breaking news
Annamayya District News
-
రెండో రోజూ కొనసాగిన ఏసీబీ సోదాలు
గాలివీడు : రైతు వద్ద రూ.15 వేలు లంచం డిమాండ్ చేసిన కేసులో ఏసీబీ వలలో చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ సత్యమూర్తి వ్యవహారంలో రెండవ రోజూ సోదాలు కొనసాగాయి. మంగళవారం గాలివీడు విద్యుత్ శాఖ కార్యాలయంలో డీఎస్పీ సీతారామారావు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఏఈ సత్యమూర్తి, అతని కారు డ్రైవర్ శ్రీనివాసులును కార్యాలయంలో గంటకు పైగా రహస్యంగా విచారించారు. రైతుల నుంచి మరేదైనా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారా? ఇతర ఫిర్యాదులు ఉన్నాయా? అనే కోణంలో ఏసీబీ అధికారులు లోతుగా ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ అనంతరం నిందితులను తదుపరి చర్యల నిమిత్తం కడపకు తరలించినట్లు తెలుస్తోంది. బర్రెల దొంగలను పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు సిద్దవటం : కడప ఇందిరానగర్‌కు చెందిన జనార్దన్ మరో ఇద్దరు యువకులతో కలిసి బర్రెలను దొంగిలించి వాటిని తరలిస్తుండగా సిద్దవటం మండలంలోని కమ్మపాలెం గ్రామస్తులకు అనుమానం వచ్చి వారిని పట్టుకుని సిద్దవటం పోలీసులకు అప్పజెప్పారు. చింతకొమ్మదిన్నె మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన నాగార్జున అనే పాడి రైతుకు చెందిన 10 బర్రెలను జనార్దన్ మరో ఇద్దరు వ్యక్తులు దొంగిలించి వాటిని బద్వేల్ వైపు తీసుకెళుతుండగా మంగళవారం కమ్మపాలెం గ్రామస్తులు బర్రెల పొదుగు నుంచి పాలు కారిపోతుండటం గమనించి వాహనాన్ని ఆపారు. బర్రెల చెవులకు పాడి రైతు సెల్ నంబర్ ఉండటంతో ఫోన్ చేశారు. సీకేదిన్నె మండలం బలిజపల్లికి చెందిన నాగార్జున ఫోన్లో మాట్లాడుతూ తన బర్రెలు సోమవారం నుంచి కనిపించలేదని చెప్పాడు. దీంతో కమ్మపాలెం ఆంజనేయస్వామి గుడి వద్ద నుంచి బద్వేలు వైపు తీసుకువెళ్తున్న బర్రెలను ఆపామని తెలిపారు. వెంటనే నాగార్జున సంఘటన స్థలానికి చేరుకొని కమ్మపాలెం గ్రామస్తులతో కలిసి వెళ్లి బర్రెల దొంగలను పోలీసులకు అప్పజెప్పారు. జరిగిన సంఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. -
క్రిస్మస్కు వేళాయె..
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసిన ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధ, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ రామ గోవిందరెడ్డి, పార్టీ ముఖ్య నేతలు ఎస్వీ సతీష్ రెడ్డి, రఘురామిరెడ్డి , కొరముట్ల శ్రీనివాసులు, ఎస్బీ అంజద్‌బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, నరేన్ రామాంజుల రెడ్డి తదితరులుతళుక్కుమంటున్న క్రిస్మస్ స్టార్లు ఏసు రాకను సూచిస్తున్నాయి.. క్రిస్మస్ ట్రీలు ఎంచక్కా వెలుగులీనుతూ దైవ కుమారుడిని రారమ్మని ఆహ్వానిస్తున్నాయి..ఈనెల 25న ప్రపంచ పండగ క్రిస్మస్ పర్వదినానికి ప్రత్యేక ప్రార్థనల కోసం చర్చిలు అందంగా ముస్తాబయ్యాయి. ఇప్పటికే ముందస్తు వేడుకలతో జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంది. ఊరూవాడా చర్చిలు ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. – మదనపల్లిమదనపల్లెలోని జేసీఎం చర్చి -
ప్రజా సంక్షేమమే మా ధ్యేయం
కేవీపల్లె : ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం పనిగా పెట్టుకుందని విమర్శించారు. వారి అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉండడంతో అనతికాలంలోనే ప్రజల నుంచి పెద్ద ఎత్తున సమస్యలపై అర్జీలు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వాధికారులు పార్టీలకు అతీతంగా చిత్త శుద్ధితో పని చేయాలన్నారు. తాము నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. ప్రజలు సమస్యలను నేరుగా తమకు తెలుపుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, హరీష్‌రెడ్డి, డాక్టర్ ఇక్బాల్ అహ్మద్, నల్లారి తిమ్మారెడ్డి, పార్టీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, ఎంపీపీ ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి -
జిల్లాలో ఎస్ఐల బదిలీలు
రాయచోటి : అన్నమయ్య జిల్లా పరిధిలో ఎస్ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన వారి వివరాలు ఇలా.. ఎ.వెంకటేశ్వర్లు మదనపల్లి వన్ టౌన్ అర్బన్, డి. రవీంద్రబాబు గుర్రంకొండ, పి.శ్రావణి పెద్దమండ్యం, జి.శోభ లక్కిరెడ్డిపల్లి, సి.ఉమా మహేశ్వర్ రెడ్డి డీసీఆర్బీ అన్నమయ్య, టి.అనిల్ కుమార్ తంబళ్లపల్లి, ముక్కెళ్ల ప్రతాప్ ములకల చెరువు, ఎంకె నరసింహుడు సీసీఎస్–1 అన్నమయ్య, బి.రామకృష్ణారెడ్డి మదనపల్లి తాలూకా అర్బన్ పీఎస్–1, జి. చంద్రమోహన్ మదనపల్లి తాలుకా అర్బన్ పీఎస్–2, సి.తిప్పేస్వామి వాల్మీకిపురం, సి. చంద్రశేఖర్ సైబర్ క్రైమ్ సెల్ అన్నమయ్య, సి.సుస్మిత వీరబల్లి, జె.నరసింహారెడ్డి గాలివీడు, పి. రామకృష్ణ రాజంపేట అర్బన్ పీఎస్–1, పి.వెంకటేశు, రాజంపేట అర్బన్ పీఎస్–2, వై.సుమన్ పీసీఆర్–1, అన్నమయ్యకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన ఎస్ఐలు వెంటనే వారికి కేటాయించిన స్థానాలలో రిపోర్టు చేసుకోవాలని ఎస్పీ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఒంటిమిట్టలో ప్రధాన అర్చకుడిపై ఫిర్యాదు ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలోని ఓ ప్రధాన అర్చకుడిపై మంగళవారం ఒంటిమిట్ట పరిపాలన భవనంలో ఉన్న ఆలయ ఇన్చార్జి డిప్యూటీ ఈఓ ప్రశాంతికి ఒంటిమిట్ట గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వారి వివరాల మేరకు ప్రధాన అర్చకుడి వైఖరి వల్ల ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందన్నారు. భక్తులు వేసే కానుకలను స్వామి వారి హుండీలో పడనివ్వకుండా, భక్తుల వద్ద హారతి పల్లెం పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఒంటిమిట్ట రామాలయానికి గతంలో కంటే నేడు భక్తల తాకిడి ఎక్కువ అయినా హుండీ ఆదాయం పెరగకపోవడానికి ఆ ప్రధాన అర్చకుడి పాత్ర ఉందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఇన్చార్జి డిప్యూటీ ఈఓ విచారణ చేపడతామని చెప్పారు. రాజంపేటలో ఎనీటైం మందు! రాజంపేట : రాజంపేట బైపాస్‌లో ఉన్న బార్ల వద్ద సోమవారం తెల్లవారుజామున అమ్మకాలు గుట్టుచప్పుడుగా కొనసాగించారు. అటు సివిల్, ఇటు ఎకై ్సజ్ పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అధికారపార్టీకి చెందిన నేతల మద్దతుతో బార్లు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు. బైపాస్‌లో కడప వైపు వింటేజ్ రెస్టారెంట్ అండ్ బార్, తిరుపతి వైపు జీకేఎస్ఆర్ కళ్యాణమండపం వద్ద తిరుమల బార్ రెస్టారెంట్ నిర్వాహకులు అసలు ప్రభు త్వం ఉందా లేదా అన్నట్లుగా దర్జాగా నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో రాజంపేట బైపాస్‌లో తెల్లార్లు మద్యం లభ్యం కావడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. బైపాస్‌లో ఇటీవల మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు అనేకం జరిగాయి. ఉదయం 10 గంటలకు తెరవాల్సిన బార్లు ఉదయం 6గంటలకే తెరిచి దర్జాగా మద్యం విక్రయిస్తున్నారు. అలాగే రాత్రి 11 గంటల వరకు కొనసాగించాల్సిన బార్లు అర్థరాత్రి వరకు మద్యం అమ్మకాలను సాగిస్తున్నారు. ఎనీటైం మద్యం కావాలంటే బైపాస్కు వెళ్లాల్సిందే అని మద్యం ప్రియులు అంటున్నారు. కడప ఎడ్యుకేషన్ : కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో నిర్వహించిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ మంగళవారంతో ముగిసింది. ఈ పోటీలలో ఓవరాల్ చాంపియన్, స్పోర్ట్స్ చాంపియన్, గేమ్స్ చాంపియన్తోపాటు వ్యక్తిగత చాంపియన్‌గా కడప ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు నిలిచారు. జిల్లావ్యాప్తంగా 15 పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రెండు రోజులపాటు అఽథ్లెటిక్స్ తదితర పోటీల్లో పాల్గొన్నారు. అన్ని ఈవెంట్లలో కడప ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు స్థిరమైన ప్రదర్శనతో అగ్రస్థానాన్ని దక్కించుకుని చాంపియన్‌గా నిలిచారు. వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ను కడప ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన భవ్యశ్రీ దక్కించుకుంది. అలాగే వాలీబాల్, ఖోఖో, లాంగ్‌జంప్, బ్యాడ్మింటన్, డిస్కస్‌త్రో, రన్నింగ్ పోటీలలో బాలికలు తమ ప్రతిభను చాటి విజేతలుగా నిలిచారు. విజేతలకు డీఆర్డీఏ– వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతిలు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బందితోపాటు ఫిజికల్ డైరెక్టర్ పాల్గొన్నారు. అక్రమాల వెలికితీతకే సామాజిక తనిఖీ కలకడ : జిల్లాలోని అన్ని గ్రామాలలో జరుగుతున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో అవినీతి, అక్రమాలు వెలికి తీయడానికే ప్రతి మండలంలో సామాజిక తనిఖీ చేపడుతున్నట్లు డ్వామా పీడీ వెంకటరత్నం అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గత ఏడాది ఏప్రిల్–1వతేదీ నుంచి ఈ ఏడాది మార్చి–31వతేదీ జరిగిన పనులను సామాజిక తనిఖీ బృఽందం తనిఖీ చేసి నివేదికలను బహిరంగ సభలో చదివి వినిపించారు. అవినీతికి సంబంధించి రూ.19,179 రికవరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భానుప్రసాద్, అంబుడ్స్‌మెన్ శ్రీరాములు, కలికిరి ఏపీడీ శ్రీనివాసులు, క్లస్టర్ ఏపీడీ మధుబాబు, ఎస్టీఎం కోనయ్య తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలం
రాయచోటి అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని.. వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిఽథున్‌రెడ్డి , వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఆత్మీయంగా మమేకమై వారి కష్టనష్టాలను శ్రద్దగా విని, ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కడప– బెంగళూరు రైల్వే లైనుకు నిధులు మంజూరు చేయండి... కడప – బెంగళూరు రైల్వే లైన్ పనులకు తక్షణమే నిధులు మంజూరు చేసి ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రైల్వే లైను ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి అత్యంత కీలకమని ఎంపీ పేర్కొన్నారు. రాయచోటి ప్రాంతంలో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు, బైపాస్ రోడ్డు నిర్మాణాలు అప్పటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సహకారంతో విజయవంతంగా పూర్తయ్యాయని గుర్తుచేశారు. మదనపల్లె–పీలేరు కనెక్టివిటీ రోడ్లను కూడా అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించామని తెలిపారు. కడప– బెంగళూరు రైల్వే లైనుకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు ఇస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పారని ఎంపీ గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రైల్వేలైను ప్రాజెక్టుకు మంజూరు జరగకపోతే, రాన్ను రోజుల్లో అంచనా వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. దీంతో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంపీగా మిథున్ రెడ్డి ప్రజా గొంతుకగా నిలుస్తున్నారు: శ్రీకాంత్ రెడ్డి రాజంపేట పార్లమెంటు పరిధిలోని ప్రజల సమస్యలను ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంటు వేదికగా గళమెత్తి ఈ ప్రాంత గౌరవాన్ని ప్రాధాన్యతను దేశ స్థాయిలో పెంచుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు. ప్రజల తరపున నిర్బయంగా పోరాడే నాయకుడిగా ఎంపీ మిథున్ రెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటిలో ఎంపీ మిథున్ రెడ్డికి ఘన స్వాగతం.. తొలుత రాయచోటికి విచ్చేసిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. పట్టణమంతా వైఎస్సార్సీపీ నినాదాలతో మార్మోగింది. చిత్తూరు రింగ్ రోడ్డు నుంచి వైఎస్సార్సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో ఎంపీకి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎస్ఎన్ కాలనీలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఎంపీ చేరుకోగా అక్కడ మహిళలు హారతులిచ్చారు. గజమాలతో సత్కరించారు. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ మిథున్ రెడ్డి ఎంపీ మిఽథున్ రెడ్డికి హారతులిచ్చి స్వాగతం పలుకుతున్న మహిళలు, నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకుడు విజయభాస్కర్‌ను పరామర్శిస్తున్న ఎంపీ మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి బీసీ నాయకుడు విజయభాస్కర్‌పై జరిగిన దాడి అత్యంత హేయమైనదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం రాయచోటి పట్టణంలోని ఎన్జీవో కాలనీలో నివాసముంటున్న విజయభాస్కర్‌ను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిడి తెలుసుకుని, ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే , పార్టీ శ్రేణులపై అన్యాయంగా , అక్రమంగా దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పి.దేవనాథరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆవుల విష్ణువర్థన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఫయాజ్ బాషా, వైఎస్సార్సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేపారీ మహమ్మద్ ఖాన్, మండల కన్వీనర్ యధుభూషణరెడ్డి, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి జాఫర్ అలీకాన్, కౌన్సిలర్లు, రాయచోటి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నాయకులు, సర్పంచులు, యువత పాల్గొన్నారు. -
పంచాయతీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలి
మదనపల్లె రూరల్ : జిల్లాలోని అన్ని పంచాయతీల్లో కార్యదర్శి నుంచి డీపీఓ వరకు ఉదయం 7 గంటలకు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా ఉండాలని డీపీఓ రాధమ్మ అన్నారు. మంగళవారం పట్టణంలోని డీడీఓ కార్యాలయంలో తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాలకు సంబంఽధించి డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులతో పారిశుధ్య నిర్వహణ, స్వామిత్వ సర్వేపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో ప్రతిరోజు శానిటైజేషన్ చేయడంతో పాటు పారిశుధ్య నిర్వహణను స్వయంగా పర్యవేక్షించాలన్నారు. గ్రీన్ అంబాసిడర్లు రెండురోజులకు ఒకసారి ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్‌యార్డులకు తరలించి, వర్మీ ప్రొడక్షన్ చేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా సేకరిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో 80 శాతానికి పైగా సంతృప్తికరంగా ఉన్నట్లు నమోదు కావాలన్నారు. స్వర్ణపంచాయతీ పోర్టల్‌లోని క్యూఆర్ కోడ్ ద్వారానే కార్యదర్శులు పన్ను వసూళ్లు చేయాలన్నారు. రసీదులు ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు చేపట్టిన స్వామిత్వ కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేయాలన్నారు. జిల్లాలోని 501 గ్రామ పంచాయతీల్లో 286 గ్రామ పంచాయతీల్లో స్వామిత్వ సర్వే జరుగుతోందని, 162 పంచాయతీల్లో కొలతలు వేస్తున్నారని, 95 పంచాయతీల్లో గ్రామసభలు పూర్తయ్యాయన్నారు. డిసెంబర్ 27, జనవరి 2, 7 తేదీల్లోపు మూడు విడతలుగా అన్నిచోట్ల గ్రామసభలు నిర్వహించి 32 నోటిఫికేషన్ జారీ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీడీఓ అమరనాథరెడ్డి, డీఎల్పీఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
సీఎండీ శివశంకర్ పీలేరు: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిండమే లక్ష్యమని ఏపీఎస్పీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) శివశంకర్ అన్నారు. మంగళవారం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని గూడరేవుపల్లె పంచాయతీ పుట్టావాండ్లపల్లె పర్యటించి విద్యుత్ వినియోగంపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. టాప్ సోలార్ ప్లాంట్లు, డిజిటల్ మీటర్లు, విద్యుత్ సరఫరాలో అంతరాయం, కనెక్షన్లు సమస్యలు, బిల్లుల వివాదాలు, విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణ, డిజిటల్ చెల్లింపులు వంటి అంశాలపై ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా 14 సమస్యలుగుర్తించి పరిష్కార మార్గం చూపినట్లు తెలిపారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్దేశిత గ్రామాలు, పట్టణాల్లో పరిశీలన కార్యక్రమం చేపట్టాలని కోరారు. వినియోగదారులు తమ సమస్యలపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ సీఎం 89777 16661 నెంబర్‌కు కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి, డీఈఈ అమీర్‌బాషా, రూరల్ ఏఈ రామమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
● డీఐజీ కోయ ప్రవీణ్ ● ముగిసిన జిల్లా పోలీసు వార్షిక క్రీడా సంబరాలు రాయచోటి : క్రీడలు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. అన్నమయ్య జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో మూడు రోజులుగా ఉత్సాహంగా సాగిన జిల్లా పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ – 2025 మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు కర్నూలు రేంజ్ డీఐజీ, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులను అందజేశారు. డీఐజీ మాట్లాడుతూ మైదానంలో ప్రదర్శించిన పట్టుదలను నేరాల నియంత్రణలోనూ చూపాలన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు విధుల్లో ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. క్రీడల్లో అత్యధిక పాయింట్లు సాధించిన జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ జట్టు ఛాంపియన్ ట్రోఫీని కై వసం చేసుకుంది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ‘టగ్ ఆఫ్ వార్ (తాడు లాగుట)’ పోటీ ఫైనల్లో రాయచోటి సబ్ డివిజన్ – ఏ ఆర్ జట్టు పోటీపడగా, ఏఆర్ జట్టు అజేయ విజేతగా నిలిచింది. జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, మదనపల్లి డీఎస్పీ మహేంద్ర, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబసభ్యలు పాల్గొన్నారు. -
కడప రాయుడి కోవెలలో కల్యాణ రాగం
కడప సెవెన్‌రోడ్స్: తిరుమలకు తొలిగడపగా భావించే కడప నగరంలోని దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలకు విశేష అభిషేకాలు నిర్వహించి వధూవరులుగా అలంకరించి కల్యాణ వేదికపైగల ప్రత్యేక పీఠాలపై కొలువుదీర్చారు. అనంతరం ప్రధాన అర్చకులు మయూరం కృష్ణమోహన్ ఆధ్వర్యంలో కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. సాయంత్రం కల్యాణమూర్తులను ప్రత్యేక పల్లకీపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. సాక్షాత్తు వైకుంఠ వాసుడే అమ్మవార్లతో కలిసి తమ ఇంటి ముంగిటికి రావడంతో భక్తులు పులకించి పూజాద్రవ్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అర్చకులు మంగళ హారతులు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
● వీబీజీ–రామ్ జీ ని రద్దు చేయాలి ● సబ్ కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీల నిరసనసబ్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న సీపీఎం కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులుసబ్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు తోపుకృష్ణప్ప తదితరులుమదనపల్లె రూరల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగిస్తూ, మోదీ సర్కారు నూతనంగా తీసుకువచ్చిన వీబీ–జీ–రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపుకృష్ణప్ప డిమాండ్ చేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్షాలైన సీపీఎం, సీపీఐ పార్టీలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కొనసాగించాలని కోరుతూ వేర్వేరుగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఈ సందర్భంగా రెండు పార్టీల ముఖ్యనాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ స్వాతంత్రోద్యమ కాలపు నేతల పేర్లను నిస్సిగ్గుగా తొలగించేందుకు వెనుకాడటం లేదన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో కొత్త చట్టం వీబీ–జీ–రామ్–జీ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ ప్రభుత్వం మహాత్ముడిపై విద్వేషం వెళ్లగక్కుతోందన్నారు. మతోన్మాదం ప్రతిబింబించేలా కొత్త చట్టాలకు పేర్లు పెడుతోందన్నారు. రైతు కూలీలకు ఉపాధి కల్పించేందుకు చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టానికి బీజేపీ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందన్నారు. నూతన చట్టం రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం మోపనుందన్నారు. ఈ కొత్త బిల్లు వలన ఉపాధి హామీ కూలీలకు ఒరిగేది ఏమీ ఉండదన్నారు. వేతనాల పెరుగుదల, పనిదినాల పెంపు సవ్యంగా లేకపోవడం, సగటువేతనం రూ.240కు తగ్గించడం జరిగిందన్నారు. యూపీఏ ప్రభుత్వంలో చట్టం తెచ్చినప్పుడు కేంద్రం 90శాతం నిధులు, రాష్ట్రాలు 10 శాతం నిధులు ఉపాధి హామీకి కేటాయించాలని నిర్ణయిస్తే, ప్రస్తుత మోదీ ప్రభుత్వం రాష్ట్రాల మీద భారం పెంచే విధంగా అడుగులు వేస్తోందన్నారు. ఓ వైపు ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోందన్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న రాష్ట్రాల వాటాను ఎలా భరిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామి కనుక, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసపూరితమైన కుట్రలను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు హరిశర్మ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగరాజు, శేఖర్, నారాయణ, రమణ, సీపీఐ చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి శివారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మురళీ, ఏఐఎస్ఎఫ్ మాధవ్, ఏఐటీయూసీ తిరుమల, చిన్నప్ప, వెంకటరమణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారం
రాయచోటి : వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పోలీస్ కార్యాలయాలకు వచ్చేవారి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం చేయాలని ఆదేశించారు. పెద్దమండ్యం మండలానికి చెందిన ఓ దివ్యాంగుడు కార్యాలయానికి రాగా ఎస్పీ ఆయన వద్దకే వెళ్లి ఫిర్యాదును స్వీకరించారు. జిల్లా కార్యాలయానికి రాలేని వారు తమ సమీప పోలీసు స్టేషన్లో, సర్కిల్, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఇచ్చే ఫిర్యాదులను కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలుగానే పరిగణించి పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి -
ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ
రాయచోటి/గాలివీడు: రాయచోటి విద్యుత్ శాఖ పరిధిలోని గాలివీడు సబ్‌స్టేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ సత్యమూర్తి, అతని డ్రైవర్ రైతు నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. కడప రేంజ్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ జి.సీతారామరావు ఆధ్వర్యంలో సోమవారం ఈ ఆపరేషన్ నిర్వహించారు. గాలివీడు మండలం ఎగువగొట్టివీడు గ్రామం కుమ్మరపల్లెకు చెందిన రైతు ఎర్రయ్యగారి నాగేశ్వర తన పొలం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు గాలివీడు మండలం సబ్‌స్టేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ సత్యమూర్తిని కలిశారు. పొలం వద్ద ట్రాన్స్ఫర్ ఏర్పాటుకు గత ఏడాదిలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ఆధారంగా ట్రాన్స్‌కో అధికారులు పొలం ఫీల్డ్ వెరిఫికేషన్ చేపట్టి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ మేరకు విద్యుత్ శాఖకు డబ్బులు కూడా చెల్లించారు. శాఖపరంగా అన్ని చర్యలు తీసుకున్నా పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంలో ఇంజనీర్ రెండు వారాలుగా ఆలస్యం చేస్తూ వచ్చారు. విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు రూ.15 వేలు లంచంగా ఇవ్వాలని ఆ రైతును డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు సోమవారం రాయచోటిలోని వై జంక్షన్ శివాలయం దగ్గర రైతు యర్రగారి నాగేశ్వర నుంచి రూ.15 వేలు డబ్బులు తీసుకుంటున్న సమయంలో డ్రైవర్ ఎన్.శ్రీనివాసులుతో పాటు ఏఈ సత్యమూర్తిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. -
సమస్యకు.. పరిష్కారమేదీ !
● కలెక్టరేట్‌కు క్యూ కడుతున్న బాధితులు ● వ్యయ ప్రయాసలకోర్చి పదేపదే తిరుగుతున్నా దక్కని ఫలితం ● పింఛన్ రేషన్, రెవెన్యూ సమస్యలతోనే ఎక్కువమంది సతమతం ● ప్రతి సోమవారం కలెక్టరేట్లో సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ● గతంలో దరఖాస్తులు ఇచ్చిన వారే పదేపదే వస్తున్న వైనం సాక్షి రాయచోటి : దూరాన్ని.. భారాన్ని లెక్క చేయకుండా కలెక్టరేట్‌కు వచ్చే బాధితుల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. వ్యయ ప్రయాసలకోర్చి అర్జీ ఇచ్చినా ఫలితం ఉండడం లేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఫలితంగా బాధితులు పదే పదే కలెక్టరేట్‌కు కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. అర్జీ చేతబట్టి అధికారుల ఎదుట గోడు వెల్లబోసుకుంటూనే ఉన్నారు. ఈ వారం కూడా జిల్లా కేంద్రమైన రాయచోటి కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులు పోటెత్తారు. కలెక్టర్ నీరజ్‌కుమార్, జేసీ ఆదర్శ రాజేంద్రన్‌లు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. పదేపదే తిరుగుతున్నా.. జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి సుమారు 250–300 మంది వరకు వస్తున్నారు. సమస్యలు పరిష్కారం కాక వచ్చిన వారే మళ్లీమళ్లీ వస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేకంగా తీసుకుని పరిష్కారానికి చొరవ చూపుతున్నా క్షేత్ర స్థాయిలో అధికారులు అర్జీలను బుట్టదాఖలు చేస్తున్నారు. రెవెన్యూ సమస్యలే అధికం జిల్లాలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ఎక్కువగా రెవెన్యూకు సంబంధించిన సమస్యలే వస్తున్నాయి. ప్రధానంగా భూములు, ఆన్లైన్, మ్యూటేషన్, సర్వేలు, రికార్డుల సమస్యలు...భూముల ఆక్రమణలు, దౌర్జన్యాలు, కబ్జాల సమస్యలతోనే బాధితు లు అధికారులకుమొర పెట్టుకుంటున్నారు.అలాగే రేషన్‌కార్డులు, పెన్షన్లు, నిరుద్యోగులు ఉపాధి, ఇంటి స్థలాలు, గ్రామాల్లో స్థానిక సమస్యలతోనూ అనేక మంది వస్తున్నారు. నా భర్త మరణ ధృవీకరణ పత్రానికి నా ఆధార్ నెంబరు లింక్ చేసిన కారణంగా నా రేషన్ కార్డు రద్దయింది. పేద వర్గానికి చెందిన నా రేషన్ కార్డు రద్దు కావడంతో రేషన్ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నా రేషన్ కార్డు పునరుద్ధరించాలని అధికారులను వేడుకున్నాను. – వి.పద్మావతమ్మ, నడింపల్లె, కలికిరి మండలం, అన్నమయ్య జిల్లా -
నేటి నుంచి వైఎస్ జగన్ జిల్లా పర్యటన
పులివెందుల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23వ తేదీనుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకమవుతారు. ఇడుపులపాయలో, పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. తొలిరోజు పర్యటన ఇలా.. ఈనెల 23వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు బెంగుళూరు ఎయిర్‌డ్రోం నుంచి హెలీకాప్టర్ ద్వారా పులివెందులకు బయలుదేరుతారు. సాయంత్రం 4గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.15గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్‌కు చేరుకుంటారు. 4.15గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ప్రజలతో మమేకమవుతారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. రెండో రోజు పర్యటన ఇలా.. 24వ తేదీ బుధవారం ఉదయం 9.30గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయలోని ప్రేయర్ హాలు వద్దకు బయలుదేరుతారు. 10.30గంటలకు అక్క డికి చేరుకుంటారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రేయర్ హాలు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. మధ్యా హ్నం 1గంటకు ఇడుపులపాయ ప్రేయర్ హాలు వద్ద నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2గంటలకు పులివెందుల భాకరాపురంలో ఉన్న తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 2గంటల నుంచి రాత్రి 7గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్‌లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. మూడో రోజు క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొననున్న మాజీ సీఎం 25వ తేదీ క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం ఉదయం 8.10గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి పులివెందుల సీఎస్ఐ చర్చి వద్దకు బయలుదేరుతారు. 8.30గంటలకు పులివెందుల సీఎస్ఐ చర్చి వద్దకు చేరుకుంటారు. 8.30గంటల నుంచి 10గంటల వరకు పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 10.20గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.30గంటలకు హెలీకాప్టర్ ద్వారా బెంగుళూరుకు బయలుదేరుతారు. నేడు పులివెందులకు చేరుకోనున్న వైఎస్ జగన్ ప్రజలతో మమేకం కానున్న మాజీ సీఎం 24వ తేదీ ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు, పులివెందులలో ప్రజా దర్బార్ 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగాపులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు -
ఆకేపాడు విభజనను అడ్డుకున్న గ్రామస్తులు
రాజంపేట రూరల్ : కొన్ని తరాల నుంచి 14 గ్రామాలు కలిసి ఒకే పంచాయతీగా కొనసాగుతున్న ఆకేపాడు పంచాయతీని 4 పంచాయతీలుగా విభజించాలని చూసిన కూటమి నాయకుల ప్రయత్నాలను సర్పంచ్ ఆకేపాటి శ్రీనివాసులరెడ్డి(మురళీరెడ్డి) ఆధ్వర్యంలో మూకుమ్మడిగా ప్రజలు అడ్డుకున్నారు. మండల పరిధిలోని ఆకేపాడు పంచాయతీ వడ్డుకాడపల్లిలో సోమవారం డీపీఓ రాధమ్మ ఆదేశాల మేరకు డీఎల్పీఓ మస్తాన్‌వలీ గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆకేపాడు పంచాయతీలోని 321 మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మస్తాన్‌వలీ ఆకేపాడు పంచాయతీని 4 పంచాయతీలుగా విభజించటం ఇష్టం ఉన్న వారు వచ్చి సంతకం చేయాలన్నారు. ఏ ఒక్కరూ స్పందించలేదు. అదే విధంగా ఆకేపాడు పంచాయతీని ఒకే పంచాయతీగా ఉంచాలని కోరుకునే వారు వచ్చి సంతకం చేయాలని కోరడంతో మూకమ్ముడిగా తరలివచ్చి 321 మంది సంతకం చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి సొంత పంచాయతీ ఆకేపాడు కావడం గమనార్హం. ఈ గ్రామసభలో ఈఓఆర్డీ అస్లఫ్వలీ, పంచాయతీ సెక్రటరీ కరిముల్లా, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. -
సివిల్ ఇంజినీరింగ్ పాత్ర కీలకం
కురబలకోట : వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో సివిల్ ఇంజినీరింగ్ పాత్ర కీలకమని చుట్టూ కన్పించే వివిధ నిర్మాణాల వెనుక ఇంజినీర్ల కృషి ఎనలేనిదని పూణేలోని హిల్టి టెక్నాలజీస్ కంపెనీ టెక్నికల్ ఇంజినీర్ పి. కార్తీక్ అన్నారు. అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో అధునాతన సివిల్ ఇంజినీరింగ్ నిర్మాణ పద్ధతులపై మూడు రోజుల వర్క్‌షాపు సోమవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూపకల్పన చేయబడిన నిర్మాణాలు, వంతెనలు, రహదారులు, నీటి పారుదల వ్యవస్థలు, పట్టణ ప్రణాళిక ఇవన్నీ సివిల్ ఇంజినీరింగ్ రంగానికి చెందిన వన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ వంటి నూతన సాంకేతికతలు సివిల్ ఇంజినీరింగ్‌ను సమర్థవంతంగా మార్చాయన్నారు. దేశ అభివృద్ధికి సివిల్ ఇంజినీరింగ్ రంగం బలంగా ఉండాల్సిందేనన్నారు. భవిష్యత్ తరాలకు సుస్థిర ప్రపంచాన్ని అందించడంలో కీలకంగా నిలవనుందన్నారు. -
ఆయనో జూనియర్ అసిస్టెంట్. మున్సిపాలిటిలో పెట్రోల్ బంకు నిర్వహణ లావాదేవి పర్యవేక్షించారు. అధికారులను మభ్యపెట్టి ఆదాయాన్ని దర్జాగా దోపిడీ చేశారు. వేలు..లక్షలు కాదు.. రూ.1.23కోట్లు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు రావాల్సింది ఉందంటూ చిట్టా రాశారు. ఆపై ఎంచక్
● పెట్రోల్ పంపు నిర్వహణలో మున్సిపల్ ఉద్యోగి చేతివాటం ● మున్సిపల్ ఆదాయాన్ని దర్జాగా దోచేసిన వైనం ● ఎంచక్కా ప్రమోషన్‌పై బదిలీ.. సహకరించిన కమిషనర్ సాక్షి ప్రతినిధి, కడప : ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ మున్సిపల్ పెట్రోలు బంకు నిర్వహణ బాధ్యతలు చూ సేవారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీకి స్కెచ్ వేశారు. కోటి రూపాయలకు పైగా కుచ్చుటోపీ వేసి ఇంధనం పక్కదారి పట్టించారు. పైగా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలకు 2022–25 వరకూ రూ. 1,23,47,318ల విలువగల పెట్రోలు, డీజల్‌ను అప్పుగా పట్టినట్లు, వారి నుంచి డబ్బులు రావాలంటూ తాపీగా వెల్లడించారు. ఇంత మొత్తం పెండింగ్‌లో ఉంటే పెట్రోల్ పంపు నిర్వహణ సాధ్యమా?అనేది ప్రశ్నార్థకం. వచ్చే ఆదాయం మొత్తం స్వాహా చేసి ప్రొద్దుటూరులో లేని ట్రావెల్స్ ఏజెన్సీల పేర్లు పొందుపర్చినట్లు కొందరు వివరిస్తున్నారు. మాతాంగి ట్రావెల్స్ 2023వ సంవత్సరం నుంచి 2025 అక్టోబరు నెల వరకు అప్పు రూ. 13,75,344 ఉన్నట్లు లెక్క రాశారు. ఈ ట్రావెల్స్ ప్రొద్దుటూరులో ఉన్నట్లు రికార్డుల్లో లేకపోవడం విశేషం. అధికారులూ అమ్ముడుబోయారా! ప్రొద్దుటూరు పట్టణం కొర్రపాడు రోడ్డులోని త్రీ టౌన్ పోలీసుస్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ పెట్రోలు బంకును 2021 ఆగస్టు 18న ప్రారంభించారు. అప్పటి నుంచి జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్‌కుమార్ పెట్రోలు బంకు మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. పెట్రోల్ పంపు ద్వారా మున్సిపాలిటికి ఆదాయం లభించకపోవడంతో ఇటీవల కమిషనర్ రికార్డులు పరిశీలించారు. దాంతో ఒక్కమారుగా వ్యవహారం బహిర్గతం అయ్యింది. రూ.1.23కోట్లు విలువజేసే పెట్రోలు, డీజల్‌ను ప్రైవేటు వ్యక్తులకు అధికారుల అనుమతి లేకుండా అప్పుగా ఇవ్వడం వెలు గులోకి వచ్చింది. ఎవరి అనుమతి తీసుకుని మేనేజర్‌గా పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ అప్పులు ఇచ్చా రు అన్న ప్రశ్నలకు సమధానం లేదు. వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాల్సిన కమిషనర్ సైతం మిన్నకుండిపోయారు. ప్రలోభాలకు లోబడి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. కమిషనరా మజాకా ! ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కమిషనర్ విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీ తన సొంతమైనట్లు తాను ఆడిందే ఆట...పాడిందే పాటగా అన్నట్లుగా వ్యవహరించారు. పెట్రోల్ పంపు నిర్వహణలో లెక్కాపత్రం లేని రూ.1.23కోట్ల అవినీతిపై కమిషనర్ నాన్చుడు ధోరణి అవలంబించారు. అదే సమయంలో మున్సిపల్ చైర్మన్ సీసీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ ఓబులేసు తనకు తెలియకుండా అజెండాలో లేని అంశాలను పొందుపరిచారని, అతన్నిసస్పెండ్ చేయాలంటూ సిఫార్సులు చేశారు. ఒకే మున్సిపాలిటిలో పని చేసే ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ల వ్యవహారంలో ఒకరిపై ఒకలా, మరొకరిపై ఇంకోలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్ పంపు నిర్వహణలోని లోపాలపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ ఆదేశాల మేరకు స్పెషల్ ఆడిట్ ఆఫీసర్‌ను నియమించాం. సదరు అధికారి క్షుణ్ణంగా రికార్డులు పరిశీలిస్తున్నారు. ఈ వారంలో నివేదిక వస్తుంది. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదు పరి చర్యలు తీసుకుంటాం. – రవిచంద్రారెడ్డి, కమిషనర్,ప్రొద్దుటూరు మున్సిపాలిటీ -
భూమి ఆక్రమిస్తున్నారయ్యా..
కలెక్టరేట్ వద్ద బైఠాయించిన 84 ఏళ్ల ఈ వృద్ధురాలి పేరు షంషాద్బీ. గాలివీడు మండలం. దశాబ్దాలుగా ఈమె ఆధీనంలో సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిపై కబ్జాదారులు కన్నేశారు. భూమిని కబ్జా చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు పర్యాయాలు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులకు అర్జీలు పెట్టుకున్నా ఫలి తం శూన్యం. పోలీసులు, రెవెన్యూ అధికారులకు తన ఆవేదన తెలియజేసినా అది అరణ్య రోదనగానే మిగిలింది. ఈ క్రమంలో కలెక్టరేట్ వద్ద బైఠాయించిన ఈ వృద్ధురాలికి కమ్యూనిస్టు మార్కిస్టు పార్టీ నేతలు గుజ్జుల రమణయ్య, పోరెడ్డి రమణారెడ్డిలు సంఘీభావం తెలిపారు. అధికారుల తీరుపై నిరసనలో పాల్గొన్నారు. వృద్ధురాలికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
నేటి నుంచి మాచుపల్లి దర్గా ఉరుసు
కడప సెవెన్‌రోడ్స్ : కడప నగర శివార్లలోని మాచుపల్లె గ్రామంలో వెలసిన హజరత్ సయ్యద్ షావలీ దర్గా ఉరుసు ఉత్సవాలను మంగళవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు దర్గా ముజావర్ సయ్యద్ సలావుద్దీన్ తెలిపారు. ఈనెల 23న గంధోత్సవం సందర్భంగా రాత్రి 9 గంటలకు గంధం, పూలచాందిని ఫకీర్ల మేళతాళాలతో, బ్యాండు వాయిద్యాలతో గ్రామంలో మెరవణి నిర్వహించి గురువుల మజార్‌వద్ద సమర్పిస్తామన్నారు. అనంతరం ఫాతెహా ఉంటుందని పేర్కొన్నారు. 24న ఉరుసు సందర్భంగా వివిధ కార్యక్రమాలతోపాటు రాత్రి ఖవ్వాలీ కచేరి ఉంటుందన్నారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని అన్నదానం నిర్వహిస్తామన్నారు. 25న తహలీల్ ఫాతెహాతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఒంటిమిట్టలో వైభవంగా అధ్యయనోత్సవాలు ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ధనుర్మాస పుజల్లో భాగంగా అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఆలయ రంగమండపంలో సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను ఆశీనులు చేసి, ముత్యాల ఆభరణాలు తొడిగి, పట్టు వస్త్రాలు, పుష్పమాలికలతో సుందరంగా అలంకరించారు. వేద పండితులు స్వామి వారి చెంత పారాయణం చేశారు. -
రాజంపేటను జిల్లా కేంద్రంగా సాధించుకుందాం
రైల్వేకోడూరు అర్బన్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాల్సిన బాధ్యత కుటమి ప్రభుత్వంపై ఉందని, కలిసికట్టుగా పోరాటాలు చేసైనా జిల్లా కేంద్రంగా రాజంపేటను సాధించుకుందామని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. టోల్గేట్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలకు సోమవారం సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్ర సాధన కోసం జరుగుతున్న పోరాటాలకు వైఎస్సార్సీపీ మద్దతు సంపూర్ణంగా ఉంటుందన్నారు. కూటమి నాయకులు కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరును మాత్రమే జిల్లాగా ఉంచడంతో ఇప్పుడు రాజంపేట జిల్లా ప్రజలకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అన్నమయ్య జిల్లాకు రాజంపేట కేంద్రంగా ప్రకటించాలని డిమండ్ చేశారు. మంగళవారం జరిగే రైల్వేకోడూరు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పుల్లపేట ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, ఓబులవారిపల్లి, చిట్వేలి, పార్టీ అధ్యక్షులు వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డిలు, జేఏసీ అధ్యక్షుడు ముత్యాల పెంచలయ్య, పట్టణ అధ్యక్షుడు సీహెచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మదనపల్లెలో కార్డెన్ సెర్చ్
మదనపల్లె రూరల్ : పట్టణంలో సోమవారం వేకువజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మహేంద్ర పర్యవేక్షణలో పట్టణంలోని దక్నీపేట, అగడ్తవీధి, గౌసియా వీధి, త్యాగరాజవీధి, బడేమకాన్ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన రికార్డులు లేని 61 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, నేరాల నియంత్రణే లక్ష్యంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. పాత నేరస్థులు, రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచామన్నారు. పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా యువత చెడుమార్గాల్లో వెళ్లకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా రికార్డులు కలిగి ఉండాలన్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సీఐలు మహమ్మద్ రఫీ, రాజారెడ్డి, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.61 ద్విచక్రవాహనాలు స్వాధీనం -
ఆగని ఆందోళనలు
రాజంపేట టౌన్ : రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్న ఆందోళనలు రోజు, రోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా నిత్యం ఏదో ఒక ఆందోళనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా సోమవారం భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి చంద్రయ్య ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు పట్టణంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆర్అండ్బి బంగ్లా నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు దారి వెంబడి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. కాగా ర్యాలీ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే కార్మికులంతా ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించి ఆర్ఎస్ రోడ్డును దిగ్బంధించి ధర్నాకు దిగారు. ఉన్నఫళంగా కార్మికులు మెరుపు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని నిలువరించేందుకు కష్టపడాల్సి వచ్చింది. ధర్నాను విరమించాలని కోరినప్పటికి కొంతసేపు కార్మికులు ససేమిరా అని అలాగే బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి ఆర్ఎస్ రోడ్డులో వాహనాలు బారులు తీరాయి. అనంతరం ఆందోళనకారులు సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని సబ్‌కలెక్టర్ భావనకు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా గాలి చంద్రయ్య మాట్లాడుతూ రైల్వేకోడూరు, రాయచోటికి రాజంపేట మధ్యలో ఉందని అందువల్ల రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్నారు. అన్నమయ్య జన్మస్థలం రాజంపేట ప్రాంతమని, రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా చేయడమే సముచితమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధులు కె.వెంకటయ్య, పొట్టి సుబ్బరాయుడు, వేముల నరసింహ, మహమ్మద్ హుస్సేన్, నన్నేసాబ్, వెంకటస్వామి, పి.సుబ్రమణ్యం, నారాయణ పాల్గొన్నారు. తీవ్రరూపం దాల్చిన రాజంపేట జిల్లా సాధన ఉద్యమం భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ మెరుపు ధర్నా ఆర్‌ఎస్‌రోడ్డు దిగ్బంధం -
చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
సిద్దవటం : మండలంలోని గుండ్లమూలపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వల్లూరు మండలానికి చెందిన పెద్ద పిల్లోళ్ల రెడ్డయ్య (40) అనే వ్యక్తి చెట్టుపై నుంచి కిందపడి మృతిచెందాడని ఎస్ఐ మహమ్మద్‌రఫీ తెలిపారు. వల్లూరు మండలం పెద్ద లేబాక ఎస్సీ కాలనీకి చెందిన పెద్దపిల్లోళ్ల రెడ్డయ్యతో పాటు మరి కొందరు కూలీలను కడపకు చెందిన చాన్‌బాషా అనే వ్యక్తి గుండ్లమల్లపల్లె గ్రామానికి చెట్లు కోసేందుకు తీసుకొచ్చాడు. స్థానికుడు చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన చెట్లను చాన్‌బాషా కొనుగోలు చేసి వాటిని రంపం మిషన్‌తో కట్ చేసి అమ్ముకునే వాడు. రెడ్డయ్య అనే వ్యక్తి చెట్టుపైకి ఎక్కి రంపం మిషన్‌తో కొమ్మలను కట్ చేస్తుండగా మిషన్ ఇరుక్కుపోవడంతో ఆయన గొడ్డలితో కొమ్మను కొట్టే ప్రయత్నం చేశాడు. కొమ్మ విరిగి అతనిపై పడటంతో అదుపు తప్పి కింద ఉన్న కొమ్మలపై బోర్లా పడ్డాడు. కింద ఉన్న కొమ్మ రెడ్డయ్య ఛాతికి తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లీలావతి, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. యువకుడి ఆత్మహత్యాయత్నంమదనపల్లె రూరల్ : ప్రేమ వ్యవహారం కారణంగా మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం పెద్దమండ్యం మండలంలో జరిగింది. మదనపల్లె మండలం బసినికొండకు చెందిన మదన్మోహన్(20) కార్పెంటర్‌గా పనిచేస్తాడు. సోషల్‌మీడియా ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పెద్దమండ్యంకు చెందిన ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే ఈ వ్యవహారంలో మనస్తాపం చెందిన మదన్మోహన్ సోమవారం ప్రేమికురాలి ఇంటి వద్దకు వెళ్లి అక్కడే పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు బాధితుడిని 108 అంబులెన్స్ వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి పీలేరు రూరల్ : చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గూడరేవుపల్లె పంచాయతీ సూరప్పచెరువులో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు మండలం గూడరేవుపల్లె పంచాయతీ మర్రిమాకులపల్లెకు చెందిన బి. ఆనంద (55) తమ అల్లుళ్లు వినోద్, హరి, తమ్ముడు టి.వినోద్‌తో కలసి సూరప్పచెరువుకు చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులో వల వేసి తీసే క్రమంలో నీటి లోపల ఉన్న పాచి తగులుకుని మునిగిపోయాడు. ఆయన అల్లుళ్లకు ఈత రాకపోవడంతో గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులు చెరువులోంచి ఆనందను వెలికి తీశారు. అయితే అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. కరెంట్ షాక్‌తో వలస కూలీ.. రాజంపేట : రాజంపేట–రాయచోటి రహదారిలో ఎస్‌ఆర్‌పాళెం సమీపంలో కొరముట్ల హరి అనే వ్యక్తికి చెందిన రేకులషెడ్ నిర్మాణంలో కరెంట్‌షాక్ తగిలి పశ్చిమబెంగాల్‌కు చెందిన రాజ్ అనే వలస కూలీ సోమవారం మృతి చెందాడని పోలీసువర్గాలు తెలిపాయి. మృతుడు మైనర్‌గా భావిస్తున్నారు. రేకులషెడ్ నిర్మాణ క్రమంలో క్రేన్‌తో ఇనుపకడ్డీలు పైకి ఎత్తే సమయంలో అదే ప్రదేశంలో ఉన్న విద్యుత్ తీగలు తగలగానే షాక్‌కు గురయ్యాడు. ఆర్‌ఎస్‌రోడ్డులో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఫలితం లేకుండా పోయిందని తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రాంతీయవైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై మన్నూరు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒంటిమిట్టలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లుఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ఈ నెల 30న జరిగే వైకుంఠ ఏకాదశికి టీటీడీ ముమ్మరంగా ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు 30వ తేదిన అర్థరాత్రి 1:35 నిమిషాలకే వైకుంఠ ద్వారా దర్శనానికి భక్తులను అనుమతిస్తునట్లు ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ టీటీడీ అధికారులు తెలిపారు. -
సంక్రాంతి సంబరాలకు నాంది క్రీడలు
రాజంపేట టౌన్ : సంక్రాంతి సంబరాలకు క్రీడలే తొలుత నాంది పలుకుతాయని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి తెలిపారు. మండలంలోని పోలి గ్రామంలో ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ యూత్ విభాగం సీనియర్ నాయకుడు పోలి రఘునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ సంక్రాంతి హిందువులకు పెద్ద పండుగ అని, ఈ పండుగను పురస్కరించుకొని రఘునాఽథ్‌రెడ్డి యువతను ప్రోత్సహించేందుకు ఖర్చుకు సైతం వెనకాడకుండా క్రికెట్ పోటీలు నిర్వహిస్తుండటం ఎంతైనా అభినందనీయమని కొనియాడారు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు డి.భాస్కర్‌రాజు, క్రికెట్ పోటీల ఆర్గనైజర్లు పోలి సుకుమార్‌రెడ్డి, సి.మనోహర్‌రెడ్డి, గానుగపెంట కిషోర్, వైఎస్సార్సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు సనిశెట్టి నవీన్‌కుమార్, దండు గోపి, హరి, బొజ్జా పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి -
హార్సిలీహిల్స్‌పైకి ఎన్సీసీ విద్యార్థుల ట్రెక్కింగ్
బి.కొత్తకోట: అంగళ్లులోకి మిట్స్ యూనివర్సిటీకి చెందిన ఎన్సీసీ క్యాడెట్లు ఆదివారం బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌పైకి ట్రెక్కింగ్ నిర్వహించారు. కొండకింద నుంచి ఉదయం ఏడు గంటలకు ట్రెక్కింగ్ ప్రారంభించి 11 గంటలకు కొండపైకి చేరుకున్నారు. ఎన్సీసీ లెఫ్టినెంట్ నవీన్‌కుమార్ విద్యార్థులకు రోప్ హ్యాండ్లిగ్, హిల్స్ కై ్లంబింగ్పై శిక్షణ ఇచ్చారు. 100 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. ట్రెక్కింగ్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను కాపాడేలా సి సెరిటిఫికెట్, బి సర్టిఫికెట్లపై శిక్షణ ఇచ్చామని నవీన్‌కుమార్ తెలిపారు. -
ముగిసిన టెట్ పరీక్షలు
రాయచోటి జగదాంబసెంటర్: జిల్లా వ్యాప్తంగా 4 సెంటర్లలో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టెట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి 21వ తేదీ నిర్వహించిన పరీక్షలకు 4923 మంది అభ్యర్థులకు 4323 మంది హాజరయ్యారని తెలిపారు. రాజంపేట టౌన్: రాజంపేట జిల్లా సాధన కమిటీ మంగళవారం రాజంపేట బంద్‌కు పిలుపునిచ్చింది. అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు సహకరించాలని జేఏసీ నాయకులు కోరారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బంద్ ఉంటుందని, అందువల్ల వ్యాపారులు సంపూర్ణంగా బంద్‌కు సహకరించి తమ దుకాణాలను తెరవ వద్దని కోరారు. రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 22వ తేదిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పీలేరురూరల్: చిత్తూరు శాంతా రఘురామన్ కల్యాణమండపంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే కుంగ్‌ఫూ చాంపియన్‌షిప్ పోటీలో పీలేరు విద్యార్థులు ప్రతిభ కనబరిచి చాంపియన్లుగా నిలిచినట్లు కుంగ్‌ఫూ మాస్టర్ దామోదర్ తెలిపారు. కటాస్, నాన్చాక్ విభాగంలో జరిగిన పోటీల్లో 17 మంది గోల్డ్ మెడల్, 16 మంది సిల్వర్ మెడల్, 12 మంది బ్రాంజ్ మెడల్ సాధించినట్లు చెప్పారు. గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. అమ్మ వారికి వేకువజామునే పలు రకాల నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లీమ్‌లు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి తరలిరావడం విశేషం. పీలేరురూరల్: పదో తరగతి చదువుతున్న హాస్టల్ విద్యార్తులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్. నాగేంద్రరాజు అన్నారు. ఆదివారం పట్టణంలోని కోటపల్లె బీసీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 45 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, అందులో 450 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నట్లు తెలిపారు. పీలేరు హాస్టల్లో మొత్తం 241 మందికి 227 మంది హాజరయ్యారని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఉదయం, సాయంత్రం రీడింగ్ అవర్స్ విధిగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సహాయక అధికారి రవీంద్రరాజు, వార్డెన్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
రాయచోటి: క్రీడలతో మానసికోల్లాసం పొందొచ్చని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా వార్షిక పోలీసు స్పోర్ట్స్– గేమ్స్ మీట్–2025 ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్పీ క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. 24 గంటల విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే పోలీసులకు క్రీడలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయన్నారు. క్రీడలు గెలుపుకోసమే కాదని, కష్టాన్ని, ఓటమిని ధైర్యంగా భరించే శక్తిని ఇస్తాయని పేర్కొన్నారు. అంతకు ముందు రాష్ట్రస్థాయి పోలీసు మీట్లో డెకత్లాన్ విభాగంలో వరుసగా మూడేళ్లు గోల్డ్ మెడల్ సాధించిన హెడ్ కానిస్టేబుల్ ఎం చెన్నయ్య నుంచి ఎస్పీ క్రీడా జ్యోతిని స్వీకరించారు. జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి మాట్లాడారు. అనంతరం పరుగుపందెం ఫైనల్ పోటీ విజేతలకు ఎస్పీ చేతులు మీదుగా మెడల్స్‌ను బహుకరించారు. మూడురోజులపాటు జరిగే ఈ పోటీల్లో జిల్లాలోని నాలుగు పోలీసు జోన్లు పాల్గొంటున్నాయి.అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, టెన్నీష్, షటిల్ బ్యాడ్మింటన్, టగ్ ఆఫ్ వార్ క్రీడలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, మదనపల్లె డీఎస్పీ ఎస్ మహేంద్ర పాల్గొన్నారు. -
వాసు పోస్టింగ్.. ఊస్టింగ్!
సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయ నేతలు అనుక్షణం సేవాభావం కలిగి ఉండాలి. సమాజ శ్రేయస్సుపై అంకితభావంతో మెలగాలి. చెప్పే మాటల్లో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ధి కన్పించాలి. అప్పుడే ప్రజల్లో మెప్పు, ఆయా రాజకీయ పార్టీల్లో పరపతి ఉంటుంది. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే అంతే స్పీడ్‌గా తిరోగమనం చవిచూడాల్సి వస్తుంది. టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డే తీరే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వాసు వ్యవహారశైలితో విసిగిపోయిన టీడీపీ అధిష్టానం తాజాగా జిల్లా బాధ్యతల నుంచి తప్పించింది. జిల్లా తెలుగుదేశం పార్టీలో రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి కింగ్ పిన్... పార్టీ యావత్తు తన చుట్టే తిరిగేది. నియోజకవర్గాల్లో తాను సూచించిందే ఫైనల్. ఇది పదేళ్ల క్రితం మాట. క్రమేపీ తప్పించుకునే ధోరణి అలవాటు చేసుకున్నారు. ఉన్న కేడర్‌లో నమ్మకం సన్నగిల్లింది. కడప పార్లమెంటు పరిధిలో కీలక నేతగా ఉన్న ఆయన, కేవలం కడప అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితం కావాల్సి వచ్చిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. పోనీ కడప నియోజకవర్గంలో కూడా పార్టీ కేడర్‌కు భరోసాగా నిలిచారా?అంటే అదీ లేదు. అంతర్గతంగా పైచేయి సాధించాలనే తపనతో ఎన్నో ఏళ్లుగా టీడీపీ కోసం అంటిపెట్టుకొని వస్తున్నవారిని వ్యూహాత్మకంగా దెబ్బతీశారు. చివరికి కార్పొరేషన్ పాలకమండలిలో టీడీపీ పరువు నిలిపిన ఏకై క కార్పొరేటర్ ఉమాదేవి కుటుంబానికి రాజకీయంగా ముప్పుతిప్పలు పెట్టారు. ఎన్నికలకు ముందు సర్వస్వం టీడీపీనే అనుకున్న వారిని క్రమేపి దూరం చేసుకుంటూ వచ్చారని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఒంటెత్తు పోకడలు...దౌర్జన్యకర ఘటనలు టీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలో తాను చెప్పిందే వేదం, తన మాటే శాసనం అన్నట్లు వాసు వ్యవహరించారు. కడప గడపలో వైరిపక్షానికి చెందిన రెండు బార్లు బలవంతంగా లాక్కున్న ఘటన తెరపైకి వచ్చింది. మూడు దశాబ్దాలుగా మద్యం వ్యాపారంలో తలమునకలైనప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని సదరు మద్యం వ్యాపారి వాపోవడం గమనార్హం. టీడీపీ కేడర్‌పై అంతర్గతంగా పైచేయి సాధించాలనే తపనే ఇలాంటి దౌర్జన్యకర ఘటనలను ప్రోత్సహించేలా చేసిందని విశ్లేషకుల మాట. ఇలాంటి చర్యలతో విసిగిపోయిన టీడీపీ కేడర్ పొరుగు నియోజకవర్గానికి చెందిన పుత్తా నరసింహారెడ్డి వద్దకు క్యూ కట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు పాటించడం, కమలాపురానికెళ్లి మరీ పుత్తాకు మొరపెట్టుకుంటూ వచ్చారు. ఈ పరిణామాలను సరిదిద్దుకోవాలనే ఆలోచన లేకపోవడంతో అధిష్టానం వద్ద మరింత చులకన కావాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కడపలో నిర్దిష్ట అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టలేకపోయారు. ఎంతసేపు వైరిపక్షంపై కక్ష సాధింపు రాజకీయాలకు పరిమితం అయ్యారు. ఇలాంటి ఘటన లన్నీ కూడా అధ్యక్ష పదవి తొలగింపునకు ప్రధాన కారణమయ్యాయని పరిశీలకులు వివరిస్తున్నారు. టీడీపీని ఏకతాటిపై నడపడంలో విఫలం కడప టీడీపీ కేడర్‌లో పెరిగిన అసంతృప్తి పుత్తాను ఆశ్రయిస్తూ వచ్చిన తెలుగుతమ్ముళ్లు రాజ్యసభ సీటుపై సన్నగిల్లిన ఆశలు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జమ్మలమడుగు ఇన్‌ఛార్జి చదిపిరాళ్ల సుబ్బరామిరెడ్డి (భూపేష్‌రెడ్డి)ని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ప్రధాన కార్యదర్శిగా జబీబుల్లా (ప్రొద్దుటూరు)ను నియమించారు. కాగా భూపేష్ జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్‌పై ఆశలు పెట్టుకుంటే చిన్నాన్న ఆదినారాయణరెడ్డి పొత్తులో భాగంగా బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవాల్సి వచ్చింది. గ్రూపు రాజకీయాలకు, అంతర్గత విభేదాలకు తావు లేకుండా ఉండేందుకే తాజాగా జిల్లా అధ్యక్ష పదవి అప్పగించి ఉంటుందని రాజకీయ వేత్తలమాట. పైగా అధిష్టానం రిమోట్ కంట్రోల్ ద్వారా పార్టీని చక్కదిద్దేందుకు కట్టబెట్టారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
విద్యుత్‌షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి
నిమ్మనపల్లె : కొబ్బరి చెట్టు ఎక్కి టెంకాయలు కోస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన ఆదివారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ యల్లారబైలుకు చెందిన జయరామిరెడ్డి కుమారుడు శ్రీనివాసులురెడ్డి(31) ఐదేళ్ల క్రితం నిమ్మనపల్లె మండలం ముష్టూరు పంచాయతీ దిగువపల్లెకు చెందిన వెంకటరమణ, రమణమ్మ దంపతుల కుమార్తె చంద్రకళను ప్రేమవివాహం చేసుకున్నాడు. ఆమె కోరిక మేరకు ఇల్లరికం వచ్చి దిగువపల్లెలో ఉంటూ కూలిపనులకు వెళుతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నిమ్మనపల్లెకు వెళ్లి చికెన్ తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంతలోనే గ్రామంలో రోడ్డుపక్కన దుకాణం నిర్వహిస్తున్న యజమాని తమ కొబ్బరి చెట్టు నుంచి కాయలు కోయాల్సిందిగా కోరడంతో అక్కడకు వెళ్లి చెట్టు ఎక్కాడు. కాయలు కోసే క్రమంలో ఓ టెంకాయ మట్టను నరకగా, అది సగం మాత్రమే తెగి వంగిన భాగం 11 కే.వీ. విద్యుత్‌లైన్‌పై పడటంతో చెట్టుకు కరెంట్ సరఫరా కావడంతో శ్రీనివాసులురెడ్డి షాక్‌కు గురై అక్కడికక్కడే చెట్టుమీదనే మృతి చెందాడు. మృతుడికి కుమార్తె మేఘన(2), కుమారుడు మోక్షజ్ఞ (9నెలలు) ఉన్నారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. స్థానికులు రోడ్డుపై బైఠాయించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న విద్యుత్‌శాఖ ఈఈ గంగాధరం, ఏడీఈ సురేంద్రనాయక్, ఏఈ నాగరాజు ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుడి భార్య చంద్రకళ నిమ్మనపల్లె పోలీసులకు ప్రమాద ఘటనపై ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విష్ణునారాయణ తెలిపారు. -
హృదయ నివేదనే క్రిస్మస్
రాజంపేట టౌన్ : ప్రపంచ వ్యాప్తంగా జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్. క్రీస్తు జననానికి చిహ్నంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలకు జిల్లాలోని క్రైస్తవులు, విశ్వాసులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే సెమీ క్రిస్మస్, క్రిస్మస్ ఆరాధన పాటలతో క్రైస్తవులు, విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. కాగా క్రిస్మస్ను స్వాగతిస్తూ బుధవారం రాత్రి నుంచి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. క్రిస్మస్ పండుగ సమీపించడంతో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అంతటా పండుగ కోలాహలం నెలకొంది. శాంతికి, త్యాగానికి ప్రతీక క్రిస్మస్.. శాంతికి, త్యాగానికి ప్రతీక క్రిస్మస్. క్రీస్తు జననం లోకానికి పర్వదినమని ప్రపంచమంతా అభివర్ణిస్తుంది. విశ్వాసం, ప్రేమ, కరుణ, దయ, నిరీక్షణ సందేశంతో క్రీస్తు లోకానికి కొత్త మార్గాన్ని చూపారు. మనిషి తన హృదయాన్ని క్రీస్తుకు సమర్పించడమే నిజమైన క్రిస్మస్ అని క్రైస్తవులు, విశ్వాసుల ప్రగాఢ విశ్వాసం. క్రైస్తవ లోకం అన్ని వర్గాల ప్రజలతో కలిసి సంతోషంగా ఆచరించే పర్వదినమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదినం. క్రైస్ట్ అంటే అభిషిక్తుడు మస్ అంటే ఆరాధన అని అర్థం. ఈ పదానికి అర్థం క్రీస్తును ఆరాధించడం. యెహోవాను భూమికి కానుకగా ఇచ్చిన దినమే క్రిస్మస్.. సృష్టికర్త అయిన యెహోవా దేవుడు తన ప్రియ కుమారుని నరరూపిగా ఈ భువికి కానుకగా ఇచ్చిన పవిత్ర దినమే క్రిస్మస్. పాత నిబంధన కాలంలోని యెషయా, దానియేలు, మీకా, మలాకీ తదితర ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పే క్రిస్మస్. ఈయన పరిశుద్ధాత్మ వల్ల పవిత్రుడిగా కన్య గర్భాన జన్మించాలన్నది యెహోవా దేవుని నిర్ణయం. ఈ సంకల్పమే దూత గాబ్రియేలు ద్వారా మరియాకు అందించిన శుభ వర్తమానం. రాజాధిరాజు ప్రభువుల ప్రభువు తనను తాను తగ్గించుకొని బెత్లెహాం అనే గ్రామంలో పశువుల పాకలో జన్మించారు. క్రీస్తు జన్మించగానే ఆకాశంలో ఆయన నక్షత్రం వెలిసింది. ఈ నక్షత్ర జాడతో తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తు జననాన్ని గుర్తించారు. దైవ దూత ద్వారా అమాయకులైన గొల్లలకు ఈ వర్తమానం అందింది. ఆ సమయంలో పరలోక సైన్య సమూహం స్తుతి గానాలు చేసింది. నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నదే క్రీస్తు బోధన సారాంశం. దాని ప్రకారం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు నూతన దుస్తులు, కానుకలు, ఆహార పదార్థాలు ఇచ్చి దీనులను ఆదరిస్తారు. చర్చిల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. బహుమతులు ఇచ్చే క్రిస్మస్ తాత.. సెయింట్ నికోలస్ అనే గ్రీకు బిషప్ స్ఫూర్తితో శాంటాక్లాజ్ అనే ఒక పాత్ర రూపుదిద్దుకుంది. 1823వ సంవత్సరంలో అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల్లో శాంటాక్లాజ్ వర్ణనపై రచించిన ఏవిజిట్ ఫర్ సెయింట్ నికోలస్ అనే కవిత ఆధారంగా థామస్నెస్ట్ అనే చిత్రకారుడు శాంటాక్లాజ్ ఊహాచిత్రాన్ని గీశారు. దీని ఆధారంగా క్రిస్మస్ తాత పాత్ర రూపుదిద్దుకుంది. క్రిస్మస్ రోజున రథంపై క్రిస్మస్ తాత వస్తాడని, మంచి ప్రవర్తన గల పిల్లలకు బహుమతులు తెస్తాడని, చెడు ప్రవర్తనగల పిల్లలకు బొగ్గు ఇస్తాడని చెబుతుంటారు. క్రిస్మస్ ట్రీకి ఎంతో ప్రాధాన్యత.. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చర్చిల్లో, క్రైస్తవులు, విశ్వాసులు తమ ఇళ్లల్లో క్రిస్మస్ ట్రీని అలంకరించుకుంటారు. ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో క్రిస్మస్ ట్రీకి సంబంధించి పలు రకాల చరిత్ర ఉంది. ఆధునిక జర్మనీ ఏర్పడిన తరువాత క్రిస్మస్ ట్రీ ప్రాచుర్యంలోకి వచ్చింది. 16వ శతాబ్దంలో మార్టిన్ లూథరన్ మొదటి సారిగా ఎవర్గ్రీన్ అనే చెట్టును కొవ్వొత్తులతో అలంకరించినట్లు చెబుతారు. 20వ శతాబ్దంలో క్రిస్మస్ ట్రీ చర్చిలకు విస్తరించింది. కాలక్రమేణా ఈ సాంప్రదాయం అన్ని దేశాలకు విస్తరించింది. క్రిస్మస్ ట్రీ నిత్య జీవనానికి సూచికగా, అపవాదును పారదోలే సాధనంగా క్రైస్తవులు, విశ్వాసులు భావిస్తారు. క్రీస్తు జననానికి చిహ్నంగా కొనసాగుతున్న ప్రత్యేక ప్రార్థనలు జిల్లాలో క్రిస్మస్ పండుగకు ముస్తాబవుతున్న చర్చిలు ఎల్లుండి రాత్రి నుంచి ప్రారంభం కానున్న క్రిస్మస్ వేడుకలుపూర్ణ హృదయంతో ఆరాధించాలి క్రీస్తు పుట్టుకలో దేవదూతలు, జ్ఞానులు, గొర్రెల కాపరులు ఆయనను ఆరాధించారు. జ్ఞానులైన వారు తాము తీసుకొచ్చిన బంగారం, బోళము, బహుమానాలను బాలుడైన క్రీస్తుకు సమర్పించారు. పరలోకం విడిచి భూలోకమునకు వచ్చిన క్రీస్తును పూర్ణ హృదయంతో ఆరాధించాలి. మన హృదయాలను క్రీస్తుకు సమర్పించడమే నిజమైన క్రిస్మస్. – మార్టిన్ లూథరన్, పాస్టర్, బేతేలు చర్చి, రాజంపేటప్రేమ, త్యాగం, దయాగుణాలే క్రిస్మస్ క్రిస్మస్ మానవాళికి శుభదినం. క్రీస్తు ప్రబోధించిన సుగుణాలు, పరిశుద్ధత, తగ్గింపు స్వభావం, ప్రేమ, త్యాగం, దయాగుణాలను అలవరుచుకోవడమే క్రిస్మస్ సందేశం. అందువల్లే ప్రపంచమంతా ఆ శుభ ఘడియ కోసం ఎదురు చూస్తోంది. – కస్తూరి ఫోనిక, సిస్టర్, నిజస్వరూపిణి మందిరం, రాజంపేట -
ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగదు
పీలేరురూరల్ : బోధనేతర పనులు ఉపాధ్యాయులకు చెప్పరాదని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్. ప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక ఎస్వీఎస్ఎస్ కల్యాణమండపంలో యూటీఎఫ్ జిల్లా నాల్గవ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు భిన్నంగా ఉపాధ్యాయులకు బోధనేతర పనులు చెప్పడం వల్ల చదువు పట్ల ఏకాగ్రత కోల్పోతున్నట్లు తెలిపారు. బోధనేతర పనుల నుంచి విముక్తి కల్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జయచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, నాయకులు జావెద్, శివారెడ్డి, అక్రమ్‌బాషా, చంద్రశేఖర్, విశ్వనాథరెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రెండు ఆటోలు ఢీకొని ఇద్దరికి గాయాలులింగాల : లింగాల మండలం కర్ణపాపాయపల్లె గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఆటో డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. పులివెందులకు చెందిన ముని పీరా అనే వ్యక్తి ఆటోలో అనంతపురం వెళ్లి వేరుశనగ కాయలను తీసుకొస్తుండగా కర్ణపాపాయపల్లె గ్రామ సమీపంలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం తంగనాయనపల్లె గ్రామానికి చెందిన రామాంజి అనే వ్యక్తి ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముని పీరా కంటికి తీవ్ర గాయాలు కాగా, రామాంజికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో ఆటోలు నడపడంవల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు వారు తెలిపారు. గాయపడిన వ్యక్తిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రామాంజి అనే వ్యక్తి స్వల్ప గాయాలతో ఆటోను వదిలి పరారయ్యాడు. -
ఒంటిమిట్టలో మహిళ దారుణ హత్య
ఒంటిమిట్ట : మండల పరిధిలోని గుంటికాడిపల్లి గ్రామంలో ఆదివారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు..రాజంపేటకు చెందిన యానాది వెంకటరమణ, ఆతని భార్య నాలుగు రోజుల క్రితం గుంటికాడిపల్లి గ్రామంలోని వెంకట సుబ్బారెడ్డి మామిడి తోటలో కాపలా ఉంటామని వచ్చి, అక్కడి గుడిసెలో నివాసం ఉన్నారు. అయితే ఆదివారం ఉదయం 11 గంటలకు మామిడి తోట యజమానులు వారి కోసం వెళ్లి చూడగా అక్కడ యానాది వెంకట రమణ భార్య వివస్త్ర అయి, ఒంటి మీద కమిలి పోయిన గాయాలతో చనిపోయి ఉంది. ఆమె భర్త వెంకటరమణ పరారీ అయ్యాడు. దీంతో కంగారు పడిన మామిడి తోట యజమానులు ఒంటిమిట్ట పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ నరసింహారాజు, ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు, సిద్దవటం ఎస్ఐ రఫీ ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. సమాచారం అందుకున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి చుట్టు పక్కల ప్రదేశాలను పరిశీలించారు. మృతురాలి పేరు, వివరాలు తెలియాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. వీఆర్ఓ శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు తెలిపారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
పెద్దమండ్యం : మండలంలోని కలిచెర్ల మౌలాకా పహాడ్ వద్ద ఉన్న ఓ ఇంటి ఆవరణలో గుప్తనిధులు వెలికి తీసేందుకోసం క్షుద్రపూజలు నిర్వహించినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు గుప్తనిధుల కోసం తవ్విన ఇంటి ఆవరణాన్ని, పరిసర ప్రాంతాలను ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది పరిశీలించారు.అరుదైన వన్య ప్రాణుల స్మగ్లర్లు అరెస్టు రైల్వేకోడూరు అర్బన్ : అటవీశాఖకు సంబంధించిన అరుదైన రకం వన్య ప్రాణుల స్మగ్లింగ్‌కు సంబంధించి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. రాజ్‌కుమార్, భూపతిరాజు, జయరావ్, మొలకల సుబ్రమణ్యం, శ్రీరాములాయారి, శివ, రవికుమార్‌లను అరెస్టు చేశారు. ఫారెస్టు రిజర్వు అధికారి శ్యాంసుందర్ ఆధ్వర్యంలో వారిని కోర్టులో హాజరుపరిచారు. వారివద్ద నుంచి రెండు తలల పాము, అలుగులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సోదరభావంతో మెలగాలి మదనపల్లె సిటీ : హిందువులు సోదరభావంతో మెలగాలని శ్రీనివాసమంగాపురానికి చెందిన శ్రీ వశిష్ట్రాశమ శ్రీలలితా పీఠం వ్యవస్థాపక పీఠాధిపతి స్వస్వరూపానందగిరి స్వామి అన్నారు. ఆదివారం స్థానిక శేష్‌మహల్ టాకీసు సమీపంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని సూచించారు. ఎన్ని మతాలు, కులాలు ఉన్నా మనమంతా ఒక్కటేనన్న భావన కలిగి ఉండాలన్నారు. వీహెచ్‌పీ కుటుంబ ప్రభోధన్ ప్రాంత ప్రముఖ్ పుట్టా శేషు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పి నాయకులు బండి బాలాజీ, పెద్ద ఎత్తున హిందువులు పాల్గొన్నారు. తల్లి మందలించిందని.. బాలుడి ఆత్మహత్య కేవీపల్లె : పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడంతో తల్లి మందలించిందని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని జిల్లేళ్లమంద పంచాయతీ కర్ణంవారిపల్లెలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కర్ణంవారిపల్లెకు చెందిన నాగార్జున, అనితల కుమారుడు నాగచైతన్య (16) చౌడేపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అక్కడే హాస్టల్లో ఉంటూ పాఠశాలకు వెళ్లేవాడు. కొన్ని నెలలుగా పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించేవారు. ఈ క్రమంలో శనివారం పాఠశాల నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడం, సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉండడంతో తల్లి మందలించింది. దీంతో క్షణికావేశానికి గురైన నాగచైతన్య ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటశివకుమార్ తెలిపారు. చిట్వేలి విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికచిట్వేలి : రాయచోటి డైట్ కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు దుర్గరాజు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ విభాగంలో వి.దివ్యశ్రీ, ఎ సుస్మిత, వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో కె చందు, పి భరత్ కుమార్, వ్యక్తిగత విభాగంలో రుకియా బాంభో, పల్స్ బయోడిగ్రీడబుల్ సానిటర్ పాడ్స్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాయని తెలిపారు. విద్యుత్ కేబుల్ వైర్లు చోరీపులివెందుల రూరల్ : పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీ పరిధిలోని మల్లికార్జునపురం, నల్లపురెడ్డిపల్లె గ్రామాల్లోని పొలాల్లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ కేబుల్ వైర్లు చోరీ చేశారు. మల్లికార్జునపురం గ్రామానికి చెందిన రైతులు మల్రెడ్డి, మస్తాన్, రామాంజనేయులు, నబీ రసూల్, సుధాకర్ల పొలాల్లోని మోటార్ల దగ్గర ఉన్న కేబుల్ వైర్లను అపహరించి తీసుకెళ్లారు. -
● పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ములకలచెరువు : మండలంలోని చౌడసముద్రం జెడ్పీహైస్కూల్లో 1972–73 సంవత్సరంలో పదోతరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అప్పటి గురువులతో పాటు అప్పటి విద్యార్థులు పాల్గొన్నారు. గురువులు రంగారెడ్డి, విశ్వనాథ్, ప్రస్తుత హెచ్ఎం అశ్వినిలను సన్మానించి వారి ఆశీస్సులు పొందారు. పాఠశాల ఆవరణంలోని స్టేజీపై రూ. లక్ష ఖర్చు చేసి రేకులు వేయించారు. పూర్వ విద్యార్థులు పుట్టా శేఖర్‌గుప్తా, రత్నశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటరమణ, మల్లప్పనాయుడు, మహబూబ్‌బాషా, గిరిజా కుమారి తదితరులు పాల్గొన్నారు. -
అన్నను హతమార్చిన తమ్ముడు
గుర్రంకొండ : కుటుంబ కలహాలతో సొంత అన్ననే తమ్ముడు కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన మండలంలోని కండ్రిగ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన షేక్ నజీబ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందడంతో నజీబ్ రాయచోటిలో ఒంటరిగా ఉంటున్నారు. కండ్రిగలోని తన సొంత ఇంట్లో కుమారులు షేక్ సాదిక్ (27) షేక్ మహమ్మద్ రఫీక్ (19) కలిసి ఉంటున్నారు. సాదిక్‌కు పదేళ్ల క్రితం కురబలకోట మండలం ముదివేడుకు చెందిన షమీమ్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా సాదిక్ మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి భార్యను హింసించేవాడు. భర్త వేధింపులు భరించలేక భార్య షమీమ్ నాలుగేళ్ల క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇంట్లో అన్నదమ్ములు కలిసి ఉంటున్నారు. ఇంట్లో ఎవరు ఉండాలనే విషయమై అన్నదమ్ములు గత కొన్ని రోజులుగా ఘర్షణ పడుతుండేవారు. మూడురోజుల క్రితం ఘర్షణ పెద్దది కావడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువురికి సర్దిచెప్పి పంపించి వేశారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సాదిక్ పూటుగా మద్యం తాగి మరోసారి ఇంటి విషయమై తమ్ముడితో ఘర్షణకు దిగాడు. వివాదం పెద్దదిగా మారి బాహాబాహి తలపడ్డారు. ఇంట్లో ఉన్న కత్తితో మహమ్మద్రఫీక్ అన్న సాదిక్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో సాదిక్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తమ్ముడు రాత్రికి రాత్రే పరారయ్యాడు. ఆదివారం ఉదయం చుట్టుపక్కలవారు విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డి, ఎస్ఐ బాలకృష్ణలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానిక వీఆర్వో ప్రతిమ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
తప్పుడు పత్రాలతో వక్ఫ్‌భూముల ఆక్రమణకు యత్నాలు
మదనపల్లె రూరల్ : పట్టణంలోని జామియా మసీదుకు చెందిన వక్ఫ్‌బోర్డు భూములను తప్పుడు పత్రాలతో ఆక్రమించుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని జామియా, టిప్పుసుల్తాన్ మసీదు కమిటీ ప్రెసిడెంట్ హాజీ.గౌస్ మొహియుద్దీన్, సెక్రటరీ సికిందర్అలీఖాన్ ఆరోపించారు. ఆదివారం టిప్పుసుల్తాన్ మసీదు ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. బీకే.పల్లె రెవెన్యూ గ్రామంలో 23.30 ఎకరాల వక్ఫ్‌భూమి ఉందన్నారు. ఈ భూమి ఇప్పటివరకు సబ్‌డివిజన్ కాలేదని, మండల తహసీల్దార్ ధృవీకరిస్తూ ఎండార్స్మెంట్ ఇచ్చారన్నారు. అయినప్పటికీ, మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చిన్నపాటి మార్పులతో సుమారు 90 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. ఈ విధంగా సృష్టించిన పత్రాలను ఆధారాలుగా చూపిస్తూ, కోర్టులో కేసులు వేసి ముస్లిం సమాజానికి చెందిన వక్ఫ్‌భూమిని కాజేసేందుకు జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను అడ్డుకుని, వక్ఫ్‌భూముల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జామియా, టిప్పుసుల్తాన్ మసీదు అభివృద్ధి కమిటీ వైస్ ప్రెసిడెంట్ సర్దార్‌ఖాన్, జాయింట్ సెక్రటరీ అక్బర్‌బాషా, మెంబర్లు అబూబకర్ సిద్ధిక్, మహమ్మద్‌బాషా, సాజిద్అలీఖాన్, మహమ్మద్ జమీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ఆకేపాటి
ఒంటిమిట్ట : మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. స్థానికుల వివరాల మేరకు..రాజంపేట మండలం, శేషమాంబపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలు వైష్టవి, సునీల్ బైకుపై సిద్దవటం వెళ్తుండగా ఒంటిమిట్ట పెట్రోల్ బంకు వద్దకు రాగానే లగేజ్ ఆటో ఢీ కొనడంతో బైకులోని వారిద్దరు కిందపడి రక్త గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో వారు తీవ్ర గాయాలతో రోదిస్తున్నారు. ఆ సమయంలో సిద్దవటం నుంచి రాజంపేట వెళుతున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి వారిని చూసి కారులో నుంచి సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే నందలూరు నుంచి 108 వాహనాన్ని రప్పించి, అందులో వారిని కడప రిమ్స్‌కు తరలించారు. -
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
మదనపల్లె రూరల్ : పంటకోతకు పొలానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే రైతు ప్రాణాలు విడిచిన ఘటన శనివారం మదనపల్లె మండలంలో జరిగింది. దుబ్బిగానిపల్లె పంచాయతీ ఎనుములవారిపల్లెకు చెందిన తాతప్ప కుమారుడు చంద్రశేఖర్(58) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతనికి భార్య రత్నమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఏడాది రబీలో తనకున్న పొలంలో వరిపంట సాగు చేశాడు. 15 రోజులుగా పంట కోత కోసం తడి ఆరబెట్టిన కారణంగా పొలం వద్దకు వెళ్లలేదు. పొలంపై వెళుతున్న 11 కేవీ విద్యుత్ వైరు తెగి కిందపడింది. ఈ విషయం తెలియని రైతు చంద్రశేఖర్ శనివారం పంట కోతలో భాగంగా వరి కోత యంత్రాన్ని పొలం వద్దకు పిలిపించాడు. పంటకోత కోసేందుకు డ్రైవర్‌కు దారి చూపుతూ ముందువైపు నడుస్తూ విద్యుత్ తీగ తెగిపడిన పొలంలోకి వెళ్లాడు. వెళ్లే క్రమంలో విద్యుత్ తీగను గమనించకపోవడంతో ప్రమాదవశాత్తు కాలికి తగిలి షాక్‌కు గురయ్యాడు. షాక్ తీవ్రత అధికంగా ఉండటంతో అక్కడికక్కడే పొలంలోనే ప్రాణాలు విడిచాడు. గమనించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏపీఎస్పీడీసీఎల్ మదనపల్లె డివిజన్ ఈఈ గంగాధరం ఆదేశాలతో ఏడీఈ హరిబాబు, ఏఈ రమేష్‌లు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. విద్యుత్ తీగలు తెగి పడిన విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
సంక్షేమ సారథి
సాక్షి రాయచోటి : రాజు బాగుంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుందనేది నానుడి. అందుకు తగ్గట్టుగానే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ పాలన సాగింది. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. ‘అన్నమయ్య’లో అపార అభివృద్ధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నమయ్య జిల్లాను పురోగతిబాట పట్టించింది. ప్రధానంగా జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజంపేట పార్లమెంటును జిల్లాగా మార్చి జిల్లా కేంద్రంగా రాయచోటిని ఎంపిక చేశారు. అంతకుమునుపు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పేదల సంక్షేమానికి పెద్దపీట వేయడమే కాకుండా ప్రత్యేకంగా వారిని కంటికిరెప్పలా ప్రభుత్వం కాపాడుకుంది. మరోపక్క అంతే వేగంగా జిల్లాను అభివృద్ధి చేసింది. ● ప్రధానంగా జిల్లా కేంద్రమైన రాయచోటిలో రూ. 25 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, వెలిగల్లు ప్రాజెక్టు నుంచి రాయచోటి ప్రజల దాహార్తి తీర్చేందుకు రెండవ పైపులైన్ కోసం రూ.100 కోట్లు కేటాయించగా ఇప్పటికీ పనులు జరుగుతున్నాయి. రాయచోటిలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి సుమారు రూ. 100 కోట్లు కేటాయించారు. రూ. 8 కోట్లతో శిల్పారామం, కేంద్రీయ విద్యాలయం, పీజీ కళాశాల, మరో రూ. 3 కోట్లతో నగరవనం, క్రికెట్ స్టేడియం, మధ్యతరగతి ప్రజలకు సంబంధించి 50 ఎకరాల్లో ఎంఐజీ లే అవుట్, డబల్‌రోడ్డు నిర్మాణాలు, మున్సిపాలిటీ పరిధిలో పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు, నూతనంగా ఆర్టీసీ బస్టాండు, రైతు బజారు, సర్కిళ్లు, ఆర్అండ్బీ అతిథిగృహం, టౌన్ పోలీసుస్టేషన్, డీఎస్పీ కార్యాలయం, ఇంకా అనేక రకాల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ● మదనపల్లెలో రూ. 500 కోట్లతో మెడికల్ కళాశాల హైలెట్‌గా నిర్మాణాలు కొనసాగాయి. కేంద్రీయ విద్యాలయం, మదనపల్లె వాసుల ఎన్నో ఏళ్ల కలగా ఉన్న బీటీ కళాశాలను యూనివర్శిటీ స్థాయికి తీసుకెళ్లడం, సుమారు రూ. 200 కోట్లతో గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధితోపాటు ఇతర అనేక విధాలుగా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టారు. ● తంబళ్లపల్లె నియోజకవర్గంలోనూ వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. పీలేరులో కూడా రూ. 24 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, పీలేరు–తిరుపతి జాతీయ రహదారి నిర్మాణ పనులు వందలాది కోట్లతో, రైల్వేకోడూరు పరిధిలో రైల్వే అండర్ ఓవర్ బ్రిడ్జిలు, చిట్వేలి–రైల్వేకోడూరు ఫోర్లేన్రోడ్డు, రాజంపేట పరిధిలో రూ. 80 కోట్లతో పింఛా ప్రాజెక్టును దాదాపుగా పూర్తి చేశారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా భారీగా లబ్ధి అన్నమయ్య జిల్లాలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా సుమారు రూ. 9,450 కోట్ల మేర లబ్ధి చేకూరింది. అనేక రకాల పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించారు. ప్రతి నియోజకవర్గానికి సుమారు రూ. 1500 కోట్ల మేర ప్రయోజనం ఒనగూరింది. పేద, మధ్యతరగతి, ఇతర తారతమ్యాలు చూడకుండా పారదర్శకంగా, అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించారు. ఊర్లు మారిపోయాయి జిల్లా వ్యాప్తంగా 525కు పైగా లే అవుట్లలో 75 వేల గృహాలకు సంబంధించి నిర్మాణాలు చేపడితే అందులో వేలాది గృహాలు పూర్తయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ కొత్త ఊర్లు ఆవిర్భవించాయి. ఇంటి నిర్మాణాలతో నూతన శోభ సంతరించుకుంది. జిల్లాలో డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ. 9,450 కోట్లకు పైగా లబ్ధి పునర్విభజనతో జిల్లాలో అభివృద్ధి పరుగులు జిల్లా కేంద్రం రాయచోటిలో అన్ని రకాలుగా పురోభివృద్ధి మదనపల్లెలో తలమానికంగా రూ. 500 కోట్లతో మెడికల్ కళాశాల నేడు మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు పార్టీ పిలుపు -
బాల శాస్త్రవేత్తల వేదిక సైన్స్ ఫెయిర్
● పాఠశాల విద్య, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శామ్యూల్ ● ఘనంగా సైన్స్ ఫెయిర్రాయచోటి : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాల శాస్త్రవేత్తల అన్వేషణలను ప్రోత్సహించేందుకు జిల్లా సైన్స్ ఫెయిర్ ఒక అద్భుత వేదిక అని పాఠశాల విద్య సంయుక్త సంచాలకులు శామ్యూల్ అన్నారు. రాయచోటి పట్టణం, డైట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో దాగి ఉన్న అన్వేషణాత్మక ఆలోచనలకు సైన్స్ ఫెయిర్లు పదును పెడుతున్నాయన్నారు. పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా జీవిత సమస్యలకు శాసీ్త్రయ పరిష్కారాలు వెతకడానికి ఇవి దోహదపడతాయన్నారు. విద్యార్థి దశ నుండే బాలలు అన్వేషణాత్మక ప్రాజెక్టులను రూపొందించడం చాలా గొప్ప విషయమన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో నిలుపుతున్న అన్నమయ్య జిల్లా సైన్స్ ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల నుంచి 330 ప్రాజెక్టులు జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శించారన్నారు. వీటిలో రెండు టీచరు విభాగంలో, మరో రెండు వ్యక్తిగత విభాగం నుంచి, ఏడు గ్రూపు విభాగం నుంచి మొత్తం 11 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. జిల్లా విజేతలు ఈనెల 23, 24వ తేదీలలో విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో పాల్గొనాలన్నారు. ఈ సైన్స్ ఫెయిర్ మిగిలిన విద్యార్థులలో చక్కటి స్ఫూర్తిని నింపిందన్నారు. సైన్స్ ఫెయిర్‌ను సందర్శించిన అధికారులు.. సైన్స్ ఫెయిర్‌ను ఆర్జేడీ, డీఈఓ, ఏపీసీ అధికారులు విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించారు. ప్రతి స్టాల్‌ను సందర్శిస్తూ విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి అవగాహన స్థాయిని తెలుసుకున్నారు. విద్యార్థులు తమ ప్రాజెక్టుల వెనుక ఉన్న శాసీ్త్రయ సూత్రాలను స్పష్టంగా వివరించడం గమనార్హం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రాజెక్టులు ప్రాయోగికత, సామాజిక అవసరాలపై దృష్టి పెట్టడం ప్రశంసనీయమని అధికారులు తెలిపారు. విజేతలకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి అందజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ అనురాధ, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కొండూరు శ్రీనివాసరాజు, ఏఎంఓ అసదుల్లా, సెక్టోరియల్ అధికారులు జనార్దన్, డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ శివ భాస్కర్, సంఘం నాయకులు రామచంద్ర, వీరాంజనేయులు, శివారెడ్డి, నరసింహులు, జ్యూరీ సభ్యులు, గైడ్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉరకలెత్తిన ఉత్సాహండైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన –2025 ఎంతో ఉత్సాహంగా సాగింది. తమ ప్రాజెక్టులను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు ప్రదర్శించారు. ప్రదర్శనలను తిలకించడానికి వచ్చిన వారిని అబ్బురపరిచాయి. జిల్లా నలుమూలల నుంచి 330 పాఠశాలల నుంచి ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. అలాగే ఉపాధ్యాయులు కూడా ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. విజేతలు.. టీచర్స్ విభాగంలో.. బి.ప్రకాష్ రెడ్డి (రాయచోటి మండలం, జడ్పీహెచ్ఎస్ కె.రామాపురం), సువర్ణాదేవి(వాల్మీకిపురం మండలం, జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్) వ్యక్తిగత విభాగంలో.. జి.రుకియా (చిట్వేలి మండలం జడ్పీహెచ్ఎస్ చిట్వేలి), సిద్దార్థ రెడ్డి (బి కొత్తకోట మండలం, జడ్పీహెచ్ఎస్ గట్టు) గ్రూపు విభాగంలో... సస్టైనబుల్ అగ్రికల్చర్లో జి.నవ్య, ఎన్.అక్షిత (కలకడ మండలం ఏపీఆర్ఎస్ గర్ల్స్ కలకడ), వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్ విభాగంలో టి.లాస్య రెడ్డి, జి విజయలక్ష్మీ(ఓబులవారిపల్లి మండలం, జడ్పీహెచ్ఎస్ మంగంపేట), గ్రీన్ ఎనర్జీ విభాగంలో దివ్యశ్రీ, ఎ సుస్మిత (చిట్వేలి జడ్పీహెచ్ఎస్), ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగంలో బి.ప్రకాష్, జి,మహీధర్ నాయుడు (ఏపీఎంఎస్ రామాపురం), రిక్రియేషన్‌లో మ్యాథమెటికల్ మోడలింగ్ విభాగంలో వి.హర్షప్రియ, ఈ.వినయ్( సుండుపల్లి మండలం, జడ్పీహెచ్ఎస్ తిమ్మ సముద్రం) , హెల్త్ అండ్ హైజిన్ విభాగంలో కె.హర్షవర్దన్, సి.మహేష్ (వీరబల్లి మండలం, జడ్పీహెచ్ఎస్ ఆర్విపల్లి), వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో కె.చందు, పి.భరత్ కుమార్ (జడ్పీహెచ్ఎస్ చిట్వేలి) -
మా జీవిత ‘మేసీ్త్ర’
విద్యార్థులకు ఉన్నత చదువు చదవాలని ఉంటుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంటుంది. అయితే ఆర్థిక స్తోమత లేక వారి చదువు కుంటుపడుతుంది.. అమ్మానాన్నల ఆశలు నెరవేరేవి కావు. ఇలాంటివారి కలలను సాకారం చేసింది జగనన్న అందించిన ఫీజు రీయింబర్స్మెంట్. పీలేరు పట్టణానికి చెందిన తాపీ మేసీ్త్ర శివప్రసాద్ జగనన్న అందించిన భరోసాను ఇలా గుర్తుచేసుకున్నాడు. నాపేరు గుండ్లూరు శివప్రసాద్. మాది పీలేరు పట్టణం పద్మావతి నగర్. నా భార్య గుండ్లూరు రాజేశ్వరి గృహిణి. నేను తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నాను. రోజంతా కష్టపడినా అరకొర ఆదాయం వస్తుంది. అది కుటుంబ పోషణకే సరిపోయేది. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. నా కూతురు జి. శ్రీరమ్య తిరు పతి చైతన్య కళాశాలలో బీటెక్ చదువుతుండేది. చదువు సాగేందుకు డబ్బుల గురించి ఆలోచించేవాడిని. అయితే అదే సమయంలో జగనన్న సీఎం కావడంతో శ్రీరమ్యకు 2022 –23, 2023–24 విద్యా సంవత్సరంలో రూ. 20 వేలు చొప్పున రెండేళ్లు మొత్తం రూ. 40 వేలు ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరైంది. దీంతో ఆర్థికభారం తగ్గి నా బిడ్డ బీటెక్ పూర్తి చేసింది. పేదలను ఉన్నత చదువుల బాట పట్టించిన విద్యా ప్రదాత జగనన్న సేవలను ఎన్నటికీ మరువలేను. – పీలేరు రూరల్ -
మా బిడ్డకు మాటొచ్చింది
జగనన్న ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించడంతో మా బిడ్డకు మాట వచ్చిందని షేక్ రేష్మా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఆమె మాటల్లోనే... ‘మాది లక్కిరెడ్డిపల్లి టౌన్‌లోని పాత మసీదు వద్ద ఉంటున్నాం. నా భర్త పేరు మహబూబ్ బాషా. మాకు ఒక కుమార్తె. పేరు అలివూర్ సుల్తానా. ఆ పాపకు పుట్టుకతో మూగ, చెవుడు. అసలే ఆడబిడ్డ, అందులోనూ మూగబిడ్డ అని ఎంతో బాధపడ్డాం. లక్షలు విలువచేసే కాక్లియర్ ఇంప్లాంటే షన్ ఆపరేషన్ చేస్తేనే మాటలు వస్తాయి, చెవులు వినబడతాయని వైద్యులు చెప్పారు. నా భర్త ఆటో తోలుతూ కుటుంబం పోషిస్తున్నాడు. మాకు లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించే స్థోమత లేదు. జగనన్న ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గుంటూరులోని ఈఎన్టీ ఆసుపత్రిలో మా పాపకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఇప్పడు మా పాప కొద్దికొద్దిగా మాట్లాడుతోంది. మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలి. – లక్కిరెడ్డిపల్లి -
సొంతింటి కల సాకారం
నా పేరు కొలకని గంగమ్మ. ఒంటిమిట్ట మండలం అరుంధతీ వాడలో ఉంటున్నాను. నా భర్త పేరు నరసింహులు. మాకు ఒక కుమారుడు. పేరు హరిబాబు. నా భర్త మద్యానికి అలవాటు పడి ఇంటి గురించి పట్టించుకోకుండా తిరుగుతుంటాడు. ఏం చేయాలో దిక్కుతోచక మా మేనమామ పేర్ల కొండయ్య ఇంట్లో నేను, నా బిడ్డ తలదాచుకుంటున్నాము. అయి తే జగనన్న సీఎం అయ్యాక అన్ని పథకాలు మాకు అందాయి. నా కొడుకు ఒంటిమిట్టలో పదవ తరగతి చదువుకున్నాడు. అమ్మ ఒడి కింద రూ. 55 వేలు వచ్చాయి. రూ.1.50 లక్షల విలువ చేసే ఇంటిపట్టా ప్రభుత్వం ఇచ్చింది. రూ.1.80లక్షల విలువ చేసే పక్కా ఇంటి నిర్మాణం చేసుకున్నాను. చేయూత కింద రూ. 56 వేలు వచ్చింది. మొత్తం మీద రూ.4.50లక్షల వరకు ఆర్థికసాయం అందిందంటే అది జగనన్న చలువే. ప్రస్తుతం పంచాయతీలో స్వీపర్‌గా పనిచేస్తున్నా. – రాజంపేట -
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్ లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు మూల విరాట్ కి పంచామృతాభిషేకం నిర్వహించి, టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షణ చేసి, గర్భాలయంలోని మూల విరాట్ కి సమర్పించారు. నూతన పట్టువస్త్రాలను తొడిగి, బంగారు ఆభరాణాలు వేసి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. నేడు క్రికెట్, త్రోబాల్ పోటీలు మదనపల్లె సిటీ : జిల్లా స్థాయిలో టీచర్స్‌కు క్రికెట్, త్రోబాల్ పోటీలు ఆదివారం నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శులు నాగరాజు, ఝాన్సీరాణి తెలిపారు. రాయచోటిలోని నక్కలపల్లి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అఽథారిటీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుందన్నారు. క్రికెట్, త్రోబాల్ పోటీల్లో డివిజన్ స్థాయిలో విజేతలు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. క్రికెట్ క్రీడాకారులు తమ వెంట సొంత స్పోర్ట్స్ కిట్,అబ్డామిన్ పరికరాలు, త్రోబాల్‌కు వచ్చే క్రీడాకారులు తమ వెంట సొంత క్రీడాదుస్తులు, త్రోబాల్‌ను తీసుకురావాలన్నారు. జిల్లా స్థాయి పోటీలు ముగిసిన తర్వాత మూడు డివిజన్ల నుంచి ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి జిల్లా జట్టుకు ఎంపిక జరుగుతుందన్నారు. -
ప్లాస్టిక్ నియంత్రణ అందరి బాధ్యత
కలకడ : జిల్లాను పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వస్తువుల వాడకంలో నియంత్రణ ఉండాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. శనివారం కలకడలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలకడ సర్పంచ్ ప్యారీజాన్ కుమారుడు జావాద్ కలకడ చెత్తసేకరణ కేంద్రం వద్ద అధికారులతో కలిసి చేపట్టిన కార్యక్రమాలను తెలియజేశారు. కలకడ చెత్త సేకరణ కేంద్రం వద్ద తయారు చేసిన సేంద్రీయ ఎరువులు, సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయల పంటలను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కోన గ్రామానికి చెందిన చేనేత కార్మికులు ప్రదర్శించిన పట్టుచీరలను పరిశీలించారు. స్థానికంగా విక్రయ స్థలాలకు వినియోగదారులు వచ్చే విధంగా అవగాహన పెంచాలని సూచించారు. స్వర్ణ– ఆంధ్ర, స్వచ్ఛ–ఆంధ్ర ర్యాలీలో విద్యార్థులు , పారిశుధ్యకార్మికులు, అన్నిశాఖల అధికారులతో కలిసి కలకడ వరకూ ర్యాలీ నిర్వహించి, కలకడ ఆర్టీసి బస్టాండ్ ఆవరణలో మానవహారం ఏర్పాటు చేయించి పరిశుభ్రత పాటిస్తామని, ప్లాస్టిక్ వినియోగించం అని ప్రతిజ్ఞ చేయించారు. జీతాలు పెంచి ఆదుకోండి.... వీధులు పరిశుభ్రంగా ఉంచి రోజువారి చెత్తసేకరిస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు, చెత్త సేకరణ సిబ్బంది తమకు జీతాలు పెంచాలని కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఇంకా పలు సమస్యలను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో డీపీఓ, డీఎల్పీవో, సీఐ లక్ష్మన్న, తహసీల్దార్ మహేశ్వరిభాయ్, ఎంపీడీఓ భానుప్రసాద్, సింగల్‌విండో అధ్యక్షులు వెంకట్రమణనాయుడు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ నిశాంత్‌కుమార్ -
మా ఊరి రాత మారింది..
నా 70 ఏళ్ల వయసులో మా ఊరిలో ఒక్క ప్రభుత్వ భవనం ఏర్పాటైంది చూడలేదు. జగన్ సీఎం అయ్యాక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి భవనాలు నిర్మించారు. గతంలో కనసానివారిపల్లెగా ఉండేది. జగన్ పాలనలో పంచాయతీగా చేశారు. దశాబ్దాలుగా మేం ఎరుగని అభివృద్ధి పనులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కళ్లారా చూశాం. గ్రామస్తులు ఒక సమస్య గురించి నేతలు, అధికారులకు పదేపదే అడిగినా స్పందించడం, పరిష్కరించడం అరుదు. అలాంటిది మేం అడకపోయినా అభివృద్ధి ఫలాలను మా పల్లె ముంగిటకే తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. మా ఊరునుంచే బైపాస్‌రోడ్డు కూడా పోతోంది. సిమెంటురోడ్లు, మురికినీటి కాలువలు నిర్మించి మౌలిక వసతులు కల్పించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. –జి.లక్షుమ్మ, కనసానివారిపల్లి -
సాధుకొండలో మైనింగ్ సర్వే?
– అడ్డుకున్న గ్రామస్తులు తంబళ్లపల్లె : తంబళ్లపల్లెకు సమీపంలోని మల్లయ్యకొండ, ఇనుముకొండ, సాధుకొండ సముదాయంలోని అటవీ ప్రాంతంలో మళ్లీ మైనింగ్ సర్వే కలకలం రేపింది. రెండు రోజులుగా కర్ణాటకకు చెందిన ఓ మైనింగ్ కంపెనీకి చెందిన నలుగురు జియాలజిస్టులు సాధుకొండ అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పరిసరాల గ్రామ ప్రజలు గుర్తించారు. అనుమానంతో వారిని నిలదీసి ప్రశ్నించారు. త్వరలో మైనింగ్ టెండర్లు ఉన్నందు వల్ల ఒకసారి ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ విషయాన్ని ఎఫ్బీఓ రామ్రాజ్కు తెలిపారు. హుటాహుటిన ఎఫ్బీఓ అక్కడికి వచ్చి అటవీశాఖ ఉన్నతాధికారుల అనుమతి లేనిదే అడవిలోకి వెళ్లడానికి వీలులేదని వారిని వెనక్కుపంపివేశారు. ఈ విషయంపై మళ్లీ మైనింగా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. వంక కాలువ పూడ్చివేత మదనపల్లె రూరల్ : మండలంలోని బసినికొండ పంచాయతీలో చిత్తూరు–మదనపల్లె ప్రధాన జాతీయరహదారిపై మాదినికొండ అటవీప్రాంతం నుంచి దిగువకు నీరు వెళ్లే వంక కాలువను పూడ్చివేసేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ విషయమై శుక్రవారం స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో వీఆర్వో మహేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వంక కాలువకు ఆనుకుని భూమిని చదును చేస్తున్న యజమానులతో మాట్లాడారు. వారు తమ పట్టాభూమిలో స్థలం చదునుచేస్తున్నామని చెప్పడంతో, సొంత భూమి అయినప్పటికీ వంకను పూడ్చివేసే అధికారం లేదని చెప్పారు. దీంతో యజమాని రెవెన్యూ అధికారులతో దురుసుగా మాట్లాడటంతో తహసీల్దార్ కిషోర్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బైండోవర్ నోటీసును అందజేశారు. -
ఉపాధి హామీ సవరణలకు వ్యతిరేకంగా నిరసన
మదనపల్లె రూరల్ : గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్ని, పార్లమెంటులో చట్ట సవరణ చేయడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సవరణలకు వ్యతిరేకంగా శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం, వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ... ఉపాధి హామీ చట్టానికి కేంద్రం చేస్తున్న సవరణలను రద్దు చేయాలన్నారు. చట్టబద్ధహక్కుగా ఉన్న ఈ పథకాన్ని రద్దుచేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఉపాధిహామీ పథకం పేరును మార్చడం మహాత్ముడిని అవమానించడమేనన్నారు. ఉపాధిహామీ పథకం అమలులో కీలకమైన రాష్ట్రాల భాగస్వామ్యం కొత్తబిల్లుతో నామమాత్రంగా మారుతుందన్నారు. 10 నుంచి 40 శాతం రాష్ట్రాలపై భారం పెంచారన్నారు. ఇప్పటివరకు పథకం అమలుకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న 90శాతం నిధులను 60 శాతానికి తగ్గించి రాష్ట్రాలపై వేలకోట్లు అదనపు భారం వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా కోశాధికారి టి.హరిశర్మ, ఆటో యూనియన్ నాయకులు శ్రీరాములు, ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి, వ్యవసాయ కార్మికసంఘం నాయకులు మోహన్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పామూరి సుబ్రమణ్యంపై కేసు నమోదు ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వద్ద నిత్యాన్నదానం కేంద్ర ఏర్పాటు పనులను నిలిపి వేసిన వ్యక్తి పామూరి సుబ్రమణ్యంపై శుక్రవారం టీటీడీ అధికారులు కేసు నమెదు చేశారు. పోలీసుల వివరాల మేరకు..ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఆవరణలో తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు లో భాగంగా ఈ నెల 12 వ తేదిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు పనులు నిర్వహిస్తుండంగా పామూరు సుబ్రమణ్యం అనే వ్యక్తి తమ స్థలం అంటూ ఆ రోజు ఆ పనులను నిలిపి వేయడంపై 19వ తేదీ ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో ప్రశాంతి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పామూరు సుబ్రమణ్యంపై కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
పెళ్లి ఇంట విషాదం
● పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో వధువు తండ్రి మృతి ● 10 రోజుల్లో పెళ్లి ఉండగా ఘటన ములకలచెరువు : కన్న కూతురి పెళ్లి కళ్లారా చూడాలని... ఘనంగా చేయాలని కలలు కన్న ఒక తండ్రి సంతోషంతో బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకరమైన ఘటన శుక్రవారం రాత్రి ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లెకు చెందిన పి.ఖాసీంవలి కుమార్తె అఫ్రీన్కు అదే గ్రామానికి చెందిన యువకుడితో వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు పంచేందుకు ఖాసీంవలి ఉదయం ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వెళ్లాడు. అక్కడ పెళ్లి పత్రికలు పంచి తిరిగి సాయంత్రం ఇంటికి బయల్దేరాడు. ములకలచెరువు మీదుగా మద్దయ్యగారిపల్లెకు వెళ్తుండగా నాయనచెరువుపల్లి సత్రం మలుపు వద్ద ద్విచక్రవాహనంలో ఎదురుగా వస్తున్న బి.కొత్తకోట మండలం బుచ్చిరెడ్డిగారిపల్లి నారాయణస్వామికి చెందిన ద్విచక్రవాహనం ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఖాసీంవలి తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. నారాయణస్వామి సైతం తీవ్రంగా గాయపడడంతో 108 సహాయంతో మదనపల్లి ప్రభుత్వ హాస్పెటల్‌కు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్ఐ నరసింహుడు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని మృతిదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ హాస్పెటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి అఫ్రీన్, అమ్మాజాన్ ఇద్దరు కుమార్తెలు, ఆసీఫ్ కుమారుడు, భార్య సంషాద్ ఉన్నారు. సంఘటన స్థలంలో వీరి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. పెద్దదిక్కు లేకుండా చేశావు.... మేము నీకేమి అన్యాయం చేశాం దేవుడా అంటూ రోదించారు. -
బోయనపల్లెను వీడని గంజాయి వాసన!
రాజంపేట: కడప–రేణిగుంట హైవేలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం బోయనపల్లె.ఈ ప్రాంతాన్ని గంజాయి వాసన వీడేటట్లు కనిపించడంలేదు.బోయనపల్లెలో వివిధ ఇంజినీరింగ్ విద్యాసంస్ధలు ఉండటంతో ఇతర జిల్లాలకు చెందిన అనేక మంది యువతీ, యువకులు ఉన్నారు. గంజాయి ఎక్కడి నుంచి ఈ ప్రంతానికి వస్తుందనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడుగా గంజాయి అమ్మకాలు.. న్యూ బోయనపల్లెలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనేది ఓపెన్ టాక్. రూ.350, రూ.450, రూ.550లకు విక్రయిస్తున్నట్లు పలువురు చెపుతున్నారు. యువతను అధికంగా ఆకర్షించేలా రహస్యంగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకొని గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు తెలిసింది.గంజాయి ఎక్కడి నుంచి దిగుమతి అవుతోందన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. . పోలీసు సబ్‌కంట్రోల్ ఉన్నా.. న్యూబోయనపల్లెలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీగా ఉంటుంది. అలాగే ట్రాఫిక్ కూడా ఉంటుంది. గతంలో ఇక్కడ సబ్ కంట్రోల్ ఉంది. పోలీసు సిబ్బంది కొరత కారణంగానే నిర్వహణ భారంగా మారిందనే భావనలు శాఖాపరంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడైతే మూతపడింది. గతంలో బోయనపల్లెలో అటు మద్యం, ఇటు గంజాయి మత్తులో యువత వీరంగాలు సృష్టించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.. గతంలో గంజాయి బ్యాచ్‌లో గొడవలకు దిగారు. పోలీసుల వరకువెళ్లింది. ఈ ప్రాంతంలో గంజాయి వాసనను లేకుండా చేయడానికి ఇప్పుడు పోలీసులు దృష్టి సారించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అనుమానితులపై నిఘా.. తాజాగా గంజాయి అమ్మకాలు విషయంలో మన్నూరు పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.గతంలో కూడా కొందరిని పట్టుకున్నారు. ప్రస్తుతం రాజంపేటలో స్పెషల్‌పార్టీ సంచరిస్తోంది. అవాంఛనీయ సంఘటన ప్రాంతాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు అనుమానితులను విచారిస్తున్న పోలీసులు -
కార్మికుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : మిద్దైపె నుంచి పడి భవననిర్మాణ కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని ఎస్టేట్ విజయనగర్‌కాలనీకి చెందిన వీరభద్ర(55) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నా డు. బాబూకాలనీలో ఓ ఇంటిపై పనులు చేస్తుండ గా, అక్కడ అమర్చిన సారువ కొయ్యలు బ్యాలె న్స్ తప్పడంతో మిద్దైపె నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కరెంట్‌షాక్‌తో యువకుడికి తీవ్రగాయాలు మదనపల్లె రూరల్ : కరెంట్‌షాక్‌తో యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. చీకలబైలుకు చెందిన రామకృష్ణ కుమారుడు కరుణాకర్ అలియాస్ కర్ణ(17) ఎలక్ట్రిక్ లైటింగ్ పనులు చేసేవాడు. శుక్రవారం మండలంలోని శానిటోరియం సమీపంలోని ఓ చర్చికి క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ అలంకరణ చేస్తుండగా, వైరును పైకి వేసే క్రమంలో 11కేవీ.విద్యుత్ తీగలపై పడి కరెంట్ షాక్‌కు గురై చెట్టుపై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గా యపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే బా ధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి త రలించారు. చికిత్సలు అందించిన అనంతరం ప రిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు. కారు – ద్విచక్రవాహనం ఢీ – భార్యభర్తలకు తీవ్ర గాయాలు పీలేరురూరల్ : కారు – ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్ర గాయాలైన సంఘటన పీలేరు శివారు ప్రాంతం బోడుమల్లువారిపల్లె సమీపంలో చోటు చేసుకుంది. సుండుపల్లె మండలం గొల్లపల్లెకు చెందిన ఆనంద్ (30), భార్య శ్రావణి (27) పీలేరులో టీ హోటల్ పెట్టుకుని జీవనం సాగించేవారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భార్యభర్తల తోపాటు కుమారుడు అభయ్‌కుమార్ ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కాణిపాకం వెళుతున్న కారు బోడుమల్లువారిపల్లె వద్ద వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యభర్తలిరువురూ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ ఆనంద్, శ్రావణి -
బాదుడే.. బాదుడు!
● ఫిట్నెస్ పేరుతో చార్జీల మోత ● వాహనదారులపై అదనపు భారం ● ఆందోళన చెందుతున్న యజమానులు ● ఇక వాహనాలు నడపలేమంటున్న వైనం కడప వైఎస్ఆర్ సర్కిల్: వాహనదారులు ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం ఫిట్నెస్ చార్జీలు పెంచింది. వైఎస్సార్ జిల్లా పరిధిలో వివిధ రకాల వాహనాలు కలిపి సుమారు లక్షకు పైగా ఉన్నాయి. ఒకవైపు బాడుగ లేక మరోవైపు డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి టైర్లు, ఇన్సూరెన్స్‌తోపాటు విడిభాగాల ధరలు కూడా కొండెక్కి కూర్చున్న నేపథ్యంలో.. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు వాహనదారుల పరిస్థితి తయారైంది. ఆటో నుంచి లారీల వరకు ఫిట్నెస్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇటు పెరిగిన ఫిట్నెస్ చార్జీలు అటు ఈఎంఐలు కట్టలేక వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే వాహనాలు నడపలేమని చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో కడప, కమలాపురం, పులివెందుల, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో వివిధ రకాల వాహనాలు, లారీలు, టిప్పర్లు, క్రేన్లు, జేసీబీలు ఇతర ట్రాన్స్పోర్ట్ వాహనాలు అధికంగా ఉన్నాయి. వాటి యజమానులకు.. పెంచిన చార్జీలు అదనపు భారం కానున్నాయి. 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఒకే రకం చార్జీలు అమలు చేస్తున్నారు. లైట్ , మిడిల్ గూడ్స్ వెహికల్స్, హెవీ గూడ్స్ వెహికల్స్‌గా విభజించి ఫిట్నెస్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. హెవీ వెహికల్స్ 10 920 1416 10–13 2360 15–20 16,520 20 ఏళ్లకు పైగా 33,040 ఎంజీవీ 10 920 1416 10–13 2360 15–20 13,334 20 ఏళ్లకు పైగా 26,668 ఆటో 15 620 944 15–20 2360 20 ఏళ్లకు పైగా 10,620 ఎల్‌జీవీ 15 820 944 15–20 10,030 20 ఏళ్లకు పైగా 20,060 చార్జీలు తగ్గించాలి ప్రభుత్వం ఫిట్నెస్ చార్జీలు పెంచింది. లారీలు, ట్రాక్టర్లు, గూడ్స్ వెహికల్ యజమానులు పెంచిన చార్జీలతో ఇబ్బంది పడతారు. వాటిని తగ్గించాలి. –వేణుగోపాల్, జిల్లా అధ్యక్షుడు, ఏఐటీయూసీ -
రైల్వేకోడూరులో అరెస్ట్ కలకలం
● అరుదైన వన్యప్రాణుల స్మగ్లింగ్‌లో నలుగురు అరెస్ట్ ● స్థానిక ఎస్సార్కె లాడ్జీలో నిందితులను విచారించిన అధికారులు రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలో డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇన్టెలిజెన్స్ కేంద్ర బృందాల దాడులు శుక్రవారం పట్టణంలో కలకలం రేపాయి. అటవీశాఖకు సంబంధించిన అరుదైన రకం జంతువుల స్మగ్లింగ్ చేస్తున్న కొందరిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, నాలుగు బృందాలు దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు. వారిని పట్టణంలోని ఎస్సార్కె లాడ్జ్‌లో మధ్యాహ్నం నుంచి 9 గంటలకు పైగా విచారణ చేస్తుండడంతో జనాలు, అరెస్ట్ అయిన వారి బంధువులు లాడ్జ్ వద్ద గుమికూడడంతో కలకలం రేగింది. దీనికి తోడు స్థానిక పోలీసులు, అధికారులు, పాత్రికేయులను అనుమతించలేదు. లాడ్జ్‌ను మొత్తం వారి అదుపులోకి తీసుకొన్నారు. రాత్రి 9 గంటల సమయంలో అటవీశాఖ అధికారులను లోపలికి అనుమతించారు. అనంతరాజుపేటకు చెందిన ఆటోడ్రైవర్ మొలకల సుబ్రమణ్యం, పట్టణానికి చెందిన శ్రీరాములు ఆచారిలను అదుపులోకి తీసుకుని విచారణ ఆధారంగా మరో ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిసింది. అటవీ శాఖ అరుదైన ప్రాణులైన అల్వా, పూడుపాములను విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో దాడులను నిర్వహించినట్లు తెలిసింది. అలాగే వారివద్దనుండి కొన్ని వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదుపులోకి తీసుకొన్న వారితో అధికారులు, లాడ్జీ ముందు గుమికూడిన జనం -
రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి
రాజంపేట టౌన్: జిల్లాల పునర్విభజన, మండలాల మార్పులు చేర్పులపై అభ్యంతరాలు తెలిపేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు దగ్గర పడుతుండటంతో రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్‌తో చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అందులో భాగంగా జేఏసీ ప్రజాగర్జనకు పిలుపునివ్వడంతో శుక్రవారం రాజంపేట పట్టణంలో ప్రజలు కదం తొక్కారు. రాజంపేట, నందలూరు, పుల్లంపేట మండలాల నుంచి వేలాదిగా తరలి వచ్చారు. దీంతో పాతబస్టాండ్ సర్కిల్ నలుదిక్కులు కిక్కిరిసి పోయింది. జేఏసీ నాయకులు 11–30 గంటలకు ర్యాలీగా సబ్‌కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు. ఈసందర్భంగా దారివెంబడి ప్రజలు అన్నమయ్య పుట్టిన గడ్డ రాజంపేట, రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి, వుయ్‌వాంట్ జస్టిస్ అంటూ చేసిన నినాదాలు హోరెత్తించాయి. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని రాజంపేట జిల్లా కేంద్రం అయితే తొమ్మిది మండలాల ప్రజలకు కష్టాలు, ఇబ్బందులు తప్పుతాయని అందువల్ల ఈవిషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సబ్‌కలెక్టర్ భావనకు జేఏసీ నాయకులు వినతి పత్రం అందచేశారు. ఈసందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గతంలో రాజంపేట, రైల్వేకోడూరు, మదనపల్లె ప్రాంతంవైపు ఉండే నియోజకవర్గాలకు రాయచోటి మధ్యలో ఉండేదని అందువల్ల రాయచోటి కేంద్రంగా అన్నమయ్యజిల్లా ఏర్పడిందన్నారు. ప్రస్తుతం మదనపల్లె జిల్లా కేంద్రం అవుతుండటంతో రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాలకు రాజంపేటలో మధ్యలో ఉంటుందని అందువల్ల రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల్లోని ప్రజలతో పాటు రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, నందలూరు మండల ప్రజలకు రాజంపేట జిల్లా కేంద్రం అయితేనే సౌకర్యవంతంగా ఉంటందన్నారు. లేకుంటే ఆ మండలాల ప్రజలు రెండు బస్సులు మారి వ్యయ ప్రయాసాలకోర్చి రాయచోటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయని తెలిపారు. పైటకొంగుచాచి వేడుకున్న మహిళలు రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని పలువురు మహిళలు పైటకొంగుచాచి చంద్రబాబు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఒంటిమిట్ట, సిద్దవటం, రైల్వేకోడూరు నియోజకవర్గాలకు చెందిన మహిళలు ఏదైనా పనిమీద రాయచోటికి వెళ్లాలంటే రెండు బస్సులు మారి వెళ్లాలన్నారు. పనికావడం ఆలస్యమైతే రాత్రి వేళల్లో ఇంటికి చేరుకునేందుకు మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల చంద్రబాబు ప్రభుత్వం మహిళల భధ్రతను కూడా దృష్టిలో పెట్టుకొని అన్నమయ్యజిల్లా కేంద్రం విషయంలో నిర్ణయం తీసుకో వాలని మహిళలు కోరారు. ఈకార్యక్రమంలో జేఏసీ నాయకులు ప్రభాకర్, చిట్వేలి రవికుమార్, అబూబకర్, అల్లం సుబ్రమణ్యం, పూల భాస్కర్, చల్లా సుధాకర్, రాజశేఖర్ నాయక్ పాల్గొన్నారు. ప్రజాగర్జనలో పెద్దఎత్తున పాల్గొన్న ప్రజలు రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని కొంగుచాచి వేడుకుంటున్న మహిళలు ప్రజాగర్జనలో గర్జించిన జనం -
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నం
మదనపల్లె రూరల్ : మండలంలోని వలసపల్లె పంచాయతీలో ఎనిమిదేళ్ల బాలికపై, 22 ఏళ్ల యువకుడు అత్యాచార యత్నం చేసిన ఘటన రెండురోజుల తర్వాత వెలుగుచూసింది. బాధిత బాలిక తండ్రి మృతి చెందగా, తల్లి వదిలేసి వెళ్లడంతో ఆ బాలిక అవ్వ వద్ద ఉంటోంది. స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. 17వ తేదీ పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత సాయంత్రం బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుండగా, గ్రామానికి చెందిన వరుణ్(22) ఊరు బయటకు ఎత్తుకువెళ్లాడు. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తుండగా, గమనించిన గ్రామస్తులు అడ్డుకోగా, నిందితుడు వరుణ్ పారిపోయాడు. జరిగిన ఘటనపై బాలిక అవ్వ, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు జి.నాగరాజరెడ్డి, గ్రామస్తులతో కలిసి తాలూకా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జరిగిన ఘటనపై సీఐ కళావెంకటరమణకు ఫిర్యాదుచేసింది. ఆమేరకు నిందితునిపై పోక్సో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం గ్రామానికి వెళ్లిన సీఐ, అత్యాచార ఘటనపై విచారణ చేశారు. కాగా, నిందితుడు వరుణ్, ఏడాదిన్నర క్రితం గ్రామానికి చెందిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అప్పట్లో గ్రామస్తులు మందలించి వదిలేసినప్పటికీ, నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. చిన్నబిడ్డలపై అత్యాచారాలకు పాల్పడేటటువంటి కామాంధుడు వరుణ్‌ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు -
వంద శాతం లక్ష్యం సాధించాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్: రాయలసీమ జోన్ పరిధిలోని 8 జిల్లాలకు ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలను వంద శాతం సాధించాలని రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (ఆర్‌జేటీసీ) కృష్ణ వేణి పేర్కొన్నారు. శుక్రవారం కడపలోని ఊటుకూరులో ఉన్న జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో రాయలసీమ జోనల్ స్థాయి అర్ధ వార్షిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ లక్ష్యాలను 82 శాతం మాత్రమే సాధించామని, వంద శాతం సాధించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వాహనాల పన్ను చెల్లించని యజమానులకు నోటీసులు పంపించాలని తెలిపారు. 2026 మార్చి 31 నాటికి వాహన పన్నుల వసూలు పూర్తి చేయాలని సూచించారు. 2026 జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జిల్లాల్లో రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ పరిధిలోని 8 జిల్లాల డీటీసీలు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
క్వారీలతో పల్లె రోడ్లు ఛిద్రం
మదనపల్లె రూరల్: మదనపల్లె మండలం కోటవారిపల్లె పంచాయతీలోని క్వారీలతో పల్లె రోడ్లు ఛిద్రమైపోతున్నాయని, వాటి నుంచి వచ్చే దుమ్ముతో పంటపొలాలు దెబ్బతింటున్నాయని, పేలుడు శబ్దాలతో ఇళ్లలో ఉండలేకున్నామని రైతులు ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో ఇచ్చిన అర్జీపై సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి స్పందించారు. రైతుల సమస్యను నేరుగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ, మైనింగ్ సిబ్బందితో కలిసి పర్యటించారు. రోడ్ల దుస్థితిని నేరుగా పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మదనపల్లె మండలం రామసముద్రం రోడ్డు నుంచి కోటవారిపల్లె, ఉడుంవారిపల్లెకు వెళ్లే రహదారి, క్వారీలకు సంబంధించిన భారీ వాహ నాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వర్షాకాలంలో ప్రయాణానికి ఏమాత్రం అనువుగా లేకపోగా, మోకాలిలోతు గుంతలతో ప్రయాణం నరకంగా తయారైందన్నారు. దీనికితోడు క్వారీల నిర్వహణతో వెలువడే దుమ్ము, ధూళి కారణంగా శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. పేలుళ్ల ధాటికి ఇళ్లలో ఉండలేకున్నామని, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ గ్రామానికి వచ్చి, రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అవకాశం లేకుండా పోతోందన్నారు. దీనికితోడు క్వారీ నిర్వాహకులు కొండలపై నుంచి దిగువకు నీరు వచ్చే సప్లై ఛానల్స్, చెక్‌డ్యామ్‌లను పూర్తిగా మూసివేశారన్నారు. దీంతో గొర్రెలు, పశువులకు తాగునీటి వసతి లేకపోగా, మేపేందుకు వీలు లేకుండా పోయిందన్నారు. క్వారీలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేటప్పుడు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తామని, గ్రామాల్లో మౌలికవసతులు కల్పిస్తామని, అభివృద్ధికి సహకరిస్తామని చెప్పడం తప్పితే, పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. రైతుల సమస్యలు తెలుసుకున్న సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి...క్షేత్రస్థాయిలో తాను గమనించిన అంశాలు, రహదారుల దుస్థితిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి, మండల ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం, సర్వేయర్ సుబ్రహ్మణ్యం, మాజీ సర్పంచ్ సొక్కం సత్యనారాయణ, రైతు సురేష్, వీఆర్వో చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. దుమ్ము, శబ్దాలతో నిత్యం నరకం సబ్ కలెక్టర్ చల్లాకల్యాణికి రైతుల వినతి -
చీటీల పేరుతో రూ.కోటి దాకా కుచ్చు టోపి..?
● ఒకొక్కరికి రూ.3 నుంచి రూ.10 లక్షల దాకా ఎగ్గొట్టిన వైనం ● లబోదిబోమంటున్న బాధితులు పెద్దతిప్పసముద్రం : కూలీ నాలీ చేసి కొంత మంది, వ్యవసాయం, వ్యాపారాలు చేసుకుని మరి కొందరు ఇలా పైసా పైసా కూడబెట్టుకున్నారు. ఇలా కూడబెట్టిన సొమ్మును ఓ ప్రైవేటు వ్యక్తి వద్ద పొదుపు చేసి నెలల వారీ చీటీలు వేశారు. ఇంట్లో జరిగే శుభ కార్యాలు, లేదా గృహ అవసరాలకు ఆసరాగా ఉంటుందని భావించారు. తీరా చీటీలు వేసిన నిర్వాహకుడు అమాయక ప్రజలను నిలువునా ముంచేసి పరారయ్యాడు. రూ.కోటి దాకా ప్రజల సొమ్ముతో ఉడాయించడంతో బాధితులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రంగసముద్రం పంచాయతీ విసనకర్రవాండ్లపల్లికి చెందిన పుంగనూరు రామాంజనేయరెడ్డి అనే వ్యక్తి పీటీఎం, బి.కొత్తకోట మండలాలతో పాటు కర్నాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలకు సుపరిచితుడిగా, నమ్మకస్థుడిగా పేరు గాంచాడు. ఇతను రూ.2 నుంచి రూ.10 లక్షల వరకు నెలవారీ చీటీలు నడుపుతూ ముగిసిన చీటీదారులకు సకాలంలో డబ్బులు తిరిగి చెల్లిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యాడు. దీంతో పదుల సంఖ్యలో చాలా మంది కాయ కష్టం చేసి కూడబెట్టుకున్న డబ్బును ఇతని వద్ద నెలకు రూ.6 నుంచి రూ.10 వేల దాకా చీటీల్లో పొదుపు చేసేవారు. ఈ తరుణంలో చీటీల గడువు ముగిసినా బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించడంలో నిర్వాహకుడు కాలయాపన చేసాడు. ఇలా గత 10 నెలల పాటు ఇదిగో అదిగో ఇస్తామని ప్రజలకు నమ్మబలికేవాడు. ఈ తరుణంలో చీటీల నిర్వాహకుడు గత మూడు నెలల నుంచి బాధితులకు తప్పించుకుని తిరగడంతో విసిగి వేసారిన ప్రజలు న్యాయం చేయాలని పోలీసులను ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్ఐ పరమేశ్ నాయక్‌ను వివరణ కోరగా పరారీలో ఉన్న చీటీల నిర్వాహకుడు ఇప్పటికే కోర్టును ఆశ్రయించి పలువురికి నోటీసులు కూడా పంపాడని సదరు బాధితులు కూడా న్యాయస్థానంను ఆశ్రయిస్తే బాగుంటుందని హితబోధ చేశారు. -
పునఃప్రారంభం అయిన నిత్యాన్నదాన కేంద్రం పనులు
టీటీడీ, విజిలెన్స్, పోలీసు అధికారులతో వాదిస్తున్న పామూరు సుబ్రమణ్యం పునఃప్రారంభం అయిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ ఆవరణలో ఈ నెల 11వ తేది ప్రారంభం అయ్యి 12వ తేది ఆగిపోయిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు శుక్రవారం టీటీడీ అధికారులు పునఃప్రారంభించారు. అసలు విషయానికి వస్తే...ఈ నెల 11న రామాలయం ఆవరణలోని నామల వనం పక్కనే ఉన్న పార్కులో తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులను ప్రారంభించారు. అయితే టీటీడీ పనులు ప్రారంభించిన ప్రదేశం తమది అంటు పామూరు సుబ్రమణ్యం అనే వ్యక్తి అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకుని అతని హద్దు వరకు కంచె వేసేందుకు సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి అక్కడ టీటీడీ చేస్తున్న తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు ఆగిపోయాయి. దీంతో స్థానికంగా ఉన్న ఆలయ టీటీడీ అధికారులు విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు సమస్య పరిష్కారానికి టీటీడీ వీజీవో(విజిలెన్స్, భద్రత అధికారి) గిరిధర్ శుక్రవారం ఒంటిమిట్ట రామాలయం వద్దకు చేరుకున్నారు. సమస్యాత్మకంగా ఉన్న తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న నిత్యాన్నదానం కేంద్రానికి సంబంధించిన ప్రదేశాన్ని సందర్శించి, అక్కడ పనులకు ఆటంకం కలిగించేందుకు పామూరు సుబ్రమణ్యం ఏర్పాటు చేసిన సిమెంట్ స్తంభాలను స్థానిక పోలీసులు, విజిలెన్స్ సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న పామూరు సుబ్రమణ్యం ఘటన స్థలానికి చేరుకుని తమ స్థలానికి నష్టపరిహారం అందించి, అందులో ఏ పనులైనా చేసుకోవాలని వారితో వాదించారు. అయితే ఆయన వాదన విన్న వీజీవో గిరిధర్ తమది అంటున్న స్థలానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉంటే కోర్టు ఆదేశాలతో రావాలని ఆయన తెలిపారు. అంత వరకు ఇక్కడ పనులు ఆపే అర్హత వారికి లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేది ఏమీ లేక పామూరు సుబ్రమణ్యం కోర్టు ఆదేశాలతో వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సీఐ నరసింహారాజు, టీటీడీ సివిల్ విభాగం డీఈ నాగరాజు, ఏఈ అమర్ నాథ్ రెడ్డి, స్థానిక విజిలెన్స్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అనారోగ్యంతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బి.మహేశ్వర్ రెడ్డి (ఏఆర్ పీసీ 422) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఏఆర్ పీసీ మహేశ్వర్ రెడ్డి మృతి పట్ల జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే సిబ్బంది అకాలమరణం పొందడం బాధాకరమన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆర్ఐ శివరాముడు.. కడప నగరం రవీంద్ర నగర్‌లోని బి.మహేశ్వర్ రెడ్డి స్వగృహం వద్దకు వెళ్లి మృతదేహం వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కాగా మహేశ్వర్ రెడ్డి 1994బ్యాచ్ కు చెందిన వ్యక్తి. భార్య, కుమార్తె ఉన్నారు. శనివారం పోలీస్ లాంఛనాలతో మహేశ్వర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ పాల్గొన్నారు. -
సీమ అస్తిత్వ చిరునామా గజ్జెల మల్లారెడ్డి
కడప ఎడ్యుకేషన్ : రాయలసీమ అస్తిత్వాన్ని చిరునామాగా చేసుకొని, తెలుగు గేయానికి గజ్జకట్టి నృత్యం చేయించిన అభ్యుదయ రచయిత గజ్జెల మల్లారెడ్డి అని కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అన్నారు. యోగి వేమన విశ్వ విద్యాలయం తెలుగు శాఖ, కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో గజ్జెల మల్లారెడ్డి శత జయంతి సదస్సు శుక్రవారం విశ్వవిద్యాలయంలోని మొల్ల సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం భాషల పట్ల వారధిగా పనిచేయడానికి కేంద్ర సాహిత్య అకాడమీని ఏర్పాటు చేశారన్నారు. గజ్జెల మల్లారెడ్డి రాయలసీమ అస్తిత్వాన్ని చిరునామాగా చేసుకున్నాడని, తెలుగు గేయానికి గజ్జకట్టి నృత్యం చేయించాడన్నారు. అభ్యుదయ సాహిత్యానికి కడప జిల్లా కవులు ప్రధాన భూమిక పోషించారని, వారిలో రాచమల్లు రామచంద్రా రెడ్డి , కేతు విశ్వనాథ రెడ్డి, సొదుం జయరాం, గజ్జెల మల్లారెడ్డి తదితరులు ఉన్నారని అన్నారు. మల్లారెడ్డి వేమన లాగే ప్రజల్లో తిరిగాడని, అందుకే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు కవిత్వంగా మార్చాడన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చకు రావాలన్నారు. గజ్జెల మల్లారెడ్డి సరళమైన భాషలో, క్లుప్తంగా,వ్యంగ్యాత్మంగా రాస్తారని అన్నారు. రాజకీయ విమర్శ చాలా సూటిగా ఉంటుందని ఉదహరించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య టి.శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు వృత్తి బాధ్యతతో పాటు ఒక ప్రవృత్తిని ఎంచుకొని ముందుకు సాగితే భవిష్యత్తు సంతోషంగా ఉంటుందని, ఒకవేళ మన ప్రవృత్తి సాహిత్యం అయితే జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి రాసిన శ్రీగజ్జెల మల్లారెడ్డి జీవిత చరిత్ఙ్ర పుస్తకం(మోనోగ్రాఫ్)ను అతిథులు ఆవిష్కరించారు. తెలుగు శాఖాధిపతి, కేంద్ర సాహిత్య అకాడెమీ సలహా మండలి సభ్యులు, సదస్సు నిర్వాహకులు ఆచార్య ఎం. ఎం.వినోదిని స్వాగతం పలికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ ఎం. ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ గజ్జెల మల్లారెడ్డి నిరంతరం రాజకీయాలను పరిశీలిస్తూ వర్తమాన అంశాలను కవిత్వంగా, వ్యాసాలుగా రాసేవారని అన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ప్రాచ్య పరిశోధనా సంస్థ సంచాలకులు ఆచార్య పిసి వెంకటేశ్వర్లు గజ్జెల మల్లారెడ్డి ఆత్మకథ అయిన ఆత్మసాక్షిపై మాట్లాడారు. మల్లారెడ్డి అనువదించిన సుహృల్లేఖనం, దమ్మపథం గ్రంథాలపై ప్రముఖ విమర్శకులు డా. పి. సంజీవమ్మ మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు మేడిపల్లి రవికుమార్ మాట్లాడారు. గజ్జెల మల్లారెడ్డి గేయాల్లోని నిర్మాణ పద్ధతులను తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్ ఎన్.ఈశ్వర రెడ్డి ఉదాహరణలతో వివరించారు. ఈ సదస్సులో కేంద్ర అకాడెమీ ప్రతినిధి టి.ఎస్. చంద్రశేఖర రాజు, సాహిత్య తెలుగు శాఖ ఆచార్యులు పి.రమాదేవి, జి. పార్వతి, ఆర్ట్స్ డీన్ ఆచార్య కె. గంగయ్య, పరిశోధకులు,పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం -
డిజిటల్ ప్రయోగాల వినియోగంపై శిక్షణలో మడితాటి
రాయచోటి టౌన్ : ఢిల్లీ (ఎన్సీఈఆర్టీ)లో సాంఘికశాస్త్రం బోధనలో అమలు పరుస్తున్న డిజిటల్ ప్రయోగాల (వర్చువల్ ల్యాబ్స్)పై నిర్వహిస్తున్న జాతీయ స్థాయి శిక్షణలో రాయచోటి డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి పాల్గొన్నారు. గత రెండు రోజులు (18,19) రోజులు నిర్వహించిన ఈ శిక్షణలో భాగంగా ఆయన పాల్గొని సాంఘిక శాస్త్రం బోధనపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ట్రైనర్లు పాల్గొని సాంఘికశాస్త్ర బోధన అంశాలపై డిజిటల్ ప్రయోగాల అమలు వలన పాఠ్యపుస్తకాలలోని కఠినమైన భావాలను విద్యార్థులకు సులభతరంగా అర్థం అయ్యే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి శిక్షణ వలన బోధన –అభ్యాసన పక్రియ మరింత ఆసక్తిగా మారుతుందని తెలిపారు. వర్చువల్ ల్యాబ్స్, యానిమేషన్లు, ఇంటరాక్టీవ్ మ్యాప్స్. సిమ్యులేషన్స్ ద్వారా భౌగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం వంటి అంశాలపై విద్యార్థులకు అనుభావత్మకంగా (లెర్నింగ్ బై డూయింగ్) నేర్చుకొనే అవకాశం లభిస్తుందన్నారు. డిజిటల్ పద్దతి ద్వారా విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను పెంపొందిస్తుందన్నారు. ఈ శిక్షణలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర పి బెహరా, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ బింజా, అనేక రాష్ట్రాల నుంచి ఎన్సీఈఆర్టీ అధ్యాపకులు, డైట్ అధ్యాపకులు పాల్గొన్నారని తెలిపారు. -
సౌత్‌జోన్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
మదనపల్లె సిటీ: జేఎన్టీయూ సౌత్‌జోన్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు స్థానిక ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి ప్రశాంత్ ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన జేఎన్టీయూ సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్శిటీ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నాడు. ప్రతిభ కనబరిచి త్వరలో జరిగే సౌత్‌జోన్ పోటీలకు ఎంపికయ్యాడు. కాలేజీలో శుక్రవారం కాలేజీ డైరెక్టర్ రామమోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రాయుడు, అధ్యాపకులు అభినందించారు. కురబలకోట: అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంఐటీఎస్–ఐపీఎఫ్‌సీ మదనపల్లె మద్దతుతో మదనపల్లె పట్టు –పట్టు చీరల కోసం భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ కోసం దరఖాస్తు సమర్పించినట్లు యూనివర్సిటీ వీసీ సీ.యువరాజ్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టుచీరలు నాణ్యత, మెరుపు,తేలిక లాంటి అల్లికకు ప్రసిద్ధి చెందాయన్నారు. మిట్స్ ఛాన్సలర్ ద్వారకనాథ్ మాట్లాడుతూ రైతులు,నేత కార్మికులు తయారీదారులు జీఐ ట్యాగ్ సంభావ్య ప్రయోజనాలపై ఆశాభావంతో ఉన్నారన్నారు. రాయచోటి టౌన్: ఈ నెల 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య, వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఉషశ్రీ పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి వైద్యశాఖ కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖాధికారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 0–5 సంవత్సరాల లోపు పిల్లలు 1,78,150 మంది ఉన్నారని తెలిపారు. వీరికి పోలియో చుక్కలు వేయడానికి 1615 బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. పోలియో చుక్కలు వేయడానికి 6648 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 0–5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి 100 శాతం పోలియో లేని దేశం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాయచోటి: జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి పది సంవత్సరాల పైబడి క్లైమ్ చేయని బ్యాంకు అకౌంట్లలోని నగదును జిల్లా పరిపాలనకు వినియోగించుకునేలా.. జిల్లా కలెక్టర్ అకౌంట్లోకి బదిలీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులు, బ్యాంకుల ప్రతినిధులను జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖలకు సంబంధించి బ్యాంకు అకౌంట్లపై జిల్లా సంయుక్త కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మొదట జిల్లాకు సంబంధించి వంద అకౌంట్లను గుర్తించి బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు,బ్యాంకర్లను ఆదేశించారు. నిల్వ ఉన్న నగదును జిల్లా పరిపాలనకు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సంతకం.. సమరనాదం
ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి... మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటిసంతకాల సేకరణకు విశేష స్పందన లభించింది. రాష్ట్రంలో విద్యార్థులు, ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుకోవాలి. పక్క రాష్ట్రాల్లో తక్కువ మార్కులకు మెడికల్ సీటు దొరికే అవకాశాల ఉంటే.. మన రాష్ట్రంలోని విద్యార్థులు వారి కంటే మెరుగైన మార్కులు తెచ్చుకున్నా సీటు దక్కకుండా పోతోంది. దీనివల్ల పేదలకు వైద్యవిద్య అందని ద్రాక్షలా మారుతుంది. ప్రైవేటీకరణపై విద్యార్థుల నుంచి వ్యతిరేకతను గుర్తించి చంద్రబాబు ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలి. – నూర్ సయ్యద్‌బాషా, పీలేరుప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థి లోకం రణం మొదలుపెట్టింది. ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపి చేపట్టిన కోటి సంతకాల సేకరణలో తమదైన పాత్ర పోషించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. లక్షలాది మంది యువత, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై పలువురి మనోగతం. పేదలకు వైద్యవిద్య దూరం చేయడమే... పేద విద్యార్థులను ఆదుకోవడానికి గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి 17 మెడికల్ కళాశాలలో మంజూరు చేశారు. వాటి నిర్మాణాలు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థులకు వైద్యవిద్య దూరం చేసినట్లే. – అత్తార్ రిజ్వాన్, పీలేరు. ప్రభుత్వ నిర్ణయం సరికాదు వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం సరికాదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం ఖరీదైనది కావడంతో పేదలకు వైద్యం దూరమవుతుంది.ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. –ఎం.మేఘన, పుల్లంపేట ప్రభుత్వం పునరాలోచించాలి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద, మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్య దూరమవుతుంది. విద్య, వైద్య రంగాలను ప్రభుత్వమే నడపాలి. అప్పుడే సామాన్యులకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం పునరాలోచించాలి. –గౌస్‌అహ్మద్, విద్యార్థి, తంబళ్లపల్లె ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తే ఫీజులు అమాంతంగా పెరిగిపోతాయి. పేద విద్యార్థులు లక్షల్లో ఫీజులు చెల్లించి వైద్యవిద్య పొందే అవకాశం ఉండదు. మెడికల్ కళాశాలలు అన్ని ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలి. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంపై చూపుతున్న ప్రయత్నాలను తక్షణం ఉపసంహరించుకోవాలి. – కె.ఎస్. అర్షద్, పీలేరు. ప్రైవేటీకరణను తక్షణం ఆపాలి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో విద్యార్థులు పాల్గొని ప్రభుత్వంపై వ్యతిరేకత చాటారు.ప్రైవేటీకరణను తక్షణం ఆపాలి. – ఎం.యశ్వంతిసాయి, నందలూరు -
ఆర్టీపీపీలో నాలుగు ఇళ్లలో చోరీ యత్నం
● ఒక ఇంటిలో 3 తులాల బంగారు, 150 గ్రాముల వెండి ఆభరణాలు చోరీ ● సంఘటన స్థలాన్ని పరిశీలించిన జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు వస్తువులను చెల్లాచెదురుగా పడేసిన దృశ్యం వేలి ముద్రలు సేకరిస్తున్న క్లూస్‌టీం ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని వీవీరెడ్డి కాలనీలో ఎఫ్ టైపు–525, 535, జీ టైపు–350, 362 క్వార్టర్లలో గరువారం రాత్రి దొంగలు చోరీకి యత్నించారు. అయితే ఒక ఇంటిలో మాత్రం బంగారు, వెండి నగలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు, కొండాపురం సీఐ రాజ, కలమల్ల ఎస్ఐ సునీల్కుమార్రెడ్డిలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కడప నుంచి క్లూస్ టీం వచ్చి నాలుగు ఇళ్లలో పరిశీలించి వేలి ముద్రలను సేకరించారు. ఆర్టీపీపీలోని వీవీరెడ్డి కాలనీలో ఎఫ్ టైపు వరుసలో ఎఫ్–525 క్వార్టర్స్‌లో సుబ్రమణ్యం శ్రేష్టి నివాసం ఉంటున్నారు. ఆయన పని మీద చైన్నెకు వెళ్లారు. అలాగే ఎఫ్–535 క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న దుగ్గిరెడ్డి రామ్మోహన్‌రెడ్డి కుటుంబం హైదరాబాదుకు వెళ్లగా, ఆయన తాళాలు వేసి డ్యూటీకి వెళ్లారు. అలాగే జీ టైపు వరసలో ఉండే జీ–350 దేవచంద్ర కుటుంబంతో కలసి చిలంకూరుకు వెళ్లారు. జీ–362 క్వార్టర్స్‌లో ఉండే ఆదినారాయణరెడ్డి కూడా పనిమీద కుటుంబంతో బయటకు వెళ్లారు. ఈ నాలుగు క్వార్టర్స్‌లో ఏక కాలంలో ఇంటి తలుపులు పగలకొట్టి ఇంటిలోకి గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి ఇంటిలోని బీరువాలను పగులగొట్టారు. అయితే జీ–350 క్వార్టర్స్‌లో ఉంటున్న దేవచంద్ర ఇంట్లో మాత్రం 3 తులాలు బంగారు, 150 గ్రాముల వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిగిలిన మూడు ఇళ్లలో చోరీకి యత్నించారు కానీ ఎలాంటి నగలు, నగదు దొంగలకు దొరకలేదు. ఒకే ఇంటిలో రెండో సారి చోరీ... ఆర్టీపీపీలోని ఎఫ్ టైపు 525లో 2020లో చోరీ జరిగింది. అప్పుడు పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అయితే మరలా అదే ఇంటిలో ఇప్పుడు చోరీ జరిగింది. అలాగే 2015 సంవత్సరంలో ఆర్టీపీపీలోని ఇదే కాలనీలో ఏకంగా 7 క్వార్టర్లలో చోరీ జరిగింది. అప్పుడు చోరీలను మధ్యప్రదేశ రాష్ట్రానికి చెందిన వారు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ మేరకు దొంగలను కూడా పట్టుకుని కొంత మొత్తం రికవరీ చేశారు. భద్రతపై ఉద్యోగుల ఆదోళన.. ఆర్టీపీపీలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో భద్రతపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఆర్టీపీపీలోని వీవీరెడ్డి కాలనీలోకి వెళ్లాలాంటే గేటు వద్ద ఎస్పీఎఫ్ సిబ్బంది పహారా ఉంటారు. గేటు దాటి లోనికి పోవాలంటే వారు నిత్యం తనిఖీ చేస్తుంటారు. దొంగలు ఏ విధంగా వస్తున్నారనే సందేహాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఏపీజెన్కో యజమాన్యం స్పందించి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉద్యోగులు కోరుతున్నారు. -
రైళ్ల ద్వారా టమాట ఎగుమతులు
మదనపల్లె: మదనపల్లె నుంచి టమాటను రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు ఎగుమతులు చేసేలా రైల్వేశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం చైర్మన్ శివరాం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్, కార్యదర్శి జగదీష్ పలు అంశాలను కమిటీ దృష్టికి తెచ్చారు. పలుఅంశాలపై తీర్మానం చేశాక వారు మాట్లాడుతూ మదనపల్లె రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ఏపీ, తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తే మంచి ధరలు పలికి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని పరిశీలించి సహకారించాలని రైల్వే అధికారులను కోరినట్టు చెప్పారు. దీనికోసం ప్రత్యేక గూడ్స్ రైలును కేటాయిస్తే అధిక ఎగుమతులు సాధ్యమవుతుందని చెప్పారు. వచ్చే జనవరి 26 నుంచి మార్కెట్లో 30 కిలోలకు బదులు 15 కిలోల క్రేట్లతో టమాట కొనుగొలు జరగాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ విధానం ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటామని, వ్యాపారులు సహకరించాలని కోరారు. రైతుల కోసం మార్కెట్లో ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు తీర్మాణం చేసినట్టు చెప్పారు. సమావేశంలో కమిటి డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ నిర్ణయం -
వాట్సప్ ద్వారా ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
రాయచోటి : పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ పారదర్శకమైన పాలన అందించే దిశగా అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం మరో ముందడుగు వేసిందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఇకపై ఫిర్యాదుదారులు తమ ఎఫ్ఐఆర్ (ప్రథమ సమాచార నివేదిక) ప్రతిని నేరుగా తమ మొబైల్ ఫోన్లలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎస్పీ వెల్లడించారు. రాయచోటిలోని జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఎఫ్ఐఆర్ విషయంపై మీడియా సమావేశంలో వివరించారు. ప్రజలు సమయాన్ని ఆదా చేయడం, పోలీసు సేవల్లో జవాబుదారితనాన్ని పెంచడమే తమ లక్ష్యమన్నారు. ఎఫ్ఐఆర్ ప్రతిని ఇలా.... మీ మొబైల్లో 9552300009 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. వాట్సర్ ద్వారా సదరు నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయాలి. మెనూలో కనిపించే పోలీసు సర్వీస్ పైన క్లిక్ చేసి, ఆపై డౌన్లోడ్ ఎఫ్ఐఆర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అడిగిన ప్రాథమిక వివరాలను నమోదు చేసిన వెంటనే మీ ఎఫ్ఐఆర్ ప్రతి డౌన్లోడ్ అవుతుంది. -
వైద్యవిద్య దూరం
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుంది. చంద్రబాబునాయుడు 14 సంవత్సరాల పాలనలో ఒక మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదు.వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో 17 మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. అయితే వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీపీపీ విధానంతో ప్రైవేట్ పరం చేయాలనుకోవడం సరికాదు. – కె.దిలీప్సాగర్, విద్యార్థి, భాకరాపేట, సిద్దవటం మండలం -
బ్రాందీషాపులో చోరీ
రాజంపేట : మండలంలోని న్యూ బోయనపల్లెలో మేఘన బ్రాందీషాపులో చోరీ జరిగినట్లు మన్నూరు పోలీసులు తెలిపారు. బ్రాందీషాపు పైకప్పు రేకులు గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. షాపులోని మద్యం, రూ.1లక్షా 55వేలు నగదును ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన బ్రాందీషాపును పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బంగారు దుకాణంలో చోరీ పట్టణంలో ఓ బంగారు దుకాణంలో కొనుగోలుదారులా వచ్చిన ఓ మహిళ బంగారు చైన్‌ను దొంగిలించుకుని వెళ్లింది. ఈ విషయాన్ని సీసీ కెమెరా ద్వారా గుర్తించారు. ఆ మహిళపై పట్టణ పోలీసులకు బంగారు దుకాణం యజమాని ఫిర్యాదు చేశారు. వీబీ –జీఆర్ఎమ్ జీ బిల్లు ప్రతులు దగ్ధం మదనపల్లె : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్రం చేస్తున్న సవరణలకు నిరసనగా వీబీ–జీ ఆర్ఎమ్ జీ బిల్లు ప్రతులను వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం దగ్ధం చేశారు. మదనపల్లె పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (విబి–జి ఆర్ఎమ్ జి) పేరుతో ఉపాధిహామీ పథకానికి రాంరాం పలుకుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ కార్మికులకు డిమాండ్‌ను బట్టి ఉపాధి కల్పించే విధానాన్ని మార్చివేసి అవసరాన్ని (సప్లయిని) బట్టి పనులు పెట్టడం అంటే ఈ పథకం మౌలిక స్వభావాన్ని నిర్వీర్యం చేయడమేనని విమర్శించారు. గ్రామీణ కూలీలకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించారని తెలిపారు. మోడీ ప్రభుత్వానికి కీలక మద్దతుదారులైన టీడీపీ, జనసేన పార్టీలు కొత్త ఉపాధి బిల్లును ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి టి.హరిశర్మ, నారాయణ, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు బి.రమేష్ బాబు, మంజునాథ, రమణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రెండు మండలాలను కడపలో చేర్చాలి సిద్దవటం : ఉద్యమం తీవ్రతరం కాకముందే సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలోనే ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి అన్నారు. సిద్దవటంలో మండల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు గురువారం రాయలసీమ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తస్లీమ్, కార్యదర్శి లక్ష్మీదేవి, రాయలసీమ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ప్రతాప్‌రెడ్డి, మునిరెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జేఏసీ నాయకులు రాజగోపాలయ్య, నారాయణ, అనిల్‌కుమార్‌రెడ్డి, సిద్దయ్య, సుబ్రమణ్యం, ఓబులయ్య, రాజేష్, బాలుగారి వెంకటసుబ్బయ్య, నరసింహారెడ్డి, పి.వెంకటసుబ్బయ్య, భాస్కర్‌రెడ్డి, చంద్రమోహన్, మునికుమార్, అంకయ్య, ఆటో యూనియన్ సభ్యులు, మహిళలు, స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు. -
పోస్టల్ ఇన్సూరెన్స్ భళా !
● ఆరు పథకాలతో ఆర్థిక ప్రయోజనాలు ● తపాలా శాఖ పథకాల విస్తరణ కడప వైఎస్ఆర్ సర్కిల్ : తపాలా శాఖ అందించే బీమా పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ధీమానిస్తున్నాయి. పీఎల్ఐ (పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్) పేరిట ప్రవేశపెట్టిన పలు రకాల పథకాలు ఎంతో మంది గ్రాడ్యుయేట్లకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. వీటిని మొదట్లో తపాలా శాఖ ఉద్యోగుల సంక్షేమ పథకాలుగా ప్రవేశపెట్టారు. తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, భద్రతా సిబ్బందికి వర్తింపజేశారు. కాలక్రమేణా పీఎల్ఐ పథకాన్ని వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, సీఏ వంటి ప్రొఫెషనల్స్‌తో పాటు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లలో నమోదు కంపెనీల ఉద్యోగులకు వర్తింపజేశారు. ఇటీవల గ్రాడ్యుయేట్లకు పీఎల్ఐ సౌకర్యాన్ని విస్తరించారు. దీంతో ఈ పథకాల వైపు గ్రాడ్యుయేట్లు ఆసక్తి చూపుతున్నారు. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్.. దీనిని మనీ బ్యాక్ పాలసీ అంటారు. 19 నుంచి 25 సంవత్సరాల మధ్య గలవారు ఈ పాలసీకి అర్హులు. బీమా రూ.20వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాలపరిమితి 15 నుంచి 20 సంవత్సరాలుగా నిర్ణయించారు. 15 ఏళ్ల పాలసీపై 6, 9, 12 సంవత్సరాలు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్ లభిస్తుంది. 20 ఏళ్ల పాలసీపై 8, 12, 16 సంవత్సరాలు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం చొప్పున బోనస్ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో ఉన్న లబ్ధిదారులకు సంవత్సరానికి ఒకసారి 1000 రూపాయలకు రూ. 48 చొప్పున బోనస్ లభిస్తుంది. హోల్ లైఫ్ అస్యూరెన్స్... ఈ పాలసీకి 19 నుంచి 55 సంవత్సరాల మధ్య గల వా రు అర్హులు. బీమా రూ.20వేల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. ప్రీమియం చెల్లించే వయసును 55, 58, 60 సంవత్సరాలుగా ఎంచుకునే అవకాశం కల్పించా రు. నాలుగేళ్ల తర్వాత రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. మూడేళ్లు దాటితే పాలసీ సరెండర్ చేసుకొనే వీలుంటుంది. ఐదేళ్ల లోపు సరెండర్ చేస్తే ఎలాంటి బో నసులు వర్తించవు. కోతలు విధిస్తారు. ప్రతిఏటా 1000కి రూ. 76 చొప్పున బోనస్ లభిస్తుంది. పాలసీదారుడికి 80 ఏళ్లు దాటినా లేదా మరణించినా వారసులకు బీమా సొమ్ము బోనస్ ప్రయోజనాలను చెల్లిస్తారు. కన్వర్టబుల్ హోల్ లైవ్ అస్యూరెన్స్.. ఈ పాలసీకి 19 నుంచి 50 సంవత్సరాల వారు అర్హులు. రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు బీమా చెల్లింపులు చేయవచ్చు. మూడేళ్లు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్‌కు అవకాశం ఉంటుంది. ఐదేళ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ రాకపోగా కోతలు విధించే నిబంధనలు ఉన్నాయి. ప్రతి ఏటా రూ.1000 కి 76 రూపాయలు చొప్పున బోనస్ లభిస్తుంది.. ఎండోమెంట్ అస్యూరెన్స్.. ఈ పాలసీకి 18 నుంచి 50 సంవత్సరాల వారు అర్హులు. కనీస బీమా రూ.20,000, గరిష్టంగా రూ.50 లక్షలు ఉంటుంది. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం, పాలసీ సరెండర్‌కి అవకాశం ఉంటుంది. ఐదేళ్లు దాటిన పాలసీల సరెండర్‌పై బోనసుల్లో కోతలు విధింపు తప్పవు. ప్రతి ఏటా రూ.1000 కి 52 రూపాయలు చొప్పున బోనస్ లభిస్తుంది. జాయింట్ లైఫ్ అస్యూరెన్స్.. ఈ పాలసీకి 21 నుంచి 45 ఏళ్ల వయసు గల దంపతులు అర్హులు. బీమా రూ. 20వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాల పరిమితి ఐదు నుంచి 20 ఏళ్లు. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం ఉంటుంది. ఐదేళ్లు దాటిన పాలసీలు సరెండర్ పై బోనస్‌ల్లో కోత ఉంటుంది. పాలసీదారుడు మరణానంతరం ప్రయోజనాలు భాగస్వామి లేదా వారసులకు వర్తిస్తాయి. ప్రతి ఏటా రూ.1000కి 52 చొప్పున బోనస్ లభిస్తుంది. సింగిల్ ప్రీమియంతో దంపతులు బీమా కవరేజి పొడిగించుకోవచ్చు. చిల్డ్రన్ పాలసీ.. పాలసీదారుల పిల్లల కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు బీమా చేసుకోవచ్చు. పిల్లల వయస్సు తప్పనిసరిగా ఐదు నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. పిల్లలకు గరిష్టంగా రూ.3 లక్షలు లేదా పాలసీదారు బీమా ప్రకారం ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. పాలసీదారు ( పిల్లల తండ్రి) వయసు 40 ఏళ్లు దాటి ఉండకూడదు. పాలసీదారు చనిపోతే పిల్లలపై తీసుకున్న బీమాకు ప్రీమియం చెల్లించనక్కర్లేదు. కాలపరిమితి తీరాక బీమా సొమ్ము బోనసులు వర్తిస్తాయి. రుణ సదుపాయం సరెండర్ సౌకర్యాలు ఈ స్కీమ్ లో ఉండవు. ప్రీమియం తల్లిదండ్రులు చెల్లించాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. వీరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించరు. ఎండోమెంట్ పాలసీ ప్రకారం బోనసులు వర్తిస్తాయి. దరఖాస్తు చేయడం ఇలా.... పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునేవారు కావాల్సిన పత్రాలను విధిగా సంబంధిత అధికారులకు సమర్పించాలి. గ్రాడ్యుయేట్, పదో తరగతి, డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పాలసీని బట్టి వివిధ వైద్య పరీక్షలు ఉంటాయి, స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పోస్ట్ ఇన్ఫో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా సమీప పోస్ట్ ఆఫీస్‌ను సంప్రదించి స్కీంలో భాగస్వాములు కావచ్చు. ఉమ్మడి జిల్లాలో 3,79,680 పాలసీదారులు పీఎల్ఐ పథకంలో ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో 3,79,680 మంది పాలసీదారులు ఉన్నారు. ఇందులో కడప డివిజన్లో 2,08,722, ప్రొద్దుటూరు డివిజన్లో 1,70,958 పాలసీదారులు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పీఎల్ఐ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు, ఈ పథకంలో చేరి వివిధ పథకాల్లోని ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ బీమాతో ఎక్కువ ప్రీమియంలు పొందవచ్చు. పోస్టల్ ఉద్యోగులు పీఎల్ఐ పథకాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. – రాజేష్, కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్. -
పింఛన్‌దారులతో డీఎల్పీవో విచారణ
పెద్దతిప్పసముద్రం: మండలంలోని కాట్నగల్లు పంచాయతీ మద్దిరెడ్డిపల్లిలోని నెలవారి పింఛన్‌దారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన సొమ్ము నుంచి కార్యదర్శి ఇంటి పన్ను వసూలు చేశాడని బాధితులు ఆరోపించారు. అంతేగాక తమ వద్ద రూ.1,000ల నుంచి రూ,1,800ల వరకు పన్నుల రూపంలో వసూలు చేసినా ఇంత వరకు ఆన్లైన్ రశీదు కాకుండా మ్యానువల్ రశీదు ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విషయంపై సాక్షి పత్రికలో గురువారం ‘పింఛన్ డబ్బుల్లో ఇంటి పన్ను కోత’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా అధికారులు స్పందించారు. కలెక్టర్, డీపీవో ఆదేశాల మేరకు మదనపల్లె డీఎల్పీవో నాగరాజు, ఎంపీడీవో ప్రతాప్‌రెడ్డితో కలసి కాట్నగల్లు సచివాలయానికి విచ్చేసి రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం బాధిత పింఛన్‌దారులతో విచారించారు. పింఛన్ సొమ్ము నుంచి పన్నులు ఎందుకు వసూలు చేశావు.. సదరు సొమ్ము ప్రభుత్వ ఖజానాకు జమ చేశావా,వసూలు చేసిన పన్నులకు సంభంధించి లబ్ధిదారులకు మ్యానువల్ రశీదు ఎలా ఇస్తావు అంటూ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీఎల్పీవో మాట్లాడుతూ రికార్డులు, ఆన్లైన్ వివరాలను సమగ్రంగా తనిఖీ చేసి తదుపరి చర్యల నిమిత్తం నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని వెల్లడించారు. -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
సిద్దవటం : మండలంలోని మాచుపల్లి, డేగనవాండ్లపల్లె గ్రామ సమీపంలోని పెన్నానది పరివాహక ప్రాంతాల నుంచి నిత్యం కడపకు ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత రైతులు గురువారం మాట్లాడుతూ ప్రతి రోజూ 50 ట్రాక్టర్లు మాచుపల్లి, డేగనవాండ్లపల్లె గ్రామాల పెన్నా పరివాహక ప్రాంతాలలో తమ పొలాల వద్ద గోతులు తీసి కడపకు ఇసుకను రవాణా చేస్తున్నారని తెలిపారు. ఒక్కో ట్రాక్టర్ రూ.7 వేలకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారన్నారు. దీని ప్రభావం వల్ల పెన్నానదికి వరదలు వచ్చినప్పుడు తమ భూములు కోతకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఒంటిమిట్ట సీఐ నరసింహరాజును వివరణ కోరగా ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. గృహ నిర్మాణాలకు మాత్రమే ఆయా గ్రామాల వాసులు వినియోగించుకోవాలని కడపకు తరలించరాదని తెలిపారు. -
ఆసుపత్రి కమిటీ సభ్యురాలిపై తెలుగు తమ్ముళ్ల దాడి
టాస్క్‌ఫోర్స్ : రాయచోటిలో తెలుగు తమ్ముళ్ల దాడిలో తెలుగు మహిళా నేత, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యురాలు లక్ష్మీదేవి రక్త గాయాలతో ఆసుపత్రిలో చేరిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి రాయచోటి పట్టణం, రాజుల కాలనీలో చోటు చేసుకున్న ఈ సంఘటన గురువారం ప్రచారంలోకి వచ్చింది. రాయచోటి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ తన అనుచరులతో పార్టీ సీనియర్ కార్యకర్త, హాస్పిటల్ కమిటీ సభ్యురాలు ఆర్.లక్ష్మీదేవిపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మీదేవిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్లు స్థానికులు తెలిపారు. తనపై గండికోట సుధాకర్, మరికొందరు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని గాయపడిన లక్ష్మీదేవి రాయచోటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే ఇరువురు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు, పార్టీ పెద్దల సమాచారం కోసం ఫిర్యాదును పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. -
చీతా అంటూ వదంతులు
బి.కొత్తకోట: బి.కొత్తకోట సమీపంలో గురువారం చితా కనిపించిందని, సమీప జనుపవారిపల్లె గుట్టలోకి వెళ్లిందని విస్త్రృత ప్రచారం జరిగింది. దీంతో పట్టణంలో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆరా తీయగా అదంతా మార్ఫింగ్ ఫొటోతో వదంతులు సృష్టించారని స్పష్టమైంది. దేశంలో చీతాలు లేవని అలాంటప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందని అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ అడపా శివకుమార్ స్పష్టం చేశారు. తంబళ్లపల్లె: మహిళా సంఘాల్లోని సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా సంఘమిత్రలు, సీసీలు కృషి చేయాలని వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. గురువారం వెలుగు కార్యాలయంలో తంబళ్లపల్లె,పెద్దమండ్యం, కురబలకోట మండలాల సంఘమిత్రలతో సమావేశం నిర్వహించారు. ప్రతి మహిళా సభ్యురాలు బ్యాంకు పథకాల ద్వారా అందే ఆర్థిక సహకారంతో అభివృద్ధి చెందినప్పుడే వారి జీవనప్రమాణాలు పెరుగుతాయన్నారు. అర్హత కలిగిన సంఘాలన్నింటికీ బ్యాంకు రుణాలు పంపిణీ చేసే విధంగా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో ఏపిఎంలు గంగాధర్, నరసింహులు, శ్రీనివాసులు, డైరీ ఏపీఎం సుజాత పాల్గొన్నారు. రాయచోటి: రాయచోటిలోని డైట్ ప్రభుత్వ ఉన్న పాఠశాలలో ఈనెల 20న నిర్వహించనున్న జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌ను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం ప్రధానోపాధ్యాయులకు సూచించారు. గురువారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ వికసిత్, ఆత్మ నిర్భర్ భారత్ కోసం స్టెమ్ అనే ప్రదాన ఇతివృత్తం ఆధారంగా పాఠశాల స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు విద్యార్థులకు సైన్స్ ఫెయిర్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాల మేరకు ఈనెల 16న పాఠశాల, 18న మండలస్థాయిలో సైన్స్ ఫెయిర్లు నిర్వహించామన్నారు. ఈనెల 20న రాయచోటిలోని డైట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో మండలస్థాయి విజేతలు పాల్గొని తమ ప్రాజెక్టులను ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం య్యేలా ప్రదానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు చొరవ చూపాలన్నారు. జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ నుంచి 11 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. కడప ఎడ్యుకేషన్: స్కూల్ గేమ్స్ అండర్ 14 జాతీయస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను గురువారం స్కూల్ గేమ్స్ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి రాజు ఆవిష్కరించారు. జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు జమ్మలమడుగులోని బాలికల ప్రభుత్వ కళాశాలలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు గురువారం స్కూల్ గేమ్స్ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి రాజు క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులకు పలు సూచనలు అందించారు. బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలం పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్.రాధ గురువారం బాధ్యతలను చేపట్టారు. ఎంపీపీగా ఉన్న లక్ష్మీనరసమ్మ వచ్చే మార్చి 13 వరకు సెలవులో వెళ్లడంతో ఆ స్థానంలో వైస్‌ఎంపీపీగా ఉన్న రాధను ఎన్నుకునేందుకు ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీనిపై మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించగా వైస్ఎంపీపి ఖాదర్‌వలీ, ఎంపీటీసీలు గౌతమి, రామసుబ్బారెడ్డి, ఈశ్వరమ్మ, రమాదేవి, యల్లప్ప, విమలమ్మ, బాలకృష్ణలు హజరయ్యారు. అనంతరం ఎంపీడీఓ అబ్దుల్ షుకూర్ ఎంపీపీగా రాధకు బాధ్యతలను అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రాధ మాట్లాడుతూ తనను ఎంపీపీగా ఎంపిక చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎన్నుకున్న ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలిపారు. మండలాభివృద్దికి ఎమ్మెల్యే, ఎంపిటిసి సలహాలు, సూచనలతో కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమానికి హజరైన వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ ఖలీల్, మండల కన్వీనర్ ప్రదీప్‌రెడ్డి, జెడ్పీటిసి రామచంద్ర, పద్మశాలి కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ సురేంద్రనాధ్లు రాధను సత్కరించారు. -
ప్రైవేటీకరణపై సీపీఐ పోరుబాట
మదనపల్లె: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించకపోతే ఇక ప్రభుత్వం ఎందుకని సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు చంద్రబాబును నిలదీశారు. వైద్య కళాశాలలను పీపీపీ విధానంలోకి మార్చడాన్ని వేతిరేకిస్తూ గురువారం సీపీఐ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా మదనపల్లి మెడికల్ కళాశాల వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. భవనాల వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హజరైన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను గత ప్రభుత్వం అమలులోకి తీసుకుని వచ్చిందన్నారు. చాలా కళాశాలలు సగానికి పైగా పూర్తయ్యాయన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 107, 108 జీఓలను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, ఈ జీఓలను యధావిధిగా కొనసాగిస్తూనే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి జీఓ నబబర్ 590 తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంతో మెడికల్ కళాశాలలు అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర సీఎం, మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నడుస్తున్న డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ వ్యాపారం కేంద్రాలు మారిపోతున్న విషయాన్ని ప్రస్తావించారు. పీపీపీ విధానంతో అవినీతి జరుగుతుందే తప్ప అభివృద్ధి ఉండదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం జీవో నంబర్ 590 వెంటనే రద్దుచేసి, మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ఆధీనంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డిసాహెబ్, స హాయ సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, సహాయ కార్యదర్శి టి కష్ణప్ప, కార్యవర్గ సభ్యులు మనోహర్ రె డ్డి, శ్రీనివాసులు, సాంబశివ పాల్గొన్నారు. పీపీపీ విధానంతో జరిగేది అభివృద్ధికాదు అవినీతి మదనపల్లె మెడికల్ కళాశాల వద్ద ధర్నా -
పాత కక్షలే హత్యకు కారణం
కడప అర్బన్ : కడప నగర శివార్లలో స్వరాజ్ నగర్లో ఖాళీగా ఉన్న ఎన్జీఓ ప్లాట్లలో ఈనెల 11వ తేదీన రాత్రి వల్లెపు వెంకటయ్య అలియాస్ వెంకట్ (27) అనే యువకుడిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు అరుణ్ కుమార్ అలియాస్ అరుణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే అతని బంధువు అయిన బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు తరలించారు. బాలుడిని జువైనల్ హోం( ప్రభుత్వ బాలుర గృహం)కు తరలించారు. ఈ సంఘటనపై కడప డీఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఏ. వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని.. ఈ కేసులో ప్రధాన నిందితుడు అరుణ్‌కుమార్ అలియాస్ అరుణ్ హత్యకు గురైన వల్లెపు వెంకటయ్య అలియాస్ వెంకట్ చిన్ననాటి స్నేహితులు. మృతుడికి మొదట వెంకట సుధతో వివాహమైంది. కుటుంబ కలహాల కారణంగా వారిద్దరూ విడిపోయారు. తర్వాత అతను భవిత అలియాస్ అక్కమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న సమయంలో అరుణ్ తన మోటార్ సైకిల్‌ను కుదువకు పెట్టి మృతుడికి ఆర్థికంగా సహకరించాడు. అదే క్రమంలో మృతుడు వెంకట్ కూడా పూచీకత్తుగా ఉండి అరుణ్‌కు చెందిన మోటార్ సైకిల్‌ను కుదువ పెట్టి, తనకు తెలిసిన వారి వద్ద నుంచి డబ్బులు ఇప్పించాడు. అయితే చెప్పిన సమయానికి అరుణ్ డబ్బులు చెల్లించక పోయే సరికి వెంకట్, అరుణ్‌ను అతని కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసభ్యకరంగా తిట్టడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అతను వెంకట్‌పై కక్ష పెంచుకున్నాడు. అతనితో స్నేహ పూర్వకంగా ఉన్నట్లు నటిస్తూనే చంపేందుకు అవకాశం కోసం ఎదురు చూశాడు. ఈ నేపథ్యంలో ఈనెల 11వ తేదీ సాయంత్రం అరుణ్ తన చిన్నాన్న కుమారుడైన బాలుని సహకారం తీసుకున్నాడు. వారిద్దరూ కలిసి వెంకట్‌కు అతిగా మద్యం తాగించారు. పూర్తిగా మత్తులో ఉండగా, ఇద్దరు కలిసి వెంకట్‌ను సిమెంట్ ఇటుక దిమ్మెలతో తల పైన రక్తం వచ్చేలా కొట్టి దారుణంగా హత్య చేశారు. తొలుత హత్యకు కారణమైన వారి వివరాలు తెలియరాలేదు. తరువాత క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది సహకారంతో ‘సోను’ అనే జాగిలం ప్రధాన నిందితుడి ఇంటిని కనుగొనడంలో కీలక పాత్ర పోషించింది. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు ఆదేశించారు. నేరస్తులను గుర్తించడంలో నేర్పరి ‘సోను ’ జాగిలం.. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శిక్షణ పూర్తి చేసుకుని ఇటీవలే జిల్లా పోలీస్ శాఖ డాగ్ స్క్వాడ్‌లో చేరిన ‘సోను’ డ్యూయల్ ట్రైనింగ్ పొందింది. పేలుడు పదార్థాలను, నేరస్తులను గుర్తించడంలో నేర్పరిగా పేరు గాంచింది. జిల్లా పోలీస్ శాఖలో చేరిన కొద్ది కాలంలోనే హత్య కేసు ఛేదించి ‘శభాష్.. సోను’ అని పోలీస్ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు కృషి చేసిన దర్యాప్తు అధికారి రిమ్స్ పోలీసు స్టేషన్ సీఐ బి.రామక్రిష్ణా రెడ్డి, ఎస్ఐ సుభాష్ చంద్ర బోస్, క్లూస్ టీం ఎస్ఐ ఎస్.వినీల, డాగ్ స్క్వాడ్ సిబ్బంది మహబూబ్ హుసేన్, సుధీర్ రాజ, సోను జాగిలం, హెడ్ కానిస్టేబుల్ హరి ప్రసాద్, సుధాకర్, కానిస్టేబుల్ ఇస్మాయిల్, సుందర్‌ను అభినందించారు. హత్య కేసులో నిందితుడి అరెస్టు పోలీసుల అదుపులో మరో బాలుడు కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన పోలీస్ జాగిలం ‘సోను’ వివరాలు వెల్లడించిన కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు -
దివ్యాంగుల సాధికారతకు ప్రత్యేక చర్యలు
రాయచోటి : సామాన్య జనంలో దివ్యాంగులు కూడా ఒక భాగంగా ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధి, పునరావాస సేవలతో పాటు.. సాధికారత కోసం పాటుపడుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. ‘సామాజిక్ అధికారిత శివిర్’ కార్యక్రమంలో భాగంగా గురువారం రాయచోటి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో కేంద్ర సామాజిక న్యా యం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏఎల్ఐఎంసీఓ సంస్థ, జిల్లా పరిపాలన, ఎంఎస్జేఈలు సంయుక్తంగా సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవయవ లోపాలున్న దివ్యాంగులకు కృత్రిమ అవయవ పరికరాలు, సహాయక ఉపకరణాలను అందించే బృహత్తర కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టిందన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కిశోర్ మాట్లాడుతూ జిల్లాలోని రాయచోటి, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాలలో 2025 ఆగస్టు 6 నుంచి 8 వరకు ఏడీఐపీ, ఆర్వీవై పథకాల కింద అంచనా శిబిరాలు నిర్వహించి 832 మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల ఛైర్మన్ గడుపూడి నారాయణస్వామి, సంక్షేమ అనుబంధ శాఖల అధికారులు, బ్యాంకింగ్ తదితర అనుబంధ శాఖల అధికారులు, లబ్ధిదారులు హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ -
పింఛన్ డబ్బుల్లో ఇంటి పన్ను కోత
● 15 రోజులు కావస్తున్నా ఇంకా ఆన్లైన్ రశీదు కూడా ఇవ్వని వైనం ● ఇదేం అన్యాయమని పింఛన్‌దారుల ఆవేదన పెద్దతిప్పసముద్రం : రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ప్రతి నెలా మొదటి వారంలో అర్హులైన వారికి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్ సొమ్ము అందజేస్తారు. పింఛన్‌దారుల్లో చాలా మంది అభాగ్యులు ఈ సొమ్ము పైనే ఆధారపడి జీవిస్తుంటారు. వీరిలో మంచానికి పరిమితమైన వారు ఉంటారు. అయితే పింఛన్‌దారుల సొమ్ములో ఇంటి పన్ను, నీటి పన్నును తీసుకుని మిగిలిన సొమ్మును లబ్ధిదారుల చేతికి ఇవ్వడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పింఛన్‌దారుల కథనం మేరకు.. మండలంలోని కాట్నగల్లు పంచాయతీ మద్దిరెడ్డిపల్లిలో ఈ నెల 1, 2 తేదీల్లో నెలవారి పింఛన్ సొమ్మును బట్వాడా చేశారు. అయితే పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ ఒక జాబితా చేతబట్టి మీరంతా ఇంటి పన్నులు కచ్చితంగా చెల్లించాల్సిందేనని చెప్పి పన్ను డబ్బులు తీసుకుని మిగిలిన పింఛన్ సొమ్మును పంపిణీ చేశారు. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.1,000లు మొదలుకుని రూ.1,800ల వరకు సుమారు రూ.40 వేల దాకా ఇంటి పన్ను రూపంలో వసూలు చేసి పింఛన్‌దారులకు మ్యానువల్ రశీదు ఇచ్చారు. సాధారణంగా ఇంటి పన్ను చెల్లించిన వారికి అధికారులు ఆన్లైన్ రశీదు ఇవ్వాలి. 15 రోజులు కావస్తున్నా మాకు ఎవరూ ఆన్లైన్ రశీదు ఇవ్వలేదని పింఛన్‌దారులు వాపోయారు. ఆఖరికి తమ పేరిట ప్రభుత్వానికి ఇంటి పన్ను జమ అయినట్లు ఫోన్లకు ఎలాంటి సమాచారం కూడా రాలేదన్నారు. ఈ సందర్భంగా పింఛన్‌దారులు మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ ఎవరూ ఇలా పింఛన్ డబ్బుల్లో కోత వేయలేదన్నారు. ఏడాదికోసారి ఇళ్ల వద్దకు వచ్చి పంచాయతీకి పన్నులు వసూలు చేసేవారని, పంచాయతీలో ఇన్ని ఊర్లు ఉండగా మా ఊర్లోనే ఇలా వసూలు చేయడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంచానికే పరిమితమైన భువనేష్‌కుమార్ అనే దివ్యాంగుడి డబ్బుల్లో కూడా రూ.1000లు ఇంటి పన్ను వసూలు చేయడం బాధాకరమని పలువురు పింఛన్‌దారులు క్రిష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, రామిరెడ్డి, మద్దమ్మ, ఈశ్వరమ్మ, రఘునాథ్‌రెడ్డి, రజనమ్మ, బయారెడ్డిలు వాపోయారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పన్ను వసూలు చేసి ఆన్లైన్లో డబ్బు జమ చేశామని తెలిపారు. -
ఖోఖో జిల్లా జట్టు ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఉమ్మడి కడప జిల్లా ఖోఖో జూనియర్, సీనియర్ జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా ఖోఖో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి, జె.నరేంద్ర తెలిపారు. చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురంలోని నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఎంపిక నిర్వహించామన్నారు. జూనియర్స్ ఖోఖో జట్టు క్రీడాకారులకు కేఎన్ఆర్ ఎస్టేట్ (సుధీర్) స్పాన్సర్ చేశారు. అలాగే సీనియర్స్ జిల్లా ఖో ఖో జట్టుకు పురుషులకు యునిక్స్ బ్యూటీ సెలూన్ నిర్వాహకులు, మహిళల జట్టుకు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి (యోగి వేమన యూనివర్సిటీ) క్రీడా దుస్తులు అందించారు. ఈ ఎంపికలకు ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ శివ బాబు, డాక్టర్ కె.రామ సుబ్బారెడ్డి, నారాయణ పాఠశాల ఏజీఎం హరీష్ బసవరాజు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో తమ ప్రతిభను చాటి ఉమ్మడి కడప జిల్లా క్రీడాకారులు విజయకేతనం ఎగురవేయాలని కోరారు. జూనియర్స్ బాలుర జట్టు .. అయాన్ బాబు, అశోక్, నాగ చైతన్య, రామకష్ణ, వెంకట అనిల్ కుమార్, హేమంత్, శివ, ధనుంజయ్, మహేష్, ముఖేష్, రాఘవ, శ్రీకాంత్, ఎతీష్ , వెంకటకృష్ణ, హేమంత్ రాజు. జూనియర్స్ బాలికల జట్టు.. ధరణి, సాహితీ, ప్రసన్న, రెహనాబీ, దీక్షిత, జానకి లహరి, వెంకట ప్రణవి, గంగ లావణ్య, అనుపమ, హరిత, లోహిత, యోగ రాయల్, వైష్ణవి, అశ్విని, వెంకట నందిని. సీనియర్స్ మహిళల జట్టు .. గాయత్రి, లక్ష్మీదేవి, ప్రతి, అఖిల, లక్ష్మీ ప్రసన్న, వాసంతి, స్నేహలత, జయశ్రీ, వందన, రంగమ్మ, కమలమ్మ, సత్యవాణి, హాసిని, చైత్ర, రాధిక. సీనియర్స్ పురుషుల జట్టు .. రామ్మోహన్, సుధీర్, రాము, లక్ష్మణ్, గోవింద రెడ్డి, ఖాదర్ రెడ్డి, వీరేష్, అయ్యబాబు, చంద్రశేఖర్, హరి ప్రసాద్, షేక్ సుభాన్, ప్రేమ్ పృథ్వీరాజ్, శ్రీనాథ్, సునీల్, వెంకట నరేంద్ర ఎంపికయ్యారు. -
మోసం చేశారని ఇంటి ముందు హిజ్రా బైఠాయింపు
మదనపల్లె : నమ్మించి డబ్బు, బంగారం తీసుకుని మోసం చేసిన దంపతులపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని బుధవారం సాయంత్రం మదనపల్లెకు చెందిన హిజ్రా స్వాతి వారి ఇంటిముందు బైఠాయించింది. చేతులెత్తి దండం పెడుతూ కన్నీళ్లతో తనగోడు చెప్పుకొంటూ వేడుకుంది. బాధితురాలి కథనం మేరకు వివరాలు. మదనపల్లెకు చెందిన హిజ్రా ఇంజరపు స్వాతి, గౌతమినగర్‌కు చెందిన దంపతులు డమరేశ్వర్ స్వర్ణలత మధ్య స్నేహం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారం, చిట్టీల పేరుతో స్వాతి నుంచి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు తీసుకున్నారు. తర్వాత నగదు, ఆభరణాలు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినా పట్టించుకోలేదు.గట్టిగా నిలదీస్తే ఎదురుతిరిగారు. దంపతులు తనవద్ద నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు రసీదులు, ఆధారాలు ఉన్నాయని ఆమె వివరించింది. గత ఐదు నెలలుగా గుర్తు తెలియని వ్యక్తులు తనను వెంబడిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. తనకు ఇప్పటికై నా న్యాయం చేయాలని కోరింది. నకిలీ నోట్లతో మోసగించే యత్నం లక్కిరెడ్డిపల్లి : బ్యాంకులో నగదు డ్రా చేసిన వ్యక్తికి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లతో ఉడాయించేందుకు కొందరు మోసగాళ్లు ప్రయత్నించారు. మోసాన్ని పసిగట్టి స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలిలా.. లక్కిరెడ్డిపల్లి మండలం, కుర్నూతల గ్రామానికి చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి కొంత నగదును విత్ డ్రా చేసుకునేందుకు బుధవారం లక్కిరెడ్డిపల్లి స్టేట్ బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ రూ.50 వేలు విత్‌డ్రా చేసుకుని అక్కడే ఉన్న ఓ వ్యక్తి చేతికి ఇచ్చి లెక్కబెట్టమని చెప్పాడు. అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు అసలు నోట్లు వారివద్ద ఉంచుకుని తమ వద్ద ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న దొంగనోట్ల కట్టను బయటకు తీసి లెక్కించడం మొదలు పెట్టారు. ఇంతలో వారిలో నుంచి ఒకరు ఇవి దొంగనోట్లలా ఉన్నాయని ఆదినారాయణతో అన్నారు. తానిప్పుడే బ్యాంకులో డ్రా చేశానని మీరెవరంటూ వారితో గట్టిగా మాట్లాడేసరికి వారు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. స్థానికులు అప్రమత్తమై వారిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అతను తనది వాయల్పాడు అని చెప్పాడు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ మస్తాన్, మరో ఇద్దరు పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని మోసగాడిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
మదనపల్లెలో స్క్రబ్ టైఫస్ కలకలం
మదనపల్లె రూరల్: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో స్క్రబ్ టైఫస్ కలకలం రేగింది. ప్రస్తుతం మదనపల్లె మండలంలో 8 మందికి, నిమ్మనపల్లె మండలంలో 1 మొత్తం 9 మందికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయా ప్రాంతాల్లో కీటకాల నివారణ, పారిశుధ్య నిర్వహణకు చర్యలు చేపట్టారు. బుధవారం మండలంలోని కోళ్లబైలు పంచాయతీ చెరువుముందరపల్లె, సీటీఎం, కొత్తవారిపల్లె, బసినికొండ,శివాజీనగర్, ముజీబ్‌నగర్, బాబూకాలనీ, రామారావు కాలనీ, నిమ్మనపల్లె మండలం చల్లావారిపల్లెలో కేసులు ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత సరైన వైద్యం తీసుకుంటే, స్క్రబ్‌టైఫస్ ప్రాణాంతం కాదని, పొలాలు, పొదలు, గడ్డివాములు వంటి ప్రదేశాల్లో స్క్రబ్స్ ఎక్కువగా ఉండటం, ఆ పురుగు కుట్టిన తర్వాత తల తిరగడం, గందరగోళంగా ఉంటుందన్నారు. పొలాల్లో, తోటల్లో పనులు చేసేవారు, చెప్పుల్లేకుండా గడ్డిలో వాకింగ్ చేసేవారు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, శరీరంపై దద్దుర్లు, కుట్టిన చోట గట్టి మచ్చ ఏర్పడటం తదితర లక్షణాలు కనిపిస్తాయన్నారు. అనుమానం ఉన్న వ్యక్తులు నేరుగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వస్తే రక్తపరీక్షలు నిర్వహించి ఎలీసా టెస్ట్‌కు నమూనాలు పంపి వ్యాధిని నిర్ధారిస్తామన్నారు. నియోజకవర్గంలో 9 మందికి వ్యాధి నిర్ధారణ -
మోరాళ్ల గుట్టలో మైన్స్ ఏర్పాటు చేయొద్దు
● గ్రామ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది ● ఏకగ్రీవంగా వ్యతిరేకించిన గ్రామస్తులు గాలివీడు : మండలంలోని నూలివీడు పంచాయతీ పరిధిలోని మోరాళ్ల గుట్టలో మైనింగ్ ఏర్పాటు చేయవద్దని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. మోరాళ్ల గుట్టలో మైనింగ్‌కు సంబంధించిన ప్రతిపాదనలపై బుధవారం ఆర్డీఓ, పొల్యూషన్ బోర్డ్ అధికారులు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ, నూలివీడు పంచాయతీ పరిధిలోని మోరాళ్ల గుట్టలో 23 ఎకరాల్లో మైనింగ్ ఏర్పాటు చేసేందుకు మెసేజ్ గ్లోబల్ మైన్స్ అండ్ మినరల్స్ సంస్థ దరఖాస్తు చేసుకుందన్నారు. దీనిపై ఇప్పటికే ప్రాథమిక పరిశీలన జరిగిందని తెలిపారు. మైన్స్ ఏర్పాటు వల్ల గ్రామస్తులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అనే అంశంపై ప్రజల అభిప్రాయాలు కోరారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో దాదాపు 500 వరకు ఆవులు, గేదెలు, గొర్రెలు ఉన్నాయని, వాటిని మేపుకోవడానికి మోరాళ్ల గుట్ట ఒక్కటే ఆధారమని తెలిపారు. ఆ గుట్టను కూడా మైనింగ్‌కు కేటాయిస్తే మూగజీవాలను ఎక్కడ మేపుకోవాలని ప్రశ్నించారు. గ్రామ పరిధిలో ఇది తప్ప మరో ఖాళీ ప్రభుత్వ స్థలం లేదని వారు స్పష్టం చేశారు. అదే విధంగా మైన్స్ ఏర్పాటు చేస్తే బ్లాస్టింగ్ జరిగి శబ్ద కాలుష్యం పెరిగి సమీప గ్రామాల్లో ఇళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని కొంతమంది గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక గుట్టకు సమీపంలో మామిడి తోటలు, పంట భూములు ఉన్నాయని, మైనింగ్ వల్ల వెలువడే దుమ్ము, వ్యర్థాల కారణంగా వ్యవసాయం పూర్తిగా నాశనం అవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా ఏకగ్రీవంగా మైన్స్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాలను అధికారులకు తెలియజేశారు. అయితే బయట నుంచి వచ్చిన కొంతమంది ఎన్జీఓలు మాత్రం మైన్స్ ఏర్పాటు చేయాలని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ, ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అన్ని అభిప్రాయాలను వీడియో రూపంలో రికార్డు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా స్థానిక ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి సుధ, స్థానిక తహసీల్దార్ భాగ్యలత, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు రెడ్డిస్వాతి
కడప ఎడ్యుకేషన్ : కడప నగర పరిధిలోని నిర్మల ఫార్మసి కళాశాలకు చెందిన ఫార్మ.డి విద్యార్థి రెడ్డి స్వాతి జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై ంది. పులివెందుల జేఎన్టీయూలో జరిగిన యూనివర్సిటీ హ్యాండ్‌బాల్ పోటీలలో కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఫార్మ.డి విద్యార్థి రెడ్డి స్వాతి జేఎన్టీయూ యూనివర్సిటీ జట్టుకు ఎంపికై ంది. 2026 జనవరిలో కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ హ్యాండ్‌బాల్ పోటీలలో పాల్గొని కళాశాల, యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ మోహన్‌కుమార్ సూచించారు. రెడ్డి స్వాతిని నిర్మల ఫార్మసి కళాశాల చైర్మన్ బి. శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ మెహన్కుమార్, ఫిజికల్ డైరెక్టర్ గంగరాజు, కళాశాల సిబ్బంది అభినందించారు. -
పందెం కోడి... పండక్కి రెడీ
● సమరానికి సై అంటున్న కోళ్లు ● తర్ఫీదు ఇస్తున్న పందెం రాయుళ్లు ● పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా... ● జిల్లాలో ప్రతి ఏటా సాగుతున్నకోడి పందేలు రాజంపేట టౌన్: రాష్ట్రంలో అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగను ప్రతి ఒక్కరూ జోష్‌గా జరుపుకుంటారు. అయితే కొంతమంది సంక్రాంతిని పురస్కరించుకొని కోడి పందేలు కాస్తారు. కోడిపందెం కాయకుంటే వారికి సంక్రాంతి ఆనందం లేదన్నట్లు కూడా భావించేవారు లేకపోలేదు. చట్టరీత్యా కోడిపందేలు కాయడం నేరం అయినప్పటికీ పందెంరాయుళ్లు మాత్రం ప్రతి ఏడాది పోలీసుల కన్నుగప్పి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో మూడు రోజులు కోడి పందేలు కాయడం ప్రతి ఏటా సాగుతూనే ఉంది. సంక్రాంతి పండుగకు నెల రోజులు కూడా సమయం లేక పోవడంతో పందెం నిర్వాహకులు కోళ్లను పందేనికి సిద్ధం చేస్తున్నారు. బరిలో దింపే కోళ్లపై గత మూడు నెలల నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వస్తున్నారు. పందేలు....రకాలు జిల్లాలో పందేలు రెండు రకాలుగా జరుగుతాయి. కొంత మంది ముందుగానే కోళ్లను చూసుకొని పందెం డబ్బులు మాట్లాడుకొని పందెం నిర్వహిస్తారు. మరికొంత మంది పందెం జరిగే ప్రాంతానికి వెళ్ల బరిలో దిగే కోళ్లను చూసి వారికి నచ్చిన కోడిని ఎంచుకొని పందెం కాస్తారు. సరదాగా కోడిపందేలు చూసేందుకు వచ్చిన వారు సైతం పందెం కాస్తుంటారు. గోదావరి జిల్లాలకు భిన్నంగా..... సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడిపందేలకు గోదావరి జిల్లాలు ప్రసిద్ది. అక్కడ కోడి ఒకసారి బరిలోకి దిగితే ఏదో ఒక కోడి ఓడిపోయి చనిపోవడం కాని లేకుంటే లేవలేని స్థితిలో పడియే వరకు వాటి వద్దకు వెళ్లరు. అయితే అన్నమయ్య జిల్లాలో అందుకు భిన్నంగా పోరు సాగుతుంది. పోరుసాగే సమయంలో పందెంరాయుళ్ల మధ్యలో వెళ్లి తమ కోళ్లను బరి నుంచి బయటకు తీసుకు వస్తారు. తరువాత కొద్దిసేపటికి బరిలోకి దింపుతారు. పందెం కోడి చాలా కాస్ట్లీ సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో పందెం కోళ్ళ విక్రయాలు చాపకింద నీరులా జోరుగా సాగిపోతున్నాయి. పందెం కోళ్ల ధరలు పది వేల నుంచి దాదాపు 30 వేలకు పైగా ఉన్నట్లు సమాచారం. వీటిలో అనేక జాతులు ఉన్నాయి. కోడి జాతిని బట్టి కూడా ధర పలుకుతుంది. పందెం కోళ్లకు సంబంధించి కోడి నెమలి, కాకి నెమలి, పచ్చకాకి, డేగ ఇలా దాదాపు 30కి పైగా రకాలు ఉన్నాయి. కుక్కుట శాస్త్రం పుస్తకం కుక్కుట శాస్త్రం గురించి పందెం రాయుళ్లకు తప్ప సాధారణ ప్రజలకు పెద్దగా తెలియదు. కుక్కుట శాస్త్రం బట్టి కోడి పందేలను నిర్వహిస్తారు అంటే సాధారణ ప్రజలకు అతిశయోక్తి అనిపించినా ఇది నిజం. కోడి పందేల నిర్వహణ కోసం కుక్కుట శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. అనేక మంది పందెం రాయుళ్లు కుక్కుట శాస్త్రం ద్వారా కోడిపుంజు జాతి, రంగు చూసి బరిలోకి దింపేందుకు ముహూర్తం నిర్ణయిస్తారు. అలాగే పందేనికి ఏ దిక్కున ఏ సమయంలో వెళితే కలిసి వస్తుందన్న విషయాన్ని కూడా కుక్కుట శాస్త్రం పుస్తకంలో చూసి పందేనికి బయలుదేరుతుంటారు. ఇక తిథులను బట్టి ఆ రోజు కలిసివచ్చే రంగులను పందెంరాయుళ్లు అంచనా వేస్తారు. కొంత మంది కుక్కుట శాస్త్రం ఆధారంగా కోడి రంగును బట్టి పందెం కాస్తారు. -
పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాలి
గాలివీడు : హంద్రీ–నీవా, జీఎస్ఎస్ఎస్ ప్రాజెక్టుల ద్వారా వెలిగల్లు జలాశయానికి నీరు అందించే పథకం పనులు అమలుకు నిధులు కేటాయించాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి. నారాయణ కోరారు. బుధవారం చక్రాయపేట మండలం లోని కాలేటి వాగు, ఎన్పీ కుంట హంద్రీ–నీవా కాలువ, గాలివీడు మండలం వెలిగల్లు జలాశయం, శ్రీనివాసపురం ఎత్తి పోతల పథకం కాలువలను వేదిక సభ్యులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాయలసీమలోని కరువు ప్రాంతాలకు శ్రీశైలం వరద నీటిని తరలించి సాగునీరు, తాగునీరు అందించే భారీ ప్రాజెక్టు అన్నారు. దీని ద్వారా వెలిగల్లు ప్రాజెక్టు సహా అనేక రిజర్వాయర్లు నిండుతాయన్నారు. కృష్ణా జలాలను రాయలసీమ లోతట్టు ప్రాంతాలకు చేర్చే ముఖ్యమైన ప్రాజెక్టులకు నిధులు కేటాయించి సత్వరం పనులు చేపట్టి రాయలసీమ రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్యాంప్రసాద్, ఏఐసీసీ మెంబర్ ఎస్ఏ సత్తార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీ శివయ్య, సభ్యులు పాపిరెడ్డి, డీసీ వెంకటయ్య, జిల్లా నాయకులు వెంగళరావు యాదవ్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతల స్వీకరణ
లక్కిరెడ్డిపల్లి: లక్కిరెడ్డిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్గా కృష్ణంరాజు నాయక్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. కడప సీసీఎస్‌లో పనిచేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా లక్కిరెడ్డిపల్లికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు.ఇక్కడ పనిచేస్తున్న టీవీ కొండారెడ్డి అన్నమయ్య ఆర్ఎస్ఏఎస్టీఎఫ్కు బదిలీపై వెళ్లారు. మదనపల్లె రూరల్: మదనపల్లె ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను ఈనెల 20న వేలం వేయనున్నట్లు ఎకై ్సజ్ సీఐ భీమలింగ ఒక ప్రకటనలో తెలిపారు. మదనపల్లె ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో వివిధ నేరాలకు సంబంధించి సుమారు 200కుపైగా వాహనాలు సీజ్ చేసినట్లు చెప్పారు. ఇందులో 100 వాహనాలకు వేలంపాటలు నిర్వహించేందుకు కడప ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అనుమతి ఇచ్చారన్నారు. 20వ తేదీ ఉదయం 10 గంటలకు అన్నమయ్య జిల్లా ఎకై ్సజ్ సూపరిండెంట్ మధుసూధన్ ఆధ్వర్యంలో వేలంపాటలు జరుగుతాయన్నారు. ఆసక్తి కలిగిన వ్యక్తులు ఆధార్‌కార్డు, డిపాజిట్ మొత్తం చెల్లించి వేలం పాటల్లో పాల్గొనవచ్చన్నారు. పూర్తి వివరాలకు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. కడప సెవెన్‌రోడ్స్/ప్రొద్దుటూరు: దేవాదాయ ధర్మదాయశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా కొత్త భజన మందిరాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయని దేవాదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ శంకర్ బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో ఒక గ్రామ పంచాయతీకి ఒక భజన మందిరాన్ని నిర్మిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సదరు దేవస్థానం పేరుమీద తహసీల్దార్ ద్వారా జారీ చేయబడిన స్థల ధృవీకరణపత్రం ఉండాలన్నారు. ఐదు సెంట్లకు రూ. 10 లక్షలు, 8 సెంట్లకు రూ. 15 లక్షలు, 10 సెంటలకు రూ.20 లక్షలు చొప్పున మంజూరు చేస్తామ న్నారు. ఇతర వివరాలకు కడప డివిజన్ 95818 01858, ప్రొద్దుటూరు డివిజన్ 99856 45430, రాజంపేట డివిజన్ 99669 61554 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. రేపు రాజంపేటలో ప్రజా గర్జన రాజంపేట టౌన్: రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్‌తో శుక్రవారం ఉదయం 10 గంటలకు రాజంపేట పట్టణంలోని పాతబస్టాండులో ప్రజా గర్జనను నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి సబ్‌కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజాగర్జనలో రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలు,ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలకు చెందిన ప్రజలు పాల్గొంటారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, మండలాల మార్పులపై అభ్యంతరాలు తెలిపేందుకు ప్రభుత్వం ఈనెల 27వ తేదీ వరకు గడువు ఇచ్చిందని, అలాగే వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో ప్రభుత్వ కార్యకలాపాలు కూడా ప్రారంభం అవుతాయన్నారు. అందువల్ల ఈలోపే ప్రభుత్వం రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించేలా ఉద్యమాన్ని కొనసాగించాల్సి ఉందని, ఇందుకు ప్రజలు తమవంతు సంపూర్ణంగా సహకరించాలని కోరారు. పీలేరు: జేఎన్టీయూ ఆధ్వర్యంలో కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జేఎన్టీయూఏ ఇంటర్ యూనివర్సిటీ సెటిల్ బ్యాడ్మింటన్‌లో పీలేరుకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి హ్యోత్రిశ్రీ ప్రతిభ కనబరిచింది. కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ఇంటర్ యూనివర్సిటీ సెటిల్ బ్యాడ్మింటన్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ పోటీల్లో 50 కళా శాలల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. పీలేరుకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తిరుపతి కేఎఎం కళాశాల విద్యార్థిని టి. హ్యోత్రిశ్రీ ప్రతి కనబరచి సౌత్‌జోన్ పోటీలకు ఎంపికై ంది. హ్యోత్రిశ్రీ తండ్రి టి. ప్రభాకర్‌రెడ్డి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ కావడంతో ఆయన సలహాలు, సూచనలు తోడ్పాటునందించాయి. హ్యోత్రిశ్రీని కేఎంఎం కళాశాల డైరెక్టర్ అరుణ్‌కుమార్, జేఎన్టీయూ అనంతరం స్సోర్ట్ కౌన్సిల్ కార్యదర్శి నారాయణరెడ్డి అభినందించారు. -
నజీరుల్లా మఠం, మసీదు వక్ఫ్‌బోర్డు స్వాధీనం
ప్రొద్దుటూరు కల్చరల్ : మైదుకూరు రోడ్డులోని నజీరుల్లా షా మఠం, ఖాదర్ హుస్సేన్ మసీదులను వక్ఫ్‌బోర్డు స్వాధీనం చేసుకుంటున్నట్లు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ వసీం అక్రం తెలిపారు. బుధవారం ఆయన నజీరుల్లా షా మఠం వద్ద నోటీసులు అతికించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంత మంది నజీరుల్లా షా మఠం ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయని హైకోర్టులో పిటీషన్ వేశారన్నారు. హైకోర్టు, వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వక్ఫ్‌బోర్డు ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఖాదర్ హుస్సేన్ మసీదును సక్రమంగా నిర్వహించడం లేదని, కమిటీని సక్రమంగా నిర్వహించాలని అనేక సార్లు చెప్పినా పరిస్థితిలో మార్పులేదన్నారు. దీంతో ఆ మసీదును వక్ఫ్‌బోర్డు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా నజీరుల్లాషా మఠం వద్ద అంజుమన్ అహలే ఇస్లాం కమిటీ అధ్యక్షుడు వీఎస్ ముక్తియార్, నజురుల్లా షా మఠం ట్రస్టు ప్రతినిధులు, సభ్యులు వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్తో చర్చించారు. కోర్టు తీర్పు మేరకు ఆస్తులపై సర్వే నిర్వహించాలని, నజీరుల్లా షా మఠాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని తాము ఒప్పుకోమని తెలిపారు. -
ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం తగదు
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం తగదు. ఈ విషయంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల పేరుతో తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఇందుకు విద్యార్థి లోకం స్వచ్ఛందంగా మద్దతు ఇస్తోంది.పక్క రాష్ట్రాల్లో తక్కువ మార్కులకు మెడికల్ సీటు దొరికే అవకాశాలు ఉండగా , మన రాష్ట్రంలోని విద్యార్థులు వారి కంటే మెరుగైన మార్కులు తెచ్చుకున్నా సీటు దక్కకుండా పోతుంది. పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనే కలను సాకారం చేసేలా చంద్రబాబు సర్కార్ తన నిర్ణయాన్ని పునరాలోచించాలి. సరైన నిర్ణయం తీసుకోవాలి. – గుత్తిరెడ్డి కార్తీక్‌రెడ్డి, విద్యార్థి, కడప -
ఇస్తిమా నిర్వహణపై సీఐ సమీక్ష
రామసముద్రం : మండల కేంద్రంలో జనవరి 7, 8 తేదీలలో ముస్లింలు నిర్వహించే ఇస్తిమా కార్యక్రమంపై బుధవారం మదనపల్లి రూరల్ సీఐ రవి నాయక్ భద్రతాపరమైన చర్యలపై ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్తిమా జరుగుతున్న ప్రదేశంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం కమ్యూనిటీ సభ్యులతో మాట్లాడుతూ కార్యక్రమం శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. వాహనాల పార్కింగ్, ఎలాంటి అపోహలు, వివాదాలు తలెత్తకుండా చూడాలన్నారు. వలంటీర్లను నియమించి క్యూ లైన్లు, పార్కింగ్ సమస్య రాకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ దిలీప్ కుమార్, పోలీస్ సిబ్బంది బాలాజీ, లోకేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
కూచ్ బెహర్ ట్రోఫీ విజేత ఆంధ్రా జట్టు
కడప వైఎస్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు విజయం సాధించింది. వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ మైదానంలో ఆంధ్రా–ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బౌలర్ల ధాటికి ఉత్తరాఖండ్ బ్యాటర్లు తడబడటంతో రెండవ రోజే ఆంధ్రా జట్టుకు విజయం వరించింది. బుధవారం రెండవ రోజు 42 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆంధ్రా జట్టు నిర్ణీత 71.2 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని ఆనంద్ జోషయ్య 58 బంతులకు 1 సిక్సర్, 4 ఫోర్లతో 49 పరుగులు, మన్విత్ కుమార్ రెడ్డి 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశారు. ఉత్తరాఖండ్ జట్టులోని నిషు పటేల్ 5 వికెట్లు, లక్ష్య రాయ్‌చందాని 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఉత్తరాఖండ్ జట్టు నిర్ణీత 36 ఓవర్లకు 102 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని లక్ష్యరాయ్చందాని 30 పరుగులు, ఆయుష్ దేశ్వాల్ 25 పరుగులు చేశారు. ఆంధ్రా జట్టులోని ఏఎన్వీ లోహిత్ ఉత్తరాఖండ్ బ్యాటర్లపై చెలరేగి చక్కటి లైనప్‌తో బ్యాటింగ్ చేసి 5 వికెట్లు, రాజేష్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆంధ్రా జట్టు నిర్ణీత 10.5 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీ నారాయణ 20 పరుగులు, హానీష్ వీరారెడ్డి 35 పరుగులు చేశారు. దీంతో ఆంధ్రా జట్టు విజయం సాధించింది. అయితే ఉత్తరాఖండ్ జట్టు ఆంధ్రా బౌలర్ల ధాటికి తక్కువ పరుగులకే ఆలౌట్ కావడం విశేషం. దీంతో ఆంధ్రా జట్టుకు 7 పాయింట్లు లభించాయి. ఏఎన్వీ లోహిత్, ఆంధ్రా (5 వికెట్లు)రాజేష్, ఆంధ్రా (4 వికెట్లు) -
అసభ్యంగా ప్రవర్తించినందుకు ఇద్దరికి జైలు శిక్ష
ఎర్రగుంట్ల : ఓ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఇద్దరు యువకులకు కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. కలమల్ల ఎస్ఐ డి.సునీల్ కుమార్ రెడ్డి వివరాల మేరకు.. ముద్దనూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన కుంచెం శ్రీధర్, కుంచెం గోపాల్ అనే యువకులు 2023 సంవత్సరంలో ఒక అమ్మాయితో అసభ్యకరంగా ప్రవరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ సంజీవరెడ్డి కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కడప పోక్సో కోర్టు జడ్జి ఎస్.ప్రవీణ్ కుమార్ కుంచెం శ్రీధర్‌కు 21 రోజుల జైలు శిక్ష రూ.25 వేలు జరిమానా, కుంచెం గోపాల్‌కు 17 రోజుల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. నిందితులకు శిక్ష పడేందుకు సహకరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొమ్మినేని వేణుగోపాల్, ఎస్ఐ సునీల్‌కుమార్ రెడ్డి , కోర్టు కానిస్టేబుల్ ఎం.నారాయణ, కోర్టు మానిటరింగ్ ఏఎస్ఐ నాగేంద్ర, సీఐ వినయ్కుమార్రెడ్డిలను ఉన్నతాధికారులు ప్రశంసించారు. క్విజ్ పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ కడప కార్పొరేషన్ : జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఇంధన పొదుపుపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటీ ఆధ్వర్యంలో సంస్థ పరిధిలోని 9 జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇంధన పొదుపుపై క్విజ్ పోటీలు నిర్వహించారు. ఇందులో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారని కడప డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిసేవ్యా నాయక్ తెలిపారు. బుధవారం డివిజన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. క్విజ్ పోటీల్లో ఖాజీపేట ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి జీవీవీ నాగిరెడ్డి, ఈ. నాగ రిషిత, ప్రొద్దుటూరు ఎస్‌పీసీఎన్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి వై. ప్రణీత్‌రెడ్డి, వైవీఎస్ మున్సిపల్ హైస్కూల్ వి. వైష్ణవ్‌లు విజేతలుగా నిలిచారని తెలిపారు. -
బాబు బినామీల జేబులు నింపడానికే ప్రైవేటీకరణ
కడప కార్పొరేషన్: చంద్రబాబు బినామీల జేబులు నింపడానికే మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తున్నారని వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. బుధవారం కడపలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 1999–24 కాలంలో రాష్ట్రానికి 19 కాలేజీలు మంజూరు కాగా అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఒక్కటి మాత్రమే వచ్చిందన్నారు. ప్రైవేటీకరణ అంటే చంద్రబాబుకు ఎంత మక్కువో ఈ ఉదాహరణ చాలన్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటే పేద విద్యార్థులు రూ.70వేలతో మెడిసిన్ పూర్తి చేయవచ్చని, లేనిపక్షంలో ఏడాదికి రూ.1.14లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వైద్య ఖర్చులు కూడా భారీగా పెరిగిపోతాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైందని, నెట్వర్క్ హాస్పిటల్స్‌కు బిల్లులు చెల్లించపోవడంతో అవి పేదలకు వైద్యం చేయడం మానేశాయన్నారు. ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభించిందని, ఆ సంతకాల పత్రాలను ఈనెల 18వ తేదీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్‌కు అందించనున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం వైఎస్సార్సీపీ చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. ప్రైవేటీకరణతో ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం ఎంతో చెప్పాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం ఎంతో బహిర్గతం చేయాలని వైఎస్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజకీయ మాయాజాలం చెబితే చాంతాడంత అవుతుందని, వినడానికి వీధినాటకం అవుతుందన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన ఆయన మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారని, వందల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తూ ఏడాదికి రూ.8వేల సంపదను ఖజానాకు తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని 2022లో ప్రధాని నరేంద్రమోదీ చెప్పినప్పటికీ, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ విధానంతో పేదలకు మేలు జరగదని భావించారన్నారు. అందుకే ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు నిర్మించారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సు, వారి ఆరోగ్యంపై ఏమాత్రం శ్రద్ద లేదన్నారు. ఈ సమావేశంలో వైద్య విభాగం నగర అధ్యక్షుడు సతీష్‌రెడ్డి, డాక్టర్ పవన్ కుమార్‌రెడ్డి, డాక్టర్ పెంచలయ్య పాల్గొన్నారు. -
పేద,మధ్య తరగతి విద్యార్థులకు నష్టం
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణతో పేద,మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుంది. వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంగా జరిగింది. పీపీపీ విధానంతో వైద్యం ఖరీదుగా మారుతుంది. ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరించుకోవాలి. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూడటం దుర్మార్గం. –విజయ్‌బాబు, విద్యార్థి,మదనపల్లె ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటేనే బాగుంటుంది మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తే పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించలేరు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలు ఏర్పాటైతేనే బాగుంటుంది. కన్వీనర్ కోటా కింద సీట్లు వచ్చినా పేద విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో ఉండి చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తే పేదలు కళాశాలలవైపు కన్నెత్తి కూడా చూడలేరు. – నందిని, ఇంటర్ నర్సింగ్ విద్యార్థిని, రాజంపేట ప్రైవేట్‌కు కట్టబెట్టొద్దు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడితే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో 17మెడికల్ కళాశాలల ఏర్పాటును సంకల్పించి కొన్నింటిని పూర్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, పేదలకు అత్యుత్తమ వైద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. –ఎం.వనజారాణి, బోస్‌నగర్, రాయచోటి పట్టణం -
స్వచ్ఛందంగా సంతకాలు పెట్టారు
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు అప్పగించే నిర్ణయం విరమించుకోవాలి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా సాగింది. విద్యార్థులతో పాటు మేధావులు దీనిని వ్యతిరేకించి స్వచ్ఛందంగా సంతకాలు పెట్టారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌కు అప్పగిస్తే పేదలకు వైద్యం దూరమవుతుంది. పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష లాగా మారుతుంతి. కోటి సంతకాల సేకరణపై కూటమి నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటు. వైఎస్సార్పీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. వీటిని ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గం. –జీవీ ప్రసాద్, విద్యావేత్త, మదనపల్లె -
వాహనం ఢీకొని యువకుడి మృతి
పుల్లంపేట : మండల పరిధిలోని రెడ్డిపల్లె వద్ద టాటా ఇంట్రా వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రైల్వేకోడూరు నుంచి పుల్లంపేటకు ఏపీ 39 ఆర్జి 4967 నంబరు గల బుల్లెట్ వాహనంలో దూరి.కార్తీక్ (26) అనే యువకుడు పుల్లంపేట వైపు వస్తుండగా రెడ్డిపల్లె వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఏపీ 39 డబ్ల్యుజే 1964 నంబరు గల టాటా ఇంట్రా గూడ్స్ వాహనం ఢీకొంది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కార్తీక్ స్వగ్రామం మండల పరిధిలోని రామసముద్రం గొల్లపల్లె కాగా 4 నెలల క్రితం కువైట్ నుంచి వచ్చి వ్యవసాయం చేస్తున్నాడు. కార్తీక్ తండ్రి కొద్దికాలం క్రితం డెంగీ జ్వరంతో మరణించాడు. కార్తీక్ అవివాహితుడు కాగా ముగ్గురు చెల్లెళ్లకు వివాహాలు చేశాడు. యువకుడి మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చిన్న రెడ్డప్ప తెలిపారు. ట్రాక్టర్ కింద పడి విద్యార్థి.. తంబళ్లపల్లె : రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం తంబళ్లపల్లె మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పెద్దమండ్యం మండలం ముసలికుంట పంచాయతీ బాలచెరువుపల్లెకు చెందిన ఎం.సహదేవ కుమారుడు రాము (15) తంబళ్లపల్లె మండలం బోయపల్లెలోని మేనేత్త ఇంటిలో ఉంటూ తంబళ్లపల్లెలో ఐటీఐలో చదువుతున్నాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం బోయపల్లె వద్ద నుంచి ద్విచక్రవాహనంలో వస్తుండగా మార్గమధ్యంలో గోళ్లపల్లికి సమీపంలో ముందు వరిగడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్టేక్ చేయబోయి ప్రమాదశాత్తు కిందపడ్డాడు. అతడిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన తంబళ్లపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్.ఐ ఉమామహేశ్వరరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరిలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
డిమాండ్ల సాధన కోసం నిరసన
రాయచోటి అర్బన్ : సహకార శాఖ ఉద్యోగులు డిమాండ్ల సాధన కోసం మంగళవారం రాయచోటిలోని జిల్లా సహకార అధికారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సహకార శాఖ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమస్యలు పరిష్కరించాలని నినదించారు. ఈ సందర్భంగా జిల్లా సహకార సంఘ అధ్యక్షుడు సీవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా జనరల్ సెక్రటరీ రెడ్డి బాబు మాట్లాడుతూ తమ సమస్యల పట్ల ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ నంబర్ 36ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16వ తేదీన జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమంతోపాటు 29వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా అధికారి గురు ప్రకాశ్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సాబ్జాన్, ఆంజనేయులు, ఆంజనేయ రెడ్డి, మదనపల్లె సబ్ డివిజన్‌కు చెందిన హరినాథరెడ్డి, కరుణాకర్ రెడ్డి, రాజంపేట సబ్ డివిజన్‌కు చెందిన వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
జల్ జీవన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్
లక్కిరెడ్డిపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు శుద్ధమైన నీటిని అందించేందుకు జల్ జీవన్ పథకం ప్రవేశపెట్టాయ, ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి ప్రభుత్వం మంచినీరు అందిస్తుందని ఐఏఎస్ అధికారి హరినారాయణ పేర్కొన్నారు. ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్‌లో భాగంగా మంగళవారం మండలంలోని దిన్నెపాడు పర్వతరెడ్డిగారిపల్లి, దప్పేపల్లి, లక్కిరెడ్డిపల్లి గ్రామాల్లోని సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా దిన్నెపాడు గ్రామంలోని పర్వతరెడ్డిగారిపల్లెలో డంపింగ్ యార్డు పరిశీలించారు. పొడి చెత్త, తడిచెత్తను వేరుచేసి డంపింగ్ యార్డుకు తరలించాలని, దీంతో గ్రామం శుభ్రంగా ఉంటుందని, అంతేకాకుండా ఆర్థికంగా గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. దప్పేపల్లి గ్రామంలో మామిడి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడి ఉత్పత్తులు దిగుబడులు గురించి రైతులతో మాట్లాడారు. మామిడి రైతులకు సబ్సిడీ ఎరువులు, మందులు ప్రభుత్వం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డీపీఓ రాధమ్మ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారిణి సుభాషిణి, ఎంపీడీఓ రెడ్డయ్య, తహసీల్దార్ క్రాంతి కుమార్, మండల ఉద్యానవన శాఖ అధికారి సింధూరి, ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ విద్య, ఆర్‌డబ్ల్యుఎస్ జేఈ కిషోర్, డిప్యూటీ ఎంపీడీఓ ఉషారాణి, ఎంఈఓ చక్రినాయక్, వెంకటసుబ్బయ్య, నీతి ఆయోగ్ కో–ఆర్డినేటర్ వెంకటరామిరెడ్డి, ఆర్ఐ రాజేష్, అన్ని శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో ఓ వివాహిత ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం రామసముద్రం మండలం చెంబకూరులో జరిగింది. చెంబకూరుకు చెందిన కుమార్ భార్య రోజా(35) ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. అపస్మారస్థితిలో పడి ఉండటంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అవమానభారంతో ఆత్మహత్య పెనగలూరు : మండలంలోని చక్రంపేట గ్రామానికి చెందిన కల్లూరి గంగిరెడ్డి (67) అనే వ్యక్తి తనకు జరిగిన అవమాన భారంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ కె. రఘురాం సమాచారం మేరకు.. చక్రంపేటకు చెందిన గంగిరెడ్డి అదే గ్రామానికి చెందిన కంచర్ల ఈశ్వర్ రెడ్డికి కొంత నగదును అప్పుగా ఇచ్చాడు. గంగిరెడ్డి అందరి ఎదుట ఈశ్వర్ రెడ్డిని అప్పు కట్టాలని గట్టిగా అడిగాడు. దీంతో అందరి ముందు అప్పు అడుగుతావా అంటూ సోమవారం గంగిరెడ్డి ఇంటివద్దకు కంచర్ల ఈశ్వర్ రెడ్డి, కంచర్ల లక్ష్మీరెడ్డి, కంచర్ల గంగిరెడ్డిలు వెళ్లి కాళ్లతో, చేతులతో కొట్టారు. దీంతో అవమాన భారం తట్టుకోలేక గంగిరెడ్డి నిమ్మతోట వద్ద పురుగుల మందు తాగి పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గణేష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు సిద్దవటం : మండలంలోని కడప–చైన్నె జాతీయ రహదారి ఉప్పరపల్లి గ్రామం సాయిబాబా గుడి సమీప ప్రాంతంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. కడప వైపు నుంచి చైన్నె వెళ్తున్న కంటైనర్ లారీకి అడ్డంగా బర్రె రావడంతో అదుపు తప్పి కడప వైపు నుంచి ద్విచక్రవాహనంలో నందలూరు గ్రామానికి వెళ్తున్న శంకరయ్యను ఢీకొంది. ద్విచక్రవాహనదారుడు లారీ కిందపడటంతో కాలికి బలమైన గాయాలయ్యాయి. గాయపడిన శంకరయ్య నందలూరు ఎస్సీ కాలనీ వాసిగా గుర్తించారు. బాధితుడిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రమాదవశాత్తు కంటికి గాయం మదనపల్లె రూరల్ : గోడకు మేకు కొడుతుండగా ప్రమాదవశాత్తు మేకు కంటికి తగడంతో కన్నుదెబ్బతిన్న సంఘటన మదనపల్లె పట్టణం బుగ్గకాల్వలో మంగళవారం జరిగింది. బుగ్గకాల్వకు చెందిన సూరి(35) లారీ టింకరంగ్ పని చేస్తూ జీవిస్తున్నాడు. ఇంటిలో గోడకు మేకును సుత్తితో కొడుతుండగా జారిపోవడంతో కంటిపై మేకు గుచ్చుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి గమనించిన డాక్టర్లు కంటిలో గుచ్చుకున్న మేకును తొలగించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. – ఆవేదనతో పురుగుల మందు తాగిన బాధితురాలు బ్రహ్మంగారిమఠం : మండలంలోని సోమిరెడ్డిపల్లె పంచాయతీ నరసన్నపల్లెలో సంగాని రత్నాలు అనే మహిళకు చెందిన పచ్చని పైరుపై అదే గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వీరారెడ్డి తండ్రి నాగిరెడ్డి మంగళవారం గడ్డి మందు పిచికారీ చేశాడు. దీంతో మొక్క జొన్న, చీనీ చెట్లు మాడి పోయాయని బాధితురాలి కుమారుడు తెలిపాడు. అతని కథనం మేరకు.. నరసన్నపల్లె పొలం సర్వే నంబర్ 268–2లో 1.56 ఎకరాలలో మొక్కజొన్న, నిమ్మ సాగులో ఉందన్నారు. నాగిరెడ్డికి, తమకు భూ సమస్య ఉండంతో ప్రస్తుతం బద్వేలు కోర్టులో కేసు నడుస్తోందన్నారు. కుమారుడు పోలీస్ అనే భావనతో నాగిరెడ్డి తమపై కక్ష సాధిస్తున్నాడని చెప్పాడు. భూ సమస్య కోర్టులో ఉండగానే తమపై దాడులు చేస్తున్నారని వాపోయాడు. తాము అన్ని రకాలుగా నష్టపోవాలనే ఉద్దేశంతో పచ్చని పైరుపై గడ్డి మందు పిచికారీ చేయడంతో పంట నిలువునా వాడి పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఆవేదనతో పురుగుల మందు తాగిన రత్నాలు.. ఉన్న కొద్దిపాటి పైరు నిలువునా మాడిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన భూ యజమాని సంగాని రత్నాలు పంట చేలోనే పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. కొండాపురం : తాళ్లప్రొద్దుటూరు గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది. అచ్చమ్మ అనే మహిళ ఇంట్లో బీరువాలోని రూ.40 వేలు నగదు, రూ.12 వేలు విలువ చేసే బంగారు ఉంగరాన్ని దొంగిలించారు. -
పట్టపగలే రెండిళ్లలో చోరీ
గుర్రంకొండ : పట్టపగలే రెండిళ్లలో చోరీ జరిగిన సంఘటన మండలంలోని తలారివాండ్లపల్లె, అరిగిలవారిపల్లెలో జరిగింది. తలారివాండ్లపల్లెకు చెందిన మల్రెడ్డి వ్యవసాయ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం ఇంటికి తాళాలు వేసుకొని కుటుంబ సభ్యులతో కలసి పొలం వద్దకు వెళ్లారు. పొలం పనులు ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి రాగానే అప్పటికే ఇంటి తాళాలు తెరచి ఉండడాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువాను పగులగొట్టి తెరిచి ఉంచిన దృశ్యాలు కనిపించాయి. పరిశీలించగా బీరువా లాకర్లో ఉంచిన 40 గ్రాముల బంగారు నగలతో పాటు రూ. 10 వేలు నగదు చోరికి గురైనట్లు గుర్తించారు. చోరీకి గురైన వస్తువుల విలువ రూ. 4.50 లక్షల వరకు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. మండలంలోని అరిగెలవారిపల్లెకు చెందిన శ్రీరాములు వ్యవసాయకూలి పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం ఇంటికి తాళాలు వేసుకొని వ్యవసాయ పనుల కోసం పొలాల వద్దకు వెళ్లాడు. పనులు ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చే సమయానికి ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించి ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో ఉన్న బీరువా తలుపులు, అందులో లాకర్ తలుపులు పగులగొట్టిన దృశ్యాలు కనిపించాయి. అయితే వస్తువులు చోరీకి గురైన ఆనవాళ్లు కనిపించలేదని బాధితులు పేర్కొన్నారు. చోరీ చేసే సమయంలో ఏదైనా అలికిడి జరగడంతో భయంతో దొంగలు పరారై ఉంటారని భావిస్తున్నారు. ఈ సంఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రశ్నలు సంధించండి.. ప్రధానితో మాట్లాడండి
● విద్యార్థులకు పరీక్షా పే చర్చలో పాల్గొనే అవకాశం ● ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భాగస్వామ్యం ● ఇప్పటి వరకు 1500 మంది ఆన్లైన్లో నమోదు ● జనవరి 11 తుది గడువు కడప ఎడ్యుకేషన్ : భారత ప్రధానితో నేరుగా మాట్లాడాలనుకుంటున్నారా.. ఇప్పుడు ఆ అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మీరు చేయాల్సిందల్లా ప్రధానమంత్రి ‘పరీక్షా పే చర్చ’ యాప్‌లో ఆన్లైన్లో నమోదు కావాలి. ఏటా పరీక్షల ముందు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనిని కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. ఇప్పుడు 9వ ఎడిషన్‌కు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధాని మోదీ నేరుగా సంభాషించనున్నారు. పరీక్షలను సమర్థవంతంగా, ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడం, చిరునవ్వుతో ప్రశ్నలకు సమాధానాలు రాయడం ద్వారా విద్యార్థులకు పరీక్షలంటే భయాన్ని తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 1500 మంది విద్యార్థులు ఆన్లైన్లో నమోదు అయ్యారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకునేందుకు జనవరి 11వ తేదీ వరకు గడువు ఉంది. త్వరపడాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. త్వరలో పరీక్షల సీజన్.. పరీక్షల సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఆ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలి. విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలి? విద్యార్థుల ఆకాంక్ష ఏంటి? వాటిని చేరుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలు ఏంటి.. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఎలా ఉండాలి.. తదితర అంశాలపై పరీక్షా పే చర్చ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు 6 నుంచి 12 తరగతుల విద్యార్థులు అర్హులు. దీని ద్వారా ప్రధానమంత్రి శక్తివంతమైన యువతతో కనెక్ట్ అవుతారు. యువతతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. యువత ఎదుర్కోనే సవాళ్లు, ఆకాంక్షలను మరింతగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం కూడా కలుగుతుంది. పరీక్షా పే చర్చ మొదటి ఎడిషన్ 2018 ఫిబ్రవరి 16న ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించారు. ఇప్పుడు కూడా విద్యార్థులు తమ ప్రశ్నను ప్రధానమంత్రిని నేరుగా అడగవచ్చు. ప్రశ్న గరిష్టంగా 500 అక్షరాలలోపు ఉండాలి. ఇందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు. వారి ఎంట్రీలను కూడా ఆన్లైన్లో పంపే అవకాశం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కల్పించింది. వీటిలో మంచి ప్రశ్నలను ఎంపిక చేసి అర్హులను నిర్ణయిస్తారు. విజేతలుగా నిలిస్తే.. పరీక్షా పే చర్చలో విజేతలు నేరుగా ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశాన్ని పొందుతారు. ప్రతి విజేతకు ప్రత్యేక కిట్ అందజేస్తారు. విజేతలకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. విజేతలు ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి ఆటోగ్రాఫ్‌ను, ఫొటోతో కూడిన డిజిటల్ సావనీర్ పొందే అవకాశం ఉంటుంది. లాగిన్ అవ్వాలి ఇలా... విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హెచ్‌టీటీపీఎస్;//ఇన్నోవేట్ ఇండియా.మై జీవోవీ.ఇన్ అని క్లిక్ చేయాలి. ఎంటర్‌కాగానే క్లిక్ ఏజ్ స్టూడెంట్,టీచర్, పేరెంట్స్ అనే లాగిన్స్ కనిపిస్తాయి. వాటిలోకి ఎంటర్ కాగానే మీ మొబైల్ నంబరు లేదా జీమెయిల్ ఖాతాను పూర్తి చేయాలి. ఓటీపీతో లాగిన్ అయి క్లిక్ చేయాలి. ఓటీపీ రాగానే మళ్లీ లాగిన్ చేయాలి. స్టూడెంట్స్‌కు నేరుగా ఫోన్ నంబరు, జీమెయిల్ లేని సందర్భంలో టీచర్స్ లాగిన్ ద్వారా ఎంటర్ అయ్యే అవకాశం కల్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రాథమిక సమాచారం వివరాలను పూర్తి చేయాలి. కార్యాచరణ వివరాలను పూర్తి చేసిన తర్వాత థీమ్‌ను ఎంచుకుని 500 అక్షరాలలోపు వివరించాలి. అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరీక్షా పే చర్చలో పాల్గొనేలా ఉప, మండల విద్యాశాఖ అధికారులు కృషి చేయాలి. పరీక్షా పే చర్చకు ఎంపికై న సుమారు 2,000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా పీపీసీ కిట్లను బహుమతిగా అందజేయనున్నారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. 6–12 తరగతులకు చెందిన విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఇది చక్కని అవకాశం. అధిక సంఖ్యలో పాల్గొనేలా ఎవరి స్థాయిలో వారు కృషి చేయాలి. జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకురావాలి. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల ఎంఈఓలు స్పందించి విద్యార్థులు ఆన్లైన్లో నమోదు అయ్యే విధంగా అవగాహన కల్పించాలి. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి. -
● ఓ వైపు పోరాటం.. మరోవైపు నిరీక్షణ
మహానాడు నిర్వహణకు సహకరించిన ఉపాధ్యాయులకు అండగా తెలుగుతమ్ముళ్లు నిలవాలి. అలాంటి చిత్తశుద్ధి వారిలో కన్పించడం లేదు. ప్రధానంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డిలు బాధ్యతగా వ్యవహరించి టీచర్ల ప్లాట్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీకీ యథావిధిగా అప్పగించాల్సి ఉంది. మహానాడు నిర్వహణకు సహకరించిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపి, యథావిధిగా అప్పగించాల్సి ఉండగా, ఆరు నెలలు అవుతున్నా నాన్చుడు ధోరణి వ్యక్తమౌతోంది. ఇకనైనా తెలుగుతమ్ముళ్లు టీచర్లకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: అయ్యవార్లు ఊహించిందే అయింది. గ(పె)ద్దలు బెదిరించి స్వాహా చేయాలని చూస్తున్న భూమిలో మహానాడు కోసం హద్దులు చెరిపేశారు. తిరిగి యథావిధిగా ప్లాట్స్ దక్కుతాయా? అనే సందిగ్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. హౌస్ బిల్డింగ్ సొసైటీ భూమి సక్రమంగా అప్పగిస్తారా? ముప్పుతిప్పలు పెడుతారా? అనుమానాలు నిజమవుతోన్నాయి. ఆరు నెలలు అవుతున్నా టీడీపీ నేతలు సమస్యలకు పరిష్కారం చూపలేదు. నాడు సీఎం చంద్రబాబు ద్వారా ప్రశంసలు, సన్మానాలు సరే.. ‘యూజ్ అండ్ త్రో పాలసీ’ హౌస్ బిల్డింగ్ సొసైటీకి కూడా వర్తింపజేశారని అయ్యవార్లలో ఆవేదన వ్యక్తమవుతోంది. ● 1989లో టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ 88 ఎకరాలు కడప రూరల్ పబ్బాపురం గ్రామ పరిధిలో కొనుగోలు చేసింది. అందులో 1430 మంది ఉపాధ్యాయులకు ఇంటి స్థలాలు కేటాయించారు. అప్పట్లో ఆ భూమి వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. కాలక్రమేణా రింగ్‌రోడ్డు అందుబాటులోకి రావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దాదాపు 17 ఏళ్ల తర్వాత 2006లో ‘మా సమ్మతి లేకుండా కొనుగోలు చేశారు’ అని శోత్రియందారులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు 6.66 ఎకరాలు మాత్రమే శోత్రియం దారులకు అప్పగించాల్సి ఉంది. రికార్డు లేకున్నా రిజిస్ట్రేషన్: పబ్బాపురం టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ పరిధిలో 20 ఎకరాలకు రైత్వారీ పట్టా ఒకటికి వెలుగులోకి తెచ్చారు. ఆ రైత్వారీ పట్టాకు చెందిన భూమి వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో లేదు. అయినప్పటికీ రూరల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం శుభకీర్తి డెవెలపర్స్ పేరిటి రిజిస్ట్రేషన్ చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని హౌస్ బిల్డింగ్ సొసైటీ వెలుగులోకి తెచ్చింది. అప్పటి జాయింట్ కలెక్టర్ గణేష్‌కుమార్ జిల్లా రిజిస్ట్రార్, చింతకొమ్మదిన్నె తహసీల్దార్, టీచర్లతో కలిపి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తే.. 2021లో రైత్వారీ పట్టా కేటాయింపునకు చెందిన ఎలాంటి రికార్డులు అందుబాటులో లేవని స్పష్టమైంది. నకిలీ రైత్వారీ పట్టా పుట్టించినట్లు తేటతెల్లమైంది. అయితే వెబ్‌ల్యాండ్‌లో లేకపోయినా శుభకీర్తి డెవెలపర్స్‌కు రిజిస్ట్రేషన్ కావడం వెనుక ఓ బడా టీడీపీ నేత ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల క్రితం టీచర్స్ లేఔట్లో మహానాడు నిర్వహణ చదును చేసి హద్దులు చెరిపేసిన టీడీపీ పెద్దలు ఇదివరకే ఆక్రమణకు సిద్ధమైన అక్రమార్కులు 35 ఏళ్లుగా ఎదుగుబొదుగు లేకుండా ఉండిపోయిన ప్లాట్స్ యథావిధిగా స్థలాలు దక్కుతాయా అనినాడు అయ్యవార్లు హైరానా సమస్యలు పరిష్కరించిప్లాట్స్ కేటాయిస్తామని హామీ తర్వాత పట్టించుకోని నాయకులు టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కొనుగోలు చేసిన భూమిని చేజిక్కించుకోవాలని కొందరు అక్రమార్కులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లుతో దౌర్జన్యం చేస్తున్నారు. ఇది వరకూ అనేక పర్యాయాలు ఉన్నతాధికారుల దృష్టికి అయ్యవార్లు తీసుకెళ్లారు. అధికారులు సానుకూలంగా స్పందించినా టీచర్లుకు దశాబ్దాల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. అవే స్థలాలపై తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తుండటంతో వ్యవహారం మరింత జఠిలమైంది. అప్పటి వరకూ ఉన్న టీచర్స్ ప్లాట్స్ రాళ్లు, హద్దులు చెరిపేశారు. యథావిధిగా టీచర్స్ ప్లాట్స్ అప్పగిస్తామని టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు జిల్లా కలెక్టర్ వరకూ అందరూ హామీ ఇచ్చారు. టీచర్లు సొంత డబ్బుతో కొనుగోలు చేసిన స్థలాన్ని ఇప్పటికీ దక్కించుకోలేని దుస్థితి నెలకొంది. అయ్యవార్లకు ఓ వైపు పోరాటం, మరోవైపు సమస్యలు పరిష్కారం కాక నిరీక్షణ తప్పడం లేదు. -
ఉపాధ్యాయుని ఇంటిలో భారీ చోరీ
● దొంగతనానికి పాల్పడిన ఐదుగురు దొంగలు ● సీసీ కెమెరాలో గుర్తించిన పోలీసులు రాజంపేట : కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని ఊటుకూరు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఉపాధ్యాయుడు శ్రీనివాసులు ఇంటిలో భారీ చోరీ జరిగింది. ఈమేరకు బాధితుడు మన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు దొంగలు చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. తొలుత దొంగలు సుధాకర్ రాయల్ ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అక్కడ అలికిడి రావడంతో దొంగతనం చేయలేక వెనుదిరిగారు. అనంతరం పుల్లంపేట మండలం పీవీజీ హైస్కూల్ ఉపాధ్యాయుడు లక్కాకుల శ్రీనివాసులు ఇంటిని లక్ష్యం చేసుకున్నారు. ఉపాధ్యాయుడు, ఆయన భార్య ఉమాదేవి తిరుమల దర్శనానికి వెళ్లారు. అలాగే తన తల్లి పనిమీద రాయచోటికి వెళ్లి ఉండటంతో ఇంటిలో ఎవరూ లేరు. రాత్రి 2 గంటల సమయంలో ఐదుగురు దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. మన్నూరు సీఐ ప్రసాద్‌బాబు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. క్లూస్‌టీంకు సమాచారం అందించారు. కాగా దొంగలు తిరుగుతున్న సమయంలో గ్రామానికి చెందిన చింతమాను వెంకటసుబ్బమ్మ అనే మహిళ వారిని గమనించి, గద్దించి వెంటనే ఇంటిలోకి వెళ్లిపోయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మన్నూరు పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో 20 తులాల బంగారు నగలు దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. మన్నూరు పోలీసులు విచారణ చేస్తున్నారు. -
మహిమాన్వితం.. మహాప్రసాదం
బ్రహ్మంగారిమఠం : ‘జగన్మాతా.. దీవించు తల్లీ’ అంటూ భక్తులు వేడుకున్నారు. మహాదేవి ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ‘అమ్మవారి ప్రసాదం.. మహిమాన్వితం’ అంటూ భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. శ్రీఈశ్వరీదేవి మఠంలో ఆరు రోజుల పాటు కనుల పండువగా నిర్వహించిన ఆరాధన గురుపూజ మహోత్సవాలు మంగళవారం ముగిశాయి. అమ్మవారికి మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి, రాజేశ్వరిదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేసి, విశేషంగా అలంకరించారు. అనంతరం మహాప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మంగారిమఠం, శ్రీఈశ్వరీదేవి మఠం సంప్రదాయాల ప్రకారం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో ద్వార పూజ చేశారు. బ్రహ్మంగారిమఠంలో ప్రసాదం తయారు చేసి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి, సంకటితిమ్మాయపల్లెకు చెందిన పోలు ఎరికలరెడ్డి, సుబ్బారెడ్డి, ముక్కమల్ల భాస్కర్‌రెడ్డి, వీరపు ఉమాపతి, సుంకు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఈశ్వరీదేవి ఆరాధన మహోత్సవాలు -
సోమశిల ముంపు బాధితులకు ఎక్స్‌గ్రేషియా
నందలూరు : సోమశిల ప్రాజెక్టు కింద ముంపునకు గురైన 54 గ్రామాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్రయోజనాల కింద ఎక్స్‌గ్రేషియా పంపిణీకి చర్యలు ప్రారంభించినట్లు తహసీల్దార్ అమరేశ్వరి తెలిపారు. ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన డబ్ల్యుపీ నెంబర్ 119/2022లో వచ్చిన ఆదేశాల మేరకు ముంపు గ్రామాల అవార్డుదారులను గుర్తించి, రికార్డుల పరిశీలన కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ సహాయకులతో కూడిన బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. పొత్తపి, కొమ్మూరు, కోనాపురం, తిమ్మరాజుపల్లి, కిచ్చంపేట, తాళ్లవరం, చాపలవారిపల్లి, కొత్తపల్లి, రామాంబపురం, రంగాయపేట, వెంకట రాజంపేట, మజార కోనాపురం, ఎగువ రాచపల్లి తదితర ముంపు గ్రామాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన అవార్డుదారులు ఆధార్‌కార్డు నకలు, అవార్డు కాపీ నకలు, బ్యాంకు పాసుపుస్తకం నకలు, రేషన్‌కార్డు వంటి పత్రాలతో ఆయా గ్రామ సచివాలయాల్లో లేదా నందలూరు మండల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.17, 18వ తేదీలలో చాపలవారిపల్లి, కొత్తపల్లి, వెంకట రాజంపేట, మధిర తిమ్మరాజుపల్లి, రామాంజనేయపురం, జంగాలపల్లి, రంగాయపల్లి, మధిర కోనాపురం, ఎగువ రాచపల్లి తదితర గ్రామాల అవార్డుదారుల నందలూరు తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా ఆమె కోరారు. రాయచోటి సబ్ జైలును తనిఖీ చేసిన న్యాయమూర్తి రాయచోటి టౌన్ : రాయచోటి సబ్ జైలును జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌జైలులోని రికార్డులను పరిశీలించారు. అనంతరం జైలులో ఉన్న ఖైదీలతో మాట్లాడుతూ ఖైదీలు తమ హక్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖైదీల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జైలు శాఖ అధికారులు పాల్గొన్నారు. రాజుపాళెం : తనకు ఇష్టం లేని పెళ్లి వద్దని అటు తల్లిదండ్రులకు, ఇటు బంధువులకు, స్నేహితులకు చెప్పుకోలేక షేక్ పెద్ద మీరావలీ (24) అనే యువకుడు విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాజుపాళెం మండలంలోని వెల్లాల గ్రామ పొలాల్లో జరిగింది. రాజుపాళెం ఎస్ఐ కత్తి వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని గొట్లూరు గ్రామానికి చెందిన షేక్ చిన్న మీరావలీ కుమారుడు పెద్ద మీరావలీకి కొద్ది రోజుల్లో వివాహం జరగనుంది. అయితే ఈ వివాహం ఇష్టం లేకపోవడంతో ఎవరికి చెప్పుకోలేక మంగళవారం ప్రొద్దుటూరులో బ్యాంకులో పని ఉందని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో పెద్ద మీరావలీ వెల్లాల గ్రామ పొలాల్లో మామిడి జ్యూస్‌లో విషపు గుళికలు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రాజుపాళెం ఎస్ఐ వెంకటరమణ సంఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే పెద్ద మీరావలీ మృతి చెంది ఉన్నాడు. మృతుడి తండ్రి చిన్న మీరావలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
మరోసారి విభేదాలు బహిర్గతం
సాక్షి టాస్క్‌ఫోర్స్: పులివెందుల నియోజకవర్గంలో టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బట్టబయలు అయ్యాయి. ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, బీటెక్ రవి వర్గాల మధ్య కొంత కాలం నుంచి దూరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం పులివెందులలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించింది. అన్ని శాఖల నుంచి ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. అయితే ఇందులో కొసమెరుపు ఏమిటంటే స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డికి ఆహ్వానం అందనట్లు సమాచారం. ఈ సమావేశం కేవలం బీటెక్ రవి కుటుంబ సభ్యుల అధ్యక్షతన జరిగినట్లుగా ఉంది. బీటెక్ రవి, ఆయన తమ్ముడు, చిన్నాన్నలు సమీక్ష చేశారు. దీనిపై అధికారులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అభివృద్ధి సమావేశమా లేక కుటుంబ సమావేశమా అని వారు మథన పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై న ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ఈ మీటింగ్‌కు హాజరు కాకపోవడంపై తెలుగుదేశం పార్టీలోనే పలువురు నాయకులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు అనేక సార్లు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు కూడా రాజ్యాంగ పరిధిలో ఉన్న ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డికి సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. ● బీటెక్ రవి అధ్యక్షతన సమావేశం ● హాజరు కాని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి -
21న పల్స్‌పోలియోను విజయవంతం చేయండి
రాయచోటి: జిల్లాలో ఈ నెల 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. రాయచోటి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో మంగళవారం ‘ప్రతిసారి రెండు చుక్కలు.. పోలియోపై నిరంతరం విజయం’ అనే పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేపట్టిన ముఖ్యమైన ప్రజా ఆరోగ్య కార్యక్రమమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు వయసు గల పిల్లలకు నోటి పోలియో వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేస్తారని వివరించారు. పల్స్ పోలియో రోజులలో ప్రత్యేకంగా నిర్వహించే రోగనిరోధకత డ్రైవ్‌లు ద్వారా వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు, సమాజ సంస్థలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈనెల 21వ తేదీన (ఆదివారం) అర్హులైన పిల్లలను సమీపంలోని పల్స్ పోలియో బూత్‌కు తీసుకువచ్చి వ్యాక్సిన్ వేయించి దేశాన్ని పోలియో రహితంగా ఉంచడంలో తల్లిదండ్రులు, సంరక్షకులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ శ్రీలక్ష్మీ, నరసయ్య, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జి.ఉషశ్రీ, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. 49.160 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అన్నమయ్య జిల్లాలో ఈ నెల 16 నాటికి 45 ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా 49.160 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశామని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ధాన్యం విక్రయించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబరు: 08561–293953ను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో 45 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రైతులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
మిట్స్‌కు ట్రిపుల్ ఏ రేటింగ్
కురబలకోట: అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు ట్రిపుల్ ఏ రేటింగ్ లభించిన ట్లు ప్రిన్సిపాల్ రామనాధన్ తెలిపారు. జాతీయ స్థాయిలో ఎన్పీటీఈఎల్ పరీక్షల్లో అత్యధికులు ప్రతిభ చూపడంతో ఈ రేటింగ్ లభించినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు టాప్ ట్వంటీలో మిట్స్ కళాశాలకు జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకుగా గుర్తింపు లభించినట్లు వివరించారు. సంబేపలె ్ల: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై జరిగే అవాంఛనీయ సంఘటనలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మండలంలో జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఒంటిమిట్ట : విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు పోరుబాట పట్టనున్నట్లు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని పెన్నపేరూరు జెడ్పీహెచ్ఎస్లో జిల్లా కౌన్సిల్ సమావేశాల కరపత్రాలను ఉపాధ్యాయులతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న మైదుకూరులో జిల్లా కౌన్సిల్ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయులు షీలా కుమారి, ఉపాధ్యాయులు పెద్ద రెడ్డయ్య, శ్రీధర్, హెలెన్ మంజుల, అనురాధ, సుజన, శివరామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఎన్నో ప్రయోజనాలు పెనగలూరు: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఐపీఓ జీవీ ప్రసాద్ అన్నారు. మంగళవారం పెనగలూరు సబ్ పోస్టాఫీసును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 20 వరకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అనంతరం వివిధ పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పెనగలూరు పోస్టుమాస్టర్ సుబ్బరాయుడు, ఎల్ సుబ్రమణ్యం, పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
యమ డేంజర్!
రాజంపేట: కడప–రేణిగుంట హైవే.. డేంజర్ జోన్‌గా మారిందనే అంశం పార్లమెంట్లో కూడా చర్చకు వచ్చింది. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కడప–రేణిగుంట జాతీయ రహదారి దుస్థితిపై గళం విప్పారు. సరైన అలైన్మెంట్ లేదని, నైట్ జర్నీ యమడేంజర్‌గా ఉందని తెలియజేశారు. వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకురావడంతో ఈ అంశం కేంద్ర రవాణాశాఖను తాకింది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదం సంభవిస్తోంది. హైవే దారంతా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. నిత్యం ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రెండు దశాబ్దాల కిందట సింగిల్ రోడ్డుగా ఉన్న రహదారిని వెడల్పు చేసి స్టేట్ హైవే డబుల్ రోడ్డుగా మార్చారు. ఉభయ వైఎస్సార్ జిల్లాలో ఈ రోడ్డు కొనసాగుతోంది. ప్రయాణం.. భయానకం ప్రస్తుత హైవే వెంట ప్రయాణం భయానకంగా మారింది. ఎటువైపు నుంచి ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి. కడప శివార్లలోని జేఎంజే కళాశాల నుంచి భాకరాపేట సర్కిల్, మాధవరం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లె, మంగంపేట, రైల్వేకోడూరు, శెట్టిగుంట, కుక్కులదొడ్డి వరకు హైవేలో రహదారి ప్రయాణం కత్తి మీద సాములా మారింది. మార్గంలో అనేక ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఒంటిమిట్ట, నందలూరు, రెడ్డిపల్లె చెరువుకట్టలపై రహదారి ఉంది. అనేక మార్లు వాహనాలు అదుపు తప్పి చెరువుల్లో పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. దక్షిణ భారతదేశం నుంచి తిరుమలకు కడప–రేణిగుంట మార్గం మీదుగా వేలాది మంది యాత్రికులు వాహనాల్లో ప్రయాణం చేస్తుంటారు. తెలంగాణా, మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు రాజస్తాన్, యూపీ తదితర రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు ఈ రోడు మార్గాన్నే వెళుతుంటారు. తుపాన్‌తోపాటు రకరకాల ఫోర్‌వీల్ వాహనాల్లో యాత్ర కొనసాగించడం అధికంగా ఉంటుంది. పలుమార్లు వాహనాలు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ కడప–రేణిగుంట హైవేలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ మార్గం మీదుగా తిరుపతి, చైన్నె, ముంబయి, హైదరాబాద్‌కు రాకపోకలు కొనసాగుతున్నాయి. నిత్యం 17 వేలకు పైగా వాహనాలు హైవేపై పరుగులు తీస్తున్నాయి. ఈ ట్రాఫిక్‌కు ప్రస్తుతం ఉన్న హైవే కెపాసిటీ సరిపోవడం లేదు. ఫలితంగా ప్రమాదాలు, ట్రాఫిక్ స్తంభించడం తరుచూ జరుగుతున్నాయి. అంతే గాకుండా కడప–రేణిగుంట రోడ్డు ప్రయాణం రెండు నుంచి మూడు గంటలకు పైగా పడుతోంది. సకాలంలో గమ్యాలకు చేరలేని పరిస్థితి ఉంది. కడప–రేణిగుంట హైవేలో ప్రతి మండల పరిధిలో బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. రాజంపేట అర్బన్‌లో 3, నందలూరు 2, , రైల్వేకోడూరు 3, పుల్లంపేట 3 ఓబలవారిపల్లె 6, మన్నూరు 3 ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలు సర్వే చేసి కడప–రేణిగుంట ప్రస్తుత హైవేలో ప్రమాదాలు జరుగుతున్నాయని నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పెద్దాసుపత్రిలో ట్రామా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందుబాటులో లేదనే సంగతి విదితమే. అధ్వానస్థితిలో కడప–రేణిగుంట హైవే ప్రమాదకర మలుపులు ప్రాణాలు పోతున్న వైనం పార్లమెంట్లో గళం విప్పినమేడా రఘునాథరెడ్డి కడప–రేణిగుంట హైవేకు సరైన అలైన్మెంటట్ లేదని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి పార్లమెంట్ సాక్షిగా గళం విప్పారు. ప్రమాదాలకు నిలయంగా మారిందన్నారు. మలుపులు ఉన్నాయని, రాత్రి పూట ప్రయాణం భయంకరంగా ఉంటుందన్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రమాదరహిత రహదారిగా మార్చాలని కోరారు. కడప –రేణిగుంట నేషనల్ హైవేలోని నందలూరు చెయ్యేరు నదిపై నిర్మించి వంతెన(బ్రిడ్జి) ప్రమాదాలకు నిలయంగా నిలిచిపోయింది. వంతెనపై ప్రమాద నివారణ చర్యలేవి కనిపించడం లేదు. వంతెన మధ్యలో ఉన్న బీటి (తారు)రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్డు మధ్యలో గుంతలు పడ్డాయి. బ్రిడ్జిపై వేగాన్ని నిరోధించే విధంగా బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు కూడా వేయలేదు. రాత్రి వేళలో వంతెనపై చీకటిగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవడమే కాకుండా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ బ్రిడ్జి సగం మన్నూరు, మరో సగం నందలూరు పోలీసు స్టేషన్ల పరిధిలోకి వస్తాయి. కిలోమీటర్లకు పైగా పొడవు కలిగిన ఈ వంతెన మృత్యుకుహరంగా మారింది. -
కష్టపడినా గుర్తింపు ఏదీ!
మదనపల్లె : తంబళ్లపల్లె, మదనపల్లె టీడీపీలో నెలకొన్న పరిస్థితులపై సోమవారం ఆ పార్టీ రహస్యంగా పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించింది. జిల్లా ఇన్చార్జి మంత్రి జనార్దనరెడ్డి, టీడీపీ జోన్–4 ఇన్చార్జి దీపక్‌రెడ్డి స్థానిక టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అధికారులతో ఇబ్బందులు, అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లుల వ్యవహారాలపై మంత్రి, పార్టీ విషయాలపై దీపక్‌రెడ్డి చర్చించారు. గతంలో అందరి సమక్షంలో అభిప్రాయాలు తెలుసుకోవడం వల్ల జరిగిన ఘటనల నేపథ్యంలో మంత్రి ఒక్కో నాయకునితో వ్యక్తిగతంగా సమావేశమై రహస్యంగా వివరాలు సేకరించారు. కొంతమంది ఎమ్మెల్యే షాజహాన్‌బాషా టీడీపీ సీనియర్లను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కాగా ఎమ్మెల్యే షాజహాన్‌బాషా కూడా ఫిర్యాదు చేశారని పార్టీవర్గాలు తెలిపాయి. తాను ఎమ్మెల్యేగా ఉండగా పార్టీలో వర్గాలను పెంచిపోషిస్తూ ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్న వారిపై ఫిర్యాదు చేసి, ఇలాగైతే పాలన ఎలా సాగించాలని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిసింది. తంబళ్లపల్లె నియోజకవర్గ పార్టీ పరిస్థితులపై మండలాల నుంచి వచ్చిన నాయకులు దీపక్‌రెడ్డి ఎదుట ఫిర్యాదు చేసుకున్నారు. ఇన్చార్జిని నియమించాలని డిమాండ్ చేశారు. మండల అధ్యక్షుల పదవుల్లో తమకే ప్రాధాన్యత ఇవ్వాలని జయచంద్రారెడ్డి వ్యతిరేక వర్గం పట్టుపట్టారు. పార్టీకోసం కష్టపడిన తమను గుర్తించరా, కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తారా అని గట్టిగా నిలదీయడంతో ఉద్రికత్తకు దారితీస్తుందని భావించిన పోలీసులు తంబళ్లపల్లె టీడీపీ నేతలను కార్యాలయం నుంచి వెలుపలికి తీసుకొచ్చారు. తంబళ్లపల్లె పార్టీ పరిస్థితిపై త్రీమెన్ కమిటీ విచారణ జరిపిందని చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.మంత్రి, ఇన్చార్జిలపై తంబళ్లపల్లె టీడీపీ నేతల ఆగ్రహం.. పోలీసుల జోక్యం -
బాలిక అదృశ్యం
నిమ్మనపల్లె : మైనర్ బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విఽష్ణునారాయణ తెలిపారు. నిమ్మనపల్లె పంచాయతీకి చెందిన మైనర్ బాలిక (16) ఈనెల 13న ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి బాలిక స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్ద ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ఏఎస్ఐ జిలానీబాషా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి ములకలచెరువు : అతిగా మద్యం తాగి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మండల కేంద్రంలో జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు... సత్యసాయి జిల్లా అమడగూరు మండలం గుండాలవారిపల్లెకు చెందిన నరసింహులు(40) కుమారులు తిరుపతిలో చదువుకుంటున్నారు. పిల్లలని చూసొస్తానని చెప్పి వారం క్రితం ఇంటి నుంచి వెళ్లాడు. అనంతరం తిరుపతి నుంచి వచ్చి ములకలచెరువులోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ తరచూ మద్యం తాగేవాడు. ఈ క్రమంలో అతిగా మద్యం తాగి కదిరి రోడ్డు షాదీమహల్ వద్ద అపస్మారకస్థితిలో పడిపోయాడు. స్థానికులు 108 సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు యత్నించిన వివాహిత.. పెద్దమండ్యం : ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ సోమవారం మృతి చెందినట్లు ఏఎస్ఐ ఇషాక్ తెలిపారు. మండలంలోని సీ గొల్లపల్లె పంచాయతీ బుసిరెడ్డిగారిపల్లెలో ఈ ఘటన జరిగింది. ఏఎస్ఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శ్రీనాథరెడ్డికి గుర్రంకొండ మండలం ఎల్లుట్ల బురుజుపల్లెకు చెందిన సుజాత (32) తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శ్రీనాథరెడ్డి మదనపల్లె మండలంలోని సీటీఎంలో ఓ వైన్‌షాపులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజులకు ఒకసారి ఇంటికి వచ్చి భార్య, బిడ్డలను చూసుకొని వెళ్లేవాడు. ఈ క్రమంలో భర్తపై భార్య సుజాత అనుమానం పెంచుకొంది. ఈ విషయమై సుజాత తనతల్లి దృష్టికి తీసుకెళ్లింది. ఆమె కుమార్తెకు సర్ది చెప్పింది. ఆయితే ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్ఐ తెలిపారు. మద్యం మానేయమంటే.. చెరువులో దూకి ఆత్మహత్య మదనపల్లె రూరల్ : ఇంట్లో పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. మద్యం మానేసి బాధ్యతగా ఉండాలని భార్య, భర్తను మందలిస్తే మనస్తాపం చెంది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. బసినికొండకు చెందిన చెంగారెడ్డి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి(44)కు భార్య రేణుక, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇంట్లోనే సమోసాలు, మిక్చర్ తయారుచేసి విక్రయించడమే కాకుండా, స్థానికంగా ఉన్న షాపులకు వేస్తూ జీవిస్తున్నారు. చంద్రశేఖర్‌రెడ్డి గత కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యాడు. మద్యం సేవిస్తున్న కారణంగా తరచూ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఈనెల 12న సాయంత్రం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. దీంతో భార్య రేణుక మందలించింది. మనస్తాపం చెందిన చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం స్థానికంగా ఉన్న నక్కలకుంట చెరువులో ఓ వ్యక్తి శవమై తేలడంతో గుర్తించిన స్థానికులు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి విచారించారు. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని మృతి చెందిన వ్యక్తి చంద్రశేఖర్‌రెడ్డి అని నిర్ధారించారు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. వీఆర్ఏలపై దాడి ఘటనపై డీఎస్పీ విచారణ గాలివీడు : విధి నిర్వహణలో ఉన్న వీఆర్ఏలపై ఉదయ్‌కుమార్ అనే యువకుడు దాడి చేసి, కులం పేరుతో దూషించాడన్న ఆరోపణల నేపథ్యంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విషయమై సోమవారం రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ విచారణ చేపట్టారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో బాధిత వీఆర్ఏలను విచారించారు. దాడి ఘటనలో ధ్వంసమైన ఫర్నిచర్‌తో పాటు చెల్లాచెదురైన ఫైళ్లను తహసీల్దార్ భాగ్యలతతో కలిసి డీఎస్పీ పరిశీలించారు. విచారణలో లక్కిరెడ్డిపల్లి సీఐ కొండారెడ్డి, స్థానిక ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు. -
అక్రమార్కులకు అధికారుల అండ!
● రైతుల అనుమతి లేకుండా పొలాల్లో వాటర్‌షెడ్ పనులు ● ఇదేమిటని ప్రశ్నించిన రైతులకు టీడీపీ నాయకుల బెదిరింపులుపెద్దతిప్పసముద్రం : ఇటు ప్రజలకు అటు రైతులకు ప్రయోజనకరమైన పనులు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటర్షెడ్కు రూ.కోట్ల నిధులు మంజూరు చేస్తున్నాయి. మంజూరైన నిధులను ఎలాగైనా ఖర్చు పెట్టేసి ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులు గ్రామ స్థాయిలో ఉండే కూటమి నాయకులతో కుమ్మకై ్క నిబంధలను తుంగలో తొక్కి ప్రజా ధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నా పట్టించుకునే నాథులే లేరని ప్రజలు విమర్శిస్తున్నారు. కూటమి నాయకులకు వాటర్‌షెడ్‌లో పని చేసే క్షేత్ర స్థాయి అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో పనుల నిషేధం ఉన్నా చెరువులు, ఏరు, కుంటలతో పాటు, రైతుల వ్యవసాయ పొలాలు ఇలా ఎక్కడబడితే అక్కడ ఇష్టారాజ్యంగా పనులు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఉదాహరణకు మండలంలోని రంగసముద్రానికి చెందిన బుడ్డోల్ల చిన్న నాగప్ప పేరిట రెండు ఎకరాల ప్రభుత్వ డీకేటీ భూమి ఉంది. నాలుగేళ్ల క్రితం రైతు మృతి చెందగా కుటుంబ సభ్యులు పంటలను సాగు చేసేవారు. జింకల బెడద అధికంగా ఉండటంతో ఈ ఏడాది చుట్టు పక్కల రైతులు ఎవరూ పంటలు సాగు చేయనందున రైతు చిన్న నాగప్ప కుటుంబీకులు కూడా భూమిని బీడుగా వదిలేశారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా రాపూరివాండ్లపల్లి పంచాయతీడి. నారాయణపల్లికి చెందిన ఓ గ్రామ స్థాయి టీడీపీ నాయకుడు ఐదు రోజుల క్రితం తమ పొలంలో అక్రమంగా ఫారంపాండ్ తవ్వేశాడని రైతు కుమారుడు నాగరాజు సోమవారం ఆవేదన వ్యక్తం చేశాడు. దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరిస్తున్నాడు.. రంగసముద్రం పంచాయతీలోని వాటర్‌షెడ్‌లో నేను కూడా కమిటీ సభ్యుడిని. కూలి పనులే మాకు జీవనాధారం. మాకు చెప్పకుండా మా పొలంలో ఫాంరంపాండ్ పని ఎందుకు చేశావని ప్రశ్నిస్తే నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అని కూటమి నాయకుడు బెదిరిస్తున్నాడు. అధికారులకు కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేశాను. వాళ్లు చొరవ చూపి గుంత పూడ్పిస్తారని అనుకుంటున్నాను. – నాగరాజు. రంగసముద్రం -
మనోహరం.. ధనుర్మాసం.!
● నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం ● మోగనున్న నెలగంట ● నెలరోజుల పాటు పల్లె సీమల్లో ఆధ్యాత్మిక సందడిరాజంపేట టౌన్ : హిందువులకు అతి పెద్ద పండుగ సంక్రాంతి. నిరుపేదలు కూడా సంక్రాంతి పండుగను ఉన్నంతలో ఘనంగా జరుపుకుంటారు. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి పల్లెసీమల్లో పెద్దపండుగ వాతావరణం కనిపిస్తుంది. తెలుగు సంస్కృతి, సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే మకర సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే గ్రామీణ ప్రాంతాలు ముస్తాబవుతాయి. కాగా మంగళవారం సాయంత్రం 5–30 గంటలకు సూర్యుడు ధనురాశిలో ప్రవేశించనున్నాడు. దీంతో మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసం ప్రారంభం కానుంది. ఈమాసం వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ మకర సంక్రాంతితో ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభం కావడాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలు నెలగంట, పండుగ నెల అని పిలుస్తారు. ఈ నెల రోజులు ఇటు పట్టణ ప్రాంతాల్లో అటు గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాస పూజలు నిర్వహించేందుకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిత్యం తిరుప్పావై పారాయణం.. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. నిత్యం తిరుప్పావై పారాయణం చేస్తూ విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరతాయని అలాగే సంపద, ఆరోగ్యం, మోక్షం లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతం ముఖ్యమైనదని పురోహితులు చెబుతున్నారు. ఈ వ్రతం సందర్భంగా నెలరోజుల పాటు రోజుకో పాశురం చొప్పున విన్నపం చేస్తారు. ఒకటి నుంచి ఐదు రోజులు నియమ నిబంధనలకు సంబంధించిన పాశురాలు, 6వ రోజు నుంచి 15వ రోజు వరకు పాశురాలలో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి సందగోపుని గృహానికి వెళ్లడం. 16, 17, 18వ రోజుల్లో పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొలపడం, 23వ రోజు పాశురంలో మంగళాశాసనం, 25, 26వ రోజుల్లో స్వామికి అలంకారాలైన ఆయుధాలను ‘పర’ అనే వాయిద్యాన్ని తమ శరణాగతిని అనుగ్రహించి, తమ సంకల్పాన్ని నేరవేర్చమని ప్రార్థిస్తారు. చివరి రోజు గోదారంగనాథుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. విశిష్టమైన ఉత్తర ద్వార దర్శనం.. ఏడాదిలో 24 ఏకాదశులు ఉన్నప్పటికి ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి ఎంతో విశిష్టమైనది. వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా మహావిష్ణువుని దర్శించే అవకాశం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి దర్శనమిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనం ద్వారా ముక్కోటి దేవతల ఆశీస్సులతో పాప విమోచనం, మోక్ష ప్రాప్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం. సాంప్రదాయాలకు నెలవు.. ధనుర్మాసం సాంప్రదాయాలకు నెలవు అనే చెప్పాలి. ఈ మాసంలో ఇంటి ముంగిట మహిళలు వేసే రంగవల్లులు, పగటి వేషం వేసే కళాకారులు, డూ డూ బసవన్నల సందడి, సాంప్రదాయ పిండి వంటలతో పల్లెసీమలు కళకళలాడుతాయి. అలాగే ఉద్యో గ, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉండే వారు, విద్యార్థులు విధిగా సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు చేరుకుంటారు. పరమపదించిన కుటుంబ స భ్యులకు దుస్తులు పెట్టుకొని పూజలు చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పండుగకు కొన్ని రోజుల ముందే మారుమూల ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతాయి. పోలీసులు కోడిపందేలను నిర్వహించకుండా ఎన్ని చర్యలు చేపట్టినా కొంత మంది కోడిపందేలు కాయడం అనాదిగా వస్తోంది. -
ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం తగదు
రాయచోటి : ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయరాదని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం రాయచోటిలోని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా విని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసాలు, ప్రేమ పేరుతో మోసాలు, ఇతర సమస్యలపై ఎస్పీ స్వయంగా విచారణ జరిపారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి చట్టపరిధిలో తక్షణ న్యాయం అందించాలని ఆదేశించారు. అభివృద్ధి పథకాల్లో ప్రజల భాగస్వామ్యంతో సత్ఫలితాలు కురబలకోట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యంతో సత్ఫలితాలు సాధ్యమని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలోని తాగునీరు, పారిశుద్ధ్యం విభాగ డైరెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. సోమవారం కురబలకోట మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆస్పీరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. విద్య, వైద్య సేవల్లో నాణ్యత పాటించాలన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. టీటీడీ పనుల అడ్డగింత ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఆవరణలో టీటీడీ ప్రారంభించిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాట్లు స్థలానికి నష్టపరిహారం చెల్లించకుండా తమ స్థలంలో పనులు జరుగుతున్నాయని పామూరు వెంకట సుబ్రమణ్యం అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ స్థలంలో వారి హద్దు వరకు కంచెను ఏర్పాటు చేసేందుకు సోమవారం సిమెంట్ స్తంభాలు కూడా నాటించారు. తమకు నష్టపరిహారం చెల్లించాకే తమ స్థలంలో ఏ పనులైనా టీటీడీ అధికారులు చేపట్టాలని ఆయన కోరుతున్నారు. -
కువైట్‌ను తాకిన రాజంపేట జిల్లా ఉద్యమ సెగ
రాజంపేట : రాజంపేట,రైల్వేకోడూరుకు చెందిన వేలాది మంది జీవనోపాధి కోసం కువైట్‌లో దేశంలో ఉన్న నేపథ్యంలో వారు కూడా జిల్లా కేంద్రంగా రాజంపేట ఉండాలనే డిమాండ్ లేవనెత్తారు. మాలియాలోని పవన్ రెస్టారెంట్లో ప్రవాసాంధ్రులు రాజంపేట మున్సిపల్ వైస్‌చైర్మన్, కాపు నేత మర్రి రవికుమార్ పదిరోజులుగా చేస్తున్న అన్నమయ్య జాయింట్ యాక్షన్ కమిటీ రిలే నిరాహారదీక్షలకు కువైట్ వైఎస్సార్సీపీ తరపున మద్దతు పలికారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఇప్పుడు రాజంపేటకు అర్హత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కువైట్ నేతలుు గోవిందు నాగరాజు, మర్రి కళ్యాణ్, నేతలు నాయని మహేష్‌రెడ్డి, మన్నూరు చంద్రరెడ్డి, లక్ష్మీప్రసాద్, రాంబాబు, నరసింహ, మహబూబ్‌బాషా, షేక్ సర్దార్, గజ్జల నరసింహారెడ్డి, యూవీ రమణారెడ్డి, నాగిరెడ్డి, చంద్రారెడ్డి, మురాతోటి మణి, అలీ తదితరులు పాల్గొన్నారు.మాలియాలో రాజంపేట, రైల్వేకోడూరు వాసుల నిరసన -
ఆడబిడ్డకు అన్యాయం చేస్తున్న టీడీపీ నాయకుడు
మదనపల్లె రూరల్ : అనుచరుడికి అండగా నిలిచి, ముస్లిం ఆడబిడ్డనైన తనకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు అన్యాయం చేస్తున్నాడని టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో జోన్–4 ఇన్చార్జి దీపక్‌రెడ్డి, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా సమక్షంలో బాధిత మహిళ జోయాఖాన్ నిలదీసింది. కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, మూడునెలలుగా తనను ఇబ్బందికి గురిచేస్తున్నారని ఆరోపించింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళితే, అధికారబలంతో పోలీసులకు ఫోన్‌చేసి అరెస్ట్ చేయనివ్వకుండా ఒత్తిడి తెస్తున్నాడని వాపోయింది. తనకు, తన బిడ్డకు ఏం జరిగినా బాధ్యత శ్రీ రామ్ చినబాబుదేనని పార్టీ పెద్దల ఎదుటే కన్నీటిపర్యంతమైంది. బాధిత మహిళ మాట్లాడుతూ...శ్రీరామ్ చినబాబు ప్రధాన అనుచరుడైన మహబూబ్‌ఖాన్ 12 ఏళ్ల క్రితం తనను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడని, తమకు తొమ్మిదేళ్ల కుమార్తె ఉందన్నారు. కొంతకాలంగా మహబూబ్‌ఖాన్ వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యాబిడ్డలను నిర్లక్ష్యం చేశాడని చెప్పింది. ఇంటికి రావడం మానేశాడని చెప్పింది. దీనిపై మీడియా ఎదుట తన గోడు చెప్పుకుంటే...తన వెనుక టీడీపీ నాయకుడు చినబాబు ఉన్నాడని, నీవల్ల ఏమి అవుతుందో చేసుకోమని బెదిరించాడంది. దీనిపై మంత్రి నారాలోకేష్‌కు ఫిర్యాదుచేస్తే ఆయన స్టేషన్లో ఫిర్యాదుచేయాల్సిందిగా సూచించారంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు భర్తను అరెస్ట్ చేయకుండా ఫోన్‌చేసి శ్రీరామ్ చినబాబు అడ్డుకుంటున్నట్లు తెలిపింది. కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి తనకు అన్యాయం చేస్తున్నాడని, పార్టీ పెద్దలు తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకుంది. తనకు, బిడ్డకు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత శ్రీరామ్ చినబాబుదేనంటూ పేర్కొంది.పార్టీ పరిశీలకుడి ఎదుటే నిలదీసిన ముస్లిం మహిళ -
అమరజీవి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
రాయచోటి : ఆంధ్ర రాష్ట్ర సాధనకోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ముఖ్య అతిథిగా హాజరై శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు నిస్వార్థ సేవకు, అసమాన త్యాగానికి చిరునామాగా నిలిచారన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆయన చూపిన పట్టుదల, నిబద్ధత మన పోలీసు విధుల్లో కూడా ప్రతిబింబించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు జీవీ రామకృష్ణ, ఎం.పెద్దయ్య, సీఐలు జి.శంకర, మల్లయ్య, ఎ.ఆదినారాయణ రెడ్డి, పలువురు ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డీపీఓ సిబ్బంది, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
షేర్ ఆటోను ఢీకొన్న లారీ
గాలివీడు : మండలంలోని ప్యారంపల్లి గ్రామ పరిధిలో గాలివీడు–కోనంపేట రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో ఆవుల శారదమ్మ (45) అనే మహిళ మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. సోమవారం ఉదయం 5.40 గంటల సమయంలో ప్యారంపల్లి మిట్ట వద్ద పరదేశిరెడ్డి మామిడి తోట సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోపనపల్లె గ్రామం, గొల్లపల్లెకు చెందిన ఆవుల శంకర్ రెడ్డి భార్య శారదమ్మ పొలాల్లో కూలి పనుల కోసం పెద్దమండ్యం మండలం కొత్తల గ్రామానికి వెళ్లేందుకు షేర్ ఆటోలో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో శివపురం వడ్డెపల్లె వైపు నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ లారీని ఆర్. శివకుమార్ నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. దీంతో షేర్ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో శారదమ్మ తలకు తీవ్ర రక్తస్రావ గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.ఆటోలో ప్రయాణిస్తున్న గాలివీటి భాగ్యమ్మ, మల్లేశ్వరి, రాజేశ్వరి తదితరులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతురాలి భర్త ఆవుల శంకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ నేత ఆవుల నాగభూషణ్‌రెడ్డి, సర్పంచ్ చెన్నకేశవరెడ్డిలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను పరామర్శించారు.మహిళ మృతి -
వరదాయిని.. జగజ్జనని
పూజలు నిర్వహిస్తున్న మఠాధిపతి వీరశివకుమారస్వామి, గీతా పారాయణంచే స్తున్న చిన్మయామిషన్ వారు బ్రహ్మంగారిమఠం : ‘వర ప్రదాయిని.. జగజ్జనని’ అంటూ భక్తులు శరణు వేడారు. ‘కొలిచే వారి కొంగు బంగారమై నిలిచే తల్లీ.. మమ్మల్ని చల్లంగా చూడు’ అంటూ భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. ఈశ్వరీదేవి మఠం జగన్మాత నామస్మరణతో మార్మోగింది. వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని శ్రీఈశ్వరీదేవి మఠంలో అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఐదో రోజైన సోమవారం పూర్వపు మఠాధిపతి వీరబ్రహ్మయ్యాచార్య స్వాముల వారి ఆరాధన నిర్వహించారు. ఉదయం ప్రభాత సేవ, అభిషేషకం, బిల్వదళార్చన, గురుపూజ విధులు చేపట్టారు. మఠాధిపతి వీరశివకుమారస్వామి, రాజేశ్వరిదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ద్వార పూజ, నైవేద్యం, మంత్ర పుష్పం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి గ్రామోత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. బ్రహ్మంగారిమఠానికి చెందిన చిన్మయామిషన్ వారి గీతాపారాయణం భక్తులను అలరించింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జగన్మాత ఈశ్వరీదేవిని దర్శించుకున్నారు. వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి, దాతలు తమిదల కోటిరెడ్డి, శిల్పా శ్రీకాంత్, కల్లూరు కేశవాచారి, కోడూరి సుబ్రహ్మణ్యాచారి, పోలు పోలేటమ్మగారి సుబ్బారెడ్డి, బాల హుస్సేన్‌రెడ్డి, యాకశిరి జయలక్షుమ్మ, నొస్సం సుబ్రహ్మణ్యాచారి, మహేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు నిర్ణయాన్ని మార్చుకోవాలి
సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగించడాన్ని ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తున్న తరుణంలో నిర్ణయం మార్చుకోవాలి. పేదలకు అత్యుత్తమ వైద్యం అందించడమే లక్ష్యంగా మా నాయకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలలను తీసుకొస్తే వాటిని ఉపయోగంలోకి తీసుకు రాకపోగా, ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూడటం దుర్మార్గం. రానున్న కాలంలో పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు కూడా దక్కే పరిిస్థితి ఉండదు. అలాగే పేదల ఆరోగ్యానికి కూడా భరోసా లభించదు. – కె.సురేష్‌బాబు, రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు -
పేదల వైద్యానికి ఇబ్బంది కలుగుతుంది
పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే వైద్య కళాశాలలో పెత్తందారులకు అప్పగించాలని చూడడం దారుణం. వీటిని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలి. వీటిని ప్రైవేటీకరిస్తే పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండదు. ప్రభుత్వం మెడలు వంచి ప్రజల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్య కళాశాలలు నడిచేలా ఇంకా ఉద్యమిస్తాం. అలాగే మద్యం అక్రమ కేసు సృష్టించిన ప్రభుత్వం వైఎస్సార్ సీపీ నేతలను వేధిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం నకిలీ మద్యం తయారీ ప్లాంట్ నిర్వహణపై సమాధానం చెప్పు లేకపోయింది. – పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎమ్మెల్యే, తంబళ్లపల్లె -
నివేదనలే.. పరిష్కారం లేదు
● ఎంతో ఆశతో కలెక్టరేట్‌కు వస్తున్న బాధితులకు జరగని న్యాయం ● చిన్నపాటి సమస్యలకు దొరకని ఫలితం ● పదేపదే వచ్చిన వారే వస్తున్న వైనం అర్జీదారుల నుంచి సమస్యలు వింటున్న కలెక్టర్ నిశాంత్ కుమార్ సమస్యలను కలెక్టర్ కార్యాలయంలో నమోదు చేయించుకుంటున్న అర్జీదారులు రాయచోటి అర్బన్/ రాయచోటి టౌన్ : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందజేసిన అర్జీలు పరిష్కారం కావడం లేదు. జిల్లాలోని మూరుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రతిసోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎన్నెన్నో కష్టాలు, మరెన్నో అవస్థలు పడి ఇక్కడికి వస్తున్నారు. తల్లికి వందనం రాలేదని, సదరం సర్టిఫికెట్ ఇవ్వలేదని, భూసమస్యలు పరిష్కరించాలిని కోరుతూ అర్జీలు సమర్పించారు. ఇదే సమస్యలపై గతంలో పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలకు సకాలంలో, నాణ్యతతో పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ● సంబేపల్లె మండలం కోట్రాళ్ల హరిజనవాడకు చెందిన వెంకటరమణ తన కుమార్తె స్వాతికి ఇంత వరకు తల్లికి వందనం నగదు అందలేదని అర్జీ ఇచ్చారు. ● రాయచోటికి చెందిన సుబ్బరామయ్య సదరం సర్టిఫికెట్ కేవలం 65శాతం మాత్రమే ఉందని ఇచ్చినట్లు కలెక్టర్ నిశాంత్‌కుమార్‌కు అర్జీ సమర్పించారు. -
అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు వెలకట్టలేనివి
రాయచోటి : అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధనకోసం అమరజీవి ఆత్మార్పణ దినోత్సవం సందర్బంగా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, రెవెన్యూ అధికారి మధుసూదన్ రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అమరజీవి చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్య వంతులను చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించేలా చేసిందన్నారు. ఆయన ప్రాణత్యాగం ఫలితంగా తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం లభించిందని తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు అసమాన త్యాగం, అహింసా మార్గంలో ఆయన చేసిన పోరాటం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఘట్టమని ఈ సందర్బంగా గుర్తు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గొప్ప త్యాగమూర్తి, భాషా ప్రయుక్త రాష్ట్రాలకోసం పోరాటం చేసిన ఆద్యుడని కొనియాడారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ -
ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. అన్ని వర్గాల నుంచి ఈ ఉద్యమానికి మద్దతు లభించింది. బినామీలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కట్టబెట్టాలన్న చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. – ఆకేపాటి అమర్నాథ్రెడి, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం చంద్రబాబు పాలన అసమర్థతకు నిదర్శనం. సామాన్యునికి సైతం మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో రాష్ట్రంలో జగనన్న 17 మెడికల్ కళాశాలలను నిర్మించ తలపెడితే కూటమి ప్రభుత్వం రాగానే వాటిని వారికి అనుకూలమైన వ్యక్తులకు పంచిపెట్టి దోచుకునే చర్యలకు కూటమి ప్రభుత్వం దిగజారడం దారుణం. – కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే, రైల్వేకోడూరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తూ తీసుకొన్న నిర్ణయం పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన మెడికల్ విద్యార్థుల పాలిట గొడ్డలి పెట్టు లాంటిది. ప్రభుత్వం ఈ నిర్ణయా న్ని వెనక్కి తీసుకునే వరకు తాము పోరాటాన్ని కొనసాగిస్తాం. – చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పీలేరు వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూ డా తీసుకురాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించడం జరిగింది.వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే వీటిని ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు. – గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
దోచుకో.. పంచుకో.. తినుకో..
సూపర్ సిక్స్ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సూపర్–3 అమలు చేస్తోందని....అది దోచుకో, పంచుకో, తినుకో మాత్రమే. ఇది తప్ప పేదలకు చేసిన మేలు ఏదీ లేదు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం, పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలలు తీసుకువస్తే.. పేద ప్రజల నోట్లో మన్నుకొట్టి పెత్తందారులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. – నిసార్ అహ్మద్. వైఎస్సార్సీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త -
ఆ రెండు మండలాలు కడప జిల్లాలోనే ఉండాలి
ఒంటిమిట్ట : సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలోనే ఉండాలని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలో జేఏసీ నిర్వహిస్తున్న 9వ రోజు రిలే నిరాహార దీక్షకు వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షడు , రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా అన్నమయ్య జిల్లాలో ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను విలీనం చేయడానికి ప్రయత్నిస్తే ప్రజల అవసరాలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి మేలు జరిగే విధంగా ఈ రెండు మండలాలను కడప జిల్లాలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనసాగించిందని గుర్తు చేశారు. నేటి కూటమి ప్రభుత్వం వారి స్వార్థ రాజకీయాల కోసం ఈ రెండు మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేసిందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి, వైఎస్సార్సీపీ ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, జేఏసీ మండల అధ్యక్షుడు భవనాసి రామదాసు, ఉపాధ్యక్షుడు పాటూరి గంగిరెడ్డి, జేఏసీ నాయకులు బాలరాజు శివరాజు, కో–ఆప్షన్ మెంబర్ షేక్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. రాయచోటి వద్దు.. కడప ముద్దు సిద్దవటం : సిద్దవటం మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. సిద్దవటం తహసీల్దార్ కార్యాలయం వద్ద జేఏసీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న ఐదో రోజు రిలే నిరాహార దీక్షలో ఆదివారం ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారు రాయచోటి వద్దు.. కడప ముద్దు అంటూ నినాదాలు చేశారు. రిలే నిరాహార దీక్షలో ఉపాధ్యాయులు డీవీఎస్ ప్రసాద్‌రెడ్డి, సుభాష్‌బాబు, ఖాదర్‌వలి, నరసింహబాబు, రమణ, ఓబయ్య, కుమార్‌రెడ్డి, లక్షుమయ్య కూర్చున్నారు. జేఏసీ నాయకులు రాజగోపాలయ్య, పాలెం నారాయణ, అయ్యవారు నాయుడు, సిద్దయ్య, పోలు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి -
చంద్రబాబు ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలి
రాజంపేట : రాజంపేటను జిల్లా చేసుకుందాం..మెడికల్ కాలేజి పెట్టిస్తా.. రాజంపేటను గొప్పనగరంగా తీర్చిదిద్దుతా అంటూ రాజంపేట ఎన్నికల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం అన్నమయ్య జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో, నందలూరు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గోపిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన 9వ రోజు నిరాహార దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నియోజకవర్గాలకే అన్నమయ్య జిల్లా పరిమితమైందని, ఇప్పుడు ఈ మూడు నియోజకవర్గాల కేంద్ర బిందువు రాజంపేట అని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలన్నారు. జిల్లా కేంద్రం చేసుకోవడానికి రాజంపేటకు అన్ని అర్హతలు ఉన్నాయనే విషయం ప్రభు త్వం గుర్తించాలన్నారు. రాజకీయాలొద్దు అని, అందరికి ఒకటే అజెండా అదే రాజంపేట జిల్లా కేంద్రం కావాలని పిలుపునిచ్చారు. అన్నమయ్య జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మర్రి రవికుమార్ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ఉద్యమిస్తే తప్పకుండా రాజంపేట జిల్లా కేంద్రంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో నందలూరు వైఎస్సార్సీపీ నేతలు గీతాల నరసింహారెడ్డి, షేక్ మహబూబ్‌బాషా, పల్లెం వెంకటేశు, దాదిరెడ్డి నరసారెడ్డి, నందలూరు శివ, చింతకాయల శంకరయ్య, గడికోట వెంకటసుబ్బారెడ్డి, సౌమిత్రి, రాజంపేట వైఎస్సార్సీపీ నేతలు వడ్డె రమణ, దండుగోపి, ఏజెఏసీ నేతలు సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి -
పుష్ప రథోత్సవం
అంగరంగ వైభవం.. ● కనుల పండువగా ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలు ● భారీగా పాల్గొన్న భక్తజనంబ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలోని శ్రీ ఈశ్వరీదేవిమఠంలో అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన ఆదివారం పుష్పరథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోకమాత పుష్పరథంపై ఆశీనులై భక్తులను ఆశీర్వదించారు. జగజ్జననికి మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి, రాజేశ్వరిదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి, ఊరేగింపు చేపట్టారు. ఉదయం గుడి ఉత్సవం కమనీయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా అనుమసముద్రం మండలం కొలను గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న, భువనేశ్వర్‌రెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ప్రగతి నృత్యాలయ కళాట్రస్ట్ బృందం ప్రదర్శించిన నృత్యం అలరించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి పాదరేణువులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆకట్టుకున్న కోలాటం ఇటుకలపాడుకు చెందిన శివపార్వతుల మహిళా కోలాట బృందం ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మఠం సిబ్బంది, అమ్మవారి శిష్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో విజయవాడకు చెందిన గుంటముక్కల వెంకటేశ్వరరావు, వైజాగ్‌కు చెందిన గోపిశెట్టి సురేంద్రనాథ్, కడపకు చెందిన మునగా బద్రినాథ్ శ్రేష్టి, ప్రకాశం జిల్లా కంభంకు చెందిన తిరువీధి లక్ష్మీరంగయ్యశ్రేష్టి, బ్రహ్మంగారిమఠం ముక్కమల్ల భాస్కర్‌రెడ్డి, వీరపు ఉమాపతి, సుంకు సురేష్‌బాబు, చెరువుపల్లి ఓంకారస్వామి, నొస్సం చంద్రశేఖరాచారి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి సన్నిధిలో.. శ్రీ ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధిని దర్శించుకుని తరించారు. అలాగే మాత గోవిందమాంబ, శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం, పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ, పోలేరమ్మ గుడి, తదితర ప్రాంతాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన అల్లాబకష్ కుమారుడు మహమ్మద్ జాఫర్(33) మదనపల్లె మండలం సీటీఎం క్రాస్‌రోడ్‌లో వెల్డింగ్‌షాపు నిర్వహిస్తున్నాడు. ఆదివారం పనులు ముగించుకుని షాపులో పనిచేసే షాబుద్దీన్ అలియాస్ బాబు (30)తో ద్విచక్రవాహనంలో మదనపల్లె నుంచి కదిరికి బయలుదేరారు. మార్గమధ్యంలో దొమ్మన్నబావి సమీపంలో కారును ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సును వెనుకవైపు నుంచి ఢీకొని కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మహమ్మద్ జాఫర్‌కు కుడికాలు విరిగి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మహమ్మద్ జాఫర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. మదనపల్లె పట్టణం పూలవీధి వెంకటరమణస్వామి ఆలయం వద్ద నివాసం ఉంటున్న భార్యాభర్తలు రాజశేఖర్(35), సరస్వతి(32) ద్విచక్రవాహనంలో బయలుదేరి నిమ్మనపల్లె రోడ్డులోని వశిష్ట స్కూల్ వద్ద నూతనంగా నిర్మించిన ఇంటి వద్దకు వెళుతుండగా, రామాచార్లపల్లె వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి, బైక్ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి ఒంటిమిట్ట : మండలంలోని సాలాబాద్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న చెరువు కట్టపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమలకు వెలుతున్న వ్యక్తిని వెనుక వైపు ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు...ఎర్రగుంట్లకు చెందిన గోవింద మాల వేసుకున్న జగదీష్(20) అనే వ్యక్తి తిరుమలకు పాదయాత్రగా వెళుతుండగా ఆదివారం రాత్రి 8:30 సమయంలో వెనుక వైపు రాజంపేట బాసింగారిపల్లికు చెందిన కత్తి వెంకటేష్(27) అనే వ్యక్తి వేగంగా ద్విచక్రవాహనం నడుపుతూ వచ్చి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇరువురికి గాయాలయ్యాయి. జగదీష్‌కి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని కడప రిమ్స్‌కు తరలించారు. స్వల్పగాయాలు అయిన వెంకటేష్‌కు ఒంటిమిట్ట పీహెచ్సీలో ప్రథమ చికిత్స అందించారు. జగదీష్ కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె రాజానగర్‌కు చెందిన నీలావతి(25) కుటుంబ సమస్యలతో ఇంటి వద్ద విషద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చిట్వేలి : ఆరుగాలం కష్టించి పండించిన పంటలు పండక, పెట్టిన పెట్టుబడులు రాక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్వేలి మండలంలో జరిగింది. ఆదివారం కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని జట్టువారిపల్లికి చెందిన ఏదోటి సుబ్బరాయుడు (48) కౌలుకు 15 ఎకరాలలో బొప్పాయి, అరటి సాగు చేస్తున్నాడు. పండించిన పంటలు పండక, పెట్టుబడి రాక అప్పుల బాధతో పొలంలో శనివారం విషపు గుళికలు మింగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన రేణిగుంట ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలుబద్వేలు అర్బన్ : పట్టణంలోని అగ్రహారం సమీపంలో గల న్యూబైపాస్ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని మడకలవారిపల్లెకు చెందిన సీనియర్ జర్నలిస్టు రఘురామిరెడ్డి, మరో వ్యక్తి కారులో న్యూబైపాస్ రోడ్డులో వెళుతుండగా అగ్రహారం సమీపంలోకి రాగానే గేదెలు అడ్డు రావడంతో వాటిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రఘురామిరెడ్డి తలకు తీవ్ర గాయాలు కాగా మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 సహాయంతో గాయపడిన వారిని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కడపకు తీసుకెళ్లారు. నిలకడగా విద్యార్థుల ఆరోగ్యంతొండూరు : తొండూరు మండలం అగడూరు పంచాయతీ పరిధిలో గల యాదవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగిన ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆదివారం పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి విలేకరుల బృందంగా వెళ్లి.. అక్కడి వైద్యులు, విద్యార్థుల తల్లిదండ్రులతో వివరాలు తెలుసుకోగా, ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారన్నారు. సోమవారం విద్యార్థులను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. -
మృత్యువులోనూ వీడని స్నేహ బంధం
దువ్వూరు : స్థానిక నల్లవంక దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గోపులాపురం గ్రామానికి చెందిన చిట్టిబోయిన పెద్ద ఎల్లయ్య (60), నేలటూరు గ్రామానికి చెందిన చాగలేటి వీరప్రతాప్‌రెడ్డి (62) ఇద్దరు స్నేహితులు. ఆదివారం వీరిద్దరు దువ్వూరుకు ఇంటి సరుకుల కోసం టీవీఎస్ ఎక్సెల్ స్కూటర్‌పై వచ్చి తిరిగి సొంత ఊర్లకు బయలుదేరారు. దువ్వూరు సమీపంలోని నల్లవంక దగ్గర ఉన్న సురేష్ గోడౌన్ వద్ద వాహనాన్ని ఆపి రోడ్డు దాటుతుండగా ప్రొద్దుటూరుకు వెళుతున్న బొలెరో వాహనం వేగంగా వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిరువురు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. చాలా ఏళ్ల నుంచి ఇద్దరు స్నేహితులుగా ఉన్నారు. పెద్ద ఎల్లయ్యకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరప్రతాప్రెడ్డికి కోవిడ్ సమయంలో భార్య చనిపోయింది. కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వీరు మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధు మిత్రులు, ఇరుగ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు.రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం -
ఉపాధ్యాయుల సమస్యలు మంత్రి లోకేష్ దృిష్టికి
● ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ● ఎస్టీయూ ఆధ్వర్యంలో మహా ర్యాలీకడప ఎడ్యుకేషన్ : పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాల వలన ఉపాధ్యాయులు బోధనకు దూరం అవుతున్నారనే విమర్శ ఎక్కువగా ఉందని ఈ విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం కడప నగరంలో ఆర్ట్స్ కాలేజ్ నుంచి జిల్లా పరిషత్తు వరకు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేలాది మంది ఉపాధ్యాయులు మహా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యారంగం, ఉపాధ్యాయల అభ్యున్నతికి ఎస్టీయూ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ అర్హత పరీక్ష పై ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేసి 2011 కంటే ముందు ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వారికి టెట్ నుంచి మినహాయింపు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకుని సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని తెలిపారు. ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యా సంవత్సరం మధ్యలో తీసుకొస్తున్న సంస్కరణల వల్ల విద్యా సంవత్సరం కుంటుపడుతోందని చెప్పారు. ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు చూస్తుంటే ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి ఉచిత విద్య నుంచి ప్రభుత్వం తప్పుకునేలా పావులు కదుపుతోందన్నారు. జీఓ 117కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన 21 జీఓను సవరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొర్రా సురేష్ బాబు, గాజుల నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం రాజు, జోసెఫ్ సుధీర్ బాబు, తిమ్మన్న, జనవిజ్ఞాన వేదిక నాయకులు విశ్వనాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నాయకుడు వలరాజు, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగమేశ్వరరెడ్డి, పాలకొండయ్య, రాష్ట్ర నాయకులు కంఘం బాలగంగిరెడ్డి, పిల్లి రమణారెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కొత్తపల్లి శీను, బండి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సేవలకు అంతరాయం
కడప అగ్రికల్చర్: చంద్రబాబు సర్కార్ సహకార ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. వారి సమస్యల పరిష్కారానికి హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చకపోవడంతో సహకార సంఘం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో రూ.లక్షల్లో లావాదేవీలు జరుగుతుంటాయి. ఉద్యోగుల ఆందోళన కారణంగా ఆయా రోజుల్లో లావాదేవీలు నిలిచిపోతుండంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 77 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 400 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముగియడంతో పలువురు రైతులు ధాన్యం డబ్బులు చేతికి రావడంతో వాటిని చెల్లించేందుకు సహకార సంఘాలకు వస్తున్నారు. ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతుంటంతో ఉసూరుమంటూ వెనుతిరిగి వెళ్లాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారంపై రుణాలు తీసుకునే రైతులకు అవస్థలు చాలా మంది రైతులు రబీ పంటల పెట్టుబడి కోసం బంగారు నగల తాకట్టుపై అధికంగా రుణాలు తీసుకుంటారు. రూ. 88 పైసల వడ్డికే సహకారం సంఘాల్లో రుణాలు ఇస్తారు.దీంతో రైతులు బంగారు తాకట్టుెపెట్టి రుణాలు పొందుతారు. కానీ ఉద్యోగులు అందుబాటులో లేకపోడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలి. 2019, 2024 పెండింగ్‌లో ఉన్న వేతన సవవరణలు చేయాలి. ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సీలింగ్ 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు.చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి. ప్రభుత్వోద్యోగుల మాదిరిగా పదవీ విరమ ణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలి. ఉద్యోగులకు రూ. 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించాలి. ప్రతి ఉద్యోగికి రూ. 20 లక్షల టర్మ్ ఇన్యూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి డీసీఈబీ ద్వారా నేరుగా రైతులకు రుణాలు ఇవ్వకుండా సహకారం సంఘాల ద్వారా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం సహకార సంఘాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్లను సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలో ఖాళీగా ఉన్న సంఘాల సీఈఓలుగా నియమించాలి. ఆందోళన కార్యక్రమాల వివరాలు.. డిసెంబర్ 16వ తేదీ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా, వినతిపత్రం సమర్పించడం. డిసెంబర్ 22 రాష్ట్రంలో ఉన్న అన్ని డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నా, వినతిపత్రం అందజేయడం. 29వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలు ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా, ఉన్నతాధికార్లకు వినతిపత్రం అందించడం. 2026 జనవరి ఽ5వ తేదీ నుంచి 26 జిల్లాలు పూర్తి అయ్యేవరకు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహాల దీక్షలు. కొనసాగుతున్న సహకార సంఘ ఉద్యోగుల ఆందోళన నిలిచిపోతున్న లావాదేవీలు అవస్థలు పడుతున్న అన్నదాతలు -
సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు.చంద్రబాబు ప్రభుత్వం వీరి గరించి పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా స్పందించాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. – జి. నారాయణరెడ్డి, ఏపీ కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు. ధర్నాను విజయవంతం చేయాలి సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జనవరి 5వ తేదీ విజయవాడ ధర్నా చౌక్ వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలి. ఉద్యోగులకిచ్చిన హామీలు అమలు చేయాల్సి ఉండగా ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు. – ఎన్.సుధీర్‌రెడ్డి, ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్బ్యాంకు జిల్లా అధ్యక్షుడు -
నందలూరుపై ఎందుకీ వివక్ష!
● మొన్న కోచ్ ఫ్యాక్టరీ.. నేడు ట్రిప్‌షెడ్ తరలింపు ● తిరుచానూరులో ఏర్పాటుకు టెండర్లు ● బీజేపీ చేతిలో మరోసారి దగాపడ్డ నందలూరు రైల్వేకేంద్రంరాజంపేట : గుత్తి–రేణిగుంట డబుల్‌లైన్ మార్గంలోని నందలూరు రైల్వే కేంద్రంపై బీజేపీ ప్రభుత్వం వివక్ష వీడలేదన్న విమర్శలు కొనసాగుతున్నాయి. నందలూరు రైల్వేకేంద్రానికి మరోసారి అన్యాయం జరిగింది. మొన్న కోచ్ ఫ్యాక్టరీ తరలించుకెళ్లారు. నేడు ట్రిప్‌షెడ్ (ఏసీ లోకో)కు సంబంధించి తిరుచానూరులో ఏర్పాటుకు రైల్వేశాఖ మొగ్గు చూపింది. టెండర్లను కూడా పిలిచింది. రైల్వేపరిశ్రమ ఏర్పాటుకు నందలూరు అనుకూలమన్నా ఇక్కడ పెట్టడానికి రైల్వేశాఖ వెనుకంజ వేస్తూనే వస్తోంది. లాలూ సభలో ప్రకటించారు.. ఒకప్పుడు రైల్వేమంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్ పార్లమెంట్లో నందలూరులో ప్రత్యామ్నాయ రైల్వేపరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో వ్యాగిన్ రిపేర్ వర్క్ షాపు, కోచ్ ఫ్యాక్టరీ, ట్రిప్ షెడ్ ఏర్పాటు లాంటి ప్రతిపాదనలు దశాబ్దాల క్రితమే తెరపైకి వచ్చాయి. అయితే వాటిని అమలు చేయడంలో నందలూరు వివక్షకు గురవుతోంది. కొత్త ట్రిప్షెడ్కు టెండర్లు.. తిరుచానూరు రైల్వేస్టేషన్ పరిధిలో కొత్త ట్రిప్‌షెడ్ ఏర్పాటుకు భారతీయ రైల్వే టెండర్లను ఆహ్వానించింది. ట్రిప్‌షెడ్ నిర్మాణం కోసం రూ.7.803955.86 కోట్లు విలువగా టెండర్ల ప్రకటన జారీ చేశారు. భారత రాష్ట్రపతి తరుపున సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీరు(గుంతకల్) టెండర్ల నోటిఫికేషన్ జారీ చేశారు. రైల్వేపరిశ్రమ ఏర్పాటుకు అనుకూలమని నివేదికలున్నా.. రైల్వేపరిశ్రమకు అవసరమయ్యే 145 ఎకరాలు, వందలాది క్వార్టర్స్, ఎంతటి కరువొచ్చినా పుష్కలంగా నీటి వనరులతోపాటు రైల్వే కార్మికుల కుటుంబాల నివాసానికి అనుకూలమైన ప్రాంతంగా నందలూరుకు పేరుంది. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతం. కాని పాకాలలో పెట్టడం కేవలం కూటమి సర్కారు కక్ష సాధింపే కారణమనే భావన జిల్లా వాసులలో వ్యక్తమవుతోంది. యూపీఏ పాలనలో.. యూపీఏ ప్రభుత్వంలో నందలూరులో ప్రత్యామ్నాయ రైల్వే పరిశ్రమకు ఆనాటి కేంద్రం అంగీకరించింది. అప్పటి మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రాజ్యసభలో ప్రకటించారు. నందలూరు రైల్వేకేంద్రంలో వ్యాగిన్ రిపేరు వర్క్‌షాప్ లేదా ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని అప్పటి కేంద్రప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో వ్యాగిన్ రిపేరు వర్క్‌షాపు, కోచ్ రీహ్యాబిటేషన్ వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తారనే దిశగా ఆశలు చిగురించాయి. కోట్ల వచ్చారు..తరలించుకెళ్లారు.. రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి నందలూరు రైల్వేకేంద్రంలో ఏర్పాటు చేయాలనుకున్న వ్యాగిన్ రిపేర్ వర్క్‌షాప్‌ను తన ప్రాంతమైన కర్నూ లుకు తరలించుకుపోయారు. ఆ విధంగా యూపీఏ పాలనలో నందలూరుకు అన్యాయం జరిగింది. మరోసారి దగా.. నందలూరు రైల్వే కేంద్రంలో రైల్వేపరిశ్రమను ఏర్పాటు చేయాలని, 250 క్వార్టర్సు ఉన్నాయని, 150 ఎకరాల స్ధలం ఉందని అనేకమార్లు రైల్వేమంత్రిత్వశాఖకు వినతులు వెళ్లాయి. క్యారేజి రిపేర్‌షాపు, ఎలక్ట్రికల్ ఇంజిన్ రిపేర్షెడ్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. అయితే ఇవేమీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రెండు దశాబ్దాల క్రితం బీజేపీ కేంద్రపెద్దలు నందలూరుకు వచ్చి అధికారంలోకి రాగానే రైల్వేపరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బీజేపీ అగ్రనేత నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురా లు పురందేశ్వరితో పాటు దేశ, రాష్ట్ర స్ధాయి నేతలు నందలూరు లోకోషెడ్‌ను చూసి వెళ్లారు. మూడవసారి ముచ్చటగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేతిలో మరోసారి నందలూరు దగాపడింది. -
రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు
కలికిరి : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురు గాయపడిన ఘటన ఆదివారం రాత్రి కలికిరి మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని మర్రికుంటపల్లి గ్రామం కొత్తదళితవాడకు చెందిన గంగయ్య స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంలో కలికిరికి వెళుతున్నాడు. కలికిరి వైపు నుంచి గడికి చెందిన షఫిక్, నాసిక్ ఇద్దరు ద్విచక్రవాహనంలో ఎదురుగా వచ్చి మర్రికుంటపల్లిరోడ్ పంచాయతీ కార్యాలయంలో సమీపంలో ఢీకొన్నారు. రోడ్డు పక్కనున్న ఝరికోన పైప్‌లైన్ లీకేజీతో నీరు రోడ్డుపై చేరింది. ఆ ప్రాంతంలో ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో ప్రమా దం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు కలికి రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏడాదికి పైగా రోడ్డుపై ఝరికోన లీకేజీ నీరు ప్రవహిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయ ని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంటిమిట్ట వద్ద చెరువులోకి దూసుకెళ్లిన కారు ఒంటిమిట్ట : ఒంటిమిట్ట మండలంలోని సాలాబాదు క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం ఒంటిమిట్ట చెరువులోకి కారు దూసుకెళ్లింది. పోలీసుల వివరాల మేరకు.. కర్నూలులోని నిర్మల్ నగర్‌కు చెందిన శ్రావణ్‌కుమార్ కుటుంబ సభ్యులు మరో ముగ్గురు కారులో తిరుమలకు వెళ్లి వస్తున్నారు. ఒంటిమిట్ట చెరువు కట్టపైకి రాగానే కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ కారుకు తుమ్మచెట్లు అడ్డుపడటంతో చెరువులో మునగలేదు. ప్రమాదం తప్పింది. -
గంగమ్మా..కాపాడవమ్మా
లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ అనంతపురం గంగమ్మ ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. గంగమ్మా..కాపాడవమ్మా అని వేడుకున్నారు. బోనాలు సమర్పించి తలనీలాలు అర్పించారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15వతేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండి దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లికి రాయచోటికి చెందిన దాతలు శ్రీనివాసులు,సూర్యకుమారి దంపతులు బంగారునెక్లెస్ బహూకరించారు. రూ. 3.84 లక్షలు విలువ చేసే 30గ్రాముల బంగారు నెక్లెస్‌ను ఆదివారం ఆలయ కమిటీ చైర్మన్ రాజన్ననాయుడు, ఈవో మంజులలకు అందజేశారు. ఈసందర్భంగా దాతలకు ఆలయ సాంప్రదాయలతో స్వాగతం పలికి అమ్మవారికి పూజలు చేయించారు. శేష వస్త్రంతో దాతలను సన్మానించారు. -
మదనపల్లెలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ
మదనపల్లె: మదనపల్లె పట్టణం అన్నమయ్య సర్కిల్లో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయి విగ్రహాన్ని ఆదివారం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఆయన హెలిక్యాప్టర్‌లో మదనపల్లె చేరుకోగానే స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. బీటీ కళాశాల మైదానం నుంచి బస్సులో పార్టీనేతలతో కలిసి చేరుకున్న సీఎం పుష్కర్‌సింగ్ ధామి..వాజ్‌పేయి విగ్రహంపై కప్పిన కాషాయ వస్త్రాన్ని తొలగించి ఆవిష్కరించి పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మదనపల్లెతో వాజ్‌పేయికి ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రి సత్యకుమార్, 20 సూత్రాల అమలు కమిటి చైర్మన్ లంకా దినకర్, శాసనమండలి డెప్యూటీ చైర్మెన్ జకియాఖానం, జిల్లా అధ్యక్షులు సాయిలోకేష్, సీనియన్ నేత చల్లపల్లె నరసింహారెడ్డి, విష్ణుకుమార్‌రెడ్డి, బర్నెపల్లె రవికుమార్, ఆకుల కృష్ణమూర్తి, పులి నరేంద్ర, ఎన్.శోభారాణి, బావాజి తదితరులు పాల్గొన్నారు.సీఎం పుష్కర్‌సింగ్ ధామి రాక సందర్భంగా బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు.ర్యాలీలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు, బీజేపీకి చెందిన వివిధ విభాగాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అటల్–మోదీ సుపరిపాలన యాత్ర పేరిట ఆదివారం మదనపల్లెలో జరిగిన వాజ్‌పేయి విగ్రహావిష్కరణ, టిప్పు సుల్తాన్ మైదానంలో జరిగిన సభకు టీడీపీ ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. సభలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, పీలేరు ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌రెడ్డి, టౌన్‌బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్‌లను వేదికపైకి ఆహ్వనించినా వారు గైర్హాజరయ్యారు. వారితోపాటు టీడీపీ శ్రేణులు ఎవరూ పాల్గొనలేదు. జనసేనకు చెందిన కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, రాయలసీమ కో–కన్వీనర్ రామదాస్ చౌదరి, మార్కెట్ కమిటి చైర్మన్ శివరాం, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో బైక్ ర్యాలీ టీడీపీ దూరం -
ఉద్యోగులను దగా చేస్తున్న ప్రభుత్వం
రాయచోటి టౌన్ : ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 12వ పీఆర్సీ, ఐఆర్, డీఏలు సకాలంలో ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం దగా చేయడమేనని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి ఆరోపించారు. ఆదివారం రాయచోటి పట్టణంలో ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (పీఎస్టీయూ)ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే సీపీఎస్ విధానాన్ని సమీక్షించి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. పీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తామని చెప్పి 10–14వ తేదీ వచ్చినా జీతాలు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పీఎస్టీయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పీసీ రెడ్డెన్న మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఇలియాస్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పురుషోత్తమరెడ్డి, రామాంజనేయరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎస్. మునిరెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు పీవీ సుబ్బారెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చెన్నుపల్లె ఓబుల్‌రెడ్డి, మైనార్టీ కన్వీనర్ లియాఱత్, ఆర్థిక కార్యదర్శి వెంకట సుబ్బయ్య, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం..శ్రీవారి కల్యాణం
రాజంపేట టౌన్ : రాజంపేట పట్టణంలోని ఏబీ చంద్రారెడ్డి గార్డెన్స్‌లో శ్రీవారి భక్తసేవా సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. తొలుత శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పూలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన వేదికపై కల్యాణ ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు.తిరుమల, తిరుపతి దేవస్థానానికి చెందిన వేదపండితులు స్వామివారి కల్యాణ క్రతువును జరిపించారు. మంగళసూత్రాన్ని పురోహితులు భక్తులకు చూపించిన సమయంలో గోవిందనామస్మరణ చేశారు. ఈ ఏడాది అంచనాలకు మించి భక్తులు కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. దీంతో చాలామంది నిల్చొని ఎల్ఈడి స్క్రీన్లలో కార్యక్రమాన్ని తిలకించారు. రాజంపేట పట్టణం నుంచే కాక వివిధ గ్రామాల నుంచి కూడా భక్తులు ప్రత్యేక వాహనాల్లో అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీవారిసేవా సమితి ప్రతినిధులు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. -
● శరీరంలోకి నేరుగా ప్రవేశించదు
● జల్లాలో పెరుగుతున్న కేసులు ● ఇప్పటికే 39 కేసులు నమోదు.. మరో ఇద్దరికి గుర్తింపు రాయచోటి : అన్నమయ్య జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆందోళన కల్గిస్తోంది. అన్నమయ్య జిల్లా పరిధిలో ఇప్పటికి 289 నమూనాలను సేకరించగా 39 మందికి పాజిటివ్ రావడంతో జిల్లా ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. రెండు రోజుల కిందట సంబేపల్లి మండలం, శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఒక విద్యార్థి, కేవీ పల్లె మండల పరిధిలో మరో వ్యక్తికి వ్యాధి నిర్ధారణ కావడంతో తిరుపతిలో చికిత్స పొందుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ కేసుల సంఖ్య అధికంగా ఉన్నట్లు సమాచారం. స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ పనులు చేసేవారు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలతోపాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అధికశాతం మందికి ఈ వ్యాధిపై అవగాహన లేదు. అధికారులు దీనిపై విస్తృతంగా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది సాధారణ జ్వరం లాంటిదైనప్పటికీ ఆలస్యం చేస్తే శరీరంలో అంతర్గత అవయవాలపై ప్రభావం చూపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు మండల పరిధిలో ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. . ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ..... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ ఆసుపత్రులు ఇదే అదనుగా భారీగా సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా సమయంలో ఇలాగే జరిగిన విషయం తెలిసిందే. సాధారణ జ్వరాన్ని స్క్రబ్ టైఫస్ అని భయాందోళనకు గురిచేస్తూ పేదల నుంచి డబ్బు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించిన ల్యాబ్, మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లక్షణాలు ఇవి.. స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటియా సుట్సుగముషి అనే సూక్ష్మక్రిమి ద్వారా వస్తుంది. ఇది చిగ్గర్స్ అనే చిన్న కీటకాల లాంటి పురుగుల ద్వారా వ్యాప్తి చెందే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా ఎలుకలు, కుందేళ్లు, ఉడతల శరీరంపై కనిపిస్తుంది. ఈ చిగ్గర్స్ కీటకాలు పొదలు, గడ్డి, వ్యవసాయ భూముల్లో నివసిస్తాయి. ఇవి కుట్టినప్పుడు ఇన్ఫెక్షన్ సోకుతుంది. స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకిన తర్వాత 5–15 రోజుల్లోపు తీవ్రమైన జ్వరం, చలి, ఒంటినొప్పులు, తలనొప్పి, అలసట, బలహీనత, మెడ, చంకల్లో వాపు గడ్డలు, శరీరంపై దద్దుర్లు వస్తాయి. అలాగే పురుగు కుట్టిన చోట ముదురు రంగుతో కూడిన పుండు ఏర్పడుతుంది. ఇలాంటి లక్షణాలుంటే స్క్రబ్ టైఫస్‌గా భావించాలని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స చేయించకపోతే శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో పాటు అవయవాల వైఫల్యం కూడా జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని, సకాలంలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే నాలుగైదు రోజుల్లోనే పూర్తిగా నయం అవుతుందని వైద్యులు తెలిపారు. నివారణ మార్గాలు ఏంటంటే.. స్క్రబ్ టైఫస్ రాకుండా ఉండాలంటే చేతులు, కాళ్లను బాగా కప్పి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టూ గడ్డి, పొదలు పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. గోరు వెచ్చని నీరు తాగడంతో పాటు సమతుల ఆహారం తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రభావం జిల్లాలో చాలా తక్కువగా ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 39 మందికి ఈ లక్షణాలు కనిపించాయి. స్క్రబ్ టైఫస్ బ్యాక్టిరియా శరీరంలోకి నేరుగా ప్రవేశించలేదు. బ్యాక్టిరియాను మోసుకెళ్లే ఈగలు, పేలు, నల్లులు కుట్టడం ద్వారా మానవుని శరీరంలోకి ప్రవేశిస్తుంది. కుట్టినచోట కొందరికి నల్లని మచ్చ ఏర్పడుతోంది. కొందరిలో మచ్చ కనిపించదు. నొప్పి ఉండదు. ఇవి కుట్టినచోట బ్యాక్టిరియా రక్తంలోకి ప్రవేశించి శరీరమంతా వ్యాపిస్తుంది. ఆరు లేదా ఏడు రోజులకు పూర్తి లక్షణాలు బయటపడతాయి. మొదట్లో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, చలి వంటి లక్షమాలు కనిపిస్తాయి. మలేరియా, టైపాయిడ్ అనే భ్రమలో ఉన్నవారు స్క్రబ్ టైఫస్ పరీక్ష చేయించుకోవాలి. – లక్ష్మీ నరసయ్య, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి -
హాస్టల్ విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి
కేవీపల్లె : హాస్టల్ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎస్సీ వెల్ఫేర్, ఎంపవర్మెంట్ అధికారి దామోదర్‌రెడ్డి అన్నారు. గ్యారంపల్లె ఎస్సీ హాస్టల్లో ఉన్న సంబేపల్లె మండలానికి చెందిన విద్యార్థి శశిధర్ నాయక్ తమ గ్రామానికి వెళ్లి స్క్రబ్ టైఫస్ వ్యాధికి గురైన నేపథ్యంలో శనివారం ఎస్సీ హాస్టల్‌ను జిల్లా అధికారులు తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ గదులు, వంటగది పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హాస్టల్లో ఉంటున్న పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీవీఎంఈ వెంకటరమణ, అసిస్టెంట్ సోషియల్ వెల్ఫేర్ అధికారి కృష్ణ, హాస్టల్ వార్డెన్ బి. లత పాల్గొన్నారు. నేడు ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం సమావేశం కడప ఎడ్యుకేషన్ : ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని అన్నమయ్య జిల్లా రాయచోటి బోస్‌నగర్‌లోని విజ్ఞానం స్కూల్లో ఆదివారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు లెక్కల జమాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి, వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పీవీ సుబ్బారెడ్డి, జి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, గౌరవాధ్యక్షులు పీసీ రెడ్డన్న, ఆర్థిక కార్యదర్శి ఎస్.ఇలియాస్‌రెడ్డి తదితరులు పాల్గొంటారని వారు పేర్కొన్నారు. విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చేయాల్సిన పోరాటాలపై చర్చించనున్నట్లు వివరించారు. సమావేశానికి ఉపాధ్యాయులందరూ హాజరు కావాలని కోరారు. -
క్రీడలతో మానసికోల్లాసం
రాయచోటి టౌన్ : క్రీడలు మానసిక ఉల్లాసానిస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శనివారం రాయచోటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాయచోటి డివిజన్ స్థాయిలోని ఆరు మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు క్రీడాపోటీలు నిర్వహించారు.క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి అభినందనలు తెలిపారు. డివిజనల్ కో ఆర్డినేటర్ వీరాంజనేయులు ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి.క్రికెట్లో సంబేపల్లె జట్టు రాయచోటిపై గెలుపొందింది. మిగిలిన మ్యాచ్‌లు ఆదివారం ఉదయం నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
వికటించిన భోజనం
తొండూరు : పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యను అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. జగనన్న ప్రభుత్వంలో నాణ్యమైన విద్యతోపాటు నాడు– నేడు కింద పాఠశాలలను పునర్నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించారు. అయితే చంద్రబాబు పాలనలో విద్యార్థులకు కనీసం కడుపు నింపేందుకు నాణ్యమైన భోజనం కూడా అందించకపోవడం సిగ్గుచేటు. వైఎస్ఆర్ జిల్లా తొండూరు మండలం అగడూరు పంచాయతీ పరిధిలోని యాదవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి యథావిధిగా శనివారం భోజనం అందించాల్సి ఉంది. మెనూ ప్రకారం అన్నం, పప్పు, రసం అందించాల్సి ఉంది. అయితే అన్నం, వంకాయ, సాంబారు, స్వీట్ పొంగలి అందించారు. వీటిని తిన్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి విరేచనాలు, వాంతులు అయ్యాయి. వారు పాఠశాలలో చదువుతుండగా ఒకేసారి వాంతులు, విరేచనాలు రావడంతో ఉపాధ్యాయురాలు భారతి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా శాఖ ఉన్నతాధికారులకు విషయం తెలియజేశారు. వారు 108 వాహనానికి ఫోన్ చేసి బాధితులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఫుడ్ పాయిజన్ కావడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. 24 గంటలు తమ పర్యవేక్షణలో ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. తోటలోని వంకాయలు తెచ్చి కడగకుండా వండారని, వాటికి పురుగు నివారణ మందు అవశేషాలు అలాగే ఉండటంతో ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పరామర్శించిన వైఎస్సార్సీపీ నాయకులు పులివెందుల ప్రభుత్వాసుపత్రికి పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్, రసూల్, జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి వెళ్లిరు. విద్యార్థులను పరామర్శించి, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న డీఈఓ షంషుద్ధీన్, ఆర్డీఓ చిన్నయ్య ప్రభుత్వాసుపత్రి వద్దకు వచ్చి విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 10 మంది విద్యార్థులకు అస్వస్థత పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలింపు అధికారులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం మెనూ ప్రకారం వడ్డించకపోవడమే కారణమని మండిపాటు పరామర్శించిన డీఈఓ, ఆర్డీఓ -
రైతుబజారులో రూ.20కు కిలో నిమ్మకాయలు
మదనపల్లె రూరల్ : పట్టణంలోని రైతుబజారులో రూ.20కు కిలో నిమ్మకాయలు విక్రయిస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం తెలిపారు. శనివారం రైతుబజారులో నిమ్మకాయల విక్రయకేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ విజయసునీత, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆదేశాల మేరకు... ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కౌంటర్లో కిలో రూ.20 చొప్పున నిమ్మకాయలు విక్రయించనున్నట్లు చెప్పారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అర్చకులు మూల విరాట్లకు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలించ్చారు. రాజంపేట : రాజంపేట కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 2087 కేసులు పరిష్కరించి కక్షిదారులకు రూ. 58,67,880లు అందే విధంగా పరిష్కారపత్రాలు అందించినట్లు మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాజంపేటలో 3 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. ఇన్ని కేసులు పరిష్కారం అయ్యేందుకు కృషి చేసిన పోలీసులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి టి కేశవ, జూనియర్ సివిల్ జడ్జి రాజన్ ఉదయ్ ప్రకాశ్, ఏపీపీ టి రామకృష్ణ, ఏజీపీ మౌనిక, బార్ ప్రెసిడెంట్ పి హనుమంత నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
రాజంపేట రూరల్ : గ్రామాలలో అంతరాయంలేని నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే తమ లక్ష్యమని విద్యుత్‌శాఖ ఎస్ఈ సత్యరాజ్కుమార్ తెలిపారు. మండల పరిధిలో బ్రాహ్మణపల్లి 220 కేవీ సబ్ స్టేషన్‌ను శనివారం ఎస్ఈ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవిలో అంతరాయంలేని విద్యుత్‌ను అందించడం కోసం బ్రాహ్మణపల్లి సబ్‌స్టేషన్‌లో ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. 220 కేవీ సింగిల్ జీబ్రా బజ్‌ను ట్విన్ మౌజ్ బజ్‌గా ఆధునీకరిస్తున్నాన్నారు. అలాగే సీకే పల్లి– రేణిగుంట 220 కేవీ వనరులను రూపాంతరం చేస్తామన్నారు. ఆకేపాడు, వత్తలూరులో 33 కేవీ ఫీడర్లు నూతనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఎస్ఈసీహెచ్ శ్రీరామచంద్రమూర్తి, ఈఈలు వెంకటేశ్వర్లు, రామిరెడ్డి, చంద్రశేఖర్, డీఈఈలు అచ్యుత్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య, సుబ్బారెడ్డి, గోవింద్, ఏఈఈలు దినేష్‌కుమార్, సురేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.విద్యుత్‌శాఖ ఎస్ఈ సత్యరాజ్కుమార్ -
హృదయాల్లో ఆధ్యాత్మికతను వెలిగించాలి
కురబలకోట : హృదయాల్లో ఆధ్యాత్మికతను వెలిగించాలని, మంచి వాళ్లు కుటుంబానికి సమాజానికి కూడా మూల ధనం లాంటి వారని హజరత్ మౌలానా కారి అహ్మద్ పేర్కొన్నారు. కురబలకోట మండలం ముదివేడులోని ముస్లిం పూర్లో ప్రజా శాంతి, శ్రేయస్సు, ఐకమత్యం కోసం జల్సా పేరుతో గ్రామస్తుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సందేశం ఇస్తూ హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారన్నారు. ఎవరు ఎవరిని మార్చలేరని ఎవరికి వారు మార్పు చెంది స్వతహాగా మారాల్సిందేనన్నారు. మనిషి హృదయం మారితే సమాజం మారుతుందన్నారు. మనిషి అసలు అందం అతని హృదయంలో ఉండే మంచితనమేనన్నారు. అల్లాహ్ ప్రేమను పొందడానికి ముందుగా అహంకారం, ద్వేషం, లోభాన్ని తొలగించుకోవాలన్నారు. చేసే సాయం, మంచి పనులు ఇతరుల జీవితాల మార్పుకు దోహదపడతాయన్నారు. మాననీయ విలువల కన్నా డబ్బు గొప్పది కాదన్నారు. నమాజ్, దువా, ఖురాన్ పఠనం మనసును పరిశుభ్రం చేస్తాయన్నారు. ఇవి దేవునికి సమీపంగా తీసుకెళతాయన్నారు. జీవన విధానంలో విశ్వాసం, నిబద్దత, నిజాయితీ, మాననీయత, మంచితనం, క్షమ, సహనంతో పాటు ఆధ్యాత్మికతను పాటించే వారిని అల్లాహ్ ఎంతగానో ఇష్టపడతారన్నారు. ఈ కార్యక్రమంతో ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. కడప– బెంగళూరు రైల్వేలైన్ ప్రతిపాదనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలికడప వైఎస్ఆర్ సర్కిల్ : ఇటీవల జరిగిన రైల్వే అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముద్దనూరు– ముదిగుబ్బ మీదుగా బెంగళూరుకు రైల్వే లైను నిర్మాణం జరపాలని చేసిన ప్రతిపాదనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కడప– బెంగళూరు రైలు మార్గంపై ఇదివరకే పెండ్లిమర్రి, రాయచోటి, మదనపల్లి మీదుగా ఒక ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. జిల్లాలో విస్తారంగా పండించే అరటి, మామిడి, చీనీ, బొప్పాయి, చామంతి పంటల ఎగుమతికి పెండ్లిమర్రి మీదుగా కడప– బెంగళూరు రైల్వే లైను నిర్మాణానికి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రణాళిక రూపొందించారన్నారు. రూ.2వేల కోట్ల అంచనా వ్యయంతో 157 కిలో మీటర్ల మేర చేపట్టాల్సిన పనులను వైఎస్సార్ మరణానంతరం అటకెక్కించారన్నారు. అనుమతులున్న పాత ప్రాజెక్టుకు రూ. 2వేల కోట్లు కేటాయిస్తే రైల్వే పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉన్నదన్నారు. కానీ ఆ దిశగా ఆలోచించకుండా కొత్త ప్రాజెక్టు ప్రతిపాదన తీసుకురావడంలోని ఆంతర్యమేమిటన్నారు. పాత ప్రాజెక్టుకు కేటాయించిన వందల కోట్ల నిధులు నిరుపయోగం కావాల్సిందేనా అని ప్రశ్నించారు. ఇలాంటి సందర్భాలలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
సమస్యల పరిష్కారంలో కొరవడిన స్పష్టత
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వంలో స్పష్టత కొరవడిందని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్ ఆరోపించారు. శనివారం కడపలోని యూటీఎఫ్ భవన్లో జరిగిన ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు కూటమి పెద్దలు ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు తమకు రావాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించడంతోపాటు 12వ పీఆర్సీని అమలు చేసి తమ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తారని ఆశించారన్నారు. అయితే పీఆర్సీ అమలు సంగతి అటుంచితే, పీఆర్సీ చైర్మన్‌ను నియమించడంలో సైతం కాలయాపన చేస్తున్నారన్నారు. పీఆర్సీ గడువు ముగిసి రెండున్నరేళ్లు కావస్తున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం తగదన్నారు. ఉద్యోగుల ఆర్థిక బకాయిలను ఆరు మాసాలలోగా రోడ్ మ్యాప్ ప్రకటించి చెల్లిస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 8500 కోట్ల రూపాయల బకాయిలను మాత్రమే చెల్లించిందని, మిగతా 25 వేల కోట్ల బకాయిల చెల్లింపునకు చర్యలు చేపట్టాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షను నిర్వహించడం తగదన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మి రాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు, జిల్లా సహాధ్యక్షుడు వై.రవికుమార్, ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు ఎస్.ఎజాస్ అహ్మద్, ఎ.శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డి.క్రిష్ణారెడ్డి, ఐక్య ఉపాధ్యాయ జిల్లా కన్వీనర్ జి.గోపీనాథ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్ -
లోకపావనీ.. పాహిమాం
● అంగరంగ వైభవంగా ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలు ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ● పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనంబ్రహ్మంగారిమఠం : దేవీ శరణం.. లోకమాతా పాహిమాం.. జగజ్జననీ రక్షమాం అంటూ భక్తులు వేడుకున్నారు. బ్రహ్మంగారిమఠం భక్తజన సంద్రంగా మారింది. శ్రీఈశ్వరీదేవి ఆరాధన గురుపూజ మహోత్సవాలు మూడు రోజులుగా కనుల పండువగా జరుగుతున్నాయి. అమ్మవారు సజీవ సమాధి నిష్ట వహించిన రోజైన శనివారం కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి మాలధారులు ఇరుముడి సమర్పించారు. పట్టు వస్త్రాలు సమర్పణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా భక్తులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. శ్రీ విశ్వకర్మ విరాట్ భవన్ నుంచి వారు ఊరేగింపుగా అమ్మ సన్నిధానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ధ్వజ స్తంభం వద్ద 108 దీపాలను వెలిగించి, 108 కొబ్బరి కాయలు కొట్టి త్వరితగతిన లోకపావని ఆలయ పునః నిర్మాణం జరగాలని ప్రార్థించారు. అలాగే శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, మాతా గోవిందమాంబకు పట్టువస్త్రాలు సమర్పించారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అంగలకుదుటి సుశీల నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షురాలు తాళబత్తుల వాసవి, ప్రధాన కార్యదర్శి లక్కోజు సుజాత, బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు భారతి తదితరులు పాల్గొన్నారు. మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి, రాజరాజేశ్వరిదేవి దంపతులు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయ ట్రస్టు బోర్డు మెంబర్ వడ్ల రాజ్యలక్ష్మి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి దువ్వూరి నరసింహాచారి, న్యాయ సలహా కమిటీ చైర్మన్ గురుప్రసాద్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పెద్దబాబు, కోనసీమ జిల్లా వైస్ ప్రెసిడెంట్ వరదసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కమనీయంగా దీక్షా బంధన అలంకరణ మధ్యాహ్నం లోకపావని దీక్షా బంధన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. అల్పాహారం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాత్రి పండ్లతో తులాభారం నిర్వహించి, వాటిని భక్తులకు పంపిణీ చేశారు. సింహ వాహనోత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. సహస్ర దీపాలంకరణ వెలుగుతో దేవస్థానం కాంతులీనింది. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ప్రగతి నృత్యాలయ కళాట్రస్ట్ బృందం ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది. గుంటూరుకు చెందిన కుమారి తిరువళ్లూరి దివ్యశరణి భాగవతారిణి హరికథా గానం అలరించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మఠం నిర్వాహకులు, అన్నదాన సత్రాల వారు వసతి సౌకర్యాలు కల్పించారు. ఆలయ ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి పర్యవేక్షణలో మఠం సిబ్బంది, అమ్మవారి శిష్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో దాతలు వొమ్మిన చిన్న ఈశ్వరయ్యశ్రేష్టి, మారంరెడ్డి రామనారాయణరెడ్డి, కడారు విశ్వనాథాచార్యులు, అంకిరెడ్డిపల్లె ఓబుల్‌రెడ్డి, కోడూరు శ్రీనివాస రావు, చెరువుపల్లి వీరయ్యస్వామి, చేవూరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాల్లో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డిని సత్కరించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రత్నకుమార్ యాదవ్, ఎంపీటీసీ మనోహరాచారి, నాయకులు భాస్కరరెడ్డి, ఉమాపతి, సుబ్బారెడ్డి, చంద్రఓబుల్‌రెడ్డి, జోగయ్య పాల్గొన్నారు. -
మొదలు పెట్టారు.. అంతలోనే ఆపేశారు
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆవరణలో గురువారం నిత్యాన్నదాన కేంద్రం తాత్కాలిక పనులు మొదలు పెట్టారు. ఎట్టకేలకు నిత్యాన్నదాన కేంద్రం పనులు ప్రారంభమయ్యాయనుకుంటే అంతలోనే ఆ పనులు ఆపేశారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం టీటీడీ సివిల్ విభాగం వారు నిత్యాన్నదాన కేంద్రానికి వేసిన జర్మన్ షెడ్డు 1500/1బి సర్వే నెంబర్లోని 19.5 సెంట్లలో వేశారు. అయితే ఆ షెడ్డు వేసిన స్థలం పామూరు వెంకటస్వామిశెట్టి(నాగిశెట్టి) పేరుతో ఉంది. 2013లో టీటీడీ ఆలయ ప్రాంగణంలోని ప్రజల స్థలాలు తీసుకునే సమయంలో పామూరు వెంకటస్వామిశెట్టి అనే వ్యక్తి స్థలంలో ఉన్న కట్టడాలను నష్ట పరిహారం అందించకుండా పడగొట్టి స్వాధీనం చేసుకున్నారని స్థలం యజమానులు చెబుతున్నారు. అనేక సార్లు రెవెన్యూ అధికారులను, టీటీడీ ఉన్నతాధికారులను కూడా ఈ విషయంపై కలిశామంటున్నారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లామని గుర్తు చేస్తున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించకుండా తమ స్థలంలో ఎలా నిత్యాన్నదాన కేంద్రానికి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తారని ఆ స్థలానికి చెందిన పామూరు వెంకటస్వామిశెట్టి మనువడు పామూరు వెంకట సుబ్రమణ్యం శుక్రవారం అక్కడ జరుగుతున్న పనులను ఆడ్డుకున్నారు. దీంతో చేసేది ఏమి లేక పనులను టీటీడీ సివిల్ విభాగం వారు తాత్కాలికంగా ఆపేశారు. దీనిపై టీటీడీ ఒంటిమిట్ట సివిల్ విభాగం ఏఈ అమర్ నాథ్ రెడ్డిని వివరణ కోరగా ఆ స్థలానికి సంబంధించి సమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. వారి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. -
రాయచోటి వద్దు.. కడప ముద్దు
సిద్దవటం : మండలంలోని భాకరాపేట చెక్‌పోస్ట్ వద్ద జేఏసీ నాయకులు శనివారం రాయచోటి వద్దు.. కడప ముద్దు అంటూ వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రజాభీష్టం మేరకే ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంగా సిద్దవటం మండలాన్ని కలపడం సహేతుకంగా లేదన్నారు. సిద్దవటం మండలం కడపలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే మాధవరం–1 గ్రామంలో మహిళా నాయకురాలు ఏకుల రాజేశ్వరిరెడ్డి, కేవీ సుబ్బయ్య, నరసింహారెడ్డి, తుర్రా ప్రతాప్, రెడ్డెయ్య రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు మహిళలు, జేఏసీ నాయకులు కడప–చైన్నె జాతీయ రహదారిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి రాజంపేట జనసేన నాయకుడు అతికారి కృష్ణ సంఘీభావం తెలిపారు. కాగా ఇదే సమయంలో తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న ఇన్చార్జి మంత్రి సవితమ్మ కారును ఆపి సిద్దవటం మండలాన్ని కడపలోనే కొనసాగించాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అనిల్‌కుమార్‌రెడ్డి, చలపాటి చంద్ర, వినోద్, నాయబ్ రసూల్, శివయ్య, వెంకట్, రవిశంకర్, డాక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కడప జిల్లానే ఆమోదయోగ్యం ఒంటిమిట్ట : సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలోనే కొనసాగించడమే అన్ని విధాలా ఆమోదయోగ్యం అని వైఎస్సార్సీపీ రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం కోదండ రామాలయం వెనుక వైపు 8వ రోజు కొనసాగిన జేఏసీ రిలే నిరాహార దీక్షలో ఆయనతో పాటు మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. పిడుగు వెంకట శేషారెడ్డి, సుంకేసుల సుబ్బరాయుడు, కో–ఆప్షన్ మెంబర్ షేక్ మహ్మద్ రఫీ, బత్తల సుబ్బనరసయ్య, పందేటి చంద్రశేఖర్ రాజు దీక్షలో కూర్చున్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మండల జేఏసీ అధ్యక్షుడు భవనాసి రామదాసు, ఉపాధ్యక్షుడు పాటూరి గంగిరెడ్డి, జేఏసీ నాయకుడు బాలరాజు శివరాజు, చంద్రసుధాకర్ రెడ్డి, గురుమోహన్ రాజు, సిరిపిరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


