ఒడిశా కూలీలు.. ఫేక్‌ జెన్‌జీలు! | CM Chandrababu Comments in AP Legislative Assembly | Sakshi
Sakshi News home page

ఒడిశా కూలీలు.. ఫేక్‌ జెన్‌జీలు!

Aug 18 2026 5:25 AM | Updated on Aug 18 2026 5:25 AM

CM Chandrababu Comments in AP Legislative Assembly

శాసనసభలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

మెగా డీఎస్సీలో అక్రమాలు జరగలేదు

అవినీతి జరిగిందని ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు

సాక్షి, అమరావతి: ‘మెగా డీఎస్సీ నియామకాల్లో ఎక్కడా డీవియేషన్‌ లేదు. అయినా డీఎస్సీపై ఒ­డి­శా కూలీలతో, 90 ఏళ్ల ఫేక్‌ జెన్‌జీ వ్యక్తులతో ధ­ర్నాలు చేయించారు..’ అంటూ సీఎం చంద్ర­బాబు వ్యాఖ్యలు చేశారు. నియామక ప్రక్రియ వివ­రా­ల­న్నీ పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ఉంచినా వైఎస్సార్‌­సీపీ నేతలు హిట్‌ అండ్‌ రన్‌ చర్యలతో దుష్ప్రచా­రం చేస్తున్నారని ఆరోపించారు. మెగా డీఎస్సీ ని­యా­మకాల అంశంపై శాసనసభలో సోమవారం ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ 14 డీఎస్సీ­లు జరిగితే టీడీపీ, ఎన్డీఏ హయాంలో 11 డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామ­ని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంత వరకూ అవి­నీతి జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయ­లేదని చెప్పారు. 2019–24 మధ్య 10–12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్లకు రావటం మానేశార­ని, అందుకే తల్లికి వందనం అమలు చేశామ­న్నా­రు.ఉపాధ్యాయ నియా­మకాలు చేయ­కుండా 2019–24 మధ్య పాలకులు విద్యారంగంపై డబ్బాలు కొట్టుకున్నారని విమర్శించారు. 

ఓ మాజీ ఐఏఎస్, మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు..
తొలి సంతకం చేసి మెగా డీఎస్సీతో 15,941 ఉద్యోగాలను భర్తీ చేశామని, కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారద­ర్శకంగా పూర్తి చేసి నియామకాలు పూర్తి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. టెట్, డీఎస్సీ నోటిఫి­కేషన్లు సహా హారిజాంటల్, వర్టికల్‌ రిజర్వేషన్ల ప్రక్రి­యను కట్టుదిట్టంగా చేపట్టామన్నారు. 13 సబ్జెక్టుల్లో 42 వేల ప్రశ్నల్ని ఎంపిక చేసి అత్యుత్తమ విధానంలో పరీక్ష నిర్వహించామని తెలిపారు. 154 సెంటర్లలో పరీక్షలు సీబీటీ విధానంలో చేపట్టి ఫలితాలను  పారదర్శకంగా విడుదల చేసి ప్రతిభ ప్రకారం 15,941 మందిని ఎంపిక చేసి నియామ­కాలు చేశామన్నారు. స్పోర్ట్స్‌ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలనే అమలు చేశామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఐఏఎస్‌ అధి­కారి, ఓ మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతు­న్నారని, లిటిగెంట్‌ పార్టీకి చెందిన వ్యక్తులు వందల కేసులు వేసి అడ్డంకులు సృష్టించారని, అధికా­రికంగా వివరణ ఇచ్చినా రోజుకో కుట్ర చేస్తూనే ఉన్నారని ఆరోపించారు.  ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట పబ్జీలు ఆడుకుంటున్నారని విమర్శలు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement