అల్పపీడన ప్రభావం.. ఏపీలో మూడు రోజులు వర్షాలు | Huge Rains In Andhra pradesh Tamilnadu | Sakshi
Sakshi News home page

అల్పపీడన ప్రభావం.. ఏపీలో విస్తారంగా వర్షాలు

Dec 16 2024 5:21 PM | Updated on Dec 16 2024 6:19 PM

Huge Rains In Andhra pradesh Tamilnadu

సాక్షి,విశాఖపట్నం: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఏపీ, తమిళనాడులో వర్షాలు పడనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

మంగళవారం నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బుధవారం నెల్లూరు,తిరుపతి,విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.

18వ తేదీన ఉదయం తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి 30 నుంచి 35 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు ఈ నెల 18 వరకూ వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement