breaking news
Idhayam Murali
-
OTT: ‘ఇదయమ్ మురళి’ మూవీ రివ్యూ
ప్రేమ....ప్రతి ఒక్కరికి దక్కే అపూర్వమైన, అందమైన అనుభవం. మరీ ముఖ్యంగా యువత ఈ ప్రేమ కోసం అల్లాడిపోతుంటారు. మనస్సులో ఒకరి పై ప్రేమ పుడితే చాలదు, దానిని వ్యక్తపరిచే ధైర్యం కూడా ఉండాలి. ఉరికే ఉత్సాహమున్న ఉడుకు రక్తపు వయస్సులో కన్ఫ్యూజన్ లో పెట్టే కళ్ళు ఓ వైపుంటే, క్లారిటీ లేని మనసు మరో వైపు ఈ ప్రేమ వైపే లాగుతూనే ఉంటుంది. మరి ఆ కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ యువతకు ఎలా వస్తుందో తెలియచెప్పేదే ఈ ఇదయమ్ మురళి. దాదాపు 35 ఏళ్ళ క్రితం ఓ సినిమా యూత్ ని తెగ ఆకట్టుకుంది. అదే హృదయం సినిమా. దానిలో కూడా కథానాయకుడు తనకు నచ్చిన అమ్మాయికి తన ప్రేమను వ్యక్తపరిచే కథే ఆ హృదయం సినిమా. ఆ సినిమాకి, అలానే ఆ సినిమా కథానాయకుడికి ఇచ్చిన సరైన ట్రిబ్యూటే ఈ ఇదయమ్ మురళి. నాటి హృదయం సినిమా కథానాయకుడు స్వర్గీయ మురళి కొడుకు అధర్వ ఈ ఇదయమ్ మురళి సినిమాలో కధానాయకుడిగా నటించడం విశేషం. స్కూల్ టైమ్ నుండి ఉద్యోగం చేరేవరకు పుట్టే ప్రేమలు ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ సినిమాలో దర్శకుడు ఆకాశ్ భాస్కరన్ కళ్ళకు కట్టినట్టు చూపించాడు. తాను రాసుకున్న కథకు తానే నిర్మాతగా వ్యవహరించి తానే దర్శకత్వం వహించిన ఈ ఇదయమ్ మురళి సినిమా ప్రేక్షకుల హృదయాల్లో పదిలింగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. అంతలా ఈ సినిమాలో ఏముందో ఓ సారి చూద్దాం.కొంతమంది స్నేహితులు న్యూయార్క్ నగరం నుండి భారతదేశానికి వచ్చే ప్రయాణంలో తమ స్నేహితులలో ఒకరైన ఇదయం పెళ్ళి గురించి ఓ అదే విమానంలో పరిచయమైన ఓ అపరిచుతిడికి చెప్పే కథే ఈ ఇదయమ్ మురళి. తన చిన్నతనంలో తన క్లాస్ టీచర్ ని అనుకోని సంఘటనతో ఇష్టపడతాడు మురళి. ఆ పై కాలేజ్ లో మరో అమ్మాయిని, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో మరొకరిని ఇష్టపడతాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మురళి ఎవ్వరితోను తన ప్రేమను వ్యక్తపరచడు. అయితే మరి మురళి పెళ్ళి ఎవరితో అవుతుంది అన్న విషయాన్ని మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఇదయమ్ మురళి సినిమాలోనే చూడాలి. మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్.- హరికృష్ణ ఇంటూరు -
రొమాంటిక్‌గా ‘ఇదయం మురళి’
ఇదయం మురళి చిత్రం హ్యాపీగా షూటింగ్ సాగుతోందని ఆ చిత్ర హీరోయిన్ హన్సిక అంటున్నారు. అంతేకాదు. ఒరు కల్ ఒరు కన్నాడి చిత్ర సక్సస్ ఈ తాజా చిత్రంతో రిపీట్ అవుతుందనే నమ్మకాన్ని ఈ చుట్టబుగ్గల చిన్నది వ్యక్తం చేస్తోంది. కోలీవుడ్‌లో మంచి రైజింగ్‌లో ఉన్న హీరోయిన్ హన్సిక. అరణ్మణై, ఆంబళ చిత్ర విజయాలతో యమ ఖుషీగా ఉన్న హన్సిక ఈ మధ్య తన ఫొటోలతో మార్ఫింగ్ చేసిన బాత్రూమ్ సన్నివేశాలు ఇంటర్నెట్లో హల్ చల్ చేయడంతో కాస్త అప్సెట్ అయ్యారు. ఇదయం మురళి చిత్ర షూటింగ్ ఆ బాధను తొలగించి సంతోషాన్ని నింపుతోందని హన్సిక అన్నారు. ఉదయనిధి స్టాలిన్ హీరోగా పరిచయం అయిన ఒరు కల్ ఒరు కన్నాడి చిత్రంలో ఆయనతో జోడి కట్టి సక్సస్‌ను అందుకున్న భామ తాజాగా మరోసారి ఆయనతో నటిస్తున్న చిత్రం ఇదయం మురళి. ఈ చిత్రానికి అహ్మద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు జీవా, త్రిష జంటగా ఎండ్రెండ్రుం పున్నగై చిత్రం తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారన్నది గమనార్హం. ఇదయం మురళి చిత్రం రొమాంటిక్ చిత్రం అని అన్నారు. ఈ బ్యూటీ నటించిన వాలు, రోమియో జూలియట్ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం హన్సిక విజయ్ సరసన పులి చిత్రంలో నటిస్తున్నారు.


