OTT: ‘ఇదయమ్ మురళి’ మూవీ రివ్యూ | Idhayam Murali Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘ఇదయమ్ మురళి’ మూవీ రివ్యూ: క్లారిటీ లేని మనసు, కన్ఫ్యూజన్ లో పెట్టే కళ్ళు

Aug 15 2026 3:31 PM | Updated on Aug 15 2026 3:42 PM

Idhayam Murali Movie Review And Rating In Telugu

ప్రేమ....ప్రతి ఒక్కరికి దక్కే అపూర్వమైన, అందమైన అనుభవం. మరీ ముఖ్యంగా యువత ఈ ప్రేమ కోసం అల్లాడిపోతుంటారు. మనస్సులో ఒకరి పై ప్రేమ పుడితే చాలదు, దానిని వ్యక్తపరిచే ధైర్యం కూడా ఉండాలి. ఉరికే ఉత్సాహమున్న ఉడుకు రక్తపు వయస్సులో కన్ఫ్యూజన్ లో పెట్టే కళ్ళు ఓ వైపుంటే, క్లారిటీ లేని మనసు మరో వైపు ఈ ప్రేమ వైపే లాగుతూనే ఉంటుంది. మరి ఆ కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ యువతకు ఎలా వస్తుందో తెలియచెప్పేదే ఈ ఇదయమ్ మురళి. దాదాపు 35 ఏళ్ళ క్రితం ఓ సినిమా యూత్ ని తెగ ఆకట్టుకుంది. అదే హృదయం సినిమా. 

దానిలో కూడా కథానాయకుడు తనకు నచ్చిన అమ్మాయికి తన ప్రేమను వ్యక్తపరిచే కథే ఆ హృదయం సినిమా. ఆ సినిమాకి, అలానే ఆ సినిమా కథానాయకుడికి ఇచ్చిన సరైన ట్రిబ్యూటే ఈ ఇదయమ్ మురళి. నాటి హృదయం సినిమా కథానాయకుడు స్వర్గీయ మురళి కొడుకు అధర్వ ఈ ఇదయమ్ మురళి సినిమాలో కధానాయకుడిగా నటించడం విశేషం. స్కూల్ టైమ్ నుండి ఉద్యోగం చేరేవరకు పుట్టే ప్రేమలు ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ సినిమాలో దర్శకుడు ఆకాశ్ భాస్కరన్ కళ్ళకు కట్టినట్టు చూపించాడు. తాను రాసుకున్న కథకు తానే నిర్మాతగా వ్యవహరించి తానే దర్శకత్వం వహించిన ఈ ఇదయమ్ మురళి సినిమా ప్రేక్షకుల హృదయాల్లో పదిలింగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. అంతలా ఈ సినిమాలో ఏముందో ఓ సారి చూద్దాం.

కొంతమంది స్నేహితులు న్యూయార్క్ నగరం నుండి భారతదేశానికి వచ్చే ప్రయాణంలో తమ స్నేహితులలో ఒకరైన ఇదయం పెళ్ళి గురించి ఓ అదే విమానంలో పరిచయమైన ఓ అపరిచుతిడికి చెప్పే కథే ఈ ఇదయమ్ మురళి. తన చిన్నతనంలో తన క్లాస్ టీచర్ ని అనుకోని సంఘటనతో ఇష్టపడతాడు మురళి. ఆ పై కాలేజ్ లో మరో అమ్మాయిని, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో మరొకరిని ఇష్టపడతాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మురళి ఎవ్వరితోను తన ప్రేమను వ్యక్తపరచడు. అయితే మరి మురళి పెళ్ళి ఎవరితో అవుతుంది అన్న విషయాన్ని మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఇదయమ్ మురళి సినిమాలోనే చూడాలి. మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్.
- హరికృష్ణ ఇంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement