YSR
-
వర్రా రవీంద్రారెడ్డికి బెయిల్.. జైలు నుంచి విడుదల
అమరావతి: సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టైన వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు వర్రా రవీంద్రారెడ్డి శనివారం బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. మడకశిరలో వర్రా రవీంద్రా రెడ్డిపై నమోదైన కేసులో బెయిల్ వచ్చింది. దీంతో వర్రాపై నమోదైన 26 కేసుల్లోనూ వర్రాకు బెయిల్ మంజూరైనట్లయ్యింది. దీంతో వర్రా రవీంద్రా రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు.సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ అభియోగాలు మోపుతూ కూటమి ప్రభుత్వం వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం. వైఎస్సార్సీపీ మద్దతుదారు వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసింది. వర్రా రవీంద్రారెడ్డిని గత నవంబర్ లో అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. ఇలా రవీంద్రారెడ్డిపై 26 కేసులు నమోదు చేశారు. మొత్తం అన్ని కేసుల్లో ఇప్పటికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు వర్రా రవీంద్రారెడ్డి -
‘జబర్దస్త్ స్కిట్లు.. బాబు, పవన్ వెకిలి నవ్వులు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వెటకారంగా నిర్వహించారని.. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా, వెటకారంగా నిర్వహించారు అనేది ప్రజలందరూ చూశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జబర్దస్త్ కార్యక్రమంలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారంటూ దుయ్యబట్టారు.‘‘జీవితంలో ఎప్పుడు నవ్వని చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వారు. కనీస సంస్కారం లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వెకిలి నవ్వులు ఎందుకు?. కేవలం జగన్‌ను హేళన చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారా?. ఇవన్నీ మానుకుంటే చంద్రబాబుకు బాగుంటుంది. సిగ్గు లేకుండా, హుందాతనం లేకుండా ప్రవర్తించిన గ్రీష్మ అనే మహిళకు ఏ విధంగా ఎమ్మెల్సీ ఇచ్చావో స్పష్టం చేయాలి. టీడీపీలో ఎంతో మంది సీనియర్లు, నాయకులను కాదని రౌడీలకు పదవులా?’’ అంటూ సతీష్‌రెడ్డి నిలదీశారు.‘‘పులివెందుల నియోజకవర్గం నుంచి పవన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హత్య సినిమాపై ట్రోల్ చేశారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలోని సన్నివేశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అదుపులోకి తీసుకుంటారా?. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు చేస్తే పోలిసులు స్పందించడం దారుణం. టీడీపీ, జనసేన నాయకులకు సిగ్గు లేదు. వైఎస్సార్సీపీ నాయకులు హుందాతనంతో ప్రవర్తిస్తారు. సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అపహస్యం చేశారు’’అని సతీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఉగాది పురస్కారాలకు ఎంపిక
కడప అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ తరపున పోలీసు, విజిలెన్స్, ఫైర్, ఇతర విభాగాలలో పనిచేస్తు న్న పోలీసు అధికారులకు, సిబ్బందికి ‘ఉగాది’ పుర స్కారాలను ప్రకటించింది. ఈ అవార్డులను ఈ ఏడా ది నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర ఆవతరణ దినోత్సవం రోజున అందుకోనున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో వివిధ కేటగిరిలకు చెందిన వారు ‘ఉగాది పురస్కారాల’ అవా ర్డులకు ప్రకటితమైన వారి వివరాలిలా వున్నాయి. హోంశాఖ పరిధిలోని అన్ని విభాగాల వారిగా అవార్డులు వైఎస్ఆర్ జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బందికి పురస్కారాలు -
జిల్లా పేరు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా పేరు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఉన్న వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడపజిల్లాగా మార్పు చేస్తూ జీఓ ఎంఎస్ నెంబరు 99 విడుదల చేశారు. ఏపీ డిస్ట్రిక్ట్ (ఫార్మేషన్) యాక్ట్–1974 ఆర్/డబ్ల్యు రూల్–4 ఆఫ్ ఏపీ డిస్ట్రిక్ట్ (ఫార్మేషన్) రూల్స్–1984 మేరకు ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా ద్వారా కలెక్టర్ కార్యాలయానికి వచ్చాయి. ఈ మేరకు కలెక్టర్ ప్రాథమిక నోటిఫికేషన్‌ను జిల్లా గెజిట్‌లో ప్రచురించి ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను ఆహ్వానించాలని ఆదేశించారు. 30 రోజుల్లో అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించి పంపాలని సూచించారు. వైఎస్ఆర్ సేవలకు గుర్తింపుగా... వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు.సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేశారు. కడప రిమ్స్, డెంటల్ కళాశాల, యోగి వేమన విశ్వవిద్యాలయం, స్పోర్ట్స్ స్కూలు, ఐటీ కార్ల్, ట్రిపుల్ ఐటీ తదితర ఎన్నో విద్య,వైద్యాలయాలు స్థాపించారు. 2009 సెప్టెంబరు 2వ తేదిన ఆయన ప్రమాదవశాత్తు మరణించారు. ఆయన సేవలకు గుర్తింపుగా నాటి ప్రభుత్వం 2009 అక్టోబరు 5వ తేదిన కడపజిల్లా పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాగా మార్పుచేస్తూ జీఓ విడుదల చేసి అభిప్రాయాలు, అభ్యంతరాలను కోరింది. ఆ తర్వాత 2010 జులై 7వ తేది వైఎస్సార్ జిల్లాగా మార్పు చేస్తూ జీఓ ఎంఎస్ నెం. 613 జారీ చేసింది. అప్పటి నుంచి వైఎస్సార్జిల్లాగా పిలుస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పేరును తొలగించి వైఎస్సార్కడపజిల్లాగా మార్పు చేస్తూ జీఓ జారీ చేసింది. -
విజేతలకు బహుమతులు పంపిణీ
ఒంటిమిట్ట: అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఒంటిమిట్ట ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారి శ్రీకాంత్ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సాయి భారతి ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడవులు ప్రాముఖ్యత, వాటి సంరక్షణ అవసరం, అటవీ చట్టాల పాత్ర తదితర అంశాల గురించి వివరించారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ అడవులు వాతావరణ సమతుల్యతను కాపాడతాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామ తులసీ, ఎఫ్ఎస్ఓ బ్రహ్మయ్య పాల్గొన్నారు. -
మెడికల్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
కడప అర్బన్ : ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్త ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ డ్రగ్స్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో శుక్రవారం మందుల దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల పరంగా ఈ దాడులను కొనసాగిస్తున్నారు. కడప నగరంలోని జనతా మెడికల్ స్టోర్ లో విజిలెన్స్ అధికారి శ్రీనివాసరావు, డ్రగ్ ఇన్స్పెక్టర్ మాధవి ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు డాక్టర్ పర్యవేక్షణలోనే, వారి ప్రిస్కిప్షన్ల మేరకు మాత్రమే నార్కోటిక్ మందులు వినియోగించాల్సి ఉంటుందని, అయితే కొంతమంది యువత డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే మత్తు ట్యాబ్లెట్లు తీసుకొని మత్తులో జోగుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. మెడికల్ దుకాణాల్లో మత్తుమందులు ఏవైతే ఉన్నాయో, ఆ మందులను యువత కొనుగోలు చేసి సేవిస్తున్నారన్నారు.. వివిధ కాంబినేషన్లోని మందులు మానసిక రుగ్మతలు ఉన్న రోగులకు, కొన్ని రకాల జబ్బులు నయమయ్యేమందుకు మాత్రమే వీటిని వినియోగించాల్సి ఉంటుందన్నారు. కొందరు యువత డాక్టర్ అనుమతి లేకుండానే మత్తు టాబ్లెట్లు కొనుగోలు చేస్తున్నారన్నారు. వీటిని సేవించడం వల్ల యువత నేరాలకు పాల్పడుతున్నారన్నారు. కడపలో జనత మెడికల్ స్టోర్‌లో తనిఖీలు నిర్వహించామని అయితే ఇక్కడ మందులు కొనుగోలు విక్రయాలు స్టాకు వివరాలపై వ్యత్యాసం ఉందన్నారు. మెడికల్ స్టోర్స్ నిర్వాహకులకు, మెడికల్ రెప్స్కు అవగాహన కల్పిస్తున్నామన్నారు. దాడుల్లో విజిలెన్స్ సీఐ శంకర్ రెడ్డి, అగ్రికల్చర్ అధికారి బాలగంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. -
మాతా శిశు సంరక్షణే ధ్యేయం
కడప కోటిరెడ్డిసర్కిల్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) పథకం మాతా శిశు సంరక్షణ కోసం దోహదపడుతోంది. పేద, మధ్యతరగతికి చెందిన గర్భిణులకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా మారింది. ఈ పథకాన్ని మొదట 2010లో నాటి కేంద్ర ప్రభుత్వం మాతృత్వ సహయోగ్ యోజన (ఐజీఎంఎస్‌వై) పథకంగా ప్రారంభించింది. అయితే ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక 2016లో ఈ పథకాన్ని ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనగా మార్చారు. ఈ పథకం మరింత మందికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పథకాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మరిన్ని మార్పులు చేసిన తర్వాత అమలులోకి తీసుకొచ్చారు. పీఎంఎంవీవై ద్వారా అందించే నగదు ప్రోత్సాహాకాల ద్వారా గర్భిణులు, బాలింతల్లో మెరుగైన ఆరోగ్య కల్పనకు, నవజాతా శిశు సంరక్షణకు, వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. నమోదు ప్రక్రియను నిరంతరం: జిల్లాలో 13,256 మంది గర్భిణులను నమోదు చేశారు. వీరి అందిరికీ ఇప్పటివరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. గర్భిణులకు వర్తింపజేసే విధంగా నమోదు ప్రక్రియను ఆరోగ్య సిబ్బంది నిరంతరం నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో గర్భిణుల గుర్తించి వైద్యశాఖ రికార్డుల్లో పొందుపరుస్తున్నారు. దీంతోపాటు గత మూడేళ్లుగా నమోదు చేసుకుని చిన్నారుల తల్లులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. పీఎంఎంవీవై పథకానికి అర్హతలు : ● గర్భం దాల్చిన మూడు నెలల్లోపు పీఎంఎంవీవై పథకం కోసం వార్డు, గ్రామ సచివాలయంలోని వెల్నెస్ సెంటర్లో పేరు నమోదు చేసుకోవాలి. ● గర్భిణులు తప్పనిసరిగా మదర్ చైల్డ్ ప్రొటెక్షన్ (ఎంసీపీ) కార్డు కలిగి ఉండాలి. ● 19 సంవత్సరాలు నిండిన తర్వాత గర్భం దాల్చిన మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. ● పీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్లలో ప్రతినెల 9వ తేదీన నిర్వహిస్తున్న పీఎంఎంవీవై శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలి. నగదు చెల్లింపు ఇలా.. ● గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం పూర్తయ్యేలోపు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా మూడు విడతల్లో రూ. 5 వేలు చెల్లిస్తుంది. ● మొదటి విడతగా అంగన్వాడీ కేంద్రం లేదా గ్రామ సచివాలయంలో గర్భిణీగా నమోదైన వెంటనే రూ. 1000 లబ్ధిదారునికి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ● ఆరు నెలలపాటు క్రమం తప్పకుండా వైద్య పర్యవేక్షణ తీసుకున్న గర్భిణికి రెండవ విడతగా రూ. 2 వేలు అందజేస్తారు. ● ప్రసవం అయిన తర్వాత మూడవ విడతగా రూ. 2 వేలు చెల్లిస్తారు. పీఎంఎంవీవై కింద రూ. 5 వేల సాయం గర్భిణులకు మూడు విడతలుగా చెల్లింపు రెండవ కాన్పులో ఆడపిల్ల పుట్టినా పథకం వర్తింపు జిల్లా వ్యాప్తంగా 13256 మంది గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవజాతా శిశువు తల్లుల సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన పీఎంఎంవీవై పథకాన్ని గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతినెలా అర్బన్ హెల్త్ సెంటర్లలో గర్భిణులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. నిర్ణీత సమయంలో వివరాలు నమోదు చేసుకుని పథకం లబ్ధిని పొందాలి. ఇప్పటికే ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీలకు అవగాహన కల్పిస్తున్నాం. – దేవిరెడ్డి శ్రీలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ, కడప విస్తృత ప్రచారం చేస్తున్నాం పీఎంఎంవీవై పథకం ఆవశ్యకత గురించి, గర్భిణులకు కలిగే ప్రయోజనాలపై విరివిగా అవగాహన కల్పిస్తున్నాం. అర్హులందరికీ ఈ పథకం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. గర్భిణులను నమోదు చేసి ప్రతి ఒక్కరికీ ఎంసీపీ కార్డును అందజేస్తున్నాం. – సుజాత, ఏఎన్ఎం, కడప -
బెంగళూరులో ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
కడప కోటిరెడ్డిసర్కిల్ /బనశంకరి : కేఎస్ఆర్టీసీ బస్ డ్రైవరు రాంగ్ రూట్లో వచ్చి ఏపీఎస్ఆర్టీసీ బస్ డ్రైవరుపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులోని ఉప్పారపేటె పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కెంపేగౌడ బస్టాండు టెర్మినల్ –3లో గురువారం రాత్రి 10.30 సమయంలో మైసూరు రోడ్డు డిపో–6 కు చెందిన కేఎస్ఆర్టీసీ బస్ డ్రైవరు హనుమంతు చలవాది బస్‌ను డిపోలోకి రాంగ్రూట్లో తీసుకెళ్లాడు. డిపోలో పార్కింగ్ స్థలంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రొద్దుటూరు డిపో బస్ ఉండటంతో పక్కకు తీయమని తెలిపారు. ఆ సమయంలో కేఎస్ఆర్టీసీ డ్రైవరు హనుమంతు చలవాది, ప్రొద్దుటూరు డిపో డ్రైవరు నరాల రవిశంకర్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన కేఎస్ఆర్టీసీ డ్రైవరు హనుమంతు చలవాది, నరాల రవిశంకర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని తక్షణం మల్లిగె ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఉప్పారపేటె పోలీస్ స్టేషన్లో డ్రైవరు నరాల రవిశంకర్‌రెడ్డి కేఎస్ఆర్టీసీ డ్రైవరు హనుమంతు చలవాదిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు కేఎస్ఆర్టీసీ డ్రైవరు కమ్ కండక్టర్ హనుమంతు చలవాదిని సస్పెండ్ చేశారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే శుక్రవారం ఆర్టీసీ రీజనల్ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పూల నాగరాజు దాడికి గురైన డ్రైవరు నరాల రవిశంకర్‌రెడ్డిని ఆసుపత్రిలో పరామర్శించారు. ఆస్పత్రి వైద్యం ఖర్చులను ఏపీఎస్ఆర్టీసీ భరిస్తుందని హామీ ఇచ్చారు. బాధిత డ్రైవర్‌ను అన్ని విధాల ఆదుకుంటాం బెంగుళూరు బస్టాండు పాయింట్లో జరిగిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రొద్దుటూరు డిపో డ్రైవర్ ఎన్ఆర్ఎస్ రెడ్డిని అన్ని విధాల ఆదుకుంటామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని మీడియాకు వివరించారు. బెంగుళూరులో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్‌ను అలెర్ట్ చేసి బాధిత డ్రైవర్‌కు అండగా నిలబడాలని సూచించామన్నారు. ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు మాట్లాడుతూ బెంగుళూరుకు వెళ్లి సమగ్రంగా విషయాలు తెలుసుకున్నారన్నారు. బాధిత డ్రైవర్‌కు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కడప ఈడీకి సూచించినట్లు వివరించారు. అంతేకాకుండా బాధిత డ్రైవర్ వైద్యానికి సంబంధించి మొత్తం ఖర్చును ఆర్టీసీ సంస్థ భరిస్తుందని ఆర్ఎం తెలియజేశారు. కర్ణాటక డ్రైవర్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తామని తెలిపారు. రాష్ట్రాలు వేరైరా అందరూ సోదరభావంతో మెలగాలని ఆయన డ్రైవర్లకు పిలుపునిచ్చారు. -
కలెక్టర్ కార్యాలయానికి బాంబు బెదిరింపు!
మాక్ డ్రిల్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది రాయచోటి: కలెక్టర్ కార్యాలయాన్ని బాంబులతో పేల్చేస్తున్నట్లు దుండగుల నుంచి ఫోన్ సమాచారం అందింది. వెంటనే విషయాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియపరిచారు. సమాచారం అందగానే జిల్లా బాంబు స్క్వాడ్, డాగ్స్ స్క్వాడ్లు కలెక్టర్ కార్యాలయంలో అణువణువు గాలింపు చేశాయి. కార్యాలయ సిబ్బంది అంతా ఒక్క మారుగా ఉలికిపాటుకు గురయ్యారు. తీరా ఇదంతా జిల్లా పోలీస్ యంత్రాంగం మాక్ డ్రిల్‌లో భాగమని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయానికి వస్తే శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో బాంబు బెదిరింపు వచ్చినపుడు ఎలా స్పందించాలనే దానిపై పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉద్యోగుల అప్రమత్తత కోసం..... ఉద్యోగులను అప్రమత్తం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇవ్వడమే మాక్ డ్రిల్ ఉద్దేశమని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బాంబు బెదిరింపు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో రాయచోటి పట్టణ సీఐ చలపతి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వీజే రామకృష్ణ, సీఐలు, ఎస్ఐలు,ఆర్ఎస్ఐలు, ఏఆర్ పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. -
● ముచ్చుమర్రి లిఫ్ట్, మైలవరం నుంచి నీరివ్వాలని డిమాండ్
మైదుకూరు, చాపాడు ఛానల్స్‌కు తెలుగుగంగలో భాగమైన వెలుగోడు రిజర్వాయర్ నుంచి సాగునీరు అందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. వెలుగోడులో 4.4 టీఎంసీల నీరు మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ అర టీఎంసీ నీటిని మళ్లిస్తే సరిపోతుందని రైతులు అంటున్నారు. శ్రీశైలం వెనుక జలాల్లో ఏర్పాటు చేసినా ముచ్చు మర్రి లిఫ్ట్ నుంచి 750 క్యూసెక్కులు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నా సరిపోతుందంటున్నారు. అయితే ముచ్చుమర్రి నుంచి లిఫ్ట్ ద్వారా ఇస్తున్న నీరు నంద్యాల జిల్లా చివరి ఆయకట్టు ప్రాంతమైన ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, దొర్నిపాడు, చాగలమర్రి ప్రాంతాలకే సరిపోతుందని అధికారులు అంటున్నా రు. పైగా కుందూ నీటిని మోటార్ల ద్వారా ఎగువ ప్రా ంతరైతులు మళ్లించుకునే అవకాశాలు ఉన్నాయని అధికారుల అభిప్రాయం. ఇకపోతే కడప, చెన్నూరు ఆయకట్టుకు మైలవరం నీటిని ఆదినిమ్మాయపల్లె ఆ నకట్ట ద్వారా అందించాలని రైతులు కోరుతున్నారు. -
సమర్థవంతమైన పౌరసేవలే ‘మిషన్ కర్మయోగి’ లక్ష్యం
– జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు కడప సెవెన్‌రోడ్స్ : భారతీయ నైతికతలో సమర్థవంతమైన పౌర సేవను సృష్టించే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగులు ఓర్పు, నేర్పుతో ఉద్యోగ విధులు నిర్వహించే లక్ష్యంతో ‘మిషన్ కర్మయోగి’ ఆన్లైన్ అభ్యాస వేదికను ప్రభుత్వం అమలు చేస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సభాభవన్‌లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ‘కర్మయోగి పోర్టల్’ నిర్వహణపై అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ఒకరోజు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఆర్వో విశ్వేశ్వర నాయుడు తోపాటు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి హజరతయ్య హాజరై పోర్టల్ నిర్వహణపై పీపీటీ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. డీఆర్వో మాట్లాడుతూ.. మిషన్ కర్మయోగి – నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ (ఎన్పీసీఎస్సీబీ) సివిల్ సర్వీస్ అధికారులకు కర్మయోగి భారత్ పోర్టల్‌ను భారత ప్రభుత్వం అందిస్తుందన్నారు. మిషన్ కర్మయోగి న్యూ ఇండియా దార్శనికతకు అనుగుణంగా సరైన వైఖరి, నైపుణ్యాలు మరియు జ్ఞానంతో కూడిన భవిష్యత్తు నిర్మాణం కోసం పౌర సేవను నిర్మించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాంక్షిస్తున్నాయన్నారు. అధికారుల భవిష్యత్తును పటిష్టం చేసి దిశగా.. నిరంతరం ఎప్పుడైనా–ఎక్కడైనా నేర్చుకునేలా బలమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా పౌర సేవల సామర్థ్య నిర్మానాత్మక వ్యూహంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. కర్మయోగి భారత్ దార్శనికత, భారత పౌర సేవల సామర్థ్య నిర్మాణ దృశ్యాన్ని మార్చడం, తద్వారా అధికారులు భవిష్యత్తులో సిద్ధంగా ఉండటానికి, ఎప్పుడైనా–ఎక్కడైనా నిరంతర అభ్యాసాన్ని అనుమతించే బలమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.కర్మయోగి పోర్టల్‌ను ప్రతి ఉద్యోగి, అధికారి సీఎఫ్ఎంఎస్ లింక్ చేయబడిన మొబైల్ నంబర్ని ఉపయోగించి లాగిన్ చేసుకోవాలన్నారు. మిషన్ కర్మయోగి ప్రభుత్వం–పౌరుల మధ్య పరస్పర చర్యను పెంపొందించడం, అధికారులు పౌరులకు మరియు వ్యాపారానికి సహాయకులుగా మారడం, ప్రవర్తనా–కార్యాచరణ–డొమైన్ సామర్థ్యాల అభివృద్ధి ద్వారా జీవన సౌలభ్యం మరియు వ్యాపార సౌలభ్యానికి దారితీస్తుంది. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ హరనాథ్, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పర్యటన రద్దు
రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరులో ఈనెల 23వ తేదీన జరగాల్సిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. మళ్లీ పర్యటన ఎప్పుడు ఉంటుందో త్వరలో తెలియజేస్తామన్నారు. హుండీ ఆదాయం లెక్కింపు ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం ఆలయ టీటీడీ అధికారులు లెక్కించారు.నెలరోజులకు రూ.4,55,140 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రశాంతంగా పది పరీక్ష కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 161 సెంటర్స్‌లో రెగ్యులర్‌కు సంబంధించి 27924 మంది విద్యార్థులకుగాను 27786 మంది హాజరుకాగా 138 మంది గైర్హాజయ్యారు. అలాగే ప్రైవేటు విద్యార్థులకు 13 మందికిగాను 10 మంది హాజరుకాగా ముగ్గురు గైర్హారయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ మూడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా 13 మంది ప్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 90 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఏకగ్రీవ ఎన్నికరాజంపేట: రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది పచ్చా హనుమంతునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు ఎన్నికల సీఈవో సురేష్‌కుమార్, సహాయ ఎన్నికల అధికారి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం ధ్రు వీకరణపత్రాన్ని అందచేశారు. బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శిగా జాఫర్‌బాషా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో బార్అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కొండూరు శరత్‌కుమార్‌రాజు, న్యాయవాదులు నాసరుద్దీన్, గడికోట రామచంద్రయ్య, రామచంద్రరాజు, నలికిరిరెడ్డయ్య పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వ విద్యాలయాన్ని అందరి సహకారంతో అత్యున్నత విద్యాసంస్థగా తీర్చిదిద్దుతామని ఆచార్య ఆల్లం శ్రీనివాసులు పేర్కొన్నారు. నెల్లూరు విక్రం సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేస్తున్న ఆయన వైవీయూ ఇన్ఛార్జీ వీసీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఆచార్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులతో భేటీ అయ్యారు. డ్రైవర్లతోనే సంస్థ పురోభివృద్ధి కడప కోటిరెడ్డిసర్కిల్: డ్రైవర్ల కారణంగానే ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ పురోభివృద్ధిలో పయనించగలదని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక డీపీటీఓ కార్యాలయంలో ప్రమాదాలు చేసిన డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. తొలుత ఓం శాంతి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంకు చెందిన అక్కయ్యలు మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం ప్రక్రియలు నిర్వహించారు. ఈ సందర్బంగా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీకి ప్రమాద రహిత సంస్థగా గుర్తింపు ఉందన్నారు. ఆ గుర్తింపును అలాగే కొనసాగించేందుకు డ్రైవర్లు ప్రధానపాత్ర పోషించాలన్నారు. ప్రయాణీకులను క్షేమకరంగా సకాలంలో గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉందన్నారు. అనంతరం కడప డిపో మేనేజర్ డిల్లీశ్వరరావు డ్రైవర్లకు సేఫ్టీ డ్రైవింగ్ పై సూచనలు సలహాలు ఇచ్చారు. అలాగే బ్లాక్ స్పాట్ పై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. -
ఏప్రిల్ 15 వరకు నీరివ్వాలి
ప్రాజెక్టు కమిటీ హామీ మేరకే కేసీ ఆయకట్టు రైతులు పంటలు సాగు చేశారు. ఈ పంటలు కాపాడటం కోసం ఏప్రిల్ 15 వరకు నీరివ్వాల్సిన అవసరం ఉంది. కుందూలో నీటి ప్రవాహం ఉంటేనే తాము ఇవ్వగలమంటూ ప్రభుత్వ అధికారులు చెప్పడం తగదు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఈ దుస్థితికి కారణం. ముచ్చుమర్రి లిఫ్ట్ లేదా వెలుగోడు నుంచి నీటి విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – అచ్చుకట్ల కరీముల్లా, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు, ఖాజీపేట మైలవరం నుంచి నీరివ్వాలి కడప–చెన్నూరు ప్రాంత కేసీ కెనాల్ ఆయకట్టులో సాగు చేసిన పంటలను రక్షించేందుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మైలవరం రిజర్వాయర్‌లో అవసరమైన నీటి లభ్యత ఉంది. అక్కడి నుంచి పెన్నా ద్వారా నీటిని ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వరకు తీసుకొచ్చి కేసీ ఆయకట్టుకు ఇవ్వాలి. ఈ విషయాన్ని తాము కేసీ కెనాల్ అధికారులను కోరగా, మైలవరం తమ పరిధిలో లేదని, కడప చీఫ్ ఇంజనీరు పరిధిలో వస్తుందంటున్నారు. ఈ విషయంలో కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని కడప చీఫ్ ఇంజనీరుతో మాట్లాడి మైలవరం నుంచి నీరు విడుదల చేయాలి. – ఎన్.రవిశంకర్‌రెడ్డి, కార్యదర్శి, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ, కడప -
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
కడప అర్బన్: జిల్లా వ్యాప్తంగా నర్సరీలలోనూ, రైతుల పొలాలలోనూ అటవీజాతి మొక్కలను పెంచి సంపదను మరింత అభివృద్ధి చేస్తామని జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్‌కుమార్ అన్నారు. కడపలోని డీఎఫ్ఓ కార్యాలయంలో శుక్రవారం (మార్చి21)ను నేషనల్ ఫారెస్ట్ డే సందర్భంగా వినీత్ కుమార్ మాట్లాడారు. మొక్కలను నాటడమే కాదు, వాటిని నాటిన తర్వాత ఎదుగుదల గమనించడం ముఖ్యమన్నారు. అడవులను కాపాడడానికి అందరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలోని నగరవనాలు, ఎకో పార్కుల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని ఆయన వివరించారు. కడప నగరవనాన్ని రూ. 2 కోట్ల వ్యయంతో.. ప్రొద్దుటూరులో ఎకోపార్క్‌ను రూ. 84 లక్షలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. గండికోట– మైలవరం మధ్యలో వున్న పొన్నతోటలో నగరవనం ఏర్పాటు చేయనున్నామన్నారు. బద్వేల్ పరిధిలో సెంచురీ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీ సమీపంలో మరో నగరవనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకుముందు ‘కడప నేటివ్ ఫారెస్ట్ రెస్టోరేషన్ ప్రాజెక్ట్’పోస్టర్‘ ఇతర అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు సబ్ డీఎఫ్ఓ దివాకర్, బద్వేల్ సబ్ డీఎఫ్ఓ స్వామి వివేకానంద, కడప ఎఫ్ఆర్ఓ ప్రసాద్, పోరుమామిళ్ల ఎఫ్ఆర్ఓ రఘునాథ రెడ్డి , ప్రొద్దుటూరు ఎఫ్ఆర్ఓ హేమాంజలి ఇతర అటవీ అధికారులు పాల్గొన్నారు. ఆదేశాలు రాలేదు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాశినాయన క్షేత్రం పునరుద్ధరణ ఆదేశాలు ఇంకా రాలేదని ఓ ప్రశ్నకు డీఎఫ్ఓ సమాధానమిచ్చారు. కాశినాయన క్షేత్రం పరిధిలో రిజర్వ్ఫారెస్ట్కు సంబంధించి నిబంధనలను అమలుచేసేందుకు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్, కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకే జిల్లా అటవీశాఖ తరఫున చర్యలను మొదలుపెట్టామన్నారు. బస్సులను నిలిపివేయడం, పలుమార్లు కాశినాయన క్షేత్ర ప్రతినిధులు, సిబ్బందితో సంప్రదించామన్నారు. ఇటీవల భవనాల కూల్చివేత తరువాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు పునరుద్ధరణకు సంబంధించిన లిఖిత పూర్వకమైన ఆదేశాలు తమ శాఖకు అందలేదని వివరించారు. జిల్లాలో నగరవనం, ఎకో పార్క్‌ల అభివృద్ధికి కృషి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాశినాయన క్షేత్రం పునరుద్ధరణ ఆదేశాలు ఇంకా రాలేదు విలేకరుల సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి వినీత్‌కుమార్ -
పంటలు కాపాడండి సారూ!
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలోని కేసీ కెనాల్ కింద రైతులు సాగు చేసిన పంటలకు నీరిచ్చి కాపాడాలని జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అచ్చుకట్ల కరీముల్లా కోరారు. శుక్రవారం జెడ్పీ చైర్ పర్సన్ జేష్ఠాది శారద అధ్యక్షతన నిర్వహించిన జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల వరకు కేసీ కెనాల్ కింద రైతులు వివిధ పంటలు సాగు చేశారని తెలిపారు. వచ్చేనెల 15వ తేది వరకు సాగు నీరు అందితే తప్ప పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదన్నారు. కొండపేట కాలువ పూడికతీత పనులు చేపట్టాలని కోరారు. ఇందుకు కేసీ కెనాల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు చిన్న పుల్లయ్య బదులిస్తూ కుందూనదిలో నీరున్నంత వరకు కేసీ కెనాల్‌కు సాగునీరు అందిస్తామన్నారు. వెలుగోడు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 4.4 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మైలవరం నుంచి నీరు విడుదల చేసే అంశం తమ పరిధిలో లేదని, కడప చీఫ్ ఇంజనీరును సంప్రదించాలని సూచించారు. ● వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి మాట్లా డుతూ తమ మండలంలో వివిధ గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొందని తెలిపారు. బోర్ల డీపెనింగ్, ఫ్లషింగ్, అవసరమైనచోట తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. ఇంతకుముందు తాగునీటి రవాణాకు సంబంధించిన బిల్లులను ఇంతవరకు చెల్లించకపోవడం విచారకరమన్నారు. ● పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండు నిర్మాణం కోసం గతంలో టెండరు పిలిచారని తెలిపారు. ఫలానా స్థలంలో బస్టాండు నిర్మించాలని కూడా అధికారులు సూచించారన్నారు. కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తి అధికారులు చూపిన స్థలంలో రెండున్నర లక్షలు ఖర్చు చేసి గ్రావెల్ తోలాడని చెప్పారు. తీరా ఇప్పుడు ఆర్టీసీ బస్టాండు నిర్మించాల్సిన స్థలం అది కాదని అధికారులు చెప్పడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నవంబరు నుంచి దరఖాస్తు చేసుకున్న వితంతువులకు పెన్షన్ మంజూరు చేస్తామంటోందని, అంతకుమునుపు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా పెన్షన్మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, పలు మండలాల జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లోసభ్యుల వినతి -
నకిలీ బంగారు కేసులో నిందితుడి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం: బంగారు బిస్కెట్‌ను అతి తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మించి నకిలీ బంగారాన్ని అంటకట్టిన కేసులో వన్ టౌన్ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. అరెస్ట్ వివరాలను ప్రొద్దుటూరు డీఎస్పీ భావన గురువారం రాత్రి వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. పట్టణంలోని దొరసానిపల్లె రోడ్డుకు చెందిన చిట్టిబోయిన కీర్తి జనరల్ స్టోర్ నిర్వహించేవారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు దంపతులమని చెప్పి వారు ఉంటున్న వీధిలో చేరారు. ఈ క్రమంలో వారు కీర్తితో పరిచయం పెంచుకున్నారు. తాము బెంగళూరులో బిల్టిండ్ పని చేస్తున్న సమయంలో బంగారు బిస్కెట్లు దొరికాయని, అందులో ఒక బిస్కెట్‌ను తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని కీర్తి తన భర్త రామకృష్ణకు తెలిపింది. బంగారు బిస్కెట్ మార్కెట్లో రూ. 25 లక్షలు వరకు అవుతుందని, అయితే మీకు మాత్రం రూ.5.20 లక్షలకే విక్రయిస్తామని నమ్మబలికారు. అనుమానం ఉంటే బిస్కెట్ నాణ్యతను పరీక్షించుకోజచ్చని ఒక బంగారు బిస్కెట్ ముక్కను ఇచ్చారు. దాన్ని కీర్తి దంపతులు మార్కెట్లో పరీక్షించగా నాణ్యత బాగున్నట్లు తేలింది. దీంతో కీర్తి దంపతులు బంగారు బిస్కెట్ కొనేందుకు ఆసక్తి చూపారు. మరుసటి రోజే రూ. 5.20 లక్షలు వారికి ఇచ్చి బిస్కెట్‌ను కొనుక్కున్నారు. గత నెల 23న నగలను తయారు చేయించుకునేందుకు వారు బంగారు దుకాణానికి వెళ్లారు. అయితే దాన్ని పరీక్షించిన స్వర్ణకారుడు నకిలీ బిస్కెట్ అని చెప్పాడు. మోసపోయామని భావించి కీర్తి దంపతులు 24న వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడైన పల్నాడు జిల్లా, ముప్పాల మండలం, మాదాల గ్రామానికి చెందిన బండారు నాగేశ్వరరావు పట్టణంలోని కళామందిర్ వద్ద అనుమానంతో తిరుగుతుండగా వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో భాగంగా మోసం చేసినట్లు అతను అంగీకరించాడు. ఇంకా ఈ కేసులో నిందితుడి భార్య బండారు ఏడుకొండలు, తుమ్మిశెట్టి రాము, తుమ్మిశెట్టి భవానీల ప్రమేయం ఉందని డీఎస్పీ తెలిపారు. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. సమావేశంలో సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ సంజీవరెడ్డిపాల్గొన్నారు. -
భవన నిర్మాణాలకు పటిష్టమైనది భారతి సిమెంట్
కలసపాడు : అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలకు భారతి సిమెంట్ పటిష్టమైనదని భారతీ సిమెంట్ కంపెనీ టెక్నికల్ ఇంజినీర్లు శ్రీకాంత్‌రెడ్డి, నాగేంద్ర, సేల్స్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. స్థానిక సీఎంఆర్ కల్యాణ మండపంలో గురువారం బిల్డర్లు, మేసీ్త్రలకు సిమెంటు వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. భారతి సిమెంట్ ప్రతినిధులు మాట్లాడుతూ భారతి సిమెంట్ రోబోటిక్ టెక్నాలజీతో తయారవుతోందన్నారు. అల్ట్రా ఫాస్ట్ నాణ్యత కలిగి ఉంటుందని, ఇతర కంపెనీల సిమెంట్‌కు ఐదు గంటలు పడితే భారతి సిమెంట్ అల్ట్రా ఫాస్ట్ రెండు గంటల్లోనే గట్టి పడుతుందన్నారు. చాలా దృఢత్వాన్ని కలిగి కట్టడాలు త్వరగా పూర్తవుతాయని తెలిపారు. అనంతరం వంద మంది మేసీ్త్రలకు రూ.లక్ష విలువ గల ఉచిత ప్రమాద బీమా బాండ్లు అందజేశారు. కార్యక్రమంలో డీలర్ వెంకటసుబ్బయ్య, మేసీ్త్రలు తదితరులు పాల్గొన్నారు. -
ఏనుగు దాడిలో మృతుల కుటుంబాలకు సాయం
ఓబులవారిపల్లె : శివరాత్రి సందర్భంగా తల కోన కు కాలినడకన వెళ్తూ వై.కోట సమీపంలో ఏనుగల దాడిలో మృతిచెందిన కుటుంబాలకు ము క్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ద్వారా ముక్కా వరలక్ష్మీ గురువారం ఆర్థికసాయం అందజేశారు. రైల్వేకోడూరు మండలం బుడుగుంటపల్లి పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన మృతురాలు తుపాకుల మణెమ్మ, తిరుపతి చెంగల్ రాయుడు, ఉర్లగడ్డపోడు వంకాయల దినేష్ కుమార్ కుటుంబీకులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కులను ము క్కా వరలక్ష్మీ అందజేశారు. ముక్కా వరలక్ష్మీ మా ట్లాడుతూ మృతుల కుటుంబాలకు అన్ని విధాలు గా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ రాజంపేట టౌన్ : పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఓ లారీ గురువారం డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అదుపుతప్పి కింద పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కడప–తిరుపతి మార్గంలో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. బైపాస్ రోడ్డు కావడంతో వేగంగా వెళ్తుంటాయి. లారీ కింద పడి ఉంటే వెనుకవైపు వచ్చే వాహనాలు ఢీకొని పెనుప్రమాదం జరిగేదని, ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. డివైడర్ ఎత్తు పెంచాలని వాహనదారులు కోరారు. ఇసుక రవాణాకు అడ్డుకట్ట వీరబల్లి : మండలంలోని పెద్దవీటి పంచాయతీ ఎలకచెట్టుపల్లి వంతెన, రాగిమాను దిన్నెపల్లి వద్ద మాండవ్య నదిలో ట్రాక్టర్లతో నిత్యం ఇసుక తరలిస్తున్నారు. ఇసుక రవాణా ట్రాక్టర్లను నదిలోకి వెళ్లనీయకుండా రాగిమానుపల్లి గ్రామస్తులు గురువారం నిలిపివేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ కొందరు నాయకుల సహకారంతో ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. భూగర్భజలాలు అడుగంటిపోయి తాగడానికి నీరు దొరకకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దారు వెంకటేష్‌కు ఫోన్ ద్వారా తెలుపగా ఇసుక రవాణాను నిలిపవేయాలని సిబ్బందికి సూచించారు. అటవీ భూమి కబ్జా చిన్నమండెం : మండలంలో ఆక్రమణదారులు పేట్రేగిపోతున్నారు. చిన్నర్సుపల్లె కొండ కింద కింద ఉన్న అటవీ భూమిని జేసీబీతో చదును చేయిస్తున్నా.. స్థానికులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. వివరాల్లోకి వెళితే.. చిన్నమండెం మండలం చాకిబండ చెరువు వద్ద చిన్నర్సుపల్లె కొండ కింద అటవీ భూమి ఉంది. మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వారం రోజులుగా యథేచ్ఛగా ఆక్రమణకు పాల్పడుతున్నా అటవీ అధికారులు స్పందించడం లేదు. తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. హద్దులు దాటిన.. డ్యాన్స్ కురబలకోట : ముదివేడు అమ్మవారి తిరునాలలో డ్యాన్స్ హద్దులు దాటింది. భక్తి భావం ఉప్పొంగాల్సిన చోట అసభ్యకర నృత్యంతో హోరెత్తించారు. కురబలకోట మండలం ముదివేడు దండుమారెమ్మ రాత్రి తిరునాల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించకూడదని ముందస్తుగా పోలీసులు హెచ్చరించినా కొందరు ఖాతరు చేయలేదు. మండలంలోని నడింపల్లె, గోల్లపల్లె గ్రామాల్లో బుధవారం రాత్రి హద్దులు దాటి యథేచ్ఛగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. ఈ దృశ్యాలను కొందరు సెల్ ఫోన్లో రికార్డ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకుని చాందినీబండి నిర్వాహకుడు నడింపల్లె అశోక్‌పై వివిధ సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దిలీప్‌కుమార్ గురువారం తెలిపారు. వారు ఉపయోగించిన డీజే సౌండ్ సిస్టమ్, ఇతర వాహనాలను సీజ్ చేసి కందూరుకు చెందిన కార్తీక్, డిజే వెహికల్ డ్రైవర్ గురునాథ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ● ముదివేడు తిరునాలలో రికార్డింగ్ డ్యాన్సులు ● ముగ్గిరిపై కేసు నమోదు...వాహనాలు సీజ్ -
లగేజ్ మూటలు పడి వ్యక్తి మృతి
కడప అర్బన్ : కడప నగరంలోని ఓ ట్రాన్స్పోర్ట్ లారీ నుంచి లగేజ్ మూటలు దించుతుండగా ప్రమాదవశాత్తూ మీద పడి ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. కడప రామకృష్ణ నగర్‌కు చెందిన ఎం. విజయ భాస్కర్(40) ట్రాన్స్పోర్ట్ గోదాములో పనిచేస్తున్నారు. గురువారం లారీ నుంచి లగేజ్ మూటలు దించుతుండగా మూటలన్నీ అతడిపై పడిపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి సోదరుడు నరసింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు వ్యక్తి అదృశ్యం – కేసునమోదు ముద్దనూరు : మండల కేంద్రంలోని డీయన్.పల్లె రహదారిలో నివసిస్తున్న వెంకటాద్రి(47) అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. గత ఫిబ్రవరి 25న ఉదయం పది గంటల సమయంలో వెంకటాద్రి పనుల నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు గాలించారు. మార్చి 1వ తేదీన సెల్ఫోన్లో మాట్లాడిన అతడు అనంతరం ఫోన్ ఎత్తడం లేదని తెలిపారు. వెంకటాద్రి భార్య మంజులాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఆస్పత్రి మార్చురీలో గుర్తుతెలియని మృతదేహం ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సుధాకర్ (55) అనే వ్యక్తి అనారోగ్యంతో గురువారం మృతిచెందాడు. అనారోగ్య కారణాలతో ఈ నెల 15న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. ఇతడి పేరు డి.సుధాకర్ అని ఐపీ రిజిస్టర్లో రాసి ఉంది. అతను మృతి చెందగా, కుటుంబీకులు ఎవరూ లేకపోవడంతో మృత దేహాన్ని ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. వ్యక్తి బంధువులు ఆస్పత్రిలో సంప్రదించాలని మార్చురీ ఇన్చార్జి వరాలు తెలిపారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్షన్కు ఆరు నెలలు మదనపల్లె : కుమారుడి చదువు కోసం క్యాస్ట్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకుంటే.. తప్పుల సవరణ పేరుతో ఆరు నెలలుగా పత్రం ఇవ్వకుండా నిలిపివేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు హబీబ్ సాహెబ్ వివరాల మేరకు.. నిమ్మనపల్లె కందూరు రోడ్డుకు చెందిన బి.హబీబ్ సాహెబ్ షేక్(బీసీ–ఈ) కులానికి చెందిన వ్యక్తి. ఇతడికి బి.ఫహీమ్, బి.ఫాజిల్లా, బి.ఫరీద్ సాహెబ్ ముగ్గురు పిల్లలు. ఫరీద్ సాహెబ్ ఐదో తరగతి చదువు తున్నారు. నవోదయ విద్యాలయలో చేర్పించేందుకు క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరమవడంతో దరఖాస్తు చేసుకుని కావాల్సిన ధృవపత్రాలు జతపరిచాడు. నిమ్మనపల్లె రెవెన్యూ సిబ్బంది బీసీ–ఇకు బదులుగా ఇండియన్ ముస్లిం(ఓసీ)గా పేర్కొంటూ జారీ చేశారు. దీంతో హబీబ్, తాము షేక్(బీసీ–ఈ)కు చెందిన వారమని, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని రెవెన్యూ అధికారులకు విన్నవించారు. మిగిలిన తన ఇద్దరు కుమారుల క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఫరీద్ అహ్మద్ స్కూల్ టీసీ చూపినా బీసీ–ఈ సర్టిఫికేట్ జారీ చేయడంలో అధికారులు జాప్యం చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి అర్జీ పంపి, క్యాస్ట్ సర్టిఫికెట్ సరిచేసేందుకు మూడు నెలలుగా నిమ్మనపల్లె తహసీల్దారు కార్యాలయం, మదనపల్లె సబ్ కలెక్టరేట్ చుట్టూ సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు మరోసారి ఫైల్ తెచ్చి ఇవ్వాల్సిందిగా కోరారన్నారు. రెవెన్యూ అధికారుల తప్పిదానికి ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. -
దుకాణాల దగ్ధంపై పోలీసులు విచారించాలి
ప్రొద్దుటూరు : స్థానిక పాత బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొండారెడ్డి, సుధాకర్ దుకాణాల దగ్ధంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి కోరారు. ఇటీవల దగ్ధమైన రెండు షాపులను గురువారం ఆయన పరిశీలించి బాధితులను పరామర్శించారు. రాచమల్లు మాట్లాడుతూ విద్యుత్తు మీటర్‌కు సంబంధించిన బాక్స్ యథాస్థితిలో ఉండగా, షార్ట్ సర్క్యూట్ ఎలా జరుగుతుందని అన్నారు. గత పదేళ్లుగా కొండారెడ్డి, సుధాకర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ వెంట నడుస్తున్నారని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, తన జన్మదిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ షాపులకు నిప్పు అంటించారనే అనుమానంపై పోలీసులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఈ టి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. తన శ్వాస ఉన్నంత వరకు పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తానన్నారు. అనంతరం దుకాణాలు కాలిపోయి నష్టపోయిన కొండా రెడ్డికి రూ.2లక్షలు, సుధాకర్‌కు రూ.30వేల సాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, వరికూటి ఓబుళరెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, సత్యం, రాగుల శాంతి, డీలర్ అంజి, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
ఉత్తమ ఫ్యాకల్టీతో డీటీసీలో శిక్షణ
ఇ–క్లాస్ రూమ్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ కడప అర్బన్ : ఉత్తమ ఫ్యాకల్టీతో జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం(డీటీసీ)లో నిర్వహించే శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్ అన్నారు. కడప నగర శివారులోని డీటీసీలో అత్యాధునిక ప్రొజెక్టర్, పరికరాలు, ఏసీ గదులతో ఏర్పాటు చేసిన ఇ–క్లాస్ రూమ్‌ను ఎస్పీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటూ వివిధ అంశాలపై పట్టు సాధించాలని సూచించారు. భవిష్యత్తులో ఉపయుక్తంగా ఉండేలా రూపొందించిన మెటీరియల్ శిక్షణ కాలంలో అందిస్తారన్నారు. వేసవి నేపథ్యంలో సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఇ–క్లాస్ రూమ్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన డీటీసీ డీఎస్పీ అబ్దుల్‌కరీంను ఆయన అభినందించారు. అనంతరం భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలను నిపుణులు సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్‌బాబు, ఏఎస్పీ(ఏఆర్) బి.రమణయ్య, డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్.వినయ్‌కుమార్‌రెడ్డి, టి.రెడ్డెప్ప, దారెడ్డి భాస్కర్‌రెడ్డి, సీతారామిరెడ్డి, శివరాముడు, మహమ్మద్‌బాబా, మధుమల్లేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
జూన్‌లో గండి ఆలయ కుంభాభిషేకం
చక్రాయపేట : గండి వీరాంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి జూన్‌లో కుంభాభిషేకం చేయాలని, భక్తులకు మూల విరాట్ దర్శనం కల్పించాలని దేవదాయశాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్‌తో కలిసి గురువారం ఆయన గండి దేవస్థానానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. నాలుగేళ్లు కావస్తున్నా ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని, పత్రికల్లో వార్తలు, భక్తుల నుంచి కూడా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం ప్రారంభం నుంచి భక్తులకు అలవాటయ్యేలా పద్ధతి మార్చాలని, మూల విరాట్ వద్ద దర్శనం తీర్థం, సెటారి ఉండాలని సూచించారు. స్వామిని ప్యాకెట్ పాలతో కాకుండా, గోశాలలోని ఆవుపాలతో అభిషేకించాలన్నారు. భక్తులచే ఉత్సవ విగ్రహం వద్ద చేయించాలని అర్చకులకు సూచించారు. అనంతరం ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య, అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు ఆయచే పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవాదాయ శాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ఆజాద్ -
బంగారు, వెండి ఆభరణాల చోరీ
వేంపల్లె : వేంపల్లి మండలం కుమ్మరాంపల్లె సమీపంలోని ఓ ఇంట్లో గురువారం గుర్తు తెలియని వ్యక్తులు రూ.7.5 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. పోలీసులు, బాధితుడి వివరాల మేరకు.. గ్రామ మాజీ సర్పంచ్ రామాంజనేయరెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి, ఆయన సతీమణి మౌనిక వేంపల్లె–పులివెందుల రోడ్డులో దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం ఎనిమిది గంటలకు వేంపల్లెలో దుకాణానికి వచ్చి.. రాత్రి తిరిగి ఇంటికి వెళ్తారు. పిల్లలు కూడా వేంపల్లె పాఠశాలలోనే చదువుతున్నారు. గురువారం యథా ప్రకారం దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో వెళ్లి చూడగా బీరువా తెరచి దుస్తులు చిందరవందరగా ఉండడం గమనించారు. రూ.7.50 లక్షల విలువచేసే 65 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండి ఆభరణాల చోరీ జరిగినట్లు గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ప్రధాన తలుపును పగలగొట్టి ఇంటి వెనకవైపు నుండి పారిపోయి ఉంటారని బాధితుడు తెలిపారు. పోలీసులు క్లూస్ టీంతో వచ్చి తనిఖీలు నిర్వహించారు. వేలి ముద్రలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వేంపల్లె సీఐ సురేష్‌రెడ్డి తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో క్లూస్ టీం తనిఖీలు -
యువ పరిశోధకులకు విస్తృత అవకాశాలు
కడప ఎడ్యుకేషన్ : యువ పరిశోధకులకు శాస్త్ర పరిశోధనలో విస్తృత అవకాశాలున్నాయని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎఫ్ఎన్ఎ ఫెలో ఆఫ్ నేషనల్ అకాడమీ ఆచార్య ఏఎస్.రాఘవేంద్ర స్పష్టం చేశారు. వైవీయూలోని తాళ్లపాక అన్నమాచార్య సమావేశ మందిరంలో ‘జీవశాస్త్రంలో కమ్యూనికేషన్ వ్యవస్థలు’ అంశంపై గురువారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర మాట్లాడుతూ సైంటిఫిక్ లెక్చర్స్పై స్కాలర్లు దష్టి సారిస్తే సైన్స్ అకాడమీలు సహకారం అందిస్తాయన్నారు. ప్రిన్సిపల్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ వివిధ జాతుల మధ్య పర్యావరణ సమతుల్యత నిర్వహించడంలో కమ్యూనికేషన్ సహాయ పడుతుందన్నారు. ఆచార్య పి.పద్మ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం–2020 కింద ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలను ప్రోత్సహిస్తున్నారని, వ్యాధుల నిర్ధారణ, చికిత్స, ఔషధం అభివద్ధి, వ్యవసాయం, పర్యావరణ స్థిరత్వం అంశాలలో సహాయపడతారని తెలిపారు. అనంతరం అతిథులు పలు అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎస్.రాజగోపాల్, ఆచార్య ఎస్.నరేష్‌బాబు, ఆచార్య డాక్టర్ దయానంద్, ప్రొఫెసర్ రియాజున్నీసా, ప్రొఫెసర్ మాదక్క, అధ్యాపకులు పాల్గొన్నారు. -
24న గోవిందమాంబ ఆరాధన
బ్రహ్మంగారిమఠం: భవిష్యత్ కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మపత్ని మాతా గోవిందమాంబ ఆరాధన ఈనెల 24న నిర్వహించనున్నట్లు మఠం మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 8గంటలకు అభిషేకం, 10గంటలకు సహస్ర నామార్చన, 1గంటకు ద్వారపూజ, రాత్రికి గ్రామోత్సవం ఉంటుందన్నారు. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రేపు ప్రొద్దుటూరులో జాబ్‌మేళా కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా ఉపాధి కార్యాలయం, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రొద్దుటూరు పట్టణం కొర్రపాడు రోడ్డులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 10 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌మేళాలో పలు కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై 18–45 ఏళ్లలోపు కలిగి ఉండాలన్నారు. ఎంపికై న వారికి రూ. 12–25 వేల వరకు హోదాను బట్టి వేతనం ఉంటుందని వివరించారు. ప్రొద్దుటూరు పట్టణంతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హుండీల ఆదాయం లెక్కింపు బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో భక్తులు సమర్పించుకున్న కానుకలను గురువారం లెక్కించారు. ఇందులోరూ.20,15,750 నగదు, 1గ్రాము బంగారం, 90గ్రాములు వెండి వచ్చినట్లు మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో మఠం పిట్‌పర్సన్ శంకర్‌బాలాజీ , పూర్వపు మఠాధిపతి కుమారుడు వెంకటాద్రిస్వామి, ఎండోమెంట్ అధికారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. సంగమేశ్వరుడి ఆదాయం రూ.5లక్షలు వీరపునాయునిపల్లె: మండలంలోని మొగమూరు, పాపాఘ్ని నదుల సంగమం వద్ద వెలసిన సంగమేశ్వరుని ఆలయంలో గురువారం ఆలయ మాజీ చైర్మెన్ మురళీ మోహన్‌రెడ్డి, ఈఓ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. లెక్కింపు అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది మార్చి నుంచి నేటి వరకు 5లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని మండల కేంద్రంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో జమ చేసినట్లు తెలియజేశారు. అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయ ఈఓ మారుతీ ప్రసాద్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బ్రహ్మానందరెడ్డి, వాసుదేవరెడ్డి, ప్రసాదురెడ్డి భక్తులు పాల్గొన్నారు. శిల్పారామానికి నూతన ఏఓ కడప కల్చరల్: కడప శిల్పరామానికి నూతన పాలనాధికారి (ఏఓ) వచ్చారు. ఇప్పటివరకు ఏఓగా పనిచేస్తున్న పి.శివప్రసాద్‌రెడ్డి అనంతపురం శిల్పారామానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో అనంతపురం శిల్పారామం ఏఓ కృష్ణ ప్రసాద్ గురువారం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప శిల్పారామంను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలోని పులివెందులలో ఇంతవరకు ఏఓగా ఉండిన సుధాకర్‌ను తిరుపతి శిల్పారామానికి బదిలీ చేయగా, అక్కడి ఏఓ ఖాదర్‌వలీని పుట్టపర్తి శిల్పారామానికి బదిలీ చేశారు. విశాఖ ఏఓగా ఉండిన విశ్వనాథ్‌ను పులివెందుల శిల్పారామానికి బదిలీ చేశారు. -
● నాయకుల పాపం.. పశువులకు శాపం
కష్టం వచ్చినా ఏమని చెప్పాలో.. ఎలా చెప్పాలో తెలియని మూగ జీవులు అవి. నిత్యం తమకు ఆహారం అందిస్తూ వసతి కల్పించిన జ్యోతి క్షేత్రంలోని కాశినాయన ఆశ్రమంలో ఇప్పటివరకూ క్షేమంగా ఉన్నాయి. నాయకులు చేసిన పాపమో ఏమో మరి.. అటవీ అధికారులు సత్రాల కూల్చివేయడంతో వాటికి ఆదరణ కరవైంది. కొన్ని చెట్టు కింద సేద తీరుతుండగా.. మరిన్ని ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి. వైస్సార్ కడప–ప్రకాశం జిల్లా సరిహద్దు మండలంలోని జ్యోతి క్షేత్రంలో కాశినాయన నిత్యాన్నదాన సతంరంతోపాటు అతి పెద్ద గోశాలలు ఉన్నాయి. వేయి నుంచి 1500 గోవులు ఇక్కడ సేదతీరుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ క్షేత్రంలో కూల్చివేతలు మొదలయ్యాయి. మొదట గోశాల, గోవుల పశుదాన సత్రంతో మొదలై గత మూడు నెలల్లో నాలుగు సత్రాలు కూలాయి. వేసవిలో సత్రం నీడన ఉండాల్సిన మూగ జీవులు ఎండ వేడిమికి అల్లాడుతున్నాయి. దాతల సహకారంతో ఇప్పటి వరకూ సాగిన సత్రాలకు ఇపుడు కష్టాలు తప్పడంలేదు. కొన్ని చెట్టు నీడన సేదతీరగా.. మరిన్ని మండుటెండలో బిక్క మొహంతో చూస్తున్నాయి. అక్కడికి వచ్చిన భక్తులు ఇది చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ఫొటో గ్రాఫర్, కడప -
● పశు యజమానులకు కష్టకాలం
సాక్షి రాయచోటి: రాష్ట్రంలో 108, 104 తరహాలో వైఎస్సార్సీపీ సర్కార్ వినూత్నంగా ఆలోచించి గ్రామీణ ప్రాంతాల్లోని పశువులకు అత్యుత్తమైన వైద్య సేవలు అందించేలా ప్రణాళిక అమలు చేసింది.ఎక్కడికక్కడ పశువులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు 2022 మే 19వ తేదీన సంచార పశు వైద్య వాహనాలకు శ్రీకారం చుట్టింది.సమున్నత లక్ష్యంతో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచార వాహనాలతో ఉత్తమ వైద్యానికి చర్యలు చేపట్టారు. అప్పట్లోనే ప్రతి నియోజకవర్గానికి ఒక వాహనాన్ని కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నిరంతరాయంగా పశువులకు సేవలు అందిస్తూ వచ్చిన సంచార వైద్యానికి గ్రహణం పట్టుకుంది. ప్రస్తుత కూటమి సర్కార్ సంచార పశు వైద్య వాహనాల గురించి పట్టించుకోకపోవడంతో దాదాపు మూడు వారాలుగా ఇవి మూలకు చేరాయి. కాంట్రాక్టు గడువు ముగియడంతో జిల్లా పశుసంవర్దకశాఖ అధికారులు వాటిని నిలిపివేశారు. కాంట్రాక్టు గడువు ముగిసినా.. ఉన్నతాశయంతో వైఎస్ జగన్ సర్కార్ పశు సంచార వాహనాలకు శ్రీకారం చుడితే గడువుముగియడంతో పక్కన పెట్టేశారు. అయితే కూటమి సర్కార్ కాంట్రాక్టు ముగిసినా పట్టించుకోకుండా ముందుకు వెళు తుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంత పశువులకు, ఇతర జంతువులకు ఉపయోగపడే ఈ పథకంపై ప్రస్తుత సర్కార్ నిర్లక్ష్యం చూపడంపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ఏది ఏమైనా ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంచార పశు వైద్య వాహనాల కాంట్రాక్టు పొడిగించడంపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో అంతుచిక్కడం లేదని పలువురు పశువుల యజమానులు ప్రశ్నిస్తున్నారు. అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్లు, గేదెలు, ఆవులు, ఎద్దులు, ఇతర పెంపుడు జంతువులు ఉన్నాయి. అయితే సంచార పశు వైద్య వాహనం ద్వారా ఎక్కడికక్కడ సమస్య ఉన్నచోటనే...జంతువును వాహనంలోకి హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా ఎక్కించి అక్కడే అన్ని పరీక్షలు చేసేవారు. పశువుల సంరక్షణ కోసం 20 రకాల మల సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తోపాటు ఆటోగ్లేవ్ ప్రయోగశాలను కూడా సంచార వాహనంలో అందుబాటులో ఉంచారు. అత్యున్నత టెక్నాలజీతో వాహనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే దీనికి 108, 104 తరహాలోనే ఒక నంబరును కేటాయించి ఫోన్ చేయగానే గ్రామాలకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో 6, వైఎస్సార్ జిల్లాలో 7 వాహనాలు తిరగడకపోవడంతో రెండోదశలో వచ్చిన వాహనాలతోనే వైద్యం అందిస్తున్నారు. దీంతో పశువులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం గగనంగా మారింది. ఎందుకంటే కొన్ని వాహనాలు పక్కన పెట్టడంతో మిగిలినవి పరిమిత సంఖ్యలోనే వైద్యం అందిస్తాయి. దీంతో పాడి రైతులకు సమస్యలు తప్పడం లేదు. అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని పశువుల సమాచారం రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు అన్నమయ్య జిల్లాలో పశుసంవర్దకశాఖలో మొదటి విడతలో వచ్చిన ఆరు సంచార పశు వైద్య వాహనాల గడువు మీరడంతో పక్కన పెట్టారు. అయితే రెండో విడతలో వచ్చిన వాహనాలతో పశు యజమానులకు ఇబ్బందులు లేకుండా చూస్తు న్నాం. ఎప్పటికప్పుడు పాడి రైతులతోపాటు మిగిలిన ప్రాంతాల్లోనూ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. –గుణశేఖర్పిళ్లై, పశు సంవర్ధకశాఖాధికారి, అన్నమయ్య జిల్లా వాహనాలను పనురుద్ధరించాలి గత ప్రభుత్వ హయాంలో సంచార వైద్యశాలలు ఉండేవి. వాటి ద్వారా పశువులకు ఇంటివద్దనే వైద్యం అందేది. నేడు ఆ వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మూగజీవాల ఆరోగ్యంగా దెబ్బతింటే ఆటోల ద్వారా సమీప పశువైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ఇలా చేయడం కష్టంతో కూడుకున్న పని, ఆర్థికంగా ఇబ్బంది. ప్రభుత్వం తక్షణమే సంచార పశువైద్య వాహనాలను పనురుద్ధరించాలి. –సుబ్బరాయుడు,రైతు పాళెంగడ్డ,సంబేపల్లె మండలం వైఎస్సార్ జిల్లా అన్నమయ్య జిల్లా గేదెలు 3,99,854 100588 కోళ్లు 31,82,190 30,82,260 ఎద్దులు, ఆవులు 44,000 276417 గొర్రెలు 9,20,614 18,24,325 మేకలు 3,80,099 3,53,370 జిల్లాలో పాడి రైతులు 1.80 లక్షలు 2 లక్షలు మొదటి విడతలో వచ్చిన సంచార పశు వైద్య వాహనాలు నిలుపుదల మూగజీవాలకు కష్టకాలం -
శుభాల రేయి ఘడియలు షురూ!
కడప కల్చరల్: పవిత్ర రంజాన్ మాసం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ మాసాన్ని మూడు భాగాలు విభజిస్తారు. ఇందులో మొదటి పది రోజులు అల్లాహ్ కరుణ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తే...రెండవ పది రోజుల్లో తమ తప్పులను క్షమించాలని ప్రార్థిస్తారు. ఇక మూడవదైన ముఖ్యమైన చివరి పదిరోజులు కొంచెం భిన్నమైనవిగా భావిస్తారు. నరకం నుంచి బయట పడేయాలని అల్లాహ్‌ను శరుణు కోరుకునేందుకు ఈ పదిరోజులను ప్రత్యేకమైనవిగా భావిస్తారు. పుణ్యాల కోసం..రంజాన్‌మాస చివరి పది రోజుల్లో పవిత్ర బడీరాత్ కూడా ఉంటుంది. దీన్నే షబ్ ఏ ఖదర్ లేదా లైలతుల్ ఖద్ర్ అనికూడా అంటారు. ఈ పవిత్ర రాత్రి చివరి పది రోజుల్లో బేసి రాత్రుల్లో ఉంటుందన్న నమ్మకంతో ముస్లింలు తాఖ్ రాత్‌గా నిర్వహిస్తారు. మరీ ముఖ్యంగా 27వ రోజు రాత్రే లైలతుల్ ఖద్ర్ ఉంటుందని భక్తుల విశ్వాసం. లైలతుల్ ఖద్ర్ రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేయడంతో వెయ్యి నెలలపాటు ఉపవాస దీక్షలు చేసినంత ఫలం లభిస్తుందని పెద్దలు పేర్కొంటున్నారు. ప్రజల పాపాలను క్షమించాలని కోరుతూ మహమ్మద్ ప్రవక్త ప్రార్థించారని పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఉండడంతో ముస్లింలు జాగరణ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. నేటి నుంచి పవిత్ర తాఖ్ రాత్రులు పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత ముఖ్యమైనవిగా, అధిక పుణ్యాన్ని ఇచ్చే తాఖ్ రాత్‌లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కడప నగరంలోని పలు మసీదులలో నిర్వాహకులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వక్తలు, గురువులు తాఖ్ రాత్‌లలో అల్లాహ్ సందేశాన్ని అందజేసేందుకు రానున్నారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల నుంచి మొదటి తాఖ్ రాత్ను ఆచరించనున్నారు. ఆ తర్వాత రోజు విడిచి అంటే ఈనెల 23, 25, 27, 29 తేదీలలో తాఖ్రాత్లను ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఐదు రోజులపాటు తరావీ నమాజు అనంతరం పవిత్ర ఖురాన్ పఠనంతోపాటు సామూహికంగా జిక్ర్‌ను చేయించనున్నారు. అలాగే తహజూద్ ప్రార్థనలకు విశేష ఏర్పాట్లు చేశారు. ప్రార్థనల అనంతరం ఐదు రోజులపాటు ఉపవాస దీక్ష చేపట్టే వారికి సెహరి సౌకర్యం కల్పించనున్నారు. దీంతోపాటు శుక్రవారం నాటి ముస్లిం భక్తులు మసీదులలో ఎత్తేకాఫ్ (తపోనిష్ట) దీక్షలు పాటించడం జరుగుతుంది. వీరు రోజంతా పూర్తిగా ఇతర విషయాల జోలికి వెళ్లకుండా కేవలం ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. రంజాన్ పండుగ నిర్వహణకు సూచనగా నెలవంక కనిపించిన తర్వాతనే వారు దీక్ష విరమిస్తారు. నేటి నుంచి తాఖ్ రాత్రులు ప్రత్యేక ఏర్పాట్లలో మసీదు నిర్వాహకులు బగ్దాదియా మసీదులో తాఖ్‌రాత్ ప్రార్థనలు నగరంలోని షాహీపేటలోగల బగ్దాదియా మసీదులో తాఖ్ రాత్ నిర్వహణకు ఏర్పాట్లు చేశామని హజరత్ మహమ్మద్ అలీ బగ్దాది సాహెబ్ తెలిపారు. ఇందులో భాగంగా మొదటి తాఖ్ రాత్ అయిన ఈనెల 21న పామిడికి చెందిన హజరత్ ఫజులర్ రెహ్మాన్ సాహెబ్, ఖలీలుల్లా సాహెబ్, అబ్దుల్ రహీం బగ్దాది సాహెబ్ ఆధ్యాత్మిక సందేశాన్ని అందజేయనున్నారు. 22న నగరానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు హజరత్ మహమ్మద్ బగ్దాది సాహెబ్, అక్మల్పీరాన్ సాహెబ్, అమీనుద్దీన్ సాహెబ్‌లు దైవ సందేశం అందజేయనున్నారు. 25న అబ్దుర్ రెహ్మాన్ బగ్దాది సాహెబ్, ఖలీలుల్లా సాహెబ్, 27న మహమ్మద్ వలీవుల్లా సాహెబ్, బిలాల్ అహ్మద్ సాహెబ్, మోహసిన్బేగ్ సాహెబ్, 29న మహమ్మద్ అలీ బగ్దాది సాహెబ్, మహమ్మద్ అహ్మద్ అష్రఫీ సాహెబ్, అబ్దుల్ ఖదీర్ జిలానీ సాహెబ్‌లు పాల్గొని పవిత్ర రంజాన్ విశిష్ఠత, మహమ్మద్ ప్రవక్త సూచనలు తెలియజేయనున్నారు. -
ప్రజల గుండెల్లోంచి వైఎస్సార్‌ను చెరపలేరు
కడప కార్పొరేషన్: జిల్లా పేరు మార్చవచ్చేమోగానీ, ప్రజల గుండెల్లోంచి వైఎస్సార్‌ను చెరపలేరని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 680 మంది చనిపోయారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎవరు చనిపోయినా కూడా ఇంతమంది మరణించలేదన్నారు. తమిళనాడులో ఎంజీఆర్ చనిపోయినప్పుడు మాత్రమే కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వైఎస్సార్ పాలన ఒక చరిత్ర అన్నారు. ఎన్నికల్లో చెప్పినవేగాక, చెప్పనివి ఎన్నో ఆయన అమలు చేసి చూపారన్నారు. వైఎస్సార్ పేరు చెప్పగానే చరిత్రాత్మకంగా గుర్తుండిపోయే ఎన్నో పథకాలు స్ఫురణకు వస్తాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత కరెంటు, జలయజ్ఞం, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఆయన ప్రవేశపెట్టినవేనన్నారు. కోటి ఎకరాలకు నీరివ్వాలని లక్ష కోట్లతో జలయజ్ఞం మొదలు పెట్టారని, మనం కాకపోయినా వేరెవరైనా వాటిని పూర్తి చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని భావించారన్నారు. పోలవరం, గాలేరునగరి సుజల స్రవంతి, హెచ్ఎన్ఎస్స్, వెలిగొండ, సోమశిలతోపాటు తెలంగాణలో కూడా 45 శాతం ప్రాజెక్టులు చేపట్టారన్నారు. నేడు ఇంతమంది చదివారు అంటే వైఎస్సార్ ప్రవేశపెట్టి ఫీజు రీయింబర్స్‌మెంటే కారణమన్నారు. ఈ పథకం ద్వారా వేలాదిమంది డాక్టర్లు, ఇంజినీర్లుగా తయారయ్యారని తెలిపారు. వైద్యానికి సంబంధించి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టాలన్న ఆలోచన కూడా ఎవ్వరికీ రాలేదన్నారు. స్వతహాగా వైద్యుడైనందునే వైఎస్సార్ ఆ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఏపీలో చూసి ప్రతి రాష్ట్రంలో దాన్ని అమలు చేశారన్నారు. పేదలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లలో నాణ్యమైన వైద్యం చేయించారన్నారు. ప్రజల బాగు కోసం నిరంతరం పరితపించిన ట్రెండ్ సెట్టర్ వైఎస్సార్ అన్నారు. ఆయన చనిపోయాక 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాకు వైఎస్సార్ జిల్లాగా పేరు మార్చిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డో, అభిమానులో పెట్టింది కాదన్నారు. ఆ పేరును కూటమి ప్రభుత్వం మార్చడం దురదృష్టకరమని, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అలా పాలించలేదని, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ల పేర్లు జిల్లాలకు పెట్టారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక పేర్లన్నీ తీసేస్తున్నారని మండిపడ్డారు. వైజాగ్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వాళ్లు పేరు పెట్టుకుంటే ఆది కూడా తీసేశారన్నారు. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును ప్రభుత్వం మారగానే తీసేశారన్నారు. పేరు తొలగించినంత మాత్రాన వారిపై ప్రజలకున్న గౌరవం తొలగించలేరన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిందేమీ లేదుగానీ, ఇలా దోపిడీ, దుర్మార్గాలను చేస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులు గురి చేసి ఆస్తులను నష్ట పరుస్తున్నారన్నారు.దేశమంతా అంబేడ్కర్ రాజ్యాంగం నడుస్తుంటే, ఏపీలో మాత్రం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని తూర్పారబట్టారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు సీఎంలుగా ఉన్నప్పుడు కూడా ఇలా జరగలేదన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, కచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని బాగుపరుస్తారనే ఆశతో ప్రజలు ఓట్లు వేశారని, ఇచ్చిన అఽధికారాన్ని సద్వినియోగపరచుకుని ప్రజల మనసులు గెలవాలని రవీంద్రనాథ్‌రెడ్డి హితవు పలికారు. అంతే తప్ప ప్రకృతి వనరులను ధ్వంసం చేసి మట్టి, ఇసుకను దోచుకోవడం, లోకల్ ట్యాక్స్ వసూలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల హామీలు అమలు పరచకపోతే వైఎస్సార్సీపీ ఉద్యమాల ద్వారా మెడలు వంచి చేయిస్తామన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్, బీహెచ్ ఇలియాస్, ఎస్ఏ కరిముల్లా, ఎస్ఎండీ షఫీ, కిరణ్ పాల్గొన్నారు. పేరును చెరపగలరేమోగానీ...ప్రజల్లో ఆయనకున్న గౌరవాన్ని కాదు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి -
నకిలీ పత్రాలతో అటానమస్ గుర్తింపు
కడప ఎడ్యుకేషన్ : ప్రొద్దుటూరు వేంకటేశ్వర డిగ్రీ, పీజీ ప్రైవేట్ కళాశాల నిర్వాహకులు అటనామస్ గుర్తింపునకు నకిలీ పత్రాలు చూపి అక్రమాలకు పాల్పడ్డారని విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు జగన్, నరసింహ, జగదీష్ ఓబులేసు, జయరాజు, ప్రతాపరెడ్డి, బయన్న ఆరోపించారు. వైవీయూ రిజిస్ట్రార్ పుత్తా పద్మను గురువారం వారు తమ కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. వారు మాట్లాడుతూ కళాశాల కరస్పాండెంట్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 20 ఏళ్లుగా పాలకులు, అధికారులను మోసం చేస్తూ తప్పుడు ధ్రువ పత్రాలతో అక్రమ మార్గంలో గుర్తింపు పొందారని ఆరోపించారు. ఒక ఫీజు చెప్పి.. మరోలా ఫీజు రాబడు తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నా రు. యూనివర్సిటీ అధికారులు విచారణ జరిపి చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బయన్న, దాసు, తదితరులు పాల్గొన్నారు. వైవీయూ రిజిస్ట్రార్‌కు విద్యార్థి యువజన నాయకుల ఫిర్యాదు -
బాబూ.. హజ్ యాత్ర పాయింట్ తొలగింపు సరికాదు: అంజాద్ భాషా
సాక్షి, వైఎస్సార్: ఏపీలో మైనార్టీలను చంద్రబాబు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా. విజయవాడ నుంచి హజ్ యాత్ర పాయింట్ తొలగించడం సరికాదన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కష్టపడి విజయవాడ పాయింట్ సాధించినట్టు తెలిపారు.మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడ నుంచి హజ్ యాత్ర పాయింట్ తొలగించడం సరికాదు. వైఎస్సార్సీపీ హయాంలో కష్టపడి విజయవాడ పాయింట్ సాధించాం. మైనార్టీలను చంద్రబాబు పూర్తిగా విస్మరించారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే పాయింట్ తొలగించారు. గతంలో మన రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్లాలంటే వేరే ప్రాంతాల నుండి వెళ్ళేవారు. 2019లో కూడా హైదరాబాద్ పాయింట్ నుండి హాజీలు యాత్రకు వెళ్లారు.అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర హజీలకు సరైన సదుపాయాలు కల్పించలేదు. ఆ తర్వాత మన రాష్ట్రం నుండే హజీలను హజ్ యాత్రకు పంపించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. దీంతో, 2020లో మన రాష్ట్రం విజయవాడ నుండి యాత్రకు పాయింట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020, 2021 రెండేళ్లు కరోనా నేపథ్యంలో హజ్ యాత్ర జరగలేదు. 2022లో కూడా తక్కువ మందిని మాత్రమే అక్కడి ప్రభుత్వం అనుమతించింది. 2023లో కేంద్ర ప్రభుత్వానికి అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది.2023లో మన రాష్ట్రం నుండి విజయవాడ వద్ద పాయింట్ నుంచే 1813 మంది హజ్ యాత్రకు వెళ్లారు. అదనపు భారాన్ని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఉత్తర్వులు జారీచేసింది. ఇంత కష్టపడి సాధించిన యాత్ర పాయింట్‌ను తీసేయడం బాధాకరం. ఇది కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రమే. మైనార్టీ వర్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విస్మరించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రామయ్య క్షేత్రానికి రైళ్లేవి?
ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని క్షేత్రంలో ఉన్న రైల్వేస్టేషన్ దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు టీటీడీ వార్షిక బ్రహ్మోత్సవాలను కోట్లాది రూపాయిలు వెచ్చించి వైభవంగా నిర్వహిస్తుంటే.. దూర ప్రాంతాలకు చెందిన వారు ఈ వైభవం, ఆలయం ప్రాశ్యస్తంను తెలుసుకునేందుకు రావాలంటే రైలు సౌకర్యం లేదు. టీటీడీ చొరవతో అయినా ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ బాగుపడుతుందా అని భక్తులు ఎదురుచూస్తున్నారు. రాజంపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు భద్రాచలం అధికారిక రామాలయంగా భాసిల్లింది. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఆంధ్రా భద్రాచలంగా ఒంటిమిట్ట కోదండరామాలయం అధికారిక రామాలయంగా ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను చేపడుతూ వస్తోంది. రెండవ అయోధ్యగా..ఏకశిలానగరంగా పిలవబడుతున్న ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌కు భక్తులు చేరుకునేందుకు రైలే లేదు. ఉన్న ఏ రైలూ ఆగదు. ఏటా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈయేడాది ఏప్రిల్ 5 నుంచి ఉత్సవాలను వైభవంగా ప్రారంభించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. కానీ సౌత్ సెంట్రల్ రైల్వే తమ వంతు బాధ్యతగా ఒంటిమిట్టకు భక్తులు చేరుకునేందుకు కల్పించిన రైలు సౌకర్యం శీతకన్ను పెట్టిందనే విమర్శలున్నాయి. ఒంటిమిట్ట రామయ్య చెంతకు చేరుకునేందుకు భక్తులకు వీలులేని పరిస్థితులు దాపురించాయి. భద్రాచలం తరహాలో స్టేషన్ అభివృద్ధి ఏదీ? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసిన తరహాలోనే ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే దక్షిణ మధ్య రైల్వే శీతకన్ను చూపుతోందనే అపవాదును మూటకట్టుకుంది. ముంబాయి–చైన్నె కారిడార్ రైలుమార్గంలో నడిచే ప్రతి రైలుకు ఒంటిమిట్టలో స్టాపింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు అంటున్నారు. ప్రస్తుతానికి డెమో ఒక్క రైలు మాత్రం ఉదయం, సాయంత్రం ఆగుతుంది. కోవిడ్ ముందు నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒంటిమిట్టను ఆంధ్రా భద్రాదిగా గుర్తించి, అభివృద్ధి చేస్తుంటే రైల్వేశాఖ తన వంతు పాత్రను పోషించడం లేదు. పల్లె స్టేషన్లాగే రైల్వేశాఖ భావిస్తోంది. ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఒంటిమిట్టను పరిగణనలోకి తీసుకోలేదు. ఒంటిమిట్ట, భద్రాచలం రెండు పుణ్యక్షేత్రాలు దక్షిణ మధ్య రైల్వేలోనే ఉండేది. భద్రాచలం స్టేషన్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను ఒంటిమిట్టకు ఇవ్వడం లేదంటే వివక్షను ప్రదర్శించినట్లేనని భక్తులు భావిస్తున్నారు. రైలు సౌకర్యంపై దృష్టి పెట్టని టీటీడీ .. ఒంటిమిట్ట రామాలయం టీటీడీలో విలీనమైంది. అయితే ఎంతసేపు రామాలయం అభివృద్ధి వరకు దృష్టి కేంద్రీకరించింది. అయితే రామయ్య క్షేత్రానికి భక్తులు వచ్చేందుకు అవసరమైన సౌకర్యాలపై దృష్టి సారించలేదన్న విమర్శలున్నాయి. ఒంటిమిట్టకు భక్తులు వచ్చేలా రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని టీటీడీ రైల్వేబోర్డును కోరితే తప్పకుండా స్పందిస్తుందని రైల్వే వర్గాలు చెపుతున్నాయి. ఈవో భక్తులకు రైలు సౌకర్యం కల్పించే విషయంసౌ దృష్టిపెట్టాలని రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు కోరుతున్నారు. కొత్తజోన్‌లో అయినా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ఎస్సీ రైల్వేలో ఏపీకి ప్రత్యేకంగా జోన్ ఏర్పాటైంది. విశాఖజోన్కే తలమానికం ఒంటిమిట్ట రామాలయం. అధికారికంగా గుర్తించిన రామాలయం ఇదే. అటువంటప్పుడు కొత్త జోన్ వల్ల రామాలయం ఉన్న ఒంటిమిట్ట స్టేషన్‌కు గుర్తింపు వస్తుందన్న ఆశలున్నాయి. దూరప్రాంత భక్తులెలా వచ్చేది.. దూర ప్రాంత భక్తులు రైలుమార్గంలో రామయ్య చెంతకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట్ట రామయ్య దర్శనానికి వస్తున్నారు. భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ మీదుగా భక్తులు వచ్చేందుకు వీలుగా రైళ్లు నడుస్తున్నాయి. ఒంటిమిట్ట స్టేషన్పేరుకు మాత్రమే ఉంది. నవమి బ్రహ్మోత్సవాలు, స్వామివారి కళ్యాణం రోజున లక్ష లాది మంది భక్తులు ఒంటిమిట్టకు చేరుకుంటారు. ఒంటిమిట్ట స్టేషన్ అభివృద్ధి చేయాలంటూ ప్రజాప్రతినిధులు గళం విప్పుతున్నారు. అయినా రైల్వేశాఖలో ఎటువంటి స్పందన కనిపించలేదన్న విమర్శలున్నాయి. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి రైలుమార్గంలో వచ్చేదెలా..? భద్రాచలం తరహాలోస్టేషన్ అభివృద్ధి ఏదీ? మొన్నటి వరకు ఒంటిమిట్ట, భద్రాచలం రెండు ఎస్సీ రైల్వేలోనే .. విశాఖ జోన్‌కే తలమానికంఒంటిమిట్ట రామాలయం ఒంటిమిట్టపై రైల్వేశాఖ వివక్ష భక్తులకు రైలు సౌకర్యంపై దృష్టిపెట్టని టీటీడీ రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళతాం టీటీడీ ఒంటిమిట్ట కోదండ రామాలయంకు ప్రత్యేక గుర్తింపు ఇస్తోంది. మరి ఎందుకు రైల్వేశాఖ వివక్ష చూపుతోంది. రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి ద్వారా ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో రైళ్ల హాల్టింగ్, స్టేషన్ అభివృద్ధి అంశాలను రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళతాం. తెలంగాణాలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసి, రైలు సౌకర్యం కల్పించినప్పుడు ఆంధ్రా భద్రాచలం రైల్వేశాఖకు కనిపించలేదా. భక్తులు ఒంటిమిట్టకు చేరుకునేందుకు ఒక్కరైలు కూడా అందుబాటులో లేదు. – తల్లెం భరత్‌రెడ్డి, డీఆర్‌యుసీసీ సభ్యుడు భక్తుల రాకకు రైలు మార్గమే అనుకూలం దూరప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట్టకు చేరుకునేలా రైలు సౌకర్యం కల్పించాలి. భక్తులకు ఏ విధంగా భద్రాచలం రైల్వేస్టేషన్ సౌకర్యంగా ఉందో, అలాగే ఒంటిమిట్టను మార్చాలి. ఏపీకి అధికారిక రామాలయంగా గుర్తించారు. అదే రీతిలో రైల్వేపరంగా భక్తులకు సౌకర్యాల ఏర్పాటుకు కృషిచేయాలి. కనీసం కళ్యాణం రోజైనా స్టాపింగ్ కల్పించాలి. ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మేడా రఘునాఽథ్రెడ్డిల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళతాం. –తంబెళ్ల వేణుగోపాల్‌రెడ్డి, డీఆర్‌యుసీసీ సభ్యుడు -
ల్యాండ్ మాఫియాను అరికట్టాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్: కూటమి ప్రభుత్వంలో రెచ్చిపోయి అక్రమాలకు పాల్పడుతున్న ల్యాండ్, శాండ్ మాఫియాను అరికట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణ యాలను సమూలంగా మార్పులు చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో భిన్నంగా నడుస్తోందన్నారు. విలువైన ప్రభుత్వ వంకా, వాగు, చెరువు, రాస్తా, అసైన్డ్, దేవాదాయ, ఈ నామ్, వక్ఫ్, అటవీ, స్మశాన భూముల ఆక్రమణ యదేచ్చగా సాగుతుందన్నారు. ఎక్కడపడితే అక్కడ అనుమతులు లేని మట్టి క్వారీలు ఏర్పా టు చేసుకొని యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. మండిపోతున్న ఎండల ప్రభావం భూగర్భ జలాలు పడిపోయి బోర్లు ఎండిపోయి చేను ఎండిపోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. పీపీ యూనిట్ వైద్యురాలిపై సస్పెన్షన్ వేటు ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని పీపీ యూనిట్ వైద్యురాలు ఇలియారాణిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. నక్కలదిన్నె గ్రామానికి చెందిన శివలక్ష్మికి కొన్ని రోజుల క్రితం చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఇలియారాణిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పద్మావతి నుంచి డీఎంహెచ్‌ఏ నాగరాజుకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు ఆందాయి. తన భార్యకు అన్యాయం జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని రెండు రోజుల క్రితం విశ్వనాథ్‌రెడ్డి కలెక్టరేట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. పీపీ యూనిట్ ఇన్చార్జి బాధ్యతలను డాక్టర్ నజీర్బాషాకు అప్పగించారు. -
అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట బడి
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడి నిర్వహించాలని ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి మొద లైన ఒంటిపూట బడి సమయ వేళలు ఏప్రిల్ 31వ తేది వరకు అమల్లో ఉంటాయని పేర్కొ న్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలను నడపాలని సూచించారు. 23న దేవుని కడప పోలీసు డిపార్ట్మెంట్ ఉద్యోగుల సభ కడప అర్బన్: దేవుని కడప పోలీసు డిపార్ట్మెంట్ ఉద్యోగుల పరస్పర సహకార గృహ నిర్మాణ సంఘం సంవత్సరపు మహాజన సభ ఈనెల 23 వతేదీన ఉదయం 10 గంటలకు కడపలోని వైఎస్ఆర్ పోలీసు కాలనీలో నిర్వహించనున్నట్లు దేవుని కడప పోలీస్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ కె. ప్రభాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంఘంలో ఇళ్ల స్థలాలు పొందిన సభ్యులు గృహ నిర్మాణం చేసుకునే విషయాలతోపాటు, ఇతర అంశాలపై చర్చ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కేజీబీవీల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని 17 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6,11 తరగతులలో ప్రవేశాలకు 2025–26 విద్యా సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా మార్చి 22 నుంచి మే 11వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానందరాజులు తెలిపారు. అలాగే కేజీబీవీల్లో 7,8,9 తరగతులలో మిగిలిన సీట్ల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తులను https://apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా చేసుకోవాలని తెలిపారు. మైనార్టీ బాలుర పాఠశాలలో ప్రవేశాలకు... కడప ఎడ్యుకేషన్: కడపలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (మైనార్టీ బాలుర)లో 2025–26 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పేతకంశెట్టి సోమ సత్యశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో 80 సీట్లు, 6,7,8 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మైనార్టీ బాలురతోపాటు ఎస్సీ, ఎస్టీ బాలురు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 31లోగా https://aprs. apcffss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 25వ తేదీ ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు. వివరాలకు 7780179446, 90595 00173 నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు. ఉప సర్పంచుల ఎన్నికకు నోటిఫికేషన్ కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉన్న తొమ్మిది ఉప సర్పంచుల స్థానా లను భర్తీ చేసేందుకు ఈనెల 27వ తేది ఉదయం 10 గంటలకు ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు జిల్లా పంచాయతీ అధికారి జి.రాజ్యలక్ష్మి బుధవారం ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం, సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరు, సీకే దిన్నె మండలం బుసిరెడ్డిపల్లె, కమలాపురం మండలం కోగటం, బ్రహ్మంగారిమఠం మండలం గొడ్లవీడు, ఎర్రగుంట్ల మండలం తుమ్మలపల్లె, చిర్రాజుపల్లె, దువ్వూరు మండలం ఇడమడక, చెన్నూరు మండలం ముండ్లపల్లె పంచాయతీలకు సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నికలు జరగనున్నా యి. ఇందుకోసం అధికారులను నియమించా రు. ఏదైనా కారణాల రీత్యా ఆరోజు ఎన్నిక జరగకపోతే మరుసటిరోజు నిర్వహించాల్సి ఉంటుంది. జూడాల సంఘం నూతన కమిటీ ఏర్పాటు కడప అర్బన్: ప్రభుత్వ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ల సంఘం (జీఎంఎస్కె– జూడా) కొత్త కమిటీ ఏర్పాటైంది. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. సురేఖ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. విజయభాస్కర్ రెడ్డి కొత్త కమిటీని అభినందించారు. అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ ఎస్. విష్ణు వర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ బి. విజయ్, డాక్టర్ చరిత, డాక్టర్ పూజ, డాక్టర్ ప్రతిభ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ. నిఖిల్ సింగ్, డాక్టర్ సుబ్బారెడ్డి కళాశాలలోని సమస్యల గురించి ప్రిన్సిపల్‌కు వినతిపత్రం అందజేశారు. కళాశాల సమస్యల గురించి ప్రస్తావించారు. సానుకూలంగా స్పందించిన ప్రిన్సిపల్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
దూరవిద్య కోర్సుల ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ
డైరెక్టర్ ఆచార్య కృష్ణారెడ్డి వెల్లడి కడప ఎడ్యుకేషన్: యోగి వేమన యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీవోఈ) ద్వారా పలు కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ ప్రొఫెసర్ కె. కృష్ణారెడ్డి తెలిపారు. బుధవా రం ఆయన ప్రిన్సిపల్ ఎస్ రఘునాథరెడ్డి, రిజిస్ట్రా ర్ ప్రొఫెసర్ పి.పద్మ తో కలిసి మాట్లాడారు. యోగి వేమన విశ్వవిద్యాలయం గుర్తింపునిచ్చిన అధ్యయన కేంద్రాల్లో ఎంఏ ఎకనామిక్స్, ఇంగ్లిష్, హిస్టరీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, తెలుగు, ఎం కామ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. బ్యాచిలర్ డిగ్రీలో ఎకనామిక్స్ చదివిన వా రికి మాత్రమే ఎంఏ ఎకనామిక్స్ లో ప్రవేశాలు ఉంటాయని అలానే బీకాం, బీబీఏ, బీబీఎం డిగ్రీ చేసిన వారు ఎంకామ్‌లో ప్రవేశాలకు అర్హులన్నారు. మిగిలిన అన్ని కోర్సులకు ఏదేని డిగ్రీ పాసైతే చాలన్నారు. ఈ ఏడాది నూతనంగా బ్యాచిలర్ ఆఫ్ ఫైనార్ట్స్ (బీఎఫ్ఏ ఆనర్స్) మ్యూజిక్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించామన్నారు. ఈ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్, సమాన అర్హత గల వారు ప్రవేశానికి అర్హులన్నారు. ఈ కోర్సులన్నీ డిస్టెన్స్, ఆన్లైన్ లర్నింగ్ విధానంలో ఉంటాయన్నారు. వివరాలకు https://code.yvu.edu.inను సంప్రదించాలని సూచించారు. -
● 2024లో నాసిరకం అద్దాలకు అడ్డుకట్ట..
విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం 2024లో కూడా జరిగింది. అప్పుడు టెండర్లను ఆహ్వానించినప్పుడు పంపిణీదారులకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అప్పట్లో ప్రకాశం జిల్లాకు చెందిన పంపిణీదారుడు టెండరులో పాల్గొన్నారు. రూ.180కే నాణ్యమైన కళ్లద్దాలను పంపిణీ చేస్తానని టెండర్ వేశారు. కడప నగరానికి చెందిన ఇదే వ్యక్తి నాడు రూ.168కే పంపిణీ చేస్తానని టెండర్ దక్కించుకున్నారు. ఈ పంపిణీదారుడు అప్పుడు కూడా నమూనాగా నాణ్యమైన కళ్ల జోళ్లను చూపి నాసిరకం అద్దాలను పంపిణీ చేసేందుకు యత్నించారు. దీంతో ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి అడ్డుతగిలారు. కడప నగరానికి చెందిన పంపిణీదారుడు నాసిరకం అద్దాలు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో కడప పంపిణీదారుడు గత్యంతరం లేక నాణ్యమైన కళ్లద్దాలు పంపిణీ చేయడంతో గొడవ సద్దుమణిగింది. -
రైతులను ఆదుకోని ప్రభుత్వం
ఖాజీపేట : కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం.. రైతులను మోసగించిన దగా ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఖాజీపేట మండలం బి.కొత్తపల్లె పంచాయతీ బక్కాయపల్లె గ్రామంలో యువ రైతు పత్తి రామచంద్రారెడ్డి పొలంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్నారు. మృతి చెందిన రైతుకు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతికి గల కారణాలను ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చనిపోయిన రైతు మంచి రైతుగా గ్రామంలో పేరు ఉందన్నారు. తాను పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక పోవడంతో ఏటా సాగుకు అప్పులు తీసుకు వచ్చి సాగు చేసేవాడన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేక పోవడంతోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తోందన్నారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని ఆయన అన్నట్లుగానే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రైతులకు అందాల్సిన రైతు భరోసా ఎక్కడని ప్రశ్నంచారు. తమ ప్రభుత్వంలో రైతులు ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ చెల్లించేవారు కాదన్నారు. ప్రభుత్వమే రైతుల తరపున ఇచ్చేదని తెలిపారు. ఒక్క ఖాజీపేట మండలానికే పంట నష్ట పరిహారం రూ.27 కోట్లు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చారని గుర్తు చేశారు. ఇన్పుట్ సబ్సిడీతో పాటు రైతుల పంటకు గిట్టుబాటు ధర లేకపోతే గిట్టు బాటు ధర కల్పించి కొనుగోలు చేశామన్నారు. నేడు కూటమి ప్రభుత్వం రైతుల నుంచి ఒక్క గింజైనా కొనుగోలు చేసిందా అని ప్రశ్నంచారు. రైతు అత్మహత్యలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని హితవు పలికారు. చనిపోయిన రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ వ్యవసాయ సలహాదారు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి రాఘవరెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ కడప జోనల్ మాజీ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మైదుకూరు రైతు విభాగం నాయకుడు నాగిరెడ్డి, కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అన్నం పెట్టే రైతుకు దిక్కులేకుండా పోయింది కడప కార్పొరేషన్ : అన్నం పెట్టే రైతుకు కూటమి ప్రభుత్వంలో దిక్కులేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ బక్కాయపల్లె గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న యువ రైతుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారన్నారు. పెద్ద కుమార్తె పదో తరగతి పరీక్షలు రాస్తుండగా, చిన్న కుమార్తె 7వ తరగతి చదువుతోందన్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని గాలికొదిలేసిందని, ఫలితంగా అప్పులు ఎక్కువై వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. రెండు నెలల క్రితం మైలవరంలో మిర్చి రైతు, ఇప్పుడు వరి రైతు ఉసురు తీసుకున్నాడన్నారు.మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి -
● 2024లో నాసిరకం అద్దాలకు అడ్డుకట్ట..
విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం 2024లో కూడా జరిగింది. అప్పుడు టెండర్లను ఆహ్వానించినప్పుడు పంపిణీదారులకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అప్పట్లో ప్రకాశం జిల్లాకు చెందిన పంపిణీదారుడు టెండరులో పాల్గొన్నారు. రూ.180కే నాణ్యమైన కళ్లద్దాలను పంపిణీ చేస్తానని టెండర్ వేశారు. కడప నగరానికి చెందిన ఇదే వ్యక్తి నాడు రూ.168కే పంపిణీ చేస్తానని టెండర్ దక్కించుకున్నారు. ఈ పంపిణీదారుడు అప్పుడు కూడా నమూనాగా నాణ్యమైన కళ్ల జోళ్లను చూపి నాసిరకం అద్దాలను పంపిణీ చేసేందుకు యత్నించారు. దీంతో ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి అడ్డుతగిలారు. కడప నగరానికి చెందిన పంపిణీదారుడు నాసిరకం అద్దాలు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో కడప పంపిణీదారుడు గత్యంతరం లేక నాణ్యమైన కళ్లద్దాలు పంపిణీ చేయడంతో గొడవ సద్దుమణిగింది. -
ఫ్లైయాష్ వ్యవహారంపై విచారణ
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో ఫ్లైయాష్ రవాణా వ్యవహారంపై ఏపీజెన్కో యాజమాన్యం రహస్యంగా విచారణ చేపట్టింది. గురువారం ఏపీజెన్కో నుంచి కొందరు అధికారులు విచారణ నిమిత్తం ఆర్టీపీపీకి వచ్చారు. గతంలో ఫ్లైయాష్ విషయంలో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలడంతో ముగ్గురు అధికారులపై వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఫ్లైయాష్ వ్యవహారంపై రహస్యంగా విచారణ చేపట్టడం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ విషయంపై ఆర్టీపీపీ సీఈ గౌరీపతిని ఫోన్లో వివరణ కోరగా సాధారణ విచారణలో భాగంగానే ఏపీజెన్కో నుంచి అధికారులు వచ్చి విచారణ చేపడుతున్నారని తెలిపారు. మామిడి తోటకు నిప్పు – 40 చెట్లు దగ్ధం చిన్నమండెం : ఆకతాయిలు మామిడి తోటకు నిప్పు పెట్టడంతో 40 మామిడిచెట్లు కాలిపోయినట్లు బాధిత రైతులు బయన్న, రామచంద్ర, రమణయ్య తెలిపారు. వారి కథనం మేరకు.. మండల పరిధిలోని నాగూరువాండ్లపల్లె సబ్ స్టేషన్ పక్కన గల మామిడితోట వద్ద గల కంచెకు ఆకతాయిలు నిప్పు పెట్టారు. దీంతో మామిడి తోట దగ్ధం కావడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు చేరుకొని మంటలను అదు చేశారు. అప్పటికే 40 చెట్లు కాలిపోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
చెడు వ్యసనాలకు బానిసలై.. ఏటీఎంలో చోరీకి యత్నం
ఇద్దరు నిందితుల అరెస్టుఎర్రగుంట్ల : చెడు వ్యసానాలకు బానిసలై డబ్బుల కోసం ఏకంగా ఏటీఎంలో చోరీకి యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి కారు, గ్యాస్ సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో పట్టణ సీఐ నరేష్‌బాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. రాజుపాళెం మండలం తొండలదిన్నె గ్రామానికి చెందిన కొత్తమాసి సుధీకర్, గాలిపోతుల అభిషేకం స్నేహితులు. వీరిలో కొత్తమాసి సుధీకర్ 2020 సంవత్సరం నుంచి సెక్యూర్ వ్యాలీవ్ కంపెనీ ద్వారా ఏటీఎంలకు డబ్బులను లోడ్ చేసేవాడు. ఇతను చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ నెలలో ఏటీఎంలకు డబ్బులు లోడ్ చేసే క్రమంలో అప్పుడుప్పుడు డబ్బులను దొంగిలిస్తూ సుమారు రూ.36 లక్షలు తన చెడు వ్యసనాలకు వాడుకున్నాడు. సెక్యూర్ వ్యాలీవ్ కంపెనీవారు డబ్బులు కాజేసిన విషయాన్ని తెలిసుకుని కొత్తమాసి సుధీకర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. వాడుకున్న డబ్బును ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి వద్ద నుంచి వసూలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత సుధీకర్ జల్సాలకు డబ్బులు అవసరం కావడంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. దీంతో ఎర్రగుంట్ల పట్టణం వేంపల్లి రోడ్డులో ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం మూసి ఉన్న విషయం తెలుసుకున్నాడు. గతంలో ఈ ఏటీఎంలో డబ్బులు లోడ్ చేసి ఉండటంతో సులువుగా డబ్బులు దొంగిలించవచ్చనుకున్నాడు. ఈ తరుణంలోనే ప్రొద్దుటూరులోని ఆటో నగర్లో వెల్డర్‌గా పనిచేస్తున్న గాలిపోతుల అభిషేకంను తోడు చేసుకుని గ్యాస్ , ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం ఏటీఎంలోకి వచ్చి షటర్ మూసి ఏటీఎం బాక్సును కట్ చేసి డబ్బులు సులువుగా దొంగిలించవచ్చనుకున్నారు. అయితే ఏటీఎం క్యాష్ బాక్స్ మెయిన్ డోర్ ఎంత సేపటికి తెరుచుకోలేదు. దీంతో ఎవరైనా వస్తారేమో అనే భయంతో అక్కడి నుంచి కారులో వస్తువులన్నీ వేసుకుని వెళ్లిపోయారు. ఈ విషయంపై ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులిద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
రైతు వ్యతిరేక ప్రభుత్వమిది
కడప సెవెన్‌రోడ్స్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు–కరువు కవల పిల్లల్లాంటి వారని ఎద్దేవా చేశారు. కరువుతో రైతులు, వ్యవసాయ కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చాలా ప్రాంతాల్లో పంటలు పూర్తిగా కోల్పోవాల్సి వచ్చిందని, కొన్ని ప్రాంతాల్లో సగం పంటలు చేతికి వచ్చాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి రైతులకు సరైన ప్రోత్సాహం లేనందువల్ల ఆత్మహత్యలు చేసుకో వాల్సిన దుర్గతి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రమం తప్పకుండా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేవారన్నారు. అన్నదాత సుఖీభవ పేరిట తాను రూ. 20 వేలు ఇస్తానంటూ ఎన్నికల ముందు ప్రకటించిన చంద్రబాబు ఈ సంవత్సరం దాని ఊసే మరిచిపోయారని విమర్శించారు. జిల్లాలో శనగ, మినుములు, కంది, వరి, చెరుకు లాంటి ఏ పంటకు మద్దతు ధర కల్పించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ యేడాది శనగ ఎకరాకు 3–4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందన్నారు. ప్రభుత్వం మద్దతు ధరతో మార్క్‌ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే ఈ–క్రాప్ చేసుకోవాలని ఇంకా పలు నిబంధనలు విధించడం వల్ల రైతులు అదే ధరకు బయట వ్యాపారులకు విక్రయిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అరటి, ఎర్రగడ్డలకు సైతం మద్దతు కల్పించామన్నారు. చంద్రబాబు పాలనలో ఉద్యాన పంటలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారన్నారు. జిల్లాలో 42 డిగ్రీల ఎండ తీవ్రత ఉండడంతో మామిడి పూత, పిందె రాలిపోతోందని, ఈ పరిస్థితుల్లో మామిడి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పంటల మద్దతు ధర కోసం బడ్జెట్లో అరకొర కేటాయింపులు చేశారని, అవి కూడా ఏమేరకు విడుదల చేస్తారో తెలియడం లేదన్నారు. రైతు వ్యతిరేకి చంద్రబాబు ప్రభుత్వానికి బుద్దిచెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. రైతు నాయకుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరిలో క్వింటాలు బుడ్డశనగ ధర రూ. 5100 నుంచి రూ. 5250 వరకు ఉండేదన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కల్లాల్లోనే వ్యాపారులకు విక్రయించుకున్నారని, ప్రస్తుతం ఐదు శాతం శనగలు కూడా రైతుల వద్ద లేవన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు బాలయ్య, ఆ పార్టీ నాయకులు పులి సునీల్‌కుమార్, ఇలియాస్, మునిశేఖర్‌రెడ్డి, నాగేంద్ర, నాగేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర లేదు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి -
కళ్లద్దాలకు..అవినీతి మసక !
‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అనే సంగతిని మరిచారు. పాపం.. దృష్టి లోపంతో బాధపడుతున్న చిన్నారుల కళ్లద్దాలపై అవినీతి కన్ను పడింది. నాసిరకం కళ్లద్దాలను పంపిణీ చేశారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థలో వెలుగు చూసిన అక్రమాలు విస్మయం కలిగిస్తున్నాయి. సాక్షి టాస్క్‌ఫోర్స్ : జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయాలని జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్ణయించింది. ఆ మేరకు కళ్ల జోళ్ల పంపిణీ కోసం 2025 జనవరి 4వ తేదీన టెండర్లు పిలిచారు. ఇందులో జిల్లాలోని పాఠశాల విద్యార్ధులకు కంటి పరీక్షల కార్యక్రమంలో భాగంగా దృష్టి లోపంతో బాధపడుతున్న 5,200 మందికి ఉచితంగా కళ్ల జోళ్లను పంపిణీ చేయాలి. సకాలంలో మంచి నాణ్యత గల కళ్ల జోళ్లు అందించగల సంస్ధల నుంచి టెండర్లను ఆహ్వానించారు. టీఆర్–90/పాలీకార్బొనేట్ ఫుల్ ఫ్రేమ్ (బాలురు, బాలికలకు వివిధ రకాల రంగుల్లో) లెన్స్:సీఆర్–39 (ప్లాస్టిక్ లెన్స్) నాణ్యత కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన సరఫరాదారులు తమ కనిష్ట ధరను సీల్డ్ కవర్లో ఉంచి నమూనా ఫ్రేముతో పాటుగా 6 నుంచి 17వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు జిల్లా అంధత్వ నివారణ సంస్థ (జిల్లా ప్రోగ్రాం మేనేజర్)కు అందజేయాలని సూచించారు. కాగా టెండరు ప్రకటనలో వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోని సంస్థల (ఆప్టికల్ షాపుల యాజమాన్యాలు) వారు మాత్రమే టెండర్లలో పాల్గొనాలని షరతు విధించారు. గతంలో ఇలా ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు మాత్రమే జిల్లాలో ఉన్న వారికి మాత్రమే టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం కల్పించడంపై అనుమానాలు తలెత్తాయి. ఇలా ఆదిలోనే అక్రమాలకు బీజం పడినట్లయింది. అనుకూలమైన వారికి వచ్చేలా చక్రం తిప్పారు.. ఈ టెండర్లలో జిల్లాకు చెందిన వారు మొత్తం నలుగురు పాల్గొన్నారు. అందులో కడప నగరానికి చెందిన ఆప్టికల్ షాపు యజమాని రూ.270 విలువైన నాణ్యమైన కళ్లద్దాలు, బాక్స్‌ను పంపిణీ చేస్తానని టెండర్లో పొందుపరిచారు. మిగతా ముగ్గురు అంతకంటే తక్కువ ధరను కోట్ చేశారు. వాస్తవానికి టెండర్ తక్కువ ధరకు వేసిన వారికే రావాలి. అయితే ఇక్కడ కడప నగరానికి చెందిన పంపిణీదారుడికి టెండర్ దక్కాలని మిగతా ముగ్గురు టెండర్‌దారులతో మధ్యవర్తిత్వం నడిపారు. ఒప్పందం కుదిర్చారు. దీంతో సిండికేట్‌గా మారారు. అందుకు గాను ఒకరికి రూ 1.70 లక్షలు, మిగతా ఇద్దరికి రూ.70 వేలు చొప్పున డబ్బును ముట్టజెప్పినట్లు తెలిసింది. ఫలితంగా టెండర్ల నుంచి ముగ్గురు తప్పుకోవడంతో కడప నగరానికి చెందిన పంపిణీదారుడి టెండర్ సీల్డ్ కవర్‌ను బాక్స్‌లో వేశారు. ఆ బాక్సులో ఉన్న కవర్‌ను జాయింట్ కలెక్టర్ చాంబర్లో తెరిచారు. టెండర్ తమకు అనుకూలమైన కడప నగరానికి చెందిన పంపిణీదారుడికి దక్కేలా చేసే విషయంలో అధికారులకు..టెండర్‌దారులకు మధ్య డీల్ కుదిరేలా ఒక ఆప్తాలమిక్ ఆఫీసర్ వ్యవహారం నడిపారనే ఆరోపణలున్నాయి. నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేశారు..కళ్ల జోళ్ల నాణ్యతా ప్రమాణాలను ఆ విభాగంలో పనిచేసే ఆప్తోమెట్రిస్ట్ (అద్దాలను పరీక్షించేవారు), ఆప్తాలమిక్ ఆఫీసర్స్ (కంటి వైద్యాధికారులు) పరీక్షిస్తారు. అలాగే ఈ నాణ్యతా పరీక్షలను రిమ్స్ కంటి వైద్యులు నిర్వహించాలి. ఈ నిర్ధారణ పరీక్షల్లో నాణ్యమైన అద్దాలని తేలితేనే విద్యార్థులకు అందజేయాలి. అయితే ఈ ప్రమాణాలను పాటించిన దాఖలాలు లేవు. కాగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆప్తాలమిక్ ఆఫీసర్స్ 15 మంది పనిచేస్తున్నారు. లక్షలు నొక్కేశారు..ప్రస్తుతం రూ.270తో పంపిణీ చేసిన కళ్ల జోళ్లు ఒక ప్రముఖ కంటి వైద్యశాలలో రూ. 60–80కే లభిస్తున్నట్లుగా అనుకుంటున్నారు. ఆ ప్రకారం ఒక జత కళ్ల జోళ్ల ధర రూ.270తో అయితే మొత్తం రూ.14.04 లక్షలు అవుతుంది. అదే రూ.80తో వేసుకుంటే మొత్తం రూ. 4.16 లక్షలు అవుతుంది. అంటే దాదాపుగా రూ.10 లక్షల వరకు చేతులు మారాయి. ఈ అంశాలపై ఇంటా..బయటా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవినీతి వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కడప పాత రిమ్స్‌లోని జిల్లా అంధత్వ నివారణ సంస్థ కార్యాలయం టెండర్ల ఆహ్వానంలోనే మతలబు 5,200 మంది విద్యార్థులకు నాసిరకం కళ్ల జోళ్లు అందజేత రూ.లక్షలు నొక్కేసిన వైనం జిల్లా అంధత్వ నివారణ సంస్థలో అక్రమాలు -
రైతన్న ఉసురు తీసిన అప్పులు
ఖాజీపేట : సాగుచేసిన పంటలకు సరైన మద్దతు ధర లేకపోవడం, సరైన దిగుబడి రాక పోవడంతో ఏటా సాగు వ్యయం పెరిగింది. చేసిన అప్పులు తీరడం లేదు. వడ్డీల మీద వడ్డీలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనో వ్యథతో ఓ యువ రైతు తన పంట పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖాజీపేట మండలం బి.కొత్తపల్లె పంచాయతీలోని బక్కాయపల్లె గ్రామానికి చెందిన పత్తి రామచంద్రారెడ్డి (42) చురుకై న వ్యవసాయ యువ రైతు. తనకు 2.50 ఎకరాల పొలం ఉంది. ఈ పొలంతో పాటు అదనంగా 10 ఎకరాలను గుత్తకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో పంటలు సాగు చేసేవాడు. ముఖ్యంగా వరి, వేరుశనగతోపాటు పలురకాల పంటలు సాగు చేసేవాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా పంట దిగుబడి వస్తే మార్కెట్లో సరైన గిట్టుబాటుధర లేక పోవడం, ఇలాగే మార్కెట్లో ధర ఉన్నప్పుడు సరైన దిగుబడి రాక పోవడం జరిగేది. దీంతో పండించిన పంటలపై సరైన ఆదాయం లేదు. పొలం గుత్త చెల్లించలేక ఏటా నష్టాలను చవిచూడాల్సి వచ్చేది. పంట సాగు కోసం ఏటా అప్పులు తీసుకురావడం.. ఆ అప్పులు తీరక ముందే పంట సాగు చేసే ప్రయత్నంలో తిరిగి అప్పు లు చేయడం మామూలైంది. ఫలితంగా అప్పులు అధికమై తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. పొలంలోనే ఆత్మహత్య.. ఏటా తాను సాగుచేసే పంటలకు అప్పులు తీసుకు రావడం వల్ల సుమారు రూ.15లక్షల మేరకు అప్పులు అయ్యాయి. వచ్చే సీజన్లో పంటలు సాగుచేస్తే ఆదాయం వస్తుందన్న నమ్మకాన్ని రైతు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఈనెల 18వ తేదీ మంగళవారం రాత్రి పొలంలో పంటకు నీరు పట్టి వస్తానని ఇంటిలో చెప్పి పొలం వద్దకు వెళ్లాడు. పొలంలోనే పురుగుల మందు తాగి అక్కడే పడిపోయాడు. పొలంలో పడిపోయి ఉన్న రైతును చూసి మరో రైతు పిలిచాడు. ఎంతకూ పలకక పోవడంతో దగ్గరకు వెళ్లి చూడగా చనిపోయినట్లు గమనించి గ్రామస్తులకు సమాచారం చేరవేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పొలం వద్దకు చేరుకుని పత్తి రామచంద్రారెడ్డి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. కేసు నమోదు మృతి చెందిన రైతు భార్య పత్తి శిరీషా ఫిర్యాదు మేరకు ఖాజీపేట సీఐ మోహన్ కేసు నమోదు చేశారు. కడప రిమ్స్‌లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బుధవారం సాయంత్రం బంధువులు అంత్యక్రియలు నిర్వహంచారు. పురుగుల మందు తాగి యువ రైతు ఆత్మహత్య -
మైదుకూరులో ఆలయ భూముల సర్వే
మైదుకూరు : మైదుకూరులో శ్రీ పార్వతీ సమేత భీమేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూములను బుధవారం దేవదాయ శాఖ అధికారులు సర్వే చేయించారు. పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డులో ఇటీవల కొందరు నిర్మించిన కాంప్లెక్స్ దేవాలయ భూముల్లో నిర్మించారని ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో బుధవారం దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ భూమును పోలీసు బందోబస్తుతో సర్వే చేసి కొలతలు వేశారు. భీమేశ్వరస్వామి ఆలయానికి చెందిన సర్వే నంబర్లు 1052/ఏ లో 1.98 ఎకరాలు, 1052/బీలో 1.83 ఎకరాలు, 1052/సీలో 0.65 ఎకరాలు, 1845లో 10.20 ఎకరాలు, 1031లో 6.22 ఎకరాలు, 1054లో 1.56 ఎకరాలు, 1054/బీలో 1.34 ఎకరాలు, 1087/ఏలో 2.10 ఎకరాలు ఉన్నాయని ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ విలేకరులకు తెలిపారు. కాగా బుధవారం కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారి బైపాస్ సమీపంలో కేసీ కెనాల్‌కు ఉత్తరం వైపున ఉన్న సర్వే నంబర్ 1052/ఏలోని 1.98 ఎకరాలను, 1052/సీలోని 0.65 ఎకరాలను సర్వే చేయించి గుర్తింపు రాళ్లను పాతించారు. 1052/బీలోని 1.83 ఎకరాలకు సంబంధించిన భూముల్లో నిర్మాణాలు చేసిన వారు అభ్యంతరం వ్యక్తం చేయడం, వాటిపై కోర్టుకు వెళ్లినట్టు తెలియడంతో ఆ సర్వే నంబర్లోని భూములను దేవదాయ శాఖ అధికారులు సర్వే చేయించలేదు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ ఆలయ భూముల్లో కొందరు నిర్మాణాలు చేపట్టడంపై ఇటీవల ఫిర్యాదులు రావడంతో భూములను గుర్తించేందుకు సర్వే చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవదాయశాఖ ప్రొద్దుటూరు ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ రెడ్డి, మైదుకూరు ఈఓ ప్రసాద్ రావు, కడప ఇన్స్పెక్టర్ శివయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ మీటర్ రీడర్ల నిరసన
ప్రొద్దుటూరు : స్థానిక విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద మంగళవారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో మీటర్ రీడర్లు నిరసన తెలిపారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ మీటర్ రీడర్స్‌కు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలన్నారు. అనంతరం వారు ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ రమణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు సబ్ డివిజన్ యూనియన్ నాయకులు శ్రీనివాసులు, సుధాకర్, సురేష్, రమణ, శేఖర్, ప్రసాద్, పవన్‌కుమార్, లక్ష్మీనారాయణ, సుబ్బారెడ్డి, రమణ, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. మండుతున్న కొండలు – వృక్ష సంపద అగ్నికి ఆహుతి పులివెందుల రూరల్ : అడవికి నిప్పు పెట్టడంతో మానవాళికి ముప్పు కలుగుతోంది. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల, చక్రాయపేట, వేముల, పులివెందుల మండలాల్లోని కొండలు అగ్నికి ఆహుతి కావడంతో వృక్ష సంపద కనుమరుగవుతోంది. రేయింబవళ్లు కొండలపై మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. కొండ, గుట్ట ప్రాంతా లలో కొంతమంది వ్యక్తులు కొండలకు నిప్పు పె ట్టడంతో కొండలు, గుట్ట ప్రాంతాల్లో ఉన్న వృక్ష సంపద ఎందుకు పనికిరాకుండా పోతోంది. ఆకతాయిలు కొండలకు నిప్పు పెట్టడంతో వృక్ష సంపదతోపాటు వన్య ప్రాణులకు తీవ్ర నష్టం జరుగుతోంది. దీనిపై అటవీ శాఖ అధికారులు దృష్టి సారించి అటవీ సంపదను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాకు 5500 ఫారం పాండ్స్ మంజూరు చక్రాయపేట : జిల్లాకు కొత్తగా 5500 ఫారం పాండ్స్ మంజూరయ్యాయని డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక సీ్త్ర శక్తి భవనం వద్ద జరిగిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ బృందం నిర్వహించిన ఓపెన్ ఫోరం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చక్రాయపేట మండలంలో సామాజిక తనిఖీ బృందం పరిశీలన సందర్భంగా రూ.55,227 రికవరీ చేశామన్నారు. జిల్లాకు మంజూరైన 5500 ఫారం పాండ్స్‌ను మార్చి నుంచి జూన్ వరకు నెలకు 1400 చొప్పున పూర్తి చేసేలా ప్రణాళిక తయారు చేశామని చెప్పారు. ఈనెల 22న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫారం పాండ్లకు సంబంధించి భూమి పూజ చేస్తారన్నారు. కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ అధికారి భాస్కర్, ఏపీడీ సోమశేఖరరెడ్డి, డీవీవీఓ రామలింగేశ్వరరెడ్డి, ఏఓ వెంకటరమణ, ఎస్ఆర్పీ భాస్కర్, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు -
జెడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
కడప సెవెన్‌రోడ్స్: కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 23న జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు ఉద్దేశించిన ప్రత్యేక సమావేశం ఏర్పాటు కోసం నోటీసు జారీ చేస్తారు. ఈ నోటీసు జెడ్పీ సభ్యులందరికీ అధికారులు అందజేయాల్సి ఉంటుంది. ఈనెల 27వ తేది ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఆరోజు ఉదయం 10 గంటల ముందు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 12.00 గంటల్లోపు స్క్రూటినీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అర్హతగల నామినేషన్ల జాబితా విడుదల చేస్తారు. 1 గంటవరకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. ఆపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. సమావేశం ముగిసిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. ఏదైనా కారణాల వల్ల ఆరోజు ఎన్నిక జరగకపోతే మరుసటిరోజు ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఉమ్మడి కడపజిల్లాలోని ఖాజీపేట, ఒంటిమిట్ట, రాయచోటి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన ఆకేపాటి అమర్నాథరెడ్డి రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున గెలుపొందడంతో ఈ ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం ఇన్చార్జి చైర్ పర్సన్‌గా జేష్ఠాది శారద వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో జిల్లా పరిషత్‌కు కొత్త అధ్యక్షుడు ఎన్నిక కానుంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని హనుమనగుత్తి గ్రామానికి చెందిన గోటూరు సుబ్బరాయడు కుమారుడు గోటూరు మంజుగోపాల్ (9) సరదాగా ఈతకు వెళ్లి పెన్నానదిలో పడి మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. అదే గ్రామానికి చెందిన స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గోటూరు సుబ్బరాయుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు. మధ్యాహ్నం సమయంలో స్నేహితులతో కలసి మంజుగోపాల్ సమీపంలో ఉన్న పెన్నానదికి వెళ్లాడు. పెన్నానదిలో అనేక పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఆ గుంతలలో సరదాగా స్నేహితులతో కలసి ఈతకు దిగాడు. అంతే గుంతలోని అడుగు భాగంలో మంజుగోపాల్ ఇరుక్కున్నాడు. పైకి రాకపోవడతో వెంటనే స్నేహితులు మంజుగోపాల్ తండ్రి సుబ్బరాయుడుకి సమాచారం అందించారు. వెంటనే స్థానికుల సాయంతో బాలుడిని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రలు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఏపీఎస్ ఆర్టీసీ కడప డిపో మేనేజర్ డిల్లీశ్వరరావు తెలిపారు. మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు పలు అంశాలను డీఎం దృష్టికి తీసుకు వచ్చారు. దువ్వూరుకు కడప నుంచి నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలని ఓ ప్రయాణికుడు కోరారు. అలాగే కృష్ణాపురంలో స్టేజ్ ఏర్పాటు చేయాలని, ఒంగోలుకు ఎక్స్‌ప్రెస్ బస్సు నడపాలని, విజయవాడకు కావలి మీదుగా బస్సు ఏర్పాటు చేయాని మరికొందరు కోరారు. చిత్తూరుకు ప్రస్తుతం నడుస్తున్న బస్సులకు తోడు అదనపు సర్వీసులు ఏర్పాటు చేయడంతోపాటు టైమింగ్ అప్డేట్ చేయాలన్నారు. శ్రీశైలంకు ఎక్స్‌ప్రెస్ కాకుండా సూపర్ లగ్జరీ బస్సు నడపాలన్నారు. పామూరుకు బస్సు ఏర్పాటు చేయాలని, ఎర్రగుంట్లకు సాయంత్రం 6 తరువాత బస్సు ఏర్పాటు చేయాలని, సబ్ జైలు దగ్గర బస్ షెల్టర్ ఆక్రమణలు తొలగించాలన్నారు. బస్టాండులో వివిధ వస్తువులను అధిక ధరలకు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.ఖాజీపేట బస్సు స్టేషన్లో దెబ్బతిన్న కుర్చీలను బాగు చేయాలని, బస్సులు ఆపని సిబ్బందిపై చర్య తీసుకోవాలని కోరారు. -
‘కోట్లు మింగేశారు’పై విచారణ
కడప రూరల్: జిల్లా క్షయ నియంత్రణ విభాగంలో జరిగిన అక్రమాల ఆరోపణలపై ఈ నెల 16న సాక్షిలో ప్రచురితమైన ‘క్షయ నియంత్రణ పేరుతో కోట్లు మింగేశారు’ కథనంపై రాష్ట్ర స్థాయి క్షయ నియంత్రణ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు మంగళవారం స్ధానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని మీటింగ్ హల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డాక్టర్ నాగరాజు, డీఐఓ డాక్టర్ ఉమామహేశ్వరకుమార్, ఇద్దరు ఆఫీస్ సూపరెండెట్లు విచారణ చేపట్టారు. క్షయ నియంత్రణ విభా గం జిల్లా కార్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న సిబ్బందిని విచారణకు పిలిపించారు. ఈ సందర్భంగా సిబ్బంది పలు అంశాలను.. ఆసక్తికరమైన విషయాలను విచారణ అధికారుల దృష్టికి తెచ్చినట్లుగా తెలిసింది. అధికారులు చేపుడుతున్న విచారణ..అందుకు సంబంధించి ఉన్నతాధికారులకు సమర్పించే నివేదిక..తదుపరి చర్యలపై ఆ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. -
కార్మికులు అప్రమత్తంగా ఉండాలి
కడప కోటిరెడ్డిసర్కిల్: పెరిగిన ఉష్ణోగ్రతల నేపధ్యంలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ఉప కార్మిక కమిషనర్ శ్రీకాంత్‌నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కార్మికుల రక్షణకు యాజమాన్యాలు తమవంతుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్మికుల పని వేళల్లో మార్పు చేయాలని, పని ప్రాంతంలో చల్లని నీరు, నీడ వసతి కల్పించాలని, వైద్య సిబ్బందిచే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్లూయిడ్స్, అత్యవసర మందులు సమకూర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశంలో కార్మికులు పనిచేయకుండా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. కుట్టుమిషన్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ప్రొద్దుటూరు: బీసీ కార్పొరేషన్, కాపు, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కార్పొరేషన్లకు సంబంధించి మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వి.మల్లికార్జున మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22లోపు ఏపీఓబీఎంఎంఎస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఎంపికై న లబ్ధిదారులకు శిక్షణ అనంతరం 75 శాతంపైగా హాజరు కలిగిన వారికి సర్టిఫికెట్, ఉచితంగా కుట్టుమిషన్ అందిస్తారని వివరించారు. 18–50 ఏళ్లలోపు గల మహిళలు అర్హులని, తెల్ల రేషన్‌కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు ఉండాలని, కుటుంబంలో ఒకరు మాత్రమే లబ్ధి పొందుటకు అర్హులని తెలిపారు. మద్యం ప్రీమియం స్టోర్‌కు... కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక ప్రీమియం స్టోర్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని జిల్లాప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రీమి యం స్టోర్ లైసెన్స్ వ్యవధి 5 ఏళ్లని, లైసెన్స్ ఫీజు ఏడాదికి రూ. కోటి ఉంటుదని రెండవ సంవత్సరం నుంచి ఉన్న ఫీజు 10 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొన్నారు. ప్రీమియం స్టోర్ కార్పెట్ వైశాల్యం 4 వేల చదరపు అడుగులు ఉండాలని తెలిపారు. ప్రీమియం స్టోర్ దరఖాస్తు కోసం రుసుము రూ. 15 లక్షలు డీడీ ద్వారా తీసుకురావాలని సూచించారు. ఆసక్తి గల వారు ఈ నెల 26 సాయంత్రం 5 లోపల దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆర్టీపీపీలో పెరిగిన బొగ్గు నిల్వలు ఎర్రగుంట్ల: డాక్టరు ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో బొగ్గు నిల్వలు పెరిగాయి. ప్రస్తుతం ఆర్టీపీపీలో 1.38లక్షలు మెట్రిక్ టన్నులు నిల్వలు ఉన్నాయని ఆర్టీపీపీ సీఈ గౌరీపతి మంగళవారం తెలిపారు. ఆర్టీపీపీలోని 1,2,3,4,5,6 యూనిట్లలో గాను 1650 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తికి గాను ప్రస్తుతం 1420 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని వెల్లడించారు. అన్ని యూనిట్లులో విద్యుత్ ఉత్పత్తికి గాను సుమారు 21 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగం అవుతోందని పేర్కొన్నారు. పైడిపాళెం ఆయకట్టుకు కృష్ణా జలాలు కొండాపురం: గండికోట జలాశయంలో నుంచి గండికోట ఎత్తిపోతలపథకం వద్ద ముడు మోటర్ల ద్వారా 300 క్యూసెక్కులనీటిని పంపింగ్ చేస్తున్నట్లు జీకేఎల్ఐ ఈఈ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పైడిపాళెం జలాశయ ఆయకట్టు రైతులకు సాగు,తాగునీరు అవసరాల కోసం గండికోట ఎత్తిపోతల పథకం నుంచి గండికోట డ్యామ్ లో నిల్వ ఉన్న కృష్ణ జలాలను పంపింగ్ చేస్తున్నామన్నారు. పైడిపాళెం జలాశయం పూర్తి సామర్థ్యం 6 టిఎంసీలు ఉండగా ప్రస్తుతం జలాశయంలో4.2 టిఎంసీలు నిల్వ ఉన్నట్లు ఆయన తెలిపారు.గండికోట జలాశయం పూర్తి సామర్థ్యం 26.85 టిఎంసీలు ఉండగా ప్రస్తుతం గండికోట లో 23.5టిఎంసీలు ఉన్నట్లు గాలేరినగరి సృజలస్రవంతి ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. -
మత సామరస్యం కాపాడాలి
కడప అర్బన్ : ఇటీవల రాయచోటి, చెన్నూరు సంఘటనల నేపథ్యంలో జిల్లాలో మతసామరస్యం కాపాడాలని మంగళవారం అఖిలపక్ష కమిటీ, మైనార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి, ఎన్ఆర్సీ జేఏసీ కన్వీనర్ అహ్మద్ బాబు బాయ్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అఫ్జల్ ఖాన్, సీపీఐ ఎం ఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఓబయ్య మాట్లాడుతూ జిల్లాలో మత సామరస్యం, శాంతిని, లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కొందరి కుట్రల కారణంగా మత ఘర్షణలు చెలరేగి శాంతి భద్రతల సమస్య తలెత్తి ప్రజల్లో అనైక్యతకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల శాంతి సంఘాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూల విజయభాస్కర్, ముస్లిం ఫెడరేషన్ అధ్యక్షుడు మహమ్మద్ జాకీర్, మౌలానా సిరాజ్ బుఖారి, ఆప్ కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మగ్బూల్ బాషా, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ షాజహాన్, సయ్యద్ చాంద్‌బాషా, ఇండిపెండెన్స్ పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పాస్టర్ విజయభాస్కర్, క్రైస్తవ పెద్దలు వారధి జోసెఫ్, దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మడగలం ప్రసాద్, రాయలసీమ రైతు సంఘం నాయకుడు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● రాత్రింబవళ్లు 4 జేసీబీలతో..
జగనన్న కాలనీ ఎస్టీపీ రెండో లే ఔట్ పైన నానాపల్లె, వైఎస్సార్ కాలనీ సమీపాన ఎన్జీఓ కాలనీకి చెందిన ఇద్దరు టీడీపీ బ్రదర్స్ 3 జేసీబీలతో గ్రావెల్ అక్రమ రవాణా సాగిస్తున్నారు. యానాది కొట్టాల వద్ద మరో జేసీబీతో తవ్వుతున్నారు. పదుల సంఖ్యలో టిప్పర్లు ఏర్పాటు చేసి టన్నుల కొద్దీ మట్టిని మాయం చేస్తున్నారు. కాలువల పక్కనున్న పొరంబోకు స్థలాలు, వివాదాస్పద డీకేటీ స్థలాల్లో మకాం వేసి ఈ మట్టిని ఆయా ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. లీజు క్వారీల నుంచి మట్టి తోలితే ఒక టిప్పరుకు రూ.1750లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. వీరు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా...ప్రభుత్వానికి రూపాయి కూడా చెల్లించకుండా కేవలం రూ.4000 నుంచి రూ.5000లకు టిప్పర్ మట్టిని తోలుతూ జేబులు నింపుకుంటున్నారు. లీజు క్వారీలకు అనుమతి ఉన్నవారిని సామ, దాన, భేద, దండోపాయాల ద్వారా బెదిరించి క్వారీలు మూయించిన అధికార పార్టీ నేతలు, తమ టిప్పర్లతో విచ్చలవిడిగా అక్రమ రవాణా చేస్తున్నారు. వైఎస్సార్ కాలనీకి పోయే మార్గంలోనే ఇదివరకు చెక్‌పోస్టు ఉండేది. అది ఉన్నప్పుడు ఎంతోకొంతైనా రాయల్టీ ప్రభుత్వానికి దక్కేది. ఇప్పుడు ఆ చెక్‌పోస్టు కూడా ఎత్తేయడంతో అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. సామాన్యులు, చిన్నా, చితకా వారి నుంచి ముక్కుపిండి రాయల్టీ వసూలు చేసే మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు.... ఫోన్లు చేసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రింబవళ్లు టిప్పర్లతో మట్టి తోలడం వల్ల రోడ్లు గుంతలమయంగా మారాయి. పక్కనున్న జగనన్న కాలనీలు ఎర్రటి మట్టితో నిండిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
●ముగ్గురాయి లూటీ.. మౌనరాగమే అధికారుల డ్యూటీ!
వేంపల్లె: పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు అక్రమ మైనింగ్‌లతో చెలరేగుతున్నారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు , లైసెన్స్ మాటే లేకుండా మైనింగ్ కార్యకలాపాలను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లె మండలాల్లో టీడీపీ నాయకుల దందా జోరుగా సాగుతోంది. వీరికి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక అక్రమ మైనింగ్‌లో టీడీపీ బడా నాయకులకు వాటాలు కూడా వెళుతున్నట్లు సమాచారం. ఇటీవలే సంక్రాంతి పండుగ రోజు టిఫెన్ కంపెనీకి చెందిన దాదాపు రూ.15కోట్ల విలువైన ముగ్గురాయిని రాత్రికి రాత్రే వేముల మండలానికి చెందిన టీడీపీ నాయకుడు తరలించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై టిఫెన్ కంపెనీ వారు పోలీసులకు, మైనింగ్ అధికారులకు సాక్ష్యా లతో సహా ఫిర్యాదు చేసినా వారి నుంచి స్పందన లేకుండా పోయింది. మైనింగ్ పనులు చేపడుతూ వ్యక్తి మృతి.. వేంపల్లె మండలం కత్తులూరు గ్రామ సమీపంలో మైనింగ్ పనులు చేపడుతూ మంగళవారం ప్రమాదవశాత్తు చిట్టిబోయిన రామచంద్ర(55) మృతి చెందాడు. మృతుడు వేముల మండలం అమ్మయ్యగారి పల్లె గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. రోజులాగే ముగ్గురాయి పనులకు వెళ్లిన చిట్టిబోయిన రామచంద్రపై ఒకసారిగా మట్టి ఉళ్లి పడింది. ఆ మట్టిలో రామచంద్ర కురుకుపోయాడు. జరిగిన విషయాన్ని మృతుని బంధువులకు సమాచారమివ్వడంతో కుమారుడు రాజశేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని వెలికి తీశారు. అప్పటికే మట్టిలో కూరుకుపోయిన తండ్రి రామచంద్ర మృతి చెందాడు. వేముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సంఘటన స్థలాన్ని వేంపల్లె సీఐ సురేష్ రెడ్డి, వేముల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. -
రోడ్డు ప్రమాదంలో దుస్తుల వ్యాపారి దుర్మరణం
కురబలకోట ; కడప నగరంలోని జెడ్ఆర్ ఫ్యాషన్ వరల్డ్ నిర్వాహకుడు షేక్ జహీర్ (28) మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో జరిగిన ఈ విషాదకర సంఘటనకు సంబంధించి ముదివేడు ఎస్ఐ దిలీప్‌కుమార్ కథనం మేరకు.. కడప నగరానికి చెందిన జహీర్ రెండేళ్లుగా కడపలో జెడ్ఆర్ ఫ్యాషన్ వరల్డ్ పేరిట రెడీమేడ్ దుస్తుల షాపు నిర్వహిస్తున్నాడు. గతంలో ట్రావెల్స్‌లో పనిచేసేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు సంతానం. భార్య ప్రస్తుతం గర్భిణి. రంజాన్ సందర్భంగా విక్రయానికి అవసరమైన దుస్తులు కొనుగోలు చేసేందుకు తమ్ముడు షమీర్ (26)తో కలిసి షేక్ జహీర్ కారులో బెంగళూరు బయలుదేరాడు. తనే కారు నడుపుకుంటూ వస్తుండగా కురబలకోట మండలంలోని మధ్యాహ్నంవారిపల్లె–రామిగానిపల్లె మధ్యలో మదనపల్లె–2 డిపోకు చెందిన గాలివీడు ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చింది. ప్రమాదవశాత్తు బస్సును కారు ఢీకొంది. ఈ సంఘటనలో జహీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తమ్ముడు షమీర్ కారులో వెనుక సీట్లో ఉండడంతో గాయాలతో బయటపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం జహీర్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడిపైనే కేసు.! ఇదిలా ఉండగా ప్రమాదానికి మృతుడు జహీర్ కారణమని కేసు నమోదు చేయాల్సి వచ్చిందని ముదివేడు ఎస్ఐ దిలీప్‌కుమార్ తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్న జహీర్ కారును నిద్రమత్తులో అదుపు చేయలేక వేగంగా బస్సును ఢీ కొట్టడం వల్లే ఈ సంఘటన జరిగినట్లు అటు విచారణలోను ఇటు సంఘటన స్థల పరిశీలనలోను వెల్లడైందన్నారు. చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం ఇదేమి.. విచిత్రం స్వామీ అంటూ పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. మృతుడి స్వస్థలం కడప బెంగళూరుకు వెళుతుండగా దుర్ఘటన -
ఇస్రో చూసొద్దామా !
● అంతరిక్ష కేంద్రానికి ఆహ్వానం ● 9వ తరగతి విద్యార్థులకు అవకాశం ● మార్చి 23 వరకు ఆన్లైన్లో నమోదుకు గడువు షెడ్యూల్ ఇలా.. రిజిస్ట్రేషన్ గడువు : మార్చి 23 వరకు ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల : ఏప్రిల్ 7 విద్యార్థులకు ఆహ్వానం : మే 18 యువికా కార్యక్రమం : మే 19వ తేదీ నుంచి 30 వరకు యువికా ముగింపు : మే 31వ తేదీ కడప ఎడ్యుకేషన్ : బాల్య దశలోనే విద్యార్థులను సైన్సు, అంతరిక్ష సాంకేతిక రంగాల వైపు మళ్లించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కృషి చేస్తోంది, అంతరిక్ష వీక్షణం, ఉపగ్రహాల ప్రయోగాలు వంటి వాటిపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చి శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ భావితరాల వారిని అంతరిక్ష శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ ఏడాది యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) కింద 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. తమ అధికారిక వెబ్సైట్ ద్వారా విద్యార్థులు మార్చి 23 లోపు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు గడువును ప్రకటించింది. ఎంపిక ఇలా.. 8వ తరగతిలో విద్యార్థులకు వచ్చిన మార్కులను 50 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు అదనంగా 15 శాతం, ఆన్లైన్ ద్వారా నిర్వహించే క్విజ్‌లో 10 శాతం, సైన్సుఫెయిర్లో పాల్గొన్న విద్యార్థులకు 5 శాతం, ఎన్సీసీ, స్కౌట్ విద్యార్థులకు 5 శాతం, ఒలంపియాడ్ ఎగ్జామ్స్‌లో పాల్గొన్న వారికి 10 శాతం, ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు 5 శాతం కేటాయించి ఎంపిక చేస్తారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న మెరుగైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చక్కటి అవకాశం.. అంతరిక్ష రంగంపై ఆసక్తి కలిగించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చక్కటి అవకాశం. జాతీయ స్థాయిలో ఎంపికై న విద్యార్థులకు మే 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి విశేషాలు వివరిస్తారు. ఇస్రో సంస్థల్లోని శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో చర్చించవచ్చు, ఆస్ట్రో ఫిజిక్స్, ఆస్ట్రో బయాలజీ, మెటీరియల్ సైన్సు, కంప్యూటర్ సైన్సులపై అవగాహన కల్పిస్తారు. అలాగే ఇస్రో చైర్మన్‌తో సంభాషించే అవకాశం కలుగుతుంది. లక్ష్యం ఇదీ.. అంతరిక్ష పరిజ్ఞానంలో మన దేశం పలు విజయాలతో అగ్రరాజ్యాల సరసన నిలిచింది. ఈ స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపి వారిని ఆ స్థాయిలో తీర్చిదిద్దేందుకు యూవికా ఏర్పాటు చేశారు. ఇలా భావి శాస్త్రవేత్తలను తయారు చేయాలనుకుంటున్నారు. ప్రతిభావంతుల కోసం ఇస్రో ప్రకటన జారీ చేసింది దరఖాస్తు ఇలా..ఇస్రో ప్రధాన వెబ్ౖసైట్లో మార్చి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్‌టీటీపీఎస్://డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఐఎస్ఆర్ఓ.జీఓవీ.ఇన్/యువిక.హెచ్‌టీఎంఎల్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంపికై న వారి జాబితాను ఏప్రిల్ 9న విడుదల చేస్తారు. మే 18న విద్యార్థులకు ఆహ్వానం అందజేస్తారు. మే 19 నుంచి 30 వరకు యువికా–2025 నిర్వహిస్తారు. మే 31తో కార్యక్రమం ముగుస్తుంది. -
గడ్డివాములు దగ్ధం
– స్పందించని అగ్నిమాపక సిబ్బంది సింహాద్రిపురం : ఆకతాయిలు చేసిన పనికి రైతులు వేసుకున్న గడ్డివాములతో పాటు ట్రాక్టర్ ట్రాలీ, పల్టర్ దగ్ధమయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బిదినంచర్ల గ్రామంలో మంగళవారం సాయంత్రం ఇళ్ల సమీపాన ఎవరో ఆకతాయిలు చెత్తకు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగి ఊరి సమీపాన ఉన్న మొలకల జయరామిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, మునిరెడ్డిలకు చెందిన నాలుగు గడ్డి వాములతోపాటు ఒక ట్రాక్టర్ ట్రాలీ, పల్టర్ దగ్ధమయ్యాయి. దీంతో సుమారు రూ.2లక్షలకుపైబడి నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఫోన్లు చేస్తున్నా అగ్నిమాపక శాఖ సిబ్బంది స్పందించలేదని బాధిత రైతులు వాపోతున్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. రెండు లారీలు ఢీ – డ్రైవర్ దుర్మరణం ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని కడప రోడ్డులో మై హోం కాలనీ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో హెచ్‌పీ గ్యాస్ లారీ డ్రైవర్ గండ్లూరు కదిరయ్య (41) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి 1.30 గంటలకు జరిగింది. ఎర్రగుంట్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలం పి.కొత్తపల్లి గ్రామానికి చెందిన గండ్లూరు కదిరయ్య హెచ్‌పీ గ్యాస్ లారీకి డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం అర్థరాత్రి ఎర్రగుంట్ల నుంచి కడప రోడ్డు మార్గాన వెళుతుండగా మైహోం కాలనీ వద్ద ముందు వెళుతున్న మరో లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో హెచ్‌పీ గ్యాస్ లారీ ముందు భాగం నుజ్జు నుజ్జయింది. లారీ డ్రైవర్ కదిరయ్య క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కున డ్రైవర్‌ను జేసీబీ సాయంతో బయటకు తీశారు. కదిరయ్యకు కాలు తెగిపోవడంతో అధిక రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ గురుశంకర్‌రెడ్డి తెలిపారు. రాయచోటి కేసులో 12 మందికి బెయిల్ కడప అర్బన్ : అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై మార్చి 9వ తేదీ పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు. కడప సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న 12 మంది మంగళవారం బెయిలుపై విడుదలయ్యారు. నీటి సంపులో పడి బాలుడి మృతి మదనపల్లె : ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. చంద్రాకాలనీకి చెందిన రాజశేఖర్‌రెడ్డి, గీత దంపతులకు సాత్విక్‌రెడ్డి, చార్విక్‌రెడ్డి(5) ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం సాయంత్రం కాలనీలో నీటిసరఫరా జరుగుతున్న సమయంలో నీళ్లను పట్టుకునేందుకు తల్లి, నానమ్మ హడావిడిలో ఉండగా, ఇంటి ముందు ఆడుకుంటున్న చార్విక్‌రెడ్డి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని బయటకు తీసి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. 35 గ్రాముల బంగారు గొలుసు చోరీ సుండుపల్లె : మండల పరిధిలోని పింఛాలో అమ్మణ్ణెమ్మ తన మనవడిని చూసేందుకు ఈ నెల 8వ తేదీన బెంగళూరుకు వెళ్లింది. సోమవారం తిరిగి తన స్వగ్రామానికి చేరుకుంది. ఇంటిలోకి వెళ్లగా బీరువా తాళాలు పగలగొట్టి 35 గ్రాముల బంగారు గొలుసును చోరీ చేసినట్లు గుర్తించింది. -
తల్లి శవంతో నెల రోజులుగా ఇంట్లోనే..
కడప కల్చరల్ : కడప నగరం శాటిలైట్‌సిటీ వద్దగల ఇంట్లో నెల రోజుల క్రితం ఓ వృద్దురాలు మరణించింది. ఆమెకు పెళ్లికాని 45–55 సంవత్సరాల వయస్సుగల ఇద్దరు కుమారులు మినహా ఇంకెవరూ లేరు. ఆమెకు వచ్చే పెన్షన్‌తోపాటు అక్కడ, ఇక్కడ చిన్న చితకా పనులు చేసి వారిని పోషించేది. నెల కిందట ఆమె మరణించింది. ఈ విషయం బయట ఎవరికీ తెలియదు. ఇద్దరు కుమారులు ఎవరితో మాట్లాడేవారు కాదు. తల్లి మరణించినా కూడా శవంతోపాటు అక్కడే ఉండిపోయారు. ఒక కుమారుడు మూడు రోజుల తర్వాత ఉరి వేసుకుని మరణించాడు. దుర్వాసన రావడంతో ఆ ప్రాంతీయులు పోలీసుల ద్వారా ఇంటిని పరిశీలించగా విషయం తెలిసింది. మున్సిపల్ సిబ్బంది ద్వారా మృతదేహాలను ఖననం చేయించారు. మిగిలిన పెద్ద కుమారుడు జనార్దన్ ఇల్లు వదిలి బయటే తిరుగుతూ ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో స్థానికుల్లో ఒకరు పోరుమామిళ్లలోగల శ్రీ వివేకానంద ఆశ్రమ నిర్వాహకులు పాపిజెన్ని రామకృష్ణకు సమాచారం ఇచ్చారు. ఆయన తన బృందంతో వచ్చి కడప నగరం చెన్నూరు బస్టాండులో ఉండిన జనార్దన్‌ను వెతికి పట్టుకుని తన ఆశ్రమానికి తరలించారు. మొదట ఆశ్రమానికి వచ్చేందుకు అంగీకరించలేదు. మొత్తానికి ఆయనను ఒప్పించి ప్రత్యేక వాహనంలో ఆశ్రమానికి తీసుకెళ్లారు. మానసిక వైద్యం చేయించి శుభ్రంగా తీర్చిదిద్దారు. జనార్దన్ ప్రస్తుతం వ్యక్తులను గుర్తు పెట్టి మాట్లాడే స్థితికి వచ్చాడు. ఈ అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందని ఆశ్రమ నిర్వాహకులు రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. -
ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్.పి ఈ.జి. అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ’ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్)లో ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడారు. వారి సమస్యలను విని, సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ’ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమాకాంత్ పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ఈ.జి.అశోక్ కుమార్ -
పోలీస్ క్రికెట్ స్టేడియంలో అత్యాధునిక పిచ్ రోలర్
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని పోలీస్ క్రికెట్ స్టేడియంలో అత్యాధునిక పిచ్ రోలర్‌ను జిల్లా ఎస్పీ ఈ.జీ. అశోక్ కుమార్ సోమవారం ప్రారంభించారు. రోలర్‌కు జిల్లా ఎస్పీ పూజ నిర్వహించి స్వయంగా డ్రైవ్ చేసి పరిశీలించారు. వర్షానికి గ్రౌండ్ తడవకుండా ఉంచేందుకు వీలుగా ఏర్పాటు చేసిన వాటర్ ప్రూఫ్ గ్రౌండ్ షీట్‌ను కూడా పరిశీలించారు. నిరంతరం విధుల్లో ఉండే పోలీస్ సిబ్బంది క్రీడల ద్వారా నూతనోత్తేజం పొందవచ్చని, స్టేడియంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు మాట్లాడుతూ ఇతరులు కూడా స్టేడియంను అద్దె ప్రాతిపదికన ఉపయోగించుకోవచ్చన్నారు. వివరాలకు 9121100641 లేదా 9000144343 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య , ఆర్.ఐ లు టైటస్, ఆనంద్, వీరేష్, శ్రీశైల రెడ్డి, శివరాముడు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొన్న ఐచర్ వాహనం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండల పరిధిలోని ప్రొద్దుటూరు రోడ్డులో ఎస్వీ కల్యాణ మండపం సమీపంలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి గుడి దగ్గర ఆటోను గుర్తు తెలియని ఐచర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ చంగల రామాంజనేయులుతో పాటు ఆటోలో ఉన్న మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు పట్టణంలోని డ్రైవర్ కొట్టాల కాలనీకి చెందిన అల్లం లక్ష్మీనారాయణమ్మ, అల్లం జగన్నాథం, అల్లం నాగ పద్మ, అల్లం నాగ బిందు, జి.నాగముని, జి. రామాంజనేయులు ప్రొద్దుటూరులోని ఒకే కుటుంబానికి చెందినవారేరు. వీరంతా ప్రొద్దుటూరు వెళ్లేందుకు చంగల రామాంజనేయులుకు చెందిన ఆటో ఎక్కారు. ఎస్వీ కల్యాణ మండపం వద్దకు రాగానే ఆటో వెనుక వైపు గుర్తు తెలియని ఐచర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంగల రామాంజనేయులు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, ఆటోలో ఉన్న మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
హాస్టల్ విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి
కడప ఎడ్యుకేషన్ : జమ్మలమడుగు పట్టణంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల కళాశాల వసతి గృహంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నరేంద్ర, సుబ్బరాయుడు డిమాండ్ చేశారు. కడపలోని వారి కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో అనేక సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ సంఘటనలపై విచారణ చేపట్టి విద్యార్థులకు అవగాహన కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఆరు నెలల క్రితం ఇదే హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యకు యత్నించారన్నారు. అప్పుడే విచారణ జరిపి చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఈ సంఘటన జరిగి ఉండేది కాదన్నారు. స్థానికంగా నివాసం ఉండాల్సిన ఏఎస్డబ్ల్యూఓ గురుప్రసాద్ తన 35 ఏళ్ల సర్వీసులో ఏ ప్రాంతంలో పనిచేసినా పులివెందులలో నివాసం ఉండి విధులకు సక్రమంగా హాజరు అయ్యేవారు కాదనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు నరసింహ, గోపి, అయ్యన్న, రామ్‌చరణ్ పాల్గొన్నారు. -
లింగాల సబ్ స్టేషన్లో అగ్నిప్రమాదం
లింగాల : మండల కేంద్రంలోని 133 కేవీ సబ్ స్టేషన్లో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సబ్ స్టేషన్ సిబ్బంది ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సబ్ స్టేషన్ ఆవరణలో భారీగా ముళ్ల పొదలు ఉండటంతో ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటల తీవ్రత ట్రాన్స్ఫార్మర్లకు తగలకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది అనిల్ కుమార్, రవీంద్రారెడ్డి, డ్రైవర్ ఆపరేటర్ బుజ్జిబాబు పాల్గొన్నారు. 133 కేవీ సబ్ స్టేషన్‌కు ఎలాంటి ప్రమాదం లేదని ఏఈ రమేష్ తెలిపారు. ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. -
● బీమా లేని బతుకులు
వారు నిరాశ్రయులు.. కన్నవారిని.. కన్న ఊరును వదిలేసి వచ్చిన వలస జీవులు. పగలంతా ఏదో ఒక పని చేసుకుని.. రాత్రయ్యే సరికి ఇదిగో ఇలా ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తుంటారు. అయిన వారికి.. ఆత్మీయులకు దూరంగా ఉంటున్న వీరి బతుకులకు ఎలాంటి ధీమా లేదు.. వీరు సేద తీరుతున్న చోట గోడపైన ఉన్న జీవిత బీమా ప్రకటన చూసిన వారు ఏ బీమా వర్తించని బతుకులు వీరివే కదా అంటూ ఓ క్షణం ఆగి.. ఆలోచించి వెళ్లిపోతున్నారు. కడప నగరంలో ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో సాక్షి కంట పడిన దృశ్యమిది. – ఎస్కే మొహమ్మద్ రఫీ, సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కడప. -
విద్యుత్ తీగలు తెగి అరటి పంట దగ్ధం
లింగాల : మండలంలోని బోనాల గ్రామంలో విద్యుత్ తీగలు తెగి మంటలు చెలరేగి అరటి పంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన రమేష్‌రెడ్డి అనే రైతు తన పొలంలోని చీనీ చెట్లను నరికివేసి పొలం గట్టుపైన వేశాడు. సోమవారం ఉదయం విద్యుత్ తీగలు తెగి ఎండిన చీనీచెట్లపై పడటంతో మంటలు చెలరేగాయి. ఆ మంటల వేడికి సుమారు ఎకరా పొలంలో ఉన్న మూడు నెలల అరటి మొక్కలు కాలిపోయి సుమారు రూ.50వేలు నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చీనీ పంటలో దిగుబడి రాక వాటిని తొలగించి అరటి పంట సాగు చేస్తే ఇలా కాలిపోవడం బాధాకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు తనకు న్యాయం చేయాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు. -
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి
కడప కార్పొరేషన్ : రాయలసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి డిమాడ్ చేశారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాయలసీమకు అన్యాయమే జరుగుతుందని, అదేం ఖర్మో తెలియదు గానీ వర్షాలు అసలే పడవన్నారు. ఆయన పదిహేనేళ్లు అధికారంలో ఉంటే 14 ఏళ్లు కరువేనని, ఒక ఏడాది వరదలు వచ్చాయన్నారు. ఈ పదిహేనేళ్లలో రైతులు తమ పంటలు నష్టపోవడం మినహా బాగుపడింది లేదన్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014–19లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి, రంగారెడ్డి పాలమూరు ఎత్తపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకాల పేర్లతో అక్రమ నీటి ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. వీటికి నీటి కేటాయింపులు లేకపోయినా ఇది అక్రమమని ఆనాడు ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రశ్నించలేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 885 అడుగులని, దానిపైన నీళ్లుంటే తప్పా రాయలసీమకు నీళ్లు రావన్నారు. 800 అడుగులుంటే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. ఫలితంగా అవసరమున్నా.. లేకపోయినా తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీరు కిందికిపోయేలా చేస్తున్నారన్నారు. కనిష్ట పరిమితి నిల్వ చేయకపోవడం వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు నీరు రావడం లేదన్నారు. రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు ఆనాడు తాకట్టు పెట్టడం వల్ల నేడు సాగునీరు కాదుకదా తాగునీటికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో వరదలు వస్తే తప్పా శ్రీశైలం నిండటం లేదన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నా చంద్రబాబు నోరు మెదప లేదన్నారు. సీమలోని తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, చైన్నెకి తాగునీరు అందించాలంటే సుమారు 101 టీఎంసీలు కావాల్సి ఉందన్నారు. అందుకే దివంగత వైఎస్సార్ ఎక్కువ నీటిని తీసుకుపోయేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11వేల క్యూసెక్కులకు పెంచారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సామర్థ్యాన్ని 33వేల క్యూసెక్కులకు పెంచారన్నారు. చంద్రబాబు అఽధికారంలో ఉండగా వైఎస్సార్ జలయజ్ఞంలో చేపట్టిన ఏ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదన్నారు. అందుకే ఆయన రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారన్నారు. రాయలసీమ రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2023లో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని, దీనిపై తెలంగాణలోని టీడీపీ వారితో ఎస్జీటీకి ఫిర్యాదు చేయించారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జున సాగర్‌ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహణ చేయాల్సి ఉన్నా తెలంగాణ లెక్కచేయడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం పార్టీలకతీతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యా నందరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బీహెచ్ ఇలి యాస్, శ్రీరంజన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి -
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్టు
బద్వేలు అర్బన్ : అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1.50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ తెలిపారు. సోమవారం స్థానిక అర్బన్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పట్టణంలోని చెన్నంపల్లె ఎస్టీ కాలనీ సమీపంలో గల కాశినాయన గుడి వద్ద అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం రావడంతో తనతో పాటు ఎస్ఐలు, సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించామన్నారు. పట్టణంలోని రాజుగారివీధికి చెందిన దండు మనోజ్‌కుమార్, వల్లెరవారిపల్లె గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌లు గంజాయి విక్రయిస్తూ కనిపించారన్నారు. వెంటనే వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినా, అమ్మకాలు చేపట్టినా, వారికి సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో అర్బన్ ఎస్ఐలు ఎం.సత్యనారాయణ, జె.రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.1.50 కేజీల గంజాయి స్వాధీనం -
పోలీస్ క్రికెట్ స్టేడియంలో అత్యాధునిక పిచ్ రోలర్
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని పోలీస్ క్రికెట్ స్టేడియంలో అత్యాధునిక పిచ్ రోలర్‌ను జిల్లా ఎస్పీ ఈ.జీ. అశోక్ కుమార్ సోమవారం ప్రారంభించారు. రోలర్‌కు జిల్లా ఎస్పీ పూజ నిర్వహించి స్వయంగా డ్రైవ్ చేసి పరిశీలించారు. వర్షానికి గ్రౌండ్ తడవకుండా ఉంచేందుకు వీలుగా ఏర్పాటు చేసిన వాటర్ ప్రూఫ్ గ్రౌండ్ షీట్‌ను కూడా పరిశీలించారు. నిరంతరం విధుల్లో ఉండే పోలీస్ సిబ్బంది క్రీడల ద్వారా నూతనోత్తేజం పొందవచ్చని, స్టేడియంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు మాట్లాడుతూ ఇతరులు కూడా స్టేడియంను అద్దె ప్రాతిపదికన ఉపయోగించుకోవచ్చన్నారు. వివరాలకు 9121100641 లేదా 9000144343 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య , ఆర్.ఐ లు టైటస్, ఆనంద్, వీరేష్, శ్రీశైల రెడ్డి, శివరాముడు, సిబ్బంది పాల్గొన్నారు. -
లింగ వివక్ష చూపే వారిపై కేసులు నమోదు చేయాలి
కడప రూరల్/కడప కోటిరెడ్డి సర్కిల్: ఆడ పిల్లల శాతాన్ని పెంచేందుకు కృషి చేయడంతో పాటు లింగ వివక్షతను చూపే వారిపై కేసులు నమోదు చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి పి. జాన్‌ఇర్విన్ అన్నారు. సోమవారం స్ధానిక డివిజనల్ అధికారి కార్యాలయంలో థామస్ మన్రో మీటింగ్ హాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన గర్భస్థ శిశు నిర్ధారణ పరీక్షల నిర్మూలనపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల లింగ నిష్పత్తిని గమనిస్తే బాలురతో పోలిస్తే బాలికల శాతం తక్కువగా ఉందన్నారు. అసమానతలు తొలగించి సమాజంలో ఆడపిల్లల శాతం పెంచాలని తెలిపారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలకు చట్టపరమైన శిక్ష ఉంటుదన్నారు. లింగ నిర్ధారణకు పాల్పడే స్కానింగ్ సెంటర్లు, వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. నోడల్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరకుమార్ మాట్లాడుతూ ఆర్ఎంపీలు అబార్షన్లు చేయకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రబ్బాని, సీఐ బి. రామకృష్ణ, డాక్టర్ బాలకృష్ణ, టి.మెహన్కృష్ణ, భారతి, అధికారులు, ఎన్జీఓలు పాల్గొన్నారు. -
స్మశాన భూమి ఆక్రమణలు తొలగించాలి
బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లె గ్రామ సర్వే నెంబరు 464లో ప్రభుత్వం 1976లో 10.05 ఎకరాల భూమిని స్మశాన వాటిక కోసం కేటాయించింది. అందులో ఎనిమిది ఎకరాలు పైబడి భూమిని కొంతమంది దురాక్రమించారు. దురాక్రమణల నుంచి స్మశాన భూమిని విడిపించాలంటూ 2017లో లోకాయుక్త కలెక్టర్‌కు ఆదేశాలు పంపింది. కానీ, రెవెన్యూశాఖ ఏడేళ్లుగా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. – బాలనాయుడు, కందిమల్లాయపల్లె, బి.మఠం రహదారి సౌకర్యం కల్పించాలి మాది తెలుగుగంగ పునరావాస గ్రామం. మా గ్రామంలోకి రావాలంటే కందిమల్లాయపల్లె, సోమిరెడ్డిపల్లె గ్రామ పొలాల సర్వే నెంబరు 309, 310 నుంచి రావాలి. ఇరుకు రహదారి వల్ల రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు నిర్మాణంతోపాటు దాని వెంట విద్యుత్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి. – ఆదినారాయణరెడ్డి, బి.మఠం -
ప్రారంభమైన ‘పది’ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు తమ తల్లితండ్రులతో కలిసి పరీక్షా కేంద్రాలకు వచ్చారు. తొలిరోజు పరీక్ష కావడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు ధైర్యం చెబుతూ కనిపించారు. మరికొందరు ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ కేంద్రాల్లోకి పంపారు. ఇంకొందరు దగ్గరుండి హాల్‌టికెట్లు నెంబర్లను చూడడంలో సాయపడ్డారు. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అధికారులు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్‌ను అమలు చేశారు. జిల్లావ్యాప్తంగా 161 పరీక్షా కేంద్రాలలో 27,800 మంది విద్యార్థులకుగాను 27,648 మంది హాజరుకాగా 152 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా అబ్జర్వర్.. పదో తరగతి పరీక్షల జిల్లా అబ్జర్వర్ మధుసూధన్‌రావు జిల్లాలోని ఒంటిమిట్ట మండలం ఒంటిమిట్ట జెడ్పీ హైస్కూల్‌ను, మాధవరం జెడ్పీ హైస్కూల్‌ను, కొండమాచుపల్లి జెడ్పీ హైస్కూల్స్‌ను తనిఖీ చేసి ఛీప్ సూపరెండెంటెంట్లకు, డిపార్టుమెంట్ ఆఫీసర్లకు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా చర్యలు జిల్లావిద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ కడపలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్, పవన్ స్కూల్, వికాస్ స్కూల్, గంగాభవాని హైస్కూల్, సాయిబాబా హైస్కూల్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. తొలి రోజు 27,800 మందికిగాను 27,648 మంది హాజరు జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అబ్జర్వర్, డీఈఓ -
వైద్యం బంద్ అని చెప్పారు...
నా బిడ్డ చెవి నొప్పి సమస్యతో బాధపడుతోంది. డా క్టర్‌కు చూపించడానికి కడప కు వచ్చాను. ఇక్కడ ఆరోగ్య శ్రీ కింద చూడడం లేదు. అందరూ బంద్‌లో ఉన్నారు. రేపు రమ్మని చెప్పా రు. నా బిడ్డ చెవి నొప్పితో బాధపడుతుంటే ఎలా ఉండాలి. డాక్టర్‌కు ఫీజు కట్టి నా బిడ్డకు చూపించాలనుకుంటున్నాను. – రఫీక్, ఖాజీపేట నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నా పేరు నమోదు కాలేదు నాలుగు రోజుల నుంచి కడపకు కంటి ఆపరేషన్‌కు సంబంధించి పుష్పగిరి ఐ హాస్పిటల్‌కు నా కుమారుడితో పాటు వస్తున్నా. కానీ ఇక్కడ ‘ఎన్టీఆర్ వైద్య సేవ’కు సంబంధించిన పేరు నమోదు చేయలేదు. ప్రతి రోజూ బస్సు ఛార్జీలు, సమయం వృథా అవుతోంది. ఈ రోజైనా నా పేరు నమోదు అవుతుందో లేదో. – ఖాజా రసూల్, చాగలమర్రి, నంద్యాల జిల్లా ఉదయం నుంచి... ఎడమకన్నుకు ఆపరేషన్ చేసుకోవాలని గతంలో డాక్టర్లు చెప్పారు. పోరుమామిళ్లనుంచి తెల్లవారుజామునే బయలుదేరి పుష్పగిరి కంటి ఆసుపత్రికి ఉదయాన్నే చేరుకున్నాను. ప్రాథమిక వైద్య పరీక్షల తరువాత ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి పేరు నమోదు చేసేందుకు వచ్చి ఎదురు చూస్తున్నాను. మధ్యాహ్నం 1 గంట అవుతున్నా నమోదు కాలేదు.– రమీజా,పోరుమామిళ్ల -
బీఈడీ పరీక్షలు షురూ
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని 15 కేంద్రాల్లో బీఈడీ, ఎంఈడీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యా యి. బీఈడీ పరీక్షలకు 4,463 మంది విద్యార్థులు, ఎంఈడీ పరీక్షలకు 63 మంది విద్యార్థులు హాజరయ్యారు. కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో, విజయలక్ష్మి బీఈడీ కళాశాల పరీక్షా కేంద్రాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కేఎస్వి కృష్ణారావు, అబ్జర్వర్లు ఆచార్య మాధవి, ఆచార్య రియాజ్ ఉన్నిసా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేలా చూడాలని చీఫ్ సూపరింటెండెంట్లకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య కేఎస్వీ కష్ణారావు మాట్లాడుతూ పరీక్షలు ఈనెల 22వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. గండి దేవస్థాన భూములకు వేలం పాట చక్రాయపేట : మండలంలోని మారెళ్ల మడక గ్రామ పంచాయతీలో ఉన్న గండి వీరాంజనేయస్వామి ఆలయంలో సోమవారం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో గండి దేవస్థాన భూములకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో ఇడుపులపాయ గ్రామ సర్వే నెంబర్ 469లో గల 8.72 ఎకరాల భూమిని ఏడాది కాలానికి రూ.1.51 లక్షలకు పి.జి.మహేష్ దక్కించుకున్నారు. అలాగే వీరన్నగట్టుపల్లె గ్రామంలోని 98 సెంట్ల భూమిని రూ.4 వేలకు ఆర్.తేజేశ్వర దక్కించుకున్నారు. అలాగే గండి దేవస్థానానికి సంబంధించిన సులభ్ కాంప్లెక్స్‌ను రూ.20 వేలకు ఇడుపులపాయకు చెందిన పి.వెంకటరత్నం దక్కించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ కృష్ణతేజ, మాజీ చైర్మన్ వెంకటస్వామి, దేవస్థాన ఉప ప్రధాన అర్చకుడు రాజా రమేష్, ఆలయ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. వైవీయూ ఉపకులపతిగా ఆచార్య అల్లం శ్రీనివాసరావుకడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య అల్లం శ్రీనివాసరావు నియమితులయ్యారు. నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేస్తున్న ఆయనను వైవీయూ ఇన్చార్జి వీసీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆర్డర్ ద్వారా ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు వైవీయూ ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య ఫణతి ప్రకాష్‌బాబు పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా నియమితులు కావడంతో ఆయనను రిలీవ్ చేశారు. ఆ స్థానంలో నూతన ఇన్చార్జి వైస్ ఛాన్సలర్‌గా ఆచార్య అల్లం శ్రీనివాసరావును నియమించారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 25న రాజంపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు రాజంపేట : రాజంపేట బార్ అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించనున్నారు. సోమవారం నామినేషన్ల ప్రక్రియ సీఈఓ పి.సురేష్‌కుమార్ నేతృత్వంలో ప్రారంభమైంది. బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానానికి హనుమంతు నాయుడు నామినేషన్‌ను దాఖలు చేశారు. మంగళవారం కూడా నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. 19న నామినేషన్ల స్క్రూటిని, 20న నామినేషన్ల ఉపసంహరణ, 21న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా, 25న పోలింగ్, అదే రోజున కౌంటింగ్ నిర్వహించనున్నారు. నేడు డయల్ యువర్ డీఎం కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప నగరంలోని స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయంలో మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వ హిస్తున్నట్లు ఆర్టీసీ డీఎం ఢిల్లీశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన తెలుపుతూ మంగళవారం సాయంత్రం 5గంటల నుండి 6గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రయాణీకులు తమ సమస్యలను, సూచనలు, సలహాలను 99592 25774 అనే ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసి కానీ, వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయాలన్నారు. -
‘వృద్ధురాలినన్న కనికరమూ లేదు..’
చేతిలో అర్జీ పట్టుకుని కుంటుకుంటూ కలెక్టరేట్‌కు వచ్చిన ఈమె పేరు బి. చంద్రమ్మ. వయసు ఏడు పదులు పైనే. ఏమైందవ్వా అని పలకరిస్తే.. ‘గూడు’ గురించి గోడు వెల్లబోసుకుంది. ఈమెకు వల్లూరు మండలంలోని ఎన్. ఓబాయపల్లెలోని లే అవుట్లో ఇల్లు మంజూరైంది. తన వృద్ధాప్య పెన్షన్ డబ్బుతో పాటు అల్లుడిచ్చిన కొంచెం డబ్బులతో ఇంటిని నిర్మించుకుంది. తనకు రావాల్సిన చివరివిడత డబ్బుల కోసం అధికారు లనడిగితే ‘నాలుగు ట్రిప్పుల ఇసుక, రెండు కిటికీలు మొత్తం రూ. 10,776లు విలువ చేసే సామగ్రి తీసుకు న్నావుగా.. ఇదిగో ఆన్లైన్లో కూడా చూపిస్తోంది చూడు’ అని జవాబిచ్చారు. నోరెళ్లబెట్టడం ఆమె వంతైంది. తన సంతకం లేకుండానే కమలాపురం గోడౌనుంచి తెచ్చుకున్నట్లు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అసలు ఆ గోడౌన్ ఎక్కడుందో కూడా తెలియదని వాపోయింది. వృద్ధురాలినన్న కనికరమూ లేకుండా పోయింది. ఇది వరకు ఓ సారి స్పందనలో ఫిర్యాదు చేస్తే.. తనకు తెలియకుండానే విచారణ చేసి ముగించారట. నాకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయండి సారూ అని వేడుకుంది. -
బాబు పాలనలో అందరికీ ఇబ్బంద్లే !
కడప రూరల్ : ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’(ఆరోగ్య శ్రీ)లో పనిచేస్తున్న సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం విధుల బహిష్కరించి..నిరసన తెలిపారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 108 నెట్ వర్క్ ఆసుపత్రులకు వచ్చిన పేదలు ఉచిత వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యాధులతో నెట్ వర్క్ ఆసుపత్రులకు వచ్చే పేదలు అక్కడ ఉన్న ‘ఆరోగ్య మిత్ర’హెల్ప్ డెస్క్‌ను సంప్రదిస్తే రోగుల రిజిస్ట్రేషన్‌తో పాటు అన్ని అంశాలు వారే పర్యవేక్షిస్తారు. ఆరోగ్య మిత్రలు విధులను బహిష్కరించడంతో ప్రభుత్వం ఆరోగ్య మిత్రల రోల్‌ను ఆసుపత్రులకే అప్పగించింది. వారు చాలా ఆసుపత్రుల్లో అత్యవసరమైన అంటే ఇన్ పేషెంట్స్‌కు మాత్రమే వైద్య సేవలు అందించారు. కొన్ని చోట్ల అది కూడా జరగలేదని సమాచారం. మిగతా వారిని ఆసుపత్రి సిబ్బంది నేడు బంద్..రేపు రండి అని చెప్పి పంపించారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాధిగ్రస్తులు తమ బాధను ఎవరికీ చెప్పుకోలేక ఆవేదనతో వెనుతిరిగి వెళ్లారు. కొంతమంది వెనుతిరిగి వెళ్లలేక..అనారోగ్యం బాధను తట్టుకోలేక వైద్యుడికి ఫీజును చెల్లించి వైద్య చికిత్సను పొందారు. మొత్తం మీద వైద్య సేవ సిబ్బంది ఒక్కరోజు విధులను బహిష్కరించినందుకే దాదాపు 3,255 రకాలకు చెందిన వైద్య సేవలకు ఆటంకం ఏర్పడింది. 2007–2008లో నాటి సీఎం వైఎస్సార్ ఆరోగ్య శ్రీని ప్రవేశపెట్టారు. నాటి నుంచి ఇప్పటి వరకూ ఏ రోజు వైద్య సేవలు నిలిచిపోలేదు. ఎప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆరోగ్య శ్రీ ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఏకంగా వైద్య సేవలే నిలిచిపోవడం గమనార్హం. ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ’సిబ్బంది విధుల బహిష్కరణ ఇబ్బందులు పడిన రోగులు ‘ఆరోగ్య శ్రీ’పథకం చరిత్రలో విధులను బహిష్కరించడం ఇదే ప్రఽథమం ఇతని పేరు బాబాసాహెబ్. వయసు 35 ఏళ్లు. కడప నగరం ఆజాద్‌నగర్‌కు చెందిన ఇతను వారం రోజుల క్రితం అనారోగ్యం పరిస్థితుల్లో 108లో రిమ్స్‌లో చేరాడు. మొదట ఆయాసం, జలుబు, దగ్గుతో చేరాడు. చేరిన సమయంలో వైద్యసేవల అనంతరం వివిధ వైద్య పరీక్షలను చేసిన డాక్టర్లు ఇతనికి ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం వల్ల తిరుపతి స్విమ్స్‌కు రెఫర్ చేశారు. ఈ రెఫర్కు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు కడప రిమ్స్ ఐపీ విభాగంలో ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ సిబ్బందిలో ఇద్దరు మాత్రమే విధుల్లో ఉన్నారు. దాదాపు గంటకు పైగా సమయం పట్టడంతో అల్లాడిపోయాడు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం, బుడుగుంటపల్లి పంచాయతీ, రైల్వేస్టేషన్ సమీపంలో అనంతపురం దొనగిరికి చెందిన లక్ష్మీనారాయణ (35) అనే యువకుడు విద్యుత్ హై టెన్షన్ స్తంభానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా.. రెండేళ్ల క్రితం రైల్వేకోడూరుకు బేల్దారీ పనులు చేసుకునేందుకు భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చి బాలానగర్‌లో నివాసం ఉండేవాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ యువకుడు ఉరివేసుకున్నాడు. దీంతో కుటుంబమంతా వీధిన పడింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మోటారు వైర్లు చోరీ రాజంపేట రూరల్ : మండల పరిధిలోని ఆకేపాడు గ్రామ పంచాయతీలో శనివారం రాత్రి బోర్ వైర్ కేబుళ్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. రాయచోటికి వెళ్లే దారిలో ఉన్న వీరంరెడ్డి నారాయణరెడ్డి పొలంలోని 2 బోర్లకు చెందిన మోటర్ వైర్లు, స్టార్టర్లు దొంగిలించారు. అలాగే వీరంరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, మందకాల శ్రీనివాసులు, బొమ్మ రంగారెడ్డికి చెందిన మోటార్ వైర్లు, స్టార్టర్లు కూడా ఎత్తుకెళ్లారు. గొళ్ల విజయరెడ్డికి చెందిన 3 మోటాటర్ వైర్ కేబుళ్లు, గోళ్ల సుజాతారెడ్డికి చెందిన 2 మోటార్ వైర్ కేబుళ్లు చోరీకి గురయ్యాయి. పోలీసులు దొంగలను పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు. ‘నాకు రక్షణ కల్పించండి’ సిద్దవటం : తనను హతమార్చేందుకు యత్నిస్తున్నారని, రక్షణ కల్పించాలని సిద్దవటం మండలం కడపాయపల్లె గ్రామానికి చెందిన బత్తల శివకుమార్ కడప డీఎస్పీ, ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రమైన సిద్దవటంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ తనతో పాటు బొంత రమాదేవి 2002 సంవత్సరంలో ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా సర్వేనెంబర్ 164 లింగంపల్లె రెవెన్యూ గ్రామ పొలంలో పట్టా పొందామన్నారు. ఈనెల 14వ తేదీన భూమి సాగు చేసుకునేందుకు జేసీబీతో పని చేయిస్తుండగా వెన్యూ వారు వచ్చి రికార్డులను పరిశీలించి వెళ్లారన్నారు. అయితే లింగంపల్లె గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఫోన్ చేసి తనను అడగకుండా భూమి సాగు చేసేందుకు ఎంత ధైర్యం నీకు అంటూ బెదిరించాడన్నారు. ఆ తరువాత కొంత మంది లింగంపల్లె దళితులను తన వద్దకు పంపి తనపై దౌర్జన్యం చేసి పనిని నిలుపుదల చేశారన్నారు. అంతటితో ఆగకుండా వెంకటేశ్వర్లు తన మనుషులైన ఈరిశెట్టి సురేష్, ఈరిశెట్టి మునిసుబ్బరాయుడు, ఈరిశెట్టి నాగరాజు, పిట్టి గోపాల్‌ల చేత తనపై హత్యాయత్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. సూరప్పగారిపల్లెలో భారీ చోరీ గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ సూరప్పగారిపల్లెలో భారీ చోరి జరిగింది. వ్యవసాయపనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లిన ఓ రైతు ఇంట్లో దుండగులు ప్రవేశించి 150 గ్రాముల బంగారు నగలు, రూ.50 వేలు నగదు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన కుమ్మర మునిస్వామి వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటికి తాళాలు వేసుకొని గ్రామానికి సమీపంలోని తన పొలం వద్దకు వెళ్లారు. రైతు దంపతులు సాయంకాలం పనులు చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి తాళాలు పగులగొటి బీరువాలో ఉంచిన రూ. 13లక్షలు విలువచేసే బంగారు నగలు, రూ.50 వేలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని కడప – చిత్తూరు జాతీయ రహదారిపై షెంఫోర్డ్ స్కూలు సమీపంలో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా శనివారం అర్థరాత్రి ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొంది. జమాలపల్లె గ్రామానికి చెందిన ఆరిఫ్, షేక్ అహ్మద్, అబ్దుల్లా గౌస్ అనే ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన హైవే పెట్రోలింగ్ రక్షక్ సిబ్బంది గాయపడిన వారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. నూతన నియామకం రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని వివిధ మండలాలకు, పట్టణాలకు నూతన అధ్యక్షులకు నియామకపత్రాలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి అల్లాబకష్, పుంగనూరు ఇన్చార్జి మురళీయాదవ్, పీలేరు ఇన్చార్జి సోమశేఖర్‌రెడ్డి, రైల్వేకోడూరు ఇన్చార్జి గోశాల దేవి, పార్టీ సీనియర్ నాయకులు రామకష్ణారెడ్డి, రాయచోటి చెన్నకష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు వీరే : షేక్ ఆదిల్ (రాజంపేట పట్టణం), మహదేవయ్య (రాజంపేట రూరల్), సల్మాన్(టి.సుండుపల్లె), సుబ్బరాయుడు (ఒంటిమిట్ట), శ్రీనివాస్ (చిట్వలి), రమేష్ (పుల్లంపేట), జీవరత్నం (పెనగలూరు), హరిక్రిష్ణారెడ్డి(ఓబులవారిపల్లె)ను నియమించారు. అలాగే బాబాసర్దార్ (రాయచోటి పట్టణం), నాగార్జున (లక్కిరెడ్డిపల్లె), గణేష్ (రామాపురం), సుబ్బయ్య (సంబేపల్లె), షబ్బీర్‌ఖాన్ (చిన్నమండెం), పీలేరు నియోజకవర్గంలో ఫిరోజ్ (గుర్రంకొండ), సాంబశివ (వాయల్పాడు), శ్రీకాంత్( పీలేరు), మదనపల్లె నియోజకవర్గంలో సతీష్‌రెడ్డి (రామసముద్రం), శేఖర్ (నిమ్మనపల్లె) లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా నియమించారు. -
మల్లూరమ్మ హుండీ ఆదాయం రూ.2,93,890
చిన్నమండెం : చిన్నమండెం మండలం మల్లూరు, కొత్తపల్లె గ్రామాల సరిహద్దు మాండవ్యనది ఒడ్డున ఉన్న మల్లూరమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడం ఇటీవలే అమ్మవారి జాతర వైభవంగా జరగడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. అదే విధంగా మల్లూరమ్మ తల్లి ఆలయ హుండీలను లెక్కించగా రూ.2,93,890 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ కొండారెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలుమదనపల్లె సిటీ/బి.కొత్తకోట : రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటనలు ఆదివారం జరిగాయి. బి.కొత్తకోట మండలం గొళ్లపల్లి పంచాయతీ కనికలతోపుకు చెందిన షేక్ మౌలాలి(35) పేపర్‌బాయ్‌గా పని చేస్తున్నాడు. ఉదయం పేపర్ ద్విచక్రవాహనంలో వేస్తుండగా ఎదురుగా వచ్చి కారు ఢీకొనడంతో గాయపడ్డాడు. స్థానికులు గమనించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. గుర్రంకొండ మండలం చెరువుముందరపల్లెకు చెందిన నారాయణ (45) ద్విచక్రవాహనంలో కలకడ క్రాస్ వద్ద వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని కడప – చిత్తూరు జాతీయ రహదారిపై షెంఫోర్డ్ స్కూలు సమీపంలో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా శనివారం అర్థరాత్రి ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొంది. జమాలపల్లె గ్రామానికి చెందిన ఆరిఫ్, షేక్ అహ్మద్, అబ్దుల్లా గౌస్ అనే ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన హైవే పెట్రోలింగ్ రక్షక్ సిబ్బంది గాయపడిన వారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. నూతన నియామకం రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని వివిధ మండలాలకు, పట్టణాలకు నూతన అధ్యక్షులకు నియామకపత్రాలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి అల్లాబకష్, పుంగనూరు ఇన్చార్జి మురళీయాదవ్, పీలేరు ఇన్చార్జి సోమశేఖర్‌రెడ్డి, రైల్వేకోడూరు ఇన్చార్జి గోశాల దేవి, పార్టీ సీనియర్ నాయకులు రామకష్ణారెడ్డి, రాయచోటి చెన్నకష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు వీరే : షేక్ ఆదిల్ (రాజంపేట పట్టణం), మహదేవయ్య (రాజంపేట రూరల్), సల్మాన్(టి.సుండుపల్లె), సుబ్బరాయుడు (ఒంటిమిట్ట), శ్రీనివాస్ (చిట్వలి), రమేష్ (పుల్లంపేట), జీవరత్నం (పెనగలూరు), హరిక్రిష్ణారెడ్డి(ఓబులవారిపల్లె)ను నియమించారు. అలాగే బాబాసర్దార్ (రాయచోటి పట్టణం), నాగార్జున (లక్కిరెడ్డిపల్లె), గణేష్ (రామాపురం), సుబ్బయ్య (సంబేపల్లె), షబ్బీర్‌ఖాన్ (చిన్నమండెం), పీలేరు నియోజకవర్గంలో ఫిరోజ్ (గుర్రంకొండ), సాంబశివ (వాయల్పాడు), శ్రీకాంత్( పీలేరు), మదనపల్లె నియోజకవర్గంలో సతీష్‌రెడ్డి (రామసముద్రం), శేఖర్ (నిమ్మనపల్లె) లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా నియమించారు. -
గోవా మద్యం బాటిళ్లు పట్టివేత
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జమ్మలమడుగు రోడ్డులో వైఎస్సార్ సర్కిల్ వద్ద 18 గోవా మద్యం బాటిళ్లను ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సురేంద్రారెడ్డి, సిబ్బందితో ఆదివారం వాహనాలను తనిఖీ చేపట్టారు. ఒక స్విఫ్డ్ డిజైర్ కారును తనిఖీ చేయగా అందులో 750 ఎంఎల్ గల 18 గోవా మద్యం బాటిళ్లు దొరికాయి. కాటం వీరేంద్ర, ఉప్పు రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు వీటిని తరలిస్తున్నారని, వారిపై కేసు నమోదు చేసి మద్యం బాటిళ్లను, కారును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. 18న పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా కడప వైఎస్ఆర్ సర్కిల్ : పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఈపీఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని కోరుతూ ఈనెల 18న మంగళవారం పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రామకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నిత్యాసర వస్తువుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఈపీఎస్ పెన్షనర్స్‌కు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తే ఏ రకంగా బతుకుతారని ప్రశ్నించారు. ఆరు నెలలకు ఒకసారి డీఏ చెల్లించాలని, కనీస పెన్షన్ రూ.9వేలు ఇవ్వాలని, పెన్షన్‌దారులకు ఈఎస్ఐ ద్వారా వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. రిమ్స్‌లో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహంకడప అర్బన్ : కడప రిమ్స్‌లో ఈనెల 9వ తేదీన ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. అతను ఈనెల 5న తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలిపారు. నలుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్ప్రొద్దుటూరు క్రైం : స్థానిక ఎర్రగుంట్ల రోడ్డులోని పాత పీఎంఎఫ్ వద్ద నలుగురు క్రికెట్ బుకీలను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇటీవల జరిగిన ఛాంపియన్ షిప్ ట్రోఫీ సందర్భంగా క్రికెట్ పందేలు నిర్వహించి పలువురు డబ్బులు పంచుకుంటున్నారని సమాచారం రావడంతో వన్‌టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ సంజీవరెడ్డి, శ్రీనివాసులు ఆదివారం సాయంత్రం సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడిలో ఆర్.నాగేంద్ర, గాలిపోతుల ఆనంద్, ఆర్.మనోజ్, బొమ్మిశెశెట్టి శివప్రసాద్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.20 లక్షలు నగదు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
మూల్యాంకనానికి సర్వం సిద్ధం
కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం(స్పాట్ వ్యాల్యుయేషన్) సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ అధికారులు పూర్తి చేశారు. ఈ ప్రక్రియ ఈనెల 17వ తేదీ సోమవారం నుంచి కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వేదికగా ప్రారంభం కానుంది. ప్రధాన ద్వారంతోపాటు మూల్యాంకనం జరుగుతున్న అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దిద్దుబాటులో జరిగే తప్పులు, దోషాలకు ఎగ్జామినర్లు, సిబ్బంది బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ అధికారులు తెలిపారు. నాలుగు విడతల్లో మూల్యాంకనం.. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన మూల్యాంకనం కోసం 2,05,000 జవాబు పత్రాలు జిల్లాకు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,85,253 పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. వీటిలో 1,75,393 కు కోడింగ్‌ను కూడా పూర్తి చేశారు. మిగతా వాటికి కోడింగ్ చేస్తున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం మొత్తం నాలుగు విడతల్లో జరగనుంది. ఇందుకు సంబంధించి ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో మూల్యాంకనం జరగనుంది. మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, 2వ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఇందులో ఒక ఎగ్జామినర్ పూటకు 15 చొప్పున రోజుకు 30 పేపర్లను దిద్దాల్సి ఉంటుంది. ఈ మూల్యాంకనం కోసం 450 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 100 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 100 మంది స్క్రూటినైజర్లు, 25 మంది ఏసీఓలను నియమించినట్లు ఆర్ఐఓ తెలిపారు. సిబ్బంది నియామకం పూర్తి.. మూల్యాంకన విధుల కోసం ఎగ్జామినటర్ల నియామక ఉత్తర్వులను ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే ఆయా కళాశాలలకు చేరవేసింది.పేపర్ వ్యాల్యుయేషన్ ప్రక్రియలో భాగంగా స్పాట్ క్యాంపు ఆఫీసర్‌గా ఆర్ఐఓ బండి వెంకటసుబ్బయ్య వ్యవహరిస్తారు. జనరల్–1 కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సూర్యారావు, జనరల్–2 గా కడప ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఉర్దూ లెక్చరర్ హబీబుల్లా, సీసీఓ–1గా ప్రొద్దుటూరు ఉర్దూ కాలేజీ ప్రిన్సిపాల్ రమణారెడ్డి, సీసీఓ–2గా కమలాపురం ఎయిడెడ్ కళాశాల ప్రిన్సిపాల్ సర్వేశ్వరరెడ్డి నియమితులయ్యారు. వీరితోపాటు కోడింగ్ ఆఫీసర్లు, ఏసీఓలు, సబ్జెక్టు ఎక్స్పర్ట్, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్ల నియామక ప్రక్రియ పూర్తయింది. అధ్యాపకులను రిలీవ్ చేయకపోతే కళాశాలలకు జరిమానా బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సివిక్స్, గణితం సబ్జెక్టులో చీఫ్ ఎగ్జామినర్లు, ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపకులను సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్లు తప్పని సరిగా రిలీవ్ చేయాలని స్పాట్ వాల్యూయేషన్ క్యాంప్ ఆఫీసర్ బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. కళాశాలల్లో రిలీవ్ అయిన అధ్యాపకులు 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు స్పాట్ వాల్యుయేషన్ క్యాంపునకు హాజరుకావాలన్నారు. వ్యాల్యూయేషన్ డ్యూటికి నియమితులైన అధ్యాపకులను రిలీవ్ చేయని కళాశాలలకు బోర్డు ద్వారా జరిమానా విధిస్తామన్నారు. నేటి నుంచి ఇంటర్మీడియట్ మూల్యాంకనం ప్రారంభం కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వేదికగా ఏర్పాట్లు 2,05,000 పేపర్లకు మూల్యాంకనం నాలుగు విడతల్లో జరగనున్న స్పాట్ ప్రక్రియమూల్యాంకన విధులకు తప్పకుండా హాజరు కావాలి.. జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న మూల్యాంకన విధులకు కేటాయించిన సిబ్బంది తప్పక హాజరుకావాలి. మూల్యాంకన కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ను అనుమతించడం జరగదు. కేంద్రంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేశాం. పేపర్ల దిద్దుబాటులో అలసత్వం ప్రదర్శించి తప్పులు చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. – బండి వెంకటసుబ్బయ్య, ఆర్ఐఓ, ఇంటర్ స్పాట్ క్యాంపు ఆఫీసర్ -
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మేజర్ జనరల్ అజయ్‌మిశ్రా అన్నారు. ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన మాజీ సైనికుల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి భారీ సంఖ్యలో హాజరైన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు చెందిన వ్యక్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మేజర్ జనరల్ అజయ్‌మిశ్రా, బ్రిగేడియర్ వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని చిన్న సమస్యలను అక్కడే పరిష్కరించారు. కల్నల్ మాథ్యూ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మాజీ సైనికులకు పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్య సేవలు అందించారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు చెందిన తొమ్మది మంది దివంగత సైనికుల సతీమణులను ఘనంగా సత్కరించారు. వారికి చీర, మెమెంటో, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లు బహూకరించారు. మాజీ రిక్రూట్ సహదేవరెడ్డికి ట్రై స్కూటర్ అందించారు. అలాగే తొమ్మిది మంది మాజీ సైనికులకు ట్రై ప్యాడ్, వాకింగ్ స్టిక్స్, ఐదుగురికి వీల్ చైర్లు అందజేశారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి రజాక్‌ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కల్నల్ ఎస్కే సింగ్, జాయింట్ డైరెక్టర్ హాస్పిటల్ సర్వీసెస్ కల్నల్ ఆర్.దత్తా, కల్నల్ బి.బుధౌరి, ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్మెంట్ అధికారి బ్రిగేడియర్ వెంకటరెడ్డి, కల్నల్ రాంప్రకాశ్, కల్నల్ కుల్దీప్మానె, కల్నల్ అశ్విన్దాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు కార్యక్రమంలో పాల్గొని తమ శాఖ ద్వారా అందించిన వైద్య సేవలను పర్యవేక్షించారు.మేజర్ జనరల్ అజయ్‌మిశ్రా -
ప్రైవేట్ డిగ్రీ అండ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కార్యవర్గం
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ అండ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని స్క్వేర్ సమావేశ మందిరంలో జరిగిన అసోసియేషన్ నాయకుల సమావేశంలో నూతన అధ్యక్షుడిగా రాజంపేట గీతాంజలి డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ సంభావు వెంకటరమణ, కార్యదర్శిగా ముద్దనూరు వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ జి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా నాగేశ్వరరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, కోశాధికారిగా ఆలీ అక్బర్, సంయుక్త కార్యదర్శిగా ఎన్.సంజీవరెడ్డి, రవి శేఖర్ రెడ్డి మిగిలిన సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షులు మదనమోహన్ రెడ్డి, రవి శేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి, పెంచలయ్య, రాజగోపాల్ రెడ్డి, పోలా రమణారెడ్డి, రాష్ట్ర నాయకులు పి.సురేష్, విజయ్ కుమార్, మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డి, సంజీవరెడ్డి, నరసింహులు, వివిధ కళాశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు. -
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి
కమలాపురం : కమలాపురం మండలం ఎర్రబల్లె, కొత్తపల్లె ఎస్సీ కాలనీకి చెందిన దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ కమలాపురం ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఆక్రమణకు గురైన స్థలాన్ని లబ్ధిదారులతో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1994లో అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్ 100/726 లో ఎర్రబల్లె కొత్తపల్లె ఎస్సీ కాలనీ వాసులకు 2.30 ఎకరాలు కేటాయించిందన్నారు. అందులో ఒక ఎకరాలో 30 మందికి ప్లాట్లు వేసి డీకేటీ పట్టాలు పంపిణీ చేసిందన్నారు. మిగిలిన 1.30 ఎకరాలు కమ్యూనిటీ అవసరాల కోసం అలాగే వదిలేశారన్నారు. ఆ స్థలాన్ని గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డిలు ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన భూమిని గుర్తించి ఎస్సీలకు అప్పగించాలని, అలాగే ఆక్రమణ దారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
ఏప్రిల్ 2 నుంచి సీపీఎం జాతీయ మహాసభలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : సీపీఎం జాతీయ మహాసభలు ఏప్రిల్ 2 నుంచి తమిళనాడులోని మధురైలో నిర్వహించనున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ తెలిపారు. ఆదివారం ఆర్కే నగర్‌లోని సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో దేశంలో, రాష్ట్రంలో జరిగే ఎలాంటి ఎన్నికల్లోనా సీపీఎం పొత్తులు ఒకే రకంగా ఉండవని తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి ఉంటాయన్నారు. ఏప్రిల్ 2 నుంచి 6వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జరిగే 24వ సీపీఎం జాతీయ మహాసభల్లో స్పష్టమైన రాజకీయ విధానం రూపొందించనున్నట్లు తెలిపారు. నేడు దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేయడం సీపీఎం భవిష్యత్తు కార్యాచరణ అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.రామ్మోహన్, బి.మనోహర్, వి.అన్వేష్, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి, బి.దస్తగిరి రెడ్డి, పి.చాంద్ బాషా, కె.సత్యనారాయణ, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. -
దీక్షలు విరమించండి
ప్రొద్దుటూరు రూరల్ : దీక్షలు విరమించి తరగతులకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెటర్నరీ కౌన్సిల్(ఏపీఎస్వీసీ) చైర్మన్ డాక్టర్ పి.వి. లక్షుమయ్య పశువైద్య విద్యార్థులకు సూచించారు. ఆదివారం మండలంలోని గోపవరం గ్రామ సమీపంలో ఉన్న పశువైద్య కళాశాల ఆవరణలో పశువైద్య విద్యార్థులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీక్షలను విరమిస్తే పశువైద్య విద్యార్థుల తరపున ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. తరగతులు కోల్పోకూడదని, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం పెంచిన రూ.10,500 స్టైఫండ్ మీకు సరిపోదని తనకు తెలుసునని ఇంకొంచం పెంచేందుకు తాను ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం జీఓ విడుదల చేస్తుందని పేర్కొన్నారు. అందుకు పశువైద్య విద్యార్థులు మాట్లాడుతూ జీఓ వచ్చేంత వరకు దీక్షలను కొనసాగిస్తామని తెలిపారు. మిగిలిన పశువైద్య కళాశాలలైన గరివిడి, గన్నవరం, తిరుపతి విద్యార్థులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.ఏపీఎస్వీసీ చైర్మన్ డాక్టర్ లక్ష్మయ్య -
బి.కొత్తకోటలో సీపీఐ శత వార్షిక వేడుకలు
బి.కొత్తకోట : సీపీఐ శత వార్షిక వేడుకలను ఆదివారం బి.కొత్తకోటలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్య అతిథిగా హజరయ్యారు. స్థానిక జ్యోతిచౌక్ నుంచి మెయిన్‌రోడ్డు, దిగువబస్టాండ్, పంచాయతీ వీధి, బైపాస్‌రోడ్డు, రంగసముద్రంరోడ్డు మీదుగా ప్రదర్శన నిర్వహించారు. నారాయణ డప్పుకొట్టి ప్రదర్శనను ప్రారంభించారు. అంతకుముందు జ్యోతిచౌక్ చేరుకున్న నారాయణ ఇక్కడి సాదిక్‌బాషా బిర్యానీ హోటల్ వద్దకు వచ్చి సాధారణ వ్యక్తిలా గ్లాసుతో నీళ్లు తాగారు. వెనక్కి ఇస్తూ ఏం వండారు అని నిర్వాహకున్ని ప్రశ్నించగా బిర్యాని అని చెప్పడంతో కొద్దిగా అన్నం పెట్టమని ప్లేటులో తీసుకుని రుచి చూశారు. అక్కడే ఉన్న ఓ విలేకరి చికెన్ తినరా అని ప్రశ్నించగా తింటాను ఓ ముక్క పెట్టమని చెప్పి పెట్టించుకుని తిన్నారు. ర్యాలీ సందర్భంగా స్థానికులు ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తి చూపారు. నారాయణ ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటిలో సభ్యునిగా పనిచేస్తున్న కాలం నుంచి బి.కొత్తకోటతో అనుబంధం ఉంది. దీంతో పాతతరం సీపీఐ నాయకులను పేరుతో పలకరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహులు, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గంగాధర, ఉపపధాన కార్యదర్శి సలీంబాషా, ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి సాంబశివ, రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణప్ప, ప్రజానాట్యమండలి కార్యదర్శి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. -
అరబ్బుల ఇంటికి.. మన అరటి!
పులివెందులూరల్: వైఎస్సార్ జిల్లా పులివెందుల అరటి కాసులు కురిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో మంచి డిమాండ్ ఉన్న ఈ అరటి ఇటీవల కాలంలో గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతూ నాణ్యత విషయంలో తగ్గేదే లేదంటోంది. ఈ ప్రాంతంలో సాగయ్యే అరటికి బయట మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారులు నేరుగా తోటల వద్దకు వస్తున్నారు.ఢిల్లీ మార్కెట్‌కు అనుకూలంగా ఉన్న తోటలను ఎంచుకుని అరటికాయలను కొనుగోలు చేస్తున్నారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి ధరలు నిర్ణయించి కొనుగోలు చేయడం ద్వారా దళారుల బెడద లేకుండా పోయిందని రైతన్నలూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో 10 నుంచి 15వేల ఎకరాల్లో ... పులివెందుల ననియోజకవర్గ వ్యాప్తంగా 15వేల ఎకరాల్లో అరటి సాగు ఉంటే ఇందులో 10వేల ఎకరాల్లో గెలలు మొదటి కోతకు రానున్నాయి. నియోజకవర్గంలోని పులివెందుల, లింగాల, వేముల, వేంపల్లె మండలాల్లో అధికంగానూ, తొండూరు, సింహాద్రిపురం మండలాల్లో తక్కువగా అరటి సాగు అవుతోంది. ఒకసారి సాగు చేస్తే మూడు పంటలు తీయవచ్చన్న ఉద్దేశంతో రైతులు అరటిని ఎంచుకుంటున్నారు. ఎక్కువగా మే, జూన్, జూలై నెల్లో సాగుచేస్తారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోతకు వచ్చేలా సాగు చేయడం ద్వారా ధరలు ఉంటాయని రైతులు అంటున్నారు. ఎకరాకు రూ.60వేలు పైనే పెట్టుబడులు అరటి సాగులో పెట్టుబడులు కూడా అధికం అవుతున్నాయి. ఎకరా సాగు చేయాలంటే రూ.60వేల నుంచి రూ.70వేల వరకు పెట్టుబడులు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. అరటి నాటిన మొదలు గెలలు కోతకు వచ్చే వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాగుచేసిన 11 నెలలకు గెలలు కోతకు వస్తాయి. సాగులో పెట్టుబడులు అవుతున్నప్పటికీ ఆదాయం ఉంటుందనే రైతులు అరటిని సాగుచేస్తున్నారు. డ్రిప్పు ద్వారా నీటి తడులతో పాటు ఎరువులు అందించడం ద్వారా నాణ్యమైన అరటి ఉత్పత్తులు అందుతున్నాయి. సాగులో ఎకరాకు 10 నుంచి 15 టన్నుల వరకు దిగుబడులు వస్తున్నాయి. ఒక్కో గెల 10 నుంచి 12 చీప్‌లు వేస్తుందని రైతులు అంటున్నారు. వారం రోజుల పాటు అరటి కాయల నిల్వ ... పులివెందుల నుంచి అరటిని ఢిల్లీకి తరలించాలంటే వారంరోజులు పడుతుంది. పక్వానికి వచ్చిన గెలలను కొట్టి చీపులను వేరుచేస్తారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా వారంపాటు నిల్వ ఉండడంతో ఢిల్లీకి చెందిన వ్యాపారులు పులివెందుల అరటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కోసారి అరటి గెలలను లారీకి లోడ్ చేసి ఢిల్లీకి తరలిస్తారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లేసరికి అరటి గెలలు దెబ్బతినవని, కాయలు నాణ్యతగా ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. అరటికాయలను శుద్ధిచేసి ప్యాకింగ్ ... పులివెందుల నుంచి అరటి కాయలను ఢిల్లీకి తరలించాలంటే శుద్ధి చేసి ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో తోటల వద్దకు కూలీలు వెళ్లి అరటి గెలలు తీసుకువచ్చి చీపులను వేరుచేస్తారు. వీటిని బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిలో శుద్ధి చేస్తారు.అలా శుద్ధిచేసిన చీపులను అట్టపెట్టెలో కవరు వేసి అందులో అరటి కాయలను ఉంచి ప్యాకింగ్ చేస్తారు. ఒక్కో అట్టపెట్టెలో 15కిలోల చొప్పున అరటికాయలను ప్యాక్ చేస్తారు. తోటల వద్దనే తూకాలు వేసి అట్టపెట్టెలను సీజ్ చేస్తారు. అరటికాయలతో ఉన్న అరటి పెట్టెలను లోడ్ చేసి ఢిల్లీ మార్కెట్‌కు తరలిస్తారు. గల్ఫ్ దేశాలకు పులివెందుల అరటిపులివెందుల ప్రాంతంలో పండిన అరటికి ఢిల్లీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎక్కువగా ఈ సీజన్లోనే ఇక్కడ అరటి కాయలను తరలిస్తారు. నెలకు 10నుంచి 15వేల టన్నుల మేర కాయలు ఢిల్లీ మార్కెట్‌తో పాటు గల్ఫ్ దేశాలు అరబ్, ఇరాక్, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్తాయి. ఇక్కడ పండించిన అరటి నాణ్యతగా ఉండడం, వారం రోజుల పాటు నిల్వ ఉండడం వల్ల ఢిల్లీ మార్కెట్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో డిమాండ్ ఉంటుంది. – రామమల్లేశ్వరరెడ్డి, అరటి రైతు -
రూటే..సప‘రేటు’పై కలెక్టర్ స్పందన
● డీఎంహెచ్ఓ ఏఓను డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేస్తూ ఆదేశం కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన అవినీతి ఆరోపణలపై ఈ నెల 7న సాక్షిలో ప్రచురితమైన రూటే..సప‘రేటు’అనే కథనంపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పందించారు. అధికారులను పిలిపించుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఏఓ శ్రీదేవిని డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేశారు. అలాగే ఇందుకు సంబంధించి లోతుగా విచారించాలని ఒక అధికారిని నియమించారు. కాగా ఈ వ్యవహరానికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పద్మావతి సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. కోట్ల స్వాహాపై విచారణ కడప రూరల్: జిల్లా క్షయ నియంత్రణ విభాగంలో జరిగిన అవినీతిపై ఈ నెల 16న సాక్షిలో ప్ర చురితమై ‘క్షయ నియంత్రణ పేరుతో కోట్లు మింగేశారు’కథనం ఆ శాఖలో ప్రకంపనలు పుట్టించింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు సైతం స్పందించారు. విచారణకు ఆదేశించారు.ఈ నేపధ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు ఈ నెల 18న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగే మీటింగ్‌కు క్షయ నియంత్రణ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది సంబంధిత రికార్డులతో రావాలని ఆదేశించారు. అలాగే 2023–2025 నుంచి జరిపిన బ్యాంకు లావాదేవీలపై కూడా ఆరా తీయనున్నారు. ఘనంగా ఉరుసు సిద్దవటం: పరకోటలో వెలసిన హజరత్ సయ్య ద్ షా బిస్మిల్లాషా ఖాద్రీ దర్గాలో ఆదివారం ఉరుసు మహోత్సవం ఘనంగా జరిగింది. శనివారం రాత్రి గంధోత్సవం సందర్భంగా ఫాతెహాను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గంధం అర్పించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. -
తప్పని పరిస్థితుల్లోనే నిరసన
ఉద్యోగ భద్రత..వేతనాల పెంపు ఇతర సమస్యల పరిష్కారానికి చాలా నెలల నుంచి ఆందోళన చేపడుతున్నాం. మా సమస్యలను ప్రభుత్వానికి విన్నవించాం. సమస్యలు పరిష్కారం కాలేదు. తప్పని పరిస్థితుల్లో ఈ నెల 17న కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన తెలుపుతున్నాం. అలాగే 24న జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయం వద్ద, 27న మంగళగిరిలోఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయం వద్ద విధులను బహిష్కరించి శాంతియుత నిరసన తెలపాలని రాష్ట్ర కమి టీ నిర్ణయించింది. – విజయ్, అధ్యక్షులు, జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ వైద్య మిత్రల యూనియన్ -
అమరజీవి త్యాగం ఆదర్శనీయం
కడప సెవెన్‌రోడ్స్: ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సంస్మరణ సభ జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జాతికోసం ప్రాణాలర్పించిన మహనీయులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. విధినిర్వహణలో ప్రతి ఉద్యోగికి ఆయన అత్యున్నత విలువలు స్ఫూర్తిదాయకం అన్నారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి డీఆర్వోతో పాటు పలువురు పూలమాలవేసి నివాళులర్పించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి, కలెక్టరేట్ అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రాణత్యాగం చేసిన మహనీయుడు కడప అర్బన్: దేశంలోని భాషా ప్రయుక్త రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు మనందరికి గర్వకారణమని ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ కొనియాడారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీఅశోక్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. అదనపు ఎస్పీ కె ప్రకాష్ బాబు, ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య, ఆర్ఐలు ఆనంద్, వీరేష్, టైటాస్, శివరాముడు, ఆర్.ఎస్.ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డీఆర్వో విశ్వేశ్వరనాయుడు -
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో ఏప్రిల్ 5 నుంచి 15 వరకు జరగనున్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీలు, సీఐలకు పలు సూచనలు చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలన్నారు. కడప–ఒంటిమిట్ట మార్గంలోని ఉప్పరపల్లె వద్ద ఏర్పాటు చేయనున్న పార్కింగ్ ప్రదేశం, కల్యాణ వేదిక, సాలాబాద్ వద్ద ఉన్న పార్కింగ్ ప్రవేశం, టీటీడీ గెస్ట్ హౌస్, వీవీఐపీ గెస్ట్ హౌస్, ఆలయ పరిసరాలు పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై కడప డీఎస్పీ వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కల్యాణ వేదిక సమీపంలోని పార్కింగ్ స్థలం వద్ద వాహనాలు క్రమ పద్ధతిలో నిలిపి ఉంచేలా పర్యవేక్షించాలన్నారు. భారీ కేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సీఐ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. రామయ్యను దర్శించుకున్న జేసీలు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అతిధి సింగ్, అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్‌లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ లాంఛనాలతో వారికి స్వాగతం పలికి ప్రదక్షణ గావించి గర్భాలయంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ రంగమండపంలో సేదతీరిన వారికి అర్చకులు సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఒంటిమిట్ట మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.డీఎస్పీ, సీఐలకు సూచనలు చేస్తున్న ఎస్పీ అశోక్ కుమార్ -
రాజకీయ కక్షతోనే నిప్పంటించారు
ప్రొద్దుటూరు : స్థానిక పాత బస్టాండ్‌లోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు అయిన కొండారెడ్డి, సుధాకర్ షాపులు దగ్ధం కావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కేవలం రాజకీయ కక్ష సాధింపే ఈ సంఘటనకు కారణమని భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యర్తలు కొండారెడ్డి, సుధాకర్ పాతబస్టాండ్‌లో షాపులు నిర్వహిస్తున్నారు. కొండారెడ్డి కూల్ డ్రింక్ షాపు, సుధాకర్ ఫ్యాన్సీ స్టోర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఊహించని రీతిలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఇరువురి దుకాణాలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 12న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన యువత పోరు కార్యక్రమానికి కొండారెడ్డి కార్యకర్తలతో కలసి వాహనాల్లో కడపకు వెళ్లారు. ఈ కారణంగానే వీరి షాపులకు నిప్పు అంటించారని తెలుస్తోంది. శనివారం మున్సిపల్ వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, కౌన్సిలర్ చింపిరి అనిల్ కుమార్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు ద్వార్శల గురునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. పాత బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తల షాపులు దగ్ధం -
క్షయ నియంత్రణ పేరుతో.. కోట్లు మింగేశారు !
కడప రూరల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షయ నియంత్రణకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నాయి. అయితే ఈ నిధులు కొంతమంది అవినీతి పరులైన ఉద్యోగుల వలన పక్కదారి పడుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జిల్లా క్షయ నియంత్రణ విభాగం ఒకటి. ఈ కార్యాలయం కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉంది. అవినీతి జరిగింది ఇలా... క్షయ వ్యాధిని నియంత్రించేందుకు జిల్లా క్షయ నియంత్రణ విభాగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రూ.కోట్ల నిధులను కేటాయిస్తాయి. ఈ నిధులను క్షయ నియంత్రణకు సంబంధించిన అంశాలకు ఖర్చు చేయాలి. అయితే 2019 నుంచి 2025 ఏడాదిలో ఇప్పటి వరకు ఆ విభాగంలో పనిచేసే కొందరు ఉద్యోగులు నిధులను పక్కదారి పట్టించారు. ● ఎన్‌పీవై (నిక్షయ్ పోషణ యోజన) స్కీం కింద టీబీ పేషెంట్ల పౌష్టికాహారానికి సంబంధించి ప్రభుత్వం ఒకరికి ఒక నెలకు రూ.500 చొప్పున 6 నెలల కాలానికి రూ.3 వేలు అందజేస్తుంది. అలాగే క్షేత్ర స్థాయిలో పేషెంట్ ఆరోగ్య పరిరక్షణ, పర్యవేక్షణ బాధ్యతలను ‘ట్రీట్మెంట్ సపోర్టర్స్’గా ఆశాలు నిర్వహిస్తారు. ఈ ఆశాలకు కూడా ఒక పేషెంట్‌కు ఆరు నెలల కాలానికి రూ.3 వేలు వారి ఖాతాలకు జమ చేస్తారు. వ్యాధిగ్రస్తులకు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్) ద్వారా రూ.3 వేలు అందిస్తారు. ఈ నిధులకు సంబంధించి అక్కడ పనిచేసే ఉద్యోగులు అకౌంట్ నంబర్లను మార్చి తమకు అనుకూలమైన అకౌంట్లకు నిధులను జమ చేశారు. ట్రీట్మెంట్ సపోర్టర్స్‌కు ఇవ్వవలసిన డబ్బులను పీఎఫ్‌ఎంఎస్‌లో అకౌంట్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్స్‌ను మార్పు చేసి అక్కడ పనిచేసే ఉద్యోగి తనకు సంబంధించిన వారి అనధికారిక ఖాతాలకు దాదాపు రూ.12 లక్షలు దారి మళ్లించారు. ఇందుకు సంబంధించి నోట్ ఫైల్, పీఎఫ్ఎంఎస్ నుంచి పంపిన అకౌంట్స్ వివరాలు, ట్రీట్మెంట్ సపోర్టర్స్ వివరాలను పరిశీలించాలి. ● జిల్లాలో 40 మంది టీబీ ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు. వారందరికీ పీఓఎల్ (పెట్రోల్ బిల్లులు) చెల్లించాలి. ఒకరికి ఒక నెలకు రూ.3500 వరకు వస్తుంది. ఈ బిల్లులను 5–6 నెలలకు ఒక సారి చెల్లిస్తారు. అందుకు గాను ఒకరి నుంచి రూ.2 వేలు వసూలు చేస్తారు. ఎందుకని అడిగితే జిల్లా అధికారులకు ఇవ్వాలని సమాధానం ఇస్తారు. అలాగే ఫీల్డ్ స్టాఫ్ మాత్రమే ఉపయోగించాల్సిన టూ వీలర్స్‌ను అక్కడ పనిచేసే ఉద్యోగి తన వాళ్లకు ఇచ్చారు. కొన్ని టూ వీలర్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా అక్కడ పనిచేసే ఉద్యోగే ఉపయోగిస్తున్నారు. ● ఈ పెట్రోల్ బిల్లులకు సంబంధించి అక్కడ పనిచేసే ఉద్యోగులు తమకు అనుకూలమైన ఎస్టీఎస్ (సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్), టీబీహెచ్ఎస్ (ఫీల్డ్ స్టాఫ్) ఎంపీహెచ్‌ఎస్‌లకు అధిక మొత్తంలో బిల్లులను మంజూరు చేస్తారు. అందుకు సంబంధించిన డబ్బును ఆ ఉద్యోగుల నుంచి వసూలు చేస్తారు. ఆ విధంగా వచ్చిన డబ్బును తమ ఖాతాల్లో వేసుకోకుండా అనుకూలమైన అక్కడే పనిచేసే ఉద్యోగులతో పాటు కుటుంబ సభ్యుల ఖాతాల్లో జమ చేశారు. ఈ ఖాతాలను పరిశీలిస్తే ఆ వివరాలు తెలుస్తాయి. ● టీబీ డ్రగ్స్‌కు సంబంధించి తప్పుడు బిల్లులను పొందుపరిచారు. ఈ డ్రగ్స్‌కు సంబంధించిన నోట్ ఫైల్‌తో పాటు డ్రగ్ బిల్స్, పీఎఫ్ఎంఎస్ నుంచి ఆ నగదును ఏ అకౌంట్, ఐఎఫ్ఎస్సీ కోడ్స్‌కు బదిలీ చేశారో పరిశీలించాలి. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు.. ఆ శాఖలో అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులపై ఈ నెల 12వ తేదీన ఓ వ్యక్తి రూ.5 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు .రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, విజయవాడ అవినీతి నిరోధక శాఖ, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర టీబీ నియంత్రణ అధికారితో పాలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశం ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర క్షయ నివారణ అధికారి డాక్టర్ రమేష్‌బాబును ఆదేశించారు. అలాగే జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరూకురి విచారణకు ఆదేశించినట్లుగా సమాచారం. విచారిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి..ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఆ శాఖలో ఉద్యోగుల మధ్య తీవ్ర చర్చజరుగుతోంది. అవినీతి సొమ్ముతో ఉద్యోగులు తమ సొంత పనులను చక్కబెట్టుకుంటున్నారని అనుకుంటున్నారు. అక్రమ సంపాదనలో ఏ అధికారికి ఎంత వాటా ఉంది. దీని వెనుక ఏ అధికారి ప్రమేయం..హస్తం ఉంది అనే అంశాలు వెలుగు చూడాల్సి ఉంది. కాగా ఫిర్యాదుదారుడు చాలా వరకు ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ అంశాలపై నిజాయితీగా లోతైన సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. అప్పుడే వచ్చిన ఆరోపణలు వాస్తవమా..అవాస్తవమా అనేది తేలుతుందని ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వ నిధులకు కన్నం ఉద్యోగుల చేతి వాటం ఉన్నతాధికారుల దృష్టికి అవినీతి బాగోతం విచారణకు డీఎంహెచ్ఓను ఆదేశించాం... క్షయ నియంత్రణ విభాగంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజును ఆదేశించాం. విచారణ చేపట్టిన తరువాత అందుకు సంబంధించిన నివేదికను తెప్పించుకొని పరిశీలించి, చర్యలు చేపడతాం. – డాక్టర్ రమేష్‌బాబు, రాష్ట్ర క్షయ నియంత్రణ అధికారి, జాయింట్ డైరెక్టర్ -
పర్యవేక్షణ లోపమే విద్యార్థిని ఆత్మహత్యకు కారణం
జమ్మలమడుగు : హాస్టల్ వార్డన్ ప్రభావతి, అక్కడ వంట మనిషిగా పని చేస్తున్న ప్రసన్నల వికృత చేష్టలే డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అక్షిత (18) మరణానికి ప్రధాన కారణమని పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. దీంతో వార్డన్ ప్రభావతిని సస్పెండ్ చేయగా వంట మనిషిగా ఉన్న ప్రసన్నను అవుట్ సోర్సింగ్ ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనూ ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థినులు.. గత ఏడాది నవంబర్‌లో ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. అప్పట్లో అధికారులు వారి వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యలకు యత్నించినట్లు తప్పుడు నివేదిక ఇవ్వడం వల్లే తిరిగి ఇలాంటి సంఘటన జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. హాస్టల్ వార్డన్, వంట మనిషి వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినులను తమ స్వలాభాలకు ఉపయోగించుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వంట మనిషి ఆడపిల్లలను అర్థరాత్రి పూట బయటకు పంపిస్తోందని స్థానికులు చెప్పినా వార్డన్ పట్టించుకోలేదనే విమర్శలు వినవస్తున్నాయి. అక్షిత కుటుంబానికి న్యాయం చేయాలి ఆత్మహత్య చేసుకున్న అక్షిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో తప్పుడు నివేదిక ఇచ్చిన ఏఎస్డబ్ల్యూఓ గురుప్రసాద్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. పోలీసుల విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు -
మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ
కడప వైఎస్ఆర్ సర్కిల్ : బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది..ఇటీవల రాయచోటి ఘటనలో దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి.. అని పలు పార్టీలు, సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక నూర్జహాన్ కల్యాణ మండపంలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మతసామరస్యం–ప్రాధాన్యత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం బెంగళూరు, హైదరాబాద్, కలకత్తా, కేరళ, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బలపడేందుకు ప్రయోగాలు చేస్తున్నదని తెలిపారు. ఐక్యతకు నిలయమైన రాయలసీమ ప్రాంతంలో మతచిచ్చు పెడుతున్నారని, బీజేపీ దాని అనుబంధ సంస్థలు పనిగట్టుకుని దాడులకు పూనుకుంటున్నాయన్నారు. రాయచోటిలో వీరభద్రస్వామి శోభాయాత్ర పేరిట ముస్లింలు ప్రార్థన చేసుకుంటున్న ప్రార్థనా మందిరం వైపు వెళ్లి మతాచారాలకు విరుద్ధంగా వ్యవహరించి ముస్లింలపై దాడి చేసి వారే తమపై దాడి చేశారని కేసులు పెట్టి అమాయలను జైల్లో వేశారని చెప్పారు. రాయచోటిలో వీరభద్రస్వామి యాత్ర మధ్యాహ్నం మూడు గంటలకు మసీదు దాటుకోవాలని పోలీసులు చెప్పినప్పటికీ, వారు ఉద్దేశపూర్వకంగానే సాయంత్రం 6:15 గంటలకు మసీదు వద్దకు తెచ్చారన్నారు. మసీదు ఎదుట డీజీలు, బాణసంచా కాలుస్తూ, డప్పులు, నినాదాలు చేస్తూ గొడవలు సృష్టించారని, మసీదులో ప్రార్థన చేసుకుంటున్న ముస్లిం పెద్దలపై పిల్లలపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారన్నారు. ఒకప్పుడు దేశ ప్రజలందరూ కలిసి బ్రిటీష్ వారిని ఎదిరించిన గడ్డలో ప్రజల మధ్య మతాల చిచ్చుపెట్టి విడదీసే ప్రయత్నాలకు బీజేపీ ప్రభుత్వం నాంది పలికిందన్నారు. బీజేపీ చేస్తున్న వికృత చేష్టలకు ప్రజలు విసిగిపోయారని, వారు తిరగబడే రోజు అత్యంత దగ్గరలోనే ఉందన్నారు. ఈ సమావేశంలో ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, నగర ముస్లిం ప్రముఖులు జిలాన్, అమీర్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అఫ్జల్ ఖాన్, గౌస్‌పీర్, సీఎస్ఐ టౌన్ చర్చి పాస్టర్ మోహన్ బాబు, మల్లెల భాస్కర్, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకుడు ఓబయ్య, ఎన్ఆర్సీ,సీఏఏ వ్యతిరేక కమిటీ కన్వీనర్ బాబు భాయ్, సీహెచ్ శివారెడ్డి, జాకీర్, సంఘ సేవకుడు సలావుద్దీన్, రాయలసీమ మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి తస్లీమా, గౌస్‌పీర్, ఎస్బీఐ తాహిర్, కార్పొరేటర్ షఫీ తదితరులు పాల్గొన్నారు. రాయచోటి ఘటనకు బాధ్యులను శిక్షించాలి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు -
గ్రావెల్ తరలిస్తున్న వాహనాలు సీజ్
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగర శివారులోని చిన్నచౌక్ గ్రామ సర్వే నెంబర్ 919లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. రెండు టిప్పర్లు, ఒక ట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ తరలిస్తుండగా సీజ్ చేశారు. పట్టుబడిన వాహనాలను కడప నగరంలోని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. కేసులతో వేధించడం సరికాదు కడప అర్బన్ : ఎక్కడైనా రెండు వర్గాల మధ్య సమస్యలు ఉన్నప్పుడు శాంతియుతంగా ఆ సమస్యను పరిష్కరించాల్సిందిపోయి ఒకే వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని విపరీతమైన సెక్షన్లతో కేసులు పెట్టి వేధించడం అనేది చాలా దారుణమని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్నారు. ఇటీవల రాయచోటిలో జరిగిన సంఘటనకు సంబంధించి అక్రమ కేసుల ద్వారా రిమాండ్‌లో ఉన్న బాధితులను శనివారం ఆయన కడప కేంద్ర కారాగారానికి వచ్చి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేతలు ఇలాంటి ఘటనలపై స్పదించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తపడాలన్నారు. ఎర్రగుంట్లలో చోరీ ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని వినాయకనగర్ కాలనీలో అబ్దుల్ సత్తార్ ఇంటిలో చోరీ జరిగింది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ నరేష్కుమార్ శనివారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం వచ్చి సంఘటన స్థలంలో వేలి ముద్రలు సేకరించారు. బాధితుతు తెలిపిన వివరాలకు మేరకు ...అబ్దుల్ సత్తార్ రెండు రోజుల క్రితం తన కూతురు వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. వెంటనే లోనికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న రెండు జతల కమ్మలు, వెండి పట్టీలు, గజ్జెలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నరేష్కుమార్ తెలిపారు. -
‘కాశినాయన’పై దాడికి సీమపై వివక్షే కారణమా ?
కడప కల్చరల్ : కాశినాయన ఆశ్రమంపై దాడి చేసి అటవీ అధికారులు అక్కడి కొన్ని ముఖ్యమైన భవనాలను కూల్చివేయడానికి అధికారులు, రాజకీయ నాయకుల్లో రాయలసీమపైగల వివక్షే కారణమా అని రాయలసీమ ఆకాంక్షల పౌర వేదిక కోఆర్డినేటర్ అలవలపాటి రఘునాథరెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కన్నబిడ్డలు అన్నం పెట్టకపోయినా ఆశ్రమంలో ఎప్పటికీ అన్నం లభిస్తుందని కాశినాయన ఆశ్రమానికి రోజూ వందలాది మంది అనాథలు చేరుకుంటారన్నారు. కుల మత గోత్రాలను పట్టించుకోకుండా అన్నార్తులను ఆదుకుంటున్న ఇలాంటి ఆశ్రమాలకు సాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. ఈ కూల్చివేతకు అటవీ నిబంధనలు ప్రధాన కారణం కాదన్నారు. కూల్చివేత సమయంలో ఉండిన స్థితిని పునరుద్ధరించాలని, అందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు. ఏపీజీబీ విషయంలో కూడా.. కాశినాయన ఆశ్రమం విషయంలో స్పందించినట్లే ఏపీజీబీ విషయంలో కూడా రాష్ట్ర మంత్రి లోకేష్ సరైన రీతిలో స్పందించి ఇకనైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని వేదిక కో ఆర్డినేటర్ రఘునాథ రెడ్డి కోరారు. రాష్ట్రంలో 4 గ్రామీణ బ్యాంకుల విలీనం తర్వాత పెద్ద బ్యాంక్ అయిన ఏపీజీబీ ప్రధాన కార్యాలయం ఉన్న కడపలోనే రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయం కొనసాగాలని ఈ ప్రాంతంలో రాజకీయ అనుబంధాలకు అతీతంగా అందరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఓపెన్ స్కూలు కో ఆర్డినేటర్ అక్రమాలపై విచారణ జరపాలి కడప సెవెన్‌రోడ్స్ : ఓపెన్ స్కూలు కో ఆర్డినేటర్ సాంబశివారెడ్డి అవినీతిపై విచారణ జరపాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేశు యాదవ్ కోరారు. శనివారం కలెక్టరేట్ సభా భవనంలో రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూలు ఎడ్యుకేషన్ కె.శ్యామూల్‌కు వినతిపత్రం సమర్పించారు. సాంబశివారెడ్డికి అర్హత లేకపోయినా ఓపెన్ స్కూలు కో ఆర్డినేటర్‌గా అప్పటి డీఈఓ అనూరాధ నియమించారన్నారు. సుమారు ఆరు వేల మంది ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాశారని, ఒక్కొక్కరి వద్ద రూ. 5–8 వేలు సాంబశివారెడ్డి వసూలు చేశారని ఆరోపించారు. ఇలా రూ. 6 కోట్లు అక్రమంగా వసూలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నవీన్, నాయకులు నాగమల్లయ్య, అశోక్, సూర్యవంశీ, నాగార్జున, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న పెట్రోలు, డీజిల్ నిక్షేపాల సర్వే లింగాల : లింగాల మండలంలో డీజిల్, పెట్రోలు నిక్షేపాలను గుర్తించేందుకు అన్వేషణ కొనసాగుతోంది. రైతులకు తెలియకుండా వారి పొలాల్లో బోర్లు వేయబోమని కాంట్రాక్టర్లు మాధవరెడ్డి, సురేష్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన అక్షయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు లేబర్ కాంట్రాక్టు పొంది ఈ అన్వేషణలో భాగంగా లింగాల, తొండూరు మండలాల్లో బోరుబావుల తవ్వకం నిర్వహిస్తున్నామన్నారు. అయితే ఆ గ్రామాల వీఆర్ఓలకు, సర్పంచ్‌లకు తెలియజేసి దండోరా వేయించి రైతులకు తెలియపరుస్తామన్నారు. అయితే రైతుల బోరుబావుల సమీపంలో బోర్లు వేయడం జరగదని, బోరుకు బోరుకు మధ్య దూరాన్ని పాటించి రైతులకు ఎలాంటి హాని లేకుండా చూసుకుంటామని వీఆర్ఓ బాబు తెలిపారు. గడ్డివామి దగ్ధం బ్రహ్మంగారిమఠం : బి.మఠం –బద్వేలు రోడ్డులో నరసింహస్వామి ఆశ్రమం దగ్గర ఉన్న గోశాలలో శనివారం తెల్లవారు జామున గడ్డి వామికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అంతకు ముందు రోజు గోశాలకు సమీపంలో ఉన్న నివాసముంటున్న వారికి గోశాల నిర్వాహకులకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. గడ్డి వామి దగ్ధంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గోశాల నిర్వాహకులు తెలిపారు. ఏఆర్ ఎస్ఐ సస్పెన్షన్ కడప అర్బన్ : కడపలోని పోలీస్ శాఖలో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్న ఐవీ రమణారెడ్డి (1824)ని సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయప్రవీణ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చాలామంది నిరుద్యోగ యువత వద్ద లక్షలాది రూపాయలను వసూలు చేసుకున్నారు. దీంతో బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారు. వారి ప్రాథమిక నివేదిక మేరకు కర్నూలు డీఐజీ ఆదేశించారు. బ్యాంకు ఖాతా నుంచి రూ.4.89 లక్షలు కాజేశారు బి.కొత్తకోట : గుర్తు తెలియని వ్యక్తి నుంచి మొబైల్‌కు వచ్చిన మేసేజ్ ఓపెన్ చేయగానే రూ.4.89 లక్షలు కాజేశారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు. మండలంలోని నాయనబావికి చెందిన దాదం లోకనాథరెడ్డి మొబైల్‌కు గతనెల 14న ఓ మెసేజ్ వచ్చింది. దాన్ని చూసిన లోకనాథరెడ్డి క్లిక్ చేసి తెరిచాడు. గట్టు కెనరా బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా రూ.4,89,858 నగదు వేరే ఖాతాలకు బదిలీ అయిపోయింది. -
ప్రొద్దుటూరులో ఆగని చోరీలు
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో దొంగతనాలు ఆగడం లేదు. చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ నెల ఏడో తారీఖున మైదుకూరు రోడ్డులోని లక్ష్మీనగర్‌లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. వస్త్రవ్యాపారి వల్లంకొండు రఘువంశీకి చెందిన 850 గ్రాముల బంగారు. 670 గ్రాముల వెండి, రూ. 7.70 లక్షలు నగదును దొంగలు దోచుకెళ్లారు. అయితే వారం రోజుల వ్యవధిలోనే హౌసింగ్‌బోర్డులో మళ్లీ చోరీ జరిగింది. ఇక్కడి గోపిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఇంట్లో సుమారు 25 తులాల బంగారు నగలను దొంగలు అపహరించుకొని వెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజుపాళెం మండలం, టంగుటూరు గ్రామానికి చెందిన శివశంకర్‌రెడ్డి వ్యవసాయదారుడు. వారి ఒక్కగానొక్క కుమార్తె సౌమ్యారెడ్డి చదువుల కోసం ప్రొద్దుటూరులోని హౌసింగ్‌బోర్డు కాలనీలో డూప్లెక్స్ ఇంటిని నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. పొలం పనులు ఉన్నప్పుడు గ్రామానికి వెళ్లొస్తుంటారు. శివశంకర్‌రెడ్డి, భార్య కవిత, కుమార్తె ముగ్గురు ప్రతి రోజు మొదటి అంతస్తులోని బెడ్రూంలో పడుకొనేవారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో నిద్రలేచిన వారు బెడ్ రూం డోర్ తీయడానికి ప్రయత్నించగా రాలేదు. బయట గడియ పెట్టి ఉన్నారు. దీంతో శివశంకర్‌రెడ్డి పక్కింటి వాళ్లకు ఫోన్ చేశాడు. వాళ్లు ఇంట్లోకి వెళ్లడానికి రాగా వంట గది వైపు ఉన్న డోర్ లాక్ తొలగించి ఉంది. ఈ విషయాన్ని అతను శివశంకర్‌రెడ్డికి తెలిపాడు. చోరీ జరిగిందని భావించిన అతను వెంటనే టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సూచన మేరకు ఇంట్లోకి ఎవరూ వెళ్లలేదు. టూ టౌన్ సీఐ యుగంధర్, ఎస్ఐ ధనుంజయ వచ్చిన తర్వాత వారున్న బెడ్రూం గడియ తీశారు. తర్వాత లబోదిబో మంటూ వారంతా బయటికి వచ్చారు. 25 తులాల బంగారు చోరీ కవిత గాబరాగా ఎదురుగా ఉన్న మరో బెడ్రూంలోకి వెళ్లి చూడగా బీరువా తెరచి.. అందులోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. లాకర్‌ను పరిశీలిస్తే అందులోని బంగారు నగలన్నీ కనిపించలేదు. అందులో సుమారు 25 తులాల మేర వివిధ రకాల బంగారు నగలు ఉన్నాయి. బీరువా పక్కనే ఉన్న డ్రస్సింగ్ టేబుల్లో తాళాలు పెట్టామని, వాటిని తీసుకొని దొంగలు బీరువా తెరిచినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా వేకువ జామున 3.30 గంటల సమయంలో కింద ఏదో శబ్ధం వినిపించినట్లు కవిత చెబుతున్నారు. ఎదురుగా ప్రధాన ద్వారంతో పాటు ఎడమ వైపున వంట గది పక్కన మరో ద్వారం కూడా ఇంటికి ఉన్నాయి. దొంగలు వంటగది పక్కన ఉన్న డోర్ లాక్‌ను తొలగించి సులభంగా ఇంటిపైకి ప్రవేశించారు. ముందు జాగ్రత్తగా శివశంకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు నిద్రపోతున్న బెడ్రూంకు గడియ పెట్టి ఎదురుగా ఉన్న మరో బెడ్రూంలోకి దొంగలు ప్రవేశించారు. డ్రస్సింగ్ టేబుల్లో బీరువా తాళాలు ఉండటంతో దొంగల పని సులభతరమైంది. ఖరీదైన వడ్డానం, ఇతర ఖరీదైన బంగారు హారాలను బ్యాంక్ లాకర్లో పెట్టామని లేదంటే భారీ నష్టం జరిగేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం పోలీసులు వేలి ముద్రలు సేకరించారు. డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు పరిశీలించారు. శివశంకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ యుగంధర్ తెలిపారు. ● హౌసింగ్ బోర్డు కాలనీలో 25 తులాల బంగారు దోచుకెళ్లిన దొంగలు ● కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నా బంగారు కొట్టేసిన అగంతకులు -
మహిళపై దాడి కేసులో నిందితుడి అరెస్టు
కమలాపురం : కమలాపురం పట్టణం గిడ్డంగివీధిలో ఈ నెల 13వ తేదీన లక్ష్మీదేవి అనే మహిళపై జరిగిన దాడి కేసులో నిందితుడు ఆకుల రెడ్డి నవీన్‌ను అరెస్ట్ చేసినట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన దాడికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. నిందితుడు నవీన్ ఇంటర్ వరకు చదువుకుని ఏడాది పాటు ఏఐఎల్ డిక్సన్ కంపెనీలో పని చేసి మానేశాడు. అనంతరం క్రికెట్ బెట్టింగు, ఆన్లైన్ బెట్టింగ్‌లతో పాటు మద్యం తదితర వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో అప్పులు చేసి తీర్చలేని స్థితికి చేరుకున్నాడు. తన ఇంటి పక్కనే ఉన్న కరంగుడి లక్ష్మీదేవి వద్ద తన మొబైల్‌ను కుదువ పెట్టి రూ.30వేలు అప్పు తీసుకున్నాడు. సెల్‌ఫోన్ కూడా విడిపించుకోలేక లక్ష్మిదేవిని చంపేసి ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు ఒంటిపై ఉన్న నల్లపూసల దండ, తాళిబొట్టు సరుడులను బలవంతంగా లాక్కుని వెళ్లి వాటిని అమ్ముకుని అప్పు తీర్చాలనుకున్నాడు. దీంతో ఈ నెల 13వ తేదీ ఉదయం ఇంట్లో లక్ష్మీదేవి ఒంటిరిగా ఉన్న విషయం తెలుసుకుని, ఇంట్లోకి చొరబడి ఆమెను కత్తితో పొడిచి మెడలో ఉన్న బంగారు నల్లపూసల దండ, తాళిబొట్టు సరుడు బలవంతంగా లాక్కొని పారిపోయాడు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన సీఐ ఎస్కే రోషన్, సీసీఎస్ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్ఐ ప్రతాప్‌రెడ్డి, సిబ్బంది తో కలసి దర్యాప్తు చేపట్టి శనివారం వల్లూరు మండలం తోళ్లగంగన్నపల్లె వద్ద నిందితుడిని అరెస్ట్ చేశారు. అలాగే అతడి వద్ద నుంచి బంగారు తాళిబొట్టు సరుడు, నల్లపూసల దండతో పాటు, నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. కాగా కేవలం రెండు రోజుల్లోనే దాడి కేసులో నిందితుడుని పట్టుకుని అరెస్ట్ చేసిన సీఐ రోషన్, ఎస్ఐ ప్రతాప్‌రెడ్డి, సిబ్బందిని ఆయన అభినందించారు. అలాగే వారికి రివార్డులకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. -
వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం
కడప కార్పొరేషన్: వినియోగదారులు తమ హక్కులపై అవగాహన ఏర్పరుచుకోవాలని ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ అన్నారు. శనివారం ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కడప నగర శివార్లలోని ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీ ఎదురుగా ఉన్న పాస్టర్స్ సెంటర్ ఆడిటోరియంలో ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ స్టేట్ కో–ఆర్డినేటర్ మద్దెల సురేష్ బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి రమేష్ మాట్లాడుతూ వినియోగదారుల అవగాహనకు ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ద్వారా ప్రతి జిల్లాలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు మోసపోకుండా ఉండడానికి తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. వినియోగదారుడు కొనే ప్రతి వస్తువు పైన కొన్ని హక్కులు ఉంటాయని, ఆ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన న్యాయమైన, స్థిరమైన జీవితం వైపు ముందడుగు వేయాలన్నారు. మోసపూరిత చర్యలు లేకుండా ముందుకు సాగాలని, సైబర్ క్రైమ్ కు దూరంగా ఉండాలని వివరించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం మాట్లాడుతూ ఇటీవల పెరుగుతున్న ఆన్లైన్ మోసాల పట్ల ప్రజల అప్రమత్తం కావాలన్నారు. సైబర్ క్రైమ్ వలలో చిక్కకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఏపీ స్టేట్ చైర్మన్ శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ కొనే ప్రతి వస్తువుపై బిల్లు తీసుకోవాలని వినియోగదారుల్లో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా దీని నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ని సంప్రదిస్తే తమ వంతు సహాయం చేస్తామన్నారు. స్టేట్ వైస్ చైర్మన్ మత్సు విశ్వనాథం, డాక్టర్ నల్లమిల్లి ఆది రెడ్డి, తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్ మెరుగు రాధాక్రిష్ణ గౌడ్, అనకాపల్లి జిల్లా చైర్మన్ హేమంత్ చరపాక, కడప జిల్లా చైర్మన్ కిషోర్, చైర్మన్ అడ్మిన్ చైతన్య, కడప జిల్లా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ నేషనల్ చైర్మన్ సాయి రమేష్ -
● ఖుషీ ఖుషీగా విద్యార్థులు
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా మార్చి 1 నుంచి ప్రారంభమైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షల కోసం జిల్లావ్యాప్తంగా 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 17114 మంది, సెకెండియర్‌కు సంబంధించి 15771 మంది విద్యార్థులు మొత్తంగా జనరల్, ఒకేషనల్‌కు సంబంధించి 32885 మంది విద్యార్థులు పరీక్షలను రాశారు. ఈ సందర్భంగా ఆర్ఐవో బండి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా పరీక్షలను నిర్వహించామన్నారు. పరీక్షల నిర్వహణకు సహరించిన అన్నిశాఖలకు అయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. చివరి రోజు 544 మంది గైర్హాజరు... ఇంటర్ పరీక్షల్లో భాగంగా చివరిరోజు ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు 14083 మంది విద్యార్థులకుగాను 13539 మంది హాజరుకాగా 544 మంది గైర్హాజరయ్యారని ఆర్ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. పరీక్షలు ముగియడంతో పిల్లలు ఖుషీ ఖుషీగా కనిపించారు. పరీక్ష ముగించుకుని బయటకు రాగానే కేరింతలు కొట్టారు. ఒకరికొకరు చేతులు కలుపుకోవడం.. సెండాఫ్ చేప్పుకోవడం వంటి సంబరాల్లో మునిగిపోయారు. -
ఘనంగా ముగిసిన దర్గా ఉత్సవాలు
రామాపురం: మండలంలోని నీలకంట్రావుపేట సమీపంలోని దర్గా వద్ద శ్రీ సద్గురు హజరత్ దర్బార్ అలీషావలి, రమతుల్లా అలైబాబా శ్రీ జలీల్ మస్తాన్ వలీ బాబా ఉరుసు ఉత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. గురువారం గంధంతో ప్రారంభమైన ఉరుసుకు రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొ న్నారు. గతంలో దర్గా స్వామిజీ, దర్గా మాతాజీలు ఈ ఉరుసు ఉత్సవాలను జరిపేవారు. వారు పరమపదించడంతో సత్యమయ్య స్వామిజీ, శంకరయ్య స్వామి జీలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి బెంగళూరుకు చెందిన ఆస్మానిఖత్, నాగపూర్‌కు చెందిన సలీం సైదా మధ్య గొప్ప ఖవాలీ పోటీ జరిగింది. అంతకు ముందు జెండా ఊరేగింపు జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి 70–80 అడుగులు పొడవు కలిగిన వెదురు బొంగుతో దర్గాకు చేరుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. శనివారం రాత్రి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదివింపులు, చాదర్‌తో దర్గాలో ఫాతేహా నిర్వహించారు. -
పరిసరాల శుభ్రతతో ఆరోగ్యం
కడప అర్బన్: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం సామాజిక బాధ్యత అని, పరిసరాల శుభ్రతతో ఆరోగ్యంగా ఉంటూ దైనందిన విధులను మరింత సమర్థవంతంగా నిర్వర్తించవచ్చని ఎస్పీ ఈ.జీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడో శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉన్న స్టేడియం పరిసరాలను ఎస్పీ పాల్గొని పారలు, గునపం చేతబట్టి స్వయంగా శుభ్రపరిచారు. అనంతరం మొక్క నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు క్రమశిక్షణతో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అందరికి స్పూర్తి కలిగిస్తుందనీ, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఏ.ఆర్. అదనపు ఎస్పీ బి. రమణయ్య, ఏ.ఆర్. డిఎస్పీ కె. శ్రీనివాసరావు, ఆర్ఐలు ఆనంద్, టైటస్, శివరాముడు, శ్రీశైలరెడ్డి, వీరేష్, ఆర్.ఎస్.ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఈ.జీ అశోక్‌కుమార్ -
ఫిర్యాదుల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కడప ఎడ్యుకేషన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఎవరైనా తమ ఫిర్యాదులను తెలియజేసేందుకు, సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించినట్లు పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్ తెలిపారు. ఇందులో ఆర్జేడీ కార్యాలయ సూపరింటెండెంట్ బాబానాయక్ (9441683500), జయసూర్య (7358302380) లను నియమించినట్లు తెలిపారు. ఏవైనా ఫిర్యాదులుంటే వీరి నంబర్లకు కాల్ చేసి తెలియ చేయవచ్చని ఆర్జేడీ తెలియ చేశారు. రేపు ‘స్పర్ష్ అవుట్ రీబ్’ ప్రోగ్రాం కడప రూరల్: కడపలోని జిల్లా సైనిక సంక్షేమ భవనం దగ్గర ఈ నెల 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘స్పర్ష్ అవుట్ రీబ్’పోగ్రాంను జిల్లాలోని మాజీ సేనికులు వారి కుటుంబ సభ్యలు సద్వినియోగం చేసుకోవాలని లీగ్ జిల్లా అధ్యక్షులు జడ్ ఫిలిప్స్ తెలిపారు. ఈ సందర్భంగా స్పర్ష్, ఈసీహెచ్ఎస్, కేఎస్పీ, డిజేబులిజీ పెన్షన్‌తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రేపు ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ సిబ్బంది విధుల బహిష్కరణ కడప రూరల్: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో పని చేస్తున్న వైద్య మిత్రలు ఇతర సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న కడపలోని జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయం ఎదుట విధులను బహిష్కరించి..నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా యూనియన్ అధ్యక్షుడు సి. విజయ్, జాయింట్ సెక్రటరీ సుబ్బరాజు తెలిపారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా 24వ తేదీన కడపలోని జిల్లా కో–ఆర్డినేటర్ కార్యాలయం ఎదుట, 27వ తేదీన మంగళగిరిలోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన..విధుల బహిష్కరణ కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలిపారు. సిబ్బంది ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. వైభవం.. పుష్పయాగం గుర్రంకొండ: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం ఉద యం తోమాలసేవ, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపారు. అనంతరం సుదూర ప్రాంతాల నుంచి రంగురంగుల పుష్పాలను తెప్పించి గ్రామోత్సవం నిర్వహించారు. వాటితో స్వామివారిని అందంగా అలంకరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పుష్పయాగం నిర్వహించారు. స్వామివారికి అలంకరించిన పుష్పాలను అర్చకులు భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి కడప సెవెన్‌రోడ్స్: ఈ నెల 16, 17 తేదీల్లో జరగనున్న ఏపీపీఎస్సీ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 మధ్యాహ్నం 12.00 గంటల వరకు , తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి 5.00 గంటల వరకు ఈ పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా చూడాలన్నారు. లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెంట్లు, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలోని సీకే దిన్నె మండల పరిధిలో నాలుగు, చాపాడులో ఒకటి, ప్రొద్దుటూరులో ఒక కేంద్రం కలిపి మొత్తం ఆరు పరీక్షా కేంద్రాలు ఉంటాయని, ప్రతి కేంద్రం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షల జిల్లా ప్రత్యేక అధికారులు ఎండీ బాబర్, ఎ.శివనారాయణరెడ్డి, లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
సర్పంచులపై కూటమి కక్ష
కడప సెవెన్‌రోడ్స్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులపై అధికార ఎన్డీయే కూటమి ప్రజాప్రతినిధుల కక్ష సాధింపు చర్యలు రోజురోజుకు అధికమవుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సర్పంచుల చెక్‌పవర్ రద్దు చేయించడం ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారు. అధికారులు కూడా టీడీపీ నేతల ప్రాపకం కోసం చెప్పిన దానికంతా తలాడిస్తున్నారు. జిల్లా పంచాయతీ అఽధికారి రాజ్యలక్ష్మి అనుసరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. దీంతో చేసేదిలేక బాధిత సర్పంచులు న్యాయ స్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ● ఖాజీపేట మండలం రావులపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ పి.శివరామిరెడ్డి చెక్ పవర్‌ను రద్దు చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి ఈనెల 10వ తేది ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులను దుర్వినియోగం చేశారని సర్పంచ్‌పై అధికార పార్టీకి చెందిన కొందరు అభియోగాలు మోపారు. ఫిర్యాదులు వచ్చిందే తడువుగా స్పందించిన డీపీఓ రాజ్యలక్ష్మి విచారణ జరిపి తనకు నివేదిక సమర్పించాలంటూ కడప డివిజనల్ పంచాయతీ అధికారిని ఆదేశించారు. 2022–23, 2023–24 సంవత్సరాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ సాధారణ నిధులు రూ. 1,78,924, 2023–24లో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 46,652 కలిపి మొత్తం రూ. 2,25,576 నిబంధనలు పాటించకుండా వివిధ పనుల కోసం గ్రామ పంచాయతీ ఖర్చు చేసిందంటూ విచారణ అధికారి తన నివేదికలో పేర్కొన్నారు. నిబంధనలు పాటించలేదని చెప్పారే తప్ప, ఆ నిధులు దుర్వినియోగం చేసినట్లు నివేదికలో ఎక్కడా చెప్పలేదు. పనులకు చెల్లించిన నిధుల వివరాలు ఎం.బుక్కులో నమోదు చేశారుగానీ అంచనా వివరాలు లేవని విచారణ అధికారి తన నివేదికలో చెప్పడం సరికాదని పలువురు అంటున్నారు. ఎందుకంటే పనులకు సంబంధించిన అంచనా పత్రాలు రికార్డు కస్టోడియన్ అయిన పంచాయతీ కార్యదర్శి ఆధీనంలో ఉంటాయి. ఇక కోవిడ్ సమయంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఎక్కువ ఖర్చు చేయక తప్పలేదని సర్పంచ్ శివరామిరెడ్డి అంటున్నారు. వీఎల్సీ సరఫరా చేసిన ప్రతి వస్తువుకు సంబంధించిన బిల్లులను సర్పంచ్ విచారణ అధికారికి సమర్పించారు. కొనుగోలు చేసిన ప్రతి దాన్ని స్టాకు రిజిష్టర్‌లో నమోదు చేసి నిర్వహించే బాధ్యత ప్రభుత్వ నిబంధనల మేరకు పంచాయతీ కార్యదర్శిపై ఉంటుందేగానీ సర్పంచుపై కాదు. పంచాయతీ కార్యదర్శి/విస్తరణ అధికారి ఖర్చులకు సంబంధించిన బిల్లులను ప్రవేశ పెడితేనే పంచాయతీ ఆమోదిస్తుంది. నిజానికి పంచాయతీ విస్తరణ అధికారి తన పరిధిలోని పంచాయతీలను ప్రతినెలా సందర్శించి జమా ఖర్చులను తనిఖీ చేయాలి. పంచాయతీ పాలనలో ఏవైనా లోపాలుంటే సర్పంచుకు, సిబ్బందికి తగు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు తనిఖీలు నిర్వహించి లోపాలు లేకుండా చూసేందుకు ఏ అధికారి రావులపల్లె పంచాయతీ సందర్శించలేదని తెలుస్తోంది. సర్పంచ్ అన్ని వివరాలను డీపీఓకు సమర్పించినప్పటికీ వాటిని పట్టించుకోకుండా టీడీపీ నేతల ఒత్తిళ్లకు లొంగి చెక్‌పవర్ రద్దు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ● గతంలో వీరపునాయునిపల్లె మండలం బుసిరెడ్డిపల్లె పంచాయతీ సర్పంచ్ లింగారెడ్డి అనూరాధ చెక్ పవర్ రద్దుకు చర్యలు చేపట్టారు. సర్పంచ్ అనూరాధ బుసిరెడ్డిపల్లె నుంచి గంగనపల్లె రూ. 1.14 లక్షలతో గ్రావెల్‌రోడ్డు నిర్మించారు. ఏఈ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. బిల్లు అప్పటికి ఇంకా తీసుకోలేదు. కాగా రోడ్డు పనుల్లో అవినీతి జరిగిదంటూ టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో డీపీఓ రాజ్యలక్ష్మి పులివెందుల డివిజనల్ పంచాయతీ అధికారిని విచారణకు నియమించారు. దీనిపై సర్పంచ్ గతనెల 19వ తేదిన జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇలా అధికార పార్టీ నేతల ఫిర్యాదులకు విలువనిస్తూ వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచులను డీపీఓ వేధిస్తుండడం వివాదాస్పదంగా మారింది. ముక్తసరి జవాబుతో సరిపెట్టిన డీపీఓ చెక్ పవర్ రద్దుతో వేధింపులు నేతల కనుసన్నల్లో అధికారులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న బాఽధితులు ఖాజీపేట మండలం రావుపల్లె గ్రామ సర్పంచ్ శివరామిరెడ్డి చెక్ పవర్ రద్దు వెనుక మీపై ఉన్న రాజకీయ ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. ఇందుకు మీ సమాధానం ఏమిటని శనివారం డీపీఓ రాజ్యలక్ష్మిని ‘సాక్షి’ వివరణ కోరింది. ఇందుకు ఆమె బదులిస్తూ తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, కడప డీఎల్పీఓ సమర్పించిన విచారణ నివేదిక ఆధారంగానే తాను చెక్ పవర్రద్దు చేశానని చెప్పారు. డీఎల్పీఓ నివేదికలో నిబంధనలు పాటించలేదని మాత్రమే ఉంది తప్ప నిధుల దుర్వినియోగం అనే మాట ఎక్కడా లేదని ప్రశ్నించగా ఆమె నీళ్లు నమిలారు. తాను వేరే సమావేశంలో ఉన్నానంటూ ఫోన్ కట్ చేయడం గమనార్హం. -
వేయి కిలోమీటర్లు ఎగిరిన పావురం
సింహాద్రిపురం : పక్షులను ప్రేమించే వారు ఎక్కువగా పావురాలను పోషిస్తుంటారు. పక్షుల ప్రేమికులను ప్రోత్సహించడానికి కొందరు పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించిన పావురాల పోటీల్లో వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురానికి చెందిన శివప్రసాద్‌రెడ్డి పావురం ప్రథమ స్థానంలో నిలిచి భళా అనిపించింది. ఏపీ హోమింగ్ పిగియన్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ఈ ఏడాది మధ్యప్రదేశ్‌లోని భోపాల్ డివిజన్లో గత నెల 22న పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో 159 పావురాలు పాల్గొనగా, ఇందులో శివ ప్రసాద్ రెడ్డి పావురం స్టేట్ లాంగ్ డిస్టెన్స్ చాంపియన్‌గా నిలిచింది. 700 కిలోమీటర్ల రేస్‌లో, ఆకాశ మార్గాన 1000 కి.మీ రేస్‌లోనూ మొదటి స్థానంలో నిలించింది. పావురం యజమాని శివ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ నేను 200 పావురాలను పెంచి పోషిస్తూ ఉన్నాను. వాటిలో ఈ పావురం చురుకుగా ఉంటుండడంతో భోపాల్‌కు పంపానని, అక్కడ స్టేట్ చాంపియన్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పక్షులపై జాలి, ఆదరణ చూపితే అవి యజమానిని అంటిపెట్టుకొని ఉంటాయన్నారు. -
బాల భటులు ప్రపంచస్థాయి పౌరులుగా ఎదగాలి
రాయచోటి అర్బన్ : బాలభటులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని ప్రపంచ స్థాయి పౌరులుగా ఎదగాలని స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి కోరారు. రాయచోటి పట్టణంలోని అర్చన కళాశాలలో ఈ నెల 10వ తేదీ నుంచి నిర్వహిస్తున్న పెట్రోల్ లీడర్స్ శిక్షణ ముగింపు సమావేశం శుక్రవారం జరిగింది. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎంపికై న 36 పీఎంశ్రీ పాఠశాలల నుంచి వచ్చిన 272 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను విరవించారన్నారు. రోడ్డుప్రమాదాలు జరిగి నప్పుడు ప్రథమ చికిత్స అందించి సమీపంలోని ఆసుపత్రికి చేర్చడం, స్వచ్ఛందంగా సేవలందించడం, మంచి అలవాట్లను నేర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ లక్ష్మికర్, హెచ్‌డబ్ల్యూఓ నిర్మల, ఓబులరెడ్డి, నాగరాజు, సుజాత, గోవిందమ్మ, స్వర్ణలత పాల్గొన్నారు. -
కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం.. కళ్లు మూసుకుని నిద్ర నటిస్తున్న అధికారుల నిర్లక్ష్యం.. వెరసి వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల తూకాల్లో పట్టు తప్పుతున్నా.. వాటిని నియంత్రించేందుకు చట్టాలున్నా.. ప్రజల్
కడప రైతు బజారు కడప అర్బన్/ కోటిరెడ్డిసర్కిల్: ప్రతి ఒక్కరూ ఉద యం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు నిత్యావసర సరుకులు, వస్తు సామగ్రి కొనుగోలు చేయాలన్నా.. వినియోగించుకోవాలన్నా ఒక్క క్షణం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ వస్తువు ఎక్కడ కల్తీ జరుగుతుందో, ఎక్కడ నాణ్యత లోపించిందో కనిపెట్టలేని దుస్థితి. నిత్యం ఉపయోగించే పాలు, పెరుగు, కూరగాయలు, గ్యాస్ సిలిండర్లు, వాహనాలకు ఉపయోగించే పెట్రోలు, డీజిల్, మాంసంగా వినియోగించే చికెన్, మటన్, చేపలు, కోళ్లు తదితర వాటి గురించి తెలుసుకుని కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఏ వస్తువు కొందామన్నా అధిక ధరలైనా ఉంటాయి.. లేదంటే నాణ్యతా లోపం ఉంటుంది. పై వాటిల్లో ఏ వస్తువు వినియోగించినా ఆరోగ్యంగా ఉంటామన్న గ్యారంటీ కూడా లేదు. ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవేళ తెలుసుకుని ఫిర్యాదు చేసినా, రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి తమతోపాటు నడిస్తేనే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని అఽధికారులు చెబుతుండటం గమనార్హం. దీంతో తమకెందుకులే అనుకుంటూ ‘ఏదో కొంటున్నాం.. తింటున్నాం’ అని వినియోగదారులు కాలం గడిపేస్తున్నారు. రైతు బజారులో.. ఉదయం రైతు బజారుకు వెళితే అక్కడ తూనికలు, కొలతలు శాఖ వారు నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఎలక్ట్రానిక్ యంత్రాలు ఉన్నప్పటికీ.. వాటిని సరిచేయడంలో లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కూరగాయలు కొనే వినియోగదారులు ఎవరికీ ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి. ఆకుకూరలు, కూరగాయలు నాణ్యతా ప్రమాణాలు లేకపోయినప్పటికీ అవసరానికి వినియోగదారులు తీసుకు వెళుతుండడం గమనార్హం. రైతు బజారులో 128 దుకాణాలు లైసెన్స్ కలిగి ఉంటే.. ఆ మేరకు దుకాణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ దుకాణాల నిర్వాహకులు మాత్రం అధికంగా దళారులే ఉన్నా రు. వీరిలో కేవలం 10 శాతం, అంత కంటే తక్కువగా రైతులు ఉన్నారు. ఏరోజుకారోజు ధరల పట్టికను ప్రదర్శించాల్సిన అవసరం అక్కడున్న ప్రతి దుకాణదారుడికి ఉంది. కానీ, కొన్ని చోట్ల ఈ ధరల పట్టికను ప్రదర్శించకపోవడం గమనార్హం. నిర్దేశించిన ధరల పట్టికల కింద రైతు బజారు ఇన్స్పెక్టర్ సంతకం ఉండాలి. కానీ అవేమీ అక్కడ కనిపించలేదు. రైతు బజారు బయటి వైపున ఓ దుకాణంలో నిబంధనలకు విరుద్ధంగా కంజు పిట్టలను పెంచుతూ యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కంజు పిట్టలను విక్రయించడం నిబంధనల మేరకు ఉందా? అని అటవీశాఖ అధికారులను ప్రశ్నించగా, వారు మాత్రం బాయిలర్ కోళ్ల ఫారం మాదిరిగా పెంచుకుంటే సరే కానీ, అడవిలో నుంచి తీసుకొచ్చి పెంచే నిబంధన లేదన్నారు. అలా ఎవరైనా చట్ట వ్యతిరేకంగా కంజు పిట్టలను పెంచి విక్రయిస్తే తమ దృష్టికి తీసుకు రా వాలన్నారు. అలాగే చేపల దుకాణం వద్ద ఐస్బాక్సులలో చేపలను పెట్టి విక్రయిస్తున్నారు. ఆ చేపలు తాజాగా తీసుకొచ్చి పెట్టారా? లేక రెండు లేదా మూడు రోజుల నుంచి అలాగే ఉంచారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. వినియోగదారుడు ‘మేలు’కొనాలి. వస్తువుల ధర, పరిమాణం, తయారీ, తేదీ, తయారీ కంపెనీ అడ్రస్ వంటివి చూసుకోవాలి. అలాగే బిల్లు పొందాలి. ● జిల్లాలో వినియోగదారుల హ క్కులను సంరక్షించేందుకు వివిధ శాఖల వారు తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు న్యాయం చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నారు. ● జిల్లా కేంద్రమైన కడపలో పాత కలెక్టరేట్ ఆవరణలో వున్న వినియోగదారుల ఫోరం 1993 నవంబర్‌లో ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపుగా 8 వేలకుపైగా ఫిర్యాదులు అందాయి. గతేడాది 120 ఫిర్యాదులు, ఈ ఏడాది 30 ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటి వరకు 170 ఫిర్యాదులకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ● జిల్లాలో వినియోగదారుల హక్కులను సంరక్షించేందుకు తూనికలు, కొలతలశాఖ వారు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, అగ్రికల్చర్, రెవెన్యూ, ఆహార నాణ్యత, భద్రత విభాగాల అధికారులు, సిబ్బంది తమకు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వాటిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. వినియోగదారులలో చాలా మంది తమకు జరిగిన అన్యాయాన్ని వెంటనే రుజువులతో సహా ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు. రాత పూర్వకమైన ఫిర్యాదులు బాధితుల ద్వారా అందకపోయినా పై శాఖల వారు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉండటం గమనార్హం. ●మేలుకో.. హక్కులు తెలుసుకో.. ఆర్టీసీ బస్టాండులో.. కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండులో క్యాంటీన్, హోటళ్ల కంటే తినుబండారాలు, కూల్‌డ్రింక్ షాపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి వాటర్ బాటిల్‌పై ముద్రించిన రేటు రూ. 20–25 ఉంటే రూ.5–10 అధికంగా వసూలు చేస్తున్నారు. చిన్నచిన్న ప్యాకెట్లలో వేరుశనగ, సన్‌ఫ్లవర్, బఠానీలు, ఉప్పు శనగలను లోకల్ ప్యాకింగ్ చేసి, ఎలాంటి ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా ప్రయాణికులకు విక్రయించేస్తున్నారు. ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెను బస్సు ఎక్కించేందుకు వచ్చిన సమయంలో బిందు అనే పెట్ కూల్‌డ్రింక్ బాటిల్‌ను కొనుగోలు చేస్తే.. దానిపై ఉన్న ధరకన్నా రూ.10 అదనంగా తీసుకున్నారు. సమోసాలు తయారు చేసి అలాగే బయట ప్రదర్శించే లాగా పెట్టి అమ్ముతున్నారు. ఆ సమోసాలకు ఈగలు, దోమలు, దుమ్ముధూళి పడినా పట్టించుకోకుండా అమ్మడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే బస్టాండులో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్ల వద్ద ఎంత వసూలు చేసేది నిర్ణయించే ధరల పట్టికను ప్రదర్శించలేదు. ప్రయాణికుల నుంచి ఇష్టానుసారంగా డబ్బులను వసూలు చేస్తున్నారు. పెట్రోలు బంకు వద్ద లీటరు బాటిల్ తీసుకెళ్లి లీటరు పెట్రోలును కొనుగోలు చేస్తే 10–20 ఎంఎల్ వరకు తక్కువగా వచ్చింది. ఇలా ప్రతి లీటరులో 10–20 ఎంఎల్ పెట్రోలును కాజేస్తూ వినియోగదారులను కొందరు పెట్రోలు బంకు యాజమాన్యం నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు అధిక ధరకు అమ్మకాలు నాణ్యతా, ప్రమాణాలు పాటించని వైనం నష్టపోతున్న వినియోగదారులు ఫిర్యాదులుంటేనే చర్యలంటున్న అధికారులు -
టీడీపీలోనే అసాంఘిక శక్తులు
కడప కార్పొరేషన్: తెలుగుదేశం పార్టీలో కొన్ని అసాంఘిక శక్తులు పని చేస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా ఆరోపించారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులే గ్యాంబ్లిగ్, బెట్టింగ్‌లు నిర్వహిస్తూ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని విమర్శించారు. జూదం ఆడిస్తున్నారనే కారణంతో రెండు రోజుల క్రితం రాజారెడ్డి వీధికి చెందిన అశోక్ రెడ్డి అనే వ్యక్తిని అన్నమయ్య జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. అతను వైఎస్సార్సీపీ నాయకుడని అని కొన్ని పత్రికల్లో కథనాలు రావడం దురదృష్టకరమన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా అతను వైఎస్సార్సీపీ నాయకుడని రాయడం సరికాదన్నారు. రాజారెడ్డి వీధికి చెందిన అశోక్‌రెడ్డి పక్కా తెలుగుదేశం పార్టీ నాయకుడని, లక్ష రూపాయలు చెల్లించి టీడీపీ శాశ్వత సభ్యత్వం పొందారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో సీఎస్ఐ స్కూల్లో టీడీపీ తరఫున ఏజెంట్‌గా కూర్చొన్నారని, కడప ఎమ్మెల్యే మాధవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డికి ముఖ్య అనుచరుడన్నారు. లక్షలు, లక్షలు చేతులు మారుస్తూ జూదం ఆడించే గ్యాంబ్లర్కు 41ఏ నోటీసులిచ్చి వదిలేయడం వెనుక ఎవరి హస్తం ఉందో వెలికి తీయాలన్నారు. గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్, గంజాయి సరఫరా చేసే వారికి కూడా ఇలానే నోటీసులిచ్చి వదిలేస్తారా.. పోలీసులు దీనికి సమాధానం చెప్పాలన్నారు. జిల్లాలో ఏది జరిగినా వైఎస్సార్సీపీపై బురదజల్లడం ఆనవాయితీగా మారిందన్నారు. భూదందాలు ఎవరు చేస్తున్నారు, మట్టి, ఇసుక మాఫియా ఎవరి చేతుల్లో ఉందనేది జగమెరిగిన సత్యమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టం ముందు తన, మన అనే భేదం లేకుండా పాలన సాగిందన్నారు. వైఎస్ కొండారెడ్డి కాంట్రాక్టర్‌ను బెదిరిస్తే తన బంధువైనా సరే వైఎస్ జగన్ సహించలేదని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో మాత్రం ఆసాంఘిక కార్యకలాపాలు సాగించే వారిని ప్రోత్సహిస్తున్నారని, సామాన్యులకు ఒక న్యాయం, టీడీపీ వారికి మరొక న్యాయం అనే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, వైఎస్సార్సీపీ నాయకులు దాసరి శివప్రసాద్, తోటక్రిష్ణ, రమేష్‌రెడ్డి, షఫీ, గుంటి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. జూదం ఆడిస్తూ పట్టుబడిన వ్యక్తి వైఎస్సార్సీపీ కార్యకర్త కాదు అశోక్‌రెడ్డి టీడీపీ 24వ డివిజన్ ఇన్చార్జి లక్ష రూపాయలు పెట్టి టీడీపీ శాశ్వత సభ్యత్వం పొందారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా -
చంద్రబాబుకు అనైతిక రాజకీయాలు అలవాటే
పులివెందుల: చంద్రబాబుకు అనైతిక రాజకీయాలు చేయడం అలవాటేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ మాట్లాడారు. ఎన్నికలప్పుడు అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత బుట్టదాఖలు చేయడం ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు. ప్రజలు కూడా చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోయామని పునరాలోచించుకుంటున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలకు జగనన్న శ్రీకారం చుడితే.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేట్‌పరం చేయాలని చూస్తుండటం దారుణమన్నారు. అలాగే రైతన్నలకు అదిగో, ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను జగన్మోహన్రెడ్డి ఎండగడతారనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నుంచి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి -
విషద్రావణం తాగి విద్యార్థిని ఆత్మహత్య
జమ్మలమడుగు రూరల్ : పట్టణంలోని నాగులకట్ట వీధిలోని ఎస్సీ హస్టల్లో ఉంటున్న అక్షయ(19) శుక్రవారం విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. పెద్దముడియం మండలం కొండసుంకేసుల గ్రామానికి చెందిన అక్షయ పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ఎస్సీ హాస్టల్లో ఉంటోంది. గురువారం రాత్రి వసతి గృహంలో వి ద్యార్థినుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడం, కాసేపటి తరువాత విద్యార్థి నులు క్షమాపణలు చెప్పుకోవడం జరిగినట్లు తెలిసింది. అయితే శుక్రవారం మ ధ్యాహ్నం అందరూ భోజనం చేయడానికి వెళ్లగా అక్షయ మాత్రం వెళ్లలేదు. అప్ప టికే తెచ్చుకున్న విష ద్రావణాన్ని(వాస్మోల్) తాగింది. విషయం తెలుసుకున్న వార్డెన్ బత్తుల ప్రభావతి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూ చన మేరకు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 8.45 గంటల మధ్యలో చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ప్రజా సంఘాల ఆగ్రహం అక్షయ అత్మహత్యపై ప్రజాసంఘాల నాయకులు అగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు వసతిగృహనికి చేరుకోని విద్యార్థిని మృతికి హస్టల్ వార్డన్ బత్తుల ప్రభావతి, సిబ్బంది కారణం అని హస్టల్స్ ఏఎస్‌డబ్ల్యూ గురుప్రసాద్, సీఐ లింగప్పకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది నవంబరు 7న కూడా వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు వాస్మాల్ తాగి అత్మహత్య యత్నానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఇంత జరుగతున్నా అధికారులు చర్యలు చేపట్టలేదన్నారు. సీఐ ఎస్.లింగప్ప వసతి గృహానికి వెళ్లి విద్యార్థినులను విచారించారు. దర్యాప్తు అనంతరం అక్షయ ఆత్మహత్యయత్నానికి కారణాలు తెలియజేస్తామని సీఐ తెలిపారు. స్థలం వివాదంలో ఏడుగురికి జైలు విశాఖ లీగల్: ఆస్తి విషయంలో ఒక వ్యక్తిని మోసం చేసిన ఏడుగురికి ఐదేళ్లు జైలు శిక్ష, రూ.18.60 లక్షల జరిమానా విధిస్తూ నగరంలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం కమ్ 11వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.సత్యదేవి తీర్పు వెలువరించారు. పెందుర్తి పోలీస్ అధికారులు తెలిపిన వివరాలివీవీ.. వైఎస్సార్ జిల్లా బిట్రగుంట గ్రామానికి చెందిన పి.అప్పలరాజు 2014లో స్థలం కొనుగోలు చేయాలని భావించి పలువురిని సంప్రదించారు. దీనిని అవకాశంగా తీసుకున్న పిల్ల అర్జున్ మరో తొమ్మిది మందితో కలిసి మోసపూరితంగా కుట్ర పన్నారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 158.88 చదరపు గజాల స్థలం కొనుగోలుకు అప్పలరాజు నుంచి రూ.18 లక్షలు వసూలు చేశారు. అయితే అదే స్థలాన్ని వేరే వారికి కూడా విక్రయించినట్లు 2017 ఫిబ్రవరిలో అప్పలరాజు గుర్తించి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులు పిల్ల అర్జున్, కె.అంజలిరావు, ఎం.పెద్ద అప్పలరాజు, ఎం.మరిడయ్య, ఎం.రమణ, ఎం.గోవింద్, ఎం.రాంబాబు, ఎం.చిన్న మరిడయ్య, ఎం.సూరిబాబు, ఎం.అప్పలరాజులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ జరుగుతుండగా పిల్ల అర్జున్, ఎం.పెద్ద అప్పలరాజు, ఎం.అప్పలరాజు మృతి చెందారు. మిగిలిన ఏడుగురు నిందితులకు న్యాయమూర్తి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.18.60 లక్షల జరిమానా విధించారు. జరిమానా మొత్తాన్ని బాధితుడు అప్పలరాజుకు చెల్లించాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. గిరిజన మహిళపై దాడి మదనపల్లె : భూ వివాదంలో కొందరు వ్యక్తులు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని గిరిజన మహిళ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌కు వెళితే న్యాయం చేయకపోగా, తనపైనే కేసు బనాయించారని ఆరోపించారు. ఆమె వివరాల మేరకు.. పట్టణంలోని చంద్రా కాలనీకి చెందిన కృష్ణా నాయక్, సునీత దంపతులు దినసరి కూలీలు. వారికి స్థానికుడు బాల్ రెడ్డితో స్థల వివాదం ఉంది. అదే స్థలంలో తాము నిర్మించుకున్న పునాదులను గురువారం సాయంత్రం కొందరు తొలగిస్తున్నారని చెప్పడంతో అక్కడకు వెళ్లినట్లు సునీత తెలిపారు. ఆ సమయంలో బాల్‌రెడ్డి, కుటుంబ సభ్యులు తనపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారన్నారు. అపస్మారకస్థితిలో పడిన తనను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి తన చెల్లెలు చికిత్స అందించిందన్నారు. టూటౌన్ పోలీస్ స్టేషన్‌పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా, బాల్‌రెడ్డి ఫిర్యాదుమేరకు తనపై కేసు నమోదుచేశారన్నారు. -
జ్యోతిక్షేత్రంపై ఉక్కుపాదం మోపడం అన్యాయం
కలసపాడు : ఎందరో అభాగ్యులు, అనాథలకు ఆశ్రయమిస్తూ ఆకలి తీరుస్తున్న వైఎస్సార్ జిల్లాలోని జ్యోతి క్షేత్రంపై ఉక్కుపాదం మోపడం అన్యాయమని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి.రమణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతంలోని వేలాది అభాగ్యులకు ఆపన్నహస్తంగా మారిన ఆశ్రమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి సరికాదన్నారు. జ్యోతి క్షేత్రాన్ని ఒక అనాథల నిలయంగా, సామాజికసేవా ఆలయంగా, అభాగ్యుల పాలిట ఆపన్నహస్తంగా చూసి అనుమతులు ఇవ్వాలన్నారు. అటవీ అధికారులు కూలగొట్టిన భవనాలను నిర్మించడమేగాక, ఆలయ నిర్మాణానికి అనుమతులు ఇప్పించి ప్రభుత్వ పెద్దలు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా ఏ క్షేత్రంపై లేని వివక్ష జ్యోతిక్షేత్రంపై మాత్రమే ఎందుకు చూపుతుందో అర్థం కావడం లేదన్నారు. భార్యా, పిల్లలను నిర్భంధించారు – కడప వాసి ఆవేదన కడప అర్బన్ : తన భార్య, పిల్లలను బాకీ డబ్బుల కోసం నిర్భంధించారని రాంబాబు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. వేంపల్లికి చెందిన రాంబాబు కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్‌ను కలిసేందుకు వచ్చారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో విలేకరులతో రాంబాబు మాట్లాడుతూ చక్రాయపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి నుంచి తన భార్య గంగాదేవి రూ.45లక్షలు రూ.2కు వడ్డీకి తెచ్చి కార్పొరేషన్‌కు బదలాయించి వడ్డీలకు ఇచ్చిందన్నారు. అనంతరం ఆ డబ్బు చెల్లించలేదంటూ వారు తన భార్య, పిల్లలను తీసుకెళ్లి చక్రాయపేట వాసులు వారి ఇంటి వద్ద పెట్టుకున్నారన్నారు. వెంటనే తన భార్య, పిల్లలను తనకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై వేంపల్లి, చక్రాయపేట పోలీసులకు ఇప్పటికే తెలిసినా పట్టించుకోలేదని సమాచారం. చిలంకూరు పరీక్ష కేంద్రం తొలగింపు ఎర్రగుంట్ల : మండలంలోని చిలంకూరు జెడ్పీ పాఠశాలలో పది పరీక్ష కేంద్రాన్ని ఈ ఏడాది తొలగించారు. గతంలో చిలంకూరులో పరీక్ష కేంద్రం ఉండడంతో ఆర్టీపీపీలోని డీఏవీ, సరస్వతి స్కూల్స్, చిలంకూరులోని జేడ్పీ హైస్కూల్ విద్యార్థులంతా పరీక్ష రాసేందుకు అనుకూలంగా ఉండేది. కూటమి ప్రభుత్వం రాగాననే చిలంకూరు పరీక్ష కేంద్రాన్ని తొలగించి యర్రగుంట్లకు మార్చివేశారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల విద్యాఽధికారి శివప్రసాద్ వివరణ కోరగా చిలంకూరులో సీ.కేంద్రం కావడంతో ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఆలయంలో మైక్ సెట్ చోరీ మదనపల్లె : ఆలయంలో మైక్ సెట్ చోరీకి గురైన సంఘటన గురువారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. అంకిశెట్టిపల్లె పంచాయతీ గాంధీపురంలోని కోదండరామస్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయానికి అమర్చిన మైక్ సెట్‌ను ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు చోరీ ఘటనపై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైక్ సెట్ విలువ సుమారు రూ.11వేలు ఉంటుందని పేర్కొన్నారు. తాలూకా సీఐ కళావెంకటరమణ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. టిప్పర్ డ్రైవర్‌పై దాడి మదనపల్లె : రాయచోటి నుంచి మదనపల్లెకు ఇసుక తీసుకుని వచ్చినందుకు టిప్పర్ డ్రైవర్‌పై మదనపల్లె టిప్పర్ అసోసియేషన్ సభ్యులు దాడి చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. రాయచోటికి చెందిన సుబ్రహ్మణ్యం టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాజంపేట రీచ్ నుంచి ఇసుక లోడ్ చేసుకుని, మదనపల్లెలో అన్లోడ్ చేసి తిరిగి రాయచోటికి వెళుతున్నాడు. చౌడేశ్వరి సర్కిల్ వద్ద అసోసియేషన్ సభ్యులు బిల్డప్ భరత్, పీఎస్ఆర్.ప్రసాద్‌రెడ్డి, అంకిశెట్టిపల్లె రమేష్, మణి, గొల్లపల్లెశివ, ముబారక్‌బాషా, ఏఎన్ఎస్ అమర తదితరులు బండిని అడ్డుకుని తాళాలు లాక్కోవడమే గాక, తనపై దాడిచేసి, చొక్కాను చించివేసి గాయపరిచారన్నారు. మదనపల్లెలో టిప్పర్ అసోసియేషన్ లారీలు తప్ప వేరెవ్వరూ తక్కువ ధరకు ఇసుక అమ్మరాదని, తాము రూ.24 వేలు అమ్ముతుంటే, నీవు రూ.18,500కు ఎలా దించుతావంటూ గదమాయిస్తూ విచక్షణారహితంగా కొట్టారన్నాడు. బాధితుడు టిప్పర్‌ను అక్కడే విడిచిపెట్టి, తెలిసిన వారి సహాయంతో టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, సీఐ రామచంద్రకు ఫిర్యాదు చేశాడు. దాడి ఘటనపై విచారణ చేసి కేసు నమోదుచేస్తామని తెలిపారు. -
కాశినాయన భవనాలు ప్రభుత్వమే పునర్నిర్మించాలి
కాశినాయన : జ్యోతి క్షేత్రంలో అటవీ అధికారులు కూల్చివేసిన కాశినాయన ఆశ్రమ కట్టడాలను ప్రభుత్వమే పునర్నిర్మించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంభూపాల్, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు అన్వేష్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా కాశినాయన ఆశ్రమంలో అటవీ అధికారులు కూల్చివేసిన కట్టడాలను శుక్రవారం వారు పరిశీలించి ఆశ్రమ నిర్వాహకులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ కరవు ప్రాంత రైతుల సహకారంతో మూడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న అన్నదాన ఆశ్రమంలోని కట్టడాలను అటవీశాఖ అనుమతులు లేవంటూ కూల్చివేయడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం గత డిసెంబర్లో ఇచ్చిన ఆదేశాలతోనే నిర్మాణాలను కూల్చివేశారని ఆశ్రమ నిర్వాహకులు చెప్పారన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో కూల్చిన కట్టడాలను మంత్రి లోకేష్ తన సొంత డబ్బులతో నిర్మిస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సబబు కాదన్నారు. గత 12 ఏళ్లుగా నిలిపివేసిన ఆలయ నిర్మాణ పనుల ప్రారంభానికి వెంటనే అనుమతులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు తాము పండించిన ధాన్యంలో కొంత భాగం కాశినాయన పేరు మీద అన్నదాన సత్రానికి తరలిస్తుంటారని, వాటితోనే అన్నదాన కార్యక్రమం సజావుగా సాగుతోంన్నారు. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న అన్నా క్యాంటీన్, డొక్కాసీతమ్మ భోజనాల కంటే ఎన్నో రెట్లు నాణ్యమైన భోజనం ఇక్కడ అందిస్తున్నారన్నారు. ఎంతో మంది నిరాశ్రయులు, ఒంటరి మహిళలు కాశినాయన ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారని, కూల్చివేయడం సరికాదన్నారు. స్వయం ప్రకటిత హిందూమత రక్షకుడు పవన్‌కళ్యాణ్ వారం రోజులుగా ఇలాంటి చర్యలు జరుగుతుంటే స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి భైరవ ప్రసాద్, బి.మఠం కార్యదర్శి సునీల్‌కుమార్, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. -
లారీ దూసుకెళ్లి..భార్యాభర్తలు మృతి
మైదుకూరు : కష్టపడి పంట పండించే రైతులు ఆ భార్యాభర్తలు. రోజుమాదిరిగానే పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేందుకు రోడ్డుపై ఉండగా వేగంగా వచ్చిన లారీ వారిపై దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన భార్య, భర్తలు తిరిగిరాని లోకాలకు చేరారు. వారి కుమారుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. చాపాడు మండలం తప్పెట ఓబాయపల్లెకు చెందిన పసుపులేటి చలమయ్య కుటుంబం 30ఏళ్ల కిందట మైదుకూరుకు వచ్చి స్థిరపడింది. పట్టణంలోని నంద్యాల రోడ్డు సీతారామాంజనేయనగర్లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు పెద్దకుమారుడు మల్లేష్‌కు వివాహం కాగా, రెండో కుమారుడు వినోద్ కుమార్ డిగ్రీ వరకు చదివి కడపలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేస్తున్నారు. చలమయ్య మున్సిపాలిటీ పరిధిలోని కేశలింగాయపల్లె వద్ద ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వినోద్ వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. పొలంలో సాగు చేసిన పసుపు పంట ఆకు కోయడంతో దానిని తొలగించేందుకు శుక్రవారం భార్య, కుమారుడు వినోద్‌తో కలిసి చలమయ్య పొలానికి వెళ్లారు. పొలం పని అయిపోగానే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ముగ్గురు మైదుకూరు–పోరుమామిళ్ల రహదారిపైకి చేరుకొని ఆటో కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మాచర్ల నుండి సిమెంట్ లోడుతో వస్తున్న లారీ వీరిపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో చలమయ్య (55), ఆయన భార్య లక్ష్మీదేవి (50) అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుమారుడు వినోద్ కుమార్‌కు గాయాలవడంతో కడప రిమ్స్‌కు తరలించారు. సంఘటన స్థలాన్ని అర్బన్ సీఐ హాసం పరిశీలించారు. వివరాలు తెలుసుకున్నారు. భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడికి తీవ్ర గాయాలు పొలానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు -
సాంకేతిక విద్యతో బంగారు భవిత
కడప ఎడ్యుకేషన్ : వైఎస్సార్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 27 వేల మంది పదో తరగతి విద్యార్థులు ఈ ఏడాది 161 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో పది విద్యార్హతతో సాంకేతిక విద్యకు పునాది వేసే పాలీసెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే నోటిఫికేషన్ విడుదల చేసింది. పది పరీక్ష రాసే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రెన్స్ పరీక్షలో లభించిన ర్యాంకు మేరకు పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు లభిస్తాయి. ఈ ఏడాది మార్చిలోనే పాలీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. గ్రామీణ విద్యార్థులకు ఉపయుక్తం గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి అత్యున్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. వీరికి తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. దీనికి పాలిటెక్నిక్ కోర్సులు వేదికగా నిలుస్తాయి. పాలీసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సులో చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. కోర్సుల వివరాలివీ.. పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, మెకానికల్, సివిల్, ఇంటర్నెట్ ఆప్ థింగ్స్(ఐఓటి) మెటలాజికల్ ఇంజినీర్(ఎంఈటి) కోర్సులు అందుబాటులో ఉంటాయి. జిల్లాలో కడప, పొద్దుటూరు, వేంపల్లి, సింహాద్రిపురం, జమ్మలమడుగు, మైదుకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల పరిధిలో దాదాపు 3800 సీట్లు ఉన్నాయి. ఇందులో కడపలో ప్రత్యేకంగా మహిళా పాలిటెక్నిక్ ఉంది. ఈ కోర్సు కాల వ్యవధి మూడు సంవత్సరాలు. దీనిలో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. పాలిసెట్ ఎంట్రన్స్‌లో క్వాలిపై మార్కులు 35గా నిర్ణయించారు. పాలీసెట్ నోటిఫికేషన్ ఇలా... దరఖాస్తుకు గడువు : ఏప్రిల్ 15 ప్రవేశ పరీక్ష : ఏప్రిల్ 30 ఫలితాల వెల్లడి : మే 10 కౌన్సెలింగ్ ప్రారంభం : జూన్‌లో పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు చక్కటి అవకాశం మార్చి చివరకు ముగియనున్న పది పరీక్షలు పాలీసెట్ నోటిఫికేషన్ ఇదీ.. పాలీసెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఏప్రిల్ 15వ తేదీలోపు పాలీసెట్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ఏప్రిల్ 30న పరీక్ష ఉంటుంది. మే 10న ఫలితాలను ప్రకటిస్తారు. జూన్‌లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. గణితంలో 50, ఫిజిక్స్‌లో 40, కెమిస్ట్రీలో 30 మార్కులకు ప్రశ్నలు పదో తరగతి సిలబస్ ఆధారంగా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100, ఓసీ,బీసీ విద్యార్థులు రూ.400 పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నో ఉద్యోగావకాశాలు... పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ చేస్తే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కళాశాలల్లో తరచూ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు మూడేళ్లు ఉంటుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ సెకండియర్‌లో చేరవచ్చు. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధికి తోడ్పడుతుంది. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – సీహెచ్.జ్యోతి, ప్రిన్సిపల్, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, కడప -
కక్ష సాధింపుతోనే చికెన్ దుకాణానికి నిప్పు
ఎర్రగుంట్ల : కక్ష సాధింపుతోనే కొందరు వ్యక్తులు వైఎస్సార్సీపీ కార్యకర్త నరేష్ కుమార్ చికెన్ దుకాణానికి నిప్పు పెట్టారని మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిలంకూరు గ్రామంలో నరేష్కుమార్ గత కొద్ది రోజులుగా చికెన్ సెంటర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆయన ఇటీవల వైఎస్సార్సీపీలో చురుగ్గా పనిచేశారు. ఇది ఓర్వలేని కొందరు వ్యక్తులు శుక్రవారం అతడి చికెన్ దుకాణానికి నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నరేష్ కుమార్ పార్టీ కోసం చాలా కష్టపడడం ఓర్వలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. బాధితుడికి వైఎస్సార్సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. బాధితుడు నరేష్కుమార్ మాట్లాడుతూ దుకాణంలో సుమారు 300 కోళ్లు, ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయని, దాదాపు రూ.3లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. అనంతరం నరేష్‌కు రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో బహుదూర్, రామక్రిష్ణ, రఘునందన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి -
రైలు కిందపడి విశ్రాంత ఉపాధ్యాయుడు మృతి
ముద్దనూరు : మండలంలోని కమ్మవారిపల్లె సమీపంలో రైలు క్రింద పడి భీంచెర్ల శివారెడ్డి(90) శుక్రవారం మృతిచెందాడు. యర్రగుంట్ల రైల్వే ఎస్ఐ సునీల్‌కుమార్ రెడ్డి సమాచారం మేరకు మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన శివారెడ్డి ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందాడు. శుక్రవారం సాయంత్రం రైలు క్రింద పడి మరణించాడని తెలిపారు. కేసు నమోదు చేసి కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. మిద్దైపె నుంచి పడి గాయాలు మదనపల్లె : మిద్దైపె నుంచి పడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం ఉదయం పట్టణంలో జరిగింది. నక్కలదిన్నెకు చెందిన వెంకటరమణ(62) మిద్దైపె ఆరబోసిన మిరప కాయలను కిందకు తెచ్చేందుకు వెళ్లాడు. కిందకి దిగే క్రమంలో ప్రమాదవశాత్తూ కాలు జారి కింద పడ్డాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 23న మాలల సింహగర్జన రాజంపేట రూరల్ : తిరుపతిలో ఈ నెల 23న ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్‌ను వ్యతిరేకిస్తూ రాయలసీమ మాలల సింహగర్జన నిర్వహిస్తున్నట్లు రాయలసీమ మాలల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్అండ్బీ కార్యాలయం వద్ద శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి విరుద్ధంగా ప్రధాని మోదీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిందన్నారు. మాలలు అంతా ఏకమై సింహగర్జనలో దీనిని వ్యతిరేకించాలన్నారు. ఈ సమావేశంలో ప్రభాకర్, సంజీవ్, ధన శేఖర్, పూలమరెడ్డి మల్లికార్జున, చిరంజీవి, జనార్ధన, సుబ్బనరసయ్య, సుబ్బయ్య, దండప్రసాద్, కాంతయ్య, కే.హరినాథ్, రవిశంకర్, రైటర్ పుండ్రిక, కె.సుధాకర్, ఒ.పెంచలయ్య, కన్నయ్య, శ్రీను, మనోహర్ పాల్గొన్నారు. -
పెట్రోల్, డీజిల్ నిక్షేపాల వెలికితీతకు ట్రయల్ రన్
లింగాల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో డీజిల్, పెట్రోలు నిక్షేపాలను కనుగొనేందుకు బోరుబావుల తవ్వకాల ద్వారా ట్రయల్ రన్ ప్రారంభించారు. శాటిలైట్ ద్వారా నిర్ధారించిన పాయింట్లలో ఈ తవ్వకాలకు నాలుగు రోజుల క్రితం శ్రీకారం చుట్టారు. సుమారు 80–200 అడుగుల లోతు వరకు ఈ బోరుబావులను తవ్వుతున్నారు. ఆ తర్వాత వాటి అడుగు భాగంలో డైనమైట్లు, జిలెటిన్ స్టిక్స్, మందుగుండు సామాగ్రి పంపి పేలుస్తున్నారు.అనంతరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పేలుళ్లవల్ల చుట్టుపక్కల వ్యవసాయ బోరుబావులకు భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. రైతుల అనుమతుల్లేకుండా వారి పంట పొలాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఉదా.. లింగాల మండల కేంద్రంలోని ఎ.వి. శ్రీనివాసరెడ్డి పొలంలో అనుమతిలేకుండా తొమ్మిది బోరు బావులు తవ్వారు. జిల్లా కలెక్టర్ అనుమతులతో ఓఎన్జీసీ సంస్థ బోరుబావులు తవ్వుతోందని తహసీల్దార్ ఈశ్వరయ్య తెలిపారు. రెండ్రోజుల క్రితం కలెక్టర్ ఇచ్చిన అనుమతుల కాపీని తనకు అందించారన్నారు. ఇక ముదిగుబ్బ నుంచి జమ్మలమడుగు వరకు బోరుబావుల తవ్వకాల కాంట్రాక్టును బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సురేష్ పొందినట్లు సమాచారం. -
రైతుల తరఫున పోరాటం చేస్తాం
మైలవరం: దాల్మియా ప్రభావిత గ్రామాలైన దుగ్గనపల్లి, నవాబుపేట గ్రామ రైతు సమస్యలపై పోరాటం చేస్తామని ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో రైతుల సమస్యలను పరిష్కరించకుండా ప్రజాభిప్రాయ సేకరణ మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. దుగ్గనపల్లి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మిర్చి రైతు మోషే కుటుంబాన్ని గురువారం మధ్యాహ్నం పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ఎంపీకి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దుగ్గనపల్లి,నవాబుపేట గ్రామాలకు ప్రధానంగా రెండు సమస్యలు పొంచి ఉన్నాయన్నారు. అందులో కాలుష్యం ఒకటి కాగా.. పంటల నీట మునక మరో ప్రధాన సమస్య అని తెలిపారు. ఈ విషయంపై రైతులు లోకాయుక్తను ఆశ్రయించగా అందుకు సంబంధించిన పూర్తి నివేదక కోసం కమిటీ వేశారన్నారు. అది పూర్తి కాకముందే ప్రజాభిప్రాయ సేకరణ చేసి పరిశ్రమ విస్తరణకు ముందుకు సాగడం మంచిదికాదన్నారు. ప్రస్తుతం ఇక్కడ గ్రామాలలో ఉన్న సమస్యలపై పార్టీ తరపున కలెక్టర్‌ను కలిసి వివరిస్తామన్నారు. 27వ తేదిన తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేసేదుకు ప్రయత్నం చేస్తామన్నారు. అనంతరం రెండు గ్రా వ ూ లకు సంబంధించిన మునక భూములు, దుమ్మూ, ధూళి నిండిన పొలాలను పరిశీలించారు. ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలి: ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దాల్మియా పరిశ్రమ విస్తరణకు సంబంధించి ఈనెల 27వతేదిన జరిగే ప్రజాభిప్రాయ సేకరణను వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయకపోతే ప్రజలు, రైతుల సమస్యలు పరిష్కారం కావని.. ఆపై యాజమాన్యం పట్టించుకునే పరిస్థితి ఉండదన్నారు. నవాబుపేట నాయకులు భాస్కర్‌రెడ్డి, చిన్న కొమెర్ల సర్పంచ్ జగదీశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధిద కొమెర్ల మోహన్‌రెడ్డి, కన్వీనర్ ధన్నవాడ మహేశ్వరరెడ్డి, గిరిధర్‌రెడ్డి, శివగుర్విరెడ్డి, పోరెడ్డి మహేశ్వరరెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, వెంపలాకు రామాంజనేయుల యాదవ్, జడ్పీటీసీ మహాలక్ష్మీ, హృషికేశవరెడ్డి ,శంకర్‌రెడ్డి,చిన్నయ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి స్పష్టీకరణ రెండు లక్షల పరిహారం అందజేత రైతు మోషే కుటుంబ సభ్యులను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మోషే కుమారుడు ఏలియాజర్, కుమార్తెలు దీవెనమ్మ, మణి కుమారిలకు రెండు లక్షల పరిహారం అందించారు. ఎప్పుడు ఏ ఆపదొచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
వెబ్ ఆప్షన్లను పూర్తి చేయండి
కడప రూరల్: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల డీఎస్సీ ఉచిత కోచింగ్‌కు సంబంధించి వెబ్ ఆప్షన్లను పూర్తి చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి తెలిపారు. ఇందుకు సంబంధించి జ్ఞానభూమి వెబ్ ఆప్షన్ సర్వీస్ ప్రారంభమైందన్నారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధులు 15న లేదా అంతకుముందు వెబ్ ఆప్షన్ సర్వీస్ ద్వారా ఎంప్యానెల్డ్ కోచింగ్ సంస్ధలకు తమ ప్రాధాన్యతలను తెలియజేయాలని పేర్కొన్నారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను ఏపీసీఎఫ్ఎస్ఎస్ వెబ్ పోర్టల్‌లో చూడవచ్చని తెలిపారు. 15న బద్వేలులో జాబ్‌మేళా కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 15న ఉదయం 10 గంటలకు బద్వేలు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని వెలుగు కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పేటీఎం కంపెనీలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, డొనో బీపీఓ అండ్ ఐటీ సొల్యూషన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో టెలీ కాలింగ్ ఆఫీసర్, ఆల్ డిక్సన్ కంపెనీలో అసెంబ్లింగ్ ఆపరేటర్, క్వాలిటీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివి 18–45 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఎంపికై న వారికి అర్హతను, అనుభవాన్ని బట్టి రూ. 12–25 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థులు విద్యార్హతలు, ఫొటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.యూత్ పార్లమెంట్ ఉపన్యాసాల రిజిస్ట్రేషన్ గడువు పెంపు కడప ఎడ్యుకేషన్: భారత ప్రభుత్వ యువజన,క్రీడా వ్యవహారాల శాఖ నెహ్రూ యువ కేంద్ర ఆదేశాల మేరకు యూత్ పార్లమెంటు ఉపన్యాసాల పోటీలలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మార్చి 16 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా యువజన అధికారి మణికంఠ తెలియజేశారు. పోటీలలో పాల్గొని యువత వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశం పైన ఉపన్యాసాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారని చెప్పారు. అన్నమయ్య, కడప జిల్లా పరిధిలోని 18 నుంచి 25 ఏళ్లలోపు యువత రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు అవకాశం కల్పించారన్నారు. మార్చి 15వ తేదీన కెఎస్‌ఆర్‌ఎమ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించాల్సిన ఉపన్యాసాల పోటీలు, రిజిస్ట్రేషన్ గడువు పెంపు కారణంగా వాయిదా వేసినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు 9177616677 సంప్రదించాలని సూచించారు. మొల్లమాంబ గొప్ప కవయిత్రి కడప సెవెన్‌రోడ్స్: సరళమైన తెలుగు భాషలో రామాయణం రచించి సమాజానికి అందించిన గొప్ప కవయిత్రి మొల్లమాంబ అని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని సభా భవన్ హాలులో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతనమొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాహితీవేత్త నరాల రామారెడ్డి, మొల్ల సాహితీ పీఠం అధ్యక్షులు డాక్టర్ విద్వాన్ గానుగపెంట హనుమంత రావు హాజరుకాగా జిల్లా పోలీస్ అధికారి అశోక్ కుమార్, డీఆర్ ఓ విశ్వేశ్వరనాయుడు , ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవీయ విలువలకు ప్రాధాన్యతనిస్తూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు వివక్షతకు వ్యతిరేకంగా తన రచనలు చేశారని కొనియాడారు. బీసీ వెల్ఫేర్ అధికారి భరత్ కుమార్, సాంఘీక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, మొల్ల సాహితీ పీఠం సభ్యులు పాల్గొన్నారు. -
అన్ని ప్రభుత్వ శాఖల యందు ‘వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం’తీరే వేరయా అన్న చందంగా మారింది ఇక్కడి పరిస్థితి. ఈ శాఖలో పోస్టింగ్ కోసం ఉద్యోగులు ఉబలాటపడుతున్నారు. ఎలాగైనా ఇక్కడ కొలువు దీరాలని కొందరు ప్రయత్నిస్తుంటే.. ఇప్పటికే ఉన్నవారు తమ కుర్చీని కాపాడుకు
కడప రూరల్: జిల్లా కేంద్రమైన కడప పాత రిమ్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం ఉంది. ఇది జోన్–4 కార్యాలయం. రాయలసీమ జిల్లాల్లో వైద్య ఆరోగ్యశాఖ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 17 కేడర్లు, 13 వేల మందికి పైగా ఉద్యోగులు ఈ శాఖ పరిధిలోకి వస్తారు. ఇక్కడ ఉద్యోగుల పదోన్నతులతో పాటు సర్వీసుకు సంబంధించిన అంశాలు వస్తాయి. అలాగే ఇక్కడ స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ తదితర ఉద్యోగ నియామకాలను చేపడుతుంటారు. ఈ జాబితా ఈ శాఖ ఎంత కీలకమైందో చెప్పకనే చెబుతోంది. ఇలాంటి ముఖ్యమైన శాఖలో పనిచేయడానికి ఉద్యోగులు తహ తహలాడుతుంటారు. ఇక్కడ ఏది జరిగినా కూడా ఆ అంశం జోన్–4 (రాయ లసీమ) వ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఇక్కడికి రావడానికి అనేక ప్రయత్నాలు... సాధారణంగా వర్క్ ఆర్డర్, డిప్యుటేషన్లు అంటే ‘వర్క్ లోడ్’(పని భారం) ఎక్కువగా ఉన్నప్పుడు సంబంధిత అధికారి తమకు ఉద్యోగుల అవసరం అని ఉన్నతాధికారులకు నివేదిస్తారు. వారి ఆదేశాల ప్రకారం ఇతర విభాగాల్లో పనిచేస్తున్న తమకు అనుకూలమైన ‘అన్ని పనులు తెలిసిన’వారిని రప్పించుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. ఇక్కడి వైద్య ఆరోగ్య శాఖలో పని భారం ఉన్నా..లేకున్నా వర్క్ ఆర్డర్, డిప్యుటేషన్లపై కోరుకున్న చోటికి రప్పించుకోవడం ఒక సాకుగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ● ప్రొద్దుటూరు సమీపంలోని ఒక పీహెచ్సీలో పనిచేస్తున్న ఒక సీనియర్ అసిస్టెంట్, తిరుపతిలో ఒక విభాగంలో పనిచేస్తున్న మరొక సీనియర్ అసిస్టెంట్ వర్క్ ఆర్డర్‌పై వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయానికి రావడానికి డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు ఇక్కడి నుంచి ఫైల్స్ వెళ్లాయి. అక్కడి ఉన్నతాధికారులు ఆ ఫైల్స్‌ను పక్కన పెట్టినట్లు తెలిసింది. ఈ వర్క్ ఆర్డర్ జరుగుతుందా..లేదా అనేది పక్కనబెడితే.. తాజాగా ప్రభుత్వం వర్క్ ఆర్డర్స్, డిప్యుటేషన్లపై ‘బ్యాన్’విధించింది. అయినా ఇందుకు సంబంధించిన పత్రాలు వెళ్లడం గమనార్హం. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమంటే ఇక్కడ పనిచేసి వెళ్లిన మరొక ఉద్యోగి కూడా మళ్లీ ఇక్కడికే రావడానికి చాలా నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఆ శాఖలో పనిచేయడానికి ఉద్యోగుల మధ్య పోటీ నెలకొంది. ఈ విధంగా మొదటి నుంచి ఉదో ్యగులు ఈ శాఖలో పోస్టింగ్ పొందడానికి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఏదోలా ఇక్కడికి వచ్చాక ‘ఫెవికాల్ వీరుల్లా’మారిపోతారు. వెళ్లాల్సి వస్తే మళ్లీ రావడానికి అడ్డదారులు వెతుకుతారు. అందుకే ఈ శాఖలో పోస్టింగ్‌కు సంబంధించి ‘కదలరు..వదలరు’అని అం టుంటారు. మరి అందరికే ఇదే ఎందుకిష్టమంటే ‘పైసా మే పరమాత్మ’ అనే గుసుగుసలు వినిపిస్తాయి. నేతల మధ్య ఆధిపత్యం.. అక్కడికి పోస్టింగ్ అంటే ఉబలాటం వచ్చాక వెళ్లకుండా ఉండడానికి ఆరాటం గత్యంతరం లేక వెళ్లాల్సివస్తేమళ్లీ రావడానికి ప్రయత్నం ఇదీ ౖ‘వెద్య ఆరోగ్య శాఖజోన్–4 కార్యాలయం’తీరు వైద్య ఆరోగ్య శాఖ విభాగాలకు సంబంధించి రాయలసీమ (జోన్–4) జిల్లాల్లో ఆరుకు పైగా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. కొన్నింటి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఒకరు అవునంటే..మరొకరు కాదంటారు. అలాగే తమకు అనుకూలమైన వారిని కీలకమైన పోస్టింగ్‌ల్లో నియమించుకోవడానికి, అనుకూలమైన చోటికి బదిలీలు చేయించుకోవడానికి పోటీ పడుతుంటారు. ఉద్యోగుల అంశానికి సంబంధించి ఏదైనా సరే ప్రభుత్వ నిబంధనలు అందరికీ ఒకే విధంగా వర్తించేలా అటు అధికారులు..ఇటు ఉద్యోగ సంఘాల నేతలు చూడాలని ఆ శాఖకు చెందిన ఉద్యోగులు కోరుతున్నారు. మరి ప్రభుత్వ పెద్దలు..ఉన్నతాధికారులు ఉద్యోగుల మాటలు ఆలకిస్తారో లేదో చూడాలి. -
వైఎస్సార్సీపీ ఆవిర్భావమే ఒక ప్రభంజనం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే ఒక ప్రభంజనమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ 15వ వసంతంలోకి అడుగుపెట్టడం సంతోషదాయకమన్నారు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల వల్ల ఈ పార్టీ పోరాటాల నుంచి పుట్టిందన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మకై ్క ఎన్నో రకాలుగా వేధించి, అవినీతి ఆరోపణలు చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని 16నెలలు జైల్లో పెట్టారన్నారు, 2014లో 67 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా మారిందన్నారు. ఏదైనా ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించిన వెంటనే అధికారంలోకి రాకపోతే కనుమరుగవడం ఖాయమని, కానీ వైఎస్సార్సీపీ మొదటిసారి అధికారంలోకి రాకపోయినా 9 ఏళ్లు నిలబెట్టడమంటే ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. చిరంజీవిలాంటివారే రెండేళ్లకే పార్టీని అమ్ముకున్నారని గుర్తు చేశారు. ఆయా సంక్షేమ పథకాలతో ఏపీలో ఎన్టీఆర్, వైఎస్సార్, వైఎస్ జగన్ ముగ్గురు ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచారన్నారు. విద్యా వ్యవస్థలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమూల మార్పులు తీసుకువచ్చారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేసి మెడికల్ సీట్లు సాధిస్తే వాటిని వద్దని లేఖ రాసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేని ధ్వజమెత్తారు. 2024లో వైఎస్సార్సీపీ సంఖ్యాపరంగా ఓటమిపాలైనా 40 శాతం ఓట్లతో ప్రజల మనసు గెలుచుకుందన్నారు. జిల్లాలోని కాశినాయన క్షేత్రంలో అన్న సత్రాలు కూల్చివేస్తుంటే ...ధర్మాని పరిరక్షిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సంపద సృష్టించి ఎన్నికల హామీలు అమలు చేస్తానన్న బాబు, ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో తన చెవిలో చెప్పమంటున్నారని ఎద్దేవా చేశారు. జెడ్పీ వైస్ ఛైర్మెన్ బాలయ్య, వైఎస్సార్సీపీ నేతలు పులి సునీల్, పి. జయచంద్రారెడ్డి, బీహెచ్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి రాకపోయినా 9 ఏళ్లు పార్టీని నడపడం సామాన్య విషయం కాదు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి -
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
కమలాపురం : ప్రతి ఒక్క వాహన డ్రైవర్ భద్రతా నియమాలు పాటించాలని భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) సీఎంఓ సాయి రమేష్ తెలిపారు. గురువారం 54వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు సమావేశాలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని నల్లింగాయపల్లెలోని బీసీసీపీఎల్‌లో ఆయన వాహన డైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ముందుగా భద్రతా పతాకాన్ని ఎగుర వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహన డ్రైవర్ రోడ్డు భద్రతా నియమాలు పాటించినపుడే గమ్య స్థానాలకు సురక్షితంగా చేరవచ్చన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకపోతే అటు యజమానులు, ఇటు డ్రైవర్ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండవచ్చన్నారు. రెప్పపాటు కాలంలోనే ప్రమాదాలు ముంచుకొస్తాయన్నారు. డ్రైవర్లు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదాల బారిన పడతారని, తద్వారా కుటుంబ సభ్యులు వీధిన పడతారని గుర్తు చేశారు. వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్, సీటు బెల్ట్ తప్పక ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె. క్రిష్ణమూర్తి మాట్లాడుతూ భద్రత కంటే ఆరోగ్యం ముఖ్యం అన్నారు. ఈ సంవత్సరం థీమ్ వివరిస్తూ అభివృద్ధి చెందిన భారతదేశంగా ఉండాలంటే మనమందరం ఆరోగ్య సూత్రాలను, భద్రతా చర్యలను పాటించాలన్నారు. భద్రతా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం పీపీఈ స్టాల్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం జగదీశ్వర్ రెడ్డి, హెచ్ఆర్ హెడ్ గోపాల్‌రెడ్డి, సేఫ్టీ ఆఫీసర్ జి.మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీసీసీపీఎల్ సీఎంఓ సాయిరమేష్ -
ప్రభుత్వానికి తెలియకుండా కట్టడాలు కూల్చివేస్తారా
కాశినాయన : ప్రభుత్వానికి తెలియకుండా జ్యోతి క్షేత్రం కాశినాయన ఆశ్రమంలోని నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. కాశినాయన మండలంలోని జ్యోతిక్షేత్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. కాశినాయన సమాధి, లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాశినాయన ఆశ్రమంలో అటవీశాఖ అధికారులు అనుమతులు లేవంటూ కూల్చివేసిన గోశాల, క్షౌ రశాల, వసతిగదులు, కుమ్మరి, విశ్వబ్రాహ్మణుల సత్రాలు, మరుగుదొడ్లతో పాటు భోజనశాల, వంటశాలలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతినిత్యం వేలాది మంది కాశినాయన సమాధిని దర్శించుకుని భోజనం చేసి వెళుతుంటారన్నారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న కాశినాయన ఆశ్రమంలో అనుమతి లేకుండా కట్టడాలు కట్టారని కూల్చివేయడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అధికారులు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. 2023 ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీ అవధూత కాశినాయన ఆశ్రమానికి 12.98 హెక్టార్ల భూమి అవసరమని, ఇందుకు సంబంధించి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌కు లేఖ రాశారని తెలిపారు. ఆ లేఖను తాను, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితో పాటు కొంత మంది ఆలయ నిర్వాహకులు ఢిల్లీ వెళ్లి అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డికి అందజేశామన్నారు. ఆయన కేంద్ర అటవీశాఖ మంత్రికి లేఖను అందజేసి అనుమతులు మంజూరు చేయాలని కోరారన్నారు. తాను పలుమార్లు ఢిల్లీలోని అటవీశాఖ అధికారులతో మాట్లాడానని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఫారెస్టు అధికారులతో చర్చలు జరుపుతూ కాశినాయన ఆశ్రమానికి తోడ్పాటు అందించామని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం 8 నెలల్లో మూడుసార్లు ఆశ్రమంలోని నిర్మాణాలను కూల్చడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వానికి తెలియకుండా అటవీ అధికారులు కూల్చివేశారని మంత్రి లోకేష్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర అటవీశాఖ అధికారుల ఆదేశాలతో ఇప్పటి జిల్లా కలెక్టర్ జనవరి 1న కాశినాయన ఆశ్రమంలోని కట్టడాలను కూల్చివేయాలని పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్అండ్బి, ఏపీఎస్పీడీసీఎల్, అటవీశాఖ అధికారులకు జీఓ జారీ చేశారని తెలిపారు. రాష్ట్రం, కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, జగన్మోహన్రెడ్డి లేఖ రాసిన ప్రకారం 12.98 హెక్టార్ల భూమికి అనుమతి మంజూరు చేయించి కాశినాయన ఆలయ నిర్మాణానికి అనుమతులు తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఆశ్రమాన్ని ఇక్కడ భక్తులే నిర్వహిస్తున్నారని, అలాంటి ఆశ్రమాన్ని అనుమతుల పేరుతో కూల్చివేయడం తగదన్నారు. మంత్రి లోకేష్ అధికారులను తప్పు పట్టడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేనిదే అధికారులు ఎలా కట్టడాలను కూల్చివేస్తారని ప్రశ్నించారు. మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ అవధూతగా పేరు పొందిన కాశినాయన ఆశ్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూల్చివేతలు మొదలు పెట్టడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువ నాయకుడు ఆదిత్యరెడ్డి, మాజీ వ్యవసాయ ప్రభుత్వ సలహాదారు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కె.రమణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాశినాయన భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి -
అన్ని ప్రభుత్వ శాఖల యందు ‘వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం’తీరే వేరయా అన్న చందంగా మారింది ఇక్కడి పరిస్థితి. ఈ శాఖలో పోస్టింగ్ కోసం ఉద్యోగులు ఉబలాటపడుతున్నారు. ఎలాగైనా ఇక్కడ కొలువు దీరాలని కొందరు ప్రయత్నిస్తుంటే.. ఇప్పటికే ఉన్నవారు తమ కుర్చీని కాపాడుకు
కడప రూరల్: జిల్లా కేంద్రమైన కడప పాత రిమ్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం ఉంది. ఇది జోన్–4 కార్యాలయం. రాయలసీమ జిల్లాల్లో వైద్య ఆరోగ్యశాఖ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 17 కేడర్లు, 13 వేల మందికి పైగా ఉద్యోగులు ఈ శాఖ పరిధిలోకి వస్తారు. ఇక్కడ ఉద్యోగుల పదోన్నతులతో పాటు సర్వీసుకు సంబంధించిన అంశాలు వస్తాయి. అలాగే ఇక్కడ స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ తదితర ఉద్యోగ నియామకాలను చేపడుతుంటారు. ఈ జాబితా ఈ శాఖ ఎంత కీలకమైందో చెప్పకనే చెబుతోంది. ఇలాంటి ముఖ్యమైన శాఖలో పనిచేయడానికి ఉద్యోగులు తహ తహలాడుతుంటారు. ఇక్కడ ఏది జరిగినా కూడా ఆ అంశం జోన్–4 (రాయ లసీమ) వ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఇక్కడికి రావడానికి అనేక ప్రయత్నాలు... సాధారణంగా వర్క్ ఆర్డర్, డిప్యుటేషన్లు అంటే ‘వర్క్ లోడ్’(పని భారం) ఎక్కువగా ఉన్నప్పుడు సంబంధిత అధికారి తమకు ఉద్యోగుల అవసరం అని ఉన్నతాధికారులకు నివేదిస్తారు. వారి ఆదేశాల ప్రకారం ఇతర విభాగాల్లో పనిచేస్తున్న తమకు అనుకూలమైన ‘అన్ని పనులు తెలిసిన’వారిని రప్పించుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. ఇక్కడి వైద్య ఆరోగ్య శాఖలో పని భారం ఉన్నా..లేకున్నా వర్క్ ఆర్డర్, డిప్యుటేషన్లపై కోరుకున్న చోటికి రప్పించుకోవడం ఒక సాకుగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ● ప్రొద్దుటూరు సమీపంలోని ఒక పీహెచ్సీలో పనిచేస్తున్న ఒక సీనియర్ అసిస్టెంట్, తిరుపతిలో ఒక విభాగంలో పనిచేస్తున్న మరొక సీనియర్ అసిస్టెంట్ వర్క్ ఆర్డర్‌పై వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయానికి రావడానికి డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు ఇక్కడి నుంచి ఫైల్స్ వెళ్లాయి. అక్కడి ఉన్నతాధికారులు ఆ ఫైల్స్‌ను పక్కన పెట్టినట్లు తెలిసింది. ఈ వర్క్ ఆర్డర్ జరుగుతుందా..లేదా అనేది పక్కనబెడితే.. తాజాగా ప్రభుత్వం వర్క్ ఆర్డర్స్, డిప్యుటేషన్లపై ‘బ్యాన్’విధించింది. అయినా ఇందుకు సంబంధించిన పత్రాలు వెళ్లడం గమనార్హం. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమంటే ఇక్కడ పనిచేసి వెళ్లిన మరొక ఉద్యోగి కూడా మళ్లీ ఇక్కడికే రావడానికి చాలా నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఆ శాఖలో పనిచేయడానికి ఉద్యోగుల మధ్య పోటీ నెలకొంది. ఈ విధంగా మొదటి నుంచి ఉదో ్యగులు ఈ శాఖలో పోస్టింగ్ పొందడానికి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఏదోలా ఇక్కడికి వచ్చాక ‘ఫెవికాల్ వీరుల్లా’మారిపోతారు. వెళ్లాల్సి వస్తే మళ్లీ రావడానికి అడ్డదారులు వెతుకుతారు. అందుకే ఈ శాఖలో పోస్టింగ్‌కు సంబంధించి ‘కదలరు..వదలరు’అని అం టుంటారు. మరి అందరికే ఇదే ఎందుకిష్టమంటే ‘పైసా మే పరమాత్మ’ అనే గుసుగుసలు వినిపిస్తాయి. నేతల మధ్య ఆధిపత్యం.. అక్కడికి పోస్టింగ్ అంటే ఉబలాటం వచ్చాక వెళ్లకుండా ఉండడానికి ఆరాటం గత్యంతరం లేక వెళ్లాల్సివస్తేమళ్లీ రావడానికి ప్రయత్నం ఇదీ ౖ‘వెద్య ఆరోగ్య శాఖజోన్–4 కార్యాలయం’తీరు వైద్య ఆరోగ్య శాఖ విభాగాలకు సంబంధించి రాయలసీమ (జోన్–4) జిల్లాల్లో ఆరుకు పైగా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. కొన్నింటి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఒకరు అవునంటే..మరొకరు కాదంటారు. అలాగే తమకు అనుకూలమైన వారిని కీలకమైన పోస్టింగ్‌ల్లో నియమించుకోవడానికి, అనుకూలమైన చోటికి బదిలీలు చేయించుకోవడానికి పోటీ పడుతుంటారు. ఉద్యోగుల అంశానికి సంబంధించి ఏదైనా సరే ప్రభుత్వ నిబంధనలు అందరికీ ఒకే విధంగా వర్తించేలా అటు అధికారులు..ఇటు ఉద్యోగ సంఘాల నేతలు చూడాలని ఆ శాఖకు చెందిన ఉద్యోగులు కోరుతున్నారు. మరి ప్రభుత్వ పెద్దలు..ఉన్నతాధికారులు ఉద్యోగుల మాటలు ఆలకిస్తారో లేదో చూడాలి. -
మహిళపై కత్తితో దాడి
కమలాపురం : కమలాపురం పట్టణంలో పట్ట పగలే ఇంట్లోకి దూరి కళ్లల్లో కారం చల్లి కత్తితో దాడి చేసి బంగారు నగలు, నగదు దోచుకెళ్లిన ఘటన గురువారం జరిగింది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గిడ్డంగి వీధిలో నివాసం ఉన్న కరంగుడి లక్ష్మిదేవి అనే మహిళపై అదే వీధికి చెందిన ఆకుల నవీన్ కత్తితో దాడి చేశాడు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో లక్ష్మీదేవి ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న నిందితుడు ఇంట్లోకి చొరబడి మహిళ కళ్లల్లో కారం చల్లి కత్తితో ముఖం, మెడ, చేతులు, కాళ్లు, గొంతు వద్ద విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడింది. ఈ నేపథ్యంలో నిందితుడు లక్ష్మీదేవి ఒంటిపై ఉన్న సరుడు, గాజులు తదితర 10 తులాల మేరకు బంగారు నగలు అపహరించుకు వెళ్లాడు. ఈ ఘటన తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు అచేతన స్థితిలో పడి ఉన్న లక్ష్మీదేవిని కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కాగా బాధితురాలు మాట్లాడుతూ పిన్ని అని పిలిచి ఇంట్లోకి దూరి కారం చల్లి కత్తులతో దాడి చేసి తన ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు నగలు దోచుకెళ్లాడని, తనకు, తన బిడ్డలకు న్యాయం చేయాలని రోదించింది. కాగా బాధితురాలి భర్త శేఖర్ మాట్లాడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి ఇంత ఘోరం చేశాడని బంగారుతో పాటు, రూ.3లక్షల నగదు అపహరించుకు వెళ్లాడన్నారు. గాలింపు చర్యలు చేపట్టాం: సీఐ ఎస్కే రోషన్ గిడ్డంగి వీధికి చెందిన లక్ష్మీదేవిపై దాడి చేసిన ఆకుల నవీన్‌ను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టామని సీఐ ఎస్కే రోషన్ తెలిపారు. లక్ష్మీదేవి ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న నవీన్ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బంగారు, నగదు అపహరణ నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు -
టెలీ కాన్ఫరెన్సులతో టెన్షన్
కడప టాస్క్‌ఫోర్స్: ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఏపీఎస్పీడీసీఎల్)లో నిర్వహిస్తున్న వరుస టెలీ కాన్ఫరెన్సులతో అటు ప్రజలు, ఇటు విద్యుత్ శాఖ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ శాఖ అనేది అత్యవసరాల్లో పనిచేసే ప్రభుత్వ శాఖల్లో ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఇతర శాఖల సిబ్బందికై నా కొన్ని నిముషాలు, గంటల వ్యవధి ఉంటుంది. కానీ విద్యుత్ శాఖలో మాత్రం సెకన్లు, నిముషాల్లో స్పందించకపోతే భారీ నష్టం చవి చూడక తప్పదు. ప్రతి మంగళవారం, శనివారం జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీరు స్వయంగా ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వస్తుంటారు. ఆ రోజుల్లో సాయంత్రం 5 గంటల నుంచి రెండు, మూడు గంటలపాటు టెలీ కాన్ఫరెన్స్ ఉంటుంది. ఈ సమయంలో విద్యుత్ పరంగా ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా....ఉదాహరణకు విద్యుత్ లైన్లు తెగిపడినా, లైన్లు తగులుకొని ఎవరైనా జంతువుగానీ, మనిషిగానీ చనిపోయినా...ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, మంటలు రేగినా ఇతరత్రా ఏ సమస్య వచ్చినా విద్యుత్ సిబ్బందికి చెబుదామంటే వారి ఫోన్లు పనిచేయవు. వారి ఉన్నతాధికారులకు చెప్పాలనుకుంటే అదీ కుదరదు. ఎందుకంటే వారంతా విద్యుత్ శాఖ సిబ్బంది మొత్తం టెలీ కాన్ఫరెన్స్‌లో బిజీగా ఉంటారు. ఇది ఒకరోజుతో పోయేది కాదు...వారానికి రెండు సార్లు, రెండు, మూడు గంటలపాటు కొనసాగుతూనే ఉంటుంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డీఈఈలు, ఏఈలు, ఏఓలు, జేఏఓలు, లైన్మెన్లు, ఏఎల్ఎంలు, జేఎల్ఎంలు, ఎనర్జీ అసిస్టెంట్లు, సబ్ స్టేషన్లలో పనిచేసే ఆపరేటర్లు, వాచ్మెన్లు అందరూ ఎక్కడ ఎన్నా...ఏ పరిస్థితుల్లో ఉన్నా టెలీ కాన్ఫరెన్సుకు హాజరై తీరాల్సిందే. లేకుంటే వారికి వెంటనే మెమోలు జారీ అవుతాయి. ప్రతిరోజూ ఉదయం విద్యుత్ సిబ్బంది డిస్కనెక్షన్ లిస్టు పట్టుకొని ఇంటింటికీ వెళ్లి కరెంటు బిల్లులు చెల్లించని వారి విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తుంటారు...ఒకవేళ వారు వెంటనే బిల్లులు చెల్లిస్తే సాయంత్రంలోపు విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాల్సి ఉంటుంది. మిగతా అన్ని రోజులూ ఇబ్బంది లేదుగానీ ఆ రెండురోజుల్లో మాత్రం సమస్యలెదురవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకూ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడం వల్ల అప్పటికే చీకటి పడిపోతోంది. ఆ సమయంలో సిబ్బంది స్తంభాలు ఎక్కి పనిచేయడం కష్టతరమవుతోంది. విద్యుత్ సిబ్బంది పనిచేయకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా ఎవరో ఒకరి చేత విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరించుకునే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదేకాదు కరెంటు పోయినా, లైన్లు తెగినా, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా ఆ సమయంలో ప్రజల గోడు వినే నాథుడే ఉండటం లేదు. సాధారణంగా ఎస్ఈ స్థాయిలోని అఽధికారి ఈఈలు, డీఈలు, ఏఈలు, ఏఓలు వంటి అధికారులతోనే టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించడం ఆనవాయితీ. ప్యూజ్ ఆఫ్ కాల్స్‌కు స్పందించాల్సిన చిన్న స్థాయి ఉద్యోగులను కూడా టెలీ కాన్ఫరెన్స్‌లోకి తీసుకోవడంతో వారు ఆ సాకు చెప్పి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఉన్న సబ్స్టేషన్లలో సుమారు 1000 మంది పనిచేస్తున్నారు. ఇందులోని విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందితో ఒకేసారి టెలీ కాన్ఫరెన్సు నిర్వహించి చిన్న స్థాయి ఉద్యోగులందరికీ తెలిసేలా వారిపై అధికారులను తిడుతుండటం వల్ల వారు మానసిక వేదనకు గురవుతున్నట్లు సమాచారం. తాము ఏదైనా తప్పు చేసినా, సరిగా పనిచేయకపోయినా ఉన్నతాధికారి పిలిచి మందలించవచ్చు. ఇలా టెలీ కాన్ఫరెన్స్‌లో అందరి సమక్షంలో తిట్టడం వల్ల వారు అవమానంగా భావిస్తున్నట్లు సమాచారం. ఏఈలు చెప్పినట్లు లైన్మెన్లు, ఆపరేటర్లు, వాచ్మెన్లు పనిచేస్తారు కాబట్టి ఏఈలతో కాన్పరెన్స్ నిర్వహిస్తే సరిపోతుంది. అలా కాకుండా ప్రజలకు, విద్యుత్ సంస్థకు వారధిగా ఉండి ప్రజలకు కావాల్సిన పనులు చేసిపెట్టే క్షేత్ర స్థాయి సిబ్బందితో నిర్వహించడం వల్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెప్పేవారికి వినేవారు లోకువ అన్న చందంగా వారానికి రెండు సార్లు చెప్పిందే గంటలు, గంటలు చెప్పడం వల్ల అందరికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ● చీకటిలో పని చేయలేక... ప్రభుత్వం ఏదైనా ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించినప్పుడో లేదా విద్యుత్ సంస్థ ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించినప్పుడో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులతో టెలీ కాన్ఫరెన్స్‌లు, మీటింగ్‌లు అనుసరించడంలో అర్థముంది. జిల్లాలో అలా జరగడం లేదు. వారానికి రెండు సార్లు జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరితో రెండు, మూడు గంటలపాటు అదేపనిగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ కోసం సిబ్బంది ఫోన్లు పని చేయక జనం ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ శాఖలో వారానికి రెండుసార్లు కొన్ని గంటలపాటు స్తంభించిపోతున్న కార్యకలాపాలు ఆ సమయంలో పనిచేయని విద్యుత్ సిబ్బంది ఫోన్లు ఫ్యూజ్ ఆఫ్ కాల్స్‌కు స్పందించని క్షేత్రస్థాయి సిబ్బంది ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం -
పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్‌రోడ్స్: ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలు పకడ్బందీ భద్రత, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. గురువారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌తో కలసి సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పద వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయన్నారు. జిల్లాలో 161 పరీక్షా కేంద్రాలలో 14,330 మంది బాలురు, 13,470 మంది బాలికలు మొత్తం 27,800 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రతను కల్పించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. ఎక్కడ మాస్ కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కడప,బద్వేలు, పులివెందుల, జమ్మలమడుగు ఆర్డీవోలు జాన్ ఇర్వీన్, చంద్రమోహన్, చిన్నయ్య, సాయిశ్రీ, తహసీల్దార్ లు, విద్యా శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పీ4 సర్వేతో ప్రతి ఇంటికి అభివృద్ధి ప్రభుత్వ, దాతల, ప్రజల, భాగస్వామ్యం (పీ4) సర్వేతో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి చేకూరుతుందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సభా భవనంలో పీ4 సర్వేపై ప్రజా అభిప్రాయం కోసం జిల్లా పోలీస్ అధికారి అశోక్ కుమార్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్, ప్రజలు, దాతలు పార్టనర్షిప్తో అట్టడుగునున్న 20 శాతం పేదలను, అత్యున్నతంగా ఉన్న 10 శాతం సంపన్నులు ద్వారా అభివృద్ధి చేయడం పి4 ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రాబోయే ఐదేళ్లలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం ‘జీరో పావర్టీ –పీ4 పాలసీ‘అమలుకు కృషి చేస్తోందన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజంలోని వివిధ వర్గాలు, మేధావులు, నిపుణులు,ప్రజలు తమ సహకారాలు అందించి పీ4 మోడల్ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమావేశ అనంతరం పారిశ్రామిక వేత్తలు, బ్యాంక్ అధికారులు, ఇతరులు పీ4 విధానంపై సూచనలు, సలహాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు. ●అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన అనుమతులను జాప్యం చేయకుండా త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అభివృద్ధి పనులు, రెవెన్యూ సదస్సులు, గ్రామ సభలు, పౌర సరఫరాల పంపిణీపై జేసీ అదితి సింగ్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. సంబంధిత తహసీల్దార్ వద్దకు వచ్చిన దరఖాస్తును రెండు రోజుల్లో పరిశీలించి పరిష్కరించాలన్నారు. సకాలంలో అనుమతులు ఇవ్వక జాప్యం చేసి అక్రమ మైనింగ్‌కు ఆస్కారం ఇవ్వవద్దన్నారు. రెవెన్యూ సదస్సులు, గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పౌర సరఫరాల అంశంలో వంట గ్యాస్ పంపిణీ, నిత్యావసర వస్తువుల పంపిణీ, తూకాల వ్యత్యాసంపై తరచు తనిఖీలు తదితరులపై వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు జారీచేశారు. -
రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ అధికారి విచారణ
కడప అర్బన్ : కడప నగరంలో ఈనెల 27వ తేదీన రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై రవాణాశాఖ అధికారి శ్వేత గురువారం విచారణ చేపట్టారు. ఏడు రోడ్లవద్ద రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేయగా బస్సు కండీషన్‌పై గురువారం ఉదయం రవాణా శాఖాధికారి శ్వేత దర్యాప్తు చేశారు. ఏడు రోడ్ల వద్ద ప్రతిరోజు రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పదుల సంఖ్యలో నిలబెడుతూ వుండటంతో ట్రాఫిక్ అధికం అవుతోందని పోలీసులు తెలిపారు. ఎన్నిసార్లు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యజమానులకు చెప్పినా అక్కడే గంటల కొద్దీ బస్సులు నిలుపుతూ ఉండటంతో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు కూడా కారణం అవుతున్నాయని చెబుతున్నారు. బస్సుల యజమానులకు త్వరలో నోటీసులు జారీ చేస్తామని ట్రాఫిక్ సీఐ జావేద్ తెలిపారు. -
పొలం ఆక్రమణపై కేసు నమోదు
పోరుమామిళ్ల : సిద్దవరం గ్రామానికి చెందిన నాగిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం సాయంత్రం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కొండారెడ్డి తెలిపారు. చల్లగిరిగెల గ్రామ రెవెన్యూ పొలంలో నాగిరెడ్డికి చెందిన భూమిని మంగనపల్లెకు చెందిన ఆంజనేయులు ఆక్రమించుకొనేందుకు ప్రయత్నం చేశాడన్నారు. అలాగే పొలం చుట్టూ నాటిన స్తంభాలను ధ్వంసం చేశాడని, అడ్డం వస్తే చంపుతానని బెదిరించాడని నాగిరెడ్డి ఫిర్యాదు చేశాడన్నారు. గతంలో కూడా ఆంజనేయులు తనపై దాడి చేసినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు బారికేడ్ల వితరణ సింహాద్రిపురం : మండల కేంద్రమైన సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌కు భారతి సిమెంటు కంపెనీ 10 బారికేడ్లను వితరణగా అందించినట్లు ఎస్ఐ తులసీనాగ ప్రసాద్ తెలిపారు. గురువారం భారతి సిమెంటు కంపెనీ మేనేజర్లు ప్రతాప్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, భారతి సిమెంటు కంపెనీ డీలర్ మల్లికార్జునరెడ్డిలు స్థానిక పోలీస్ స్టేషన్లో 10 నూతన బారికేడ్లను ప్రారంభించి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ సామాజిక సేవలో భాగంగా భారతి సిమెంటు కంపెనీ తరపున ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ చంద్రమోహన్ రెడ్డి, పోలీసు సిబ్బంది, భారతి సిమెంట్ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. -
బైకు అదుపుతప్పి ఒకరి మృతి
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని మూలవంక గ్రామం నుంచి కొత్తపేటకు వెళ్లే రోడ్డుపై గురువారం మధ్యాహ్నం బైకుకు కుక్క అడ్డు రావడంతో బైకు అదుపుతప్పి రోడ్డు పక్కగా ఉన్న మోరీని ఢీకొనడంతో గగ్గుటూరు రాజా(55) మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మహేశ్వరరెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు గగ్గుటూరు రాజా స్థానిక లింగారెడ్డిపల్లె నివాసి కాగా, వృత్తి రీత్యా వ్యవసాయ పనులు, బేల్దారిమేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బైకు నడుపుతూ తలకు తీవ్ర గాయాలైన మహేశ్వరరెడ్డిని చికిత్స కోసం కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఇతను కూడా స్థానిక లింగారెడ్డిపల్లెకు చెందిన వ్యక్తి కాగా, వ్యవసాయ పనులు, ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు ఉన్నారు. జిల్లా ఆస్పత్రిలో దొంగ హల్చల్ – మహిళా డాక్టర్ మెడలో బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించిన దొంగ ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ దొంగ ఏకంగా మహిళా డాక్టర్ మెడలోని బంగారు గొలుసును లాగేందుకు ప్రయత్నించాడు. అయితే మహిళా డాక్టర్ అప్రమత్తం కావడంతో దొంగ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ఘటన గురువారం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో జరిగింది. గైనకాలజిస్ట్ శ్రీవాణి ఆపరేషన్ థియేటర్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి డాక్టర్ మెడలోని బంగారు చైన్‌ను లాగేందుకు ప్రయత్నించాడు. దీంతో డాక్టర్ అతని చేయి పట్టుకుని విసిరేశారు. తర్వాత డాక్టర్ గట్టిగా కేకలు వేయడంతో దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్‌కే ఆస్పత్రిలో సెక్యూరిటీ లేదని పలువురు వాపోతున్నారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి రాజుపాళెం : మండల కేంద్రమైన రాజుపాళెంలో వెంగలాయపల్లె గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న పెట్రోల్ బంకు వద్ద గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రాజుపాళెం ఎస్ఐ కత్తి వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు గాదెగూడూరు గ్రామానికి చెందిన సుంకు ప్రసాద్(55) పని నిమిత్తం ప్రొద్దుటూరు వెళుతున్నారు. ఇదే మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన కాసా వెంకటసుబ్బా రెడ్డి ద్విచక్ర వాహనంలో ప్రొద్దుటూరు వైపు నుంచి వెంగలాయపల్లె గ్రామానికి వెళుతూ అతివేగం, అజాగ్రత్తగా పెట్రోల్ బంకు వైపునకు ద్విచక్ర వాహనాన్ని తిప్పడంతో ఈ సంఘటన జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో సుంకు ప్రసాద్ కింద పడిపోయాడు. అతన్ని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య సుంకు మల్లేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు, గోడౌన్లలో పోలీసుల తనిఖీలు కడప అర్బన్ : జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు కడప నగరంలోని ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు, గోడౌన్లలో గురువారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాలను పూర్తిగా కట్టడి చేసే క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు రవాణా జరగకుండా జిల్లా ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, మేకలదొడ్డి, తదితర ప్రాంతాల్లోని ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు, గోడౌన్లు, ప్రముఖ ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీల గోడౌన్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణాకు పాల్పడినా, సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్శిళ్లలో ఎక్కడైనా గంజాయి ఆనవాళ్లను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తనిఖీలలో ఫ్యాక్షన్ జోన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, ఎస్ఐ మల్లికార్జున రెడ్డి, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
నాటు సారా నిర్మూలనకు సహకరించాలి
చక్రాయపేట : గ్రామాల్లో నాటు సారా నిర్మూలనకు గ్రామస్తులందరూ అధికారులకు సహకరించాలని ఎకై ్సజ్ శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ జయరాజ్ పేర్కొన్నారు. గురువారం చక్రాయపేట మండలం కల్లూరుపల్లె తాండాలో నవోదయం–2 కార్యక్రమంలో భాగంలో నాటుసారా నిర్మూలన కోసం గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు ఆయన హాజరై నాటుసారా వలన కలిగే నష్టాలు, వాటి నివారణ చర్యలు ప్రజలకు వివరించారు. అనంతరం డేగ కళాజాత బృందం నాటిక, పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వినోద్‌కుమార్, గ్రామ సర్పంచ్ పురుషోత్తం నాయక్, పోలీస్ ఇన్స్పెక్టర్ సురేష్‌రెడ్డి, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు విశ్వనాథరెడ్డి, చెన్నారెడ్డి, ఎకై ్సజ్ సబ్ ఇన్స్పెక్టర్ సాదిక్ హుస్సేన్, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. -
అందరూ మహానటులే.. అసలైన ‘నటుడే’ స్పందించలేదే!
అందరూ అమాయకులే.. కానీ ఉట్టిమీద ఎండు చేపలు మాత్రం ఏమైనాయో తెలీదు. చేయాల్సింది చేసేసి ఇప్పుడు అందరూ.. అయ్యో.. ఇదెక్కడి ఘోరం.. తప్పయింది.. సరిదిద్దుతాం.. మా చేతిడబ్బులు పెడతాం అని ఆస్కార్ స్థాయి నటన చూపుతున్నారు. వాత పెట్టేది వాళ్ళీ.. వెన్నరాసేది వాళ్ళే..లంబు.. జంబు మాదిరి కేబినెట్లో ఈ లోకేష్.. పవన్ భలే తగిలారు.. తిరుమల తొక్కిసలాట మీద లోకేష్.. చంద్రబాబు కిక్కురుమనలేదు కానీ ఎగురుకుంటూ వచ్చి పవన్ సారీ చెప్పారు.. చైర్మన్ నాయుడు కూడా సారీ చెప్పాల్సిందే అని డిమాండ్ చేసారు. ఇప్పుడు పవన్ చేతిలో ఉన్న అటవీశాఖ పరిధిలోని కాశీనాయన సత్రం భవనాలను కడప జిల్లాలో ప్రభుత్వం కూల్చేసింది.. దీనిమీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వేలాదిమంది ఆకలి తీరుస్తున్న అన్నసత్రాలను కూల్చడం ఏమిటని ప్రజలు.. యువత.. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీంతో ఇదేదో పెద్ద డ్యామేజ్ అయింది అనుకున్న ప్రభుత్వం వెంటనే రిపేర్లు మొదలు పెట్టింది.కూల్చేశాక దీనికి సంబంధించి పవన్ ఎక్కడా నోరుమెదపలేదు.. కానీ లోకేష్ లైన్లోకి వచ్చి ఎకాఎకిన సారీ చెప్పేసి సొంత డబ్బుతో వాటిని నిర్మిస్తాను అంటున్నారు. అసలు ఆ సత్రాల కూల్చివేత వెనుక కూసే కులపరమైన రాజకీయ విద్వేషం ఉందని అంటున్నారు. కానీ, దానితో సంబంధం లేకుండానే రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత పెల్లుబుకడంతో ఏకంగా లోకేష్ లైన్లోకి వచ్చేసారు. ఆ భవనాలు టైగర్ జోన్లోకి వస్తాయి కాబట్టి కూల్చేశారని అది తప్పేనని అంగీకరిస్తూ.. మళ్ళీ వాటిని పునర్నిర్మిస్తామని.. దానికి తన సొంత డబ్బును వెచ్చిస్తానని చెబుతున్నారు. అదెలా సాధ్యం కూల్చినపుడు అవి టైగర్ జోన్లో ఉన్నాయ్ అన్నారు.. మరి మళ్ళీ నిర్మిస్తే టైగర్ జోన్లోకి రావా?. అది నిబంధనలకు విరుద్ధం కాదా?. అప్పుడు అటవీ చట్టాలు ఒప్పుకుంటాయా అనేది అర్థం కానీ విషయం. అటవీ మంత్రి సౌండ్ చేయడం లేదేం..టైగర్ జోన్లో ఉన్న భవనాలను కూల్చడం అంటే అది పవన్ కల్యాణుకు తెలిసే జరిగి ఉంటుంది.. లేదా పవన్ కు తెలియకుండా లోకేష్ సారధ్యంలో అయినా అది జరిగి ఉండాలి.. మరి ఇలాంటప్పుడు పవన్ కదా బయటకు వచ్చి దానిమీద స్పందించాలి.. అసలు పవన్ ఎక్కడున్నారో తెలియదు.. శాసనసభ సమావేశాలు మొదట్లో ఒకట్రెండు రోజులు వచ్చిన ఆయన తరువాత ఏమయ్యారో తెలియడం లేదు. తన శాఖ పరిథిలోకి లోకేష్ దూరిపోయి పెత్తనం చేయడం.. ఏకంగా క్షమాపణ చెప్పడం అంటే పవన్‌ను ఓవర్ టేక్ చేసేయడమే అని స్పష్టంగా తెలుస్తోంది. సంబంధిత దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ అంశం మీద మాట్లాడారు.. ఆ సంఘటన జరిగి ఉండకూడదన్నారు.. కానీ తన శాఖలో జరిగిన ముఖ్యమైన పరిణామం మీద పవన్ కిక్కురుమనడం లేదు. నాడు తిరుమల తొక్కిసలాట సమయంలో లోకేష్ సౌండ్ చేయలేదు.. పవన్ మాత్రం ఓవర్ యాక్షన్ చేసారు.. నేడు పవన్ చప్పుడు చేయడంలేదు కానీ లోకేష్ మొత్తం మాట్లాడేసి.. దాని విరుగుడు కూడా చెప్పేస్తున్నారు. అంటే అందరూ కూడబలుక్కుని జనాన్ని మోసం చేస్తున్నారా? ఏమి అని సందేహం వస్తోంది.-సిమ్మాదిరప్పన్న. -
నేడు జ్యోతి క్షేత్రానికి ఎంపీ అవినాష్‌రెడ్డి రాక
కాశినాయన: మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్యోతిక్షేత్రం కాశినాయన ఆశ్రమానికి గురువారం ఉదయం 8.30 గంటలకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రానున్నట్లు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు హనుమంతరెడ్డి తెలిపారు. అటవీశాఖ అనుమతులు లేవంటూ అటవీ అధికారులు కూల్చివేసిన ఆలయ కట్టడాలను ఆయన పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ, జిల్లా నాయకులు వస్తారని, పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. సెమిస్టర్ ఫలితాలు విడుదల కడప ఎడ్యుకేషన్: డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలోని ఆర్కిటెక్చర్ విభాగపు 1, 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను బుధవారం వర్శిటీ వీసీ ఆచార్య జి. విశ్వనాథ కుమార్, రిజిస్ట్రార్ రాజేష్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఫణీంద్ర రెడ్డి, సహాయ పరీక్షల నియంత్రణాధికారులు ఉదయప్రకాష్ రెడ్డి, నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హుండీ కానుకలు లెక్కింపు పెండ్లిమర్రి: పొలతల శైవ క్షేత్రంలోని మల్లేశ్వరస్వామి దేవస్థానంలోని హుండీ కానుకలను బుధవారం దేవదాయశాఖ సూపరింటెండెంట్ రమణమ్మ ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు. మల్లేశ్వరస్వామి, పార్వతిదేవి, అక్కదేవతలు, పులిబండెన్న స్వాములవారి హుండీ కానుకలను లెక్కించగా రూ.33,37,829 లక్షలు నగదు, 50 గ్రాములు బంగారు, 4కేజీలు వెండి లభించిదన్నారు. కార్యక్రమంలో ఆలయ ఆలయ ఈఓ క్రిష్ణానాయక్ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు. -
కూటమికి ప్రజలు త్వరలోనే బుద్ధిచెప్తారు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి తాము అన్ని లెక్కలు వేసుకున్న తర్వాతే ప్రజలకు హామీలు ఇస్తున్నామని చెప్పిన చంద్రబాబు, లోకేష్ అధికారంలోకి వచ్చి తొమ్మిదినెలలయినా ఒక్క హామీ కూడా అమలు చేసిన పాపాన పోలేదని రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మొదటి సంతకం చేసిన మెగా డీఎస్సీకి దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. గతంలో చంద్రబాబు మిగిల్చిపోయిన అరియర్స్‌ను జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో విద్య కోసం రూ. 38 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలే బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. -
420 కేసు నమోదు చేయాలి
● వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు హామీలను విస్మరించిన రాష్ట్రంలోని కూటమి నేతలపై 420 కేసు నమోదు చేయాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి అన్నారు. తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను చంద్రబాబు అటకెక్కించారని దుయ్యబట్టారు. పీఎం కిసాన్‌తోపాటు రైతులకు రూ. 20 వేలు ఇస్తామని నమ్మబలికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల తాము తక్కు వ కాలంలోనే రోడ్లపైకి ఎక్కాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందన్నా రు. వేలాదిగా ప్రజలు యువత పోరులో భాగంగా కలెక్టరేట్‌కు వచ్చినా కలెక్టర్, జేసీ అందుబాటులో లేకపోవడం విచారకరమన్నారు. -
సీజనల్ వ్యాధులను కట్టడి చేద్దాం
కడప రూరల్: సీజనల్ వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం అని జోనల్ మలేరియా అధికారి డాక్టర్ కే లక్ష్మీనాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు అన్నారు. బుధవారం స్థానిక వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని మీటింగ్ హల్లో రాయలసీమ ప్రాంత 8 జిల్లాలకు సంబంధించిన సబ్ యూనిట్ మలేరియా అధికారులకు సీజనల్ వ్యాధులపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం అని యూనిట్ మలేరియా అధికారులు గుర్తించాలన్నారు. గ్రామాల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను మొక్కుబడిగా నిర్వహించొద్దన్నారు. ఆరోగ్య సిబ్బంది క్షేత్ర స్దాయిలో పర్యటించినప్పుడు దోమలను ఉత్పత్తి చేసే బ్లీడింగ్ ప్రాంతాలను తప్పనిసరిగా గుర్తించాలని .. ఆయా గ్రామాల్లో మలేరియా వర్కర్ల చేత తప్పనిసరిగా క్రిమి సంహారక మందులను స్ప్రేయింగ్ చేయించాలని ఆదేశించారు. రాష్ట్ర మలేరియా విభాగం డిప్యూటీ డైరెక్టర్ రామనాఽథం మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి మనోరమ, కడప మైక్రోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగసుధారాణి, మలేరియా నివారణ అధికారులు ఏ నూకరాజు, బీ వేణుగోపాల్, డాక్టర్ సౌమ్య పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై శిక్షణ కార్యక్రమంలో వైద్యాధికారులు -
మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం!
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 750 మెడికల్ సీట్లను మంజూరు చేయించగా, చంద్రబాబు వచ్చాక పీ4 కింద కళాశాలలన్నింటిని ప్రైవేటు పరం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రజలను భ్రమల్లో పెట్టి కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చకపోగా, విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపులతో భారాలు మోపిందని విమర్శించారు. -
గండికోట వివరాలిస్తే.. యునెస్కోలో అవకాశం
కడప కల్చరల్ : గండికోట వివరాలతో కూడిన డోసియర్(వివరాల పత్రం)ను వెంటనే పంపితే యునెస్కో జాబితాలో చేర్చేందుకు అవకాశం ఉందని అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అన్నారు. ఢిల్లీ తిలక్‌మార్గ్ లోని కేంద్ర పురావస్తుశాఖ కార్యాలయంలో డీజీ యధువీర్సింగ్ రావత్‌తో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా గండికోట, లేపాక్షి తదితర ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు ఇవ్వాలని వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం వీరాంజనేయులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి కట్టడాలకు సంబంధించి వివరాలు ఇంతవరకు తమకు అందలేదని డీజీ యదువీర్సింగ్ రావత్ అన్నారన్నారు. రాష్ట్రంలోని 129కి పైగా చారిత్రక కట్టణాల్లో ఒక్క దానికి యునెస్కో జాబితాలో చోటు దక్కలేదని, కూటమి ప్రభుత్వం ఆలోచించి ఇకనైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చారిత్రక కట్టడాలకు యునెస్కోలో చోటు దక్కినపుడే రాష్ట్రం, జిల్లా అభివృద్ధి చెందగలదన్నారు. పర్యాటకశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే నివేదిక పంపాలన్నారు. -
పది పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు
కడప సెవెన్‌రోడ్స్: ఈనెల 17వ తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు జరుగనున్న పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బుధవారం అమరావతి నుంచి పదో తరగతి పరీక్షల సన్నద్ధత, కలెక్టర్ కాన్ఫరెన్స్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కావేటి విజయానంద్ జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ అధికారులు, విద్యా శాఖాధికారులు, సంబంధిత అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. ● సీఎస్ వీసీ ముగిసిన అనంతరం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.సమస్యాత్మక పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు, ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరాలన్నా రు. పరీక్ష కేంద్రాలలో తాగునీరు, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు ఉండేలా చూసుకోవాలని అధికారు ల ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌లు ఇతర జిల్లా అధికారులతో కలిసి (ప్రభుత్వ దాతల ప్రజల భాగస్వామ్యం) పీ4 పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఓ హజరతయ్య, జిల్లా పంచాయతీరాజ్ అధికారిణి రాజ్యలక్ష్మి, డీఈఓ షంషుద్దీన్, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్,మెప్మా ిపీడీ కిరణ్ కుమార్, పోలీసు, రవాణాశాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వివిధ అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కావేటి విజయానంద్ సమీక్ష -
కళ్లు తెరిచిన ప్రభుత్వ పెద్దలు!
సాక్షి ప్రతినిధి, కడప: లక్షలాదిమంది భక్తుల మనో భావాలపై దెబ్బకొట్టారు. కోట్లాది మంది అన్నార్థులకు శరణార్థిగా ఉన్న ఆశ్రమంపై పగబట్టారు. దశాబ్దాల తరబడి ఉన్న భవనాలను టైగర్ ఫారెస్టు జోన్ అంటూ కూలగొట్టారు. సనాతన ధర్మానికి ప్రతినిధినంటూ కాషాయధారిగా అవతారమెత్తిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నిర్వహిస్తున్న అటవీశాఖ నేతృత్వంలోనే కూలగొట్టే చర్యలు చేపట్టారు. కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వ పెద్దల కళ్లు తెరుచుకు నేలా వైఎస్సార్సీపీ నినదించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ గళమెత్తింది. క్రమం తప్పకుండా పోరుబాట పట్టడంతో రాజకీయ దుమారం చెలరేగింది. వెరశి ప్రభుత్వ పెద్దలు దిగివచ్చారు. వైఎస్సార్ జిల్లా కాశినాయన జ్యోతిక్షేత్రంలో కట్టడాలు కూలగొట్టడంపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జ్యోతిక్షేత్రాన్ని దేవదాయశాఖ పరిధిలోకి విలీనం చేసుకునేందుకు ప్రతిపాదనలున్నాయని అసెంబ్లీలో బుధవారం ప్రకటించారు. ● జ్యోతి క్షేత్రంలో పురాతన శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయం ఉంది. కాశిరెడ్డినాయన అనే సిద్ధుడు బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతనతో దేశాటన చేస్తూ పుణ్యక్షేత్రాల్లో గడిపారు. యోగులు, సిద్ధుల వద్ద దీక్షలు తీసుకున్నారు. పాడుపడిన దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయమన్న గురువు ఆదేశాల ప్రకారం జ్యోతి క్షేత్రంలో నరసింహాస్వామి దేవాలయాన్ని 1980 దశకంలో పునర్నిర్మాణం చేశారు. అక్కడే నిత్యం వందలాది మందికి అన్నదానం సైతం చేసేందుకు ఆశ్రమం కూడా కట్టారు. కాశినాయన 1995లో పరమపదించాక జ్యోతిక్షేత్రం..కాశినాయన క్షేత్రం అయింది. ఆంధ్రా, తెలంగాణాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఈ క్షేత్రానికి ఏటా వార్షికోత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అలాంటి క్షేత్రంలో భక్తుల కోసం, వంట కోసం సత్రాలు నిర్మాణాలు చేపట్టారు. కొన్ని దశాబ్దాలుగా ఈక్షేత్రం అటవీ ప్రాంతంలోనే ఉంది. అక్కడి నుంచి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కాలిబాట కూడా ఉంది. ఇన్నాళ్లుగా అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అడ్డం వచ్చింది. ప్రధాన దేవాలయం, కాశినాయిన సమాధి మినహా తక్కిన నిర్మాణాలన్నింటినీ కూల్చివేశారు. కట్టడాల పరిరక్షణకు అండగా వైఎస్సార్సీపీ... జ్యోతి క్షేత్రం శ్రీశైలం టైగర్‌జోన్ రిజర్వ్ ఫారెస్టులో ఉంది. గతంలో అటవీశాఖ అధికారులు అక్కడి నిర్మాణాలపై అభ్యంతరాలు తెలిపినా కూల్చివేత వరకు వెళ్లలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న 13 హెక్టార్ల భూమిని అటవీ చట్టం నుంచి మినహాయించాలని అప్పటి కేంద్ర అటవీ పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు స్వయంగా లేఖ కూడా రాశారు. రోజు రోజుకీ భక్తులు పెరగడంతో అక్కడ నిర్మాణాలు అవసరం ఏర్పడిందని, మరో వైపు అసలు అటవీ సంరక్షణ చట్టం రాకముందు నుంచే ఇక్కడ దేవాలయాలు ఉన్నాయని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి తనవంతు కర్తవ్యం నిర్వర్తించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సైతం పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి ఇదే సమస్యను తీసుకెళ్లారు. కాశినాయన క్షేత్రం ప్రాశ స్త్యం దెబ్బతినకుండా ఉండాలని, భక్తులకు సౌకర్యాలు ఉండేందుకు కృషి చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం మాత్రం వెనుకా ముందు చూడకుండా, భక్తుల మనోభావాలను గుర్తించకుండా కూల్చివేతలు చేపట్టింది. నిత్యం తాను సనాతనవాదిని అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రాతినిధ్యం వహించే అటవీశాఖ అధికారులే ఈ కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. ఎన్నో దేవాలయాలు శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ అడ్డురాని అటవీ చట్టం ఇక్కడే ఎందుకు అడ్డుగా ఉందని భక్తులు నిలదీశారు. సనాతన ధర్మాన్ని కాపాడతానని ప్రకటించిన పవన్‌కల్యాణ్ నేతృత్వంలోని మంత్రిత్వశాఖ కాశినాయన కట్టడాలు కూల్చివేతలు చేస్తుంటే ఆయనేం సమాధానం చెబుతారని వైఎస్సార్సీపీ నిలదీసింది. రాజకీయ దుమారం రేగడంతో...ఆశ్రమాన్ని ప్రభుత్వమే నిర్వహించండి. కట్టడాలను అటవీశాఖకు వాడుకోండి. కూల్చివేతలు చేపట్టవద్దని భక్తులు, పీఠాధిపతులు నెత్తి నోరు కొట్టుకున్నా కూటమి సర్కార్ కాశినాయన క్షేత్రంలో నిర్మాణాలు కూల్చింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై వైఎస్సార్సీపీ పోరుబాట ఎంచుకుంది. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, అధికార ప్రతినిధి శ్యామల కాశినాయన క్షేత్రాన్ని క్రమం తప్పకుండా సందర్శించారు. గురువారం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సైతం కాశినాయన క్షేత్రం వెళ్లనున్నారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్రజల చెంతకు వైఎస్సార్సీపీ తీసుకెళ్లింది. నిర్మాణాలు పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ, లక్షలాది మంది భక్తుల మనోభావాలపై దెబ్బ కొట్టడాన్ని ఎత్తిచూపారు. వైఎస్సార్సీపీ ప్రత్యక్ష పోరాటానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా హిందు సంఘాలు, పలువురు పీఠాధిపతులు కాశినాయన క్షేత్రంలో కట్టడాలు కూలగొట్టడంపై నిరశన గళం విప్పారు. వెరశి రాజకీయ దుమారం రేగింది. బీజేపీ సైతం అసెంబ్లీలో స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమేరకు ప్రభుత్వ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కాశినాయన క్షేత్రంలో కట్టడాలు కూల్చివేతలపై మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెబుతూ ఎక్స్‌లో స్పందించారు. దేవదాయశాఖ పరిధిలోకి చేర్చుకునేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం అసెంబ్లీలో ప్రకటించాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాశినాయన కట్టడాలు కూల్చివేతపై క్షమాపణలు చెప్పిన మంత్రి నారాలోకేష్ దేవదాయశాఖ పరిధిలోకి కాశినాయన జ్యోతి క్షేత్రం ప్రతిపాదనలు అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి -
ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ● కడప నగరంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి , కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● పులివెందుల పట్టణంలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు వరప్రసాద్, చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. ● కమలాపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రాజుపాలెం సుబ్బా రెడ్డి,గంగాధర్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి తదితరులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. చింతకొమ్మదిన్నె రింగురోడ్డు వద్ద నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ● ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్పర్సన్ శారద, మున్సిపల్ చైర్మన్ బి. లక్ష్మిదేవి, వైస్ చైర్మన్లు ఆయిల్‌మిల్ ఖాజా, పి. బంగారు మునిరెడ్డి, ఆప్కాబ్ మాజీ ఛైర్పర్సన్ మల్లేల ఝాన్సీ, జిల్లా ఉపాధ్యక్షుడు పి. నరసింహారెడ్డి, ఎంపీపీ శేఖర్‌యాదవ్ పాల్గొన్నారు. ● బద్వేల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. నియోజకవర్గ యువనాయకులు దేవసాని ఆదిత్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, కుడా మాజీ ఛైర్మెన్ గురుమోహన్, రమణారెడ్డి పాల్గొన్నారు. ● జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని యర్రగుంట్ల పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేశారు. అంతకుముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ -
కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ
సమస్యలకు సత్వర పరిష్కారం – ఎస్పీ అశోక్‌కుమార్ రాజుపాళెం : సమస్యపై బాధితులు ఫిర్యాదు చేసినపుడు వారికి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని కడప జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్ సిబ్బందికి సూచించారు. రాజుపాళెం పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించి క్రైం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న సమస్యపై ఫిర్యాదు చేస్తే పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలన్నారు. ఎక్కువగా రైతుల పొలం గట్లు, భూమి సమస్యలు ఉంటాయని, అవి ఎలాంటి పరిణామాలకై నా దారితీస్తాయన్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవించేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీ పి.భావన, బాలమద్దిలేటి, వెంకటరమణ, రామకృష్ణారెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా కడప అర్బన్ : గంజాయి, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తోంది. జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కడప నగరం శివారున అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది డ్రోన్ కెమెరాల సాయంతో నిఘా ఉంచేలా చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతూ అక్కడ అనుమానస్పదంగా సంచరించే వారిని గుర్తించనున్నారు. బుధవారం నగరంలోని గుర్రాలగడ్డ, అల్మాస్ పేట బ్రిడ్జి, బుగ్గవంక పరివాహక ప్రాంతం, ఏ.ఎస్.ఆర్ నగర్ పరిసర ప్రాంతాలు, పులివెందుల రోడ్ లోని సాక్షి సర్కిల్ పరిసరాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తున్నారు. ఫ్యాక్షన్ జోన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. కెపాసిటర్లతో బిల్లులో తగ్గుదల కడప కార్పొరేషన్ : అధిక లోడ్ వినియోగించే వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులు కెపాసిటర్లను సరైన పద్ధతిలో వాడితే విద్యుత్తు బిల్లులు గణనీయంగా తగ్గించుకోవచ్చని వైఎస్సార్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్రమణ తెలిపారు. తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ విద్యుత్ లోడ్ ఆన్ అయినప్పుడు మాత్రమే కెపాసిటర్లు ఆన్ కావాలన్నారు. కెపాసిటర్ల సామర్థ్యం విద్యుత్ లోడ్‌కు 65 శాతం నుంచి 75 శాతం వరకూ ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఉదాహరణకు 100 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ లోడుకు 65 నుండి 75 కేవీఎఆర్ కెపాసిటీ కెపాసిటర్లు వాడితే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ 1.0 ఉంటుందని, దీంతో బిల్లులు తగ్గించుకోవచ్చన్నారు. హజ్ యాత్రపై అవగాహన ఉండాలిప్రొద్దుటూరు కల్చరల్ : ముస్లింలు పవిత్రంగా భావించే హజ్, ఉమ్రా యాత్రలపై అవగాహన అవసరమని సినీ నటుడు ఆలీ పేర్కొన్నారు. స్థానిక ఎస్కే గ్రాండ్లో ఆల్ ఇన్ఫో టెక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ కడప, కర్నూలు, రాయచోటి ప్రాంతాల్లో తనకు బంధువులున్నట్లు తల్లిదండ్రులు చెబుతుండేవారని పేర్కొన్నారు. హాస్య నటుడు రాజబాబును స్ఫూర్తిగా తీసుకుని సినిమాలోకి వచ్చానని, 45 సంవత్సరాల సినీ ప్రయాణంలో 1260 సినిమాల్లో నటించానని చెప్పారు. తక్కువ ధరలోనే హజ్, ఉమ్రాకు ఆల్ ఇన్ఫోటెక్ సంస్థ ప్యాకేజీలను ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. వీఎస్ ముక్తియార్, షేక్షా, అయూబ్ ఖాన్, అబ్దుల్ అజీం, మౌలానా అబ్దుల్ మొహిద్దీన్ సాహెబ్ పాల్గొన్నారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష కడప ఎడ్యుకేషన్: జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాతంగా జరిగాయి. ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 14900 మంది విద్యార్థులకుగానూ 14310 మంది హాజరైనట్లు ఆర్ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. జనరల్‌కు సంబంధించి 11,289 మంది, ఒకేషన ల్కు సంబంధించి 1075 మంది హాజరయ్యారు. మదనపల్లె : కర్ణాటక రాష్ట్ర సరిహద్దున మదనపల్లెకు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురికి తీవ్రగాయాలవగా, 40 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నుంచి సువర్ణముఖి(సబర్వాల్) ప్రైవేట్ బస్సు మదనపల్లె మీదుగా బెంగళూరుకు వెళుతోంది. అదే సమయంలో బెంగళూరు నుంచి ఏఆర్‌బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నంద్యాలకు వెళ్తోంది. కర్ణాటక సరిహద్దు రాయల్పాడు సమీపంలోని గెలిజగూరు వద్దకు రాగానే రాత్రి 1 గంట సమయంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఏఆర్ ట్రావెల్స్ బస్సు ముందువైపు వెళుతున్న వాహనాలను ఓవర్టేక్ చేస్తూ, ఎదురుగా వచ్చిన సువర్ణముఖి బస్సును ఢీకొంది. ప్రమాదంలో మదనపల్లె కమ్మవీధికి చెందిన సువర్ణముఖి ప్రైవేట్ బస్సు కండక్టర్ గంగాధర్ అలియాస్ బాబు (59) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్ వెనుకసీటులో ఉన్న మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనివాసపురం ఆస్పత్రికి తరలించారు. 22 మంది ప్రయాణికులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో చింతామణికి చెందిన వెంకటేష్ (40), కడపకు చెందిన అలీ(38), నంద్యాలకు చెందిన జవహరుద్దీన్(35), బెంగళూరుకు చెందిన జయకుమారి(30), ఆనందరెడ్డి(54), రాంప్రసాద్(57), రా యచోటికి చెందిన నిర్మల(38) తీవ్రంగా గాయపడగా, మెరుగైన వైద్యం కోసం వారిని తిరుపతి, బెంగళూరు ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కర్ణాటక రాయల్పాడు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను మదనపల్లె, బెంగళూరు, కోలారు, శ్రీనివాసపురం ఆస్పత్రులకు 108 వాహనాల్లో తరలించారు. ప్రమాదఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 19న విజయవాడలో మహా ధర్నా కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్రంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ ఈ నెల 19న విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యదర్శి ఎల్. నాగసుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని హొచిమన్ భవన్లో చలో విజయవాడ కరపత్రాలను బుధవారం వారు అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 86,500 మంది పేద, మధ్య తరగతి అట్టడుగు వర్గాల మధాహ్న భోజన కార్మికులకు నామమాత్రంగా రూ.3 వేలు ఇస్తున్నారన్నారు. నిత్యావసర ధరల పెరుగుదలతో తమ కుటుంబ పోషణ కష్టమవుతోందని, నెలకు రూ. 10 వేల వేతనం ఇవ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని వారు కోరారు. ప్రతి విద్యార్థికి రూ.30 మెస్ చార్జీలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేసీ.బాదుల్లా, ఎస్.చాంద్‌బాషా, బి.కామాక్షమ్మ, ఎం.మేరి, కోశాధికారి ఎం.పార్వతి పాల్గొన్నారు. వైద్య మిత్రలను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి కడప రూరల్ : ఈ నెల 16వ తేదీలోపు తమను ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగిగా గుర్తిస్తూ జీఓ జారీ చేయకపోతే 17వ తేదీ నుంచి విధులను బహిష్కరిస్తామని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో పనిచేస్తున్న వైద్య మిత్రలు, ఇతర సిబ్బంది స్పష్టం చేశారు. తమ ఉద్యోగ భద్రత, వేతనాల పెంపుకోసం ఆందోళన బాట పడుతూ విధుల బహిష్కరణకు సిద్ధమవుతున్నారు. బుధవారం విజయవాడలో ఆ ట్రస్టు సీఈఓ డాక్టర్ పి.రవిసుభాష్‌తో ఏపీ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు జరిగిన చర్చలు విఫలమవడంతో సంఘం కడప జిల్లా నాయకులు తమ కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 17, 24వ తేదీల్లో జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయం ఎదుట, 27న మంగళగిరి ట్రస్ట్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన తెలపాలని నిర్ణయించారు. అయితే వైద్య మిత్రలు విధులకు హజరవుతారని ఆ ట్రస్ట్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ వి.బాలాంజనేయులు తెలిపారు. ఒకరి మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు నలుగురి పరిస్థితి విషమం 40మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు -
ఆలయ సంరక్షణకు చర్యలు తీసుకుంటాం
కాశినాయన : వైఎస్సార్ జిల్లా కాశినాయన ఆలయ సంరక్షణకు చర్యలు తీసుకుంటామని ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కె.కె.చౌదరి అన్నారు. జ్యోతి క్షేత్రంలో కూల్చిన కాశినాయన ఆలయ భవనాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. కాశినాయన ఆశ్రమంలో అటవీశాఖ అనుమతులు లేవని భవనం కూల్చిన విషయం ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లిందన్నారు. వెంటనే ఆయన స్పందించి ప్రభుత్వం తరఫున తనను వెళ్లి పరిశీలించమన్నారన్నారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, తహసీల్దారు నరసింహులు, తదితరులు పాల్గొన్నారు. ఆరుగురు జూదరుల అరెస్టు రాజుపాళెం : మండలంలోని టంగుటూరులో దక్షిణం వైపు ఉన్న కంపచెట్ల వద్ద జూదం ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.11,520 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కత్తి వెంకటరమణ తెలిపారు. కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. అరటికాయల లారీ బోల్తా పులివెందుల రూరల్ : పులివెందుల మండలం నల్లగొండువారిపల్లె ఘాట్ రోడ్డులో బుధవారం సాయంత్రం అరటికాయల లారీ బోల్తా పడింది. గ్రామ సమీపంలోని తోట వద్ద అరటి కాయలను లోడు చేసుకుని పులివెందులకు వస్తుండగా బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. వేలంలో రూ 93.25 లక్షల ఆదాయం బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో బుధవారం తలనీలాల వేలం పాట నిర్వహించారు. అనంతపురానికి చెందిన ఎంఆర్ ప్రాజెక్టు నిర్వాహకులు రూ.93.25 లక్షలకు వేలంపాడి దక్కించుకున్నారు. గత ఏడాది రూ.81 లక్షల ఆదాయం వచ్చినట్లు పిట్ పర్సన్ శంకర్‌బాలాజీ తెలిపారు. -
ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీదే అధికారం
పులివెందుల రూరల్ : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం తథ్యమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ.సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా విలేకరులతో సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ప్రజల వ్యతిరేకత కూడగట్టుకుందన్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తే 151 స్థానాల్లో విజయం అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడంలోనూ, ప్రజల సంక్షేమం కోసం పెద్దపీట వేయడంలోనూ ఆయన ముందున్నారన్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమై కోట్లు ఖర్చు పెట్టి అసత్య ప్రచారాలతో సాధ్యం కాని హామీలు ఇచ్చారన్నారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందాలన్నా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలన్నా వైఎస్.జగన్మోహన్రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నడుంబిగించాలన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ.సతీష్‌కుమార్‌రెడ్డి -
గురు సన్నిధి.. ఆధ్యాత్మిక పెన్నిధి
రామాపురం : ఆరు దశాబ్దాల క్రితం నిర్జీవంగా ఉండి సమాధుల చుట్టూ గోడలు ఉండే ప్రదేశం నేడు ఎందరో భక్తులకు మానసిక ఉల్లాసం కలిగిస్తూ, వారి కోర్కెలు తీర్చే ఆలయంగా మారింది నీలకంట్రావుపేట దర్గా. ఆరు దశాబ్దాల క్రితం అదో నిర్జన ప్రదేశం. అందులో రెండు సమాధులు, చుట్టూ గోడలు, సాయంత్రం వేళల్లో ఫకీరులు పక్క గ్రామమైన నీలకంట్రావుపేట, చుట్టు పక్కల గ్రామాల్లో భిక్షమడిగి తెచ్చుకుని అక్కడే తిని, అక్కడే బస చేస్తుండేవారు. దర్గా అని పిలువబడే ఇక్కడికి భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుని వెళుతుండేవారు. ఈ దర్గా అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంట్రావుపేట సమీపంలో దక్షిణ దిశగా ఒక కిలోమీటరు దూరంలో ఉంది. ఏటా ఘనంగా దర్గా ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. దర్గా సంక్షిప్త చరిత్ర.. హిందూ, ముస్లిం సమైక్యతకు ప్రతీకగా ఓ పవిత్ర దర్శనీయ స్థలంగా నేడు ఈ దర్గా వెలుగొందుతోంది. కడప –చిత్తూరు ప్రధాన జాతీయ రహదారికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ దర్గాలో ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ఎంతో వైభవంగా ఉరుసు ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుపుతారు. సద్గురు హజరత్ దర్బార్ వలీ అలీషా వలీ, రహంతుల్లా అలైహి బాబా, శ్రీ జలీల్ మస్తాన్‌వలీ గార్ల ఉరుసు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కనుల పండువగా జరుగుతాయి. అత్యంత మహత్యం కలిగిన ఈ ప్రదేశం శివత్వమని, శివైక్యం పొందిన దర్బారు నగరు పీఠాధిపతి గురువు సద్గురు దర్గాస్వామీజీ తెలిపారు. దత్త పీఠానికి చెందిన మహాపూర్ణత్వ పురుషులైన హజరత్ దర్బారు అలీషావలీ 147 వ సంవత్సరంలో ఈ నిర్జన స్థలంలో సజీవ సమాధిగా సిద్ధి పొందారని స్వామీజీ వివరించారు. అప్పటి అరేబియా దేశస్తులైన హజరత్ దర్బారు షావలి తన భారత దేశ యాత్ర సందర్భంగా ఈ నిర్జన ప్రదేశ విశేష మహత్యానికి తపోసిద్ధి పొంది ఇక్కడ సమాధి పొందారు. దర్గా దర్బారులో సాయి మందిరం, విద్యాలయం.. ఇదే ఆశ్రమ సన్నిధిలోనే షిర్డీ సాయినాథుని పంచలోహ విరాట్ విగ్రహంతో కూడిన మందిరం నిర్మించారు. అలాగే పంచలోహ ఉత్సవ విగ్రహం కూడా ఉంది. అలాగే 1–10వ తరగతి వరకు సుందరమైన భవనాలలో తరగతి గదులు, ప్రార్థనా మందిరం ఇక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ ఒక పూట ఉచిత భోజనంతో కూడిన విద్యాదానం చేస్తున్నారు. మాతాజీ మందిరం.. స్వామీజీకి అహర్నిశలు చేదోడువాదోడుగా ఉండి అంతా తానై వచ్చే భక్తులను ఎంతో ఆప్యాయత అనురాగాలతో ప్రేమగా పలకరించే ఆయన అర్ధాంగి రంగనాయకమ్మ తుదిశ్వాస వదిలారు. అక్కడికి వచ్చే భక్తులందరూ అమ్మ అంటూ మాతృమూర్తి సమాధి దర్గాలో ఏర్పాటు చేసి నిత్యం ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉరుసు ఉత్సవం.. సద్గురు హజరత్ దర్బార్ అలీషావలి, రహంతుల్లా అలైబాబా జలీల్ మస్తాన్ వలీ బాబా గార్ల ఉరుసు ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గంధమహోత్సవం, 14న శుక్రవారం జెండా మెరవణి , ఉరుసు, రాత్రి హిందూ, మహమ్మదీయ సోదరుల సహకారంతో బ్రహ్మాండమైన వాయిద్యాల నడుమ బెంగళూరుకు చెందిన అస్మా నిఖత్, నాగపూర్‌కు చెందిన సలీం సైదాలతో గొప్ప ఖవాలీ పోటీ ఉంటుంది. 15న తహలీల్ ప్రసాదం అందించడంతో ఉత్సవం ముగుస్తుంది. హిందూ, ముస్లిం సమైక్యతకు ప్రతీక నీలకంట్రావుపేట దర్గా నేటి నుంచి ఉరుసు ప్రారంభం -
ప్రభుత్వ బెదిరింపులకు భయపడవద్దు
ప్రొద్దుటూరు రూరల్ : న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకూ ప్రభుత్వ బెదిరింపులకు భయపడవద్దని జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గేయానంద్ అన్నారు. మండలంలోని గోపవరం గ్రామంలో పశువైద్య విద్యార్థులు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశు వైద్యార్థులు అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదని, న్యాయమైన డిమాండ్లే అన్నారు. ఒక సాధారణ ఉద్యోగి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ప్రభుత్వ జీఓలో ఉందన్నారు. విద్యార్థులు నిరసన వ్యక్తం చేసే క్రమంలో ప్రభుత్వం నుండి బెదిరింపులు రావడం బాధాకరమన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతులు, ప్రజా, విద్యార్థి, కుల సంఘాలను కలుపుకొని పోరాటం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల స్టైఫండ్ విషయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో మాట్లాడతానని తెలిపారు. జేవీవీ రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, జేవీవీ రాష్ట్ర సమత నాయకురాలు డాక్టర్ ప్రసన్న, సీపీఎం పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాహుల్, డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి విశ్వనాథ్, ఆప్కాస్ పశు వైద్య కళాశాల అధ్యక్షుడు సుబ్బారావు, ఉపాధ్యక్షుడు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గేయానంద్ -
పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తాం
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని, వాటి విలువలు అందరికీ తెలిపే విధంగా ప్రసిద్ధ ప్రదేశాలు ఆలయాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. మంగళవారం భారత జాతీయ కళా సంస్కతి వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్) జిల్లా చాఫ్టర్ కన్వీనర్ లయన్ కె.చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన ఇంటాక్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పురాతన కట్టడాలు, కళలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక అంశాలపై జిల్లా సంస్కృతి గొప్పదనాన్ని తెలిపే విధంగా ఏడాదిలో నాలుగు రకాల ఉత్సవాలను జరిపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఇందులో కడపోత్సవాలు, గండికోట ఉత్సవాలు, పురాతన వారసత్వ ఉత్సవాలు , గుడి సంబరాలు వంటివి ఉండాలని సూచించారు. జిల్లాలో ఉన్న టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసే విధంగా టూరిజం సర్క్యూట్ ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న జానపదాలు, సాహిత్యాలు, కళలు, ఫోక్ డాన్సులు వంటి వాటిపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలన్నారు. ఇంటాక్ కన్వీనర్ చిన్నపరెడ్డి మాట్లాడుతూ గండికోట వరల్డ్ హెరిటేజ్ గా యునెస్కో గుర్తింపుకోసం కృషి చేస్తున్నామని.. ఇందుకు జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలు అందించాలని కోరారు. జిల్లా పర్యాటక శాఖ ఇంచార్జీ అధికారి సురేష్ కుమార్, టూరిజం మేనేజర్ రామ్ కుమార్,ఇంటాక్ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు ప్రభుత్వ నిబంధనలకు లోబడే గ్యాస్ సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు హెచ్చరికలు జారీచేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో హాలులో జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో జేసీ అదితిసింగ్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సరఫరాపై ప్రభుత్వానికి వినియోగదారుల నుంచి అసంతృప్తికరమైన సందేశాలు అందాయన్నారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను ఇంటికి సరఫరా చేసే సమయంలో డెలివరీ బాయ్స్ అదనపు చార్జీలను వినియోగదారుల నుండి వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అందడంపై ప్రభుత్వం సీరియస్ గా పరిగణించిందన్నారు. జిల్లాలో అదనపు చార్జీల వసూళ్లకు పాల్పడుతున్న 15 ఏజెన్సీలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే గ్యాస్ ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి డీఎస్ఓ రెడ్డి చంద్రిక, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ -
హోంగార్డుల సేవలు అభినందనీయం
కడప అర్బన్ : పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ అందరి మన్ననలు చూరగొంటున్న హోంగార్డుల సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ కొనియాడారు. జిల్లాలోని హోంగార్డ్స్ సిబ్బందికి వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు రెండు వారాలపాటు నిర్వహించిన మొబిలైజేషన్ కార్యక్రమం ముగింపు సందర్భంగా మంగళవారం డీ–మొబిలైజేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ హోంగార్డ్స్ పెరేడ్ (కవాతు)ను పరిశీలించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పెరేడ్‌ను ప్రతిభావంతంగా, క్రమశిక్షణతో చేశారని జిల్లా ఎస్పీ హోంగార్డులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ శిక్షణా కాలం అనేది కీలకమని, విద్య నేర్చుకున్న అనంతరం సమాజానికి ఉపయోగపడకపోతే ఆ విద్యకు విలువ ఉండదన్నారు. అలాగే ఈ శిక్షణలో హోంగార్డులు నేర్చుకున్న అంశాలను దైనందిన విధుల్లో ప్రతిబింబించేలా చూడాలన్నారు. దేశ అంతర్గత భద్రతను పరిరక్షించడంలో హోంగార్డ్స్ సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. పోలీస్ శాఖతో పాటు అగ్నిమాపక, ఆర్.టి.ఓ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జైళ్లశాఖ తదితర వాటిలో కీలకవిధులు నిర్వర్తిస్తూ ఆయా శాఖలకు వెన్నెముకగా నిలిచారని ఎస్పీ పేర్కొన్నారు. హోంగార్డుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలనీ, పరిశీలించి పరిష్కరిస్తాని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు. బ్యాండ్ పార్టీ ఏ.ఆర్. హెడ్‌కానిస్టేబుల్ పి.బాబు, బృందాన్ని పెరేడ్ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన హోంగార్డ్‌లకు బహుమతులు అందజేశారు. ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య మాట్లాడుతూ రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా హోంగార్డ్స్ సిబ్బందికి మొబిలైజేషన్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఈ.జీ. అశోక్‌కుమార్ ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. డీఎస్పీ కె. శ్రీనివాసరావు, ఆర్ఐలు శ్రీశైలరెడ్డి, ఆనంద్, టైటస్, వీరేష్, శివరాముడు, ఆర్.ఎస్.ఐలు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, హోంగార్డుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హోంగార్డుల డీ మొబిలైజేషన్ పెరేడ్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్‌కుమార్ -
ఈనెల 13న జ్యోతి క్షేత్రానికి ఎంపీ అవినాష్‌రెడ్డి రాక
పోరుమామిళ్ల : ఈనెల 13న గురువారం ఉదయం 8–30 గంటలకు కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి జ్యోతి క్షేత్రం కాశినాయన క్షేత్రాన్ని సందర్శిస్తారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కె. రమణారెడ్డి తెలిపారు. మూడు దశాబ్ధాలుగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి, నిత్యాన్నదానం, కాశినాయన సమాధిని సందర్శించుకుంటున్న వేలాదిమంది భక్తుల విశ్వాసం విస్మరించి, అక్కడ అధికారులు కట్టడాలు కూలగొట్టడంపై స్వయంగా తెలుసుకొనేందుకు ఎంపీ వస్తున్నారన్నారు. ఆయనతో పాటు బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, జిల్లా నాయకులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఉపాధ్యాయుడి మృతి జమ్మలమడుగు రూరల్ : రోడ్డు పక్కన నిలబడి నీళ్లు తాగుతుండగా వేగంగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొని ప్రొద్దుటూరుకు చెందిన నగళ్లపాటి సుబ్బరాయుడు (63) అనే విశ్రాంత ఉపాధ్యాయుడు మృతి చెందాడు. జమ్మలమడుగు మండలంలో మంగళవారం రాత్రి 9.30 గంటలకు జరిగిన ప్రమాద సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన నగళ్లపాటి సుబ్బరాయుడు సొంత పనుల నిమిత్తం స్వగ్రామం అయిన మైలవరం మండలం వేపరాల గ్రామానికి భార్య కృష్ణవేణితో కలిసి వచ్చాడు. పనులు ముగింకునిని స్కూటీలో తిరిగి ప్రొద్దుటూరు వెళుతుండగా మార్గమాధ్యంలోని ధర్మాపురం గ్రామం వద్దకు వెళ్లగానే దాహం వేసింది. దీంతో స్కూటీని ఆపి నీళ్లు తాగుతుండగా ప్రొద్దుటూరు వైపు వెళుతున్న బొలెరో క్యాంపర్ వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో నగళ్లపాటి సుబ్బరాయుడు అక్కడికక్కడే మృతి చెందగా భార్య కృష్ణవేణికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 వాహనంలో బాధితురాలిని ప్రొద్దుటూరుకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.