ఉచిత విద్యకు దరఖాస్తు చేసుకోండి
మదనపల్లె సిటీ : విద్యా హక్కు చట్టం–2009 ఉచిత నిర్భంద హక్కు చట్టం ప్రకారం 2026–27 విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్ర మణ్యం తెలిపారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న, బలహీన వర్గాల పిల్లలకు సమీప ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలల్లో చూసుకోవచ్చునని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ సచివాలయం, మండల వనరుల కేంద్రం, సంబంధిత పాఠశాలల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు ఎంఈఓలను సంప్రదించాలని సూచించారు.
ఇద్దరు సచివాలయ
ఉద్యోగుల సస్పెన్షన్
పెద్దతిప్పసముద్రం : విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న ఇద్దరు సచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఈ నెల 5న ఆయా శాఖల మండల స్థాయి అధికారులకు కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కమ్మచెరువు సచివాలయ పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీనివాసులు, మల్లెల సచివాలయ పరిధిలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పని చేస్తున్న జ్నానప్రకాష్ ప్రభుత్వం అప్పగించిన వివిధ సర్వే బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం, విధుల్లో అలసత్వం వహించడంతో కలెక్టర్ వారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
సీఐల బదిలీ
మదనపల్లె టౌన్ : జిల్లాలో తొమ్మిది మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మదనపల్లె వన్ టౌన్ సీఐ మహ్మద్ రఫీ టూటౌన్‌కు, టూ టౌన్ సీఐ వన్ టౌన్‌కు బదిలీ అయ్యారు. అలాగే జిల్లాలో మరికొంత మందికి బదిలీ ఉత్తర్వులు అందాయి.
వెనుకబడిన విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ ప్రోగ్రాం
– డీఈఓ సుబ్రహ్మణ్యం
మదనపల్లె సిటీ : పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక మోతీనగర్ వద్దనున్న గిరిజన గురుకుల విద్యాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భాగంగా జిల్లాలో 182 మంది విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పని చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట ఎంఈఓ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
రిమ్స్ పీజీ విద్యార్థుల ప్రతిభ
– ప్రిన్సిపల్ డాక్టర్ టి.జమున అభినందనలు
కడప : కడప ప్రభుత్వ వైద్య కళాశాల(రిమ్స్ )జనరల్ సర్జరీ విభాగ పీజీ విద్యార్థులు జాతీయస్థాయి సదస్సు ప్రతిభ కనబరిచారు. జాతీయస్థాయి–85 వ జనరల్ సర్జరీ విజ్ఞాన సదస్సు డిసెంబర్ 17, 18,19 తేదీలలో కలకత్తాలో నిర్వహించారు. ఈ సదస్సులో రిమ్స్ జనరల్ సర్జరీ పీజీ విద్యార్థులు పోస్టర్ విభాగంలో డాక్టర్ వంశీ కళ్యాణ్ మొదటి స్థానం, డాక్టర్ సత్యబ్రత్ పాణిగ్రహి, డాక్టర్ ఉపేంద్ర రెడ్డి ద్వితీయ స్థానం, డాక్టర్ వైష్ణవి మూడో స్థానం సాధించారు. వీరిని సోమవారం ప్రిన్సిపాల్ డాక్టర్ టి జమున ప్రత్యేకంగా అభినందించారు. వీరిని గైడ్ చేసిన జనరల్ సర్జరీ హెచ్ ఓ డి డాక్టర్ వినయ్, ఫ్యాకల్టీలందరినీ అభినందించారు.
విద్యార్థుల డేటా మార్పునకు మరో అవకాశం
కడప ఎడ్యుకేషన్ : ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల డేటాలో కొన్ని మార్పులకు యూడైస్ ప్లస్ పోర్టల్‌లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారని వైఎస్సార్ జిల్లా డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు.
ఉచిత విద్యకు దరఖాస్తు చేసుకోండి


