ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 03-02-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి

Feb 3 2026 3:59 AM | Updated on Feb 3 2026 4:40 AM

Rasi Phalalu: Daily Horoscope On 03-02-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: బ.విదియ రా.2.14 వరకు, తదుపరి తదియ,నక్షత్రం: మఖ రా.11.55 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ప.12.02 నుండి 1.37 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.50 నుండి 9.35 వరకు తదుపరి రా.10.56 నుండి 11.48 వరకు, అమృత ఘడియలు: రా.9.32 నుండి 11.07 వరకు.

సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం :  5.52
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం... వ్యయప్రయాసలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృథా ఖర్చులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. వ్యాపారులకు నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు.

వృషభం... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి.

కర్కాటకం... పనుల్లో తొందరపాటు. బంధువుల నుంచి చికాకులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ మార్పులు.

సింహం... సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

కన్య..... చేపట్టిన కార్యక్రమాలు వాయిదా. ఆరోగ్యభంగం. బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

తుల... పరిచయాలు పెరుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు.

వృశ్చికం... చిన్ననాటి మిత్రులను కలుస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. ఆహ్వానాలు అందుతాయి. 

ధనుస్సు... కొన్ని కార్యక్రమాలు వాయిదా. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఇంటాబయటా చికాకులు. పుణ్యక్షేత్రాల సందర్శనం.

మకరం..... కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఉద్యోగులకు పనిభారం.

కుంభం... కొత్త పనులు చేపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు.

మీనం.... సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో విజయం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement