కృష్ణమ్మ పరవళ్లు.. వెలిగల్లుకు జలకళ | - | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ పరవళ్లు.. వెలిగల్లుకు జలకళ

Jan 28 2026 7:08 AM | Updated on Jan 28 2026 7:08 AM

కృష్ణ

కృష్ణమ్మ పరవళ్లు.. వెలిగల్లుకు జలకళ

రాజన్న పుణ్యమే

14 ఎకరాల్లో పంట సాగు చేశా

గాలివీడు : ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన పాలనలో వ్యవసాయం, విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో కరువు పారదోలేందుకు జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టుల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే వెలిగల్లు రిజర్వాయర్‌ ప్రాజెక్టు 2008లో రూపుదిద్దుకుంది. రాయలసీమ ప్రాంతం ఎడారిగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను ఈ ప్రాంతానికి తెప్పించి పంట పొలాలు పచ్చగా ఉండాలని, రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలని వైఎస్సార్‌ సంకల్పించారు. అప్పుడు రాజశేఖరరెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత లక్ష్యాన్ని ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో హంద్రీ–నీవా పనులు పూర్తి చేశారు. తద్వారా నేడు కృష్ణా జలాలు వెలిగల్లు రిజర్వాయర్‌లోకి పరవళ్లు తొక్కుతున్నాయి. 100 క్యూసెక్కుల నీరు వెలిగల్లు ప్రాజెక్టులోకి రావడంతో 4.64 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటలు, చెక్‌ డ్యామ్‌లు దాదాపు 80 వరకు 1.37 టీఎంసీల నీటితో నింపడం జరిగింది. ప్రస్తుతం వెలిగల్లు ప్రాజెక్టులో 3.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌ కుడి ఎడమ కాలువల నుంచి 24 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. రాయచోటి–గాలివీడు ప్రాంతాలకు శుద్ధి జలాలతో తాగునీటికి వరప్రసాదంగా మారింది.

రైతుల్లో హర్షం

వెలిగల్లు ప్రాజెక్టులోకి కృష్ణా జలాలు రావడంతో రైతులు హర్షం వ్యక్త చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని గుర్తుకు చేసుకుంటూ పంట పొలాల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులు సంవత్సరానికి మూడు పంటలు వేరుశనగ, కూరగాయలు, వరి చేతికి అందుతుండటంతో.. వైఎస్సార్‌ను మరో మారు తలచుకుంటూ ఆయన జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటున్నారు. ఇప్పటికే కుడి కాలువ దాదాపు 7 నెలలు నీటితో పరవళ్లు తొక్కుతోంది.

నియోజకవర్గాల అభివృద్ధి కోసం

తండ్రి, తనయుడి కృషి

అప్పటి లక్కిరెడ్డిపల్లి, ప్రస్తుత రాయచోటి నియోజకవర్గాల అభివృద్ధి కోసం లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విశేషంగా కృషి చేశారు. వారు చేపట్టిన ప్రగతి పనులు, సంక్షేమాన్ని ప్రజలు మరవలేకపోతున్నారు. వారి హయాంలో పులివెందుల తర్వాత ఆయా నియోజకవర్గాలలో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి, తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు రాయచోటి పట్టణానికి తాగునీటిని వెలిగల్లు ప్రాజెక్టు పంపింగ్‌ ద్వారా తీసుకువచ్చారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు అయ్యేలా కృషి చేశారు. ఆయా నియోజకవర్గాలలో తాగునీరు, రోడ్డు సౌకర్యం, పక్కా గృహాలు, సీసీ రోడ్లు, విద్యుత్‌ సౌకర్యాలు, నాడు– నేడు విద్యాలయాలు, దేవాలయాలు ఇలా చెప్పుకొంటూ పోతే అంతు లేని విధంగా అభివృద్ధి చేశారు.

నీటితో కళకళలాడుతున్న వెలిగల్లు ప్రాజెక్టు

సాగులో ఉన్న పంట

సాగు, తాగునీటికి వరప్రదాయిని

వెలిగల్లు ప్రాజెక్టు

వైఎస్సార్‌ జలయజ్ఞంలో భాగంగా నిర్మాణం

జగన్‌ హయాంలో కృష్ణా జలాలు రాక

పచ్చగా కళకళలాడుతున్న పంటలు

సంవత్సరానికి మూడు పంటలు రైతులకు అందుతున్నాయంటే అది రాజన్న పుణ్యమే. ఈ ప్రాంతంలో కరువుతో అల్లాడుతున్న రైతులు మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి పుణ్యాన వెలిగల్లు నీటితో పంటలు పండించుకుంటున్నాము. – మోపురి సతీష్‌, యువ రైతు

ప్రాజెక్టు నీటిని నమ్ముకుని 14 ఎకరాల్లో పంటను సాగు చేశా. ఈ పంట సాగుకు కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమే. ఎప్పుడూ వైఎస్సార్‌ను గుండెల్లో పెట్టుకుంటాం. నియోజకవర్గ ప్రజలందరం ఆయనకు రుణపడి ఉంటాం. – ఉప్పు బాలాజీ, యువ రైతు

కృష్ణమ్మ పరవళ్లు.. వెలిగల్లుకు జలకళ 1
1/4

కృష్ణమ్మ పరవళ్లు.. వెలిగల్లుకు జలకళ

కృష్ణమ్మ పరవళ్లు.. వెలిగల్లుకు జలకళ 2
2/4

కృష్ణమ్మ పరవళ్లు.. వెలిగల్లుకు జలకళ

కృష్ణమ్మ పరవళ్లు.. వెలిగల్లుకు జలకళ 3
3/4

కృష్ణమ్మ పరవళ్లు.. వెలిగల్లుకు జలకళ

కృష్ణమ్మ పరవళ్లు.. వెలిగల్లుకు జలకళ 4
4/4

కృష్ణమ్మ పరవళ్లు.. వెలిగల్లుకు జలకళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement