సంక్షేమ హాస్టల్‌ వర్కర్లను పర్మినెంట్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ హాస్టల్‌ వర్కర్లను పర్మినెంట్‌ చేయాలి

Feb 15 2026 7:27 AM | Updated on Feb 15 2026 7:27 AM

సంక్షేమ హాస్టల్‌ వర్కర్లను పర్మినెంట్‌ చేయాలి

సంక్షేమ హాస్టల్‌ వర్కర్లను పర్మినెంట్‌ చేయాలి

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ప్రభుత్వ సంక్షేమ బీసీ, ఎస్సీ,ఎస్టీ వసతి గృహాల్లో 10, 15 సంవత్సరాలుగా పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్లను పర్మినెంట్‌ చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌ నాగసుబ్బారెడ్డి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు కేసి బాదుల్లా, కార్యదర్శి రాజేశ్‌ పేర్కొన్నారు. శనివారం కడపలోని హోచిమిన్‌ భవన్‌లో ఏఐటీయూసీ 12 జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో రోజువారీ పనులు చేసే కార్మికులకు రోజుకు రూ. 600 చొప్పున నెలకు రూ.18 వేలు సంపాదిస్తున్నట్లు అదే విధంగా నగరాల్లో అడ్డా కూలీలు నెలకు రూ 24 వేలు వరకు సంపాదిస్తున్నారని తెలిపారు. అంతకంటే తక్కువ హాస్టల్‌ కార్మికులకు ఇవ్వడం ఎంతవరకు న్యాయమన్నారు. పెరిగిన ధరల ద్రవ్యోల్బణం దృష్టిలో పెట్టుకొని వెంటనే జీతాలు రూ.26 వేలకు పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్టళ్లలో వర్కర్ల సంఖ్యను విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పెంచాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి యు మద్దిలేటి హాస్టల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు చండ్రాయుడు భాస్కర్‌ ప్రసాదు చంద్రశేఖర్‌ జానీ భారతి విజయ్‌ కుమారి మంజుల తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement