కోల్‌కతా: 2026-27 కేంద్ర బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం తర్వాత, ఢిల్లీకి బయలుదేరే ముందు కోల్‌కతా విమానాశ్రయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. పెద్ద పెద్ద మాటలు చెప్పడమే తప్ప, సామాన్య ప్రజలకు ఈ బడ్జెట్‌లో ఒరిగిందేమీలేదని, ఇది ప్రజా వ్యతిరేకమైందనీ పేర్కొన్నారు. ప్రధానంగా బెంగాల్‌కు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆమె ధ్వజమెత్తారు.
లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఆమె విమర్శులు గుప్పించారు. "ఇది యాంటీ యూత్, యాంటీ పూర్, యాంటీ బీసీ ఎస్టీ, మైనార్టీ, మహిళా వ్యతిరేక, రైతు వ్యతిరేక, విద్యా వ్యతిరేక" అని బడ్జెట్ అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మండి పడ్డారు. ఈ బడ్జెట్‌ను అలాగే ఎలాంటి దూరదృష్టిలేని దిశానిర్దేశం లేనిదని, వ్యాఖ్యానించారు. ఇది మొత్తంగా అబద్దాల పుట్ట అన్నారు.
ఇదీ చదవండి: నిర్మలమ్మ చీర : గ్రహ గతుల విశ్లేషణ ఇదీ!
పన్నులను రాష్ట్రాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కేంద్రం, తామేదో ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను, రాజ్యాంగ నిర్మాణాన్ని, స్వతంత్ర సంస్థలను కేంద్రం నాశనం చేస్తున్న కేంద్రానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదంటూ ఘాటుగా విమర్శించారు.
అలాగే బడ్జెట్‌లో ప్రతిపాదించిన మూడు కారిడార్ల అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తాము ఆ ప్రాజెక్టులపై పని చేస్తున్నామన్నారు. పురూలియాలోని 'జంగల్ సుందరి' ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వమే రూ. 72వేల కోట్లు పెట్టుబడి పెడుతోందని గుర్తు చేశారు. హిమాలయాలను దాటిపోయేంత అసత్యాల పుట్ట అని అభివర్ణించారు. అర్థిక వ్యవప్త గాడి తప్పిందనీ, సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలిందన్నారు. మరోవైపు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బడ్జెట్‌పై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. తాను రేపు పార్లమెంట్ కల్పించిన వేదికద్వారా మాట్లాడతానని రాహుల్ లేకరులతో అన్నారు.
Totally directionless , visionless , mission less budget . Nothing for Bengal says @MamataOfficial pic.twitter.com/NWZp2BbOIj
— Kamalika Sengupta (@KamalikaSengupt) February 1, 2026


