breaking news
heavy rains
-
ఢిల్లీలో ఊహించని విషాదం.. సీసీటీవీ దృశ్యాలు
ఢిల్లీ: నగరంలో ఊహించని విషాదం జరిగింది. కల్కాజీ ప్రాంతంలో తండ్రి, కూతురు బైక్‌పై వెళ్తుండగా భారీ వర్షానికి బైక్‌పై చెట్టు కూలిపోయింది. తండ్రి మృతి చెందగా.. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. సుధీర్ కుమార్ (50) అనే వ్యక్తి తన కుమార్తె ప్రియ (22)తో కలిసి వెళ్తుండగా.. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీలో ఒక పాత వేప చెట్టు విరిగి బైకర్, పక్కనే ఉన్న వాహనాలపై పడింది. ఈ ఘటన ఉదయం 9:50 గంటలకు జరిగింది. సీసీటీవీలో ఈ విషాద ఘటన రికార్డయ్యింది.చెట్టు కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. పీసీఆర్ కాల్‌కు పోలీసులు వేగంగా స్పందించి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇద్దరు బాధితులను బయటకు తీసి, సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రామా సర్వీసెస్ (CATS) అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.In South Delhi’s Kalkaji, a biker lost his life after a tree collapsed on him during heavy rain.pic.twitter.com/58u0JEa4E4— Greater Noida West (@GreaterNoidaW) August 14, 2025తండ్రి, కుమార్తె ఇద్దరినీ AIIMS ట్రామా సెంటర్లో చేర్చారు. తండ్రి తీవ్ర గాయాలతో మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో తెల్లవారుజామున నుండి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు ప్రభావంతో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఏర్పడింది. జనజీవనానికి అంతరాయం కలిగింది. -
ఏపీకి భారత వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
విశాఖపట్నం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. పలు జిల్లాల్లో ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లి రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ తరుణంలో గురువారం భారత వాతావరణశాఖ ఏపీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద (ఫ్లాష్ ఫ్లడ్) ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశముందని తెలుస్తోంది.పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తరాంధ్ర ఒడిశా వైపు కదిలే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాగల వారం రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణకేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు.ఏపీ వ్యాప్తంగా గురువారం పలుజిల్లాలో భారీ వర్షాలు కొనసాగాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువ నుంచి వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ వద్ద 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో ఏలూరులో 22, ముమ్మిడివరంలో 18, అమలాపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాద సూచికను ఏగురవేశారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. -
వాన జోరు.. వరద హోరు
సాక్షి, నెట్వర్క్: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం, ఉపరితల ఆవర్తనం, రుతుపవనాలు చురుకుగా మారడంతో రాష్ట్రంలో వానలు ఊపందుకున్నాయి. రెండు, మూడ్రోజులుగా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు రిజర్వాయర్లు నిండిపోయాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. మరోవైపు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. పంట చేలు ముంపునకు గురయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీ వర్షం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగాయి. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో బుధవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు రెండు గేట్లు, స్వర్ణ ప్రాజెక్టు ఒక గేటు, కుమురంభీం ప్రాజెక్టు ఏడు, వట్టివాగు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం మత్తడివాగు గేటు ఎత్తారు. ఆసిఫాబాద్ మండలం తూంపెల్లి వాగు, నంబాల వాగు పొంగడంతో 13 గ్రామాలకు రాకపోకల్లో అంతరాయం కలిగింది. అలాగే కెరమెరి మండలం అనార్పల్లి వాగు, బూరుగూడ పెంచికల్‌పేట ఎర్రవాగు లోలెవల్ వంతెనపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. నెన్నెల మండలం లంబాడి తండా ఎర్రవాగుపై ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోయింది. భీమిని మండలం రాజారాం, కర్జీ భీంపూర్‌లో రోడ్డు కొట్టుకుపోయింది. కోటపల్లి మండలాల్లో వరద నీరు పంట చేన్లకు చేరింది. మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాల్లో రోడ్లపై వరద చేరింది. కలెక్టరుŠల్ ముంపు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షానికి మూడు వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబూబ్‌నగర్ జిల్లాల్లో.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పరిగి, వికారాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బుధవారం రాత్రి వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. సరళాసాగర్, రామన్‌పాడు, పోపల్దిన్నె రిజర్వాయర్లకు భారీగా వరద కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో 350 చెరువులు అలుగు పారుతున్నాయి. వనపర్తి జిల్లా ఊకచెట్టు వాగులో నీటి ఉధృతి పెరిగి ఆత్మకూర్–మదనాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి అతలా కుతలం సంగారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. న్యాల్కల్ మండల పరిధిలోని రేజింతల్ గ్రామ శివారులో వరద బ్రిడ్జిపై నుంచి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పంట పొలాలు వరదనీటితో నిండిపోయాయి. ప్రధానంగా పత్తి పంటతోపాటు చెరుకు, మినుము, సోయా, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లాలో.. సూర్యాపేట జిల్లాలోనూ భారీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మునగాల మండలంలోని మొద్దులచెరువు, కలకోవ ఊరచెరువు, రేపాల, నర్సింహులగూడెం, ముకుందాపురం తిప్పాయికుంట, ఆకుపాముల నాగులకుంట చెరువులు అలుగు పోస్తున్నాయి. పాలేరు రిజర్వాయర్ నిండు కుండలా మారింది. ఆయకట్టు పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సాగర్ ఎడమ కాల్వకు బుధవారం నీటి విడుదలను నిలిపివేశారు. కోదాడలో బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం రాత్రి గుడిబండ రోడ్డులో ఉన్న తులసీనగర్ టౌన్íÙప్లోకి వర్షపునీరు చేరడంతో ఇళ్లలోని వారిని మున్సిపాలిటీ సిబ్బంది జేసీబీతో బయటకు తీసుకొచ్చారు. షిర్డీసాయినగర్‌కు వరద ముప్పు దృష్ట్యా అక్కడ ఉన్న ముస్లిం మైనార్టీ బాలికల పాఠశాల విద్యార్థులను మధ్యాహ్నమే ఖాళీ చేయించి ఇంటికి పంపారు. పలు కాలనీల్లో ఇళ్లు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. మూసీ వంతెనలు పరిశీలించిన అధికారులు హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో మూసీ పరవళ్లు తొక్కుతోంది. వలిగొండ మండలం బీమలింగం, భూదాన్ పోచంపల్లి మండలం జూలరు–రుద్రవెల్లి వద్ద లో లెవల్ బ్రిడ్జిల పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి ఇతర అధికారులు మూసీ వంతెనలను పరిశీలించారు. భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్ మండలాల్లో మూసీ ఆధారిత చెరువులు అలుగులు పోస్తున్నాయి. వరంగల్ లోతట్టు కాలనీల్లో వరద వరంగల్ నగరంలో మంగళవారం ఉదయం నుంచే వర్షం తగ్గుముఖం పట్టినా పలు లోతట్టు కాలనీల్లో ప్రవహిస్తున్న వరదనీరు ఉధృతి బుధవారం కూడా తగ్గలేదు. ఎస్ఆర్ఆర్ తోట, శివనగర్, మైసయ్య నగర్, శాకరాశికుంట, నాగేంద్రనగర్, కాశికుంట కాలనీలు నీటిలో ఉన్నాయి. 12 మెరీల నుంచి బొందివాగు వరకు రహదారిపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. శివనగర్‌లో బల్దియా ఏర్పాటు పునరావాస కేంద్రంలో నిర్వాసితులు తలదాచుకుంటున్నారు. -
వరద ముంపులో అమరావతి
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడికొండ : రాజధాని అమరావతి మళ్లీ వరద ముంపులో చిక్కుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లడంతో గుంటూరు వైపు నుంచి రాజధాని అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి పది గంటల నుంచి బుధవారం ఉదయంలోపు జిల్లాలో సగటున 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో తాడికొండ మండలం లాం వద్ద కొండవీటి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాదాపు ఆరు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పెదపరిమి వద్ద కోటేళ్లవాగు, కంతేరు వద్ద ఎర్రవాగు, అయ్యన్నవాగు, పాలవాగులు పొంగడంతో రహదారులపైకి నీరు చేరింది.రాజధాని నిర్మాణాలతో స్వరూపం కోల్పోయిన వాగులు..రాజధాని ప్రాంతంలో వివిధ నిర్మాణాల కారణంగా పాలవాగు, అయ్యన్నవాగులు వాటి స్వరూపాన్ని కోల్పోయాయి. కొండవీటి వాగు నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. నిర్మాణాలతో వాగులు మూసుకుపోవడంతో పాటు రోడ్ల ఎత్తును పెంచడంతో వాగు నుంచి వచ్చే వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేక వేలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిసారించకుండా కొండవీటి వాగు వరదను గాలికొదిలేయడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. మరోవైపు.. తాడికొండ, తుళ్ళూరు, మేడికొండూరు, మంగళగిరి రూరల్ మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాల్లో పంటలు కొండవీటి వాగు వరద ఉధృతికి ముంపుబారిన పడి సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరే ఉండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు నిల్..ఇక మంగళవారం రాత్రి తాడికొండ మండలంలో 225 మిల్లీమీటర్లు, తుళ్ళూరు మండలంలో 180.2 మి.మీ., మేడికొండూరు 140.2, ఫిరంగిపురం 111.2, మంగళగిరి 194.8 మి.మీ., వర్షం కురిసింది. ఈ వర్షం నీరు అంతా కొండవీడు కొండల మీదుగా మేడికొండూరు, తాడికొండ, తుళ్ళూరు, తాడేపల్లి మండలాల మీదుగా ప్రకాశం బ్యారేజ్‌కు చేరాల్సి ఉంది. కానీ, కొండవీటి వాగు ప్రక్షాళనకు రూ.234 కోట్లతో టీడీపీ కూటమి ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల పథకంలో ఎక్కడా ఎగువ నుంచి దిగువకు వరద నీరు పూర్తిగా వచ్చేలా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. నిజానికి.. వందల ఏళ్లుగా కొండవీటి వాగు పల్లపు ప్రాంతమైన రాజధాని ప్రాంతం నుంచే ప్రవహించేది. అయితే, ప్రస్తుతం దానిని మూసేసి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లుచేయకపోవడంవల్లే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. కాసుల కక్కుర్తి కోసం రాజధానిలో రిజర్వాయర్ల పేరుతో ఇతర నిర్మాణాలను చేపట్టడం కూడా వరద ముంపునకు కారణమైంది. దీంతో.. గత 25 ఏళ్లలో ఎప్పుడూ జరగని నష్టం ఇప్పుడీ ప్రాంతానికి వచ్చింది. ఇటు పంటలు మునగడంతో పాటు గ్రామాల్లో కూడా నీరు కదిలే పరిస్థితి లేక రాజధానితో పాటు పరిసర ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం..ఇదిలా ఉంటే.. గుంటూరు నుంచి రాజధానికి వెళ్లేందుకు ప్రధాన రహదారి అమరావతి–గుంటూరు రోడ్డే. అయితే, ఈ మార్గంలో లాం వద్ద కొండవీటి వాగు ఏటా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ వంతెన నిర్మాణం హామీ ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. » మరో మార్గం.. జాతీయ రహదారి మీదుగా కంతేరు–తాడికొండ మధ్యలో ఎర్రవాగు వద్ద కూడా వరద పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ కూడా వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. ఆ దిశగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. » మంగళగిరి మీదుగా రాజధానికి ప్రవేశించాలన్నా నీరుకొండ–పెదపరిమి రహదారి వద్ద భారీ వర్షం కురిస్తే వారం పాటు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఐనవోలు మీదుగా కూడా రహదారి పూర్తిగా దిగ్బంధం అవుతుంది. » ఒక్క చంద్రబాబు నివాసం మీదుగా వచ్చే కరకట్ట రహదారి మినహా రాజధానికి రావాలంటే ఏ ఒక్క రోడ్డు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర సచివాలయానికి ఉద్యోగులు వెళ్లలేక నానా ఇబ్బందులు పడ్డారు. -
నేడు అక్కడక్కడా అతిభారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి గురువారం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. ఆదివారానికి దక్షిణ ఒడిశా మీదుగా కదులుతూ తీరం దాటనుంది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణ వరకూ తూర్పు పశ్చిమ ద్రోణి విస్తరించి ఉంది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. వర్షాల ప్రభావం ఈనెల 17 వరకు ఉంటుందని.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 18న కూడా కొనసాగే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. ఈనెల మూడో వారంలో కోస్తాంధ్ర తీరాల్లో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని.. ఆ తర్వాత మళ్లీ వర్షాలు పుంజుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
కృష్ణవేణి.. ఉగ్రరూపిణి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తోడు ఉప నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీలోకి బుధవారం రాత్రి 9 గంటలకు వరద 3,97,250 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. అంతే పరిమాణంలో 70 గేట్ల ద్వారా అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి గురువారం ఉదయానికి ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 4 నుంచి 4.50 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో.. కృష్ణా నదీ తీర ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మూడ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్ర పరవళ్లు తొక్కుతున్నాయి. బుడమేరు పరీవాహక ప్రాంతంలో కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో బుధవారం రాత్రికి 10–15 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మున్నేరు, కొండవీటి వాగు తదితర వాగుల ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద వస్తోంది. విజయవాడలో పలు ప్రాంతాలు జలమయం భారీ వర్షాలకు విజయవాడతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డ్రెయిన్లు పొంగడంతో రోడ్ల మీద 4 అడుగుల మేర నీరు నిలిచింది. వందల సంఖ్యలో ఇళ్లలోకి నీరుచేరింది. బుడమేరు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హంసలదీవి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. పమిడిముక్కల మండలం ఐనంపూడిలో పిడుగుపడి పశువులపాక దగ్ధం కావటంతో రెండు గేదెలు, ఒక ఎద్దు మృతిచెందాయి. కాజ టోల్‌గేటు వద్ద నిలిచిన ట్రాఫిక్ మంగళగిరి నగర పరిధిలోని కాజ టోల్‌గేటు వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌ప్లాజా వద్ద మూడడుగుల నీరు ఉండడంతో గుంటూరు నుంచి విజయవాడ వైపు పలు లైన్లలో రాకపోకలు నిలిపివేశారు. మంగళగిరి టిడ్కో గృహ సముదాయంలో నీరు నిలిచిపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో ప్రధాన రహదారులపై వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిపోయాయి. గుంటూరు రోడ్లు, డ్రెయిన్లు, మార్కెట్లు, జలమయమయ్యాయి. పిడుగురాళ్ల మండలం జూలకల్లు, గుత్తికొండ, దాచేపల్లి, కారంపూడి మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్కడక్కడ బ్రిడ్జిలు, చప్టాలు కూలిపోయాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని దొంగలవాగు ఉధృతంగా ప్రవహించటంతో కర్నూలు రహదారిలో కొత్తూరు వద్ద ఉన్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ ప్రాంతం వద్ద బుధవారం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ‘పశ్చిమ’లోనూ భారీ వర్షం పశి్చమ గోదావరి జిల్లా భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పెనుగొండ, ఉండి నియోజకవర్గాల్లో కుండపోత వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్ర«దాన రహదారులపై సైతం వర్షం నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులు ఇక్కట్లకు గురయ్యారు. ఏలూరు జిల్లాలోనూ కుండపోత వర్షం కురిసింది. కాకినాడ, జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు కనిపించని విధంగా జలమయమయ్యాయి. మూడు జిల్లాల్లో పంటలకు నష్టం వర్షాల వల్ల ఖరీఫ్ పంటలు నీటమునుగుతున్నాయి. గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ మూడు జిల్లాల పరిధిలో 161 గ్రామాల్లో 1.12 లక్షల ఎకరాల్లోని పంటలు ముంపుబారిన పడ్డాయి. 52,924 మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా 1.02 లక్షల ఎకరాల్లో వరి, 8,550 ఎకరాల్లో పత్తి, వెయ్యి ఎకరాల్లో మినుము, 300 ఎకరాల్లో వేరుశనగ పంటలు ముంపునకు గురయ్యాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వందల ఎకరాల్లో వరి పైర్లు నేలకొరిగాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ అక్కడక్కడ వరి పంటలు నీట మునిగాయి. కర్నూలు జిల్లాలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న, కంది, టమాట పంటలు నీటమునిగి కుళ్లిపోతుండడంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నంద్యాల జిల్లాలోనూ వరి పైరు నీట మునిగింది. మినుము, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. అప్రమత్తంగా ఉండండి: సీఎంరాష్ట్రంలో వచ్చే రెండు, మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువ ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.సీఎం చంద్రబాబు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై సమీక్షించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించాలని చెప్పారు. బెజవాడలో ముగ్గురు దుర్మరణం భారీ వర్షాలకు విజయవాడలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పాతబస్తీ గులాం మొహిద్దీన్ వీధిలో భూగర్భ డ్రైనేజీ మరమ్మతుల నిమిత్తం నగరపాలక సంస్థ సిబ్బంది తీసిన గోతిలోపడి కృష్ణా జిల్లా హోల్‌సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు టీవీ మధుసూదనరావు మరణించాడు. మరో ఘటనలో.. పాతబస్తీ సుబ్బరామయ్య వీధిలోని జెండా చెట్టు వద్ద ప్రధాన అవుట్‌ఫాల్ డ్రెయిన్ సమీపంలో ముర్తుజా అనే వ్యక్తి వర్షపు నీటిలో పడి కొట్టుకుపోయాడు. లయోలా కాలేజీ సమీపంలో చెట్టు పడటంతో ఓ వ్యక్తిపై ప్రాణాలు విడిచాడు. కాగా.. కృష్ణా నదిలో తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం వద్ద ఇసుకను తోడే బుల్డోజర్ స్థానం మార్చేందుకు దిగిన కామేశ్వరరావు (19), వీర ఉపేంద్ర (22) గల్లంతు కాగా.. మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. -
తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్.. వానలే వానలు (ఫొటోలు)
-
నీట మునిగిన ‘ఏపీ రాజధాని’
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి నీట మునిగింది. అమరావతి కోర్ క్యాపిటల్ వరద ముంపులో చిక్కుకుంది. అమరావతి రాజధాని గ్రామాలు వర్షానికి మునిగాయి. ఏపీ రాజధాని అమరావతి.. కృష్ణా నదిని తలపిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంది. కొండవీటి వాగు, పాలవాగు పొంగిపొర్లుతుంది. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి పొర్లుతోంది. దీంతో కనుచూపుమేరలో రాజధానిలో భూమి కనిపించడం లేదు.వేల ఎకరాలు భూములు నీటమునిగాయి. నీరుకొండ వద్ద వర్షపు నీరు గంట గంటకు పెరుగుతోంది. శాఖమూరు, ఐనవోలు, కృష్ణాయ పాలెం, నీరుకొండ, కురగల్లు, ఎర్రబాలెం, పెనుమాక, బేతపూడి పొలాల్లోకి వరద నీరు చేరింది. ఎస్ఆర్ఏం యూనివర్సిటీ చుట్టూ భారీగా వరద నీరు చేరుతోంది. హైకోర్టుకు వెళ్లే రోడ్డు మార్గం జలమయంగా మారింది. రాజధాని నిర్మాణాల చుట్టూ వరద నీరు పెరుగుతోంది. పొంగి ప్రవహిస్తున్న కొండవీటి వాగు, పాలవాగుతో వేలాది ఎకరాల నీటమునిగాయి.ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా పోటెత్తుతోంది. దీంతో అధికారులు.. మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. విజయవాడకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలతో డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. గుంటూరు, తాడికొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మంగళగిరిలో ఇళ్లలోకి వరద నీరు చేరింది.నీట మునిగిన అమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణంఅమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణం కూడా నీట మునిగిపోయింది. ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ వరద నీరు చేరింది. రాయపూడిలో ఐకానిక్ టవర్ నిర్మాణం అవుతోంది. అమరావతి ఐకానిక్ టవర్ ప్రాంతం చెరువులా మారిపోయింది. -
గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర భారీగా వరద
-
ఏపీవాసులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
Heavy Rains In AP Updates:బుడమేరు వాగు ఉధృతిభారీవర్షాలతో బుడమేరులో పెరిగిన నీటి ప్రవాహంసరైన సమాచారం లేక ఆందోళన చెందుతున్న ప్రజలుబుడమేరు మధ్య కట్ట, గుణదల తదితర ప్రాంతాలలో పర్యటించిన సీపీఎం నేత సీహెచ్ బాబురావులోతట్టు ప్రాంతాల్లో మునిగిన కొన్ని ఇళ్లను సందర్శించిన బాబురావు, సీపీఎం నేతలుకృష్ణానది వరద ముంపు, కృష్ణ కరకట్ట ప్రాంత ప్రజలను పరామర్శించిన సీపీఎం బృందంవిజయవాడలో దంచికొడుతోన్న వర్షంరోడ్లు జలమయంపొంగిపొర్లుతున్న డ్రైన్లులోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరుతున్న వర్షపు నీరువిద్యాధరపురంలో పలు ఇళ్లలోకి చేరిన వర్షపునీరుగన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షంవిజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు, ప్రసాదంపాడులో జాతీయ రహదారిపైకి చేరిన వర్షపు నీరు.తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.సాక్షి, విజయవాడ: ఏపీలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కృష్ణనది పరీవాహక ప్రాంత ప్రజలకు అధికారులు అలెర్ట్ జారీ చేశారు. విజయవాడలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుణదల వంతెనపై నుంచి బుడమేరు ప్రవాహం కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నంలోని చినలంక, పెద్దలంక ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో చెరువుకు గండి పడింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర భారీగా వరద నీరు చేరుకుంది. కోల్కత్తా-చెన్నై జాతీయ రహదారిపై వాహనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిన్న(మంగళవారం) రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి. వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ శివారులో వాగు పొంగి జూలకల్లు పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో రహదారిపై నుండి పారుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాచేపల్లి పట్టణంలోని రజక కాలనీ, బొడ్రాయి సెంటర్‌తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి.కేసానుపల్లి గ్రామంలో వాగు పొంగిపొర్లుతోంది. కారంపూడి-దాచేపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మాచవరం మండలం రుక్మిణి పురం గ్రామం వద్ద పిల్లేరు వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచవరం మండలం గాంధీనగర్ వద్ద వరద నీటితో వాగు పొంగి పొర్లడంతో మాచవరం-పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. -
విజయవాడ: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. ఇద్దరు బలి
సాక్షి, విజయవాడ: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరి నిండు ప్రాణాలు బలయ్యాయి. మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఒకరు, చెట్టు మీదపడి మరొకరు మృతిచెందారు. మృతులను టీవీ మధుసూదన్, మూర్తాజా గుర్తించారు.గులాం మొహిద్దీన్ స్ట్రీట్‌లో మ్యాన్ హోల్ కోసం నగరపాలక సంస్థ అధికారులు భారీ గుంత తవ్వించారు. భారీ గోతుల వద్ద అధికారులు ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. గత రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు చెరువుల్లా మారాయి. వీఎంసీ అధికారులు తవ్విన గోతిలో టీవీ మధుసూదన్ అనే వ్యక్తి మృతి చెందాడు. వీఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్‌షీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు.పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ శివారులో వాగు పొంగి జూలకల్లు పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో రహదారిపై నుండి పారుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.దాచేపల్లి పట్టణంలోని రజక కాలనీ, బొడ్రాయి సెంటర్ తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి. కేసానుపల్లి గ్రామంలో వాగు పొంగి పొర్లుతోంది. కారంపూడి దాచేపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచవరం మండలం శ్రీరుక్మిణిపురం గ్రామం వద్ద పిల్లేరు వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. మాచవరం మండలం గాంధీనగర్ వద్ద వరద నీటితో వాగు పొంగి పొర్లడంతో మాచవరం పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
తెలంగాణకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు
హైదరాబాద్: తెలంగాణ అంతటికీ వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నాలుగు నుంచి ఐదు రోజులపాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో.. బుధ, గురువారాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న మీడియాకు వెల్లడించారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ కలర్ వార్నింగ్ జారీ చేసినట్లు నాగరత్న తెలిపారు. అలాగే.. హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ కలర్ వార్నింగ్ జారీ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘‘నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశాం. రేపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్.. రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాం. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఉత్తర తెలంగాణలో 17న వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి’’ అని ఆమె అన్నారు. రాష్ట్రమంతటా రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వివరించారామె.అప్రమత్తమైన జీహెచ్ఎంసీభారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. సాయంత్రం నుంచి అధిక వర్షాలు పడే అవకాశం ఉండడంతో.. ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేసింది. మరోవైపు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని, మ్యాన్‌హోల్స్‌ను ఎవరూ తెరవొద్దని హెచ్చరించింది. -
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఉత్తర ప్రాంతాల్లో బుధ, గురు, శుక్రవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, సరాసరి 10 నుంచి 15 సెం.మీ కంటే ఎక్కువ, కొన్ని చోట్ల 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షం కురవవచ్చని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఆయా రోజుల్లో వాహనాల కదలికలను తగ్గించాలని అభ్యర్థించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. -
వరంగల్‌ను ముంచెత్తిన వరద
సాక్షి, వరంగల్/ఖమ్మం/నల్లగొండ నెట్వర్క్: వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్ రైల్వేస్టేషన్లో ఉన్న మూడు పట్టా లైన్లు నీట మునిగి రైళ్ల రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది నీటిని బయటకు పంపడంతో రైళ్ల రాకపోకలు సాగాయి. హంటర్ బ్రిడ్జ్ రోడ్డులోకి భారీగా వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాశీకుంట వాంబేకాలనీలోని ఇంట్లోకి నీరు వచ్చి మంచం మునగడంతో దానిపై పడుకున్న వృద్ధురాలు పసునూటి బుచ్చమ్మ చనిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్న వారిని పోలీసులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖిలా వరంగల్ కోట నీటిలో మునిగింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామంలో గేదెలను బయటకు తోలేందుకు ఆకేరు వాగులో దిగిన పశువుల కాపరి కందికగ్ల ఉప్పలయ్య వరదనీటిలో గల్లంతయ్యారు. ∙గొల్లబుద్దారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలకు వరద ప్రవా హం ఒక్కసారిగా పెరిగిపోవడంతో పాఠశాల ప్రాంగణం ఒక చిన్న చెరువును తలపించింది. దాదాపు 400 మంది విద్యార్థులు పాఠశాల లోపలే చిక్కుకుపోయి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఖమ్మం జిల్లాలో....ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పాలేరు రిజర్వాయర్ సామర్థ్యం 23 అడుగులు కాగా 23.15 అడుగులు, వైరా రిజర్వాయర్ 18.03 అడుగులకుగాను 18.08 అడుగుల మేర ప్రవాహంతో పోటెత్తుతున్నాయి. ఇక తిరుమలాయపాలెం మండలం రాకాసితండాను గతేడాది ఆ కేరు వరద ముంచెత్తగా ఈసారి మంగళవారం సాయంత్రాని కి ఆకేరు వరద పెరిగి సీతారామ ఆక్వాటెక్ట్కు తాకి ప్రవహి స్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో....ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామం వద్ద వలిగొండ– తొర్రూరు ప్రధాన రహదారిపై బ్రిడ్జి పనులు సాగుతుండగా, తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. వరద నీరు దిగువకు వెళ్లక అక్కడే చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వెలిశాలలో ఎస్ఆర్ఎస్పీ కాల్వ లైనింగ్ దెబ్బతిన్నది. భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు, రుద్రవెల్లి గ్రామాల మధ్య గల లోలెవల్ బ్రిడ్జి పై నుంచి మూసీనది ఉధృతి కొనసాగింది. దీంతో పోచంపల్లి నుంచి బీబీనగర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.సంగారెడ్డి జిల్లాలో....రాయికోడ్(అందోల్): సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం యూసుఫ్పూర్ గ్రామానికి చెందిన ఎం. శ్రీనివాస్(35) మంగళవారం రాయికోడ్ నుంచి స్వగ్రామానికి పయనమ య్యాడు. గ్రామ సమీపానికి చేరుకోగానే వాగులో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీనివాస్ వరద నీటిలో నుంచి గ్రామం వైపు దాటేందుకు ప్రయత్నించాడు. వరద ఉధృతికి ఒక్కసారిగా వరద నీటిలో కొట్టుకుపోయి మరణించాడు. నీళ్లు నిలిచి.. ఒండ్రు చేరి..సంగారెడ్డి జిల్లాలో పత్తి చేలన్నీ నీట మునిగాయి. కొన్ని చోట్ల మొక్కలు ఎర్రగా, మరికొన్నిచోట్ల నల్లగా మారి మురిగిపోయాయి. భారీ వర్షం పడినప్పుడు పొలాల్లో నీళ్లు పారుతుండటంతో ఒండ్రుమట్టి వచ్చి చేరుతోంది. -
దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ప్రకాశం జిల్లా మద్దిపాడులో అత్యధికంగా 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ జిల్లా కోటనందూరులో 7.6, సామర్లకోటలో 7.2, అల్లూరి సీతారామరాజు జిల్లా కరిముక్కిపుట్టిలో 6.8, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులు కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగుల వద్ద ఉండవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బుధవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలకు ఆస్కారముందన్నారు. -
72 గంటలు హై అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. మూడు రోజుల పాటు అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది సెలవులను రద్దు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మేరకు అధికారులను ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆన్‌డ్యూటీలో ఉండాలన్నారు. హైదరాబాద్‌తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వరద ముంపు పరిస్థితుల్లో ట్రాఫిక్ సమస్యను నివారించడానికి శాంతిభద్రతల విభాగం పోలీసుల సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పారు. రాబోయే 72 గంటలు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ం నిర్వహించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాజ్‌వేలు, వంతెనలపై రాకపోకలు ఆపండి ‘లోతట్టు కాజ్‌వేలు, ఉధృతంగా ప్రవహించే నదులు, వాగులు, వంకల వంతెనలపై నుంచి రాకపోకలు లేకుండా చూడాలి. పశువులు, గొర్రెలు, మేకల కాపర్లు తరచూ వాగుల్లో చిక్కుకుపోతున్నారు. వారిని అప్రమత్తం చేయాలి. ఎక్కడైనా ప్రమాదవశాత్తు చిక్కుకుంటే వారిని తక్షణమే బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలి. విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలి. డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. గతంలో ఖమ్మంలో 2 గంటల్లో 42 సెం.మీ వర్షం పడింది. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మన దగ్గర 24 గంటల్లో 2 సెం.మీ వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణాలు నిర్మాణం అయ్యాయి. కాబట్టి ఒకటీ రెండు గంటల్లోనే 20, 30 సెంటీమీటర్ల వర్షం (క్లౌడ్ బరస్ట్) పడితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేలా సన్నద్ధం కావాలి. అత్యధిక స్థాయిలో వర్షాలు పడే జిల్లాలు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలి. ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలి. సహాయక చర్యలకు అవసరమైన నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. నీటి విడుదలపై అలర్ట్ చేయాలి.. ‘అకస్మిక వరదలు సంభవించినపుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్లు ఉండేలా చూసుకోవాలి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అవసరమైన మందులు ఉంచాలి. గర్భిణులను తక్షణమే తరలించేలా అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. అవసరమైతే పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇవ్వడంపై జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లోపై నీటిపారుదల శాఖ పూర్తి అవగాహనతో ఉండాలి. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై పూర్తి సమాచారం లోతట్టు ప్రాంతాల ప్రజలకు తెలియజేయాలి. చెరువులు, కుంటలు కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకోవాలి..’ అని రేవంత్ ఆదేశించారు. జిల్లాలు కమాండ్ కంట్రోల్‌తో టచ్‌లో ఉండాలి.. ‘భారీ వర్షాల సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. అన్ని జిల్లాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేయాలి. వారికి ఎప్పటికప్పుడు అలర్ట్ సమాచారం ఇవ్వాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్తో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా అందరూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోలలో అలర్ట్ చేయాలి. సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలి. మీడియా తప్పుడు వార్తలతో భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయొద్దు. సమాచార శాఖ మీడియాకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలి..’ అని సీఎం సూచించారు. అన్ని విభాగాలూ సమన్వయంతో పని చేయాలి ‘హైదరాబాద్‌లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా వ్యవహరించాలి. 24 గంటలూ అందుబాటులో ఉండాలి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సమన్వయంతో పని చేయాలి. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది.. ప్రతి విభాగం సమన్వయంతో పని చేయాలి. అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. -
వచ్చే మూడ్రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/కర్నూలు (అగ్రికల్చర్)/అనంతపురం అగ్రికల్చర్: ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం పలుచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 13వ తేదీ నాటికి వాయవ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు ఆస్కారముందని తెలిపింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తాంధ్రలో చెదురుముదురుగా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశమున్నట్లు వెల్లడించింది.పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. దీంతో.. ఈనెల 12న ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్.. 13న నంద్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్.. 14న ఉమ్మడి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్.. 15న ఉమ్మడి జిల్లాకు ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ ప్రకటించింది. సహాయక చర్యలకు టోల్‌ఫ్రీ నెంబర్లు.. వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలని ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కోరారు. సోమవారానికి కాకినాడ జిల్లా రౌతులపూడిలో 4.2, అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో 4.1, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 4 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. -
Telangana: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 13న అల్పపీడనం ఏర్పడే ఛాన్స్
-
Hyd: అసంపూర్తిగా వదిలేసిన SNDP నాలాలో పడిన డెలివరీ బాయ్
-
తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. ఇవాళ తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు(సోమవారం) కూడా తెలంగాణలోని 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. పార్వతీపురం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.కాగా, హైదరాబాద్ మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నిన్న (శనివారం) రాత్రి 8:30 గంటల నుంచి సుమారు రెండు గంటలపాటు ఏకధాటిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పలు అపార్ట్మెంట్లలోకి వరదనీరు వచ్చి చేరింది.ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష బీభత్సానికి వణికిపోయాయి. రాత్రి 11 గంటల వరకు నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తొర్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా 13.5 సెం.మీ. వర్షం కురిసింది. హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, వనస్థలిపురం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి హైదరాబాద్–విజయవాడ హైవేపై పెద్దఅంబర్‌పేట్ వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది.ఫలితంగా వాహనదారులు, ఊళ్లకు పయనమైన ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బేగంబజార్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు.ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన చోట్ల హైడ్రా అధికారులు మోటార్లతో వరద నీటిని తోడారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. కాగా, ఈ నెల 15 వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
ఉరిమిన వరుణుడు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి 8:30 గంటల నుంచి సుమారు రెండు గంటలపాటు ఏకధాటిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పలు అపార్ట్మెంట్లలోకి వరదనీరు వచ్చి చేరింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష బీభత్సానికి వణికిపోయాయి. రాత్రి 11 గంటల వరకు నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తొర్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా 13.5 సెం.మీ. వర్షం కురిసింది. హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, వనస్థలిపురం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి హైదరాబాద్–విజయవాడ హైవేపై పెద్దఅంబర్‌పేట్ వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు, ఊళ్లకు పయనమైన ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బేగంబజార్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన చోట్ల హైడ్రా అధికారులు మోటార్లతో వరద నీటిని తోడారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. కాగా, ఈ నెల 15 వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
భారీ వర్షాలు.. ఢిల్లీలో పెను విషాదం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న(శుక్రవారం) రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. జైత్పూర్లో శనివారం ఉదయం గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది మృతిచెందారు.మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.కాగా, శనివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కుంభవృష్టి వర్షం కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, భారీ వర్షాలు కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. 200లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.#दिल्ली के जैतपुर थाना इलाके में आज एक हादसा - लगभग 100 फुट लंबी दीवार गिर गई जिसकी चपेट में पास की कई झुग्गियां आ गई है। pic.twitter.com/FsEMHTY8o6— Rohit Chaudhary (@rohitch131298) August 9, 2025 -
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు
-
కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌లో కాలనీలు అతలాకుతలం
-
HYD Rains: హైదరాబాద్ లో వర్ష బీభత్సం
-
దేవభూమిలో విలయం.. గల్లంతైనవాళ్లు ఎందరో?
దేవభూమిని మరోమారు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నాం కుంభవృష్టి ధాటికి వరద పోటెత్తి ఏకంగా రెండు గ్రామాలు సర్వనాశనం అయ్యాయి. నివాసాలు, హోటల్స్ బురద వరదలో కొట్టుకుపోయిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ విలయం ధాటికి ఇప్పటికే ఐదుగురు మరణించగా.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు, అదే సమయంలో చిక్కుకుపోయిన వాళ్లను రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి.భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఉత్తరాఖండ్‌లో.. మంగళవారం ఉత్తరకాశీ జిల్లాలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ కుంభవృష్టి పెను విషాదాన్ని మిగిల్చింది. హర్సిల్ సమీపంలోని ఖీర్ గధ్ వాగు నీటిమట్టం ఊహించని రీతిలో ప్రమాదస్థాయికి చేరుకుని ఒక్కసారిగా సమీప గ్రామాలపై విరుచుకుపడింది. స్వల్ప వ్యవధిలో ధరాలీ (Dharali), సుకీ(Sukhi) గ్రామాలను కొండకు చెరోవైపు నుంచి ఆకస్మిక వరద(Flash Floods) ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో.. గల్లైంతన వారి కోసం బుధవారం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటిదాకా ఐదు మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. మరో 130 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే భారీ వర్షం సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తోంది. అయినప్పటికీ సైన్యం ముందుకు వెళ్తోంది. శరణార్థులకు భోజనం, దుప్పట్లు ఇతర సదుపాయాలను అందిస్తోంది. పోలీస్, అగ్నిమాపక శాఖ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), భారత సైన్యం.. విపత్తు సహాయక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కనీసం 50 మంది గల్లంతై ఉండొచ్చని స్థానికుల సమాచారం ఆధారంగా అధికారులు ప్రకటన చేశారు. అయితే.. కేవలం కేరళ నుంచి 28 మందితో వచ్చిన ఓ బృందం ఆచూకీ లేకుండా పోవడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు వాతావరణ శాఖ మళ్లీ భారీవర్షాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. పర్వత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే.. ఉత్తరాఖండ్ ఎంపీలు ఇవాళ ప్రధాని మోదీని కలిసి సహాయక చర్యలపై విజ్ఞప్తి చేశారు. కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి పుష్పర్ ధామి ఉత్తర కాశీలో ఏరియల్ సర్వే నిర్వహించి అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. 🚨 "𝗦𝘄𝗶𝗳𝘁 𝘁𝗼 𝗥𝗲𝘀𝗽𝗼𝗻𝗱, 𝗖𝗼𝗺𝗺𝗶𝘁𝘁𝗲𝗱 𝘁𝗼 𝗣𝗿𝗼𝘁𝗲𝗰𝘁." 🪖📍Kheer Gad, Dharali Village | Uttarkashi | 1345 Hrs, 05 Aug 2025A massive mudslide struck #Dharali village in the #KheerGad area near Harsil, triggering sudden flow of debris and water through the… pic.twitter.com/FwPPMrIpqu— SuryaCommand_IA (@suryacommand) August 5, 2025 -
చైనాలో గోల్డ్ రష్..!
బీజింగ్: ఒకటీరెండూ కాదు..ఏకంగా 20 కిలోల బంగారం, వెండి నగలు...బంగారం, డబ్బు నిండుగా ఉన్న ఇనుప బీరువా..! చైనాలోని ఓ ఊళ్లో జనం వీటిని సొంతం చేసుకునేందుకు తెగ వెతుకుతున్నారు. కొందరు బురద మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. మరికొందరైతే ఏకంగా మెటల్ డిటెక్టర్లను పట్టుకుని తిరుగుతున్నారు. ఇదంతా నిధీ నిక్షేపాల కోసం మాత్రం కాదు..వరదల్లో కొట్టుకుపోయిన సొత్తు కోసం సాగుతున్న ఎడతెగని అన్వేషణ..! ఏం జరిగిందంటే..జూలై 25వ తేదీన షాంగ్జి ప్రావిన్స్‌లోని వుక్వి కౌంటీలో భారీ వర్షాలతో అనూహ్యంగా వరదలు వచ్చాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీటరు ఎత్తున వరద ఉప్పొంగి పట్టణాన్ని ముంచెత్తింది. ఆ వరద లావోఫెంగ్ జియాంగ్ దుకాణంలోకి కూడా ప్రవేశించింది. అధికార యంత్రాంగం వరద హెచ్చరికలతో ఆ రాత్రంగా జాగారం చేసిన దుకాణం సిబ్బంది, ఉదయం పూట యథా ప్రకారం దుకాణం తెరిచేందుకు ఉద్యుక్తులవుతున్నారు. బంగారం, ఇతర విలువైన సామగ్రిని సురక్షితంగా భద్రపర్చడం మర్చిపోయారు. సరిగ్గా ఆ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా వేగంగా వరద ప్రవాహం దుకాణంలోకి చేరింది. తేరుకునేలోపే నగలున్న ట్రేలు, కాబిన్లను ఊడ్చిపెట్టుకుపోయింది. నగదు, నగలతోపాటు ఒక ఐరన్ సేఫ్ సైతం వరదతో పాటు మాయమైంది. బంగారం గొలుసులు, ఉంగరాలు, గాజులు, బ్రాస్లెట్లు, వజ్రపు ఉంగరాలు, వెండి ఆభరణాలు, పచ్చలు పోయిన వాటిల్లో ఉన్నాయి. ఐరన్ సేఫ్‌లో పెద్ద మొత్తంలో నగదుతోపాటు, కరిగించిన బంగారం, కొత్త బంగారు వస్తువులు ఉన్నాయి. వెరసి దుకాణదారుకు వాటిల్లిన నష్టం మార్కెట్ ధర ప్రకారం రూ.12 కోట్లని అంచనా. ఈ సొత్తు కోసం దుకాణం యజమాని కుటుంబంతోపాటు సిబ్బంది రెండు రోజులుగా కాళ్లకు బలపం కట్టుకుని మరీ ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పోయిన వాటిలో సుమారు కిలో బంగారు ఆభరణాలు దొరికినట్లు అధికారులు చెబుతున్నారు. వరదల కారణంగా పట్టణంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో, సీసీటీవీ ఫుటేజీ వ్యవస్థ దెబ్బతింది. దీనివల్ల వరద సమయంలో దుకాణంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు సరైన ఆధారమంటూ లేకుండా పోయింది. ఎవరైనా ఈ వస్తువులను తీసుకెళ్లారా? లేక వరదలోనే కొట్టుకుపోయాయా అనేది నిర్థారించడం సైతం కష్టంగా మారింది. తమ నగల దుకాణానికి సంబంధించిన విలువైన వస్తువులను ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా తీసుకున్నట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని యజమాని హెచ్చరిస్తున్నారు. దుకాణంలోని వస్తువులు వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం తెలుసుకున్న స్థానికులు సైతం గాలింపు మొదలుపెట్టారు. వరదలకు కొట్టుకు పోయి న బురద, మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. కొందరు మెటల్ డిటెక్టర్లతోనూ వెదుకుతున్నారు. ఈ గోల్డ్ రష్కు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే, స్థానికులెవరూ దొరికిన వస్తువులను తమకివ్వలేదని దుకాణం యజమాని చెబుతున్నారు. అలా ఎవరైనా తీసుకుపోయినట్లు తెలిస్తే సమాచారమివ్వాలని స్థానికులను కోరుతున్నారు. తెచ్చిన వారికి ఆ వస్తువు విలువను బట్టి బహుమతులను సైతం ఇస్తామని ఆశచూపుతున్నారు.బీజింగ్‌లో వర్షాలు, వరదల్లో 44 మంది మృతి చైనా రాజధాని బీజింగ్‌ను భారీ వర్షాలు, వరదలు కకావికలం చేశాయి. శనివారం కురిసిన కుండపోత వానలు, వరదల్లో కనీసం 44 మంది చనిపోగా, 9 మంది గల్లంతయ్యారు. గత నాలుగు రోజులుగా బీజింగ్ సహాయక, రక్షణ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో మరోసారి భీకరంగా వాన కురియడంతో రహదారులు తెగిపోవడంతోపాటు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని జనాన్ని సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. బీజింగ్‌లో ఉత్తరాన ఉన్న పర్వతప్రాంత మియున్, యాంగ్వింగ్ జిల్లాల్లో అత్యధిక నష్టం వాటిల్లిందని అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. -
అమర్నాథ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత
శ్రీనగర్: పహల్గాం, బాల్తాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బుధవారం తెల్లవారుజామునుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేసినట్లు జమ్మూ కశశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధూరి తెలిపారు. రెండు మార్గాల్లోనూ కురుస్తున్న భారీ వర్షాలు బేస్ క్యాంపుల నుంచి యాత్రికుల రాకపోకలను ప్రభావితం చేశాయన్నారు.పరిస్థితి మెరుగుపడేవరకు బాల్తాల్, నున్వాన్ బేస్ క్యాంపుల వైపు ఎలాంటి రాకపోకలను అనుమతించబోని తెలిపారు. ఈ విషయంలో యాత్రికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తామని అధికారులు వెల్లడించారు. పరిస్థితులు మెరుగుపడితే యాత్రను తిరిగి ప్రారంభించే విషయాలను కూడా యాత్రికులకు తెలియజేస్తామన్నారు. జూలై మూడో తేదీన ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీతో ముగియనుంది.ఈ పవిత్ర వార్షిక యాత్ర కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తారు. యాత్రికులు రెండు మార్గాల్లో పుణ్య క్షేత్రానికి చేరుకుంటారు. ఒకటి 48 కిలోమీటర్ల పొడవైన పహల్గాం మార్గం కాగా, మరోటి నిటారుగా ఉన్న తక్కువ దూరమైన బాల్తాల్ మార్గం. ఈ ఏడాది ఇప్పటివరకు 3.93 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ను దర్శించుకున్నారు. -
Delhi: భారీ వర్ష సూచన.. వైమానిక సంస్థల హెచ్చరికలు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమాన ప్రయాణికుల సౌకర్యార్థం పలు విమానయాన సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.ఎయిర్ ఇండియా #TravelAdvisory Gusty wind and rain may impact flight operations to and from Delhi this morning.Please check your flight status here https://t.co/ZRtxRBbSY7… before heading to the airport and allow extra time for your journey.— Air India (@airindia) July 29, 2025 ఢిల్లీలో వర్షం కురుస్తున్న కారణంగా విమాన కార్యకలాపాలు ప్రభావితం కావచ్చని ఎయిర్ ఇండియా ప్రయాణికులకు తెలియజేసింది. విమానాశ్రయానికి వెళ్లే ముందు ప్రయాణికులు http://airindia.com/in/en/manage/fలో మీరు ప్రయాణం చేయబోయే విమాన స్థితిగతులను తెలుసుకోవాలని సూచించింది. మీ ప్రయాణానికి అదనపు సమయాన్ని కేటాయించాలని కోరింది. ఇండిగో Travel Advisory 🌂 A Rainy Day Reminder With heavy rainfall expected over #Delhi, we’re seeing a chance of delays and slower traffic to and from the airport. While we can’t control the skies, we’re doing everything possible to keep your journey steady on the ground.…— IndiGo (@IndiGo6E) July 29, 2025 ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ ప్రయాణికులకు వాతావరణ సంబంధిత ప్రయాణ హెచ్చరికలను జారీచేసింది. అదనపు ప్రయాణ సమయానికి ముందుగానే సిద్ధం కావాలని ప్రయాణికులను కోరింది. స్పైస్ జెట్ #WeatherUpdate: Due to bad weather in Delhi (DEL) and Dharamshala (DHM), all departures/arrivals and their consequential flights may get affected. Passengers are requested to keep a check on their flight status via https://t.co/2wynECYWr0.— SpiceJet (@flyspicejet) July 29, 2025 విమానయాన సంస్థ స్పైస్ జెట్ కూడా ప్రయాణికులకు ఇలాంటి హెచ్చరికను జారీ చేసింది. ఢిల్లీ, ధర్మశాలలో ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడనుంది. దీనిని గమనించాలని సూచించింది. భారత వాతావరణ శాఖ Delhi weather report: IMD predicts cloudy sky with moderate rain in national capital on Tuesday#DelhiRains #DelhiWeather #IMD https://t.co/rwVi0Riava— IndiaTV English (@indiatv) July 28, 2025 ఇంతలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవార మధ్యాహ్నం నాటికి వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆగస్టు 3 వరకు అంటే వచ్చే ఏడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలియజేసింది. -
ఐదు జిల్లాల్లో ఇంకా లోటే!
సాక్షి, హైదరాబాద్: వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు కాస్త బ్రేక్ పడింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న రైతులకు తాజా వర్షాలు భారీ ఊరటనిచ్చాయి. ప్రస్తుత గణాంకాలు సాధారణ స్థితిలో ఉన్నా, మరిన్ని వర్షాలు కురవాల్సిన అవసరముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నైరుతి సీజన్ వర్షపాత గణాంకాలు పరిశీలిస్తే... జూలై 27వరకు రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 33.40 సెంటీమీటర్లు కాగా, నమోదైన వర్షపాతం 33.68 సెంటీమీటర్లు. నెలాఖరు నాటికి 35.81 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. రెండ్రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినా, రేపట్నుంచి వర్షాలు మోస్తరుగా కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.అక్కడ ఇంకా లోటే...సీజన్ ప్రారంభం నుంచి దాదాపు ఆరువారాల వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్రంలో సగటు వర్షపాతం తీవ్ర లోటులో ఉంది. గతవారం రోజులుగా కురిసిన వర్షాలతో వర్షపాత గణాంకాలు అమాంతం పైకిలేచాయి. అయినా, ఐదు జిల్లాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది.⇒ మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జనగామ జిల్లాల్లో 20శాతం పైబడి లోటులో ఉన్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. లోటు వర్షపాతం ఉన్న మండలాల్లోఅత్యధికం ఉత్తర ప్రాంత జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు పంటల సాగుపై తీవ్ర ప్రభావాన్నే చూపునున్నాయి. ⇒ సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 20శాతం పైబడి వర్షాలు కురవడంతో ఆయా జిల్లాలు అధిక వర్షపాతం కేటగిరీలో ఉన్నాయి.⇒ మిగిలిన 23 జిల్లాల్లో వర్షపాత గణాంకాలు సాధారణ స్థితిలో నమోదయ్యాయి.నేడు..రేపు తేలికపాటి వానలురాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రస్తుతం రుతుపవన ద్రోణి బికనీర్, కోట, వాయువ్య మధ్యప్రదేశ్ దాని పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని అధికారులు చెబుతున్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది. వర్షపాత గణాంకాలు ఇలా.... మండలాల సంఖ్య లోటు 132సాధారణం 339అధికం 131అత్యధికం 132 -
‘తుంగభద్ర, శ్రీశైలం, గోదావరి’లో వరద హోరు
హొళగుంద/శ్రీశైలం ప్రాజెక్ట్/సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి శనివారం వరద నీరు పోటెత్తింది. సగటు ఇన్ ఫ్లో 44,348 క్యూసెక్కులుండగా.. గంటకు 46,500 క్యూసెక్కులు చొప్పున నీరు జలాశయంలోకి చేరుతోంది. మొత్తం 33 గేట్లలో 26 గేట్లను రెండున్నర అడుగుల మేర ఎత్తి 50 వేల క్యూసెక్కుల వరకు నీటిని నదికి వదులుతున్నారు. కాలువలకు 10 వేల క్యూసెక్కుల వరకూ విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి ఈ ఏడాది ముందుగానే వరద నీటి చేరిక మొదలైంది. దెబ్బతిన్న క్రస్టు గేట్లను దృష్టిలో ఉంచుకుని డ్యాం పూర్తిమట్టం 105.788 టీఎంసీలలో 80 టీఎంసీలకు నీటి నిల్వను కుదించడం తెలిసిందే. డ్యాం 105.788 టీఎంసీల నీటి సామర్థ్యంలో 77.907 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్‌కు కొనసాగుతున్న నీటి విడుదల శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల కొనసాగుతోంది. శుక్రవారం నుంచి శనివారం వరకు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,40,871 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. శ్రీశైలం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 156,722 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 6.80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నాగార్జునసాగర్‌కు క్రస్ట్‌గేట్ల ద్వారా 53,940 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన ద్వారా 68,846 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శనివారం సాయంత్రానికి శ్రీశైలం డ్యాం నీటిమట్టం 882.40 అడుగులకు చేరుకోగా.. జలాశయంలో 201.1205 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా, ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, శబరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి పోలవరం ప్రాజెక్టుకు 5.52 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. పోలవరం స్పిల్ వే 30.400 మీటర్ల ఎత్తు నుంచి 5.52 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు
-
హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
-
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. సాగర్ ఐలాండ్‌కు 80 కి.మీ, కలకత్తాకు వంద కి.మీ దూరంలో వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో వారం రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. 40-50 కిమీ వేగంతో ఈదుగు గాలులు వీస్తాయని పేర్కొంది.ఉత్తర కోస్తా తీరం వెంబడి ఉన్న కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక, దక్షిణ కోస్తాలో మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పార్టీలకు మొదటి ప్రమాద హెచ్చరికను విశాఖ వాతావరణ కేంద్రం జారీ చేసింది. మత్స్యకారుల వేటకు వెళ్లరాదని తెలిపింది. -
రాష్ట్రానికి రెండ్రోజులు ఎల్లో అలర్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 2.53 సెం. మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంలో గురువారం ఉదయం ఉపరితల ఆవర్తనం విలీనమైంది. దీంతో వచ్చే రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30–40 కి.మీ. వేగంతో కూడిన ఈదురుగాలులతో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. ఈ మేరకు రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3–6 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదవుతున్నాయి. గురువారం నల్లగొండలో 28.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి: సీఎం భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం... గురువారం సీఎంఓ అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు నమోదైన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వరద ఉధృతి ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షసూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని.. ప్రతి విభాగం అధికారితో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలని చెప్పారు. భారీ వర్షాలు, వరదల వల్ల ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు అవసరమైన సహాయక చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలని.. జిల్లా అధికారులు జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలన్నారు -
జలజల..జలపాతాలు
సాక్షి, నెట్వర్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతాలన్నీ పరవళ్లు తొక్కుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతం జాలువారుతోంది. పాల నురుగలు కక్కుతూ ఎగిసి పడుతున్న తుంపరులతో కనువిందు చేస్తోంది. కాగా, బొగత జలపాతం ఉప్పొంగి ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో తాత్కాలికంగా పర్యాటకుల సందర్శనను నిలిపివేసినట్టు ములుగు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీప దట్టమైన అడవిలోని భీమునిపాద జలపాతం జాలువారుతూ చూపరులను కనువిందు చేస్తోంది. బయ్యారం పెద్దగుట్టపై ఉన్న పాండవుల జలపాతం, చింతోనిగుంపు సమీపంలోని వంకమడుగు జలపాతం అందాలను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తున్నారు. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉన్న ఎత్తయిన కొండల మధ్య నుంచి జాలువారుతోంది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో దాదాపు 200 మీటర్ల ఎత్తు నుంచి ఈ జలపాతం పారుతోంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మందగూడ పంచాయతీ పరిధిలోని చింతలమాదర(తిర్యాణి) జలపాతం జలకళను సంతరించుకుంది. దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న నీళ్లు పాలధారను తలపిస్తున్నాయి. -
రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం విశాఖపట్నం సమీపంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో కొనసాగుతోంది. మరో ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గడ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడింది. వీటి ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.. దీంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 40నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు విస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అనేక చోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. అదేవిధంగా దక్షిణకోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
బంగాళాఖాతంలోకి ప్రవేశించిన ‘విఫా’.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. "విఫా" తుఫాన్.. చైనా, హాంకాంగ్‌లో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే.. "విఫా" తుఫాను అవశేషం... తీరం దాటిన తర్వాత బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. క్రమేపీ బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది.వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం తీరం వెంబడి గంటకు 60 కి.మీ గరిష్ఠ వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. గత 24 గంటల్లో గుంటూరు, మాచర్ల, నర్సీపట్నంలో 7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. -
కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే: సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా కలెక్టర్లంతా అప్రమత్తండా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈరోజు(సోమవారం, జూలై 21) జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో వర్షాలపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్.‘వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేయాలి. జూన్ నుంచి ఇప్పటి వరకు 21 శాతం వర్షపాతంనమోదైనా… గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్ని విభాగాలు అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో 150 బృందాలను ఏర్పాటు చేశాం. వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ రూం నుంచి సమన్వయం చేసుకుని ముందుగానే టీంలను పంపిస్తున్నాం. పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన ఉన్నతాధికారులు గ్రౌండ్ లో ఉండాలి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలి. జిల్లాల్లో పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలు నమోదు చేయాలి. గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ ప్రాంతాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పీహెచ్సీ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే. కలెక్టర్లు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నా. అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ప్రతీ రోజు కలెక్టర్ల కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి రిపోర్టును అందించాలని సీఎస్ ను ఆదేశిస్తున్నా. వర్షాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటికి సంబంధించి వాటర్ మేనేజ్మెంట్ ఉండాలి’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి,విశాఖపట్నం/సాక్షి, అమరావతి: దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఆలస్యంగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో కొనసాగుతూ నైరుతి వైపుగా వంగి ఉంది. దీనికి అనుబంధంగా దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకూ తూర్పు పశ్చిమ గాలుల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయి.పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందనీ.. తీరం వెంబడి గరిష్టంగా 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో నంద్యాల జిల్లా పెరుసోమలలో 7.8, అల్లూరి జిల్లా లంబసింగిలో 5.7, ఏలూరు జిల్లా మిర్జాపురంలో 5.3, కోనసీమ జిల్లా రామచంద్రపురం లో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసినా..మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. శనివారం ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, వైఎస్సార్ కడప జిల్లాల్లో 37 నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మరో రెండు రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం గ్రేటర్ హైదరాబాద్ సమీప జిల్లాల్లో జోరు వాన నమోదైంది. హైదరాబాద్, జనగామ, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, అదిలాబాద్ జిల్లాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లాల కలెక్టర్లకు సూచించింది. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు అంతంత మాత్రంగానే కురిశాయి. గత మూడు వారాలుగా వర్షాల జాడలేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 26.23 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 20.43 సెంటీమీటర్లు మాత్రమే కురిసింది. -
Nallakunta: ప్రతి సంవత్సరం వర్షం వస్తే ఇదే పరిస్థితి అంటూ కాలనీవాసుల ఆవేదన
-
పీకల లోతు వరద నీటిలో రిపోర్టింగ్, చివరకు..
పనిలో డెడికేషన్ అనాలో.. టీఆర్పీ కోసం పాకులాట అనాలో.. వ్యూస్ కోసం స్టంట్లు అనాలో.. ఈ ఘటన గురించి చదివాక మీ స్పందన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఒక జర్నలిస్ట్ లైవ్ రిపోర్టింగ్ చేస్తూ నీటిలో కొట్టుకుపోయాడంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన రావల్పిండిలోని చాహన్ డ్యామ్ వద్ద చోటుచేసుకుంది. రిపోర్టర్ పీకల లోతు వరద నీటిలో నిలబడి అక్కడి పరిస్థితి వివరిస్తున్నాడు. ఆ సమయంలో వరద ఉధృతికి ఆకస్మికంగా ప్రవాహం అతన్ని లోపలికి లాక్కెళ్లిపోయింది.A Pakistani reporter is swept away by strong currents during a live broadcast while covering the floods in neck-deep water.#Pakistan #Floods pic.twitter.com/0raCbYaoer— Al Arabiya English (@AlArabiya_Eng) July 17, 2025అయితే ఈ వీడియో అక్కడికి మాత్రమే కట్ అయ్యింది. అతను కొట్టుకుపోయాడని, ఇప్పటిదాకా అతని ఆచూకీ తెలీయకుండా పోయిందనేది సదరు వార్త కథనాల సారాంశం. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అతనిది మూర్ఖపు చర్య అని కొందరు, విధి నిర్వహణలో తప్పేం కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కెమెరామ్యాన్నెవర్డైస్ అంటూ మరికొందరు సరదా కామెంట్లు పెడుతున్నారు. అయితే.. మరికొందరు మాత్రం అతను అసలు రిపోర్టర్ కాదని, టిక్‌టాక్ లాంటి షార్ట్వీడియోస్ యాప్‌లలో వ్యూస్ కోసం ఇలాంటి స్టంట్లు చేస్తుంటాడని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అతను సురక్షితంగానే ఉండి ఉంటాడన్నది ఆ కామెంట్ల సారాంశం. అయితే.. ఫ్యాక్ట్ చెక్‌లో అతని పేరు అలీ ముసా రాజా(Ali Musa Raza)గా తేలింది. రూహీ అనే చానెల్లో అతను చాలా కాలంగా రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. అతను క్షేమంగానే ఉన్నాడా? అనే దానిపై ఆ చానెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా ఘటన నేపథ్యంలో పలువురు జర్నలిస్టులు సైతం అతనికి సంఘీభావం తెలుపుతున్నారు. అతను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. చీప్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కంటే ఇలాంటి ధైర్యమైన రిపోర్టర్లు సమాజానికి అవసరమని, అదే సమయంలో ఇలాంటివాళ్లు సురక్షితంగా కూడా ఉంటాలంటూ కామెంట్లు పెడుతున్నారు. రిపోర్టర్ అలీ ముసా రాజాకు ఇలాంటి స్టంట్లు కొత్తేం కాదు. కిందటి ఏడాది.. పంజాబ్ ప్రావిన్స్ సఖి సర్వర్ ఏరియాలో వరదలను నడుం లోతు నీళ్లలో కవర్ చేస్తూ వైరల్ అయ్యాడు కూడా. View this post on Instagram A post shared by NDTV WORLD (@ndtvworld)పాకిస్తాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది గత సంవత్సరం కంటే 124% ఎక్కువ వర్షపాతం అని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. తాజా వరదల ధాటికి ఆ దేశంలో ఇప్పటికే 180 మంది మరణించారు. అయితే.. ఒక్క పంజాబ్ ప్రావిన్స్‌లో 54 మంది ఒకే రోజులో మరణించడం గమనార్హం. -
మూడు రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. శుక్రవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు సైతం నమోదు కావొచ్చని అంచనా వేసింది. బికనీర్, సికార్, వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి నైరుతి ఉత్తరప్రదేశ్ వరకు వాయుగుండం కొనసాగుతోంది.ఇది క్రమంగా తూర్పు ఆగ్నేయ దిశలో కదిలి ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించనుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీనికి సమాంతరంగా ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్య తెలంగాణలో భారీ వర్షం..: శుక్రవారం రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురిశా యి. ప్రధానంగా మధ్య తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 50 చోట్ల 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. రా ష్ట్రంలో వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉదయం వరకు రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచి్చంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.జీహెచ్ఎంసీ సమీప జిల్లాల్లో భారీ వర్షం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల చక్రవాత ఆవర్తనం, దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు వర్షాలకు అనుకూలంగా మారాయి. దీంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌లోని కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో వచ్చే మూడు రోజులకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేశాం. – డాక్టర్ కే.నాగరత్న డైరెక్టర్, ఐఎండీ–హైదరాబాద్ -
ఏపీకి బిగ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అల్లూరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల పల్నాడు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.రుతు పవన గాలులు కొనసాగనున్నాయని.. 40-50 కిమీ వేగంతో గాలుల వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.మరోవైపు, తెలంగాణలొ గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని తెలిపింది. దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
ఏపీకి చల్లని కబురు.. వారం రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో నేడు, రేపు (శుక్ర,శని) భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో వారం రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.కోస్తా జిల్లాల్లో ఐదు రోజులపాటు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లాలో 12 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదయినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.రుతుపవనాలు ప్రవేశించి.. దాదాపు నెలన్నర అవుతున్నా.. లోటు వర్షపాతమే కొనసాగుతోంది. మండు వేసవిని తలపించేలా భానుడు భగభగలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో.. బ్రేక్మాన్సూన్ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎండలు.. లోటు వర్షపాతం నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.వారి అంచనాల ప్రకారం గురువారం నుంచి రాష్ట్రంలో వర్షాలు క్రమక్రమంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ వర్షాలు జోరందుకోనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులు పడే ప్రమాదం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
తెలంగాణకు అలర్ట్.. రెండురోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. వర్షాలు లేక రైతాంగం ఇప్పటికే తీవ్ర అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎండలు, ఉక్కపోతతో సామాన్య ప్రజానీకం సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో.. రేపు(గురువారం) నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. అలాగే.. ఎల్లుండి మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్ష పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో పడొచ్చని హెచ్చరించింది.రాజధాని హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం లేదంటే రాత్రి తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని 340 మండలాల్లో ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జిల్లాలుఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లిభూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెంనల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండరంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ఈదురుగాలులు: గంటకు 30–40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.⚠️ హెచ్చరికలు:పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో సురక్షితంగా ఉండాలని సూచనచెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు -
1.6 లక్షల మంది నిరాశ్రయులు
న్యూఢిల్లీ: దేశంలో ప్రకృతి విపత్తులు పంజా విసురుతూనే ఉన్నాయి. భారీ వర్షాలు, భీకరమైన వరదల కారణంగా పెద్ద సంఖ్యలో జనం నష్టపోతున్నారు. శాశ్వత లేదా తాత్కాలిక ఇళ్లు, ఆవాసాలు కోల్పోయి నిరాశ్రయులుగా మారుతున్నారు. 2024లో దేశంలో 400కుపైగా ప్రకృతి విపత్తులు చోటుచేసుకున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో చూస్తే ఇదే అత్యధిక కావడం గమనార్హం. గత ఏడాది విపత్తుల వల్ల 1.18 లక్షల మందికిపైగా జనం నిరాశ్రయులయ్యారని ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ వెల్లడించింది. 2023 కంటే 2024లో నిరాశ్రయుల సంఖ్య 30 శాతం అధికం అని తెలియజేసింది. 2021లో 22,000 మంది, 2022లో 32,000 మంది ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డారని పేర్కొంది. ప్రకృతి విపత్తులు ప్రతిఏటా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2019 నుంచి 2023 మధ్య 281 విపత్తుల ఘటనలు చోటుచేసుకున్నాయి. 2024లో మాత్రం ఏకంగా 400కు పైగా విపత్తులు సంభవించాయి. గత ఆరేళ్లలో జనం నిరాశ్రయులు కావడానికి వరదలు 55 శాతం, తుఫాన్లు 44 శాతం కారణమని తేలింది. కొండ చరియలు విరిగిపడడం, భూకంపాలు, కరువుల వల్ల కూడా జనం ఆశ్రయం కోల్పోతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే అధికం 2024లో 1.18 లక్షల మంది నిరాశ్రయులు కాగా, 2025లో మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా 1.6 లక్షల మంది బాధితులుగా మారిపోయినట్లు ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. పశ్చిమ బెంగాల్‌తోపాలు ఈశాన్య రాష్ట్రాల ప్రజలే అధికంగా ప్రకృతి విపత్తుల బారినపడుతున్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 80,000 మంది నిరాశ్రయులయ్యారు. -
ఢిల్లీలో భారీ వర్షం.. రోడ్లపై నిలిచిపోయిన నీరు
-
బ్యాంకులోకి చేరిన వరద.. జనం కాపలా
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటం తెల్సిందే. మండి జిల్లాలోని థునాగ్ పట్టణంలోని రాష్ట్ర సహకార బ్యాంకు కార్యాలయంలోకి వరద నీరు చేరింది. రెండంతస్తుల ఈ భవనం మొదటి అంతస్తు వరద, చెత్తాచెదారంతో నిండిపోయింది. వరద తీవ్రతకు బ్యాంకు షట్టర్ ఒకటి ఊడిపోగా మరో రెండు షట్టర్లు వంకర్లు తిరిగి ఊడిపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. బ్యాంకులో ఖాతాదార్లు తాకట్టు పెట్టిన, లాకర్లలో భద్రంగా ఉంటుందని భావించిన లక్షలాది రూపాయల విలువైన నగలు, విలువైన పత్రాలు, కోట్లాది రూపా యల డబ్బు ఉన్నట్లు సమాచారం. అయితే, నష్టం వివరాలు వెల్లడి కాలేదు. చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించిన తర్వాతే నష్టాన్ని అంచనా వేసేందుకు వీలుంటుందని చెబుతున్నారు. థునాగ్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఈ బ్యాంకులో నిత్యం 150 మంది వరకు వ్యాపా రులు లావాదేవీలు జరుపుతుంటారు. ఎనిమిదివేల జనాభా కలిగిన థునాగ్ పట్టణంలో బ్యాంకు ఇదొక్కటే. వరదల కారణంగా కొట్టుకువచ్చిన విలువైన వస్తువులను ఎవరైనా ఎత్తుకుపోయే ప్రమాదము ందని భావిస్తున్న స్థానికులు నిత్యం కాపలా కాస్తున్నారు. జూన్ 20–జూలై 6వ తేదీల మధ్య హిమాచల్‌లో భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
హిమాచల్‌లో వర్షాలతో నష్టం
న్యూఢిల్లీ: గడిచిన రెండు వారాలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర నష్టం సంభవించింది. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 43 మంది మృతి చెందగా 37 మంది కనిపించకుండా పోయారు. ఒక్క మండి జిల్లాలోనే 17 మంది చనిపోగా, 31 మంది గల్లంతయ్యారు. జూన్ 20వ తేదీ నుంచి హిమాచల్‌లో కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల కారణంగా రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. వచ్చే మంగళవారం వరకు వర్షాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్‌లోని భిమ్‌టల్‌లో గురువారం ఉప్పొంగుతున్న జలాశయంలో మునిగి నేవీకి చెందిన ఇద్దరు సిబ్బంది చనిపోయారు. పఠాన్ కోట్కు చెందిన ప్రిన్స్ యాదవ్(22), బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన సాహిల్ కుమార్(23)గా వీరిని గుర్తించారు. నైనిటాల్ నుంచి సరదాగా గడిపేందుకు వచ్చిన 8 మంది ఐఏఎఫ్ సిబ్బందిలో వీరున్నారు. వర్షాల కారణంగా రాష్ట్రంలోని 100కు పైగా రహదారులను మూసివేశారు. చార్ధామ్ యాత్రకు అంతరాయం కలిగింది. యమునోత్రికి వెళ్లే జాతీయ రహదారిపై ఐదు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడి ఈ రహదారిపైనున్న సిలాయి మలుపు వద్ద 12 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో, 9 మంది నిర్మాణ కార్మికులు కొట్టుకుపోయారు. వీరి కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మండ్లా, సియోని, బాలాఘాట్ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. జబల్పూర్–మండ్లా జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అదేవిధంగా, రాజస్తాన్‌లోని జైసల్మీర్ జిల్లా పొఖ్రాన్‌లో 128 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. -
హిమాచల్‌పై వరుణుడి పంజా.. 63 మరణాలు, 400 కోట్ల నష్టం
సిమ్లా: ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అయ్యింది. కుండపోత వర్షంతో హిమాచల్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి. రాష్ట్రంలోని బియాస్ నది సహా ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటికి 63 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. రూ.400 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. జూలై ఏడో తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.హిల్‌స్టేట్ హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. కార్లు కొట్టుకుపోయాయి. ఈ వర్షాలకు మండి జిల్లా తీవ్ర విధ్వంసానికి గురైంది. భారీ వర్షాలు, వరదలకు దాదాపు 400కుపైగా రోడ్లను అధికారులు మూసివేశారు. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 63కి పెరిగింది. మరో 40 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. అనేక మంది గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. రూ.400 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు.VIDEO | Himachal Pradesh: Flash flood triggered by cloudburst causes severe damage in Thunag tehsil of Mandi district. Several houses damaged.#HimachalCloudburst #HimachalNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/XjM8R2jJHA— Press Trust of India (@PTI_News) July 4, 2025 शिमला : ढली के लिंडीधार में भारी लैंडस्लाइड - फोरलेन का डंगा गिरा - सैंकड़ों सेब के पेड़ दबे।घर छोड़ भागे लोग, 5 घरों को खतरा।#Shimla #Dhali #Landslide #HimachalNews #DDNewsHimachal pic.twitter.com/dKaekscobU— DD News Himachal (@DDNewsHimachal) July 3, 2025మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. జూలై 5న సిమ్లా, సోలన్, సిర్మౌర్, జూలై 6న ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, కాంగ్రా, చంబా, మండి జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఈ మేరకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇప్పటికే వర్షప్రభావం ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితం ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.Whoahh, that was close!!A massive landslide hit the Shillai area of Sirmaur district, Himachal Pradesh, India today, along National Highway 707 👀pic.twitter.com/nVvfZWty90— Volcaholic 🌋 (@volcaholic1) May 30, 2025Big houses, rocks all got washed away in the flood but "Pandav Shila" in Himachal Pradesh did not move from the place where it was, this is no less than a miracle. pic.twitter.com/pnhWE9Rp3I— Frontalforce 🇮🇳 (@FrontalForce) July 4, 2025🚨HEAVY RAINS TRIGGER CLOUD BURSTS AND FLOODING IN HIMACHAL PRADESH, INDIA.Cloud bursts in Karsog area, Mandi, cause 1 death and 7 missing.Vehicles swept away and 16 MW power project destroyed.Beas River floods intensifySchools and colleges closed; statewide alert active pic.twitter.com/ucXSbYhviD— Weather Monitor (@WeatherMonitors) July 1, 2025 -
హిమాచల్‌లో కుంభవృష్టి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వాన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆకస్మికంగా సంభవించిన వరదల్లో ఐదుగురు చనిపోగా, మరో ఐదుగురు గాయాల పాలయ్యారు. మరో 16 మంది గల్లంతయ్యారు.24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 225.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పదకొండు చోట్ల కుండపోత వాన, నాలుగు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించగా, ఒక చోట భారీగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. -
250 రోడ్లు మూసివేత.. 130 చోట్ల కరెంట్ కట్
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దాదాపు రాష్ట్రమంతటా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. కనీసం 130 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. వరద చేరడం, ధ్వంసం కావడం వంటి కారణాలతో 250 రోడ్లను అధికారులు మూసివేశారు. ఇందులో అత్యధికంగా సిర్మౌర్ జిల్లాలో 57, మండి జిల్లాలో 44 రోడ్లున్నాయి. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడే అవకాశమున్న 22 ప్రాంతాలకుగాను 18 చోట్ల ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. కంగ్రా, మండి, సిర్మౌర్, సొలాన్ జిల్లాల్లో సోమవారం స్కూళ్లను మూసివేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. పర్యాటక ప్రాధాన్యమున్న సిమ్లా–కల్కా రైలు మార్గంపైన చేరిన రాళ్లు, చెట్లను తొలగించే రాకపోకలకు వీలు కల్పించారు. గత 24 గంటల్లో చనిపోయిన ముగ్గురితో కలిపి ఈ సీజన్లో వర్షాల సంబంధిత ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20కి చేరిందని అధికారులు తెలిపారు. సిమ్లా–కల్కా ఐదో నంబర్ జాతీయ రహదారిపై కోటి సమీపంలో కొండచరియలు విరిగి పడటంతో గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. -
కేరళలో విషాదం.. భారీ వర్షాలకు కుప్పకూలిన పాత భవనం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. తాజాగా.. త్రిస్సూర్ సమీపంలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో 27 మంది భవనంలో చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఇప్పటికే 14 మంది బయటకు తీసుకొచ్చింది. తిరువనంతపురం: భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. శుక్రవారం ఉదయం కొడకర ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలి ముగ్గురు మరణించారు. భవనం పాతదని, అందులో వలస కార్మికులు నివసిస్తున్నారని సమాచారం. మరణించిన ముగ్గురూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికులేనని అధికారులు ప్రకటించారు. మృతులు:రాహుల్ (19) – ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిరుపెల్ (21) – మృతదేహంగా వెలికితీశారుఅలీమ్ (30) – శవంగా గుర్తింపుసుమారు 40 ఏళ్ల భవనం కావడం, లాటరైట్ ఇటుకలతో నిర్మించబడడంతో భారీ వర్షాలకు కూలి ఉంటుందని అధికారులు పప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ బిడ్డింగ్ పక్కనే కొడకర పంచాయతీ కార్యాలయం ఉన్నప్పటికీ.. ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం ఫైర్, రెస్క్యూ బృందాలు జేసీబీలు, భారీ యంత్రాలు ఉపయోగించి శిథిలాలను తొలగిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం: కోస్తాలో విస్తారంగా వర్షాలు
విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తరకోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం పడే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని, గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని నాగంపల్లెలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ రూరల్‌లో 3.7, ఎనీ్టఆర్ జిల్లా మునకుళ్లలో 3.6, అల్లూరి జిల్లా కూనవరంలో 3.5, విశాఖ జిల్లా ఎండాడ, సీతమ్మధారలో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ ప్రకటించింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: ఐఎండీ సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆదే ప్రాంతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీంతో పాటుగా మరోక ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు.వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40-60కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు. రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.గురువారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.శుక్రవారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.శనివారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.ఆదివారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.కాగా, బుధవారం సాయంత్రం 5గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లెలో 49 మిమీ, విశాఖ రూరల్ 37.7మిమీ, ఎన్టీఆర్ జిల్లా మునకుళ్ళలో 36.5మిమీ, అల్లూరి జిల్లా కూనవరంలో 35.7మిమీ, విశాఖ జిల్లా ఎండాడలో 35.7మిమీ, సీతమ్మధారలో 35.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ): ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో 4.8, అన్నమయ్య జిల్లా గుండ్లపల్లిలో 4.4, విజయనగరం జిల్లా గుల్లసీతారామపురంలో 4.0, నంద్యాల జిల్లా చౌతకూరులో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా తడలో అత్యధికంగా 8.3 సెంటీమీటర్ల వర్షం పడింది. నాగలాపురంలో 7.9 సెంటీమీటర్లు, పల్నాడు జిల్లా మాచర్లలో 7.1, తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకచర్లలో 6.7, చిత్తూరు జిల్లా యాదమర్రిలో 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం శుక్రవారానికి ఉత్తర కర్ణాటక దానికి ఆనుకుని ఉన్న తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరో ద్రోణి పశ్చిమ–మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఒడిశా తీరం వరకు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
జల్దీ ఇల్లు కట్టుకోండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదల కోసం ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, ఇప్పటికి పనులు మొదలైనవి 69 వేలు మాత్రమే. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండో సంవత్సరం కొనసాగుతుండటంతో మరో 4.50 లక్షల ఇళ్ల నిర్మా ణానికి కూడా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ నేప థ్యంలో ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది.అసలే పనుల ప్రారంభంలో ఆలస్యం జరుగుతుండగా, ప్రస్తుతం వానాకాలం కూడా మొదలు కావటంతో ఇళ్ల నిర్మాణం మరింత మందగించనుంది. భారీ వర్షాలు ప్రారంభమైతే అసలు పనులే చేపట్టేందుకు జనం ఆసక్తి చూపరు. వ్యవసాయ పనులు ఊపందుకుంటే పనుల్లోకి వెళ్లేందుకే మొగ్గు చూపుతారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా చూడాలని గృహనిర్మాణ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి త్వరగా పనులు ప్రారంభించాలని సూచిస్తున్నారు. పూర్తయిన ఇళ్లు రెండే..కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు కూడా ఉన్నాయి. దీంతో వీటి నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవలి నుంచే లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు జారీ చేస్తుండటంతో నెల రోజులుగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 69 వేల ఇళ్లు మాత్రమే మొదలయ్యాయి. వాటిల్లో పూర్తయినవి రెండు మాత్రమే. 15 వేల ఇళ్లకు మాత్రమే ఇప్పటివరకు ఆర్థిక సాయం పంపిణీ జరిగింది.ఇందులో 10 వేల ఇళ్లకు సంబంధించి తొలి విడత బేస్మెంట్ లెవల్ నిధులు రూ.లక్ష చొప్పున విడుదల కాగా, మూడు వేల ఇళ్లకు రెండో విడత, మరో రెండు వేల ఇళ్లకు గోడలకు సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. మొత్తంగా రూ.100 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. నిధులకు ఇబ్బంది లేదని, ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. భారీ వర్షాలు పడితే ఇసుకకూ కష్టమే..రాష్ట్రంలో వానాకాలం మొదలు కావటంతో భారీ వర్షాలు కురిస్తే ఇళ్ల నిర్మాణ పనులకు ఆటంకాలేర్పడతాయని అధికార యంత్రాంగం భయపడుతోంది. దీంతో వర్షాలు ఊపందుకోక ముందే వీలైనన్ని ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని భావిస్తోంది. ఈ ఇళ్లకు కావాల్సిన ఇసుకను వాగులు, వంకల నుంచి సేకరించి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. భారీ వర్షాలు కురిసి వాగులు నీటితో నిండిపోతే ఇసుక సేకరణ కూడా కష్టమవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈలోపే వీలైనంత మందికి ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించారు. అది జరగాలంటే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలి. ఇందుకోసం బృందాలుగా అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వెంటనే పనులు మొదలుపెట్టాలని కోరుతున్నారు. -
వైపరీత్యం..పెరుగుతోంది ప్రాణ నష్టం
దేశంలో వైపరీత్యాలు ఏటికేటికీ పెరుగుతున్నాయి. ఇవి ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమవుతున్నాయి. భూకంపాలు, వరదలు, అకాల వర్షాలు, కొండ చరియలు విరిగిపడడం, సుడిగాలులు..ఇలా జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పులి మీద పుట్రలా ప్రజా జీవనాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇందుకు తాజాగా భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే నిదర్శనం. సాక్షి, న్యూఢిల్లీః దేశంలో గత ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా మానవ మరణాల సంఖ్య గణనీయంగా ఉందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా విడుదల చేసిన ఎనీ్వస్టాట్స్ ఇండియా–2025 (పర్యావరణ గణాంకాలు) నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వరదలు, పిడుగుపాట్లు, వడగాడ్పులు, భారీ వర్షాలు వంటి వైపరీత్యాలతో 2024–25 ఏడాదిలో దేశంలో ఏకంగా 3,080 మంది మరణించినట్లు తెలిపింది. 2013–14 ఏడాదిలో సంభవించిన మానవ మరణాల తర్వాత అత్యధిక మరణాలు గత ఏడాదే సంభవించినట్లు పేర్కొంది. నివేదికలో అంశాలివీ.. ⇒ గడిచిన 25ఏళ్లలో అంటే 2001–02 నుంచి చూస్తే అత్యధిక మరణాలు 2007–08లో 3,764, 2008–09లో 3,405, 2013–14లో 5,677 నమోదు కాగా, ఆ తర్వాత గత ఏడాదే అత్యధికంగా 3,080 మరణాలున్నాయి. ⇒ పశు మరణాల సంఖ్య మాత్రం గత ఏడాది గణనీయంగా తగ్గింది. అత్యధికంగా 2006–07లో 4,55,619 మరణించగా, 2023–24లో 1,19,683 గతేడాది 61,966 చనిపోయాయి. ⇒ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇళ్లు ›కూలడం వంటి నష్టాలు 2007–08లో ఏకంగా 35.27లక్షలుండగా, 2023–24లో 1.40లక్షలు, 2024–25లో మాత్రం 3.64లక్షలుగా ఉంది. ⇒ 2007–08లో 85.13లక్షల హెక్టార్లలో పంట నష్టం జరగ్గా, 2023–24లో 13.39లక్షల హెక్టార్లు, 2024–25లో 14.24 లక్షల హెక్టార్లుగా ఉంది. -
ముందస్తు నివారణ చర్యలే మేలు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో తీవ్ర నష్టం జరిగిన తరువాత స్పందించడం కంటే.. నష్టం జరగకముందే నివారణ చర్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) చెపుతున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి గురువారం సచివాలయంలో ప్రకృతి విప త్తుల నిర్వహణ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధి కారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ హైదరాబాద్ తరహాలోనే జిల్లాల్లో వరదల ముప్పును ఎదుర్కొనేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. విపత్తుల నిర్వహణ విభాగం బలోపేతానికి హైడ్రా కమిషనర్, అగి్నమాపక డీజీ, విపత్తుల నిర్వహణ కమిషనర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్, నీటిపారుదల, ఆర్అండ్బీ, ఆరోగ్య శాఖల కమిషనర్లతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని వివరించారు. తర్వాత కమిటీ నివేదిక ప్రకారం చర్యలు చేపడ్తామని తెలిపారు. వర్షాకాలం ముందుస్తుగానే వచ్చిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని వైపరీత్యాల ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించాలని మంత్రి ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చే భారీ వర్షాల వల్ల ఊహించని వరదలు వస్తున్నాయని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పరీవాహక ప్రాంతాల్లోని నివాసితులను గుర్తించి వారిని అక్కడి నుంచి శాశ్వతంగా తరలించి, వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మూసపద్ధతికి స్వస్తి చెప్పండి.. విపత్తుల నిర్వహణ విభాగం మూసపద్ధతికి స్వస్తి చెప్పి, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పద్ధతులను, పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులను కోరారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆయా జిల్లాల్లో పరిస్థితులను బట్టి వరదల కార్యాచరణ ప్రణాళికలను ఈనెల 30వ తేదీలోగా తయారు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే వరద నియంత్రణ కట్టలు, చిన్న–మధ్య తరహా కాల్వలు, వర్షపు నీటి డ్రెయిన్లు.. మొదలైన వాటిని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలన్నారు. బోట్లు, లైఫ్ జాకెట్లు, అత్యవసర ఆహార కిట్లను ముందే సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని, స్థానిక సహాయక బృందాలను ఏర్పాటు చేసి, వారికి బాధితులను తరలించడం, తక్షణ స్పందన చర్యలపై శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్, విపత్తుల నిర్వహణ కమిషనర్, అగ్నిమాపక విభాగం డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పంచాయితీరాజ్ కమిషనర్ సృజన, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
దంచికొట్టిన వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ): ఈశాన్య రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం నుంచి బుధవారం వరకూ 24 గంటల వ్యవధిలో ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో 15.5 సెం.మీ. వర్షం కురిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 10, గుడివాడలో 9.4, చల్లపల్లి మండలం పురిటిగడ్డలో 9.3, బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.9 సెం.మీ. వర్షం కురిసింది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటు బాయిలో 7.2 సెం.మీ. వర్షం పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 6.5, అంబేడ్కర్ కోనసీమ జిల్లా తాతపూడిలో 4.7, ప్రకాశం జిల్లా కొలుకులలో 4.4, ఆత్రేయపురంలో 4.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ద్రోణి ప్రభావంతో మరో రెండు, మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు బిగ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: రానున్న 24 గంటల్లో ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బాపట్ల, కృష్ణ, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉత్తరాంధ్ర తీరానికి అనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాతావరణం.. రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారింది. నిన్న గుడివాడలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. కైకలూరు, మచిలీపట్టణం 7, ఏలూరు 6, నూజివీడు, భీమడోలు, రేపల్లె 5 సెంటీమీటర్ల, లేపాక్షి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
రాష్ట్రంలో నాలుగైదు రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: వచ్చే నాలుగైదు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ నుంచి పశి్చమ మధ్య బంగాళాఖాతం వరకు, ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్, మధ్య ఒడిశా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కోస్తా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధానంగా 11, 12 తేదీల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వివరించింది. మరోవైపు కొన్నిచోట్ల ఉక్కపోతతోపాటు ఎండ ప్రభావం ఉంటుందని తెలిపింది. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 4.3 సెంటీమీటర్లు, శ్రీకాకుళంలో 4.2, విశాఖ జిల్లా ఆనందపురంలో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ప్రకాశం జిల్లా వేమవరంలో 40 డిగ్రీలు, కొనకనమిట్లలో 39.9, తిరుపతి జిల్లా మంగ నెల్లూరు 39.9, వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. -
ఏపీకి ఐఎండీ బిగ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: ఏపీకి భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే వారం రోజులు వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుందని చెబుతూ.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన చేసింది. అదే సమయంలో దక్షిణ కోస్తాలోనూ విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తర ఒడిశాను అనుకుని ఉన్న బంగాళాతంలో ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతోంది. రుతుపవనాల పురోగతికి మారిన వాతావరణం అనుకూలంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్ పూర్ వరకు నైరుతి విస్తరించి ఉంది. తీరం వెంబడి ఇప్పటికే గరిష్టంగా 40కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆవర్తన ప్రభావంతో పాతపట్నంలో 5, పార్వతీపురంలో 5 ,టెక్కలి.. సాలూరు.. శ్రీకాకుళం.. ఆనందపురంలో 4, విజయనగరం, కళింగపట్నం. అనకాపల్లిలో 3 సెంమీ చొప్పున వర్షపాతం నమోదు అయ్యింది. -
ఈ నగరాలు...సముద్రం పాలు!
నదీజలాలు. నాగరికతకు పుట్టినిళ్లు. అత్యంత భారీ వర్షాలు వచ్చినప్పుడు ఉగ్రరూపంలో ఉప్పొంగినా తర్వాత సాధారణ స్థితికి వచ్చి మానవులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కానీ సముద్రజలాలు అలాకాదు. ప్రపంచవ్యాప్తంగా సముద్రతీరమున్న ఎన్నో పట్టణాలను ఇప్పుడు సముద్రజలాల పెరిగే నీటిమట్టాలు అక్కడి ప్రజల్లో ఆందోళన మట్టాలను అమాంతం పెంచేస్తున్నాయి. తరతరాలుగా తీరప్రాంతాల్లోనే స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని ఉంటున్న స్థానికులను సాగరజలాలు ఇప్పుడు బద్ధశత్రువుగా మారాయి. తీవ్రమైన వ్యాధి శరీరాన్ని కబళించినట్లు ఈ సముద్రజలాలు నెమ్మదిగా ఆయా తీరప్రాంతాల సమతల భూభాగాలను శాశ్వతంగా తనలో కలిపేసుకుంటున్నాయి. శరవేగంగా పెరుగుతున్న సముద్ర నీటిమట్టాలు ఇప్పుడు కోట్లాది మంది ప్రజలకు కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డజనుకుపైగా తీరప్రాంతాల్లో సముద్ర నీటిమట్టాలు ఇటీవలికాలంలో చాలా అత్యధిక వేగంతో పెరుగుతున్నాయని సింగపూర్‌లోని నాంయాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ(ఎన్టీయూ) శాస్త్రవేత్తలు కుండబద్దలు కొట్టారు. 2014 నుంచి చూస్తే గత ఆరేళ్లలోనే ఏటా ఒక సెంటీమీటర్ ఎత్తు సముద్రజలాల నీటిమట్టం పెరుగుతూ తీరప్రాంతాలను శాశ్వతంగా ముంచేసినట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, ద.అమెరికా ఖండాల్లో 48 తీరనగరాలకు తీరనిశోకంగా సాగరజలాలు మారాయని అధ్యయనం పేర్కొంది. వాతావరణ మార్పులకుతోడు కుంగిపోతున్న భూమి కారణంగా ఈ సమస్య తీవ్రమవుతోందని తేలింది. రెండేళ్ల క్రితం ఈశాన్యచైనాలోని తియాంజిన్ నగరంలో తీరప్రాంత వీధులన్నీ కుంగడంతో వేలాది మందిని అపార్ట్మెంట్ల నుంచి హుటాహుటిన ఖాళీ చేయించారు. 2014 నుంచి 2020 ఏడాది వరకు చూస్తే తియాంజిన్ నగర భూభాగం ఏటా 18.7 సెంటీమీటర్లమేర కుంగింది. సముద్రజలాలు పెరిగి భూగర్భజలాలు పెరగడంతో నేల కుంగింది. ముంపు బారిన ముంబై దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరాన్నీ ముంపు సమస్య పట్టిపీడిస్తోంది. 2014 నుంచి చూస్తే సంవత్సరానికి 0.01 సెం.మీ.ల నుంచి 5.9 సెంటీమీటర్ల స్థాయిలో ముంబైలోని చాలా ప్రాంతాలను సముద్రనీరు ముంచేసింది. ఏటా 1 సెం.మీ.చొప్పున నేల సముద్రజలాల్లో కలిసిపోతున్న చోట్ల 62 లక్షల మంది జీవిస్తున్నట్లు ఎన్టీయూ అధ్యయనకారులు ప్రకటించారు. మాతుంగా ఈస్ట్‌లోని కింగ్ సర్కిల్ స్టేషన్ ప్రాంతం వేగంగా ముంపునకు గురవుతోంది. ఇక్కడ ఏటా 2.8 సె.మీ.ల మేర సముద్రజలాలు పెరుగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా సాగరజలాలు గత ఏడాది 0.59 సెంటీమీటర్లమేర ఎగిశాయని నాసా అధ్యయనంలో స్పష్టమైంది. భూగర్భజలాలను విచ్ఛలవిడిగా తోడేయడం, ఊహించనంత బరువుతో ఆకాశహర్మ్యాలను నిర్మించడం, నిరాటంకంగా కొనసాగుతున్న మెట్రో ప్రాజెక్ట్ పనులు, చిత్తడినేలలను ప్రభుత్వాలు పునరుద్ధరించడం తదితర కారణాలు సైతం మహానగరంలోకి సాగరజలాలు చొచ్చుకొచ్చేలా చేస్తున్నాయి. కనీసం 50 లక్షల జనాభా ఉన్న సముద్రతీర నగరాల వెంట సముద్రనీటిమట్టాలు పెరుగుతున్న అంశాన్ని ఉపగ్రహాల సాయంతో విశ్లేషించి ఈ అధ్యయనం చేశారు. అగ్రరాజ్యంలోనూ.. అమెరికాలోని మయామీ సిటీని సాగరజలాలు ముంచెత్తుతున్నాయి. 2014 నుంచి 2020 వరకు చూస్తే మయామీ సిటీలో కోకోనట్ గ్రోవ్సహా చాలా ప్రాంతాలు గరిష్టంగా 2.2 సెంటీమీటర్లమేర సముద్రజలాల మట్టాలు పెరిగాయి. ఏటా 1 సెం.మీ. సముద్రనీరు పెరుగుతున్న ప్రాంతాలు 43,000 మందికిపైగా అమెరికన్లు నివసిస్తున్నారు. న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ పరిధిలోని బ్రీజీ పాయింట్ వద్ద నీరు ఏటా 3 సె.మీ.ల మేర పెరుగుతోంది. ఇక్కడ ఏటా 1 సెం.మీ. సముద్రనీరు పెరుగుతున్న చోట 1,03,000 మందికిపైగా అమెరికన్లు నివసిస్తున్నారు. లాస్ ఏంజెలిస్ సిటీలోని శాన్ పెడ్రో సహా పలు తీర ప్రాంతాల్లో నీరు ఏటా 2.5 సె.మీ.ల మేర పెరుగుతోంది. హ్యూస్టన్ సిటీ పరిధిలో గరిష్టంగా ఏకంగా 11 సెం.మీ. మేర సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. హ్యూస్టన్‌లోని సెంట్రల్ సౌత్‌వెస్ట్ ప్రాంతంలో ఏటా 8 సెం.మీ.ల మేర సముద్రనీరు పైకొస్తోంది.కొత్త పరిష్కారం చూపుతున్న జపాన్ భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు చేస్తున్న జపాన్ ఇప్పుడు సముద్రమట్టాల పెరుగుదల ముప్పుకూ మరో పరిష్కారం వెతికింది. విచ్ఛలవిడిగా భూగర్భజలాలను వాడడంతో నేల కుంగి పరోక్షంగా సముద్రనీరు చొచ్చుకొస్తున్న నేపథ్యంలో గ్రౌండ్‌వాటర్ అతి తోడివేతకు చెక్ పెట్టింది. ఈ విషయంలో కఠిన నిబంధనలను అమలుచేస్తోంది. పటిష్టవంతమైన నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటుచేసింది. 2014 ఏడాది నుంచి చూస్తే 0.01–2.3 సె.మీ.ల స్థాయిలో నేల కుంగినా ఇప్పుడు మాత్రం ఆ దురవస్థ నుంచి కాస్తంత బయటపడింది. ఎగువ ప్రాంతాలు, అడువులు, నదుల నుంచి సిటీ వైపుగా వచ్చే నీటిని నగరానికి దూరంగా ఉన్న రెండు రిజర్వాయర్లలో నింపుతోంది. అక్కడి నుంచి అవసరమైన మేరకే నీటి నగరంలో జనావాసాలకు, పరిశ్రమలకు సరఫరాచేస్తోంది. అయితే జపాన్ మోడల్ అన్ని దేశాలకు పనికొస్తుందో లేదో తెలీదు. పైగా ఇది అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారమని జపాన్‌లోని వసేడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ మిగూయెల్ ఎస్తిబాన్ అభిప్రాయపడ్డారు. భూగర్భజలాల అతి తోడివేతను తగ్గించుకుని తైపే నగరం ఈ సమస్య నుంచి కాస్తంత బయటపడింది. దీనికితోడు బ్యాంకాక్, అమెరికాలోని హ్యూస్టన్, బ్రిటన్‌లోని లండన్ నగరాలు సైతం భూగర్భజాలాల అతివాడకానికి చరమగీతం పాడాయి.భూగర్భజలాలు పైకి రావడానికి కారణాలెన్నో.. తీర ప్రాంతాల వెంట భవనాల నిర్మాణం, గనుల తవ్వకం, భూఫలకాల కదలికలు, భూకంపాలు, సహజంగా భూమిపొరలు ఒత్తకునిపోవడం తదితర కారణాలతో భూమి కాస్తంత కుంగుతుంది. వీటికితోడు కింది పొరలో భూగర్భజలాలు ఉన్న చోటు నుంచి మనం నీటిని తోడేసి ఖాళీచేస్తున్నాం. దీంతో అప్పటిదాకా భూగర్భజలాలపై ఉన్న శిలలు, నేల పొరలు కిందకు పడిపోతున్నాయి. ఇలా భూమి కుంగుతోంది. ‘‘ అత్యధికంగా భూమి కుంగుతున్న 48 తీరప్రాంతాల్లో సగం ప్రాంతాలు ఈ సమస్యకు అతిగా భూగర్భజలాలను తోడేయడమే కారణం’’ అని ఎన్టీయూ పరిశోధనలో కీలక పరిశోధకురాలు చెరిక్ టే చెప్పారు. జకార్తా వంటి నగరాల్లో భూగర్భజలాలను వెలికితీయడం మరీ ఎక్కువైందని ఆయన వెల్లడించారు. ‘‘ అత్యధిక అభివృద్ధి ప్రాజెక్టులు, జనాభా ఉన్న దేశాల్లో అధిక భూగర్భజలాల వినియోగం కనిపిస్తోంది. ముఖ్యంగా, ఆసియా, తూర్పు ఆసియా ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రమవుతోంది. తక్కువ ఎత్తున్న డెల్టా ప్రాంతాల్లో వెలిసిన నగరాలకు ఈ సమస్య మరీ ఎక్కువ. సముద్రంలో కలవడానికి ముందే ఎక్కువ పాయలుగా విడిపోయి ప్రవహించే నదుల వెంట ఉన్న ప్రాంతాల్లోనూ ఇదే సమస్య కనిపిస్తోంది. జకార్తా, బ్యాంకాక్, హో చి మిన్ సిటీ, షాంఘైలకు ఈ ముంపు ముప్పు ఎక్కువ. జకార్తా సిటీలో సగం ప్రాంతాలు సముద్ర నీటిమట్టం కంటే తక్కువ ఎత్తులో ఉండటం గమనార్హం. 1970 ఏడాదితో పోలిస్తే జకార్తాలో ప్రస్తుతం పలు ప్రాంతాలు 4 సెం.మీ. కుంగిపోయాయి. ఈ కారణంగానే తీరానికి కాస్తంత దూరంగా నుసంతారా పేరిట కొత్త రాజధానిని ప్రభుత్వం నిర్మిస్తోంది. ‘‘ తీరం వెంట మా ఇల్లు ఉంది. ఇంటి కిటికీలు నా చిన్నప్పుడు మెడ ఎత్తులో ఉండేవి. ఇప్పుడు మోకాలు ఎత్తుకు వచ్చేశాయి. నేలపై సముద్రనీరు చొచ్చుకొచ్చి నప్పుడల్లా మా ఇంటి అడుగును పూడుస్తూ వచ్చాం. దీంతో గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఇంటి ఎత్తు తగ్గుతూ వస్తోంది. చివరకు గ్రౌండ్‌ఫ్లోర్ మొత్తం మునిగిపోతుందో, ఇల్లే కూలిపోతుందో మాకే అర్థంకావట్లేదు’’ అని నార్త్ జకార్తాలోని ఎర్నా, ఆమె తల్లి సోనీ వాపోయారు. తాత్కాలిక ప్రత్యామ్నాయాలు జకార్తా, ఈజిప్‌్టలోని అలెగ్జాండ్రియా, వియత్నాంలోని హో చీ మిన్ సిటీల్లోకి పెరిగిన సముద్రమట్టాలు చొచ్చుకురాకుండా గోడలు, అవరోధాలు నిర్మించారు. వచ్చిన నీరు అక్కడే తిష్టవేయకుండా కందకాల వంటి తవ్వి నీటిని మరో చోటుకు మళ్లించారు. అయితే ‘‘గోడలు ఒకరకంగా మంచిచేస్తే మరోరకంగా చేటుచేస్తున్నాయి. ఎగువ నుంచి వరద వస్తే మళ్లీ ముంపు సమస్య అలాగే ఉండిపోతుంది’’ అని ఇటలీలోని పడోవా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పెట్రో తియాటినీ చెప్పారు. షాంఘై వినూత్న పంథా షాంఘై నగరం వాటర్ ఇంజెక్షన్ అనే కొత్త విధానాన్ని అవలంబిస్తోంది. యాంగ్జే నది నుంచి సేకరించిన నీటిని శుద్ధిచేసి ఆ నీటిని బావులు, ఇతర మార్గాల ద్వారా నేలలోకి పంపిస్తోంది. నీటిని తోడేందుకు వేసిన బోరుబావుల రంధ్రాల నుంచి నీటిని నేలలోకి పంపుతోంది. అలా భూగర్భజలాల మట్టాలను పెంచుతోంది. తద్వారా భూగర్భజలాల సమతుల్యతను కాపాడుతోంది. చైనాలోని చోంగ్క్విన్, ఎల్సాల్విడార్లోని శాన్ సాల్విడార్ సిటీలో ‘స్పాంజ్ సిటీ’ పంథాలో వెళ్తున్నాయి. అత్యధిక నీటిని పీల్చుకునే మట్టిరకం, చెట్లు, గడ్డిని పెంచుతున్నాయి. అదనంగా వచ్చిన నీరు పార్కుల్లోకి, చిత్తడినేలల్లోకి వెళ్లేలే ఏర్పాట్లుచేశారు. ‘‘అదనపు నీటిని నిల్వచేసేందుకు పేద్ద రిజర్వాయర్ కట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. దీనితో పలిస్తే పదో వంతు వ్యయంతోనే సమస్యకు పరిష్కారం వెతకొచ్చు’’ అని వర్జీనియా టెక్ వర్సిటీలో ప్రొఫెసర్ మనోòÙహర్ షెర్జాయీ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అసోంలో తగ్గని వరద తీవ్రత
గువాహటి: అసోంలో వరదల తీవ్రత గురువారం కూడా కొనసాగింది. మొత్తం ఏడు లక్షలమంది వరదలతో ప్రభావితులు కాగా, 21 జిల్లాల పరిధిలోని ప్రధాన నదుల్లో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో మృతుల సంఖ్య 19కి చేరింది. బ్రహ్మపుత్ర సహా మొత్తం తొమ్మిది ప్రధాన నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. బరాక్, ఉపనదులు చచార్ జిల్లాలో ఉగ్రరూపాన్ని చూపుతున్నాయి. శ్రీభూమి జిల్లాలో అత్యధికంగా 339 గ్రామాల్లోని 2.60 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. రాష్ట్రంలో వరదలతో మొత్తం 15 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. కజిరంగా నేషనల్ పార్క్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇలా ఉండగా, సిక్కింలోని చటెన్లో వరదల్లో చిక్కుకున్న 63 మంది హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులే కావడం గమనార్హం. చెటెన్లో చిక్కుకున్న మరో 64 మందిని బయటకు తీసుకువచ్చేందుకు ఆర్మీ, స్థానిక యంత్రాంగం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆలస్యమవుతోందని అధికారులు అంటున్నారు. -
నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. బుధవారం రాత్రికి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తంగానూ, మహారాష్ట్ర, తెలంగాణలో చాలా భాగాలు, చత్తీస్ఘఢ్, ఒడిశాల్లో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోంది. ఇది గురువారం మధ్యాహ్నానికి ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.అల్లూరి, పార్వతీపురం మన్యం, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపారు. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40–50, గరిష్టంగా 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంపై వర్షాల ప్రభావం జూన్ 1 వరకూ కొనసాగనుంది. అనంతరం క్రమంగా వర్షాలు తగ్గుముఖం పట్టి.. పొడి వాతావరణం ఉంటుందనీ.. జూన్ 10 తర్వాత నుంచి వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
అకాల వర్షాలు.. కొండెక్కిన ధరలు.. ఇలాగే ఉంటే...!
దాదర్: గత వారం, పదిరోజులుగా రాష్టవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలవల్ల వివిధ రకాల పంటలతోపాటు కూరగాయల తోటలకు అపార నష్టం వాటిల్లింది. వర్షాలకు అనేక ప్రాంతాల్లో కూరగాయల తోటలు నీటమునిగాయి. కొన్ని చోట్ల ట్రక్కులు, టెంపోలలో రవాణాకు సిద్ధంగా ఉంచిన కూరగాయలు కుళ్లిపోవడంతో అక్కడే రోడ్లపై పారేయాల్సిన పరిస్ధితి వచి్చంది. ఫలితంగా న్యూ ముంబై వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ), అలాగే థానేలోని హోల్‌సేల్ మార్కెట్లలో కూరగాయల లోడుతో వచ్చే వాహనాల సంఖ్య తగ్గిపోయింది. సరుకు కొరత ఏర్పడడంతో కూరగాయల ధరలు మండి పోతున్నాయి. మొన్నటి వరకు స్ధిరంగా ఉన్న కూరగాయల ధరలు ఇప్పుడు అకాల వర్షాల వల్ల చుక్కలను తాకుతున్నాయి. అసలే వర్షాలు, ఆపై కూరగాయల కొరత, ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. 18 ఏళ్ల తరువాత మళ్లీ... రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గత వారం, పదిరోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు కొంత ముందుగానే ఆరంభమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ 20 రోజుల ముందుగానే ఊహించని వర్షాలతో సామాన్య జనాలతో పాటు రైతులు కూడా ఆందోళనకు గురయ్యారు. గత 18 ఏళ్ల కిందట మే నెలలో భారీ వర్షాలు కురిశాయి. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు రికార్డు బ్రేక్ చేశాయని కొలాబా, శాంటాకృజ్ వాతావరణ శాఖలు తెలిపాయి. చదవండి: గంగి గోవు పాలు...గడ్డిపోచ..ఏది ఘనమైనది?!ఇలాగే ఉంటే...మరింత పైపైకి... కొద్ది నెలలుగా స్ధిరంగా కూరగాయలు, ఉల్లి, బంగాళదుంపలు, టమాటాలు, ఆకు కూరల ధరలు కొద్ది నెలలుగా స్థిరంగా ఉంటుండటంతో కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు అకాల వర్షాలు, ధరల పెరుగుదలతో బెంబేలెత్తిపోతున్నారు. కొరత కారణంగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల ధరలు ఇప్పటికే 10–20 శాతం పెరిగాయి.రాష్ట్రంలోని అనేక జిల్లాలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో సరుకులు కుళ్లీపోకే ముందే అక్కడే ఖాళీ చేస్తున్నారు. తక్కువ ధరకు విక్రయించి కనీసం పెట్టుబడి రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్ధితి ఇలాగే ఉంటే రేట్లు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు.ఇదీ చదవండి: స్కూల్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు : అపూర్వ సహోదరులు -
ఐఎండీ అలర్ట్.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. మహారాష్ట, గోవా, సౌత్, కర్ణాటకకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక తీర ప్రాంతాల్లో మరో ఐదు రోజులపాటు రెడ్అలర్ట్ అమల్లోనే ఉంటుందని అధికారులు ప్రకటించారు. మంగళూరు సిటీలో చాలా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. దక్షిణ కన్నడ జిల్లాలో కొండప్రాంతాల్లో స్వల్పస్థాయిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి.రెడ్ అలర్ట్ రాష్ట్రాలు: మహారాష్ట, గోవా, సౌత్, కర్ణాటకఆరెంజ్ అలర్ట్ రాష్ట్రాలు: కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలుతెలంగాణ: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలుదక్షిణమధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నైరుతి సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానుల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈసారి రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన మర్నాడే అల్పపీడనం ఏర్పడటంతో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ, ఇంకొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. -
YS Jagan: పొదిలి పర్యటన వాయిదా
సాక్షి, ప్రకాశం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) పొదిలి పర్యటన వాయిదా పడింది. రేపు(బుధవారం, మే 28) ఆయన అక్కడ పర్యటించాల్సి ఉంది. అయితే.. భారీ వర్షాల నేపథ్యంతో పొదిలి పర్యటన(Podili Tour) వాయిదా పడిందని వైఎస్సార్సీపీ ఓ ప్రకటనలో తెలిపింది. వాతావరణం అనుకూలించిన తర్వాత పర్యటన విషయమై తదుపరి ప్రకటన చేస్తామని వెల్లడించింది. కూటమి పాలన(Kutami Prabhutvam)లో మద్ధతు ధర లేక రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా వారి సమస్యలు తెలుసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు.ఇదీ చదవండి: కోనసీమ విషాదంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి -
ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)
-
ముందస్తు నైరుతి ఎందుకంటే..!
రుతుపవనాల రాక కోసం కర్షకుడు ఆకాశంకేసి కళ్లు కాయలు కాచేలా చూస్తాడు. హలధారితో దోబూచులాడే రుతుపవనాలు ఈసారి రైతన్నలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ ఆగమేఘాల మీద దూసుకొచ్చి వర్షాలను దంచికొడుతున్నాయి. అడవుల నరికివేత, యథేచ్ఛగా సాగుతున్న మానవ కార్యకలాపాలు, శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం తదితరాలతో వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ సంభవించిన కారణంగానే రుతుపవనాలు ఇలా ముందుగా వచ్చేశాయని ఎన్నో విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే ఇలా ముందస్తు వర్షాలు గతంలో సర్వసాధారణమని వాదించే వాళ్లూ ఉన్నారు. దీంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ముందస్తు రాకకు కారణాలేంటి అనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. గతంలోనూ ముందొచ్చాయి కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఊరకే రాష్ట్రాలను చుట్టేయకుండా భారీ వర్షాలతో పలకరించి ఈసారి అధిక వర్షాలు ఖాయమని కబురును రుతుపవనాలు మోసుకొచ్చాయి. అయితే ఇలా ముందస్తు రాక కొత్తేమీ కాదని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఈసారి పలు రాష్ట్రాల్లోకి రెండు వారాల ముందే రుతుపవనాలు ప్రవేశించడంతోపాటు కేరళ నుంచి మహారాష్ట్రదాకా అవి వేగంగా, విస్తారంగా మే 24న ఒక్కరోజులోనే విస్తరించడం విశేషం. ఇది అసాధారణమేమీ కాదని, కేవలం అరుదైన విషయమని గణాంకాలు చాటుతున్నాయి. 1971 ఏడాదిలోనూ రుతుపవనాలు కర్ణాటకలో అధిక భాగం, మహారాష్ట్రలో కొంత మేర ఒకేసారి విస్తరించి అప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. మళ్లీ దాదాపు యాభై ఏళ్ల తర్వాత ఇదే తరహాలో రుతుపవనాలు ఒకేసారి విస్తరించాయి. ఆ తర్వాత కాస్తంత బ్రేక్ జూన్ రెండో తేదీదాకా రుతుపవనాలు ఇదే వేగంతో విస్తరిస్తాయని వాతావరణ శాఖ వర్గాలు అంచనావేస్తున్నాయి. మహారాష్ట్ర, తూర్పు భారతాన్ని త్వరగా చుట్టుముట్టాక వేగం తగ్గే వీలుంది. గతంలో మాది రే వేగం నెమ్మదించి మెల్లిగా రుతుపవనాలు ముందుకు సాగనున్నాయి. మధ్య స్థాయి ఎత్తులో పొడి వాతావరణం ఏర్పడటంతో జూన్ మొదటి వా రం తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తరచూ వర్షాలు పడే అవకాశాలు సన్నగిల్లుతాయి. రుతుపవనాల గమన వేగం సైతం తగ్గనుంది. ముందస్తుపై వాతావరణ మార్పుల ప్రభావం సహజ వాతావరణ వ్యవస్థతోపాటు మానవ ప్రేరేపిత భూతాపోన్నతి, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు వంటి అంశాలూ రుతుపవనాలపై ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే భారత్‌లో రుతుపవనాల రాకపై వాతావరణ మార్పుల ప్రభావం పరిమిత స్థాయిలోనే ఉందని వారు అభిప్రాయపడ్డారు. భూతాపోన్నతి దెబ్బకు యురేసియా, హిమాలయ ప్రాంతాల్లో మంచు దుప్పటి కరిగిపోతోంది. 1990–2020 కాల సగటుతో పోలిస్తే ప్రస్తుతం యురేసియా, హిమాలయాల పరిధిలో మంచు 15 శాతం అంతరించిపోయింది. తక్కువ మంచు కారణంగా ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో రుతుపవనాలు ప్రేరేపితమై త్వరగా వస్తాయి. ఒక్కోసారి మే నెల మధ్యలోనే ఇవి రావొచ్చు. గ్లోబ ల్ వార్మింగ్‌లో పెరిగే ప్రతి ఒక్క డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతకు సముద్రాలపై వాతావరణంలో తేమ 6–8 శాతం పెరుగుతుంది. పారిశ్రామిక విప్లవానికి ముందునాటితో పోలిస్తే 2025లో ఉష్ణోగ్రత 1.2 డిగ్రీ సెల్సియస్ పెరిగిందని ఇప్పటికే గణాంకాలు చాటుతున్నాయి.ఈ నేపథ్యంలో అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం ఉపరితల వాతావరణంలో తేమ పెరిగి మే నెలలోనే మేఘాల అధిక ఆవిర్భావానికి దారితీసింది. కర్ణాటక–గోవా తీరం వెంట ద్రోణి కారణంగా తుపాను పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవి ఈసారి రుతుపవనాలను మరింత ముందుకు లాగాయి. మారిషస్, మడగాస్కర్ల మధ్య తక్కువ ఎత్తులో వీచే పవనాల దృగ్విషియాన్ని సోమాలీ జెట్‌గా పిలుస్తారు. ఇది ఈనెలలోనే విజృంభించింది. ఈ గాలులు అరేబియా సముద్రం మీదుగా భారత పశి్చమ తీరం వైపు వీస్తాయి. ఇవి కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలనూ తాకుతాయి. ఈసారి సోమాలీ జెట్ గాలుల ప్రభావం తోడవడంతో నైరుతి పవనాలు త్వరగా వచ్చేశాయి. మరెన్నో కారణాలు.. భౌగోళిక, సముద్ర, వాతావరణ పరిస్థితుల మధ్య సమన్వయంలో తేడా సైతం ఈసారి రుతుపవనాల ఆగమనాన్ని ముందుకు తోసింది. భూమధ్యరేఖ జోన్లో ప్రతి 30 నుంచి 60 రోజులకు ఒకసారి సముద్రజలాల మీదుగా మేఘాలు, వర్షాలు, పవనాలు ఒక క్రమపద్దతిలో ముందుకు సాగుతాయి. దీనినే మేడిన్ జూలియన్ ఆసిలేషన్(ఎంజేఓ)గా పిలుస్తారు. ఎంజేఓ అనేది రుతుపవనాల్లో తేమ, పొడి దశలను నిర్దేశిస్తుంది. ఈనెలలో ఎంజేఓ మూడో దశలోఉంది. ఇది మేఘావృత స్థితిని అధికం చేసి దక్షిణభారతంలో వర్షాలను కురిపిస్తుంది. మే 25వ తేదీన ఇది నాలుగోదశకు మారడంతో హిందూ సముద్రం నుంచి మరింత తేమ పవనాల రూపంలో భారత్‌పై కురిసింది. ఈసారి ఎల్‌నినో సైతం తటస్థ వైఖరిని ప్రదర్శించడంతో రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. అందుకే ఈసారి వర్షాలు ముందే పడ్డాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన
-
దెబ్బతిన్న ముందుభాగంతోనే లాండింగ్
శ్రీనగర్: 220 మందికి పైగా ప్రయాణికులతో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయల్దేరిన ఇండిగో విమానానికి పెనుప్రమాదం తప్పింది. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో ప్రయాణం ఆద్యంతం విమానం భారీ కుదుపులకు లోనైంది. పైలట్ అత్యవసరంగా శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించాడు. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్యే సాయంత్రం 6.30కు విమానాన్ని సురక్షితంగా లాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనలకు లోనై దైవప్రార్థనలు చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలతో పాటు విమానం తాలూకు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైన ఫొటోలు వైరల్‌గా మారాయి. అది లాండింగ్‌కు ముందే విరిగిపోయిందని, చావు ముంగిటి దాకా వెళ్లొచ్చామని ఓ ప్రయాణికుడు చెప్పుకొచ్చాడు. -
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
హైదరాబాద్, సాక్షి: నగరంలో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్పల్లి, బంజారాహిల్స్, మోహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, కార్వాన్, మలక్‌పేట్, సైదాబాద్, చాదర్ ఘాట్, మారేడుపల్లి, షేక్‌పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, అత్తాపూర్, అంబర్పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నల్లకుంట, నాచారం, తార్నాక, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ఉప్పల్, రామంతాపూర్‌లో భారీ వర్షం కురుస్తోంది.ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నాం నుంచి ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘రెయిన్ అలర్ట్’ జారీ చేసింది.ఉపరితల ద్రోణి ఉదయం నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం(Hyderabad Rains) కురుస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. మలక్ పేట్, నాంపల్లి, చార్మినార్, దిల్సుఖ్ నగర్, కోఠి, రామంతపూర్, అబిడ్స్, అంబర్పేట్.. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ సమీపంలో స్వల్ప వర్షంతో మొదలై.. జడి వానగా మారింది. నగర శివారు ప్రాంతాల్లో చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లో జంట నగరాల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే.. రాత్రి సమయంలో హైదరాబాద్‌లో తీవ్రమైన తుఫాను(Cyclone) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ(GHMC) అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్ హోల్స్, కరెంట్ పోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.ఇదిలా ఉంటే.. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో(Telangana Rains) ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది. తెలంగాణకు రెయిన్ అలర్ట్వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముందస్తు ప్రణాళికలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. అలాగే..ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లను సైతం అందుబాటులో ఉండాలని ఆదేశించింది.‘‘ఋతుపవనాలు ముందుగా రాబోతున్నాయి. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి. 2024లో కురిసిన భారీ వర్షాలకు NDRF అందుబాటులో లేకపోవడంతో గోల్డెన్ అవర్ కోల్పోయాం. 2024 సెప్టెంబర్ లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావొద్దు. జిల్లాల్లో కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు, సమన్వయం చేసుకోవాలి. సింగరేణి లో ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి’’ అని సర్క్యులర్‌లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ కీలక ఆదేశాలుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సీఎస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు.. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలి.హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలి. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలి. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి’’ అని సీఎస్‌ను ఆదేశించారాయన. ఇదీ చదవండి: సూర్యుడిపైకి సాగర మేఘాలు -
వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. గడిచిన 24 గంటల్లో బాపట్ల జిల్లా కూచినపూడిలో 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విశాఖ రూరల్‌లో 7.5, కృష్ణా జిల్లా ఘంటశాలలో 7.1, కాకినాడలో 6.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాకినాడ జిల్లా కరపలో 6.5 సెం.మీ వర్షం పడింది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా కటికపల్లిలో 5.3 సెంటీమీటర్లు, కోనసీమ జిల్లా మండపేటలో 4.8, కాకినాడ జిల్లా ఆర్యావటంలో 4.6, మధ్యకొంపలులో 4.4 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని తెలిపింది. 4, 5 రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో నైరుతి రుతుపవనాలు 4, 5 రోజుల్లో కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వేగంగా విస్తరిస్తున్న రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఏర్పడిందని పేర్కొంది. -
భారీ వర్షానికి తడిసి ముద్దైయిన ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి
-
ఏపీలోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు
-
ఏపీకి బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రానున్న ఐదు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది. నేడు అల్లూరి, మన్యం, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కేంద్రకృతమైంది. నిన్న శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.కాగా, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక, గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో వర్షం కురుస్తోంది. మరో రెండు గంటల పాటు పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, నిన్న శ్రీకాకుళం జిల్లాల్లో 5.3 సెంమీ వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రాప్తాడు, కందుకూరు, ఆకుతోటపల్లి వద్ద కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసులు, ఫైర్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
"చివరికి ప్రకృతి కూడా కరుణించింది! 'సూపర్ సిక్స్' చలని కబురు ఎప్పుడు వింటామో..ఏమో! "
-
ఏపీకి చల్లని కబురు.. నాలుగురోజుల పాటు విస్తార వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా, రాయలసీమలో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పిడగులు పడే ప్రమాదం ఉందని.. గంటకు 40-50 కిమీ వేగంతో గాలుల తీవ్రత ఉండన్నాయని.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.కాగా, తెలంగాణలో ఎండలు తీవ్రం కానున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. రానున్న రెండు రోజులు సాధారణం, అంతకంటే కాస్త ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి గత ఐదు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణం కంటే 1 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదయ్యాయి.అయితే ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదైనప్పటికీ ఉక్కపోత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.దక్షిణాది జిల్లాలకు వర్ష సూచన ప్రస్తుతం మరత్వాడ నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశంం ఉంది. -
అకాల వర్షాలు, అన్నదాతకు అంతులేని శోకం
సాక్షి, ముంబై: జల్గావ్ జిల్లాలో మంగళవారం కురిసిన వడగళ్ల వానలు, తుఫానుల గాలులు, అకాల వర్షాల ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొత్తం 7,235 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, 4,279 హెక్టార్లలో విస్తరించి ఉన్న అరటి తోటలు నేలమట్టమయ్యాయి. తీవ్ర పంటనష్టంతో రైతులకు ఆరి్థకంగా కోలుకోలేని దెబ్బ తగిలిందని జిల్లా వ్యవసాయ సూపరింటెండెంట్ కార్యాలయం తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, భారీ వర్షాలు జిల్లాలోని 14 తాలూకాలలో పంటలను ప్రభావితం చేశాయి. అమల్నేర్ మినహా మిగిలిన అన్ని తాలూకాల్లో వడగళ్ల వానలు బొప్పాయి, మొక్కజొన్న, జొన్న, మిల్లెట్, ఉల్లిపాయ, బీన్స్ పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క జల్గావ్ తాలూకాలోనే అత్యధికంగా 1,320 హెక్టార్లలో అరటి తోటలు ధ్వంసమయ్యాయి. చోప్డాలో 663 హెక్టార్లు, రావర్‌లో 519 హెక్టార్లు, యావల్లో 436 హెక్టార్లు, ఎరండోల్‌లో 254 హెక్టార్లు, ముక్తాయ్‌నగర్‌లో 250 హెక్టార్ల మేర నష్టం వాటిల్లింది. అలాగే 717 హెక్టార్లలో మొక్కజొన్న, 507 హెక్టార్లలో మినుములు, 214 హెక్టార్లలో జొన్న, 301 హెక్టార్లలో ఉల్లిపాయ, 249 హెక్టార్లలో బొప్పాయి, 751 హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఇక, ధరణగావ్ తాలూకాలోని ఎక్లగ్న బుద్రుక్ గ్రామంలో పిడుగుపాటుకు రెండు గేదెలు మతి చెందగా, చోప్డా తాలూకాలోని పుంగావ్ గ్రామంలో యువరాజ్ బావిస్కర్ అనే రైతు గేదెపై చెట్టు పడటంతో మరణించిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు నష్టపరిహారం కోసం ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ సూపరింటెండెంట్ ఖుర్బాన్ తడ్వి సూచించారు.ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 14447 లేదా వాట్సాప్ నంబర్ 7065514447 ను సంప్రదించవచ్చని తెలిపారు. -
పలుచోట్ల వర్షం
సాక్షి, అమరావతి: విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో రాష్ట్రంలో పలుచోట్ల వర్షం కురిసింది. చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో 78.5 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా పెద్దరావీడులో 59.2, తిరుపతి జిల్లా పుత్తూరులో 58.7, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 37 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది. నేడు పలు ప్రాంతాల్లో భారీవర్షాలు రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ పక్క విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలుంటే సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై అధికవర్షం పడుతోంది. మంగళవారం చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 42.4 డిగ్రీలు, తిరుపతి జిల్లా రేణిగుంట, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 42.1, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో 41.3, కర్నూలు జిల్లా కామవరంలో 41నిడిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 42ని–43 డిగ్రీల మధ్య ఉండవచ్చని తెలిపింది.అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, గంగవరం మండలాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని, 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు హోర్డింగ్స్, చెట్లకింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలకు సమీపంలో ఉండరాదని సూచించింది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. -
చల్లబడిన ఏపీ.. ఈదురుగాలులతో భారీ వర్షం
-
ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్లకు బలమైన డిమాండ్ ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా. కీలక పంటలకు అధిక మద్దతు ధరలకుతోడు, నిర్మాణ రంగం నుంచి డిమాండ్, పాత వాహనాలను మార్చడం, సాధారణం కంటే అధిక వర్షాలు పడతాయన్న అంచనాలతో క్రిసిల్ రేటింగ్స్ అ అంచనాకు వచి్చంది. 2025–26లో ట్రాక్టర్ల విక్రయాలు 9.75 లక్షల యూనిట్లుగా ఉండొచ్చని.. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 3–5 శాతం వరకు పెరుగుతాయని తన తాజా నివేదికలో పేర్కొంది. ట్రాక్టర్ల తయారీ పరిశ్రమలో రూ.4,000 కోట్ల మూలధన పెట్టుబడులకు అవకాశాల్నుట్టు తెలిపింది. ప్రస్తుత తయారీ సామర్థ్యంలో వినియోగం 75–80 శాతానికి చేరుకోవడం, పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు మద్దతు మూలధన నిధుల వ్యయాలకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. కర్బన ఉద్గారాల నిబంధనలు ‘టర్మ్ 5’ 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని.. కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివర్లో ట్రాక్టర్ల ముందస్తు కొనుగోళ్లు ఊపందుకోవచ్చని కూడా క్రిసిల్ అంచనా వేసింది. కనుక 2022–23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన ట్రాక్టర్ల గరిష్ట విక్రయాలు 9.45 లక్షల యూనిట్ల మార్క్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమ్మకాలు అధిగమించొచ్చని పేర్కొంది. 2024–25లో ట్రాక్టర్ల అమ్మకాలు 7 శాతం పెరిగినట్టు తెలిపింది. వర్షపాతం అంచనాలతో సానుకూల సెంటిమెంట్ ‘‘సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదవుతాయంటూ భారత వాతావణ శాఖ వేసిన అంచనాలు గ్రామీణ సెంటిమెంట్‌ను బలపరుస్తాయి. రైతుల్లో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ట్రాక్టర్లు సహా సాగుపై పెట్టుబడులకు ఇది కీలకంగా పనిచేస్తుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. కీలక పంటలకు కనీస మద్దతు ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అలాగే నిర్మాణ రంగంలో కార్యకలాపాలు ఊపందుకోవడం వంటివి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ల విక్రయాలు పెరిగేందుకు సానుకూలిస్తాయన్నారు. ముఖ్యంగా 2026 ఏప్రిల్ 1 నుంచి టర్మ్ 5 నిబంధనలు అమల్లోకి వస్తుండడంతో ట్రాక్టర్ల ధరలు పెరుగుతాయని.. ఇది కూడా ముందస్తు కొనుగోళ్లను పెంచుతుందని అంచనా వేశారు. అమ్మకాల్లో పెరుగుదల, తయారీ వ్యయాలు తగ్గుముఖం పట్టడం వంటివి ట్రాక్టర్ల కంపెనీల మార్జిన్లను 13–13.5 శాతం స్థాయిలో స్థిరంగా కొనసాగేందుకు దారితీస్తాయని క్రిసిల్ నివేదిక తెలిపింది. వర్షాల్లో తాత్కాలిక అవాంతరాలు, వ్యవసాయ రంగం, గ్రామీణ ఆదాయాలపై దీని ప్రభావం, కమోడిటీల ధరలు, వడ్డీ రేట్లు, కాలుష్య ఉద్గారాల నిబంధనల అమలు ప్రభావం వంటివి మధ్య కాలానికి గమనించాల్సిన అంశాలుగా పేర్కొంది. -
ఒక్క వానకే కకావికలం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో శుక్రవారం పగలంతా మండిన ఎండలు.. సాయంత్రానికి ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఈదురుగాలులకు తోడు భారీ వర్షంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్ర ప్రణాళికా శాఖ గణాంకాల ప్రకారం నగరంలోని కంచన్‌బాగ్‌లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహదూర్‌పురాలో 7.9, చారి్మనార్‌లో 7.63 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని పలుచోట్ల వరద నీరు భారీగా చేరడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా కురిసిన భారీ వర్షాలతో వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లాలో ఏకధాటి వర్షానికి దుబ్బాకలో 10 వేల క్వింటాళ్లకుపైగా ధాన్యం తడిసిపోయింది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో మామిడికాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఉడకబెట్టి ఆరబెట్టిన పసుపుపంటలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగు జనగామ జిల్లా ఆలింపూర్‌లో వాన పడుతుండటంతో తలదాచుకునేందుకు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేసిన చలువ పందిరి కిందకు వెళ్లారు. వారికి సమీపంలోనే పిడుగు పడగా, ఆ ధాటికి వారంతా ఎగిరిపడ్డారు. 12 మందికి గాయాలయ్యాయి. వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అపస్మారకస్థితిలో ఉన్న కొందరికి వైద్యులు సీపీఆర్ చేశారు. కాగా, కామారెడ్డి మండలం ఇస్రోజివాడిలో పిడుగు పడి 40 గొర్రెలు మృతిచెందాయి. రూ.5 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్టు బాధితుడు కడారి దేవయ్య తెలిపాడు. జనగామ జిల్లా చేర్యాలలో పిడుగుపాటుకు మూడు గేదెలు మృత్యువాత పడ్డాయి.నేడు, రేపు అక్కడక్కడా వానలురాష్ట్రంలో రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరోపక్క రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సూచించింది. శుక్రవారం నిజామాబాద్‌లో 42.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, దుండిగల్‌లో 19.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
Andhra Pradesh: ఉపరితల ఆవర్తనం.. తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి, అమరావతి/ఒంగోలు సిటీ: దక్షిణ కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం ఉష్ణోగ్రతలు కొద్దిమేర తగ్గాయి. పలుచోట్ల ఆకస్మిక వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత తగ్గినా ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.54 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 54.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో 43 మిల్లీమీటర్లు, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో 39.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. సోమవారం కూడా ఇదే తరహా వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం జిల్లాలో గాలివాన బీభత్సం ప్రకాశం జిల్లాలో ఆదివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. కనిగిరి, మార్కాపురం, కొండపి, గిద్దలూరు, దర్శి, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల పరిధిలో వర్షం కురిసింది. కనిగిరి, దొనకొండ ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. కనిగిరి మండలం శంఖవరంలో డబ్బుకొట్టు లక్ష్మమ్మ (52) అనే మహిళ పశుగ్రాసం కోసం వెళ్తుండగా, నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి గోడ గాలివానకు కూలి ఆమెపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందింది.కనిగిరిలో ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది. పీసీపల్లి, మర్రిపూడి, దర్శి, మార్కాపురం మండలాల్లోని కల్లాల్లో ఉన్న మిరపకాయలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. పొన్నలూరులో పొగాకు బ్యారన్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పొదిలిలో గాలివానకు భారీ వృక్షం విరిగి కారుపై పడటంతో ధ్వంసమైంది. -
బిహార్‌లో వర్షాలు, పిడుగుల బీభత్సం
పట్నా: బిహార్‌లో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు, పిడుగుపాటు ఘటనలు 38 మందిని బలి తీసుకున్నాయి. బుధవారం 13 మంది చనిపోగా, గురువారం మరో 25 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. పిడుగులు పడటంతోపాటు చెట్లు, ఇళ్లు, కరెంటు స్తంభాలు కూలిన ఘటనల్లో అత్యధికంగా నలందలో 18 మంది చనిపోయారు. సివాన్‌లో ఇద్దరు, దర్భంగా, బెగుసరాయ్, కటిహార్, భాగల్పూర్, జెహానాబాద్‌లలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులైన మరో 11 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం పిడుగులు పడిన ఘటనల్లో నాలుగు జిల్లాల్లో కలిపి 13 మంది చనిపోయారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితీశ్‌కుమార్ సానుభూతి తెలిపారు. రూ.4 లక్షల చొప్పున వీరి కుటుంబాలకు సాయం అందజేస్తామని ప్రకటించారు. బిహార్‌లో 38 జిల్లాలకుగాను 24 జిల్లాలకు యెల్లో అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముందని తెలిపింది. -
ఏపీలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం
-
మూడు రోజులు ఆంధ్రాలో వానలే వానలు
-
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షం, ఈదురుగాలులతో రాజధాని హైదరాబాద్ నగరంలో లొతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.రోడ్ల పై నీటి నిల్వలు లేకుండా ట్రాఫిక్ సమస్య, విద్యుత్ అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, విభాగాలు సమన్వయం తో పని చేయాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసి వాహనదారులు త్వరగా ఇళ్లకు చేరుకునేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చేపట్టే సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు పడుతున్నందున జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు -
Hyd: భారీ వర్షానికి కారుపై విరిగి పడిన చెట్టు
హైదరాబాద్: నగరంతో తెలంగాణలోని పలు చోట్ల అకాల వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్న ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ లో పలు చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్ లో కొన్ని చోట్ల కుండ పోత వర్షం కురవగా, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడింది. ఈ వర్షానికి జన జీవనం స్తంభించింది. వర్షం కారణంగా చాలా చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో వాహనదారులు అవస్తలు తప్పలేదు.మరొకవైపు ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే దారిలో ఓ చెట్టు విరిగి కారుపై పడింది. దాంతో అప్రమత్తం కావడంతో వారు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కారుపై చెట్టు పడిన వెంటనే రెస్య్కూ ఆపరేషన్ లో ఉన్న పోలీసులు సకాలంలో స్పందించారు. కారులో ఉన్న ముగ్గుర్ని ముందుగా బయటకు తీసేశారు. కారుపై పడ్డ చెట్టును అక్కడ నుంచి తొలగించే పనిలో ఉన్నారు డీఆర్ఎఫ్ సిబ్బంది. హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా దంచికొడుతున్న వానలు -
రేపు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) పులివెందులలో పర్యటించనున్నారు. లింగాలలో పడిపోయిన అరటి తోటలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. భారీవర్షాలు, ఈదురు గాలులకు అరటి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. బాధిత రైతులను ఆయన పరామర్శించనున్నారు.వైఎస్సార్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానకు భారీగా అరటి పంటలు నేలకూలాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో సరిగ్గా కోతకు వచ్చిన సమయంలో భారీ పంట నష్టం ఏర్పడింది. చేతి కందిన పంట నేలకూలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
AP: ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం.. 1000 ఎకరాల్లో..!
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్, అనంతపురం జిల్లాలల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం అర్థరాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానకు భారీ ఎత్తున అరటి పంటలు నేలకూలాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాలతో పాటు అనేక గ్రామాలలో అరటి చెట్లు నేలకూలాయి. సరిగ్గా కోతకు వచ్చిన సమయంలో భారీ పంట నష్టం ఏర్పడింది. చేతి కందిన పంట నేలకూలడంతో లబోదిబోమని అంటున్నారు రైతులు.రెండు జిల్లాలో పరిధిలో సుమారు 1000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆకస్మికంగా వచ్చిన ఈదురుగాలులతో కూడా వడగాళ్ల వానకు తన పంట పూర్తిగా నేలకొరికిందని అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పురుగుల మందుల తాగి లక్ష్మీ నారాయణ, వెంగప్ప అనే రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుత వీరికి పులివెందుల మెడికల్ కాలేజ్ లో చికిత్స అందిస్తున్నారు. పంట నష్టపోయిందని బాధతో అధికారులకు ఫోన్ చేస్తే ఈ రోజు సెలవు అన్నారని , దాంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు..పులివెందుల నియోజకవర్గంలో భారీ పంట నష్టంపులివెందుల నియోజకవర్గంలో భారీ అరటి పంట నష్టం జరిగిందని హార్టికల్చర్ అధికారి రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని లింగాలలో భారీగా అరటి చెట్లు నేలకూలయాన్నారు. నిన్న రాత్రి ఆకస్మాత్తుగా వచ్చిన వర్షం, ఈదురుగాలులతో తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపామని రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. మొత్తం రూ. 20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామన్నారు. -
అమెరికాలో భారీ వర్షాలు.. కార్ల నీట మునిగి పలువురు మృతి
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దంచికొడుతున్న వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. వర్షంతో పాటుగా భారీ గాలులు వీస్తున్న కారణంగా పలు భవనాలు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే తొమ్మిది మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు.)అమెరికాలో భారీ తుఫాన్లు కారణంగా వరదలు ముంచెత్తాయి. వర్షాల కారణంగా కెంటుకీలో ప్రాణనష్టం జరిగింది. కెంటుకీలో గడిచిన 48 గంటల్లో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. వరదలు కారణంగా ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయారని అధికారులు తెలిపారు. కార్లు నీటిలో చిక్కుకుని మునిగిపోవడంతో వీరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం.Floodwaters are creeping toward homes as heavy rain triggers dangerous flash flooding across the south-central U.S., including Kentucky, West Virginia, Virginia, and Tennessee. pic.twitter.com/4PY8tAMLvg— AccuWeather (@accuweather) February 16, 2025అంతేకాకుండా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 39,000 ఇళ్లల్లో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని కెంటుకీ గవర్నర్ తెలిపారు. వర్జీనియా(#Virginia), పశ్చిమ వర్జీనియా, టేనస్సీలో కూడా వరదలు సంభవించాయి. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల పాటు వర్షాలు, భారీ స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.Parts of West Virginia, Virginia, Kentucky, Arkansas, and Tennessee are experiencing severe flooding. I wonder what they think about Donald Trump wanting to get rid of FEMA right about now? pic.twitter.com/VLts0ltv5s— Art Candee 🍿🥤 (@ArtCandee) February 16, 2025మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వరదలపై సమీక్షిస్తున్నారు. ఇక, వరదల్లో చిక్కుకున్న వారిని రెస్య్కూ టీమ్స్ కాపాడుతున్నాయి. సహాయక చర్యలను సమన్వయం చేయడానికి ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీకి అధికారం ఇచ్చారు. ఫెడరల్ నిధులు వినియోగించి అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ట్రంప్ ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. Amerika'yı fırtına vurdu!ABD’nin Tennessee, Kentucky, Virginia ve Georgia eyaletlerinde meydana gelen fırtına ve selde, ilk belirlemelere göre 9 kişi hayatını kaybetti. pic.twitter.com/vSe020el2I— 23 Derece (@yirmiucderece) February 17, 2025 #BREAKING: Powerful overnight storm leaves at least 9 dead in Kentucky & Georgia, officials say#tnwx #Georgia #Floods #Tornado #Tennessee#Kentucky #Virginia pic.twitter.com/by2i750f1o— JUST IN | World (@justinbroadcast) February 16, 2025 -
అమెరికాలో వరదలు
లూయిస్విల్లే: ప్రకృతి వైపరీత్యాలు అమెరి కాను వణికిస్తున్నాయి. ఆగ్నేయాన భారీ వర్షాలు, ప్రమాదకరమైన వరదలు అతలా కుతలం చేస్తుండగా ఈశాన్య ప్రాంతంలో తీవ్రంగా మంచు కురుస్తోంది. మైదాన ప్రాంతాల్లో చలి వణికిస్తోంది. కెంటకీలోని క్లే కౌంటీలో సంభవించిన వరదల్లో శనివారం ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వరద హెచ్చరికల నేపథ్యంలో జాక్సన్లోని కెంటకీ రివర్ మెడికల్ సెంటర్‌ను మూసివేశారు. కెంటకీలో నివాస భవనాలు, కార్లు వరదల్లో చిక్కుకుపోగా వర్జీనియాలోని రోడ్లను బురద కమ్మేసింది. టెన్నెస్సీ, అర్కా న్సాస్లోనూ అధికారులు వరద ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. 10 దక్షిణాది రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. న్యూఇంగ్లండ్, న్యూయార్క్‌ల్లో చాలా ప్రాంతాలను భారీగా మంచు కప్పేసింది. నెబ్రస్కా, అయోవా, విస్కాన్సిన్, మిషిగన్, డెన్వర్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు పడిపోయాయి. మొంటానా, డకోటా, మిన్నెసోటాల్లో మైనస్ 51 డిగ్రీల వరకు పడిపోయతాయని అధికారులు చెప్పారు. -
ఆస్ట్రేలియాను ముంచెత్తిన వరదలు
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్ను వరదలు ముంచెత్తాయి. అవి ముంచెత్తడంతో వేలాది మంది ఇళ్లను వదిలి పారిపోయారు. సోమవారం రికార్డు స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరద నీరు రెండో అంతస్తు స్థాయికి పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వరదలతో టౌన్స్ విల్లే, పర్యాటక కేంద్రమయిన కెయిర్న్స్ మధ్య రహదారులు తెగిపోయాయి. ఉత్తర క్వీన్స్‌ల్యాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో 700 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో 24 గంటల్లో ఆరు గంటల్లోనే 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరదలతో హెర్బర్ట్ నది నీటిమట్టం 15.2 మీటర్లకు చేరుకుంది. కుండపోత వర్షాలు, ఈదురు గాలులు మరింత ఆకస్మిక వరదలకు దారితీసే అవకాశం ఉందని బ్యూరో హెచ్చరించింది. సుమారు 200,000 మంది జనాభా ఉన్న టౌన్స్‌విల్లే నగరంలో గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వరదలు వచ్చాయని క్వీన్స్‌ల్యాండ్ ప్రీమియర్ డేవిడ్ క్రిసఫుల్లీ తెలిపారు. -
భారీ వర్షాల ప్రభావంతో నష్టపోయిన రైతులు
-
హిమాచల్‌లో భారీ మంచు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో గత 24 గంటల్లో భారీగా మంచు కురియడంతో నలుగురు మృతి చెందారు. మూడు జాతీయరహదారు లు, మరో 220 దారులను మూసివేశారు. సిమ్లా, కులు, మండి, చంబా, సిర్మౌర్ జిల్లాలతో పాటు కిన్నౌర్, లాహౌల్, స్పితి జిల్లాల్లో భారీగా మంచు కురిసింది. పలు వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దీంతో సిమ్లాలో 145, కులులో 25, మండీ జిల్లాల్లో 20 రహదారులను మూసివేశారు. 356 ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్యూర్ కావడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ లేదు. క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం సిమ్లా, మనాలీలకు పర్యాటకులు పోటెత్తారు. స్థానిక నివేదికల ప్రకారం, అట్టారి నుంచి లేహ్, కులు జిల్లా లోని సంజ్ నుంచి ఔత్, కిన్నౌర్ జిల్లాలోని ఖాబ్ సంగం, లాహౌల్, స్పితి జిల్లాలోని గ్రామ్ ఫూ వరకు జాతీయ రహదారులు ట్రాఫిక్ కారణంగా మూసివేశారు. రోడ్లను క్లియర్ చేయడానికి హిమాచల్ ప్రభుత్వం రెండు స్నో బ్లోయర్లతో సహా 268 యంత్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా యంత్రాంగం సూచనలను పాటించాలని, స్థానికులు చెప్పేది వినాలని, మంచులో డ్రైవింగ్ చేయవద్దని పర్యాటకులు సూచించింది.తెల్లని వండర్‌ల్యాండ్‌గా హిమాచల్.. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, మనా లీ వంటి పర్యాటక కేంద్రాలు తెల్లని వండర్‌ల్యాండ్‌గా మారాయి. అలాగే జమ్మూకాశీ్మర్లోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా మంచుకురిసింది. ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే అనేక డిగ్రీలు పడిపోయా యి. ఇది క్రిస్మస్ సెలవుల కోసం ప్రదేశాలను సందర్శించే పర్యాటకులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మరోవైపు వాహనాల రాకపోకలకు కష్టమవుతోంది. సోమవా రం అర్థరాత్రి మనాలీ, డల్హౌసీ శివారు ప్రాంతాల్లో తేలికపాటి హిమపాతం నమోదైంది. ఖద్రాలాలో అత్యధికంగా 24 సెంటీమీటర్లు, సంగ్లాలో 16.5 , షిల్లారోలో 15.3, చోపాల్, జుబ్బల్‌లో 15 సెంటీమీటర్ల చొప్పున, కల్పాలో 14, నిచార్‌లో 10, సిమ్లాలో 7, పూహ్‌లో 6, జోత్‌లో 5 సెంటీమీటర్ల చొప్పున మంచు కురిసింది. ప్రతికూల వాతావరణం, హిల్ స్టేషన్‌కు వెళ్లే మార్గంలో రహదారిపై ప్రాణాంతక పరిస్థితులు ఉన్నా పర్యాటకులు పోటెత్తారు. సిమ్లాలోని హోటల్ గదుల ఆక్యుపెన్సీ 70 శాతం నమోదైంది. గత ఏడాది డిసెంబర్ కంటే ఇది 30 శాతం ఎక్కువ. మంచు దుప్పటితో అందంగా కప్పబడిన సిమ్లా, మనాలీ చిత్రాలతో సోషల్ మీడియా నిండిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యా హ్నం వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా సిమ్లాలో భారీ వర్షా లు, మంచు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
ఏపీలో ఓవైపు ముసురు.. మరోవైపు వర్షం.. ఇంకోవైపు గజగజలాడిస్తున్న చలి (ఫొటోలు)
-
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/చింతపల్లి( అల్లూరి జిల్లా): ఇటీవల ఫెంగల్ తుపాన్ మాదిరిగానే.. ప్రస్తుతం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా అంచనాలకు అందకుండా తిరుగుతోంది. ప్రస్తుతం ఇది నెల్లూరు, ఉత్తర తమిళనాడు మధ్యలో కేంద్రీకృతమై ఉంది. రెండు రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే.. ఇది తమిళనాడు తీరం వైపు వెళ్తుందా నెల్లూరు వైపు వస్తుందా అనేదానిపై స్పష్టత రావడం లేదని చెబుతున్నారు.వాయుగుండంగా మారినా సముద్రంలోనే బలహీనపడిన తర్వాత తీరం దాటుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కారణంగా ఈనెల 18 రాత్రి నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 19 నుంచి 22 తేదీల మధ్య ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని చెబుతున్నారు. మన్యంను వణికిస్తున్న చలి అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. దీంతో మన్యం వాసులు చలికి గజగజలాడుతున్నారు. సోమవారం జి.మాడుగులలో 4.1 డిగ్రీలు, అరకులోయలో 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, ఉష్ణోగ్రతల విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. చింతపల్లిలో 7.0, జీకే వీధిలో 7.3, హుకుంపేటలో 7.8 ,పెదబయలులో 9.0,అనంతగిరిలో 9.4 ,కొయ్యూరులో 11.6 డిగ్రీల చొçప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
అల్పపీడన ప్రభావం.. ఏపీలో మూడు రోజులు వర్షాలు
సాక్షి,విశాఖపట్నం: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఏపీ, తమిళనాడులో వర్షాలు పడనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బుధవారం నెల్లూరు,తిరుపతి,విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.18వ తేదీన ఉదయం తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి 30 నుంచి 35 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు ఈ నెల 18 వరకూ వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని తెలిపింది.మంగళవారం అల్లూరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. -
వరదలు.. పెనుగాలులు.. భూకంపం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలోని గోదావరి తీర ప్రాంతాలు ప్రకృతి విపత్తులకు నిలయంగా మారుతున్నాయి. కొన్నేళ్ల నుంచి జరిగిన ఘటనలను పరిశీలిస్తే.. ఏటా ఏదో ఒక విపత్తు ఎదురవుతోంది. ముఖ్యంగా ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. వరుసగా అతి భారీ వర్షాలు, వరదలు, పెనుగాలులు టోర్నడోలు, ఇప్పుడు భూకంపం వంటివి తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.అతి భారీ వర్షాలతో..2022 జూలై 14 నుంచి 16 వరకు ఈ ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి కారణంగా గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. ఏ క్షణమైనా కరకట్ట కొట్టుకుపోయి భద్రాచలం మునిగిపోతుందనే పరిస్థితి ఏర్పడింది. 2023 జూలై 27న భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో అత్యంత భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో ఏకంగా ఒక్కరోజే 64.9 సెంటీమీటర్ల వాన పడింది. అందులో కేవలం మూడు గంటల్లోనే 46.4 సెంటీమీటర్ల అతి భారీ వాన పడింది. అదేరోజు జయశంకర్ జిల్లా చిట్యాలలో 61.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగులు ఉప్పొంగి గ్రామాలు నీట మునిగి పన్నెండు మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఆగస్టు 31న నర్సంపేట, పాలకుర్తి, మహబూబాబాద్ నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షంపడి మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులకు కనీవినీ ఎరుగని రీతిలో వరద వచ్చింది. ఖమ్మం పట్టణం, పరిసర గ్రామాలు చిగురుటాకులా వణికిపోయాయి.లక్ష చెట్లను కూల్చేసిన పెనుగాలులుఈ ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ ఒకటో తేదీల మధ్య ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో తీవ్ర పెను సుడిగాలులు వీచాయి. ఏటూరునాగారం అభయారణ్యంలో ఏకంగా 334 హెక్టార్ల పరిధిలో లక్ష వరకు చెట్లు కూలిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ వాయు విధ్వంసానికి కారణాలను ఇప్పటికీ స్పష్టంగా తేల్చలేదు. ఇక్కడే భూకంప కేంద్రాలురాష్ట్రంలోని సిర్పూర్, జైనూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, మంథని, భూపాలపల్లి, వరంగల్, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలు భూకంప సీస్మిక్ జోన్–3 పరిధిలో ఉన్నాయి. బొగ్గు గనులు విస్తృతంగా ఉన్న ఈ ప్రాంతాల్లో తరచూ భూమి నుంచి భారీ శబ్దాలు రావడం సాధారణంగా మారిపోయింది. ఇదే ప్రాంతంలోని భద్రాచలంలో 1969లో 5.7 తీవ్రతతో భూకంపం రాగా.. ఇప్పుడు 5.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. గత ఆరేళ్లలో మణుగూరులో స్వల్ప స్థాయిలో మూడు సార్లు ప్రకంపనలు వచ్చాయి కూడా. భారీగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం, బొగ్గు తవ్వకాలు, గోదావరిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు వంటివి విపత్తులకు దారితీస్తున్నాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. వేడి నీటిబుగ్గలకూ కేంద్రంములుగు జిల్లాలోని రామన్నగూడెం ప్రాంతంలో వేడి నీటిబుగ్గలు ఉన్నాయి. 1954లో ఇక్కడ చమురు నిక్షేపాల అన్వేషణ కోసం తవ్వకాలు జరిపి వదిలేసిన బోరులోనుంచి ఇప్పటికీ వేడి నీళ్లు వెలువడుతూ ఉన్నాయి. భూమి పొరల్లో పగుళ్ల వల్ల నీళ్లు మరింత లోతుకు వెళ్లి... అక్కడి అధిక ఉష్ణోగ్రతల వల్ల వేడై పైకి ఉబికివస్తాయని నిపుణులు చెబుతున్నారు.మానవ తప్పిదాలపై ప్రకృతి హెచ్చరికలివి!మానవ తప్పిదాలపై ప్రకృతి చేసిన హెచ్చరికలను మనం పట్టించుకోలేదు. మూడు నెలల క్రితం తాడ్వాయి అడవుల్లో టోర్నడోల తీవ్రత కారణంగా లక్ష చెట్లు నేలకొరిగినప్పుడే భూకంపాలపై హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ ఘటన జరిగాక కారణాలేమిటన్న దానిపై ప్రభుత్వం, వర్సిటీలు, ఎన్జీఆర్ వంటి సంస్థలు ఎలాంటి పరిశోధనలు చేయలేదు. మనం గోదావరి బెల్ట్‌ను నాశనం చేశాం. ప్రాజెక్టుల కోసం అడవులు నరికేశాం. భూమి లోపల పొరలు ఎలా ఉన్నాయి? డ్యామ్‌ల వల్ల వాటికి ఏ మేరకు నష్టం అన్నది సాంకేతికంగా పరిశీలించలేదు. అది భూకంపాలకు కారణమవుతోంది.– పాకనాటి దామోదర్‌రెడ్డి, పర్యావరణవేత్త -
సూరీడు రాక నాలుగు రోజులైంది
శివమొగ్గ: ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలు కురిసిన మలెనాడులో ఇప్పుడు బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన తుపాను ప్రభావంతో చలికాలంలోనూ జోరు వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్ తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా జిల్లాలో ఆకాశం మేఘావృతమైంది. సోమవారం సాయంత్రం నుంచి ప శి్చమ కనుమలతో పాటు పలు చోట్ల చెదురుమదురు వర్షాలు కురిశాయి. వర్షంతో పాటు చల్లగాలులు కూడా జోరుగా వీస్తున్నాయి. ఇలా అనూహ్యమైన వాతావరణంతో ప్రజల ఆరోగ్యం కూడా తలకిందులవుతోంది. చలిజ్వరం, దగ్గు పడిశంతో చిన్నా పెద్దా ఆస్పత్రులకు వెళ్తున్నారు. కాగా రాబోయే రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఎల్లో అలర్ట్ ఉంటుంది. గత మూడు నాలుగు రోజుల నుంచి సూర్యుడు కనిపించడం మానేశాడు. పగటి వేళలో కూడా చల్లని వాతావరణం కొనసాగుతోంది. ప్రజలు ఎండ కోసం తపించాల్సి వస్తోంది. -
AP: ‘ఫెంగల్’ ప్రభావం.. 1,500 కి.మీ.
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఎక్కడో నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు దగ్గరలో ఏర్పడింది... పుదుచ్చేరి దగ్గర తీరం దాటింది... కానీ దాని ప్రభావం మాత్రం దాదాపు 1,500 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒడిశాపైనా చూపించింది. ఇదీ... ఫెంగల్ తుపాను విరుచుకుపడిన తీరు. తుపానుగా మారిన కొద్ది సేపటికే బలహీనపడటం.. మళ్లీ తుపానుగా మారడం.. ఇలా భిన్న రూపాలతో ఫెంగల్ ఇబ్బంది పెట్టింది. నవంబర్ 30వ తేదీ ఉదయం 8 గంటలకు నైరుతి బంగాళాఖాతం నుంచి చెన్నై వైపుగా కదిలింది. అనంతరం 11.30 గంటలకు చెన్నై తీరానికి సమీపంలోకి వచ్చి అక్కడే దాదాపు 10 గంటల వరకు స్థిరంగా ఉండిపోయింది.చెన్నై దగ్గర తీరం దాటుతుందని భావించగా.. తర్వాత నెమ్మదిగా వెనక్కి కదులుతూ నైరుతి బంగాళాఖాతం వైపు వెళ్లిపోయింది. సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు, నిపుణులు అంచనా వేశారు. కానీ.. ఎవరూ ఊహించనట్లుగా మళ్లీ దక్షిణ తమిళనాడు వైపునకు ముందుకు నెమ్మదిగా దూసుకొచి్చంది. కానీ ఈ నెల ఒకటో తేదీన రూట్ మార్చి మరక్కానం, పుదుచ్చేరి వైపు కదిలింది. ఆ తర్వాత తీరం దాటింది. అయితే.. సాధారణంగా తుపానులు తీరం దాటిన తర్వాత వేగాన్ని పుంజుకోవడంతోపాటు బలహీనపడతాయి. కానీ, ఫెంగల్ మాత్రం తీరం దాటినా.. 6 గంటల వరకు తుపానుగానే కొనసాగి పుదుచ్చేరిలో విధ్వంసం సృష్టించింది. నైరుతి బంగాళాఖాతంలో తుపాను ఏర్పడితే దాని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరితోపాటు దక్షిణ కోస్తా జిల్లాలపైనే ఉంటుంది. ఫెంగల్ తుపాను మాత్రం ఒడిశాలోని గోపాల్పూర్ వరకు చూపించింది. ప్రస్తుతం వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రం వైపుగా కదులుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం మంగళవారం సాయంత్రంతో తగ్గుముఖం పడుతుందని, అప్పటి వరకు దక్షిణ కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్రలో ఒకటి, రెండుచోట్ల మోస్తరు వానలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. కసుమూరులో 7.9 సెంటీమీటర్ల వర్షం తుపాను ప్రభావంతో సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కసుమూరులో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆత్మకూరు, నెల్లూరు రూరల్, మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లోను పలుచోట్ల భారీ వర్షాలుపడ్డాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె, రాజంపేట, బాపట్ల జిల్లా నిజాంపట్నం, తిరుపతి జిల్లా వాకాడు, పుత్తూరు మండలాల్లోనూ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలోను అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. పలు గ్రామాల్లో ధాన్యం రాశులు తడిచిపోయాయి. పొలాల్లో వరి పనలు నీట మునిగాయి. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం ఫెంగల్ తుపాను ప్రభావం, సహాయక చర్యలపై సోమవారం సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మొత్తం 53 మండలాల్లో తుపాను ప్రభావం ఉందని అధికారులు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 6,824 హెక్టార్ల మేర వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, దీనికి అవసరమైన ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. వర్షం కారణంగా తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. పొంచి ఉన్న మరో ముప్పు.!తుపాను ప్రభావం ఇంకా కొనసాగుతున్న తరుణంలో మరో ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల రెండో వారంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి వాయుగుండంగా మారుతుందనీ, అయితే తుపానుగా బలపడుతుందా.. లేదా.. అనే దానిపై ఈ వారాంతంలో అంచనా వేయగలమని చెబుతున్నారు. దీని ప్రభావం కూడా దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుందన్నారు. -
Tirumala: తిరుమలపై ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్
-
తుపాను ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు (ఫొటోలు)
-
AP: బలహీనపడిన తుపాను
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఫెంగల్ తుపాను ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వద్ద నెమ్మదిగా బలహీనపడింది. తీరం దాటిన తర్వాత కూడా 6 గంటలకుపైగా భూమిపై తుపానుగానే స్థిరంగా కొనసాగింది. ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం ఇది పుదుచ్చేరి సమీపంలోని కడలూరుకు 30 కి.మీ., విల్లుపురానికి 40 కి.మీ., చెన్నైకి 120 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాత్రికి ఇంకా బలహీనపడి వాయుగుండంగా.. ఆ తర్వాత అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మూడు జిల్లాల్లో ఎడతెగని వర్షాలుతుపాను ప్రభావంతో చిత్తూరు, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఆదివారం కూడా ఎడతెగని వర్షాలు కురిశాయి. మిగిలిన కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా పుత్తూరులో 18.7సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లా పుత్తూరు మండలం రాచలపాలెంలో 15.2 సెం.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, తడ, చిత్తమూరు, దొరవారిసత్రం, నాయుడుపేట, వెంకటగిరిలో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా నగరి, నిండ్ర, కార్వేటినగరం, పాలసముద్రం మండలాలు, నెల్లూరు జిల్లాలోని మనుబోలు, కొడవలూరు, సైదాపురం మండలాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. కోస్తా జిల్లాల్లోనూ చాలాచోట్ల భారీ వర్షాలు పడ్డాయి.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 10 సెం.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. వాగుల్లోకి పెద్దఎత్తున నీరు చేరి ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైలో ఇంకా తీవ్రంగా వర్షాలు పడుతుండటంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లే అనేక బస్సులను రద్దు చేశారు. సోమవారం కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తిరుపతి జిల్లాలో జోరువానతిరుపతి జిల్లాలో 3 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. సత్యవేడు, గూడూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. వర్షం ప్రభావంతో 116 ఆర్టీసీ సర్వీసులను నిలుపుదల చేశారు. 21 గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు వెళ్లడం లేదు. చెన్నైకి వెళ్లే పలు సర్వీసులకు బ్రేక్ పడింది. ఏసీ సర్వీసులను నిలుపుదల చేశారు. జిల్లాలో మామిడి కాలువ, పాముల కాలువ, కార్వేటి కాలువ, ఈదులకాలువ, సున్నపు కాలువ తదితర 21 కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ వానలుకృష్ణా జిల్లా పెనమలూరు, పెడన, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాల్లో ఆదివారం కూడా వర్షాలు కురిశాయి. 19,500 ఎకరాల్లో వరి నేలవాలింది. కోతలు పూర్తయిన చోట్ల ధాన్యాన్ని రోడ్లపైనే రాశులు పోయగా.. తడిసిపోయింది. ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడా మోస్తరు జల్లులు కురిశాయి. పూత దశలో ఉన్న కంది, మిరప గాలులకు రాలిపోయింది. మబ్బుల కారణంగా పంటలు తెగుళ్ల బారిన పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో 9.2 మి.మీ. వర్షం పడగా, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో 1.6 మి.మీ. వర్షం కురిసింది. కొల్లిపర, దుగ్గిరాల, తెనాలి, పొన్నూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో కోతకు వచ్చిన వరి పంట పలుచోట్ల నేల వాలింది.పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం చిరు జల్లుల కారణంగా సార్వా మాసూళ్ల (నూర్పిడి) పనులు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. భోగాపురం, గరివిడి, ఎస్.కోట, డెంకాడ, గుర్ల, చీపురుపల్లి, పూసపాటిరేగ, కొత్తవలస, బొండపల్లి, గజపతినగరం, వేపాడ, నెల్లిమర్ల, మెంటాడ, విజయనగరం, రామభద్రపురం మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో చెదురుమదురు జల్లులు పడ్డాయి.కాకినాడ జిల్లాలో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరి చేలు నేలకొరిగాయి. సుమారు 30 శాతం వరిచేలు నేలనంటాయి. ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో వరిపై వర్షాల ప్రభావం అధికంగా ఉంది. కూనవరం మొగ మూసుకుపోవడంతో ముంపు నీరు దిగడం లేదు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ శాతం పడిపోయింది. రొయ్యలను కాపాడుకునేందుకు ఆక్వా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.తిరుమలలో విరిగిపడుతున్న కొండ చరియలుతిరుమలలోని రెండో ఘాట్ రోడ్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. సకాలంలో టీటీడీ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. రెండు ఘాట్ రోడ్లలోనూ దిట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. తిరుమలలో ఆదివారం కూడా ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరగడంతో చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు పలు మండలాల్లో వరి పంట నేలకొరిగింది. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రైల్వేకోడూరు నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. వరి, టమాటా, బొప్పాయి ఇతర ఆకు కూరల తోటలు దెబ్బతిన్నాయి. పొగ మంచు రావడంతో రహదారులపై వాహనదారులు కష్టతరంగా ప్రయాణాన్ని సాగిస్తున్నారు. -
తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను నెమ్మదిగా కదులుతోంది. శనివారం రాత్రికి గంటకు 7కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మహాబలిపురానికి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 80 కిలోమీటర్లు, చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం రాత్రికి తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తమిళనాడు–పుదుచ్చేరి తీరాల వద్ద కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గర తీరం దాటే ప్రక్రియ మొదలైనట్టు పేర్కొంది.తీరం దాటే సమయంలో ఇంకా నెమ్మదిగా కదులుతున్నట్టు తెలిపింది. తుపాను చెన్నైకి సమీపంలో తీరం దాటేందుకు వచ్చినట్టే వచ్చి దాదాపు 6 గంటల వరకూ సముద్రంలోనే స్థిరంగా నిలిచిపోయింది. అనంతరం.. పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ పుదుచ్చేరి తీరం వైపు పయనించింది. తుపాను తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తుండగా.. కోస్తాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి.భారీ నుంచి అతి భారీ వర్షాలు డిసెంబర్ 2 వరకూ కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. తిరుపతి, నెల్లూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని.. ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు 3వ తేదీ వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను తీవ్రత దృష్ట్యా తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అత్యంత తీవ్రంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ∙ఆరెంజ్ అలర్ట్, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.రెండు జిల్లాల్లో కుండపోతశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు తిరుపతి జిల్లా అంతా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలోనూ వర్షాల తీవ్రతకు అనేక ప్రాంతాల్లోని రోడ్లపై నీరు చేరింది. కోస్తా జిల్లాల అంతటా వర్షాలు పడుతుండటంతో కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయి పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఆకస్మిక అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారుహెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.ఈదురుగాలులు ఎక్కువగా ఉండటంతో చలి తీవ్రంగా ఉంది. జనమంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. వాకాడు, కోట, చిట్టమూరు, చిల్లకూరు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదయ్యపాళెం నుంచి∙సంతవేలూరుకు వెళ్లే మార్గంలో సీఎల్‌ఎన్‌పల్లి వద్ద పాముల కాలువ, అంబూరు సమీపంలో మార్ల మడుగు కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పెద్ద పాండూరు సమీపంలో రాళ్ల కాలువ వద్ద నీటి ఉధృతి పెరగడంతో మరో 7 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవంతో విద్యుత్‌కు అంతరాయం కలిగింది.తిరుమలలో భారీ వర్షంతిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరిగింది. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె గదులు దొరకని భక్తులు షెడ్ల కింద వర్షానికి, చలికి వణికిపోతున్నారు. వ్యాపార సంస్థలు ఉదయం నుంచి మూతపడ్డాయి. తిరుమల శిలాతోరణం నుంచి శ్రీవారి పాదాల వద్దకు వెళ్లే మార్గంతోపాటు, ఆకాశ గంగ, పాపవినాశనం మార్గాలను తాతాల్కింగా మూసివేశారు. విమాన సర్వీస్‌లు రద్దువిజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సరీ్వస్‌లను శనివారం రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయడంతో అక్కడి నుంచి గన్నవరం వచ్చి వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. తిరుపతి, షిర్డీ విమాన సర్వీస్‌లు కూడా రద్దయ్యాయి. చెన్నై, షిర్డీ, తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా.. తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయంలోని రన్‌వేపై నీళ్లు చేరడంతో ఏడు విమాన సరీ్వస్‌లు రద్దయ్యాయి. భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్లుశనివారం తిరుపతి జిల్లా భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా మన్నార్పోలూర్లో 13.0, పుత్తూరులో 12.3, సూళ్లూరుపేటలో 11.8, పూలతోటలో 11.5, తడలో 10.8, మల్లంలో 10.3, చిత్తూరు జిల్లా నగరిలో 9.4, నిండ్రలో 8.8 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.సముద్రం అల్లకల్లోలంవిశాఖ సముద్ర తీరం భారీ కెరటాలతో అల్లకల్లోలంగా మారింది. మూడు అడుగుల కంటే ఎత్తుగా కెరటాలు ఎగసి పడుతున్నాయి. విశాఖలోని వైఎంసీఏ నుంచి విక్టరీ ఎట్ సీ వరకు గల తీరం భారీగా కోతకు గురయింది. నాలుగు అడుగులకుపైగా ఎత్తున ఇసుక పూర్తిగా కోతకు గురైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం ఉదయం నుంచి జల్లులు పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో జల్లులు కురిశాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడడక్కడా జల్లులు పడ్డాయి.కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం కురవడంతో రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోతలు కోసి పనలపై ఉన్న ధాన్యం తడిసిపోయింది. హంసలదీవి వద్ద సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. పల్నాడు జిల్లాలో అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలో విడతలవారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు 3వేల ఎకరాలకుపైగా వరిపంట నేలకొరిగింది.తుపానుపై సీఎం సమీక్ష సాక్షి, అమరావతి: ఫెంగల్ తుపాను నేపథ్యంలో అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను పరిస్థితులపై శనివారం జిల్లా కలెక్టర్లు, సీఎంవో, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులతో సమీక్షించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.సహాయ, పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని కలెక్టర్లను ఆదేశించారు. తుపాను విషయంలో రైతులు ఆందోళనగా ఉన్నారని, నిరి్ధష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని సూచించారు. కాగా, ఫెంగల్ తుపాను దృష్ట్యా భారీ వర్షాలు కురిసి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని విద్యుత్ సంస్థలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. -
తెలంగాణలో ఫెంగల్ తుపానుతో వర్షాలు.. ఎల్లో వార్నింగ్ జారీ
హైదరాబాద్, సాక్షి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి తమిళనాడును ముంచెత్తి, ఏపీని వణికిస్తున్న ఫెంగల్ తుపాను.. తెలంగాణపైనా ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఈ ప్రభావం శుక్రవారం సాయంత్రం నుంచే రాష్ట్రంపై కనిపిస్తోంది. ఇక శనివారం పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక ఆది, సోమవారాల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం.... సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడనున్నాయి. ఈ మేరకు ఆ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. అలాగే చలి తీవ్రతా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.ఇదీ చదవండి: మళ్లీ తుపానుగా బలపడిన వాయుగుండం -
ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, నెల్లూరు, తిరుపతి: పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో - పెన్నా పరివాహక ప్రాంతాలలో ఆకస్మిక వరదలు వస్తాయంటూ కేంద్ర జల శక్తి శాఖ నెల్లూరు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. పెన్నా నదితో పాటు దాని ఉపనదుల సమీపాలలో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు సర్వేపల్లి నియోజకవర్గ ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. రైతుల పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది.రెండు రోజులు పాటు వర్షాలు కురిస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. లోతట్టు ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా కలెక్టర్ ఆనందు ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం జిల్లాకు చేరుకున్నాయి. తిరుమల: పెంగల్ తుపాను ప్రభావం తిరుపతి జిల్లాపై పడింది. తిరుమలలో శుక్రవారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తిరుపతి ఎయిర్‌పోర్టులో 9 విమాన సర్వీసులను రద్దు చేశారు. హైదరాబాద్, విశాఖ, బెంగళూరు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. మరోవైపు దట్టంగా కమ్మేసిన మంచు, పెరిగిన చలి కారణంగా.. భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ సూచించింది. పాపవినాశనం, శ్రీవారి పాదాలు మార్గాలు తాత్కాలికంగా మూసివేశారు. వృక్షాలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఏర్పేడు మండలంలో సీత కాలువ పొంగిపొర్లుతుండటంతో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయాయి. వర్షాల నేపథ్యంలో నేటి మధ్యాహ్నం నుంచి ప్రభుత్వ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సెలవులు ప్రకటించారు.కాగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుపానుగా మారింది. దీనకి పెంగల్గా నామకరణం చేశారు. ఈ తుఫాన్ శనివారంమధ్యాహ్నం తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆ సమయంలో తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయని తెలిపింది. ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
Cyclone Fengal: చెన్నై ఎయిర్‌పోర్టు బంద్.. రెడ్ అలెర్ట్ జారీ
ఫెంగల్ తుఫాను తమిళనాడు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారిన ఫెంగల్.. శనివారం పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాగే అవకాశం ఉంది. కారైకాల్- మహాబలిపురం మధ్య పుదుచ్చేరికి సమీపంలో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో నేటి మధ్యాహ్నం తీరం దాటనున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో పుదుచ్చేరి, చెన్నైతో సహా తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో చెన్నై విమానాశ్రయాన్ని రాత్రి ఏడు గంటల వరకు అధికారులు మూసివేశారు. ఈ సమయంలో సబర్బన్ రైళ్లు కూడా తక్కువగా నడుస్తాయని దక్షిణ రైల్వే తెలిపింది.భారీ వర్షాలు..పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, చెంగల్పట్టు, కాంచీపురం, చైన్నె, తిరువళ్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశాలున్నాయి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అనేక తీర ప్రాంతాలు ఇప్పటికే వాతావరణంలో మార్పు, అధిక ఆటుపోట్లను చూస్తున్నాయని తెలిపింది. తీరాన్ని ఫెంగల్ సమీపించే కొద్దీ గాలిప్రభావం 90 కి.మీ వేగంతో ఉండేందుకు అవకాశాలు ఉండడంతో ముందు జాగ్రత్తలు విస్తృతమయ్యాయి.Beautiful low cyclonic clouds... #ChennaiRains #Cyclone #Fengal pic.twitter.com/VTGxLYNty4— Sreeram (@sreeram) November 30, 2024 వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, పెరంబలూరు, అరియలూర్, తంజావూరు, నాగపట్నం, రాణిపేట, కారైకల్ జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్ జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి విపత్తు ఎదురైనా తక్షణం బాధితులను ఆదుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. పుదుచ్చేరిలో వర్షాలు కొనసాగుతుండడంతో పాటు కారైక్కాల్–తమి నాడులోని చైన్నె శివారు ప్రాంతం మహాబలిపురం మధ్య తీరాన్ని ఫెంగల్ తుపాను తాకనుండడంతో ఇక్కడి గ్రామీణ, తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.Velachery, Vijayanagar 2nd main road #Fengal #ChennaiRains #velachery pic.twitter.com/nR7Ygwywcm— Swetha Chandran (@SwethaC3110) November 30, 2024మత్స్యకారులకు ఆదేశం..ఈ జిల్లాల్లో పడవలు, జనరేటర్లు, మోటారు పంపులు, ట్రీ కటర్లు, ఇతర అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచారు. ఈ జిల్లాల్లో ఎన్డిఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందాలు రంగంలోకి దిగాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఆదేశించారు. తమ పడవలు, ఇతర పరికరాలను ఎత్తైన ప్రాంతాలకు తరలించి నష్టం జరగకుండా చూడాలని అధికారులు సూచించారు.విద్యాసంస్థలు బంద్తుఫాను కారణంగా భారీ వర్షంతోపాటు బలమైన గాలులు వీస్తుండటంతో సాధారణ జనజీవనం స్తంభించింది. పుదుచ్చేరి, తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, మైలాడుతురై జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతపడనున్నాయి. ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని కంపెనీలను కోరారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అటు విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. చెన్నై నుంచి రాకపోకలు సాగించే విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇండిగో తెలిపింది. వాతావరణం మెరుగుపడిన తర్వాత విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది. -
ఏపీకి బిగ్ అలర్ట్.. ఆ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. రానున్న ఆరు గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో నాలుగు రెడ్ అలర్ట్‌లను వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని, రెడ్ అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.రేపు మధ్యాహ్ననికి పుదుచ్చేరి వద్ద తుపాను తీరాన్ని తాకనుంది. రెండు రోజులపాటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాముందన్న వాతావరణ శాఖ.. దక్షిణ కోస్తా పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక, రాష్ట్రంలో మిగతా పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. -
దూసుకొస్తున్న ‘ఫెంగల్’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : ఫెంగల్ తుపాను దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతూ ట్రింకోమలీకి తూర్పుగా 110 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కి.మీ., పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కి.మీ., చెన్నైకి ఆగ్నేయంగా 500 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ, విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపాయి. ఇది బుధవారం సా.5.30కు తుపానుగా బలపడింది. అనంతరం.. శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది. 30న దక్షిణ తమిళనాడు, శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశాలున్నాయని.. ఆ తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వెల్లడించాయి. దీని ప్రభావం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోనూ, రాయలసీమలోని తిరుపతి జిల్లాలోనూ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే, కోస్తాంధ్రలో అక్కడక్కడ గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా పడతాయన్నారు. ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని.. అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మత్స్యకారులెవరూ డిసెంబరు 3 వరకూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక తుపాను కారణంగా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక.. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సిగ్నల్–4తో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు.. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 9491077356 (చిత్తూరు).. నెల్లూరు ప్రజలు 0861–2331261 టోల్‌ఫ్రీ నంబర్లలో సంప్రదించాలి. అధికారులకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు రద్దుచేశారు.రైతులు అప్రమత్తంగా ఉండాలి..ఫెంగల్ తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంట పొలాల్లో నిలిచే అదనపు నీరు వీలైనంత త్వరగా బయటకుపోయేలా రైతులు ఏర్పాట్లుచేసుకోవాలి. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలి. – రోణంకి కూర్మనాథ్, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ -
ఏపీని భయపెడుతున్న తుపాను
సాక్షి, విశాఖ: తమిళనాడుతో పాటు ఏపీని కూడా తుపాను భయపెడుతోంది. ఈ రాత్రికి తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంటోంది. ఫెంగల్ తుపాను సమీపించే కొద్దీ.. భారీ వర్షాలు అతలాకుతలం చేస్తాయని హెచ్చరిస్తోంది... ఇప్పటికే దక్షిణ కోస్తా భారీ వర్షాలు, తీవ్ర గాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మరో ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది. కోస్తా తీరం వెంబడి ఉన్న పోర్టులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు నేపథ్యంలో వ్యవసాయ పనులు చేసే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది అధికార యంత్రాంగం. ఇక.. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. .. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బుధవారం ఉదయం చెన్నైకు దక్షిణ ఆగ్నేయ దిశలో 550 కి.మీ, పుదుచ్చేరికి 470 కి.మీ కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ.. తుపానుగా మారే అవకాశం ఉంది. రాగల రెండ్రోజులు ఉత్తర ఆగ్నేయ దిశలోనే ప్రయాణించి తమిళనాడు తీరంలో కేంద్రీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలో పలు చోట్ల గురువారం, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అన్నారాయన.ఏపీపై తుపాను ప్రభావం వారంపాటు కొనసాగనుంది. రేపు సాయంత్రం నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజుల్లో.. దక్షిణ కోస్తా. రాయలసీమ, ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఈ నెల 30వ తేదీ దాకా మత్య్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు ఇదివరకే జారీ అయ్యాయి. ఇంకోవైపు.. తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇప్పటికే తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది అక్కడి విద్యాశాఖ. -
‘ఫెంగల్’ తుఫాన్.. తమిళనాడు,పుదుచ్చేరిలకు రెడ్ అలర్ట్
చెన్నై:తమిళనాడు,పుదుచ్చరిలకు భారత వాతవావరణశాఖ రెడ్అలర్ట్ జారీ చేసింది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం తుఫానుగా మారనుందని వెల్లడించింది.ఫెంగల్ తుఫాను ప్రభావంతో బుధ,గురు వారాల్లో తమిళనాడులోని మూడు జిల్లాలు పుదుచ్చేరిలోని కారైకల్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు,పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో గురువారం నుంచి శనివారం వరకు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.ప్రస్తుతం తుపాను తమిళనాడులోని నాగపట్నం నుంచి 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి తుపాను దగ్గరగా రానున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
AP: నేడు తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర వాయవ్యంగా ప్రయాణించి బుధవారం తుపానుగా మారనుంది. తర్వాత కూడా అదే దిశలో ప్రయాణిస్తూ శ్రీలంక తీరానికి ఆనుకుని ప్రయాణించి.. ఈ నెల 29న నాటికి ఉత్తర తమిళనాడు వైపు రానుంది. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.ఈ నెల 29, 30 తేదీల్లో రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో అన్ని ప్రధాన ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్న దృష్ట్యా డిసెంబర్ 1వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు హెచ్చరించారు. తీవ్ర వాయుగుండం మంగళవారం రాత్రి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కి.మీ. దూరంలో, నాగపటా్ననికి దక్షిణ–ఆగ్నేయంగా 710 కి.మీ., చెన్నైకి దక్షిణ–ఆగ్నేయంగా 800 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపానుగా మారిన తర్వాత దానికి ‘ఫెంగల్’ అని పేరు పెట్టనున్నారు. -
దూసుకొస్తున్న తుపాను.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: తీవ్ర వాయుగుండం తమిళనాడు తీరం వైపు కదులుతూ బలపడుతోంది. ట్రికోమలీకి ఆగ్నేయంగా 310 కి.మీ, నాగ పట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 590 కి.మీ, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొద్ది గంటల్లో చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశముంది. తమిళనాడుకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు.. రానున్న ఆరు రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంద్ర జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. రానున్న 24 గంటలలో నెల్లూరు, తిరుపతిలలో భారీ వర్షాలు.. అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.ఈ నెల 30వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాముందని.. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు వేగంతో గాలులు విస్తాయని.. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదన్న వాతావరణ శాఖ.. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
AP: వాయుగుండం ముప్పు!
సాక్షి, అమరావతి/వాకాడు: దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాలపై కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సాయంత్రం ఇది 30 కిలో మీటర్ల వేగంతో కదులుతూ ట్రింకోమలీకి 530 కి.మీ, నాగపటా్ననికి 810 కి.మీ, పుదుచ్చేరికి 920 కి.మీ, చెన్నైకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.ఆ తర్వాత రెండు రోజుల్లో వాయవ్య దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 29వ తేదీ వరకు దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి మంగళవారం గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురిసే జిల్లాలు ఇవీ... ఈ నెల 26, 27, 28 తేదీల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 29వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎగసిపడుతున్న కెరటాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో సముద్ర తీరంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లాలోని చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల పరిధిలోని సముద్ర తీర ప్రాంతంలో సోమవారం అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద సముద్ర కెరటాలు దాదాపు ఏడు అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. సముద్రం మూడు మీటర్లు ముందుకు వచ్చింది. పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. ముందు జాగ్రత్తగా స్థానిక మత్స్యకారులు తమ బోట్లను ఒడ్డుకు చేర్చుకుని భద్రపరుచుకున్నారు. -
ఏపీలో పిడుగులతో వర్షాలు
అమరావతి, సాక్షి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయుగుండంగా మారి.. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరిస్తోంది.రేపటి నుంచి ఏపీపై వాయుగుండం ప్రభావం కనిపించనుంది. రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 28, 29న నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.తీరప్రాంతాల్లో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు.. కోస్తాంధ్రలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోస్తాంధ్ర రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. -
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రం–ఆగ్నేయ బంగాళాఖాతంపై విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో 25న వాయుగుండంగా బలపడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ తదుపరి రెండు రోజుల్లో తమిళనాడు–శ్రీలంక తీరాల వైపు వెళ్లి.. తీరం దాటనుందని వెల్లడించారు. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 27 నుంచి మూడురోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 35 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయనీ.. వాయుగుండంగా బలపడిన తర్వాత గాలుల ఉద్ధృతి పెరగనుందన్నారు. 26వ తేదీ నుంచి దక్షిణ కోస్తా తీరం వెంబడి గరిష్టంగా 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని 29వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. -
ఇదేమీ రాజకీయ సభకాదు.. సాయం చేసేందుకు వచ్చిన ప్రభం‘జనం’
స్పెయిన్‌లో ఇటీవలి భారీ వర్షాలు, వరదల్లో 210 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, చాలా మంది జాడ తెలియకుండా పోయారు. ఒక్క వలెన్సియాలోనే 155 మంది చనిపోయారు. సునామీ స్థాయిలో సంభవించిన తుపాను కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించడం తెలిసిందే. ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున సహాయక పనులకు చేపట్టింది. వేలాదిగా ఆర్మీని రంగంలోకి దించింది. వరదలతో దెబ్బతిన్న వలెన్సియా నగర వీధుల్లో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్న ప్రజలు..సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటామంటూ స్వచ్ఛందంగా తరలివచ్చిన వారితో శుక్రవారం వలెన్సియాలోని సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కల్చరల్ కాంప్లెక్స్ ఆవరణ కిక్కిరిసిపోయిందిలా..! స్పెయిన్‌ను వణికించిన వరదలుభారీ వర్షంతో ఆకస్మికంగా సంభవించిన వరదలతో స్పెయిన్ అతలాకుతలమైంది. తూర్పు, దక్షిణ స్పెయిన్‌లో భారీ వర్షాలు పడటంతో వరదలు వచ్చాయి. తద్వారా భారీ సంఖ్యలో కుటుంబాలు వీధిన పడ్డాయి. వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి.ఆకస్మిక భారీ వరదలకు మృత్యువాత పడ్డ వారి సంఖ్య 210కి చేరింది. మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీయగా, శిథిలాలుగా మారిన ఇళ్లు, బురదలో మునిగిన వీధులు.. గల్లంతు అయిన వారి కోసం బంధువులు పడే ఆందోళనలతో ఎక్కడ చూసినా విషాద ఛాయలే కనిపిస్తున్నాయి. -
నోటికందే కూడు నీటిపాలు!
మెదక్/ సిరిసిల్ల/ వీర్నపల్లి/ రుద్రంగి/ నిర్మల్/ వాజేడు: ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చాయి. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నీటి పాలవగా.. కొన్నిచోట్ల కోతకు వచ్చిన వరిపంట పొలాల్లోనే నేలకొరిగింది. దీనితో అన్నదాతలు ఆందోళనలో పడిపోయారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి ఇన్నిరోజులైనా ఇంకా కొనుగోళ్లు ఊపందుకోలేదని.. వర్షాలతో తమ ధాన్యం తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసు్తన్నారు. ఇప్పటికే ఆరిపోయి తేమశాతం తగ్గిన వడ్లు కూడా వర్షానికి తడిశాయని, మళ్లీ ఆరబెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రతీ గింజ కొంటామని ప్రభుత్వం ప్రకటించిందని.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని మండిపడుతున్నారు.తడిసిపోయిన ధాన్యం..రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే 156 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు మాత్రం మొదలుకాలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం హఠాత్తుగా కురిసిన వర్షంతో రైతులు ఆగమాగమయ్యారు. వీర్నపల్లి, రుద్రంగి మండల కేంద్రాల్లో టార్పాలిన్లు లేకపోవడంతో వడ్లు తడిసిపోయాయి. రుద్రంగి మండలం పరిధిలో రైస్‌మిల్లర్లు ధాన్యం దింపుకోబోమని చెప్తున్నారని రైతులు వాపోతున్నారు.⇒ మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. దుబ్బాక, మెదక్, నర్సాపూర్, కొల్చారం, చిన్నశంకరంపేట, కౌడిపల్లి, చిలప్‌చెడ్, నిజాంపేట, హత్నూర మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వేలాది క్వింటాళ్ల ధాన్యం నీటిపాలైంది. వర్షాల నేపథ్యంలో కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు.⇒ నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో శుక్రవారం గంటకుపైగా వాన కురిసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపైకి వరద చేరింది. కుంటాల మండలంలో కోతకు వచ్చిన వరి నేలవాలింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి, జైపూర్ మండలాల్లో సుమారు 4000 ఎకరాలకుపైగా వరి నేలవాలింది. భీమిని, కన్నెపల్లి మండలాల్లో వందల ఎకరాల్లో పత్తి తడిసిపోయింది.పిడుగుపాటుకు ఇద్దరు మృతిరాష్ట్రంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో పత్తి ఏరుతుండగా పిడుగుపడి గడ్డం నాగమ్మ (26) అనే మహిళ మృతి చెందింది. ఇక ములుగు జిల్లా వాజేడు మండలం కృష్ణాపురంలో వ్యవసాయ భూమిలో ఎడ్లను మేపుతుండగా పిడుగుపాటుకు గురై సొనప నవీన్ (24) మృతి చెందాడు. -
Bengaluru: కార్లు వదిలి నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు, ఎందుకంటే!
బెంగళూరు పేరు చెబితేనే ట్రాఫిక్ అంటూ వాహనదారులు భయపడిపోతూ ఉంటారు. కిలోమీటర్ దూరానికే గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని సగం జీవితం రోడ్డుపైనే గడపాల్సి వస్తుందంటూ తరచూ నగరవాసులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. సాధారణ సమయంలోనే ఇలా ఉంటే.. అదే వర్షాలు కురిసి వరద నీటితో రోడ్లు అన్నీ నిండిపోయిన సందర్భంలో ఏర్పడే ట్రాఫిక్ గురించి ఇక చెప్పనవసరం లేదు.తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది. బుధవారం కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతలమైంది. పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. మోకాళ్లలోతు నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టెకీలంతా తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఫ్లైఓవర్‌పై భారీగా జామ్ నెలకొంది. దాదాపు మూడు గంటలకు పైగా ఫ్లైఓవర్‌పైనే చిక్కుకుపోయిన పరిస్థితి తలెత్తింది. దీంతో విసుగుచెందిన కొందరు తమ కాళ్లకు పని చెప్పారు. వాహనాలను వదిలేసి నడుచుకుంటూ ఇంటి బాట పట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.Completely Jammed from past 1.5 hrs in the #electroniccity flyover. I must have reached my home now which is 30kms away. Logged out at 5:20 and we are still stuck! We can see most of the employees of various companies frustrated and starting to walk. @madivalatrfps pic.twitter.com/wqvXuIArN6— KpopStan🤍 (@PratikfamHouse) October 23, 2024 -
తీవ్ర తుపానుగా ‘దానా’
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను తీవ్రరూపం దాల్చింది. ఇది వాయవ్య దిశగా గంటకు 12 కి.మీ. వేగంతో కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణిస్తోంది. గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మరింత బలపడనుంది. ప్రస్తుతం పారాదీప్‌కు ఆగ్నేయంగా 420 కి.మీ., దమరకు 450 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో పూరీ–సాగర్ ద్వీపం మధ్య గురువారం అర్ధరాత్రి నుంచి తీరం దాటే ప్రక్రియ ప్రారంభం కానుంది. శుక్రవారం ఉదయానికి ఒడిశాలోని బిటర్క నికా–దమర వద్ద తీరం దాటే సూచనలు కనిపి స్తున్నాయని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీవ్ర తుపానుగా బలపడటంతో తీరం దాటే సమయంలో గంటకు 100–110 కి.మీ. వేగంతో, గరిష్టంగా 120 కి.మీ. వేగంతో ఉధృత గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై తీవ్రంగా ఉంటుందన్నారు. అదేవిధంగా గురువారం మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందనీ.. మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు వానలు పడతాయని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ.. మత్స్యకారులెవరూ 25వ తేదీ వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. -
భవనం కుప్పకూలి ఐదుగురు మృతి.. డిప్యూటీ సీఎం సీరియస్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు వణికించాయి. మంగళవారం కురుసిన కుండపోత వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా బెంగళూరులో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తు భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు అయిదుగురు మృతి చెందారు.మరో ఏడుగురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 13 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో బీహార్‌కు చెందిన హర్మన్ (26), త్రిపాల్ (35), మహ్మద్ సాహిల్ (19), సత్యరాజు (25), శంకర్ ఉన్నారు.బెంగళూరు తూర్పు ప్రాంతంలోని హోరామావు అగరా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలిందదని, ప్రమాద సమయంలో భవనంలో దాదాపు 20 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాత్రి వరకు సహాయక చర్యలు ఆపేశారు. తిరిగి బుధవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సహాయక చర్యల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌తోపాటు డాగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించారు.A multi storey building collapsed with in seconds In Bengaluru. The building collapse killed one person with five people still missing. Fourteen workers have been rescued from the rubble at the construction site in Babusapalya. Building basement became weak due to continuous… pic.twitter.com/rM5dr5WVhf— V Chandramouli (@VChandramouli6) October 23, 2024భవనం కూలిన ప్రాంతాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సందర్శించారు. బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఐదుగురు మృతి చెందడం బాధాకరమని అన్నారు. అయితే భవన నిర్మాణం చట్టవిరుద్ధమని, దాని యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భవనానికి అనుమతి ఇవ్వలేదని అధికారులు చెప్రనిరు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న యజమాని, కాంట్రాక్టర్, దీనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బెంగళూరు వ్యాప్తంగా అన్ని అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపేసేలా తాము అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంట్రాక్టర్, యజమాని, అధికారులు ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని తెలిపారు.Rains and building collapse. This is in Anjanadri layout, near #HoramavuAgara 6 storey building under construction.. some workers are stuck inside sadly z pic.twitter.com/igamkHjA7L— HennurBlr (@HennurBlr) October 22, 2024 భవనం కూలిన ఘటనపై మాకు సమాచారం అందిన తర్వాత, అగ్నిమాపక యంత్రాలు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ ఠాకూర్ తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సమాచారం అందించామని, రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పారు.. తమకు అందిన సమాచారం ప్రకారం ప్రమాద సమయంలో 21 మంది కూలీలు ఉన్నారని, రోజూ 26 మంది ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపారు. 60/40 ప్లాట్‌లో ఇంత పెద్ద భవనాన్ని నిర్మించడం నేరమని, మూడుసార్లు నోటీసులు జారీ చేశామని చెప్పారు. మరోవైపు రికార్డు స్థాయిలో భారీ వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దక్షిణ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సహాయక చర్యలు చేపట్టారు. బెంగళూరు నగరానికి నేడు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సిటీలోని పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు.ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలని సూచించారు. -
హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీగా వరద
సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురంలో భారీ వర్షాలు ముంచెత్తాయి. అనంతపురం, పెనుకొండ, ధర్మవరం, రాప్తాడులో కురిసిన వర్షానికి.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అనంతపురం పట్టణంలోని పలు శివారు కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి.వరదలో ఇళ్లు మునిగిపోగా ఆటోలు, బైక్‌లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో కాలనీ వాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదకు సామాగ్రి, నిత్యవసర సరుకులు కొట్టుకుపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వరదనీటితో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. వరదలో బస్సులు, లారీలు, కారులు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
24 నుంచి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి తుపాను ముప్పు పెద్దగా లేకపోయినా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రంలో సోమవారం తెల్లవారుజామున ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలపడిందని, ఇది పశి్చమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారానికి వాయుగుండంగా, బుధవారానికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని తెలిపింది. ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించి గురువారం ఉదయానికి ఒడిశా–పశి్చమ బెంగాల్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున ఇది తీవ్ర తుపానుగా ఉత్తర ఒడిశా, పశి్చమ బెంగాల్ తీరాల సమీపంలో పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.తుపాను సన్నద్ధతపై సోమవారం ఢిల్లీ నుంచి కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇందులో ఏపీ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. నేవీ అధికారులతో సమన్వయం చేసుకుని సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రప్పించినట్లు తెలిపారు. -
తిరుమలలో భారీ వర్షం..ఘాట్ రోడ్ పై విరిగిపడ్డ కొండచరియలు (ఫొటోలు)
-
#APHeavyRains : ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (ఫొటోలు)
-
వణికిస్తున్న వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రాష్ట్రాన్ని వణికిస్తోంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లోనూ రెండ్రోజులుగా ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. వర్షాల తీవ్రతకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నెల్లూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై ఉండడంతో జన జీవనానికి ఇబ్బంది ఏర్పడింది. మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అతిభారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.నేడు తీరం దాటనున్న వాయుగుండంఇక బుధవారం రాత్రికి చెన్నైకి 190 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 250 కిలోమీటర్లు, నెల్లూరుకి 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడులోని పొన్నేరి–తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట మధ్యలో బుధవారం అర్థరాత్రి 12 నుంచి గురువారం వేకువజామున 3 గంటలలోపు తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత అల్పపీడనంగా బలహీన పడే అవకాశం ఉందని వెల్లడించింది.దీని ప్రభావంతో గురువారం రాత్రి వరకు రాయలసీమలోని నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్లు వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అయితే సూళ్లూరుపేట, తడ మండలాలకే ఎక్కువ ప్రమాదం ఉన్నట్లుగా హెచ్చరిస్తున్నారు. తేరుకుంటున్న చెన్నై.. సాక్షి, చెన్నై/సాక్షి, బెంగళూరు : వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చెన్నైలో బుధవారం క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 450 ప్రాంతాల్లో వరద నీటిని పూర్తిగా తొలగించారు. కానీ, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు అవస్థలు తప్పలేదు. కొన్ని కుటుంబాలను పడవల ద్వారా శిబిరాలకు తరలించారు. వాయుగుండం గురువారం తీరం దాటే అవకాశాలతో రెడ్ అలర్ట్‌ను కొనసాగిస్తున్నారు. చెన్నై శివార్లలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించారు. బెంగళూరు విలవిల.. మరోవైపు.. భారీ వర్షాలకు ఐటీ రాజధాని బెంగళూరు వణికిపోతోంది. వర్షాల తీవ్రత మంగళవారం ఎక్కువగా ఉండగా, చాలావరకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. తిరుపతిలో భారీ వర్షాలు..వాయుగుండం ప్రభావంతో తిరుపతి జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోని పలుచోట్ల చెరువు కట్టలు దెబ్బతిన్నాయి. తిరుపతిలో 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. పిచ్చాటూరు మండలంలోని అరణియార్ ప్రాజెక్టుకు ఒక్కసారిగా 20 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. ఇప్పటివరకు జిల్లాలో సరాసరి 198.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.మరోవైపు.. తిరుమలలోనూ భారీ వర్షం కురుస్తోంది. దీంతో రెండో ఘాట్ రోడ్డులోని 15వ మైలు వద్ద, భాష్యకార్ల సన్నిధికి సమీపంలో, హరిణి వద్ద బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలతో తిరు మాడవీధుల్లో, శ్రీవారి ఆలయం ఎదుట నీరు ప్రవహిస్తోంది. మరోవైపు.. వర్షాల కారణంగా తిరుమలలోని డ్యాముల్లోకి పెద్దఎత్తున నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఐదు డ్యాములకు 250 లక్షల గ్యాలన్ల నీరు వచ్చిచేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. బుధవారం ఉ.7.35 గంటలకు హైదరాబాద్ నుంచి తిరుపతి విమానాశ్రయానికి ప్రయాణికులతో ఇండిగో విమానం చేరుకుంది.ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో చెన్నైకు వెళ్లింది. అక్కడ రన్‌వేపై నీళ్లు ఉండటంతో తిరిగి రేణిగుంటకు చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా దింపి మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. అలాగే హైదరాబాద్ నుంచి తిరుపతి రావాల్సిన మరో ఇండిగో విమాన సర్వీసు రద్దయింది. అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరుతోపాటు రాజంపేటలలో వరి, బొప్పాయి, అరటికి నష్టం జరిగింది.శ్రీవారి మెట్టు మార్గం మూసివేత..ఇక భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని గురువారం వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది. అలాగే, బుధవారం రాత్రి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ఈఓ శ్యామలరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులతో వర్చువల్‌గా జరిగిన సమావేశంలో ఆదేశించారు. కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి వాటికీ ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం చూడాలన్నారు.నెల్లూరు జిల్లాలో అత్యవసర పరిస్థితి..మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కలెక్టర్ ఆనంద్ జిల్లాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అధికారులు, రెవెన్యూ, పంచాయతీ ఉద్యోగులకు సెలవులను రద్దుచేశారు. పెన్నా పరీవాహక ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేçస్తూ కలెక్టర్‌తో పాటు ఎస్పీ కృష్ణకాంత్, అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక నెల్లూరు నగరంలో వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని సుమారు 8.50 లక్షల జనాభాలో దాదాపు 1.5 లక్షల మంది వర్ష ప్రభావానికి గురయ్యారు. ఇక పలుచోట్ల వాగులు పొంగిపొర్లడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.అలాగే, జిల్లాలో పలుచోట్ల సముద్రం ఐదారు మీటర్ల వరకు ముందుకొచ్చింది. మూడు నుంచి నాలుగు మీటర్ల వరకు అలలు ఎగసిపడుతున్నాయి. బాపట్ల జిల్లా సూర్యలంక సముద్రతీరం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్కసారిగా 120 అడుగుల మేర ముందుకు వచ్చింది. పౌర్ణమిరోజు వచ్చే పోటు సమయంలో సహజంగా 20 అడుగుల మేర సముద్రం ముందుకొస్తుంది. తీరంలోని వాచ్టవర్లు, తాత్కాలిక విశ్రాంతి బెడ్స్,, పర్యాటకులు కూర్చునే బల్లలను దాటుకుని సముద్రపునీరు ముందుకొచ్చింది. జిల్లాలో 14 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి బాధితులను వీటిలోకి తరలించారు. ఉలవపాడు మండల పరిధిలోని మన్నేటికోట గ్రామంలోని పునరావాస కేంద్రంలో బాధితుల్ని గాలికొదిలేశారు. రెవెన్యూ సిబ్బంది కొంత బియ్యం, కూరగాయలు షెల్టర్ వద్ద ఉంచి వెళ్లిపోయారు. దీంతో గిరిజనులే వండుకున్నారు. అధికారులు బుధవారం మధ్యాహ్నం వరకు కూడా భోజనాల ఏర్పాట్లుచేయలేదు. బాధితులే వండుకున్నారు. కానీ, ఉన్నతాధికారులకు పంపే రిపోర్టులో మాత్రం పునరావాసంలో అన్నం వండి వారికి పెట్టినట్లుగా పేర్కొన్నారు. 8 ప్రకాశం జిల్లా అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. సింగరాయకొండ, కొత్తపట్నం, ఒంగోలు, సంతనూతలపాడు సముద్రతీర ప్రాంతాల్లో ఈదురు గాలుల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు వేట నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులకు గండ్లు పడటం, చెరువు కట్టలు తెగిపోవడం, పలుచోట్ల సప్టాలు మునిగిపోయాయి. ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నివాస ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
అడ్రస్ లేని ఎమ్మెల్యే ఆరణి
వాయుగుండం ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. మురుగు కాలువలు ఉప్పొంగడంతో కాలనీలకు కాలనీలే దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఉంటే స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. బాధితులను ఆదుకోవడం సంగతి దేముడెరుగు.. కనీసం పరామర్శించి పాపాన పోలేదు. అధికారులు ఏర్పాటు చేసిన పునరావాసకేంద్రాలను సైతం సందర్శించలేదు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులు సైతం కనుచూపు మేరలో కనిపించకుండా పోయారు. కూటమి నేతల వైఖరిపై నగరవాసులు మండిపడుతున్నారు. ఆపత్కాలంలో ఆదుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడు అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అందించిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించిన తీరును కొనియాడుతున్నారు.తిరుపతి తుడా : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తిరుపతి నగరంలో కుంభవృష్టి కురుస్తోంది. రోడ్లపై వర్షపు నీరు భారీగా ప్రవహిస్తోంది. డ్రైనేజీలు పొంగడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో స్థానికుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. బాధితులను ఆదుకునే వారు కరువయ్యారు. పునరావాస కేంద్రాలకు చేరిన ముంపు ప్రాంతవాసులను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు తిరుపతి ఎమ్మెల్యే, కూటమినేతలు వాటిని ఆ కేంద్రాల్లో ప్రజలు ఎలా ఉన్నారో కనీసం పరామర్శించలేదని పలువురు విమర్శిస్తున్నారు. కష్టకాలంలో అండగా నిలవాల్సిన ఎమ్మెల్యే అడ్రస్ లేకుండా పోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు మాత్రం వేయించుని, అధికారం చేపట్టి, ప్రజలు నరకం అనుభవిస్తుంటే పలకరించేందుకు కూడా రాలేదని వాపోతున్నారు.మాజీ ఎమ్మెల్యేపై ప్రశంసలుగతంలో ఇలాగే తిరుపతిలో భారీ వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయమైన సందర్భంలో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అందించిన సేవలు మరువలేమని ప్రజలు ప్రశంసిస్తున్నారు. చిమ్మ చీకట్లో, నడుము లోతు నీటిలో క్షేత్రస్థాయిలో పర్యటించి ధైర్యం చెప్పిన తీరును చర్చించుకుంటున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారని గుర్తుచేసుకుంటున్నారు. అప్పట్లో వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న గృహాలకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందించారని వెల్లడిస్తున్నారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు వంతున సాయం చేశారని వివరిస్తున్నారు. పునరావాస కేంద్రంలో చేరిన ప్రతి వ్యక్తికీ రూ.2వేలు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. భూమన స్ఫూర్తితో ఇప్పుడు కూడా వర్ష బాధితులకు ఆర్థికంగా చేయూత అందించాలని కోరుతున్నారు. -
వాయుగుండం : ఏపీలో దంచికొడుతున్న వానలు (ఫొటోలు)
-
చెన్నై, బెంగళూరులో భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు
చెన్నై: దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నై, బెంగళూరులో పాఠశాలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.#WATCH | Chennai, Tamil Nadu: Heavy rainfall causes waterlogging in several parts of the city(Visuals from Choolaimedu area) pic.twitter.com/3hWHlXfPSL— ANI (@ANI) October 16, 2024 భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పేట జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మూసివేయలని పేర్కొంది.Good morning #Chennai. 16 Oct 4:45 am : System moving North West towards North TN and South AP coast #Chennairains #Chennai Most of the main band over South Andhra coastDrizzle rain band over #Chennai. No need to worry for now. pic.twitter.com/r7aWnpm5nd— Chennai Weather-Raja Ramasamy (@chennaiweather) October 15, 2024రేపు (గురువారం) తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి, నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పీడన ప్రాంతం పశ్చిమం నుంచి వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం అల్పపీడనంగా మారింది. మరోవైపు భారీ వర్ష సూచన నేపథ్యంలో బెంగళూరు, చెన్నైలలో బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని నగరంలో మోహరించారు.Palavanthangal Subway. 7 AM #ChennaiRains pic.twitter.com/v2YIiRUxv3— Dhivya Marunthiah (@DhivCM) October 16, 2024 3 தலைமுறையா கொள்ளை அடிச்சுட்டு இருக்கானுங்க அப்பவும் பத்தல போல.அவ்ளோ பணத்த வச்சு என்னதான் பண்ணுவானுங்களோ, கொஞ்சமாவது மக்கள் நலனுக்கு செலவு பண்ணுங்கடா!!!#ChennaiRains pic.twitter.com/YamVQQ0Zo2— Arvinth Easwaran (@arvinth_e) October 16, 2024 ‘‘బెంగళూరులో భారీ వర్షాల నేపథ్యంలో బెంళూరులో హై అలర్ట్ ప్రకటించాం. ఇప్పటికే బెంగళూరులో సుమారు 60 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మోహరించాం. ఏదైనా అవసరం కోసం సిద్ధంగా ఉండటానికి మరో 40 మందిని మళ్లీ నియమించాం. అగ్నిమాపక , అత్యవసర సేవలను సిబ్బందిని అందుబాటులో ఉంచాం’ అని కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ తెలిపారు.Current situation of BangloreAs Per Wheather Reports 5 Days light moderate and some time Heavy rain at Banglore#BangloreRains #INDvsNZpic.twitter.com/oYC0GKyXxf— Cricket Manchurian (@Cric_man07) October 16, 2024Bengaluru Weather Alert: Depression taking slightly northwards path. #Bengaluru will experience cloudy weather with intermittent light rain or drizzle for 36 hours with moderate rain spells in afternoon/evening. Strong impact will be near #Hindupur -#Nellore belt slightly north. pic.twitter.com/mQSFRb4AEL— 🛑 Bengaluru Rain Alert (@Bengalururain) October 16, 2024 -
వాయుగుండం ముప్పు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి మళ్లీ వర్షాల ముప్పు పొంచి ఉంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చి మ వాయువ్య దిశగా పయనిస్తూ తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు తూర్పు–ఆగ్నేయంగా 490 కి.మీ., పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 500 కి.మీ, నెల్లూరు(ఆంధ్రప్రదేశ్)కి ఆగ్నేయంగా 590 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ నెల 17వ తేదీన తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పశ్చి మ–వాయువ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. రానున్న మూడు రోజులు ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నెల్లూరుకు సమీపంలో తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుందని, తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. పలుచోట్ల భారీ వర్షాలు ఇప్పటికే రెండు రోజుల నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా విడదలూరు మండలం ఊటుకూరులో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు అత్యధికంగా 15.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అల్లూరి మండలం ఇసుకపల్లిలో 14.6, తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరంలో 13.5, ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం దేవరంపాడులో 13.3, నెల్లూరు జిల్లా కావలి, ఉలవపాడు మండలం కారేడులో 13.2, కొడవలూరులో 12.4, బుచ్చిరెడ్డిపాలెంలో 11.4 సెంటీమీటర్లు చొప్పున వర్షం కురిసింది. తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద మంగళవారం సముద్రపు కెరటాలు 5 మీటర్లు ఎత్తుకు ఎగసి పడుతున్నాయి. దాదాపు 8 నుంచి 10 మీటర్లు వరకు సముద్రం ముందుకు రావడంతో తీరం కోతకు గురవుతోంది. అప్రమత్తంగా ఉండండి: సిసోడియా భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఆయన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రజలకు హెచ్చరికలు జారీ చేసే విధానంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అత్యవసరమైతే శాటిలైట్ ఫోన్లు వినియోగించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ‘నైరుతి’కి సెలవు నైరుతి రుతుపవనాలు దేశమంతటి నుంచి ఉపసంహరణ పూర్తయింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా రాష్ట్రంపై ప్రభావం చూపాయి. జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు చూస్తే.. సాధారణంగా 686 మి.మీ. సగటు వర్షపాతం కాగా.. 10.7 శాతం అధికంగా వర్షాలు కురిసింది. నైరుతి సీజన్లో 758.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
తమిళనాడులో భారీ వర్షాలు (ఫొటోలు)
-
ఏపీకి 4 రోజుల పాటు భారీ వర్షం
-
ఎడతెరిపిలేని వాన
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామునుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో విద్యాసంస్థలకు అత్యవసరంగా సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సగటున 54.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి జిల్లాలో సగటున 25.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.ఒంగోలు బస్టాండ్ సెంటర్ సహా నగరంలోని కాలనీలన్నీ జలమయం అయ్యాయి. జల వనరుల శాఖ ఎస్ఈ కార్యాలయ భవనంలోకి వర్షం నీరు చేరింది. వైఎస్సార్ జిల్లాలో చిరుజల్లులు కురిశాయి. సిద్ధవటంలో అత్యధికంగా 29.6 మి.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు, వాకాడు, తడ మండలాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం నుంచి భీకర శబ్దాలు వెలువడుతున్నాయి. సముద్రాన్ని చూసేందుకు వెళ్లే వారిని స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు.తిరుమలలో హై అలర్ట్ తిరుమల: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 48 గంటల్లో తిరుమలలో విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులంతా సంసిద్ధంగా ఉండాలని కోరారు.కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్య శాఖ అంబులెన్సులను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం సిద్ధంగా ఉండాలన్నారు. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ దృష్ట్యా 15న మంగళవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.రైళ్ల రాకపోకలకు అంతరాయం తెనాలి రూరల్: భారీ వర్షాల కారణంగా చెన్నై–విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు పొన్నూరు–బాపట్ల స్టేషన్ల మధ్య డౌన్ లైన్ వద్ద భూమి కుంగుతోంది. దీని కారణంగా పట్టాలు దెబ్బతిని రైళ్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండడంతో ఈ డౌన్ లైన్లో మాచవరం స్టేషన్ వద్ద నుంచి రైళ్ల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపడుతున్నారు. ఈ కారణంగా పలు రైళ్లను బాపట్ల, చీరాల, ఒంగోలులో నిలిపివేశారు. చెన్నైలో ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై, కోయంబత్తూరు తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం, శివారులలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు అతి భారీ వర్ష సూచనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ఈ నాలుగు జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ నెల 18 వరకు వర్క్›ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. -
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలే
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాలు ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలోనే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. రాబోయే రెండు రోజుల్లో ఇది వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.ఇది దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలకు చేరుతుందని.. ఆ తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలవైపు చేరే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 40నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.నేడు వర్షం కురిసే జిల్లాలుఅల్పపీడనం ప్రభావంతో మంగళవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.16న భారీ వర్షాలుదీని ప్రభావం వల్ల బుధవారం బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.17న వర్షాలు కురిసే జిల్లాలు17వ తేదీన గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.కలెక్టర్లకు సీఎస్ సూచనలుభారీ వర్షాల హెచ్చరికలతో నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ సోమవారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాతో కలిసి ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెన్నా పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. ఒరిగిన విద్యుత్ స్తంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండరాదన్నారు. పాత భవనాలను వదిలి ముందుగానే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం
అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో చైన్నె నగరం, శివారు జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో మాదిరి మరోమారు ఈ ప్రాంతాలు వరద విలయంలో చిక్కకుండా ముందుజాగ్రత్త చర్యలను విస్తృతం చేశారు. మంగళవారం చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు తమ సిబ్బంది ద్వారా ఆఫీసులలో కాకుండా, వర్క్ ఫ్రం హోం కేటాయించాలని సూచించారు. చైన్నె, శివారు జిల్లాలోని ప్రధాన ప్రాంతాలను మంత్రులు, ఐఏఎస్‌ల బృందం నిత్యం పర్యవేక్షిస్తోంది. పుదుచ్చేరి లోనూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.సాక్షి, చైన్నె: ఉపరితల ఆవర్తనం రూపంలో గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో చెదురు ముదురు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి క్రమంగా వరుణాగ్రహం తీవ్రమైంది. తొలుత మదురై, దిండుగల్, తిరుచ్చి జిల్లాలోనూ తర్వాత కోయంత్తూరు, ఈరోడ్ తదితర చోట్ల కుండపోతగా వర్షం పడింది. ఆదివారం రాత్రంతా అనేక జిల్లాలో వర్షాలు కొనసాగాయి. సోమవారం విల్లుపురం, కడలూరు, అరియలూరు,పెరంబలూరు తదితరప్రాంతాలలో అనేక చోట్ల వర్షం పడింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా బూదలూరులో 12 సెం.మీ వర్షం పడింది. వర్షాలతో తేని, మదురైలోని జలపాతాలు, వైగై జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగింది. కావేరి తీరంలో కురుస్తున్న వర్షాలకు మే ట్టూరు జలాశయంలో కి సెకనుకు 17 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దిండుగల్‌లోని వరదమానది రిజర్వాయర్ నిండడంతో ఉబరి నీటిని విడుదల చేస్తున్నారు. మ దురై, దిండుగల్,కోయంబత్తూరులలోని లోతట్టు ప్రాంతాలలో చేరిన నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. మదురైలో వర్షాలకు కోట్టం పట్టి వద్ద విద్యుత్ తీగ తెగి పడడంతో రైతు గణేషన్(50) మరణించాడు. పూంజుత్తి ప్రాంతానికి చెందిన రామచంద్రన్ (58) విద్యుదాఘాతానికి గురై బలయ్యాడు.నామక్కల్ తిరుచంగోడువద్ద తిరుమని ముత్తారునదిలో పాల వ్యాపారి పెరిస్వామి(63) మోటారు సైకిల్‌తో పాటు కొట్టుకెళ్లి మరణించాడు.అల్పపీడన ప్రభావంతో..బంగాళాఖాతంలో సోమవారం ఉదయం 5.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. దక్షిణమధ్య బంగా ళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ ద్రోణి వా యువ్య దిశలో పయనించి మంగళవారం సెంట్రల్ బంగాళా ఖాతంలో వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో చైన్నె నగరం, శివారు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు డెల్టాలోని నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, పుదుకోట్టై, మైలాడుతురై జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో అతిభారీ వర్షాలు, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, వేలూరు జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశాల ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. చైన్నె, శివా రులలో ఒకే రోజు 20 సెం.మీ వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మూడు రోజులు సరా సరిగా 40 సెం.మీ వర్షం పడేందుకు అధిక అవకాశాలు ఉందన్న సమాచారంతో చైన్నె, శివారు జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. శివారుల నుంచే అధిక నీరు నగరంలోకి రావడం, వరద ముంపు ఎదుర కావడం వంటి పరి ణామాలు గతంలో జరగడంతో ఈ సారి శివారు ప్రాంతాలపై మరింతగా అధికార యంత్రాంగం ఎక్కువ దృష్టి సారించింది. మంగళవారం చైన్నె, శి వారు జిల్లాలో స్కూళ్లు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ప్రైవేటు సంస్థల సిబ్బందికి వర్క్ ఫ్రంహోంకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.మంత్రుల ఉరుకుల.. పరుగులుడిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, నగరాభివృద్ధి శాఖమంత్రి కేఎన్ నెహ్రూ, ఎంఎస్ఎంఈ మంత్రి అన్బరసన్, దేవదాయ మంత్రి శేఖర్‌బాబు, ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తదితరులు చైన్నె, శివారు జిల్లాల వైపుగా పరుగులు తీశారు. ముందు జాగ్రత్తలను విస్తృతం చేశారు. జె. మేఘనాథరెడ్డి, సమీరన్, కుమర వేల్ పాండియన్, ఎస్ రామన్, శ్రేయ, కన్నన్, జాన్ వర్గీస్, విశాఖన్ తదితర ఐఏఎస్ అధికారులను మండలాల వారీగా రంగంలోకి దించారు. శివారులోని తాంబరంలో 19 చోట్ల శిబిరాలను ఏర్పాటు చేశారు. శివారులతోపాటూ చైన్నెలో భారీ వర్షం కురిసినా నీరు సులభంగా సముద్రంలోకి వెళ్లే విధంగా ముఖద్వారం వద్ద పూడికతీత శరవేగంగా సాగుతోంది. ఇక్కడకు కొట్టుకు వచ్చే చెత్త చెదారాన్ని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాలలో ముందు జాగ్రత్తలతో పాటు ఇక్కడి ప్రజల కోసం శిబిరాలను సిద్ధం చేశారు. చైన్నెలో 18 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మరో 16 పోలీసు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ఇదిలా ఉండగా చైన్నె శివారులలోని వేళచ్చేరి పరిసరాలలోని లోతట్టు ప్రాంతవాసులు ముందు జాగ్రత్తగా తమ కార్లను సమీపంలోని వంతెనల మీద పార్క్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అన్ని పాఠశాలలలో పరిస్థితులు, విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాల అధికారులకు విద్యాశాఖ డైరెక్టర్ కన్నన్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అలాగే అన్ని ఆస్పత్రులలో మందులు పుష్కలంగా ఉండాలని, వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి ఎంసుబ్రమణియన్ ఆదేశించారు. వండలూరు, గిండిలలోని పార్కులలో ఉన్న పక్షలు, వన్య ప్రాణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈశాన్య రుతు పవనాల అలర్ట్ చేస్తూ, ముందు జాగ్రత్తల విస్తృతంపై సీఎస్ మురుగానంద్ లేఖ రాశారు.అత్యవసర సేవల నంబర్లు ఇవే..అతి భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సేవలకు గాను చైన్నె కార్పొరేషన్ యంత్రాంగం హెల్ప్‌లైన్ నం బర్లను ప్రకటించింది. మండలాల వారీగా అఽధికారులు, వారి సెల్ నెంబర్లను విడుదల చేసింది.ప్రాంతం అధికారి సెల్ నంబరుతిరువొత్తియూరు బాబు 94445 90102మనలి గోవిందరాజు 94445 90002మాదవరం తిరుమురుగన్ 94445 90003తండయార్ పేట శరవన్ ముర్తి 94445 90004రాయపురం ఫరీదా బాబు 94445 90005తిరువీకానగర్ మురగన్ 94445 90006అంబత్తూరు తమిళ్ సెల్వన్ 94445 90007అన్నానగర్ సురేష్ 94445 90008తేనాంపేట మురుగ దాసు 94445 90009కోడంబాక్కం మురుగేషన్ 94445 90010వలసరవాక్కం ఉమాపతి 94445 90011ఆలందూరు పీఎఎస్ శ్రీనివాసన్ 94445 90012అడయార్ పీవీ శ్రీనివాసన్ 94445 90013పెరుంగుడి కరుణాకరన్ 94445 90014షోళింగనల్లూరు రాజశేఖరన్ 94445 90015హెల్ప్‌లైన్ నంబర్లుకార్పొరేషన్ కంట్రోల్ రూం –1913స్టేట్ కంట్రోల్ రూం –1070 -
అల్పపీడనం ప్రభావం..నెల్లూరు జిల్లాలో భారీ వర్షం (ఫొటోలు)
-
రేపు తీవ్ర అల్పపీడనం.. దక్షిణకోస్తాకు భారీ వర్ష సూచన
సాక్షి,విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం(అక్టోబర్14) అల్పపీడనం ఏర్పడింది. రేపటికి ఈ అల్పపీడనం తీవ్రరూపం దాల్చే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి 35- 45కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీయనున్నాయి. -
AP: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/వాకాడు/మహారాణిపేట (విశాఖ జిల్లా): బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉందని సోమవారానికి ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 16–18వ తేదీ వరకు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావం రాయలసీమలో ఎక్కువగా..కోస్తాంధ్రలో మోస్తరుగా ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నేడు వర్షాలు కురిసే జిల్లాలు సోమవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూÆý‡ు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మంగళవారం కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలకు అవకాశమున్నట్లు తెలిపింది.బుధవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. గురువారం అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.6 మీటర్లు ముందుకు వచి్చన సముద్రం తిరుపతి జిల్లా వాకాడు మండలంలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. తూపిలిపాళెం వద్ద సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సముద్రం 6 మీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చింది. దీంతో మత్స్యకారులు తమ బోట్లు, వేట సామగ్రిని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు -
50 ఏళ్లలో తొలిసారి సహారా ఎడారిలో వరదలు.. ఫోటోలు వైరల్
ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారాలో అత్యంత అరుదైన దృశ్యం కనిపించింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు సహారా ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ప్రవహించింది. ఆగ్నేయ మొరాకోలోని ఎడారి ప్రాంతంలో వర్షం పడడమంటే చాలా అరుదైన ఘటన. మొరాకో ప్రభుత్వ సమాచారం మేరకు సెప్టెంబరులో రెండురోజుల పాటు కురిసిన వర్షం.. చాలా ప్రాంతాల్లో ఏడాది సగటును మించిపోయింది.ఇక్కడ ఏటా 250 మి.మీ. కంటే తక్కువగా సగటు వర్షపాతం నమోదవుతుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజధాని రబత్కు 450 కి.మీ. దూరంలోని టాగౌనైట్ గ్రామంలో 24 గంటల్లోనే 100 మి.మీ. కంటే ఎక్కువ వర్షం కురిసిందని.. ఇది అత్యంత అరుదైన పరిణామమని పేర్కొన్నాయి. జాగోరా, టాటా మధ్య 50 ఏళ్లుగా పాటు పొడిగా ఉన్న ఇరికీ సరస్సు వరద కారణంగా తిరిగి నిండినట్లు నాసా తీసిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడవుతోంది. గత 30 నుంచి 50 సంవత్సరాల నుంచి ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ వర్షాలు కురవడం ఇదే తొలిసారి అనిి మొరాకో వాతావరణ సంస్థ అధికారి హౌసీన్ యూబెబ్ పేర్కొన్నారు. కాగా గత నెలలో మొకరాలో సంభవించిన వరదలు 18 మందిని బలిగొన్నాయి.ఇక సహారా ఎడారి, ఉత్తర, మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికా అంతటా 9 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా తీవ్రమైన వాతావరణ వేడిని ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఈ తరహా తుఫానులు మరింత తరచుగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
తమిళనాడు,పుదుచ్చేరిలో భారీ వర్షాలు
చెన్నై:తమిళనాడు,పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.తమిళనాడు డెల్టాప్రాంతంలో ఎనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ(ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై,పుదుచ్చేరి సహా ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. భారీ వర్షాలతో పుదుచ్చేరిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.పుదుచ్చేరిలో ప్రభుత్వాస్పత్రి జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో పేషెంట్లను మరో ఆస్పత్రికి అధికారులు తరలించారు. వర్షాలకు రోడ్లపై వరద నీరు చేరి చెన్నై,పుదుచ్చేరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తమిళనాడు సేలం జిల్లాలో సబ్వేలో వరద నీరు నిలిచింది.ఇదీ చదవండి: మురసోలి సెల్వమ్ కన్నుమూత -
Hurricane Milton: మిల్టన్ ధాటికి ఫ్లోరిడా అతలాకుతలం
మిల్టన్ తుఫాను ఫ్లోరిడాలో బీభత్సం సృష్టించింది. భయంకరమైన గాలులు, వర్షంతో నగరాలను అతలాకుతలం చేసింది. సెయింట్ లూసీ కౌంటీలో టోర్నడోల ధాటికి ఐదుగురు మరణించారు. విద్యుత్ లేక 30 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. బుధవారం రాత్రి 3 కేటగిరీగా తీరం దాటిన తుఫాను తరువాత ఒకటో కేటగిరీకి బలహీనపడింది. అయినా ముప్పు ఇంకా పొంచి ఉందని అధికారులు పునరుద్ఘాటించారు. టంపా: మిల్టన్ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ఫ్లోరిడా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. బుధవారం ఉదయం దక్షిణ ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాల్లో టోర్నడోలు సంభవించాయి. సెయింట్ లూసీ కౌంటీలో టోర్నడోల ధాటికి ఐదుగురు మృతి చెందారు. ఫ్లోరిడా అట్లాంటిక్ తీరంలోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఫోర్ట్ మైయర్స్లో మరో టోర్నడో ధాటికి చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్థంభాలు నేలకొరగడంతో రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. హార్డీ కౌంటీ, హైలాండ్స్ కౌంటీతో సహా పలు ప్రదేశాల్లో 90% మందికి విద్యుత్ అంతరాయం కలిగింది. సానిబెల్ నగరంలో రోడ్లన్నీ వరదతో ముంచెత్తాయి. రహదారులపై 3 అడుగుల మేర నీరు చేరింది. వరదలతో టంపా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. నేపుల్స్లో రికార్డు స్థాయిలో నీరు నిలిచింది. తుఫాను ధాటికి తీవ్ర ప్రాణ నష్టం జరిగి ఉంటుందని, అయితే ఎంత మంది చనిపోయారనేది చెప్పలేమని అధికారులు వెల్లడించారు. అత్యధిక వర్షపాతం... సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 41 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వెయ్యేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. ఈదురు గాలులు ట్రోపికానా ఫీల్డ్ పైకప్పును చీల్చాయి. తుపాను ధాటికి పలు క్రేన్లు కూడా కూలిపోయాయి. మంచి నీటి సరఫరాను సైతం నిలిపేశారు. సుదీర్ఘ విద్యుత్ అంతరాయాలు, మురుగునీటి పారుదల వ్యవస్థ సైతం మూతపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓర్లాండోలో వాల్ డిస్నీ వరల్డ్, యూనివర్సల్ ఓర్లాండో, సీ వరల్డ్ సంస్థలు గురువారం మూతపడ్డాయి. పలు ఫ్లోరిడా విమానాశ్రయాలను నిరవధికంగా మూసివేశారు. హరికేన్ కలిగించిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. పొంచి ఉన్న ముప్పు.. హెలెన్ హరికేన్‌తో ఇప్పటికే దెబ్బతిన్న ఫ్లోరిడాను మిల్టన్ మరింత దుస్థితిలోకి తీసుకెళ్లింది. ఈ ఏడాది అమెరికాను తాకిన ఐదో హరికేన్ ఇది. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరానికి 75 మైళ్ల దూరంలో మిల్టన్ కేంద్రీకృతమై ఉందని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీ)తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు మధ్య, ఈశాన్య ఫ్లోరిడాలో ఈదురుగాలులు వీస్తాయని, ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినా తూర్పు తీరం వెంబడి తుఫాను ముప్పు ఇంకా ఉందని వెల్లడించింది. అధికారులు ఫ్లోరిడా, ఇతర రాష్ట్రాలకు చెందిన 9,000 మంది నేషనల్ గార్డ్ సభ్యులతో సహాయక చర్యలు చేపట్టారు. కాలిఫోరి్నయా వరకు 50,000 మందికి పైగా యుటిలిటీ కారి్మకులను అందుబాటులో ఉంచారు. టంపా, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని 60 శాతానికి పైగా గ్యాస్ స్టేషన్లలో బుధవారం రాత్రే గ్యాస్ నిండుకోవడంతో గ్యాసోలిన్ ట్యాంకర్లను తరలించడానికి సైరన్లతో హైవే పెట్రోలింగ్ కార్లు పనిచేస్తున్నాయి. -
79,574 ఎకరాల్లో పంటనష్టం
సాక్షి, హైదరాబాద్: ‘ఆగస్టు 31 నుంచి సెపె్టంబర్ 6వ తేదీ వరకు కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో 79,574 ఎకరాలలో పంటనష్టం సంభవించినట్టు అధికారులు నిర్ధారించారు. దానికి సంబంధించి పంట ష్టపోయిన రైతులకు పరిహారం కింద రూ.79.57 కోట్ల నిధులు విడుదల అయ్యాయి’అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పంటనష్టం 28,407 ఎకరాల్లో ఆ తర్వాత మహబూబాబాద్‌లో 14,669, సూర్యాపేటలో 9,828 ఎకరాల్లో ఉందన్నారు. మిగతా 22 జిల్లాలకు సంబంధించి అత్యల్పంగా 19 ఎకరాల నుంచి 3,288 ఎకరాల వరకు పంటనష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ పేర్కొంది. పంట నష్ట పరిహారం ఎకరానికి రూ. 10 వేల చొప్పున నేరుగా రైతు ఖాతాలలోనే జమ అయ్యేటట్టు అధికారులు ఏర్పాటు చేసినట్టు తుమ్మల తెలిపారు. 4.15 లక్షల ఎకరాల్లో నష్టమన్న సీఎంరాష్ట్రంలో కుండపోత వర్షాలు, వరదలకు 4.15 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అధికారులు మాత్రం చివరకు 79,574 ఎకరాల్లో పంటనష్టం జరిగిందని తెలిసి, ఆ మేరకే నిధులు కేటాయించారు. అంటే ముఖ్యమంత్రి చెప్పిన దానికంటే ఐదోవంతు కంటే తక్కువగా నష్టాన్ని నిర్ధారించారు. దీంతో రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఇదిలా ఉండగా పంట నష్టం జరిగిన దాంట్లో దాదాపు 25 శాతం ఇసుకమే ట పేరుకుపోయి నష్టం సంభవించింది. ఇసుక మేటకు పదివేలకు అదనంగా ఇస్తా మని కూడా వ్యవసాయ శాఖ వర్గాలు హామీ ఇచ్చాయి. కానీ ప్రస్తుతం ప్రకటించిన పరిహారంలో ఇసుకమేట విషయం లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
తెలంగాణలో మూడురోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.శుక్రవారం పశ్చిమ-మధ్య దక్షిణ బంగాళాఖాతం వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం.. ఇవాళ పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరువగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. నుంచి 4.5 కి.మీ మధ్యలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రభావంతో తెలంగాణలోకి పశ్చిమ, వాయువ్య దిశ నుంచి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.దీంతో శనివారం జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపింది.ఆదివారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. సోమవారం ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.