చాలామంది విద్యార్థులు మంచి యూనివర్సిటీ డిగ్రీ, పీజీలు చేశాక ఉద్యోగ వేటలో పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అప్పుడే తెలుస్తుంది ఉద్యోగం సంపాదించడం అంత సులువు కాదని. అచ్చం అలాంటి పరిస్థితిని ఎదర్కోని ఎన్నో చిన్న చితకా ఉద్యోగాలతో విసిగివేసారి.. చివరికి లక్షల కోట్లు విలువ చేసే కంపెనీకి సీఈవో రేంజ్‌కి ఎదిగాడు గేమింగ్ ఫ్లాట్‌ఫామ్ రోబ్లా సీఈవో డేవిడ్ బస్జుకి. పైగా విద్యార్థులకు తనలా చేయొద్దంటూ తన సక్సెస్ స్టోరీని షేర్ చేసుకున్నాడు కూడా. మరి అతడే ఆ స్థాయికి ఎలా చేరుకున్నాడో సవివరంగా చూద్దామా..!
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థి అయిన 62 ఏళ్ల డేవిడ్ బస్జు అక్కడ విద్యార్థులతో తన సక్సెస్ స్టోరీని షేర్ చేసుకున్నాడు. తన కెరీర్ తొలినాళ్లలో చాలా గందరగోళానికి గురయ్యానని, పలు ఉద్యోగాల ఇంటర్వ్యూలో రిజెక్షన్లు, దాంతో తన అర్హతకు సరిపడని ఏవేవో ఉద్యోగాలు చేసి చాలా నిరాశ నిస్ప్రుహలకు లోనయ్యానంటూ వివరించాడు. చెప్పాలంటే చాలామంది విద్యార్థులు ఇలాంటి సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తుంటారని అన్నారడు.
ఎందుకంటే సరిగ్గా మనం వచ్చేటప్పటికే ఉద్యోగ మార్కెట్ పేలవంగా ఉండటంతో ఉద్యోగం సంపాదించడం అన్నది కష్టాసాధ్యమైన విషయంగా మారిపోతుందన్నారు. అలాగే ఆ సమయంలో మనకు సలహాలిచ్చే వాళ్లు కూడా ఎక్కువైపోతారు, పైగా అవి వినబుద్ధి కూడా కాదని అన్నారు. ఆ కష్టకాలంలో తాను తన అంతరదృష్టిపై ఫోకస్ పెట్టి అస్సలు తానేం చేయాలనుకుంటున్నాడు, ఏదైతే తన కెరీర్ బాగుంటుంది అనే వాటి గురించి ప్రశాంతంగా ఆలోచించేవాడని చెప్పారు.
తన అంతరంగా చెబుతున్నదాన్ని, ఇష్టపడుతున్నదాన్ని గమనించి ఆ దిశగా అడుగులు వేశానని, అలాగే తాను అంతకుముందు చేసిన చెత్త ఉద్యోగాలతో పొందిన అనుభవం కూడా దీనికి హెల్ప్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. స్టాన్‌ఫోర్డ్ విద్యార్థిని అన్న పేరు..మంచి కెరీర్‌ని సంపాదించుకోవడానికి హెల్ప్ అవ్వలేదని అంటాడు ఈ టెక్ దిగ్గజం డేవిడ్. ఎందుకంటే కాలేజ్ చదువు పూర్తి అయిన తర్వాత కెరీర్ ఒక్కసారిగా స్థంభించిపోయినట్లు అయిపోయిందంటూ నాడు తాను ఎదుర్కొన్న పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు.
తన డ్రీమ్ జాబ్ సంపాదించలేక పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావని వాపోయాడు. చివరికి ఆ కష్ట సమయంలో సమ్మర్ టైంలో తన సోదరులతో కలిసి కిటికీలు శుభ్రంచేసే పనికి సైతం వెళ్లినట్లు తెలిపాడు. ఈ చిన్ని చిన్ని ఉద్యగాలుచేయలేక సతమతమవుతున్న తరుణంలోను తన అంతరంగం చెబుతున్న దానివైపు మళ్లాడానికి చాలా ధైర్యం కావలి కూడా. ఎందుకంటే అప్పటికే ఎన్నో ఇంటర్వ్యూల్లో తిరస్కరణలు చూశాక..అస్సలు మనపై మనకు నమ్మకం ఉండదు.
కానీ సక్సెస్ కావాలంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ చేతులు ఎత్తేయకుడదు, అలాగే నీ సామర్థ్యంపై నమ్మకం సడలకూడదు. అప్పుడే విజయం ఒడిలోకి వచ్చివాలుతుందని అంటాడు డేవిడ్. అంతేగాదు తన మనసు ఏకంగా తొమ్మిది రకాల కెరీర్ ఆప్షన్లు ఇచ్చిందని, అయితే వాటిలో ఏది బెటర్, ఏది మంచిది కాదు అని అంచనా వేసుకుంటూ..కెరీర్‌ని నిర్మించుకున్నానని చెప్పాడు.
అలా సుమారు రూ. 5 లక్షల కోట్లు విలువచేసే గేమింగ్ ఫ్లాట్‌ఫామ్ రోబ్లాక్స్‌కి నాయకత్వం వహించే రేంజ్‌కి వచ్చానంటూ తన విజయ రహస్యాన్ని విద్యార్థులతో షేర్ చేసుకున్నారు. అంతేగాదు డేవిడ్ ఏకంగా రూ. 4 వేల కోట్ల నికర విలువ చేసే ఆస్తులు కలిగి ఉన్న కుభేరుడు కూడా.
(చదవండి: Worlds Most Expensive Saree: అత్యంత ఖరీదైన 'పట్టుచీర'..! ఆద్యంతం ఆసక్తికరం..అద్భుతం..)


