ఫిబ్రవరి 1 ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026 చాలామందిని నిరాశపర్చింది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొమ్మిదో యూనియన్ బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించగా, ప్రతిపక్ష నాయకులు, ఇతర పలువురు రాజనీయ నాయకులు, ఆర్థిక వేత్తలు మాత్రం సామాన్యులకు ఒరిగిందేమీ లేదనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అటు సోషల్‌మీడియాలోవ్యంగ్యోక్తులు, విమర్శలు వెల్లువెత్తాయి.
నిర్మలా సీతారామన్ ప్రసంగం బడ్జెట్ ముగిసిన వెంటనే, టాక్స్ విధానంలో ఎలాంటి ఉపశమనం రాకపోవడంతో సోషల్ మీడియాలో కామెడీ మీమ్స్ వెల్లువెత్తాయి.సెలబ్రిటీలు, వేతన జీవులు మధ్యతరగతి ఆందోళనల వరకు ఫన్నీ, క్రియేటివ్ మీమ్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఇదీ చదవండి: దురంధర్ రంభ హో ఫీవర్ 70 ఏళ్ల వయసులో స్టన్నింగ్ డ్యాన్స్ వైరల్ వీడియో
సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ఉద్దేశించి, "ఫిబ్రవరి నెల మొత్తం మూడ్ ఒకే మహిళపై ఆధారపడి ఉంటుంది" అని ఒక మీమ్ పేర్కొనగా, మరో మీమ్‌లో, "మీ ఫండ్ నుండి కొంచెం డబ్బు వస్తే చాలా బాగుంటుంది" అంటూ ఇంకో మీమ్‌ను చూడవచ్చు. బడ్జెట్ 2026 అసలీ జాంజ్..పర్సు బరువు, సహనానికి పరీక్ష, మీమ్స్ పండుగ". అనే మరో ఫన్నీ మీమ్ కూడా ఉంది.
మరోవైపు తాజా బడ్జెట్‌పై బెంగాల్ సీఎం మమతా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్, జైరాం రమేష్ మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగం పారదర్శకంగా లేదని, కీలక కార్యక్రమాలు , పథకాలకు బడ్జెట్ కేటాయింపుల గురించి ఎలాంటి సమాచారం లేదని విమర్శించారు.మరో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఈ బడ్జెట్ సామాన్య ప్రజల కోసం కాదని, పెద్ద కార్పొరేట్ల కోసం అని, ఇందులో ఏమీ లేనప్పుడు ప్రజలు దీనిని ఎలా స్వాగతించగలరని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో ఏమీ లేదు. ఇది పూర్తిగా డొల్ల అని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: దిశా నిర్దేశంలేని కేంద్ర బడ్జెట్ : ధ్వజమెత్తిన మమతా బెనర్జీ
Budget Memes - A thread 🧵
Nirmala Sitharaman to Middle Class people pic.twitter.com/XOl1QDWCOO— Phunsuk Wangdu (@Phunsukwangduji) February 1, 2025
కేంద్ర బడ్జెట్ 2026
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ. 11.2 లక్షల కోట్ల నుండి 2027 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం లక్ష్యాన్ని రూ. 12.2 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు సీతారామన్ ప్రకటించారు. టైర్-2 , టైర్-3 నగరాలతో సహా దేశంలో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఆమె అనేక చర్యలను కూడా ప్రకటించిన సంగతి విదితమే.
BCOM students trying to understand the budget pic.twitter.com/JpUTLsVEoV
— Phunsuk Wangdu (@Phunsukwangduji) February 1, 2025
Government to salaried people during every budget#Budget2025 pic.twitter.com/VnfvuKYolM
— Finance Memes (@Qid_Memez) February 1, 2025


