గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం,శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.తదియ రా.1.54 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: పుబ్బ రా.12.11 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: ఉ.8.01 నుండి 9.36 వరకు, దుర్ముహూర్తం: ప.11.52 నుండి 12.36 వరకు, అమృత ఘడియలు: సా.5.42 నుండి 7.20 వరకు.
సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం : 5.53
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం.... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.
వృషభం... వ్యయప్రయాసలు. బంధువర్గంతో వైరం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
మిథునం.... ఆకస్మిక ధనప్రాప్తి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి ఒప్పందాలు. సోదరులతో సఖ్యత. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.
కర్కాటకం.... శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.
సింహం.... ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య..... పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
తుల..... శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
వృశ్చికం...... దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
ధనుస్సు... మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు.
మకరం.... వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
కుంభం.... బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విచిత్ర సంఘటనలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.
మీనం... శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.


