breaking news
tamilnadu
-
‘సీఎం విజయ్.. మీరు మా రాష్ట్రానికి రావొద్దు’
సాక్షి, బెంగళూరు: కావేరీ నదీ జలాల వివాదం నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో జరగాల్సిన చర్చలను కర్ణాటక రద్దు చేసుకుంది. ఈ క్రమంలో తమిళనాడు సీఎం విజయ్, ఆయన బృందం ఇప్పుడు కర్ణాటకకు రావడం అంత మంచిది కాదని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమ కర్ణాటక పర్యటనను వాయిదా వేసుకోవాల్సిందిగా తాము తమిళనాడు ప్రభుత్వానికి సలహా ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు సీఎం విజయ్ ఇక్కడికి వస్తే ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 12న కర్ణాటక వ్యాప్తంగా బంద్‌కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి.ఈ వివాదం ప్రభావం సినిమాలపైనా పడింది. కర్ణాటకలో తమిళనాడు సీఎం విజయ్ నటించిన తాజా చిత్రం ‘జనగాయన్’ ప్రదర్శనను థియేటర్లలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఒకవేళ సినిమాను ప్రదర్శిస్తే థియేటర్లపై కన్నడ సంఘాలు దాడులు చేసే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
విజయ్ Vs ధనుష్ రాధన్ పండిత్ మరో సంచలనం
-
ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన ఈ లేఖలో కోరారు. కావేరీ నదిపై కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు మురుగునీటి నిల్వ/డ్యామ్ ప్రాజెక్టుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆ సమాధానం ఇచ్చారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి మాట్లాడుతూ, కావేరీ నదిపై ఏదైనా నిర్మాణాన్ని చేపట్టే ముందు కర్ణాటక రాష్ట్రం ఇతర దిగువ రాష్ట్రాల (తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి) అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సుప్రీంకోర్టు 2018 నాటి తీర్పులో స్పష్టంగా ఎక్కడా పేర్కొనలేదని సమాధానమిచ్చారు.అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ సమాధానం తీవ్ర నిరాశకు గురిచేసిందని సీఎం విజయ్ పేర్కొన్నారు. అంతరాష్ట్ర నీటి వివాదాలలో ఇప్పటికే స్థిరపడిన చట్టాలు మరియు చట్టపరమైన సూత్రాలను పరిశీలించకుండానే కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారని విజయ్ విమర్శించారు. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరిగిన ఆలమట్టి డ్యామ్ వివాదంలో, దిగువన ఉండే రాష్ట్రం యొక్క అనుమతి ఖచ్చితంగా అవసరమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.కావేరీ నీటి వివాదాల ట్రిబ్యునల్ అవార్డు, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఉంటే తప్ప, మేకేదాటు డ్యామ్ ప్రాజెక్టుకు ఎటువంటి పరిపాలనాపరమైన లేదా చట్టపరమైన అనుమతులు మంజూరు చేయకుండా చూడాలని సీఎం విజయ్ ప్రధానమంత్రిని కోరారు. అలాగే, 2018లో సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ తీర్పును సమర్థించినప్పుడు, రాష్ట్రాలు తమ పరిధిలోని నీటిని ట్రిబ్యునల్ ఆదేశాలకు లోబడి మాత్రమే నియంత్రించుకోవచ్చని స్పష్టం చేసిందని పేర్కొన్నారు.గతంలో కేరళకు చెందిన పాంబార్ హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విషయంలో కూడా దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉమ్మడి ఒప్పందాలు అవసరమని ట్రిబ్యునల్ పేర్కొన్న విషయాన్ని విజయ్ గుర్తు చేశారు. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యసభలో ఇచ్చిన సమాధానాన్ని ఉపసంహరించుకోవాలని, దిగువ రాష్ట్రాల హక్కులను రక్షించాలని ఈ ప్రాజెక్టుపై సమగ్ర చట్టపరమైన, సాంకేతిక పరిశీలన జరపాలని డిమాండ్ చేశారు. -
కామన్వెల్త్ హీరోకు సీఎం విజయ్ భారీ నజరానా
స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన తమిళనాడు వెయిట్‌లిఫ్టర్ రాజా ముత్తుపాండికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.30 లక్షల నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ముత్తుపాండిని అభినందించారు. ఆయన సాధించిన విజయం తమిళనాడుకు గర్వకారణమని అన్నారు. ముత్తుపాండి విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి రాష్ట్రం, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముత్తుపాండి తమిళనాడులోని కోవిల్పట్టికి చెందినవారు.కాగా, ముత్తుపాండి కామన్వెల్త్ క్రీడల పురుషుల 65 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించాడు.స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలో 126 కిలోలు ఎత్తడంలో విఫలమైన ముత్తుపాండి, రెండో ప్రయత్నంలో అదే బరువును విజయవంతంగా ఎత్తాడు. అనంతరం 129 కిలోల ప్రయత్నం విఫలమైనప్పటికీ, 126 కిలోలతో ఆ విభాగాన్ని ముగించాడు.క్లీన్ అండ్ జర్క్‌లో కూడా తొలి ప్రయత్నంలో 158 కిలోలు ఎత్తలేకపోయిన ముత్తుపాండి, రెండో ప్రయత్నంలో 160 కిలోలు విజయవంతంగా ఎత్తి మొత్తం 286 కిలోల లిఫ్ట్‌తో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. -
విజయ్ బాటలో ధనుష్.. రాజకీయాల్లోకి ఎంట్రీ!
-
‘ఎముకలు విరిగిపోతాయి’.. సీఎం విజయ్‌పై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
సాక్షి చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ను ఉద్దేశించి బహిరంగ సభలో అభ్యంతరకరమైన, బెదిరింపు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై విలాతికుళం నియోజకవర్గానికి చెందిన డీఎంకే ఎమ్మెల్యే జి.వి. మార్కండేయన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం (జూలై 20, 2026) తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఆయనను తూత్తుకుడి ఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. ఈ అరెస్టును నిరసిస్తూ డీఎంకే మద్దతుదారులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు.ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. దీనిని ఉద్దేశించి అసెంబ్లీలో సీఎం విజయ్ ‘మీ నాన్న ఎక్కడ?’ అంటూ సెటైర్లు వేశారు. దీనికి కౌంటర్‌గా జూలై 18న కొవిల్‌పట్టిలో జరిగిన డీఎంకే కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే మార్కండేయన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.అసెంబ్లీలో ముఖ్యమంత్రి తాను ఒకరి తండ్రి కోసం వెతుకుతున్నానని మాట్లాడుతున్నారు. ఆయనొక సిగ్గులేని ముఖ్యమంత్రి. అసెంబ్లీలో మిమ్మల్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. అసెంబ్లీ తలుపులు మూసివేస్తానని ఆయన అంటున్నారు. ఒకవేళ ఆయన గనుక వాటిని మూసివేస్తే, ఆయన ఎముకలు విరిగిపోతాయి. దమ్ముంటే అసెంబ్లీని మూసి చూడమనండి’అంటూ మార్కండేయన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఈ ప్రసంగం తాలూకు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీవీకే ఉత్తర జిల్లా కార్యదర్శి బాలసుబ్రమణియన్ తూత్తుకుడి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మార్కండేయన్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విలాతికుళంలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.మార్కండేయన్ అరెస్టును డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి తీవ్రంగా ఖండించారు. విమర్శలను తట్టుకోలేక అధికార టీవీకే ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తోందని, ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యేనని వారు మండిపడ్డారు. కాగా, ముఖ్యమంత్రి విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నెల ప్రారంభంలోనే తిరుచెందూర్ డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేయగా, ఆయన అదే రోజు బెయిల్‌పై విడుదలయ్యారు. తాజా అరెస్టుతో తమిళనాడులో డీఎంకే, టీవీకే పార్టీల మధ్య రాజకీయ యుద్ధం మరింత ముదిరింది. -
మంత్రులకు సీఎం విజయ్ వార్నింగ్
-
జయలలిత ఇంటిని కొనుగోలు చేస్తున్న సీఎం విజయ్
-
2031లో కచ్చితంగా అధికార మార్పిడి
సాక్షి చెన్నై: ఒక నిజమైన హిందువు అందరినీ సమానంగా చూస్తాడని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ‘వుయ్ ది లీడర్స్’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కె.అన్నామలై చెప్పారు. ఆదివారం కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిలో ఫౌండేషన్ మొదటి మహానాడులో ఆయన ప్రసంగించారు. ‘‘నేను హిందువును, కానీ బయటకు వెళ్లేటప్పుడు నా కులం, మతాలను ఇంట్లోనే ఉంచి తాళం వేస్తాను. ప్రతిసారీ మతాన్ని ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు. నిజమైన హిందువు అందరినీ సమానంగా చూస్తాడు. అందరూ ఒకే సరళరేఖలో కలిసి సాగాలని భావిస్తాడు. అదే నా హిందూ తత్వం’’అని తేల్చిచెప్పారు. ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అన్నామలై స్పందించారు. 39 ఏళ్లలోపు వయసున్నవారే అధికార మార్పునకు కారణమయ్యారని చెప్పారు. రాష్ట్రంలో 2031లో మరోసారి కచ్చితంగా అధికార మారి్పడి జరుగుతుందని స్పష్టంచేశారు. 2031లో తమ పార్టీ రంగంలోకి దిగుతుందని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో యువత మరోసారి కచ్చితంగా మార్పును తీసుకొస్తుందని వెల్లడించారు. 2031 నాటికి తమ ఉద్యమం పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారి ప్రజల ముందుకు వస్తుందని తెలిపారు. తాము ఆరోగ్యకరమైన రాజకీయాల కోసమే కృషి చేస్తాం తప్ప క్షుద్ర రాజకీయాల కోసం కాదన్నారు. ‘వుయ్ ది లీడర్స్’ఉద్యమంలో 19 లక్షల మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. వీరిలో 54 శాతం మంది 39 ఏళ్ల లోపు యువతే కావడం గమనార్హం. ప్రస్తుత సభ్యుల్లో 83 శాతం మంది పురుషులు, 17 శాతం మంది మహిళలు ఉన్నారు. ఈ మహిళా భాగస్వామ్యాన్ని త్వరలోనే 50 శాతానికి పెంచడమే లక్ష్యమని అన్నామలై ప్రకటించారు. ఇకపై ప్రతి సంవత్సరం జూలై నెలను మాదకద్రవ్యాల వ్యతిరేక మాసంగా పాటించాలని, డ్రగ్స్ రహిత తమిళనాడును నిర్మించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి విజయ్ పాలనపై అన్నామలై సానుకూలంగా స్పందించారు. కోటి 68 లక్షల మంది ప్రజలు ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తెలిపారు. ఆ ప్రజా తీర్పును మనం గౌరవించాలన్నారు. మంత్రులు చాలామంది కొత్తవారే కాబట్టి ప్రారంభంలో వారు కొంత తడబడటం సహజమని చెప్పారు. టీవీకే ప్రభుత్వంపై ఒక సంవత్సరం ఎలాంటి విమర్శలు చేయబోమని అన్నారు. తాము అధికారం కోసం ప్రజాక్షేత్రంలోకి రాలేదని, ఒక మంచి సమాజాన్ని నిర్మించడమే ఏకైక లక్ష్యమని వివరించారు. -
టీవీకే మెజార్టీ కోసం విజయ్ భారీ స్కెచ్..?
సాక్షి, చెన్నై: తమిళనాడులో విజయ్ అధికారం చేపట్టిన నాటి నుంచి అక్కడి ప్రతిపక్ష పార్టీలకు కంటిమీద కులుకు లేకుండా పోతుంది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కడ టీవీకే తీర్థం పుచ్చుకుంటారా అని అక్కడి పార్టీలు హైరానా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ మరో భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అక్కడ ఒక పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు టీవీకేలో చేరేలా పావులు కదుపుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వార్తలు ప్రచురిస్తున్నాయి.తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో టీవీకే సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన టీవీకే ఏకంగా 107 సీట్లు సాధించి రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ రిజల్ట్ చూసిన రాజకీయా విశ్లేషకులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. అయితే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఆ తర్వాత అధికారం కోసం జరిగిన హైడ్రామా సైతం సినిమా ఎపిసోడ్‌ను తలపించింది. అక్కడి కాంగ్రెస్‌తో పాటు ఇతర చిన్న చిన్న పార్టీల సహాకారంతో జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయడంతో సీఎం హైడ్రామాకు ఫులిస్టాప్ పడింది. అయితే సీఎం కావడంలో ఎదుర్కొన్నఇబ్బందుల్ని సీఎం విజయ్ ఇంకా మర్చిపోనున్నట్లు తెలుస్తోంది. అందుకే టీవీకే స్వంతంగా మెజార్టీ మార్కు దాటేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఏఐడీఎంకేకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీకి రాజీనామా చేసి టీవీకేలో చేరేలా టీవీకే సన్నాహాలు చేస్తోందని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఆగస్టు 15లోపు వీరు పార్టీలో చేరతారని అనంతరం టీవీకే తరపున ఉపఎన్నికల్లో పోటీ చేస్తారని కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ "ఆపరేషన్ ఎల్" అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.కాగా ఇదివరకే నలుగురు ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేలో అధికారికంగా చేరారు. దానితో పాటు మే 13న జరిగిన అసెంబ్లీ విశ్వాస పరీక్షలో టీవీకేకు మద్ధతుగా ఏఐడీఎకే రెబల్ గ్రూప్‌కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో మరో పదిమందిని పార్టీలో చేర్చుకొని ఉపఎన్నికలకు వెళ్లేలా విజయ్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే తమిళనాట మరోసారి పొలిటికల్ హీట్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
మృతుల ఆత్మశాంతి కోసం నదిలో వస్తువులు ఎందుకు వేయాలి?
సాక్షి,చెన్నై: మత విశ్వాసాల పేరుతో జలవనరులను కలుషితం చేసే హక్కు ఎవరికీ లేదని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం స్పష్టం చేసింది. మృతుల ఆత్మశాంతి కోసం బట్టలు, చెప్పులు, ఫొటోలు, ఇతర వస్తువులను నదుల్లో వదలడం వల్ల నీటి కాలుష్యం పెరుగుతోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.విచారణలో న్యాయమూర్తులు.. చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం నదిలో వస్తువులు పడేయాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నించారు. మూఢనమ్మకాల పేరుతో నదులను కలుషితం చేయడం సమర్థనీయం కాదని వ్యాఖ్యానించారు. నదులను పరిరక్షించేందుకు ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. అయితే ఇది మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కావడంతో, సంబంధిత వర్గాల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది.అంబాసముద్రం తాలూకాలోని ఓ మండపానికి సంబంధించి అధికారులు చేపట్టిన తొలగింపు చర్యలను వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ బి. పుగలేంధిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారించింది. తామిరబరణి నది కాలుష్య అంశాన్ని పరిశీలించింది.విచారణలో అప్పర్ తామ్రపర్ణి సబ్ డివిజన్‌కు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కీలక వివరాలు వెల్లడించారు. పాపనాశనం నుంచి తామిరబరణి నదీ స్నాన ఘట్టాలకు వేలాది మంది భక్తులు పూర్వీకులకు సంబంధించిన అంత్యక్రియల ఆచారాల కోసం వస్తుంటారని తెలిపారు. ఈ సందర్భంగా మరణించిన వారికి సంబంధించిన వాడిన, వాడని దుస్తులు, తువ్వాళ్లు, చెప్పులు, ఇతర వస్తువులను నదిలో వదులుతున్నారని చెప్పారు. ముఖ్యంగా ఆది అమావాస్య వంటి సందర్భాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని వివరించారు.స్థానిక అధికారులు, ఆలయ యాజమాన్యంతో కలిసి పనిచేస్తున్న స్వచ్ఛంద కార్యకర్త మూర్తి కోర్టుకు పలు వివరాలు తెలిపారు. నదిలో పడేసిన దుస్తులు నదీ గర్భంలో చిక్కుకుపోయి, ఈ-కోలి వంటి బ్యాక్టీరియా వృద్ధికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు.తామ్రపర్ణి నది జలాల స్వచ్ఛతపై సి. కళావల్లి రచించిన పుస్తకంలోని వివరాలను కూడా ధర్మాసనం పరిశీలించింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం, మే 7 నుంచి మే 28 మధ్య కాలంలో నది నుంచి భారీ మొత్తంలో వ్యర్థాలను సేకరించారు. 86 నుంచి 90 టన్నుల వరకు దుస్తులు, 2.2 టన్నుల భస్మం (విభూతి), 115 కిలోల పాదరక్షలు,1,385 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు, 220 కిలోల గాజు సీసాలు, 700 కిలోల కాల్చిన ఇటుకలు, 374 కిలోల శానిటరీ నాప్కిన్లు, డైపర్లు 302 కిలోల నూనె సీసాలు, షాంపూ కవర్లు ఉన్నట్లు వివరాలు వెల్లడయ్యాయి.ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు, కోర్టు ఇవ్వబోయే ఆదేశాలను ప్రజలకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీనిపై మతపరమైన సంస్థలు లేదా ఇతర వర్గాలు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పించాలని సూచించారు. ఈ కేసు తదుపరి విచారణను జూలై 16కు వాయిదా వేశారు. -
మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం విజయ్..
-
సుప్రీంకోర్టులో సీఎం విజయ్‌కు భారీ ఊరట
ఢిల్లీ: కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో తమిళనాడు సీఎం విజయ్‌కు ఊరట దక్కింది. కరూర్ తొక్కిసలాటపై బహిరంగ ప్రకటనలు చేయకుండా సీఎం విజయ్, రాష్ట్ర మంత్రి ఆధవ్ అర్జునతో పాటు ఇతర టీవీకే నేతలను నిరోధించాలని కోరుతూ తమిళనాడు డీఎంకే జనరల్ సెక్రటరీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం మంగళవారం నిరాకరించింది.డీఎంకే జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ అహ్రానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్లో సీఎం విజయ్ పేరు ఎక్కడా నిందితుడిగా లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒక ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లాలి. ఏం మాట్లాడాలి అనే విషయాలను కోర్టులు నియంత్రించలేవు అని ధర్మాసనం పేర్కొంది. న్యాయస్థానాలను రాజకీయ పోరాటాలకు వేదికగా మార్చవద్దని డీఎంకే తరపు న్యాయవాదులకు కోర్టు హితవు పలికింది. కోర్టు వైఖరితో డీఎంకే తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ప్రస్తుతం ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే, జూలై 10, 11 తేదీల్లో సీఎం విజయ్ కరూర్‌లో పర్యటించి, మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందించనున్నారు.బాధితులే ఈ కేసులో కీలక సాక్షులని, సీఎం విజయ్ పర్యటన వల్ల సీబీఐ విచారణ ప్రభావితం అవుతుందని డీఎంకే తన పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేసింది. కానీ కోర్టు ఆ వాదనలను తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో సీఎం విజయ్ కరూర్ పర్యటనకు, బాధితుల కుటుంబాలను కలవడానికి ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. -
విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఐదుగురు అరెస్ట్
-
బాణాసంచా భారీ పేలుడు.. మంటల్లో 20 మంది కార్మికులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని ప్రముఖ బాణాసంచా తయారీ కేంద్రమైన శివకాశిలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక బాణాసంచా ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో అక్కడ సుమారూ 20 మందికి పైగా కార్మికులు విధులు నిర్వహిస్తూ మంటల్లో చిక్కుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.ఈ పేలుడు ధాటికి సదరు బాణాసంచా గోడౌన్‌తో పాటు దాని పక్కనే ఉన్న మరో నాలుగు గోడౌన్లు మరియు చుట్టుపక్కల ఉన్న 10కి పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో గోడౌన్లో పనిచేస్తున్న పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కుకున్న మిగిలిన కార్మికులను రక్షించేందుకు శ్రమిస్తున్నారు.కాగా, గాయపడిన బాధితులను అత్యవసర చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది -
‘ఇది సినిమా ప్రొడక్షనా? సెక్రటేరియట్ పాలనా?’
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ చుట్టూ ఉన్న రాజకీయ సలహాదారులు, సినిమా ప్రముఖులు, వ్యాపార భాగస్వాములతో కూడిన సన్నిహిత వర్గం ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా సీఎంకు అత్యంత సన్నిహితుడైన విష్ణు రెడ్డి, రాజకీయ వ్యూహకర్త జాన్ ఆరోగ్యసామిలు ఎలాంటి అధికారిక హోదా లేకుండానే ప్రభుత్వ రహస్య క్యాబినెట్ సమావేశాలు, సమీక్షలకు హాజరవుతున్నారని ప్రతిపక్ష డీఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరు అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేసింది. అయితే, వారిద్దరికీ క్యాబినెట్ హోదాతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని టీవీకే (టీవీకే) వర్గాలు వాదిస్తున్నప్పటికీ, ఆ జీవోలను బహిరంగపరచకపోవడంపై పారదర్శకత లోపించిందనే విమర్శలు వస్తున్నాయి.మరోవైపు విజయ్ లాంగ్ టైమ్ మేనేజర్ జగదీష్ పళనిస్వామి తాను ముఖ్యమంత్రికి ‘ప్రైవేట్ సెక్రటరీ’గా నియమితుడైనట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా స్వయంగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అలాగే విజయ్ సినిమా ‘జననాయగన్’ నిర్మాత కే వెంకట నారాయణను ఢిల్లీలో తమిళనాడు ప్రత్యేక ప్రతినిధిగా (క్యాబినెట్ హోదా), ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసను ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ హెడ్‌గా నియమించారు. వీరితో పాటు ఇద్దరు జర్నలిస్టులు, ఒక మాజీ ప్రొడక్షన్ కంట్రోలర్, ఒక లెఫ్ట్ పార్టీ ఎంపీలు అధికారిక హోదా లేకుండానే బదిలీలు, పాలనాపరమైన విషయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం.మొదటిసారి ముఖ్యమంత్రి అయిన విజయ్, తనకు నమ్మకస్తులైన, నిర్వహణా నైపుణ్యాలు ఉన్న సినిమా, మీడియా రంగాల వ్యక్తులపై ఆధారపడటాన్ని ఆయన మద్దతుదారులు సమర్థిస్తున్నారు. వారసత్వ రాజకీయాల కంటే దశాబ్దాల తరబడి వేల మందిని పర్యవేక్షిస్తూ, బడ్జెట్, లాజిస్టిక్స్ నిర్వహించిన సినిమా ప్రొడక్షన్ కంట్రోలర్లకు పాలనా సామర్థ్యం ఎక్కువ ఉంటుందని వారు వాదిస్తున్నారు. అయితే ప్రజా జీవితంలో విశ్వసనీయత అనేది పారదర్శకత ద్వారానే వస్తుందని, సలహాదారులు, అధికారుల పాత్రలను, వారి నియామక ఉత్తర్వులను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. -
సీఎం విజయ్‌కి బిగ్ షాక్.. కూటమి తొలి మీటింగ్‌లోనే భారీ ట్విస్ట్!
సాక్షి,చెన్నై: టీవీకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు అదిలోనే హంసపాదు ఎదురైంది. రాజకీయంగా ఒక కీలక పరిణామం ఎదురైంది. టీవీకే ప్రభుత్వానికి తాము కేవలం బయటి నుంచే మద్దతు ఇస్తామని వామపక్షాలు స్పష్టం చేశాయి. అందుకు ఊతం ఇచ్చేలా.. సీఎం విజయ్ అధ్యక్షతన జరిగిన కూటమి భాగస్వామ్య పార్టీల తొలి సమావేశానికి లెఫ్ట్ పార్టీల నాయకులు గైర్హాజరయ్యారు.రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కూటమి పార్టీలతో కలిసి సీఎం విజయ్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీకి టీవీకే మిత్రపక్షాలైన కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, ఎండీఎంకే పార్టీల అగ్రనేతలు హాజరయ్యారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ బి. మాణిక్యం ఠాగూర్, సీనియర్ నాయకుడు పి. చిదంబరం, వీసీకే అధినేత తొల్ తిరుమావళవన్, ఎండీఎంకే నాయకుడు వైకో, ఐయూఎంఎల్ అధ్యక్షుడు కె.ఎం. ఖాదర్ మొహిదీన్లతో పాటు టీవీకే సీనియర్ నేతలు, మంత్రులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.దాదాపు గంటపాటు సాగిన ఈ సమావేశంలో.. మిత్రపక్షాలతో కలిసి రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని అందించడం, ఐదేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేయడంపై ప్రధానంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర ఇంధన, న్యాయశాఖ మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. టీవీకే నేతృత్వంలోని ఈ కూటమికి ఒక ప్రత్యేక పేరును పెట్టాలనే ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందని వెల్లడించారు. దీనిపై సీఎం విజయ్ కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులతో మరోసారి చర్చించి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని చెప్పారు.నిర్మల్ కుమార్ వ్యాఖ్యలను సమర్థిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎంపీ ఎస్. జోతిమణి మాట్లాడారు. టీవీకే, దాని భాగస్వామ్య పక్షాలకు ముఖ్యంగా లౌకికవాద సిద్ధాంతాలపై ఒకే రకమైన స్పష్టత ఉన్నందున ఈ కూటమి చాలా బలంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో తమ ఆలోచనలన్నింటినీ సీఎం విజయ్ చాలా శ్రద్ధగా విన్నారని ఆమె పేర్కొన్నారు. కాగా, కూటమి కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు త్వరలోనే ఒక సమన్వయకర్తను (కోఆర్డినేటర్) నియమించే అవకాశం ఉందని టీవీకే వర్గాలు తెలిపాయి. -
టీవీకే నేతృత్వంలో కొత్త కూటమి!
సాక్షి, చెన్నై : తమిళనాడులో టీవీకే నేతృత్వంలో కొత్త కూటమి ఏర్పాటు కానుంది. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న మిత్ర పక్ష పార్టీల నేతలతో బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం విజయ్ సమావేశం నిర్వహించనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలు గెలుచుకున్న అనంతరం.. కాంగ్రెస్, విడుతలై చిరుతైగళ్ కట్చి, సీపీఐ, సీపీఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీల మద్దతుతో విజయ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వంలో వీసీకే, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌లకు చెందిన ఎమ్మెల్యేలు సైతం మంత్రులుగా ఉన్నారు.ఈ క్రమంలో డీఎంకే, అన్నాడీఎంకేలు ఇరకాటంలో పెట్టే విధంగా దూకుడు పెంచడంతో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న పార్టీలను ఏకం చేసి, కొత్త కూటమి దిశగా విజయ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా నేడు జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో ఆ విషయమై చర్చించడంతోపాటు ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలను ఎలా చిత్తు చేయాలనే అంశంపై కూడా చర్చించబోతున్నారు. రాబోయే అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయంతో పాటు ప్రభుత్వం చేపట్టబోయే వివిధ ప్రజా శ్రేయస్సు ప్రాజెక్టుల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. స్టాలిన్ వ్యాఖ్యలతో ప్రాధాన్యత అసెంబ్లీకి ఎప్పుడైనాఎన్నికలు రావచ్చు అంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు విజయ్‌లో దూకుడు పెంచినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నేడు సంకీర్ణ పార్టీల అగ్ర నేతల సమావేశమే ఇందుకు నిదర్శనం అని చెబుతున్నారు. ఈ కీలక సమావేశంలో పాల్గొనాల్సిందిగా సంకీర్ణ కూటమిలోని భాగస్వామ్య పార్టీల నాయకులను ప్రభుత్వ మంత్రులు ఎన్.ఆనంద్, ఆదవ్ అర్జున స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో విడుతలై చిరుతైగళ్ కట్చినేత తిరుమావళవ¯Œను నేరుగా కలిసి చర్చించారు. ఆహ్వాన పత్రం అందజేశారు. కూటమిని పటిష్టం చేసుకునే దిశగా సాగుతున్న ఈ పరిణామాలు తమిళ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.జూలైలో కరూర్‌కు సీఎం విజయ్గత సంవత్సరం సెపె్టంబర్ 27న కరూర్‌లో నిర్వహించిన టీవీకే ప్రచార ర్యాలీలో ఊహించని విధంగా జరిగిన భారీ తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసందే. ఆ తర్వాత భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధిత కుటుంబాలన్నింటినీ మహాబలిపురంకు పిలిపించి విజయ్ పరామర్శించారు. వారిని ఓదార్చడమే కాకుండా, ప్రతి బాధిత కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున ఆర్థి క సహాయం అప్పట్లోనే అందజేశారు. అదే సమయంలో ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ 41 కుటుంబాల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు సీఎం విజయ్ జూలై మొదటి లేక రెండో వారంలో కరూర్‌లో పర్యటించాలని నిర్ణయించారు. ఈ పర్యటన ఏర్పాట్లపై పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి ఆనంద్ కరూర్ జిల్లా నేతలతో చర్చించారు. -
స్పోర్ట్ ఆడు... డ్రగ్స్ వీడు సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్
-
తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గత కొంతకాలంగా పట్టాళి మక్కల్ కట్చి (PMK)పార్టీలో అంతర్గత కలహాలు కొనసాగతున్నవేళ ఎట్టకేలకు ఈ రోజు బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాస్, తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ఎస్. రాందాస్‌ను కలిశారు. వివాహ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి వచ్చానన్నారు. ఈ సందర్బంగా ఎస్. రాందాస్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.పీఎంకే (PMK) పార్టీలో 2024 డిసెంబర్లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ వ్యవస్థాపకుడు డా. ఎస్. రామదాస్ ఆయన కుమారుడు ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు డా.అన్బుమణి రామదాస్ మధ్య తలెత్తిన అధిపత్యం విషయమై తలెత్తిన వివాదం పార్టీ చీలికకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం డా. అన్బుమణి రామదాస్ నేతృత్వాన్ని గుర్తించి పార్టీ అధికారిక పేరు ‘పాట్టాలి మక్కల్ కట్చి’ (PMK) దాని ప్రధాన గుర్తును ఆయనకు కేటాయించాయి.ఈ రాజకీయ ఉద్రిక్తలను నడుమ ఈ రోజు తన తండ్రి ఎస్. రామదాస్‌ను విల్లుపురం జిల్లాలోని తిండివనం సమీపంలో ఉన్న తైలపురంలోని తమ కుటుంబ నివాసంలో డా. అన్బుమణి రాందాస్ కలిశారు. తమ తల్లిదండ్రుల 61వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ "నా తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం రోజున వారి ఆశీస్సులు తీసుకోవడానికే థైలాపురం వచ్చాను. ఇకపై మంచి విషయాలే జరుగుతాయి" అని ఆయన పేర్కొన్నారు.కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ రెండు వర్గాలుగా పోటీ చేసింది – కొడుకు నేతృత్వంలోని ఒక వర్గం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లో భాగం కాగా, తండ్రి నేతృత్వంలోని మరో వర్గం వి.కె. శశికళ నేతృత్వంలోని కూటమితో జతకట్టింది. ఈ ఎన్నికల్లో అన్బుమణి వర్గం నాలుగు స్థానాలను గెలుచుకుంది.Videos of the meeting between Anbumani and Ramadoss have been released. note : There is no connection between me and the song playing in the background. pic.twitter.com/zxmnPsx3NB— Vignesh Theni (@Vignesh_twitz) June 24, 2026 -
సీఎం విజయ్ కాదు.. రియల్ లైఫ్ హీరో..!
తమిళనాడు సీఎం విజయ్ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నారు. సీఎంగా విజయ్ మానవత్వం చాటుకున్నారు. ఇవాళ విద్యుత్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన పనికి ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ తాను కూడా ఒక మనిషేనని నిరూపించారు.విద్యుత్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రం కోసం ఒక గర్భిణీ స్త్రీ కూడా హాజరైంది. అయితే ఆమెను వేదికపైకి పిలవకుండా విజయ్ స్వయంగా వెళ్లి ఆమెకు అందించారు. సీఎం హోదాలో ఉన్నప్పటికీ మానవత్వాన్ని మరువలేదని నిరూపించారు. ఒక గర్భిణీ పట్ల విజయ్ చూపిన గౌరవానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు. పూర్తి మెజారిటీ రాకపోయినా కొన్ని పార్టీల మద్దతుతో సీఎం అయ్యారు. BREAKING: A Heartwarming Gesture by Tamil Nadu Chief Minister Joseph Vijay. Instead of asking her to come up to the stage, he stepped down from the stage and personally handed the very first appointment order to a pregnant woman. A small gesture that spoke volumes. pic.twitter.com/GTZgd20MYW— Actor Vijay Team (@ActorVijayTeam) June 24, 2026 -
నీట్‌పై సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు
చైన్నై: నీట్ పరీక్షపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైద్య అర్హత పరీక్షలకు దేశవ్యాప్తంగా నీట్ ఒక్కటే అర్హత పరీక్షగా ఉందని తద్వారా అది అనేక వివాదాలకు మూలంగా నిలిచిందన్నారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. విజయ్ సీఎం హోదాలో తొలిసారిగా ఈ రోజు (మంగళవారం) ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. విజయ్ మాట్లాడుతూ" గత కొన్నేళ్లుగా నీట్ పరీక్ష అనేక వివాదాలకు మూలంగా ఉంది. ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుకొని, దేశంలో వైద్య విద్య విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రశ్నపత్రాలు లీకవడం వరకు ఈ వివాదం కొనసాగింది. ఈ పరీక్షను రద్దు చేసి, 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించాలని తమిళనాడు పదేపదే పిలుపునిచ్చింది". అని అన్నారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో అమలులో ఉన్న రెండు భాషల విధానం, అంటే తమిళం (రాష్ట్ర భాషగా), ఇంగ్లీష్ (ప్రపంచ భాషగా) సరిపోతుందని నొక్కి చెప్పారు.కరూర్ తొక్కిసలాటకరూర్ తొక్కిసలాటపై ఆయన మాట్లాడుతూ "41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాదం గురించి నా బాధను నేను మాటల్లో చెప్పలేను. ఆ బాధ నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు. కానీ ఆ నిందను కూడా మాపై వేస్తున్నారు. ఇది దారుణం. రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ విజయంపై విజయ్ ప్రసంగిస్తూ " ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అన్ని కష్టాలను అధిగమించి విజయం సాధించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే గెలవడానికి అనేక కుట్రలను, ఆంక్షలను అధిగమించాల్సి వచ్చిందని తెలిపారు.తమిళనాడు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి మేము పడిన కష్టాలు మాకు మాత్రమే తెలుసు… కానీ ఇదంతా తెలిసినప్పటికీ, కొందరు ఏమీ అర్థం కానట్టు నటిస్తూ, అతను కేవలం ఒక నటుడు, పార్టీ కూడా నటుల పార్టీనే అని ఎగతాలిగా మమ్మల్ని విమర్శిస్తారు. ఈ విజయం కోసం ఎన్నో కుట్రలను, కుతంత్రాలను అధిగమించి విజయం సాధించాం. " అని విజయ్ అన్నారు.డీఎంకే అవినీతిఇది వరకూ ప్రభుత్వం డీఎంకేలా తాము అవినీతి చేయబోమని పార్టీ ఫండ్స్ కోసం టాస్మాక్ ఆదాయాన్ని డీఎంకే లూటీ చేసిందని ఆరోపించారు. ద్విబాషా విధానానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు.కాగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవలే రైతులకు భారీ స్థాయిలో రుణమాఫీ ప్రకటించారు. అదేవిధంగా మరెన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తారుమారు చేస్తూ ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం కొద్ది రోజల పాటు గవర్నర్ వ్యవహారంతో డ్రామా నడిచిన మిత్రపక్షాల సహాయంతో ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తొలిసారిగా సీఎం హోదాలో ప్రసంగించారు. -
విజయ్ కు బర్త్ డే విషెస్ తెలిపిన YS జగన్
-
స్టాలిన్‌కు మరో ఎదురుదెబ్బ.. డీఎంకేకు ఆ పార్టీ గుడ్‌బై
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) కూటమితో దాదాపు ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ రాజకీయ బంధానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ) అధికారికంగా ముగింపు పలికింది. డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.తమిళనాడులో టీవీకే గెలుపు ఆ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయి. విజయ్ సీఎం కావడంతో అక్కడ పార్టీల పొత్తుల లెక్కలు మారుతున్నాయి. ఇదివరకే కాంగ్రెస్ పార్టీ డీఎంకేకు గుడ్‌బై చెప్పగా ఇప్పుడు ఆ జాబితాలో ఐయూఎంఎల్ నిలిచింది.ఈ నిర్ణయంపై ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు కేఎం కాదర్ మొహిదీన్ మాట్లాడుతూ "ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారాయి. ద్రవిడ మోడల్ పరిపాలన కొనసాగుతుందని మేము ఆశించాము, కానీ ప్రజల తీర్పు భిన్నంగా ఉంది. ఎన్నికల్లో టీవీకే పార్టీకి సంపూర్ణ మెజారిటీకి కొద్దిగా సీట్లు తగ్గినప్పుడు, రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వాన్ని కాపాడటానికి, రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాన్ని నివారించడానికి ఐయూఎంఎల్ మద్దతు ప్రకటించింది," అని ఆయన వివరించారు.తాము డీఎంకే కూటమితో కలిసి దాదాపు 60 ఏళ్లు ప్రయాణించామని, ఈ కాలంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రతినిధుల రూపంలో తమ పార్టీకి ప్రాతినిధ్యం లభించిందని పేర్కొన్నారు. ఈమేరకు పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. డీఎంకేతో సంబంధాలను తెంచుకుంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. అలాగే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులపై తదుపరి దశలో నిర్ణయం తీసుకుంటామని పార్టీ స్పష్టం చేసింది. సాధారణంగా డీఎంకే వైపు మొగ్గు చూపే మైనారిటీ ఓటర్లు, ఈసారి టీవీకే వైపు మెుగ్గుచూపడం సైతం ఈ నిర్ణయానికి ఒక కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఆరు దశాబ్ధాల బంధానికి తెరడీఎంకే.. ఐయూఎంఎల్ బంధం ఇప్పటిది కాదు దాదాపు ఆరు దశాబ్ధాలుగా 1967 నుండి ఐయూఎంఎల్ పార్టీ డీఎంకే కూటమితో కలిసి నడుస్తోంది. డీఎంకేకు అత్యంత నమ్మకమైన, సన్నిహిత ముస్లిం మిత్రపక్షంగా ఈ పార్టీ గుర్తింపు పొందింది. మధ్యలో 1996, 2001 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఏఐఏడీఎంకే కూటమి తరపున పోటీ చేసినప్పటికీ, డీఎంకేతో దీని రాజకీయ సంబంధాలు ఇన్నేళ్లుగా చెక్కుచెదరకుండా కొనసాగుతూ వచ్చాయి.2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఐయూఎంఎల్ పార్టీ డీఎంకే కూటమిలో భాగంగా పోటీ చేసి రెండు స్థానాలను గెలుచుకుంది. అయితే, ఎన్నికల అనంతరం మారిన సమీకరణాల నేపథ్యంలో, ఆ పార్టీ టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి, అధికార కూటమిలో చేరింది. అంతేకాకుండా రాష్ట్ర మంత్రివర్గంలోనూ స్థానాన్ని దక్కించుకుంది.కాగా ఇప్పటికే డీఎంకే కూటమి నుంచి పలు మిత్రపక్షాలు దూరమయ్యాయి. గతంలోనే కాంగ్రెస్, లెఫ్ట్ (కమ్యూనిస్ట్) పార్టీలు, విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) లు డీఎంకే కూటమి నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాయి. మరో మిత్రపక్షమైన మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) కూడా కూటమిలో తన స్థానంపై పునరాలోచనలో ఉన్నట్లు సమాచారం. -
సీఎం విజయ్ నిర్ణయం.. ఇండస్ట్రీ వ్యక్తికి కీలక పదవి
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తుతం రాజకీయంగా బిజీగా ఉన్నారు. మరోవైపు వరసగా సినీ ప్రముఖులని కలుస్తూనే ఉన్నారు. తాజాగా ఈయన తీసుకున్న నిర్ణయం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగు, తమిళ సినిమాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసకు కీలక పదవి కట్టబెట్టడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇదిగో రామ్ చరణ్ కూతురు క్లీంకార)ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసని తమిళనాడు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి విజయ్ అధికారిక ఉత్తర్వు జారీ చేశారు. మనోజ్ ఒకప్పుడు ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోనే చదువుకున్నారు. తర్వాత అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఖాళీ సమయాల్లో సినిమాటోగ్రఫీకి సంబంధించి వర్క్ షాప్స్ నిర్వహించడం, క్లాసులు చెప్పడం లాంటివి మనోజ్ పరమహంస చేస్తుంటారు. విజయ్ హీరోగా నటించిన స్నేహితుడు, లియో, బీస్ట్ సినిమాలకు ఈయనే సినిమాటోగ్రాఫర్. అలా టెక్నికల్ నాలెడ్జ్ ఉందని ఈయనకు పదవి ఇచ్చారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం విజయ్ తన సన్నిహితులకు పదవులు కట్టబెట్టుకుంటున్నారని విమర్శిస్తున్నారు.ఇకపోతే మనోజ్ పరమహంస తెలుగులో.. రేసుగుర్రం, ఏ మాయ చేశావె, బ్రూస్ లీ, రాధేశ్యామ్, గుంటూరు కారం, హరిహర వీరమల్లు, ఓజీ తదితర సినిమాలకు పనిచేశారు. తమిళంలోనూ స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన అనుభవముంది.(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్) -
DMK కు షాక్.. సీఎం విజయ్ తో వైకో భేటీ
-
అన్నామలై కీలక ప్రకటన
చెన్నై: రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కీలక ప్రకటన చేశారు. "వీ ది లీడర్స్" అనే స్వచ్ఛంద సంస్థను త్వరలోనే రాజకీయ పార్టీగా మార్చే మార్చేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో జరిగిన ఒక సంభాషణలో అన్నామలై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మార్పు జూలై, నాటికి జరగవచ్చని పేర్కొన్నారు.సామాజిక మాధ్యమాల్లో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ "మేము ఈ ఉద్యమాన్ని ఒక రాజకీయ సంస్థగా ప్రారంభించిన తర్వాత, ఈ జూలై నుంచి దాని కార్యకలాపాలు వేరే రూపాన్ని సంతరించుకుంటాయి, ప్రజలు దానిని గమనించబోతున్నారు వీ ది లీడర్ ఎట్టి పరిస్థితుల్లో విఫలం కాదు, అబద్ధం చెప్పదు, ప్రజలను తప్పుడు మార్గంలోకి నడిపించదు" అని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ ఉద్యమంపై ఎలాంటి వ్యక్తిగత అంచనాలు లేకపోయినప్పటికీ దాదాపు 18 లక్షల మంది ఇందులో చేరారని ఆయన అన్నారు. తమిళనాడు వ్యాప్తంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, ప్రచారాల ద్వారా తమ కార్యక్రమానికి విపరీతమైన మద్ధతు లభిస్తోందన్నారు.తమకు పార్టీకి అన్ని మతాలు సమానమేనని దానిపైన మరో ఆలోచన లేదన్నారు.రాబోయే నెలల్లో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరింత ఉదృతంగా కొనసాగాలన్నదే తన లక్షమని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిభ ఉన్న తమిళులకు రాజకీయాల్లో ప్రవేశించాలని ఉందని కాని వారికి ఆ మార్గం తెలియడం లేదని అన్నామలై పేర్కొన్నారు. పాతవాటిని తొలగించి కొత్తవాటిని తీసుక వస్తేనే మార్పు జరుగుతుందని అన్నామలై ఆశాభావం వ్యక్తం చేశారు.ఐపీఎస్‌ను వీడీ రాజకీయాల్లోకి2020 ఆగస్టులో బీజేపీలో చేరడం ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచింది. పార్టీలో చేరిన తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు. యువతను ఆకర్షించే ప్రసంగాలు, క్షేత్రస్థాయి పర్యటనలతో తమిళనాడులో బీజేపీకి కొత్త ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు.2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాగా. గత కొంతకాలంగా పార్టీ నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడిచింది. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే పొత్తును ఆయన వద్దన్నారని.. ఆ ఎఫెక్ట్‌తోనే (పళనిస్వామి ఒత్తిడితోనే) ఆయన్ని బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి తప్పించారని గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకపోగా.. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన క్రియాశీలకంగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీకి గుడ్‌బై చెప్పి కొత్తపార్టీ పెట్టబోతున్నారు. -
ముఖ్యమంత్రిని డార్లింగ్ అని పిలవడం నా అదృష్టం
హీరో దళపతి విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలువురు నటీనటులు ఈయనని కలుస్తూనే ఉన్నారు. ఖుష్బూ, సిమ్రాన్ తదితరులు తమ కుటుంబాలతో వెళ్లి మరీ విజయ్‌ని కలిశారు. ఇప్పుడు హీరో విశాల్ కూడా సీఎంని కలిశాడు. ఆయనని డార్లింగ్ అని పిలుస్తూ అందుకు గల కారణాన్ని కూడా చెబుతూ ఓ ట్వీట్ చేశాడు.(ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం చనిపోయిన ఫ్రెండ్ గుర్తుగా అనిరుధ్ సాంగ్)'ప్రియమైన డార్లింగ్ సీఎం విజయ్‌కి. మిమ్మల్ని నేను ఎప్పటినుంచో డార్లింగ్ అనే పిలుస్తున్నాను. లయోలా కాలేజీ రోజుల నుంచి, మీతో పరిచయం ఏర్పడినప్పటి నుంచి ఆ పిలుపు మారలేదు. ఎన్నో అటుపోట్లు, విమర్శలు తట్టుకుని మీరు సూపర్‌స్టార్‌గా ఎదగడం చూశా. ఇప్పుడు మీరు తమిళనాడు సీఎం కావడం ఆనందంగా ఉంది. మీ హోదా, పదవి మారి ఉండొచ్చు గానీ మీరు ఏ మాత్రం మారలేదు. కళైంజ్ఞర్ అయ్య నుంచి జయలలిత అమ్మ వరకు, స్టాలిన్ అంకుల్ నుంచి ఉదయ వరకు.. మన రాష్ట్ర ముఖ్యమంత్రిని డార్లింగ్ అని పిలిచే అదృష్టం నాకు దక్కడం స్పెషల్‌గా అనిపిస్తోంది. ఎప్పటికీ నేను మీ అభిమానినే''మిమ్మల్ని కలిసే సందర్భంలో బొకే, శాలువా ఇవ్వకుండా ఆ మొత్తాన్ని ఆర్థికంగా వెనకబడిన ముగ్గురు ఆడపిల్లల చదువు కోసం మీ పేరుతో సాయం చేస్తున్నాను. ఆ పిల్లలు మిమ్మల్ని గుర్తుంచుకుంటారనే నమ్మకం నాకుంది. మీ పదవీకాలంలో తమిళనాడు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. తమిళనాడుకు ఉత్తమ భవిష్యత్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని విశాల్ రాసుకొచ్చాడు. సాయం అందుకున్న పిల్లల పేర్లు కూడా తన ట్వీట్లో చేర్చాడు.(ఇదీ చదవండి: హీరోయిన్-సీఎం విజయ్.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు)Dearest darling CM Vijay @CMOTamilnadu The word “darling “ hasn’t changed which I used to call u for the last so many years since i knew u from Loyola college. It all started wen I got to know you as a budding star and then seeing u rise up the ladder as the SUPERSTAR facing… pic.twitter.com/iTLAeCZ3cp— Vishal (@VishalKOfficial) June 16, 2026 -
తమిళనాడు సీఎం సంచలన నిర్ణయం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ సహకార సంస్థల ద్వారా పంట రుణాలు పొందిన అన్నదాతల కోసం అత్యంత ప్రాధాన్యత కలిగిన రుణమాఫీ నిర్ణయాన్నివెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సహకార రంగంలో రూ.75 వేలకు పైగా రుణం తీసుకున్న సుమారు 14 లక్షలకు పైగా రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగనుంది. ఈ పథకంతో రూ. 5.932 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడనుంది. ప్రతీ రైతుకు ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు టీవీకే ప్రకటించిేంది. ఈ మేరకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఈ ఉత్తర్వులు జారీ చేశారు.కాగా ఈ పథకం నిబంధనల ప్రకారం సహాకార సంస్థల్లో లోన్ తీసుకున్న చిన్న, సన్నకారు రైతులకు రూ.75,000ల పరిమితి వరకు 100 శాతం రుణమాఫీ లభిస్తుంది. ఒకవేళ తీసుకున్న రుణం మొత్తం రూ.75,000 కంటే ఎక్కువగా ఉంటే, వారికి గరిష్టంగా రూ.35,000ల వరకు రుణమాఫీ వర్తింపజేస్తారు. దీని ద్వారా గత ఏడాది కాలంలో పంట రుణాలు తీసుకున్న వారందరికీ కనీసం రూ.35,000 నుండి గరిష్టంగా రూ.75,000ల వరకు పరోక్ష సహాయం చేకూరనుంది. -
మరో స్టార్ పొలిటికల్ ఎంట్రీ.. క్యూ కడుతున్నారుగా..!
కోలీవుడ్ స్టార్స్ సినిమాలతో పాటు పాలిటిక్స్ వైపు దూసుకెళ్తున్నారు. తమిళనాట కొత్త పార్టీ పెట్టిన దళపతి విజయ్ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే సీఎం అయ్యారు. అదే స్ఫూర్తితో రాఘవ లారెన్స్ సైతం రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని క్లారిటీ ఇచ్చేశారు. ఎప్పుడనేది మాత్రం సస్పెన్స్ కొనసాగించారు. విజయ్ పార్టీలో చేరతారా? లేదా అన్నదానిపై రాబోయే రోజుల్లో తెలియనుంది.ఇదిలా ఉండగానే మరో స్టార్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగిన జీవీ ప్రకాశ్ కుమార్ రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ ఇచ్చారు. సినీ ప్రయాణం ఇంకో 15 ఏళ్లు కొనసాగుతుందో లేదో చెప్పలేనని జీవీ ప్రకాశ్ అన్నారు. ఆ తర్వాత తాను ప్రజాసేవపైనే దృష్టి పెడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. నా ఆలోచనలకు సరిపోయే వేదిక దొరికితే కలిసి పనిచేయడానికి సిద్ధమని తెలిపారు. ఈ ప్రకటనతో భవిష్యత్తులో తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని హింట్ ఇచ్చారు జీవీ ప్రకాశ్. తాజా ఇంటర్వ్వూలో ఈ కామెంట్స్ చేశారు.ఇటీవలే రాఘవ లారన్స్, రజినీకాంత్ అల్లుడు లాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలొచ్చాయి. లారెన్స్ ఇప్పటికే ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ సైతం తన పొలిటికల్ ఎంట్రీ సంకేతాలిచ్చారు. ఇదంతా చూస్తుంటే కోలీవుడ్ ఇండస్ట్రీ సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో సినీ ఇండస్ట్రీ.. తమిళనాట రాజకీయాలను శాసించనుందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు నిషేధం విధించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రోడ్లపై, వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు అంటించడం నిషేధమని స్పష్టం చేసింది. ఇటీవల రాష్ట్రంలో భారీ కటౌట్లు, పోస్టర్లు పాదచారుల రాకపోకలకు అడ్డంకిగా మారాయి. పాదచారులు రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు పెరిగాయి.వర్షాకాలం ప్రారంభం కావడంతో బ్యానర్లు, కటౌట్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.అదే సమయంలో టీవీకే తన పార్టీ కార్యకర్తలకు సైతం విజ్ఞప్తి చేసింది. పార్టీ కార్యకర్తలు పోస్టర్లు, బ్యానర్లు, ప్లకార్డులు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించొద్దని కోరింది. జన్మదిన వేడుకలు, కుటుంబ వేడుకలు, రాజకీయ సమావేశాలు వంటి సందర్భాల్లో బహిరంగ ప్రదేశాల్లో డెకరేషన్లు చేయద్దని సూచించింది. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా ఏ వేడుకలు జరపరాదని, ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గత నెలలో పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను విజయ్ మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే రోజు మధ్యాహ్నం, ఆయన తన తమిళగ వెట్రి కజగం కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. పుట్టినరోజులు, కుటుంబ కార్యక్రమాల వంటి సందర్భాలలో ప్రజలకు లేదా ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే విధంగా... బహిరంగ ప్రదేశాలలో బ్యానర్లు, పోస్టర్లు అంటించొద్దని కోరారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు,కటౌట్లు,పోస్టర్లు అంటించడంపై ఆంక్షలు విధించడంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! ఆఖరికి విజయ్ సైతం..
తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టార్ హీరో విజయ్. ఆయన ఇటీవలే కర్ణాటకలోని కొల్లూరు శ్రీ మూకాంబికా అమ్మవారిని సందర్శించుకుని పూజలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడు ఆలయాన్ని ఎందరో దర్శించుకున్నారు. అంతేగాదు సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం ఈ ఆలయానికే తరలి వస్తుంటారు. మన టాలీవుడ్ హీరో ఎన్టీర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సంగీత మాంత్రికుడు ఇళయరాజా వంటి దిగ్గజాలు వరకు చాలామంది ఈ అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రులు ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు అంతా ఈ అమ్మవారిని దర్శించుకున్నారు. అలా అంతటి అతిరథమహారథులంతా తరలివస్తున్న ఈ కొల్లూరు మూకాంబిక క్షేత్రం విశిష్టత ఏంటి, ఎందుకు రాజకీయ నాయకులు దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఈ అమ్మ దర్శనానికి బారులు తీరుతున్నారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉన్న కొల్లూరు మూకాంబికా దేవాలయం.. దక్షిణాదిన ప్రసిద్ధ శక్తి పీఠాల్లో ఒకటి. పార్వతీదేవి ఇక్కడ మూకాంబికాగా పూజలందుకుంటోంది. దీన్ని పరశురాముడు సృష్టించిన ఏడు మోక్ష క్షేత్రాల్లో ఒకటిగా స్థానిక పురాణాలు పేర్కొంటున్నాయి.ఆకుపచ్చని పశ్చిమ కనుమల్లో వెలిసిందీ ఆలయం. ఇక్కడి అమ్మవారి విగ్రహం.. బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం అనే అయిదు పంచలోహాల సమ్మేళనంతో రూపొందింది. మూకాంబికా దేవిని మాట, అక్షరం, విద్యకు సంబంధించిన శక్తిగా భక్తులు ఆరాధిస్తారు. అందుకే విద్యాభ్యాసం ప్రారంభించే పిల్లలను ఈ ఆలయానికి తీసుకువచ్చే సంప్రదాయం కూడా ఉంది.ఎంజీఆర్ టు అమ్మ జయలిలత వరకు..అంతేగాదు 1200 ఏళ్ల చరిత్ర కలిగిన కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రులు దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. గతంలో ఎంజీ రామచంద్రన్ ఈ అమ్మవారిని దర్శించుకుని బంగారు కత్తిని కానుకగా అందజేశారు. ఆయన భార్య జానకీ రామచంద్రన్ కూడా సీఎం అయిన తర్వాత ఇక్కడకు వచ్చారు. అలాగే, ‘అమ్మ’ జయలలిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. జులై 30, 2004లో కొల్లూరు నూకాంబిక ఆలయంలో ప్రత్యేకంగా చండీయాగం కూడా జరిపించి, అన్నదానం కోసం రూ. 30,000లను జయలలిత సమర్పించారు. ఇక, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గ కూడా ఎన్నికలకు ముందు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. వారి బాటలోనే ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ సైతం ఈ అమ్మవారిని దర్శించుకుని వెండి ఖడ్గాన్ని సమర్పించారు. ఆలయ చరిత్ర..పురాణాల ప్రకారం.. ఈ ప్రాంతాన్ని పాలించిన కౌమాసురుడనే రాక్షసుడు తనకు మరణం లేకుండా వరం పొందడానికి శివుడి కోసం తపస్సు చేశాడట. తన మనోబలంతో ఆ రాక్షసుడి కోరికను పసిగట్టిన కోల మహర్షి.. సరస్వతికి తెలియజేయడంతో శివుడు ప్రత్యక్షమయ్యే సమయంలో అతడ్ని అమ్మవారు మూగవాడిని చేసిందట. అప్పటి నుంచి అతడ్ని మూసాసురుడిగా పిలిచేవారు. అయినప్పటికీ అతడు గర్వం వీడకపోగా.. దేవతలను, యక్షులను హింసించేవాడట. తననే పూజించాలని హుకుం జారీచేసి.. యజ్ఞయాగాదులను కూడా అడ్డుకోవడంతో కోల మహర్షి ఆధ్వరంలో మునులు పార్వతిదేవి వద్దకు వెళ్లి తమ కష్టాలను చెప్పుకున్నారు. దీంతో అమ్మవారు దైవగణాలతో వచ్చి ఆ మూసాసురుడిని సంహరించింది.ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత ఆది శంకరాచార్యులు కుడజాద్రి కొండలలో ధ్యానం చేస్తున్న సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగిందట. దీనికి శంకరాచార్యులు.. కేరళలోని తాను చెప్పిన చోట వెలిసి పూజలు అందుకోవాలని, తద్వారా ఆ ప్రాంతం సుభిక్షమవుతుందని, ఆలయాన్ని దర్శించుకునే వారికి ఎన్నుకున్న రంగంలో విజయం సిద్ధించేలా వరాలు ఇవ్వాలని కోరారట. ఇందుకు సరేనన్న అమ్మవారు.. ముందుగా శంకరాచార్యులను నడవమని, తర్వాత వెనుకగా వస్తాని, గమ్యం చేరే వరకూ తిరిగి చూడొద్దని చెప్పిందట. అలా మూకాసురుడ్ని వధించిన ప్రాంతానికి వచ్చేసరికి దేవి ఆగిపోయిందట. అమ్మవారి గజ్జల శబ్దం వినబడకపోవడంతో శంకరాచార్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడే మూకాంబికగా వెలిసిందట.దీంతో నిరాశకు గురైన శంకరాచార్యలకు అమ్మవారు తన విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆయన అలాగే చేశారని అంటారు. అమ్మవారి మొట్టమొదటి స్థానం కోడచాద్రి శిఖరంపై ఉండేదని.. కానీ అక్కడకు వెళ్లడం భక్తులకు కష్టంగా ఉండటంతో శంకరాచర్య ఆలయాన్ని కొల్లూరులో తిరిగి ప్రతిష్ఠించారని చెబుతుంటారు స్థానికులు.అంతేగాదు ఆదిశంకరాచార్యులు స్వయంగా ఇక్కడ తపస్సు చేసి, అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఆయనే ఇక్కడ స్వయంభూ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ లింగం మధ్యలో ఒక 'స్వర్ణ రేఖ' ఉంటుంది. ఇది శివశక్తుల కలయికకు ప్రతీకగా నిలుస్తుంది. అంటే ఒకే క్షేత్రంలో అటు పరమశివుడిని, ఇటు పరాశక్తిని కలిపి దర్శించుకునే అరుదైన భాగ్యం భక్తులకు ఇక్కడ కలుగుతుంది.ఈ అమ్మ ఆసీస్సుల కోసమే ఎందుకంటే..ఈ మూకాంబికా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే, తమ కెరీర్ అద్భుతంగా రాణిస్తుందని, విజయాలు వరిస్తాయని ఇండస్ట్రీ వర్గాల గట్టి నమ్మకం. అందుకే ముఖ్యమైన సినిమాలు ప్రారంభించే ముందు లేదా రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రముఖులు ఇక్కడికి రావడం ఆనవాయితీగా మారింది. అంతేగాదు ఈ అమ్మవారిని మహిమాన్వితమైన శక్తిగా (లక్ష్మి, సరస్వతి, కాళీ స్వరూపిణిగా) భక్తులు విశ్వసిస్తారు. ఆ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు ఎన్నికల్లో జయాలు సాధించిన తర్వాత, తమ పదవికి, ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపాలన సాగాలని కోరుకుంటూ ఇక్కడ ప్రత్యేక పూజలు, చండీ యాగం వంటివి నిర్వహిస్తారు. పచ్చని ప్రకృతి ఒడిలో, సౌపర్ణిక నది తీరాన వెలసిన కొల్లూరు క్షేత్రం అటు ఆధ్యాత్మిక ప్రశాంతతను, ఇటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం. అందుకే సామాన్య భక్తుల నుంచి కోట్లాది మంది అభిమానులు ఉన్న సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ అమ్మవారి పాద చెంతకు చేరుకుంటున్నారు.🚨 Why CM Vijay’s visit to the Kollur Mookambika Temple is a massive political statement.Tamil Nadu Chief Minister Vijay is visiting the Kollur temple in Karnataka today at 3 PM. While it looks like a standard spiritual visit, the historical context is fascinating.He is…— MacroMatrix (@MacroMatrix1) June 12, 2026 (చదవండి: ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు) -
సీఎం విజయ్ స్కూల్ ఫీజులపై సంచలన నిర్ణయం..
-
ఆత్మబంధూ.. సెలవ్
స్టూడియో గోడల మధ్య మగ్గుతున్న తమిళ సినిమాకు నాలుగు దిక్కులా కిటికీ తెరిచిన ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శక శిఖరం) భారతీ రాజా కన్నుమూశారు.‘సీతాకోకచిలుక’, ‘తూర్పు వెళ్లే రైలు’, ‘పదహారేళ్ల వయసు’, ‘ఎర్ర గులాబీలు’... తన కథలతో వెండితెరపై కవిత్వం చేశారు. పెద్ద పెద్ద స్టార్లు ఆయన చేతిలో పాత్రలయ్యారు. విగ్గుల వేషాలు అసలు సిసలు పల్లెటూరి మనుషులయ్యాయి. నేడు భారతీరాజా లేరు. కానీ ఆయన సినిమాల్లోని పల్లెటూరి గాలి ప్రేక్షకులను తాకుతూనే ఉంటుంది. వరి చేల మీది సంగీతం వినిపిస్తూనే ఉంటుంది. ఆయన చూపిన మనిషి మనతో మాట కలుపుతూనే ఉంటాడు.‘ఎన్ ఇనియ తమిళ్ మక్కళే...’ ‘నా ప్రియమైన తమిళ ప్రజలారా’ అని తన ప్రతి సినిమా మొదట్లో పలకరించే భారతీ రాజా ఇక పై అలా పలకరించరు. దర్శకులకే దర్శకుడిగా, వెండితెరకు మట్టి పరిమళం అద్దినవాడిగా, భావుకునిగా, కెమెరాతో కవిత్వం రాసే పిపాసిగా కోట్లమంది ప్రేక్షకుల అభిమానం పొందిన భారతీ రాజా స్వర్గలోకంలో విలేజ్ కాటేజీ బయట నులక మంచం పై విశ్రమించడానికి వెళ్లిపోయారు. గొంగళిపురుగు వంటి సమాజాన్ని తన కథల స్పర్శతో సీతాకోక చిలుకగా మలిచేందుకు తపించిన భారతీ రాజా మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమ ధ్రువతార లేని ఆకాశమైంది. భారతీ రాజా కథ ఎప్పుడూ పల్లెకే పరుగులు తీసింది, కానీ ఆ పల్లె అమాయకత్వానికి పూసిన పూత కాదు... ఆ పల్లెలో దుమ్ము ఉంది, దగా ఉంది, దాహం ఉంది.చిన్నసామి పెరియమాయ దేవర్ (85) 1941 జూలై 17న తమిళనాడులోని తేని అల్లినగరంలో జన్మించారు. చిన్నసామికి చిన్నప్పుడే కళలంటే మక్కువ. ఆ ఇష్టంతోనే ఆయన సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. పి. పుల్లయ్య, ఎం. కృష్ణన్ నాయర్ తదితర దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో చేశారు. ‘16 వయదినిలే’ (1977) చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా పోస్టర్లో చిన్నసామి పేరు ‘భారతీ రాజా’ అని ఉంటుంది. తమిళ ప్రముఖ కవి సుబ్రమణ్య భారతియార్ అంటే ఉన్న ఇష్టంతో తన స్క్రీన్ నేమ్‌ని ‘భారతీ రాజా’గా పెట్టుకున్నారు.పదహారేళ్ల వయసు ప్రేమఒక అందగత్తె, ఓ అమాయకుడికి ముడిపెట్టిన కథ ‘16 వయదినిలే’. ఈ పల్లెటూరి కథలో అందగత్తెని పొందాలని పోకిరీలు ఎదురు చూస్తుంటారు. అమాయకుడైన పశువుల కాపరికి ఆమె అంటే ఇష్టం ఉన్నా చెప్పడు. దుర్మార్గుడి చేతిలో ఆమె జీవితం బలి కాకుండా హత్య చేసి, జైలుకి వెళతాడు కాపరి. ‘తిరిగొస్తా’ అని ఆమెకు మాటిస్తాడు. ఈడూ జోడూ బాగాలేకపోయినా ఈ ఇద్దరూ ఒకటైతే బాగుండు అని ప్రేక్షకులు ఆ ప్రేమను ఫీలవుతారు. అందుకే ఈ సినిమా 175 రోజులు ఆడింది. ఎస్. జానకికి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు తెచ్చింది. మరి... ‘సెంధూర పూవే’ (సిరిమల్లె పువ్వా...) అంటూ ఆమె పాడిన పాటను అంత సులువుగా మరచిపోగలమా! కమల్‌హాసన్ (అమాయకుడు), రజనీకాంత్ (విలన్ షేడ్ ఉన్న పాత్ర), శ్రీదేవిలకు మంచి పేరొచ్చింది. ఈ చిత్రం తెలుగులో చంద్రమోహన్, మోహన్‌బాబు, శ్రీదేవి కాంబినేషన్లో ‘పదహారేళ్ల వయసు’గా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొంది, హిట్ అయింది. హిందీలో ‘సోల్వా సావన్’గా భారతీ రాజా దర్శకత్వంలోనే తెరకెక్కి, విజయం సాధించింది.ప్రేమ ప్రయాణంఒక రైలు ఇద్దరి ప్రేమికులకు రాయబారిగా మారుతుంది. పరిస్థితులు అనుకూలించక పట్టణం వెళ్లే యువకుడు, పల్లెటూరిలో మిగిలిపోయిన అతని ప్రేయసి... ఈ ఇద్దరూ వచ్చే పోయే రైలు వెనక ప్రేమ సందేశాలు పంపించుకుంటారు. అయితే ఆ యువతి మీద బావ కన్నేస్తాడు. ఆచారం పేరు చెప్పి, ఆ యువతి నగ్నంగా గ్రామంలో తిరగాలని నిబంధన పెడతారు. అలా ఆ యువతి తిరుగుతున్న సమయంలో ఆ యువకుడు యువతితో సహా రైలు ఎక్కుతాడు. ఈ రైలు ప్రయాణంతో ప్రేక్షకుల మనసు కూడా ప్రయాణించింది. అందుకే ఈ సినిమా ఏడాది ఆడింది. కథానాయికగా పరిచయమైన రాధికకి మంచి పేరొచ్చింది. తెలుగు హీరో సుధాకర్ కూడా తమిళ ప్రేక్షకుల ప్రేమను పొందారు. ఈ చిత్రం తెలుగులో ‘తూర్పు వెళ్లే రైలు’ పేరుతో బాపు దర్శకత్వంలో జ్యోతి, మోహన్ కాంబినేషన్లో రీమేక్ అయి, ఘనవిజయం అందుకుంది. ‘పల్లె ప్రేమకథా చిత్రాలే తీయగలడు’ అని భారతీ రాజా మీద ముద్ర వేశారు. కానీ తనలో ఇంకో కోణం ఉందన్నారు భారతీ రాజా.థ్రిల్ జర్నీకమల్హాసన్, శ్రీదేవి కాంబినేషన్లో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘సిగప్పు రోజాక్కళ్’ మొదలుపెట్టారు భారతీ రాజా. స్త్రీలను ద్వేషించే ఒక సైకో కిల్లర్ వాళ్లని ప్రేమలో పడేసి, పెళ్లి చేసుకుని క్రూరంగా చంపేస్తుంటాడు. అలా ఒక అమ్మాయిని వలలో వేసుకుని, పెళ్లాడతాడు, సహజంగానే ధైర్యవంతురాలు, తెలివిగల అమ్మాయి కావడంతో తన భర్త ఒక సీరియల్ కిల్లర్ అని కనిపెడుతుంది. చివరికి తన ప్రాణాలను కాపాడుకుని, ఆ సైకో బారి నుంచి ఎలా బయటపడింది? అనేది కథ. భారతీ రాజా ‘అర్బన్ మూవీ’స్ కూడా తీయగలడని ఈ సినిమాతో అనిపించుకున్నారు. ఈ సినిమాలోని పాటల్లో ‘నినైవో ఒరు పరవై’ ఒకటి. అంటే... ‘జ్ఞాపకం ఒక పక్షిలాంటిది’ అని అర్థం. పక్షిలా ఈ సినిమా నలు దిక్కులకూ వెళ్లి, ఒక మంచి జ్ఞాపకంలా మిగిలిపోయింది. తెలుగులో ‘ఎర్ర గులాబీలు’, హిందీలో ‘రెడ్ రోజ్’గా రీమేక్ అయింది. ‘సిగప్పు రోజాక్కళ్’ తర్వాత నూతన తారలతో ‘నిళల్గళ్’ సినిమా తెరకెక్కించారు భారతీ రాజా. ముగ్గురు నిరుద్యోగ యువకుల కష్టాలను ఈ చిత్రంలో చూపించారు. ఈ సినిమాలోని పాటల్లో ‘ఇదు ఒరు పొన్ మాలైæపొళుదు’ ఒకటి. అంటే... ‘ఇదొక బంగారంలాంటి సాయంత్రం’ అని అర్థం. కలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించే యువకుడు ఆశాభావంతో పాడుకునే ఈ పాటకు ఇళయరాజా ఇచ్చిన బీట్ కుర్రకారు హార్ట్ బీట్‌కి దగ్గరైంది. హాలీవుడ్ మేకింగ్ స్టైల్‌తో...కమల్‌హాసన్, మాధవిలతో ‘టిక్ టిక్ టిక్’ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ తీశారు భారతీ రాజా. అయితే ఇది హాలీవుడ్ బి గ్రేడ్ ఫిల్మ్‌లా ఉందనే విమర్శలు ఎదురయ్యాయి. కానీ మేకింగ్ స్టైల్ హాలీవుడ్ తరహాలో ఉందనే ప్రశంసలూ దక్కాయి. ఈ చిత్రంలో మాధవి ‘స్విమ్ సూట్’ ధరించడం అప్పట్లో ఓ సంచలనం.సాగర సంగమమే...సాగరంలో ఎన్నో నదులు కలుస్తాయి. విడదీయలేని కలయిక అది. కట్టుబాట్లను తెంచుకుని, విడదీయలేనంతగా తమ ప్రేమను పండించుకోవాలనుకుంటుంది ఓ జంట. అదే ‘అలైగళ్ ఓయ్వదిల్లై’ (సీతాకోక చిలుక). ఈ సినిమాలో ‘సాగర సంగమమే... ప్రణయ సాగర సంగమమే’ పాట ప్రేక్షకులతో మమేకమైపోయింది. తమిళంలో కార్తీక్, రాధ జంటగా నటించిన ఈ సినిమాలో సిల్క్ స్మితను సంప్రదాయ గృహిణిగా చూపించారు భారతీ రాజా. అలాగే బాల నటు డిగా అలీకి మంచి పేరు తెచ్చిన చిత్రం ఇది. తెలుగు ‘సీతాకోక చిలుక’తో అరుణ కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు వెర్షన్లో జంధ్యాల సంభాషణలు ఆకట్టుకున్నాయి.మన్ వాసనైతో మరో హిట్భారతీ రాజా నుంచి వచ్చిన మరో హిట్ ప్రేమకథ ‘మన్ వాసనై’. మేనమామ, మేనకోడలి ప్రేమ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. గాజులు అమ్ముకుంటున్న పాండియన్ని ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు. రేవతి కూడా ఈ చిత్రం ద్వారానే హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఈ సినిమా తెలుగులో బాలకృష్ణ, సుహాసిని జంటగా ‘మంగమ్మగారి మనవడు’ పేరుతో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రీమేక్ అయి, ఘనవిజయం సాధించింది.ఆత్మతో ముడిపడిన ప్రేమఅప్పటివరకూ భారతీ రాజా సినిమాల్లోని ప్రేమికులు ఎన్నో ప్రేమ ఊసులు చెప్పుకున్నారు. కానీ, మనసు నిండా ప్రేమ నింపుకుని, మాటల్లో చెప్పుకోని ఓ ప్రేమ జంటని చూపించారు భారతీ రాజా. అదే ‘ముదల్ మరియాదై’. 60 ఏళ్ల వ్యక్తి, అందులో సగం వయసు కూడా లేని ఓ యువతి మధ్య ప్రేమ ఉంటుంది. ఇక్కడ భౌతికపరమైన ప్రేమ వెనక్కి వెళ్లిపోతుంది. ఆత్మతో పెనవేసుకున్న ప్రేమతో శివాజీ గణేశన్, రాధ కాంబినేషన్లో భారతీ రాజా తెరకెక్కించిన ‘ముదల్ మరియాదై’ సూపర్ డూపర్ హిట్. ‘ఆత్మ బంధువు’గా తెలుగులో విడుదలై, ఘనవిజయం సాధించింది. మరణం అంచుల్లో ఉన్న ఆ మూగ ప్రేమికుడు... ప్రేయసి కనపడ్డాకే కన్ను మూస్తాడు... ఎంత గొప్ప ప్రేమ. తర్వాతి తరంతోనూ సినిమాలు తీయడం మొదలుపెట్టిన తర్వాత కుల వివక్ష నేపథ్యంలో దగ్గుబాటి రాజా, అమల కాంబినేషన్లో భారతీ రాజా తెరకెక్కించిన ‘వేదమ్ పుదిదు’ ఓ సంచలనం. దగ్గుబాటి రాజా, మహేశ్వరితో ‘కరుత్తమ్మ’ తీశారు.తెలుగులో ‘కొత్త జీవితాలు’తో...తెలుగులో హరిప్రసాద్, సుహాసిని కాంబినేషన్లో ‘కొత్త జీవితాలు’ చిత్రాన్ని తెరకెక్కించారు భారతీ రాజా. తమిళంలో ఆయన దర్శకత్వంలోనే వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘పుదియ వార్పుగళ్’కి ఇది రీమేక్. అలాగే తమిళంలో సత్యరాజ్, రేఖ జంటగా తాను తెరకెక్కించిన ‘కడలోర కవిదైగళ్’ని తెలుగులో మాస్ హీరో చిరంజీవితో ‘ఆరాధన’గా తెరకెక్కించారు. ఒక టీచర్‌కి, నిరక్షరాస్యుడికి మధ్య సాగే ప్రేమతో రూపొందిన ఈ చిత్రం రెండు భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. ఇంకా సీనియర్ నటుడు కృష్ణతో ‘జమదగ్ని’ చిత్రాన్ని రూపొందించారు. తమిళ్, తెలుగు, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాలు తెరకెక్కించారు భారతీ రాజా. దర్శకుడిగా ఆయన చివరి చిత్రం ‘మీండుమ్ ఒరు మరియాదై’ (2020). ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశారు. భారత చలన చిత్ర సీమ ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. భారతీ రాజాకు రీప్లేస్మెంట్ లేదు... మట్టి కథలకు ప్రాధాన్యం ఇచ్చి, మట్టి పరిమళాన్ని వెండితెరపై వెదజల్లి, భౌతికంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిన భారతీ రాజా ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఉంటారు. ‘ఆర్’ అక్షరంతో నామకరణంవిజయశాంతి, రాధిక, రాధ, రేవతి, రేఖ, రంజిత, రతి అగ్నిహోత్రి, ముచ్చెర్ల అరుణ, ప్రియమణి... ఇలా పలువురు కథానాయికలను పరిచయం చేశారు భారతీ రాజా. ఆయన తెరకెక్కించిన ‘కల్లుక్కుళ్ ఈరమ్’తో విజయశాంతి నటిగా ప్రయాణం మొదలుపెట్టి, తెలుగులో లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగారు. అలాగే తాను పరిచయం చేసిన కథానాయికల పేరు మార్చాల్సి వస్తే... ‘ఆర్’ అక్షరం ఉండేలా చూసేవారు భారతీ రాజా.నటుడిగా...నటుడిగానూ భారతీ రాజా రాణించారు. తాను దర్శకత్వం వహించిన ‘కల్లుక్కుళ్ ఈరమ్’లో దర్శకుడి పాత్ర చేశారు. మణిరత్నం తెరకెక్కించిన ‘యువ’ సినిమాతో పూర్తి స్థాయి నటుడిగా మారారు. శింబు ‘ఈశ్వరన్’ లో, ధనుష్ ‘తిరు’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. తమిళంలో భారతీ రాజా నటించిన చివరి చిత్రం ‘పులవర్’ విడుదల కావాల్సి ఉంది. చివరిగా ఆయన మలయాళంలో ‘తుడరుమ్’లో కనిపించారు. అలాగే విజయన్, త్యాగరాజన్, మణివణ్ణన్ వంటి వారికి ఒక్కో సినిమాకి డబ్బింగ్ కూడా చె΄్పారు. ‘కరుత్తమ్మ’లో ‘కాడు పొట్టకాడు...’ అనే పాట పాడారు. బుల్లితెరకు ‘తేకత్తి పొన్నుమ్, అప్పనుమ్ నానుమ్’ వంటి సీరియల్స్‌కి, ‘మోడర్న్ లవ్ చెన్నై’ అనే వెబ్ సిరీస్‌లోని ఓ ఎపిసోడ్‌కి దర్శకత్వం వహించారు.తనయుడి మరణంతో మనోవేదన1974లో చంద్రలీలను వివాహం చేసుకున్నారు భారతీ రాజా. కుమారుడు మనోజ్‌కుమార్, కుమార్తె జననీ వీరి సంతానం. తండ్రి దర్శకత్వం వహించిన ‘తాజ్ మహల్’ చిత్రంతో మనోజ్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా ‘విజిల్, పవిత్ర, మార్గళి తింగళ్’ చిత్రాలను రూపొందించారు. 2006లో తన స్నేహితురాలు, నటి నందనని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, 2025లో గుండెపోటుతో మనోజ్ కన్ను మూశారు. కుమారుడి మరణంతో భారతీ రాజా మనోవేదనకు గురయ్యారు. మనోజ్ మరణం ఆయన్ను బాగా కుంగదీసింది.దర్శక శిఖరానికి ఆరు జాతీయ అవార్డులుభారతీయ చిత్ర సీమకు చేసిన ఎనలేని సేవలకు గాను భారతీ రాజాను ఎన్నో అవార్డులు వరించాయి. ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శక శిఖరం) అనే బిరుదు ఆయన సొంతం. 2004లో భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ విభాగాల్లో మొత్తంగా 6 జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారాయన. ‘సీతాకోకచిలుక’, ‘ముదల్ మరియాదై’, ‘వేదమ్ పుదిదు’, ‘కరుత్తమ్మ’, ‘అంది మందారై’, ‘కడల్ పూక్కళ్’ చిత్రాలకు జాతీయ అవార్డులు లభించాయి. ఇంకా తమిళ నాడు రాష్ట్ర పురస్కారాలు, ఇతర అవార్డులు అందుకున్నారు. ‘సీతాకోక చిలుక’కి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు లభించింది.– డి.జి. భవాని -
తమిళనాడు నుంచి దుబాయికి బస్సు టికెట్
చెన్నై: తమిళనాడులో ఓ కండక్టర్ ఇచ్చిన టికెట్ ప్రయాణికున్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. తన సమీపంలోని ఊరికి వెళ్లాలని ప్రయాణికుడు సదరు కండక్టర్ని టికెట్ అడిగారు. దానికి సరే అని తలూపిన కండక్టర్ టికెట్ ఇచ్చారు. తీరా టికెట్ చూస్తే అందులో వేరే దేశానికి టికెట్ ఉంది. అంతే కాకుండా దాని ఖరీదు రూ. 10 వేలుగా ఉంది.అసలేం జరిగిందంటే?దామోదరన్ అనే వ్యక్తితో పాటు అతని స్నేహితుడు కలిసి బెంగళూరు వెళ్తున్న తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ బస్సు ఎక్కారు. వారు తమిళనాడులోని హుసూరు ప్రాంతానికి వెళ్లడానికి టికెట్ అడిగారు. దీంతో కండక్టర్ టికెట్ ఇచ్చారు. అయితే, కండక్టర్ తన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్ ద్వారా ప్రింట్ తీసి ఇచ్చిన టికెట్లను చూసి దామోదరన్ షాక్‌కు గురయ్యాడు.అందులో అతడు వెళ్లాల్సిన గమ్యస్థానం హుసూరుకు బదులు (దుబాయి, యుఏఈ) అని అని రాసి ఉంది. అంతే కాకుండా టికెట్ ధర రూ. పదివేలుగా ఉంది. దీంతో సదరు ప్రయాణికుడు షాక్‌కు గురయ్యాడు. దీంతో ఒక సాధారణ అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణం కాస్తా, అంతర్జాతీయ విమాన ప్రయాణంలా మారిపోయిందని ఆశ్చర్యపోయాడు. సాధారణంగా అతను వెళ్లాల్సిన గమ్యస్థానానికి రూ.150 వరకూ టికెట్ ధర ఉంటుంది.సోషల్ మీడియాలో ట్రెండింగ్అయితే ఈ ఘటనను తాలూకా వివరాలతో పాటు ఆ టికెట్‌ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో కాస్తా ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై రకరకాల జోకులు, మీమ్స్‌తో విరుచుకుపడ్డారు. తమిళనాడు రవాణా సంస్థ గల్ఫ్ దేశాలకు కూడా బడ్జెట్ బస్సు సర్వీసులను ప్రారంభించిందా ఏంటి? అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేశారు. సముద్రాలను దాటి బస్సు ప్రయాణిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.అధికారుల వివరణఈ టికెట్ వైరల్ కావడంతో తమిళనాడు రవాణా సంస్థ (TNSTC) సేలం డివిజన్ అధికారులు వెంటనే స్పందించారు... కండక్టర్ ఉపయోగించిన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్‌లో ఏర్పడిన ఒక సాంకేతిక లోపం వల్లే టికెట్‌పై దుబాయ్ అని ప్రింట్ అవ్వడం, అంత భారీ మొత్తంలో ఛార్జీ పడటం జరిగాయి. ప్రయాణికుల నుంచి కేవలం ఛార్జీ రూ. 150 మాత్రమే వసూలు చేశారని, ఈ తప్పు కేవలం టికెట్‌పై ప్రింట్ అయిన వివరాలకే పరిమితమైందని అధికారులు స్పష్టం చేశారు. -
సీఎం విజయ్‌తో చెస్ సంచలనం ప్రజ్ఞానంద
భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద నార్వే చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో సోమవారం తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌ని ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ప్రజ్ఞానందను అభినందించడమే గాక అతడితో సరదాగా చెస్ ఆడాడు. అతడి ప్రదర్శనతో తమిళనాడు గర్విస్తోందని పేర్కొన్న విజయ్ ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల చెక్కును రివార్డుగా అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ఓస్లో వేదికగా జరిగిన టోర్నీలో ప్రజ్ఞానంద ఫైనల్లో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌ను మట్టికరిపించి చాంపియన్‌షిప్ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. టోర్నీ ఆరంభంలో తడబడిన ప్రజ్ఞానంద చివరి దశలో అనూహ్యంగా ఫుంజుకున్నాడు. పదో రౌండ్ ప్రారంభానికి ముందు 15 పాయింట్లతో ప్రజ్ఞానంద ముందు వరుసలో నిలిచాడు. ఆఖరి రౌండ్లో విన్సెంట్ కీమర్‌ను ఓడించిన ప్రజ్ఞానంద నార్వే చెస్ టైటిల్‌ను తొలిసారి సొంతం చేసుకున్నాడు. ఇక నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచిన ప్రజ్ఞానందకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు అభినందించారు.#WATCH | Chennai | Tamil Nadu CM Vijay meets Indian Grandmaster R Praggnanandhaa and awards him Rs 50 lakh on behalf of the Sports Development Authority of Tamil Nadu after the chess player won the Norway Chess 2026 title.(Source: TNDIPR) pic.twitter.com/Lf4dNgYrEX— ANI (@ANI) June 8, 2026చదవండి: మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియన్స్! -
తమిళ్ పాలిటిక్స్ లోకి మరో హీరో ఎంట్రీ
-
తమిళనాడులో బీజేపీకి మరో బిగ్‌షాక్
సాక్షి,బెంగళూరు: తమిళనాడులో బీజేపీకి మరో బిగ్‌షాక్ తగిలింది. తమిళనాడులో బీజేపీకి మరో బిగ్‌షాక్ తగిలింది. తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాజీనామా చేసిన తర్వాత, ఆయన బాటలో మరికొందరు నేతలు కూడా పార్టీని వీడారు. ముఖ్యంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్, రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్ సహా కనీసం 15 మంది కీలక పదవుల్లో ఉన్న నాయకులు రాజీనామా చేశారు.కరు నాగరాజన్ 2016లో మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2017లో ఆర్కే నగర్ ఉపఎన్నికలో పోటీ చేశారు. అయితే రెండు సార్లూ ఘోర పరాజయం పాలయ్యారు. ముఖ్యంగా 2017 ఉపఎన్నికలో ఆయనకు వచ్చిన ఓట్లు నోటా కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఆ ఎన్నికలో ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ విజయం సాధించారు.ఇక బీజేపీకి రాజీనామా, రాజీనామాకు బీజేపీ పెద్దలు ఆమోదం తెలపడంపై అన్నామలై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రాష్ట్రంలో తాను కొత్త ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అన్నామలై మక్కల్ ఇయ్యక్కం (AMI) పేరుతో ప్రారంభమైన ఈ ఉద్యమం 2031 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. కల్ట్ పొలిటిక్స్ నుంచి బయటపడుతూ, సాధారణ ప్రజల రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నామలై స్పష్టం చేశారు.పార్టీ నిర్ణయాలపై అసంతృప్తిఅన్నామలై ఈ వారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్లతో సమావేశమయ్యారు. తన రాజీనామా లేఖలో, తమిళనాడు రాజకీయ వ్యూహంపై పార్టీ నాయకత్వంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.అన్నామలై రాజకీయ ప్రయాణం కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయన 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి వీద ఫౌండర్ లీడర్స్ ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించారు. 2020లో బీజేపీలో చేరి, ఏడాదిలోనే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంపై ఆయన చేసిన దూకుడు ప్రచారాలు, పాదయాత్రలు బీజేపీకి తమిళనాడులో గుర్తింపు తెచ్చాయి. అయితే 2026 ఎన్నికల్లో బీజేపీ–ఏఐఏడీఎంకే కూటమి నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు కావడంతో చివరికి ఆయన పార్టీని వీడారు. -
కొత్త పార్టీ పేరుపై సస్పెన్స్.. అన్నామలై మాస్టర్ ప్లాన్?
-
'అన్నామలై రాజీనామా చేయలేదు'
చెన్నై: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై విషయం గత కొద్ది రోజులుగా హాట్ టాఫిక్‌గా మారింది. ఆయన పార్టీని వీడుతున్నారని త్వరలోనే ఒక కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని పుకార్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందించారు. అన్నామలై బీజేపీకి రాజీనామా చేస్తున్నారనేది పూర్తిగా అవాస్తవాలని ఆయన రాజీనామా చేయలేదని కొట్టిపేడేశారు.నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ.. "అన్నామలై బీజేపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ కేవలం ఆధారాలు లేని పుకార్లు. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నాకు ఆయన నుంచి ఎలాంటి రాజీనామా లేఖ అందలేదు. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. కొత్త పార్టీ పెట్టే విషయంపై అన్నామలై ఎవరితోనూ మాట్లాడలేదు. మేము కూడా ఆయనతో ఈ విషయం మాట్లాడలేదు, ఆయన కూడా మాతో ప్రస్తావించలేదు. ఆయన రాజీనామా చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం, వాటిలో ఎలాంటి నిజం లేదు, అవన్నీ కేవలం వదంతులు మాత్రమే." అని నాగేంద్రన్ అన్నారు. ఈ క్రమంలోనే అన్నామలైకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు.ఇటీవలే న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీ అయ్యారు. తదుపరి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరిస్తూ ఐదు పేజీల లేఖను ఆయనకు సమర్పించారు. అయితే ఆయన రాజీనామాను బీజేపీ ఇంతవరకూ ఆమోదింపలేదు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఈ విధంగా వ్యాఖ్యానించారు.కాగా ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్నామలైను పూర్తిగా సైడ్‌ట్రాక్ చేసింది. ఆయన అభిప్రాయాలకు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీజేపీ అన్నామలైని శాంతిపజేసే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
బీజేపీకి అన్నామలై రాజీనామా..
-
సీఎం విజయ్‌తో విజయ్ ఆంటోనీ, ఆర్జే బాలాజీ భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను సినీ హీరో విజయ్ ఆంటోనీ, ఇటీవల హీరో సూర్యతో ‘కరుప్పు’ చిత్రం చేసి హిట్‌కొట్టిన దర్శకుడు ఆర్జే బాలాజీ మంగళవారం వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా తమ సీఎంతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. సీఎం విజయ్‌తో గడిపిన సమయం ఎంతో ప్రేరణాత్మకంగా అనిపించింది. ఆయన పాజిటివిటీ, ఎనర్జీ ఎప్పటిలాగే అద్భుతంగా ఉన్నాయి. ప్రజలకు సేవ చేస్తూ సమాజంలో అర్థవంతమైన మార్పు తీసుకురావడానికి కావాల్సిన శక్తి ఆయనకు లభించాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. విజయ్ను ముఖ్యమంత్రిగా కలవడం నమ్మశక్యం కాని అనుభూతి. ఆయన చూపే ప్రేమలో ఏమాత్రం మార్పు లేదు. ఎప్పటిలాగే ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా ఉన్నారని అన్నారు. ‘కరుప్పు’ కథను మొదట విజయ్‌కే చెప్పినట్టు బాలాజీ గతంలో వెల్లడించారు. అయితే విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో సినిమా ఆలస్యమవుతుందన్న భావనతో సూర్యతో ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళనాట ఆ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ మూవీ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైంది. తమిళనాడులో ఈ చిత్రాన్ని జనం ఎగబడి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రూ.300 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. చాన్నాళ్ల తర్వాత ఈ మూవీతో సూర్యకు హిట్ దక్కింది. -
బీజైపీకీ అన్నామలై గుడ్‌బై..?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకోబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కే అన్నామలై త్వరలోనే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం అందుతోంది. అనంతరం త్వరలోనే సొంతంగా ఒక రాజకీయ ఉద్యమాన్ని, ఆ తర్వాత కొత్త పార్టీని స్థాపించే యోచనలో ఉన్నట్లు సమాచారం.బీజేపీ నేత అన్నామలైకి అధిష్ఠానంతో అస్సలు పొసగడంలేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (2026) ఒంటరిగా పోటీ చేయాలని అన్నామలై భావించినప్పటికీ, బీజేపీ అధిష్టానం మాత్రం తిరిగి AIADMKతో పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఒత్తిడి మేరకు అన్నామలై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన కనీసం పోటీ కూడా చేయకుండా కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు.ఈ నేపథ్యంలో పార్టీలో తనకు సరైన గుర్తింపు, భవిష్యత్తు లేవనే అసంతృప్తితో ఉన్న ఆయన ఈ విషయమై బీజేపీ జాతీయ నేత నితిన్ నబిన్‌తో సమావేశం కావడానికి నిన్న( సోమవారం) ఢిల్లీ పయనమయ్యారు. చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను మీడియా ప్రతినిధులు పలకరించగా.. "దయచేసి రెండు రోజులు ఆగండి, మనం కూర్చొని వివరంగా మాట్లాడుకుందాం" అని క్లుప్తంగా సమాధానమిచ్చారు. అయితే, ఆయన విమానాశ్రయానికి వచ్చిన వాహనానికి బీజేపీ జెండా లేకపోవడంతో ఆయమ పార్టీ మారనున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.ప్లాన్ సిద్ధమైందా..?కాగా జూన్ 4న అన్నామలై పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో ఇప్పటికే "మా నాయకుడా, వచ్చి మమ్మల్ని నడిపించు" అనే నినాదాలతో భారీ పోస్టర్లు వెలిశాయి. ఆయన ప్రస్తుతం నడిపిస్తోన్న "వి ది లీడర్స్" అనే స్వచ్ఛంద సంస్థ ఆధారంగా ఒక బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఉద్యమం చేపట్టి ఆపై దానిని ఒక రాజకీయ పార్టీగా మార్చేలా అన్నామలై వ్యూహం రచిస్తోన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
సీఎం విజయ్ బ్లాక్ అండ్ వైట్ సూట్ రహస్యం బయట పడింది
సాక్షి,చెన్నై: రాష్ట్ర హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని తమిళనాడు సీఎం విజయ్ స్పష్టం చేశారు. టీవీకే పార్టీ భారీ విజయం సాధించిన తర్వాత విజయ్ తిరుచ్చిలో తన మొదటి సభను నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ పోరాటం ఇప్పుడు టీవీకే , డీఎంకే మధ్య మాత్రమే. ఇకపై ఎఐఎడీఎంకేకు రాష్ట్ర రాజకీయాల్లో స్థానం లేదు. మా ప్రభుత్వం అందరి కోసం పని చేస్తోంది. రాష్ట్ర హక్కులు, లౌకికవాదం విషయంలో ఎలాంటి రాజీ పడబోదు’అని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా తనపై వచ్చిన హార్స్ ట్రేడింగ్ (ఎమ్మెల్యేల కొనుగోలు) ఆరోపణలను విజయ్ ఖండించారు. డీఎంకే ఎఐఎడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. మీరు ఎన్నో సంవత్సరాలుగా మోసం చేసిన ఇద్దరిని తిరస్కరించి మీ విజయ్ను, మీ అన్నను, మీ తమ్ముడిని ఎన్నుకున్నారు. నేను ముఖ్యమంత్రి కాదు, మీ సేవకుడినంటూ సభకు హాజరైన ప్రజలు, పార్టీ శ్రేణుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దుస్తులపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. నేను సూట్ ఎందుకు ధరించకూడదు? నేను రంగులు మార్చలేను, రంగురంగుల దుస్తులు ధరించలేను. అందుకే సూట్ ధరిస్తున్నాను. నేను ధరిస్తున్న సూట్‌ను కూడా వాళ్లు విమర్శిస్తున్నారు. మనం కోటు సూటు ధరించకూడదా? విజయ్ ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్ నిజాయితీగా ఉంటాడనే విషయాన్ని ఇది సూచిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి గెలిచిన తర్వాత రాజీనామా చేసి, చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గాన్ని కొనసాగించారు. సభకు ఆయన రాక సందర్భంగా విమానాశ్రయం నుంచి వేదిక వరకు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. -
తమిళనాడు పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్.. కొత్త పార్టీతో అన్నామలై రీ-ఎంట్రీ?
-
హ్యుందాయ్ కార్ల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి,చెన్నై: తమిళనాడు కాంచీపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హ్యుందాయ్ కార్ల షోరూంలో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అగ్నికీలల్లో కార్లు,సామాగ్రి దగ్ధమయ్యాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్ని మాపక సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. పదుల సంఖ్యలో మొహరించిన ఫైరింజన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తెచ్చినప్పటికీ భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు. -
సూపర్ కాంబో: మోదీ, సురేష్ గోపీలతో విజయ్ స్కెచ్!
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో కీలక భేటీ అయ్యారు. తరువాత కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు సురేష్ గోపీకి ఫోన్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంభాషణ కేవలం మర్యాదపూర్వకం మాత్రమే కాదని, దేశాభివృద్ధి లక్ష్యంగా సాగిందని సురేష్ గోపీ స్వయంగా వెల్లడించారు.రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిప్రధాని మోదీతో 20 నిమిషాల భేటీ ముగిసిన తర్వాతే తన ప్రియ మిత్రుడు, తమిళనాడు సీఎం విజయ్ ఫోన్ చేశారని సురేష్ గోపీ సోషల్ మీడియాలో తెలిపారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి, తద్వారా దేశ పురోగతికి కలిసి పనిచేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు ఆయన తెలియజేశారు.ఢిల్లీ పర్యటనలో విజయ్ కీలక అజెండాసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ చేపట్టిన తొలి అధికారిక ఢిల్లీ పర్యటన కీలక అంశాలతో ముగిసింది. మెకేదాటు ప్రాజెక్ట్ వివాదం, తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడులు, వందేమాతరం వివాదం వంటి సున్నితమైన సమస్యలను ఆయన ప్రధాని ముందుంచారు. ఈ అంశాలపై కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజయ్ విజ్ఞప్తి చేశారు.చరిత్రక వారసత్వానికి ప్రాధాన్యతప్రాంతీయ సమస్యలతో పాటు, దేశ గౌరవానికి సంబంధించిన అంశాలపై కూడా విజయ్ దృష్టి సారించారు. నెదర్లాండ్స్ నుండి తిరిగి తీసుకువచ్చిన చోళుల కాలం నాటి రాగి శాసనాలను విజయవంతంగా స్వదేశానికి రప్పించినందుకు ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన పదవీకాలంలో ప్రజా సంక్షేమంతో పాటు, చరిత్రక వారసత్వాన్ని కాపాడటంలో కూడా కీలకంగా వ్యవహరిస్తానని విజయ్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. -
ఈ ఎన్నికల్లో అవేం గెలవలేదు.. సీఎం విజయ్‌పై సముద్రఖని కామెంట్స్
తమిళనాడు ముఖ్యమంత్రిగా కొన్నిరోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన హీరో విజయ్.. తన రోజువారీ పనుల్లో బిజీ అయిపోయారు. అయితే ఆయన గెలుపు గురించి ఇండస్ట్రీ నుంచి ఇప్పటికీ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నటుడు, దర్శకుడు సముద్రఖని కూడా తనదైన శైలిలో సీఎం విజయ్ గురించి మాట్లాడారు. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: జాన్వీ కపూర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్.. పూటలోనే బక్కగా అయిపోతారు)ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన సముద్రఖని.. విజయ్ రాజకీయ అనుభవంపై వచ్చిన విమర్శలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. 'తమిళనాడు ప్రజలు సినీ ఇండస్ట్రీ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి అందించారు. దీనిపై నాకు చాలా ఆనందంగా ఉంది. రాజకీయాల్లోకి రావడానికి ఆయనకు(విజయ్) ఏం అర్హత ఉందని చాలామంది ప్రశ్నించారు. అయితే ఆ అర్హత ఉందని చెప్పుకొనే వాళ్లు ప్రజల కోసం ఏం చేశారు? రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినవాళ్లు మరింత జాగ్రత్తగా, ప్రజల కోసం మంచి చేస్తారనే నమ్మకం నాకు ఉంది' అని అన్నారు.తమిళనాడు ఎన్నికల ఫలితాలని సునామీతో పోల్చిన ఈయన..'ఈ ఎన్నికల్లో డబ్బు, కులం, మతం, అహంకారం ఏమీ గెలవలేదు. ప్రజలు అజ్ఞానులు అని కొందరు భావించారు. కానీ వాళ్లే ఎంతో తెలివిగా వ్యవహరించారు. అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకుని చివరకు డబ్బు ఇవ్వని పార్టీకి ఓటేశారు. అయితే ఈ ఫలితాల్లో స్టాలిన్ సర్, పళనివేళ్ త్యాగరాజ్ అన్న, సీమన్ అన్న ఓడిపోవడం నాకు బాధ కలిగించింది. తిరుమావళన్ అన్నకు పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సింది. అప్పుడు గెలిచేవారు. అన్నామలై ఇంకొంత కాలం ప్రజల్లో తిరుగుంటే బాగుండేది. ఈ సునామీ కొన్ని మంచి విషయాల్ని కూడా తీసుకెళ్లిపోయింది' అని సముద్రఖని చెప్పుకొచ్చారు.తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా వరస సినిమాలు చేస్తున్న సముద్రఖని ప్రస్తుతం వెట్రిమారన్ 'అరసన్' మూవీలో నటిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం 'కార్మేని సెల్వం' మూవీతో వచ్చారు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.(ఇదీ చదవండి: అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్)“பெரிய சுனாமி வந்தது மாதிரி...பணம், ஜாதி, மதம், அகங்காரம் உடைக்கப்பட்டது..”- தேர்தல் முடிவு குறித்து இயக்குநர் சமுத்திரக்கனி#Samuthirakani | #TVK | #Vijay | #CMVijay pic.twitter.com/bh2Q5p4cZt— PttvOnlinenews (@PttvNewsX) May 26, 2026 -
ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో క్రికెటర్
తమిళనాడు చెందిన మరో క్రికెటర్ ఐపీఎల్ సహా దేశవాలీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొద్ది రోజుల కిందట ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ దేశవాలీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు వీడ్కోలు పలకగా.. తాజాగా మురుగన్ అశ్విన్ కూడా రెండు విభాగాలకు బై బై చెప్పాడు.35 ఏళ్ల అశ్విన్ లెగ్ బ్రేక్ బౌలర్‌గా సుపరిచితుడు. 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన మురుగన్.. 2018లో ఆర్సీబీకి, 2019-21 వరకు పంజాబ్ కింగ్స్‌కు, 2022లో ముంబై ఇండియన్స్‌కు, 2023లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు. View this post on Instagram A post shared by Ashwin Murugan (@ashwinmurugan)అప్పటి నుంచి అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. మురుగన్ తన ఐపీఎల్ కెరీర్లో 44 మ్యాచ్‌లు ఆడి 35 వికెట్లు తీశాడు.2012లో తమిళనాడు తరఫున దేశవాలీ అరంగేట్రం చేసిన మురుగన్.. 2023, 24లో చండీఘడ్‌కు, 2025లో జమ్మూ కశ్మీర్‌కు ఆడాడు. దేశవాలీ కెరీర్లో 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 29 లిస్ట్-ఏ, 105 టీ20లు ఆడిన మురుగన్.. మొత్తంగా 130 వికెట్లు తీశాడు. -
ప్రెస్మీట్లో పగలబడి నవ్విన పోలీస్ అధికారిని ఎవరంటే?
సాక్షి,చెన్నై: కోయంబత్తూర్ జిల్లాలో 10 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. బాలికను అపహరించి దారుణంగా హత్య చేసిన ఈ సంఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఘోరమైన నేరాలకు పాల్పడిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి, ఫాస్ట్-ట్రాక్ కోర్టులో విచారణ జరిపి కఠిన శిక్షలు విధించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మహిళలు, పిల్లల భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.అయితే కేసు పురోగతిని వివరించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్ జోన్ ఐజీ ఆర్వీ రమ్యా భారతి, డీఐజీ సమీనాథన్, ఎస్పీ పవన్ కుమార్ రెడ్డి నవ్వుతూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నేపథ్యంలో అధికారులు ఇలా వ్యవహరించడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఐజీ రమ్యా భారతి నవ్వుతూ గోళ్లు గిల్లుకోవడం మరింత వివాదాస్పదంగా మారింది. Am told that CM has taken action over the insensitive video of police officers laughing before briefing the media on such a serious case.But it turns out no action has been taken yet.I deleted my earlier tweet in which I thanked the CM.Didn’t expect CM Vijay to stay silent… pic.twitter.com/vmLURRYV5Z— Lala (@FabulasGuy) May 25, 2026 ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ‘ఒక కుటుంబం కన్నీటిలో మునిగిపోయి ఉంటే, బాధ్యతాయుత పదవుల్లో ఉన్న అధికారులు నవ్వుతూ కనిపించడం మానవత్వానికి విరుద్ధం’ అంటూ నెటిజన్లు మండిపడ్డారు. రాష్ట్ర మహిళా మంత్రులు ఎస్.కీర్తన, కే.జగదీశ్వరి కూడా నవ్వుతూ మాట్లాడినందుకు విమర్శలు ఎదుర్కొన్నారు.బాధిత బాలిక తల్లి కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘నా బిడ్డను కడసారి చూడనీయలేదు, పోస్టుమార్టం తర్వాత కూడా చూపించలేదు’అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం,ఈ కేసు విచారణ కొనసాగుతుండగా ప్రెస్మీట్లో నవ్వుతూ కనిపించిన ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.కోయంబత్తూర్ చిన్నారి హత్య కేసులో ఇద్దరు నిందితులు కార్తిక్ (33), మోహన్ (30) అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం వారు కోర్టు ఆదేశాల ప్రకారం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కార్తిక్ గాయాల కారణంగా కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, మోహన్ జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు.ప్రధాన నిందితుడు కార్తిక్ బాధిత కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి. బాలికను లాక్కెళ్లి లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అరెస్ట్ సమయంలో పారిపోవడానికి ప్రయత్నించి భవనం నుంచి దూకడంతో చేతి, కాలి ఎముకలు విరిగాయి. ప్రస్తుతం కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మోహన్.. కార్తిక్‌కు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. கடுங்குற்றச் செயல்களில் ஈடுபடுவோர் மீது உடனடியாக வழக்குப் பதிவு செய்து, விரைவாக விசாரணை நடத்தி, சட்டத்தின் கீழ் கடுமையான தண்டனை பெற்றுத்தர வேண்டும் என தமிழ்நாடு முதலமைச்சர் விஜய் அவர்கள் உத்தரவிட்டுள்ளார்#TVKVijayHQ #CMJosephVijay pic.twitter.com/zryLbTeHjc— CM Joseph Vijay (@CMJosephVijayHq) May 25, 2026 -
సీఎం విజయ్ కి తొలి సవాల్.. కోయంబత్తూరు ఘటన కలకలం
-
వంగిన కొబ్బరిచెట్టుతో వీసీకేకు కౌంటర్
చెన్నై: తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా రెండు వారాలవుతున్నా ఇంకా అక్కడ రాజకీయం ఏ మాత్రం చల్లారటం లేదు. డీఎంకే, వీసీకే పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండుపార్టీలు తమిళనాడు సాహిత్యంతో విమర్శలు చేసుకుంటున్నాయి.ఈ ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠతో నడిచిన రాజకీయం ఏదంటే.. ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాలే అని చెప్పుకోవాలి. విజయ్ టీవీకే పార్టీ అధికారానికి పది సీట్ల దూరంలో నిలిచిపోవడం.. గవర్నర్ ఎట్టిపరిస్థితుల్లో సరైన మద్దతు చూపాలనడం.. మెుదట సపోర్టు చేస్తానని చెప్పిన చిన్న పార్టీలు తరువాత మెుండి చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయం సస్పన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. ఎట్టకేలకు అక్కడి కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు వీసీకే సపోర్టు చేయడంతో విజయ్ పార్టీ గండం గడిచి అధికారం చేజిక్కించుకుంది.ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు వీసీకే సపోర్టు ఇచ్చింది. కాగా దీనిపై తాజాగా డీఎంకే, వీసీకే నేతలు తమిళ సాహిత్యంలోని కవిత్వంతో విమర్శలు చేసుకున్నారు. డీఎంకే ఎంపీ రాజా వంకరగ పెరిగిన కొబ్బరి చెట్టు తనను పెంచిన భూమికి కాకుండా ప్రక్కకు వంగి వేరే ప్రాంతానికి కొబ్బరికాయలు ఇస్తుందని తెలిపారు. అంటే పరోక్షంగా వీసీకే డీఎంకే కూటమిలో గెలిచే విజయ్ పార్టీతో చేరిందని చురకలుంటించారు.రెండవ ట్వీట్లో పెరియార్ ద్రవిడియన్ సిద్ధాంతమే తమిళనాడు రాజకీయ, సాంస్కృతిక, సామాజిక గుర్తింపును ముందుకు తీసుకెళుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మారే వరకూ ఎదురుచూస్తాం.. పోరాడటాన్ని కొనసాగిస్తాం విజయం సాధిస్తాం అని అన్నారు.వీసీకే రీకౌంటర్అయితే ఈ కామెంట్స్‌కు వీసీకే పార్టీ నేత వీ బాలాజీ స్పందించారు. "వినయవంతులకు అధికారం.. అందులో ఆగ్రహం ఏముంది" అనే తమిళ పద్యంతో కౌంటరిచ్చారు.సామాజిక న్యాయం కోసం పని చేసే వారిపై ఆగ్రహంతో ఉన్నారని డీఎంకే వ్యాఖ్యలలో కుటుంబ పాలన కూలిపోతుందే భయం కనిపిస్తోందనే కుటుంబపాలన కూలిపోతుందనే భయం కనిపిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలతో డీఎంకే పార్టీ అసలు స్వరూపం బయిటపడిందన్నారు. -
‘సీఎం సీటొద్దులే.. మంత్రిగా సరిపెట్టుకుంటా’
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో ఇప్పటివరకు బయట నుంచి మద్దతు ఇస్తున్న విదుతలై చిరుతైగల్ కట్చి (VCK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అంగీకరించాయి. దీంతో విజయ్ మంత్రి వర్గంపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ విజయ దుందుభి మోగించారు. విజయ్ గెలుపే కాదు రాజకీయ సమీకరణాలు సైతం మారాయి. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఒంటరిగా నెలకొల్పే అవకాశాన్ని ఆమడ దూరంలో కోల్పోయారు. దీంతో కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంల్, సీపీఐ, సీపీఎం వంటి వామపక్షాల సహకారంతో విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు మంత్రివర్గ విస్తరణలో వ్యూహంవిజయ్ ఇప్పటి వరకు 33 మంది సభ్యులతో (ముందుగా 10 మంది, ఇప్పుడు 23 మంది చేరారు) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ వీసీకే, ఐయూఎంల్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ రెండు పార్టీలు డీఎంకే ఆధ్వర్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్‌లో భాగమై ఉండటంతో, టీవీకే మంత్రివర్గంలో చేరడంపై జాగ్రత్తగా వ్యవహరించాయి. విజయ్ ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి, మంత్రివర్గంలో మూడు స్థానాలను ఖాళీగా ఉంచారు. భవిష్యత్తులో వీరిని ఒప్పించవచ్చన్న ధీమాతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.వీసీకే, ఐయూఎంల్ వైఖరివీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ ‘మేము మంత్రిపదవులు కోరలేదు, రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెరగకుండా ఉండటానికి మాత్రమే మద్దతు ఇచ్చాం’అని స్పష్టం చేశారు. అయినప్పటికీ, పార్టీ చర్చల అనంతరం మంత్రివర్గంలో చేరేందుకు అంగీకరించింది. ఐయూఎంల్ కూడా మొదట్లో సంకోచం చూపినప్పటికీ, చివరికి తమ ఎమ్మెల్యే ఏ.ఎం. షాజహాన్‌ను మంత్రివర్గంలోకి పంపేందుకు సిద్ధమైంది.వీసీకే, ఐయూఎంల్ మంత్రివర్గంలో చేరడం ద్వారా విజయ్ ప్రభుత్వానికి మరింత స్థిరత్వం లభిస్తుంది. కాంగ్రెస్ ఇప్పటికే మంత్రివర్గంలో భాగమై ఉండటంతో, చిన్నపార్టీలకు కూడా ప్రాధాన్యం లభిస్తుంది. ఇది అలయెన్స్ రాజకీయాల్లో సమతుల్యతను కాపాడడమే కాకుండా, విజయ్‌కు కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో మరింత బలం ఇస్తుంది. మొత్తం మీద, వీసీకే, ఐయూఎంల్ మంత్రివర్గంలో చేరడం విజయ్ ప్రభుత్వానికి ఒక పెద్ద ఊరట. ఇది తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుంది.సీఎం సీటొద్దులే.. మంత్రి పదవి చాలు.. వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ గతంలో సీఎం కావాలనే ఆశయాన్ని బహిరంగంగా ప్రకటించారు. కానీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ ఘన విజయం సాధించడంతో ఆ అవకాశం ఆయనకు దూరమైంది. విజయ్ మెజారిటీకి తక్కువగా నిలిచినప్పటికీ, వీసీకే, ఐయూఎంల్, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. మొదట్లో వీసీకే బయట నుంచి మాత్రమే మద్దతు ఇచ్చింది.విజయ్ వ్యూహాత్మకంగా మంత్రివర్గంలో ఖాళీ స్థానాలు ఉంచి, మిత్రపక్షాలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. చివరికి వీసీకే కూడా మంత్రివర్గంలో చేరేందుకు అంగీకరించింది. ఇలా, సీఎం కావాలనే కల నెరవేరకపోయినా, ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా వీసీకే అధినేత తన రాజకీయ ప్రాధాన్యాన్ని నిలబెట్టుకున్నారు. -
మరో వివాదంలో సీఎం విజయ్
-
'థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమే..
మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్రామ నేపథ్యం నుంచి విదేశాలకు వలస వెళ్లి విజవయంతంగా స్థిరపడ్డాయి. వారిలో కొందరు తమ మూలాలను చూసుకునేందుకు వెనక్కి వచ్చి మరి భారతగడ్డపై అడుగుపెడుతుంటారు. పైగా తాము పుట్టి పెరిగిన ప్రాంతాలు, తమ పూర్వీకుల ఇళ్లను చూసి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. నిజంగా నాడు వాళ్లు అభివృద్ది చెందాలని కష్టపడి ఉండకపోతే..తాము అక్కడ ఉండే వాళ్లం కాదన్న ఆలోచన ఉబ్బితబ్బిబైలా చేయడమే కాదు సగర్వంగా అనిపిస్తుంది. అలాంటి భావోద్వేగాన్నే పొందాడు ఈ భారత సంతతి వ్యక్తి. అందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అసలేం జరిగిందంటే..గోల్డ్ వాటర్ వ్యవస్థాపకుడు విజయ్ తిరుమలై అమెరికాలో రోడ్‌షోకు వెళ్లేమందు వార్షిక చిత్తిరై ఉత్సవం నిమిత్తం ఆలయ పునరుద్ధరణ పనుల కోసం తన తండ్రి గ్రామాన్ని సందర్శించడానికి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ తన నాన్న, మామయ్యలు పెరిగిన ఇల్లు తదితరాలను గుర్తు చేసుకుంటూ..ఆ టైంలో ఇక్కడ కరెంట్ లేదు, నీటి సరఫరా లేదని చెప్పారు. అయినప్పటికీ బాల్యంలో ఇక్కడే పాలిటెక్నిక్ చదవి ఈ చుట్టుపక్కలే ఆడుకుంటూ ఎంజాయ్ చేశారని అన్నారు. ఇక తన కుటుంబం ఏ స్థాయికి చేరుకుందో గుర్తుచేసుకుంటూ..తన కజిన్స్ , ఇతర కుటుంబసభ్యులు అమెరికాలో బే ఏరియా, టొరంటో తదితర ప్రాంతాల్లో స్టార్టప్‌లు, బిగ్టెక్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో స్థిరపడ్డారని అన్నారు. తమ కెరీర్ ప్రారంభంలో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ..మమ్మల్ని మంచి స్థాయిలో స్థిరపడేలా పెంచినందుకు మా తల్లిదండ్రులకు, పెద్దలకు సదా కృతజ్ఞతలని పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే తమ పూర్వీకుల ఇంటి ఫోటోని కూడా షేర్ చేశారు. ఈ ఇంటిలోనే తన తండ్రి, మామయ్యల బాల్యం సాగిందని చెప్పారు. అయితే నెటిజన్లు వలసలు, త్యాగాల ఫలితం ఉన్నత స్థాయికి ఎదగడంతో ముడిపడి ఉన్న కుటుంబ చరిత్రను ఈ ఇల్లు గుర్తు చేస్తుందని అన్నారు. మరొక నెటిజన్ శెభాష్ విజయం..ఒక తరం అభివృద్ధి చెందడం కోసం ఇంకో తరం కష్టపడి త్యాగాలు చేస్తుంది. ఇది అద్భుత కుటుంబ కథ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.Yesterday took some time off ( before i head off for a US road show) to visit my dad's village for the annual festival ( Chittirai) to the temple where we do our part for renovations etcThis is the house my dad and my uncles grew up, no electricity, no running water, nothing,… pic.twitter.com/S8ZohHFMLM— Vijay Thirumalai (@vijaythirumalai) May 18, 2026 (చదవండి: ఆమె ఐస్‌క్రీమ్ బ్రాండ్‌కి అమెరికన్లే ఫిదా..! ఏడాదికి రూ. 2 వేల కోట్లు..) -
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు..!
-
తమిళ రాజకీయాల్లో దుమారం.. చిక్కుల్లో విజయ్..
-
బీసీసీఐ విషయంలో కీలక తీర్పు.. ఇకపై..
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి భారీ ఊరట లభించింది. సమాచార హక్కు చట్టం (RTIA) పరిధి నుంచి బోర్డును తొలగిస్తూ కేంద్ర సమాచార కమిషన్ (CIC) తీర్పు వెలువరించింది. బీసీసీఐ ‘పబ్లిక్ అథారిటీ’ కాదని స్పష్టం చేసింది.గతంలో అలా..కాగా 2018లో సమాచార కమిషనర్‌గా ఉన్న ఎం. శ్రీధర్ ఆచార్యులు.. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2(h)ను అనుసరించి బీసీసీఐని పబ్లిక్ అథారిటీగా డిక్లేర్ చేశారు. బోర్డులో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మద్రాస్ హైకోర్డును ఆశ్రయించగా.. CIC వద్దకు చేరింది.ప్రభుత్వ నియంత్రణలో లేదుగీతా రాణి అనే వ్యక్తి గతంలో బీసీసీఐ విషయంలో వేసిన పిటిషన్‌ను తాజాగా కొట్టివేస్తూ.. ‘‘చట్టపరమైన తీర్పులు గానీ.. శాసనాల ద్వారా రాతపూర్వకంగా జరిగిన చట్టంగా మారినట్లుగా గానీ.. బీసీసీఐ ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా ప్రభుత్వానికి చెందినట్లుగా లేదంటే ప్రభుత్వ నియంత్రణలో ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కూడా పొందడం లేదు’’ అని CIC తన తీర్పులో పేర్కొంది.ప్రభుత్వ ఫండింగ్‌గా భావించకూడదుబీసీసీఐ ఆర్థికంగా స్వతంత్ర వ్యవస్థ అని.. మీడియా హక్కులు, స్పాన్సర్షిపులు, ఐపీఎల్ ఒప్పందాలు, టికెట్ల అమ్మకాలు.. తదితరాల నుంచి ఆదాయం పొందుతోందని CIC ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసింది. అయితే, ఇందుకు సంబంధించిన పన్ను ప్రయోజనాలు పొందుతోంది కాబట్టి.. దీనిని ప్రభుత్వ ఫండింగ్‌గా భావించడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేసింది.అదే విధంగా.. క్రికెట్ పరిపాలనా అంశాలకు సంబంధించి అంతా పారదర్శకంగా ఉండాలని మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశించిందని CIC పేర్కొంది. అంతేతప్ప.. ఆర్టీఐ చట్టం కింద బీసీసీఐని ఎన్నడూ పబ్లిక్ అథారిటీగా ప్రకటించలేదని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థగాకాగా తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ప్రైవేటు సంస్థగా బీసీసీఐ నమోదైంది. పార్లమెంట్ ద్వారా చేయబడిన చట్టం లేదంటే రాజ్యంగబద్ధంగా బోర్డు రూపొందలేదు. కాగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా బీసీసీఐ వెలుగొందుతున్న సంగతి తెలిసిందే.చదవండి: ఐపీఎల్ ఎక్కువైందా?.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్ -
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరాజయం నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ అన్నామలై బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ జాతీ నేత పీఎల్ సంతోష్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మెజారిటీ శాతం మంది అన్నామలైకే మళ్లీ బాధ్యతలు అప్పగించాలని పట్టుబట్టినట్టు సమాచారాలు వెలువడ్డాయి.అసెంబ్లీకి ఎన్నికల ముందుగా అన్నాడీఎంకే ఒత్తిడి మేరకు అన్నామలైను అధ్యక్ష పదవి నుంచి బీజేపీ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నైనార్ నాగేంద్రన్ నియమితులయ్యారు. ఈ ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓటమి చవి చూసింది. నైనార్ నాగేంద్రన్ సైతం ఓటమి పాలు కావడంతో ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న నినాదం బీజేపీలో బయలు దేరింది. దీంతో అధ్యక్ష మార్పు విషయంగా పీఎల్ సంతోష్ ద్వారా అభిప్రాయాల సేకరణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నిర్ణయించినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి.ఈ మేరకు పీఎల్ సంతోష్ అభిప్రాయాల సేకరణలో నిమగ్నమయ్యారు. మెజారిటీ శాతం మంది అన్నామలై ద్వారానే బీజేపీ బలోపేతం సాధ్యమన్నది స్పష్టం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆయన్ని మళ్లీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఆయనకు ఈసారి రాజ్యసభ పదవి కూడా ఇవ్వబోతున్నట్టుగా మద్దతుదారులు పేర్కొంటుండటం గమనార్హం. -
సింహం సింగిల్.. వెనక్కి తగ్గినా రజినీకాంత్.. జీర్ణించుకోలేకపోతున్న పవన్ !
-
రెండు పెద్ద పార్టీల మధ్య గెలవడం గ్రేట్.. విజయ్ ని ఆకాశానికెత్తిన రజినీ
-
'అందుకే స్టాలిన్‌ను కలిశా.. విజయ్‌పై ద్వేషం లేదు'.. రజినీకాంత్ ఆసక్తికర కామెంట్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమిళనాడు రాజకీయాలపై ఆయన మాట్లాడారు. నేను రాజకీయాల్లోకి రానని మరోసారి స్పష్టం చేశారు. పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినని ధీమా వ్యక్తం చేశారు. స్టాలిన్ నాకు మంచి స్నేహితుడని.. ఎన్నికల్లో ఓటమి తర్వాత అందుకే వెళ్లి కలిశానని అన్నారు.కేవలం ఒక స్నేహితుడిగా మాత్రమే స్టాలిన్‌ను కలిశానని రజినీకాంత్ వెల్లడించారు. హీరో విజయ్ సీఎం కావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. నాకు ఎవరిపైనా ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని.. అందుకే విజయ్ను గెలిపించాలని రజినీకాంత్ స్పష్టం చేశారు.ఎన్నికల ఫలితం తర్వాత స్టాలిన్‌ను కలవడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. దీంతో తాను స్టాలిన్‌ను కలవడానికి గల కారణాలను వెల్లడించారు. విజయ్ సీఎం అయినందుకు నాకేలాంటి అసూయ లేదన్నారు. కమల్‌హాసన్ సీఎం అయితే అసూయపడేవాడిని.. కానీ విజయ్ సీఎం అయ్యాడని తెలిసి మొదట షాక్‌కు గురైనట్లు తెలిపారు. తమిళనాడు ప్రజలకు విజయ్ మంచి చేస్తాడని నమ్మారని రజినీకాంత్ తెలిపారు. సింగిల్‌గా పోటీచేసి రెండు పెద్ద పార్టీలపై గెలిచాడని ప్రశంసించారు. నన్ను విజయ్‌తో పోల్చడం కరెక్ట్ కాదని.. నాకు, అతనికి 28 ఏళ్ల వ్యత్యాసముందని రజినీ స్పష్టం చేశారు. ఇక తలైవా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం జైలర్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
బాబోయ్ నన్ను వదిలేయండి.! విజయ్ దెబ్బకి పవన్ కి చుక్కలు..!
-
తమిళనాడు సీఎం విజయ్ ఆగ్రహం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరల పెరుగుదలపై తీవ్రంగా స్పందించారు. పెరుగుదలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పెట్రో ధరల పెంపు పేదలు, మధ్యతరగతి ప్రజల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.చెన్నైలో శుక్రవారం జరిగిన సమావేశంలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. ‘పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 పెంచడం అన్యాయం. మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను తగ్గించకుండా లాభాల రూపంలో లబ్ధి పొందుతున్నాయి. నిరు పేదలు, మధ్య తరగతి వర్గం ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, ఇతర చిన్నచిన్న వాహనాలపై ఆధారపడుతున్నారు. ధరల పెరుగుదల వారి నెలవారీ ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బ్యాంకు రుణాలతో వాహనాలు కొనుగోలు చేసి టాక్సీలు లేదా అద్దె వాహనాలుగా నడిపే వారు మరింత ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వల్ల అద్దె ధరలు పెరగడం, అవసరమైన వస్తువుల ధరలు పెరగడం, కొనుగోలు శక్తి తగ్గిపోవడం జరుగుతుందని గుర్తు చేశారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలపై ప్రభావంమైక్రో,చిన్న పరిశ్రమలు (MSEs) కూడా ఇంధన ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయన్న సీఎం విజయ్ తద్వారా దేశీయ మార్కెట్ విక్రయాలు, ఎగుమతులు మందగించే ప్రమాదం ఉందని చెప్పారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమన్నారు.కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ఇంధన ధరల పెరుగుదల తక్షణమే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2022 ఏప్రిల్ నుండి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, 2024 మార్చిలో లోక్‌సభ ఎన్నికల ముందు ఒక్కసారి రూ.2 తగ్గించారని, ఇప్పుడు పెరుగుదల అన్యాయమని ఆయన అన్నారు. 2022 ఏప్రిల్‌లో చివరిసారి ధరలు పెరిగాయి. ఆ తర్వాత 2024 మార్చిలో ఎన్నికల ముందు ఒక్కసారి తగ్గించారు. ఇప్పుడు మళ్లీ పెట్రో ధరలు పెంచడం ప్రజలకు భారమని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ஒன்றிய அரசின் பொதுத்துறை எண்ணெய் நிறுவனங்கள் பெட்ரோலியப் பொருட்களின் விலையை இன்று (15.05.2026) உயர்த்தியுள்ளது தொடர்பாக மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்களின் அறிக்கை#CMJosephVijay pic.twitter.com/FZIcuTHdCQ— CMOTamilNadu (@CMOTamilnadu) May 15, 2026 -
కొత్త సీఎంకు ఫోన్ చేసిన మెగాస్టార్.. ఏ సలహా ఇచ్చారంటే?
తమిళనాడు సీఎం విజయ్‌కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ను అభినందించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ప్రజాకేంద్రీకృత పాలనతో తమిళనాడు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని మెగాస్టార్ సూచించారు. దివంగత మహానేత ఎంజీఆర్‌లా ప్రజల ప్రేమాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు.చిరంజీవి మాటలకు సీఎం విజయ్ కూడా స్పందించారు. ఇటీవలే మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాన్ని వీక్షించినట్లు తెలిపారు. మిమ్మల్ని తెరపై చూడటం ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు. జననాయగన్ పైరసీ విషయంలో సపోర్ట్ చేసినందుకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న చిరంజీవి రాబోయే చిత్రానికి విజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
తమిళనాడు ఎన్నికల్లో నకిలీ ఓటర్లు..?
చెన్నై: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమంగా ఓటు వేశారనే ఆరోపణలతో 25 మంది విదేశీ పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైతో పాటు మదురై విమానాశ్రయాల్లో వీరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకుల నడుమ మిత్రపక్షాల మద్దతుతో ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇప్పుడు ఆ ఎన్నికల్లో నకీలీ ఓట్లు వేసిన 25 మంది విదేశీయులను అధికారులు పట్టుకున్నారు.ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ విమానం ఎక్కడానికి వచ్చిన ప్రయాణికులకు చేతిపై ఎలక్షన్ సిరా ఉండడం గుర్తించారు. దీంతో అనుమానం వచ్చన అధికారులు ఇది ఎలా చేతికి వచ్చిందని విచారణ చేయగా వారు అక్రమంగా ఓటు వేసినట్లు తేలింది. వీరంతా శ్రీలంక, కెనడా, ఆస్ట్రేలియా బ్రిటన్ వంటి దేశాల పౌరసత్వం కలిగిన భారత సంతతి వ్యక్తులు. విదేశీ పాస్‌పోర్ట్‌లు ఉన్నప్పటికీ, పాత ఓటర్ ఐడిలను ఉపయోగించి వీరు ఓటు వేసినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.వీరు చెన్నైలోని పెరంబూర్, కె.కె. నగర్ మరియు పట్టుక్కోట్టై వంటి నియోజకవర్గాల్లో ఓట్లు వేసినట్లు మరికొందరు పుదుచ్చేరిలో సైతం ఓట్లు వేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.వీరిపై 'భారతీయ న్యాయ సంహిత, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. విదేశీ పౌరసత్వం తీసుకున్న తర్వాత కూడా భారత ఎన్నికల్లో పాల్గొనడం చట్టరీత్యా నేరం. -
CM విజయ్ ఫస్ట్ రివ్యూ మీటింగ్
-
తమిళనాడు సీఎం విజయ్ కు వైఎస్ జగన్ ఫోన్
-
TVK సంచలన నిర్ణయం.. OSD రాధన్ పండిట్ నియామకం రద్దు
-
144 Seats.. విజయ్ ను వరించిన విజయం
-
బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్
-
TVK విజయ్ పార్టీ నుండి రెండు సీట్లు కట్
-
Watch Live: విజయ్ సర్కార్ కు బలపరీక్ష.. నెంబర్ గేమ్ పై ఉత్కంఠ
-
సీఎం కార్యాలయంలో రాథన్ పండిట్ కు కీలక హోదా
-
నేడే సీఎం విజయ్ బల పరీక్ష
-
విజయ్ అన్న థాంక్స్..! మద్యం బంద్ పై విశాల్ రియాక్షన్
-
లిక్కర్ షాపులపై విజయ్ సంచలనం..
-
TVK అధినేత, సీఎం విజయ్ కు మద్దతు ప్రకటన
-
కెప్టెన్ విజయకాంత్ భార్య మాటలకు అసెంబ్లీలో ఎమోషనల్
-
డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే .. విజయ్ రియాక్షన్ చూడండి
-
ఒక్క సినిమాకు రూ.200 కోట్లు.. మరి సీఎంగా నెల జీతమెంత?
సినిమాల్లో సక్సెస్ అయిన హీరో విజయ్.. రాజకీయాల్లోనూ తన మార్క్ చూపించారు. పోటీ చేసిన తొలిసారే ఏకంగా సీఎం అయ్యారు. తమిళనాడు ఎన్నికల్లో మెజార్టీ మార్క్ రాకపోయినా.. ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు ఆయన నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ చిత్రం సెన్సార్ వివాదాలతో రిలీజ్ కాలేదు. ఈ మూవీకి దళపతి ఏకంగా రూ.200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ వినిపించింది.కానీ ఇప్పుడు విజయ్ హీరో కాదు.. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక్క సినిమాకు రూ.200 కోట్లు తీసుకునే విజయ్.. సీఎంగా ఎంత సంపాదిస్తారనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రజల సొమ్మును తాను తినని స్పష్టం చేసిన విజయ్.. సీఎంగా తనకొచ్చే నెల జీతంతోనే సర్దుకుపోతారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్.తమిళనాడు ముఖ్యమంత్రిగా సీఎం విజయ్‌కి నెలకు రూ.2,05,000 జీతం అందుకోనున్నారు. సినిమాల్లో ఒక్క సినిమాకే కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విజయ్.. ఇకపై ఏడాది కేవలం రూ. 34.2 లక్షల జీతం మాత్రమే ఆయనకు దక్కనుంది. అయితే వీటితో పాటు ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్, జెడ్ ప్లస్ సెక్యూరిటీ వంటి ప్రత్యేక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన విజయ్.. ఇప్పటికే సినిమాలు చేయనని చెప్పేశారు. తన చివరి మూవీ జన నాయగన్ అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
AIADMKలో చీలిక! రెండు వర్గాలుగా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు
-
అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టిన విజయ్
-
విజయ్ భార్య పిల్లలు ఎక్కడ..?
-
విజయ్ కోసం త్రిష.. ఐస్ బ్లూ సారీలో సడెన్ ఎంట్రీ!
-
CM జోసెఫ్ విజయ్.. ఆన్ డ్యూటీ..!
-
విజయ్ విజయానికి పనిచేసిన సీక్రెట్ టీమ్
-
ఐయామ్ హ్యాపీ.. నా మద్దతు ఎప్పటికీ విజయ్ కే
-
సీఎం కుర్చీలో జోసెఫ్ విజయ్
-
సీఎంగా విజయ్ ప్రమాణం.. త్రిష స్పెషల్ విషెస్
కోలీవుడ్ హీరో విజయ్‌కు హీరోయిన్ త్రిష శుభాకాంక్షలు తెలిపింది. విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణం స్వీకారం సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. విజయ్‌కు నా మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని త్రిష వెల్లడించింది. చెన్నైలోని నెహ్రు స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారానికి హీరోయిన్ త్రిష కూడా హాజరైంది. ఈ కార్యక్రమంలో త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.విజయ్‌తో త్రిష రిలేషన్..ఎన్నికల ముందు నుంచే త్రిష- విజయ్ రిలేషన్లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. విజయ్ భార్య సంగీత కూడా విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. అంతేకాకుండా ఇద్దరు కలిసి జంటగా పెళ్లికి హాజరుకావడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే త్రిష బర్త్ డే రోజున ఎన్నికల ఫలితాలు రావడం.. విజయ్ అత్యధిక సీట్లు గెలవడంతో ఆనందం మరింత రెట్టింపైంది. త్రిషకు విజయ్ బర్త్ డే గిఫ్ట్ అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మరింత కాలం వేచి చూడాల్సిందే. -
ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చా.. విజయ్ గూస్బుమ్స్ స్పీచ్
-
సీఎంగా విజయ్.. తొలి సంతకం
-
విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన రాహుల్ గాంధీ
-
ప్రారంభమైన విజయ్ శకం
-
విజయ్ అనే నేను.. బాహుబలి సీన్ రిపీట్
-
ఫ్యాన్స్ కేరింతలు.. ఎమోషనల్ అయిన విజయ్
-
108 నుంచి 121కి వచ్చాం.. ఇకపై మా ఆట చూపిస్తాం..!
-
నా కొడుకు ప్రమాణస్వీకారాన్ని ఎంజాయ్ చేయాలి.. విజయ్ తల్లిదండ్రుల రియాక్షన్
-
విజయ్ ముఖ్య నేతలకు కీలక శాఖలు..
-
విజయ ప్రమాణ స్వీకారంలో తిష సందడి
-
విజయ్ ప్రమాణస్వీకారం ప్రత్యక్ష ప్రచారం
-
‘2026 తీర్పు’: పీఠం కదిలింది.. చరిత్ర మారింది!
భారతదేశ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక కీలక మలుపుగా నిలిచాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాలు దేశ రాజకీయ గమనాన్ని మార్చేలా ఉన్నాయి. అస్సాం, పుదుచ్చేరిల్లో యథాతథ స్థితి కొనసాగినప్పటికీ, మిగిలిన మూడు రాష్ట్రాల్లో వచ్చిన మార్పులు సామాన్యులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం, మరోవైపు జాతీయ పార్టీల వ్యూహాలు, ఇంకోవైపు సరికొత్త రాజకీయ శక్తుల ఉద్భవం వెరసి.. భారతదేశ సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరలేపాయి.కేరళలో కాంగ్రెస్ పునరుజ్జీవంకేరళ రాజకీయ చరిత్రలో ఎల్డిఎఫ్ , యూడిఎఫ్ కూటములు దశాబ్దాలుగా మారుతూ అధికారంలోకి వస్తున్నాయి. అయితే 2021లో పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డిఎఫ్ వరుసగా రెండోసారి విజయం సాధించి, ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. అయితే గడిచిన ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ సరికొత్త నాయకత్వంతో, రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి దూసుకు వెళ్ళింది. ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. లౌకికవాదాన్ని, ఆర్థిక పురోగతిని, సమాఖ్య స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు కేరళలో బలపడిన యూడిఎఫ్ భాగస్వామ్య పక్షాలపై ఉంది.తమిళనాట ‘విజయ్’ మేజిక్తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ ఈసారి ఫలితాలు అత్యంత సంక్లిష్టంగా ఉన్నాయి. 2021లో ఘనవిజయం సాధించిన ఎంకె స్టాలిన్ ప్రభుత్వం ఆర్థిక వృద్ధి, సంక్షేమ పథకాల్లో అద్భుతంగా రాణించినప్పటికీ, ఇతర అంశాలు ఓటర్లను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా సినీ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం ఒక పెను తుఫానులా మారింది. రెండేళ్ల క్రితం పెట్టిన టీవీకే పార్టీ.. ఎన్నికలకు పది రోజుల ముందు పుంజుకుని ఏకంగా 108 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. ఎటువంటి భారీ ప్రచారాలు లేకుండా, కేవలం సోషల్ మీడియా మీమ్స్, పాటలు, విజయ్ ప్రసంగాలతోనే ఈ విజయం సాధించడం విశేషం. మేజిక్ ఫిగర్‌కు 11 సీట్ల దూరంలో నిలిచిన టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు తెలపడంతో నూతన ప్రభుత్వానికి మార్గం సుగమం అయ్యింది.బెంగాల్లో తృణమూల్ వెనుకంజదేశ రాజకీయ దిశను మార్చగల సత్తా ఉన్న పశ్చిమ బెంగాల్ ఫలితాలు ఈసారి దిగ్భ్రాంతిని కలిగించాయి. పదేళ్లుగా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ, అక్కడ బలమైన శక్తిగా ఎదిగింది. గత మూడు పర్యాయాలుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఒక కారణమైతే, ఓటర్ల జాబితాలో జరిగిన భారీ మార్పులు మరో ప్రధాన కారణం. అనేక కుటుంబాల్లో తలిదండ్రులకు ఓటు హక్కు ఉంటే పిల్లలకు లేకపోవడం, కొన్నిచోట్ల వైరుధ్యాలు తలెత్తడం వంటి అంశాలు ప్రజాస్వామ్యంపై మచ్చగా నిలిచాయి. న్యాయవ్యవస్థ కూడా ఈ విషయంలో ఓటర్లను ఆదుకోలేకపోయింది. వరుస విజయాలతో ఉన్న దీదీకి ఈ ఓటమి గట్టి ఎదురుదెబ్బగా మారింది.ఈశాన్యంలోనూ కమలనాథుల హవా పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత బీజేపీ ఆధిపత్యం దేశవ్యాప్తంగా దాదాపు పూర్తయింది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి పశ్చిమ రాష్ట్రాల నుండి హిందీ బెల్ట్ వరకు, ఇప్పుడు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోనూ కమలనాథుల హవా నడుస్తోంది. అయితే, దక్షిణాది ఐదు రాష్ట్రాలు మాత్రం బీజేపీకి ఇప్పటికీ ఇనుప కోటలుగానే మిగిలాయి. కేరళ, తమిళనాడులో పాగా వేయడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నాలను అక్కడి ఓటర్లు తిప్పికొట్టారు. కేరళలో 3, తమిళనాడులో 1 సీటుకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. ఉత్తరాదిని శాసిస్తున్నా, దక్షిణాది మాత్రం బీజేపీని సుదూరంగానే ఉంచింది.సమాఖ్య వ్యవస్థకు పొంచి ఉన్న ముప్పు?బీజేపీ వరుస విజయాలు సాధిస్తే భవిష్యత్తులో ఏకపార్టీ పాలన వైపు, హిందూత్వ భావజాలం వైపు రాజ్యాంగ సవరణలు జరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు. దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా, లౌకిక రాజ్యంగా ఉంచాలంటే ప్రతిపక్షాల ఐక్యత అనివార్యం. 2024లో కొంత విజయం సాధించిన ఇండియా కూటమి ఆ తర్వాత నెమ్మదించినట్లు కనిపిస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్ ఓటమి తర్వాత మమతా బెనర్జీ కూటమిని బలోపేతం చేస్తానని ప్రకటించారు. అటు స్టాలిన్ కూడా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా పరిగణిస్తున్నారు. కొత్తగా పుంజుకున్న విజయ్ (టీవీకే) కూడా ఈ కూటమిలోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాల స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో దేశ భవిష్యత్తు కోసం ఈ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడం ఇప్పుడు చారిత్రక అవసరం అని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: కేబినెట్లో ఏకైక మగువ.. ఎవరీ అగ్నిమిత్ర పాల్? -
నేడు తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణం... మెజార్టీ దక్కడంతో ఎట్టకేలకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
-
విజయ్ కి అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్
-
తమిళనాడులో జగన్ ప్లాన్ అమలు చేయనున్న విజయ్
-
తమిళనాడులో హై డ్రామా VCK చీఫ్ తో విజయ్ కీలక భేటీ
-
విజయ్ సీఎం కాకుండా అడ్డుకుని ఉంటే.. తమిళనాడు రణరంగంలా మారేది
-
జోసెఫ్ విజయ్ అనే నేను.. TVK సర్కార్ లోడింగ్
-
విజయ్‌కు రాచమర్యాదలు చేయండి.. గవర్నర్ ఆదేశాలు
సాక్షి,చెన్నై: పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడం అంటే ఇదే మరి. ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే టీవీకే అధినేత విజయ్‌కు తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు కాన్వాయ్ ఏర్పాటు చేశారు. కాన్వాయ్ ఎలా కేటాయిస్తారంటూ పోలీసు ఉన్నతాధికారులపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ చిర్రుబుర్రులాడారు. ముఖ్యమంత్రి హోదా లేకుండా రాచమర్యాదలు ఎందుకు అన్న ప్రశ్నను లేవనెత్తారు. అయితే, ఇప్పుడు అదే విజయ్‌కు గవర్నర్ రాచమర్యాదలు చేశారు. విజయ్ కోసం కాన్వాయ్ సిద్ధం చేయాలని అధికారులకు గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. అయితే, పూర్తి మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను రెండు సార్లు కలిసినా ఆహ్వానం లభించలేదు. సంఖ్యాబలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటును గవర్నర్ తిరస్కరించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలపై గురువారం గవర్నర్‌తో చీఫ్ సెక్రటరీ సాయి కుమార్, డీజీపీ సందీప్ రాయ్ రాథోర్లు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి హోదా లేకుండానే విజయ్‌కు జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఎలా ఇస్తారంటూ గవర్నర్ ప్రశ్నించారు. దీంతో విజయ్‌కు పోలీస్ శాఖ జెడ్ ప్లస్ సెక్యూరిటీని తొలగించింది. శుక్రవారం విజయ్‌కు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే మద్దతు ప్రకటించాయి. దీంతో ఆయనకు తగిన సంఖ్యాబలం లభించింది. విజయ్ గవర్నర్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. మద్దతు లేఖను గవర్నర్‌కు అందించారు. ఈ క్రమంలో విజయ్ రాకతో గవర్నర్ ఆదేశాలకు అనుగుణంగా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. లోక్‌భవన్‌లో విజయ్ కోసం ప్రత్యేక కాన్వాయ్‌ను ఏర్పాటు చేసింది. ఆసక్తికరంగా, మొన్న కాన్వాయ్ ఇవ్వడంపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేయగా, ఇప్పుడు మద్దతు నిరూపించుకున్న విజయ్ అదే కాన్వాయ్‌లో తిరిగి వెళ్లారు. రేపు ఉదయం 11గంటలకు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 11 లేదా 12న మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్
సాక్షి,చెన్నై: టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీపీఐ, సీపీఎం, వీసీకే మద్దతు ప్రకటించడంతో విజయ్‌కు స్పష్టమైన సంఖ్యాబలం లభించింది. టీవీకేకు 107, వీసీకేకు 2, సీపీఐకు 2, సీపీఎంకు 2, కాంగ్రెస్‌కు 5 స్థానాలు కలిపి విజయ్ బలం 118కి చేరింది.మెజార్టీ సభ్యుల జాబితాతో విజయ్ ఈ రోజు సాయంత్రం తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలవనున్నారు. ఇప్పటికే విజయ్ గవర్నర్‌తో రెండు సార్లు భేటీ అయ్యారు. ఆ సమయంలో సంఖ్యాబలం తక్కువగా ఉందని గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.సంఖ్యాబలం కోసం విజయ్ వామపక్షాల మద్దతు కోరారు. పార్టీ జాయింట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ వామపక్ష నేతలతో చర్చలు జరిపారు. నాలుగు రోజుల క్రితం లేఖ రాసి మద్దతు కోరిన టీవీకే, అనంతరం నేరుగా సమావేశమై చర్చలు జరిపింది. ఆ చర్చలు సఫలమవడంతో వామపక్షాలు, వీసీకే ఎలాంటి షరతులు లేకుండా విజయ్‌కు మద్దతు ప్రకటించాయి.వారికి కేబినెట్ బెర్త్లుప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన వీసీకే, సీపీఐ, సీపీఎంకు ఒక్కో మంత్రి పదవి, కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని విజయ్ ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.టీవీకే శ్రేణుల సంబరాలు నాలుగు రోజుల అనిశ్చితి, గందరగోళం తర్వాత శుక్రవారం సాయంత్రం చెన్నైలోని విజయ్ ఇంటి వద్ద ‘టీవీకే, టీవీకే’ నినాదాలు మార్మోగాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సీట్లు సమకూర్చుకున్నారని సమాచారం రావడంతో ఆయన తదుపరి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండడంతో టీవీకే శ్రేణుల సంబరాలు అంబరార్నంటాయి.అదనపు మద్దతు అవసరం విజయ్ వద్ద 107 మంది టీవీకే ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలవడంతో ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో 11 మంది అదనపు మద్దతు అవసరమైంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ నుంచి 5 మంది మద్దతు పొందారు. అలాగే వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలతో చర్చలు జరిపారు. ఇవి డీఎంకే మిత్రపక్షాలే అయినప్పటికీ, చివరికి విజయ్‌కే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీసీకే, సీపీఐ, సీపీఎం కలిపి 6 సీట్లు ఉండటంతో విజయ్‌కి కావలసిన సంఖ్య పూర్తయింది. -
ఇండియా కూటమికి డీఎంకే గుడ్‌బై
సాక్షి,చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో, డీఎంకే ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పింది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసి, డీఎంకే ఎంపీలకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చోబోమని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ లేఖతో డీఎంకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి.కాంగ్రెస్ ఇటీవల టీవీకేకు మద్దతు ప్రకటించడం డీఎంకేకు పెద్ద షాక్‌గా మారింది. డీఎంకే నేతృత్వం దీనిని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌కు ద్రోహంగా అభివర్ణించింది. దీంతో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే-కాంగ్రెస్ పొత్తు ఒక్కసారిగా ముగిసింది.డీఎంకే ఈ నిర్ణయం వల్ల ఇండియా కూటమి బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, టీవీకే-కాంగ్రెస్ కూటమి బలపడుతుందని అంచనా. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు,కొత్త వ్యూహాలు రూపుదిద్దుకునే అవకాశం ఉంది. -
నిరాశ చెందవద్దు ఉత్కంఠల నడుమ.. విజయ్ ట్వీట్
చెన్నై: ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా లేదా ఇతర పార్టీలు పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఇంత ఉద్రిక్తతల నడుమ విజయ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఫలితాలలో విజయం సాధించిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ విజయ్ ట్వీట్ చేశారు. " 12వ తరగతి పబ్లిక్ పరీక్షలో అచంచలమైన పట్టుదలతో విజయం సాధించిన నా ప్రియమైన సోదరులకు, నీ సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం మీ కఠోర శ్రమకు లభించిన గుర్తింపు. ఉన్నత విద్యలో తదుపరి దశకు ఆత్మవిశ్వాసంతో అడుగు పెట్టండి. అదే సమయంలో, ఈసారి విజయం సాధించలేని వారు నిరాశ చెందవద్దు. మళ్ళీ ప్రయత్నించండి. మనం విజయపు అంచున ఉన్నామని గుర్తుంచుకోండి.మీ అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను." అని ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం విజయ్ టీవీకే పార్టీకి మెజారిటీకి ఇంకా ఐదు స్థానాల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో కమ్యునిస్టులు,వీసీకే పార్టీ మద్దతు ఇస్తారా లేదా అన్న అంశం ఈ రోజు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అని ఉత్కంఠ వాతావరణం నెలకొంది. -
టీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటు.. పరువు పోగొట్టుకుంటున్న గవర్నర్
సాక్షి,చెన్నై: తమిళనాడు ఏఐసీసీ ఇన్చార్జ్ గిరీష్ చోడంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో తీసుకున్న నిర్ణయాల వల్ల తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ పరువు పోగొట్టుకుంటున్నారని ఆయన అన్నారు.తమిళనాడులో డీఎంకే–అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో చోడంకర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే బెదిరిస్తున్నదని, కుట్రలో భాగంగా ఈడీ పేరుతో ఒత్తిడి తెస్తున్నదని ఆరోపించారు.కాంగ్రెస్‌ను వీడి అన్నాడీఎంకేలో చేరేది లేదని ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టంగా తెలిపారు. బెదిరింపులు, భేరసారాసాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలబడుతున్నారని, విజయ్‌కు ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ ముందుండి నడిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా గవర్నర్ రాజేంద్రపై తీవ్ర విమర్శలు గుప్పించిన చోడంకర్.. ‘దేశం ఎప్పుడూ చూడని విధంగా తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఇవ్వడం లేదు. టీవీకే కాకుండా ఇతర పార్టీలు సంఖ్యాబలం నిరూపిస్తే అవకాశం ఇస్తానని చెప్పి నవ్వులు పాలవుతున్నారు’ అని అన్నారు.టీవీకేకు మద్దతు ఇవ్వాలని వీసీకేతో పాటు మరో రెండు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, ఆ మూడు పార్టీల నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
విజయ్ పవర్ ఫుల్ డైలాగ్ తో TVK ఆఫీస్ వద్ద అభిమాని
-
గవర్నర్ నెంబర్ గేమ్ తమిళనాడులో పంచతంత్రం
-
మాణిక్కం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: ప్రస్తుతం తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితులపై ఎంపీ మాణిక్కం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంత కాలం భద్ర శత్రువులుగా ఉన్న రెండు పార్టీలు కేవలం ఒక్క వ్యక్తిని ఆపడానికి ఏమమవుతున్నాయన్నారు. దీనిని స్పష్టంగా గమనించే కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసిందని తెలిపారు.తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సరైనా సంఖ్యాబలం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని ఆరాష్ట్ర గవర్నర్ తేల్చి చెప్పడం.. ఆ తరువాత డీఎంకే- ఏఐడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం.. ఒకవేళ అలా చేస్తే టీవీకే ఎమ్మెల్యేలు అంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని విజయ్ హెచ్చరించడం ఇలా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. మాణిక్కం ఠాగూర్ తన ట్విట్టర్లో... "జీవితకాలం బద్ధ శత్రువులుగా ఉన్న రెండు పార్టీలు అధికారం కోసం కలుస్తున్నాయి. ఒక్క వ్యక్తిని ఆపడం కోసం రెండు పార్టీలు కలుస్తున్నాయి. ఆర్ఎస్ఎస్/బీజేపీల బి-టీమ్‌తో చేతులు కలిపి మిమ్మల్ని మీరు లౌకికవాదులని పిలుచుకోలేరు. స్థిరమైన ప్రభుత్వం పేరుతో రెండు పార్టీలు అధికారం కోసం తహతహలాడుతున్నాయి. డీఎంకే ఈ రోజు తన ముసుగు తీస్తుందా?" అని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.ఆర్ఎస్ఎస్, బీజేపీల బీ-టీమ్‌తో చేతులు కలిపి మిమ్మల్ని మీరు లౌకికవాదులుగా పిలుచుకోలేరు అని అన్నారు. కాగా ప్రస్తుతం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటునకు మాత్రం గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ అంగీకరించడం లేదు. మ్యాజిక్ ఫిగర్ అయిన 118 ఎమ్మెల్యేల సంతకాలతోనే రావాలంటూ స్పష్టం చేశారు. తనకు నెంబర్ ముఖ్యమని.. మెజారిటీ బలంతో ఎవరు ముందుకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటునకు అనుమతిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సస్పెన్స్ కొనసాగుతోంది. -
విజయ్ కి స్టాలిన్ డెడ్ లైన్.. అప్పటి వరకు నేను అడ్డుకొను..
-
జోసెఫ్ విజయ్ అనే నేను.. లోడింగ్..
-
తమిళనాట వైరల్ టీవీకే అధినేత ఆస్తులు.. ఎన్ని కోట్లో తెలుసా?
-
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ మరోసారి అభ్యర్థించిన విజయ్.. మళ్లీ వెనక్కి పంపేసిన గవర్నర్
-
ఓడినా గెలిచాడు.. స్టాలిన్ రాజకీయ పరిణితికి హ్యాట్సాఫ్
-
తమిళనాడు దద్దరిల్లిపోయేలా.. జోసెఫ్ విజయ్ అనే నేను
-
అలా చేస్తే బేరసారాలకు అవకాశం.. తమిళనాడు గవర్నర్
చెన్నై: ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలలో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరిగా చూపించాల్సిందేనని ఆ రాష్ట్ర గవర్నర్ తేల్చిచెప్పడంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎమ్మెల్యేల బేరసారలకు పరోక్షంగా అనుమతి ఇవ్వలేమన్నారు.తమిళనాడు గవర్నర్ తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఆయన తీరును కాంగ్రెస్‌తో పాటు అక్కడి పలువురు నేతలు ఖండించారు. ఈ ఆందోళనల నేపథ్యంలో E ఆ రాష్ట్రంలోని ఓ పత్రికకు గవర్నర్ ఇంటర్వూ ఇచ్చారు.విశ్వనాథ్ అర్లేకర్ మాట్లాడుతూ.."మెజారిటీ లేకపోవడం అన్నది ఒక్క విజయ్ సమస్య మాత్రమే కాదు. తమిళనాడు సమస్య మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బేరసారాలకు అనుమతించలేం. విజయ్‌ని మోజారిటీ నిరూపించమని మేము అనలేదు. మోజార్టీతో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తాం అని తెలిపాం. కాని వారు అలా చేయలేదు. దీనికి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఎలా అడ్డుకుంటున్నట్లు. ఏఐడీఎంకే, డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎస్.ఆర్ బొమ్మై కేసులోని ఉత్తర్వు దీనికి వర్తించదు" అని అన్నారు. కాగా విజయ్‌కు జెడ్‌ప్లస్ సెక్యూరిటీ కల్పించడంపైనా ఆ రాష్ట్ర గవర్నర్ డీజీపీపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌కు డీజీపీ శాంతిభద్రతలపై నివేదిక అందించారు. మరోవైపు రేపు గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ రేవు రాష్ట్ర వ్యాప్తం ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. -
కఠిన నిర్ణయాలు తీసుకుంటాం.. ఎమ్మెల్యేలకు స్టాలిన్ ఆదేశాలు
చెన్నై: ప్రస్తుతం తమిళనాడులో పరిస్థితులు చాలా గంభీరంగా మారాయి. టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటు అభ్యర్థణను అక్కడి గవర్నర్ తిరస్కరించడంతో ఇప్పుడు అక్కడ ఏం జరగనుందా అనే టెన్షన్ మెుదలైంది. ఈ నేపథ్యంలోనే రకరకాల ఉహగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డీఎంకే అధినేత స్టాలిన్..ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు అక్కడి వార్త పత్రికలు కథనాలు ప్రచురించాయి.తమిళ తంబీల రాజకీయాలపైనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. టీవీకే మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా 5 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరముంది. దానికోసం విజయ్ పలు చిన్న పార్టీల మద్దతుని అభ్యర్థించారు. వారు త్వరలో తమ నిర్ణయాన్ని తెలియజేస్తామన్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ డీఎంకే అధినేత స్టాలిన్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించినట్లు తమిళనాడు పత్రికలు పేర్కొన్నాయి. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలందరికీ కఠినమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది " రాష్ట్రంలో మేము మంచి ప్రతిపక్ష పార్టీగా పనిచేయాలనుకుంటున్నాం. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీనియర్ కార్యవర్గ నాయకులతో సంప్రదించిన తర్వాత మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. డీఎంకే నాయకులంతా మే 10వ తేదీ వరకూ చెన్నైలోనే ఉండాలి. డీఎంకే ప్రణాళికలకు ఎటువంటి ఆటంకం తలెత్తవద్దు". అని వారికి తెలిపినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.అయితే ఇది వరకే స్టాలిన్ టీవీకే అంశమై ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన విజయ్‌ని తాము ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోమని స్పష్టం చేశారు. అలాగే ఒకవేళ వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు విజయ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంటే తాము అడ్డుకోమన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్టాలిన్ ఏం నిర్ణయం తీసుకుంటారా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
విజయ్ కి గుడ్ న్యూస్..లైన్ క్లియర్ చేసిన స్టాలిన్
-
మిస్ చేసుకుంటే విజయ్ CM కాలేడు..!
-
టీవీకే విజయ్ను ఉద్దేశిస్తూ.. తమిళనాడు గవర్నర్ అధికారిక ప్రకటన
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింతగా పెరిగింది. తాజాగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కలిశారు. ఈ సమావేశం అనంతరం గవర్నర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ప్రకటనలో ‘ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మద్దతు ఇంకా లభించలేదు. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ నిరూపించకపోతే ప్రభుత్వం ఏర్పాటు ఆహ్వానం ఇవ్వలేం’ అని పేర్కొంది. దీంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది.234 సభ్యుల అసెంబ్లీలో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలవడంతో ఒక సీటు వదులుకోవాలి. దీంతో పార్టీ బలం 107కి తగ్గుతుంది. కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో సంఖ్య 112కి చేరింది. కానీ మెజారిటీకి కావలసిన 118కి ఇంకా తక్కువ. ఇక ఇతర పార్టీల వైఖరి కీలకంగా మారింది. సీపీఐ,సీపీఎం, వీసీకే మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ విజయ్‌కు మద్దతు ఇచ్చే అంశాన్ని వామపక్షాలకే వదిలేశారు. అయితే ఏఐఏడీఎంకే మాత్రం టీవీకేకు మద్దతు ఇవ్వబోమని స్పష్టంగా తెలిపింది.టీవీకే మద్దతుదారులు లోక్‌భవన్ వద్ద నిరసనలు చేపట్టారు. గవర్నర్ ఆలస్యం పై పలువురు ప్రముఖులు విమర్శలు చేశారు. టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. మొత్తం మీద, టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ, మెజారిటీకి కావలసిన సంఖ్య ఇంకా తక్కువ. గవర్నర్ ఆహ్వానం ఇవ్వడానికి ముందు స్పష్టమైన మెజారిటీ నిరూపణ కోరుతున్నారు. చిన్న పార్టీల నిర్ణయం, కాంగ్రెస్ మద్దతు, డీఎంకే తాత్కాలిక వెనుకడుగు వంటి అంశాలు తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠను మరింతగా పెంచుతున్నాయి. Governor Tells Vijay, Majority Not Yet EstablishedChennaiThe #LokBhavan, Tamil Nadu, has issued a press statement stating that Governor Rajendra Vishwanath Arlekar met C. Joseph #Vijay, President of the Tamilaga Vettri Kazhagam (#TVK), in #Chennai today. During the… pic.twitter.com/c1OQza05RK— Yasir Mushtaq (@path2shah) May 7, 2026 -
ప్రభుత్వం ఏర్పాటుపై క్లారిటీ..! KSR డీటెయిల్ అనాలసిస్
-
తమిళనాడు సీఎం విజయ్..?
-
విజయ్ దూకుడు షురూ... గవర్నర్ గ్రీన్ సిగ్నల్.?
-
విజయ్‌కు మద్దతుగా ప్రకాష్ రాజ్
-
విజయ్ మద్దతు పెరిగిందా? పళనిస్వామి ప్లాన్ పై సస్పెన్స్
-
విజయ్ ప్రభుత్వానికి.. గవర్నర్ గ్రీన్ సిగ్నల్
-
అధికారం కోసం కొత్త పొత్తు.. మాజీ శత్రువులు ఇప్పుడు కొత్త మిత్రులు?
-
విజయ్ విజయం వెనుక 5 మాస్టర్ మైండ్స్
-
తమిళ రాజకీయంలో ఊహించని ట్విస్ట్...
-
విజయ్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్
-
విజయ్ ప్రమాణస్వీకారం అనుమానమే
-
మెజార్టీపై గవర్నర్ ను ఒప్పించలేకపోయిన విజయ్
-
విజయ్‌కు బిగ్ షాక్ TVKప్రభుత్వ ఏర్పాటులో ట్వీస్ట్
-
విజయ్ అలా చేస్తే మద్దతు ఉపసంహరిస్తాం
చెన్నై: తమిళనాడు రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. తాను ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని టీవీకే అధినేత సినీస్టార్ విజయ్ ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్‌ను కలసి వినతి పత్రం అందించారు. అయితే మెజార్టీ మార్కుకు కేవలం పదిసీట్ల దూరంలో ఆగిపోయిన టీవీకేకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మద్దతు తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో టీవీకేకు సపోర్టు చేసే ముందు కాంగ్రెస్ విజయ్‌తో ఒక విషయంలో కీలక ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది.ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు తుదిదశకు చేరుకున్నాయి. ఆ రాష్ట్ర సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి దాదాపు ముహుర్తం సైతం సిద్ధమైంది. రేపు లేదా ఎల్లుండో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే విజయ్ సీఎం కావడానికి అక్కడి కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టీవీకేతో కీలక ఒప్పందం చేసుకొని అనంతరం మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్ ఇంఛార్జ్ గిరీశ్ చౌడాంకర్ ఓ ప్రకటన విడుదల చేశారు." ప్రస్తుతం మేము టీవికేకు మద్దతిస్తున్నాం. రాజ్యాంగాన్ని నమ్మని మతతత్వ రాజకీయ పార్టీలకు టీవీకే పార్టీ దూరంగా ఉన్నంత కాలం మాత్రమే ఉంటుంది. ఒకవేళ వారు మతతత్వ శక్తులతో కలిస్తే మా మద్దతు ఉపసంహరిస్తాం. అని అన్నారు అయితే ఇప్పటికే కాంగ్రెస్ విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించింది.కాగా మెజార్టీ మార్కు రావాలంటే కాంగ్రెస్ ఐదు స్థానాలతో కలిపి టీవీకేకు మరో ఐదు స్థానాల మద్దతు అవసరం ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఇతర చిన్న పార్టీలు టీవీకేకు మద్దతు ఇస్తామని ప్రకటించాయి. దీంతో మెజార్టీమార్కుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. -
విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్..
-
అలా చేశాడంటే.. విజయ్ పతనం ఖాయం..!
సినిమాలు వేరు.. రాజకీయం వేరు.. అవును ఇది ముమ్మాటికీ నిజమే. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రూవ్ అయింది కూడా. సినీ గ్లామర్‌తో పాలిటిక్స్‌లో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అధికారం చేపట్టలేకపోయారు. తమిళనాడులోనూ కమల్ హాసన్, విజయ్ కాంత్ లాంటి వాళ్లు కూడా నెగ్గలేకపోయారు. కానీ ఊహించని విధంగా దళపతి విజయ్ మాత్రం సక్సెస్ అయ్యాడు. అధికారం కోసం మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా అత్యధిక సీట్లు గెలిచాడు. దీంతో ఒక్కసారిగా విజయ్ పేరు మార్మోగిపోతోంది.ఈ నేపథ్యంలో త్రిష పేరు కూడా హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నికల ముందే వీరిద్దరిపై రూమర్స్ వచ్చాయి. విజయ్ భార్య సంగీత సైతం విడాకుల పిటిషన్ వేయడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని టాక్ వినిపించింది. విజయ్-త్రిష కలిసి పెళ్లికి హాజరు రావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా విజయ్ గెలిచాక త్రిష నేరుగా ఇంటికెళ్లి మరి అభినందనలు తెలిపింది. దీంతో త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. విజయ్ పోటీ చేసిన ఓ స్థానంలో నిలబడుతుందని తమిళనాట హల్చల్ చేస్తోంది. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. పాలిటిక్స్‌లోకి త్రిష ఎంట్రీ ఇస్తే విజయ్ పతన ఖాయమని అంటున్నారు. అదేలాగో తెలుసుకుందాం.త్రిష ఎంట్రీతో విజయ్‌కి దెబ్బ..రాజకీయాల్లో సీఎం కుర్చీ అనేది అంత ఈజీ కాదు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. పాలిటిక్స్‌లో వ్యక్తిగత విషయాలను తీసుకురాకపోవడమే మంచింది. త్రిషతో రిలేషన్ ఉన్నంత మాత్రాన ఆమెను రాజకీయాల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ అదే జరిగితే విజయ్‌పై చెడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది. ఎందుకంటే విజయ్‌కు మాత్రమే తమిళ ప్రజలు ఓటేశారు. అంతేకానీ త్రిషను చూసి కాదు. ఆమెను తీసుకొస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ఇదంతా పాలన ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో బీజేపీ నేత నాగేంద్రన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. అప్పట్లో త్రిషకు మద్దతు లభించినా.. ఆమెను విజయ్ రాజకీయంగా ప్రమోట్ చేస్తే మాత్రం ప్రజా వ్యతిరేకతకు కారణమవుతుంది. ఈ విషయంలో విజయ్ చాలా అప్రమత్తంగా ఉండాలి.వ్యక్తిగతం వేరు.. రాజకీయ జీవితం వేరుతిరుచ్చి ఈస్ట్ స్థానానికి విజయ్ రాజీనామా చేయాల్సిందే. ఆ నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యం ఉన్న ప్రాంతం కావడం విశేషం. అక్కడ విజయ్ను చూసి మాత్రమే ఓటేశారు. అదే స్థానంలో త్రిషను నిలబెడితే ఆదిలోనే విజయ్‌కు దెబ్బపడే అవకాశముంది. అధికారం చేపట్టిన పార్టీ తొలి ఉపఎన్నికలోనే ఓడిపోతే ఆ ప్రభావం పాలనపై పడుతుంది. ఈ ప్రయోగం విఫలమైతే.. అది కేవలం ఒక సీటు ఓటమి మాత్రమే కాదు.. విజయ్ రాజకీయ పతనానికి సంకేతంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ద్రవిడ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని విజయ్ ముందుకెళ్లాలి. రాజకీయాలతో పర్సనల్ లైఫ్‌ను ముడిపెట్టకుండా పాలన సాగిస్తే విజయ్‌కే మంచిదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
తమిళనాడులో విజయ్ సునామీ.. సెలబ్రిటీలతో సెల్ఫీలు వైరల్!
-
8వ తేదీన "విజయ్ అనే నేను ప్రమాణస్వీకారం!"
-
విజయ్ రాజీనామా డిప్యూటీ సీఎంగా త్రిష?
-
పలు కీలక అంశాలపై గవర్నర్ తో టీవీకే భేటీ
-
విజయ్ గెలుపు.. బుట్టబొమ్మకు ముందే తెలుసా?
తమిళనాట ఎన్నికలకు ముందు దళపతి విజయ్ నటించిన చివరి మూవీ జన నాయగన్. అయితే ఈ సినిమా సెన్సార్ వివాదాలతో వాయిదా పడింది. ఎలక్షన్ ముందు అడ్డంకులు రావడంతో జన నాయగన్ వివాదం కోర్టుకు చేరింది. ఎన్నికల ముందు రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ మూవీలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ నటించింది. ఇందులో నటి మమితాబైజు, ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.ఈ సినిమా సంగతి పక్కన పెడితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు బుట్టబొమ్మ.. విజయ్ను చూపిస్తూ కనిపించింది. ఈ వీడియో జన నాయగన్ మూవీ షూటింగ్ టైమ్‌లో చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో విజయ్ సిగ్గుపడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ గెలుస్తాడని బుట్టబొమ్మకు ముందే తెలుసా అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. మరికొందరు పూజా హెగ్డే కాన్ఫిడెన్స్ సూపర్ అంటూ కొనియాడుతున్నారు. BREAKING: Pooja Hegde points at Thalapathy Vijay as the election winner and he responds with a shy blush. pic.twitter.com/aUdvjB7Odx— Actor Vijay Team (@ActorVijayTeam) May 5, 2026 -
'గెలిచినందుకు కంగ్రాట్స్.. ఆ మాట తప్పకూడదు'.. విజయ్‌కు సత్యరాజ్ చురకలు
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయంపై నటుడు సత్యరాజు స్పందించారు. ఈ గెలుపు పట్ల విజయ్‌కు అభినందనలు తెలిపారు. అదే సందర్భంలో మీరు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. మీరు పెరియార్, అంబేద్కర్‌ను తనకు ఆదర్శమని ప్రకటించారని గుర్తు చేశారు. మీరు వారి విలువలను నిలబెట్టి, సామాజిక న్యాయాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. డీఎంకే స్టాలిన్ ఓటమి పట్ల బాధగా ఉందన్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో తన సపోర్ట్ డీఎంకేకే ఉంటుందని సత్యరాజ్ స్పష్టం చేశారు.కాగా.. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో టీవీకే చీఫ్, హీరో విజయ్ ఏకంగా వందకు పైగా సీట్లు సాధించారు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ్ గెలుపొందారు. తొలిసారి ఎన్నికల్లో నిలిచిన విజయ్ పార్టీ ఏకంగా 108 సీట్లు సాధించింది. ఇంకా అధికారం చేపట్టాలంటే మరో పది సీట్లు కావాలి. ఇతర పార్టీల సహకారంతో విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కోల్పోయింది. దీంతో సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. Congratulations #ThalapathyVijay & #TVK on your victory. You’ve cited Periyar & Ambedkar as your ideological leaders—hope you uphold their values and ensure social justice. Saddened by #MKStalin’s defeat, but I’ll continue supporting #DMK.– #Sathyaraj pic.twitter.com/c5Q7ikwpBo— Movies Singapore (@MoviesSingapore) May 5, 2026 -
tvk vijay : ఎల్లుండి సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ ఎల్లుండి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయ్‌తో పాటు 20మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) అతి పెద్ద పార్టీగా అవతరించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసించిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి, ప్రజల తీర్పుతో కొత్త శక్తిగా ఎదిగింది. అయితే స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు కీలకమైంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు విజయ్ను సంప్రదించాయి. అదే సమయంలో విజయ్ సైతం పలు పార్టీలతో సంప్రదింపులు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడం, మంత్రి వర్గంలో ఏ పార్టీకి చోటివ్వాలి. ప్రమాణ స్వీకారం తదిదర అంశాలపై స్పష్టత వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మిత్రపక్షాల ప్రతిపాదనలుసీపీఎం, సీపీఐ, పీఎంకే, వీసీకే పార్టీలు విజయ్‌కు తమ ప్రతిపాదనలు పంపాయి.పీఎంకే (పట్టాలి మక్కల్ కచ్చి) - నాలుగు స్థానాలు గెలుచుకున్న ఈ పార్టీకి ఒక మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం.సీపీఎం- భావజాల పరంగా టీవీకేకు దగ్గరగా ఉన్న ఈ పార్టీకి ఒక మంత్రి పదవి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.సీపీఐ - మరో వామపక్ష పార్టీకి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.వీసీకే (విదుతలై చిరుతైగల్ కచ్చి)- సామాజిక న్యాయం కోసం పోరాడే ఈ పార్టీకి కూడా ఒక మంత్రి పదవి ప్రతిపాదించారని సమాచారం.విజయ్ వ్యూహంకేవలం బయటి నుంచి మద్దతు కాకుండా, మిత్రపక్షాలను నేరుగా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ద్వారా స్థిరమైన పాలన అందించాలనేది విజయ్ వ్యూహం. గత 60 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డీఎంకే, ఏఐఏడీఎకే పార్టీల ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా విజయ్ ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నారు.వినూత్న మంత్రివర్గంమిత్రపక్షాల సీనియారిటీతో పాటు, తన పార్టీలోని యువ నాయకులను కలిపి ఒక వినూత్నమైన మంత్రివర్గాన్ని విజయ్ రూపొందిస్తున్నారు. ప్రజలు కోరుకున్న ‘మార్పు’ తీర్పును గౌరవిస్తూ, పాత రాజకీయ శక్తులకు దూరంగా ఉండాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు.ముఖ్యమంత్రి పదవికి విజయ్అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ గురువారం (మే 7)న విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.


