ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యమొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యమొద్దు

Apr 3 2026 7:26 AM | Updated on Apr 3 2026 7:26 AM

ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యమొద్దు

కురబలకోట: వివిధ పనులపై ఆఫీసులకు వచ్చే వారి సమస్యలను సత్వరం పరిష్కరం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సూచించారు. గురువారం ఆయన కురబలకోట మండలంలోని నందిరెడ్డిగారిపల్లి సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవలు, ప్రజల వినతు లు, పరిష్కార విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ప్రతి రోజు సమయానికి విధులకు హాజరుకావాలన్నారు. ఫేసియల్‌ అటెండెన్స్‌ విధానాన్ని విధిగా అనుసరించాలన్నారు. ప్రజా సమస్యలను పెండింగ్‌లో ఉండకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ లో నమోదైన వినతులను సత్వరం పరిష్కరించాలన్నారు. తహశీల్దారు, ఎంపీడీఓ పాల్గొన్నారు.

కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement