ఉక్రెయిన్‌తో కొనసాగుతున్నయుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌లో మరిన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవడం ద్వారా రష్యా ముందుకు సాగుతోందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.డోనెట్స్‌స్కీ, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో కలుపుకుంటామని పుతిన్ వెల్లడించారు. ఈ ప్రాంతాలన్నింటినీ దశలవారీగా స్వాధీనం చేసుకుంటున్నామని పుతిన్ పేర్కొన్నారు.
తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్‌కీ ప్రాంతంలోని డిబ్రోవా గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. డొనెట్స్క్‌లోని స్లోవియన్స్‌కీలో రష్యా జరిపిన షెల్లింగ్‌లో ఒకరు మరణించగా, మరో 5 మంది గాయపడ్డారు. జపోరిజియాలో కూడా రష్యా జరిపిన దాడిలో ఒకరు మరణించారు . ఈ ఏడాది ఉక్రెయిన్‌లో 6,460 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రష్యా స్వాధీనం చేసుకున్నట్లు జనరల్ వాలెరీ గెరాసిమోవ్ తెలిపారు. ఇందులో 334 గ్రామాలు కూడా ఉన్నాయన్నారు. ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య జరిగిన చర్చలు విఫలమైన కొద్దిసేపటికే పుతిన్ సైనిక యూనిఫాంలో కమాండర్ల సమావేశానికి హాజరయ్యారు.
ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్‌ఆర్‌ఐ మృతి
జెలెన్‌స్కీతో చర్చల తర్వాత, ట్రంప్ మాట్లాడుతూ శాంతి ఒప్పందం కుదిరిందని, అయితే ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్న జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్తు, డోనెట్స్‌కి, మరియు లుహాన్స్‌కీలను కలిగి ఉన్న డాన్‌బాస్ ప్రాంతాన్ని అప్పగించడం అనేవి పరిష్కారం కాని రెండు సమస్యలు అని జెలెన్‌స్కీ అన్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతి ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చారు. దానికోసం కనీసం 60 రోజుల కాల్పుల విరమణ అవసరం. ప్రస్తుతం డాన్‌బాస్‌లో కొంత భాగం మాత్రమే ఉక్రెయిన్ చేతిలో ఉంది. ఉక్రెయిన్ దళాలు అక్కడి నుండి వెనక్కి తగ్గాలని లేదా మరిన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్‌ఆర్‌ఐ మృతి
మరోవైపు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు శాంతి చర్చలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడులు జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. డిసెంబర్ 28 నుంచి 29 మధ్య పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కానీ ఉక్రెయిన్ మాత్రం ఖండించింది.
ఇదీ చదవండి : ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యం


