ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్! | Dark Secrets Movie Got Huge Response In OTT | Sakshi
Sakshi News home page

ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు ఆంథాలజీ

Aug 16 2026 4:00 PM | Updated on Aug 16 2026 4:00 PM

Dark Secrets Movie Got Huge Response In OTT

ఒకప్పుడు సినిమా అంటే థియేటర్స్‌కి వెళ్లి మాత్రమే చూసేవాళ్లు.కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఓటీటీల ద్వారా నేరుగా ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూస్తున్నారు. కొన్ని సినిమాలు అయితే నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌ అయి..మంచి విజయం సాధిస్తున్నాయి. అలా నేరుగా ఓటీటీలో విడుదలైన ఓ తెలుగు ఆంథాలజీ చిత్రం ఇప్పుడు డిజిటల్‌ తెరపై దూసుకెళ్తోంది. అదే ‘డార్క్ సీక్రెట్స్’.

అప్సరరాణి, నైనిక అనసూయ, జయశ్రీ, నీలిమ చౌదరి ప్రధాన పాత్రలల్లో నటించిన ఈ చిత్రానికి  అవినాష్ కొకటి దర్శకత్వం వహించారు. ఇటీవల అద్దె విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చి..డిజిటల్‌ తెరపై దూసుకెళ్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అద్దె విధానంలో ఉన్న టాప్‌ 10 ఇండియన్‌ సినిమాల్లో నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఈ చిత్రం ఉంది. 

వివిధ భాషల చిత్రాలతో పోటీ పడుతూ దేశవ్యాప్తంగా ఈ స్థాయికి చేరుకోవడం చిత్ర బృందానికి ప్రత్యేకమైన విజయంగా చెప్పవచ్చు. చిన్న చిత్రాలకు కూడా ఓటీటీ వేదికలు ఎంతటి అవకాశాలు కల్పిస్తున్నాయో ‘డార్క్ సీక్రెట్స్’ మరోసారి నిరూపిస్తోంది.

‘డార్క్ సీక్రెట్స్’ కథ విషయానికొస్తే.. మానవ మనస్తత్వంలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసే చిత్రమిది. ఇదొక  ఆంథాలజీ డ్రామా. సాధారణంగా కనిపించే మనుషుల జీవితాల్లో దాగి ఉన్న అసాధారణ రహస్యాలు, కోరికలు, భావోద్వేగాలు, సంబంధాల సంక్లిష్టతల చుట్టూ ఈ సినిమా కథలు తిరుగుతాయి. ప్రతి కథలో ఒక ప్రత్యేక పరిస్థితి, ఒక రహస్యం, ఆ రహస్యం బయటపడినప్పుడు జరిగే పరిణామాలను చూపించే ప్రయత్నం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement