Annamayya
-
28న ఆర్ట్స్ కాలేజీలో జాబ్ మేళా
ప్రొద్దుటూరు: ఈ నెల 28వ తేదీన జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యాన స్థానిక ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ(ఆర్ట్స్‌కాలేజీ)లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జి.చంద్రశేఖర్, జేకేసీ కోఆర్డినేటర్ డాక్టర్ టి.శశికాంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కడప కొప్పర్తిలోని ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీ ప్రైవేట్ కంపెనీలో అసెంబ్లింగ్ ఆపరేటర్, హెల్పర్, టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపిక చేసేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఐటీఐ/డిప్లొమా, బీటెక్ (ఈసీఈ, ఈఈఈ) చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు 28న ఉదయం 9 గంటలకు జాబ్ మేళాలో పాల్గొనాలని, మరిన్ని వివరాలకు 9573321678 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. మధ్యవర్తిత్వంపై శిక్షణకడప అర్బన్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్లు కడప న్యాయ సేవా సదన్‌లో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళ రీసోర్స్ పర్సన్ పీజీ సురేష్ మాట్లాడుతూ న్యాయవాదుల పాత్ర, మధ్యవర్తిత్వం, రాజీ నియమాలు, కమ్యూనికేషన్ నిర్వచనం, ప్రక్రియ, ప్రభావవంతమైన, సమర్ధమైన కమ్యూనికేషన్, ప్రయోజనాలు కమ్యూనికేషన్ రకాలు, కమ్యూనికేషన్ పద్ధతులు, మౌఖిక కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్ ప్రశ్నలు, తటస్థతతో సానుభూతి, రోల్ ప్లే–4 మొదలగు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్స న్ జి జ్యోతి, న్యాయవాదులు పాల్గొన్నారు. పోలీసుల విస్తృత తనిఖీలు కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లాను గంజాయి రహిత జిల్లాగా రూపొందించడమే లక్ష్యంగా విశాఖ పట్నం, విజయవాడ నుంచి కడపకు వచ్చే రైళ్లు, బస్సులు, పార్శల్ కేంద్రాల్లో పోలీస్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఉదయం విశాఖపట్నం నుండి కడపకు చేరుకున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల లగేజీని పరిశీలించారు. అనంతరం నగరంలోని బస్టాండు, సెవెన్ రోడ్స్ వద్ద ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ కార్యాలయాలలో, పార్శల్ సెంటర్లు, గోడౌన్లలో తెల్లవారుజామున విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణాకు పాల్పడినా, సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో ఫ్యాక్షన్ జోన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, జీఆర్పీ ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి, ఆర్పీఎఫ్ ఎస్ఐ నాగభూషణం, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
పెట్టుబడి కూడా రాలేదు
నా పేరు నిరంజన్‌రెడ్డి. మా ఊరు చిన్నమండెం మండలం రెడ్డివారిపల్లె. 20 ఎకరాల్లో దోస సాగు చేశా. పంట దిగుబడి వచ్చే వరకు 30 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఉద్యానవన అధికా రుల సూచనలతో పురుగు నివారణ మందులు పిచికారీ చేశాను. ఎకరాకు నాలు గైదు టన్ను లు వస్తుందని ఆనందపడ్డాను. ప్రకృతి కరుణించలేదు, తెగుళ్లు వీడలేదు. ఫలితంగా సగం తోట దెబ్బతిన్నది. వచ్చిన దిగుబడితోనైనా పెట్టుబడి వస్తుందని ఆశించాను. మార్కెట్‌కి వెళ్తే ధరలు లేక, పెట్టిన పెట్టుబడి రాక ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితులు వచ్చాయి. దళారీల సిండికేటుతో ఇక్కట్లు నా పేరు ఎద్దుల ప్రసాద్. మాది రైల్వేకోడూరు. పది ఎకరాలలో కర్బూజా పంటను సాగు చేశా. దళారుల సిండికేట్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని వ్యాపారులు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా కలిసి వాట్సాప్ గ్రూపులలో దోస, కర్బూజా ధరలను పంచుకుంటున్నారు. ఒక వ్యాపారి తోట దగ్గరికి వచ్చి కిలో 5 రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పి వెళ్లిన విషయాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతు పేరుతోపాటు గ్రూపులలో షేర్ చేస్తున్నారు. దీంతో మిగిలిన వ్యాపారులు అదే ధరకు లేదా మరో రూపాయి అదనంగా ఇస్తామని మాత్రమే చెబుతున్నారు. ఇదీ ఈ ఇద్దరి రైతుల ఆవేదనే కాదు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొంది. -
దంపతుల మృతికి కారకుడిని ఎలా వదిలేస్తారు?
ఎర్రగుంట్ల : దంపతుల మృతికి కారణమైన ఓమ్నీ వాహన డ్రైవర్‌ను పోలీసులు వదిలి పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున గ్రామస్తులు కలమల్ల పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వివరాలు ఇలా.. కలమల్ల గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం ఓమ్నీ వాహనం ఢీకొన్న సంఘటనలో వెంకటరాజారెడ్డి అనే ఆర్టీపీపీ కాంట్రాక్టు కార్మికుడు దుర్మరణం చెందగా అతని భార్య సుజాత తీవ్ర గాయాలతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాదానికి కారణమైన ఓమ్నీ వాహన డ్రైవర్ వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రాత్రికి రాత్రే నిందితుడిని కూటమి పార్టీకి చెందిన ఆర్టీపీపీ ఉద్యోగి నారాయణస్వామి వచ్చి స్టేషన్ నుంచి విడిపించుకుని తీసుకెళ్లారు. ఇద్దరి మృతికి కారణమైన వాహన డ్రైవర్‌ను కలమల్ల ఎస్ఐ తిమోతి కూటమి నాయకుడి వెంట పంపించడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం కలమల్ల పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఐను కోరితే ఆయన తమను బెదిరించాడంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎస్ఐ తీరు ముందు నుంచి వివాదాస్పదంగా ఉందని, ఎవరు డబ్బులు ఇస్తే వారికి ఎస్ఐ వత్తాసు పలుకుతాడని ఆరోపించారు. గ్రామస్తులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి పోలీసు స్టేషన్ వద్దకు చేరుకుని గ్రామస్తులకు సంఘీభావం ప్రకటించారు. నిందితుడిని ఎలా వదిలేస్తారంటూ ఆయన మండిపడ్డారు. మృతుల కుటుంబానికి న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న దంపతుల మృతదేహాలను సందర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాకు న్యాయం చేయండి.. తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఇద్దరు కుమార్తెలు తీవ్ర వేదనతో స్టేషన్ బయట బైఠాయించారు. తమకు న్యాయం చేయండి అంటూ బోరున విలపించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన తమకు దిక్కు ఎవరు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒకానొక దశలో గ్రామస్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో స్టేషన్ ఆవరణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిందితుడు వెంకటరమణ, అతన్ని విడిపించుకుని వెళ్లిన ఆర్టీపీపీ ఉద్యోగి నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలని మృతుల సమీప బంధువు లింగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిమోతి తెలిపారు. కలమల్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. ఎస్ఐ తీరును నిరసిస్తూ కలమల్ల గ్రామస్తులు స్టేషన్ బయట బైఠాయించడంతో ఎస్ఐ తిమోతి స్టేషన్లోనే ఉండిపోయారు. వెంటనే కొండాపురం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నుంచి సీఐలు మహమ్మద్ రఫీ, లింగప్ప, నరేష్‌బాబు, గోవిందరెడ్డి, గోపాల్‌రెడ్డి, దస్తగిరిలు, ఎస్ఐలు విద్యాసాగర్, ధనుంజయుడు, హృషికేశవరెడ్డి, పోలీసు సిబ్బంది స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నించారు. తర్వాత జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర్లు కూడా స్టేషన్‌కు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. రోడ్డు ప్రమాదం ఘటనలో నిందితుడిని విడిపించుకుని వెళ్లిన కూటమి నాయకుడు కలమల్ల ఎస్ఐ తీరుపై గ్రామస్తుల మండిపాటు పోలీసు స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన గ్రామస్తులకు మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి -
బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్
వేంపల్లె : స్థానిక వేంపల్లె నాలుగు రోడ్ల కూడలిలోని కడప రోడ్డులో ఉన్న బెంగళూరు బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. దీంతో స్వీట్లకు సంబంధించిన మెటీరియల్, మిషనరీ దగ్ధమైంది. సంతోష్ కుమార్ అనే వ్యక్తి బతుకు దెరువు కోసం వృషభాచలేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన వాణిజ్య గదుల్లో బెంగళూరు బేకరీని నిర్వహిస్తున్నారు. రోజూ లాగే షాపునకు బీగాలు వేసి ఇంటికి వెళ్లారు. అయితే మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో బేకరీలో నుంచి దట్టమైన పొగలు రావడంతో సమీపంలో ఉన్న దుకాణఱదారుడు నాగ సుబ్బారావు చూసి బేకరీ యాజమాని సంతోష్ కుమార్ కు సమాచారమిచ్చారు. అలాగే అగ్నిమాపక శాఖకు ఫోన్ ద్వారా సమాచారమివ్వడంతో హుటాహుటిన అగ్నిమాపక శాఖాధికారి శివరామిరెడ్డి సంఘటన స్థలం వద్దకు తన సిబ్బందితో చేరుకుని మంటలను అదుపు చేశారు. బేకరీలోనే స్వీట్లు తయారీ చేస్తుండడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వచ్చినట్లు ఫైర్ అధికారి తెలిపారు. అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
చింతకొమ్మదిన్నె : కడప–చిత్తూరు జాతీయ రహదారిపై మండల పరిధిలోని మద్దిమడుగు బిడికి గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మేకల ఆదినారాయణ, కోర్ణ సూర్యనారాయణ అనే వ్యక్తులు మృతి చెందినట్లు చింతకొమ్మదిన్నె సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున రాయచోటి నుంచి కడపకు రాతి స్తంభాలు వేసుకుని ఏపీ04 బీఎక్స్7660 నెంబర్ గల ట్రాక్టరులో డ్రైవర్ వెంకట చలపతి, సహాయకుడు మేకల ఆదినారాయణ వస్తుండగా మద్దిమడుగు సుగాలి బిడికి గ్రామ సమీపంలో ఉదయం 5.45 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ట్రాక్టర్ ట్రాలీ వెనుక ఎడమవైపు గల టైరు పేలి ట్రాక్టర్ అదుపు తప్పింది. ఈ ఘటనతో ట్రాక్టర్ ఒక్కసారిగా వేగం తగ్గడంతో వెనుక ఏపీ05 టీడీ 6549 నెంబరుగల కంకర లోడుతో వస్తున్న టిప్పర్ డ్రైవర్ వేగాన్ని అదుపు చేసుకోలేక ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్ వెంకట చలపతి, టిప్పర్ డ్రైవర్ కోర్న సూర్యనారాయణ, ట్రాక్టర్ సహాయకుడు ఆదినారాయణను రోడ్డు పక్కకు తీసుకెళ్లి నీరు తాగిస్తుండగా కొద్దిసేపటికే ఎన్ఎల్02 బి 7879 నెంబరుగల శివాజీ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు డ్రైవర్ తురక శివరామకృష్ణ కడప నుంచి రాయచోటి వైపు అతివేగంగా నడుపుకుంటూ వచ్చి టిప్పర్ డ్రైవర్ కోన సూర్యనారాయణను ఢీకొట్టాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ట్రాక్టర్‌లోని సహాయకుడు, టిప్పర్ డ్రైవర్‌ను రిమ్స్‌కు తరలించారు. ఉదయం 7.36 గంటలకు ట్రాక్టర్ సహాయకుడు మేకల ఆదినారాయణ, ఉదయం 9.11 గంటలకు టిప్పర్ డ్రైవర్ కోర్న సూర్యనారాయణ మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు చింతకొమ్మదిన్నె సీఐ తెలిపారు. -
టీచర్ల పీఎఫ్ స్లిప్‌లను వెబ్సైట్లో ఉంచాలి
కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ వార్షిక వివరాల స్లిప్‌లను వెబ్సైట్లో పొందుపరచాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి కోరారు. ఈ విషయమై మంగళవారం కడప జెడ్పీలో డిప్యూటి సీఈఓ మైథిలిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్, మండల పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 2023–2024 సంవత్సరానికి చెందిన పీఎఫ్ స్లిప్‌లను వెబ్సైట్లో పొందుపరచాలని, పీఎఫ్ నెలవారీ జమలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో ఉంచాలని కోరారు. -
డ్రైవర్‌పై దాడి చేసి.. కారును దొంగిలించారు
కడప అర్బన్ : హైదరాబాదు నుంచి కడపకు ఇన్నోవా కారును బాడుగకు తీసుకుని వచ్చి డ్రైవర్‌పై దాడి చేసి.. కారును దొంగిలించిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మైనర్ బాలుడు ఉన్నాడు. మంగళవారం కడప డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు చిన్న చౌక్ సీఐ ఓబులేసు, ఎస్ఐలు రాజరాజేశ్వర్ రెడ్డి, రవికుమార్‌లతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. కడపకు చెందిన నూరుల్లా అలియాస్ నూర్, తాజుద్దీన్ అలియాస్ తాజ్ హైదరాబాదుకు వెళ్లి ఈనెల 15న రాత్రి ఇన్నోవా కారును కడపకు బాడుగకు మాట్లాడుకొని వచ్చారు. ఈనెల 16వ తేదీన కడప రింగ్ రోడ్డు వద్దకు రాగానే కారు డ్రైవర్‌పై దాడి చేసి అతని మెడలోని బంగారు గొలుసు, వెండి ఉంగరాలను దోచుకుని కారుతో నిందితులు పరారయ్యారు. కారు డ్రైవర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కడప చిన్నచౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో కడపకు చెందిన పఠాన్ మర్ఫాద్ ఖాన్ అలియాస్ హోంవర్కర్ అలియాస్ లడ్డు మరో బాల నేరస్తునితో కలిసి డ్రైవర్ శ్రీకాంత్‌ను కొట్టి అతని వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు, మెడలో ఉన్న బంగారు గొలుసు, వెండి ఉంగరాలు తీసుకొని కారుతో పరారైనట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ ఈ.జీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ ఓబులేసు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులపై నిఘా ఉంచారు. వాటర్ గండి రోడ్డులో కడప నకాష్‌కు చెందిన పఠాన్ మర్ఫాద్ ఖాన్ అలియాస్ హోంవర్కర్ అలియాస్ లడ్డును అరెస్ట్ చేశారు. మరో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు నూరుల్లా అలియాస్ నూర్, తాజుద్దీన్ అలియాస్ తాజ్‌లు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు ఒకరిని రిమాండ్‌కు తరలించారు. మరొకరిని పరిశీలనకు పంపించారు. ఇద్దరి అరెస్టు.. నిందితుల్లో ఒకరు మైనర్ పరారీలో ఇరువురు ప్రధాన నిందితులు వివరాలు వెల్లడించిన కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు -
నేటి నుంచి అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు
రాజంపేట: పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు 522 వర్ధంతి ఉత్సవాలను బుధవారం నుంచి నిర్వహించనున్నారు. టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. తాళ్లపాక, 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద చలువ పందిళ్లు, స్వాగతతోరణాలు, కళాకారుల కోసం కళావేదికను సిద్ధం చేశారు. ఈ ఉత్సవాలు 29 వరకు కొనసాగనున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తాళ్లపాకను అభివృద్ధి చేయాలి అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాక వైపు టీటీడీ అధికారులు కన్నెత్తి చూడటం లేదని తాళ్లపాక గ్రామస్తులు అదృష్టదీపుడు, మోహనరావు, నారయణ, బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగోతు రమేష్‌నాయుడులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి అన్నమయ్య జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలవని వారు కోరారు. తిరుమలలో హుండీలో వచ్చిన ఆదాయం ఒక శాతం తాళ్లపాక అభివృద్ధి కోసం వ్యయం చేయాలన్నారు. తాళ్లపాక వైపు కన్నెత్తి చూడని టీటీడీ అధికారులు చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన తాళ్లపాక గ్రామస్తులు -
ప్రాచుర్యం శూన్యం
భక్తకన్నప్ప గ్రామం..ఽభక్తకన్నప్ప విగ్రహం ● కన్నప్ప జన్మస్థలం ఇలా.. అరవై ముగ్గురు మహాశివభక్తులలో కన్నప్ప ఒకరు. తండ్రి నాగుడు, తల్లి తంచె. కన్నప్ప ద్వాపరయుగంలో అర్జునడే. ఆ యుగంలో శివుని అనుగ్రహం కోసం తపస్సు చేసి.. పాశుపాతాస్త్రం పొందారు. కలియుగంలో తిన్నడు (కన్నప్ప)గా ఉడుమూరులో జన్మించారు. కాలక్రమంలో ఉడుమూరు ఊటుకూరుగా మారింది. కన్నప్ప ప్రతిష్టించిన శివలింగం.. తన జన్మస్థలమైన ఊటుకూరులో ఉంది. అక్కడ శివాలయం వెలసింది. రాజంపేట: భక్త కన్నప్ప గొప్ప శివభక్తుడు. తెలుగు వాడు. ఆయనను మొదట్లో తిన్నడు అనే పేరుతో పిలిచే వారు. బోయ వంశస్తుడు. ఒక బోయరాజు కుమారుడు.ఒకనాడు అడవిదారి గుండా వెళ్తుండగా.. శివలింగం కనిపించింది. అప్పటి నుంచి ఆ శివలింగాన్ని తిన్నడు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ.. తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా సమర్పించే వాడు. ఒక సారి శివుడు తిన్నడు భక్తిని పరీక్షించ దలచి.. ఆయన పూజ చేయడానికి వచ్చినపుడు శివలింగంలోని ఒక కంటి నుంచి రక్తం కార్చడం మొదలు పెట్టారు. విగ్రహం కంటిలో నుంచి నీరు కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి విగ్రహానికి అమర్చాడు. వెంటనే విగ్రహం రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం ఆరంభమైంది. కాలి బొటనవేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించారు. నిన్ను దర్శించినా, చరిత్ర విన్నా.. పఠించినా సర్వపాపాలు తొలిగి.. అంత్యకాలంలో కై లాసప్రాప్తి పొందుతారని పలికి పరమశివుడు అంతర్థానమయ్యారు. అందువల్లనే తిన్నడికి.. కన్నప్ప అనే పేరు వచ్చింది. తిన్నడు దేవుడికి కన్ను ఇచ్చినందుకే కన్నప్ప అయ్యారు. ఆయన భక్తిని మెచ్చిన ప్రజలు.. భక్తకన్నప్పగా పిలుస్తున్నారు. ఆ శివలింగం ఉన్న ప్రాంతంలోనే శ్రీ కాళహస్తి క్షేత్రం వెలసినట్లు చరిత్ర చెబుతోంది. కన్నప్ప పుట్టిన ఊరు ఎక్కడా.. రాజంపేట పట్టణం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో కడప–రేణిగుంట జాతీయ రహదరిలో భక్తకన్నప్ప జన్మస్థలం అయిన ఊటుకూరు ఉంది. హైవే రోడ్డు పక్కనే కన్నప్ప ప్రతిష్టించిన శివలింగం ఉన్న పురాతన ఆలయం ఉంది. తిరుపతి, చైన్నెకు వెళ్లే ఏ వాహనంలో అయినా ఊటుకూరు (ఉడుమూరు)కు చేరుకోవచ్చు. వెలుగులోకి తీసుకొచ్చిన తమిళ వాసి.. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన పళనిస్వామి పెరియపురాణం ద్వారా భక్తకన్నప్ప జన్మస్థలం.. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలం ఊటుకూరు అని వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి విదితమే. అప్పటి నుంచి గ్రామస్తులు దాతల సహకారంతో.. గ్రామంలోని శివాలయం అభివృద్ధికి నడుంబిగించారు. భక్తకన్నప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అధికారిక గుర్తింపు కోసం ఎదురు చూపులు భక్తకన్నప్ప జన్మస్థలం అధికారిక గుర్తింపు కోసం ఎదురు చూస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనమతులు ఎప్పుడు వస్తాయని ఇక్కడి ప్రాంతీయులు వేచి చూస్తున్నారు. భక్తకన్నప్ప జన్మస్థలం అభివృద్ధికి సహకరించాలని గతంలో శ్రీకాళహస్తి దేవస్థానం దృష్టికి వారు తీసుకెళ్లారు. అన్నమయ్యతో కన్నప్ప జన్మస్థలానికి అనుబంధం తాళ్లపాక అన్నమాచార్యులు తాత నారాయణయ్య చదువుకోవడానికి ఊటుకూరు(ఉడుమూరు)కు వచ్చారు. చదువు అబ్బక గురువు పెట్టే శిక్షలు భరించలేక చింతాలమ్మ గుడిలోని పుట్టలో చేయిపెట్టారు. పాము కరవలేదు కానీ, చింతాలమ్మ ప్రత్యక్షమైంది. ‘శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం వల్ల పరమభక్తుడు నీకు మనవునిగా పుడతారు’ అని ఆశీర్వదించింది. ఆ నారాయణయ్య మనువడే అన్నమాచార్యులు. అన్నమయ్య తండ్రి నారాయణసూరి, తల్లి లక్కమాంబ. అన్నమయ్య కూడా ఊటుకూరులో చిన్నతనంలో విద్యాభాస్యం చేశాడు. కలియుగ దైవం వెంకటేశ్వరునిపై 32 వేల కీర్తనలు రచించి, పద కవితా పితామహడుపేరు తెచ్చుకొని ధన్యుడయ్యారు. చింతాలమ్మ అమ్మవారి విగ్రహం ఇప్పటికీ ఊటుకూరు శివాలయంలో ఉంది. కన్నప్ప.. కాళహస్తికి ఎలా వెళ్లాడుతిన్నడు(కన్నప్ప) ఒకనాడు అడవిలో పందిని వేటాడుతూ ఊటుకూరు నుంచి అటవీ ప్రాంతంలో స్వర్ణముఖినది వరకు వెళ్లాడు. అక్కడ నేటి శ్రీకాళహస్తి దగ్గర శివలింగాన్ని దర్శించి, శివుని భక్తునిగా మారారు. తర్వాత తన రెండు కళ్లను సమర్పించి భక్తిని చాటుకున్నారు. ఆనాటి నుంచి శ్రీకాళహస్తిలో భక్తకన్నప్పకు.. స్వామివారి కన్న ముందే పూజ చేయడం ఆచారంగా వస్తోంది. ఏటా స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలోనూ.. భక్తకన్నప్ప కొండపై తొలుత ధ్వజారోహణం చేసిన తర్వాత మరుసటి రోజు స్వామివారి ధ్వజారోహణ చేసి ఉత్సవాలు ప్రారంభిస్తారు. భక్తకన్నప్ప జన్మస్థలికి ఇప్పటి వరకు అధికార ముద్ర పడలేదు. కూటమి ప్రభుత్వం అయినా చొరవ చూపుతుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. భక్తకన్నప్ప సినిమా తీస్తున్న మంచువిష్ణు బృందం సందర్శించిన క్రమంలో.. ఊటుకూరు మరోసారి తెరపైకి వచ్చింది. పెరియ పురాణం ద్వారా వెలుగులోకి జన్మస్థలి పట్టించుకోని ప్రభుత్వం కన్నెత్తి చూడని శ్రీకాళహస్తి దేవస్థానం భక్తుల ఆవేదన అరణ్య రోదన చారిత్రక ఆధారాలు ఉన్నాయి కన్నప్ప ఇక్కడి వాడేనని అన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి శ్రీకాళహస్తికి అటవీ మార్గంలో చేరుకున్నారు. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో తొలిపూజ మా గ్రామానికి చెందిన భక్తకన్నప్పకు అంటే మాలో ఎక్కడ లేని భక్తి ఉప్పొంగి వస్తుంది. –ఆర్.శ్రీనువాసురాజు, ఎంపీటీసీ, ఊటుకూరు భక్తకన్నప్ప నడయాడిన ప్రదేశం గామంలో కన్నప్ప పూజించిన శివాలయం ఉంది. అలాగే ఊటుకూరు పరిసరాలు కన్నప్ప నడయాడిన ప్రాంతాలు. భక్తకన్నప్పకు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో తొలిపూజ అనే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. –నాగా ఫృథ్వీపతిరెడ్డి, గ్రామపెద్ద, ఊటుకూరు -
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
వల్లూరు : మద్యం మత్తులో అనుమానంతో భర్తే భార్యను హత్య చేసి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వల్లూరు మండల పరిధిలోని అంబవరం ఎస్సీ కాలనీలో మంగళవా రం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు..అంబవరం ఎస్సీ కాలనీలో యర్రగుడిపాడుకు చెందిన చెన్న కేశవ, సుజాత దంపతులు నివసిస్తున్నారు. వీరికి సంతోష్ కుమార్ అనే వివాహమైన కుమారుడితో బాటు వరుణ్ కుమార్ (13) అనే కుమారుడు, స్వర్ణలత (8) అనే కుమార్తె ఉంది. చెన్న కేశవ (45) తాగుడుకు బానిసగా మారి మద్యం మత్తులో భార్య సుజాత (40)ను వేధిస్తుండేవాడు. సుజాతపై చెన్నకేశవ అనుమానం పెంచుకోవడంతో ఆమె 2 నెలల క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది. నెల క్రితం ఆమె పెద్ద కుమారుని వివాహం జరగడంతో దాని కోసం ఆమె అంబవరం వచ్చింది. వివాహం జరిగిన తరువాత మళ్లీ తన అమ్మగారి ఇంటికి వెళ్లిపోయింది. కొడుకు అత్తగారి ఇంటి నుంచి కోడలికి ఉగాది సాంగ్యం తెస్తుండటంతో..తన కుమారుడు ఆమెను అంబవరానికి తీసుకువచ్చాడు. మంగళవారం మద్యం తాగిన చెన్న కేశవ ఇంటి ఆవరణలో సుజాతపై కొడవలితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చెన్న కేశవ కొడవలి పట్టుకుని క్రిష్ణాపురం, గంగాయపల్లె రైల్వేస్టేషన్ల మధ్య నల్లపురెడ్డిపల్లె రైల్వే గేటుకు కొద్ది దూరంలో గూడ్సు రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆపై తానూ ఆత్మహత్య వైఎస్సార్ జిల్లాలో ఘటన -
నియోజకవర్గం దోస కర్బూజ
కష్టపడి పండించిన కర్బూజాకు మార్కెట్ ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కొంత మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా దోస, పుచ్చకాయ పంటను సాగు చేశారు. మార్కెట్లో కేజీ దాదాపు రూ.15 నుంచి రూ.20 పలుకుతోంది. దళారులు కేజీ రూ.5 లేదా రూ.8 మాత్రమే చెల్లిస్తున్నారు. కానీ ఎకరాకు పెట్టుబడి 50 వేల నుంచి లక్ష రూపాయలకు పైగా అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. దీంతో పంటపై పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొలంలోనే కాయలను వదిలి వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వాపోతున్నారు. రైల్వేకోడూరు 2210 1720 రాయచోటి 480 346 రాజంపేట 179 225 మదనపల్లి 125 56 పీలేరు 230 42 తంబళ్లపల్లి 708 – రాయచోటి/రైల్వేకోడూరు అర్బన్: జిల్లాలో దోస, కర్బూజ పంటలు పండించే రైతులకు ఫలితాలు.. ఈ ఏడాది కూడా ఆశాజనకంగా లేవు. నట్టేట ముంచి అప్పులపాలు చేస్తున్నాయి. ఫిబ్రవరి నెల ఆఖరులో, మార్చి మొదటి వారంలో దోస 22 రూపాయలు, కర్బూజ 18 రూపాయలు ధరలు పలకడంతో కొందరు రైతులు లాభపడ్డారు. దీంతో రైతులు కొండంత ఆశ పెట్టుకొన్నారు. కానీ అందరి దిగుబడి చేతికి వచ్చే సరికి.. దళారులు మోసాలతో ధరలను పాతాళానికి పడేశారు. జిల్లాలో భారీగా దోస, కర్బూజ పంటలు సాగు చేశారు. ముఖ్యంగా రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాలలో వందలాది మంది రైతులు వేశారు. తెగుళ్లు, దళారీల మోసాలు, గిట్టుబాటు ధరలు లేక భారీగా నష్టపోతున్నారు. ఓబులవారిపల్లిలో కోహినూర్ దోస వేసి ఎగుమతులు లేక రూ.లక్షల్లో నష్టపోయారు. ఎరువులు, పురుగు మందుల పిచికారీ కోసం.. దోస, కర్బూజ పంటల సాగు ప్రారంభ దశ నుంచే రైతులకు మందుల పిచికారీ, ఎరువులు పెనుభారంగా మారింది. విత్తన దశ నుంచి క్రిమి సంహారక మందులకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. దీనికి తోడు పూతకు పిందెలు వచ్చే సమయం నుంచి తెగుళ్ల నివారణకు మందుల పిచికారీ అధికంగా ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల పూత రావడానికి, పిందె నిలవడానికి, తెగుళ్లకు రెండు రోజులకు ఒక సారి అయినా మందులు పిచికారీ చేయాలి. కేవలం మందులకే రైతులు దుకాణాల్లో రూ.లక్షలు అప్పులు చేశారు. తూకాల్లో కోత రైతులు పంటకు ధరలు పడి పోయి కన్నీరు కారుస్తుంటే.. పలువురు దళారీలు ఇదే అదునుగా మరింతగా రేటు తగ్గిస్తున్నారు. ఇక్కడి దిగుబడిని ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తుంటారు. ఇదే అదునుగా రైతులకు, వ్యాపారులకు మధ్య దళారులు చేరి అక్కడ ఒకరేటు, రైతులకు ఒకరేటు, లోడ్ తూకాలలో కోత, కమీషన్లు ఇలా రకరాలుగా మోసం చేస్తున్నారు. కరుణించని పాలకులు మార్కెట్ ధరలు లేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన దోస రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గిట్టుబాటు ధరలు రావడం లేదని రైతు సంఘాల నేతలు గళమెత్తి అరుస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం.. కష్టాల కడలిలో ఉన్న కర్షకులను పరామర్శ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రాంతం ఎమ్మెల్యేలు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరుతున్నారు. అనుకూలించని రేటు కర్బూజ, దోస రైతు కుదేలు పెట్టుబడి కూడా రాని వైనం దోచుకుంటున్న దళారులు పట్టించుకోని ప్రభుత్వం అప్పుల పాలైన అన్నదాత రైతులను ఆదుకోవాలి సంబేపల్లి మండలం రెడ్డివారిపల్లె పంచాయతీ సీఎం కొత్తపల్లిలో రైతు రామచంద్ర 4 ఎకరాలలో రూ.6 లక్షలు ఖర్చు చేసి సాగు చేశారు. దళారులు అడిగినంతకు కాయలు ఇవ్వలేదని వాటిని కొనుగోలు చేయలేదు. కాయలు తోటలోనే కుళ్లిపోవాల్సిన పరిస్థితి. పండించిన పంటను మార్కెట్‌కి తరలించలేక రైతు తోటలోనే కూలిపోయాడు. ఇలా వేల మంది రైతులు దోస, కర్బూజ తోటలను సాగు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కావున ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. – బాలకృష్ణారెడ్డి, రైతు సంఘం రీజనల్ కోఆర్డినేటర్, అన్నమయ్య జిల్లా ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి జిల్లాలో సాగవుతున్న పంటలో సగం ఒక పైగా రైతులు పండ్ల తోటలు వేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచి ఆదాయాన్ని గడించవచ్చని దోస పంట సాగు చేశారు. రైతులు పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధరలు రావాలంటే ప్రజలు ఆహారపు అలవట్లను మార్చుకుంటే మంచిది. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు మంచి ఆరోగ్యం కోసం ఆహారంలో 200 గ్రాములు పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. జిల్లాలో పండించిన రైతుకు బాగుంటుంది. – రవిచంద్రబాబు, జిల్లా ఉద్యానవన అధికారి, అన్నమయ్య జిల్లా -
భూ వివాదంలో ఐదుగురిపై కేసు నమోదు
సుండుపల్లె : రాతికూసాలను, ఇనుప తంతిని ధ్వంసం చేసిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. మండల కేంద్రానికి సమీపంలోని బుర్రలదిన్నెపల్లె గ్రామంలో కామిని శ్రీను అనే వ్యక్తి మామిడి తోటకు పొలానికి చుట్టుపక్కల రాతి కూసాలను ఏర్పరచుకుని ఇనుప తంతిని నిర్మించుకున్నాడు. అతనికి బంధువు అయిన కామిని అంజనమ్మ మరో నలుగురు వ్యక్తులు అతని పొలంలోకి అక్రమంగా ప్రవేశించి సుమారు 40 రాతి కూసాలను, ఇనుప తంతిని ధ్వంసం చేసి నష్టం చేకూర్చారు. కామిని శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు తెలిపారు. ప్రమాదవశాత్తు భవన నిర్మాణ కార్మికుడి మృతి రాజంపేట : పట్టణంలోని ఆర్ఎస్ రోడ్‌లోని రాఘవేంద్ర ప్రొవిజెనల్స్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం పై నుంచి ముద్దా మల్లికార్జున (35) అనే భవన నిర్మాణ కార్మికుడు కిందపడి మృతి చెందాడు. ఈ మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా కూలిపనుల నిమిత్తం ఒంగోలు నుంచి వచ్చిన భవన నిర్మాణ కూలీల బృందంలో ఇతను ఒకడిగా గుర్తించారు. మహిళ మెడలో గొలుసు చోరీ మదనపల్లె : ఇంటి ముందు ముగ్గువేస్తున్న మహిళ మెడలో గుర్తు తెలియని వ్యక్తి బలవంతంగా గొలుసు చోరీ చేసిన ఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని జోగప్పగారివీధికి చెందిన నాగభూషణం భార్య వెంకటలక్షుమ్మ(67) తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇంటి ముందు ముగ్గువేస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి ముసుగు ధరించి వచ్చి మహిళ మెడలో నుంచి బలవంతంగా చైను లాక్కుని పరారయ్యాడు. చోరీ ఘటనపై బాధితురాలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బంగారు గొలుసు సుమారు 12 గ్రాములు బరువుతో పాటు రూ.60వేలు విలువ చేస్తుందని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. రోడ్డుపై మోల్డింగ్ వాహనం బోల్తా – ఒడిస్సా వాసి దుర్మరణం బి.కొత్తకోట : కర్ణాటకలోని రాయల్పాడులో ఓ ఇంటికి మోల్డింగ్ పనికోసం వెళ్తున్న వాహనం మార్గమధ్యంలో బి.కొత్తకోట మండలంలో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న కూలీల్లో ఒక రు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. పో లీసుల కథనం మేరకు వివరాలు.. మంగళవారం బి.కొత్తకోట నుంచి ఆరుగురు కూలీలతో రాయల్పాడులో మోల్డింగ్ పనుల కోసం వాహనం బయలుదేరింది. దాని వెనుక మిల్లర్‌ను తగిలించుకుని వెళ్తుండగా మొటుకుపల్లె పంచాయతీ టేకులపెంటకు సమీపంలోని దొక్కలవంక వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘట నలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన కె.సింహాచలం (40) తీవ్ర గాయాలతో దుర్మరణం చెందాడు. మిగిలిన కూలీలకు రక్త గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానిక కరెంట్ కాలనీలో ఉంటున్న మృతుని భార్య ఊర్మిల డ్రైవర్ శ్రీనివాసులు అజాగ్రత్తగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగి తన భర్త మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ జీవన్ గంగనాఽథ్బాబు తెలిపారు. -
సంప్రదాయ దుస్తుల్లోనే పాల్గొనాలి
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపులో సంప్రదాయ దుస్తుల్లోనే పాల్గొనాలని ఈవో డీవీ రమణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. సీ్త్రలు చీర, పురుషులు పంచె, షర్ట్ ధరించి రావాలన్నారు. పాల్గొనదలచిన వారు ముందుగా వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. స్వామి పాదాలు తాకనున్న సూర్య కిరణాలు నేటి(బుధవారం) నుంచి ఈ నెల 31వ తేది వరకు ఉదయం 6 గంటల నుంచి 6–30 గంటల లోపు శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి పాదాలను సూర్యకిరణాలు తాకనున్నాయని ఈవో తెలిపారు. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారు దక్షసంహారనంతరం అవతార సమాప్తి చేసి.. అర్చనామూర్తిగా వెలసిన అవతార మూర్తిని సూర్యభగవానుడు సప్తద్వారాలు దాటి.. గర్భాలయంలోని స్వామి వారి పాదాలను తాకుతాయని తెలిపారు. సూర్య భగవానుడికి శివ జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీ వీరభద్రస్వామి పాదాలను.. దక్షప్రజాపతి సూర్యకిరణాల ద్వారా పాద పూజ చేసుకొంటారని, అందులో భాగంగానే ఈ సూర్యకిరణాలు ప్రసరిస్తాయనే భక్తుల ప్రగాఢ నమ్మకం అన్నారు. ఇళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం రాజంపేట: రాష్ట్ర ప్రభుత్వ అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తోందని, ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా హౌసింగ్ పీడీ సాంబశివయ్య తెలిపారు. స్థానిక మున్సిపాలిటీ మెప్మా కార్యాలయంలో మంగళవారం మెప్మా సిబ్బందితోపాటు మున్సిపల్ ఏఈలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇళ్లు మంజూరైన ఎస్సీ, ఎస్టీ, బీసీలు నిర్మించుకోలేక, అర్ధాంతరంగా ఆగిపోయి ఉంటే.. అటువంటి వారికి ప్రభుత్వం అదనంగా సాయం అందిస్తోందన్నారు. ఇందులో భాగంగా ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీ, బీసీలకు రూ.50 వేల అందిస్తుందన్నారు. ఈ విషయంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. సొంత స్థలం ఉండి.. నిర్మించుకోదలిస్తే పక్కా ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. స్థలం లేని వారు స్థలం, ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈ ఈశ్వర్‌రెడ్డి, రాజంపేట హౌసింగ్ ఈఈ మురళీకృష్ణ, మెప్మా ప్రతినిధి అయ్యవారయ్య తదితరులు పాల్గొన్నారు. కేసీ కెనాల్ నీటి విడుదలకు చర్యలు కడప సెవెన్‌రోడ్స్: కేసీ కెనాల్ ఆయకట్టుకు ఏప్రిల్ 15వ తేది వరకు నీరు అవసరమని జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీలో కోరడంతో ఆ విషయాన్ని తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని కేసీ కెనాల్ (స్పెషల్) సబ్ డివిజన్ మైదుకూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎస్.పుల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు తగు చర్యలు తీసుకుంటామని వారు తెలి పారని వెల్లడించారు. ఈనెల 22న సాక్షి దినపత్రికలో ‘ఇటు కేసీ చూడండి’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. జిల్లాలోని కేసీ కాలువ పరిధిలో ఉన్న పంటలకు ఇప్పటివరకు నీరు అందిస్తూనే ఉన్నామని తెలిపారు. క్రమశిక్షణ, సేవాభావానికి ప్రతీక స్కౌట్ రాయచోటి అర్బన్: విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతోపాటు దేశభక్తి, సామాజిక సేవాభావాలను పెంపొందించడానికి బాలభటుల ఉద్యమం (స్కౌట్ అండ్ గైడ్స్) ఎంతో తోడ్పడుతుందని ఉపవిద్యాశాఖ అధికారి శివప్రకాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో స్కౌట్ మాస్టర్లు, గైడ్కెప్టెన్లకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో స్కౌట్యూనిట్ను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో ప్రవేశం పొందిన విద్యార్థుల వివరాలు మార్చి 31వ తేదీలోపు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, జిల్లా కోశాధికారి ఎం.ఓబులరెడ్డి, ఏఎస్ఓసీ లక్ష్మికర్, రీసోర్స్‌పర్సన్ గురుప్రసాద్‌రెడ్డి, రాజంపేట, రాయచోటి డివిజన్ల స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు, కట్మాస్టర్స్, ప్లాక్లీడర్స్ తదితరులు పాల్గొన్నారు. -
తిరువణ్ణామలై వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం
– కోడూరు వాసి మృతి రైల్వేకోడూరు అర్బన్ : తమిళనాడులోని తిరువణ్ణామలై పుణ్యక్షేత్రానికి వెళ్లి శివుడి దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడూరు వాసి మృతి చెందాడు. దర్శనం అనంతరం స్నేహితులతో కారులో వస్తుండగా చిత్తూరు జిల్లా పాకాల వద్ద మంగళవారం కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కోడూరు మండలం రాఘవరాజపురం (సత్రం)కు చెందిన కౌలురైతు వెలిగిచెర్ల నరసింహారెడ్డి (45) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య రజని, కొడుకు ఈశ్వర్, 5 నెలల పాప ఉంది. తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పది ప్రశ్నపత్రం లీకేజీపై విచారణ సాక్షిటాస్క్‌ఫోర్స్ : వల్లూరు జెడ్పీ హైస్కూల్ పరీక్షా కేంద్రం నుంచి సోమవారం పదో తరగతి గణితం ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై విచారణ కొనసాగుతోంది. కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో, కమలాపురం సీఐ ఎస్కే రోషన్, ఎస్ఐ ప్రతాప్ రెడ్డిల నేతృత్వంలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి వరకు అత్యంత రహస్యంగా విచారణ జరిపారు. ఇప్పటికే వల్లూరు జెడ్పీ హైస్కూల్ పరీక్షా కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ అధికారితోపాటు ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పరీక్షా కేంద్రంలో విద్యా శాఖకు సంబంధం లేని బయటి వ్యక్తిని వాటర్‌బాయ్‌గా నియమించడం వెనుక ఆంతర్యం ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. అతని ద్వారానే ప్రశ్నప్రతం బయటకు వచ్చిందనే ఆరోపణలున్నాయి. అలాగే పలువురు ఇన్విజిలేటర్లు, సిబ్బంది సెల్ఫోన్లు కూడా లోనికి దర్జాగా తీసుకెళ్లారంటే పరీక్షల నిర్వహణ ఎంత లోపభూయిష్టంగా ఉందో తెలుస్తోంది. ఈ అన్ని అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. -
ఏప్రిల్ 3న బలిజపల్లె గంగమ్మ జాతర
రాజంపేట టౌన్ : ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎంతో ప్రసిద్ధి గాంచిన బలిజపల్లె గంగమ్మ జాతరను ఏప్రిల్ 3వ తేదీ నిర్వహించేందుకు నిర్వాహకులు తీర్మానించారు. ఈమేరకు సోమవారం రాత్రి తొలుత బలిజపల్లెకు చెందిన జాతర నిర్వాహకులు బలిజపల్లెలో సమావేశమై జాతర తేదీని ఖరారు చేశారు. అనంతరం జాతర నిర్వహణలో భాగస్వాములైన తుమ్మలఅగ్రహారం, నారపురెడ్డిపల్లె జాతర నిర్వాహకులతో వారి గ్రామాల్లో సమావేశమై జాతర విషయమై చర్చించి ఏప్రిల్ మూడవ తేదీ జాతర నిర్వహించాలని మూడు గ్రామాలకు చెందిన నిర్వాహకులు తీర్మానించడంతో జాతర తేదీ అధికారికంగా ఖరారైంది. కాగా ఈనెల 30వ తేదీ రాత్రి బలిజపల్లె గ్రామంలో వెలసిన గంగమ్మ స్వయంభు వద్ద జాతర నిర్వహణకు వైభవంగా అంకురార్పణ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శివరాత్రి ముగిసినప్పటి నుంచి జాతర ఎప్పుడు నిర్వహిస్తారా అని ఎదురు చూస్తూ వచ్చిన భక్తులు జాతర తేదీ ఖరారు కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. -
క్షయ వ్యాధిగ్రస్తులపై వివక్ష తగదు
రాయచోటి అర్బన్: క్షయ వ్యాధిగ్రస్తులపై ఎవరూ వివక్ష చూపరాదని జాతీయ మానవ హక్కుల కమిషన్ కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, మానసిక ఆరోగ్యశాఖ, ఇతర శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం వర్చువల్‌గా రైల్వేకోడూరు జ్యోతికాలనీలో ఉన్న కుష్టు వ్యాధిగ్రస్తులతో మాట్లాడి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మరింత మెరుగ్గా కుష్టువ్యాధి నివారణ కార్యక్రమం అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ దేవసాగర్, డీఎంహెచ్ఓ కొండయ్య, అదనపు డీఎంహెచ్ఓ శైలజ, జిల్లా న్యూక్లిప్ మెడికల్ ఆఫీసర్ విష్ణువర్దన్‌రెడ్డి, జిల్లా ఆర్బీఎస్కే కో ఆర్డినేటర్ డాక్టర్ శివప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా గోవిందమాంబ ఆరాధన ఉత్సవాలు
బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రభోదకర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ధర్మపత్ని మాతా గోవిందమాంబ ఆరాధన మహోత్సవం సోమవారం బ్రహ్మంగారిమఠంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రామస్వామి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది మహిళలు అమ్మవారికి చీరె, సారెను అందించారు. ప్రత్యేక భజనలు, అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి వీరబ్రహ్మేంద్ర, గోవిందమాంబ సమేత ఉత్సవ గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ ఆధ్వర్యంలో మేనేజర్ ఈశ్వరాచారి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతి కుమారులు వెంకటాద్రిస్వామి, వీరభద్రస్వామి, దత్తస్వామి, మఠాధిపతి తమ్ముడు వీరభద్రస్వామి, దేవస్థాన సిబ్బంది, పుర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
రాళ్ల దాడిలో ముగ్గురికి గాయాలు
మదనపల్లె : ఓ యువకుడు మరో ముగ్గురిపై రాళ్లతో దాడి చేయడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. చిప్పిలికి చెందిన లడ్డూ (32) టౌన్లోకి వెళ్లి రావాల్సి ఉందని మండలంలోని జంగాలపల్లెకు చెందిన ఆదికేశవ (40)ను ద్విచక్రవాహనం ఇవ్వాల్సిందిగా కోరాడు. దీంతో అతను వాహనంలో పెట్రోల్ లేదని, ఇవ్వలేనని చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న లడ్డూ..తాను అడిగితే బండి ఇవ్వవా అంటూ ఆదికేశవతో పాటుగా వేంపల్లెకు చెందిన చరణ్ (30), అంకిశెట్టిపల్లెకు చెందిన సుమంత్ (31)లతో గొడవపడ్డాడు. ఘర్షణలో ముగ్గురిపై రాళ్లతో దాడిచేశాడు. దాడిలో ఆదికేశవ తీవ్రంగా గాయపడగా, చరణ్, సుమంత్‌లు సైతం గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. 13 మందిపై రౌడీషీట్ కేసులు రాయచోటి టౌన్ : పిల్లలపై నేరాలకు పాల్పడిన 13 మందిపై రౌడీ షీట్ కేసులు నమోదు చేసినట్లు రాయచోటి అర్బన్ సీఐ బీవీ చలపతి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయచోటిలో గత రెండేళ్ల కాలంలో మైనర్లపై దాడులకు పాల్పడిన వారిపై నిఘా ఉంచామన్నారు. అలాంటి వారిలో 13 మందిని గుర్తించి రౌడీషీట్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చిన్న పిల్లలు, మహిళలపై దాడులకు పాల్పడినా, అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అరటి తోటలను పరిశీలించిన మంత్రి సవిత లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామంలో శనివారం రాత్రి భారీ ఈదురు గాలులు, వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను సోమవారం రాష్ట్ర మంత్రి సవిత పరిశీలించారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నేర్జాంపల్లె గ్రామంలో పర్యటించి అక్కడ తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి రైతులతో చర్చించారు. అనంతరం పార్నపల్లె గ్రామంలో దెబ్బతిన్న అరటి పంటలను, తమలపాకు తోటలను పరిశీలించారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె రైతులకు హామీ ఇచ్చారు. ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లో పోటాపోటీగా క్రికెట్ పోటీలు వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో పోటాపోటీగా క్రికెట్ పోటీలు జరిగాయి. సోమవారం ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లోని ఆట స్థలంలో స్పోర్ట్స్ మీట్ క్రీడా పోటీలు నిర్వహించారు. దీంతో టీచింగ్, నాన్ టీచింగ్ మధ్య జరిగిన క్రికెట్ పోటీల్లో టెక్నికల్ టైగర్స్ జుట్టు విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన ఆర్కేవీ రైడర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లలో 78 పరుగులు చేయగా.. బ్యాటింగ్‌కు దిగిన టెక్నికల్ టైగర్స్ జుట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే 79 పరుగులు చేసి విజయం సాధించింది. విజేతలను డైరెక్టర్ కుమార స్వామి గుప్తా అభినందించారు. -
పట్టపగలే వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
మదనపల్లె : పట్టపగలే ఆగంతకుడు ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని బెదిరించి బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. దేవళంవీధికి చెందిన రాజమ్మ(80)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, ఆమె ఒంటరిగా మరో ఇంట్లో ఉంటోంది. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో సుమారు 25 సంవత్సరాలు వయస్సు కలిగిన యువకుడు తలకు టోపీ, మఖానికి మాస్కు, చేతులకు గ్లౌజులు ధరించి వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. వృద్ధురాలిని గొంతునులిమి బెదిరించి మెడలోని సుమారు 30 గ్రాముల బంగారు గొలుసుతో పాటు మరో 5 గ్రాముల చెవి కమ్మను బలవంతంగా లాక్కుని పరారయ్యాడు. బాధిత వృద్ధురాలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని చోరీ ఘటనపై ఫిర్యాదు చేసింది. పోలీసులు, వృద్ధురాలి ఇంటి సమీపంలోని సీసీ టీవీ పుటేజీని పరిశీలించగా, మాస్క్ ధరించిన వ్యక్తి చోరీ చేసి పారిపోతుండటాన్ని గుర్తించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ ఎరీషావలీ తెలిపారు. -
బ్యాడ్మింటన్ చాంపియన్లుగా నాగరాజు– నితిన్ జోడీ
కడప అర్బన్ : న్యాయశాఖ ఉద్యోగుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతలుగా నాగరాజు – నితిన్ జోడి నిలిచింది. కడప నగరం పక్కీరుపల్లెలోని పీవీఆర్ ఇండోర్ స్టేడియంలో న్యాయశాఖ ఉద్యోగుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు న్యాయమూర్తి రామారావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్. బాబా ఫక్రుద్దీన్ హాజరై విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్రీడాకారులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని అభినందించారు. కాగా టోర్నీలో రన్నరప్‌గా నరసింహారెడ్డి – ప్రభాకర్ రెడ్డి జోడీ నిలిచింది. అంతర్జాతీయ అంపైర్ జిలానీ బాషాకు సత్కారం అంతర్జాతీయ అంపైర్‌గా బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లాకు చెందిన ఎస్. జిలానీబాషాను టోర్నమెంట్ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ అంపైర్‌గా రాణిస్తూ ఉండడంతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రెఫరీ సెలక్షన్ కమిటీ అసెసర్ గా ఎంపిక కావడంపై జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు, న్యాయశాఖ ఉద్యోగులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజు, జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, కోశాధికారి గుప్తా, కృష్ణ ప్రసాద్, అహ్మద్, బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు సోనీ శ్యామూల్, వెన్నెల తదితరులు పాల్గొన్నారు.రన్నరప్‌గా నరసింహారెడ్డి – ప్రభాకర్ రెడ్డి -
ప్రకృతిని ప్రేమించండి.. భవిష్యత్తును కాపాడండి
ఒంటిమిట్ట : అడవులు మనకు జీవనాధారం, పచ్చదనాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. ఈ విషయాలను ప్రాక్టికల్‌గా అర్థం చేసుకునేలా ఒంటిమిట్ట అటవీశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన ప్రకృతి అవగాహన శిబిరం నేచర్ క్యాంప్ సోమవారం ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట మండల కేంద్రంలోని శ్రీ సాయి భారతి ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమశిల వెనుక జలాలు కలిగిన కుడమలూరు గ్రామంలో మంటపంపల్లి గ్రామ శివారులోని వనమిత్రలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకృతిలో అనుభూతిని పొందేలా అటవీ సంపదను కళ్లారా చూసేలా ప్రత్యేకమైన ఈ క్యాంప్ విద్యార్థులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిందని ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారి శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నాగు నాయక్, ఎఫ్ఎస్ఓ బ్రహ్మయ్య, నర్సరీ ఎఫ్బీఓ బాషా, సరోజ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బరామయ్య, ఉపాధ్యాయుడు రాజ, అటవీశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.శిక్షణ ఐఎఫ్ఎస్ అధికారి శ్రీకాంత్ -
తమిళనాడులో రోడ్డు ప్రమాదం
జమ్మలమడుగు : ద్విచక్రవాహనాల్లో అరుణాచలం బయలుదేరిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన నలుగురు యువకులు ప్రముఖ శైవ క్షేత్రమైన తమిళనాడులోని తిరునామలై అరుణాచలానికి ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. తమిళనాడులోని రాణికోట పట్టణ సమీపంలో వీరి ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన కంటైనర్ ఢీకొనడంతో గంజికుంట శేషాచలం(29) బడిగించల నాగేంద్ర(31) కిందపడ్డారు. అదే సమయంలో వెనుకవైపు నుంచి వచ్చిన కారు వీరిద్దరిపై నుంచి వెళ్లడంతో శేషాచలం, నాగేంద్ర అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గంజికుంట శేషాచలంకు వివాహమై ఒక కుమార్తె ఉంది. సోమవారం సాయంత్రం మృతదేహాలు స్వగ్రామమైన వేపరాలకు చేరాయి.వేపరాలకు చెందిన ఇద్దరి మృతి -
నూతన వధూవరులకు ఆశీర్వాదం
● అడుగడుగునా కన్నీటిగాథలే.. సాక్షి కడప : పచ్చని ఫలం చూస్తుండగానే నేలవాలింది.. కొండంత కష్టం నేలపాలైంది. ప్రకృతి దెబ్బకు గెలలతో కళకళలాడుతున్న అరటి అల నిలువునా ఒరిగిపోయింది. రెండు,మూడు రోజుల్లో కోత కోద్దామనుకున్న రైతుల ఆశల్ని గాలివాన తుంచేసింది. వారి కాయాకష్టాన్ని నేలపాలు చేస్తూ వారి జీవితాల్లో కోత విధించింది. రెండు రోజుల క్రితం వీచిన గాలివానకు పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో అరటి తోటలు ధ్వంసమయ్యాయి. నిండు కాపుతో ఉన్న చెట్లన్ని నేలపాలు కావడంతో రైతుల వేదన అరణ్య రోదనగా మారింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడం మరింత బాధ కలిగిస్తోందని రైతులు వాపోయారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై వైఎస్ జగన్ ధ్వజం గాలులు, వర్షాలకు లింగాల మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతలతోపాటు అనేక గ్రామాల రైతులు విలవిలలాడుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. దెబ్బతిన్న తోటలను పరిశీలించారు. వారి బా ధలను ఆలకించారు. అండగా ఉంటామని ధైర్యం నింపారు. ప్రభుత్వం మెడలు వంచైనా పరిహారం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని రైతులలో భరోసా నింపారు. కూటమి ప్రభుత్వ పాలన ఏడాద వుతోంది.. మరో మూడేళ్లలో తమ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ఇన్సూరెన్స్‌తోపాటు పూర్తిస్థాయిలో ఇన్‌ఫుట్ సబ్సిడీ..గతంలో ఇచ్చిన రూ.50వేల తరహా లోనే నెల రోజుల్లోనే అందిస్తామని రైతన్నల్లో భరోసా నింపారు. తోటలను పరిశీలించిన మాజీ సీఎంఅకాల వర్షాలకుతోడు పెనుగాలులతో లింగాల మండలంలో దెబ్బతిన్న అరటి తోటలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డిలతో కలిసి పరిశీలించారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల గ్రామాల్లో సూర్య నారాయణరెడ్డి, కేశవయ్య పొలాలతోపాటు దారి పొడవునా అరటి తోటలను పరిశీలించారు. తోటల పరిస్థితిని చూసి మాజీ సీఎం చలించిపోయారు. కూటమి సర్కారుపై కన్నెర్రలింగాల మండల పర్యటనలో రైతులు పడుతున్న బాధలను దగ్గరగా చూసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తుత కూటమి సర్కార్ నిరంకుశ వైఖరిని తప్పుబట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉన్న ఉచిత పంటల భీమా విధానాన్ని రద్దు చేసి కొత్తగా బీమా ప్రీమియం చెల్లించకపోవడంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ సీఎం దుయ్య బట్టారు. రైతులకు సంబంధించి సున్నా వడ్డీ లేదు, కనీసం రైతు భరోసా లాంటిది అందించడంలేదని ధ్వజమెత్తారు. కనీసం ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మండిపడ్డారు. మండు వేసవిలో ఎండలు అదరగొడుతున్నా.. మిట్ట మధ్యాహ్న సమయంలోనే రైతులతో మమేకమయ్యారు. రైతుల బాధలను పంచుకుంటూ.. పొలాల మధ్యనే రైతులతో మాట్లాడుతూ కదిలారు. వైఎస్ జగన్ పర్యటన విజయవంతంమాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటన విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నం ఇడుపులపాయ నుంచి తాడేపల్లికి బయలుదేరే సమయంలో హెలీప్యాడ్ వద్ద వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ లింగాల మీదుగా తాతిరెడ్డిపల్లెకు వెళుతుండగా రైతులు అడుగడుగునా ఆపి తమ పొలాలను చూపించారు. సూర్యనారాయణరెడ్డి తోట వద్దకు రాగానే ఇంద్రావతి, రాగమణి, లక్ష్మిదేవి, ఎం.లక్ష్మిదేవి, రాజేశ్వరి, వాలమ్మ తదితరులు జగన్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటూ... ‘పంటంతా పోయింది.. రేపో మన్నాడో కోస్తామనుకునేలోపే పోయింది. ఉన్నఫలంగా గాలులు దెబ్బతీశాయి. మాకు దిక్కెవరంటూ’విలపించారు. కొందరు మహిళలు ‘మాకు ఇద్దరు ఆడబిడ్డలు అని ఒకరు, మాకు ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు ఎలా చదివించాలి, ఎలా బతికి బట్టకట్టాలంటూ బోరుమన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తీరా కోసే సమయంలో ఇలా పడిపోయిందని.. చివరకు కూలీ లు దొరకడం లేదు.. ఆలస్యం కావడంతో దళారులు రేట్లు తగ్గిస్తున్నారు.. ఈ వ్యవస్థను మార్చండి.. మమ్ములను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండని’జగన్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. వారితోపాటు ఉన్న కొంతమంది తాతిరెడ్డిపల్లె రైతులు కూడా తమ బాధను మాజీ సీఎంకు వివరించారు. దళారుల రాజ్యం అధికంగా ఉందని.. ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదని.. ఇన్‌ఫుట్ సబ్సిడీ కూడా ఇవ్వకపోతే పెట్టుబడులు కూడా దక్కవని వాపోయారు. దీనికి స్పందించిన వైఎస్ జగన్.. ప్రభుత్వం ఇన్సూరెన్స్‌కు ప్రీమియం చెల్లించలేదు.. కనీసం రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మీకు న్యాయం జరిగేలా పోరాడుతామన్నారు. అంతేకాకుండా అక్కడే ఉన్న ఉద్యాన శాఖ అధికారులతోపాటు రెవెన్యూ, ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులను కూడా మాజీ సీఎం గట్టిగా ప్రశ్నించారు. చిన్నకుడాల క్రాస్ నుంచి లింగాల, తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల వరకు పొలాలను పరిశీలిస్తున్న సందర్భంలో ప్రతి రైతు కంట కన్నీరు కనిపించింది. ఈదురు గాలులకు నిలువునా నేలవాలిన తోటలు ప్రకృతి దెబ్బతీసినా..పట్టించుకోని ప్రభుత్వం లింగాల మండలంలో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన వైఎస్ జగన్ వేంపల్లె : వేంపల్లె జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి కుమారుడికి వివాహమైన నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జెడ్పీటీసీ స్వగృహానికి వెళ్లి నూతన వధూవరులను ఆశ్వీరదించారు. ఇటీవల శ్రీలంకలో జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి కుమారుడైన సాయి భైరవ ప్రీతం కుమార్ రెడ్డి, వైష్ణవిల వివాహం జరిగింది. జిల్లా పర్యటనలో పులివెందులకు విచ్చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లింగాల మండలంలో పర్యటించి అక్కడి అరటి రైతులను పరామర్శించిన అనంతరం రోడ్డు మార్గాన పులివెందుల నుంచి వేంపల్లెకు విచ్చేశారు. అలాగే రవికుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, సుఽధీర్ కుమార్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, మేయర్ సురేష్ బాబు, వేంపల్లె వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు చంద్ర ఓబుల్ రెడ్డి, ఉపాధ్యక్షులు మునీర్‌బాషా, రవిశంకర్ గౌడ్, సర్పంచ్ ఆర్.శ్రీనివాసులు పాల్గొన్నారు. -
మహిళలకు ఖురాన్ పఠనం
రాయచోటి జగదాంబసెంటర్ : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం ముస్లిం మైనార్టీ మహిళలకు ఖురాన్ పఠనం, ఇప్తార్ విందు ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయం – టీడీజీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి కడప రూరల్ : వైఎస్సార్ కడప జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి అన్నారు. సోమవారం స్థానిక తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు సంఖ్యా బలం లేదన్నారు. అందువలన తాము జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని స్పష్టం చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, మాధవి రెడ్డి పాల్గొన్నారు. నిత్యకల్యాణానికి విరాళాలు బ్రహ్మంగారిమఠం : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవింద మాంబల నిత్య కళ్యాణానికి భక్తులు విరాళాలు ఇస్తున్నారు. సోమవారం రాజుపాళెం మండలం అరకటవేముల గ్రామానికి చెందిన రాచంరెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి, ధర్మపత్ని వెంకటసుబ్బమ్మ కుటుంబ సభ్యులతో స్వామి మాస కళ్యాణంకు కార్తిక శుద్ద ద్వాదశ రోజున జరిపే ఈ కళ్యాణంకు రూ.1,00,150లు నగదు అందజేశారు. ఇదే క్రమంలో దువ్వూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన మాబుషరీఫ్ ధర్మపత్ని రేష్మి రూ.1,00,116లు అందించారు. వీరికి స్థానిక పిట్ పర్సన్ శంకర్‌బాలాజీ,మఠం మేనేజర్ ఈశ్వరాచారిలు ప్రత్యేక పూజలు చేయించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా పిట్ పర్సన్ మాట్లాడుతూ.. నూతనంగా తలపెట్టిన వీరబ్రహ్మేంద్ర, గోవిందమాంబల మాస కార్తిక శుద్ద ద్వాదశ రోజున జరిపే కళ్యాణానికి భక్తులకు వారికి తోచిన విధంగా విరాళాలు ఇస్తుండటం హర్షనీయమన్నారు. -
రాజంపేట కోర్టు క్లాంపెక్స్ ఒప్పందం అమలుకు కృషి
రాజంపేట : రాజంపేట కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన స్థలం అంశంలో రెవెన్యూ, న్యాయశాఖ మధ్య జరిగిన ఒప్పందం అమలుకు తన వంతుగా కృషి చేస్తానని నూతనంగా ఎన్నికై న రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పచ్చా హనుమంతు నాయుడు అన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కోర్టు క్లాంపెక్స్ ఒప్పందంలో భాగంగా తహసీల్దారు కార్యాలయాన్ని అధికారికంగా న్యాయశాఖకు అప్పగించారని గుర్తు చేశారు. రాజంపేట కోర్టుకు మహర్దశ కల్పించేందుకు అసోసియేషన్ కార్యవర్గ సహకారంతో కృషి చేస్తానన్నారు. కోర్టు నూతన భవనాల నిర్మాణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారంలో తాము ముందుంటామన్నారు. సమావేశంలో న్యాయవాది కేఎంఎల్ నరసింహులు, రాజంపేట, నందలూరు న్యాయవాదులు పాల్గొన్నారు. -
సమస్టిగా క్షయవ్యాధిని నివారిద్దాం
జేసీ ఆదర్శరాజేంద్రన్రాయచోటి అర్బన్ : క్షయవ్యాధి నివారణకు అందరూ సమస్టిగా కృషి చేద్దామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ,సిబ్బంది స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి ప్రారంభించిన ర్యాలీని ఆయన జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలోని 61 పంచాయతీలను టీబీ ముక్త్ అభియాన్‌లో భాగంగా ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపిక చేసిన గ్రామాల సర్పంచ్‌లు,సీహెచ్ఓలకు టీబీ ముక్త్ పంచాయతీ అవార్డులను అందచేయనున్నట్లు తెలిపారు. 2027 నాటికి టీబీని పూర్తిస్థాయిలో నివారించే కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవాలని కోరారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొండయ్య మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పీహెచ్సీ, యూపీహెచ్సీ సామాజిక ప్రాంతీయ, జిల్లా అసుపత్రులలో టీబీ వ్యాధి నిర్ధారణ కోసం గళ్ల, ఎక్స్‌రే పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయితే 6నెలల వరకు ఉచితంగా డాట్స్ద్వారా మందులను కూడా అందచేస్తారని చెప్పారు. ఏడీఎంహెచ్ఓ, జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారిణి శైలజ మాట్లాడుతూ జిల్లాలో 9 టీబీ యూనిట్లు ఉన్నాయన్నారు. ఆయా యూనిట్లలోని వైద్యఅధికారులు, సిబ్బంది తమ పరిధిలో టీబీ కేసులను గుర్తించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించడం, డాట్స్ ద్వారా ఉచితంగా మందులు అందచేయడం, రోగులకు ప్రధా నమంత్రి పోషణ్ అభియాన్ పథకం కింద వారి ఖాతాలో నెలకు రూ.1000లు జమచేయడం జరుగుతోందని వివరించారు. అనంతరం టీబీ వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభను కనపరచిన సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందచేశారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డేవిడ్ సుకుమార్, డీపీఎంఓ రియాజ్‌బేగ్, వైద్యులు కోటేశ్వరి, ఆశ్విన్, రియాజ్, రెడ్డిశేఖర్‌రెడ్డి, ఆరోగ్యవిద్యాధికారి మహమ్మద్ రఫీ, టీబీ పోగ్రాం పర్యవేక్షఖులు శ్రీనివాసులు, మురళి, ప్రణీత్,భూపతి, తరుణ్,సుశీల తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షల వేళ .. పట్టుజారితే ప్రమాదం!
గుర్రంకొండ : పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఇష్టానుసారం ద్విచక్రవాహనాల్లో పరీక్షా కేంద్రాల వద్దకు వస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు నుంచి నలుగురు విద్యార్థులు ఒకే ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు పరీక్షలు రాసిన తరువాత పరీక్షా కేంద్రాల వద్దనే రోడ్డుపై సర్కస్ ఫీట్లు చేస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పరీక్షలు రాసే ఇలాంటి సమయాల్లో పట్టుజారి ప్రమాదాలకు గురైతే వారి పరిస్థితి ఏంటని ఈ దృశ్యాలను చూసిన వారు చర్చించుకుంటున్నారు. జాతీయ రహదారిపై అజాగ్రత్తగా.. అన్నమయ్య జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కువగా ద్విచక్రవాహనాల్లో వచ్చే విద్యార్థుల సంఖ్య కనిపిస్తోంది. గుర్రంకొండలోని తెలుగు, ఉర్దూ జెడ్పీ హైస్కూళ్లలో 324 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. పలువురు విద్యార్థులు ద్విచక్ర వాహనాలపై పరీక్షా కేంద్రాలకు వస్తున్నారు. అదికూడా ఒకరిద్దరు కాదు ఏకంగా ముగ్గురు నుంచి నలుగురు కలిసి ప్రయాణిస్తుండడం గమనార్హం. ఎన్‌హెచ్ 340 కడప–బెంగళూరు జాతీయ రహదారిపై నిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్న ఈ రెండు జెడ్పీ హైస్కూళ్లు జాతీయ రహదారికి పక్కనే ఉన్నాయి. దీంతో వేగంగా పరీక్షా కేంద్రాలకు ద్విచక్రవాహనాలపై వచ్చే విద్యార్థులు పట్టుజారి ప్రమాదాల బారిన పడితే వారి భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. కనీసం ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా విచక్షణ లేకుండా పదో తరగతి పరీక్షలు రాసే తమ పిల్లలకు ద్విచక్రవాహనాలు ఇచ్చి పంపిస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దృశ్యాలను పోలీసులు గమనిస్తూ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తుండడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. పోలీసులు స్పందించి తగు చర్యలు చేపట్టాల్సి ఉంది. విన్యాసాలతో వికృత చేష్టలు.. పరీక్షలు రాసిన అనంతరం పలువురు విద్యార్థులు తమ ద్విచక్రవాహనాల్లో ఏకంగా ముగ్గురిని కూర్చోబెట్టుకొని సర్కస్‌ఫీట్లు చేస్తున్నారు. కొంతమంది విద్యార్థినులను వెంబడిస్తూ వేగంగా వారి ముందువైపు వాహనాలను నడుపుతూ ప్రమాదకర ఫీట్లు చేస్తుండడం దారుణం. ద్విచక్రవాహనాల్లో వచ్చే వి ద్యార్థులు పరీక్షా సమయం ముగిసినా ఇళ్లకు వెళ్లకుండా రోడ్లపై ఇష్టానుసారం వేగంగా వాహనాలు నడుపుతూ పరీక్షా కేంద్రాల వద్దనే చక్కర్లు కొడుతూ భయంకర విన్యాసాలకు పాల్పడుతున్నారు. ద్విచక్ర వాహనాల్లో పరీక్షా కేంద్రాలకు మైనర్ విద్యార్థులు ఒకే వాహనంలో ముగ్గురి నుంచి నలుగురు ప్రయాణం పరీక్షా కేంద్రం వద్దే ద్విచక్రవాహనాలతో సర్కస్ ఫీట్లు -
టోల్‌ప్లాజా వద్ద ఆగిన అద్దె బస్సులు
రామాపురం : కర్నూలు – చిత్తూరు 40వ జాతీయ రహదారి బండపల్లె వద్ద గల టోల్‌ప్లాజాలో రాయచోటికి చెందిన ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సులకు ఫాస్ట్‌ట్రాక్‌లో నిధులు లేకపోవడంతో అన్ని బస్సులను సోమవారం టోల్‌ప్లాజా సిబ్బంది ఆపేసి, పక్కన నిలబెట్టారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆయా బస్సులలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ సందర్భంగా బస్సు డ్రైవరు, కండక్టర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒక్కసారిగా అన్ని బస్సులకు ఫాస్ట్ ట్రాక్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. చివరకు బస్సు నిర్వాహకులు, యజమానులు, టోల్‌ప్లాజా వద్దకు చేరుకొని ఫాస్ట్ ట్రాక్ వేయడంతో ఒక్కో బస్సును టోల్‌ప్లాజా దాటించే ప్రయత్నం చేశారు. అవస్థలు పడిన ప్రయాణికులు ఎట్టకేలకు బస్సులకు ఫాస్ట్ ట్రాక్ వేయడంతో కదిలిన వైనం -
కేజీబీవీల్లో ప్రవేశాలకు పిలుపు
రాములోరి బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరణ ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దుఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం బోర్డు సమావేశం అనంతరం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఏప్రిల్ 6 నుంచి 14వ తేది వరకు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్ 9న హనుమంత వాహనం, 10న గరుడవాహనం, 11న సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణ జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అలాగే ఏప్రిల్ 12న రథోత్సవం, 14న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. కార్యక్రమంలో ఈఓ జె శ్యామలరావు, అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేసవి నేపథ్యంలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలి రాయచోటి అర్బన్/జగదాంబసెంటర్: వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని కార్మికులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కార్మికశాఖ ఇన్చార్జి అధికారి డీవీ రంగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. మండుతున్న ఎండలను గుర్తెరిగి కార్మికుల రక్షణ కోసం యాజమాన్యాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా కార్మికుల పనిగంటలలో మార్పులు,చేర్పులు చేసుకోవాలన్నారు. బహిరంగంగా పనిచేసే కార్మికులు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4గంటల వరకు పనివేళలు మార్చుకోవాలన్నారు. పనిప్రాంతంలో చల్లనినీరుతో పాటు నీడవసతిని కూడా కల్పించాలని పేర్కొన్నారు. వడదెబ్బకు గురికాకుండా డీహైడ్రేషన్ నివారణ మార్గాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అర్జీలకు సత్వరమే పరిష్కారం – జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకొని నూరుశాతం పరిష్కరించాలన్నారు. సమస్య ఏమిటి, దానిని ఎలా పరిష్కరించాలన్న విషయాలపై అధికారులకు అవగాహన ఉండాలని, చిత్త శుద్ధితో ప్రజల సమస్యలను నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డిఆర్ఓ మధుసూదన్ రావు, ఎస్డీసీ రమాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాయచోటి : ప్రజా సమస్యల పరిరరాంలో ఏమాత్రం అలసత్వం చేయరాదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయడు పోలీసులు అధికారులను ఆదేశించారు. సోమవారం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలన్నారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ సమగ్ర విచారణ జరిపి పరిష్కరించాలని ఎస్పీ తెలిపారు. మదనపల్లె సిటీ : గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాలు, అనాథ బాలికల చదువుకు కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) బాసటగా నిలుస్తున్నాయి. ఉచిత వసతితోపాటు భోజనం ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నాయి. తాజాగా కేజీబీవీల్లో 6వ తరగతితోపాటు ఇంటర్ ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 11వ తేదీ వరకు గడువు విధించారు. అర్హులైన బాలికలు 6వ తరగతి, ఇంటర్లో ప్రవేశాలు పొందవచ్చు. జిల్లా వ్యాప్తంగా చిన్నమండ్యం, చిట్వేలి, గాలివీడు, కలకడ, కురబలకోట, కె.వి.పల్లి, లక్కిరెడ్డిపల్లె, ములకలచెరువు, నిమ్మనపల్లె, ఓబులవారిపల్లె, పెద్దమండ్యం, పెనగలూరు, పెద్దతిప్పసముద్రం, పుల్లంపేట, రామాపురం, రామసముద్రం, రాయచోటి, సంబేపల్లి, తంబళ్లపల్లె, టి.సుండుపల్లి, వీరబల్లి, బి.కొత్తకోటల్లో కేజీబీవీలు ఉన్నాయి. సీట్ల భర్తీలో నిబంధనల మేరకు ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ కేటగిరీ వారీగా ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం 6 వ తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం సీట్లను భర్తీ చేస్తారు. 7,8,9 ,10, 12 తరగతుల్లో మిగిలిన సీట్లకుఆడ్మిషన్లు ఉంటాయి. దరఖాస్తును హెచ్‌టీటీపీఎస్://ఏపీకేజీబీవీ. ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐఎన్ సైట్ ద్వారా పొందవచ్చు. ఎంపికై న విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది. ఇందు కోసం రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించారు. తరగతికి 40 మంది... కేబీజీబీలో 6 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో తరగతికి 40 సీట్ల చొప్పున కేటాయించారు. ఇంటర్మీడియట్‌కు సంబంధించి ఒక్కో కేజీబీవీలో ఒక్కో గ్రూపును ప్రవేశపెట్టారు. 40 సీట్ల చొప్పున అడ్మిషన్లు ఉంటాయి. ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణజిల్లాలో కేజీబీవీలు : 22 ప్రవేశాలు : 6వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం : ఎంపీసీ,బైపీసీ, ఎంఈసీ,సీఈసీ, ఎంఎల్టి, ఎంపీహెచ్డబ్యు కోర్సులు 7,8,9,10,12 తరగతుల్లో మిగిలిన సీట్లు కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన కేజీబీవీ పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన సాగుతోంది. మౌలికసదుపాయాలు, విద్యార్థులకు స్మార్ట్ డిజిటల్ తరగతులు ద్వారా బోధన ఉంటుంది. బాలికలకు భరోసాగా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. చదువుతో పాటు క్రీడలు, ఇతర నైపుణ్యాలను మెరుగులు దిద్దుతాం. – సుమతి, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్.కేజీబీవీ, తంబళ్లపల్లె అవకాశాన్ని వినియోగించుకోవాలి కేజీబీవీ పాఠశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థినులు అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. పేద, అనాథ, బడిబయట పిల్లలు, బడిమానేసిన బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇక్కడ బోధనతో పాటు వసతి ఉంది. – సుబ్రమణ్యం, జిల్లా విద్యాశాఖాధికారి -
భక్తులతో కిక్కిరిసిన గంగమ్మ దేవత ఆలయం
లక్కిరెడ్డిపల్లి : మండలంలోని అనంతపురం గంగమ్మ తల్లికి వేలాది మంది భక్తులు ఆదివారం బోనాలు సమర్పించి తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర ముగిసిన తరువాత మూడవ ఆదివారం కావడంతో చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలిరావడంతో అమ్మవారి దర్శనం కోసం వేకువజాము నుంచే క్యూలైన్లో భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. లక్కిరెడ్డిపల్లి పోలీసులతోపాటు ప్రత్యేక అధికారి శ్రీనివాసులు, ఆలయ పూజారులు చెల్లు గంగరాజు, దినేష్ యాదవ్, రామచంద్ర, వెంకటేష్, గురుస్వామి , రెడ్డి శేఖర్, బోస్ యాదవ్, సాయిలు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించే విధంగా చొరవచూపుతూ అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో భక్తులకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మానవత స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రసాద్ యాదవ్, రవికుమార్, షఫీ, నాయక్, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
దెబ్బతిన్న అరటితోటలను నేడు వైఎస్ జగన్ పరిశీలన
పులివెందుల: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం 8.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి లింగాల మండలంలో అరటి తోటలను పరిశీలిస్తారు. తాజాగా తీవ్ర ఈదురుగాలులతో లింగాల మండలంలో వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది. నష్టపోయిన అరటి రైతులతో మాట్లాడతారు. అనంతరం వేంపల్లెలో జెడ్పీటీసీ రవి నివాసంలో జరిగే శుభకార్యానికి హాజరవుతారు. తర్వాత ఇడుపులపాయ చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమన్ని నిర్వహి ంచనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ చామ కూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నేడు గోవిందమాంబ ఆరాధన మహోత్సవం బ్రహ్మంగారిమఠం: శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ధర్మపత్ని మాతా గోవిందమాంబ ఆరాధన మహోత్సవం సోమవారం నిర్వహించనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు చేయనున్నారు. నేడు రాయచోటిలో ర్యాలీ రాయచోటి అర్బన్: ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమ వారం పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొండయ్య, అదనపు డీఎంహెచ్ఓ, జిల్లా టీబీ పోగ్రాం అధికారిణి శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి నేతాజి సర్కిల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు సాగుతుందన్నారు. అనంతరం ఎన్జిఓ సబాభవనంలో సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఏడాది నిర్వహించిన టీబీ నివారణ కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి, టీబీ ముక్తభారత్‌లో ఎంపికై న పంచాయతీలకు అవార్డులను ప్రదానం చేయనున్నట్లు వారు తెలిపారు. 29న నాటక ప్రదర్శనలు రాజంపేట టౌన్: అన్నమయ్య 522వ వర్ధతిని పురస్కరించుకొని ఈనెల 29వ తేదీ రాత్రి 7 గంటల నుంచి తాళ్లపాక ధ్యానమందిరం ఆవరణలో ఉచితంగా నాటకాలను ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని అన్నమయ్య కళాకారుల ఐక్యవేదిక రాజంపేట అధ్యక్షుడు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నాటకాల ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా శ్రీరామాంజనేయ యుద్దసీను, శ్రీకృష్ణరాయబారంలోని మయసభ సన్నివేశం, పడక సీను, కర్ణసందేశం, బాలనాగమ్మ నాటకంలోని సన్నివేశాలను ప్రముఖ కళాకారులు ప్రదర్శిస్తారని చెప్పారు. -
జేఎన్టీయూ గేమ్స్ మీట్లో అనంతపురం విద్యార్థుల ప్రతిభ
కలికిరి : కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు జరిగిన జేఎన్టీయూ యూనివర్సిటీ స్థాయి 12వ ఇంటర్ కాలేజియేట్ గేమ్స్ మీట్–2025 ఆటల పోటీలలో జేఎన్టీయూ ఏ అనంతపురం విద్యార్థులు ప్రతిభ చాటి ఓవరాల్ చాంపియన్ ట్రోఫీ దక్కించుకున్నారు. గేమ్స్ మీట్ ముగింపు సందర్భంగా కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడారు. కలికిరి కళాశాలలో మొదటి సారిగా యూనివర్సిటీ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడంతో కళాశాలకు మంచి గుర్తింపు లభించిందన్నారు. విజేతలు వీరే.. టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో జేఎన్టీయూ ఏ అనంతపురం, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో తిరుపతి కేఎంఎం కళాశాల, బ్యాడ్మింటన్ పురుషులు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో మదనపల్లి మిట్స్ కళాశాల విజేతలుగా నిలిచాయి. త్రోబాల్ మహిళల విభాగంలో మదనపల్లి మిట్స్, హ్యాండ్ బాల్ మహిళల విభాగంలో పులివెందుల జేఎన్టీయూ, వాలీబాల్ మహిళల విభాగంలో తిరుపతి ఎస్వీసీఈ కళాశాల, ఖోఖో పురుషుల విభాగంలో కలికిరి జేఎన్టీయూ, హ్యాండ్ బాల్ పురుషుల విభాగంలో పుత్తూరు సిద్దార్థ కళాశాల, వాలీబాల్ పురుషుల విభాగంలో పుత్తూరు సిద్దార్థ కళాశాల టీంలు విజేతలుగా నిలిచాయి. ఓవరాల్ చాంపియన్ షిప్ టైటిల్‌ను 50 పాయింట్లతో జేఎన్టీయూ ఏ అనంతపురం కళాశాల సొంతం చేసుకుంది. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ త్యాగరాజన్, జేఎన్టీయూ అనంతపురం ఫిజికల్ డైరెక్టర్ జోజిరెడ్డి, అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
రామా.. సామాన్యుల బాధ కనుమా!
రాజంపేట: రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఆలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఇక్కడ ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో అత్యంత కీలకఘట్టం ఏప్రిల్ 11న జరిగే దాశరథి కల్యాణం. కల్యాణం కనులారా తిలకించే భాగ్యం సామాన్య భక్తులకు దరిచేరేలా ఉంటుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో టీటీడీ ఎలా వ్యవహరిస్తుందనేది వేచిచూడాల్సిందే. వీవీఐపీ, వీఐపీలకే పెద్దపీట వేసే క్రమంలో.. కల్యాణ వీక్షణకు వీవీఐపీ, వీఐపీలకు పెద్దపీట వేసే క్రమంలో సామాన్య భక్తులను దూరం చేస్తోందన్న అపవాదును టీటీడీ మూటకట్టుకోవాల్సి వస్తుంది. సామాన్య భక్తులు కూడా కనులారా వీక్షించే సౌకర్యం కల్పించాలని వినతులు వస్తున్నాయి. కనీసం కల్యాణం తర్వాత ఉత్సవమూర్తులను దగ్గ్గరగా దర్శించుకునే భాగ్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ● సామాన్య భక్తుల గ్యాలరీలు ఉన్నప్పటికీ, అవి కల్యాణ వేదికకు చాలా దూరంగా ఉంటాయి. కాబట్టి ఎల్ఈడీ స్క్రీన్‌లో మాత్రమే చూడాల్సి వస్తోంది. కేవలం కల్యాణ వేదికలో ఉన్నామన్న భావనతో ఉండాల్సి వస్తోంది. ఈ సారి 60 గ్యాలరీలు ఏర్పాటు చేయాలనే భావనలో టీటీడీ ఉన్నట్లు సమాచారం. భక్తులు మధ్యాహ్నం 2 నుంచి గ్యాలరీకి చేరుకుంటారు. ఈ ఏడాది భానుడి ప్రతాపం అధికంగా ఉంటోంది. కాబట్టి సౌకర్యాల కల్పనలో ఎలాంటి తప్పిదాలు తలెత్తినా.. టీటీడీ మరోసారి నిందలు మోయాల్సి వస్తుంది. ప్రసాదాల కోసం పడరాని పాట్లు రాములోరి కల్యాణం వీక్షించేందుకు వచ్చే సామాన్య భక్తులకు టీటీడీ అందజేసే ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాల విషయంలో ఎప్పుడూ తోపులాటలు జరుగుతున్నాయి. ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉండేందుకు.. టీటీడీ గట్టి చర్యలు చేపట్టాల్సి ఉంది. తిరుమల శ్రీవారి లడ్డూలు రెండు (25 గ్రాములు) ఇచ్చేందుకు టీటీడీ యోచిస్తున్నట్లు తెలిసింది. పంపిణీ కౌంటర్ల విషయంలో గందరగోళం లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. గతంలో కన్నా అధిక సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేసే యోచనలో టీటీడీ నిమగ్నం కావాలి. అలా చేస్తే.. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా ఉంటారు. ●సర్వాంగ సుందరంగా.. వచ్చే నెల 11న రాములోరి కల్యాణం సామాన్య భక్తులకు కనిపించని భాగ్యం టీటీడీకి సవాల్‌గా మారనున్న పరిస్థితి కల్యాణ వేదికను పుష్పాలు, ఫలాలతో సుందరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఉద్యానవన విభాగానికి ఆ బాధ్యతలను అప్పగించనున్నారు. అందుకు సంబంధించి సన్నద్ధం కావాలని టీటీడీ ఆదేశించినట్లు సమాచారం. కడప–రేణిగుంట జాతీయ రహదారి పక్కన విశాలమైన ఖాళీ స్థలంలో రూ.40 లక్షలతో ప్రధాన కల్యాణ వేదిక నిర్మించారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి శాశ్వత పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం రూ.45 కోట్లతో కలశం ఆకృతితో నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. తొలివిడతలో రూ.17 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం కల్యాణవేదిక రహదారి, ముఖద్వారాలు, జాంబవంతుని విగ్రహం, పలు సౌకర్యాలకు రూ.28 కోట్లకు పైగా వ్యయం చేశారు. -
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
మదనపల్లె : వ్యక్తి అదృశ్యంపై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఎరీషావలీ తెలిపారు. పట్టణంలోని బుగ్గకాలువకు చెందిన సురేంద్ర (44) స్థానికంగా పండ్ల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా తిరుపతి పండ్ల మండీలో నగదు రావాల్సి ఉండగా మండీ యజమానులు నగదు ఇస్తామని చెప్పడంతో అదే విషయం ఇంట్లో చెప్పి ఈనెల 19న ఇంటి నుంచి వెళ్లాడు. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. పలుచోట్ల కుటుంబ సభ్యులు, భార్య గాలించినా ఫలితం లేకపోవడంతో ఆదివారం సురేంద్ర భార్య భాగ్యలక్ష్మి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య గాలివీడు : గల్ఫ్ దేశానికి వెళ్లొద్దన్నారని మనస్థాపంతో బూజెల హరిప్రసాద్(53) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గాలివీడు పట్టణంలో జరిగింది. ఎస్ఐ రామకృష్ణ కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన బూజెల లక్ష్మన్న కుమారుడు హరిప్రసాద్ పలుమార్లు కువైట్ కు వెళ్లి వచ్చాడు. అయితే గత సంవత్సరం ఇండియాకు వచ్చిన హరిప్రసాద్ మళ్లీ కువైట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు కుటుంబ సభ్యులు వద్దని అడ్డు చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం గాలివీడు మండలం పక్కీరారెడ్డిగారిపల్లెలో నివాసం ఉంటున్న మేనల్లుడు ఎద్దుల ఈశ్వర్ ఇంటికి వచ్చిన హరిప్రసాద్ మనస్థాపంతో మద్యంలో విష ద్రావణం కలుపుకుని తాగాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న హరిప్రసాద్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పల్లెపల్లెలో బెల్టు షాపులు పుల్లంపేట : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా ఉంది. ఒక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామాలలో బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. వాటిని అమలు చేయాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉన్నారు. పుల్లంపేట మండలంలో మూడు మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే ప్రతి గ్రామంలో బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం బాటిళ్లపై రూ. 10 నుంచి రూ. 20లు వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా రెడ్డిపల్లి మద్యం దుకాణం వద్ద అనధికారికంగా పర్మిట్ రూములు ఏర్పాటు చేయడం వల్ల మద్యం ప్రియులు యథేచ్ఛగా మద్యం తాగుతున్నారు. కూలి నాలి చేసుకునే వారు మద్యానికి బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాలలో బెల్టు షాపులు లేకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
హార్సిలీహిల్స్‌లో వెలగని లైట్లపై సబ్ కలెక్టర్ సీరియస్
బి.కొత్తకోట: హార్సిలీహిల్స్‌పై వెలగని లైట్ల విషయమై మదనపల్లె సబ్‌కలెక్టర్, హార్సిలీహిల్స్ టౌన్షిప్ కమిటీ చైర్మన్ మేఘస్వరూప్ సీరియస్ అయ్యారు.దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ‘హార్సిలీహిల్స్‌కు వెలుగులు ఎప్పుడు‘ శీర్షికతో ఆదివారం ప్రచురితమైన కథనంపై సబ్ కలెక్టర్ స్పందించారు. విద్యుత్‌శాఖ సిబ్బందితో మాట్లాడిన సబ్‌కలెక్టర్ కార్యాలయ సిబ్బంది అసలు సమస్య ఎక్కడున్నది ఆరా తీశారు. దీనిపై విద్యుత్‌శాఖ, కాంట్రాక్టర్ హార్సిలీహిల్స్‌కు పరుగులు తీశారు. టెండర్లో హైమాస్ లైట్లు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ వాటి నిర్వహణ బాధ్యతలు చూడాలన్న నిబంధన ఉంది. సబ్ కలెక్టర్ ఆదేశాలతో కొండపై ఐదుచోట్ల ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను పరిశీలించారు. వాటికి స్విచ్‌బోర్డులు ధ్వంసం కావడం, సరైన విద్యుత్ సరఫరా వైర్లు లేకపోవవడం, పైన అమర్చిన లైట్లు పగిలిపోవడం లేదా కాలిపోవడాన్ని గుర్తించారు. మెయిన్ స్విచ్‌లు మార్చాలని, కంట్రోల్ ప్యానళ్లు అమర్చాలని గుర్తించారు. గాలిబండలపై రెండు, గుడి వద్ద ఒకటి హైమాస్ లైట్లు వెలగకపోవడానికి ఇవే కారణమని నిర్ధారించారు. అలాగే ఒకదానికి విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయాలని లైన్ ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి చెప్పారు. అంథకారంలో ఉంటున్నామని, రాత్రివేళల్లో ఇబ్బందులు పడుతున్నామని పర్యాటకులు, స్థానికులు చెప్పారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ● తక్షణమే చర్యలకు ఆదేశం -
● రూ.406 కోట్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు రూ.20వేల ఆర్థిక సహాయం అందాలి. 2024–25లో ఈ పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులు ప్రభుత్వం నుంచి పొందాల్సిన సాయాన్ని నష్టపోయారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే రూ.6,500 వాటా సొమ్ము పక్కనపెట్టి రాష్ట్ర వాటా రూ.13,500 ఇచ్చినా జిల్లా రైతాంగానికి రూ.406.74 కోట్ల ఆర్థిక సహాయం అందాలి. 2023–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అందించిన రైతుభరోసా రైతుల సంఖ్య మేరకు పై సహాయం అందాలి. తాజా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే రైతుల సంఖ్య పెరగడంతోపాటు అన్నదాత సుఖీభవ సాయం కూడా పెరుగుతుంది. -
చెట్టుపై నుంచి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు
నిమ్మనపల్లె : చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. గంగాపురంపల్లెకు చెందిన రామకృష్ణ(52) స్థానికంగా చింతకాయలు కోసేందుకు కూలి పనులకు వెళ్లాడు. చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా, ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయమై చెవులు, ముక్కుల నుంచి రక్తంకారి అపస్మారక స్థితికి వెళ్లాడు. దీంతో గమనించిన స్థానికులు హటాహుటిన మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అత్యవసర విభాగంలో వైద్యచికిత్స అందించినా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. -
బైకును ఢీకొన్న టిప్పర్
రామాపురం : మండల పరిధిలోని కసిరెడ్డిగారిపల్లె పంచాయతీ పెట్రోల్ బంకు సమీపంలో బైకును టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో జంపు మహేశ్వర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యి. పోలీసుల వివరాల మేరకు చక్రాయపేట మండలం సురభి గ్రామం కుప్పగట్టపల్లెకు చెందిన జంపు మహేశ్వర్ కడప ఇండియన్ గ్యాస్ గోడౌన్లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని చక్రాయపేటకు ఏపీ04ఏడీ ఏపీ2207 బైకుపై గువ్వలచెరువు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మీదుగా ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో గువ్వలచెరువు పెట్రోల్ బంక్ సమీపానికి రాగానే ఎదురుగా కడప వైపు వెళ్తున్న ఏపీ04యూ1215ల టిప్పర్ ఢీ కొంది. ఈ సంఘటనలో బైకుపై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్ అమర్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగులను మోసగిస్తున్న కూటమి సర్కార్ రాయచోటి అర్బన్ : ఉద్యోగులను మరోమారు మోసం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందని వైస్సార్సీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి విజయభాస్కర్ విమర్శించారు. ఆదివారం పట్టణంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రూ. 6200 కోట్ల ఉద్యోగుల బకాయిలను చెల్లిస్తామంటూ మభ్యపెడుతోందన్నారు. ప్రభుత్వం చెల్లిస్తామంటున్న రూ.6200 కోట్లలో 85 శాతం నిధులు సీపీఎస్ ఉద్యోగుల ఖాతాల్లో జమ కావాల్సి ఉందన్నారు. అలా చేయని పక్షంలో ప్రభుత్వానికి రిజర్వు బ్యాంకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి అప్పుగా ఇచ్చే ప్రసక్తే ఉండదన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెడుతూ తామేమో ఉద్యోగుల బకాయిలను తీర్చేస్తున్నట్లు ఫోజులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు జానం రవీంద్ర యాదవ్, సుగవాసి శ్యామ్‌కుమార్, సంజీవ, సాంబశివ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.వ్యక్తికి తీవ్ర గాయాలు -
ప్రేమ వివాహం చేసుకున్నారని యువకుడి ఇంటిపై దాడి
లక్కిరెడ్డిపల్లి : తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారనే కారణంగా సోమల వెంకటేశ్వర్లు అనే యువకుడి ఇంటిపై టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యులు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఇంట్లో ఉన్న యువకుడి తల్లిదండ్రులు వెంకటలక్షుమ్మ, వెంకటరమణ, అక్కా, బావలను చితకబాదారు. ఈ ఘటన లక్కిరెడ్డిపల్లి మండలం మద్దిరేవుల గ్రామం సోమలవాండ్లపల్లెలో శనివారం అర్థరాత్రి జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని మద్దిరేవుల గ్రామం, సోమలవాండ్లపల్లికి చెందిన సోమల వెంకటేశ్వర్లు అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సుంకర వెంకటరమణ కుమార్తె శివలీలను ఈనెల 15వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు మేజర్లు కావడంతో పెళ్లి అనంతరం అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడును ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. తమకు ప్రాణహాని ఉందని వెంకటేశ్వర్లు, శివలీల ఇరువురు కలిసి స్వగ్రామానికి రాకుండా రాయవరం వద్ద తెలిసిన మిత్రుల ఇంటిలో తలదాచుకున్నారు. అక్కడ ఉన్నట్లు సమాచారాన్ని సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ఇటీవల వారిపై దాడి చేశారు. స్థానికులు సుండుపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు యువతి, యువకుడిని సుండుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వారిరువురు స్వగ్రామానికి రాకుండా వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. దీంతో వారి సమాచారం తెలపాలని శనివారం అర్థరాత్రి మూకుమ్మడిగా వెంకటేశ్వర్లు ఇంటిపై కర్రలు, ఇనుపరాడ్లతో అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేసి తలుపులు, కిటికీలను ధ్వంసం చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న యువకుడి తల్లిదండ్రులను, వారి కుటుంబ సభ్యులను రోడ్డుపైకి ఈడ్చి చితకబాదారు. ఈ మేరకు బాధితులు లక్కిరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. దాడిలో గాయపడిన యువకుడి తల్లిదండ్రులు, అక్కా, బావ పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితుల ఆవేదన -
చవ్వా విజయశేఖర్‌రెడ్డి నేత్రదానం
పులివెందుల టౌన్ : పులివెందుల పట్టణంలోని చవ్వా సుభాకర్ రెడ్డి కాలనీకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త చవ్వా విజయ శేఖర్ రెడ్డి ఆదివారం మరణించడంతో ఆయన నేత్రాలను దానం చేశారు. భార్య సునీత, కుమారుడు దుష్యంత్ రెడ్డి, కుమార్తె మధులిక, చెల్లెలు ప్రమీలమ్మ, బావ వైఎస్ మనోహర్ రెడ్డి, వదిన సులోచనమ్మలు నేత్రదానానికి అంగీకరిస్తూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ, స్నేహిత అమృత హస్తం సేవాసమితి, నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షుడు రాజుకు సమాచారమిచ్చారు. నేత్ర సేకరణ కేంద్రం టెక్నీషియన్ హరీష్‌తో కలిసి మృతుని స్వగృహానికి వెళ్లి భౌతికకాయం నుంచి కార్నియాలను సేకరించి హైదరాబాద్‌లోని డాక్టర్ అగర్వాల్ నేత్రనిధికి పంపించారు. ఈ సందర్బంగా స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ మనిషి మరణానంతరం మట్టిలో కలసి పోయే నేత్రాలు దానం చేయడం ద్వారా అంధత్వంతో బాధ పడుతూ ఈ లోకాన్ని చూడలేని అంధులకు చూపు ఇచ్చినవారమవుతామన్నారు. కుటుంబంలోని వ్యక్తి లేదా సన్నిహితులు, బంధువులెవరైనా మరణిస్తే నేత్రదానం కోసం 9866727534, 7093204537 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
దళిత, గిరిజనుల పక్షపాతి వైఎస్సార్
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రంలోని దళిత, గిరిజనులకు భూములు పంపిణీ చేసిన దళిత, గిరిజన పక్షపాతి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని బీకేఎంయూ అధ్యక్షుడు పండుగోలు మణి పేర్కొన్నారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన వెంటనే దళిత గిరిజనులకు కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు మేరకు రెండు ఎకరాలు భూమి పంపిణీ చేశారని తెలిపారు. తరువాత ముఖ్యమంత్రులు ఎవరూ దళిత గిరిజనులకు భూమి పంపిణీ చేయలేదని విమర్శించారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పేదలకు ఒక్క సెంటు భూమి పంచిన పాపాన పోలేదన్నారు. ఎన్నికల ముందు పేదలు, కార్మికులకు హామీలు ఇచ్చి వారి ఓట్లతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కృష్ణప్ప, జ్యోతి చిన్నయ్య, చైతన్య, రాజశేఖర్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
సురభి కాలనీలో చోరీ
మదనపల్లె : పట్టణంలోని సురభి కాలనీలో శనివారం రాత్రి చోరీ జరిగింది. చోరీలో 53 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి, 97 వేల రూపాయల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. స్థానికంగా నివాసం ఉన్న రామకృష్ణ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి కలికిరి మండలం పాలమంద జాతరకు అత్త ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకోగా, అప్పటికే ఇంటి తలుపులు గడియ పగులగొట్టి ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఎరీషావలీ, ఎస్ఐ వెంకటశివకుమార్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్‌టీమ్‌తో ఆధారాలు సేకరించారు. ఇటీవల బ్యాంకు నుంచి విడిపించిన 53 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి, బీరువాలో ఉన్న రూ.97 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎరీషావలీ తెలిపారు.53 గ్రాముల బంగారం, రూ.97 వేల నగదు చోరీ -
టీడీపీ నాయకుడి దాష్టీకం
మదనపల్లె : తన ఇంట్లో పనికి రాలేదని, పనిమనిషి అన్నపై టీడీపీ నాయకుడు కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసి దాష్టీకానికి పాల్పడ్డాడు. మనస్థాపం చెందిన వ్యవసాయ కూలీ టీడీపీ నాయకుడి ఇంటివద్దే పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆదివారం రాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ఘటనపై బాధితుడు తెలిపిన మేరకు వివరాలు.. మదనపల్లె మండలం వేంపల్లి పంచాయతీ గుట్టకిందపల్లెకు చెందిన కృష్ణమూర్తి కుమారుడు శంకర (50) వ్యవసాయ కూలీ పనులపై ఆధారపడి జీవిస్తున్నాడు. అతని చెల్లెలు లక్ష్మీదేవి మదనపల్లె పట్టణంలోని కమ్మ వీధిలో నివాసం ఉంటున్న కొత్తపల్లె మాజీ సర్పంచ్ టీడీపీ నాయకుడు బోయపాటి గోపాల్ రెడ్డి ఇంట్లో పని చేస్తుంది. ఆదివారం లక్ష్మీదేవి బంధువులకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె గోపాల్ రెడ్డి ఇంటికి పనికి వెళ్లలేదు. ఈ విషయమై గోపాల్ రెడ్డి శంకరకు ఫోన్ చేసి, మీ చెల్లెలు ఎందుకు పనికి రాలేదని ప్రశ్నించాడు. తమ కుటుంబ సభ్యులకు అనారోగ్యంగా ఉంటే కూడా మీకు పనికి రావాలా అంటూ శంకర అసహనం వ్యక్తం చేశాడు. దీంతో గోపాల్ రెడ్డి నీతో మాట్లాడే పని ఉంది ఇంటికి రమ్మని పిలిచాడు. సాయంత్రం శంకర గోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లగా, నన్ను ఫోన్లో నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా అంటూ గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి, అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా వైర్లతో కొట్టి దాడి చేశాడు. దీంతో మనస్థాపం చెందిన శంకర పురుగుమందు తీసుకొని వచ్చి గోపాల్ రెడ్డి ఇంటికి సమీపంలోనే తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెంటనే తరలించారు. అత్యవసర విభాగ వైద్యులు చికిత్స అందించారు.● చెల్లెలు పనికి రాలేదని అన్నపై దాడి ● మనస్థాపంతో టీడీపీ నాయకుడి ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నం -
టీడీపీ నేత కుమార్తెతో ప్రేమ.. పెళ్లి చేసుకున్నాడనే కారణంతో..
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ నేత కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడనే కారణంగా వరుడి ఇంటిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేత సుంకర వెంకటరమణ కుమార్తె శివలీల, అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వీరి ప్రేమను పెద్దలు కాదనడంతో వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వరుడు వెంకటేశ్వర్లుపై వెంకటరమణ, ఆయన మద్దతు దారులు కక్ష పెంచుకున్నారు. దీంతో, వెంకటేశ్వర్లు ఇంటిపై కర్రలు, రాడ్లతో టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. టీడీపీ నేతల దాడిలో ఇంట్లోని ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసమైంది. -
మద్దతు ధరపై కందుల కొనుగోలు
రాయచోటి జగదాంబసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం నాఫెడ్ వారి ఆధ్వర్యంలో ఏపీ మార్క్‌ఫెడ్ జిల్లాలో కంది పండించిన, ఈ క్రాప్ చేయించుకున్న రైతుల నుంచి మద్ధతు ధరపై ఒక క్వింటాల్ రూ.7,550 చొప్పున కందులు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చిందని ఏపీ మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ త్యాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం నుంచి మదనపల్లె, ములకలచెరువు మార్కెట్‌యార్డుల్లో కందుల కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రైతు సేవా కేంద్రంలో పేర్లు నమోదు నమోదు చేయించుకోవాలన్నారు. కేవలం ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేస్తామని, తేమశాతం 12 శాతం లోపల ఉండేలా చూసుకోవాలన్నారు. మరిన్ని వివరములకు 9052567983 నంబర్లలో సంప్రదించాలని ఆయన తెలిపారు. లేగ దూడల ప్రదర్శన సంబేపల్లె: మండల పరిధిలోని శెట్టిపల్లె పంచాయతీ వల్లబండపల్లె సమీపంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో శనివారం లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి గుణశేఖర్పిల్లై మాట్లాడుతూ గడ్డిపెంచడం, గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు సకాలంలో పాడిపశువులకు వేయించుకోవాలన్నారు.వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని, పశు వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో పశువైద్యులు శ్రీధర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసి నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం రాయచోటి టౌన్: జిల్లాలోని గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి. సురేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని రాయచోటి, పీలేరు ( కెవీపల్లెలో) ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో 2025–2026కు సంబంధించి ఖాళీలు ఇలా ఉన్నాయి. 5వ తరగతికి సంబంధించి రిజర్వేషన్ ప్రకారం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వీటిలో ఎస్టీలకు సంబంధించి (అన్ని తెగలకు చెందిన ఎస్టీలు)64, ఎస్సీ –10, బీసీ–04, ఇతరులు 2 మొత్తం 80 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. పూర్వపు కడప విద్యార్థినిలు చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు చివరి తేది ఈ నెల 25వ తేదీ. మరిన్ని వివరాల కోసం 94411 46908 / 73822 64994/ 94414 94161 నంబర్లలో సంప్రదించాలని చేయవల్సిందిగా డి. సురేష్ తెలిపారు. క్షయవ్యాధిపై అవగాహన అవసరం గుర్రంకొండ: క్షయవ్యాధి(టీబీ)పై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఆరోగ్య విద్యాధికారి మహమ్మద్‌రఫీ అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ తెలుగు జూనియర్ కళాశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు టీబీ , క్యాన్సర్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. టీబీకి వ్యతిరేకంగా మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ సదస్సులు ఎంతగానో ఉపయోగపడ తాయన్నారు. రెండువారాలకు పైబడి దగ్గు ఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరిక్షలు చేయించు కోవాలన్నారు. గళ్ల పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ అయితే ఆరునెలల పాటు మందులు డాట్స్ ద్వారా అందిస్తామన్నారు. టీబీ రోగులకు పోషకాహారం కోసం ప్రతినెలా రూ.1000 అందిస్తామన్నారు. క్షయవ్యాధిలేని సమాజం కోసం అందరం కృషి చేయాలన్నారు. ఇంటింటి క్యాన్సర్ పరిక్షలు నిర్వహించేకార్యక్రమం త్వరల్లో జరుగుతుందన్నారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో వైద్యాధికారి రవీంద్రనాయక్, హెల్త్‌సూపర్‌వైజర్ నాగరాజు, ఆంగన్వాడీకార్యకర్తలు పాల్గొన్నారు. తరగతి రాయచోటి కెవిపల్లె (పీలేరు) 5 80 80 6 39 64 7 06 55 8 00 46 9 01 46 -
ఎత్తెకాఫ్..ఏకాంత ఆరాధన
రాజంపేట టౌన్: రంజాన్ మాసంలో వచ్చే బడీరాత్కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఎత్తెకాఫ్కు కూడా అంతే ఉంటుంది. రంజాన్ మాసంలో చివరి పదిరోజులు అనేక మంది ముస్లింలు ఎత్తెకాఫ్ను ఆచరిస్తారు. శుక్రవారం సాయంత్రం నుంచి జిల్లాలోని అనేక మసీదుల్లో ముస్లింలు ఎత్తెకాఫ్ను పాటిస్తున్నారు. అల్లాహ్ ఇంటి (మసీదు) ఆతిధ్యం ఎత్తెకాఫ్ కల్పిస్తుందని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. రంజాన్ మాసంలో ఒక ఊరిలో ఎత్తెకాఫ్ ఉండకపోతే ఆ ఊరిపై నా కరుణ, ప్రేమాభిమానాలు ఉండవు అని పవిత్ర ఖురాన్లో అల్లాహ్ స్పష్టం చేశారు. ఇల్లు, కుటుంబం, వృత్తిని పక్కనపెట్టి వీలైనన్ని రోజులు లేక కనీసం 24 గంటలు అయినా మసీదులో గడపడమే ఎత్తెకాఫ్. అన్నింటిని త్యాగం చేసి ఆధ్యాత్మికతతో ఉండే వారిపై అల్లాహ్ అత్యంత కరుణ చూపి మొరను ఆలకిస్తారని మౌల్వీలు చెబుతున్నారు. అయితే పెద్దతరహాలో ఉండే అనేక మంది పదిరోజుల పాటు ఎత్తెకాఫ్ను పాటించనున్నారు. ఎత్తెకాఫ్కు ఎంతో ప్రాధాన్యత రంజాన్‌మాసంలో ఎత్త్తెకాఫ్కు ఎంతో ప్రాధాన్యతవుంది. అల్లాహ్ సన్నిధిలో నమాజ్, జికర్, దువాచేస్తే ఆలకిస్తారు. ఒకరోజు ఎత్తెకాఫ్ పాటించినా నరకాగ్ని నుంచి అల్లాహ్ కా పాడుతారు. –మౌలానా అతాఉల్లాహ్, ఇమామ్, నూరాని మస్జీద్, ఈడిగపాళెం, రాజంపేట మోక్షమార్గానికి అనువైన రోజులు రంజాన్ మాసంలో చివరి పది రోజులు మోక్షమార్గానికి అనువైన రోజులు. ఎత్తెకాఫ్లో ఉన్న వారు కఠోర దీక్ష చేపట్టి ఖురాన్‌ను పఠించాలి. మసీదు గడప దాటకుండా అనుక్షణం అల్లాహ్ స్మరణలోనే ఉంటే తప్పక పుణ్యం, మోక్షం లభించడంతో పాటు ఏ పరిస్థితిలో ఉన్నా సాటి మానవుడి పట్ల ప్రేమాభిమానాలు చూపే గొప్ప మనస్తత్వం కలుగుతుంది. అందువల్లే ఎత్తెకాఫ్ను పాటిస్తున్నాను. –మహమ్మద్ సమీర్, ఉస్మానగర్, రాజంపేట ఎత్తెకాఫ్ ఇలా... ఎత్తెకాఫ్ ఉండాలంటే శుద్ధి స్నానం చేసి మసీదుకు వెళ్లి వజూ (ముఖం, చేతులు, కాళ్లను శుద్ధి చేసుకోవడం) చేయాలి. ఎత్తెకాఫ్ నియ్యత్ను చదవాలి. ఇతరుల నుంచి భంగం లేకుండా మసీదులో డేరా ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండాలి. తహతుల్ వజూ, తహతుల్ మజ్జీద్ల రెండేసి రకాత్‌ల నఫిల్ నమాజు చదవడం మంచిది. ఖురాన్ పఠనం, దువా, జికర్ ఇతర నమాజ్‌లు చేసుకోవాలి. మల, మూత్ర విసర్జన, వజూ, గుసూల్ స్నానం కోసం మాత్రమే డేరాల నుంచి బయటకు రావాలి. మసీదు గడపదాటరాదు. సహర్, ఇఫ్తార్ ఇస్తే స్వీకరించాలి. లేదా ఇంటి నుంచి భోజనం, ఆహార పదార్దాలు తెప్పించుకోవాలి. కలిమా ఏ తయ్యిబా లాయిలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదూర్ రసూలల్లా (సొల్లెల్లాహు అలైహి వసల్లం), అస్తగ్ ఫిరల్లాహ్ బాగా పఠించాలి. సహరి కంటే ముందు 12 రకాతుల తహజూద్ (కనీసం రెండు రకాతులు) నమాజ్, సజ్దాలో దువా చేస్తే అల్లాహ్ సమీపం నుంచి మొర వింటారని ఖురాన్ బోధిస్తుంది. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల కష్ట సుఖాలతో పాటు సర్వమానవాళి సంక్షేమాన్ని కోరుతూ ప్రార్థనలు చేయడం ఉత్తమం. ఇఫ్తార్ సమయం నుంచి మరుసటి రోజు ఇఫ్తార్ వరకు ఒకరోజు అవుతుంది.మసీదులో అడుగు పెట్టగానే ‘బిస్మిల్లాహి దాఖల్తువ అలైహి తవక్కల్తు వనవైతు సున్నతుల్ ఎత్తెకాఫ్ నియ్యత్ చదవాలి. ఎత్తెకాఫ్లో ఉన్నప్పుడు మనసును అల్లాహ్‌పైనే ఉంచాలి. ఏ ఇతర విషయాలను పట్టించుకోకూడదు. 30వ తేదీ వరకు మసీదుల్లోనే గడపనున్న ముస్లింలు -
చట్టాలపై పాఠశాల స్థాయి నుంచి అవగాహన
సుండుపల్లె మండల పరిధిలోని మల్లక్కగారిపల్లె సమీపంలో నీరు లేక వెలవెలబోతున్న వ్యవసాయ మోటారు బావులు సాక్షి రాయచోటి: వేసవి ప్రారంభమైందో...లేదో భానుడి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఒకవై ఎండ సెగలు, మరోవైపు గాలుల ధాటికి నీరు ఆవిరవుతోంది. 2024లో కరువు ప్రభావంతో వర్షపాతం అంతంత మాత్రంగా నమోదు కావడం....దానికితోడు చెరువులు,కుంటల్లో జలాలు కూడా లేకపోవడంతో ప్రస్తుతం పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. రోజురోజుకు నీటిమట్టాలు పాతాళంలోకి చేరుతుండడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ప్రధానంగా ఇటు తాగునీటితోపాటు సాగునీటికి కూడా సంకటం మొదలైంది. ఇంకిపోతున్న జలం జిల్లాలో భూగర్బ జలమట్టం రోజురోజుకు ఇంకిపోతోంది. ఉదాహరణకు జనవరిలో బోరులో రెండు ఇంచుల నీరొస్తుండగా, ప్రస్తుతం ఒక ఇంచుకు పడిపోయిన పరిస్థితి కళ్లేదుటే కనిపిస్తోంది. రోజురోజుకు ఎండ ప్రభావం పెరిగే కొద్ది మరింత విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. . ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా బావులతోపాటు బోర్లలోనూ నీటిమట్టం తగ్గిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పంటలపై ప్రభావం ఎండలు పెరిగే కొద్ది పంటలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. బోర్లలో నీటిమట్టం తగ్గుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో ప్రధానంగా సాగులో ఉన్న మామిడి తోటలకు సంబంధించి రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా దోస, టమోటా, ఇతర పండ్ల తోటలతోపాటు కూరగాయల పంటలకు సంబంధించి కూడా బోర్లలో నీరు రోజురోజుకు ఇంకుతున్న నేపధ్యంలో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఎండిపోతున్న నీటి వనరులు జిల్లాలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోనూ నీటిమట్టం రోజురోజుకూ పడిపోతోంది. వెలిగల్లు, పెద్దేరు, శ్రీనివాసపురం, ఝరికోన, బాహుదా ఇలా అన్ని నీటి వనరుల్లోనూ నీటిమట్టం పడిపోతోంది. మరోవైపు జిల్లాలోని చెరువులు, కుంటలు, నదులు, బోరు బావులు, బావుల్లోనూ నీటి మట్టం తగ్గిపోయింది. దీంతో తాగునీటి సమస్య తలెత్తుతుందని అధికారులు ఆందోళన చెందుతుండగా, రైతులు కూడా నీరు తగ్గిపోతుండడంతో ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోరు బావులు: 63,570 మొత్తం పెద్ద చెరువులు: 154 జిల్లా మూడో అదనపు జడ్జి ప్రవీణ్‌కుమార్ భూగర్భంలో జలం...ఆందోళనలో జనం రోజురోజుకు తగ్గిపోతున్న నీటి మట్టం ఎండ ప్రభావంతో ఇంకిపోతున్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు -
ఏప్రిల్ 1న ఒంటిమిట్టలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీ నుంచి 14 శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 1న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఏప్రిల్ 5న బ్రహ్మోత్సవాలకు అంకుకార్పణ నిర్వహించనున్నారు.ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. ● బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు ఏప్రిల్ 6న ఉదయం 9.30 నుండి 10.15 గంటల వరకు బృషభలగ్నం నందు ధ్వజారోహణం, రాత్రి శేష వాహనం, 7న ఉదయం వేణుగానాలంకారం, రాత్రి హంస వాహనం, 8న ఉదయం వటపత్రశాయి అలంకారం, రాత్రి సింహవాహనం, 9న ఉదయం నవనీత కృష్ణాలంకారం, రాత్రి హనుమంత వాహనం, 10న ఉదయం మోహినీ అలంకారం, రాత్రి గరుడసేవ, 11న ఉదయం శివధనుర్భాణ అలంకారం, రాత్రి కల్యాణోత్సవం, గజవాహనం, 12న ఉదయం రథోత్సవం, 13న ఉదయం కాళీయమర్థనాలంకారం, రాత్రి అశ్వవాహనం, 14న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం, 15వ తేది సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు. -
వెలుగులు ఎప్పుడు?
హార్సిలీహిల్స్‌కు బి.కొత్తకోట: ఎక్కడ చూసిన విద్యుత్ వెలుగులు కనిపిస్తుంటే పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై ఐదు హైమాస్ లైట్లున్నా వెలగని పరిస్థితి నెలకొంది. ఇక్కడి స్థానికులు, పర్యాటకులు ఎంతోకాలంగా ఎల్ఈడీ లైట్లు వేయాలని విన్నవిస్తున్నా ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. ప్రతి పల్లెలో విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటవుతున్నాయి, హార్సిలీహిల్స్‌పై ఎల్ఈటీ లైట్ల కథ ఎలా రాత్రయితే చీకటి కమ్ముకుంటోంది. సముద్ర మట్టానికి 4,141 అడుగుల ఎత్తులోని ఈ పర్యాటక కేంద్రానికి వెలుగుల మోక్షం ఎప్పుడు అన్నది ఎదురుచూపే అవుతోంది. చీకటిలోనే మగ్గిపోతోంది చుట్టూ అటవీప్రాంతం కలిగిన కొండపై విష సర్పాలు, దుప్పులు, జింకలు సంచరిస్తుంటాయి. వీటి బారిన పడితే స్థానికులకు ప్రాణాపాయం తప్పదు. ముఖ్యంగా వీధిదీపాల ఏర్పాటు జరగడం లేదు. రోడ్ల వెంబడి ఉన్న విద్యుత్ స్థంభాలకు వీధి దీపాలను ఏర్పాటు చేస్తే వెలుగు ఉంటుంది. సందర్శకులు, స్థానికులకు ఇబ్బందులు ఉండవు. 20 ఏళ్ల క్రితం కొండపైనున్న అక్కడక్కడా వీఽధిదీపాలు ఏర్పాటు చేసి వదిలేశారు. అప్పుడు వేసిన లైట్లు ఇప్పుడు లేవు. స్తంభాలకు పైపులు అలాగే కనిపిస్తున్నాయి. వాటికి లైట్లను అమర్చితే ప్రయోజనం. పర్యాటక ప్రాంతమైన హార్సిలీకొండకు ప్రభుత్వస్థాయి అధికారులు, ముఖ్యనేతలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి అధికంగా పొరుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు వస్తుంటారు. ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తే వీరికి సౌకర్యం కల్పించడమేకాక స్థానికులకు ఇబ్బందులు తొలగుతాయి. సమావేశాలు ఎప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మూడునెలలకోసారి హార్సిలీహిల్స్ టౌన్షిప్ కమిటీ సమావేశాలు జరిగేవి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క సమావేశం కూడా జరగలేదు. దీంతో హార్సిలీహిల్స్‌పై ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇకనైనా టౌన్షిప్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యేందుకు వీలుంది. ●దిష్టిబొమ్మల్లా హైమాస్ అంతా అగమ్యగోచరంవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.14.75 లక్షలతో ఐదు చోట్ల వాటిని ఏర్పాటు చేయించారు. 16 మీటర్ల ఎత్తులో గాలిబండపై రెండు చోట్ల, ఏనుగుమల్లమ్మ ఆలయం వద్ద ఒకటి, జిడ్డు సర్కిల్లో ఒకటి, రెవెన్యూ అతిథి గహం వద్ద ఒకటి ఏర్పాటు చేశారు. ప్రారంభంలో అన్ని లైట్లు వెలుగుతూ ఎక్కడో ఉన్న వారికి ఈ లైట్ల వెలుగు కనిపించేది. అదిగో హార్సిలీహిల్స్‌పై లైట్లు అని చెప్పుకునేవారు. ప్రస్తుతం స్వీమ్మింగ్ పూల్, రెవెన్యూ అతిథి భవనం వద్ద మాత్రమే హైమాస్ లైట్లు వెలుగుతున్నాయి. మిగిలిన మూడు వృధాగా ఉన్నాయి. -
కొబ్బరిచెట్టుపై పిడుగు
రామసముద్రం : మండలంలోని చెంబకూరు నుంచి కొత్తూరుకు వెళ్లే రోడ్డు మార్గంలో శనివారం సాయంత్రం కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. దీంతో చెట్టుపై మంటలు రాజుకున్నాయి. గతనెల రోజులుగా ఉక్కపోతకు గురైన ప్రజలకు వాతావరణంలో మార్పులు వచ్చి ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లుల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో చెంబకూరుకు చెందిన రైతు గాండ్ల శంకరప్ప పొలంలోని కొబ్బరిచెట్టుపై పిడుగు పడటంతో మంటలు ఏర్పడ్డాయి. దీన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. జింకపై కుక్కల దాడి – కాపాడిన యువకులు నందలూరు : మండలంలోని బహుదానది సమీపంలోని నేషనల్ హైవే బైపాస్ రోడ్డు పక్కన ఉన్న వరి పంట పొలాల్లో ఓ జింకను శనివారం కొన్ని కుక్కలు వెంటపడి దాడి చేస్తుండగా కొంతమంది యువకులు కాపాడారు. జింకను కాపాడి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జింకను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కుక్కల దాడి నుంచి రక్షించి సమాచారం తెలిపిన యువకులు గొల్లపల్లికి చెందిన బడే, తిమ్మయ్య, పవన్ కుమార్, కొండయ్య, నందకుమార్, షమీవుల్లాను స్థానికులు అభినందించారు. -
బార్ అసోసియేషన్ ఎన్నికలకు 17 నామినేషన్లు
రాయచోటి అర్బన్ : రాయచోటి బార్ అసోసియేషన్‌కు ఈనెల 29న జరుగనున్న ఎన్నికల బరిలో నిలిచేందుకు 17 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి రాజకుమార్ రాజు, సహాయ ఎన్నికల అధికారి ఇలియాస్బేగ్ శనివారం తెలిపారు. బార్ అసోసియేషన్ కార్యవర్గంలోని 7 పోస్టులకుగాను 17 నామినేషన్లు దాఖలైనట్లు చెప్పారు. నామినేషన్ల దాఖలు గడువు ముగిసే సమయానికి అధ్యక్ష పదవికి ఎన్.ప్రభాకరరెడ్డి, వై.రమేష్‌రెడ్డి, ఉపాధ్యక్ష పదవికి టి.ఈశ్వర్, ధనుంజయ కుమార్, ఎంఎల్ రామచంద్రారెడ్డి, వై.రామమోహన్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారన్నారు. జనరల్ సెక్రటరీగా పి.రెడ్డిబాష, పి.శ్రీనివాసులు, సహాయ కార్యదర్శికి నాగముని, ఎం.వి,.రమణ, రామ్‌కుమార్‌లు, కోశాధి కారిగా ఆదిరెడ్డి నాయక్, నాగరాజులు, లైబ్రరీ సెక్రటరీకి వి.సిద్దయ్య, కె.బాలచంద్రలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ టివి రమణ, డి.రామకుమార్ నామినేషన్లు వేసినట్లు తెలిపారు. ఈనెల 24న నామినేషన్ల పరిశీలన, 25న ఉపసంహరణ, 29న ఎన్నికల నిర్వహణ, అదేరోజున ఎన్నికల ఫలితంపై ప్రకటన ఉంటుందని తెలిపారు. -
ఆడుతూ...పాడుతూ చదివేద్దాం
మదనపల్లె సిటీ : పిల్లలు ఎంతగానో ఎదురు చూసే ఒంటిపూట బడులు రానే వచ్చాయి. మధ్యాహ్నం 12.30 గంటల వరకే పాఠశాలలు ఉంటాయి. తరువాత ఇంటికి రాగానే బడి బ్యాగులను పెట్టడమే స్నేహితులతో ఎంచక్కా చెట్లు, పుట్టలు, గుట్ల వెంట తిరుగుతూ ఆటలాడటం, బావులు,చెరువుల వద్దకు వెళ్లడం, ఈత వచ్చినా రాకున్నా వాటిల్లోకి దిగి లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులకు అప్రమత్తత అవసరం. పిల్లలను మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా చూడటం మేలు. అలా అని వారు టీవీలు, సెల్ఫోన్లకు అంటిపెట్టుకుని ఉండటమూ తగదు. ఈ దశలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో.. దినపత్రికలను చదివేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరచాలి. ఆదివారం అనుబంధం లాంటి మ్యాగజైన్లలో ఫజిల్స్‌ను సాధన చేయాలి. తద్వారా మెదడు పనితీరు చురుకవుతుంది. బొమ్మలకు రంగులు వేసే పుస్తకాలు, సృజనాత్మకతను పెంపొందిస్తాయి. పిల్లలు బయటకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటూ స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ క్యారమ్స్, చెస్ వంటి ఆటలు ఆడాలి. ఆటల పరికరాలు అనేకం షాపుల్లో దొరుకుతాయి. ఇంట్లోనే పిల్లలు వాటితో భవనాలు, వంతెనలు, యంత్రాలను నిర్మించడం ఆసక్తికరంగా ఉంటుంది. అవి వారికి ఎంతో కాలక్షేపాన్ని కలిగిస్తాయి. తల్లిదండ్రులు తమ బాల్యంలో ఆడుకున్న పరమపద సోపానపటం, వామనగుంతలు,పులి మేక దాడి, అష్టా చెమ్మా వంటి ఆటలు ఉంటాయి. పిల్లలకు వాటిని పరిచయం చేసి వారితో పాటు కలిసి ఆడుకుంటే బాగుంటుంది. ఆహారంపై శ్రద్ధ ఎండ తీవ్రత కారణంగా చిన్నారులు త్వరగా నీరసించిపోతుంటారు. పాఠశాలకు వెళ్లే సమయంలో తేలికపాటి ఆహారం, త్వరగా జీర్ణమయ్యే అల్పాహారంతో పాటు పండ్లరసం అందజేయాలి. భోజనంలో కూరగాయలు, ఆకు కూరలు ఉండే విధంగా చూడటంతో పాటు అధిక నీటి శాతం ఉన్న కూరలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేపుళ్లకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. అప్రమత్తతే కీలకం: చెరువులు, బావుల్లో ఈత కొట్టేందుకు వెళ్తుంటారు. లోతు తెలియకుండా దిగడం వల్ల ప్రమాదాలు జరిగే అస్కారం ఉంటుంది. జిల్లాలో గతంలో అనేక చోట్ల ఈతకు వెళ్లి పలువురు చిన్నారులు నీటమునిగి మృత్యువాత పడిన సంఘటనలున్నాయి. ఎండల్లో ఎక్కువ తిరగడం వల్ల వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం గొడుగులు వాడటం, టోపీలు ధరించడం, ముఖానికి చేతిరుమాలు కట్టుకునేలా జాగ్రత్తలు సూచించాలి. సాయంత్రం పూట: 5 గంటల తరువాత ఎండ తగ్గుముఖం పడుతుంది. అప్పుడు పిల్లలు బయట ఆటలు ఆడుకునేలా చూడాలి. శారీరక వ్యాయామంలా ఉంటుంది. రాత్రి 7 గంటల తరువాత చదువుకోవటంపై విద్యార్థులు దృష్టి సారించాలి. హోంవర్క్ చేసుకోవాలి. ఒంటపూట బడులు కావటం వల్ల పిల్లలు వేకువజామునే నిద్రలేవాల్సి ఉంటుంది. అందువల్ల రాత్రిపూట తొందరగా నిద్రపోవడం మేలు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు : 2,200 విద్యార్థులు : 1,54.789 ప్రైవేటు పాఠశాలలు : 543 విద్యార్థులు : 1,12,589 ఒంటిపూట బడి .. ఓ కంట కనిపెట్టాలి తల్లిదండ్రులకు అప్రమత్తత అవసరం పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టాలి ఒంటిపూట బడుల సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టాలి. వారి అలవాట్లు, ఆహారం, ఆరోగ్యం, చదువు వంటి విషయాల్లో ప్రణాళిక కలిగి ఉండాలి. దినపత్రికలు, పుస్తక పఠనాన్ని అలవర్చితే ధీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుంది. – పి.ప్రసాద్‌రెడ్డి, పీడీ, ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ, మదనపల్లె అనారోగ్యానికి గురైతే నిర్లక్ష్యం వద్దు ఎండలో ఆటలు ఆడటం వలన చిన్నారులు వెంటనే డీహైడ్రేషన్‌కు గురవుతారు. చర్మంపై ముడతలు ఏర్పడటం, గొంతు ఎండిపోవడం వంటి లక్ష్యణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పండ్లు, పండ్లరసాలు, కూరగాయలు, నీటి శాతం అధికంగా ఉన్నవాటిని తీసుకోవాలి. – డాక్టర్ ఆశాలత, పీహె చ్‌సీ, కోసువారిపల్లె -
తప్పతాగి మంటల్లో పడి వ్యక్తి మృతి
రామాపురం : మండలంలోని నల్లగుట్టపల్లె పంచాయతీ బీసీ కాలనీకి చెందిన గంప చిన్న సుబ్బయ్య (55) తప్పతాగి మంటల్లో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటసుధాకర్‌రెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని నల్లగుట్టపల్లె పంచాయితీ బీసీ కాలనీకి చెందిన గంప చిన్నసుబ్బయ్య శుక్రవారం సాయంత్రం పొలం వద్ద గట్టుకు నిప్పుంటించడానికి వెళ్లి నిప్పులో పడి మృతి చెందాడు. రాత్రి వరకు భర్త ఇంటికి రాకపోవడంతో భార్య సుబ్బయ్య ఇంటి పక్కన వాళ్లను ఆరా తీసింది. మరుసటి రోజు ఉదయం శనివారం ఆ గ్రామ పరిధిలోనే గొర్ల కాపరులు మేతకు వెళ్లి చూసి గ్రామస్తులకు సమాచాం ఇచ్చారు. వెంటనే పొలం గట్టు వద్దకు వెళ్లి చూడగా తన భర్త నిప్పులో పడి మృతి చెందాడని, విషయాన్ని మండల పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోగొట్టుకున్న పర్సు అప్పగింత రాయచోటి టౌన్ : పట్టణానికి చెందిన మహిళ శనివారం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తన పర్సు పోగొట్టుకొంది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో సీఐ బివి చలపతి సీసీ కెమెరాలను ఆధారంగా చేసుకొని తన సిబ్బంది హెచ్‌సీ సురేంద్ర ద్వారా పరిశీలించారు. దొంగను పట్టుకొని పోగొట్టుకున్న పర్సును స్వాధీనం చేసుకొన్నారు. వెంటనే బాధ్యురాలిని పిలిచి పోగొట్టుకున్న బ్యాగ్ (పర్స్) అప్పగించారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ షాపింగ్ కోసమైనా, ఇతరా అవసరాల కోసం వచ్చిన సందర్భంలో మీతో తెచ్చుకున్న విలువైన వస్తువులు, బ్యాగ్‌లు, పర్సులను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్త, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెళ్లికి పిలవడానికి వచ్చి చోరీ ఎర్రగుంట్ల : పట్టణంలోని 12వ వార్డులో నివాసం ఉండే మహుబూబీని పెళ్లికి పిలవడానికి వచ్చి ఆమె చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని చోరీ చేసిన కేసులో నిందితుడు కొత్తపల్లి ఖాసీంపీరాను అరెస్టు చేసినట్లు సీఐ నరేష్‌బాబు తెలిపారు. శనివారం కేసు వివరాలను సీఐ వెల్లడించారు. ఖాజీపేట గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన ఖాసీంపీరా చెడు వ్యసానాలకు లోనై అప్పులు చేశాడు. ఇతను చాలా ఏళ్లుగా మట్కా బెట్టింగ్, అప్పులు అధికంగా చేశాడు. ఎలాగైన తెచ్చిన అప్పులు కట్టడం కోసం అడ్డ దారిలో డబ్బు కోసం ముసలి వారిని టార్గెట్ చేసుకున్నాడు. వారితో పరిచయం చేసుకుంటూ మాయ మాటలు చెప్పి వారి వద్ద నుంచి బంగారు వస్తువులు, డబ్బులు లాక్కుని పారిపోతుంటాడని చెప్పారు. ఇలా ఖాసీంపీరాపై పలు కేసులు ఉన్నాయన్నారు. ఈ తరుణంలో ఈ నెల 9వ తేదీన కడప పాత బస్టాండ్ దగ్గర నుంచి ఆటో తీసుకుని వల్లూరు, కమాలపురం, ఎర్రగుంట్లకు వచ్చాడు. యర్రగుంట్ల పట్టణంలోని పోలీస్‌స్టేషన్ వెనుక ఉన్న మహుబూబీ అనే వృద్ధురాలి వద్దకు వెళ్లి నిద్రలేపాడు. నేను మీ కోడలి బంధువు అని నమ్మించాడు. మా పాపాకు పెళ్లి చేస్తున్నాం.. అందరూ పెళ్లికి రావాలన్నాడు. పెళ్లికి కూతురికి మీ చేతికి ఉన్న ఉంగరంను అదే సైజులో చేయించాలి. మీ ఉంగరం ఇస్తే బయట ఆటోలు కూర్చోని ఉన్న వారికి చూపించి వస్తాను అని చెప్పాడు. దీంతో మహుబూబీ నమ్మి చేతికి ఉన్న బంగారు ఉంగరం తీసి ఇచ్చింది. ఆ ఉంగరం తీసుకొని ఖాసీంపీరా అక్కడ నుంచి ఊడాయించాడు. దీంతో బాధితురాలు మహూబూబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఖాసీంపీరాను ఎర్రగుంట్లలో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వేంపల్లె సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు చేపట్టాలి – ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వేంపల్లె ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ ఈశ్వరయ్యపై సత్వరమే చర్యలు చేపట్టాలని వేంపల్లె టీడీపీ నాయకుడు శేషయ్యతో పాటు కార్యాలయ పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు నాగసుబ్బారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, శేషారెడ్డి, వెంకటేశ్, రాజశేఖర్‌రెడ్డి, నాగేష్‌రెడ్డి, గంగయ్య, వాసుదేవారెడ్డి తదితరులు కోరారు. ఈ మేరకు వారు శనివారం కడపలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ డీఐజీ వీఎస్ఆర్ ప్రసాద్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభ్యర్థన మేరకు వేంపల్లె ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకునేందుకు డీఐజీ హామీ ఇవ్వడంపై ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. సబ్ రిజిస్ట్రార్ అవినీతికి అంతే లేకుండా పోతోందన్నారు. ఇతనిపై గతంలో కూడా ఫిర్యాదు చేయగా, విచారణలు సైతం జరిగాయన్నారు. వేంపల్లె సబ్ రిజిస్ట్రార్‌పై డీఐజీ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జిల్లా రిజిస్ట్రార్ పీవీఎన్ బాబును సంప్రదించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేంపల్లె ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేసినట్లు తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కొండాపురం : మండల పరిధిలోని వెంకటాపురం గ్రామ సమీపంలోని కడప–తాడిపత్రి జాతీయ రహదారిపై శనివారం ట్రాక్టర్ ట్రాలీని టిప్పర్ ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు.. ముద్దనూరు నుంచి తాడిపత్రి వరకు చేపట్టిన నాలుగు వరుసల రోడ్డు నిర్మాణ పనులు కోసం వచ్చిన మహిళా కూలీలు వెంకటాపురం వద్ద ట్రాక్టర్ ట్రాలీ నుంచి దిగుతుండగా తాడిపత్రి వైపు వెళ్లే టిప్పర్ ఢీ కొంది. మహిళలు శివమ్మ, రమాదేవి, భవాని గాయపడ్డారు. వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
మదనపల్లె : కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది వివాహిత ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన శనివారం మదనపల్లె మండలంలో జరిగింది. వలసపల్లె పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చెందిన గణేష్ బాబు, లత(41) దంపతులు. వీరికి పరిమళ జమున ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పరిమళకు రెండేళ్ల క్రితం వివాహం కాగా, జమున డిగ్రీ చదువుతోంది. గణేష్ బాబు టెంపో డ్రైవర్ గా పనిచేస్తుండగా, లత కూలీ పనులకు వెళ్తూ స్థానికంగా ఉన్న డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా కొనసాగుతోంది. డ్వాక్రా సంఘంలో రుణం తీసుకుని భర్తకు వాయిదాల పద్ధతిలో టెంపో వాహనం కొనుగోలు చేసి ఇచ్చింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫైనాన్స్ లోను, డ్వాక్రా రుణం చెల్లించడంలోనూ కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ క్రమంలో కర్ణాటక ముల్బాగల్ లో ఉంటున్న లత సోదరి, బావ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు. దీంతో వారి కుమార్తె అనాథగా మారింది. ఆ బాలికను తెచ్చి పెంచుకుందామని లత తన భర్త గణేష్ బాబును కోరింది. ముల్ బాగల్ వెళ్లి బాలికను ఇంటికి తీసుకురావాల్సిందిగా చెప్పింది. పనుల ఒత్తిడి కారణంగా గణేష్ బాబు వెళ్లకపోవడంతో, శుక్రవారం రాత్రి ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం గణేష్ బాబు జమున ఒక గదిలో నిద్రించగా లత మరో గదిలోకి వెళ్ళి కుటుంబ సభ్యులు నిద్రించాక గదిలోని రాడ్‌కు చీరతో ఉరి వేసుకుని మృతి చెందింది. ఉదయం నిద్ర లేచిన కుటుంబ సభ్యులు లత ఊరికి వేలాడుతుండగా గమనించి, స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందికి దించారు. తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కళావెంకటరమణ ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం సంఘటన స్థలానికి చేరుకుని లత మతికి గల కారణాలను కుటుంబ సభ్యులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి పెద్ద కుమార్తె పరిమళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మదనపల్లెలో ఆపరేషన్ గరుడ
● యథేచ్ఛగా నార్కోటిక్స్, మత్తు, స్టెరాయిడ్స్ విక్రయాలు ● డాక్టర్ చీటీ లేకుండా మందులు అమ్మితే కఠినచర్యలు మదనపల్లె : రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో ఎన్ఫోర్స్మెంట్ విభాగాలైన విజిలెన్స్, ఈగల్, డ్రగ్ కంట్రోల్‌తో పాటు పోలీసులు బృందాలుగా ఏర్పడి నిర్వహించిన ఆపరేషన్ గరుడ శుక్రవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని మూడు రిటైల్ మందుల షాపులు, ఒక హోల్‌సేల్ షాపులో నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో...డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చీటీ లేకుండా మందులు విక్రయిస్తున్నట్లు, మందులకు బిల్లు లేకుండా అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించామని డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి తెలిపారు. మెడికల్ షాపుల్లో నార్కోటిక్స్, మత్తు కలిగించే మందులు, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వైద్యుల సిఫారసు లేకుండానే విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో తేలిందన్నారు. రెండు షాపుల్లో ఫార్మసిస్ట్ లేకుండానే, బిల్లులు వేయకుండానే మందులు విక్రయిస్తున్నారన్నారు. అలాగే మందుల కొనుగోలు, విక్రయాల మధ్య తేడాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. డెకాయ్ ఆపరేషన్‌లో తాము గమనించిన లోపాలపై నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు పంపి వారి ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. మందుల షాపుల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్తు, నార్కోటిక్, స్టెరాయిడ్స్ తదితర ఔషధాలు వైద్యుల సిఫారసు, చీటీ లేకుండా, బిల్లులు వేయకుండా అమ్మకూడదని తెలిపారు. అమ్మకాలు జరిపిన వెంటనే వాటి వివరాలను హెచ్–1 రిజిస్టర్లో నమోదుచేయాలని, లేనిపక్షంలో అలాంటివాటిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. దాడుల్లో జిల్లా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జే.మురళీకృష్ణ(ఎఫ్ఆర్ఓ), కే.వి.కిశోర్(ఏఈఈ), వి.నాగరాజు(సీఐ), కానిస్టేబుల్స్ టిప్పుసుల్తాన్, రాజీవ్‌కుమార్, రంగనాథ్‌లు పాల్గొన్నారు. కడప – బెంగళూరు రైల్వే పనులను పూర్తి చేయాలి కడప ఎడ్యుకేషన్ : కడప బెంగుళూరు రైల్వే పనులను 20 సంవత్సరాల క్రితం మెదలు పెట్టినప్పటికీ అప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణ పనులను పూర్తి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు సిఆర్వి ప్రసాద్ అన్నారు. శనివారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక కమిటీ ఆధ్వర్యంలో పబ్బపురం వద్ద కడప బెంగళూరు రైల్వే ట్రాక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప– బెంగళూరు రైల్వే పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే లైన్ పూర్తి చేయడంలో పూర్తిగా అలసత్వం వహిస్తున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి సాకుగా చూపించి రాష్ట్ర బడ్జెట్ అంత అమరావతి కేటాయించాలని చేడటం దారుణం అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి గాని కేంద్రీకరణ చేయాలనుకోవడం సిగ్గు చేటని వారు దుయ్యబట్టారు. కడప బెంగళూరు రైల్వే లైను పూర్తయితే కడప జిల్లాలో ఎక్కువ మంది రైతులు పండించుకునే ధాన్యాలను కూరగాయలను బెంగళూరు వంటి ప్రాంతాలకు సులువుగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. అసెంబ్లీలో కానీ, పార్లమెంటులో కడప బెంగళూరు రైల్వే పనులను పూర్తిచేయాలని ఒక్క రాజకీయ నాయకుడు కూడా ప్రస్తావన చేయకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికై నా రాయలసీమ ప్రాంతం నుండి ఎన్నికై న ప్రజాప్రతినిధులు రైల్వే పనులను పూర్తిచేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ చేశారు. బద్వేలులో యువకుల బాహాబాహి బద్వేలు అర్బన్ : స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో శనివారం డబ్బు బాకీ విషయమై కొందరు యువకులు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన ఐదుగురు యువకులపై అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని చింతలచెరువు బీసీకాలనీకి చెందిన గొడుగునూరునాగరాజు వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అట్లూరు మండలానికి చెందిన కుంభగిరిశివశంకర్ వద్ద నాగరా జు రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏడాది కిందట శివశంకర్ హైదరాబాద్‌కు వెళ్ళి నా గరాజు ద్విచక్ర వాహనాన్ని తీసుకువచ్చాడు. అయితే శనివారం స్థానిక త్యాగరాగకాలనీలో బంధువుల పుట్టువెంట్రుకల కార్యక్రమం ఉండటంతో అందరూ అక్కడ కలిశారు. ఈ సమయంలో మాటమాట పెరగడంతో ఘర్షణకు దిగారు. పోలీసులు ఘర్షణ పడిన వారిని అదుపులోకి తీసుకుని నాగరాజు, శివశంకర్‌లతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. -
టీ హోటల్లో పేలిన గ్యాస్ సిలిండర్
కురబలకోట : మండలంలోని అంగళ్లు బస్టాప్ పక్కన ఉన్న టీ హోటల్లో శనివారం ఉదయం ఎల్పీజీ గ్యా స్ సిలిండర్ పేలింది. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో పరిసర ప్రాంతాల వారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అదీ అంగళ్లు బస్టాప్ దగ్గరే ఇలా జరగడంతో కల కలాన్ని సృష్టించింది. రూ. 50 లక్షల దాకా నష్టం వాటిల్లి ఉంటుందని భావిస్తున్నారు. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కాబట్టి జన సంచారం పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే నిత్యం జనాలతో రద్దీగా ఉండే బస్టాఫ్ ప్రాంతంలో పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది. సిలిండర్ పేలడంతో టీ హోటల్ భవనం కుప్పకూలింది. ఇరుగుపొరుగున వున్న భవనాలు కూడా కదిలాయి. గ్యాస్ లీక్ కావడ మే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. జిల్లాలో సంచలనం కల్గించిన ఈ దుర్గటనకు సంబంధించి బాధితుడితో పాటు పరిసర ప్రాంతాల వారి కథనం మేరకు..కదిరి ప్రాంతం తనకల్లుకు చెందిన కృష్ణయ్య (52) రెండేళ్లుగా అంగళ్లు బస్టాప్ వద్ద అద్దె రూములో ఓ ప్రాంచైజీస్ టీ హోటల్ నిర్వహిస్తున్నాడు. యథావిధిగా శనివారం ఉదయం టీ హోటల్ తెరచి స్టవ్ వద్దకు వెళ్లి లైటర్‌తో గ్యాస్ వెలిగించాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కృష్ణయ్య దుస్తులు అంటుకుని ఒంటికి మంటలు వ్యాపించాయి. భవనమంతా పెద్ద ఎత్తున పొగలు కమ్మాయి. ఆయన కాలుతున్న మంటలతో రోడ్డుపైకి రావడంతో స్థానికులు వెంటనే ఆయన ఒంటిపై మంటలను ఆర్పివేశారు. ఆయన బయటకు వచ్చిన వెంటనే పెను శబ్దం రావడంతో ఒక్కసారిగా టీ హోటల్ భవనం కుప్పకూలింది. కృష్ణయ్య ముందుగా బయటకు రావడంతో తీవ్ర గాయాలతో బయటపడ్డారు. లేదంటే బండల కింద ఊహించని ప్రమాదం సంభవించి ఉండేది. సంఘటన విషయం తెలుసుకున్న ఫైరింజన్ హుటాహుటిన అంగళ్లుకు చేరుకుంది. అప్పటికే సంఘటన జరిగిపోయింది. బాధితుడు కృష్ణయ్యను హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పెద్ద శబ్దంతో ఉలిక్కిపడ్డాం సంఘటన జరిగిన టీ హోటల్ పక్కనే మా ఎరువుల అంగడి ఉంది. శనివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఉలిక్కి పడ్డాం. మాషాపు ఉన్న భవనం కూడా అదిరింది. కిందకు వచ్చి చూస్తే టీ హోటల్ భవనం కుప్పకూలిపోయింది. పైగా బస్టాప్ ప్రాంతంలో ఇది జరగడం ఉదయం వేళ కావడంతో జన సంచారం పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదమేతప్పింది. పరిసర ప్రాంతాల వారు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. – కనసాని వేణుగోపాల్‌రెడ్డి, ఫర్టిలైజర్ షాపు యజమాని, అంగళ్లు హోటల్ నిర్వాహకుడికి తీవ్ర గాయాలు రూ. 50 లక్షల ఆస్తి నష్టం ఉలిక్కి పడిన అంగళ్లు -
భార్యను కాదని వేరే మహిళతో అక్రమ సంబంధం..
అన్నమయ్య: అదనపు కట్నం కోసం కట్టుకున్న భర్తతో పాటు అత్తా, మామ, ఆడపడచు వేధిస్తున్నారని లలితమ్మ అనే బాధితురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా.. మండలంలోని సంపతికోట పంచాయతీ ముంతపోగులవారిపల్లికి చెందిన కోనకుంట రాయుడు కుమార్తె లలితమ్మకు కర్ణాటక రాష్ట్రం చేలూరు సమీపంలోని గ్యాదోల్లపల్లికి చెందిన బంగారప్ప కుమారుడు క్రాంతి కుమార్‌తో నాలుగేళ్ళ కితం వివాహమైది. మూడేళ్ళ పాటు ఈ దంపతుల జీవనం సజావుగా సాగింది. ఈ దంపతులకు ఓ కుమార్తె సంతానం కాగా ఇటీవల మరో కుమార్తె జన్మనిచ్చింది. అయితే గత ఏడాది నుంచి తనను ఏ మాత్రం పట్టించుకోకుండా మరో మహిళతో గుట్టుగా అక్రమం సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ లలితమ్మ భర్తపై నెల రోజుల క్రితం పీటీఎం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పట్లో పోలీసులు భర్తతో పాటు వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. ఈ తరుణంలో తన భర్తలో ఎలాంటి మార్పు లేకపోవడంతో పాటు బి.కొత్తకోటలోని ఇందిరమ్మ కాలనీలో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో లలితమ్మ కుటుంబ సభ్యులకు పట్టుబడ్డాడు. తన భర్తతో పాటు ఆమె కుటుంబ సభ్యులు నిత్యం అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని, కట్టుకున్న భార్యతో పాటు పిల్లలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న అత్తామామ, ఆడ పడచుతో పాటు తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లలితమ్మ పేర్కొంది. ఈ విషయంపై ఎస్ఐ హరిహర ప్రసాద్ మాట్లాడుతూ లలితమ్మ ఫిర్యాదును స్వీకరించి విచారణ చేస్తున్నామని తెలిపారు. -
పెళ్లైన విషయాన్ని దాచి యువతితో ఆస్పత్రి మేనేజర్ ప్రేమ
మదనపల్లె: కుటుంబ పోషణ కోసం ఆస్పత్రిలో నర్సుగా చేరిన ఓ యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రైవేట్ ఆస్పత్రి మేనేజర్‌తో పాటు బెదిరించినందుకు మరో ఇద్దరు వైద్యులపై గురువారం రాత్రి కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఎరీషావలీ తెలిపారు. కురబలకోట మండలం తెట్టు పంచాయతీ సింగన్నగారిపల్లెకు చెందిన ఓ యువతి (25) నర్సింగ్ పూర్తిచేసి ఉపాధి కోసం మదనపల్లె పట్టణం బెంగళూరురోడ్డులోని ఓ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. అదే ఆస్పత్రిలో మేనేజర్‌గా పనిచేస్తున్న వివాహితుడైన రాజేష్ రెడ్డి(30) ఆమెకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. వివాహం చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఇద్దరూ శారీరకంగా ఒకటయ్యారు. ఆమె గర్భవతి కాగా, మాయమాటలు చెప్పి తిరుపతికి తీసుకువెళ్లి గత ఏడాది ఆగస్టులో అబార్షన్ చేయించాడు. తర్వాత కొంతకాలానికి రాజేష్‌రెడ్డి వివాహితుడనే విషయం తెలుసుకున్న యువతి తనకు ఎందుకు మోసం చేశావని నిలదీసింది. తనకు న్యాయం చేయాలని లేకపోతే చట్టపరంగా పోలీసులను ఆశ్రయిస్తానని ఖరాఖండిగా చెప్పింది. దీంతో పెద్దమనుషుల సహాయంతో పలుమార్లు పంచాయతీలు నిర్వహించి యువతికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె వినకపోగా, తనకు కచ్చితంగా న్యాయం జరగాల్సిందేనని లేకపోతే పోలీస్ కేసు పెడతానని చెప్పింది. దీంతో ఆస్పత్రి యజమాని, వైద్యుడైన రవికుమార్‌రెడ్డి ఆమెను నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ ఉద్యోగంలో తొలగించి బయటకు పంపేశాడు. ఇ దే విషయంలో అంగళ్లుకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు రా యుడు యువతిని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో తన కు న్యాయం జరగదని నిర్ధారించుకుని, బాధిత యువతి వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించింది. విచారించిన సీఐ ఎరీషావలీ, యువతిని మోసం చేసిన రాజేష్ రెడ్డి, ఆస్పత్రి వైద్యులు రవికుమార్‌రెడ్డి, ఆర్ఎంపీ వైద్యుడు రాయుడులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
50 మామిడిచెట్లు కాలిపోయాయి
నా పేరు మనోహర్. రాయచోటి రూరల్ మండలం ఎండపల్లి. 15 ఏళ్ల కిందట మామిడిచెట్లు నాటి పెంచుకుంటున్నాను. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు నిప్పంటించడంతో 50 మామిడి చెట్లు కాలిపోయాయి. 15 ఏళ్లుగా పెంచుకున్న చెట్లు కాలిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందిపడ్డాను. తిరిగి ఆ చెట్లను పెంచాలంటే మరో 15 ఏళ్లు ఆగాల్సిందే. ఆకతాయిలు, పశువుల కాపర్లు కానీ అగ్గి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ● అగ్గి మంటలకు బుగ్గిపాలు అవుతున్న పంటలు, అడవులు ● 430 అగ్ని ప్రమాదాలు.. రూ.3.5 కోట్ల ఆస్థి నష్టం ● అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ సాధ్యమంటున్న అగ్నిమాపక అధికారులు -
ఏనుగుల దాడి నుంచి పొలాలను కాపాడండి
రాయచోటి అర్బన్ : చిత్తూరు–తిరుపతి–అన్నమయ్య జిల్లాల్లో ఏనుగుల దాడి నుంచి పంటపొలాలను కాపాడాలని ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు వంగిమళ్ళ రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లె, చిత్తూరు జిల్లాలోని పలమనేరు, ౖవై.కోట, రామకుప్పం, బంగారుపాళెం, మండలాల్లోని పొలాలు, మామిడి తోటలపై ఏనుగులు దాడిచేసి పంటనష్టాన్ని కలిగించాయన్నారు. ఏనుగుల దాడుల్లో అన్నమయ్య జిల్లాలో ముగ్గురు, చంద్రగిరి వద్ద ఒకరు, ఇన్నగొట్టిగల్లు వద్ద ఒకరు చొప్పున మృత్యుపాలయ్యారన్నారు. దీంతో అటవీ సమీప ప్రాంత రైతులు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఏనుగుల దాడుల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు చొప్పున నష్టపరిహారం అందివ్వాలన్నారు. నష్టపోయిన పంటలను సైతం అంచనావేసి నష్టపరిహారం చెల్లించడం ద్వారా రైతాంగాన్ని ఆదుకోవాలంటూ కోరారు. -
జిల్లా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంపై ధర్నా
మదనపల్లె : ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం జిల్లా ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం సాయబులవారిపల్లెకు చెందిన హసన్సాబ్ కుమారుడు మౌలాలి(25) గురువారం సాయంత్రం ఇంటి వద్ద నుంచి వస్తుండగా, ముదివేడు క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల సహాయంతో గాయపడ్డ బాధితుడిని 108 అంబులెన్స్ వాహనంలో కుటుంబసభ్యులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సలు పొందుతూ మౌలాలి మృతి చెందాడు. వైద్యులు సకాలంలో స్పందించలేదని, మెరుగైన చికిత్స అందించకపోవడంతోనే మౌలాలి మృతి చెందాడని ఆరోపిస్తూ రాత్రి నిరసనకు దిగారు. ఇదే విషయమై శుక్రవారం ఉదయం మరోసారి నిరసనకు దిగారు. బంధువులు, కుటుంబీకులు, గ్రామస్తులతో కలిసి అత్యవసర విభాగాన్ని ముట్టడించారు. ప్రమాదం జరిగిన గంట వరకు మౌలాలి బతికే ఉన్నాడని, అంబులెన్స్‌లో తీసుకువచ్చేటప్పు డు వాహనంలో ఆక్సిజన్ సిలిండర్ లేదన్నారు. తర్వాత ఆస్పత్రికి చేరుకునేంతవరకు ప్రాణాలతో ఉన్న మౌలాలి, ఆస్పత్రిలోకి వెళ్లిన 5 నిమిషాలలోపే ప్రాణం వదలడమేంటని ప్రశ్నించారు. అనంతరం జిల్లా ఆస్పత్రి ఆర్ఎంఓ షుకుర్, ఆందోళనకారులతో చర్చించేందుకు రాగా వైద్యులపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రూరల్ సీఐ సత్యనారాయణ చొరవతీసుకుని, ఆందోళనకారులతో, ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి, న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన బాధితులు డాక్టర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ -
కలెక్టర్ కార్యాలయానికి బాంబు బెదిరింపు!
రాయచోటి: కలెక్టర్ కార్యాలయాన్ని బాంబులతో పేల్చేస్తున్నట్లు దుండగుల నుంచి ఫోన్ సమాచారం అందింది. వెంటనే విషయాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియపరిచారు. సమాచారం అందగానే జిల్లా బాంబు స్క్వాడ్, డాగ్స్ స్క్వాడ్లు కలెక్టర్ కార్యాలయంలో అణువణువు గాలింపు చేశాయి. కార్యాలయ సిబ్బంది అంతా ఒక్క మారుగా ఉలికిపాటుకు గురయ్యారు. తీరా ఇదంతా జిల్లా పోలీస్ యంత్రాంగం మాక్ డ్రిల్‌లో భాగమని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయానికి వస్తే శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో బాంబు బెదిరింపు వచ్చినపుడు ఎలా స్పందించాలనే దానిపై పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. హుటాహుటిన కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు, ఉద్యోగులను బయటకు పంపి కార్యాలయంలో అణువణువు తనిఖీ చేశారు. ఉద్యోగుల అప్రమత్తత కోసం..... ఉద్యోగులను అప్రమత్తం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇవ్వడమే మాక్ డ్రిల్ ఉద్దేశమని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బాంబు బెదిరింపు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో రాయచోటి పట్టణ సిఐ చలపతి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వీజే రామకృష్ణ, సీఐలు, ఎస్ఐలు,ఆర్ఎస్ఐలు, ఏఆర్ పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. మాక్ డ్రిల్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది -
ఎన్నికల ప్రక్రియ బలోపేతానికి సలహాలివ్వండి
రాయచోటి: జిల్లాలో ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి చట్టానికి అనుగుణంగా సూచనలు, సలహాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ రాజకీయ పార్టీలను కోరారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ గురించి ఈఆర్ఓ, డీఈఓల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి సూచనలు ఆహ్వానిస్తోందన్నారు. భారత ఎన్నికల సంఘం సూచించిన ప్రజా ప్రాతినిధ్యం, చట్టం, ఓటర్ల నమోదు నియమాలు, ఎన్నికల నియమాలు నిర్వహణ, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు, భారత ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, మాన్యువల్స్, హ్యాండ్ బుక్కులు అంశాలపై అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి ఏప్రిల్ 30 నాటికి సూచనలు, సలహాలు అందజేయాల్సి ఉందన్నారు.ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో పటిష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను తప్పనిసరిగా నియమించుకోవాలన్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల ఈవీఎంలను పగులకొట్టేందుకు ప్రయత్నించారని, సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలను గుర్తించి పటిష్ట చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కలెక్టర్‌ను కోరారు. ఈవీఎం గోదాం సందర్శన స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో ఉన్న ఈవీఎం గోదామును రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. గోదాంలోని ఈవీఎంల బీయూ, సీయూ, వివిధ ప్యాట్లను వారు పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్ఓ మధసూదన్రావు, కలెక్టర్ ఎన్నికల విభాగం సూపరిటెండెంట్ రెడ్డప్ప, తహసీల్దార్ నరసింహ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చామకూరి శ్రీధర్ -
ఉపాధి లక్ష్యానికి తూట్లు
రాయచోటి అర్బన్ : ఉపాధి హామీపథకం పనులను వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని అసెంబ్లీ సమావేశాలలో చెప్పడం చట్ట స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ అనుబంధ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పండుగోలు మణి, తోపుక్రిష్ణప్ప, సీపీఐ జిల్లా కార్యదర్శి పియల్ నరసింహులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సీపీఐ కార్యా లయంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య ససమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుబంధ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కష్టజీవులు అంగీకరించబోరంటూ హెచ్చరించారు. రాష్ట్రబడ్జెట్లో ఒక్కరూపాయిని కూడా కేటాయించని ప్రభుత్వా నికి ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అను సంధానం చేసే నైతికహక్కు లేదన్నారు. అనుసంధానం పేరుతో కూలీలకు ద్రోహం తలపెట్టవద్దంటూ వారు కోరారు. కరువు పరిస్థితులతో తల్లడిల్లుతూ తిండిఅయినా పెట్టండి – పనులు అయినా కల్పించండి అనే నినాదంతో పేదలు, కూలీలు చేసిన పోరాటం ఫలితంగానే 2005లో యూపీఏ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టం తీసుకువచ్చిందన్నారు. ఉపాధిపనులను సక్రమంగా కల్పించకపోవడం వలన కూలీల వలసలు తీవ్రమయ్యాయన్నారు. ఉపాధిహామీ పథకం నిధులను పక్కదారి పట్టించకుండా చూడాలన్నారు. మెటీరియల్ కాంపోనెంటును పూర్తిగా రాష్ట్రప్రభుత్వమే భరించాలని కోరారు. కూలీలకు డబ్బులను పోస్టాపీసు ద్వారా చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న పాతబకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా పనిచేస్తున్న ప్రతి వ్యక్తికి ఉపాధి కల్పించాలని, ఒకవేళ పని కల్పించలేకపోతే వారికి ఉపాధి భృతిగా ఏడాదికి రూ.12 వేల చొప్పున అందజేయాలని కోరారు. సమావేశంలో రైల్వేకోడూరు, రాజంపేట ,తంబళ్ళపల్లె, మదనపల్లె, పీలేరు,రాయచోటి ప్రాంతాల సంఘం నేతలు పాల్గొన్నారు. ఉపాధిని వ్యవసాయానికి అనుసంధానం చట్టస్ఫూర్తికి విరుద్ధం పనులు కల్పించలేకపోతే ఏడాదికి రూ.12వేల భృతిగా చెల్లించాలి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నేతల డిమాండ్ -
కట్నం వేధింపులపై ఫిర్యాదు
పెద్దతిప్పసముద్రం : అదనపు కట్నం కోసం కట్టుకున్న భర్తతో పాటు అత్తా, మామ, ఆడపడచు వేధిస్తున్నారని లలితమ్మ అనే బాధితురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా.. మండలంలోని సంపతికోట పంచాయతీ ముంతపోగులవారిపల్లికి చెందిన కోనకుంట రాయుడు కుమార్తె లలితమ్మకు కర్ణాటక రాష్ట్రం చేలూరు సమీపంలోని గ్యాదోల్లపల్లికి చెందిన బంగారప్ప కుమారుడు క్రాంతి కుమార్‌తో నాలుగేళ్ళ కితం వివాహమైది. మూడేళ్ళ పాటు ఈ దంపతుల జీవనం సజావుగా సాగింది. ఈ దంపతులకు ఓ కుమార్తె సంతానం కాగా ఇటీవల మరో కుమార్తె జన్మనిచ్చింది. అయితే గత ఏడాది నుంచి తనను ఏ మాత్రం పట్టించుకోకుండా మరో మహిళతో గుట్టుగా అక్రమం సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ లలితమ్మ భర్తపై నెల రోజుల క్రితం పీటీఎం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పట్లో పోలీసులు భర్తతో పాటు వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. ఈ తరుణంలో తన భర్తలో ఎలాంటి మార్పు లేకపోవడంతో పాటు బి.కొత్తకోటలోని ఇందిరమ్మ కాలనీలో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో లలితమ్మ కుటుంబ సభ్యులకు పట్టుబడ్డాడు. తన భర్తతో పాటు ఆమె కుటుంబ సభ్యులు నిత్యం అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని, కట్టుకున్న భార్యతో పాటు పిల్లలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న అత్తామామ, ఆడ పడచుతో పాటు తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లలితమ్మ పేర్కొంది. ఈ విషయంపై ఎస్ఐ హరిహర ప్రసాద్ మాట్లాడుతూ లలితమ్మ ఫిర్యాదును స్వీకరించి విచారణ చేస్తున్నామని తెలిపారు. -
సాంకేతిక సహకారంతో అడవుల సంరక్షణ
బి.కొత్తకోట: విధుల్లో ఉండే అటవీశాఖ యంత్రాంగం అడవులను సంరక్షించుకునేందుకు సాంకేతిక సహకారంతో సత్ఫలితాలు సాధించొచ్చని వైల్డ్‌లైఫ్ సెంట్రల్ బ్యూరో ఇన్స్పెక్టర్ (చైన్నె) ఆదిమల్లయ్య, రాజంపేట డీఎఫ్ఓ జగన్నాఽథ్సింగ్, లీగల్ విభాగం న్యాయవాది బలరాం అన్నారు. శుక్రవారం బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌పై జిల్లాలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు 70మందికి వైల్డ్‌లైఫ్, ఏఐ, న్యాయ అంశాలపై ఒకరోజు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారిన చట్టాల మేరకు ఎవరైనా వన్యప్రాణిని చంపితే దానికి విధించే అపరాధ రుసుం భారీగా పెంచారని అన్నారు. గతంలో రూ.25వేల జరిమానా ఉండేదని, ఇప్పుడు రూ.లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు విధించవచ్చని, డీఎఫ్ఓ స్థాయి అధికారి రూ.5 లక్షలకు మించి విధించే అవకాశం ఉందన్నారు. ఎర్రచందనం ఆక్రమ రవాణా, నిందితులను గుర్తించడం తదితర విషయాల్లో సాంకేతిక సహకారం తీసుకోవాలని సూచించారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని గుర్తించే సాంకేతిక విధానం అందుబాటులో ఉందన్నారు. ఎక్కడైనా అడవిలో నిప్పు పడితే అక్కడ వచ్చే పోగ ఆధారంగా శాటిలైట్ అటవీశాఖను అప్రమత్తం చేస్తుందని, ఏ ప్రాంతంలో మంటలు వ్యాపించాయో ఆ ప్రాంత అటవీశాఖ సిబ్బంది మొబైల్ ఫోన్లకు సమాచారం వెళ్తుందని అన్నారు. సిబ్బంది మంటలను అదుపు చేసే చర్యలు తీసుకుంటారని తెలిపారు. అధికారులు, సిబ్బంది చాట్‌జీపీటీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సబ్‌డీఎఫ్‌ఓలు సుబ్బరాజు, బాలరాజు, శ్రీనివాసులు,ఎఫ్ఆర్ఓలు జయప్రసాద్‌రావు, వైసీ.రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ప్రియాంక, శ్యామసుందర్, ధీరజ్, దత్తాత్రేయ, హార్సిలీహిల్స్ సెక్షన్ ఆఫీసర్ అడపా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పర్యటన రద్దు
రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరులో ఈనెల 23వ తేదీన జరగాల్సిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని వైస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. మళ్లీ పర్యటన ఎప్పుడు ఉంటుందో త్వరలో తెలియజేస్తామన్నారు. హుండీ ఆదాయం లెక్కింపు ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం ఆలయ టీటీడీ అధికారులు లెక్కించారు.నెలరోజులకు రూ.4,55,140 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సర్పంచ్ చెక్ పవర్ రద్దు పుల్లంపేట: పుల్లంపేట మండలం, జాగువారిపల్లి సర్పంచ్ వై రఘురామయ్య చెక్ పవర్ రద్దు చేస్తున్నట్లు ఏఓ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. జాగువారిపల్లికి సంబంధించి రూ. 7.50 లక్షల నిధుల్లో అవినీతి జరిగిందని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.దీనిపై విచారణ చేపట్టి చెక్ పవర్ రద్దు చేసినట్లు ఏఓ పేర్కొన్నారు. కురబలకోట ఇన్చార్జి ఎంపీపీగా భూదేవికి బాధ్యతలు కురబలకోట: కురబలకోట మండల పరిషత్ ఇన్చార్జి ఎంపీపీగా నందిరెడ్డిగారిపల్లె ఎంపీటీసీ, వైఎస్ ఎంపీపీ ఎంజి. భూదేవికి బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల క్రితం ఎంపీపీ బి. దస్తగిరి అనారోగ్య కారణాలతో ఆరునెలలు సెలవులో వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో గురువారం మండలంలోని మెజార్టీ ఎంపీటీసీలు సమావేశమై భూదేవిని ఇన్చార్జి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కూడా ఇన్చార్జి ఎంపీపీగా భూదేవికి బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో అధికారికంగా మండల పగ్గాలు ఆమె చేతికి వచ్చాయి. ఏకగ్రీవ ఎన్నికరాజంపేట: రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది పచ్చా హనుమంతునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు ఎన్నికల సీఈవో సురేష్‌కుమార్, సహాయ ఎన్నికల అధికారి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం ధ్రు వీకరణపత్రాన్ని అందచేశారు. బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శిగా జాఫర్‌బాషా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో బార్అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కొండూరు శరత్‌కుమార్‌రాజు, న్యాయవాదులు నాసరుద్దీన్, గడికోట రామచంద్రయ్య, రామచంద్రరాజు, నలికిరిరెడ్డయ్య, శంకరనాయుడు, కాశీ, వీవీ రమణ, ప్రభాకరరావు, కత్తి సుబ్బరాయుడు, శ్రీకాంత్, షమీఉల్లాఖాన్, కెఎంఎల్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వ విద్యాలయాన్ని అందరి సహకారంతో అత్యున్నత విద్యాసంస్థగా తీర్చిదిద్దుతామని ఆచార్య ఆల్లం శ్రీనివాసులు పేర్కొన్నారు. నెల్లూరు విక్రం సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేస్తున్న ఆచార్య అల్లం శ్రీనివాసరావు యోగివేమన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జీ వీసీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ కులసచివులు ఆచార్యపుత్తా పద్మ, వైవీయూ కళాశాల ప్రధానాచార్యులు ఎస్. రఘునాథరెడ్డి, ప్రొద్దుటూరు వైవీయూ వైఎస్సార్ ఇంజినీరింగు కళాశాల ప్రధానాచార్యులు ప్రొఫె సర్ జయరామిరెడ్డి, డీన్లు, బీవోఎస్ ఛైర్మన్లు, అన్ని శాఖల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, స్కాలర్లు విద్యార్థులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. యోగి వేమన విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ● వైవీయూ వీసీ విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులతో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన విశ్వవిద్యాలయ అభివృద్ధికి తన ఆలోచనలను తెలియజేసి సహకరించాలని కోరారు. -
కుటుంబ కలహాలతో అల్లుడిపై దాడి
లక్కిరెడ్డిపల్లి : కుటుంబ కలహాల నేపత్యంలో అల్లుడు పసుపుల వెంకటరమణపై అత్తా, మామలతోపాటు మరో ఇద్దరు కలిసి పట్టపగలు అందరూ చూస్తుండగానే వేట కొడవళ్లతో దాడి చేసిన సంఘటన లక్కిరెడ్డిపల్లి మండలం, పందిళ్లపల్లి గ్రామం, జింకలగట్ట వడ్డిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికల వివరాల మేరకు .. పసుపుల వెంకటరమణకు 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. ముగ్గురు సంతానం. అయితే పసుపుల వెంకటరమణ భార్యకు అంతకు మునుపే మరో మరో వ్యక్తితో వివాహమైందని, అప్పటికే ఇద్దరు సంతానం కూడా ఉన్నారని బంధువులు తెలిపారు. శుక్రవారం సాయంకాలం సమయంలో పసుపుల వెంకటరమణ తన ఇంటి వద్ద ఆరుబయట కూర్చొని ఉండగా అత్తా, మామలు, భార్య, ముందు సంతానం అయిన ఇద్దరితో కలిసి ఒక్కసారిగా కొడవళ్లతో పసుపుల వెంకటరమణపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు రక్త గాయాలతో పడి ఉన్న పసుపుల వెంకటరమణను స్థానికులు 108 సాయంతో లక్కిరెడ్డిపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం కడపరిమ్స్కు తరలించారు. లక్కిరెడ్డిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జరిగిన విషయంపై స్థానికులు ద్వారా సమాచారాన్ని సేకరించారు. పసుపుల వెంకటరమణపై దాడికి పాల్పడిన వారు పరారీలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయంపై లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ రవీంద్రబాబును సాక్షి వివరణ కోరగా స్టేషన్లో ఇప్పటి వరకు ఫిర్యాదు ఇవ్వలేదన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి
బి.కొత్తకోట : జాతీయరహదారి పక్కన నడిచి వెళ్తున్న వృద్ధుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం మండలంలోని పెద్దపల్లి క్రాస్‌లో చోటుచేసుకుంది. సీఐ జీవన్ గంగనాఽథ్బాబు కథనం మేరకు.. తుమ్మనంగుట్ట, కనికలతోపు, పెద్దపల్లి ప్రాంతాల్లో మూడునెలలుగా గుర్తు తెలియని వ్యక్తి (65) భిక్షాటన చేసుకొంటూ సంచరిస్తున్నాడు. ఇతను ఉదయం 7–8 గంటల మధ్యలో మదనపల్లె వైపు నుంచి కదిరివైపునకు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో తల, శరీరంపై తీవ్ర గాయాలైన వృద్ధుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైకోర్టు ఆదేశాల మేరకు దారి ఏర్పాటు చేయండి
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రాజకీయ కారణాలతో అగ్రవర్ణ భూస్వాములు కంచె వేసి దారిని ఆక్రమించారని, హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రైతులకు దారి ఏర్పాటు చేయాలని శుక్రవారం సీపీఎం నాయకుడు సిహెచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016వో ఎన్నో ఏళ్లుగా ఉన్న దారిని మూసేశారని, అప్పటి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వగా స్టే తెచ్చారని వారు పేర్కొన్నారు. దానిపై ప్రస్తుతం హైకోర్టు స్టే రద్దు చేసి నాలుగు వారాలలో దారి ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించిందన్నారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకుల అండదండలతో పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు. నిర్లక్ష్యం వీడి రైతులకు దారి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మల్లికార్జున రెడ్డి, సుభాన్ బాష, రాజగోపాల్ రెడ్డి, ఓబిలి పెంచలయ్య, బొజ్జా శివయ్య, ఆనంద్, పెంచలయ్య, కేశవులు, నారాయణ, చలపతి, శ్రీను, చిన్నమ్మ, చెంగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి
గాలివీడు : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చిత్తూరు వ్యవసాయ శాఖ డీడీఏ మధుసూదన్‌రెడ్డి రైతులకు సూచించారు.ఆయన శుక్రవారం పూలుకుంట గ్రామంలో ఉలవల పంపిణీ, ఉలవ పంట సాగుపై బండమీద పల్లి, రెడ్డివారి పల్లెలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట సాగుపై రైతుల దగ్గర నుంచి వివరాలను సేకరించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పార్థసారధిరెడ్డి ఆధ్వర్యంలో రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం అందించిన ఉలవల ద్వారా అధిక విస్తీర్ణంలో ఈ ప్రాంతంలో రైతులు సాగు చేశారని, దిగుబడి కూడా ఎక్కువగా ఉన్నదని తెలిపారు. ప్రతి రైతు పంట మార్పిడి ద్వారా భూ సారాన్ని కాపాడాలని తెలిపారు. అనంతరం ఉలవ పంట సాగుచేసిన రైతులను అభినందించారు. కార్యక్రమంలో ఏడీఏ శివప్రసాద్,ఏవో గౌతమి, ఏపీఎంఐపీ డీసీఓ శివశంకర్, మాజీ సర్పంచ్ నాగన్న, మాజీ సొసైటీ డైరెక్టర్ కొండారెడ్డి, రైతులు నాగేశ్వరరావు, గోపాలయ్య తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు వ్యవసాయ శాఖ డీడీఏ మధుసూదన్‌రెడ్డి -
విద్యుత్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
రాయచోటి టౌన్ : ఫిర్యాదుదారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అదాలత్‌ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ అదాలత్ చైర్పర్సన్ వి. శ్రీనివాస్ ఆంజనేయ మూర్తి (రిటైర్డ్ న్యాయమూర్తి) తెలిపారు. శుక్రవారం రాయచోటి విద్యుత్‌శాఖ వారి కార్యాలయ ఆవరణలో విద్యుత్ వినియోగం వాటిలో వస్తున్న సమస్యలపై అదాలత్ నిర్వహించారు. అదాలత్‌కు వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను పరిశీలించి వారికి పరిష్కార మార్గం చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి అదాలత్‌లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలలన్నారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె డివిజన్ పరిధిలోని వినియోగదారుల ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో అదాలత్ ఆర్థిక సభ్యులు రు. రామమోహన్ రావు, సాంకేతిక సభ్యులు ఎస్ఎల్ అంజనీ కుమార్, స్వతంత్య్ర సభ్యులు డబ్ల్యు విజయలక్ష్మి, విద్యుత్ శాఖ జిల్లా పర్యవేక్షకులు ఆర్. చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ సివిబ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. -
నడిరోడ్డుపై మృతదేహంతో నిరసన
తంబళ్లపల్లె : నవీన్‌కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు, మృతుని కుటుంబీకులు, స్నేహితులు మృతదేహాన్ని దుకాణం ముందు రోడ్డుపై ఉంచి శుక్రవారం నిరసన తెలిపారు. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో నవీన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని తంబళ్లపల్లెకు తీసుకువచ్చారు. పుడమి కిసాన్‌మార్ట్ దుకాణం ముందు రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మూడురోడ్ల కూడలిలో రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దుకాణం మేనేజర్ కృష్ణమూర్తి అవకతవకలకు పాల్పడి తమ బిడ్డ మృతికి కారణమయ్యాడని ఆరోపించారు. అతనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని నినదించారు. ఎస్ఐ లోకేష్‌రెడ్డి నిరసనకారులతో చర్చించి సమగ్ర విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పినా నిరసనకారులు భీష్మించుకుని కూర్చున్నారు. టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి బాఽధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంస్థ యాజమాన్యంతో చర్చించి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
జాతీయ రహదారిపై టిప్పర్ కంటైనర్ ఢీ
పుల్లంపేట : కడప–రేణిగుంట జాతీయ రహదారిపై పుల్లంపేట మండలం, ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పరు, కంటైనర్ ఢీ కొన్నాయి. టిప్పర్ డ్రైవర్ మృతి చెందగా కంటైనర్ డ్రైవర్ పరిస్థితి విషమంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. రాజంపేట మండలం, ఊటుకూరు గ్రామానికి చెందిన చీమకుర్తి శివ (35) టిప్పర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శివ శుక్రవారం మంగంపేట నుంచి టిప్పర్‌లో రాజంపేటకు వస్తుండగా ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా గుజరాత్ నుంచి చైన్నెకు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని బలంగా ఢీ కొనడంతో శివ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కంటైనర్ డ్రైవర్ పాండు తీవ్రంగా గాయపడ్డాడు. ఏఎస్పీ రామనాథ్ హెడ్డే, రూరల్ సీఐ రమణ, పుల్లంపేట ఏఎస్ఐ పిచ్చయ్యలు తమ సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించి గాయపడిన కంటైనర్ డ్రైవర్ పాండును రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. శివ మృతదేహం టిప్పర్‌లో ఇరుక్కుపోగా జేసీబీ సహాయంతో వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా రెండు భారీ వాహనాలు ఢీ కొని రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో సుమారు మూడు గంటలసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు జేసీబీల సహాయంతో రెండు వాహనాలను ప్రక్కకు తొలగించి ట్రాపిక్‌ను పునరుద్ధరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టిప్పర్ డ్రైవర్ మృతి కంటైనర్ డ్రైవర్ పరిస్థితి విషమం -
రైతులకు అధిక నష్టం
వేసవి కాలం వచ్చిందంటే చాలు అగ్నిప్రమాదాలు రోజూ ఎక్కడో ఒకచోట చోటు చేసుకుంటున్నాయి. అగ్ని ప్రమాదాల కారణంగా రైతులు అధికంగా నష్టపోతున్నారు. జిల్లాలో పండ్ల తోటలు సాగు అధికంగా ఉంది. తోటలకు వేసిన కంచె, ఏపుగా పెరిగిన గడ్డి, అటవీ ప్రాంతాల్లో ప్రతి రోజు మంటలు వ్యాపిస్తూ వన్యప్రాణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ● బీడు భూములు, పంట పొలాలు, పండ్ల తోటలు, అడవులకు నిప్పంటుకోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా గుర్తు తెలియని వ్యక్తుల ఆకతాయిల చర్యలు, పశువులను మేతకు అడవులకు తీసుకెళ్లే కాపరుల నిర్లక్ష్యం, పొగాకు పదార్థాలను ఆర్పకుండా పడేయడం, ఉద్దేశపూర్వకంగా నిప్పంటించడం ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు. బీడీలు, సిగరెట్లు, చుట్టలు పూర్తిగా ఆరనివ్వకుండా పడేయడం వల్ల చిన్న మంట పెద్దిగా మారి అడవిని కబళిస్తోంది. ● మంటల వల్ల ప్రధాన రహదారులకు ఇరువైపులా చెట్లు, పొదలు, కంచెలు కాలిపోతుండటం వాహనదారులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో చెలరేగిన మంటల నుంచి పొగ కమ్ముకోవడంతో, ఎదురెదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మంటల ధాటికి పండ్లను ఇచ్చే చెట్లు, ప్రకృతి ప్రసాదునిగా ఉన్న వృక్షాలు పూర్తిగా కాలిపోతుండటంతో జీవవైవిధ్యం నాశనమైపోతోంది. ● ఉన్నఫలంగా వ్యాపిస్తున్న మంటలను సిబ్బంది అదుపులోకి తేవడానికి శ్రమిస్తున్నప్పటికీ, పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న ఈ అగ్నికీలలను నియంత్రించడం వీలుకాకుండా పోతుంది. జిల్లాలో భారీ స్థాయి పరివ్రమలు లేకపోయినా తోటలు, పొలాలు, అడవుల్లో పొడి ఆకులు, చెట్ల కొమ్మలు ఎక్కువగా ఉండటంతో, ఒక్కసారి మంటలు వ్యాపిస్తే అవి అదుపులోకి రాకముందే వందలాది ఎకరాలు కాలిపోతున్నాయి. ● మంటల వల్ల పొలాల సమీపంలో ఉన్న వృక్షాలు, పండ్ల తోటలు అగ్నికి ఆహుతవుతున్నాయి. అలాగే వన్యప్రాణులు మంటల ధాటికి అడవుల నుంచి బయటకు పరుగులు తీస్తుండటంతో, అవి జనావాసాల్లోకి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయి. -
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
ఒంటిమిట్ట: అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఒంటిమిట్ట ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారి శ్రీకాంత్ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సాయి భారతి ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడవులు ప్రాముఖ్యత, వాటి సంరక్షణ అవసరం, అటవీ చట్టాల పాత్ర తదితర అంశాల గురించి ఆయన వివరించారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ అడవులు వాతావరణ సమతుల్యతను కాపాడతాయన్నారు. అడవుల వినాశనం పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వాటిని రక్షించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు, స ర్టిఫికెట్లు అందజేశారు.కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామ తులసీ, ఎఫ్ఎస్ఓ బ్రహ్మయ్య, ప్రిన్సిపాల్ సుబ్బరామయ్య, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
విఘ్నేశ్వరునికుంట కబ్జాకు యత్నాలు
మదనపల్లె : కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాగులు, వంకలు, కుంటలు, ప్రభుత్వస్థలాలు...ఒకొక్కటిగా ఆక్రమణకు గురువుతున్నాయి. మదనపల్లె పట్టణం రోజురోజుకీ విస్తరిస్తుండటంతో భూములకు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలనే ఆశతో రాజకీయ అండను ఆసరాగా చేసుకుని తమ్ముళ్లు యథేచ్చగా కబ్జాలకు పాల్పడుతున్నారు. మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీ పరిధిలో జాతీయరహదారికి ఆనుకుని దాదాపు 30 ఎకరాల్లో విఘ్నేశ్వరుని కుంట విస్తరించి ఉంది. జాతీయరహదారి విస్తరణలో భాగంగా కుంట మధ్యలో రోడ్డును ఏర్పాటుచేయడంతో రెండు భాగాలుగా విడిపోయింది. దీంతో కుంట ఓ వైపుకు వెళ్లిపోగా, మరోవైపు ఖాళీస్థలం ఏర్పడింది. హైవేకు ఆనుకుని ఉండటం, కోట్ల విలువైన స్థలం కావడంతో కబ్జారాయుళ్లు తెలివిగా... మట్టి, వ్యర్థాలను తీసుకువచ్చి మెల్లమెల్లగా కుంటను చదునుచేయడం ప్రారంభించారు. ప్రతిరోజు ట్రాక్టర్లలో ఇళ్ల వ్యర్థాలు, మట్టిపెళ్లలు, రాళ్లను తీసుకువచ్చి కుంటకు ఆనుకుని దించడం, ఎవరూ లేని సమయంలో జేసీబీని తీసుకువచ్చి చదునుచేయడం చేస్తున్నారు. దీనిపై స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేస్తే, వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిందిగా పేర్కొని చేతులెత్తేశారు. ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు రాకపోవడంతో కబ్జారాయుళ్లు భూమికి దొంగపట్టాలు సృష్టించే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికై నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా విఘ్నేశ్వరునికుంట సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. మట్టితో చదునుచేసి ఆక్రమిస్తున్న కబ్జారాయుళ్లు కోట్ల విలువైన స్థలం అన్యాక్రాంతం పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు -
హద్దులు దాటిన.. డ్యాన్స్
కురబలకోట : ముదివేడు అమ్మవారి తిరునాలలో డ్యాన్స్ హద్దులు దాటింది. భక్తి భావం ఉప్పొంగాల్సిన చోట అసభ్యకర నృత్యంతో హోరెత్తించారు. కురబలకోట మండలం ముదివేడు దండుమారెమ్మ రాత్రి తిరునాల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించకూడదని ముందస్తుగా పోలీసులు హెచ్చరించినా కొందరు ఖాతరు చేయలేదు. మండలంలోని నడింపల్లె, గోల్లపల్లె గ్రామాల్లో బుధవారం రాత్రి హద్దులు దాటి యథేచ్ఛగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. ఈ దృశ్యాలను కొందరు సెల్ ఫోన్లో రికార్డ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకుని చాందినీబండి నిర్వాహకుడు నడింపల్లె అశోక్‌పై వివిధ సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దిలీప్‌కుమార్ గురువారం తెలిపారు. వారు ఉపయోగించిన డీజే సౌండ్ సిస్టమ్, ఇతర వాహనాలను సీజ్ చేసి కందూరుకు చెందిన కార్తీక్, డిజే వెహికల్ డ్రైవర్ గురునాథ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ముదివేడు తిరునాలలో రికార్డింగ్ డ్యాన్సులు ముగ్గిరిపై కేసు నమోదు...వాహనాలు సీజ్ -
ఉపాధిలో అక్రమాలకు పాల్పడితే చర్యలు
లక్కిరెడ్డిపల్లి : ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని డ్వామా పీడీ వెంకటరత్నం అన్నారు. 2023–24లో జరిగిన ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సోషల్ ఆడిట్ సభ నిర్వహించారు. తనిఖీల్లో ఎక్కువగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని 16 పంచాయతీలలో రూ.43,243, ఏపీడీ తనిఖీలో రూ.1,91,425 ఇప్పటి వరకూ రికవరీ చేశారని సిబ్బంది పీడీకీ తెలిపారు. డీఆర్సీలు, ఉపాధి సిబ్బంది భారీ ముడుపులు తీసుకున్నారని తనిఖీ సిబ్బంది వెల్లడించారు. డ్వామా పీడీ ఆమట్లాడుతూ ఇష్టానుసారంగా నిధులు దుర్వినియోగం చేశారని ఉపాధి సిబ్బందిపై మండిపడ్డారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఒక్కొక్క పంచాయతీ నుంచి డిఆర్సీలకు ముడుపులు ముట్టినట్లు క్షేత్ర స్థాయి సిబ్బంది చెబుతున్నారన్నారు. ఈ విషయంపై వివరణ కోరుతూ ఈసీ వెంకటాలపతి, కంప్యూటర్ ఆపరేటర్ పవన్ నాయక్, టీఏ విజయదుర్గా, ప్రసాద్ రాఘవేంద్రలకు పీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఏపీఓ జిల్లీ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ నందకుమార్‌రెడ్డి, వాటర్ షెడ్ ఏపీడీ లక్ష్మీ నరసయ్య, ఇన్చార్జ్ ఎంపీడీఓ ఉషారాణి, ఏపీడీఓ డిల్లీబాబు, టీఏలు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. -
క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్షన్కు ఆరు నెలలు
మదనపల్లె : కుమారుడి చదువు కోసం క్యాస్ట్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకుంటే.. తప్పుల సవరణ పేరుతో ఆరు నెలలుగా పత్రం ఇవ్వకుండా నిలిపివేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు హబీబ్ సాహెబ్ వివరాల మేరకు.. నిమ్మనపల్లె కందూరు రోడ్డుకు చెందిన బి.హబీబ్ సాహెబ్ షేక్(బీసీ–ఈ) కులానికి చెందిన వ్యక్తి. ఇతడికి బి.ఫహీమ్, బి.ఫాజిల్లా, బి.ఫరీద్ సాహెబ్ ముగ్గురు పిల్లలు. ఫరీద్ సాహెబ్ ఐదో తరగతి చదువు తున్నారు. నవోదయ విద్యాలయలో చేర్పించేందుకు క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరమవడంతో దరఖాస్తు చేసుకుని కావాల్సిన ధృవపత్రాలు జతపరిచాడు. నిమ్మనపల్లె రెవెన్యూ సిబ్బంది బీసీ–ఇకు బదులుగా ఇండియన్ ముస్లిం(ఓసీ)గా పేర్కొంటూ జారీ చేశారు. దీంతో హబీబ్, తాము షేక్(బీసీ–ఈ)కు చెందిన వారమని, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని రెవెన్యూ అధికారులకు విన్నవించారు. మిగిలిన తన ఇద్దరు కుమారుల క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఫరీద్ అహ్మద్ స్కూల్ టీసీ చూపినా బీసీ–ఈ సర్టిఫికేట్ జారీ చేయడంలో అధికారులు జాప్యం చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి అర్జీ పంపి, క్యాస్ట్ సర్టిఫికెట్ సరిచేసేందుకు మూడు నెలలుగా నిమ్మనపల్లె తహసీల్దారు కార్యాలయం, మదనపల్లె సబ్ కలెక్టరేట్ చుట్టూ సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు మరోసారి ఫైల్ తెచ్చి ఇవ్వాల్సిందిగా కోరారన్నారు. రెవెన్యూ అధికారుల తప్పిదానికి ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. -
కూటమి పాలనలో నెరవేరని సొంతింటి కల
రాయచోటి అర్బన్ : కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా పేదల సొంతింటి కల నెరవేరిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య విమర్శించారు. పేదలకు ఇంటి పట్టాలు మంజూరుచేసి పక్కాఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో రెండు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇల్లు కట్టుకునేందుకు సాయం చేయాలని కోరారు. సర్వేల పేరుతో కాలక్షేపం చేయడం దారుణం అన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు మంజూరు చేస్తామంటూ చెప్పిన చంద్రబాబు హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్మిస్తున్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఎల్.నరసింహులు, ఎస్.శ్రీనివాసులు, సుమిత్ర, సాంబశివ, తోపు క్రిష్ణప్ప, సుధీర్‌కుమార్, మనోహర్‌రెడ్డి, టీఎల్.వెంకటేష్, శివరామక్రిష్ణ దేవరా, కోటేశ్వరరావు, జ్యోతిచిన్నయ్య, వంగిమళ్ల రంగారెడ్డి, జక్కల వెంకటేష్, మాధవ్, మహిళలు పాల్గొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్తు షాక్
ఒంటిమిట్ట : మండలంలోని సాలాబాద్ గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఒంటిమిట్ట ఎస్ఐ శివప్రసాద్ వివరాల మేరకు.. సాలాబాద్‌లో ట్రాన్స్ఫార్మర్ పనులు చేస్తున్నారు. లైన్మెన్ జనార్థన్‌రెడ్డి ఆదేశాలతో సాలాబాద్ 33/11 కె.వి.సబ్ స్టేషన్లో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యంరెడ్డి ఎల్సీ ఇచ్చారు. అనంతరం బీహార్‌కు చెందిన రిడీసాయి ఎలక్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్మికుడు మున్నాధావన్(23) ట్రాన్స్ఫార్మర్ పనులు చేసేందుకు విద్యుత్తు స్తంభం ఎక్కాడు. ఎల్సీ ఇచ్చిన సుబ్రహ్మణ్యంరెడ్డి షిప్ట్ మారడంతో రెండో ఆపరేటర్‌గా వచ్చిన సుధాకర్‌రాజు లైన్మెన్ జనార్థన్‌రెడ్డి, ఆపరేటర్ సుబ్రహ్మణ్యంరెడ్డిని సంప్రదించకుండా విద్యుత్ చార్జ్ చేశారు. దీంతో ఆ సమయంలో ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తున్న ధావన్‌కు షాక్ తగలడంతో కరెంట్ పోల్ పైనే కుప్పకూలాడు. అప్రమత్తమైన సిబ్బంది 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించి ప్రథమ చికిత్స అందిచారు. అనంతరం బాధితుడిని మెరుగైన చికిత్స కోసం తిరుపతి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. లైన్మెన్, ఆపరేటర్ల మధ్య సమన్వయ లోపమే ఈ ప్రమాదానికి కారణమని సూపర్వైజర్ మనోహర్కుమార్రెడ్డి ఫిర్యాదు చేయడంతో లైన్మెన్ జనార్దన్‌రెడ్డి, ఆపరేటర్లు సుబ్రహ్మణ్యంరెడ్డి, సుధాకర్రాజులపై కేసు నమోదు చేసినట్లు ఒంటిమిట్ట ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వలస కార్మికుడు లైన్మెన్, ఇద్దరు ఆపరేటర్లపై కేసు నమోదు -
మిగులు భూములు పంపిణీ చేయాలి
రాయచోటి అర్బన్ : జిల్లాలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ మిగులు భూములను పేద గిరిజనులు, దళితులను పంపిణీ చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు క్రిష్ణప్ప డిమాండ్ చేశారు. రాయచోటి జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మొలకలచెరువు, గుడుపల్లె వద్ద గల 270 ఎకరాల చెన్నప్పగారిగడ్డ స్త్రోత్రియం భూములను పేదలకు పంపిణీ చేయాలన్నారు. ఓబులవారిపల్లె మండలం వైకోట గ్రామం బాల్రెడ్డిగారిపల్వె వద్ద 200 ఎకరాలు, పుల్లంపేట మండలం రంగంపల్లె పంచాయతీ కరరుపాకురాజు పల్లె వద్ద వంద ఎకరాల భూములను అర్హులైన పేదలు సాగు చేసుకునేందుకు ఇవ్వాలని కోరారు. ఫ్రీహోల్డ్ కింద పెట్టడంతో దళితులు, గిరిజనులు నష్టపోతారని అన్నారు. కబ్జా కోరల్లో చిక్కుకున్న వాగులు, వంకలు, చెరువులు, కుంటలను కాపాడాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జయరామయ్య, వినయ్, వెంకటరమణ, వెలుగురమణ, వెంకట నరసమ్మ, మల్లిక వెంకటరమణ, శంకర, మునికోటయ్య, రామప్ప పాల్గొన్నారు. -
వెలిగల్లు శుద్ధి జలాలను సద్వినియోగం చేసుకోవాలి
– జెడ్పీ సీఈఓ ఓబులమ్మ గాలివీడు : వెలిగల్లు శుద్ధి జలాలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ సీఈఓ ఓబులమ్మ కోరారు. మండలంలోని వెలిగల్లు జలాశయం వద్ద వివిధ దశల్లో జరుగుతున్న నీటి శుద్ధి ప్రక్రియ పనులను ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈ కృష్ణకుమార్, అధికారులతో ఆమె సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ వెలిగల్లు జలాశయం నుంచి వెలువడే నీరు శుద్ధి చేసిన అనంతరం స్వచ్ఛంగా ఉన్నాయని, అవగాహనా రాహిత్యంతో వృథా చేయడం సరికాదన్నారు. రానున్న వేసవి దష్ట్యా ప్రజలు ప్రతి నీటి బొట్టు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా స్కీం బోర్లలో సమస్యలు తలెత్తున్నాయా అనే విషయంపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జవహర్‌బాబు, లక్కిరెడ్డిపల్లి డీఈ విద్య, జేఈ ప్రదీప్, కృష్ణయ్య, సిబ్బంది పాల్గొన్నారు. వరాహానికి ఏనుగు లాంటి పిల్ల జననం ఒంటిమిట్ట : మండలంలోని పెద్దకొత్తపల్లిలో ఓ వరాహానికి ఏనుగు లాంటి పందిపిల్ల జన్మించింది. గ్రామస్థుల వివరాల మేరకు.. మూడు రోజుల కిందట పెద్దకొత్తపల్లిలో ఓ వరాహానికి తొమ్మిది పిల్లలు జన్మించాయి. అందులో ఎనిమిది పంది పిల్లలు ఒకలా ఉంటే, ఒకటి మాత్రం ఏనుగు తొండాన్ని వేసుకొని విచిత్రంగా ఉంది. దీంతో పోతులూరి వీరబ్రహ్మం చెప్పిన మాటలు నిజమవుతున్నాయంటూ గ్రామంలో చర్చ మొదలైంది. కొందరు పంది పిల్లను చూసేందుకు ఎగబడ్డారు. బుధవారం ఆ పందిపిల్ల మృతి చెందడంతో హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేశారు. పక్కా గృహాల నిర్మాణం వేగవంతం – హౌసింగ్ పీడీ సాంబశివయ్య గాలివీడు : 2019–24 మధ్యకాలంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని హౌసింగ్ పీడీ సాంబశివయ్య కోరారు. మండలంలోని వెలిగల్లు ఎస్సీ ,ఎస్టీ కాలనీల్లో అసంపూర్తిగా ఉన్న పక్కా గృహాలను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, బీసీలకు ప్రభుత్వం రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనపు మొత్తం మంజూరు చేస్తోందని, వెంటనే ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. పనులు మొదలుపెట్టిన వెంటనే బిల్లులు ఇస్తారన్నారు. అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.350 కోట్లు మంజూరు చేసింన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ బుక్కే రమే ష్నాయక్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనాలు ఢీకొని యువకుడు మృతి
మదనపల్లె : ద్విచక్ర వాహనాలు ఎదురు ఎదురుగా ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. మండలంలోని సాయిబులవారిపల్లెకు చెందిన హుస్సేన్, ఖాదర్‌బీ దంపతుల కుమారుడు షేక్మౌలా(25) అంగళ్లు చికెన్ దుకాణంలో పని చేస్తున్నాడు. ఇతడికి భార్య సాదియా, కుమార్తె ఉన్నారు. గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో ఇంటి నుంచి వస్తున్నారు. సిద్దారెడ్డిగారిపల్లెకు చెందిన వెంకటరమణ కుమారుడు శ్రీనివాసులు (26) ముదివేడు జాతరకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. ముదివేడు క్రాస్ వద్ద ఎదురెదురుగా వస్తున్న ఇరువురి వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో మౌలా తలకు తీవ్రగాయమై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. శ్రీనివాసులు సైతం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ మౌలా మృతిచెందగా, శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలానికి 108 అంబులెన్స్ వాహనం గంట వరకు రాకపోవడంపై మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో గాయపడిన వారు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
వేలంపాటలో ఉద్రిక్తత
పెద్దతిప్పసముద్రం : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఏక పక్షంగా వేలంపాట ఎలా నిర్వహిస్తారంటూ కొందరు అధికారులను ప్రశ్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే మంతనాల అనంతరం ఈవోఆర్డీ స్పందించి సర్పంచ్, డీఎల్పీవో హాజరుకానందున వాయిదా వేస్తున్నామని చెప్పడంలో పాటదారులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని రంగసముద్రం చెరువులో చేపల పెంపకంపై స్థానిక రాపూరివాండ్లపల్లి సచివాలయం ఎదుట గురువారం వేలంపాట నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఒక రోజు ముందు మాత్రమే చాటింపు వే యడం, ఆశావహులకు డిపాజిట్లు చెల్లింపునకు ఒక రోజు గడువు ఇవ్వడంతో పాటదారుల్లో అసహనం, అ నుమానాలు రేకెత్తాయి. దీంతో వివాదం తలెత్తకుండా అధికారులు పోలీసుల రక్షణ కోరారు. పీటీఎం, ములకలచెరువు ఎస్ఐలు హరిహరప్రసాద్, నరసింహుడు, 5 మంది పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బందోబస్తు చేపట్టారు. వాయిదా వేశామన్న అధికారులు ధరావతు చెల్లించిన వారు మాత్రమే లోనికి రావాలని చెప్పడంతో గందరగోళం నెలకొంది. వేలం బహిరంగంగా కాకుండా కార్యాలయం లోపల గుట్టుగా వేయడం వెనుక ఆంతర్యం ఏమనే జనం అనుమానాలు వ్యక్తం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 12 గంటలైనా స్థానిక సర్పంచ్, డీఎల్పీవో వేలం పాటకు గైర్హాజరవడం ఇందుకు బలం చేకూర్చింది. దీంతో సచివాలయంలోకి వెళ్ళేందుకు పలువురు గ్రామస్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రజల సూచన మేరకు ఇన్చార్జి ఈవోఆర్డీ మోహన్ ప్రతాప్‌ను బయటకు రప్పించగా.. నిబంధనలకు విరుద్ధంగా వేలంపాట ఎలా నిర్వహిస్తారు? వేలంలో పాల్గొనే వారు అధికంగా ఉన్నా డిపాజిట్ కట్టించుకునేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీకు నచ్చిన వాళ్ళ దగ్గరే డబ్బు కట్టించుకుంటారా? అంటూ స్థానికులు గట్టిగా నిలదీసారు. ఎట్టకేలకు స్పందించిన ఈవోఆర్డీ స్పందిస్తూ సర్పంచ్, డీఎల్పీవో హాజరు కానందున వేలంపాట వాయిదా వేస్తున్నామని తెలిపారు. లోపాలు సరిదిద్ది, ముందస్తుగా చాటింపు, కర పత్రాలు, పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రచారం చేసి వేలం నిర్వహిస్తామని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డీఎల్పీవో, సర్పంచ్ గైర్హాజరుతో వాయిదా ఎస్ఐలు, పోలీసుల భారీ బందోబస్తు ఈవోఆర్డీపై రెండు గ్రామాల ప్రజల ఆగ్రహం -
ఏనుగు దాడిలో మృతుల కుటుంబాలకు సాయం
ఓబులవారిపల్లె : శివరాత్రి సందర్భంగా తల కోన కు కాలినడకన వెళ్తూ వై.కోట సమీపంలో ఏనుగల దాడిలో మృతిచెందిన కుటుంబాలకు ము క్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ద్వారా ముక్కా వరలక్ష్మీ గురువారం ఆర్థికసాయం అందజేశారు. రైల్వేకోడూరు మండలం బుడుగుంటపల్లి పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన మృతురాలు తుపాకుల మణెమ్మ, తిరుపతి చెంగల్ రాయుడు, ఉర్లగడ్డపోడు వంకాయల దినేష్ కుమార్ కుటుంబీకులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కులను ము క్కా వరలక్ష్మీ అందజేశారు. ముక్కా వరలక్ష్మీ మా ట్లాడుతూ మృతుల కుటుంబాలకు అన్ని విధాలు గా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ రాజంపేట టౌన్ : పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఓ లారీ గురువారం డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అదుపుతప్పి కింద పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కడప–తిరుపతి మార్గంలో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. బైపాస్ రోడ్డు కావడంతో వేగంగా వెళ్తుంటాయి. లారీ కింద పడి ఉంటే వెనుకవైపు వచ్చే వాహనాలు ఢీకొని పెనుప్రమాదం జరిగేదని, ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. డివైడర్ ఎత్తు పెంచాలని వాహనదారులు కోరారు. ఇసుక రవాణాకు అడ్డుకట్ట వీరబల్లి : మండలంలోని పెద్దవీటి పంచాయతీ ఎలకచెట్టుపల్లి వంతెన, రాగిమాను దిన్నెపల్లి వద్ద మాండవ్య నదిలో ట్రాక్టర్లతో నిత్యం ఇసుక తరలిస్తున్నారు. ఇసుక రవాణా ట్రాక్టర్లను నదిలోకి వెళ్లనీయకుండా రాగిమానుపల్లి గ్రామస్తులు గురువారం నిలిపివేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ కొందరు నాయకుల సహకారంతో ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. భూగర్భజలాలు అడుగంటిపోయి తాగడానికి నీరు దొరకకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దారు వెంకటేష్‌కు ఫోన్ ద్వారా తెలుపగా ఇసుక రవాణాను నిలిపవేయాలని సిబ్బందికి సూచించారు. అటవీ భూమి కబ్జా చిన్నమండెం : మండలంలో ఆక్రమణదారులు పేట్రేగిపోతున్నారు. చిన్నర్సుపల్లె కొండ కింద కింద ఉన్న అటవీ భూమిని జేసీబీతో చదును చేయిస్తున్నా.. స్థానికులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. వివరాల్లోకి వెళితే.. చిన్నమండెం మండలం చాకిబండ చెరువు వద్ద చిన్నర్సుపల్లె కొండ కింద అటవీ భూమి ఉంది. మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వారం రోజులుగా యథేచ్ఛగా ఆక్రమణకు పాల్పడుతున్నా అటవీ అధికారులు స్పందించడం లేదు. తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. -
అదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యం
పీలేరురూరల్ : ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన యువకుడి మృతదేహం గురువారం లభ్యమైంది. సీఐ యుగంధర్ కథనం మేరకు.. కాకులారంపల్లె పంచాయతీ కోళ్లఫారానికి చెందిన బెల్లం వెంకటేష్ కుమారుడు సిద్ధరామయ్య(36) ఈ నెల 15న ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద, గ్రామ పరిసరాల్లో గాలించినా ప్రయోజనం లేకపోయింది. రెండు రోజుల క్రితం కుటుంబీకులు పో లీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం గ్రామ సమీపంలోని గురుకుల పాఠశాల ప్రహరీ వద్ద విగతజీవిగా పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ యుగంధర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బా ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి తంబళ్లపల్లె : ఓ యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన గురువారం మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ లోకేష్‌రెడ్డి, మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు... గుండ్లపల్లి పంచాయతీ చెట్లవారిపల్లెకు చెందిన పెద్దవీరభద్ర కుమారుడు నవీన్‌కుమార్(24) స్థానిక పుడమి కిసాన్ మార్ట్ ఎరువుల దుకాణంలో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి పది గంటల వరకు షాపులో ఆడిట్ జరిగింది. అనంతరం షాపు మూసుకుని ఇంటికి చేరాడు. గురువారం ఉదయం 6.30 గంటలకే షాపుకు వచ్చి భవనం వెనుక మెట్ల వద్ద పురుగుల మందు తాగి పడి ఉన్నాడు. స్థానికులు గమనించే సరికి మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తండ్రి పెద్దవీరభద్ర హుటాహుటిన సంఘటన స్థలం చేరుకుని బోరున విలపించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. తన కుమారుడి మృతిపై పలు అనుమానాలున్నాయని, విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని మృతుడి తండ్రి పోలీసులను వేడుకున్నారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్.ఐ లోకేష్‌రెడ్డి తెలిపారు. -
పుణ్యఫలాల శుభ రాత్రులు
● నేటి నుంచి తాఖ్ రాత్రులు ● ప్రత్యేక ఏర్పాట్లలో మసీదు నిర్వాహకులు ఖురాన్ పఠించాలి రంజాన్ మాసంలోని చివరి పది రోజులను తాక్ రాత్రులు అంటాం. 21,23, 25,27,29 ఏదైనా ఓ రాత్రి పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ దివి నుంచి భూమిపైకి అవతరిస్తుందని అనేక హదీసులలో, ఖురాన్లో పేర్కొన్నారు. ఈ రాత్రులు ఎంతో మహిమ గలవి. ప్రతి ముస్లింలు ఈ రాత్రుల్లో దివ్య ఖురాన్ పఠించాలి. ప్రత్యేక నమాజులు ఆచరించాలి. – ఇక్బాల్ అహ్మద్, మత గురువు మదనపల్లి మదనపల్లె సిటీ: పవిత్ర రంజాన్ మాసం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ మాసమంతా మహిమతో కూడినదిగా భావిస్తారు. ఇందులో మొదటి రోజులు అల్లాహ్ కరుణ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తే...రెండవ పది రోజుల్లో తమ తప్పులను క్షమించాలని ప్రార్థిస్తారు. ఇక మూడవదైన ముఖ్యమైన చివరి పదిరోజులు మొదటి రెండు విభాగాల కంటే కొంచెం భిన్నమైనవిగా భావిస్తారు. నరకం నుంచి బయట పడేయాలని అల్లాహ్‌ను శరుణు కోరుకునేందుకు ఈ పదిరోజులను ప్రత్యేకమైనవిగా భావిస్తారు. రంజాన్‌మాస చివరి పది రోజుల్లో పవిత్ర బడీరాత్ వస్తుంది. దీన్నే షబ్ ఏ ఖదర్ లేదా లైలతుల్ ఖద్ర్ అనికూడా అంటారు. ఈ పవిత్ర రాత్రి చివరి పది రోజుల్లో బేసి రాత్రుల్లో ఉంటుందన్న నమ్మకంతో ముస్లింలు తాఖ్ రాత్‌గా నిర్వహిస్తారు. మరీ ముఖ్యంగా 27వ రోజు రాత్రే లైలతుల్ ఖద్ర్ ఉంటుందని భక్తుల విశ్వాసం. లైలతుల్ ఖద్ర్ రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేయడంతో వెయ్యి నెలలపాటు ఉపవాస దీక్షలు చేసినంత ఫలం లభిస్తుందని పెద్దలు పేర్కొంటున్నారు. ప్రజల పాపాలను క్షమించాలని కోరుతూ మహమ్మద్ ప్రవక్త ప్రార్థించారని పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఉండడంతో ముస్లింలు జాగరణ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ● పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత ముఖ్యమైనవిగా, అధిక పుణ్యాన్ని ఇచ్చే తాఖ్ రాత్‌లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని మదనపల్లి, రాయచోటి, రాజంపేట, పీలేరు, రైల్వే కోడూరు, వాల్మీకిపురం, పలు మండల కేంద్రాల్లోని మసీదులలో నిర్వాహకులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వక్తలు, గురువులు తాఖ్ రాత్‌లలో అల్లాహ్ సందేశాన్ని అందజేసేందుకు రానున్నారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల నుంచి మొదటి తాఖ్ రాత్ను ఆచరించనున్నారు. ఆ తర్వాత రోజు విడిచి అంటే ఈనెల 23, 25, 27, 29 తేదీలలో తార్ఖాత్లను ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఐదు రోజులపాటు తరావీ నమాజు అనంతరం పవిత్ర ఖురాన్ పఠనంతోపాటు సామూహికంగా జిక్ర్‌ను చేయించనున్నారు. అలాగే అర్దరాత్రి తహజూద్ ప్రార్థనలకువిశేష ఏర్పాట్లు చేశారు. ప్రార్థనల అనంతరం ఐదు రోజులపాటు ఉపవాస దీక్ష చేపట్టే వారికి సెహరి సౌకర్యం కల్పించనున్నారు. దీంతోపాటు శుక్రవారం ముస్లిం భక్తులు మసీదులలో ఎత్తేకాఫ్ (తపోనిష్ట) దీక్షలు పాటిస్తారు. వీరు రోజంతా పూర్తిగా ఇతర విషయాల జోలికి వెళ్లకుండా కేవలం ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. రంజాన్ పండుగ నిర్వహణకు సూచనగా నెలవంక కనిపించిన తర్వాతనే వారు దీక్ష విరమిస్తారు. -
బీసీ మహిళ
కురబలకోట పీఠంపైబి.కొత్తకోట: తంబళ్లపల్లె నియోజకవర్గంలో మరో బీసీ మహిళ ఎంపీపీ పీఠంపై కూర్చో నుంది. బీసీ జనరల్ ఎంపీపీ స్థానమైన కురబలకోట ఎంపీపీగా బీసీ మహిళను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి ఎంపిక చేయగా గురువారం ఎంపీటీసీ సభ్యులు సమావేశమై నందిరెడ్డిగారిపల్లి ఎంపీటీసీ సభ్యురాలు, వైస్ ఎంపీపీ అయిన ఎంజీ.భూదేవిని ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ ఏవో నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఎంపీపీ దస్తగిరిసాబ్ ఆరోగ్య కారణాలతో ఆరునెలల పాటు సెలవులో వెళ్లారు. అప్పటిదాకా ఎంపీపీగా ఒకరు బాధ్యతలను పూర్తిస్థాయిలో చేపట్టి మండల పరిషత్ పాలన సాగించాల్సి ఉంటుంది. దీనికి మొదటి వైస్ ఎంపీపీ ఎన్.వెంకటరమణారెడ్డి ఎంపీపీగా విముఖత చూపారు. రెండో వైస్ ఎంపీపీ భూదేవికి అవకాశం కల్పించారు. మండలంలోని 12 మంది ఎంపీటీసీల్లో ఒకరు స్వతంత్ర అభ్యర్థికాగా మిగిలిన 11 మందిలో ఇద్దరు అరోగ్య కారణాలతో హజరుకాలేదు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు ఎం.త్రీవేణి, ఎంజీ.భూదేవి, ఆర్.రవీంద్రారెడ్డి, ఎం.ఆనందరెడ్డి, ఎన్.వెంకటరమణారెడ్డి, డి.నిర్మలమ్మ, వి.గోపాలకృష్ణ, జి.సుశీలమ్మ, జి.సరస్వతమ్మ హజరయ్యారు. తదుపరి ఎంపీపీగా భూదేవి పేరును ఆనందరెడ్డి ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ తీర్మానం చేశారు. తర్వాత వినతిపత్రాన్ని ఏవోకు అందజేసి తర్వాతి చర్యలు తీసుకోవా లని కోరారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ సర్పంచ్‌లు విశ్వారెడ్డి, మనోహర్‌రెడ్డి, ఫిరోజ్ ఖాన్, కృష్ణారెడ్డి, టీఏసీ సభ్యులు దామోదర్‌రెడ్డి, కోళ్ల వాసుదేవరెడ్డి తదితరులు హజరయ్యారు. ఈ సందర్భంగా భూదేవి మాట్లాడుతూ బీసీ మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డికి రుణపడి ఉంటామని అన్నారు. జనరల్ స్థానాల్లో బీసీలు: గత ఎంపీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 72 ఎంపీటీసీ స్థానాల్లో జనరల్ స్థానాల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి బీసీ నేతలకు అవకాశం కల్పించారు. 7 ఎంపీటీసీ సీట్లను బీసీలకే అదనంగా కేటాయించి జనరల్ స్థానాల్లో అభ్య ర్థులుగా పోటీచేయించారు. బి.కొత్తకోట మండలంలోని తుమ్మనగుట్ట ఎంపీటీసీ స్థానం జనరల్ కాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఖాదర్‌వలీని ఎంపీటీసీ అయ్యాక వైస్‌ఎంపీపీ చేశారు. పెద్దతిప్పసముద్రం మండలంలోని పట్టేంవాండ్లపల్లె–2 స్థానం జనరల్ కాగా బీసీ–బీ వర్గానికి చెందిన పి.శోభకు టికెట్ ఇచ్చి గెలిపించారు. పెద్దతిప్పసముద్రం–2 ఎంపీటీసీ స్థానం జనరల్‌లో బీసీ వర్గానికి చెందిన జి.మహమ్మద్‌కు టికెట్ ఇచ్చారు. ఆయన్నే పీటీఎం ఎంపీపీ చేశా రు. తంబళ్లపల్లె మండలంలోని ఎద్దులవారిపల్లెకు ఎంపీటీసీ స్థానం జనరల్ కాగా బీసీ వర్గానికి చెందిన సీజీ.హరితకు అవకాశం ఇచ్చారు. కోటాల జనరల్ స్థానంలో బీసీ అయిన చిన్న రామకష్ణకు సీటిచ్చారు. పెద్దమండ్యం మండలంలోని ఎన్ఓ పల్లె ఎంపీటీసీ స్థానం జనరల్ కాగా బీసీ మహిళ జి.చంద్రకళకు అవకాశం ఇచ్చి తర్వాత ఎంపీపీ చేశారు. కోటాకాడపల్లె ఎంపీటీసీ జనరల్ స్థానంలో బీసీ–బీ వర్గానికి చెందిన బి.రవితేజకు అవకాశం కల్పించారు. వీరందరూ విజయం సాధించారు. ఐదుగురు మహిళలే... కురబలకోట ఎంపీపీగా భూదేవి బాధ్యతలు చేపడితే నియోజకవర్గంలోని ఆరు మండలాలకు ఐదుగురు మహిళలే ఎంపీపీలు అవుతారు. ఇప్పటికే పెద్దమండ్యం, ములకలచెరువు ఎంపీపీలు బీసీ మహిళలు, బి.కొత్తకోట ఎస్సీ మహిళ, తంబళ్లపల్లె జనరల్ మహిళ, ఇప్పుడు కురబలకోట ఎంపీపీగా భూదేవి బీసీ మహిళ అవుతారు. పెద్దతిప్పసముద్రం ఎంపీపీ మొహమూద్ బీసీ. దీంతో బీసీ ఎంపీపీల సంఖ్య నాలుగుకు చేరుతుంది. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి నిర్ణయం ఎంపీటీసీల ఏకగ్రీవ తీర్మానం ఇకపై ఐదుగురు ఎంపీపీలు మహిళలే బీసీలు ఎదగాలి వెనుబడిన తంబళ్లపల్లె నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం రాజకీయాల్లో ఎదగాలి. బీసీల అభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యత మాటల్లో కాక చేతల్లో చూపించాం. అందుకనే కురబలకోట ఎంపీపీగా బీసీ మహిళకు మద్దతు ఇచ్చాం. అన్ని పార్టీలు బీసీల రాజకీయ అభ్యున్నతికి అండగా నిలవాలి. –పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే -
● పశు యజమానులకు కష్టకాలం
సాక్షి రాయచోటి: రాష్ట్రంలో 108, 104 తరహాలో వైఎస్సార్సీపీ సర్కార్ వినూత్నంగా ఆలోచించి గ్రామీణ ప్రాంతాల్లోని పశువులకు అత్యుత్తమైన వైద్య సేవలు అందించేలా ప్రణాళిక అమలు చేసింది.ఎక్కడికక్కడ పశువులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు 2022 మే 19వ తేదీన సంచార పశు వైద్య వాహనాలకు శ్రీకారం చుట్టింది.సమున్నత లక్ష్యంతో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచార వాహనాలతో ఉత్తమ వైద్యానికి చర్యలు చేపట్టారు. అప్పట్లోనే ప్రతి నియోజకవర్గానికి ఒక వాహనాన్ని కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నిరంతరాయంగా పశువులకు సేవలు అందిస్తూ వచ్చిన సంచార వైద్యానికి గ్రహణం పట్టుకుంది. ప్రస్తుత కూటమి సర్కార్ సంచార పశు వైద్య వాహనాల గురించి పట్టించుకోకపోవడంతో దాదాపు మూడు వారాలుగా ఇవి మూలకు చేరాయి. కాంట్రాక్టు గడువు ముగియడంతో జిల్లా పశుసంవర్దకశాఖ అధికారులు వాటిని నిలిపివేశారు. కాంట్రాక్టు గడువు ముగిసినా.. ఉన్నతాశయంతో వైఎస్ జగన్ సర్కార్ పశు సంచార వాహనాలకు శ్రీకారం చుడితే గడువుముగియడంతో పక్కన పెట్టేశారు. అయితే కూటమి సర్కార్ కాంట్రాక్టు ముగిసినా పట్టించుకోకుండా ముందుకు వెళు తుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంత పశువులకు, ఇతర జంతువులకు ఉపయోగపడే ఈ పథకంపై ప్రస్తుత సర్కార్ నిర్లక్ష్యం చూపడంపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ఏది ఏమైనా ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంచార పశు వైద్య వాహనాల కాంట్రాక్టు పొడిగించడంపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో అంతుచిక్కడం లేదని పలువురు పశువుల యజమానులు ప్రశ్నిస్తున్నారు. అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్లు, గేదెలు, ఆవులు, ఎద్దులు, ఇతర పెంపుడు జంతువులు ఉన్నాయి. అయితే సంచార పశు వైద్య వాహనం ద్వారా ఎక్కడికక్కడ సమస్య ఉన్నచోటనే...జంతువును వాహనంలోకి హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా ఎక్కించి అక్కడే అన్ని పరీక్షలు చేసేవారు. పశువుల సంరక్షణ కోసం 20 రకాల మల సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తోపాటు ఆటోగ్లేవ్ ప్రయోగశాలను కూడా సంచార వాహనంలో అందుబాటులో ఉంచారు. అత్యున్నత టెక్నాలజీతో వాహనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే దీనికి 108, 104 తరహాలోనే ఒక నంబరును కేటాయించి ఫోన్ చేయగానే గ్రామాలకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో 6, వైఎస్సార్ జిల్లాలో 7 వాహనాలు తిరగడకపోవడంతో రెండోదశలో వచ్చిన వాహనాలతోనే వైద్యం అందిస్తున్నారు. దీంతో పశువులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం గగనంగా మారింది. ఎందుకంటే కొన్ని వాహనాలు పక్కన పెట్టడంతో మిగిలినవి పరిమిత సంఖ్యలోనే వైద్యం అందిస్తాయి. దీంతో పాడి రైతులకు సమస్యలు తప్పడం లేదు. అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని పశువుల సమాచారం రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు అన్నమయ్య జిల్లాలో పశుసంవర్దకశాఖలో మొదటి విడతలో వచ్చిన ఆరు సంచార పశు వైద్య వాహనాల గడువు మీరడంతో పక్కన పెట్టారు. అయితే రెండో విడతలో వచ్చిన వాహనాలతో పశు యజమానులకు ఇబ్బందులు లేకుండా చూస్తు న్నాం. ఎప్పటికప్పుడు పాడి రైతులతోపాటు మిగిలిన ప్రాంతాల్లోనూ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. –గుణశేఖర్పిళ్లై, పశు సంవర్ధకశాఖాధికారి, అన్నమయ్య జిల్లా వాహనాలను పనురుద్ధరించాలి గత ప్రభుత్వ హయాంలో సంచార వైద్యశాలలు ఉండేవి. వాటి ద్వారా పశువులకు ఇంటివద్దనే వైద్యం అందేది. నేడు ఆ వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మూగజీవాల ఆరోగ్యంగా దెబ్బతింటే ఆటోల ద్వారా సమీప పశువైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ఇలా చేయడం కష్టంతో కూడుకున్న పని, ఆర్థికంగా ఇబ్బంది. ప్రభుత్వం తక్షణమే సంచార పశువైద్య వాహనాలను పనురుద్ధరించాలి. –సుబ్బరాయుడు,రైతు పాళెంగడ్డ,సంబేపల్లె మండలం వైఎస్సార్ జిల్లా అన్నమయ్య జిల్లా గేదెలు 3,99,854 100588 కోళ్లు 31,82,190 30,82,260 ఎద్దులు, ఆవులు 44,000 276417 గొర్రెలు 9,20,614 18,24,325 మేకలు 3,80,099 3,53,370 జిల్లాలో పాడి రైతులు 1.80 లక్షలు 2 లక్షలు మొదటి విడతలో వచ్చిన సంచార పశు వైద్య వాహనాలు నిలుపుదల మూగజీవాలకు కష్టకాలం -
పూర్తయిన పనులను ఉగాది రోజున ప్రారంభించాలి
● జిల్లా కలెక్టర్ శ్రీధర్ రాయచోటి: పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పూర్తయిన పల్లె పండుగ పనులను ఉగాది రోజున ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ శాఖ సిబ్బంది, వీఆర్ఓలు, సర్వే సిబ్బంది, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ సిబ్బంది తదితరులతో పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలు, రెవెన్యూ సదస్సుల ద్వారా అందిన అర్జీలు, రీ సర్వే, ఇళ్లపట్టాల రీ వెరిఫికేషన్, పల్లె పండుగ కార్యక్రమాలు, ఎన్టీఆర్ హౌసింగ్, పి–4 సర్వే తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పూర్తయిన పల్లె పండుగ పనుల ప్రారంభోత్సవానికి ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని ఉగాది రోజున ప్రారంభించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉచిత శిక్షణ కడప కోటిరెడ్డిసర్కిల్: డీడీయూ జీకేవై ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జూనియర్ సాఫ్ట్వేర్ వెబ్ డెవలపర్, బ్యూటీషియన్ కోర్సు ల్లో 4 నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని అడ్మిషన్స్ కో–ఆర్డినేటర్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 18–35 ఏళ్లలోపు కలిగి టెన్త్ ఉత్తీర్ణులై ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. కడప నగరంలోని నిహార్ స్కిల్ సెంటర్లో శిక్షణ ఇస్తామన్నారు. ఈనెల 24 నుంచి బ్యాచ్ ప్రారంభిస్తున్నామన్నారు. -
రామయ్య క్షేత్రానికి రైళ్లేవి?
ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని క్షేత్రంలో ఉన్న రైల్వేస్టేషన్ దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు టీటీడీ వార్షిక బ్రహ్మోత్సవాలను కోట్లాది రూపాయిలు వెచ్చించి వైభవంగా నిర్వహిస్తుంటే.. దూర ప్రాంతాలకు చెందిన వారు ఈ వైభవం, ఆలయం ప్రాశ్యస్తంను తెలుసుకునేందుకు రావాలంటే రైలు సౌకర్యం లేదు. టీటీడీ చొరవతో అయినా ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ బాగుపడుతుందా అని భక్తులు ఎదురుచూస్తున్నారు. రాజంపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు భద్రాచలం అధికారిక రామాలయంగా భాసిల్లింది. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఆంధ్రా భద్రాచలంగా ఒంటిమిట్ట కోదండరామాలయం అధికారిక రామాలయంగా ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను చేపడుతూ వస్తోంది. రెండవ అయోధ్యగా..ఏకశిలానగరంగా పిలవబడుతున్న ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌కు భక్తులు చేరుకునేందుకు రైలే లేదు. ఉన్న ఏ రైలూ ఆగదు. ఏటా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈయేడాది ఏప్రిల్ 5 నుంచి ఉత్సవాలను వైభవంగా ప్రారంభించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. కానీ సౌత్ సెంట్రల్ రైల్వే తమ వంతు బాధ్యతగా ఒంటిమిట్టకు భక్తులు చేరుకునేందుకు కల్పించిన రైలు సౌకర్యం శీతకన్ను పెట్టిందనే విమర్శలున్నాయి. ఒంటిమిట్ట రామయ్య చెంతకు చేరుకునేందుకు భక్తులకు వీలులేని పరిస్థితులు దాపురించాయి. భద్రాచలం తరహాలో స్టేషన్ అభివృద్ధి ఏదీ? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసిన తరహాలోనే ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే దక్షిణ మధ్య రైల్వే శీతకన్ను చూపుతోందనే అపవాదును మూటకట్టుకుంది. ముంబాయి–చైన్నె కారిడార్ రైలుమార్గంలో నడిచే ప్రతి రైలుకు ఒంటిమిట్టలో స్టాపింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు అంటున్నారు. ప్రస్తుతానికి డెమో ఒక్క రైలు మాత్రం ఉదయం, సాయంత్రం ఆగుతుంది. కోవిడ్ ముందు నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒంటిమిట్టను ఆంధ్రా భద్రాదిగా గుర్తించి, అభివృద్ధి చేస్తుంటే రైల్వేశాఖ తన వంతు పాత్రను పోషించడం లేదు. పల్లె స్టేషన్లాగే రైల్వేశాఖ భావిస్తోంది. ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఒంటిమిట్టను పరిగణనలోకి తీసుకోలేదు. ఒంటిమిట్ట, భద్రాచలం రెండు పుణ్యక్షేత్రాలు దక్షిణ మధ్య రైల్వేలోనే ఉండేది. భద్రాచలం స్టేషన్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను ఒంటిమిట్టకు ఇవ్వడం లేదంటే వివక్షను ప్రదర్శించినట్లేనని భక్తులు భావిస్తున్నారు. రైలు సౌకర్యంపై దృష్టి పెట్టని టీటీడీ .. ఒంటిమిట్ట రామాలయం టీటీడీలో విలీనమైంది. అయితే ఎంతసేపు రామాలయం అభివృద్ధి వరకు దృష్టి కేంద్రీకరించింది. అయితే రామయ్య క్షేత్రానికి భక్తులు వచ్చేందుకు అవసరమైన సౌకర్యాలపై దృష్టి సారించలేదన్న విమర్శలున్నాయి. ఒంటిమిట్టకు భక్తులు వచ్చేలా రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని టీటీడీ రైల్వేబోర్డును కోరితే తప్పకుండా స్పందిస్తుందని రైల్వే వర్గాలు చెపుతున్నాయి. ఈవో భక్తులకు రైలు సౌకర్యం కల్పించే విషయంసౌ దృష్టిపెట్టాలని రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు కోరుతున్నారు. కొత్తజోన్‌లో అయినా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ఎస్సీ రైల్వేలో ఏపీకి ప్రత్యేకంగా జోన్ ఏర్పాటైంది. విశాఖజోన్కే తలమానికం ఒంటిమిట్ట రామాలయం. అధికారికంగా గుర్తించిన రామాలయం ఇదే. అటువంటప్పుడు కొత్త జోన్ వల్ల రామాలయం ఉన్న ఒంటిమిట్ట స్టేషన్‌కు గుర్తింపు వస్తుందన్న ఆశలున్నాయి. దూరప్రాంత భక్తులెలా వచ్చేది.. దూర ప్రాంత భక్తులు రైలుమార్గంలో రామయ్య చెంతకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట్ట రామయ్య దర్శనానికి వస్తున్నారు. భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ మీదుగా భక్తులు వచ్చేందుకు వీలుగా రైళ్లు నడుస్తున్నాయి. ఒంటిమిట్ట స్టేషన్పేరుకు మాత్రమే ఉంది. నవమి బ్రహ్మోత్సవాలు, స్వామివారి కళ్యాణం రోజున లక్ష లాది మంది భక్తులు ఒంటిమిట్టకు చేరుకుంటారు. ఒంటిమిట్ట స్టేషన్ అభివృద్ధి చేయాలంటూ ప్రజాప్రతినిధులు గళం విప్పుతున్నారు. అయినా రైల్వేశాఖలో ఎటువంటి స్పందన కనిపించలేదన్న విమర్శలున్నాయి. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి రైలుమార్గంలో వచ్చేదెలా..? భద్రాచలం తరహాలోస్టేషన్ అభివృద్ధి ఏదీ? మొన్నటి వరకు ఒంటిమిట్ట, భద్రాచలం రెండు ఎస్సీ రైల్వేలోనే .. విశాఖ జోన్‌కే తలమానికంఒంటిమిట్ట రామాలయం ఒంటిమిట్టపై రైల్వేశాఖ వివక్ష భక్తులకు రైలు సౌకర్యంపై దృష్టిపెట్టని టీటీడీ రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళతాం టీటీడీ ఒంటిమిట్ట కోదండ రామాలయంకు ప్రత్యేక గుర్తింపు ఇస్తోంది. మరి ఎందుకు రైల్వేశాఖ వివక్ష చూపుతోంది. రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి ద్వారా ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో రైళ్ల హాల్టింగ్, స్టేషన్ అభివృద్ధి అంశాలను రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళతాం. తెలంగాణాలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసి, రైలు సౌకర్యం కల్పించినప్పుడు ఆంధ్రా భద్రాచలం రైల్వేశాఖకు కనిపించలేదా. భక్తులు ఒంటిమిట్టకు చేరుకునేందుకు ఒక్కరైలు కూడా అందుబాటులో లేదు. – తల్లెం భరత్‌రెడ్డి, డీఆర్‌యుసీసీ సభ్యుడు భక్తుల రాకకు రైలు మార్గమే అనుకూలం దూరప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట్టకు చేరుకునేలా రైలు సౌకర్యం కల్పించాలి. భక్తులకు ఏ విధంగా భద్రాచలం రైల్వేస్టేషన్ సౌకర్యంగా ఉందో, అలాగే ఒంటిమిట్టను మార్చాలి. ఏపీకి అధికారిక రామాలయంగా గుర్తించారు. అదే రీతిలో రైల్వేపరంగా భక్తులకు సౌకర్యాల ఏర్పాటుకు కృషిచేయాలి. కనీసం కళ్యాణం రోజైనా స్టాపింగ్ కల్పించాలి. ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మేడా రఘునాఽథ్రెడ్డిల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళతాం. –తంబెళ్ల వేణుగోపాల్‌రెడ్డి, డీఆర్‌యుసీసీ సభ్యుడు -
జెడ్పీ ఛైర్మన్ ఎన్నికలపై మంతనాలు
కడప కార్పొరేషన్: జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 27వ తేది నిర్వహించే జెడ్పీ చైర్మన్ ఎన్నికలపై వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు చర్చించారు. గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన వారు సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు అకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇస్రో పిలుస్తోంది... వెళ్దాం రండి..!
మదనపల్లె సిటీ: అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఆ సంగతులేంటో తెలుసుందాం రండి. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీ వల ఇస్రో వంద ప్రయోగాలను పూర్తి చేసుకుంది. ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజెప్పేందుకు ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది. 23 వరకు గడువు: విద్యార్థులు మార్చి 23వ తేదీలోగా ఠీఠీఠీ.జీటటౌ.జౌఠి.జీ ుఽ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల వడబోత అనంతరం ఏప్రిల్7న ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. మే 18 నుంచి విద్యార్థుఽలను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30 వరకు యువికా–25 కార్యక్రమం నిర్వహిస్తారు. మే 31న ముగింపు కార్యక్రమం ఉంటుంది. 7 కేంద్రాల్లో నిర్వహణ: ఇస్రో ఈ కార్యక్రమాన్ని ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట ( ఏపీ), బెంగళూరు (కర్నాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్( మేఘాలయ). ఎవరు అర్హులు: 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8 లో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తా రు. స్పేస్, సైన్సు క్లబ్‌లలో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్సీసీ, స్కౌట్స్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, పల్లె ప్రాంతాల వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు. ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న విద్యార్థి కూడా ఉన్నత స్థాయిని అధిరోహించడానికి కల్పిస్తున్న అవకాశాల్లో ఇది ఒకటి. ఈ అవకాశాన్ని విద్యార్థులు అందిపుచ్చుకునేలా సైన్సు టీచర్లు కృషి చేయాలి. ఆసక్తి ఉన్న వారు మార్చి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. –మార్ల ఓబుల్‌రెడ్డి, జిల్లా సైన్సు అధికారి అన్నీ ఉచితంగానే... ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం, భోజన, వసతి సౌకర్యాలను ఇస్రో ఉచితంగా అందజేస్తుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో కేటాయించిన రోజులలో ఇస్రోకు చెందిన స్పేస్ సెంటర్లకు తీసుకెళ్తారు. అక్కడ సైన్స్‌కు సంబంధించిన అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం విద్యార్థులకు కల్పిస్తారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులతో ప్రతిభా అన్వేషణ్ పరీక్షలు రాయించడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఇలాంటి అరుదైన అవకాశాన్ని విద్యార్థి దశలోనే పొందితే కచ్చితంగా దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదుగుతారు. ప్రధానోపాధ్యాయులు దీనిని బాధ్యతగా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించాలి. – సుబ్రమణ్యం, జిల్లా విద్యాశాఖ అఽధికారి -
22న కుల, చేతివృత్తుల సంఘాల నేతల సమావేశం
రాయచోటి అర్బన్: ఈ నెల 22వ తేదీన జిల్లాలోని బీసీ కులాల చేతి, కులవృత్తుల సంఘాల నేతలతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్. జయసింహా ఒక ప్రకటనలో తెలిపారు. రాయచోటి పట్టణంలోని ఎంపీడీఓ సభాభవనంలో నిర్వహించే సమావేశంలో ఆదరణ–3 పథకం కింద అవసరమైన కుల, చేతివృత్తి పనిముట్లకు నేతల సలహాలు, సూచనలను స్వీకరించనున్నామన్నారు. సమావేశానికి నాయిబ్రహ్మణులు, రజకులు, వడ్డెరలు, మత్స్యకారులు, చేనేత, స్వర్ణకారులు, వడ్రంగులు, పాల వ్యాపారం, కల్లు గీత కార్మికులు, కుమ్మర, మేదర, వాల్మీకి, బోయ , కృష్ణ బలిజ, పూసలు, సగర, ఉప్పర తదితర కులాల నేతలతో పాటు శిల్పి, కరెంటు, ప్లంబింగ్ తదితర చేతివృత్తుల వారు హాజరు కావాలన్నా రు. 26 నుంచి అన్నమయ్య 522వ వర్ధంతి కార్యక్రమాలు రాజంపేట: ఈనెల 26 నుంచి తాళ్లపాక, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 522 వ వర్ధంతి కార్యక్రమాలను టీటీడీ నిర్వహించనుంది. ఈ మేరకు బుధవారం వర్ధంతి కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. 26న తాళ్లపాకలో నగర సంకీర్తన, గోష్ఠిగానం, అన్నమాచార్య సంకీర్తన, హరికథ కార్యక్రమాలు ఉంటాయి. 27, 28, 29న అన్నమాచార్య సంకీర్తన, హరికథలు ఉంటాయి. అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద రెండురోజుల పాటు మాత్రమే వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య సంకీర్తన, హరికథలు నిర్వహించారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో ఆధ్యాత్మిక సంగీత సభలను నిర్వహిస్తారు. జూడాల సంఘం నూతన కమిటీ ఏర్పాటు కడప అర్బన్: ప్రభుత్వ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ల సంఘం (జీఎంఎస్కె– జూడా) కొత్త కమిటీ ఏర్పాటైంది. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. సురేఖ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. విజయభాస్కర్ రెడ్డి కొత్త కమిటీని అభినందించారు. అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ ఎస్. విష్ణు వర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ బి. విజయ్, డాక్టర్ చరిత, డాక్టర్ పూజ, డాక్టర్ ప్రతిభ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ. నిఖిల్ సింగ్, డాక్టర్ సుబ్బారెడ్డి కళాశాలలోని సమస్యల గురించి వినతిపత్రం అందజేశారు. కళాశాల సమస్యల గురించి ప్రస్తావించారు. సానుకూలంగా స్పందించిన ప్రిన్సిపల్ వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దూరవిద్య కోర్సుల ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ కడప ఎడ్యుకేషన్: యోగి వేమన యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీవోఈ) ద్వారా పలు కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి తెలిపారు. బుధ వారం ఆయన ప్రిన్సిపల్ ఎస్ రఘునాథరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. పద్మ తో కలిసి మాట్లాడారు. వైవీయూ గుర్తింపునిచ్చిన అధ్యయన కేంద్రాల్లో ఎంఏ ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, తెలు గు, ఎం కామ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. బ్యాచిలర్ డిగ్రీలో ఎకనామిక్స్ చదివిన వారికి మాత్రమే ఎంఏ ఎకనామిక్స్ లో ప్రవేశాలు ఉంటాయని అలానే బీకాం, బీబీఏ, బీబీఎం డిగ్రీ చేసిన వారు ఎంకామ్‌లో ప్రవేశాలకు అర్హులన్నారు. మిగిలిన అన్ని కోర్సులకు ఏదేని డిగ్రీ పాసైతె చాలన్నారు. ఈ ఏడాది నూతనంగా బ్యాచిలర్ ఆఫ్ ఫైనార్ట్స్ ( బీఎఫ్ ఏ ఆనర్స్) మ్యూజిక్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించామన్నారు. ఈ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్, సమాన అర్హత గల వారు ప్రవేశానికి అర్హులన్నారు. -
నాటు బాంబుల కేసులో నలుగురు బైండోవర్
పీలేరు రూరల్ : వేరుశనగ రక్షణ కోసం నాటు బాంబులు, విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన కేసులో నలుగురు నిందితులను బైండోవర్ చేసినట్లు సీఐ యుగంధర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అగ్రహారం పంచాయతీ ఎనుములవారిపల్లెకు చెందిన కౌలు రైతు గుట్టమీద వెంకటేశ్వర్రాజు ఒక ఎకరా వేరుశనగ సాగు చేశాడు. పంట రక్షణకు పొలం చుట్టూ విద్యుత్ తీగలతోపాటు నాటు బాంబులు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం అడవిపంది నాటుబాంబు పేలి మృతి చెందింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులకు అందిన సమాచారంతో ఎనుమలవారిపల్లెకు చెందిన గుట్టమీద వెంకటేశ్వర్రాజు, జయచంద్రారెడ్డి, ఎస్. భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్రాజులను బుధవారం స్థానిక తహసీల్దార్ భీమేశ్వర్రావు ఎదుట బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
వాతావరణ మార్పు.. మామిడి రైతు కుదుపు
పెనగలూరు : ఈ ఏడాది వాతావరణంలో మార్పుల వల్ల సంక్రాంతి వరకు వర్షాలు పడటంతో మామిడి రైతుల్లో ఆందోళన మొదలైంది. రైతులతోపాటు వ్యాపారుల్లో కూడా గుబులు పుట్టింది. మామిడి తోటలనే నమ్ముకొని జీవిస్తున్న రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నట్లు ఇప్పటికే తేలిపోయింది. మండలంలో 3992 ఎకరాలలో మామిడి సాగు చేస్తున్నారు. శివరాత్రికి పిందెలు పుట్టి ఉగాదికి ఊరగాయంత పచ్చడి కాయలు కావాల్సి ఉంది. కానీ నేటికీ మామిడి తోటల్లో పూత దశలోనే ఉండటంతో పిందె వస్తుందా రాదా అన్న సందేహంలో రైతులు ఉన్నారు. తోటల్లో పూత విపరీతంగా వచ్చింది. పూత వచ్చిందన్న ఆనందంలో రైతులు ఉన్నప్పటికీ ఇప్పటికే పూత మాడిపోతూ రాలిపోతోంది. ఇక పిందె వస్తుందా రాదా అన్న సందిగ్ధంలో రైతులు ఉన్నారు. కొంతమంది వ్యాపారులు పూత రాకముందే తోటలను కొనుగోలు చేశారు. గత సంవత్సరం మామిడి కాయలు కాయకపోవడంతో ఈ ఏడాది కాపు వస్తుందని ఇటు వ్యాపారులు, అటు రైతులు ఆనందంగా ఉండేవారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పూతను చూసి ఇప్పటికే మూడు, నాలుగుసార్లు మందును పిచికారీ చేశారు. రైతులు బయట అప్పులు తెచ్చుకోవాలన్నా, బ్యాంకు రుణాలు తీసుకోవాలన్నా మామిడి తోటలపైనే ఆధారపడుతున్నారు. పూతకు పిందెలు నిలబడి మంచి ఫలితం రావాలని రైతులు ఆశిస్తున్నారు. మూలిగే నక్కపై తాటికాయపడ్డట్టు.. మామిడి తోటలో కాపురాక పూతకు తగ్గ పిందె లేకపోవడంతో రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు తయారైంది. 2023లో కాపు అధికంగా రావడంతో ధరలు లేక టన్ను రూ. 6 వేలు నుంచి రూ. 7 వేలుకు రైతులు అమ్మకాలు చేశారు. 2024లో కాపు 20 శాతం కూడా రాకపోగా కొంతమంది రైతులకు ఎకరాలలో మామిడి తోటలు ఉన్నా కాయలు కాయని పరిస్థితి. గత మూడు సంవత్సరాలుగా మామిడి రైతులు నష్టాన్ని చవిచూస్తున్నారు. దీంతో మండలంలోని మామిడి రైతు పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయపడ్డట్టు తయారైంది. ఆలస్యంగా పూత రావడంతో రైతుల్లో గుబులు -
వాహనం ఢీకొని జింకపిల్ల మృతి
బి.కొత్తకోట : రోడ్డు దాటుతున్న మూడు నెలల వయసున్న జింక పిల్లను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందింది. ఈ సంఘటన బుధవారం బి.కొత్తకోట సమీపంలోని బాలసానివారిపల్లి వద్ద జరిగింది. జింకపిల్ల రోడ్డుపై గాయాలతో పడి ఉండగా స్థానికులు గుర్తించి పశువైద్యశాలకు తీసుకొచ్చారు. వైద్యులు విరిగిన కాలుకు కట్టుకట్టి మందులు తాపించారు. అయినప్పటికి మృతి చెందింది. అటవీశాఖ బీటు అధికారి ప్రకాష్ వివరాలను సేకరిస్తున్నారు. గిరిజనులపై దాడులు అరికట్టాలి రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లాలో గిరిజనులపై జరిగే దాడులను అరికట్టాలని ఏపీ బంజారా సంఘం జాతీయ అధ్యక్షుడు నాగేంద్రనాయక్ చౌహాన్ డిమాండ్ చేశారు. రాయచోటిలో బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోజు రోజుకు గిరిజనులపై దాడులు అధికమయ్యాయని తెలిపారు. గుర్రంకొండ, మదనపల్లెలలో కొంత మంది గుండాలు దాడులు చేసినా ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. చిన్నారి సంబంధీకులు స్పందించాలి రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లా ములకలచెరువు ఉమాశంకర్కాలనీ ఆదర్శ పాఠశాల వద్ద గుట్టలో వదిలేసి వెళ్లిన చిన్నారి సంబంధీకులు 30 రోజుల్లోగా తమను సంప్రదించాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ సాధికారత అధికారిణి పి.రమాదేవి తెలిపారు. బుధవారం ఆమె రాయచోటిలో మాట్లాడుతూ 3 నుంచి 5 రోజుల ఆడ శిశువును ములకలచెరువు ఆదర్శ పాఠశాల వద్ద వదిలి వెళ్లిపోయారన్నారు. ఆ చిన్నారి తమ సంరక్షణలో ఉందన్నారు. ఎవరూ స్పందించకుంటే ఈ పాపను అనాథగా ప్రకటించి, ప్రభుత్వ షరతులు, నియమాల ప్రకారం మరొకరికి దత్తత ఇస్తామన్నారు. కందిపంటకు నిప్పు పెద్దమండ్యం : గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 3 ఎకరాలలో ఓ రైతు సాగుచేసిన కందిపంట అగ్నికి ఆహుతైంది. మండలంలోని ఎన్ఓ పల్లె పంచాయతీ గౌనివారిపల్లెకు సమీపంలో ఈ ఘటన జరిగింది. రైతు కథనం మేరకు.. కలిచెర్ల పాతూరుకు చెందిన సయ్యద్ అలీ అక్బర్ తనకున్న 3 ఎకరాలలో కందిపంటను సాగు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కందిపంట మొత్తం కాలిపోయింది. ప్రత్యామ్నాయ పంటగా సాగుచేసిన కందిపంట చేతికి వచ్చే సమయంలో అగ్నికి ఆహుతి కావడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. రూ. 1 లక్ష నష్టం జరిగినట్లు తెలిపాడు. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా కాలిపోయిన పంటను వీఆర్ఓ పరిశీలించారు. -
జీతం బకాయిలను చెల్లించాలి
రాయచోటి అర్బన్ : కూటమి ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు 15 నెలలుగా జీతం బకాయిలను చెల్లించకుండా వేధిస్తోందని, వారికి వెంటనే జీతాలు చెల్లించి ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు డిమాండ్ చేశారు. బుధవారం ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులతో కలసి ఆయన డీఆర్ఓ మధుసూదన్‌ను కలసి సమస్యలపై విన్నవించారు. ఆయన మాట్లాడుతూ సకాలంలో జీతాలందకపోవడంతో ఉద్యోగుల కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఇబ్బందిగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు జీతాలు విడుదల చేయించాలని కోరారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సంఘం నాయకులు వెంకట్రామయ్య, క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ్లైయాష్ వ్యవహారంపై విచారణ ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో ఫ్లైయాష్ రవాణా వ్యవహారంపై ఏపీజెన్కో యాజమాన్యం రహస్యంగా విచారణ చేపట్టింది. గురువారం ఏపీజెన్కో నుంచి కొందరు అధికారులు విచారణ నిమిత్తం ఆర్టీపీపీకి వచ్చారు. గతంలో ఫ్లైయాష్ విషయంలో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలడంతో ముగ్గురు అధికారులపై వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఫ్లైయాష్ వ్యవహారంపై రహస్యంగా విచారణ చేపట్టడం ప్రాముఖ్యత సంతరించుకుంది. -
పదో తరగతి విద్యార్థినికి అస్వస్థత
గుర్రంకొండ : పదవ తరగతి ప రీక్షా కేంద్రంలో అందరిలాగే పరీ క్ష రాస్తున్న ఓ విద్యార్థిని అకస్మాత్తుగా అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిన సంఘటన బుధవారం అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో జరిగింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హుటాహుటిన 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేవలం ఒక గంట మాత్రమే హిందీ పరీక్ష రాసి విద్యార్థిని కుప్పకూలడం అందరిని కలచివేసింది. వివరాలు ఇలా ఉన్నా యి. గుర్రంకొండ ఉర్దూ జెడ్పీహైస్కూల్లో 178 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు. మండలంలోని ఎల్లుట్ల పంచాయతీ నల్లగుట్టపల్లెకు చెందిన కె. రామచంద్ర కుమార్తె కె. రజిత చెర్లోపల్లె జెడ్పీ హైస్కూల్లో పదవ తరగతి చదివి గుర్రంకొండ ఉర్దూ జెడ్పీ హైస్కూల్లోని పరీక్షా కేంద్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తోంది. బుధవారం అందరిలాగే రామచంద్ర తన కుమార్తెను గుర్రంకొండకు తీసుకొచ్చి పరీక్షా కేంద్రంలో వదిలి తాను అక్కడి పరిసరాల్లోనే ఉన్నాడు. హిందీ పరీక్షను విద్యార్థులు రాయడం ప్రారంభించిన గంట తరువాత పరీక్షా కేంద్రంలో విద్యార్థిని రజిత కుప్పకూలిపోయింది. గమనించిన ఉపాధ్యాయులు అక్కడే ఉన్న ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించారు. ఆరోగ్య సిబ్బంది విద్యార్థినికి చికిత్స చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో వైద్యాధికారి చైతన్య అక్కడికి చేరుకొని వైద్యసేవలు అందించారు. ఎంతకూ విద్యార్థిని కోలుకోకపోవడంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు తరలించాల్సిందిగా సూచించారు. ఎంఈఓ సురేంద్రబాబు, పరీక్షా కేంద్రం చీఫ్ రమణ 108 వాహనంలో విద్యార్థినిని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షా కేంద్రంలోనే కుప్పకూలిన వైనం -
బాలుడికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
నందలూరు : ‘మా బిడ్డను కాపాడండయ్యా’ శీర్షికన బుధవారం సాక్షిలో ప్రచురితమైన వార్తపై అధికారులు స్పందించారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ నాగిరెడ్డిపల్లి దళితవాడకు చెందిన నాయనపల్లి హరిప్రసాద్, స్వర్ణలత దంపతుల కుమారుడు నవీన్ తేజ (14) గుండె జబ్బుపై కథనం ప్రచురితమైన విషయం విదితమే. నందలూరు ప్రభుత్వ వైద్యాధికారులు శరత్ కమల్, కార్తీక్ విశ్వనాథ్, ఏఎన్ఎం నాగలక్ష్మీ బాధితుని ఇంటికి వెళ్లి నవీన్ తేజ తల్లిదండ్రులతో మాట్లాడారు. విషయాన్ని అన్నమయ్య జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్ లోకవర్దన్కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నవీన్ తేజను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు తరపున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు పంపించి అవసరమైన చికిత్స చేయిస్తామని వారు తెలిపారు. -
ఉపవాస దీక్ష.. ఆరోగ్య రక్ష
రాజంపేట టౌన్ : ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఆచరించే ఇస్లాం మార్గదర్శకాల్లో రంజాన్ ఉపవాసాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. రంజాన్ నెలలో 30 రోజుల పాటు కఠోర ఉపవాసాలు ఆచరించడంతో పాటు ఐదుపూటలా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. నెలవంక కనిపించిన మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యే రోజా (ఉపవాసాలు) షవ్వాల్ నెలవంక దర్శనంతో ముగుస్తాయి. ప్రతి ముస్లీం నమాజు చేయడంతో పాటు ఉపవాసాలు పాటించాలని ఇస్లాం సూచిస్తుంది. వేకువ జామునే ఉపవాస దీక్ష (సహర్) ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయమయ్యాక (ఇఫ్తార్) వరకు ఉపవాసం పాటిస్తారు. పగలంతా ఉపవాసం పాటించిన దీక్షాపరులు సాయంత్రం నిర్ణీత వేళలో తొలుత పండ్లు తిని దీక్ష విరమిస్తారు. ఉపవాసం విరమించే వారికి అనేక మంది వివిధ రకాల ఆహార పదార్థాలను ఇస్తుంటారు. అయితే రాజంపేట పట్టణం ఉస్మానగర్కు చెందిన షేక్ సాదిక్‌పాషా రంజాన్ మాసమంతా యాష్ (గంజి) పంపిణీ చేస్తారు. గంజికి విశేష ఆదరణ.. సాదిక్‌పాషా పంపిణీ చేసే గంజి రాజంపేట పట్టణంలో విశేష ఆదరణ పొందింది. అందువల్ల రోజా ఉండే ముస్లీంలే కాక ముస్లిమేతరులు కూడా గంజిని తీసుకెళతారు. దాదాపు 15 సంవత్సరాలుగా సాదిక్‌పాషా గంజిని పంపిణీ చేస్తున్నారు. రోజుకు పదివేల రూపాయల చొప్పున నెలకు మూడు లక్షల వరకు సాదిక్‌పాషా గంజికోసం ఖర్చు చేస్తారు. నిత్యం సాయంత్రం వేళల్లో గంజిని పంపిణీ చేస్తారు. పట్టంంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు దాదాపు ఐదు వందల మందికి పైగా గంజిని తీసుకెళుతుంటారు. పోషకాలకు నెలవురోజంతా ఉపవాసం ఉండటం వల్ల మనిషి శరీరం నీరసిస్తుంది. అందువల్ల సాదిక్‌పాషా అనేక పోషక పదార్థాలతో గంజిని తయారు చేయిస్తారు. ఇందులో ప్రధానంగా పెసరబేడలు, బార్లీ బియ్యం, కొబ్బరి, పుదీన, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు, లవంగాలు, దాల్చిన చెక్క వంటి పదార్థాలను గంజి తయారీలో ఉపయోగిస్తారు. దాదాపు నాలుగు గంటల పాటు కట్టెల పొయ్యి మీద బాగా ఉడికించి తయారు చేస్తారు. ఈ గంజి హలీం రుచికి ఏమాత్రం తీసిపోదని ముస్లీంలు చెబుతున్నారు. గంజి బలవర్థకమైన పానీయమని అందువల్ల ఉపవాస దీక్షాపరులకు గంజి వెంటనే శక్తిని ఇవ్వడమే కాక ఆరోగ్యానికి కూడా మంచిదని వారు పేర్కొంటున్నారు. ఉపవాస దీక్ష విరమించేవారికి ఉచితంగా గంజి పంపిణీ రంజాన్ మాసమంతా కొనసాగనున్న కార్యక్రమం రూ.3 లక్షలు సొంత డబ్బులు ఖర్చు చేస్తున్న షేక్ సాదిక్‌పాషా మొదటి నుంచి ఈ గంజి తాగుతున్నా ఉస్మాన్ నగర్లో పంపిణీ చేసే గంజిని నేను మొదటి నుంచి తాగుతున్నాను. ఎంతో రుచిగా ఉంటుంది. అందువల్ల మా ఇంట్లో వాళ్లు అందరు కూడా ఎంతో ఇష్టంగా గంజిని తాగుతారు. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారికి ఈ గంజి శక్తినిచ్చే ఔషధంగా పనిచేస్తుంది. – సయ్యద్ బాషా, రాజంపేట అల్లాహ్ కృపవల్లే.. దాదాపు 15 ఏళ్ల క్రితం ఇఫ్తార్ సమయంలో ఉపవాసం ఉండేవారికి గంజి పంపిణీ చేశాను. అప్పుడు గంజి తాగిన వారంతా ఎంతో రుచిగా ఉందన్నారు. మీరు ఎప్పుడైనా ఇఫ్తార్ సమయంలో ఆహారం పంపిణీ చేయాలనుకుంటే గంజినే పంపిణీ చేయమని ఉపవాసం ఉంటున్న వారు చెప్పారు. అల్లాహ్ నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఉపవాస సమయంలో అల్లాహ్ స్మరణలో ఉండేవారికి రోజూ గంజి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ప్రతి ఏడాది గంజి ఉచితంగా పంపిణీ చేస్తున్నా. ఇదంతా అల్లాహ్ కృపవల్లే జరుగుతోంది. – షేక్ సాదిక్‌పాషా, ఉస్మాన్ నగర్, రాజంపేట -
సస్యరక్షణ పాటిస్తే మంచి దిగుబడులు
రైల్వేకోడూరు అర్బన్ : మామిడి రైతులు సస్యరక్షణలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి రవిచంద్రబాబు బుధవారం పేర్కొన్నారు. స్థానిక అనంతరాజుపేట వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానంలో మామిడి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మామిడి పిందె నిలబడటంపై సస్యరక్షణ, మార్కెటింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడిలో అధిక దిగుబడులు పొందేందుకు సమగ్ర పోషణ, నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. అలాగే రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువులు వాడాలని సూచించారు. ప్రారంభ దశలో తేనెమంచు పురుగు నివారణకు వేపనూనె, అజాడిరెట్టీన్ జిగురు మందు అధికారుల సూచనల మేరకు పిచికారీ చేయాలన్నారు. మామిడి పిందెలు రాలుతున్నప్పుడు అధికారుల సూచనల మేరకు ప్లానోఫిక్ మందు 500 లీటర్లకు 100 ఎంఎల్ కలిపి పిచికారీ చేయాలన్నారు. మామిడి కాయలకు ఉపయోగించే కవర్లు సబ్సిడీతో అందిస్తున్నామని, కావాల్సిన రైతులు రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెగుళ్ల నివారణ శాస్త్రవేత్త సందీప్ నాయక్, రాజంపేట ఉద్యాన అధికారులు వెంకటభాస్కర్, సురేష్ బాబు, సుధాకర్, రైతులు పాల్గొన్నారు. -
రైల్వే మంత్రి దృష్టికి రైళ్ల హాల్టింగ్ సమస్య
రాజంపేట : రాజంపేట, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, నందలూరు తదితర రైల్వే స్టేషన్లలో రైళ్ల హాల్టింగ్స్ విషయాన్ని మంగళవారం రైల్వే మంత్రి అశ్వినిౖ వెష్ణవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో దేశ రాజధానికి వెళ్లే ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, తిరుపతి– కొల్హాపూర్ మధ్య నడిచే హరిప్రియ ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్టింగ్ సౌకర్యం త్వరగా కల్పించాలని కోరామన్నారు. అలాగే రైల్వేకోడూరులో హరిప్రియ, ఎంజీఆర్ చైన్నె ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్డింగ్ ఇవ్వాలన్నారు. జిల్లాలో రైల్వే పరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వే కేంద్రానికి పూర్వ వైభవం కల్పించాలన్నారు. తిరుపతి–హుబ్లీ ప్యాసింజర్ రైలును బ్రిటీష్ కాలం నాటి రెడ్డిపల్లె రైల్వే స్టేషన్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని కోరినట్లు తెలిపారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ పేర్కొన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి -
గిరిజన మహిళపై దాడి హేయమైన చర్య
మదనపల్లె : గిరిజన మహిళ అలివేలమ్మ పై జరిగిన దాడి హేయమైన చర్య అని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు తెలిపారు. అగ్రవర్ణాల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని సీపీఎం నాయకులు హరింద్రనాథ్ శర్మ, నాగరాజు, రాష్ట్ర గిరిజన సమాఖ్య వ్యవస్థాపకుడు కోనేటి దివాకర్, బాస్ నేత ముత్యాల మోహన్ లు మంగళవారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కన్వీనర్ పి. శ్రీనివాసులు మాట్లాడుతూ అలివేలమ్మ ఒకే కుటుంబం శీలంవారిపల్లిలో ఉంటోందన్నారు. ఆమెను అక్కడి నుంచి పంపించేయాలని దురుద్దేశంతో అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు అకారణంగా గొడవ పెట్టుకుని ఆమెను వివస్త్రను చేసి విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. దాడిని అడ్డుకోబోయిన కోడలు బాలింత అని కూడా చూడకుండా దాడి చేయడం దుర్మార్గమన్నారు. బాధిత మహిళకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు నిందితులను కాపాడేందుకు ప్రయత్నించడం ఏంటని ప్రశ్నించారు. గుర్రంకొండ ఎస్ఐను వెంటనే సస్పెండ్ చేసి డీఎస్పీ స్థాయి అధికారిని విచారణకు ఆదేశించాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ప్రజలపై చిన్నచూపు తగదని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆయన కూడా పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు. -
●క్లస్టర్‌తో ఉద్యోగుల కోత
రెండు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్‌గా చేస్తున్న ప్రభుత్వం సాంకేతిక విభాగం కింద పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒక క్లస్టర్ పరిధిలో రెండు సచివాలయాలు ఉంటే.. అందులో రెండు సచివాలయాల్లో పని చేస్తున్న సాధారణ పరిపాలన ఉద్యోగులు ఐదుగురు యథావిధిగా ఉంటారు. అయితే సాంకేతిక విభాగానికి చెందిన ఏడుగురు ఉద్యోగులు మాత్రమే విధుల్లో ఉండే అవకాశం ఉంటుంది. రెండు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఒక సచివాలయ ఉద్యోగులను తగ్గించి రెండు సచివాలయ బాధ్యతలను ఒక ఉద్యోగికి అప్పగించేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో ఒక సచివాలయానికి చెందిన ఏడుగురు ఉద్యోగులను బాధ్యతల నుంచి తప్పించినట్టవుతుంది. తద్వారా సచివాలయ వ్యవస్థకు జిల్లాలో 1,757 మంది ఉద్యోగులను దూరం చేసే అవకాశం ఉంది. ఈ ప్రభావం ప్రజలకు అందించే క్షేత్రస్థాయి సేవలపై తీవ్రప్రభావం చూపిస్తుంది. -
పుట్టిన రోజే.. ఆఖరి రోజు !
పెద్దతిప్పసముద్రం : పుట్టిన రోజే ఆ యువకుడికి ఆఖరి రోజు అవుతుందని కలలో కూడా ఊహించి ఉండడు. యువకుడితో పాటు అతని స్నేహితుడు సైతం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ దుర్ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంలో ఇంటికి బయలుదేరిన ఇద్దరు యువకులను మార్గమధ్యంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఓ యువకుడు చనిపోగా ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో మరో యువకుడు మృత్యువాత పడ్డాడు. దీంతో స్థానిక అంబేడ్కర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. కాలనీకి చెందిన సాదిలి చందూకుమార్ (20) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఇదే కాలనీకి చెందిన దండు శీనూ (21) ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం దండు శీనూ జన్మదినం కావడంతో వీరిద్దరూ పుట్టిన రోజు వేడుక సందర్భంగా బి.కొత్తకోటలో సెకండ్ షో సినిమా చూసేందుకు సోమవారం రాత్రి పీటీఎం నుంచి ద్విచక్ర వాహనంలో బయలు దేరారు. సినిమా చూసిన అనంతరం 12 గంటల తరువాత ద్విచక్ర వాహనంలో పీటీఎంకు వస్తున్నారు. ఈ క్రమంలో బి.కొత్తకోట రోడ్డులోని ఓ కోళ్ల ఫారం సమీపంలో గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని ఢీకొంది. దీంతో దండు శీనూ అక్కడికక్కడే మృతి చెందాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న మరో యువకుడు సాదిలి చందూను మదనల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలిస్తుండగా పీలేరు సమీపంలో మృతి చెందాడు. అయితే ఘటన స్థలం వద్ద ఓ అడవి పిల్లి మృతి చెంది ఉండటాన్ని బట్టి చూస్తే పిల్లిని తప్పించి వాహనాన్ని పక్కకు తిప్పి వెళుతుండగా ఎదురుగా వస్తున్న వాహనం యువకులను ఢీకొందా.. వెనుక నుంచి వాహనం ఢీకొని ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ హరిహర ప్రసాద్ మంగళవారం మృతదేహాలకు పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకువి.. కాటికి కాళ్లు చాపే వయసులో మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటావనుకుంటే ఇలా అర్ధంతరంగా వెళ్లిపోయావా నాయనా.. అంటూ సాదిలి చందూ తల్లిదండ్రులు విలపిస్తుంటే చూపరులు సైతం కంట తడి పెట్టారు. కాలనీలో ఇద్దరు యువకుల అకాల మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు యువకులను బలిగొన్న రోడ్డు ప్రమాదం పీటీఎం అంబేడ్కర్ కాలనీలో విషాద ఛాయలు -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
సిద్దవటం : మండలంలోని తురకపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న ఎల్లకూరి చంద్రశేఖర్‌రెడ్డి (36) అనే వ్యక్తి అప్పుల బాధతో మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దవటం మండలం చాముండేశ్వరిపేట గ్రామానికి చెందిన ఎల్లకూరి చంద్రశేఖర్‌రెడ్డి ఆరేళ్ల నుంచి కడపకు చెందిన తోట నాగార్జున తురకపల్లెలో నిర్మించిన వెంగమాంబ సిమెంటు ఇటుకల తయారీ కేంద్రంలో వాచ్మెన్, డ్రైవర్‌గా పనిచేసేవాడు. కడపకు చెందిన షేక్ షబానాను భర్త వదిలేయడంతో చంద్రశేఖర్‌రెడ్డి ఆమెను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇతను భార్య షేక్ షబానా, ఆమె మొదటి భర్త కుమారుడు మస్తాన్‌వలీతో కలిసి తురకపల్లిలో నివాసం ఉంటున్నాడు. మృతుడి యజమాని వద్ద రూ. 2లక్షలు అప్పు తీసుకున్నాడు. మంగళవారం ఉదయం బాత్రూమ్కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి ఎంతసేపటికి రాక పోవడంతో భార్య షబానా అక్కడికి వెళ్లి చూసింది. అయితే అప్పటికే చీరతో ఉరివేసుకుని ఉన్నాడు. వెంటనే ఆమె చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చి ఆమె కుమారుడి సాయంతో మృతదేహాన్ని కిందకు దింపారు. మృతుడి తల్లి మల్లేశ్వరమ్మ కుమారుడి మృతదేహాన్ని చూసి తన కుమారుడికి మద్యం తాగే అలవాటు ఉందని, భార్యతో గొడవ పడేవాడని తెలిపింది. ఈ సంఘటనపై విచారించి న్యాయం చేయాలని సిద్దవటం ఇన్చార్జి ఎస్ఐ శివప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ఉప రాష్ట్రపతిని కలిసిన రాజ్యసభ సభ్యుడు మేడా
రాజంపేట : ఉపరాష్ట్రపతి జగదీప్ధన్కర్ను రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి మర్యాదపూర్వకంగా మంగళవారం ఆయన చాంబరులో కలిశారు. తనను ఎథిక్స్‌కమిటీ సభ్యునిగా నామినేట్ చేసిన సందర్భంగా ఉపరాష్ట్రపతిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అక్కడ అదృశ్యం.. ఇక్కడ ప్రత్యక్షం కలకడ : కదిరాయచెర్వులో అదృశ్యమైన ద్విచక్రవాహనం పీలేరులో ప్రత్యక్షమైనట్లు వీఆర్ఓ పుల్లయ్య తెలిపారు. కలకడ మండలం కె.బాటవారిపల్లె సచివాలయంలో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న గుర్రంకొండ మండలం సరిమడుగుకు చెందిన పుల్లయ్య సోమవారం తన ద్విచక్రవాహనం హోండా ఆక్టివాను కదిరాయచెర్వు గ్రామంలో నిలిపి బస్సులో కలకడకు చేరుకున్నారు. సాయంత్రం విధులు ముగించుకుని తిరిగి కదిరాయచెర్వుకు చేరుకుని పరిశీలించగా తన ద్విచక్రవాహనం కనిపించలేదు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళవారం పీలేరులోని సంత ప్రదేశంలో ద్విచక్రవాహనాన్ని గుర్తించి బాధితుడికి అందజేశారు. నీటి సంపులో పడి బాలుడి మృతి మదనపల్లె : ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. చంద్రాకాలనీకి చెందిన రాజశేఖర్‌రెడ్డి, గీత దంపతులకు సాత్విక్‌రెడ్డి, చార్విక్‌రెడ్డి(5) ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం సాయంత్రం కాలనీలో నీటిసరఫరా జరుగుతున్న సమయంలో నీళ్లను పట్టుకునేందుకు తల్లి, నానమ్మ హడావిడిలో ఉండగా, ఇంటి ముందు ఆడుకుంటున్న చార్విక్‌రెడ్డి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని బయటకు తీసి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. కారు బోల్తా – ముగ్గురికి గాయాలు గుర్రంకొండ : కారు బోల్తా పడి ముగ్గురు గాయపడిన సంఘటన మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ సూరప్పగారిపల్లె వద్ద జరిగింది. మంగళవారం బెంగళూరుకు చెందిన నంజుండప్ప తమ కుటుంబంతో కలిసి కారులో రాయచోటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో సూరప్పగారిపల్లెకు సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు చేరుకోగానే అడ్డంగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో నంజుండప్పతోపాటు ప్రకాష్, హేమావతిలకు రక్తగాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కమనీయం...లక్ష్మీనరసింహుని కల్యాణం
గుర్రంకొండ : తరిగొండ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం స్వాతి నక్షత్రంతో పాటు స్వామివారి జన్మదినం కావడంతో టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణోత్సవం కనుల పండువగా జరిపారు. ఆలయంలో చలువ పందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లి వేదికను అందంగా అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి పాలతో క్షీరాభిషేకం చేశారు. రంగురంగుల పుష్పాలతో స్వామివార్లను అలంకరించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ముత్యాల తలంబ్రాలతో స్వామివారి పెళ్లివేడుక వైభవంగా నిర్వహించారు. రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ వారు పట్టువస్త్రాలు, కంకణాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. పెద్ద ఎత్తున భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, సిబ్బంది నాగరాజ, ఆలయ అర్చకులు కృష్ణరాజ బట్టార్, అనిల్ స్వామి, గోకుల్ స్వామి పాల్గొన్నారు. భార్య గర్భిణి.. మరో యువతితో భర్త పరారీ బి.కొత్తకోట : బి.కొత్తకోట పట్టణానికి చెందిన ఓ యువకుడు కట్టుకున్న భార్యను వదిలి మరో యువతితో వెళ్లిపోయిన ఉదంతంపై బాధితురాలు మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. భర్తపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. పట్టణానికి చెందిన డ్రైవర్ అనిల్‌కు ములకలచెరువు మండలానికి చెందిన 21 ఏళ్ల యువతితో గతేడాది ఆగస్టులో వివాహమైంది. పెద్దలు కుదిర్చిన ఈ వివాహం అనిల్ ఇంటివద్దే జరిగింది. రెండు నెలలపాటు వీరి సంసారం సజావుగా సాగింది. తర్వాత స్థానికురాలైన ఓ యువతితో అనిల్ సన్నిహితంగా ఉంటున్న విషయం గమనించి భార్య ప్రశ్నించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపో అంటూ తిట్టేవాడు. సర్దుకుపోతున్న భార్య గర్భం దాల్చగా ఇప్పుడు ఆరోనెల. ఈ పరిస్థితుల్లో భర్త అనిల్ ఈనెల 4న ఇంటినుంచి బయటకు వెళ్లగా పనికి వెళ్తున్నాడని అనుకున్నారు. అప్పటినుంచి ఇంటికి రాకపోవడంతో భార్య ఆందోళనకు గురైంది. అయితే భర్తతో సన్నిహితంగా ఉంటున్న యువతి ఇన్‌స్టాలో పెడుతున్న ఫొటోలు చూసి అసలు విషయం గుర్తించింది. దీనితో తన భర్త మరో యువతితో వెళ్లాడని, చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాయచోటి కేసులో 12 మందికి బెయిల్ కడప అర్బన్ : అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై మార్చి 9వ తేదీ పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు. కడప సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న 12 మంది మంగళవారం బెయిలుపై విడుదలయ్యారు. 9 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు మదనపల్లె : కులం పేరుతో దూషించి, దౌర్జన్యం చేసి దాడికి పాల్పడిన ఘటనలో తొమ్మిది మంది నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మండలంలోని మాలేపాడు పంచాయతీ నల్లరాజుగానిపల్లెకు చెందిన బి.మునివెంకటరమణ, (69) కు సంబంధించిన పొలాన్ని స్థానికులైన కొందరు ఆక్రమించుకున్నారు. ఈ విషయమై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో సోమవారం మునివెంకటరమణ పొలం వద్ద ఇల్లు నిర్మించుకునే ప్రయత్నం చేస్తుండగా, అదే గ్రామానికి చెందిన భూ ఆక్రమణకు పాల్పడిన మరో వర్గంలోని వ్యక్తులు ఆర్.బాలకృష్ణమనాయుడు, కాంతమ్మ, రవికాంత్నాయుడు, ఆదెమ్మ, శ్రీనివాసులునాయుడు, సోమశేఖర నాయుడు, సంజు, కృష్ణమూర్తిలు దౌర్జన్యం చేసి కులం పేరుతో దాడికి పాల్పడ్డారు. దాడి ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశ్రుతి ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల–తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ ఏర్పాట్లలో రామాలయం వెనుకవైపు ఉన్న అంగన్వాడీ కేంద్రం వద్ద 30 అడుగుల భారీ కటౌట్ ఏర్పాట్లలో భాగంగా పనిచేస్తున్న తిరుపతి టౌన్‌కు చెందిన ఎం. నరసింహ (50) అనే వ్యక్తికి మూర్ఛ రావడంతో 25 అడుగులపై నుంచి కిందపడ్డాడు. అదృష్టవశాత్తు పడినచోట ఎలాంటి రాళ్లు, గట్టినేల లేకపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తోటి కూలీలు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం తిరుపతికి తీసుకెళ్లారు. -
మా బిడ్డను కాపాడండయ్యా.!
నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ నాగిరెడ్డిపల్లి దళితవాడకు చెందిన నాయనపల్లి హరిప్రసాద్, స్వర్ణలత దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు నవీన్ తేజ (14) పుట్టిన కొన్ని రోజులకే తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాదులోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి గుండెలో రంధ్రం ఉందనడంతో ఆందోళన చెందారు. పది కిలోల బరువు ఉంటేనే శస్త్ర చికిత్స చేసేందుకు వీలవుతుందని చెప్పడంతో వెనక్కు వచ్చారు. తిరిగి ఏడేళ్ల అనంతరం నిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా గుండెలో రక్త ప్రసరణ సరిగా లేదని, ఊపిరితిత్తుల్లోకి రక్తం చేరుతుందని, అవయవాలు సైతం దెబ్బతిన్నాయని శస్త్ర చికిత్స చేయలేమని, చేసినా ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. దీంతో అప్పటి నుంచి కేవలం మందులతోనే నెట్టుకొస్తున్నారు. నవీన్ తేజ గత ఏడాది స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న సమయంలో తలనొప్పితో బాధపడుతూ కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేయగా మెదడులో కణతి ఉందని చికిత్స చేశారు. అయినా నాలుగు అడుగులు నడిచినా ఆయాసంతో పడిపోతున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలి పనులకు వెళితేనే గాని తమకు పూట గడవదని, అలాంటిది తమ కుమారుడి మందులకు నెలకు రూ. 6 వేలు వరకు ఖర్చు అవుతోందని వాపోతున్నారు. ఇప్పటి వరకు సుమారు పది లక్షల రూపాయల వరకు అప్పులు చేసి ఆసుపత్రుల చుట్టూ తిరిగామని, ప్రస్తుతం ఆర్థిక స్థోమత లేకపోవడంతో మందులుసైతం కొనలేని దుస్థితిలో ఉన్నామని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇటీవల తమ కుమార్తె ఆరోగ్యం కూడా బాగోలేదని ఆసుపత్రుల వెంట తిరుగుతూ కూలి పనులకు వెళ్లలేక వేదనతో బతుకీడుస్తున్నామని చెబుతున్నారు. దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించి తమ కుమారుడిని కాపాడాలని, ప్రభుత్వం పింఛను అందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అనారోగ్యంతో అల్లాడుతున్న బిడ్డను ఆదుకోవాలని వేడుకోలు మందులకు డబ్బులు లేక తల్లిదండ్రుల ఆవేదన -
రోడ్డు ప్రమాదంలో దుస్తుల వ్యాపారి దుర్మరణం
కురబలకోట ; కడప నగరంలోని జెడ్ఆర్ ఫ్యాషన్ వరల్డ్ నిర్వాహకుడు షేక్ జహీర్ (28) మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో జరిగిన ఈ విషాదకర సంఘటనకు సంబంధించి ముదివేడు ఎస్ఐ దిలీప్‌కుమార్ కథనం మేరకు.. కడప నగరానికి చెందిన జహీర్ రెండేళ్లుగా కడపలో జెడ్ఆర్ ఫ్యాషన్ వరల్డ్ పేరిట రెడీమేడ్ దుస్తుల షాపు నిర్వహిస్తున్నాడు. గతంలో ట్రావెల్స్‌లో పనిచేసేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు సంతానం. భార్య ప్రస్తుతం గర్భిణి. రంజాన్ సందర్భంగా విక్రయానికి అవసరమైన దుస్తులు కొనుగోలు చేసేందుకు తమ్ముడు షమీర్ (26)తో కలిసి షేక్ జహీర్ కారులో బెంగళూరు బయలుదేరాడు. తనే కారు నడుపుకుంటూ వస్తుండగా కురబలకోట మండలంలోని మధ్యాహ్నంవారిపల్లె–రామిగానిపల్లె మధ్యలో మదనపల్లె–2 డిపోకు చెందిన గాలివీడు ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చింది. ప్రమాదవశాత్తు బస్సును కారు ఢీకొంది. ఈ సంఘటనలో జహీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తమ్ముడు షమీర్ కారులో వెనుక సీట్లో ఉండడంతో గాయాలతో బయటపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం జహీర్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడిపైనే కేసు.! ఇదిలా ఉండగా ప్రమాదానికి మృతుడు జహీర్ కారణమని కేసు నమోదు చేయాల్సి వచ్చిందని ముదివేడు ఎస్ఐ దిలీప్‌కుమార్ తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్న జహీర్ కారును నిద్రమత్తులో అదుపు చేయలేక వేగంగా బస్సును ఢీ కొట్టడం వల్లే ఈ సంఘటన జరిగినట్లు అటు విచారణలోను ఇటు సంఘటన స్థల పరిశీలనలోను వెల్లడైందన్నారు. చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం ఇదేమి.. విచిత్రం స్వామీ అంటూ పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. మృతుడి స్వస్థలం కడప బెంగళూరుకు వెళుతుండగా దుర్ఘటన -
బరితెగించిన టీడీపీ రౌడీ మూకలు
రామాపురం: వైఎస్సార్సీపీ వర్గీయులను చిల్లర కొట్టు దగ్గర కూర్చోబెట్టుకోవడమే.. వికలత్వం కలిగిన వృద్ధుడు డేరంగుల వెంకటరమణ (74) చేసిన తప్పు. పర్యవసానంగా స్థానికంగా ఉన్న టీడీపీ రౌడీ మూకలు.. చిల్లర బంకే జీవనాధారంగా, నడవలేని స్థితిలో జీవనం సాగిస్తున్న అతనిపై కక్ష కట్టారు. ఎన్నికల తర్వాత ఒకటి కాదు, రెండు కాదు, మూడు పర్యాయాలు.. ఆ బంకుపైకి దాడికి తెగబడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కొంత మంది టీడీపీ రౌడీ మూకలు.. అతనితోపాటు బంకుపై దాడి చేశారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సురకవాండ్లపల్లిలో 74 ఏళ్ల వృద్ధుడు డేరంగుల వెంకటరమణ వేరే జీవనాధారం లేక.. చిల్లర కొట్టు దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని స్వయం శక్తితో జీవనం సాగిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. గ్రామంలోనీ వైఎస్సార్సీపీకి చెందిన కొంత మంది వర్గీయులను బంకు దగ్గర కూర్చోబెట్టుకోవడం అతను చేసిన పాపంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. స్థానికంగా ఉన్న అధికార పార్టీకి చెందిన కొంత మంది నాయకులు అతనిపై కక్ష కట్టారు. 40 ఏళ్లుగా వున్న బంకును తొలగించాలని ఆరు నెలల నుంచి వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో అతను ఇటీవల జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించడంతో తహసీల్దార్ ద్వారా విచారణ చేసి.. న్యాయం చేశారని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం అర్ధరాత్రి ఆటోలలో వచ్చి తమపై దాడి చేసి బంకు పేకిలించే ప్రయత్నం చేశారని, బంకులోని సామగ్రిని బయటపడేసి, అరుగు బండలను ధ్వంసం చేశారని ఎస్పీకి అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలతో కలిసి వృద్ధుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వృద్ధ వికలాంగుడిపై దాడి అతని జీవనాధారం చిల్లర బంకు ధ్వంసం వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు అంగడి దగ్గర కూర్చుంటున్నారని కక్ష బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు -
రోడ్డుపై నిర్మించిన గోడ తొలగింపు
మదనపల్లె : పట్టణంలోని నక్కలదిన్నెలో రోడ్డుకు అడ్డంగా కొందరు వ్యక్తులు నిర్మించిన గోడను మంగళవారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. నక్కలదిన్నె తండాలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు వీధిలో ఇతరులు రాకపోకలు సాగించకుండా అడ్డుగా గోడను నిర్మించారు. దీనిపై ఇంకో వర్గానికి చెందిన వ్యక్తులు మున్సిపల్ కార్యాలయం, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశాల మేరకు, మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీల ఆధ్వర్యంలో టీపీఓ జకీరాబేగం పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది పోలీస్ బందోబస్తు మధ్య గోడను తొలగించారు. తొలగింపు సందర్భంగా ఎలాంటి గొడవలు, ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. -
వేగంగా భూముల రీ సర్వే
కలికిరి(వాల్మీకిపురం): భూముల రీ సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు శ్రీధర్ ఛామకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వాల్మీకిపురం మండల పరిధిలోని బూడిదవేడు గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన రీ సర్వే ప్రక్రియను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. జనవరి 20 నుంచి గ్రామంలో రీ సర్వే ప్రక్రియ ప్రారంభించామని, ఇప్పటి వరకు వెయ్యి ఎకరాలకు పైగా పూర్తి చేసినట్లు తహసీల్దారు పామిలేటి కలెక్టరుకు వివరించారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా రైతుల సమక్షంలోనే సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, పట్టా భూములు తదితరాలను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో మండల సర్వేయరు, వీఆర్ఓలు పాల్గొన్నారు. నిర్దేశించిన లక్ష్యం సాధించాలి గుర్రంకొండ: అధికారులు, సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రగతి సాధించాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో ఏ గ్రామంలో సర్వే చేస్తు న్నారు, ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, అందులో డ్రైల్యాండ్, వెట్‌ల్యాండ్ ఎంత మేరకు విస్తీర్ణంలో ఉన్నాయో ఆరా తీశారు. సదరు గ్రామంలో రీసర్వే ఎప్పుడు చేపట్టారు, ఎన్ని టీములు సర్వే చేస్తున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల్లో పూర్తి చేశారు, ఇంకా ఎంత మేరకు పెండింగ్‌లో ఉంది అనే వివరాలను తహసీల్దార్, మండల సర్వేయర్‌ను అడిగి తెలుసుకొన్నారు. మండలంలోని టి.పసలవాండ్లపల్లెలో రీసర్వే ప్రక్రియ జరుగుతోందని, గ్రామాన్ని 11 బ్లాకులూగా విభజించి 3356 ఎకరాలు సర్వే చేస్తున్నామని తహసీల్దార్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, సర్వేయర్ కిరణ్మయి, వీఆర్వోలు పాల్గోన్నారు. కలెక్టరు శ్రీధర్ ఛామకూరి -
వైఎస్సార్సీపీ పాలన ముద్ర.. రాష్ట్రంపై చిరకాలం ఉండరాదని కూటమి కక్ష కట్టింది. ఇందుకోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానస పుత్రిక అయిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. వీటి ద్వారా జనానికి అందించే సేవల్లో కోత విధించింది. తాజాగా ర
బి.కొత్తకోట: మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన దిశగా గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థపై.. కూటమి ప్రభుత్వం కక్ష కడుతోంది. ప్రజలకు మంచి చేయాలన్న సమున్నత ఆశయంతో అమలు చేసిన సచివాలయ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేలా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై ఆదేశాలు ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో కార్యాచరణ మొదలైంది. ఫలితంగా ప్రజల ముంగిటకు పాలనను తీసుకొచ్చి.. వందల సంఖ్యలో ప్రభుత్వ సేవలు అందించిన సచివాలయాలను నిర్వీర్యం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. వలంటీర్ల వ్యవస్థను అటకెక్కించిన ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ సర్కారు ప్రజల కోసం తీసుకొచ్చిన కార్యక్రమాలను ఒక్కొక్కటిగా దూరం చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో.. జిల్లాలో ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక సచివాలయం ఉండేలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరింది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాలు, 30 మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో 502 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ప్రజలకు కలిగిన ప్రయోజనం అంతా ఇంతా కాదు. ప్రతి పనికి మండల కేంద్రానికి రావాల్సిన అవసరం తప్పింది. ఎక్కడికక్కడ సేవలు పొందే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రజలకు ప్రయాణ భారం, సమయం వృథా తప్పింది. అందులోనూ మండల కేంద్రంలోని కార్యాలయాలకు వెళ్తే అధికారులు అందుబాటులో లేకుంటే మళ్లీ వెళ్లాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం దూరం చేసింది. కొత్తగా క్లస్టర్లు జిల్లా సచివాలయ వ్యవస్థను క్లస్టర్లుగా మార్చేందుకు చర్యలను అధికారులు చేపట్టారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి రెండు సచివాలయాలను ఒక క్లస్టర్‌గా చేస్తున్నారు. వీటికి మ్యాపింగ్ కూడా చేస్తున్నారు. అంటే 502 సచివాలయాలను 251 క్లస్టర్లుగా మార్చుతారు. ప్రస్తుతం ఒక్కో సచివాలయంలో సాంకేతిక విభాగానికి చెందిన ఉద్యోగులు గ్రామ రెవెన్యూ అధికారి, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, వ్యవసాయ (అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్), పశుసంవర్ధక (వెటర్నరీ, ఫిషరీష్), ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగులు ఏడుగురు, సాధారణ పరిపాలనకు సంబంధించి పంచాయతీ కార్యదర్శి–గ్రేడ్ 1–5, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, గ్రామ మహిళ పోలీసు ఉద్యోగులు ఐదుగురు ఉంటారు. ఒక్కో సచివాలయానికి మొత్తం 11 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోప్రజల ముంగిటకే సేవలు జిల్లాలో 502 సచివాలయాల ఏర్పాటు కొత్తగా రెండింటిని కలిపి ఒక క్లస్టర్‌గా మ్యాపింగ్ సాంకేతిక సిబ్బంది కుదింపు 1,757 మందిని తొలగించే అవకాశం ఇప్పటికే 372 సేవల తొలగింపు -
జెడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
కడప సెవెన్‌రోడ్స్: కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 23న జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు ఉద్దేశించిన ప్రత్యేక సమావేశం ఏర్పాటు కోసం నోటీసు జారీ చేస్తారు. ఈ నోటీసు జెడ్పీ సభ్యులందరికీ అధికారులు అందజేయాల్సి ఉంటుంది. ఈనెల 27వ తేది ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఆరోజు ఉదయం 10 గంటల ముందు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 12.00 గంటల్లోపు స్క్రూటినీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అర్హతగల నామినేషన్ల జాబితా విడుదల చేస్తారు. 1 గంటవరకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. ఆపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. సమావేశం ముగిసిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. ఏదైనా కారణాల వల్ల ఆరోజు ఎన్నిక జరగకపోతే మరుసటిరోజు ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఉమ్మడి కడపజిల్లాలోని ఖాజీపేట, ఒంటిమిట్ట, రాయచోటి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన ఆకేపాటి అమర్నాథరెడ్డి రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున గెలుపొందడంతో ఈ ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం ఇన్చార్జి చైర్ పర్సన్‌గా జేష్ఠాది శారద వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో జిల్లా పరిషత్‌కు కొత్త అధ్యక్షుడు ఎన్నిక కానుంది. -
దరఖాస్తుల ఆహ్వానం
రాయచోటి జగదాంబసెంటర్: అన్నమయ్య జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సర ప్రవేశానికి గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖా ధికారి కె.సుబ్రమణ్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి మే 22లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ఆసక్తి గల విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ముగిసిన నామినేషన్ల పర్వం రాజంపేట: రాజంపేట బార్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నామినేషన్ల పర్వం ముగిసింది. బుధవారం నామినేషన్ల స్క్రూట్నీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సీఈవో సురేష్‌కుమార్ నేతృత్వంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. కాగా రెండవ రోజు కృష్ణకుమార్ తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. హనుమంతనాయుడు, కృష్ణకుమార్ ప్యానల్ల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. 29న న్యాయవాదుల సంఘం ఎన్నికలు రాయచోటి అర్బన్: ఏపీ బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈ నెల 29న రాయచోటి బార్ అసోసియేషన్‌కు సాధారణ ఎన్నికలు జరిగేలా రాయచోటి బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించినట్లు అధ్యక్షుడు ఎన్.ప్రభాకరరెడ్డి, కార్యదర్శి పి.రెడ్డెయ్య తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సీనియర్ న్యాయవాది రాజకుమార్‌రాజు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా ఇలియాస్ బాషాను ఎగ్జిక్యూటివ్ కమిటీ నియమించిందన్నారు. ఈ నెల 20, 21, 22 తేదీలలో నామినేషన్లు దాఖలు చేయవచ్చునని పేర్కొన్నారు. 24న ఽనామినేషన్ల పరిశీలన, 25న ఉపసంహరణకు సమయం ఉంటుందన్నారు. 29న పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ మేరకు ఎన్నికల అధికారి రాజకుమార్‌రాజు నోటిఫికేషన్ విడుదల చేశారు. మెరుగైన పరిహారం ఇవ్వాలి గాలివీడు: భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మండల పరిధి తూముకుంట గ్రామ పంచాయతీలోని దిగువమూలపల్లిలో సీపీఎం మంగళవారం రైతులతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో దాదాపు 60 కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరికి 40 ఏళ్ల నుంచి సాగులో ఉన్న భూమిని సోలార్ ప్రాజెక్టు పేరుతో తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడిందని తెలిపారు. అయితే వీరికి 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూములు తీసుకోవాలని పేర్కొన్నారు. భూమికి భూమి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇంటికి ఒక ఉద్యోగం, పునరావాసం తదితరాలు ప్రభుత్వాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. సర్వేయర్ సస్పెన్షన్ బి.కొత్తకోట: పీటీఎం మండలం టీ.సదుం సచివాలయంలో సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజేంద్రను సస్పెన్షన్ చేస్తూ జిల్లా సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం పంచాయతీలో జరిగిన భూముల వ్యవహరంపై తహసీల్దార్ అజారుద్దీన్, సర్వే డెప్యూటీ ఇన్స్పెక్టర్ పంపిన నివేదికల ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. గుమ్మసముద్రం పంచాయతీలో జరిగిన భూముల రీసర్వేలో రాజేంద్ర పని చేశారు. గండువారిపల్లె గ్రామానికి చెందిన భూముల విషయంలో అన్ని సర్వే నంబర్లు జాయింటు భాగాలు, విస్తీర్ణంలో తేడాలు వేయడం, ప్రభుత్వ భూమిని తల్లిపేరుతో ఆన్లైన్ చేయించుకోవడంపై గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. గండువారిపల్లె సచివాలయంలో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై విచారణ చేసిన అధికారులు వేర్వేరుగా నివేదికలను పంపగా చర్యలు తీసుకున్నారు. దీనిపై మంగళవారం తహసీల్దార్ అజారుద్దీన్ మాట్లాడుతూ రాజేంద్రను సస్పెన్షన్ చేయడంతోపాటు ఆరోపణలపై సమగ్ర విచారణకు సర్వే డెప్యూటీ ఇన్స్పెక్టర్ను అధికారులు నియమించారని చెప్పారు. -
తండ్రి మరణంలోనూ కుమార్తెకు ‘పరీక్ష’!
అన్నమయ్య జిల్లా: తండ్రి మరణించడంతో పుట్టెడు దుఃంఖంలోనూ ఆ విద్యార్థిని పది పరీక్షలకు హాజరైంది. అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం కందుకూరు పంచాయతీ గొడుగు వారి పల్లికి చెందిన కొత్తోళ్ల వెంకట్రమణ(55) ఆదివారం చింతచెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు విడిచాడు. ఆయన భార్య పదేశ్ల కిందటే అదృశ్యమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు గణేష్, కుమార్తె గిరిజ. అయితే దుఃఖాన్ని దిగమింగుకుని గిరిజ సోమవారం పదో తరగతి పరీక్షలకు హాజరైంది. పరీక్షల అనంతరం తండ్రి కడచూపు కోసం కన్నీటితో ఇంటికి వెళ్లింది. మద్యం మత్తులో ఎంఈవో!ఓ వైపు పదో తరగతి పరీక్షలు జరుగుతున్నా ఆ ఎంఈవో మాత్రం మద్యం మత్తులో మునిగితేలుతున్నాడు. శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లా ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం శివనాగేశ్వరరావు ఉలవపాడు–1 ఎంఈవోగా ఉన్నారు. ఆయన సోమవారం వి«ధి నిర్వహణలో ఉండగానే యథేచ్ఛగా మద్యం తాగారు. ఉదయం 9.30 నుంచి స్థానికంగా ఉన్న బ్రాందీషాపు పక్కనే ఉన్న దుకాణం వద్ద కూర్చుని దాదాపు గంట సేపు మద్యం తాగారు. అంతేకాదు.. రాత్రి వేళల్లో ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే నివాసం ఉంటూ.. రాత్రివేళ పాఠశాలలో సైతం మద్యం తాగుతుంటారని స్థానికులు, విద్యార్థులు చెబుతున్నారు. అదేమంటే.. తనకు మంత్రి అనగాని సత్యప్రసాద్ మిత్రుడని.. చెబుతుండటంతో ఫిర్యాదు చేసేందుకు ఉపాధ్యాయులు, చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సైతం వెనుకాడుతున్నారు. -
● భూమి ఆన్లైన్ చేయరూ..
పుల్లంపేట మండలం గొల్లపల్లె రంగంపల్లె. నాపేరు బూసిరెడ్డి ఆదిలక్షుమ్మ. నాకొడుకు రెడ్డయ్యరెడ్డికి నాకు సంబంధించిన ఎకరాన్నర భూమిని రాయిచ్చాను. అయితే 172/3లో 26 సెంట్లు ఆన్‌లైన్‌లోకి ఎక్కలేదు. మ్యుటేషన్ చేయిస్తామనుకుంటే కంప్యూటర్ తీసుకోవడం లేదని సారోళ్లు చెబుతున్నారు. ఆరేడు నెలల నుంచి సచివాలయానికి, తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగుతున్నా. నాపని మాత్రం కావడం లేదు. ఈ వయస్సులో ఎండలకు ఆఫీసుల చుట్టూ తిరగాలంటే అయ్యేపనేనా అయ్యా. ఏమైనా సమస్య ఉంటే ఇదోమ్మా ఈ సమస్య ఉంది అందువల్ల నీపని కాదు అని చెప్పొచ్చు కదా. ఎకరాన్నర భూమిలో 26 సెంట్లు మాత్రమే ఎందుకు ఆన్లైన్ చెయ్యరు. -
తొలి రోజు ప్రశాంతం
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పరీక్షలు మొదటి రోజున ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన పరీక్షలు మధ్యాహ్నం 12.30 వరకు జరిగాయి. జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు. జిల్లాలో జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 22, 296 మందికి గాను 21,711 మంది హాజరు కాగా.. 530 మంది గైర్హాజరైనట్లు డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. పరీక్షలకు 97.62 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. తెలుగుకు బదులుగా హిందీ పేపర్ పదోతరగతి పరీక్షలలో ముగ్గురు విద్యార్థులకు హాల్ టికెట్లు ముద్రణలో తెలుగు సబ్జెక్టుకు బదులు హిందీ సబ్జెక్టు ముద్రణ కావడంతో.. జిల్లాలోని మూడు సెంటర్లలో కొద్దిసేపు హైరానా నెలకొంది. హిందీ ప్రశ్నాపత్రాన్ని అందుకున్న ఆ విద్యార్థులు తొలుత ఆందోళనకు గురయ్యారు. విద్యార్థుల ఆవేదన, హాల్‌టికెట్టు పరిస్థితులను స్థానిక పరీక్ష నిర్వహణ అధికారి జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం అందించారు. ముద్రణలో పొరపాటు జరిగి ఉంటుందని, వెంటనే వారికి తెలుగు ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడంతో.. కొన్ని నిమిషాల వ్యవధిలో సమస్యకు పరిష్కారం లభించింది. ఈ పరిస్థితి జిల్లాలోని మూడు ప్రాంతాలలో నెలకొనడంతో సమస్యకు పరిష్కారం చూపామని డీఈఓ తెలిపారు. కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు పదో తరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టంగా భద్రాతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పోలీసులు పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. రాయచోటి టౌన్ నేతాజీ సర్కిల్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి.. డీఈఓ డాక్టర్ కె. సుబ్రమణ్యంతో కలిసి సందర్శించారు. అనంతరం మాసాపేట జిల్లా పరిషత్ హైస్కూల్, లక్కిరెడ్డిపల్లి మోడల్ స్కూల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల చుట్టూ ఉన్న పరిసరాలు, పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్రారంభమైన పది పరీక్షలు 97.62 శాతం విద్యార్థుల హాజరు -
● దేవుడా.. ఇదేం ‘పరీక్ష’
బి.కొత్తకోట : బి.కొత్తకోటలో పదవ తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడి కాలు కదపలేని స్థితిలో మంచంపై పరీక్షా కేంద్రానికి హాజరైన ఉదంతం ఇది. సోమవారం పదవ తరగతి పరీక్షలు ప్రారంభమై మొదటి రోజు తెలుగు పరీక్ష నిర్వహించారు. మండలలోని ఆకులవారిపల్లెకు చెందిన లహిత్‌కుమార్‌రెడ్డి గట్టు జెడ్పీ హైస్కూల్లో పదవ తరగతి పూర్తి చేయగా స్థానిక మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలో పరీక్షలకు హజరుకావాల్సి వుంది. ఆయితే విద్యార్థి లహిత్‌కుమార్‌రెడ్డి శనివారం బైక్‌పై ఆకులవారిపల్లె నుంచి గట్టుకు వస్తుండగా హైస్కూల్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు. కుడి కాలుకు తీవ్ర గాయాలు కావడంతో కాలంతా కట్టు కట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి పరీక్షలు రాయాల్సి ఉండటంతో కుటుంబ సభ్యులు కారులో స్కూల్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి పరీక్షా కేంద్రంలోకి మోసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో మంచంపై తీసుకెళ్లారు. విద్యార్థి పరిస్థితి గమనించిన నిర్వాహకులు ఉపాధ్యాయుల విశ్రాంతి గదిలో పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. అయితే రాసేందుకు వీలుకావడం లేదని చెప్పడంతో ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని సహాయంగా నియమించడంతో లహిత్‌కుమార్‌రెడ్డి పరీక్ష పూర్తి చేశాడు. -
చేదెక్కిన చెరకు
చెరకు సాగు చేసిన రైతుల బతుకు చేదెక్కుతోంది. షుగర్ ఫ్యాక్టరీల మూసివేతతో దిగుబడిని విక్రయించుకోవడానికి వారు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. మద్దతు ధర ప్రకటనలో ప్రభుత్వ ప్రోత్సాహం కరువు అవుతోంది. దీంతో చాలా మంది ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. పర్యవసానంగా జిల్లాలో చెరకు సాగు గణనీయంగా తగ్గిపోయింది. అమ్ముకునే వెసులుబాటు కల్పించాలి ఆరుగాలం కష్టపడి పండించిన చెరుకును అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. చెరుకు విక్రయాలపై ఎకై ్సజ్ అధికారుల తీరు మారాలి. ప్రభుత్వం నల్లబెల్లం తయారీని అమ్ముకునే వెసులుబాటు కల్పించాలి. చెరకు పంటకు మార్కెట్ సౌకర్యం కల్పించి, గిట్టుబాటు ధర కల్పించాలి. అప్పుడే రైతులు చెరుకు సాగు చేయగలరు. – రెడ్డిబాషా, రైతు, కొత్త కురవపల్లె, తంబళ్లపల్లె మండలం పలు సమస్యలతోనే అనాసక్తి ఒకప్పుడు.. చెరుకు పంట దీర్ఘకాలికమైనా నికరమైన ఆదాయం వచ్చేది. ఇప్పుడు పలు సమస్యలు తలెత్తడంతో రైతులు చెరకు సాగుపై ఆసక్తి చూపడం లేదు. పక్క జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూతపడటం, మార్కెట్ సౌకర్యాలు లేకపోవడం, బెల్లం తయారీ సమయంలో కూలీల సమస్యతో రైతులు చెరుకు సాగును చేయలేకపోతున్నారు. – రమణకుమార్, వ్యవసాయ అధికారి, తంబళ్లపల్లె ఎలుకలు ఉన్నాయని ఇంటినే తగలేసిన చందంగా తయారైంది.. ఎకై ్సజ్ అధికారుల తీరు. సారా తయారీకే బెల్లం వినియోగిస్తున్నారని భావిస్తే.. కచ్చితంగా అలాంటి వ్యాపారులపై చర్యలకు ఉపక్రమించాలి. కానీ పిండి వంటలు, ఇతర గృహ అవసరాలకు ఉపయోగపడే బెల్లాన్ని పూర్తిగా వద్దనడంపై విమర్శలు వస్తున్నాయి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయినా గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉన్నాయి. మరో వైపు ప్రభుత్వమే అధికారికంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తోంది. ఆరోగ్యానికి మేలు కలిగించే బెల్లం అమ్మకాలపై మాత్రం నిషేధం విధించింది. ఒకప్పుడు బెల్లం తయారీకి నియోజకవర్గం ప్రసిద్ధి. ఇక్కడ పండించే బెల్లం ముంబయి, చైన్నె, గుజరాత్ రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అనంతపురం, వైఎస్సార్ జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి వ్యాపారులు పల్లెల్లో ముమ్మరంగా తిరిగి కొనుగోలు చేసి తీసుకెళ్లే వారు. ఎకై ్సజ్ అధికారుల తీరుపై విమర్శలు -
● నా పేరుతో ఇల్లు.. బిల్లులు ఎవరికో ఇచ్చి..
నా పేరు జి.రామక్క. నా పేరుతో గత ప్రభుత్వం ఇల్లు నిర్మించుకునేందుకు మంజూరు చేసింది. అయితే స్థోమత లేక అప్పట్లో ఇల్లు కట్టుకోలేదు. ఇప్పుడు ఇల్లు కట్టుకొందామని అధికారుల దగ్గరకు వెళ్లి అడిగితే.. ఎప్పుడో ఇల్లు కట్టుకున్నానని దానికి బిల్లులు కూడా తీసుకున్నావని చెప్పుతున్నారు. నా బ్యాంక్ పాస్ బుక్, రికార్డులు తీసుకెళ్లి చూస్తే బిల్లులు పడినట్లు లేదు. మళ్లీ అడిగితే మళ్లీ అదే సమాధానం, ఎవరికి వేశారో రికార్డులు చూపాలని కోరితే నా పేరు జి.రామక్క అయితే.. సీ రామక్క అనే పేరుతో బిల్లులు వేసినట్లు రికార్డులు చూపెట్టారు. అయితే ఆమె ఎక్కడుందో చెప్పితే ఆమె దగ్గరకు వెళ్లి అడుగుతానని కోరితే.. ఎక్కడుందో వారికి తెలియదంటా. అది నేనే తెలుసుకొని వారి దగ్గరికి తీసుకెళ్లాలంట. ఆమె ఎవరో ఏ జిల్లాలో ఉందో నాకెలా తెలుస్తుంది. బిల్లులు ఇచ్చిన అధికారులకు వారి ఇచ్చిన పేపర్ల ఆధారంగా చూడొచ్చు కదా.. డబ్బులు వాళ్లు ఇచ్చి.. ఆమె ఎవరో నేను తెలుసుకొని తీసుకురమ్మంటున్నారు. -
● ఇక ఎవరికి చెప్పుకోవాలో..
‘నాపేరు జగన్నాథ అరుణ్‌బాబు. మాఊరు కలికిరి నూర్ కాలనీ. నాకు రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మాతల్లి చనిపోయింది. నేను పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. మాలాంటి వికలాంగులకు న్యాయం జరగాలంటే ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ప్రజావేదికలో అర్జీ ఇచ్చేందుకు వచ్చాను. సార్..సార్.. నాకు పింఛన్ ఇప్పించండి’ అని అక్కడికి వచ్చిన అధికారులను అరుణ్ బాబు ప్రాథేయపడుతున్నా.. ఫలితం దక్కడం లేదు. ● పెన్షన్ ఇవ్వండి మహాప్రభో.. నాపేరు వీభద్రాచారి. మా ఊరు పీలేరు బాలమారుపల్లె. నా వయసు 65 సంవత్సరాలు. నాకు కళ్లు సరిగా కనపడవు. ఆసుపత్రికి వెళ్లి ఒక కన్నుకు వైద్యం చేయించుకున్నాను. నాకు ఏ ఆధారము లేదు. సంబంధిత పత్రాల కోసం అధికారుల చుట్టూ తిరగాను. సార్.. ఇప్పటికై నా నాకు పింఛన్ మంజూరు చేయాలి. -
● మానవత్వంతోనైనా న్యాయం చేస్తారని..
నా పేరు టి.నందిని, మేము మండల కేంద్రమైన గాలివీడు టౌన్ చిలకలూరిపేటలో నివసిస్తున్నాం. 2024 నవంబర్ ఆరో తేదీన నా భర్త హరినాథ్ పక్కిరవాండ్లపల్లి సమీపంలో మామిడి తోటలో ట్రాక్టర్ మిల్లరులో పడి మృతి చెందాడు. దీనికి కారణమైన వారు అరవిటి వాండ్లపల్లిలో ఉన్నారు. దాదాపు 5 నెలలు కావస్తున్నా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నేను నా పిల్లలు కలిసి చనిపోవడానికి సిద్ధమవుతున్నాము. మా కుమార్తె సాహితీకి నాలుగేళ్లు, కుమారుడు జన్నేశ్వర్కు ఏడాది.. నా పరిస్థితి బాగా లేకనే ఇంత దూరం ఇద్దరి పిల్లల్ని వేసుకొని అధికారుల దగ్గరికి వచ్చా.. కనీసం మానవత్వంతో అన్న న్యాయం చేస్తారని కలెక్టర్‌కు సార్ విన్నవించుకోగా .. ఆయన గాలివీడు పోలీసులకు ఫోన్ చేసి అవతలి వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పారు.. నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. న్యాయం కోసమే ఇక్కడికి వచ్చాను. -
● కొన్నేళ్లుగా తిరుగుతున్నా..
అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్‌లోకి ఇలా పాకుకుంటూ వస్తున్న దివ్యాంగుడిని చూస్తే బాధేస్తుంది. మండు వేసవిలో కాళ్లు చేతులతో పాకుతూ... రోడ్డు ఎండలకు కాలుతుండడంతో అలాగే ముందుకు వచ్చి అతి కష్టం మీద కలెక్టరేట్‌లోకి వచ్చిన ఇతని పేరు ఎలిశెట్టి పార్థసారథి. ఊరు జిల్లా కేంద్రంలోని మాసాపేట. ‘నా వయసు 25 సంవత్సరాలు, డిగ్రీలో బీజెడ్సీ పట్టా పొందాను. నేను అడిగేది నాకు పెన్షన్ ఇవ్వండి. చదువుకు తగ్గట్టు ఉద్యోగం కల్పించండి... పోయిన కొన్ని సర్టిఫికెట్లు ఇప్పించండి.. ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు వచ్చి కలెక్టర్ కార్యాలయంలో వినతులు ఇస్తూనే ఉన్నాను. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. రెండు కాళ్లు లేవు నడవలేని స్థితిలో దేకుకుంటూ కలెక్టర్ కార్యాలయం వరకు రావాల్సి వస్తోంది.. ఈ స్థితిలో ఇలా కొన్నేళ్లుగా తిరుగుతున్నా అధికారుల నుంచి స్పందన రాకపోవడం, ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం దారుణం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు పార్థసారథి. -
హాల్ టికెట్లో తప్పిదం.. అధికారుల హైరానా
వీరబల్లి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్ష హాల్ టికెట్లో తప్పుగా ముద్రించడంతో పరీక్ష కేంద్రంలో అధికారులు హైరానా పడ్డారు. స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్న నమృత హాల్ టికెట్లో తెలుగు పరీక్షకు బదులు హిందీ అని ముద్రించడంతో పరీక్ష కేంద్రంలో ఆ బాలికకు తెలుగు ప్రశ్నాపత్రం బదులు హిందీ ప్రశ్నా పత్రం ఇచ్చారు. ఇది గమనించిన విద్యార్థిని అవాకై ్కంది. వెంటనే ఆమె ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లగా అధికారులు వెంటనే డీఈఓకు విషయాన్ని తెలిపారు. ఆయన స్పందించి హిందీ ప్రశ్నాపత్రం ప్రక్కన పెట్టి తెలుగు ప్రశ్నాపత్రం ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఆ విద్యార్థిని తెలుగు పరీక్ష రాసింది. -
జ్యోతి క్షేత్రంలో ఆశ్రమాలు తిరిగి నిర్మించాలి
కడప సెవెన్‌రోడ్స్ : జ్యోతి క్షేత్రంలో ఇటీవల ప్రభుత్వం కూల్చివేసిన ఆశ్రమాలను తిరిగి నిర్మించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య కళాక్షేత్రం, హిందూస్ ఫర్ ఫ్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంయుక్తాధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్‌స్వామి, హెచ్‌పీఈ జాతీయప్రధాన కార్యదర్శి కొవ్వూరు లోకనాథ్ మాట్లాడుతూ కాశిరెడ్డి నాయన జ్యోతి క్షేత్రం ఎంతో ప్రసిద్ధిగాంచిందన్నారు. ఆశ్రమ వసతి గృహాలను అటవీ అధికారులు కూల్చివేసిన సంఘటన లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కూల్చివేతలు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జై భారత జాతీయ ఉపాధ్యక్షుడు వంశీ, గురవయ్య, పలువురు భజన కళాకారులు పాల్గొన్నారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందజేశారు. రేపు విజయవాడలో మహా ధర్నాపులివెందుల టౌన్ : మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన విజయవాడలోని ధర్నా చౌక్‌లో మహా ధర్నా నిర్వహించనున్నట్లు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాంద్ బాషా తెలిపారు. సోమవారం పులివెందుల పట్టణంలో ఆయన మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథక కార్మికులకు నెలకు రూ.10వేలు వేతనం ఇవ్వాలని, ఎలాంటి కారణాలు లేకుండా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కామాక్షమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆటోను ఢీకొన్న ఐచర్ వాహనం ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండల పరిధిలోని ప్రొద్దుటూరు రోడ్డులో ఎస్వీ కల్యాణ మండపం సమీపంలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి గుడి దగ్గర ఆటోను గుర్తు తెలియని ఐచర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ చంగల రామాంజనేయులుతో పాటు ఆటోలో ఉన్న మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు పట్టణంలోని డ్రైవర్ కొట్టాల కాలనీకి చెందిన అల్లం లక్ష్మీనారాయణమ్మ, అల్లం జగన్నాథం, అల్లం నాగ పద్మ, అల్లం నాగ బిందు, జి.నాగముని, జి. రామాంజనేయులు ప్రొద్దుటూరులోని ఒకే కుటుంబానికి చెందినవారేరు. వీరంతా ప్రొద్దుటూరు వెళ్లేందుకు చంగల రామాంజనేయులుకు చెందిన ఆటో ఎక్కారు. ఎస్వీ కల్యాణ మండపం వద్దకు రాగానే ఆటో వెనుక వైపు గుర్తు తెలియని ఐచర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంగల రామాంజనేయులు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, ఆటోలో ఉన్న మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లింగాల సబ్ స్టేషన్లో అగ్నిప్రమాదం లింగాల : మండల కేంద్రంలోని 133 కేవీ సబ్ స్టేషన్లో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సబ్ స్టేషన్ సిబ్బంది ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సబ్ స్టేషన్ ఆవరణలో భారీగా ముళ్ల పొదలు ఉండటంతో ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటల తీవ్రత ట్రాన్స్ఫార్మర్లకు తగలకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది అనిల్ కుమార్, రవీంద్రారెడ్డి, డ్రైవర్ ఆపరేటర్ బుజ్జిబాబు పాల్గొన్నారు. 133 కేవీ సబ్ స్టేషన్‌కు ఎలాంటి ప్రమాదం లేదని ఏఈ రమేష్ తెలిపారు. ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. -
కూటమి సర్కారు కట్టుకథ మదనపల్లె ఫైల్స్
మదనపల్లె : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటనను, రాజకీయ దురుద్దేశంతో కుట్ర పూరితంగా జరిగిందనే కోణంలో ప్రజలను నమ్మించేందుకు కూటమి సర్కార్ అల్లిన కట్టుకథే మదనపల్లె ఫైల్స్ అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మదనపల్లె ఫైల్స్ ఘటనలో ప్రధాన నిందితుడుగా ఉన్న గౌతమ్‌తేజ్‌కు నిర్వహించిన పాలీగ్రాఫ్ పరీక్షలో నేర నిరూపణ నిర్ధారణ కాలేదని నివేదికలో వెల్లడించడంతో పాటు ఎవరి ప్రమేయం లేదని హైకోర్టు నిర్ధారించిందన్నారు. అగ్నిప్రమాద ఘటన రాత్రి 11.30 గంటలకు జరిగితే.. గౌతమ్‌తేజ్ 10.40 గంటలకు సబ్ కలెక్టరేట్ నుంచి బయటకు వచ్చినట్లు స్పష్టంగా నివేదికలో పేర్కొన్నారని, సీసీ కెమెరా ఆధారాలు ఉన్నాయన్నారు. ఘటనలో ప్రభుత్వం పేర్కొన్న ఏ–1 ముద్దాయి గౌతమ్తేజకు ప్రమేయం లేదని తెలుస్తుంటే, ఎవరి ప్రోద్బలంతోనే జరిగిందని ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులపై అభియోగాలు మోపడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎల్లో మీడియాలో పెద్దిరెడ్డి కుటుంబంపై 20 నుంచి 30 అసత్య కథనాలు, అభియోగాలు మోపారని, వాటిలో ఏ ఒక్కటి రుజువు చేయలేకపోయారన్నారు. రెండురోజుల క్రితం పుంగనూరు నియోజకవర్గం కృష్ణాపురంలో వ్యక్తిగత విభేదాలతో దాయాదుల మధ్య గొడవ జరిగి హత్యకు దారితీస్తే.. వైఎస్సార్ సీపీకి ఆపాదిస్తూ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా వైఎస్సార్సీపీకి ఆపాదిస్తూ మాట్లాడటం కూటమి నాయకులకు అలవాటైపోయిందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు హర్షవర్దన్‌రెడ్డి, కొమ్మేపల్లె శ్రీనివాసులురెడ్డి, జన్నే రాజేంద్రనాయుడు, నీరుగట్టి మేరీ, బి.రేవతి, ఈశ్వర్‌నాయక్, సురేంద్ర, మస్తాన్‌రెడ్డి, కోటూరి ఈశ్వర్, అంబేద్కర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
● బీమా లేని బతుకులు
వారు నిరాశ్రయులు.. కన్నవారిని.. కన్న ఊరును వదిలేసి వచ్చిన వలస జీవులు. పగలంతా ఏదో ఒక పని చేసుకుని.. రాత్రయ్యే సరికి ఇదిగో ఇలా ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తుంటారు. అయిన వారికి.. ఆత్మీయులకు దూరంగా ఉంటున్న వీరి బతుకులకు ఎలాంటి ధీమా లేదు.. వీరు సేద తీరుతున్న చోట గోడపైన ఉన్న జీవిత బీమా ప్రకటన చూసిన వారు ఏ బీమా వర్తించని బతుకులు వీరివే కదా అంటూ ఓ క్షణం ఆగి.. ఆలోచించి వెళ్లిపోతున్నారు. కడప నగరంలో ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో సాక్షి కంట పడిన దృశ్యమిది. – ఎస్కే మొహమ్మద్ రఫీ, సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కడప. -
భద్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ
రాయచోటి టౌన్ : రాయచోటిలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామికి పల్లకీ సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం రాత్రి స్వామి వారికి, అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించి అందంగా అలంకరించి పల్లకీలో ఉంచి ఆలయ మాఢవీధులలో, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఈ పల్లకీ సేవ ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణయ్య స్వామి, శంకరయ్య స్వామి, శేఖరయ్య స్వామి, వేదపండితులు రాచరాయ యోగీ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నంమదనపల్లె : కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. అంకిశెట్టిపల్లె పంచాయతీ నారమాకుల తండాకు చెందిన చినరెడ్డెప్ప నాయక్ కుమారుడు దొరస్వామి నాయక్(38) కుటుంబ సమస్యలతో ఇంటివద్దే విషపు గుళికలు మింగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
ప్రకృతి పంటలకు మంచి డిమాండ్
రాయచోటి టౌన్ : ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పంటలకు మంచి డిమాండ్ ఉందని మార్కెటింగ్ ఎన్ఎఫ్ పవన్ కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పంటలను విక్రయించేందుకు ఒక స్టాల్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సోమవారం ఈ స్టాల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణనీయంగా కొనుగోళ్లు జరిగి రైతులు పండించిన పంటలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఎంపీ పద్మావతి పాల్గొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఉద్యోగుల నిరసనరాయచోటి టౌన్ : తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ ఉద్యోగులు సోమవారం జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, క్యాడర్ కల్పించాలని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆ శాఖ అధికారులకు అందజేశారు. -
అడవి పందిని ఢీకొని వ్యక్తికి గాయాలు
ఓబులవారిపల్లె : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో అడవి పందిని ఢీ కొని బైకుపై నుంచి కింద పడటంతో డీకాల పవన్ అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో అడవి పందులు అధికంగా సంచరిస్తున్నాయి. చీకటి పడగానే అడవి పందులు మందలుగా వీధుల్లోకి వస్తున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి అడవి పందుల బెడదను నివారించాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు. గండి దేవస్థాన భూములకు వేలం పాట చక్రాయపేట : మండలంలోని మారెళ్ల మడక గ్రామ పంచాయతీలో ఉన్న గండి వీరాంజనేయస్వామి ఆలయంలో సోమవారం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో గండి దేవస్థాన భూములకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో ఇడుపులపాయ గ్రామ సర్వే నెంబర్ 469లో గల 8.72 ఎకరాల భూమిని ఏడాది కాలానికి రూ.1.51 లక్షలకు పి.జి.మహేష్ దక్కించుకున్నారు. అలాగే వీరన్నగట్టుపల్లె గ్రామంలోని 98 సెంట్ల భూమిని రూ.4 వేలకు ఆర్.తేజేశ్వర దక్కించుకున్నారు. అలాగే గండి దేవస్థానానికి సంబంధించిన సులభ్ కాంప్లెక్స్‌ను రూ.20 వేలకు ఇడుపులపాయకు చెందిన పి.వెంకటరత్నం దక్కించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ కృష్ణతేజ, మాజీ చైర్మన్ వెంకటస్వామి, దేవస్థాన ఉప ప్రధాన అర్చకుడు రాజా రమేష్, ఆలయ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు బి.కొత్తకోట : బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్ క్రాస్ సమీపం రామాపురం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు. స్థానిక బీసీ కాలనీకీ చెందిన జయచంద్ర (58), సువర్ణ (50) భార్యాభర్తలు. జయ చంద్ర చిత్తూరు ఆర్టీసీ డిపోలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వీరు బైక్ పై మదనపల్లెకు వెళ్లి తిరిగి బి.కొత్తకోటకు వస్తున్నారు. హార్సిలీ హిల్స్ క్రాస్ దాటుకుని రామాపురం వద్దకు రాగానే పీటీఎం నుంచి మదనపల్లికి టమాటా లోడుతో వెళ్తున్న ఐచర్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జయచంద్ర కాలికి పలుచోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయి, సువర్ణకు తల, పలుచోట్ల గాయాలయ్యాయి. వీరిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జయచంద్రను బెంగళూరుకు, సువర్ణను వేలూరుకు తీసుకెళ్లారు. -
భక్తి పారవశ్యం.. ప్రేమ వాత్సల్యం
మదనపల్లె సిటీ : మానవుల ఆలోచనాత్మక శిక్షణ.. ఆచరణాత్మక సంస్కరణ.. ఆధ్యాత్మిక వికాసం.. ఆత్మీయత, అనురాగాల అనుబంధం.. ఆకలి నుంచి ఔన్నత్యానికి దైవం అందించిన మహత్తర అవకాశం రంజాన్ మాసం. పవిత్ర వాతావరణంలో శారీరక, మానసిక, సాధనతో నైతిక ప్రగతి సుసాధ్యం అని ఇస్లాం బోధిస్తుంది. భక్తి పారవశ్యానికి ప్రతీక అయిన ఈ మాసం ప్రేమ.. వాత్సల్యాన్ని పంచుతోంది. విధిగా దానం(జకాత్) ద్వారా పేదలను అక్కున చేర్చుకునే శుభాల వసంతం రంజాన్ మాసం. జిల్లాలో రంజాన్ మాసం సందర్భంగా శారీరక, ఆధ్యాత్మిక వికాసానికి సాధనమైన ఉపవాసాలు కొనసాగుతున్నాయి. మసీదుల్లో రంజాన్ సూచికగా తరావీల రూపంలో దివ్యఖురాన్ ఆయత్లు ప్రతి చోట వినిపిస్తున్నాయి. రంజాన్ నెల వంక దర్శనమైనప్పటి నుంచి మసీదు కమిటీల ఆధ్వర్యంలో ఇఫ్తార్, సహర్ వేళలను పాటిస్తూ ఉపవాసాలు చేస్తున్నారు. సహనం, క్రమశిక్షణ లాంటి మహోన్నత వ్యక్తిత్వాలను అలవర్చే రోజా వ్రతాలను ఉపవాసదీక్షాపరులు భక్తిశ్రద్ధలతో పాటిస్తున్నారు. ఆధ్యాత్మిక వికాసానికి స్వాగత ద్వారం.. రంజాన్ నెల ఆధ్యాత్మిక స్వాగత ద్వారం లాంటిదని ముస్లింల భావన. అన్ని దుష్టకార్యాల నుంచి రక్షణ పొందేందుకే రంజాన్ శిక్షణగా భావిస్తారు. నెల రోజులు పాటించే ఆచరణలు మిగిలిన జీవితంలో కూడా చేపట్టాలన్నదే రంజాన్ శిక్షణ ధ్యేయం. ఉపవాసాలు పాటించే ముస్లింలు ఈర్ష్య, ద్వేషం, అసత్యం పలకడం తదితర దుర్గుణాలను త్యజిస్తారు. ఉపవాసదీక్షాపరుల్లో పవిత్రత నెలకొంటుంది. రాగద్వేషాలకు తావులేని వాతావరణం వెల్లివిరిస్తుంది. ఎలాంటి చెడులు లేని ప్రశాంత జీవితం దక్కుతుంది. ఉపవాసదీక్ష పాటించిన ప్రతి ముస్లింని రోజా పరిణితి కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. ఆత్మీయత, అనురాగాలు.. రంజాన్ నెలంతా ప్రతి ముస్లిం ఇంట్లో దైవారాధనలు, పవిత్ర ఉపవాసదీక్షలు, పుణ్యకార్యాలు, ఆధ్యాత్మిక చింతన వెల్లివిరుస్తుంది. ఉపవాసం పాటించేవారు తెల్లవారకముందే లేచి భోజనం ఆరగించాలి. దీన్ని సహరి అంటారు. సూర్యాస్తమయం వరకు మంచినీళ్లు సైతం ముట్టరు. అనంతరం మసీదు సైరన్‌తో ఉపవాసం ముగిస్తారు. దీన్ని ఇఫ్తార్ అంటారు. మసీదులన్నీ నమాజులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర ఖురాన్ పఠనంతో తన్మయులవుతారు. దయాగుణం అలవడుతుంది.. రంజాన్‌మాసం కొందరు ముస్లింలలో ఉన్న పిసినారితనం, ధనార్జన గుణం తదితర దుర్గుణాలను పోగొట్టి, దానగుణాన్ని పెంపొందిస్తుంది. ఈ నెలలో దానధర్మాలు అధికంగా చేయాలని మహమ్మద్ ప్రవక్త బోధించారు. ఒక్కొక్క పుణ్యకార్యానికి 70 రెట్లు అధిక పుణ్యఫలం ప్రసాదిస్తాడని ప్రవక్త బోధించారు. దీంతో ఆర్థికంగా సహాయం అందుతుంది. తమ సంపాదనలో 2.5 శాతం ధనాన్ని పేదలకు పంచాలని అల్లాహ్ ఖురాన్లో శాసనం చేశారు. సదఖా, జకాత్, ఫిత్రా దానాల ద్వారా పేదలకు రంజాన్ నెలలో ఆనందోత్సవాలతో పండుగ జరుపుకుంటారు. దీంతో వారి అవసరాలు తీరుతాయి. ఫలితంగా సమసమాజ స్థాపన జరుగుతుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారంగా జకాత్ ఉపయోగపడుతుంది. రంజాన్ నెలంతా ఇలా భయ, భక్తులతో ఉపవాసాలను పాటిస్తూ నమాజులను ఆచరిస్తూ ధాన, ధర్మాలను చేస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ముస్లింలు గడుపుతారు. తరావీ నమాజులో ఇమామ్‌ల ద్వారా ఖురాన్లో కొంత భాగాన్ని రోజూ ఆలకిస్తారు. ఇలా చేయడం పుణ్యప్రదంగా భావిస్తారు. త్రికరణ శుద్ధిగా ఖురాన్ బోధనలను పఠిస్తారు. మృదు స్వభావం.. సమాజంలో పేదసాదల ఆకలిదప్పులను రోజా(ఉపవాసదీక్షలు)లు తెలుపుతాయి. తోటివారి వ్యథాభరిత జీవితాన్ని కళ్లకు కడుతుంది. దీంతో తమ తోటివారు అనాథలు, అణగారిన వారిపై జాలి కలుగుతుంది. తద్వారా మృదుస్వభావం అలవడుతుంది. దీంతో వారి బాధలను కష్టాలని తీర్చేందుకు పాటుపడతారు. వ్యవసనాలకు దూరంగా.. తాగుడు, జూదం, మత్తు పదార్థాలను నమలడం లాంటి దురలవాట్లు 16 గంటల పాటు దూరమైతే ఆ వ్యక్తిలో ఆయా వ్యసనాలను త్యజించే మానసిక సంసిద్ధత ఉద్భవిస్తుందని నమ్మకం. ఉపవాసాలు మనిషి అన్ని చెడులను దూరంగా చేసి, సత్కార్యాలను దగ్గర చేస్తాయి. అత్యుత్తమ శిక్షణనిస్తాయి. దివ్య సుగంధాలను వెదజల్లుతున్న రంజాన్ ఉపవాసదీక్షాపరులతో మసీదులు కళకళ ఎటుచూసినా ఆధ్యాత్మిక వాతావరణంప్రవక్త బోధనలు పాటించాలి.. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసదీక్షలతో పాటు మహమ్మద్ ప్రవక్త బోధనలు పాటించాలి. రంజాన్ మాసంలో 30 రోజుల పాటు చేపట్టే ఉపవాసదీక్షలతో పేదల ఆకలి, బాధ తెలుస్తుంది. దీంతో పేదలను ఆదుకోవడం జరుగుతుంది. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఏదో విధంగా పేదలను ఆదుకోవాలి. పేదరికం లేని సమాజ నిర్మాణమే రంజాన్ ఆశయం. –మౌలానా జలాలుద్దీన్‌సాహెబ్, ప్రభుత్వఖాజీ, మదనపల్లె -
స్థలం కబ్జా చేసిన టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలి
కేవీపల్లె : మండలంలోని గర్నిమిట్టలో ఏపీ ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ స్థలాన్ని కబ్జా చేసిన టీడీపీ నాయకుడు గంగిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డి సురేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ నాయకులు సోమవారం తహసీల్దార్ నరేంద్రకుమార్‌కు ఫిర్యాదు చేశారు. 20 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉండి కార్యక్రమాలు జరుపుకుంటున్న స్థలాన్ని కబ్జా చేయడం సమంజసం కాదన్నారు. అధికారులు తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. తహసీల్దార్ ఆదేశాలతో వెంటనే రెవెన్యూ సిబ్బంది సంబంధిత స్థలాన్ని పరిశీలించారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ స్థలంలో ఎవరూ ప్రవేశించరాదని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గడికోట గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
దేవుడా.. మాకిక దిక్కెవరు!
పెద్దతిప్పసముద్రం: ‘అమ్మ చిన్నప్పుడు నిన్ను, మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా.. తల్లి లేని లోటు లేకుండా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడావు. రేపటి నుంచి జరిగే పది పరీక్షలకు వెంట తీసుకెళతాను అన్నావు కదా లేనాన్న’.. అంటూ తండ్రి మృతదేహం వద్ద ఆ బాలిక వెక్కివెక్కి ఏడ్చటం చూపరులను కంట తడి పెట్టించింది. ఈ విషాద సంఘటన మండలంలోని కందుకూరు పంచాయతీ గొడుగువారిపల్లిలో చోటు చేసుకుంది. గొడుగువారిపల్లికి చెందిన కొత్తోళ్ళ వెంకటరమణ (55)కు గణేష్ (20), గిరిజ (15)లు సంతానం. వెంకటరమణ భార్య 10 ఏళ్ల క్రితమే భర్త, పిల్లలను వదిలి ఎటో వెళ్లిపోయింది. అప్పటి నుంచి కూలి పని చేస్తూ పిల్లలను పోషించేవాడు. కుమారుడు గణేష్ చిన్నా, చితకా పనులు చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కుమార్తె కందుకూరు జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదివి రేపటి నుంచి జరిగే పబ్లిక్ పరీక్షలకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం గ్రామంలోని చింతచెట్టు ఎక్కి కాయలు కోసే క్రమంలో.. వెంకటరమణ చెట్టు కొమ్మల పట్టు తప్పి ప్రమాదవశాత్తు కింద పడి గాయాల పాలై స్పృహ కోల్పోయాడు. ఆయనను గ్రామస్తులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృత్యువాత పడ్డాడు. ‘దేవుడా మాకిక దిక్కెవరు, మేము చేసిన పాపమేమి’ అంటూ ఆ పిల్లల రోదనలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా మూగబోయి విషాదంతో నిండిపోయింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చెట్టుపై నుంచి పడి తండ్రి మృతి పదేళ్ల క్రితమే భర్త, పిల్లలను వదిలి వెళ్లిన భార్య -
● పకడ్బందీగా నిర్వహించండి
రాయచోటి టౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని 10వ తరగతి పరీక్షల అడిషనల్ డైరెక్టర్ ఎస్ఎస్సీ పరీక్షల రాష్ట్ర అబ్జర్వర్ డి.మధుసూదన్ రావు సూచించారు. రాయచోటిలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ఆయన ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు తాగునీటి, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఉప విద్యాశాఖాధికారి శివప్రకాష్‌రెడ్డి, ఓపెన్ స్కూల్స్ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో ఏప్రిల్ 5 నుంచి 15 వరకు జరగనున్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీలు, సీఐలకు పలు సూచనలు చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలన్నారు. కడప–ఒంటిమిట్ట మార్గంలోని ఉప్పరపల్లె వద్ద ఏర్పాటు చేయనున్న పార్కింగ్ ప్రదేశం, కల్యాణ వేదిక, సాలాబాద్ వద్ద ఉన్న పార్కింగ్ ప్రవేశం, టీటీడీ గెస్ట్ హౌస్, వీవీఐపీ గెస్ట్ హౌస్, ఆలయ పరిసరాలు పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై కడప డీఎస్పీ వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కల్యాణ వేదిక సమీపంలోని పార్కింగ్ స్థలం వద్ద వాహనాలు క్రమ పద్ధతిలో నిలిపి ఉంచేలా పర్యవేక్షించాలన్నారు. భారీ కేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సీఐ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థీ.. విజయోస్తు
సాక్షి రాయచోటి/రాజంపేట టౌన్: ఏడాది కాలంగా కష్టపడి చదివిన విద్యార్థులు.. ఇక పేపరుపై రాయడానికి సమయం ఆసన్నమైంది. పది పరీక్షలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. విద్యార్థులందరికీ విజయీభవ. పట్టుదలతో చదివిన అంశాలను.. మానసిక ఒత్తిడికి లోనుకాకుండా.. పేపరుపై విశదీకరిస్తే సులువుగా ఉత్తమ ఫలితం సాధిస్తారని విద్యావేత్తలు అభివర్ణిస్తున్నారు. ‘పది’ పరీక్షలు అనగానే ఏదో లోలోపల టెన్షన్ పడకుండా.. ప్రశాంతమైన మనసుతో రాయడమే విజయానికి నాందిగా మేధావులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు, గురువుల ఆశయాలు, ఆకాంక్షలకు అనగుణంగా రాణించేందుకు.. ప్రతి విద్యార్థి ప్రయత్నం చేయాలని ‘సాక్షి’ ఆకాంక్షిస్తోంది. ఇప్పటికే పదవ తరగతికి సంబంధించి సీబీఎస్ఈ పరీక్షలు ఈ నెల 12వ తేదీతో ముగిశాయి. స్టేట్ సిలబస్‌కు సంబంధించి సోమవారం (17వ తేది) నుంచి ప్రారంభమై ఈ నెల 31వ తేదీతో ముగియనున్నాయి. రోజూ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30కి పరీక్ష ముగియనుంది. 1250 ఇన్విజలేటర్లు నియామకం పరీక్షా కేంద్రాలను అఽధికారులు నో సెల్‌ఫోన్ జోన్‌గా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరు కూడా సెల్‌ఫోన్‌ను పరీక్షా కేంద్రంలోకి తీసుకు వెళ్లకూడదని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 1250 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అంతేకాకుండా పరీక్షల్లో మాస్ కాపీయింగ్, బయట నుంచి కాపీయింగ్‌కు పాల్పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కాపీయింగ్‌ను అరికట్టేందుకు ఎనిమిది ఫ్లయింగ్ స్క్వాడ్‌లతోపాటు 25 సిట్టింగ్ స్క్వాడ్లను వినియోగిస్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా.. కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను పరీక్షల సమయంలో మూతవేసేలా ఆదేశాలు ఇచ్చారు. కంట్రోల్ రూము ద్వారా పర్యవేక్షణ జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తింపు పొందిన పలు సెంటర్లలో పరీక్షలు నిఘా నీడలో కొనసాగనున్నాయి. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ఈసారి పకడ్బందీగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు సంబంధించి ఎనిమిది సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను అమర్చి కంట్రోల్ రూము ద్వారా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ముక్కావారిపల్లెలో రెండు కేంద్రాలు, కలికిరి బాలికల ఉన్నత పాఠశాల, గాలివీడు ఉర్దూ ఉన్నత పాఠశాలతోపాటు చక్రంపేట, పాటూరు, చిన్నతిప్పసముద్రం, చింతపర్తి కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా ఉన్నాయి. ఓపెన్ టెన్త్ పరీక్షలు కూడా.. ఓపెన్ టెన్త్ పరీక్షలు కూడా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:45 గంటల వరకు జరగనున్నాయి. ఇందుకోసం 19 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 834 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. సర్వం సిద్ధం విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్వం సిద్ధం చేశాం. ఏ చిన్న తప్పిదం జరిగిగా అందుకు ఆయా పరీక్షా కేంద్రాల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. విద్యార్థులను 8:30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తాం. ఏ పరీక్షా కేంద్రంలో అయినా వసతులు సరిగా లేకున్నా, సమస్యలు ఉన్నా విద్యార్థులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ 9100040686 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. – సుబ్రమణ్యం, డీఈఓశుభాశీస్సులు అన్నమయ్య జిల్లాలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాభినందనాలు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ ప్రశాంత మనసుతో పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలి. ‘కలలు కనాలి.. సాకారం చేసుకోవాలి’ అని చెప్పిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్ఫూర్తితో ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసం, అకుంఠిత పట్టుదలతో పరీక్షలు రాసి అత్యుత్తమ ఫలితాలతో జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకు రావాలి. పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థికి ఆల్ ది బెస్ట్! – ఛామకూరి శ్రీధర్, కలెక్టర్ అసౌకర్యాల నీడలో.. జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న అనేక పాఠశాలల్లో సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రధానంగా వెలుతురు సరిగా లేకపోవడం, ఇరుకు గదులు, బెంచీలు అంతంత మాత్రంగా ఉండటం లాంటివి కనిపిస్తున్నాయి. ఇవేకాకుండా అనేక అసౌకర్యాలు విద్యార్థులకు పరీక్షలు పెడుతున్నాయి. చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులను ఎలా అధిగమించి ముందుకు వెళతారనేది వేచి చూడాల్సిందే. 22,355 మంది విద్యార్థులు హాజరు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు సంబంధించి మొత్తం 22,355 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లాలో 502 ఉన్నత పాఠశాలలు ఉండగా, అందులో రెగ్యులర్ విద్యార్థులు 22,355 మంది పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యారు. 121 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించి 3855 మంది పరీక్షలు రాయనున్నారు. విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి నుంచి పదో తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 121 కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా 25 సిట్టింగ్, 11 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉదయం 9.30 నుంచి 12.30 వరకు నిర్వహణ -
●టీడీపీకి తిరుగులేని దెబ్బ
బి.కొత్తకోట: డ్యామిట్.. టీడీపీ అల్లిన కథ అడ్డం తిరిగింది. రాజకీయంగా బలమైన నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని బలహీనం చేయాలన్న చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టింది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా మిథున్‌రెడ్డి హ్యాట్రిక్ సాధించగా పుంగనూరు, తంబళ్లపల్లెలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిలు గెలుపొందడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజంపేట పార్లమెంటు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేని చంద్రబాబు.. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో గతేడాది జూలై 21న రాత్రి జరిగిన అగ్నిప్రమాదం ఘటనను.. పెదిరెడ్డి కుటుంబానికి, వారి మద్దతుదారులకు ఆపాదించి రాజకీయ కక్ష తీర్చుకోవాలన్న పన్నాగం పారలేదు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయడం ద్వారా వైఎస్సార్సీపీని రెండు జిల్లాల్లో బలహిన పర్చాలని చేసిన ప్రయత్నాలు, ప్రయోగించిన అస్త్రాలు విఫలమయ్యాయి. తొలుత ఈ ఘటనలో ఏమో జరిగిపోయిందంటూ సీఎం చంద్రబాబు నుంచి మంత్రులు, టీడీపీ నేతలు ఊపిరాడని విధంగా ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మద్దతుదారుల భూ ఆక్రమణల వ్యవహారాలు జరిగాయని, అందుకే ఫైళ్లను కాల్చేశారంటూ నిరాధార ఆరోపణలు చేశారు. ఈ ఘటన జరిగిన రోజు నుంచి రెండు నెలల వరకు మదనపల్లె సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. అందరి దృష్టిని ఆకర్షించి ఏమి జరిగిందో తెలుసుకోవాలన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని నిరూపించేందుకు ప్రభుత్వం శాయశక్తులా శ్రమించింది. చివరకు ఈ కేసులో ప్రధాన నిందితుడు గౌతంతేజ్కు జరిపిన పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితం, బెయిలు మంజూరు ఉత్తర్వులో న్యాయస్థానం వ్యాఖ్యలు పరిశీలిస్తే.. ఈ కేసులన్నీ వేధింపులకే అన్నది అర్థమైపోతోంది. ఆధారాల్లేకనే సాగదీత గత జూలై 21న ఘటన జరిగితే ఇప్పటి దాక ఈ కేసులో ఎవరి పాత్ర ఉంది, దీని వెనుక ఎవరున్నారు, కాలిపోయిన ఫైళ్లు ఏ పార్టీకి చెందిన నాయకులవి ఉన్నాయి, వాటి వివరాలేమిటి అనే అంశాల్లో ఒక్కదానిపైనా స్పష్టత ఇవ్వలేదు. ఆరోపణలపై ఆధారాలు లభ్యమయ్యాయా లేదా, ఎవరిపై ఆధారాలు లభ్యమయ్యాయి అన్నది కూడా రహ్యసంగానే మిగిలిపోయింది. పెద్దిరెడ్డి కుటుంబంపై భూ అక్రమణ, ఫ్రీహోల్డ్‌లో అక్రమాలు జరిగాయని పదేపదే టీడీపీ మంత్రులు, నేతలు తప్పుడు ఆరోపణలు చేసి చేతులు కాల్చుకున్నారు. ఆ ఫ్రీహోల్డ్ భూములు ఎవరివో, అందులో ఎవరి ప్రమేయం ఉందో వెలుగులోకి తేలేదు. ఘటన జరిగినప్పటి నుంచి గడచిన ఎనిమిది నెలలుగా ప్రభుత్వం విచారణను సాగదీస్తోంది. రాజంపేట ఎంపీగా మూడోసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మిథున్‌రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. అందులో గత ఎన్నికలో ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూటమి పార్టీల తరఫున బీజేపీ అభ్యర్థిగా మిథున్‌రెడ్డితో పోటీ పడటం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనించారు. భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరిగాయి. మిథున్‌రెడ్డిని ఓడిస్తానని కిరణ్ కొన్ని అభ్యంతకర అంశాలను ఆరోపణలతో గెలుపు కోసం శ్రమించినా ఓటర్లు ఆయన్నే ఓడించారు. తొలి ఎన్నికలో 2014లో ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరీని ఓడించారు. 2019లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభను ఓడించి వరుస విజయాలతో సాగిపోతున్నారు. దీనికితోడు తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని ఓడించాలని చంద్రబాబు కుల రాజకీయాలను తెరపైకి తెచ్చినా.. ఓటర్లు టీడీపీనే ఓడించారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించడం సాధ్యం కాదని తేలిపోయింది. 2024లో రాష్ట్రంలో అత్యంత మెజార్టీ సాధించినా.. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడించలేకపోవడం, రాజకీయంగా ఎదుర్కొలేని స్థితిలో టీడీపీలో నైరాశ్యం నెలకొంది. దీనితో మదనపల్లె ఘటనను అనుకూలంగా మలుచుకుని రాజకీయంగా దెబ్బ తీయాలని చంద్రబాబు సర్కారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మదనపల్లె ఆర్డీవో కార్యాలయ ఘటనను సాకుగా తీసుకుని ప్రభుత్వం వైఎస్సార్సీపీ మద్దతుదారులను వెంటాడి వేధించింది. అగ్నిప్రమాదం ఘటన దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వ వ్యవస్థలు మదనపల్లెలో మకాం వేశాాయి. ఘటనపై దర్యాప్తు చేసి ఆధారాలను సేకరించాల్సిన ప్రభుత్వం ఆ విషయాని కంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుదారులను వేధించేందుకే ప్రాధాన్యత ఇచ్చింది. ఘటనలో ప్రమేయం లేని, స్థానికంగా లేని వారిపైనా కక్ష కట్టింది. తొలుత మదనపల్లెలో ఉంటున్న మాధవరెడ్డి ఇంటి నుంచి పోలీసులు మొదలు పెట్టిన సోదాలు వరుసగా.. మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి, బాబ్జాన్, మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా, హైదరాబాద్‌లో ఉంటున్న శశికాంత్, అమెరికాలో ఉన్న తుకారాం తిరుపతి నివాసంలో సైతం నిర్వహించారు. ఈ సోదాలు జరిగిన వాళ్లందరిపైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు తీవ్రమైనవి కానప్పటికీ.. శశికాంత్, తుకారాంపై లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం గమనించాల్సిన విషయం. జూలై 21న ఘటన జరగడానికి ముందే తుకారాం అమెరికా వెళ్లారు. అయితే ఘటన జరిగాక వెళ్లినట్టుగా తప్పుడు ప్రచారం కూడా చేశారు. ఈ దాడులతో ఎప్పుడు ఎవరి ఇంటిలో సోదాలు నిర్వహిస్తారో అనే ఆందోళనకు గురిచేశారు. ఈ సోదాల్లో ప్రభుత్వం ఆశించినట్టుగా ఆధారాలు దొరక్కపోవడం నిరాశకు గురి చేయగా, రాజకీయంగా దెబ్బతీయాలన్న ప్రయత్నాలకు అడ్డుపడింది. వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఇళ్లలో జరిపిన సోదాల్లో ప్రభుత్వం ఆశించినట్టు భూముల అక్రమ కార్యకలాపాలు, కబ్జాలకు సంబంధించి ఆధారాలు లభ్యం కాలేదని సమాచారం. దీనితో జిరాక్స్ కాపీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మాధవరెడ్డి ఇంటి నుంచి 658 జిరాక్స్ కాపీలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆధార్ కార్డు నుంచి భూముల డాక్యమెంట్ల కాపీలు ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లభ్యమైవున్నా ప్రభుత్వం ఈపాటికి చర్యలకు పూనుకునేది. మిగత వారి ఇళ్లలో జరిపిన సోదాల్లోనూ ఇలాంటి డాక్యుమెంట్లు లభించినట్టు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్నవి జిరాక్స్ వెంటాడి.. వేధించి.. పెద్దిరెడ్డి కుటుంబంపై బెడిసికొట్టిన బాబు వ్యూహం రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కుట్ర మదనపల్లె ఘటనను అస్త్రంగా వాడుకునేందుకు అష్టకష్టాలు మద్దతుదారుల ఇళ్ల సోదాల్లోనూ లభించని ఆధారాలు అవన్నీ నిరాధార ఆరోపణలని తేలుతున్న వైనం -
‘దేవుడా మాకిక దిక్కెవరు, మేము చేసిన పాపమేమి’
అన్నమయ్య: ‘అమ్మ చిన్నప్పుడు నిన్ను, మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా.. తల్లి లేని లోటు లేకుండా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడావు. రేపటి నుంచి జరిగే పది పరీక్షలకు వెంట తీసుకెళతాను అన్నావు కదా లేనాన్న’.. అంటూ తండ్రి మృతదేహం వద్ద ఆ బాలిక వెక్కివెక్కి ఏడ్చటం చూపరులను కంట తడి పెట్టించింది. ఈ విషాద సంఘటన మండలంలోని కందుకూరు పంచాయతీ గొడుగువారిపల్లిలో చోటు చేసుకుంది. గొడుగువారిపల్లికి చెందిన కొత్తోళ్ళ వెంకటరమణ (55)కు గణేష్ (20), గిరిజ (15)లు సంతానం. వెంకటరమణ భార్య 10 ఏళ్ల క్రితమే భర్త, పిల్లలను వదిలి ఎటో వెళ్లిపోయింది. అప్పటి నుంచి కూలి పని చేస్తూ పిల్లలను పోషించేవాడు. కుమారుడు గణేష్ చిన్నా, చితకా పనులు చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కుమార్తె కందుకూరు జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదివి రేపటి నుంచి జరిగే పబ్లిక్ పరీక్షలకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం గ్రామంలోని చింతచెట్టు ఎక్కి కాయలు కోసే క్రమంలో.. వెంకటరమణ చెట్టు కొమ్మల పట్టు తప్పి ప్రమాదవశాత్తు కింద పడి గాయాల పాలై స్పృహ కోల్పోయాడు. ఆయనను గ్రామస్తులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృత్యువాత పడ్డాడు. ‘దేవుడా మాకిక దిక్కెవరు, మేము చేసిన పాపమేమి’ అంటూ ఆ పిల్లల రోదనలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా మూగబోయి విషాదంతో నిండిపోయింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పవన్‌ను పిచ్చాసుపత్రిలో చేర్చాలి: నారాయణ
బి.కొత్తకోట: రోజుకో మాట మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో సీపీఐ శత వార్షికోత్సవ సభ ఆదివారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ ఒకసారి చేగువేరా, మరొకసారి సావర్కర్, ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారని అన్నారు. ‘సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్య చితి మంటల్లో ఆహుతి అవుతుంది. ఇలాంటి ధర్మాన్ని ఒప్పుకుంటారా.. మూడు పెళ్లిళ్ల పవన్ కళ్యాణ్’ అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న చంద్రబాబు, పవన్ ఆయన మాటలకు తలూపుతున్నారని అన్నారు. -
‘నాకు రక్షణ కల్పించండి’
సిద్దవటం : తనను హతమార్చేందుకు యత్నిస్తున్నారని, రక్షణ కల్పించాలని సిద్దవటం మండలం కడపాయపల్లె గ్రామానికి చెందిన బత్తల శివకుమార్ కడప డీఎస్పీ, ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రమైన సిద్దవటంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ తనతో పాటు బొంత రమాదేవి 2002 సంవత్సరంలో ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా సర్వేనెంబర్ 164 లింగంపల్లె రెవెన్యూ గ్రామ పొలంలో పట్టా పొందామన్నారు. ఈనెల 14వ తేదీన భూమి సాగు చేసుకునేందుకు జేసీబీతో పని చేయిస్తుండగా వెన్యూ వారు వచ్చి రికార్డులను పరిశీలించి వెళ్లారన్నారు. అయితే లింగంపల్లె గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఫోన్ చేసి తనను అడగకుండా భూమి సాగు చేసేందుకు ఎంత ధైర్యం నీకు అంటూ బెదిరించాడన్నారు. ఆ తరువాత కొంత మంది లింగంపల్లె దళితులను తన వద్దకు పంపి తనపై దౌర్జన్యం చేసి పనిని నిలుపుదల చేశారన్నారు. అంతటితో ఆగకుండా వెంకటేశ్వర్లు తన మనుషులైన ఈరిశెట్టి సురేష్, ఈరిశెట్టి మునిసుబ్బరాయుడు, ఈరిశెట్టి నాగరాజు, పిట్టి గోపాల్‌ల చేత తనపై హత్యాయత్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. రిమ్స్‌లో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహంకడప అర్బన్ : కడప రిమ్స్‌లో ఈనెల 9వ తేదీన ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. అతను ఈనెల 5న తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలిపారు. -
ఆలయం ముసుగులో ఆక్రమణకు యత్నం
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని నడివీధి గంగమ్మ ఆలయం వద్ద పురాతనమైన బ్రిటీష్ కాలం నాటి గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని (ప్రభుత్వ గ్రామ రెవెన్యూ చావిడి) టీడీపీ నాయకులు కూల్చివేశారు. వివరాల్లోకి వెళితే.. 1500–బి1 సర్వే నెంబరులో లక్షలు విలువ జేసే రెవెన్యూ చావిడితో కలిసి తొమ్మిది సెంట్లు ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని కొన్ని నెలల నుంచి ఒంటిమిట్టలోని టీడీపీ నాయకులు నడివీధి గంగమ్మ ఆలయం ముసుగులో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామ రెవెన్యూ చావిడిని కూల్చి నడివీధి గంగమ్మకు ఇవ్వమని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు కూడా అందజేశారు. కానీ కలెక్టర్ వద్ద నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. అయినా తమ ప్రభుత్వం అధికారంలో ఉందనే కారణంగా ఎలాంటి అనుమతులు లేకపోయినా ఆదివారం అక్రమంగా కూల్చివేతకు పాల్పడ్డారు. ఒంటిమిట్ట గ్రామ రెవెన్యూ సిబ్బంది అడ్డుకోగా వారిని లెక్కచేయకుండా వారిపట్ల అనుచితంగా ప్రవర్తించి కూల్చి వేశారు. దీంతో మండల రెవెన్యూ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కూల్చివేత పనులను మధ్యలో నిలుపుదల చేయించారు. కూల్చివేతకు పాల్పడిన ఉగ్గురారపు వెంకటరమణ, అంగదాల వెంకటసుబ్బయ్య, పత్తి కృష్ణయ్య, గుర్తుకొండ శ్రీను, పసుపులేటి కృష్ణయ్యలపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే గ్రామ రెవెన్యూ కార్యాలయం కూల్చివేతలో ప్రధాన పాత్ర పోషించిన మాడా వీధికి చెందిన ఓ యువకుడి పేరు తొలుత ఫిర్యాదులో పేర్కొని తరువాత తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని కూల్చివేసిన టీడీపీ నాయకులు కూల్చివేతను అడ్డుకోబోయిన రెవెన్యూ సిబ్బందిపై అనుచిత ప్రవర్తన నడివీధి గంగమ్మ ఆలయం ముసుగులో లక్షలు విలువచేసే ప్రభుత్వ స్థలం కబ్జాకు కుట్ర -
మల్లూరమ్మ హుండీ ఆదాయం రూ.2,93,890
చిన్నమండెం : చిన్నమండెం మండలం మల్లూరు, కొత్తపల్లె గ్రామాల సరిహద్దు మాండవ్యనది ఒడ్డున ఉన్న మల్లూరమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడం ఇటీవలే అమ్మవారి జాతర వైభవంగా జరగడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. అదే విధంగా మల్లూరమ్మ తల్లి ఆలయ హుండీలను లెక్కించగా రూ.2,93,890 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ కొండారెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలుమదనపల్లె సిటీ/బి.కొత్తకోట : రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటనలు ఆదివారం జరిగాయి. బి.కొత్తకోట మండలం గొళ్లపల్లి పంచాయతీ కనికలతోపుకు చెందిన షేక్ మౌలాలి(35) పేపర్‌బాయ్‌గా పని చేస్తున్నాడు. ఉదయం పేపర్ ద్విచక్రవాహనంలో వేస్తుండగా ఎదురుగా వచ్చి కారు ఢీకొనడంతో గాయపడ్డాడు. స్థానికులు గమనించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. గుర్రంకొండ మండలం చెరువుముందరపల్లెకు చెందిన నారాయణ (45) ద్విచక్రవాహనంలో కలకడ క్రాస్ వద్ద వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి సీపీఎం జాతీయ మహాసభలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : సీపీఎం జాతీయ మహాసభలు ఏప్రిల్ 2 నుంచి తమిళనాడులోని మధురైలో నిర్వహించనున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ తెలిపారు. ఆదివారం ఆర్కే నగర్‌లోని సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో దేశంలో, రాష్ట్రంలో జరిగే ఎలాంటి ఎన్నికల్లోనా సీపీఎం పొత్తులు ఒకే రకంగా ఉండవని తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి ఉంటాయన్నారు. ఏప్రిల్ 2 నుంచి 6వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జరిగే 24వ సీపీఎం జాతీయ మహాసభల్లో స్పష్టమైన రాజకీయ విధానం రూపొందించనున్నట్లు తెలిపారు. నేడు దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేయడం సీపీఎం భవిష్యత్తు కార్యాచరణ అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.రామ్మోహన్, బి.మనోహర్, వి.అన్వేష్, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి, బి.దస్తగిరి రెడ్డి, పి.చాంద్ బాషా, కె.సత్యనారాయణ, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం, బుడుగుంటపల్లి పంచాయతీ, రైల్వేస్టేషన్ సమీపంలో అనంతపురం దొనగిరికి చెందిన లక్ష్మీనారాయణ (35) అనే యువకుడు విద్యుత్ హై టెన్షన్ స్తంభానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా.. రెండేళ్ల క్రితం రైల్వేకోడూరుకు బేల్దారీ పనులు చేసుకునేందుకు భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చి బాలానగర్‌లో నివాసం ఉండేవాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ యువకుడు ఉరివేసుకున్నాడు. దీంతో కుటుంబమంతా వీధిన పడింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మోటారు వైర్లు చోరీ రాజంపేట రూరల్ : మండల పరిధిలోని ఆకేపాడు గ్రామ పంచాయతీలో శనివారం రాత్రి బోర్ వైర్ కేబుళ్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. రాయచోటికి వెళ్లే దారిలో ఉన్న వీరంరెడ్డి నారాయణరెడ్డి పొలంలోని 2 బోర్లకు చెందిన మోటర్ వైర్లు, స్టార్టర్లు దొంగిలించారు. అలాగే వీరంరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, మందకాల శ్రీనివాసులు, బొమ్మ రంగారెడ్డికి చెందిన మోటార్ వైర్లు, స్టార్టర్లు కూడా ఎత్తుకెళ్లారు. గొళ్ల విజయరెడ్డికి చెందిన 3 మోటాటర్ వైర్ కేబుళ్లు, గోళ్ల సుజాతారెడ్డికి చెందిన 2 మోటార్ వైర్ కేబుళ్లు చోరీకి గురయ్యాయి. పోలీసులు దొంగలను పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు. గోవా మద్యం బాటిళ్లు పట్టివేతప్రొద్దుటూరు క్రైం : స్థానిక జమ్మలమడుగు రోడ్డులో వైఎస్సార్ సర్కిల్ వద్ద 18 గోవా మద్యం బాటిళ్లను ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సురేంద్రారెడ్డి, సిబ్బందితో ఆదివారం వాహనాలను తనిఖీ చేపట్టారు. ఒక స్విఫ్డ్ డిజైర్ కారును తనిఖీ చేయగా అందులో 750 ఎంఎల్ గల 18 గోవా మద్యం బాటిళ్లు దొరికాయి. కాటం వీరేంద్ర, ఉప్పు రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు వీటిని తరలిస్తున్నారని, వారిపై కేసు నమోదు చేసి మద్యం బాటిళ్లను, కారును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ప్రైవేట్ డిగ్రీ అండ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యవర్గం కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ అండ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని స్క్వేర్ సమావేశ మందిరంలో జరిగిన అసోసియేషన్ నాయకుల సమావేశంలో నూతన అధ్యక్షుడిగా రాజంపేట గీతాంజలి డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ సంభావు వెంకటరమణ, కార్యదర్శిగా ముద్దనూరు వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ జి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా నాగేశ్వరరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, కోశాధికారిగా ఆలీ అక్బర్, సంయుక్త కార్యదర్శిగా ఎన్.సంజీవరెడ్డి, రవి శేఖర్ రెడ్డి మిగిలిన సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షులు మదనమోహన్ రెడ్డి, రవి శేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి, పెంచలయ్య, రాజగోపాల్ రెడ్డి, పోలా రమణారెడ్డి, రాష్ట్ర నాయకులు పి.సురేష్, విజయ్ కుమార్, మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డి, సంజీవరెడ్డి, నరసింహులు, వివిధ కళాశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు. -
సూరప్పగారిపల్లెలో భారీ చోరీ
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ సూరప్పగారిపల్లెలో భారీ చోరి జరిగింది. వ్యవసాయపనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లిన ఓ రైతు ఇంట్లో దుండగులు ప్రవేశించి 150 గ్రాముల బంగారు నగలు, రూ.50 వేలు నగదు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన కుమ్మర మునిస్వామి వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటికి తాళాలు వేసుకొని గ్రామానికి సమీపంలోని తన పొలం వద్దకు వెళ్లారు. రైతు దంపతులు సాయంకాలం వరకు వ్యవసాయ పనులు చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటి తాళాలు పగులగొట్టి తలుపులు తెరిచి ఉన్నట్లు గుర్తించి పరుగున ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లోని ఓ గదిలో ఉన్న బీరువాను అప్పటికే బద్దలు కొట్టి అందులో వస్తువులు చిందర వందరగా పడేసిన దృశ్యాలు కనిపించాయి. దీంతో గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొన్నారు. మొత్తం పరిశీలించగా బీరువాలో దాచి ఉంచిన రూ. 13లక్షలు విలువచేసే బంగారు నగలు, రూ.50 వేలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆరుగాలం కష్టపడి పనిచేసి దాచి ఉంచుకొన్న నగలు, సొమ్ము చోరికి గురికావడంతో రైతు దంపతులు బోరున విలపించారు. జరిగిన సంఘటనపై బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కొండలకు నిప్పు.. పంటలకు ముప్పు!
గుర్రంకొండ : పీలేరు నియోజకవర్గంలోని రైతులు, ప్రజలు రాత్రంతా జాగారం చేసే పని తప్పడం లేదు. నియోజకవర్గంలోని ఆరుమండలాల పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు కొండలు, గుట్టలకు నిప్పు అంటిస్తున్నారు. దీంతో 1835 ఎకరాల్లో కొండలు, గుట్టలు కాలి బూడిదయ్యాయి. వీటితోపాటు మామిడితోటలు, టమటా తోటలతోపాటు పలు రకాల పంటలు దగ్ధమవుతున్నాయి. ఆయా పరిసర పొలాలకు చెందిన రైతులు మంటలు పొలాల వైపు రానీయకుండా రాత్రిళ్లు పొలాల వద్దే జాగారం చేస్తున్నారు. నీళ్ల ట్యాంకర్ల ద్వారా పొలాలవైపు వస్తున్న మంటల్ని రైతులు అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంతమంది రైతులు గుట్టల కింద ఉన్న పొలాలవైపు మంటలు రాకుండా జేసీబీలతో కందకాలు తవ్వుకుంటున్నారు. 1678 ఎకరాల్లో కాలిపోయిన కొండలు, గుట్టలు.. గత వారం రోజులుగా నియోజకవర్గంలోని కొండలు, గుట్టలకు కొంతమంది దుండగులు కావాలనే నిప్పు పెడుతున్నారు. అన్ని మండలాల్లో ఇప్పటివరకు 21 మార్లు అగ్నిప్రమాదాలు జరిగి మొత్తం 1678 ఎకరాల్లో కొండలు, గుట్టలతోపాటు మామిడితోటలు, పొలాలు కాలిబూడిదయ్యాయి. పొలాల్లో అమర్చిన డ్రిప్ పరికరాలు, టమాటా సీడ్స్ కట్టెలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో లక్షలాది రూపాయలు రైతులు నష్టపోయారు. రాత్రిళ్లు ఉన్నట్టుండి కొండలు, గుట్టల్లో మంటలు చెలరేగుతున్నాయి. అవి కింది భాగాన ఉన్న పొలాలు, మామిడితోటలవైపు దూసుకొస్తున్నాయి. సంబంధిత పొలాల రైతులు హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. చెట్లు, పొదలతో పాటు పక్షులు, సర్పాలు, అడవి జంతువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. నియోజకవర్గంలోని జాతీయ రహదారులకు ఇరువైపులా ఉన్న కొండలు, గుట్టలు రాత్రి పగలు అనే తేడా లేకుండా కాలుతూనే ఉండడం గమనార్హం. రాత్రిళ్లు జాగారమే.! కాలుతున్న కొండలు, గుట్టల కింది భాగంలో పెద్ద ఎత్తున మామిడితోటలు, ఇతర ఉద్యానవన తోటలతోపాటు పలురకాల పంటలు సాగవుతున్నాయి. దీంతో రైతులు రాత్రిళ్లు పొలాల దగ్గరే కాపలా కాస్తూ జాగారం చేస్తున్నారు. టెంకాయపట్టలు, పచ్చి వేపకొమ్మలు, దుమ్ముధూళితో గుట్టల దిగువ వైపు వస్తున్న మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. ఆయా ప్రాంతాల్లో చుక్కనీరు లేక పోవడంతో పట్టణం నుంచి వాటర్ ప్యాకెట్ల బస్తాలను తీసుకెళ్లారు. మరికొందరు గుట్టల్లో నుంచి వచ్చే మంటలు పొలాలవైపు రానీయకుండా జేసీబీతో పొలాల సరిహద్దుల్లో కందకాలు తవ్వారు. ఇలా రాత్రిళ్లూ రైతులు నానా కష్టాలు పడ్డారు. కొంతమంది కావాలనే పరిసరాల్లో ఇష్టానుసారం కొండలు, గుట్టలకు నిప్పు అంటిస్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. నీళ్ల ట్యాంకర్లు, స్ప్రే పంపులతో మంటలు అదుపు .. పొలాల వైపు వస్తున్న మంటల్ని అదుపు చేసేందుకు పొలాల వద్ద నీళ్ల ట్యాంకులు సిద్ధం చేసుకొంటున్నారు. నీళ్ల ట్యాంకులతో పాటు పంటలపై మందులు స్ప్రే(పిచికారీ) చేసే పెట్రోల్ పంపులు, ఇంజిన్లను పొలాల వద్దకు తీసుకెళుతున్నారు. మంటలు కొండలు, గుట్టల నుంచి పొలాలవైపు వచ్చే సమయంలో నీళ్ల ట్యాంకుల నుంచి నీటిని ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నింపి తద్వారా పెట్రోల్ ఇంజిన్లు, పైపుల ద్వారా నీటిని మంటలపై స్ప్రే చేస్తూ అదుపు చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. వందల ఎకరాల్లో కాలిపోయిన, కొండలు గుట్టలు దిగువ పొలాల రైతులకు రాత్రిళ్లు తప్పని జాగరణ నీళ్ల ట్యాంకర్లు, స్ప్రే మిషన్ల ద్వారా మంటలు అదుపు చేస్తున్న వైనంరాత్రిళ్లు జాగారం తప్పడం లేదు కొన్ని రోజులుగా మా పొలాల సమీపంలో ఉన్న కొండలు, గుట్టల్లో మంటలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మంటలు పొలాల వైపు రాకుండా రాత్రిళ్లు అక్కడే జాగారం చేయాల్సి వస్తోంది. మాతో పాటు పరిసర పొలాల రైతుల కూడా పొలాల వద్దనే ఉంటున్నారు. రోజుల తరబడి మంటలు వస్తూనే ఉన్నాయి. అటవీశాఖ అధికారులు, సిబ్బంది మాకు సహాయం చేశారు. – రెడ్డెప్ప, రైతు, చిట్టిబోయనపల్లెకావాలనే నిప్పు పెడుతున్నారు కొండలు, గుట్టలకు గత పది రోజులుగా కావాలనే నిప్పు పెడుతున్నారు. కొంతమంది వ్యక్తులు పొలాల వద్ద చెత్తా చెదారం కాల్చివేయాలనే ఉద్దేశంతో నిప్పు పెడుతున్నారు. దీంతో అవి పెద్ద ఎత్తున ఎగిసి పడుతూ పరిసర పొలాలతో పాటు కొండలు, గుట్టల్ని కాల్చి బూడిద చేస్తున్నాయి. మంటలు అదుపు చేసే వారే లేక పదిరోజులుగా కొండలు, గుట్టలు, అడ్డూ ఆపులేకుండా కాలుతూనే ఉన్నాయి. – గయాజ్ అహ్మద్, గుర్రంకొండ