ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి వారి నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు గురువారం స్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది.
ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీతా సమేత కోదండ రాములవారు రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు.
భజ న బృందాల చెక్క భజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. ఆత్మరథికుడు, శరీరమే రథం, బుద్ది శారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే విధులు.


