బాలీవుడ్ ఇప్పుడు గోవిందా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన భార్య సునీత ఆరోపణలతో బీటౌన్ అంతా ఆయన వైపే చూస్తోంది. ఇటీవల సహ నటి కోమల్ రాణి స్వర్ణకర్‌తో గోవిందా ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ఈ వివాదం మొదలైంది. కూతురు వయసున్న అమ్మాయితో తిరుగుతున్నాడని ఆయన సతీమణి సునీత అహుజా విమర్శించింది. ఇలాంటి పనులు చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలని కాస్తా ఘాటుగానే కామెంట్స్ చేసింది.
తాజాగా తన భార్య చేస్తున్న కామెంట్స్‌పై నటుడు గోవిందా రియాక్ట్ అయ్యారు. మీ హద్దుల్లో మీరు ఉంటే ఇద్దరికీ మంచిదని అన్నారు. సునీత అనవసరంగా తన పనిలో జోక్యం చేసుకుంటోందని.. తనకు ప్రజల మద్దతు కోల్పోయేలా చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. నన్ను అపఖ్యాతి పాలు చేయాలని చూస్తున్నారని అన్నారు.
సాధారణ కుటుంబాల నుంచి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించే వారిని అవమానించకూడదని గోవిందా అభిప్రాయపడ్డారు. సునీతకు పలుకుబడి, అధికారం, కీర్తి, గౌరవం, సంపద అన్ని ఉన్నాయని.. కానీ అంతమాత్రాన తక్కువ ఉన్నవారిని అవమానించడం సరికాదన్నారు. దేశంలో చాలామంది స్టార్ నటులు తమకంటే తక్కువ వయస్సు ఉన్నవారితో నటించారని గోవిందా గుర్తు చేశారు. అభిమానులు నన్ను యవ్వనంగా చూడడం మీకు ఇష్టం లేనట్లుందని అన్నారు.
కొందరు కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని గోవిందా ఆరోపించారు. మీకు మళ్లీ నా మద్దతు అవసరమయ్యే సమయం వస్తుందని నేను నమ్ముతున్నానని తెలిపారు. అందుకే దయచేసి నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. నన్ను బహిరంగంగా అవమానించడం ఆపాలని కోరుతున్నా.. దయచేసి మీరు మీ హద్దులు పాటించండంటూ సునీతకు స్పష్టం చేశారు. మీ నుంచి ఇలాంటి దుర్భాష తాను ఆశించడం లేదన్నారు. ప్రజలు మిమ్మల్ని స్పూర్తిగా తీసుకునేలా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.
This is going worse between Govinda and her ex-Wife Sunita Ahuja
Earlier Sunita called out Govinda for trapping young girls of his daughter's age
Now Govinda hit out by saying:
"Many superstars worked with young girls"
"Sunita You remain in ur limits"
This Is Going UGLY
🤡 pic.twitter.com/p9JTlBFLVw— Dear Men (@Dear_Men_Life) August 15, 2026
Govinda gets emotional over his wife Sunita Ahuja’s statement. 😭💔 pic.twitter.com/aMIW8Vfg5x
— T-Celebs (@t_celebs) August 15, 2026


