సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి క్షమాపణ! | Govind Mohan Apologises to Supreme Court Internet Shutdown | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి క్షమాపణ!

Oct 15 2026 11:11 AM | Updated on Oct 15 2026 11:11 AM

Govind Mohan Apologises to Supreme Court Internet Shutdown

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో నిరసనల సందర్భంగా మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన వ్యవహారంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేశారు. అదే సమయంలో, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇంటర్నెట్‌ నిలిపివేత నిర్ణయం సముచితమేనని కేంద్ర ప్రభుత్వం వాదించింది.

కాగా, దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్‌ 10న జరిగిన సీజేపీ నిరసనల నేపథ్యంలో రైసినా హిల్స్‌ పరిసరాల్లో సుమారు నాలుగు కిలోమీటర్ల పరిధిలో సుమారు 12 గంటల పాటు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఈ నిర్ణయం ఢిల్లీ పోలీసుల అభ్యర్థన మేరకు తీసుకున్నామని, పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజా శాంతిని కాపాడేందుకు ఈ చర్య అవసరమైందని గోవింద్‌ మోహన్‌ కోర్టుకు వివరించారు. వై-ఫై, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను మాత్రం నిలిపివేయలేదని స్పష్టం చేశారు.

అంతకుముందు అక్టోబర్‌ 9న ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘన జరిగిందంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు అక్టోబర్‌ 11న కేంద్ర హోంశాఖ కార్యదర్శి సహా సంబంధిత అధికారులకు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గోవింద్‌ మోహన్‌ క్షమాపణలు సమర్పించారు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో, చట్టపరమైన నిబంధనలు, రక్షణ చర్యలకు లోబడి ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసేందుకు అనుమతించేలా అక్టోబర్‌ 11న ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. తనపై జారీ చేసిన ధిక్కరణ నోటీసును ఉపసంహరించాలని కూడా విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహారంలో కేంద్రం వాదనలపై న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది.

ఇదీ చదవండి: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దీప్కేకు చేదు అనుభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement