1600 BC... ఈజిప్టు- తమిళ్ ట్రేడ్..! | Tamil Merchant Name Found On Egyptian Pyramids, Evidence Of Ancient 2,000 Year Old Trade Links, More Details Inside | Sakshi
Sakshi News home page

1600 BC... ఈజిప్టు- తమిళ్ ట్రేడ్..!

Feb 13 2026 11:35 AM | Updated on Feb 13 2026 12:13 PM

Ancient Tamil footprints discovered in Egypt royal tombs

భారత ప్రాచీన నాగరికత కాలంలో ఈజిప్టుతో జరిపిన వ్యాపార సంబంధాల గురించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.  తమిళనాడుకు చెందిన ఓ వాణిజ్య యాత్రికుడికి సంబంధించిన పేరు అక్కడి పిరమిడ్స్‌లో చెక్కబడింది. అంతేకాకుండా మరికొన్ని చారిత్రక సంబంధిత విషయాలు తెలిశాయి.

ప్రపంచంలోని అతికోద్ది పురాతన నాగరికలో భారత్‌ ఒకటిగా భావిస్తారు. సింధూ  కాలం నుంచే మన దేశ నాగరికత ప్రపంచంలోని వివిధ నాగరికతలతో వాణిజ్యం ఉండేదని చరిత్రకారులు భావిస్తారు. తాజాగా ఆ వాదనకు మరింత బలం చేకూర్చేలా కీలక ఆదారాలు ఈజిప్టి పిరమిడ్స్( రాజసమాధుల్లో) లభ్యమయ్యాయి. అందులో 16 BC కి చెందిన  వాణిజ్య వేత్త  "సికాయి కొట్రాన్" పేరు చెక్కబడింది.         

వాటితో పాటు తమిళ తమిళ-బ్రహ్మీ శాసనాలు, ఐదు వేర్వేరు పిరమిడ్లలో ‘సికాయి కొట్రాన్‌’ అనే తమిళ వాణిజ్యవేత్త పేరు ఎనిమిది సార్లు చెక్కి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ వివరాలను స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌ యూనివర్సిలీ ప్రొఫెసర్‌ ఇంగో స్ట్రౌచ్‌ వెల్లడించారు. ఇక్కడి పిరమిడ్‌లలోని ఆరు రాతి సమాధుల్లో తమిళ బ్రహ్మీ, ఆరు పాకృత భాషల్లో సుమారు 30 శాసనాలను వారు గుర్తించినట్లు తెలిపారు. చెన్నైలో జరిగిన అంతర్జాతీయ తమిళ ఎపిగ్రఫీ కాన్ఫరెన్స్‌లో వారు తమ పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. 

అయితే దీనిపై తమిళనాడు మంత్రి తంగం తెన్నరసు  ఆనందం వ్యక్తం చేశారు. " రోమన్ ఈజిప్టు కాలంలోనే (క్రీ.శ. 1 నుండి 3వ శతాబ్దం మధ్య) తమిళులు కేవలం వర్తకానికే పరిమితం కాకుండా, అక్కడ నివసించారని మరియు రాజ సమాధులపై తమ ముద్ర వేశారని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయని ఎక్స్‌లో పేర్కొన్నారు.ఈ అద్భుతమైన ఆవిష్కరణ తమిళ ప్రజలు గర్వంచదగ్గదని ఆ కాలంలోనే  వారు సముద్రాలు దాటి ప్రపంచ సంస్కృతులపై తమ ముద్ర వేసారని ప్రపంచానికి చాటిచెబుతోందన్నారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement