బుజ్జి కుక్క‌పిల్లను భ‌లే కాపాడారు! | puppy saved from roadside pit in Chennai viral video | Sakshi
Sakshi News home page

Viral Video: ఎంత మంచివాడవయా!

Nov 15 2025 1:11 PM | Updated on Nov 15 2025 1:11 PM

puppy saved from roadside pit in Chennai viral video

‘ఎంత మంచి మనసు’ అని ఘనంగా చెప్పుకోవడానికి కోటానుకోట్లు దానం చేయకపోయినా ఫరవాలేదు. మనకు తోచినంతలో ఏ మంచి పని (Good Work) చేసినా సరిపోతుంది అని చెప్పే సంఘటన ఇది.

చెన్నైలో ఒక కుక్కపిల్ల (puppy) గొయ్యిలో పడింది. ఆ గొయ్యి దగ్గర నిస్సహాయంగా నిల్చొని ఏడుపు గొంతుతో అరుస్తోంది తల్లి కుక్క. ఆ అరుపులు విన్న ఒక పోలీసు గొయ్యి నుంచి కుక్కపిల్లను రక్షించాడు. తల్లి కళ్లలో సంతోషం నింపాడు.

‘రోడ్డు మీద మనిషి పడిపోతే కూడా ఎవరి దారిన వారు వెళుతున్న ఈ రోజుల్లో ఆ వ్యక్తి గొప్ప మనసుతో కుక్కపిల్లను రక్షించడం గొప్ప విషయం’

‘మానవత్వం (humanity) మృగ్యమైపోతుంది అని నిరాశపడే రోజుల్లో ఇలాంటి మంచి పనుల గురించి వింటున్నప్పుడు ఆశాదీపాలు వెలుగుతాయి’... ఇలాంటి కామెంట్స్‌తో స్పందించారు నెటిజనులు. 

చ‌ద‌వండి: చాట్‌జీపీటీ వ‌రుడు వ‌చ్చాడు!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement