికలను తెలుసుకోవడానికి సాంకేతిక నిఘా ఉపయోగిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
చావు తెలివి తేటలు
న్యూఢిల్లీ: న్యాయం నుంచి తప్పించుకోవడానికి ఒక దొంగగారు ఎంత దూరం వెళ్లారో తెలుసా? ఏకంగా యమలోకం వరకూ!.. అవును, దొంగతనాలు చేసిచేసి.. విచారణలంటే విసుగొచ్చిన ఒక మహా మేధావేం చేశాడో తెలుసా? తాను చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. రెండేళ్లుగా ’చనిపో యినవాడి’ హోదాలో హాయిగా బతికేస్తున్నాడు. ఈ టెక్నాలజీ ఉంది చూశారూ.. అదిమాత్రం మనోడిని రెండేళ్ల తర్వాత పట్టించేసింది పాపం.కోర్టులు, కేసులు నా వల్లకాదెహే..ఆ ఘనుడి పేరు వీరేందర్ విమల్ (35). ఇతను దొంగతనాలు, తుపాకుల కేసుల్లో రెగ్యులర్ కస్టమర్. కోర్టులో నాన్–బెయిలబుల్ వారెంట్లు వస్తూ ఉంటే, విమల్‌కు ఒళ్లు మండింది. ’ఈ కోర్టులు, పోలీసులు, కేసులు... నా వల్ల కాదసలు! నేను ఇంకో దారి చూసుకోవాలి,’ అనుకున్నాడు. సాధారణంగా మనుషులు చనిపోతే స్వర్గానికి వెళ్తారు. కానీ ఈ వీరేందర్ విమల్ మాత్రం.. న్యాయం నుంచి తప్పించుకోవడానికి చనిపోయినట్లు నటిస్తూ, ’భూలోక స్వర్గానికి’ వెళ్లిపోయాడు!కళ్లు మూసుకుని.. ‘కన్ను మూసినట్లు’ ఇచ్చేశారు2021లో, విమల్ ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. పాత సినిమాల్లో విలన్లు చేసే పనిని, ఈయన ఏకంగా ప్రభుత్వంతోనే చేయించాడు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ జారీ చేసినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్‌ను సృష్టించాడు. ఆ సర్టిఫికెట్లో, ‘ఈ వీరేందర్ విమల్ అనే వ్యక్తి ఇక లేరు, ఆగస్ట్ 24, 2021న మరణించితిరి’ అని ఉంది! కోర్టులో ఆ ’చావు పత్రం’ సమర్పించగానే, జడ్జి గారు కూడా ‘మరణించిన వ్యక్తిని ఏం విచారించగలంలే’ అనుకుని కేసులను క్లోజ్ చేసేశారు. అక్కడ విమల్, ’చనిపోయిన వారి’ జాబితాలో చేరి, హాయిగా బతికేస్తున్నాడు. పోలీసులు కూడా, ‘పాపం, వాడు పోయాడు’ అని సైలెంట్ అయ్యారు.కానీ ట్విస్ట్ ఏంటంటే..పాత ఫైళ్లు దుమ్ము దులిపి చూస్తుంటే.. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) ఆదిత్య గౌతమ్ గారికి డౌటనుమానం వచ్చింది. వెంటనే ’విమల్ మరణ మిస్టరీని తెరిచారు. తీరా చూస్తే.. ‘అసలు చావలేదని.. ఆ మరణ ధ్రువపత్రం అంతా నకిలీది!’ అని తేలింది. పోలీసులేమో... అసలు ఎవడీడు? చావు పేరిట కూడా మమ్మల్ని మోసం చేస్తాడా?’ అని పళ్లు కొరికారు.గోరఖ్‌పూర్‌లో ‘బతికున్న దెయ్యం’పోలీసులు అతన్ని వెతకడానికి.. పాత పద్ధతులు వదిలేశారు. ’క్రైమ్ కుండ్లి’ (బయోమెట్రిక్ డేటాబేస్), ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనే సైన్స్ ఫిక్షన్ టెక్నాలజీని వాడారు. అంతే మనోడు అడ్డంగా దొరికిపోయాడు. విమల్ తాజా ఫొటోని ఆ సాఫ్ట్‌వేర్‌లో పడేయగానే.. ‘ఇతను చనిపోలేదు, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో బిందాస్‌గా బతికేస్తున్నాడు‘ అని చూపించింది! పోలీసులు గోరఖ్‌పూర్ వెళ్ళి, రెండేళ్లుగా ఖుషీఖుషీగా బతికేస్తున్న ఆ ’బతికున్న దెయ్యాన్ని’ పట్టుకుని లోపలేసేశారు.నీతి: దొంగతనాలు చేయకండి. ఒకవేళ చేసినా.. దయచేసి ’చచ్చిపోయినట్లు’ నటించకండి. ఎందుకంటే, ఢిల్లీ పోలీసుల టెక్నాలజీ... మీరెక్కడున్నా జాతకం పట్టిస్తుంది. -
పండుగ పూట పెట్టెతో సహా గోల్డ్ కొట్టేసింది..! వీడియో వైరల్
బంగారం ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయి.కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతూ సామాన్యుడికి అందని ద్రాక్షగా మిగిలిపోతోంది పసిడి. గ్రాము బంగారం కొనాలంటే జనం బెంబేలెత్తుతున్న పరిస్ఙతి. ఈ క్రమంలో ట్విటర్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఒక జ్యుయల్లరీ దుకాణంలో ఒక మహిళ తన చేతివాటి చూపించింది. బంగారం షాపింగ్ చేస్తున్నట్టుగానే నటిస్తూ లక్షలు విలువ చేసే నగను పెట్టెతో సహా దాచేసింది. కానీ విషయం షాపులోనే ఉన్న కెమెరానుంచి మాత్రం తప్పించు కోలేక పోయింది. ఒక ట్విటర్ యూజర్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. బంగారం ధరలు గ్రాముకు రూ 12 వేలు దాటేసింది. ఇలాంటి దొంగతనాలు బాగా పెరిగే అవకాశం ఉంది... ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఎప్పుడూ లేనంతగా అప్రమత్తంగా ఉండాలి! అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. 🚨 With gold prices soaring past ₹12k/gram, theft cases are bound to spike...Jewellers must stay more alert than ever!#UttarPradesh | Bulandshahr: Woman caught on camera stealing..stuffs an entire jewellery box inside her saree 👇 pic.twitter.com/5FRxWAQrA0— Nabila Jamal (@nabilajamal_) October 1, 2025 -
శ్రీవారి హుండీ నుంచి రూ.4వేలు చోరీ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి సమీపంలో ఉన్న స్టీల్ హుండీలో బుధవారం రాత్రి రూ.4వేలు దొంగతనం జరిగింది. దీన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్ విభాగం సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని పట్టుకున్నారు. నేరస్తుడు తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలికి చెందిన వేణుగా గుర్తించారు. నిందితుడు గతంలోనూ పలు చోరీలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ చోరీపై తిరుమల వన్‌టౌన్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. -
Daslakshan Mahaparv: వజ్రాలు పొదిగిన స్వర్ణకలశం చోరీ
న్యూఢిల్లీ: ఎర్రకోట ప్రాంగణం. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే దేశ రాజధానిలోని కీలక చారిత్రక ప్రాంతం. పోలీసుల వలయంగా వినతికెక్కిన అలాంటి చోట సైతం చోరకళను ప్రదర్శించాడు ఒక దొంగ. కోటి రూపాయల విలువైన బంగారు కలశాన్ని కొట్టేసే లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆ దొంగ జైన గురువు వేషధారణలో వచ్చి అలవోకగా కలశాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. సెప్టెంబర్ మూడో తేదీ ఉదయం జరిగిన ఈ చోరీ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెల్సుకున్న పోలీసులు వెంటనే ఆ చోరశిఖామణి వేటలో తలమునకలయ్యారు. వజ్రవైడ్యూరాలు, రత్నాలు, కెంపులు వంటి అత్యంత విలువైన రాళ్లు పొదిగిన ఆ కలశాన్ని భుజానికున్న బ్యాగులో పెట్టుకుని ఉడాయించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జంకులేకుండా వచ్చి మరీ.. ఎర్రకోట ప్రాంగణంలోని 15వ నంబర్ గేట్ వద్ద సెప్టెంబర్ మూడో తేదీ ఉదయం జైనుల సంబంధ మత కార్యక్రమం ‘దస్‌లక్షణ్ మహాపర్వ్’నిర్వహించారు. ఆగస్ట్ 28వ తేదీ నుంచి మొదలై సెప్టెంబర్ 9వ తేదీదాకా జరగనున్న ఈ కార్యక్రమం కోసం సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన సుదీర్జైన్ అనే వ్యాపారి తన సొంత పుత్తడి కలశాన్ని ప్రతిరోజూ తీసుకొచ్చి పూజ తర్వాత ఇంటికి తీసుకెళ్తున్నారు. 760 గ్రాముల బరువైన ఈ కలశానికి చుట్టూతా 150 గ్రాముల బరువైన, అత్యంత విలువైన వజ్రాలు, కెంపులు, మరకతాలు అందంగా అద్ది ఉంటాయి. ఎప్పటిలాగే ఆయన కలశాన్ని తీసుకురాగా ఉదయం 9 గంటల 26 నిమిషాలకు కొందరు ప్రముఖులు కార్యక్రమానికి వచ్చారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం వచ్చి జైన గురువుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీంతో కలశ యజమానిసహా తదితరులు పక్కకు వెళ్లారు. అదే అదునుగా భావించి ఒక దొంగ జైన గురువు వేషధారణలో శ్వేతవర్ణ దుస్తులు ధరించి కార్యక్రమంలో చొరబడ్డాడు. ఎవరూ గమనించని సమయంలో ఆ కలశంతోపాటు మరో కొబ్బరికాయ ఆకారంలోని పాత్ర, మరో బంగారు పాత్రను దొంగ ఎత్తుకుపోయాడు. ఈ తతంగం అంతా అక్కడి గదిలోని సీసీటీవీలో రికార్డయింది. కార్యక్రమం నిర్వాహకుడు పునీత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి గాలింపు చేపట్టారు. అయితే ఈ దొంగ గతంలో ఇదే ఎర్రకోట ప్రాంగణంలో మూడుసార్లు చోరీలు చేసి చాకచక్యంగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దొంగను గుర్తించామని త్వరలనే అతడిని పట్టుకుంటామని ఢిల్లీ పోలీసులు శనివారం తెలిపారు. అయినప్పటికీ ఎర్రకోట ప్రాంగణంలో సరైన పోలీసు భద్రత లేదనే ఆరోపణ మరోసారి తెరమీదకొచ్చింది. ఇటీవల ఎర్రకోట సమీపంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలకు సన్నాహకాల వేళ ఉత్తుత్తి బాంబును సైతం గుర్తించడంలో విఫలమైన కానిస్టేబుల్సహా ఏడుగురు ఢిల్లీ పోలీసులను సస్పెండ్ చేయడం తెల్సిందే. -
‘మమ్మల్ని క్షమించు దేవుడా’.. దోచేసిన సొమ్ముతో పాటు లేఖను వదిలేసిన దొంగలు
సాక్షి,అనంతపురం: దొంగలు దేవుడికి భయపడ్డారు. తప్పైపోయింది. మమ్మల్ని క్షమించు దేవుడా అంటూ దోచేసిన సొమ్ముతో పాటు ఓ లేఖను విడుదల చేశారు. నెలరోజుల క్రితం ప్రముఖ బుక్కరాయసముద్రం శ్రీ శ్రీ ముసలమ్మ పుణ్యక్షేత్రంలో హుండీ చోరీ జరిగింది. ఈ క్రమంలో దోచేసిన నగదును మళ్లీ ఆలయ ఆవరణలో వదిలేసి వెళ్లిపోయారు. అందుకు గల కారణాల్ని వివరిస్తూ డబ్బుతో పాటు ఓ లేఖను విడుదల చేశారు.‘దొంగతనం చేసిన నాటి నుంచి ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగా లేదు. తప్పు తెలుసుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నాం. కొడుకు హాస్పిటల్ ఖర్చుల కోసం డబ్బును వాడుకున్నాం. క్షమించండి’ అంటూ ఆ లెటర్లో పేర్కొన్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో దొంగిలించిన సొమ్ము రూ.లక్షా 86 వేలుగా ఆలయ అధికారులు లెక్కతేల్చారు. హుండీని చోరీ చేసింది ఎవరు? అనేది తేలాల్సి ఉంది.ముసలమ్మ దేవాలయానికి సుదీర్ఘ చరిత్రఇక దొంగతనం జరిగిన ముసలమ్మ దేవాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉండటంతో చర్చకు దారితీసింది. ముసలమ్మ ఆలయానికి సుదీర్ఘ చరిత్రనే ఉంది. మూడు శతాబ్దాల క్రితం బుక్కరాయసముద్రం చెరువు నిండి ఉప్పొంగి కట్టకు భారీగా గండిపడింది. దీంతో చెరువులోని నీరంతా గ్రామంలోకి చొరబడి మునిగిపోతుండగా గ్రామస్తులు గ్రామ సమీపంలో ఉన్న పోలేరమ్మ తల్లిని ప్రార్థించారు. ఆ సమయంలో ‘గ్రామంలో ఉన్న బసిరెడ్డి చిన్నకోడలు ముసలమ్మ ప్రాణత్యాగంతో కట్ట నిలుస్తుంది’ అనే మాటలు వినిపించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న ముసలమ్మ దేవుడిని ప్రార్థిస్తూ గండి పడిన చోట చెరువులోకి దూకింది. దీంతో వరద నీరు నిలిచిపోయిందట. అప్పటి నుంచి ముసలమ్మను ఇలవేల్పుగా గ్రామస్తులు పూజిస్తూ వస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి ప్రాణత్యాగం చేసిన ముసలమ్మకు ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు చేస్తూ వస్తున్నారు. అనంతరం కాలంలో రూ.3 కోట్లు వెచ్చించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
బిట్‌కాయిన్ దోపిడీ కేసు.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఐపీఎస్‌కు జీవిత ఖైదు
అహ్మదాబాద్: 2018 నాటి బిట్‌కాయిన్ దోపిడీ, బిల్డర్కిడ్నాప్ కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే నళిన్ కొటాడియా, మాజీ ఐపీఎస్ అధికారి జగదీశ్ పటేల్ సహా 14 మందికి జీవిత ఖైదు విధించింది. శైలేష్ భట్ అనే బిల్డర్‌ను అపహరించిన ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో పలువురు గుజరాత్ పోలీసు అధికారులు సైతం ఉండటం గమనార్హం.వివరాలు ఇలా ఉన్నాయి.. శైలేష్ భట్, అతడి సన్నిహితులు కలిసి సూరత్‌కు చెందిన ధావల్ మవానీ అనే వ్యక్తి నుంచి రూ.150 కోట్ల విలువైన బిట్ కాయిన్లను దొంగతనం చేసినట్లు నళిన్ కొటాడియా, అతడి బ్యాచ్‌కు సమాచారం అందింది. దీంతో, వారు భట్‌ను దోచుకునేందుకు పథకం వేశారు. ఈ కుట్రలో వారు పలువురు పోలీసు ఉన్నతాధికారులను సైతం కలుపుకున్నారు. ఇందుకు పథకం రచించిన సీబీఐ ఇన్స్పెక్టర్ సునీల్ నాయర్ రూ.5 కోట్లు ముట్టాయి.ఇతర పోలీసులతో కలిసి భట్ దగ్గరున్న అప్పట్లో రూ.12 కోట్ల విలువున్న బిట్కాయిన్లను దౌర్జన్యంగా లాక్కున్నారు. వీరు భట్ నుంచి 200 బిట్కాయిన్లను బలవంతంగా లాక్కోవడంతోపాటు, రూ.32 కోట్లు డిమాండ్ చేశారు. అనంతరం భట్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐడీ క్రైం బ్రాంచి రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు చేపట్టింది. నిందితులుగా తేలడంతో అమ్రేహ్ ఎస్పీ జగదీశ్ పటేల్‌తోపాటు అనంత్ పటేల్ తదితర ఇతర పోలీసు అధికారులను అరెస్ట్ చేసింది. సాక్ష్యాలు, ఆధారాల ఆధారంగా విచారణలో 15 మంది నిందితులకుగాను ఏసీబీ స్పెషల్ కోర్టు 14 మందిని దోషులుగా తేల్చింది. జతిన్ పటేల్‌పై ఉన్న అన్ని ఆరోపణలను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. -
'ఖజానా' కొల్లగొడదామని..
సాక్షి, హైదరాబాద్/చందానగర్: హైదరాబాద్ చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షోరూంపై బందిపోటు దొంగలు పంజా విసిరారు. మంగళవారం ఉదయం షాపు తెరిచే సమయంలోనే తుపాకులతో చొరబడిన ముఠా బంగారం కోసం ప్రయత్నించి గోల్డ్ కోటెడ్ వెండి ఆభరణాలతో పరారయ్యింది. ఈ సందర్భంగా దుండగుల కాల్పుల్లో షోరూమ్ అసిస్టెంట్ మేనేజర్ కాలుకి గాయం కాగా.. సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి. జిన్నారం మీదుగా పారిపోయిన ఈ ముఠాను పట్టుకోవడానికి 20 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి ప్రకటించారు. మాదాపూర్ డీసీపీ వినీత్, మియాపూర్ ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్‌కుమార్ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఉదయం షోరూమ్ తెరిచీ తెరవగానే.. జాతీయ రహదారిపై గంగారం వద్ద ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూంను యథావిధిగా మంగళవారం ఉదయం 10.15 గంటలకు తెరిచారు. ఆ సమయంలో విధులకు హాజరైన 25 మంది సిబ్బందితో రోజూ మాదిరిగానే డిప్యూటీ మేనేజర్ సతీష్‌కుమార్ మాట్లాడుతున్నారు. 10.30 గంటల ప్రాంతంలో ఆ షోరూం వద్దకు మాస్క్‌తో వచ్చిన ఓ ఆగంతకుడు ఫోన్ ద్వారా తన ముఠా సభ్యులకు సమాచారం ఇచ్చాడు. తర్వాత ఐదు నిమిషాలకు రెండు ద్విచక్ర వాహనాలపై మరో ఐదుగురు అక్కడకు చేరుకున్నారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ.. ఒకరు షోరూం బయటనే ఆగిపోగా.. మరొకరు ప్రధాన ద్వారం దగ్గర కాపు కాశారు. మిగిలిన నలుగురూ నేరుగా సిబ్బంది ఉన్న ప్రాంతానికి వచ్చారు. మాస్క్‌లు ధరించి ఉన్న దుండగులను వినియోగదారులని ఉద్యోగులు భావించారు. ఏం కావాలని అడగడానికి ఓ ఉద్యోగి వస్తుండగా తుపాకులు ఉన్న ముగ్గురు దుండగలు ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ డిప్యూటీ మేనేజర్‌ను లాకర్ తాళాలు ఇవ్వాలంటూ బెదిరించారు. ఆయన తన వద్ద తాళాలు లేవని చెప్పడంతో ‘చుప్ బే’అంటూ బెదిరించిన ఓ దుండగుడు అతని ఎడమ కాలుపై కాల్చాడు. షోరూమ్‌లో ఉన్న రెండు సీసీ కెమెరాలను కూడా కాల్చారు. గోల్డ్ కోటెడ్‌వే నిజమైనవి అనుకుని.. ప్రతిరోజూ షోరూమ్ మూసేముందు అదే అంతస్తులోని మెజ్జనైన్ ఫ్లోర్లో ఉన్న లాకర్లో బంగారు ఆభరణాలను భద్రపరుస్తారు. ఉదయం షోరూమ్ తెరిచిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ తాళాలు తీస్తే బంగారు ఆభరణాలను బయటకు తీసువచ్చి కింది ఫ్లోర్లో ఉన్న షో కేసుల్లో సర్దుతారు. అయితే మంగళవారం ఉదయం దుండగులు వచ్చిన సమయానికి అసిస్టెంట్ మేనేజర్ రాకపోవడంతో ఈ బంగారం దోపిడీ దొంగలకు దొరకలేదు. ఈ షోరూమ్‌లో వినియోగదారులకు చూపించడానికి బయటకు తీసి, మళ్లీ లోపల పెట్టడానికి ఉన్న కొన్ని షోకేస్‌లతో పాటు ఆభరణాలను డిస్ప్లే చేయడానికి ఉన్న షో కేసుల్లో గోల్డ్ కోటెడ్ వెండి ఆభరణాలను ఉంచుతారు. వీటినే బంగారు ఆభరణాలుగా భావించిన దుండగులు ఆ షోకేసుల్ని ధ్వంసం చేసి అందులో ఉన్న ఆభరణాలను బ్యాగుల్లో సర్దుకుని వాహనాలపై ఉడాయించారు. ఈ వెండి ఐదు నుంచి పది కిలోల వరకు ఉండచ్చని అంచనా వేస్తున్నారు. కేవలం పది నిమిషాల్లోనే ఈ దోపిడీ ముగిసింది. పక్కాగా రెక్కీ చేసిన తర్వాతే నేరం! దుండగులు రెండుమూడు రోజుల పాటు రెక్కీ చేసిన తర్వాతే దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి వచ్చిన కమిషనర్ అవినాష్ మహంతి బందిపోటు దొంగతనం జరిగిన తీరును తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న ప్రత్యేక బృందాలు.. నేరం చేసిన తర్వాత దుండగులు చందానగర్–పటాన్చెరు–కృష్ణారెడ్డిపల్లి–జిన్నారం మీదుగా పరారైనట్లు గుర్తించారు. దుండగుల్లో ఒకడు ‘చుప్ బే’అనే పదం వాడటాన్ని బట్టి.. అది మధ్యప్రదేశ్ లేదా ఉత్తరప్రదేశ్‌లకు చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షోరూం డిప్యూటీ మేనేజర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. -
విమానాశ్రయంలో చేతివాటం : అమెరికన్ డెంటిస్ట్, ఇంజనీర్ భార్యకు జైలు
సింగపూర్‌లోని విమానాశ్రయంలో లగ్జరీ వస్తువులను దొంగిలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఒక అమెరికన్ జంట పట్టుబడింది. పైగా వీరిద్దరూ మామూలు సిటిజన్స్కాదు, ఇద్దరూ గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నవారు. కానీ కక్కుర్తి పడ్డారు అదీ కఠినమైన చట్టాలు, జీరో టోలరెన్స్ నియమాలకు పెట్టింది పూరైన సింగపూర్ విమానాశ్రయంలో. చివరకు పోలీసులక చిక్కి కటాకటాల ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.కపాడియా హుస్సేన్ జోహెర్ (35), కపాడియా అమతుల్లా (30) ఇద్దరూ భార్యాభర్తలు. జోహెర్ దంతవైద్యుడిగా పనిచేస్తుండగా, అమతుల్లా ఇంజీనీర్గా ఉన్నారు. ఈ జంట సింగపూర్ విమానాశ్రయంలో విలాసవంతమైన వస్తువులను దొంగిలిస్తూ దొరికి పోయారు. అమెరికా జాతీయులైన ఈ జంట జూన్ 23న చాంగి విమానాశ్రయంలోని చాంగి విమానాశ్రయం టెర్మినల్ 1లోకి ప్రవేశించిన తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చోరీకి పాల్పడ్డారు. భారతదేశానికి కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కడానికి ముందు విమానాశ్రయంలో లూయిస్ విట్టన్ అండ్ డియోర్ నుండి 750 డాలర్లు (సుమారు రూ.65,790) ఎక్కువ విలువైన వస్తువులను దొంగిలించారని పోలీసుఅధికారులు తెలిపారు. విమానాశ్రయం లోపల ఉన్న సీసీటీవీ ఆధారంగా ఇద్దరిని విచారించి దొంగతనం చేసిన అధికారులు జైలు శిక్ష ఖరారు చేశారు. జొహెర్కు 18 రోజుల జైలు , అతని భార్యఅమతుల్లాకు వారం రోజుల జైలు శిక్ష విధించారు.చదవండి: 5 నెలల్లో 28 కిలోలు : అమీర్ ఖాన్ అద్భుత చిట్కాలు600 డాలర్ల విలువైన క్రెడిట్ కార్డ్ హోల్డర్‌ను, ది షిల్లా బ్రాండ్ కాస్మెటిక్స్ & పెర్ఫ్యూమ్స్ షాపులో డియోర్ సావేజ్ పెర్ఫ్యూమ్ బాటిల్‌ను జేబులో వేసుకున్నాడు. డబ్బు చెల్లించకుండా దుకాణం నుండి వెళ్లిపోయాడు. తన చోరీని ఎవరు చూడకుండా ఉండేందుకు భార్యను కాపాలాగా ఉంచాడు. తమ పని కానిచ్చి, ఏమీ తెలియనట్టు ముంబై విమానం ఎక్కి కామ్‌గా కూర్చుకున్నారు. కానీ పోలీసులకు చిక్కక తప్పలేదు. విమానం టేకాఫ్‌కు ముందే పోలీసులు వారిని అరెస్ట్ చేయడం విశేషం. జోహెర్ ఎక్కువ ఖర్చు చేసే అలవాటు ఉందనీ, దురాశతో దొంగతనం చేశాడని ప్రాసిక్యూటర్ తెలిపారు. దొంగిలించబడిన రెండు వస్తువులను స్వాధీనం చేసుకుని సంబంధిత దుకాణాలకు తిరిగి ఇచ్చారు. కాగా సింగపూర్లోచట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కఠినమైన చట్టాల కారణంగా సింగపూర్ ప్రపంచంలోనే అత్యల్ప నేరాల రేటు కలిగిన దేశాలలో ఒకటి. చూయింగ్ గమ్, ఇ-సిగరెట్లు, పబ్లిక్ టాయిలెట్‌ను ఫ్లష్ చేయకపోవడం లాంటివి కూడా ఇక్కడ నేరంగా పరిగణిస్తారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారికి సుదీర్ఘ జైలు శిక్ష, 24 కొరడా దెబ్బలు శిక్ష అనుభవించాలి. చట్టవిరుద్ధమైన పదార్థాలను విక్రయించే ఎవరికైనా ఇక్క మరణశిక్ష తప్పదు.ఇదీ చదవండి: Sravana Sukravaram: ‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’... సెల్ఫీ షేర్ చేయండి! -
దొంగను పట్టించిన శివుని టాటూ.. ఎంపీ సుధకు ఊరట
న్యూఢిల్లీ: లోక్‌సభ మహిళా ఎంపీ గొలుసును చోరీ చేసిన దొంగను పోలీసులు 48 గంటల్లో పట్టుకున్నారు. ఇందుకు శివుని టాటూ వారికి ఉపయోగపడింది. ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన సోహన్ రావత్ (60) ఈ చోరీకి పాల్పలడినట్లు పోలీసులు గుర్తించారు. సోహన్పై గతంలో26 దోపిడీ, దొంగతనం కేసులున్నాయి. వాహన దొంగతనం కేసులో సోహన్ బెయిల్‌పై బయటకు వచ్చాడు.ఎంపీ సుధ గొలుసు చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఐదువేలకు పైగా సీటీవీ కెమెరాలను పరిశీలించారు.48 గంటల ఇంటెన్సివ్ ఆపరేషన్ తర్వాత, పోలాండ్ రాయబార కార్యాలయం సమీపంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సదరన్ రేంజ్) సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఉదయం 6 గంటల ప్రాంతంలో బీఆర్టీ కారిడార్ సమీపంలో బంగారు గొలుసును పారవేసేందుకు ప్రయత్నిస్తుండగా రావత్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.నిందితుడు సోహన్ రావత్ ఈ నేరానికి ఉపయోగించిన స్కూటర్, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని గుర్తించడంలో అతని శరీరంపైనున్న టాటూ ఉపయోగపడింది. దీనిగురించి అతని బంధువులు పోలీసులకు సమాచార మిచ్చారు. అతని భార్య పోలీసులకు రావత్ మొబైల్ నంబర్‌ను అందించింది. ఫలితంగా రావత్ పోలీసులకు చిక్కాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న మహిళా సైనికురాలు.. కారణం ఏంటంటే?
చెన్నై: ఓ మహిళా సైనికురాలు కన్నీరుమున్నీరలయ్యేలా విలపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘తాను దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తుండగా.. తన ఇంట్లో దొంగతనం జరిగిందని వాపోయారు. అగంతకులు తన పెళ్లికోసం కొనుగోలు చేసిన బంగారంతో పాటు ఇతర ఖరీదైన వస్తువులు దోచుకెళ్లారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమిళనాడులోని నారాయణపురం గ్రామానికి చెందిన కళావతి జమ్మూ కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తుండగా.. జూన్ 24న నారాయణపురం తన గ్రామంలోని ఇంట్లో దొంగతనం జరిగింది.ఇదే విషయాన్ని కన్నీటి పర్యంతం అవుతూ ఓ వీడియో తీశారు. ఆ వీడియోలో వ్యవసాయం నిమిత్తం నాతల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. ఆ సమయంలో అగంతకులు నా ఇంటి తాళం పగలగొట్టి, నా పెళ్లి కోసం దాచుకున్న ఆభరణాలన్నీ దొంగిలించారు. దొంగతనం జరిగిన రోజైన జూన్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ జూన్ 25న ముఖ్యమంత్రి భద్రతా విధుల్లో ఉన్నారని ఎవరూ దర్యాప్తుకు రాలేదు. తర్వాత వేలిముద్రలు సేకరించి జూన్ 28న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు’అని కళావతి వీడియోలో పేర్కొన్నారు.ఆ వీడియో వైరల్‌గా మారింది. సైనికురాలి వీడియోను తమిళనాడు బీజేపీ నేత అన్నామలై షేర్ చేస్తూ డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశాన్ని కాపాడే సైనికురాలి పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అయితే,ఆ వీడియోపై వెల్లూరు జిల్లా పోలీసులు స్పందించారు.జూన్ 24న కళావతి తండ్రి కుమారసామి తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం, కళావతి పెళ్లి కోసం పక్కన ఉంచిన 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.50,000 నగదు, ఒక పట్టు చీర దొంగతనం జరిగింది. జూన్ 25న భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వేలిముద్రల నమూనాలు సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించామని పోలీసులు తెలిపారు.అనుమానితుల సెల్‌ఫోన్ కాల్ డేటా రికార్డులను (CDRలు) తిరిగి పొందడానికి వారు టవర్ డంప్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. జూన్ 29న, ఫిర్యాదుదారుడు తన ప్రకటనను సవరించి దొంగిలించబడిన ఆభరణాల బరువు 22.5 తులాలని చెప్పినట్లు తెలిసింది. ఈ వివాదంలో నిజమెవరిదో తేలాలంటే, విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. A CRPF jawan from Tamil Nadu, serving with honour at our nation’s borders in J&K, is forced to take to social media on police inaction on the case of jewellery theft from her residence near Katpadi in June this year. What kind of governance forces a woman in uniform to beg for… pic.twitter.com/BnU6WtT99l— K.Annamalai (@annamalai_k) August 4, 2025 -
ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. ఇన్నోవా కారులో ఎత్తుకెళ్లి..
సాక్షి, సికింద్రాబాద్: నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆవుల దొంగతనం కలకలం రేపుతోంది. మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండిమెట్ రెండో బజార్లో ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బండిమెట్ ప్రాంతంలో ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఇన్నోవా కారులో వెనుక భాగంలో వేసుకొని యువకులు పారిపోయారు.ఈ నెల 27 న రాత్రి సమయంలో కారులో ఆవులను తీసుకువెళ్తున్న క్రమంలో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవులను తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆవులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ యువకులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో కూడా మారేడుపల్లి పరిధిలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.Shocking Incident of Cow Theft in #Bandimet Area Of #SecunderabadA disturbing case of cow theft has come to light in the Bandimet area, where a gang of youths allegedly stole cows by injecting them with anesthetics.According to eyewitnesses, the accused arrived in a luxury… pic.twitter.com/wfIa4EF6lA— BNN Channel (@Bavazir_network) August 2, 2025 -
దొంగ.. దొంగది.! అర్ధరాత్రి ఇంట్లోకి దూరి
పటమట(విజయవాడతూర్పు): ఇంటిలోకి చొరబడి నగలు చోరీ చేసిన కేసులో ప్రేమికులను అదుపులోకి తీసుకున్నట్లు సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ తెలిపారు. పటమట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. భవానీపురానికి చెందిన బాలిక(16), మొగల్రాజపురానికి చెందిన మీసాల అజయ్(19) గతంలో వాసవీ కాలనీలో ఉండేవారు. వన్‌టౌన్ కోమలా విలాస్ వద్ద గ్యాస్ ఏజెన్సీ నిర్వహించే చిరుమామిళ్ల గిరిజా శంకర్ ఇదే కాలనీకి గతంలో అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నెల 27వ తేదీ రాత్రి గిరిజా శంకర్ ఇంటిలో నిద్రిస్తుండగా వీరిరువురూ ఇంటిలోకి చొరబడి విద్యుత్ సరఫరాను ఆపేసి ఇంటిలోని 365 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృతమైన తనిఖీలు చేయటంతో నిందితులు పట్టుబడ్డారన్నారు.పలు కేసుల్లో నిందితులు..నేరంలో భాగమైన బాలిక, అజయ్ ప్రేమికులు. వీరువురూ ఈ చోరీకి ముందు ఇదే ప్రాంతంలోని ఓ పెంపుడు కుక్కను కూడా చోరీ చేశారు. గిరిజా శంకర్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి చోరీ చేశారు. శంకర్ ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత చాకచక్యంగా ఇంటిలోకి చొరబడ్డారు. అజయ్ ఇంటిలోకి వెళ్లగా బాలిక బయట స్కూటర్‌పై కాపలా ఉండి, అజయ్ ఇంటి నుంచి రాగానే బండిపై అక్కడి నుంచి ఉడాయించారు. భవానీపురంలోని బాలిక బంధువుల వద్ద చోరీ సొత్తును దాచిపెట్టారు. వీరిపై నిఘా పెట్టడంతో బాలిక, అజయ్ గుణదల ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద పట్టుబడ్డారు. బాలికను జూవైనల్ హోంకు పంపామని, అజయ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచామని తెలిపారు. బాలిక, అజయ్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, తన కూతురును అజయ్ వేధింపులకు గురిచేస్తున్నారని బాలిక తల్లిదండ్రులు గతంలో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అజయ్‌పై పోక్సో కేసు నమోదు చేయగా పెద్దల సమక్షంలో రాజీ కుదిరిందన్నారు. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో పలు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సమావేశంలో సీఐ పవన్ కిషోర్, ఎస్.ఐలు డి.హరికృష్ణ, ఆర్ఎస్ కృష్ణ వర్మ, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
నెల్లూరులో ఆర్టీసీ బస్సు చోరీ
నెల్లూరు సిటీ/ఆత్మకూరు: నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఓ వ్యక్తి బస్సును చోరీ చేయడంతో దాదాపు రెండు గంటల పాటు ఆర్టీసీ అధికారులు హైరానా పడ్డారు. చివరికి ఫాస్ట్‌ట్యాగ్‌తో బస్సు ఆచూకీ కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన బస్సు ఏఎస్‌పేట నుంచి మంగళవారం సాయంత్రం ప్రయాణికులతో బయలుదేరి నైట్ హాల్ట్‌గా నెల్లూరు బస్టాండ్‌కు చేరింది. బుధవారం ఉదయం 5 గంటలకు తిరిగి ఏఎస్‌పేటకు బయలుదేరాల్సి ఉంది. డ్రైవర్, కండెక్టర్ బస్టాండ్‌లోనే నిద్రపోయారు. ఈ క్రమంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బుధవారం తెల్లవారు జామున బస్సును అపహరించాడు. 4 గంటలకు నిద్రలేచిన కండక్టరు, డ్రైవర్ బస్టాండ్‌లో బస్సు కనిపించకపోవడంతో ఆత్మకూరు, నెల్లూరు డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు టోల్గేట్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. అధికారులు బస్సు ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా, బుచ్చిరెడ్డిపాళెం టోల్‌ప్లాజా వద్ద సంగం వైపు క్రాస్ అయినట్లు ఫాస్ట్‌ట్యాగ్ మెసేజ్ వచ్చింది. సంగంలో బస్సును ఆపేందుకు ప్రయత్నించగా ఆగలేదు. నెల్లూరుపాళెం సెంటర్ వద్దకు వచ్చిన బస్సును పలువురు చాకచక్యంగా నిలిపి బస్సు నడిపిన వ్యక్తిని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. ఆత్మకూరు ఎస్సై ఎస్కే జిలానీకి ఫిర్యాదు చేశారు. బస్సును చోరీ చేసిన వ్యక్తిని విడవలూరు మండలం కంచరపాళెంకు చెందిన కృష్ణగా గుర్తించారు. అతనికి మతిస్థిమితం లేదని తెలిపారు. నెల్లూరు పోలీసులకు, ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కృష్ణను నెల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్టు ఎస్సై జిలానీ తెలిపారు. -
బాత్రూం గోడకు రంధ్రం చేసి.. 18 కేజీల బంగారం చోరీ
సాక్షి, సూర్యాపేట: జిల్లా కేంద్రంలో భారీ చోరీ కలకలం రేగింది. స్థానికంగా ఉన్న సాయి సంతోషి నగల దుకాణంలో బంగారం, నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. బాత్రూమ్ గోడకు రంధ్రం చేసి మరీ లోపలికి ప్రవేశించి 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ జరిగిందని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి దుకాణం వెనుక నుంచి దొంగలు లోనికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. బంగారం షాపు దొంగలను పట్టుకునేందుకు ఐదు బృందాల ఏర్పాటు చేశామని డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. స్థానికంగా ఈ ఘటన తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
గడ్డి తినిపించారు..
బరంపురం: పశువులను దొంగతనంగా రవాణా చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు దళితులను తీవ్రంగా కొట్టి, సగం గుండు గీయించి, మోకాళ్లపై నడిపించడంతోపాటు గడ్డి తినిపించారు. ఈ దారుణం ఒడిశాలోని గంజాం జిల్లా ధారకొటే పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖారిగుమ్మ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో రాజకీయ పార్టీలు సామాజిక సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. సింగిపూర్‌కు చెందిన బాబులా నాయక్(54), బులు నాయక్(42)లు హరియూర్ గ్రామం నుంచి ఒక ఆటోలో రెండు ఆవులు, ఆవుదూడను తీసుకువస్తున్నారు. వీరిని ఖారిగుమ్మ గ్రామానికి చెందిన ‘గో పరిరక్షకులు’కొందరు అడ్డుకున్నారు. వాటిని తన కుమార్తెకు బహుమతిగా ఇచ్చేందుకు తీసుకెళ్తున్నానని బాబులా చెప్పగా కొట్టిపారేశారు. దొంగతనం చేశారంటూ వారిపై నెపం వేశారు. రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా బాధితులు తిరస్కరించారు. దీంతో, వారిని తీవ్రంగా కొడుతూ నానా దుర్భాషలాడారు. సెలూన్‌కు తీసుకెళ్లి సగం జుత్తు గొరిగించారు. కిలోమీటర్ల దూరం వారిని మోకాళ్ల మీద నడిపించారు. మురుగు కాల్వలో నీటిని తాపించారు. గడ్డి తినిపించారు. కేసు నమోదు చేసి, ఆరుగురిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం గాలిస్తున్నామని ఎస్పీ సువేందు కుమార్ పాత్ర తెలిపారు. వారు గో పరిరక్షకులు కాదు, బలవంతంగా డబ్బులు వసూలు చేసేవారు మాత్రమేనని ఆయన అన్నారు. -
ప్రియురాలి కోసం సొంతింటికే కన్నం..
ఖిలా వరంగల్: చేసిన అప్పులు తీర్చేందుకు, ప్రియురాలితో కలిసి జల్సాలు చేసేందుకు ఏకంగా తన సొంత ఇంటికే కన్నం వేసిన ఓ ప్రబుద్ధుడు.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతని నుంచి 11.116 తులాల బంగారం, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఏసీపీ నందిరామ్‌నాయక్.. ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సై శ్రీకాంత్, సురేష్‌లతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు.ప్రియురాలి కోసం సొంతింటికే కన్నం..ఖిలా వరంగల్ పడమర కోటకు చెందిన గుర్రపు రామకృష్ణ ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య సవితా రాణి, ఒక కుమార్తె శ్రీనిధి, కుమారుడు గుర్రపు జయంత్ ఉన్నారు. జయంత్ హనుమకొండలోని ఓ కళాశాలలో బీబీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో అతడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో కలిసి జల్సాలు చేసేందుకు చేతిలో చిల్లి గవ్వలేదు. ఇంటికే కన్నం వేయాలని నిర్ణయించుకున్నాడు. సమయం కోసం చూస్తున్న అతను రామకృష్ణ.. తన తమ్ముడి (జయంత్‌కు బాబాయి) మనుమరాలు పుట్టినరోజు వేడుకల నిమిత్తం ఆదివారం ఉదయాన్నే హైదరాబాద్‌కు భార్య, కుమార్తెతో కలిసి వెళ్లారు. కానీ, జయంత్ ఇక్కడే ఉన్నాడు. అదేరోజు రాత్రి రామకృష్ణ ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉండగా.. అందులోని ఆరున్నర తులాల పెద్ద హారం, ఐదున్నర తులాల చిన్నహారం, రెండు తులాల రెండు బంగారు గొలుసులు, రెండు తులాల నెక్లెస్, మొత్తం 16 తులాల ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని గ్రహించి మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా బేగం ఆదేశాలతో వరంగల్ ఏసీపీ నందిరామ్‌నాయక్ కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, సురేష్ దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఉదయం 9గంటల సమయంలో ఫోర్ట్‌రోడ్డు జంక్షన్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా..గుర్రపు జయంత్ పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద 11.16 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.అప్పులు తీర్చి.. మిగతా డబ్బులతో జల్సా..జయంత్ బీబీఏ ఫైనలియర్ చదువుతూనే హైదరాబాద్‌లో ‘స్టార్ట్స్ ఓన్ వీల్స్’ పేరుతో ఒక ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తున్నాడు. వ్యాపారం కలిసిరాక అప్పులపాలయ్యాడు. జయంత్‌కు కాలేజీలో ఓ గర్్లఫ్రెండ్ ఉంది. చేసిన అప్పులు తీరాలన్నా.. గర్్లఫ్రెండ్తో జల్సాలు చేయాలన్నా డబ్బు కావాలనుకున్న జయంత్.. తన కుటుంబ సభ్యులు ఆదివారం హైదరాబాద్‌కు వెళ్లగానే ఇంట్లోని బంగారం ఆభరణాలు దొంగిలించాడు. ఆభరణాల్లో కొంత బంగారం కరిగించి అమ్ముదామని వెళ్తుండగా పోలీసులకు చిక్కాడు. అతడినుంచి 5.645 తులాల బంగారు హారం, 5.471 తులాల కరిగించిన బంగారం.. మొత్తం 11.116 తులాల బంగారం, బైక్, ఒక మొబైల్ ఫోన్ స్వా«ధీనం పర్చుకున్నారు. 24గంటల్లో కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, సురేష్, సిబ్బంది ప్రవీణ్‌రెడ్డి, వాజీద్ పాషా, నరేందర్, హోంగార్డ్ రఫీలను ఏసీపీ నందిరామ్‌నాయక్ అభినందించారు. -
రౌండప్ చేసి.. అబ్బాయి మెడలో బంగారు గొలుసు కొట్టేశారు
బంజారాహిల్స్: బస్సు దిగుతున్న ప్రయాణికుడి మెడలోని బంగారు లాక్కొని పరారైన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లోని నూర్నగర్బస్తీలో నివసించే వి.ఓంసాయిప్రకాష్ అనే విద్యార్థి మెహిదీపట్నంలో 19కే బస్సు ఎక్కాడు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–7లోని జీవీకే బస్టాప్‌లో దిగుతుండగా అంతక ముందే విరించి బస్టాపులో ఎక్కిన నలుగురు వ్యక్తులు పథకం ప్రకారం తాము కూడా దిగుతున్నట్లు నటించి సాయిప్రకాష్ మెడలో నుంచి గొలుసు తస్కరించి ఆయనకు కిందకు తోసేసి పరారయ్యారు. గొలుసు చోరీకి గురైనట్లు గుర్తించి అదే బస్సు ఎక్కి నిందితుల కోసం గాలించాడు. అయితే అప్పటికే వారంతా దిగిపోయినట్లు కండక్టర్ తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారుఉద్యోగం ఇప్పిస్తానని మోసం వెంగళరావునగర్ : ఉద్యోగం పేరుతో ఓ యువకుడిని మోసం చేసిన ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. దమ్మాయిగూడెం ప్రాంతానికి చెందిన ఎం.నాని ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు. ఐదు నెలల కిందట సంధ్య, సంజయ్ అనే వ్యక్తులు అతనికి పరిచయమయ్యారు. తనకు మంచిజీతం ఇచ్చే జాబ్ కావాలని వారితో చెప్పడంతో రూ.1.40 లక్షలు చెల్లిస్తే జాబ్ ఇప్పిస్తామని చెప్పారు. దాంతో నాని వారు అడిగిన నగదును అందజేశాడు. అమీర్‌పేటలోని వాసవీ ఎంపీఎం మాల్లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం ఇప్పించారు గాని జీతం మాత్రం ఇవ్వలేదు. పలుమార్లు అడిగినా తప్పించుకుని తిరుగుతున్నారు. నాని వారి వివరాలు ఆరా తీయగా యువతీ యువకుడి అసలు పేర్లు షేక్ నాగూర్‌బీ, షేక్ సుభానీలుగా తెలిసింది. తనను మోసం చేసి నగదు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
‘అమ్మా.. నేను దొంగను కాను’ అంటూ 12 ఏళ్ల బాలుడు..
మేదినీపూర్: పశ్చిమ బెంగాల్(West Bengal)లోని మేదినీపూర్ జిల్లాలో అవమానభారంతో ఒక బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని పన్స్కురాలోని గోసైన్బర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ప్రాంతానికి చెందిన దుకాణదారుడు.. చిప్స్ ప్యాకెట్లు దొంగిలించావని ఆరోపిస్తూ ఒక బాలుడి చేత గుంజీలు తీయించాడు. అందరిముందు దుకాణదారుడు అవమానించడంతో తీవ్రంగా కలత చెందిన ఆ 12 ఏళ్ల బాలుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బాలుడు స్థానికంగా ఉన్న ఒక పాఠశాలలో చదువుతున్నాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పన్స్కురాలోని ఒక స్వీట్ షాపు బయట వేలాడదీసిన చిప్స్ ప్యాకెట్లు గాలికి ఎగిరిపోయాయి. వాటిని ఒక బాలుడు తీసుకున్నాడు. దీనిని గమనించిన దుకాణం యజమాని షువాంకర్ దీక్షిత్ ఆ బాలుడిని పట్టుకుని, తీవ్రంగా దండిస్తూ, చెవులు పట్టుకుని గుంజీలు తీయాలంటూ బలవంతం చేశాడు. అలాగే ఆ చిప్స్ ప్యాకెట్లకు రూ. 15 చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఆ బాలుని తల్లి కుమారుని మందలించడమే కాకుండా చెంపదెబ్బ కొట్టింది. దీంతో కలతచెందిన ఆ బాలుడు తాను ఎటువంటి చోరీ చేయలేదని తల్లికి చెప్పాడు. ఆ తరువాత పురుగుల మందు తాగాడు. వెంటనే స్థానికులు బాలుడిని ఆస్పత్రి(Hospital)కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దుకాణం యజమాని దీక్షిత్ పరారయ్యాడు. బాలుని మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: యూపీలో నాలుగు కోవిడ్-19 కేసులు నమోదు -
‘రాజస్థాన్ నేరం’ వెనుక లోకేంద్ర!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కాచిగూడకు చెందిన కార్టన్స్ ఫ్యాక్టరీ యజమాని హేమ్రాజ్ దుగ్గర్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లోకేంద్ర బహదూర్ షాహి నేతృత్వంలోని ముఠా మరో నేరం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పంజా విసరడానికి ఆరు నెలల ముందు ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో 5 కేజీల బంగారం తస్కరించినట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ఈ నెల 14 రాత్రి రాజస్థాన్‌లోని జైపూర్‌లో నివసించే కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ చౌదరి ఇంట్లో రూ.6 కోట్ల సొత్తు దొంగతనానికీ ఇతడే సూత్రధారి అని ఆ పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని ఖరారు చేసుకోవడానికి హైదరాబాద్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వ్యవస్థీకృతంగా లోకేంద్ర వ్యవహారాలు.. కొన్నేళ్ల క్రితం నేపాల్ నుంచి వసలవచ్చిన లోకేంద్ర వ్యవస్థీకృతంగా ఈ చోరీలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడి వ్యాపారుల ఇళ్లల్లో పని చేస్తున్న నేపాలీల్లో కొందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఆయా వ్యాపారుల కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు తెలుసుకుంటున్నాడు. అదను చూసుకుని అప్పటికే పని చేస్తున్న వారి ద్వారానే, ఆ స్థానంలో మరో నేపాలీని పనిలో పెట్టిస్తున్నాడు. ఆపై తన ముఠాతో రంగంలోకి దిగి ఆ ఇంటిని కొల్లగొట్టిస్తున్నాడు. ముంబైకి చెందిన వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో ఐదు కేజీల బంగారం తస్కరించారు. గత నెల్లో కాచిగూడలోనూ ఇలానే భారీ చోరీకి పాల్పడ్డారు. ఇక్కడ ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులకు మత్తు మందు ఇచ్చి తమ పని కానిచ్చారు.వైశాలీ నగర్లోనూ .. జైపూర్‌లోని వైశాలీనగర్లో ఉన్న సందీప్ చౌదరి ఇంట్లోనూ ఇదే పం«థాలో నేరం జరిగింది. ఈ ఇంట్లో పని చేసే మహిళతో పాటు ఓ పురుషుడు అదను కోసం ఎదురు చూశారు. సందీప్ జైపూర్‌లో లేని విషయం గమనించి మరో ఇద్దరికి సమాచారం ఇచ్చారు. ఆయన కుటుంబీకులతో మత్తు మందు కలిపిన టీ తాగించారు. అంతా అపస్మారక స్థితిలో ఉండగా ఆ ఇద్దరితో పాటు మరొకరినీ రప్పించిన ఈ ద్వయం ఇంట్లో ఉన్న నగదు, బంగారం, వెండి, వజ్రాభరణాలతో సహా రూ.6 కోట్ల విలువైన సొత్తుతో ఉడాయించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందం భరత్ బిస్త్, హరి బహదూర్ దామిలను అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. నిందితుల విచారణలో సరైన వివరాలు రాకపోవడంతో ఈ పంథాలో జరిగిన నేరాల వివరాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే కాచిగూడ చోరీ వారి దృష్టికి వెళ్లింది. ఇక్కడా, అక్కడా ఒకేలా నేరం జరగడంతో జైపూర్ చోరీ వెనుకా లోకేంద్ర బహదూర్ షాహి పాత్రను అనుమానిస్తున్నారు. దర్యాప్తు కోసం వివరాలు కోరుతూ నగర పోలీసులను సంప్రదిస్తున్నారు. -
నేను చిప్స్ దొంగిలించలేదమ్మా
కోల్‌కతా: పాపం 12 ఏళ్ల పసివాడు! చిప్స్ దొంగిలించాడని అభాండం వేయడమే గాక అందరిముందు దండించడాన్ని, తల్లి కూడా తననే తప్పుబట్టడాన్ని తట్టుకోలేకపోయాడు. ఏకంగా పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ‘నేను చిప్స్ దొంగిలించలేదమ్మా’ అంటూ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు! ఈ దారుణం పశ్చిమబంగాల్లో పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని పన్స్కురాలో జరిగింది. ఏడో తరగతి చదువుతున్న క్రిషేందు దాస్ చిప్స్ ప్యాకెట్ కొనడానికి ఓ దుకాణానికి వెళ్తే ఎవరూ కన్పించలేదు. ‘మామయ్య! చిప్స్ కావాలి’ అని యజమాని శుభాంకర్ దీక్షిత్‌ను ఎంత పిలిచినా స్పందన రాలేదు. దాంతో ఒక ప్యాకెట్ చిప్స్ తీసుకుని వెనుదిరిగాడు. అప్పుడొచ్చి చూసిన దీక్షిత్ కోపంతో క్రిషేందును దుకాణానికి లాక్కొచ్చి చెంపదెబ్బ కొట్టాడు. అందరి ముందూ గుంజిళ్లు తీయించడమే గాక బాలుని తల్లిని పిలిపించాడు. ఆమె కూడా కొడుకునే తిట్టి చెంపదెబ్బ కొట్టింది. ఎంత పిలిచినా దీక్షిత్ రానందుకే చిప్స్ తీసుకున్నానని, తరువాతైనా డబ్బులు ఇచ్చేవాడినని ఎంత చెప్పినా ఎవరూ విన్లేదు. దాంతో అందరి ముందూ దాస్ క్షమాపణలు చెప్పాడు. అయినా తాను అబద్ధం చెబుతున్నాడని దీక్షిత్ పదేపదే తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లోకెళ్లగానే గదిలోకి దూరి గడియ వేసుకున్నాడు. దాంతో తల్లి ఇరుగుపొరుగును పిలిచి తలుపు పగలగొట్టింది. అప్పటికే బాబు నోటి నుంచి నురగలు వస్తున్నాయి. పక్కన సగం తాగిన పురుగుమందుల సీసా, బెంగాలీలో నోట్ కనిపించింది. ‘‘అమ్మా! నేను దొంగను కాదు. దొంగతనం చేయలేదు. చాలాసేపు పిలిచినా మామయ్య (దుకాణదారు) రాలేదు. అందుకే కుర్కురే ప్యాకెట్ తీసుకున్నా. అవంటే నాకెంతో ఇష్టం కదా! ఇవి నా చివరి మాటలు. పురుగుమందు తాగినందుకు క్షమించు’’ అని అందులో రాశాడు. -
తెలంగాణ రాజ్‌భవన్ హార్డ్ డిస్క్ చోరీ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్‌భవన్ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సస్పెండైన ఉద్యోగి శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌భవన్ చోరీ కేసు నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి భయభ్రాంతులకు గురి చేయగా.. ఆ కేసులో మొదటిసారి అరెస్ట్ చేశారు. కాగా.. హార్డ్ డిస్క్‌ల చోరీ కేసులో రెండోసారి చేశారు. ఆ ఉద్యోగి వారంలో రెండుసార్లు అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. సస్పెండ్ అయినా కానీ.. సెక్యూరిటీని మాయ చేసి రాత్రి సమయంలో రాజ్‌భవన్‌లోకి ప్రవేశించాడు. రాజ్ భవన్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో శ్రీనివాస్.. ఓ మహిళకు కొన్ని మార్ఫింగ్ ఫొటోలను చూపించాడు. ఎవరో తనకు ఈ ఫోటోలు పంపిస్తున్నారు జాగ్రత్త అంటూ భయపెట్టాడు. దీంతో కలవరపాటుకు గురైన ఆ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మార్ఫింగ్ ఫోటోలను సృష్టించింది.. శ్రీనివాసేనని తేల్చారు. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు పంపారు. రాజభవన్ అధికారులు శ్రీనివాస్ సస్పెండ్ చేశారు.జైలకు వెళ్లిన శ్రీనివాస్.. రెండు రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుండి వచ్చిన శ్రీనివాస్ రాత్రి సమయంలో సెక్యూరిటీని మభ్యపెట్టి లోపలికి వెళ్ళాడు. తన కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్‌ను చోరీ చేసుకుని వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై రాజభవన్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు సీసీ కెమెరాల ద్వారా శ్రీనివాస్ చోరీని గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి.. హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్ డిస్క్‌లో మహిళకు సంబంధించిన ఫోటోలు ఉండడంతో ఆ సాక్ష్యాలను డిలీట్ చేసే ప్రయత్నంలో చోరీకి పాల్పడాడ్డని తెలిసింది. -
'సీతారామం' నటి కారులో భారీ చోరీ
'సీతారామం' సినిమాలో నటించిన రుక్మిణి విజయ్ కుమార్ కారులో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.23 లక్షలు విలువైన వస్తువుల్ని దొంగిలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు.. అసలేం జరిగిందో కనుక్కొని డ్రైవర్ ముహమ్మద్ మస్తాన్ ని అదుపులోకి తీసుకున్నారు.ఇంతకీ ఏమైంది?ఈ నెల 11న మార్నింగ్ వాకింగ్ కోసం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకి రుక్మిణి వెళ్లింది. ఓ గేట్ దగ్గర తన కారు పార్క్ చేసి లోపలికి వెళ్లిపోయింది. ఈ హడావుడిలో తన కారు లాక్ చేసుకోవడం మర్చిపోయింది. అదే కారులో ఖరీదైన హ్యండ్ బ్యాగ్స్, పర్స్, రెండు వజ్రపు ఉంగరాలు, రోలెక్స్ వాచ్ తదితర విలువైన వస్తువులు ఉన్నాయి.(ఇదీ చదవండి: రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం: మంచు విష్ణు)రుక్మిణి కారుకి లాక్ వేయని విషయాన్ని గమనించిన ట్యాక్సీ డ్రైవర్ మస్తాన్.. కారులోని రూ.23 లక్షలు విలువ చేసే వస్తువుల్ని దొంగిలించాడు. దీంతో నటి రుక్మిణి.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. నిందితుడు మస్తాన్ ని అరెస్ట్ చేసి, దొంగిలించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు.స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రుక్మిణి.. తొలుత కొరియోగ్రాఫర్ గా కెరీర్ ఆరంభించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. 'సీతారామం'లో హీరోయిన్ ఫ్రెండ్ రేఖ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: 'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్) -
ఉద్యోగం కోసం వచ్చి ఐఫోన్లు మాయం చేశాడు
సనత్‌నగర్: ఉద్యోగం కోసం వచ్చినన ఓ వ్యక్తి రూ.1.40 లక్షల విలువైన రెండు ఐఫోన్లను చోరీ చేసిన ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బేగంపేట డీఐ జి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..బేగంపేటలోని ఎఫ్డీఆర్ ఆర్డీ టవర్స్‌లో గల జెప్టో కార్యాలయానికి స్టోర్ ప్యాకర్‌గా పనిచేసేందుకు బాలానగర్‌లోని జింకలవాడకు చెందిన గౌతమ్ అంకిత్‌పాత్ర (24) ఈ నెల 3వ తేదీన వచ్చాడు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత స్టోర్‌లో పనిచేసేందుకు అంగీకరించాడు. స్టోర్‌ను ఒకసారి చూసి వస్తానని చెప్పి స్టోర్‌లో కనిపించిన రెండు విలువైన ఐఫోన్లను తీసి దాచుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి కార్యాలయానికి రాలేదు. ఆ తర్వాత స్టోర్ ఆడిట్ చేసిన నిర్వాహకులు రెండు ఐఫోన్లు కనిపించడం లేదని గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా గౌతమ్ అంకిత్‌పాత్ర సెల్ఫోన్లను చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు స్టోర్ ఉద్యగి తిలక్‌కుమార్ బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత అదృశ్యం సికింద్రాబాద్: భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచి్చన వివాహిత అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. ఒడిశా రాష్ట్రం పలపాతి గ్రామానికి చెందిన జడునాథ్ ముర్ము, మల్హో మణి ముర్ము(26) దంపతులు. ఈ నెల 6న సాయంత్రం 8 గంటల సమయంలో భార్యభర్తలు భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో జనరల్ టికెట్ తీసుకొని విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలెక్కారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి ప్లాట్ ఫాం నంబర్ 1లోని గేట్ నంబర్ 5 వద్ద కూర్చున్నారు. టూత్‌పేస్ట్ తీసుకొచ్చేందుకు భర్త జడునాథ్ బయటకు వెళ్లి వచ్చేసరికి భార్య కనిపించకుండా పోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా భార్య మల్హో మణి ఆచూకీ లభించకపోవడంతో జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లో యువకుడి ఆత్మహత్య చిక్కడపల్లి: పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రో స్టేషన్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం చిక్కడపల్లి మెట్రోస్టేషన్‌కు వచి్చన గుర్తుతెలియని యువకుడు అక్కడే వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీనిని గుర్తించిన మెట్రో సిబ్బంది 108కు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యువ నటి ఇంట్లో భారీ దొంగతనం
ప్రమఖ నటి నేహా మాలిక్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. దాదాపు రూ.34 లక్షలు విలువ చేసే నగలు మాయమయ్యాయని సదరు నటి, ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన పనిమనిషి ఈ పని చేసి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది.(ఇదీ చదవండి: కుర్రాళ్ల సినిమా.. మనోళ్లకు ఎక్కేసింది!) ఎఫ్ఐఆర్ ప్రకారం.. నేహా మాలిక్ తల్లి మంజు పలు వేడుకలకు నగలు ధరించుకుని వెళ్లేది. తర్వాత తన రూంలోని చెక్క డ్రాయర్ లో వాటిని పెట్టేది. నేహా ఇంటి పనిమనిషి షహనాజ్ ముస్తాఫా ముందే చాలాసార్లు మంజు నగలు మార్చుకునేది. ఏప్రిల్ 25న ఉదయం నేహా మాలిక్ షూటింగ్ కి వెళ్లిపోగా.. ఈమె తల్లి మంజు గురుద్వార వెళ్లింది. దీంతో ఇంటిని శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషి తన దగ్గరున్న తాళంతో ఇంటిని క్లీన్ చేసి వెళ్లిపోయింది. తర్వాత రోజు పనికిరాలేదు. ఈ క్రమంలోనే నేహా మాలిక్ ఇంట్లో ఓసారి వెతకగా నగలు కనిపించలేదు. వీటి విలువ దాదాపు రూ.34 లక్షలకు పైనే.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) దీంతో నేహా మాలిక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పని మనిషిపై అనుమానం వ్యక్తం చేసింది. అందుకు తగ్గట్లే దర్యాప్తు చేసిన పోలీసులు సదరు పనిమనిషిని అరెస్ట్ కూడా చేశారు.నేహా మాలిక్ విషయానికొస్తే.. 2012 నుంచి ఇండస్ట్రీలో ఉంది. గాంధీ ఫేర్ ఆగయా, ముసాఫిర్ 2020, పింకీ మోగే వాలి 2 తదితర చిత్రాల్లో నటించింది. ఇన్ స్టాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు పెడుతూ హల్ చల్ చేస్తూ ఉంటుంది.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) -
ఫోన్ చేసుకుని ఇస్తామని మొబైల్‌తో జంప్..!
మొబైల్ ఇస్తారా ఒకసారి ఫోన్ చేసుకుంటామని కొందరు, మరికొందరు తమ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.. అర్జంటుగా బంధువులకు కాల్ చేసుకోవాలని చాలామంది మొబైల్ తీసుకుంటారు కదా. పాపం అని మనం కూడా చాలాసార్లు సాయం చేస్తుంటాం కూడా అయితే ఈ స్టోరీ చదివాక మరోసారి అలా ఇవ్వడానికి భయపడతారు. విషయం ఏమిటంటే..!దారిన వెళ్లే ఓ వ్యక్తిని ఆపి ఫోన్ చేసుకుని ఇస్తామని మొబైల్ తీసుకుని ఇద్దరు వ్యక్తులు ఉడాయించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే...జూబ్లీహిల్స్ ఇందిరానగర్‌కు చెందిన నరేష్ రసైలి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–9లోని నెట్వర్కింగ్ బిల్డింగ్‌లో గత నాలుగు సంవత్సరాలుగా వాచ్మెన్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 12న రాత్రి 9 గంటల సమయంలో డ్యూటీకి వెళ్లాడు. తిరిగి మరుసటి రోజు 13వ తేదీన తెల్లవారుజామున 5.20 గంటలకు డ్యూటీ ముగించుకుని ఇంటిబాట పట్టాడు. వెంకటగిరి నుంచి వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు స్కూటీపై అతని వద్దకు వచ్చి తమ మొబైల్ ఫోన్ రీఛార్జ్ గడువు ముగిసిందని, ఒక్కసారి నీ ఫోన్ ఇస్తే చేసుకుని ఇస్తామని నమ్మబలికారు. దీంతో నరేష్ తన ఫోన్‌ను వారికి ఇచ్చాడు. ఫోన్ తీసుకున్న ఆగంతకులు ఫోన్ చేసినట్లుగా నటించి బైక్‌పై ఉడాయించారు. ఈ సమయంలోనే బైక్‌పై వెనుక కూర్చొన్న ఆగంతకుడు నరేష్ జట్టు పట్టుకొని 5 మీటర్ల మేర లాక్కెళ్లాడు. ఈ ఘటనలో కిందపడిపోయిన నరేష్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నోట్ : నిజంగా ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో తప్పులేదు. కానీ అనామకులు, కేటుగాళ్లు పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే.! ఇదీ చదవండి: ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం! వివాహిత అదృశ్యం వెంగళరావునగర్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... బీదర్‌కు చెందిన ప్రకాశ్, రేష్మ దంపతులు ఎస్పీఆర్హిల్స్లో ఉంటారు. రేష్మ దుర్గంచెరువు ప్రాంతంలో హౌస్‌కీపింగ్ పనులు చేస్తుంది. ఈ నెల 10న ప్రకాశ్ కొబ్బరికాయల వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లగా భార్య విధులకు వెళ్లున్నట్టుగా చెప్పి బట్టలు సర్దుకుని వెళ్లింది. దాంతో ప్రకాశ్‌కు తన పెద్ద కుమార్తె ఫోన్ చేసి తన తల్లి దుస్తులు సర్దుకుని వెళ్లినట్టు తెలియజేసింది. అతను వచ్చి చూడగా కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో వెదికినా ప్రయోజనం లేదు. ఇదిలా ఉండగా తన భార్య తరచూ భాస్కర్ అనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేదని అనుమానం వ్యక్తం చేస్తూ ప్రకాశ్ సోమవారం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా... మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం’.. అని సింహగిరికి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించేసరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా... స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా’.. అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు. ‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి’.. అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగడంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి. తాము ఉంగరం తీయలేదని ఎంతచెబుతున్నా వినకుండా మీరే దొంగ అని పదే పదే ప్రశ్నించడంతో వారంతా కోపోద్రేకాలతో చిందులు వేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని... దొంగిలించిన ఉంగరం ఇలాగే ఉంటుందంటూ స్థానాచార్యులు నిలదీయడంతో భక్తులు నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ.. సింహగిరిపై ఆదివారం సందడిగా జరిగిన స్వామి వినోదోత్సవం. సింహగిరిపై జరుగుతున్న స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన స్వామి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని ఆదివారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు.ఉత్సవం సాగిందిలా...ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టంపజేశారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాడుతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యంతం చెందారు. ఉత్సవం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాని తొలగించారు. చివరికి ఆయన చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. విశాఖలోని గాయత్రి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న లాస్య, తనుశ్రీ, సుమేధలను, కొత్తవలసకి చెందిన భార్గవి, మోహిత, శ్రావణ్ అనే విద్యార్థులను, విజయనగరానికి చెందిన ఎంబీఏ విద్యార్థినులు రూప, కుసుమ, పుష్ప, సౌమ్యలను, పలాసకి చెందిన ఫైనలియర్ లా విద్యార్థినులు శశిరేఖ, తమనశ్రీ, నరేణ్యలను, మర్రిపాలెంలోని ఓ గోల్డ్ షాపులో పనిచేస్తున్న వడ్డాదికి చెందిన వీర వెంకట సత్యనారాయణ అనే భక్తుడుని పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌కి చెందిన భక్తులను, ఎకై ్సజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న యలమంచిలికి చెందిన సత్యనారాయణమూర్తి కుటుంబాన్ని, పెళ్లి చేసుకొని స్వామి దర్శనానికి వచ్చిన నూతన జంటలను తాళ్లతో బంధించారు. వాళ్ల చేతికి ఉన్న ఉంగరం.. దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమానం వ్యక్తం చేయడంతో వారందతా వాదనకు దిగారు. ఆ తర్వాత నవ్వుతూ స్వామి ఆశీస్సులు తీసుకుని తిరుగుపయనం అయ్యారు. దేవస్థానం ఈవో కె.సుబ్బారావు దంపతులు, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, ఆలయ కొత్వాల్ నాయక్ లంక సూరిబాబు, ఆలయ ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు దొంగలుగా పట్టుబడ్డారు. తొలుత స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌ని, ఆఖరులో పురోహిత్ అలంకారి సీతారామాచార్యులను తాడుతో బంధించి తీసుకురావడం విశేషం. -
డామిట్ కథ అడ్డం తిరిగింది..
సిరిసిల్ల క్రైం: డామిట్ కథ అడ్డం తిరిగింది.. అవును రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిజంగా కథ అడ్డం తిరిగింది. ఇంటి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా యజమాని దొంగతనం చేయగా పట్టించింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలో రాజవ్వ అనే వృద్ధురాలు గురువారం రాత్రి తన కూతురుతో ఇంట్లో నిద్రిస్తోంది. అదే గ్రామానికి చెందిన శేఖర్ వృద్ధురాలి మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు.మేల్కొన్న వృద్ధురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి దొంగ కోసం గాలించారు. ఇంతలోనే దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి జనంతో కలిసిపో యి వెతికినట్లు నటించి బంగారు గొలుసు దొరికిందని అందరినీ నమ్మించాడు. అసలు దొంగను పట్టుకోవాలని బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శేఖర్ ఇంటికి ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ (CCTV Footage) పరిశీలించి అవాక్కయ్యారు. దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి గొలుసు దొరికినట్లుగా నాటకమాడాడని గుర్తించారు. తండ్రి మందలించాడని..ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరుగుతుండటంతోపాటు తమ కుటుంబంతో సత్సంబంధాలు లేని వ్యక్తులతో మాట్లాడటం నచ్చని తండ్రి మందలించగా.. కోపోద్రిక్తుడైన కొడుకు కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో తండ్రి ప్రాణాలు కోల్పోగా.. కొడుకు పరారీలో ఉన్నాడు. సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్సై రమాకాంత్ వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఒడ్డెరకాలనీకి చెందిన కుంచెపు కనకయ్య (50)కు కుమారుడు కుంచెపు పర్శరాములు ఉన్నాడు. వీరి ఇంటి సమీపంలోనే ఓ శుభకార్యం జరిగింది. ఆ శుభకార్యం జరిగిన కుటుంబంతో కనకయ్య కుటుంబానికి మాటలు లేకపోయినా.. పర్శరాములు వెళ్లాడు. దీంతో వారికి మనకు మాటల్లేవని, ఎందుకు వెళ్లావని తండ్రి కోపోద్రిక్తుడయ్యాడు. పనిపాటా లేకుండా తిరుగుతున్నావని మందలించాడు.ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కొడుకు కర్రతో తండ్రి కనకయ్యపై దాడి చేశాడు. బలమైన దెబ్బ తగలడంతో మెడ నరాలు చిట్లిపోయి, అక్కడే కుప్పకూలిన కనకయ్యను కుటుంబ సభ్యులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కాగా, నిందితుడు పర్శరాములు గతంలో కరెంట్‌షాక్‌లు పెడుతూ చేపలు పడుతూ దొరకడంతో పోలీసులు రెండుసార్లు కేసులు నమోదు చేశారు. కొంతకాలం జైలులో ఉండి బయటకొచ్చాడు. పర్శరాములుపై హత్య కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.చదవండి: వార్నీ.. ఎయిర్‌పోర్టును కూడా వదలరా? -
ఇబ్బందుల్లో ఉన్నా.. అందుకే చోరీ చేస్తున్నా
ఖర్గావ్: ‘జుజర్ భాయ్.. నిండా అప్పుల్లో మునిగి ఉన్నా..అప్పులోళ్లు రోజూ వేధించుకు తింటున్నారు..వాళ్లతో వేగలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దొంగతనం చేస్తున్నా..అదీ శ్రీరామ నవమి నాడు..! ఏమీ అనుకోకు, నీ డబ్బు మళ్లీ ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తా.. ఇది నా వాగ్దానం’అంటూ ఓ మంచి దొంగ ఓ దుకాణం నుంచి రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గావ్ జిల్లా కొత్వాలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జమీదార్ మొహల్లాలో ఆదివారం రాత్రి ఈ ఘరానా చోరీ ఘటన చోటుచేసుకుంది. మరునాడు దుకాణం తెరిచిన జుజర్ అలీ బొహ్రాకు నగదు ఉంచిన బ్యాగులో ఈ లేఖ కనిపించింది. ఆశ్చర్యపోయిన ఆయన విషయం పోలీసులకు తెలిపారు. చోరుడు ప్రింటెడ్ లేఖలో దుకాణం యజమానిని జుజర్ భాయ్ అంటూ మర్యాదగా సంబోధించాడని పోలీస్ ఎస్సై అర్షద్ ఖాన్ చెప్పారు. బ్యాగులో ఉంచిన రూ.2.84 లక్షలకు గాను అతడు రూ.2.45 లక్షలు మాత్రమే తీసుకెళ్లి, రూ.38వేలను లేఖతోపాటు బ్యాగులోనే వదిలివెళ్లాడని యజమాని తెలిపాడన్నారు. రామ నవమి పండగ నాడు ఇలా దొంగతనానికి పాల్పడుతున్నందుకు క్షమించాలని కూడా దుకాణం యజమానిని అతడు కోరినట్లు ఎస్సై వివరించారు. ‘నేనుండేది మీ చుట్టుపక్కల ప్రాంతంలోనే. నాకు చాలా అప్పులున్నాయి. అప్పిచ్చిన వాళ్లు రోజూ నా ఇంటికి వస్తున్నారు. దొంగతనం చేయాలని నాకు ఏ మాత్రంలేదు. కానీ, గత్యంతరం లేదు. ఈ డబ్బుతో నాకు చాలా అవసరముంది. అయితే, అవసరమైనంత మాత్రమే తీసుకెళ్తున్నా. మిగతాది బ్యాగులోనే వదిలిపెడ్తున్నా. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తా. అప్పుడిక మీరు నన్ను పోలీసులకు అప్పగించొచ్చు’అని అందులో వివరించాడు. అంతేకాదు, ఈ లేఖలో పేర్కొన్న ప్రతి విషయమూ సత్యమేనని స్పష్టం చేశాడన్నారు. -
భూకంప శిథిలాల నుంచి కీలక పత్రాల చోరీ?
బ్యాంకాక్: థాయ్‌లాండ్ భూకంప సహాయక చర్యల్లో.. కొత్త కోణం వెలుగు చూసింది. రాజధాని బ్యాంకాక్(Bangkok Building Collapse)లోని 33 అంతస్థుల భవనం కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రమాద స్థలి నుంచి కొన్ని పత్రాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు కొందరు ప్రయత్నించగా.. సహాయక బృందాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేయగలిగారు. అయితే ఆ ఐదుగురు చైనాకు చెందిన వాళ్లు కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. చైనా(China)కు చెందిన రైల్వే నంబర్ 10 కంపెనీ 2018లో థాయ్‌లాండ్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. హౌజింగ్ సొసైటీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఇతర బడా కాంట్రాక్టులను ఈ కంపెనీ స్థానిక కంపెనీలతో జాయింట్ వెంచర్‌గా నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో థాయ్‌లాండ్ స్టేట్ ఆడిట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం కోసం సుమారు 58 బిలియన్ డాలర్లతో మూడేళ్ల కిందట పనులు చేపట్టారు.తాజా భూకంపం(Earthquake) ధాటికి నిర్మాణంలో ఉన్న ఆ భవనం కుప్పకూలిపోగా.. శిథిలాల నుంచి ఎనిమిది మంది మృతదేహాలను బయటకు తీశారు. అయితే, ఆశ్చర్యకరంగా ఇంతకంటే ఎక్కువ ఎత్తులో భవనాలకు ఏం కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. డిజైనింగ్‌లో లోపాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అనుమానాల నడుమే.. థాయ్‌లాండ్ ఉప ప్రధాని అనుతిన్ చార్న్విరాకుల్ సైతం ప్రమాద స్థలిని సందర్శించి దర్యాప్తునకు ఆదేశించారు. ఈలోపు.. ఈ భవనం నిర్మాణానికి సంబంధించిన పత్రాలను దొంగిలించేందుకు యత్నాలు జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. భవన శిథిలాల వద్దకు ఆదివారం ఐదుగురు వ్యక్తులు అనుమతి లేకుండా లోనికి ప్రవేశించారు. శిథిలాల నుంచి కొన్ని పత్రాలను తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా రెస్క్యూ టీంలు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పజెప్పాయి. వారిని ప్రశ్నించగా.. చైనా దేశస్థులని తెలిసింది. అయితే.. అందులో ఒకరు తాను ప్రాజెక్ట్ మేనేజర్ అని, బీమా క్లెయిమ్ చేసుకోవడం కోసం సంబంధిత పత్రాలు తీసుకెళ్లేందుకు వచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఈ కంపెనీ ‘నాసిరక నిర్మాణాల’తో వార్తల్లోకి ఎక్కింది. అయితే ఆయా ఘటనలతో ప్రమాదవశాత్తూ ప్రాణాలు మాత్రం పోలేదు. అయినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలను ఈ చైనా కంపెనీకి అప్పగించడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక శుక్రవారం మధ్యాహ్నాం మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం ధాటికి.. పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌లోనూ భారీగా భూమి కంపించింది. రాజధాని బ్యాంకాక్‌లో పలు భవనాలు కుప్పకూలిపోవడంతో.. ఇప్పటిదాకా 18 మంది మృతదేహాలను వెలికి తీశారు. మరో 83 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. -
రెండు బీర్లు.. ఒక క్వార్టర్
శంకరపట్నం: మద్యం దుకాణంలో రోజుకు రూ.లక్షల్లో గిరాకీ.. కౌంటర్లో డబ్బు బాగానే ఉంటుందని భావించిన ఓ దొంగ.. దుకాణం మూశాక చోరీకి దిగాలని భావించాడు. అర్ధరాత్రి వచ్చి కష్టపడి పైకప్పు రేకు కోసి, లోపలికి దిగాడు. ఆశగా కౌంటర్ తెరిస్తే రూపాయి కూడా లేకపోవడంతో నిరాశ చెందాడు. ఖాళీ చేతులతో వెళ్లడం ఎందుకని ఒక క్వార్టర్, రెండు బీర్లను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ క్రాస్‌రోడ్డు సమీపంలోని మద్యం దుకాణంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనపై వైన్స్ యజమాని, పోలీసుల కథనం ప్రకారం.. మొలంగూర్ క్రాస్ రోడ్డు సమీపంలోని మద్యం దుకాణంలో బుధవారం రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయించారు. సమయం ముగిశాక సిబ్బంది కౌంటర్లోని డబ్బులు తీసుకుని వైన్స్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగ దుకాణం పైకప్పు రేకులను కోసి దుకాణంలోకి చొరబడ్డాడు. కౌంటర్లో డబ్బు లేకపోవడంతో రెండు బీర్లు, క్వార్టర్ సీసా, సీసీ ఫుటేజీ హార్డ్‌డిస్క్ తీసుకెళ్లాడు. గురువారం వైన్స్ తెరవగా.. పైకప్పు కోసి ఉండడాన్ని గమనించి వ్యాపారి శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ రవి, క్లూస్‌టీం వివరాలు సేకరించారు. ఈ వైన్స్‌లో గతంలోనూ దొంగలు పైకప్పు తొలగించి చోరీకి దిగారని, దీంతో ఇనుపరాడ్లు వేశానని, అయినా రేకు కోసి దొంగ లోపలకు దిగాడని యజమాని వాపోయాడు. -
మేక తలతో పోలీస్‌స్టేషన్‌కు..!
అన్నానగర్: తాను పెంచుకుంటున్న మేకను చోరీ చేసి కసాయి దుకాణంలో వధించి ఉండడంతో రగిలిపోయిన ఓ మహిళ తిన్నగా ఆ మేకను తలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. కసాయి దుకాణం యజమానిని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేసింది. వివరాలు..నాగై సమీపంలోని ఉత్తర బొయికైనల్ ఊరు కు చెందిన పూంగోడి (31) ఓ మేకను పెంచుకుంటోంది. మంగళవారం ఆ మేక చోరీకి గురైంది. దీంతో పూంగోడి నాగైలోని పలు మటన్ షాపుల్లో గాలించింది. నాగై కల్లార్ ప్రాంతంలోని ఓ మాంసం దుకాణంలో తన మేకను వధించి, దాని తలను వేరు చేసి ఉండడం చూసి రగిలిపోయింది. స్టోర్ మేనేజర్‌ను నిలదీసింది. మేక తలను తీసుకుని నాగై టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కసాయి దుకాణం యజమాని సేదు అహ్మద్‌ను అరెస్టు చేశారు. -
హీరో విశ్వక్సేన్ ఇంట్లో చోరీ నిందితుల అరెస్టు
ఫిలింనగర్: సినీ హీరో విశ్వక్సేన్ ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్ రోడ్డునంబర్–8లో సినీ హీరో విశ్వక్సేన్ నివసిస్తున్నాడు. ఈనెల 14న తెల్లవారుజామున దుండగులు అతని ఇంటి తాళాలు పగులగొట్టి వజ్రాభరణాలతో పాటు హెడ్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. దీంతో అదేరోజు విశ్వక్సేన్ తండ్రి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఎస్ఐ సతీశ్‌కుమార్, కానిస్టేబుళ్లు సురేందర్ రాథోడ్, ఇంతియాజ్ హుస్సేన్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి సీసీ కెమెరాలను పరిశీలించారు. 4 రోజుల పాటు సుమారుగా 200లకు పైగా సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించారు. బేగంపేట మయూరిమార్గ్లో అద్దెకు ఉంటున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ కేసు వీడింది. కొత్తగూడెంకు చెందిన భీమవరపు స్వరాజ్ (21), బొల్లి కార్తీక్ (22), నేరేడుమల్లి సందీప్ (21) ఫుడ్ డెలివరీబాయిస్గా పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీపై దృష్టిపెట్టారు. సినీ హీరో విశ్వక్సేన్ ఇంటి వద్ద వారం పాటు రెక్కీ నిర్వహించి ఆయన కుటుంబ సభ్యుల కదలికలపై దృష్టి పెట్టారు. ముగ్గురూ కలిసి ఒకే బైక్‌పై విశ్వక్సేన్ ఇంటికి చేరుకుని కొద్ది దూరంలో బైక్ ఆపారు. స్వరాజ్ ఇంటి తాళాలు పగులగొట్టి డైమండ్ రింగ్‌లతో పాటు హెడ్‌ఫోన్ చోరీ చేసి బయటకు రాగానే ముగ్గురు కలిసి బైక్‌పై ఉడాయించారు. వీరిని అరెస్టు చేసి డైమండ్ రింగ్‌లతో పాటు 3 మొబైల్ ఫోన్లు, ఒక ఎలక్ట్రిక్ బైక్‌ను స్వా«దీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ -
విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్: ఫిలింనగర్ రోడ్డునెంబర్–8లో నివసించే సినీ హీరో విశ్వక్సేన్(Vishwak Sen) సోదరి గదిలో భారీ చోరీ జరిగింది. ఈ మేరకు ఆమె తండ్రి సి.రాజు ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో(Filmnagar Police Station) ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాజు కూతురు మూడో అంతస్తులో ఉంటుంది. తెల్లవారి తన గదిలో వస్తువులు చిందరవందరగా పడి ఉండడం చూసి ఆమె ఆందోళన చెందింది. పరిశీలించగా రెండు బంగారు డైమండ్ ఉంగరాలతో(Diamond) పాటు ఒక హెడ్‌ఫోన్ కనిపించలేదు. దీంతో విషయాన్ని తన తండ్రి దృష్టికి తీసుకు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి తెల్లవారుజామున 5.50 గంటల ప్రాంతంలో ఇంటి ముందు బైక్ పార్కు చేసినట్లుగా గుర్తించారు. సదరు వ్యక్తి గేటు తీసుకుని నేరుగా మూడో అంతస్తుకు వెళ్లి వెనుక డోర్ నుంచి బెడ్రూమ్లోకి వెళ్లి అల్మరాలో నుంచి బంగారు వస్తువులు తస్కరించినట్లుగా గుర్తించారు. సరిగ్గా 20 నిమిషాల్లోనే దొంగిలించిన సొత్తుతో సదరు వ్యక్తి బయటకు రావడం, వెళ్లిపోవడం కూడా సీసీ ఫుటేజీలో నమోదైంది. చోరీకి గురైన బంగారం విలువ రూ.2.20 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిలింనగర్ పోలీసులు దొంగ కోసం గాలింపు చేపట్టారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అనుమానితుల కదలికలపై దృష్టి పెట్టారు. పాత నేరస్తుల కదలికలను కూడా గమనిస్తున్నారు. ఇంత ధైర్యంగా గేటు తీసుకుని నేరుగా మూడో అంతస్తుకు వెళ్లడం, దర్జాగా బయటకు వెళ్లిపోవడం చూస్తుంటే ఇది తెలిసిన వారి పని అయి ఉంటుందని భావిస్తున్నారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కోట్లు పంచుకుందాం.. టికెట్ ఇవ్వండి
పారిస్: రూపాయి రూపాయి నువ్వేం చేయగలవంటే?. బంధాలు, బంధుత్వాలను తుంచేస్తా అని చెప్పిందట. డబ్బు ఉందన్న అహంతో కొందరు తమ ఆత్మియులను ఆమడ దూరం పెట్టేసిన వైనాలు మనందరం చూశాం. అయితే అదే డబ్బు శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుందని ఫ్రాన్స్‌లోని ఓ ఘటన నిరూపించింది. సాధారణంగా మన పర్సు, క్రెడిట్ కార్డులను కొట్టేసిన వాళ్లు మనకు కనబడితే చితకబాదుతాం. కానీ ఫ్రాన్స్‌లో 40 ఏళ్ల ఓ వ్యక్తి మాత్రం తన క్రెడిట్ కార్డును కొట్టేసిన వ్యక్తులను అక్కున చేర్చుకునేందుకు తహతహలాడుతున్నాడు. ఇందులో ఒక ఆర్థిక కోణం, నగదు ప్రేమ దాగి ఉంది. ఈయన దగ్గర కొట్టేసిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన ఒక లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. ఏ లక్షో రెండు లక్షలో కాకుండా ఏకంగా రూ.4,53,00,000ల జాక్‌పాట్ తగిలింది. టికెట్ ఎలా చేజిక్కించుకోవాలి? జాక్‌పాట్ తగిలిన టికెట్‌ను కౌంటర్లో ఇచ్చేసి నగదుగా మార్చుకునే అవకాశం ఆ దొంగలకు లేదు. ఎందుకంటే సంబంధిత టికెట్ కొనుగోలు పత్రాలు వాళ్ల వద్ద లేవు. ఆ టికెట్ కొనేందుకు ఉపయోగించిన క్రెడిట్ కార్డ్ వాళ్లది కాదు. దొంగతనం చేశారు కాబట్టి ఒకవేళ టికెట్ పట్టుకుని కౌంటర్ వద్దకు వస్తే పోలీసులు పట్టుకెళ్తారు. దీంతో దొంగలు ఆ రూ. 4.53 కోట్ల విలువైన లాటరీటికెట్ను నగదుగా మార్చుకునే అవకాశం కోల్పోయారు. కానీ ఆ అవకాశం క్రెడిట్ కార్డ్ యజమాని అయిన జీన్ డేవిడ్.ఈ అనే వ్యక్తికి ఉంది. కానీ అతని వద్ద టికెట్ లేదు. ఇందుకు ఆయనో పథకం వేశారు. క్రెడిట్ కార్డ్ కొట్టేసిన దొంగలపై ఎక్కడాలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ‘‘నా క్రెడిట్ కార్డులు దొంగలించిన మీపై నాకు ఇప్పుడు కోపం లేదు. గతంలో మీపై పోలీస్ కేసు పెట్టాను. కావాలంటే ఆ కేసును ఇప్పుడు ఉపసంహరించుకుంటా. అయితే మీరు ఆ లాటరీ టికెట్‌ను నాకు ఇచ్చేయండి. కావాలంటే అందులో సగం మొత్తాన్ని మీకు వాటాగా ఇచ్చేస్తా’’అని ఒక చక్కటి ఆఫర్ ఇచ్చారు. అయితే ఇంకా తమ కౌంటర్ వద్దకు ఎవరూ రాలేదని లాటరీ నిర్వహణ సంస్థ లా ఫ్రాంకైస్ డీస్ జీయక్స్(ఎఫ్‌డీజే) శనివారం ప్రకటించింది. ఆలసించిన ఆశాభంగం క్రెడిట్ కార్డ్ యజమాని జీన్ డేవిడ్ తన లాయర్ ద్వారా మరోసారి ఒక సవివరమైన ప్రకటన ఇప్పించారు. ‘‘ఆ ఇద్దరు దొంగలు లేకుండా ఈ లాటరీ విజయం సాధ్యమయ్యేదే కాదు. వాళ్లు టికెట్ కొన్నారు కాబట్టే ఇవాళ ఇంత సొమ్ము మన పరం అయ్యే సదవకాశం దక్కింది. అందుకే దొంగల్లారా.. దయచేసి ఆ లాటరీ టికెట్ మాకు ఇచ్చేయండి. మీ వద్ద ఉన్నా అది మీకు ఉపయోగపడదు. మాకు ఇచ్చేస్తే మీకూ అందులో వాటా తప్పకుండా ఇస్తాం. డీల్ కుదుర్చుకుందాం. మా ఆఫీస్‌కు వచ్చేయండి. మీరు ఆలస్యం చేస్తే ఆ టికెట్‌ను నగదుగా మార్చుకునే క్లెయిమ్ గడువు తీరిపోతుంది. అప్పుడు మనందరికీ దక్కేది సున్నా. కాలం మించిపోతోంది. సమయం లేదు మిత్రమా. త్వరగా వచ్చి ఒడంబడిక చేసుకుని డబ్బు తీసుకెళ్లండి. ఆ డబ్బుతో మేం సెటిల్ అవుతాం. మీరూ సెటిల్ అవ్వండి’’అని లాయర్ పియరీ డెబూసన్ చెప్పారు. ఈ వింత ప్రకటన చూసి ఫ్రాన్స్ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో తమకు నచ్చినట్లు పోస్ట్‌లు పెడుతున్నారు.సిటీలో కొట్టేసి.. టౌలూస్ నగరానికి చెందిన జీన్ డేవిడ్ ఫిబ్రవరి మూడో తేదీన కారులో తన బ్యాక్‌ప్యాక్‌ను ఉంచేసి వెళ్లాడు. కారు తెరచి దొంగలు ఆ బ్యాక్‌ప్యాక్‌ను, అందులోని పర్సు, క్రెడిట్ కార్డులను కొట్టేశారు. ఆ కార్డుతో ఒక చిల్లర దుకాణంలో లాటరీ టికెట్ కొన్నారు. ‘‘ఇల్లూ, చెప్పుకోవడానికి అడ్రస్ కూడా లేని ఇద్దరు వ్యక్తులు మా దుకాణానికి వచ్చి కాంటాక్ట్‌లెస్ విధానంలో 52.50 యూరోలతో ఒక లాటరీ టికెట్, మరికొన్ని సిగరెట్లు కొన్నారు. టికెట్ కొన్న ఆనందంలో వాళ్లు సిగరెట్లు కూడా మర్చిపోయి వెళ్లారు’’అని టబాక్ దిస్ థెర్మాస్ దుకాణ యజమాని చెప్పారు. -
చాక్లెట్లు దొంగలించిందని చంపేశారు !
రావల్పిండి: పాకిస్తాన్లో పేదరికం కారణంగా చిన్నతనంలోనే బాలకార్మికులుగా ఇంటిపని చేసే చిన్నారుల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో చాక్లెట్లు దొంగతనం చేసిందని ఆరోపిస్తూ 13 ఏళ్ల బాలికను ఆ ఇంటి యాజమానులు చితకబాదడంతో గాయాలపాలై ఆ అమ్మాయి చనిపోయిన ఘటన ఆగ్నేయ పాకిస్తాన్లో గత బుధవారం సాయంత్రం జరిగింది. రావల్పిండిలో నమోదైన ఈ కేసులో యజమాని రషీద్ షఫీఖ్, ఆయన భార్య సనా, వాళ్ల ఖురాన్ బోధకుడినీ పోలీసులు అరెస్ట్‌చేశారు. బాలిక కాళ్లు, చేతులు, చీలమండ పలు చోట్ల విరిగినట్లు పోస్ట్‌మార్టమ్ ప్రాథమిక నివేదికలో తేలింది. సమగ్ర నివేదిక ఇంకా రావాల్సి ఉంది. బాలిక ఇఖ్రా పనిచేస్తున్న యజమాని దంపతులకు 8 మంది సంతానం. వాళ్ల బాగోగులు, ఇంటి పనులు చూసుకునేందుకు రెండేళ్ల క్రితం వాళ్లింట్లో ఇఖ్రా పనికి కుదిరింది. జీతంగా నెలకు దాదాపు రూ.2,430 ఇచ్చేవారు. చాక్లెట్లు దొంగతనం చేసిందని ఆరోపిస్తూ ఇఖ్రాను దారుణంగా హింసించారని పోలీసులు అనుమానిస్తున్నారు. తలకు తీవ్రగాయమైనట్లు సంబంధిత వీడియోల్లో తెలుస్తోంది. అన్నపానీయాలు ఇవ్వకుండా కడుపు మార్చారని, కట్టేసి కొట్టారని, చపాతీలు చేసే కర్రతో కొట్టడంతో పుర్రె పగిలిందని వార్తలొచ్చాయి. బాలిక మరణవార్త తెల్సి దేశవ్యాప్తంగా వేలాది మంది బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇఖ్రాకు న్యాయం జరగాలని డిమాండ్‌చేశారు. తన బిడ్డ మరణాన్ని 45 ఏళ్ల రైతు సనా ఉల్లాహ్ ఏడుస్తూ చెప్పారు. ‘‘నా కుమార్తె ఆరోగ్యం బాలేదని పోలీసులు ఫోన్‌చేసి ఆస్పత్రికి రమ్మన్నారు. వచ్చి చూస్తే ఆస్పత్రి బెడ్‌పై ఇఖ్రా చలనంలేకుండా పడి ఉంది. కొద్దిసేపటికి ప్రాణాలు కోల్పోయింది. నాకున్న అప్పు తీర్చుకునేందుకు గతిలేక ఇఖ్రాను పనికి పంపించాను’’అంటూ తండ్రి దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చారు. తండ్రి అప్పులు తీర్చేందుకు, ఇంట్లో ఖర్చులకు పనికొస్తాయనే ఉద్దేశ్యంతో ఇఖ్రా ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే పనులకు వెళ్లడం మొదలెట్టింది. పేదరికంలో మగ్గిపోతున్న బాలకార్మికుల కుటుంబాలు ఇలాంటి సందర్భాల్లో న్యాయం కోసం తుదికంటా పోరాటం చేయడం పాకిస్తాన్లో చాలా అరుదు. నిందితులను దేవుడే క్షమిస్తాడని మనసును రాయి చేసుకుని ఆ దోషులు నష్టపరిహారంగా ఇచ్చే ఏంతో కొంత మొత్తాలను తీసుకుని కోర్టుల బయటే రాజీ కుదుర్చుకోవడం పాకిస్తాన్లో పరిపాటిగా మారింది. ఇఖ్రా కేసు సైతం చివరకు ఇలాంటి ‘పరిష్కారం’దిశలో పయనిస్తుందని పలువురు సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం పాకిస్తాన్లో 33,00,000 మంది బాలకార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో ఇంటిపనుల్లో నిమగ్నమైన మొత్తం 85 లక్షల మంది కార్మికుల్లో అత్యధిక శాతం మంది మహిళలు, బాలికలేనని అంతర్జాతీయ కార్మిక సంఘం(ఐఎల్ఓ) పేర్కొంది. -
మహిళ చేతివాటం, దెబ్బకి బ్యాన్ చేసిన వాల్‌మార్ట్
పాతకాలం సంగతేమిటోగానీ ఈ కాలం దొంగలను కనిపెట్టడం చాలా కష్టం సుమీ. అమెరికా అంటే టెక్నాలజీకి పెట్టింది పేరు. ఆ టెక్నాలజీతో ఒక్క దొంగతనం జరగకుండా చూడవచ్చు. అయినప్పటికీ చిన్నాచితక దొంగతనాల వల్ల పెద్ద పెద్ద షాపులు సైతం బిక్కచచ్చిపోతున్నాయి.ఏంచేయాలో తోచక దిక్కులు చూస్తున్నాయి. షాప్‌లిఫ్టింగ్ అనేది అమెరికాలో పెద్ద సమస్యగా మారింది, ఒక నివేదిక ప్రకారం 2019 నుంచి 2023 మధ్య అమెరికా అంతటా షాప్ లిఫ్టింగ్ 93 శాతం పెరిగింది. గత సంవత్సరం కూడా తక్కువేమీ లేదు.సౌత్ మెంఫిస్ వాల్ మార్ట్ నుంచి నూడుల్స్, ఇతర ప్యాకెట్లను దొంగిలించినందుకు అష్లే క్రాస్ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. 37 ఏళ్ల క్రాస్ చిన్నాచితక దొంగతనాల్లో పెద్ద పేరు తెచ్చుకుంది. అష్లే క్రాస్‌ను మల్టీనేషనల్ రిటైల్ స్టోర్ వాల్‌మార్ట్ ‘అథరైజేషన్ ఆఫ్ ఏజెన్సీ’ జాబితాలో చేర్చింది. అమెరికాలోని ఏ వాల్ మార్ట్లోకీ అడుగు పెట్టకుండా ఆమెను నిషేధించారు.‘మేము మా కస్టమర్లకు విలువ ఇస్తాం. వారు ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభవాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటాం. అరుదుగా అయినప్పటికీ కొందరిని స్టోర్లలోకి స్వాగతించని సందర్భాలు ఉన్నాయి’ అని వాల్‌మార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!ఒక్కో గ్రాము ధర రూ. 53 వేల కోట్లు, అంత ‘మ్యాటర్’ ఏముంది? -
కేడీల ఆట కట్టించిన హైదరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా (Rohit Kedia) ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు నిందితులు దాదాపు రూ.40 కోట్ల విలువైన సొత్తు దోచుకుపోగా... అత్యంత వేగంగా స్పందించిన పోలీసులు 20 గంటల్లో వారిని పట్టుకున్నారు. ఈ నిందితుల్లో ఒకరు గతేడాది దోమలగూడ పోలీసుస్టేషన్ (Domalguda Police Station) పరిధిలో స్నేహలత దేవిని చంపి, రూ.కోటి విలువైన సొత్తు దోపిడీకి పాల్పడిన కేసులో వాంటెడ్‌గా ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) పేర్కొన్నారు. తూర్పు మండల డీసీపీ బాలస్వామి, అదనపు డీసీపీలు అందె శ్రీనివాసరావు, జె.నర్సయ్యలతో కలిసి గురువారం ఐసీసీసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్వాల్ వివరాలు వెల్లడించారు. కుమార్తె పెళ్లి పనుల కోసం.. రాజేంద్రనగర్‌లో కేడియా ఆయిల్స్ కంపెనీ నిర్వహిస్తున్న రోహిత్ కేడియా హిమాయత్ నగర్లో నివసిస్తున్నారు. ఆయన కుటుంబం వద్ద దాదాపు 20 మంది పనివాళ్లు ఉన్నారు. దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఉండే వీరి ఇంటి ప్రాంగణంలోనే పనివాళ్ల కోసం మూడంతస్తుల భవనం నిర్మించారు. రోహిత్ ఇంట్లో బిహార్‌లోని బిరోల్ గ్రామానికి చెందిన సుశీల్ ముఖియా రెండేళ్ల పాటు పని చేసి ఏడాది క్రితం మానేశాడు. ఇటీవల రోహిత్ కుమార్తె వివాహం నిశ్చయం కావడంతో పాటు దుబాయ్‌లో డెస్టిషన్ మ్యారేజ్ చేయాలని నిర్ణయించారు. పెళ్లి పనుల కోసం సహాయంగా ఉండటానికి సుశీల్‌ను సంప్రదించిన రోహిత్ 15 రోజుల క్రితం పిలిపించారు. ఇదే ఇంట్లో పని చేసే పశ్చిమ బెంగాల్ మహిళ బసంతి ఆర్హికి ఇతడితో గతంలోనే వివాహేతర సంబంధం ఉంది. నేరగాడితో గతంలో ఉన్న పరిచయంతో.. సుశీల్‌తో పాటు బసంతి సైతం మిగిలిన పని వాళ్లతో కలిసి రోహిత్ ఇంటి ప్రాంగణంలోని భవనంలోనే ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం రోహిత్ ఫ్యామిలీ మొత్తం గత వారం దుబాయ్ వెళ్లింది. ఇదే అదనుగా భావించిన సుశీల్.. ఆ ఇంటిని దోచేయడానికి ఢిల్లీలో ఉండే తన స్నేహితుడు మోల్హు ముఖియాను నగరానికి పిలిపించాడు. గత ఏడాది దోమలగూడ పరిధిలో స్నేహలత అనే వృద్ధురాలిని హత్య చేసిన బిహారీలు రూ.కోటి సొత్తు దోచుకుపోయారు. ఈ కేసులో ఆమె ఇంట్లో పని చేసే మహేష్ ముఖియాతో పాటు మోల్హు, రాహుల్ నిందితులుగా ఉన్నారు. దోపిడీ జరిగిన ఎనిమిది నెలలకు మహేష్ చిక్కినా.. మిగిలిన ఇద్దరూ పరారీలోనే ఉండిపోయారు. మోల్హు నేర చరిత్ర తెలిసిన సుశీల్ తాజా నేరం కోసం ఢిల్లీ తలదాచుకున్న అతడిని పిలిపించాడు. వీరిద్దరూ కలిసి మంగళవారం తెల్లవారుజామున సర్వెంట్స్ బిల్డింగ్ నుంచి రోహిత్ ఇంట్లోకి ప్రవేశించారు. అల్మారాలు, లాకర్లు పగులకొట్టి 710 గ్రాముల వజ్రాలతో కూడిన ఆభరణాలు, 1.4 కేజీల స్వర్ణాభరణాలు, రూ.19.63 లక్షలు, 24 దేశాల కరెన్సీ, 215 గ్రాముల వెండి అపహరించారు.మూడు నగరాలకు ప్రత్యేక బృందాలు... మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రోహిత్ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని రోహిత్ మేనేజర్ అభయ్ కేడియా గుర్తించారు. వెంటనే నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసును ఛేదించడానికి నారాయణగూడ పోలీసు, టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితులు ముగ్గురూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారని, అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కారని గుర్తించారు.చదవండి: సైబర్ నేరాలతో రూ.88.58 లక్షల కోట్లు దోపిడీ దీంతో మూడు ప్రత్యేక బృందాలు భోపాల్, నాగ్‌పూర్, పట్నాలకు వెళ్లి కాపుకాశాయి. డీసీపీ బాలస్వామి మహారాష్ట్ర పోలీసులతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించి ఈ నిందితుల సమాచారం ఇచ్చారు. దీంతో మంగళవారం రాత్రి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నాగ్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. నగర పోలీసులు, అక్కడి జీఆర్పీ అధికారులతో కలిసి సోదాలు చేశారు. ముగ్గురు నిందితులతో పాటు చోరీ సొత్తు మొత్తం స్వాదీనం చేసుకుని నగరానికి తీసుకువచ్చారు.ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇస్తాంరోహిత్ కేడియా ఇంటి నుంచి చోరీ అయిన సొత్తులో వజ్రాలే 3,300 క్యారెట్లు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఒక్కో క్యారెట్ రూ.1.12 లక్షలు పలుకుతోంది. ఈ ప్రకారం చూస్తే వీటి విలువే రూ.37 కోట్ల వరకు ఉంది. వీటితో పాటు భారీగా విదేశీ కరెన్సీ, బంగారం, నగదు చోరీకి గురయ్యాయి. సొత్తు మొత్తం రికవరీ చేసి వీడియో కాల్ ద్వారా దుబాయ్‌లో ఉన్న యజమానికి చూపించి ఖరారు చేసుకున్నాం. భారీ సొత్తు చోరీ, రికవరీపై ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించాం. నగదు, సొత్తును యజమాని వారి వద్ద డిక్లేర్ చేశారా? లేదా? అనేది ఆ అధికారుల విచారణలో వెలుగులోకి వస్తుంది. – సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ -
కిలాడీ పనిమనిషి
కర్ణాటక: ఏడాదిన్నర కాలంగా పని చేస్తున్న ఇంటిలోని గుట్టుమట్లను తెలుసుకుంది, ఓ రోజు బంగారు, నగదు చోరీ చేసి, చివరకు కటకటాల పాలైన పనిమనిషి ఉదంతమిది. వివరాలు.. పరప్పన అగ్రహార ఠాణా పరిధిలోని ఓ ఇంటిలో నిందితురాలు పనిచేసేది. చాలా బంగారు ఆభరణాలు, నగదు ఉండటాన్ని గమనించిన కిలాడీలో దుర్బుద్ధి పుట్టింది. బంగారు నగలు, నగదు మాయం చేసి ఏమీ తెలియనట్లు పని చేసుకుంటోంది. సొత్తు కనబడకపోవడంతో ఇంటి యజమాని ఆమెపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు కాగానే భర్త, అతని అన్నతో కలిసి నిందితురాలు పరారైంది. పోలీసులు గాలింపు జరిపి ముగ్గురినీ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 లక్షల విలువ చేసే 273 గ్రాముల బంగారం, నగదును స్వాదీనపరచుకున్నారు. -
2,500 ఏళ్లనాటి బంగారు హెల్మెట్‌ను... ఎత్తుకెళ్లారు
ఎస్సెన్ (నెదర్లాండ్స్): నెదర్లాండ్స్‌లో దొంగలు ఏకంగా వేల ఏళ్లనాటి బంగారు హెల్మెట్‌పైనే కన్నేశారు. ఎలాగైనా చేజిక్కించుకోవాలనుకున్నారు. చివరికి అనుకున్నది సాధించారు. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను బాంబులతో బద్ధలుకొట్టి మరీ దోచుకెళ్లిపోయారు. అది ఏకంగా 2,500 ఏళ్లనాటి బంగారు హెల్మెట్! దాంతో ఈ దొంగతనం సంచలనం సృష్టించింది. ప్రాచీన వస్తు ప్రదర్శన కోసం తమ దేశం నుంచి నెదర్లాండ్స్ పట్టుకుపోయిన అత్యంత విలువైన వస్తువులు చోరశిఖామణుల పాలబడటంతో రొమేనియా సైతం దిగ్భ్రాంతికి గురైంది. నెదర్లాండ్స్‌లోని ఎస్సెన్ నగరంలోని డ్రెంట్స్ పురాతన వస్తుప్రదర్శనశాలలో ఈ భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున ముసుగులు ధరించిన దొంగలు మ్యూజియం వద్దకొచ్చి బయటివైపు ఉన్న భారీ తలుపును రంధ్రాలు పెట్టే మెషీన్, ఇనుప రాడ్లతో ఎలాగోలా తెరిచారు. అక్కడే లోపలివైపు ఇంకో భారీ తలుపు ఉంది. అత్యంత పటిష్టంగా ఉన్న దీనిని మామూలుగా తెరవడం సాధ్యంకాదని దొంగలకు తెలుసో ఏమో, ముందుజాగ్రత్తగా పెద్ద బాంబును వెంట తెచ్చుకున్నారు. తలుపుకు బాంబు అమర్చి పేల్చేశారు. తునాతునకలైన ద్వారం గుండా ఎంచక్కా లోపలికి వెళ్లి అక్కడ అత్యంత ప్రాచీనమైన నాలుగు వస్తువులను తీసుకుని ఉడాయించారు. వెలకట్టలేని హెల్మెట్ చోరీకి గురైన వాటిల్లో 2,500 ఏళ్ల క్రితం నాటి పుత్తడితో చేసిన హెల్మెట్ ఉంది. క్రీస్తుపూర్వం 50వ సంవత్సరంలో దీనిని తయారు చేశారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. దాదాపు 907 గ్రాముల బరువైన ఈ హెల్మెట్‌ను రొమేనియాలో వంద సంవత్సరాల క్రితం ఒక కుగ్రామంలో కనుగొన్నారు. ‘హెల్మెట్ ఆఫ్ కోటోఫెనెస్టీ’గా పిలుచుకునే దీనిని పూర్వకాలంలో ఉత్సవాలు, సంబరాల్లో ఉపయోగించేవారు. హెల్మెట్ ముందుభాగంలో పెద్ద కళ్లను చెక్కారు. దుష్టశక్తుల బారిన పడకుండా కాపాడుతుందని ఆనాటి జనం విశ్వసించేవారు. జంతు వధ చేస్తున్నట్లుగా హెల్మెట్ వెనుకవైపు చెక్కారు. రొమేనియా సంస్కృతి సంబంధించి ఇది వెలకట్టలేని ప్రాచీన కళాఖండమని చోరీ తర్వాత రొమేనియా ప్రభుత్వం ఆవేదన వ్యక్తంచేసింది. దీంతోపాటు డేసియన్ల రాజ్యానికి చెందిన అలనాటి రాయల్ బ్రేస్లెట్సహా మూడు వస్తువులనూ దొంగలు పట్టుకెళ్లిపోయారు. రోమన్లు రొమేనియాను పాలించడానికి ముందు రాజ్యమేలిన డేసియన్ల సంస్కృతిని కళ్లకుకట్టేందుకు ఆనాటి వస్తువులను ఒక దగ్గరకు చేర్చి నెదర్లాండ్స్ ప్రభుత్వం ఒక ప్రదర్శనను ఏర్పాటుచేసింది. గత ఏడాది జూలై నుంచి ఈ ప్రదర్శన కొనసాగుతోంది. కీలకమైన హెల్మెట్‌ను సైతం రొమేనియా నుంచి తెప్పించిమరీ ప్రదర్శనకు ఉంచగా అది కాస్తా ఇప్పుడు దొంగలపరమైంది.చోరుల కోసం వేట మొదలు మళ్లీ అప్పజెప్తామని చెప్పి బుకారెస్ట్ నగరంలోని ‘నేషనల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ రొమేనియా’ నుంచి తీసుకొచ్చిన ప్రాచీన వస్తువులు పోవడంతో నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ చోరీ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వారం క్రితం చోరీకి గురైన ఒక కారు ఈ మ్యూజియం దగ్గర కాలిపోయిన స్థితిలో ఉండటం చూసి ఈ రెండు చోరీలకు ఏమైనా సంబంధం ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. కొట్టుకొచ్చిన కారులో ఇక్కడికొచ్చిన దొంగలు ఆ తర్వాత పారిపోతూ నాలుగు మైళ్ల దూరంలో కారును వదిలేసి తగలబెట్టిపోయారని పోలీసులు భావిస్తున్నారు. కొట్టేసిన కారుకు నకిలీ నంబర్ ప్లేట ఉండటం చూస్తుంటే ఇదేదో ఆరితేరిన దొంగలముఠా పనిగా అనుమానిస్తున్నారు. ‘‘ మా మ్యూజియం 170 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలాంటి చోరీ ఘటన చూడలేదు. నిజంగా ఇది దురదృష్టకరం’’ అని ఎస్సెన్లోని డ్రెంట్స్ మ్యూజియం డైరెక్టర్ హ్యారీ ట్యూపన్ అన్నారు. -
మారలేదు.. ఇక మారడని..!
మధిర: బస్సులో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో తల్లిదండ్రులను ఎదిరించి మరీ మతాంతర వివాహం చేసుకుంది. ఇంతలోనే భర్త పెళ్లిముందు చెప్పినట్లు ఉద్యోగం చేయటంలేదని, పలు చోరీ కేసుల్లో నిందితుడని తెలియడంతో తల్లడిల్లిపోయింది. తప్పుడు పనులు ఆపేయాలని, కష్టపడి బతుకుదామని చెప్పిచూసింది. అయినా అతడిలో మార్పు రాకపోవటంతో అవమాన భారం భరించలేక ఇద్దరు కుమార్తెలను హత్య చేసి, తానూ బలవన్మరణానికి పాల్పడింది. గుండెను మెలిపెడుతున్న ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామంలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన మౌనిక అలియాస్ ప్రెజా (30) ఐదేళ్ల క్రితం విజయవాడ నుంచి మధిరకు బస్సులో వస్తుండగా.. మధిర మండలం నిదానపురానికి చెందిన షేక్ బాజీ ఆమె పక్క సీట్లో కూర్చున్నాడు. అక్కడ వారిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మౌనిక తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకపోవటంతో ఆమె బాజీతో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. వీరికి మెహక్ (4), మెనురూల్ (3) అనే కుమార్తెలు ఉన్నారు. నిదానపురంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.అవమానంతో అసాధారణ నిర్ణయం.. ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన బాజీ.. నిజానికి పలు చోరీ కేసుల్లో నిందితుడని మౌనికకు తెలిసింది. దీంతో చోరీలు మానేయాలని భర్తకు నచ్చజెప్పింది. అయినా అతడిలో మార్పు రాలేదు. బాజీపై ఈ నెల 22న (బుధవారం) ఖమ్మం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు విచారణ ప్రారంభించారు. బోనకల్ మండలం మోటమర్రిలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం నిదానపురం చేరుకున్న పోలీసులు.. బాజీ చోరీ చేస్తుండగా సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియో, ఫొటోలు ఆమెకు చూపించారు. దీంతో ఆమె గుండె పగిలిపోయింది. ఆ బాధలోనే కఠిన నిర్ణయం తీసుకుంది. అద్దెకు తీసుకున్న రేకుల షెడ్డు ఇనుప పైపునకు చీరలను కట్టి ఇద్దరు కుమార్తెలకు ఉరి వేసింది. ఆపై మరో చీరతో ప్రెజా సైతం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో వైరా ఏసీపీ రెహమాన్, మధిర సీఐ మధు, ఎస్సై లక్ష్మీభారవి అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లింట్లో భారీ చోరీ
అనంతపురం: పెళ్లింట్లో దొంగలు పడ్డారు. సుమారు రూ.3.50 కోట్ల విలువైన బంగారం, రూ.20 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. అనంతపురం నగరంలోని ఓ ఇంట్లో బుధవారం వేకువజామున ఈ భారీ చోరీ జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. అనంతపురం మండలం కాట్నేకాలువ గ్రామానికి చెందిన కొండ్రెడ్డి వెంకటశివారెడ్డి నగరంలో స్థిరపడ్డారు. భూములు అధికంగా ఉండడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొండ్రెడ్డి వెంకటశివారెడ్డి, కవిత దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఏలూరుకు చెందిన బుసిరెడ్డి ఆదినారాయణరెడ్డి కుమారుడితో ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 7న అనంతపురం ఎంవైఆర్ కల్యాణ మండపంలో వివాహం జరిపేందుకు నిశ్చయించారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి కుమార్తెకు బహుమతిగా ఇవ్వనున్న బంగారం, వెంకటశివారెడ్డి, కవిత దంపతులకు చెందిన బంగారంతో పాటు వెంకట శివారెడ్డి అత్త, మామ, వియ్యంకుల బంగారు ఆభరణాలు కలిపి సుమారు 5 కిలోల బంగారాన్ని ఇంట్లోని లాకర్లో ఉంచారు. కాగా.. శివారెడ్డి దంపతులు తెలంగాణలో ఉన్న తమ బంధువుల్ని పిలిచేందుకు వెళ్లగా.. ఇదే అదునుగా భావించిన దొంగలు బుధవారం వేకువజామున 4 గంటలకు ఇంట్లోకి చొరబడ్డారు. ఊచలు తొలగించి ఇంట్లోకి వెళ్లి తొలుత బీరువా తాళాలు పగులగొట్టారు. అందులో ఉన్న లాకర్ తాళం తీసుకుని.. లాకర్లోని సుమారు ఐదు కిలోల బంగారాన్ని, బీరువాలోని రూ.20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. మొత్తం ఐదుగురు దొంగల ముఠా చోరీలో పాల్గొన్నట్టు సీసీ కెమెరాల ఫుటేజీలను బట్టి తెలుస్తోంది. ఇంట్లో సీసీ కెమెరాలు లేనప్పటికీ ఎదురింటి సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. మరో రెండు ఇళ్లలోనూ చోరీ కాగా.. వెంకటశివారెడ్డి ఇంటి పక్కనే ఉంటున్న డిప్యూటీ కమిషనర్ ఇంట్లో రూ.75 వేలు, మిస్టర్ ఛాయ్ నిర్వాహకుడు ఇంట్లోనూ చోరీ జరిగింది. వీరు ఇంకా ఇళ్లకు చేరుకోకపోవడంతో అందులో ఎంత మొత్తం చోరీ జరిగిందనే అంశంపై స్పష్టత రాలేదు. ఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. ఈ చోరీ వెనుక తెలిసిన వారి హస్తం ఉందా? లేక రాటుదేలిన దొంగల ముఠా పనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పొన్నాల ఇంట భారీ చోరీ
హైదరాబాద్, సాక్షి: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్షన్నర నగదుతో పాటు భారీగా అభరణాలు దొంగలు దోచుకెళ్లారు. ఫిలిం నగర్ పోలీసులకు ఈ ఘటనపై పొన్నాల సతీమణి అరుణాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తిరుమల: బంగారు బిస్కెట్ చోరీ ఘటన కీలక మలుపు
తిరుమల: తిరుమల (Tirumala) పరకామణిలో బంగారు బిస్కెట్ (Gold biscuit) చోరీ ఘటన కీలక మలుపు తిరిగింది. ఇటీవల 100 గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ పట్టుబడిన నిందితుడిని తిరుమల వన్‌టౌన్ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య శ్రీవారి పరకామణిలో అగ్రిగోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు.ఇతను తొందరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏడాదిగా పరకామణిలోని గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉంచే బంగారు వస్తువులను దొంగలిస్తూ వస్తున్నాడు. ఈ మేరకు అతనిపై నిఘా ఉంచగా.. ఈనెల 11న మధ్యాహ్నం గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను దొంగలించి దానిని ట్రాలీకి ఉన్న పైపుల్లో దాచిపెట్టాడు. తనిఖీ సమయంలో టీటీడీ భద్రతా సిబ్బంది గుర్తించడంతో పెంచలయ్య పరారయ్యాడు.ఈ విషయమై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. విచారణలో మొత్తం 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, బంగారు ఆభరణాలు మొత్తం 655 గ్రాములు, 157 గ్రాముల వెండి వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
కేరళలో చోరీ..సికింద్రాబాద్‌లో షెల్టర్!
సాక్షి, సిటీబ్యూరో: కేరళలోని తిరునల్వేలి జిల్లా మూలక్రాయ్పట్టిలో ఉన్న జ్యువెలరీ దుకాణంలో రెండు కేజీలకు పైగా బంగారు ఆభరణాలు చోరీ చేసి, నాలుగున్నర నెలలుగా పరారీలో ఉన్న రామకృష్ణన్‌ను అక్కడి పోలీసులు శనివారం సికింద్రాబాద్‌లో అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఆ సొత్తును తాను తల్లి మీనాక్షి వద్దే ఉంచానని చెప్పాడు. దీంతో ప్రత్యేక బృందం తిరునల్వేలి సమీపంలోని రెట్టార్కులం గ్రామంలోని వారి ఇంటిపై దాడి చేసి సొత్తు స్వా«దీనం చేసుకున్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక మీనాక్షి ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. అక్కడ చోరీ చేసి సిటీకి వచ్చి... మూలక్రాయ్పట్టికి చెందిన వి.రెహ్మాన్ అక్కడే కొన్నేళ్లుగా జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆ సమీపంలోని రెట్టార్కులం గ్రామానికి చెందిన రామకృష్ణన్ ప్రైవేట్ ఉద్యోగి. జల్సాలకు అలవాటుపడిన ఇతగాడు కొన్నేళ్లుగా తిరునల్వేలి చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు పట్టబడకపోవడంతో పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదు. గత ఏడాది ఆగస్టులో ఇతడి కన్ను రెహా్మన్ నిర్వహిస్తున్న జ్యువెలరీ దుకాణంపై పడింది. ఆ నెల 22 రాత్రి షెల్డర్ పగులకొట్టి లోపలకు ప్రవేశించిన రామకృష్ణన్ 2.22 కేజీల బంగారం, రూ.3 లక్షల నగదు తస్కరించాడు. ఆ సొత్తును బయటకు తీయకుండా దాచి ఉంచి, కొన్నాళ్లు తన స్వస్థలానికి దూరంగా ఉంటే పోలీసులకు చిక్కనని భావించాడు. స్నేహితుడిది అంటూ తల్లికి ఇచ్చు... మర్నాడు దుకాణం తెరిచిన వెంటనే కనిపించిన సీన్‌తో తన దుకాణంలో జరిగిన చోరీ విషయం రెహా్మన్ గుర్తించాడు. దీనిపై మూలక్‌రాయ్‌పట్టి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు కోసం తిరునల్వేలి ఎస్పీ నేతృత్వంలో తొమ్మిది ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. గుర్తించిన జ్యువెలరీ దుకాణం నుంచి తస్కరించిన నగదు తన వద్ద ఉంచుకున్న రామకృష్ణన్ బంగారం మాత్రం నేర్పుగా ప్యాక్ చేశాడు. రెట్టార్కులంలోని తల్లికి దీన్ని ఇచ్చి ఇంట్లో ఉంచాలని సూచించాడు. దుబాయ్ వెళ్తున్న తన స్నేహితుడు కొన్ని విలువైన వస్తువులు ప్యాక్ చేసి, భద్రపరచాలని ఇచ్చాడంటూ ఆమెను నమ్మించాడు. నగదుతో గత ఏడాది ఆగస్టు 23న కేరళ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. హో టళ్లలో బస, ఖరీదైన మద్యం, ఆహారం, జల్సాలతో మూడు నెలల్లోనే రూ.3 లక్షలు ఖర్చు చేసేశాడు. నిర్మాణం వద్ద కాపలాదారుడిగా పని... దీంతో సికింద్రాబాద్‌లోని ఓ నిర్మాణం వద్ద కాపలాదారుడిగా ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. కనీసం ఏడాది పాటు ఇక్కడ తలదాచుకుని ఆపై స్వస్థలానికి వెళ్లాలని భావించాడు. ఆ తర్వాత తల్లి వద్ద ఉన్న సొత్తును విక్రయించి సొమ్ము చేసుకోవాలని అనుకున్నాడు. సికింద్రాబాద్‌లో కొత్త ఫోన్ నెంబర్ తీసుకున్న రామకృష్ణన్ దాన్ని వినియోగించి తల్లి మీనాక్షితో మాట్లాడటం మొదలెట్టాడు. మూలక్‌రాయ్‌పట్టి చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా రామకృష్ణన్‌ను నిందితుడిగా గుర్తించాయి. అయితే అతడి ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తల్లి ఫోన్‌పై నిఘా ఉంచాయి. ఆమెకు సికింద్రాబాద్‌లో ఉన్న నెంబర్ నుంచి ఫోన్లు వస్తున్నట్లు గుర్తించాయి. దీంతో శనివారం ఇక్కడకు వచి్చన ఓ స్పెషల్ టీమ్ రామకృష్ణన్‌ను పట్టుకుంది. ప్రాథమిక విచారణలోనే అతగాడు విషయాలన్నీ బయటపెట్టాడు.తీవ్ర అవమానంగా భావించిన మీనాక్షి.. నిందితుడిని తీసుకుని కేరళ బయలుదేరిన పోలీసులు జ్యువెలరీ దుకాణంలో చోరీ చేసిన సొత్తు అతడి తల్లి వద్ద ఉందనే విషయాన్ని అక్కడి టీమ్‌కు చెప్పారు. దీంతో ఓ బృందం ఆదివారం ఉదయం రెట్టార్కులం గ్రామంలోని రామకృష్ణన్ ఇంట్లో దాడి చేసి 2.22 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామంతోనే తన కుమారుడు దొంగగా మారాడనే విషయం మీనాక్షికి తెలిసింది. దీనికి తోడు గ్రామంలో అందరూ చూస్తుండగా పోలీసులు తమ ఇంట్లో సోదాలు చేయడం, చోరీ బంగారం రికవరీ చేయడాన్ని తీవ్ర అవమానంగా భావించింది. దీంతో పోలీసులు వెళ్లి కొద్దిసేపటిలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుస్టేషన్‌కు వచ్చి తిరిగి వెళ్లిన ఆమె భర్త ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ‘సోమవారం రామకృష్ణన్‌ను రెట్టార్కులం తీసుకువెళ్లి మీనాక్షి అంత్యక్రియలు పూర్తి చేయించాం. ఆపై కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించాం. అతడు ఇలాంటి మరికొన్ని నేరాలు చేసినట్లు అనుమానం ఉంది. కస్టడీలోకి తీసుకుని ఆ కోణంలో విచారిస్తాం’ అని తిరునల్వేలికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు.తిరునల్వేలిలో జ్యువెలరీ దుకాణాన్ని దోచేసిన రామకృష్ణన్ గత ఏడాది ఆగస్టులో చోటు చేసుకున్న ఈ భారీ దొంగతనం సొత్తు తల్లికి ఇచ్చి నగరానికి వచ్చి ప్రైవేట్ ఉద్యోగిగా మకాం సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్న అక్కడి కాప్స్ అతడి ఇంటి నుంచి సొత్తు సీజ్, అవమానంతో తల్లి ఆత్మహత్య -
విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్!
-
నేరాల్లో మరో కోణం!
సాక్షి, అమరావతి /హైదరాబాద్: చిల్లర దొంగతనాలు మొదలు రూ.కోట్లు కాజేసిన సైబర్ కేటుగాళ్ల ఉదంతాల వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది కాలంలో వివిధ నేరాలు చోటుచేసుకున్నాయి. అందుకు సంబంధించి బోలెడు ఎఫ్ఐఆర్లు సైతం నమోదయ్యాయి. కానీ వాటిలో కొన్ని విచిత్రమైన కేసులు పోలీసులను ఆశ్చర్యపరిచాయి. ఇంతకీ ఆ విచిత్ర కేసులేమిటంటే.. సైనేడ్ హత్యలుగుంటూరు జిల్లాలో ఓ తల్లీ కూతురు, వారి స్నేహితురాలు పాల్పడ్డ సైనేడ్ హత్యలు సంచలనం రేపాయి. ఈ ఏడాది సెప్టెంబరులో నాగూర్ బి అనే మహిళ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తుతో మొత్తం కుట్ర బయటపడింది. తెనాలికి చెందిన ముడియా రమణమ్మ, ఆమె కూతురు వెంకటేశ్వరి, వారి స్నేహితురాలు గునగప్ప రజినీ ముందస్తు పన్నాగంతో నాగూర్‌బీ అనే మహిళతో పరిచయం పెంచుకున్నారు. ఆమె బంగారం కాజేయాలని భావించారు.నాగూర్‌బీని నమ్మించి ఆటోలో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లారు. దారిలో ఆటో డ్రైవర్‌తో బ్రీజర్ కొనిపించారు. ఆ బ్రీజర్‌లో సైనేడ్ కలిపి నాగూర్బీతో బలవంతంగా తాగించి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కాజేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా అంతకుముందు కూడా ఇదే రీతిలో చేసిన హత్యలు కూడా బయటపడ్డాయి. నాగమ్మ అనే మహిళ నుంచి వెంకటేశ్వరి రూ.20 వేలు అప్పు తీసుకుంది. ఆ అప్పును ఎగవేసేందుకు సైనేడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగించి నాగమ్మను హత్య చేసింది. 2022లో వెంకటేశ్వరి తన అత్త సుబ్బలక్ష్మిని కూడా ఇలానే సైనేడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగించి హత్య చేసింది. తెనాలికి చెందిన మోషే అనే వ్యక్తి తన భార్యను తీవ్రంగా వేధించేవాడు. అతని ఇన్సూరెన్స్, పెన్షన్ డబ్బులు పంచుకోవాలనే ఒప్పందంతో రమణమ్మ, వెంకటేశ్వరి.. మోషే భార్యతో కలసి అతడిని హత్య చేశారు. రమణమ్మ, వెంకటేశ్వరి, రజినీ, ఆటో డ్రైవర్‌తోపాటు సైనేడ్ విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.దొంగ నోట్లు ఆశ చూపి..‘రూ.లక్ష ఇస్తే రూ.3 లక్షల దొంగనోట్లు ఇస్తాం’ అని ఆశ చూపించి స్నేహితుడిని హత్య చేసిన ఉదంతం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. కర్నూలు జిల్లా ఆస్పరిలో పెంటయ్య అనే రైతు అప్పుల పాలయ్యాడు. తన పొలాన్ని రూ.17.50 లక్షలకు విక్రయించాడు. ఆ సొమ్మును కాజేయాలని అతని స్నేహితులు బోడిగుండ నరసింహుడు, హనుమంతు భావించారు. ‘రూ.లక్ష ఇస్తే రూ.3 లక్షల దొంగనోట్లు ఇస్తాం... దాంతో నీ అప్పులన్నీ తీరిపోతాయి’ అని ఆశ చూపించారు. డబ్బులు పట్టుకుని ఆలూరు మండలం హళేబీడుకు రమ్మన్నారు. వారి మాటలు నమ్మిన పెంటయ్య రూ.7.50 లక్షలు తీసుకుని వెళ్లారు.అక్కడ స్నేహితులు ఆయనతో సైనైడ్ కలిపిన మద్యాన్ని బలవంతంగా తాగించి హత్య చేశారు. పెంటయ్య మృతదేహాన్ని సమీపంలోని పంపయ్య ఆచారి అనే వ్యక్తి పొలంలో పూడ్చి పెట్టారు. అందుకుగాను ఆచారికి కొంత సొమ్ము ముట్టజెబుతామన్నారు. రెండు రోజుల తర్వాత దుర్వాసన వస్తుండటంతో బోడిగుండ నరసింహుడు, హనుమంతు, పంపయ్య ఆచారీలు ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి ఆటోలో ఆస్పరి మండలంలోని చిన్న హోతూరు వంక వద్దకు తీసుకెళ్లి ముళ్ల పొదల్లో పడేసి వెళ్లారు. మృతదేహాన్ని సమీప గ్రామస్తులు గుర్తించడంతో పోలీసులు కేసు నమోదైంది. బోడిగుండ నరసింహుడు, హనుమంతు, పంపయ్య ఆచారీలను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.డామిట్.. కథ అడ్డం తిరిగింది!వదిన ఆస్తిని కాజేయడం కోసం భీమవరంలో ఓ వ్యక్తి పన్నిన ‘మృతదేహం పార్సిల్’ పన్నాగం విస్మయ పరిచింది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలానికి చెందిన శ్రీధర్ వర్మకు ఇద్దరు భార్యలతోపాటు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. తన రెండో భార్య రేవతి తల్లిదండ్రుల ఆస్తిపై అతను కన్నేశాడు. ఆ ఆస్తిలో తన రెండో భార్య అక్కకు కూడా వాటా ఉంది. దాంతో ఆమె వాటాను కూడా దక్కించుకోవడం కోసం ఓ ఎత్తుగడ వేశాడు. ఆమె (వదిన) నిర్మిస్తున్న ఇంటి కోసం రెండుసార్లు క్షత్రియ ఫౌండేషన్ పేరుతో నిర్మాణ సామగ్రిని పంపించాడు. మూడోసారి నిర్మాణ సామగ్రి పేరుతో ఓ మృతదేహాన్ని పార్సిల్ చేసి పంపాడు. అందుకోసం తన ప్రియురాలితో కలసి తన గ్రామానికి చెందిన మద్యానికి బానిసైన యువకుడిని హత్య చేశాడు.అతని మృతదేహాన్ని తన వదిన ఇంటికి పార్సిల్ పంపాడు. రూ.1.30 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ పార్సిల్లో ఓ లేఖ రాసి పెట్టాడు. ఆ పార్సిల్ చూడగానే వదిన భయపడి తనకు ఫోన్ చేసి పిలుస్తుందని.. ఆమెకు సహకరించినట్టుగా నటించి రూ.1.30 కోట్లు సర్దుబాటు పేరుతో ఆమె ఆస్తిని దక్కించుకోవాలన్నది శ్రీధర్ వర్మ పన్నాగం. అయితే తీవ్ర ఆందోళన చెందిన ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో మొత్తం కుట్ర బట్టబయలైంది. కాగా, ఆస్తి మొత్తం దక్కాక ఇద్దరు భార్యలను కూడా వదిలించుకుని ప్రియురాలు సుష్మాతో ఉడాయించాలని శ్రీధర్ వర్మ భావించాడు. దీంతో శ్రీధర్ వర్మ, అతని రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మాలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.మద్యంపై మక్కువతో.. పనిచేస్తున్న సంస్థలకు సున్నం పెట్టే వాళ్లు.. అన్నం పెట్టిన ఇంట్లోనే కన్నం వేసిన వాళ్ల గురించి అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఆయా నేరాల్లో సొమ్ము కాజేయడమే నిందితుల ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని ఆర్యూ పబ్‌లో పనిచేసే వినీత్‌కుమార్ అనే సెక్యూరిటీ గార్డు వెరైటీ చోరీకి పాల్పడ్డాడు. ఖరీదైన విదేశీ మద్యం తాగడం కోసం ఇద్దరు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి దాటాక పబ్‌లోకి ప్రవేశించి రాయల్ సెల్యూట్, చివాస్ రీగల్, మొహిట్ చాన్ దాన్ బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. పనిలో పనిగా పారిపోవడానికి ఉపయోగపడుతుందని రూ.2 లక్షల నగదు కూడా కొట్టేశాడు.మాస్టార్‌కు ఎదురైన ప్రేమ వేధింపులుబస్టాప్ లాంటి ప్రదేశాల్లో రోడ్‌సైడ్ రోమియోల ఆగడాల గురించి.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే కీచకులుగా మారిన ఉదంతాల గురించి అప్పుడప్పుడూ వింటుంటాం. కానీ హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఓ గురువుపై మనసు పారేసుకున్న ఓ యువతి తన ప్రేమను నిరాకరించాడన్న కోపంతో ఆయనపై క్షక్షగట్టింది. లెక్చరర్‌తోపాటు ఆయన కుమార్తె ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. దీనిపై బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో ఆ యువతి చివరకు జైలుపాలైంది.హుస్సేన్‌సాగర్‌లో ‘90 ఎంఎల్’స్టోరీసాధారణంగా ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. కానీ ఓ మందుబాబు మాత్రం మద్యం మత్తులో హుస్సేన్‌సాగర్‌లోకి దిగి ‘చుక్క’కావాలంటూ పోలీసులకు చుక్కలు చూపించాడు. నడుము లోతు నీళ్లున్న ప్రాంతంలో అతడు నిల్చుని ఉండటాన్ని చూసిన పర్యాటకులు ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాడనుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్న ఓ కానిస్టేబుల్ నీటిలోకి తాడు విసిరి, దాన్ని పట్టుకుని పైకి రావాల్సిందిగా యువకుడిని కోరాడు. కానీ అందుకు నిరాకరించిన మందుబాబు.. తనకు ‘90 ఎంఎల్’ ఇస్తేనే బయటకు వస్తానంటూ మొండికేశాడు. చివరకు గంటన్నరపాటు సాగిన డ్రామా అనంతరం పోలీసులు అతన్ని బయటకు రప్పించారు.‘అతడి’పైనా అత్యాచార యత్నంయువతులు, మహిళలపై అత్యాచారాలు, అత్యాచారయత్నాలకు సంబంధించిన కేసులు నేటికీ నమోదవుతుండటం చాలవన్నట్లు ఇద్దరు మహిళలు ఓ పురుషుడిపై అత్యాచారయత్నం చేయడం, నగ్నంగా వీడియోలు తీసి అతన్ని బెదిరించడం సనత్‌నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సదరు వ్యక్తికి మసాజ్ థెరపిస్టుగా పరిచయమైన ఓ మహిళ.. భరత్‌నగర్ కాలనీకి చెందిన మరో మహిళను పరిచయం చేసింది. ఇద్దరూ కలిసి అతన్ని భరత్‌నగర్ కాలనీలోని మహిళ ఇంటికి తీసుకెళ్లి మసాజ్ పేరుతో దుస్తులు విప్పించి అత్యాచారానికి యత్నించారు. అతడు నిరాకరించడంతో నగ్న వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి కొంత డబ్బు గుంజారు. ఆపై ఇంకా డబ్బివ్వాలని డిమాండ్ చేయడంతో ఈ ‘లైంగిక వేధింపులు’తట్టుకోలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.ఆమె అలా... అతడు ఇలాభిన్న మనస్తత్వాలుగల భార్యభర్తల్ని మనం చూస్తూనే ఉంటాం. హైదరాబాద్ లోని రామాంతపూర్‌లో నివసించే ఓ ‘విపరీత’జంట వ్యవహారం ఉప్పల్ ఠాణా అధికారుల దృష్టికి వచ్చింది. గతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో హౌస్ కీపర్‌గా పనిచేసిన మహిళ మద్యానికి బానిసగా మారింది. నిత్యం మద్యం తాగి రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ పోలీసులకు చిక్కేది. అంతటితో ఆగకుండా ఏకంగా పోలీసుస్టేషన్‌కే వచ్చి న్యూసెన్స్ చేసి వెళ్తుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఆమె భర్త కూడా తక్కువేం కాదు.. చుట్టుపక్కల కాలనీల్లోని ఇళ్ల గోడలు దూకి చెప్పులు, బూట్లు చోరీ చేసేవాడు. సీసీ కెమెరాల ఆధారంతో ఒకరోజు అతని ఇంటిపై దాడి చేసిన స్థానికులు వందల జతల పాదరక్షలు గుర్తించి పోలీసులకు అప్పగించారు. -
కొట్టేస్తే కొట్టేశారు గానీ.. పేదలకు పంచండి
లండన్: బ్రిటన్‌లోని యార్క్ నగరంలో క్రిస్మస్ మార్కెట్లో అమ్మడానికి రుచికరమైన పలు రకాల తాజా తినుబండారాలతో వ్యాన్ సిద్ధంగా ఉంది. వ్యాన్‌ను వాణిజ్యసముదాయానికి తరలించేలోపు దానిని ఎవరో దొంగలించారు. విషయం తెల్సుకున్న దాని యజమాని, పాకశాస్త్ర ప్రవీణుడు టామీ బ్యాంక్స్ ఒకింత బాధపడ్డారు. ప్రేమానురాగాలను కలిపి వంటచేసే చెఫ్‌లకు తాము వండిన ఆహార పదార్ధాలను ఇతరులకు వడ్డించడంలోనే ఆనందం, తృప్తి ఉంటాయి. టామీకి సైతం ఆ ఆనందమే ఎక్కువ. అందుకే తాను తయారుచేసిన పదార్థాలను దొంగలు ఎక్కడ పడేస్తారోననే బాధ ఎక్కువైంది. అందుకే వాటిని నేలపాలు చేయకుండా క్షుద్భాదతో తల్లడిల్లే పేదలకు పంచాలని బహిరంగ ప్రకటన చేశారు. బ్యాంక్స్‌కు యార్క్‌షైర్ కౌంటీలో ఒక పబ్‌తోపాటు రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. స్వతహాగా వంటవాడైన బ్యాంక్స్ తన రెస్టారెంట్లలో కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలను స్వయంగా తయారుచేస్తారు. తమ వ్యాన్ దొంగతనంపై తాజాగా ఆయన ఒక వీడియోను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ‘‘ చిన్న వ్యాన్‌లో ఖరీదైన తినుబండారాలున్నాయి. స్టీక్, ఏల్, బీర్లు, టర్కీ, బట్టర్‌నట్ స్క్వాష్ పై, కేక్‌లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ ఏకంగా రూ. 27,00,000 పైమాటే. వ్యాను అప్పనంగా దొరికిందన్న ఆనందంలో ఇంత ఖరీదైన ఆహారపదార్ధాలను పోతూపోతూ దారిలో పడేయకండి. పేదలకు పంచి వారి ఆకలి మంటలు తీర్చండి’’ అని వేడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘ఆహారం విలువ తెలిసిన నిజమైన చెఫ్’ అంటూ బ్యాంక్స్‌ను కొందరు నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు. బ్రిటన్‌లో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆహారపదార్ధాల చోరీలో ఇది తాజా ఘటనగా పేరొందింది. రెండు నెలల క్రితం లండన్‌లోని నీల్స్ యార్డ్ పాల ఉత్పత్తుల కేంద్రం వద్ద ఇలాంటి భారీ చోరీ జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఒక భారీ రిటైర్ సంస్థకు హోల్‌సేల్ పంపిణీదారుగా ప్రకటించుకుంటూ ఒక దొంగ ఈ డైరీకి వచ్చి ఏకంగా 48,488 పౌండ్ల బరువైన చీజ్‌ను దర్జాగా పట్టుకెళ్లిపోయాడు. దీని మార్కెట్ విలువ ఏకంగా రూ.3.30 కోట్లు. బ్రిటిష్, అంతర్జాతీయ పోలీసులు వేట మొదలెట్టి ఆ 63 ఏళ్ల పెద్దాయనను పట్టుకున్నాసరే చీజ్ జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు. -
కూకట్‌పల్లిలో భారీ చోరీ
మూసాపేట: కూకట్‌పల్లిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..టంగుటూరుకు చెందిన మధుసూదన్‌రావు, సంధ్యారాణి దంపతులు కూకట్పల్లి జయానగర్‌లోని శ్రీ సీతా ప్యాలెస్ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజులుగా వీరు అవసరాల నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నారు. గురువారం సాయంత్రం మధుసూదన్‌రావు ఇంటికి వచ్చి దుస్తులు తీసుకొని వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం డ్రైవర్ ఫోన్‌చేసి ఇంటి తలుపు తీసి ఉందని ఫోన్ చేసి చెప్పగా వెంటనే ఇంటికి వచ్చి చూసిన మధుసూదన్‌రావు దొంగతనం జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.గురువారం రాత్రి సుమారు 11.47 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మెట్ల మార్గంలో ఫ్లాట్‌లోకి వెళ్లినట్లు సీసీకెమెరాలో నమోదైంది. దొంగలు బెడ్రూమ్లోని డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనుక ఉన్న బీరువా తాళాలు తీసుకొని..బీరువాలో ఉన్న సుమారు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. 82 తులాల బంగారు నగలు, రూ.10 లక్షల విలువ చేసి డైమండ్ నెక్లెస్, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం 7.30 ప్రాంతంలో వాచ్మెన్ మొక్కలకు నీరు పోసేందుకు వెళ్లగా..ఫ్లాట్ డోర్ తెరిచి ఉందని గమనించి డ్రైవర్‌కు తెలియజేశాడు. వెంటనే డ్రైవర్ యజమానికి తెలపటంతో వారు వచ్చి చూసుకోగా బంగారు నగలు దొంగతనం అయినట్లు గమనించారు. కాగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనుక ఉన్న తాళాన్ని తీసుకొని దొంగతనం చేయటంతో తెలిసిన వారి పనై ఉండవచ్చని బాధితులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓ దొంగతనం.. ఆపై పంచాయితీ..
వట్పల్లి (అందోల్): దొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తల్లీకుమారుడు ఆత్మహత్యా యత్నం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంగారెడ్డికి చెందిన ఓ వ్యక్తి అందోలు మండలం చింతకుంట గ్రామంలో జరిగిన విందుకు ఆదివారం టాటా ఏస్ వాహనంలో వచ్చాడు. సోమవారం తిరిగి వెళ్లిపోదామని నిర్ణయించుకొని వాహనాన్ని గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో నిలిపాడు. అదే గ్రామానికి చెందిన తాగుడుకు బానిసైన వడ్ల శ్యామ్ (21) ఆ వాహనాన్ని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎత్తుకెళ్లాడు. కౌడిపల్లి మండలం బుజరంపేట గ్రామ శివారుకు వెళ్లగానే వాహనం కాల్వలో ఇరుక్కుపోయింది. దానిని బయటకు తీసే ప్రయత్నంలో భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు లేచి దొంగ దొంగ అని అరిచారు. దీంతో శ్యామ్ వెంటనే సమీపంలోని ఓ బైక్‌ను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. బుజరంపేట గ్రామస్తులు దుంపలకుంటలోని సీసీ ఫుటేజీని పరిశీలించి వడ్ల శ్యామ్‌ను గుర్తించారు. గ్రామ పెద్దలతో సమావేశమై శ్యామ్‌ను తమకు అప్పగించాలని, లేకపోతే వాహనాన్ని ఇచ్చేది లేదని హెచ్చరించారు. అనంతరం శ్యామ్ తండ్రి యాదయ్యను పిలిపించి జరిగిన విషయాన్ని వివరించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం శ్యామ్ అతడి తల్లిదండ్రులు యాదయ్య, బాలమణి (46), చిన్నమ్మ మమత బుజరంపేటకు పంచాయితీకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. తండ్రి, చిన్నమ్మ బస్‌లో బయలుదేరగా, శ్యామ్ తల్లి బాలమణితో బైక్‌పై బయలుదేరాడు. చింతకుంట బ్రిడ్జిపైకి రాగానే బైక్‌ను ఆపి మొదట శ్యామ్ మంజీరా నీళ్లలోకి దూకగా, అనంతరం తల్లి దూకింది. విషయం తెలుసుకున్న జోగిపేట, చిలప్‌చెడ్ పోలీసులు వేర్వేరుగా గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. -
మంత్రి శ్రీధర్‌బాబు నివాసంలో సెల్‌ఫోన్ చోరీ
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్.12లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉంటున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నివాసంలో సెల్‌ఫోన్ చోరీకి గురైంది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో క్వార్టర్ నెంబర్–7లో మంత్రి శ్రీధర్‌బాబు ఉంటున్నారు. గత నెల 31వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి ఇంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీఏ సతీ‹Ùకుమార్ లక్ష్మీపూజ నిర్వహించాడు. పూజ అనంతరం రాత్రి 9.30 గంటలకు ఆయన ఫోన్ కోసం చూడగా కనిపించలేదు. అన్ని ప్రాంతాలు వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. మంత్రి ఇంట్లో పూజలకు ఎంతోమంది అతిథులు వచ్చారని, ఎలా చోరీకి గురైందో తెలియదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పూజల్లో నిమగ్నమై ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు సెల్‌ఫోన్ చోరీ చేసి ఉంటారని పేర్కొన్నారు. దీపావళి తర్వాత వారం రోజులుగా తాను విధి నిర్వహణలో బీజీగా ఉన్నానని, దీంతో శనివారం ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. -
HYD: ట్రావెల్ బస్సులో భారీ చోరీ.. పోలీస్‌స్టేషన్‌కు ప్రయాణికులు
సాక్షి,రంగారెడ్డి : ఏపీలోని మండపేట నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శుక్రవారం(నవంబర్ 8) తెల్లవారుజామున భారీ చోరి జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా బ్యాగులో నుంచి రూ.15లక్షల విలువైన బంగారు ఆభరణలను ఎవరో దొంగిలించారు.తన బ్యాగులో ఉండాల్సిన బంగారం కనిపించలేదని మహిళ చెప్పడంతో తొలుత డ్రైవర్ బస్సును హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ఆపేశాడు. అనంతరం బస్సును అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్‌కు తరలించాడు.బస్సులో ప్రయాణం చేసిన మొత్తం 40 మంది ప్రయాణికులు ఉదయం 6 గంటల నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చోరీకి సంబంధించి బాధిత మహిళ ఫిర్యాదుతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: మానవ అక్రమ రవాణా కేసులో ఆరుగురికి జీవిత ఖైదు -
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. విలువైన పత్రాలు మాయం!
సాక్షి, కొమురంభీం జిల్లా: కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. బీరువా తాళాలు పగులగొట్టి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.తన ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పందించారు. తెలంగాణలో దోపిడీ దొంగల పాలన నడుస్తుందని మండిపడ్డారు. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని తన ఇంట్లో దొంగలు పడ్డారని.. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారని తెలిపారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా డీజీపీని ఆయన కోరారు.తెలంగాణ లో దోపిడి దొంగల పాలన నడుస్తున్నది. ఇది ముమ్మాటికీ నిజం. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని మా స్వగృహం లో దొంగలు పడ్డారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారు.దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా @TelanganaDGP గారిని కోరుతున్న.My home in… pic.twitter.com/A5ewLPMzCa— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 31, 2024 -
స్టోక్స్ పాక్ పర్యటనలో ఉన్నవేళ.. కుటుంబానికి భయానక అనుభవం
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పలు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. స్టోక్స్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ సారథి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.ముసుగు దొంగలు తన ఇంట్లో ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారని స్టోక్స్ తెలిపాడు. ఆ సమయంలో తన భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారని.. అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి హానీ జరగలేదన్నాడు. ఈ పని ఎవరు చేశారో తెలియాల్సి ఉందని.. త్వరగా దొంగలను పట్టుకోవడంలో తమకు సహకరించాలని కోరాడు. పాక్ పర్యటనలో ఉన్న సమయంలోఏదేమైనా కష్ట సమయంలో తన కుటుంబానికి పోలీసులు అండగా ఉన్నారని.. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘అక్టోబరు 17, గురువారం.. ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు నార్త్ ఈస్ట్‌లో గల కాసిల్ ఈడెన్ ఏరియాలో ఉన్న మా ఇంట్లోకి చొరబడ్డారు. నా భార్యా పిల్లలకు భయానక అనుభవంర్యా నగలు, విలువైన వస్తువులు ఎత్తుకుపోయారు. అందులో మా కుటుంబానికి అతి ముఖ్యమైన వస్తువులు కూడా ఉన్నాయి. దొంగలను పట్టుకునేందుకు దయచేసి నాకు సహాయం చేయండి. నిజానికి ఈ దుర్ఘటన జరిగినపుడు నా భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అయితే, వారిపై దొంగలు ఎలాంటి భౌతిక దాడికి పాల్పడలేదు. కానీ.. ఆ సమయంలో వారి మనఃస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందో.. దాని ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అందుకే ఫొటోలు షేర్ చేస్తున్నానా ఇంట్లో చోరీకి గురైన వస్తువుల ఫొటోలు విడుదల చేస్తున్నాను. వాటిని ఎవరైనా సులువుగా గుర్తించవచ్చు. తద్వారా దొంగలను పట్టుకునే వీలు కలుగుతుంది. మాకెంతో ముఖ్యమైన వస్తువులు పోయినప్పటికీ.. కేవలం వాటిని రికవరీ చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ పోస్టు పెట్టడం లేదు.ఈ పని చేసిన దుండగులు ఎవరో కనిపెట్టడం కోసమే వాటి ఫొటోలు షేర్ చేస్తున్నా. విపత్కరకాలంలో మా కుటుంబానికి స్థానిక పోలీసులు అండగా నిలిచారు. వారి మేలు మర్చిపోలేనిది. ఆ దొంగలను పట్టుకునేందుకు మేమంతా తీవ్రం శ్రమిస్తున్నాం’’ అని స్టోక్స్ ఎక్స్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు.పాక్ చేతిలో ఘోర ఓటమికాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు స్టోక్స్ ఇటీవల పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా తొలి మ్యాచ్‌కు అతడు దూరంగా ఉన్నాడు. అయితే, ఆ తర్వాత అతడు తిరిగి వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్.. ఆఖరి రెండు టెస్టుల్లో పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. తద్వారా సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.చదవండి: Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలంpic.twitter.com/1nEmNcrnjQ— Ben Stokes (@benstokes38) October 30, 2024 -
ఇనుప ఖనిజం అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు
బెంగళూరు: బెళెకెరి నౌకాశ్రయంలోని ఇనుప ఖనిజం దొంగతనం, అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ సాయిల్‌కు ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.6 కోట్ల భారీ జరిమానా విధించింది. ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సాయిల్‌తోపాటు ఆరుగురికి జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. శ్రీ మల్లికార్జున షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న సాయిల్(58) తాజా పరిణామంతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యే అవకాశముంది. బళ్లారి గనిలో అక్రమంగా వెలికి తీసిన ఇనుప ఖనిజాన్ని 2010లో బెళెకెరి పోర్టులో అధికారులు నిల్వ ఉంచారు. దీనిపై కన్నేసిన సాయిల్, మరికొందరు కోట్లాది రూపాయల ఖనిజాన్ని దొంగచాటుగా చైనాకు ఎగుమతి చేశారు. తాజాగా దోషులుగా తేలిన వారిలో ప్రైవేట్ కంపెనీల నిర్వాహకులతోపాటు పోర్టుల డిప్యూటీ కన్జర్వేటర్ మహేశ్ జె బిలియె కూడా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన తీర్పు వెలువడిన వెంటనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు సాయిల్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
విజిబుల్ పోలీసింగ్‌తోనే చోరీలకు విరుగుడు
విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి వరంగల్ జిల్లా నర్సంపేటలో కొద్దిరోజుల క్రితం తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. పెద్ద మొత్తంలో నగదు, బంగారం పోయింది. అయితే నిందితులను పట్టుకున్నాం. ఇటీవల వరంగల్ వెస్ట్‌జోన్ పోలీసులు ఇద్దరు దొంగలను పట్టుకొని వారి నుంచి రూ.22.56 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో చోరీల నివారణకు విజిబుల్ పోలీసింగ్ పెంచుతున్నాం. ఠాణాల వారీగా కూడా సమీక్షిస్తున్నాం. ఎవరైనా విధులు సరిగా నిర్వర్తించకపోతే సదరు సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. – అంబర్ కిశోర్ ఝా, పోలీసు కమిషనర్. వరంగల్ సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌ను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వరంగల్ పోలీసు కమిషనరేట్‌తో పాటు మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో నమోదవుతున్న చోరీల సంఖ్య ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన ఈ విజిబుల్ పోలీసింగ్‌లో.. ముఖ్య నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లో పోలీసులు, పెట్రోకార్, బ్లూకోల్ట్ సిబ్బంది.. తరచూ పర్యటిస్తూ నిఘా పెంచితే దొంగల్లో భయం పుడుతుంది. అదే సమయంలో ప్రజల్లో భద్రత భావం పెరుగుతుంది. ఇలా విజిబుల్ పోలీసింగ్‌తో దొంగతనాలతో పాటు నేరాలు తగ్గే అవకాశముంది. సిబ్బంది.. పెట్రోలింగ్ పెరగాలి ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో విస్తరించిన వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 150 చోరీలు జరిగాయి. మహబూబాబాద్‌లో 182, ములుగు 131, భూపాలపల్లి 78 చోరీ కేసులు నమోదయ్యా యి. గతేడాదితో పోల్చుకుంటే వీటి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారింది. కానీ.. చోరీ కేసుల ఛేదనలో కీలకమైన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో సిబ్బంది కొరత వల్ల కూడా దొంగలు పేట్రేగిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిటాచ్మెంట్ ఇన్స్పెక్టర్ల నియామకం లేకపోవడం కూడా చోరీలు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. ఇంకోవైపు సమయాల్లో ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని పోలీసులు పెట్రోలింగ్ పూర్తి స్థాయిలో చేయకపోవడం దొంగలకు వరంగా మారిందన్న విమర్శలున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ తరహాలోనే విజిబుల్ పోలీసింగ్ ద్వారానే నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టాలన్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో అంతగా అమలు కాకపోవడంతో దొంగతనాలు పెరిగేందుకు అస్కారం ఏర్పడింది. ఇంకా చాలావరకు చిన్నచిన్న దొంగతనాల కేసులు నమోదు కాలేదన్న విమర్శలున్నాయి. -
HYD: మల్కాజ్‌గిరిలో సెల్ఫోన్లు మాయం..ఎందుకంటే..
సాక్షి,హైదరాబాద్:మల్కాజ్‌గిరిలో మొబైల్ దొంగలు హల్చల్ చేశారు. ఆనంద్‌బాగ్‌లో పాల కోసం వెళ్లిన వ్యక్తి నుంచి ఫోన్ చోరీ చేశారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని మార్కెట్‌కు వచ్చిన మరో వ్యక్తి నుంచి కూడా సెల్‌ఫోన్ కొట్టేశారు. ప్రజల దృష్టి మళ్లిస్తూ మొబైల్స్ చోరీ చేస్తున్నారని బాధితులు మాల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.చోరీలపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మాల్కాజ్‌గిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు.ఇదీ చదవండి: బంజారాహిల్స్ పబ్.. ప్రతి దానికి ఓ రేటు -
బంగ్లాలో మోదీ గిఫ్ట్ చోరీ.. భారత్ తీవ్ర స్పందన
ఢిల్లీ: జేశోరేశ్వరి కాళీమాత ఆలయానికి ప్రధాని మోదీ బహూకరించిన కిరీటం చోరీపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. జేశోరేశ్వరి కాళీమాత ఆలయానికి ప్రధాని మోదీ బహూకరించిన కిరీటం చోరీకి గురికావడం పట్ల తీవ్రంగా ఖండించింది. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి అపవిత్ర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడింది.‘‘ఢాకాలోని తంతిబజార్‌లో పూజా మండపంపై దాడి, జేశోరేశ్వరి కాళీమాత ఆలయంలో చోరీ జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా బాధాకరం. బంగ్లాదేశ్‌లోని హిందువులు సహా మైనారిటీలు, వారి ప్రార్థన మందిరాల భద్రత, మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలను తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా, 2021 మార్చిలో బంగ్లాదేశ్‌లో పర్యటించిన ప్రధాని.. కాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారు కిరీటాన్ని గిఫ్ట్‌గా అందించిన సంగతి తెలిసిందే. బంగ్లాలోని సత్ఖీరా జిల్లా ఈశ్వరీపూర్‌లోని ఈ కాళీ ఆలయం శక్తి పీఠాల్లో ఒకటి. స్థానిక కళాకారులు మూడు వారాల పాటు శ్రమించి దీన్ని తయారుచేశారు.ఇదీ చదవండి: 50 ఏళ్లలో తొలిసారి సహారా ఎడారిలో వరదలు.. ఫోటోలు వైరల్ -
పని చేసిన సంస్థకే కన్నం.. రూ.6 కోట్ల విలువైన నగలతో ఉడాయించిన ఉద్యోగులు
సాక్షి,హైదారాబాద్ : పని చేసిన సంస్థకే కన్నం వేశారు ఉద్యోగులు. రూ.6 కోట్ల విలువైన నగలతో ఉడాయించారు. నగల్ని మాయం చేసిన ప్రబుద్ధుడితో పాటు అతనికి సహకరించిన సిబ్బంది గురించి పోలీసులు ఆరాతీస్తున్నారు. బంజారాహిల్స్ శ్రీ కృష్ణ జ్యువెలర్స్ షోరూంలో భారీ చోరీ జరిగింది. రూ.6 కోట్ల విలువైన బంగారు నగలు మాయమయ్యాయి. అయితే అదే షోరూంలో ప్రస్తుతం, గతంలో పనిచేసిన ఉద్యోగులకు దుర్బుద్ది పుట్టి అందరూ ఓ ముఠాగా ఏర్పడ్డారు. భారీ చోరీకి పాల్పడ్డారు. చోరీ జరిగినప్పటి నుంచి మేనేజర్ సూకేతు షా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మేనేజర్ సుకేతు షాతో పాటు ఉదయ్ కుమార్, చింటు, సత్య, అజయ్, టింకు, చంద్ర, శ్రీకాంత్ బబ్బూరిలపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. కేసులో ట్విస్ట్..మరోవైపు రూ..6 కోట్ల నగల మాయం కేసులో కీలక పాత్రపోషించిన మేనేజర్, తన భర్త సూకేతు షా కనిపించడం లేదంటూ అతని భార్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ మేనేజ్మెంట్ వేధింపుల కారణంగానే తన భర్త అదృశ్యం అయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. లెటర్‌తో పాటు,ఓ వీడియోను సైతం పోలీసులకు అందించారు. -
కోర్టుకు హాజరై వెళ్తూ మళ్లీ చోరీ
మంచిర్యాలక్రైం: వివిధ దొంగతనాల కేసులో కోర్టులో హాజరయ్యేందుకు వచ్చి తిరిగివెళ్తూ మరోసారి చోరీకి పాల్పడి పోలీసులకు పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్పెట్ గ్రామానికి చెందిన మాసు అన్నపూర్ణ, రాధ, శనిగరం పూలమ్మ అనే ముగ్గురు మహిళలు గతంలో వరంగల్‌లోని మట్టెవాడ, బెల్లంపల్లి వన్‌టౌన్, జమ్మికుంట పోలీసుస్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడి జైలుకి వెళ్లారు. బెల్లంపల్లి వన్‌టౌన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో గత నెల 30న మంచిర్యాల జిల్లా కోర్టుకు హాజరయ్యారు.తిరిగి వెళ్తూ మంచిర్యాలలోని శ్రీవైష్ణవి జువెల్లరీ షాపులో ఆభరణాలు కొనుగోలుదారులుగా వెళ్లారు. అక్కడ వెండిపట్టీలు చూస్తూ రూ.45వేల విలువైన పది జతలు దొంగిలించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి మహిళలు దొంగతనానికి పాల్పడినట్లుగా సీసీపుటేజీ ఆధారంగా గుర్తించారు. ప్రత్యేక బృందంతో ఇస్పెట్ గ్రామానికి వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకుని పట్టీలను రికవరీ చేశారు. ఈ మేరకు ఈ ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. -
డిప్యూటీ సీఎం ఇంట్లో భారీ చోరీ
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆయన ఇంట్లో పని చేస్తున్న బిహార్‌కు చెందిన వ్యక్తి, తన స్నేహితుడితో కలిసి దాదాపు రూ.20 లక్షల విలువైన సొత్తు, నగదు ఎత్తుకుపోయాడు. ఈ మేరకు అందిన ఫిర్యాదు నేపథ్యంలో..బంజారాహిల్స్ పోలీసులు అన్ని రాష్ట్రాల రైల్వే పోలీసు (జీఆర్పీ) అధికారులను అప్రమత్తం చేయడంతో.. పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్లో వారిద్దరూ పట్టుబడ్డారు. భట్టి విక్రమార్క ప్రస్తుతం ప్రజా భవన్లో నివసిస్తున్నారు. అయితే ఆయనకు బంజారాహిల్స్ రోడ్ నం.14లోని బీఎన్ రెడ్డికాలనీలో విల్లా ఉంది. బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్ (28) ఆ ఇంట్లో పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు.ఇంటి హాల్లో పడుకుంటూ వాచ్‌మన్‌గా, సర్వెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భట్టి ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని అవకాశంగా తీసుకున్న రోషన్ దొంగతనానికి పథకం వేశాడు. తన స్వస్థలం నుంచి స్నేహితుడైన ఉదయ్ కుమార్ ఠాకూర్‌ను పిలిపించాడు. ఇద్దరూ కలిసి మంగళవారం మధ్యాహ్నం విల్లా పడక గది తాళాలు పగులకొట్టారు. అందులోని బీరువాలో ఉన్న నగదు, బంగారు, వెండి వస్తువులు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు తస్కరించారు. అదే రోజు రాత్రి సికింద్రాబాద్ నుంచి రైలు మార్గంలో బిహార్‌కు బయలుదేరారు. అయితే అదే ఇంట్లో భట్టి వ్యక్తిగత సహాయకులు కూడా ఉంటుంటారు.గురువారం విల్లాలో రోషన్ కనిపించకపోవడంతో ఇల్లంతా వెతుకుతూ మొదటి అంతస్తుకు వెళ్లారు. అక్కడ ప్రధాన బెడ్రూమ్ తాళాలు పగులగొట్టి ఉండటం, చోరీ జరగడాన్ని గుర్తించారు. వెంటనే భట్టి పీఏ భాస్కర శర్మకు సమాచారం అందించారు. వెంటనే విల్లాకు వచ్చిన ఆయన రోషన్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌లను పరిశీలించగా రోషన్, ఉదయ్ ఓ బ్యాగ్‌తో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వీళ్లు రైల్లో వెళ్లారని గుర్తించిన పోలీసులు పశి్చమ బెంగాల్, బిహార్‌ల్లో ఉన్న అన్ని రైల్వేస్టేషన్ల జీఆర్పీ అధికారులకు సమాచారం ఇచ్చారు.నగరం నుంచి తొలుత భువనేశ్వర్ వెళ్లిన నిందితులిద్దరూ అక్కడి నుంచి భువనేశ్వర్–హౌరా జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఈ రైలు గురువారం సాయంత్రం ఖరగ్‌పూర్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నం.7కు చేరుకోగా అందులో తనిఖీలు చేస్తున్న జీఆర్పీ సిబ్బంది బ్యాగ్‌తో ఉన్న రోషన్, ఉదయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి చోరీ సొత్తు, సొమ్ము స్వాధీనం చేసుకుని నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శుక్రవారం ఖరగ్‌పూర్ వెళ్లిన ఎస్సై రాంబాబు నేతృత్వంలోని బృందం శనివారం సాయంత్రానికి నిందితుల్ని ఇక్కడకు తీసుకురానుంది. -
భట్టివిక్రమార్క ఇంట్లో చోరీ..నిందితుల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్14లో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితులు పోలీసులకు చిక్కారు. పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్లో నిందితులను బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు.చోరీకి పాల్పడ్డవారిని బిహార్‌కు చెందిన రోషన్ కుమార్ మండల్,ఉదయ్‌కుమార్ ఠాకూర్‌గా గుర్తించారు. వీరి నుంచి రూ.2.2లక్షల నగదు,100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు -
మోహన్‌బాబు ఇంట్లో చోరీ.. హౌజ్ బాయ్ అరెస్ట్
పహాడీషరీఫ్(హైదరాబాద్): సినీ నటుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో చోరీ జరిగిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..జల్పల్లి గ్రామ శివారులో మోహన్‌బాబుకు నివాసం (మంచు టౌన్షిప్) ఉంది. ఇంటి ఆవరణలోనే వ్యక్తిగత కార్యదర్శులు, సెక్యూరిటీ సిబ్బంది, పనివారి కోసం వేర్వేరు గదులు సైతం ఉన్నాయి. ఈ నెల 22న మోహన్‌బాబు ఆదేశాల మేరకు పర్సనల్ సెక్రటరీ (పీఎస్) కిరణ్‌కుమార్ తిరుపతిలోని ఎంబీయూ యూనివర్సిటీ నుంచి రూ.10 లక్షల నగదు తీసుకొని రాత్రికి మంచు టౌన్‌షిప్‌కు చేరుకున్నాడు. రాత్రి కావడంతో ఉదయాన్నే డబ్బులు మోహన్‌బాబుకు ఇద్దామని భావించి తన గదిలో ఉంచాడు. ఈ టౌన్‌షిప్‌లోనే అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఎర్రవంకపల్లి గ్రామానికి చెందిన గణేశ్ నాయక్ (24) హౌజ్ బాయ్‌గా పని చేస్తున్నాడు. కిరణ్ డబ్బులు తెచ్చిన విషయం ముందే తెలుసుకున్న గణేశ్ అతడు నిద్రపోయాక, తలుపు నెట్టి డబ్బులు కాజేసి పరారయ్యాడు. ఉదయాన్నే లేచి చూడగా డబ్బుతో పాటు గణేష్ కూడా కనిపించలేదు. సీసీ కెమెరాలు పరిశీలించగా అతడే డబ్బు తీసుకెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. మోహన్‌బాబు సూచన మేరకు కిరణ్ 23వ తేదీన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రాచకొండ సీపీ సుదీర్‌బాబు సూచనలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపి బుధవారం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతని వద్ద నుంచి రూ.7,36,400ల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. -
ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. ఈయనకు చెందిన జల్పల్లిలోని ఫామ్‌హౌస్‌లో నాయక్ అనే వ్యక్తి పనిమనిషిగా చేస్తున్నాడు. ఇతడే దాదాపు రూ.10 లక్షలు దొంగిలించి ఉడాయించాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేపట్టారు. అలా తిరుపతిలో నాయక్‌ని అదుపులోకి తీసుకున్నారు.(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి)గతంలో ఇదే ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ వీడియోని మంచు లక్ష్మి తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. విలాసవంతమైన ఈ ఇంటిలో దొంగతనం జరగడం ఇదే కొత్తం కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు జరిగాయి.ఇకపోతే తెలుగులో హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బోలెడన్ని సినిమాలు చేసిన మోహన్ బాబు.. చివరగా 'సన్నాఫ్ ఇండియా' చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం సొంత బ్యానర్లో భారీ బడ్జెట్‌తో 'కన్నప్ప' తీస్తున్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పటికప్పుడు పోస్టర్స్ వదులుతున్నారు. త్వరలో రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాశముంది.(ఇదీ చదవండి: 'భారతీయుడు' హీరోయిన్ విడాకులు.. భర్తకు ఇష్టం లేకపోయినా!) -
Ganesh laddu: గణేష్ లడ్డూ చోరీ
జీడిమెట్ల: గణేష్ లడ్డూతో పాటు రూ.24 వేల నగదు, 2 మొబైల్ ఫోన్లు చోరీకి గురైన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుభాష్ నగర్ డివిజన్ డీపీ కాలనీలో వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి మండపంలోకి ప్రవేశించిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు గణపతి వద్ద ఉన్న 8,2 కిలోల లడ్డూతో పాటు అక్కడే నిద్రిస్తున్న వారి జేబుల్లో రూ.24 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లను దొంగలు ఎత్తుకెళ్లారు. యూత్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరీష్ తెలిపారు. కాగా లడ్డూను ఎత్తుకెళ్తున్న వ్యక్తి ఫొటో సీసీ కెమెరాకు చిక్కింది. -
పారని మంత్రి సుభాష్ పాచిక
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ద్రాక్షారామం జగనన్న కాలనీలో ఇసుక చోరీ వ్యవహారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరుల మెడకే చుట్టుకుంది. ఈ వ్యవహారం నుంచి తన అనుచరులను తప్పించేందుకు మంత్రి రెండు రోజులుగా చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆయన అనుచరులే ఇసుకను చోరీ చేశారని తేటతెల్లమవటంతో చేసేది లేక అధికార యంత్రాంగం కేసు నమోదు చేసింది. మంత్రి ప్రధాన అనుచరుల్లో ఒకరైన టీడీపీ నేత దొంగల శ్రీధర్, మరి కొందరిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఇదే విషయాన్ని రామచంద్రపురం ఆర్డీవో ఎస్.సుధాసాగర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 26న ద్రాక్షారామ జగనన్న కాలనీ లేఅవుట్–04లో జరిగిన ఇసుక దోపిడీపై ‘జగనన్న కాలనీలో టీడీపీ దొంగలు’ అనే శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిం ది. ఈ కథనం అధికారులను, అధికార పార్టీ నేతలను పరుగులు పెట్టించింది. ఈ కేసు నుంచి మంత్రి సుభాష్ అనుచరుడు దొంగల శ్రీధర్‌ను తప్పించే ప్రయత్నాన్ని కూడా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిం ది. అయినా అతనిపైన, ఇతర అనుచరులపైన కేసు నమోదు కాకుండా మంత్రి సుభాష్ తీవ్రంగా ప్రయతి్నంచారు. అధికార బలాన్ని ఉపయోగించారు. మంత్రి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇసుక వ్యవహారంలో తమ పార్టీ నేతల ప్రమేయం లేదని చెప్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఇదంతా వైఎస్సార్సీపీ నేతల పనేనంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ బెడిసికొట్టాయి. ఆయన మీడియా సమావేశం పెట్టిన రెండు గంటలకే అధికారులు దొంగల శ్రీధర్‌పై కేసు నమోదు చేశారు. ఆయనే ఇసుక చోరీలో నిందితుడని స్పష్టం చేశారు. కాగా, ఈ ఇసుక దోపీడిపై పోలీసులు కేసు నమోదు చేసిన వాసంశెట్టి బాల, కాండ్రేగుల సాయిరాంలను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు మంత్రి సుభాష్ ప్రకటించారు. ప్రధాన అనుచరుడైన దొంగల శ్రీధర్‌పై మంత్రి ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
చోరీ చేశాడని.. కారం దట్టించారు!
అరారియా(బిహార్): దొంగతనం చేశాడని ఓ వ్యక్తిని తాళ్లతో బంధించి..అతడి మలద్వారంలోకి మిరప కారం జొప్పించారు. బిహార్‌లోని అరారియాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పోలీసులు నిందితుల్లో ఒకరిని గుర్తించి, అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇస్లామియానగర్కు చెందిన కొందరు దొంగతనం చేశాడంటూ ఓ వ్యక్తిని తాళ్లతో నిర్బంధించారు. అతడి ప్యాంటు విప్పి, బలవంతంగా ముందుకు వంచారు. ఒక వ్యక్తి అతడి మల ద్వారంలో మిరప కారం పోసి, పెన్సిల్‌తో లోపలికి కూరాడు. అక్కడే ఉన్న కొందరు ఈ వ్యవహారాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది పోలీసుల కంటబడింది. దర్యాప్తు చేపట్టి మహ్మద్ సిఫత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతడే బాధితుడి ప్యాంటు బటన్లను విప్పి, మోకాళ్ల వరకు కిందికి లాగాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. ఘటనపై ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ స్పందించారు. రాష్ట్రంలో తాలిబన్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. -
నూజివీడు ట్రిపుల్ ఐటీలో చోరీ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని స్టాఫ్ క్వార్టర్స్‌లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. క్యాంపస్‌లో ఉన్న ఓ1 బ్లాక్‌లోని 401 ఫ్లాట్‌లో దొంగలు పడి బంగారు ఆభరణాలను, వెండి వస్తువులు, నగదు దోచుకెళ్లారు. గడులను తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు ప్లాట్లోని బీరువాలు, కప్‌బోర్డులు తెరిచి వాటిల్లోని వస్తువులను చిందరవందరగా పడేశారు. ఈ క్వార్టర్లో సీఎస్ఈ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బి.పద్మ కుటుంబం నివాసముంటోంది.ఆమెకు వారం రోజులుగా డెంగీ జ్వరం కావడంతో నూజివీడులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త ఆమెకు తోడుగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ ఘటనలో రూ.1.95 లక్షల నగదు, రెండు కాసుల బంగారం వస్తువులు, 750 గ్రాముల వెండి వస్తువులను చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఫ్లాట్ నం.203లో కూడా చోరీ జరిగింది. అయితే ఆ కుటుంబం ఊరినుంచి వస్తే గానీ ఏమేమి చోరీకి గురయ్యాయో తెలియదు. ట్రిపుల్ఐటీ ఏర్పాటు చేసిన 16 ఏళ్లల్లో తొలిసారిగా జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో బ్లాక్‌లో ఉన్న మిగిలిన ఫ్లాట్ల వారు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు నుంచి క్లూస్‌టీం వచ్చి ఆధారాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్యాంపస్‌లో 8వేల మంది విద్యార్థులు, వెయ్యిమంది ట్రిపుల్ ఐటీ సిబ్బంది ఉంటున్నారు.ప్రతి షిప్టులో 56 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా చోరీ జరగడం విస్మయాన్ని కలిగిస్తోంది. కాగా, సెక్యూరిటీ పాయింట్లు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ సరిహద్దుల వద్ద కాకుండా ఎక్కడో ఏర్పాటు చేయడం గమనార్హం. -
‘ఆమె‘ను ఆకట్టుకునేందుకు.. ఓ టీనేజర్ ఘనకార్యం!
ఢిల్లీ : ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్న చందంగా.. ఇంట్లో తన నగల్ని దొంగతనం చేసిన కుమారుడేనని ఓ తల్లి గుర్తించ లేకపోయింది. ఖరీదైన నగలు మాయమవ్వడంతో పోలీసుల్ని ఆశ్రయించింది ఆ తల్లి. చివరికి ఏమైందంటే? వివరాల్లోకి వెళితే..ఆగస్ట్ 3 న, ఢిల్లీ - నజాఫ్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ‘‘సార్.. సార్ మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఆగస్ట్ 2 ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో అగంతకులు మా ఇంట్లో చొరబడి నా రెండు గోల్డ్ చైన్లు, చెవి కమ్మలు, ఒక ఉంగరాల్ని దొంగతనం చేశారు‘‘ అని ఫిర్యాదు చేసింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి ఇంటిని, ఇంటి పరిసరాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీటీవీ పుటేజీని చెక్ చేశారు. కానీ అందులో ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. బాధితురాలి ఇంటి పక్కనే ఉన్న ఇళ్లల్లో సోదాలు జరిపారు. స్థానికులను ఆరా తీశారు. అయినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని డీసీపీ అంకిత్ సింగ్ తెలిపారు. చివరగా బంగారు నగలు మాయం అవ్వడంపై బాధితురాలి కుటుంబ సభ్యుల్ని విచారించారు. పోలీసుల విచారణలో దొంగతనం జరిగిన తర్వాత 9వ తరగతి చదువుతున్న బాధితురాలి కుమారుడి అందుబాటులో లేకపోవడంతో పోలీసుల్లో అనుమానం మొదలైంది. వెంటనే పోలీసులు బాలుడి స్కూల్, అతడి స్నేహితుల్ని విచారించగా..దొంగతనం చేసిందనే బాధితుడి కుమారుడేనని నిర్ధారణకు వచ్చారు. బాలుడి కోసం ధరంపూర్, కక్రోలా, నజాఫ్‌గఢ్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో బాలుడు పోలీసుల్ని తప్పించుకున్నాడు. చివరికి తన ఇంటి సమీపంలో పోలీసుకు చిక్కినట్లు డీసీపీ అంకిత్ సింగ్ వెల్లడించారు.పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అమ్మ బంగారాన్ని తానే దొంగతనం చేసినట్లు కుమారుడు అంగీకరించాడు. బంగారాన్ని అమ్మగా వచ్చిన రూ. 50 వేలతో ఐఫోన్ కొని 9వ తరగతి చదివే తన స్నేహితురాలికి గిప్ట్గా ఇచ్చినట్లు అంగీకరించాడు. ఇక ఆ బంగారాన్ని కొనుగోలు చేసిన నగల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో బాధితురాలి భర్త అనారోగ్య సమస్యలతో కొద్ది కాలం క్రితం మరణించారు. కుమారుడికి చదువు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. పలుమార్లు ఇదే విషయంపై సదరు మహిళ కుమారుడిని మందలిస్తుండేంది. ఈ తరుణంలో 9 వ తరగతి చదువుతున్న తన స్నేహితురాలు పుట్టిన రోజు. ఆమెను ఆకట్టుకునేందుకు.. ఆమె పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం నగదు కావాలని కన్న తల్లిని కోరాడు. ముందు చదువుపై దృష్టిసారించాలని అతడికి సూచించింది. ఈ నేపథ్యంలో ఇంట్లోని చెవి దిద్దులు, చేతి ఉంగరంతోపాటు చైన్లు తీసుకు వెళ్లి.. స్థానికంగా ఉన్న వేర్వేరు బంగారం దుఖాణాల్ని విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో.. కుమారుడి ముందే తల్లిపై థర్డ్ డిగ్రీనా?
సాక్షి,హైదరాబాద్ : దళిత మహిళపై పోలీసుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా? అని ప్రశ్నించారు. ‘ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన?. దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అసలేం జరిగిందంటేదాదాపు రెండు వారాల క్రితం షాద్‌నగర్ పట్టణంలో తాళం వేసి ఉన్న నాగేందర్ ఇంట్లో 20 తులాల బంగారం, 2 లక్షల నగదు చోరీకి గురైంది. చోరీకి గురైన నగలు తమ ఇంటి సమీపంలో ఉన్న ఓ మహిళ తీసిందేమోనన్న అనుమానం ఉందని నాగేందర్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జులై 24న షాద్‌నగర్ పట్టణంలోని రోజువారీ కూలీ, స్థానికంగా ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. అంతకంటే ముందు ఆమె భర్తని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్రహింసలకు గురి చేసి విడిచి పెట్టారు. ఆ తర్వాత బాధితురాల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగంటల పాటు ఆమెను వేధించారు. చేయని దొంగతనాన్ని చేసినట్లు ఒప్పుకోవాలని షాద్‌నగర్ ఎస్సై (డిటెక్టివ్) రామిరెడ్డి బాధితురాలిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అనంతరం మధ్యరాత్రి 2గంటల సమయంలో విడిచి పెట్టారు. తీవ్రగాయాల పాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా?ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా? నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..! ఇంత కర్కశత్వమా... సిగ్గు సిగ్గు..!కొడుకు ముందే చిత్ర… pic.twitter.com/d9ERDZnHJo— KTR (@KTRBRS) August 5, 2024దళిత మహిళపై ఇంత దాష్టీకమా?దళిత మహిళపై ఇంత దాష్టీకమా?.ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన?. దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?.మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా?.నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా!. ఇంత కర్కశత్వమా... సిగ్గు సిగ్గు..!.కొడుకు ముందే చిత్ర హింసలా?రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితా?. ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో...మహిళలంటే ఇంత చిన్నచూపా..!.ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు మరోవైపు దాడులు, దాష్టీకాలు..!.యథా రాజా తథా ప్రజా అన్నట్లు ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆడబిడ్డలపై లాఠీఛార్జీలు, దాడులకు తెగబడుతున్నారు. ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. వాళ్లను గౌరవించకపోయినా ఫర్వాలేదు. ఇలా దౌర్జన్యాలు మాత్రం చేయకండి’ అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. -
దళిత మహిళపై పోలీసుల కర్కశత్వం
షాద్‌నగర్ రూరల్: దొంగతనం కేసులో విచారిస్తామంటూ తీసుకొచ్చిన ఓ దళిత మహిళపై పోలీసులు కర్కషంగా వ్య హరించారు. అంతేకాకుండా ఆమె మైనర్ కుమారుడిపై సై తం విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా వె లుగులోకి వచ్చిన ఈ ఘటన సైబరాబాద్ పరిధిలోని రంగా రెడ్డి జిల్లా షాద్‌నగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 24న చోరీ : షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫరూఖ్‌నగర్ ఎస్సీ కాలనీలో నివాసం ఉండే నాగేందర్ ఇంట్లో గత నెల 24న దొంగతనం జరిగింది. తన ఇంట్లో 24 తులాల బంగారంతో పాటు, రూ.2 లక్షల నగదు చోరీ జరిగిందని, దీనికి కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులే కారణమంటూ ఆయన షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీసుకొచ్చి.. చితకబాది : కేసు విచారణలో భాగంగా పోలీసులు భీమయ్య అతని భార్య సునీతతో పాటు 13 ఏళ్ల వారి కుమారుడిని గత నెల 30న షాద్‌నగర్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. దొంగతనాన్ని ఒప్పుకోవాలని డీఐ రామిరెడ్డితోపాటు ఇతర పోలీసు సిబ్బంది తనను, భర్తను విచక్షణారహితంగా కొట్టారని సునీత ఆరోపించింది. కాగా, తల్లి ముందే మైనర్ కొడుకును సైతం పోలీసులు దారుణంగా చితకబాది వారిని అర్ధరాత్రి ఇంటికి పంపించారు. కాగా, పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక సునీత నడవడానికి కూడా ఇబ్బందిపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను మరుసటిరోజు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. చివరకు ఈ విషయం బయటకు తెలియడంతో దళిత సంఘాల నేతలు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సాయంతో ఆదివారం సునీతను షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణకు ఆదేశం : దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పం కావడం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ జోక్యం చేసుకోవడంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పరామర్శ : దళిత మహిళపై పోలీసులు చేసిన దాడి విషయాన్ని తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంలు షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి బాధితురాలు సునీతను పరామర్శించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ.. మహిళ అని చూడకుండా పోలీసులు సునీతను కొట్టడం సరికాదని అన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు న్యాయం చేయాలన్నారు. సైబరాబాద్ కార్యాలయానికి అటాచ్ : దొంగతనం కేసులో దళిత మహిళ, మైనర్ బాలుడిని షాద్‌నగర్ పోలీసులు చితకబాదిన ఘటనపై ఆదివారం సాయంత్రం సైబరాబాద్ సీపీ మహంతి స్పందించారు. షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (డీఐ) రామిరెడ్డిని సైబరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేశారు. షాద్‌నగర్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ సమగ్ర విచారణకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: బంగారం చోరీ కేసులో ఓ దళిత మహిళ, ఆమె భర్తపై షాద్‌నగర్ పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలకు గురి చేసిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనతో సంబంధం ఉందని భావించిన వారిని వెంటనే అక్కడి నుంచి తప్పించి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయాలని ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారు ఎవరూ తప్పించుకోలేరని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. బాధితులకు న్యాయం చేయడంతోపాటు వారికి అండగా ఉంటామని హామీఇచ్చారు. దళిత మహిళపై దౌర్జన్యం హేయమైన చర్య: మాజీ మంత్రి హరీశ్‌రావు దళిత మహిళపట్ల పోలీసులు కర్కషంగా వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకోవాలని దళిత దంపతులను చిత్రహింసలకు గురిచేయడం మానవ హక్కుల ఉల్లంఘనకు నిదర్శనమన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
రాజమండ్రి ఏటీఎం నగదు చోరీ కేసు: నిందితుడిని 12 గంటల్లో పట్టేశారు..
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు చెందిన రూ.2.2 కోట్ల చోరీ కేసును 12 గంటలలోపే పోలీసులు ఛేదించారు. నిందితుడు అశోక్ పోలీసులకు చిక్కాడు. అదుపులోకి తీసుకున్ పోలీసులు నగదను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని మీడియా ముందుకు ప్రవేశపెట్టి.. ఎస్పీ నర్సింహ కిశోర్ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు.హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీ తరఫున అశోక్ పనిచేస్తున్నాడని.. పక్కా ప్రణాళికతో బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లు గప్పి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే ఐదు ప్రత్యేక బృందాలతో గంటల వ్యవధిలో కేసును ఛేదించినట్లు ఎస్పీ చెప్పారు. నిందితుడు విలాసాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. సాంకేతిక, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు.డిగ్రీ చదివిన మాచరమెట్లకు చెందిన వాసంశెట్టి అశోక్‌కుమార్.. రాజమండ్రిలోని ఏటీఎంలలో నగదు నింపే హెచ్‌టీసీ అనే ప్రైవేటు ఏజెన్సీ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నగరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించిన 11 ఏటీఎంల్లో నగదు నింపేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఏజెన్సీ ఇచ్చిన రూ.2,20,50,000 చెక్కును దానవాయిపేట హెచ్డీఎఫ్సీ శాఖకు వెళ్లి నగదుగా మార్చాడు. ఆ సొమ్ము ఇనుప పెట్టెలో సర్దుకుని వ్యక్తిగత కారులో పరారయ్యడు.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కారును వదిలి పరారైన అశోక్‌ను స్వగ్రామం కపిలేశ్వరం మండలం మాచర్ల మెట్ట గ్రామంలోని తన ఇంట్లో తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు అశోక్ తన ఊళ్లో గుండు చేయించుకుని తిరిగినట్లు సమాచారం. పోలీసులు నిందితుడి సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. -
ఈ దొంగతనమనేది ఒక పెద్ద జబ్బు.. చివరికి?
‘నాకు 45 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. హ్యాపీ ఫ్యామిలీ మాది. నాకున్న సమస్యను ఎలా చెప్పాలో తెలియడం లేదు. సిగ్గుగా ఉంది. అదేంటంటే.. కొన్నాళ్లుగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నా. కొలీగ్స్ బ్యాగ్స్లోంచి చిన్నచిన్న వస్తువులు తీసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లినా వాళ్లకు తెలియకుండా ఏదో ఒకటి దొంగిలిస్తున్నా. స్పూన్, ఫోర్క్లాంటి వాటికీ కక్కుర్తి పడుతున్నా.ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతున్నా. మొన్న సూపర్ మార్కెట్లో దొరికిపోయేదాన్నే. అదృష్టవశాత్తు బయటపడ్డా. గూగుల్‌లో బ్రౌజ్ చేస్తే ఇది క్లెప్టోమేనియా అనే మానసిక సమస్య అని తెలిసింది. దీనికి పరిష్కారం ఏంటి? దీన్నుంచి నేను బయటపడ్డం ఎలా?’ అంటూ తన పరిస్థితిని వివరించింది మాధవి.నిజమే మాధవి చెప్పినదాన్ని బట్టి అవన్నీ క్లెప్టోమేనియా లక్షణాలే. ఆమె సమస్యను ఎనలైజ్ చేయడానికి ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవలసి వచ్చింది. మాధవి స్వస్థలం బెంగళూరు. బాగా చదవాలని, అన్నిట్లో ఫస్ట్ ఉండాలని చిన్నతనం నుంచే నూరిపోశారు పేరెంట్స్. వాళ్లను సంతోషపెట్టేందుకు కష్టపడి చదివి వాళ్లు కోరుకున్నట్లే అన్నీట్లో ఫస్ట్ ఉండేది ఆమె.ఆ క్రమంలో చాలా ఒత్తిడి అనుభవించింది. చదువైపోయి, మంచి ఉద్యోగమూ సాధించింది. కెరీర్ కూడా బాగుంది. అయినా ఆమెలో ఏదో స్ట్రెస్, ఇన్సెక్యూరిటీ, సెల్ఫ్ క్రిటిసిజం. రెండేళ్ల నుంచి క్లెప్టోమేనియాతో బాధపడుతోంది. తప్పని తెలిసినా కంట్రోల్ చేసుకోలేని స్థితి ఆమెది. ఎవరైనా పట్టుకుంటే అవమానమనే భయం, సిగ్గు, ఆందోళనతో చితికిపోతోంది. ఈ ఆందోళన తగ్గించుకోవడానికి మళ్లీ దొంగతనం చేస్తోంది. అలా చేస్తేనే తనకున్న ఆందోళన తగ్గుతోందట.మెదడులో మార్పులే కారణం... సాధారణంగా ఎవరైనా విలువైన వస్తువులు దొంగిలిస్తారు. కానీ ఏమాత్రం విలువలేని చిన్నచిన్న వస్తువులను దొంగిలించకుండా ఉండలేకపోవడం క్లెప్టొమేనియా ప్రధాన లక్షణం. ఆ తర్వాత భయం, ఆందోళన, అపరాధభావం. వాటినుంచి తప్పించుకునేందుకు మళ్లీ మరో దొంగతనం. ఇదో వలయంలా సాగుతుంది. క్లెప్టోమేనియాకు కచ్చితమైన కారణాలు తెలియవు. మెదడులోని మార్పులు కారణం కావచ్చని, లేదా ఒత్తిడిని అధిగమించేందుకు దొంగతనం అలవాటు కావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.అయితే మెదడులో సెరటోనిన్ అనే రసాయనానికి ఈ రుగ్మతకు సంబంధం ఉందని తెలుస్తోంది. అలాగే చిన్నచిన్న వస్తువులను దొంగిలించినప్పుడు వచ్చే ఎగ్జయిట్మెంట్ మెదడులో డోపమైన్ విడుదలకు కారణం కావచ్చు. దాంతో అలాంటి ఎగ్జయిట్మెంట్ కోసం మళ్లీమళ్లీ దొంగతనం చేస్తుంటారు. ఇంకా మెదడులోని ఓపియాయిడ్ వ్యవస్థ కూడా కారణం కావచ్చు. అలాగే ఇబ్బందికరమైన కోరికల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించుకునేందుకు కూడా దొంగతనం చేయవచ్చు.చికిత్స తప్పనిసరి అవసరం..అరుదుగా ఉండే ఈ రుగ్మత గురించి ఎవరికైనా చెప్పుకుంటే అవమానమని చాలామంది చికిత్సకు దూరంగా ఉంటారు. ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ క్లెప్టోమేనియాను స్వయంగా అధిగమించడం కష్టం. దానికి కచ్చితంగా చికిత్స అవసరం. ఇందులో మందులు లేదా సైకోథెరపీ, లేదా రెండూ అవసరమవుతాయి.అనారోగ్యకరమైన, ప్రతికూల ప్రవర్తనలను, నమ్మకాలను గుర్తించి, వాటిని ఆరోగ్యకరమైన వాటితో భర్తీ చేయడంలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉపయోగపడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో దొంగతనం చేయాలని ట్రిగ్గర్ అవుతుందో గుర్తించాలి. కాగ్నిటివ్ రీ స్ట్రక్చరింగ్,సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్, కౌంటర్ కండిషనింగ్, కోవర్ట్ సెన్సిటైజేషన్, ఎవర్షన్ థెరపీ టెక్నిక్స్ ద్వారా మాధవి మూడు నెలల్లో తన సమస్య నుంచి బయటపడగలిగింది.అయితే ఇది మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందువల్ల నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి రివ్యూ సెషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఆమె ఫాలో అయింది. ఇప్పుడు మాధవి ఏ దొంగతనాలూ చేయకుండా ప్రశాంతంగా జీవిస్తోంది. – సైకాలజిస్ట్ విశేష్


