
బంగారం ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయి.కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతూ సామాన్యుడికి అందని ద్రాక్షగా మిగిలిపోతోంది పసిడి. గ్రాము బంగారం కొనాలంటే జనం బెంబేలెత్తుతున్న పరిస్ఙతి. ఈ క్రమంలో ట్విటర్‌లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఒక జ్యుయల్లరీ దుకాణంలో ఒక మహిళ తన చేతివాటి చూపించింది. బంగారం షాపింగ్ చేస్తున్నట్టుగానే నటిస్తూ లక్షలు విలువ చేసే నగను పెట్టెతో సహా దాచేసింది. కానీ విషయం షాపులోనే ఉన్న కెమెరానుంచి మాత్రం తప్పించు కోలేక పోయింది. ఒక ట్విటర్ యూజర్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
బంగారం ధరలు గ్రాముకు రూ 12 వేలు దాటేసింది. ఇలాంటి దొంగతనాలు బాగా పెరిగే అవకాశం ఉంది... ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఎప్పుడూ లేనంతగా అప్రమత్తంగా ఉండాలి! అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
🚨 With gold prices soaring past ₹12k/gram, theft cases are bound to spike...Jewellers must stay more alert than ever!#UttarPradesh | Bulandshahr: Woman caught on camera stealing..stuffs an entire jewellery box inside her saree 👇 pic.twitter.com/5FRxWAQrA0
— Nabila Jamal (@nabilajamal_) October 1, 2025