‘అమిత్‌షా అయోధ్యకు ఎందుకు రాలేదు’ | AAP Arvind Kejriwal Questioned Amit Shah Over Ram Mandir Scam | Sakshi
Sakshi News home page

‘అమిత్‌షా అయోధ్యకు ఎందుకు రాలేదు’

Jul 2 2026 7:04 AM | Updated on Jul 2 2026 10:50 AM

AAP Arvind Kejriwal Questioned Amit Shah Over Ram Mandir Scam

సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం విరాళాల కుంభకోణం వ్యవహారంలో ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రంపై విరుచుకుపడ్డారు. రామాలయం ప్రారంభమై రెండున్నరేళ్లు గడుస్తున్నా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఒక్కసారి కూడా స్వామివారిని ఎందుకు దర్శించుకోలేదని ఆయన నిలదీశారు. ఓట్ల కోసం ప్రసంగాల్లో రాముడి పేరు పదేపదే జపించిన నేతలకు గుడికి వెళ్లే తీరిక లేకపోవడం విచిత్రంగా ఉందని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

బుధవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విరాళాల అవకతవకలు, సిట్‌ విచారణ తీరుపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌.. రామ మందిరం ప్రాణప్రతిష్ట జరిగి కచ్చితంగా 891 రోజులు గడిచిందని, ఈ కాలంలో అమిత్‌ షా ఒక్కసారి కూడా అయోధ్య వెళ్లలేదని కేజ్రీవాల్‌ గణాంకాలతో సహా వివరించారు. అమిత్‌ షా తన ప్రసంగాలు, ఇంటర్వ్యూలలో 42 సార్లకు పైగా రామ మందిరం గురించి మాట్లాడారని గుర్తుచేశారు. దేవుడి పేరుతో ఓట్లు అడిగేందుకు సమయం ఉంటుంది కానీ గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకునే తీరికలేదా ? అని ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement