
సాక్షి, విజయవాడ: రాగల మూడు గంటల్లో ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు చెట్ల కింద నిలబడరాదని.. ఈదురు గాలుల వీచేప్పుడు హోర్డింగ్స్ దగ్గర ఉండకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇవాళ(శనివారం) భారీ వర్షం కురిసింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పట్టణంలో అంధకారం నెలకొంది. విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రహదారులు జలమయంగా మారాయి. గుడివాడలో కూడా వర్షం కురిసింది.
