ఇండస్ట్రీలో విషాదం.. 27 ఏళ్లకే చనిపోయిన నటి | Actress Ananya Raj Dies At 27 After Battling Health Issues For A Year, Family Confirms Peaceful Death In Sleep | Sakshi
Sakshi News home page

Ananya Raj: చిన్న వయసులోనే నటి మృతి.. కారణం ఏంటంటే?

Aug 16 2026 3:35 PM | Updated on Aug 16 2026 5:03 PM

Actress Ananya Raj No More

7 అవర్స్ టు గో, ది ఫైనల్ ఎగ్జిట్, ఘోస్ట్ లాంటి హిందీ సినిమాలతో పాటు 'తగ్గేదే లే' అనే తెలుగు మూవీలోనూ నటించిన అనన్య రాజ్(27) చనిపోయింది. గత నెల 15న ఆమె నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు ఈమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనన్య ఇన్ స్టాలో ఈ మేరకు పోస్ట్ పెట్టారు. దీంతో తోటి నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: విశ్వనాథ్ అండ్ సన్స్.. రెండో రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?)

అనన్య రాజ్ గత ఏడాది కాలంగా శారీరక, మానసిక సమస్యలతో బాధపడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ఇబ్బందులని అధిగమించేందుకు ఎంతో ధైర్యంగా పోరాడినట్లు రాసుకొచ్చారు. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నందున తమ వ్యక్తిగత గోప్యతని గౌరవించాలని అభిమానులు, మీడియాని కోరారు.

'ఈ వార్తని ఎంతో బాధతో తెలియజేస్తున్నాం. జూలై 15న తెల్లవారుజామున అనన్య కన్నుమూసింది. నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచింది. గత ఏడాది కాలంగా ఆమె శారీరక, మానసిక అసౌకర్యాలతో పోరాడింది. వాటిని అధిగమించేందుకు యోధురాలిలా పోరాడింది' అని అనన్య ఇన్ స్టాలో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement