మిమ్మల్ని గెలిపించుకున్నందుకు చెప్పుతో కొట్టుకోవాలి | TDP Workers Protest In Anantapur Goes Viral Over Alleged Neglect By MLA Bandaru Shravani | Sakshi
Sakshi News home page

మిమ్మల్ని గెలిపించుకున్నందుకు చెప్పుతో కొట్టుకోవాలి

Jul 2 2026 8:38 AM | Updated on Jul 4 2026 1:17 PM

TDP Actvist Slam MLA Bandaru Sravani

అనంతపురం జిల్లా: ‘శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బండారు శ్రావణిని గెలిపించుకున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకున్నా పాపం పోదు’ అంటూ అనంతపురం జిల్లా కనంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  చెప్పుతో ఆయన తలపైన కొట్టుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో బుధవారం వైరల్‌ అయింది. ‘ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మంత్రి నారా లోకేశ్‌ వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఉదయం నన్ను అదుపులోకి  తీసుకున్నారు. 

నా సమస్యను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులుకు విన్నవించగా.. మీ ఎమ్మెల్యేకు చెబుతాను.. మాట్లాడమన్నారు. అయితే అది సాధ్యమే కావడంలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.  స్వార్థపరురాలైన ఎమ్మెల్యే, అవినీతిపరులైన వారి అమ్మ బండారు లీలావతి స్వలాభం కోసం నియోజకవర్గంలో సొంత పార్టీ వారినే వేధిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రసాద్‌  ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌ ఇవ్వమని కోరారు. అయితే వేరొకరికి ఈ పోస్ట్‌ ఇవ్వడంతో తరచూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement